11/23/2013
Jagan's visit to Nimmakuru surprises TDP
Written By news on Saturday, November 23, 2013 | 11/23/2013
11/23/2013
టిడిపి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిది

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు పిచ్చిపట్టినట్లు మాట్లడుతున్నారని, వారి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన, సమైక్యత ఏదీ చెప్పలేక టిడిపి వారు పిచ్చిపట్టినవారిలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఏదీ స్పష్టంగా చెప్పలేని చంద్రబాబు ప్రజామద్దతు పొందలేకపోతున్నారని, జాతీయస్థాయిలో ఆయనను పట్టించుకునేవారు లేరని చెప్పారు. చంద్రబాబు ప్రజలతో పోరాడలేక, అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. హైటెక్ సిటీ ముందు ఫొటో దిగే హక్కు తనకే ఉందని చెబుతున్న చంద్రబాబు ఆ ఫొటోను పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. హైటెక్ సిటీ కట్టించిన ఎల్ అండ్ టి కంపెనీయే టిడిపి కార్యాలయం కట్టించిన విషయం మాత్రం చంద్రబాబు చెప్పరన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను చంద్రబాబు ఐఎన్ జికి అతి తక్కువ రేటుకు కట్టబెట్టారని చెప్పారు. హైదరాబాద్ లో 14 ఫ్లైఓవర్లు కట్టించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన గుర్తు చేశారు.
ఈ నెల 26, 27 తేదీలలో తుపాను బాధిత ప్రాంతాలలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. తుపాను ప్రాంతాలలో పర్యటన కారణంగా సమైక్యశంఖారావం వాయిదావేసినట్లు తెలిపారు. ఈ నెల 30 నుంచి సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నట్లు తెలిపారు

చంద్రబాబే గోల్కోండ కోట కట్టించారు
http://www.sakshi.com/video/news/think-about-politics-says-chandrababu-naidu-6804
చంద్రబాబే గోల్కోండ కోట కట్టించారు
11/23/2013
YSR Congress party president YS Jagan Mohan Reddy called on President Pranab Mukherjee and urged him to keep Andhra Pradesh united.
JAGAN OPTIMISTIC ON PRESIDENT'S PROACTIVE ROLE
. Sakshipost.com

Speaking to media persons after the meeting, he said the President gave them a patient hearing.
According to Jagan, his party stance was apprised to the President in a 5-page memorandum.
"Congress is indulging in the State division in a unilateral way, without taking even the opinion of legislative Assembly and also the stakeholders. The nation should not be affected by the Congress's unconstitutional methodology of dividing the States," he said. Referring to their note to the President, he said that the President was also informed of the inevitable upsurge of water disputes with the division.
"Pranab ji was also apprised on how Congress has been moving ahead with the process while overlooking Article 371 (D) and (E) of constitution," he added.
Jagan will meet JD (U) president Sharad Yadav at around 5.30 pm to seek his support to YSR CP's struggle to keep the state united. Continuing his efforts, Jagan will meet Odisha Chief Minister Naveen Patnaik in Bhuvaneswar tomorrow and appeal for his support. On Monday, he will fly to Mumbai and meet NCP leader, Union Agriculture Minister Sharad Pawar with a plea to extend support to his efforts to stop the bifurcation of the state.

- Sakshipost
11/23/2013
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకున్న వైఎస్ జగన్, ఈరోజు మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై ఆయనకు సవివరమైన నివేదిక అందజేసి, విభజన జరక్కుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 5 పేజీల నివేదికను ప్రణబ్‌కు అందజేశారు.
రాష్ట్రాన్ని కేంద్రం అడ్డగోలుగా విభజించాలని చూస్తోందని ప్రణబ్‌కు చెప్పామని, భాషా ప్రయుక్త రాష్ట్రాలను 60ఏళ్ల తర్వాత ఇలా విభజించడం సరికాదని వివరించామని ఆ తర్వాత వైఎస్ జగన్ మీడియాకు తెలిపారు. ఈ రాష్ట్ర విభజన విధానం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లే ప్రమాదముందని రాష్ట్రపతికి వివరించామని,
రాష్ట్రంలో నీటి సమస్యలు మరింత జటిలమవుతాయని ప్రణబ్‌కు చెప్పామని ఆయన అన్నారు. ఆర్టికల్ 371(డి) గురించి కూడా ప్రణబ్‌కు వివరించామని, తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని వైఎస్ జగన్ చెప్పారు.
జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరారు.
అలాగే.. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కూడా జగన్, ఇతర నేతలు కలిసి.. ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా వివరించనున్నారు. ఆ తర్వాత 24వ తేదీ ఆదివారం రోజున జగన్ భువనేశ్వర్ వెళ్లి ఉదయం 11.30 గంటలకు బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకుంటారు
రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్

హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్
హెలెన్ పెను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27, 28 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న కుప్పంలో ప్రారంభించవలసిన సమైక్య శంఖారావం యాత్రను 30వ తేదికి మార్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయం శనివారం హైదరాబాద్ లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తు ఈ నెల 28 నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం యాత్రను కుప్పంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హెలెన్ తుఫాన్ బాధితులను పరామర్శించి, ఆ తర్వాత సమైక్య శంఖారావం యాత్ర చేపట్టాలని వైఎస్ జగన్ భావించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది

టీడీపీ సొంతింటి ప్యాకేజీ...!

పార్టీలోకి వచ్చే నేతలకే కాదు.. పార్టీని వీడిపోతారనే నేతలను బుజ్జగించడానికీ టీడీపీలో ప్యాకేజీలు ఇస్తున్నారు. ఈ సొంతింటి ప్యాకేజీ సంగతి గురించి తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఇదేదో బాగానే ఉందే అనుకుంటున్నారు. విషయమేమిటంటే.. కాంగ్రెస్‌తో కుదిరిన ప్యాకేజీలో భాగంగా నేడో రేపో పార్టీ మారిపోతున్నాడని ఒక తెలంగాణ నాయకుడిపై టీడీపీలో కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నాయకుడు పార్టీ ‘టీ’ నేతల మేధోమథన సదస్సులో అందరికీ షాకిచ్చారు.
‘‘పార్టీ మారుతున్నట్టు నాపై లేనిపోని ప్రచారం జరుగుతోంది. చూడండి.. నా గుండెల్లో చంద్రుడు(చంద్రబాబు) ఉన్నారు’’ అంటూ చొక్కా విప్పి మరీ తన ఛాతీని అక్కడున్నవారికి చూపించేశారు. పురాణాల్లో హనుమంతుడు తన రామభక్తిని చాటినట్టు ఈయన తన చంద్రభక్తిని చాటడంపై ఆ నేతలంతా ఆశ్చర్యపోయారు. నిన్నటివరకు రోజూ తిడుతున్న నాయకుడే ఒక్కసారిగా ఇలా భక్తి చాటుకోవడంలో ఆంతర్యమేంటా అని ఆరా తీసేసరికి అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారట. టీ టీడీపీ ఫోరానికి చెందిన ఆ నేత కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో బాబు ఆయన్ను రహస్యంగా పిలిపిం చుకుని మాట్లాడారట.
అసలే పార్టీ స్థితి దయనీయంగా మారుతున్న టైమ్‌లో మీలాంటి నేతలు బయటికెళ్లిపోతే ఎలా? అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారట. దాంతో పార్టీలో ఉండాలంటే ఇవి చేయండంటూ చాంతాడంత కోరికల చిట్టా విప్పారట. ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు టికెట్ ఇచ్చినా గెలిచే స్థితి కనిపించట్లేదు. అలాంటప్పుడు నేను ఖర్చుపెట్టుకుని ఏం సాధిస్తాను. అందుకే ఇప్పట్నుంచి ఎన్నికలదాకా అయ్యే ఖర్చుతో పాటు ఎన్నికల ఖర్చునూ పూర్తిగా మీరే భరించాలి. నేను ఓడితే ఆ తర్వాత నాకు రాజ్యసభ టికెట్ ఇస్తానని హామీ ఇవ్వాలి’’ అంటూ జాబితా చెప్పుకుపోయారట. అందుకు అధినేత ఓకే అన్నారట. దాంతో సదరు నేత మీటింగ్లోకొచ్చి తన చంద్రభక్తిని చాటుకున్నారట. ఓహో! పార్టీలోకి వచ్చేవారికే కాదు! పార్టీని వీడిపోతారని ప్రచారం జరిగినా ప్యాకేజీలు ఇస్తారన్నమాట. ఇదేదో బాగుందే.. మనమూ ఆ ఫీలర్స్ వదిలితే పోలే...!! అని పలువురు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట..!
11/23/2013
టీడీపీకి చేయిచ్చిన మాజీ ఎమ్మెల్యే
నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ జిల్లా నాయకులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు పెద్ద ఝలక్ ఇచ్చారు. ఎన్టీయార్ ట్రస్ట్‌భవన్‌లో అధినేత సమక్షంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించిన ముహూర్తానికి సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేసి పత్తా లేకుండా పోయారు. సుమారు రెండు గంటల పాటు ఆయన కోసం దేశం నేతలు చేయని ప్రయత్నం లేదు. ఇక లాభం లేదనుకుని బాబు దగ్గర నుంచి చల్లగా జారుకున్నారు. ఏదో ఒక రకంగా మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకునేందుకు జిల్లా టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ఖంగుతిన్నారు. ఈ నెల మొదటివారంలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు టీడీపీ నేతలు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఒకరికి ఎర వేశారు. వ చ్చే సాధారణ ఎన్నికల్లో కోవూరు అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తామని టీడీపీ ముఖ్య నేతలు గట్టి హామీ ఇచ్చారు. పలు దఫాలు సంప్రదింపుల తరువాత టికెట్ ఇప్పిస్తారన్న నమ్మకంతో పార్టీలో చేరేందుకు ఆయన అంగీకరించారు. ఆ మేరకు ముహూర్తం ఖరారయ్యింది. అయితే తెలుగుదేశం ైెహ కమాండ్‌లో తనకున్న పలుకుబడితో చంద్రబాబు కోటరీలో ఒక ముఖ్యునికి మాజీ ఎమ్మెల్యే తన చేరిక విషయాన్ని వివరించారు.
ఇప్పటికే జిల్లా పార్టీ నాయకులంతా కోవూరు నియోజకవర్గానికి ఒక పేరును సిఫార్సు చేసి ఉన్నందున మరోసారి చెక్ చేసుకోవాలని సూచించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆలోచనలో పడ్డారు. తీరా విచారిస్తే తన కన్నా ముందే మరొకరికి కూడా టికెట్ ఇప్పిస్తామన్న హామీ ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో పార్టీలో చేరికకు మూహూర్తం నిర్ణయించిన రోజు ఉదయం వరకు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకో గంట సమయం ఉందనంగా ఫోన్‌స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన కోసం దాదాపు రెండు గంటల పాటు వెదికే ప్రయత్నం చేసినప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో అప్పటివరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న జిల్లా నాయకుల ముఖాలు వాడిపోయినట్టు తెలిసింది. మొత్తానికి దేశం నేతలకు మాజీ ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చిన తీరు ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కోవూరు టీడీపీ శ్రేణుల్లో గందరగోళం
కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నాయకత్వ లోపం వారిని వెంటాడుతోంది. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన తరువాత నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పాటు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంలోనూ పార్టీ చొరవ తీసుకోవడం లేదనే ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా కొత్త వ్యక్తులను అప్పటికప్పుడు దిగుమతి చేస్తే ఉప ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతం అవుతాయని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/mla-given-commitment-to-tdp-party-leaders-82879

11/22/2013
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి ఆయన ప్రణబ్ తో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్న 12.30 గం.ల ప్రాంతంలో జగన్మోహనరెడ్డి రాష్ట్రపతితో సమావేశమవుతారు. ఇదిలా ఉండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను, జేడీయూ అధినేత శరద్ యాదవ్ తో జగన్ సమావేశమువుతారు. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగానే ఉంచేందుకు మద్దతు ఇవ్వాలని వారిని కోరనున్నారు. రేపు సాయంత్రం శరద్ యాదవ్ ను కలిసిన అనంతరం, నవీన్ పట్నాయక్ ను కలిసేందుకు భువనేశ్వర్ బయలుదేరి వెళతారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి ముంబై, భువనేశ్వర్ లు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ఢిల్లీ వెళ్లేందుకు, ఈ నెల 24న భువనేశ్వర్ లో నవీన్ పట్నాయక్ ను, ఈ నెల 25న ముంబైలో శరద్ పవార్ ను కలిసేందుకు జగన్ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు.
రేపు ప్రణబ్ ను కలవనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి
Written By news on Friday, November 22, 2013 | 11/22/2013

వైఎస్ జగన్మోహనరెడ్డి ముంబై, భువనేశ్వర్ లు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ఢిల్లీ వెళ్లేందుకు, ఈ నెల 24న భువనేశ్వర్ లో నవీన్ పట్నాయక్ ను, ఈ నెల 25న ముంబైలో శరద్ పవార్ ను కలిసేందుకు జగన్ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు.
11/22/2013
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముంబై, భువనేశ్వర్ లు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈమేరకు విచారించిన ప్రత్యేక కోర్టు ముంబై, భువనేశ్వర్ నగరాలు వెళ్లేందుకు అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది.కాగా, చెన్నై పిటీషన్ ను విచారించిన కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహనరెడ్డి ముంబై, చెన్నై,భువనేశ్వర్ లు వెళ్లేందుకు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. ఈ నెల 23న ఢిల్లీ వెళ్లేందుకు పిటీషన్ దాఖలు చేయగా, ఈ నెల 24న భువనేశ్వర్ లో నవీన్ పట్నాయక్ ను, ఈ నెల 25న ముంబైలో శరద్ పవార్ ను కలిసేందుకు జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి

11/22/2013
హైదరాబాద్: : రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు చెలగాటమాడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి ఆరోపించారు.శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభానాగిరెడ్డి మాట్లాడుతూ... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కిరణ్, చంద్రబాబులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
రాష్ట్రవిభజన విషయంలో చంద్రబాబు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రహస్య పుత్రునిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను విమర్శించే ముందు తమ విధానాన్ని ఏంటో తెలియజేయాలని శోభానాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ సీనియర్ నేత, శాసన మండలిలో ఆ పార్టీ నేత యనమల రామకృష్ణకు జగన్ ఫోబియా పట్టుకుందని ఆమె పేర్కొన్నారు.
నీకు ధైర్యముంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమైక్యమని చెప్పించగలవా అని యనమలను డిమాండ్ చేశారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖరావం యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించగానే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ కుప్పం వస్తే మీకెందుకంత భయం అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. విభజన నిర్ణయం వచ్చిన రోజు సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని శోభానాగిరెడ్డి అభిప్రాయపడ్డారు.
సోనియా రహస్య పుత్రుడు చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనకు కేంద్రానికి మార్గాలను సుగమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలంతా కలసి రోజుకొక నాటకం, పూటకొక డ్రామా వేస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా స్పీకర్, ముఖ్యమంత్రిల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హైడ్రామాను చూస్తుంటే చాలా విస్మయం కలుగుతోందని పద్మ వ్యాఖ్యానించారు. కీలకమైన రాష్ట్ర విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉండగా, నాటకీయంగా సాంకేతిక విషయాలను అడ్డుపెట్టి రోడ్డుమీద చర్చ జరిగేలా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. సమైక్యవాదాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రచించిన గేమ్‌ప్లాన్‌లో భాగంగానే ముఖ్యమంత్రి, స్పీకర్ల మధ్య వివాదమున్నట్టుగా ఆ పార్టీ నేతలు చర్చకు పెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అనే వెయ్యి తలల విషసర్పంలో ఒక్కొక్క తల ఒక్కొక్క విధంగా మాట్లాడుతోందని విమర్శించారు. ‘కేంద్ర మంత్రులు ప్యాకేజీల గురించి మాట్లాడుతుంటే, విభజనకు అన్నిరకాలుగా సహకరిస్తున్న సీఎం కిరణ్ సమైక్యవాదం వినిపిస్తారు. మరికొందరు విభజన జరిగిపోయిందంటారు. సీఎం ఒక పక్క విభజనకు అవసరమైన యావత్ సమాచారాన్నీ తన శాఖల ద్వారా కేంద్రానికి, జీవోఎంకు పంపిస్తూనే, మరోవైపు సమైక్యం కోసం అసెంబ్లీని ఆయుధంలా వాడుకోబోతున్నట్టుగా ప్రచారం చేయడం హాస్యాస్పదం..’ అని పద్మ పేర్కొన్నారు.
సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు?
కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాది అయితే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి ‘సమైక్య తీర్మానం’ చేసి కేంద్రానికి ఎందుకు పంపడం లేదని పద్మ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీని సమావేశపరిచే అధికారం మీ చేతిలోనే ఉంది కనుక, కేబినెట్ నోట్ రాకముందే తీర్మానం చేయమంటే తనకు పట్టనట్టుగా వ్యవహరించారన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి, విభజనను అడ్డుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు తమకు వినపడనట్లు నటించారన్నారు. అసలు విభజనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏం చేశారని నిలదీశారు. ఉద్యోగులు త్యాగాలు చేస్తూ సమైక్య ఉద్యమానికి దిగితే వారిని మభ్యపెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేశారని మండిపడ్డారు. కిరణ్ వ్యవహారశైలి చూస్తుంటే హత్య చేసిన వ్యక్తే శ వం వద్ద ఏడ్చినట్లుందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు చెప్పినట్టే ఆడుతోన్న కేంద్రం
రాష్ట్రాన్ని విభజించాలని సోనియాగాంధీ నిర్ణయిస్తే, కొబ్బరికాయలా పగలకొట్టాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సలహా ఇవ్వడం సిగ్గుచేటని పద్మ అన్నారు. వాస్తవానికి విభజన విషయంలో కేంద్రం మొదటినుంచీ చంద్రబాబు చెప్పినట్టే చేస్తోందని తెలిపారు. ఢిల్లీలో చంద్రబాబు నిరాహారదీక్ష చేసిన వెంటనే జీవోఎం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాలు.. ఇలా ఆయన చేసిన డిమాండ్లన్నింటికీ కాంగ్రెస్ హైకమాండ్ తలూపుతోందని చెప్పారు. ఇలా కాంగ్రెస్, టీడీపీల నేతలు కలిసిపోయి.. సమైక్యం కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్న తమపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంయుక్తంగా బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. జగన్ మాదిరిగా సోనియాను విమర్శించే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. సోనియాను తిడితే ఐఎంజీ కేసులో జైల్లో వేస్తారని చంద్రబాబుకు భయం పట్టుకున్నట్లుందని, అందుకే పిల్లిలా దాక్కుంటున్నారని విమర్శించారు. సీఎం కిరణ్, చంద్రబాబు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజల పాలిట చీడపురుగుల్లా తయారయ్యారని మండిపడ్డారు.

* కుప్పం నుంచి శ్రీకారం; ఓదార్పు యాత్ర కూడా
* రాయలసీమ, తెలంగాణ మీదుగా శ్రీకాకుళం వరకూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నవంబర్ 28న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమై.. రాయలసీమ, తెలంగాణల మీదుగా శ్రీకాకుళం వరకు సమైక్య శంఖారావం యాత్ర సాగుతుంది. అలాగే చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరగలేదు కాబట్టి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి తట్టుకోలేక జిల్లాలో మరణించిన వారి కుటుంబాలను యాత్ర సందర్భంగా జగన్ పరామర్శిస్తారు.
సమైక్య శంఖారావం యాత్ర జిల్లాల వారీ సవివర షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఏ.వీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాంతీయ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. 2012 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జగన్ సోదరి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర ను చేశారని.. ఇప్పుడు జగన్ సమైక్యాంధ్ర లక్ష్యంగా స్వయంగా యాత్ర చేపడుతున్నారని వారు వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న కోట్లాది మంది ఆకాంక్షను చాటి చెప్పడానికే జగన్ పర్యటిస్తున్నారని తెలిపారు.
విలేకరుల సమావేశంలో అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి త్యాగం చేయడానికైనా వెనుకాడబోదన్నారు. రాష్ట్రాన్ని విభజించమని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి గండ్రగొడ్డలిని ఇచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పంకు జగన్ వస్తే అడ్డుకోవాలని, ఆయన వస్తే తలుపులు మూసుకోమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్కడి ప్రజలను కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కుప్పంలో సమైక్యతను కోరే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని చంద్రబాబు తనది ఏ వాదమో చెప్పకుండా జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు ఉన్నారని విభజిస్తే అందరమూ నష్టపోతామనేది జగన్ వాదన అని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విరమింప జేసి, అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టకుండా కిరణ్ సమైక్య పోరాటం చేస్తున్నారని ఆయన వ్యంగంగా వ్యాఖ్యానించారు.
కిరణ్ కొత్త పార్టీ పెట్టినా అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్దేశకత్వంలోనే ఉంటుందన్నారు. రాష్ట్రం, దేశం నాశనమైనా చంద్రబాబునాయడు పట్టించుకోరని, రాజకీయ స్వార్థ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేటపుడే చాలా పెద్ద తప్పు చేస్తున్నారని తాను హెచ్చరించారని, అయినా చంద్రబాబు వినిపించుకోలేదని వెల్లడించారు. బాబు చేస్తున్న పనులకు రాష్ట్ర ప్రజలు ఆయనకు ఇప్పటికే యావ జ్జీవ కారాగార శిక్ష విధించారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు రాజకీయ ఉరిశిక్ష వేస్తారన్నారు. జగన్ బస్సు యాత్ర చేస్తారని, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తారని, మధ్యలో ఓదార్పు యాత్ర కూడా ఉంటుందని మిథున్‌రెడ్డి తెలిపారు.
సమైక్య శంఖారావం యాత్ర జిల్లాల వారీ సవివర షెడ్యూల్ త్వరలో
* రాయలసీమ, తెలంగాణ మీదుగా శ్రీకాకుళం వరకూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నవంబర్ 28న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమై.. రాయలసీమ, తెలంగాణల మీదుగా శ్రీకాకుళం వరకు సమైక్య శంఖారావం యాత్ర సాగుతుంది. అలాగే చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరగలేదు కాబట్టి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి తట్టుకోలేక జిల్లాలో మరణించిన వారి కుటుంబాలను యాత్ర సందర్భంగా జగన్ పరామర్శిస్తారు.
సమైక్య శంఖారావం యాత్ర జిల్లాల వారీ సవివర షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఏ.వీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాంతీయ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. 2012 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జగన్ సోదరి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర ను చేశారని.. ఇప్పుడు జగన్ సమైక్యాంధ్ర లక్ష్యంగా స్వయంగా యాత్ర చేపడుతున్నారని వారు వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న కోట్లాది మంది ఆకాంక్షను చాటి చెప్పడానికే జగన్ పర్యటిస్తున్నారని తెలిపారు.
విలేకరుల సమావేశంలో అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి త్యాగం చేయడానికైనా వెనుకాడబోదన్నారు. రాష్ట్రాన్ని విభజించమని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి గండ్రగొడ్డలిని ఇచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పంకు జగన్ వస్తే అడ్డుకోవాలని, ఆయన వస్తే తలుపులు మూసుకోమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్కడి ప్రజలను కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కుప్పంలో సమైక్యతను కోరే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని చంద్రబాబు తనది ఏ వాదమో చెప్పకుండా జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు ఉన్నారని విభజిస్తే అందరమూ నష్టపోతామనేది జగన్ వాదన అని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విరమింప జేసి, అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టకుండా కిరణ్ సమైక్య పోరాటం చేస్తున్నారని ఆయన వ్యంగంగా వ్యాఖ్యానించారు.

11/21/2013
Vasi Reddy Padma press meet on 21-11-13
Written By news on Thursday, November 21, 2013 | 11/21/2013
11/21/2013
హైదరాబాద్ : సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మెహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చేయనున్నారు. ఈ నెల 28 నుంచి సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. తాజా మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమైక్య శంఖారావం యాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా మూడు ప్రాంతాల్లో కొనసాగుతుందని తెలిపారు.
ఢిల్లీ అహంకారాన్ని నిలదీస్తూ, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబడుతూ ఈ యాత్ర కొనసాగుతుందని అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరుగుతుందని జగన్ పదేపదే చెప్తున్నారని ఆయన అన్నారు. ఈ యాత్రద్వారా ప్రజానీకాన్ని చైతన్యం చేస్తారన్నారు. తెలంగాణలో కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునేవారు ఉన్నారన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ కలిసి రాష్ట్ర విభజనకోసం కేంద్రానికి గండ్రగొడ్డలి ఇచ్చారాని అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. బాబును చూసి చిత్తూరు జిల్లా ప్రజలు తలదించుకుంటున్నారని ఆయన అన్నారు. టీడీపీని కాపాడేందుకు రాష్ట్రాన్నే కాక... దేశాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో ఓదార్పు జరగలేదని.... కాబట్టి సమైక్య శంఖారావం యాత్రలో ఓదార్పు కుటుంబాలను కూడా జగన్ పరామర్శిస్తారని తెలిపారు. మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, మిధున్ రెడ్డి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
28 నుంచి జగన్ సమైక్య శంఖారావం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం రాజకీయాలలో తలపండిన వారిని సైతం ఆశ్చర్య పరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఏకపక్షంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో పార్టీ నేతల్ని కలిసి మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే వామపక్ష, బీజేపీ పార్టీ నేతల్ని ఢిల్లీలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీని కొలకత్తాలో కలిసిన జగన్, త్వరలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ని కలవనున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం, అఖిలేశ్ యాదవ్‌ని నేడు (గురువారం) కలవాల్సి ఉండగా, ఆ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు తెలుస్తోంది.
ఏదిఏమైనా, సంఖ్యాపరంగా చూస్తే, నామినేటెడ్ సభ్యులిద్దరితో కలిపి 545 మంది ఉండే లోక్‌సభలో తనతో కలిపి ఇద్దరు (మరొకరు మేకపాటి రాజమోహన రెడ్డి) మాత్రమే ఉన్న అతి చిన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత అయిన జగన్, 203 ఎంపీల బలంతో, రాజకీయపుటెత్తులు, రణతంత్రపు జిత్తులతో చలాయించుకొస్తున్న కాంగ్రెస్ పార్టీకీ, దాని నేతృత్వంలోని యుపిఎ కూటమికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. సొంత రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేస్తుందని, రేపు డిల్లి గద్దె మీద యువరాజు రాహుల్ గాంధీని కూర్చోబెట్టడానికే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ పూనుకున్నారని జగన్ పదే పదే చాటారు. రాష్ట్రాలను తన ఇష్టారాజ్యంగా విభజించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా చేజిక్కించుకోబోతున్న కాంగ్రెస్ వైఖరిలోని అప్రజాస్వామ్యాన్ని జాతీయ పార్టీల దృష్టికి ఆయన తీసుకు వచ్చారు.
25 మంది సభ్యుల వామపక్ష కూటమిలో, 16 మంది సభ్యుల సిపీఎం జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. నలుగురు సభ్యులున్న సిపీఐకి రాష్ట్ర విభజనపై భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఆర్టికల్ 3ని కాంగ్రెస్ దుర్వినియోగ పరిస్తే అవకాశాలపై జగన్ వెలిబుచ్చిన ఆందోళనని ఆ పార్టీ అర్థం చేసుకోవడమే కాకుండా, అటువంటి దుర్వినియోగాన్ని తప్పకుండా అడ్డుకుంటామని జగన్‌కు హామీ ఇచ్చింది.
ఇంతకు మించి జగన్ సాధించిన మరో ముఖ్యమైన విజయం, ప్రత్యేక తెలంగాణాకు మొదటుంచీ సుముఖంగా ఉన్న బీజేపీని పునరాలోచన దిశగా మళ్లించడం. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి అనుకూలం అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాని వేరు చేయడం వెనక కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని జగన్ వాదనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్, వారిరువురి సమావేశ సందర్భంగా అంగీకరించారు. ఎన్ని పార్టీలు వ్యతిరేకించినా, 133 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ (117 ఎంపీలు) మద్దతు ఉంటే, తెలంగాణ విభజన తేలిగ్గా చేసేయవచ్చని తలపోస్తున్న కాంగ్రెస్సుకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ. ఇదిలా ఉండగా, ఏ కూటమిలో లేని 19 మంది ఎంపీల తృణమూల్ కాంగ్రెస్ దన్ను పొందటం, ‘జగన్ వెనకే మేము’ అని మమతాబెనర్జీ అంతటి ఫైర్ బ్రాండ్ చేతే అనిపించుకోవడం డిల్లీలో పెద్దలకి మింగుడు పడటం లేదు.
యుపిఎ కూటమికి బైటనుచి సహకరిస్తున్న సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ యువరాజు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ని జగన్ కలవడం అనూహ్యమైన పరిణామం కాకపోయినా, ఈ విషయంలో జగన్ వ్యూహం వేరని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఇటీవల బెంగుళూరులో జరిగిన కార్యక్రమానికి తన కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర నేతలతో కలిసి హాజరయిన సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ, తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించబోమని కరాఖండిగా చెప్పారు. అదే సందర్భంలో, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. నిజానికి, కిరణ్ అధిస్ఠానం అడుగుజాడల్లోనే నడుస్తూ, విభజన ప్రక్రియ వేగవంతం కావడానికి చక్కని ఉత్ప్రేరకంగా, బహు విధేయంగా నడుచుకుంటున్న విషయం సమాజ్ వాదీ పార్టీ అధినాయకులకు తెలియదు. కిరణ్ ప్రకటనలు ఒట్టి కాగితపు పులి గాడ్రింపులేనని, వాటి వెనక కాంగ్రెస్ మంత్రాంగం ఉందనీ సమాజ్ వాదీ పార్టీ నేతలకి, ముఖ్యంగా అఖిలేష్ కు విడమరిచి చెప్పడం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్నో పర్యటనలో మరో ముఖ్యోద్దేశ్యమని తెలుస్తోంది. జగన్ తన వ్యూహరచనలో, దాన్ని అమలు చేస్తున్న తీరులో కనబరుస్తున్న పరిణితికి రాజకీయ విశ్లేషకులు ముక్కన వేలేసుకుంటుంటే, తెలంగాణా బిల్లు ఇక తెల్లారినట్టేనని విభజనవాదులు భయపడుతున్నారు.
జగన్ ఒక్కడే ఒక సైన్యం!

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు నాగేశ్వరరావు మృతి
మచిలీపట్నం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన అస్వస్థతకు గురి అవటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కుక్కల నాగేశ్వరరావు గతంలో కృష్ణాజిల్లా జెడ్పీ ఛైర్మన్ గా పనిచేశారు. ఆయన స్వగ్రామం మొవ్వ మండలం కోసూరు. కుక్కల నాగేశ్వరరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.
11/21/2013
విభజనను అడ్డుకోవాలని అన్ని పార్టీల మద్దతు కోరుతున్న జగన్
- తృణమూల్ అధినేత్రితో వైఎస్సార్ కాంగ్రెస్ బృందం భేటీ
- ఓట్లు, సీట్ల కోసం కేంద్రం రాష్ట్రాన్నే చీలుస్తోందని వివరించిన జగన్
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 దుర్వినియోగమవుతోందని ఆవేదన
- విభజనను అడ్డుకునేందుకు, ఆర్టికల్ 3 సవరణకు కృషి చేయాలని వినతి
- జగన్ వాదనతో ఏకీభవించిన మమత
- విభజనను లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ అడ్డుకుంటామని హామీ
- ఈ విషయంలో జగన్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటన
- విభజనను అడ్డుకోవాలని అన్ని పార్టీల మద్దతు కోరుతున్న జగన్
కోల్‌కతా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రయత్నాలను పార్లమెంట్లో అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి హామీ ఇచ్చారు. విభజన విషయంలో ఒక విధానం పాటించకుండా రానున్న ఎన్నికల్లో ప్రయోజనాలను ఆశించి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ను విడదీయాలని చూస్తే ఇటు లోక్‌సభలోనూ అటు రాజ్యసభలోనూ అడ్డుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ వరుస క్రమంలో జగన్మోహన్రెడ్డి వివరించినప్పుడు మమతా బెనర్జీ పైవిధంగా స్పందించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడదీయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగడుతోన్న జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం అందులో భాగంగా బుధవారం కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిసింది. రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గంటకుపైగా చర్చలు జరిపారు. జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ ప్రతినిధులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, వి.బాలశౌరి, గట్టు రామచంద్రరావు చర్చల్లో పాల్గొన్నారు. ఈ ప్రతినిధి బృందం రావడంతోనే ఆత్మీయంగా పలకరించిన మమతా బెనర్జీ విభజన అంశంపై జగన్ చెప్పిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా విన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ విషయంలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నేతలనూ కలిసి వివరించాల్సిందిగా సూచించారు.
కేంద్రం వైఖరిని ఎండగట్టిన జగన్..
కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విషయంలో ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నదీ, నిరంకుశ వైఖరితో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్న విషయాలన్నింటినీ సోదాహరణంగా జగన్ తృణమూల్ అధినేత్రికి వివరించారు. ఏకాభిప్రాయం లేకుండా కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని తెలిపారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందితేనే రాష్ట్రాన్ని విలీనం చేయాలన్న ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను వివరిస్తూనే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్(ఎస్ఆర్సీ) సిఫారసు ఆధారంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని వివరించారు. ‘అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి ప్రాతిపదిక లేకుండా నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. ఆ తర్వాతే వాటిని విభజించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అలాంటి సంప్రదాయం పాటించలేదు’ అని జగన్ వివరించారు. ‘కేంద్రం రాజ్యాంగంలోని 3వ అధికరణ ఉంది కదా అని ఇష్టానుసారం విభజన చేయాలనుకుంటోంది. ఈ అధికరణ దుర్వినియోగం కావడాన్ని అడ్డుకోవడంలో మీరు అండగా నిలవాలి’ అని జగన్ కోరారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ తాము కచ్చితంగా మద్దతునిస్తామని ప్రకటించారు. ‘అభివృద్ధి చేయాలంటే.. డార్జిలింగ్ మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వొచ్చు, ప్యాకేజీలు, నిధులు కేటాయిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది కాని, విభజిస్తే అభివృద్ధి జరుగుతుందా!’ అని కూడా ఆమె చర్చల సందర్భంగా అన్నారు.
దీదీ సాయం కోరాం: జగన్
సమావేశానంతరం జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకునేందుకు సాయం చేయాల్సిందిగా మమతా బెనర్జీని కోరామన్నారు. అదే విధంగా 3వ అధికరణను సవరించాలని కూడా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రాన్నైనా విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేస్తూ దీన్ని సవరించాలని, విభజనకు మూడింటరెండొంతుల మెజారిటీ ఉండాల్సిందేనని పట్టుపడుతున్నామన్నారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు రెండింటిలోనూ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదించినపుడే రాష్ట్రాన్ని విభజించాలని, లేదంటే ఓట్ల కోసం, సీట్ల కోసం.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా అడ్డగోలుగా ఏ రాష్ట్రాన్నైనా ఇట్టే విభజిస్తుందని జగన్ అన్నారు. భవిష్యత్‌లో తృణమూల్‌తో పొత్తు కుదుర్చుకునే విషయం కూడా చర్చించారా అని మీడియా ప్రశ్నించినపుడు ‘ప్లీజ్ ఇది చాలా సీరియస్ విషయం... దీనిని పక్కదారి పట్టించొద్దు. ఇపుడు వచ్చింది దాని కోసం కాదు’ అని జగన్ సున్నితంగా వ్యాఖ్యానించారు.
విభజనకు ప్రజాభిప్రాయం తప్పనిసరి: మమత
తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలనుకున్నపుడు ప్రజాభిప్రాయం తప్పనిసరని చెప్పారు. దేశం సమైక్యంగా ఉండాలనేదే తమ వైఖరి అని, ప్రజలంతా కలసికట్టుగా ఉండాలనే తాము కోరుకుంటున్నామన్నారు. విభజన కోసం స్థానికంగా కొన్ని డిమాండ్లు ఉన్నాయని, అయితే దీని విషయంలో తమ వైఖరి చాలా సుస్పష్టమని చెప్పారు. అభివృద్ధి కోసం కొత్త జిల్లాలనే ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించవచ్చు, లేదా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చు, అలా కాదు, అంతా కలిసి విభ జిద్దామని నిర్ణయం తీసుకుని తీర్మానం ఆమోదిస్తే దానిని ఎవరూ వ్యతిరేకించరని అన్నారు. కానీ ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉందని, ఒకరు కావాలంటున్నారు, మరొకరు వద్దంటున్నారు కనుక ఇది చాలా సున్నితమైన అంశమని అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఏ మాత్రం సరికాదు, కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇప్పటి వరకూ ఎందుకు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదని కూడా మమత ప్రశ్నిస్తూ సమస్యను సవివరంగా చర్చించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ, సర్కారియా కమిషన్ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.
11/20/2013

Photos: మమతాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటి, కోల్ కతా పర్యటన
Written By news on Wednesday, November 20, 2013 | 11/20/2013

11/20/2013
విభజనకు గంగిరెద్దులా తలూపిన సీఎం కిరణ్

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గంగిరెద్దులా తలూపి తలుపులు బార్లా తెరిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. విభజన నిర్ణయం వెలువెడిన వెంటనే సీఎం కిరణ్ ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు వేయి తలల విషనాగులులా తలా ఓ మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
''సమైక్యవాదిలా ఫోజులు ఇవ్వడమే సిఎం కిరణ్ కు తెలుసు. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. సమైక్య ముసుగు వేసుకున్న విభజన ద్రోహి కిరణ్. తన గురించి సొంత డబ్బా చెప్పుకోవడం తప్ప విభజనను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయడం లేదు. తనకు అనుకూలంగా పత్రికలు, చానెళ్లలో సమైక్యవాదినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపిఎన్జీఓల సమ్మెను ఎందుకు విరమింపచేశారు?'' అని భూమన ప్రశ్నించారు.
11/20/2013
కోల్ కతా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తమ్ముడి లాంటి వారని, తానెప్పుడూ ప్రాంతాలు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోల్ కతాలో మమతా బెనర్జీని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్లు విభజిస్తే కుదరదని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విభజనకు ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేయాలని, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించకుండా వాళ్ల ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాలను విభజించకుంటూ పోతామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలోను, పార్లమెంటులో కూడా మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలని, లేనిపక్షంలో రాష్ట్రాన్ని విభజించకూడదని జగన్ అన్నారు. అంతేతప్ప అడ్డదిడ్డంగా, ఇష్టం వచ్చినట్లు విభజిస్తే అంగీకరించేది లేదని అన్నారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ అంతా కలిసే ఉండాలన్నదే తన భావన అని తెలిపారు. విభజిస్తూ పోతే సమస్య పరిష్కారం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఐదేళ్లుగా మాట్లాడకుండా ఊరుకుని ఇప్పుడు ఎన్నికలు వచ్చే తరుణంలో ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు విభజిస్తున్నారని ఆమె నిలదీశారు. అభివృద్ధి కావాలంటే కొత్త జిల్లాలను ఏర్పాటుచేసుకోవచ్చని, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించవచ్చని.. లేదా వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చని ఆమె తెలిపారు. లేదు అంతా కలిసి విభజిద్దామని నిర్ణయం తీసుకునితీర్మానం ఆమోదిస్తే దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరని మమతా బెనర్జీ అన్నారు. ఉదాహరణకు జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయని, పార్లమెంటులోకూడా 2/3 కన్నా ఎక్కువ మెజార్టీతో ఒప్పుకున్నారని ఆమె గుర్తుచేశారు
నా బాట సమైక్యమే

జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తమ్ముడి లాంటి వారని, తానెప్పుడూ ప్రాంతాలు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోల్ కతాలో మమతా బెనర్జీని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్లు విభజిస్తే కుదరదని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విభజనకు ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ అంతా కలిసే ఉండాలన్నదే తన భావన అని తెలిపారు. కావాలంటే కొన్నిచోట్ల మరిన్ని జిల్లాలు ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించాలని, అంతేతప్ప విభజిస్తూ పోతే మాత్రం సమస్య పరిష్కారం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

కోల్‌కతా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోల్ కతా చేరుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన ఈరోజు మధ్యాహ్నం భేటీ కానున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించే దిశగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులు సడలించాలని జగన్ కోర్టును కోరారు. ఆ మేరకు ముందుగా కోల్ కతా, లక్నో నగరాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.
దీంతో ముందుగా ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా గూర్ఖాలాండ్ ఉద్యమం జోరుగా ఉండటం, విభజన యోచనను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. ఆంద్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కూడా ఆమె మద్దతు పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కోల్ కతా వెళ్లిన జగన్ మోహన్ రెడ్డికి కోల్ కతా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మమతతో సమావేశం కానున్నారు.
కోల్ కతా చేరుకున్న వైఎస్ జగన్

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాల్ని మరింత ఉధృతం చేసింది. కాంగ్రెస్ నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని జాతీయస్థాయిలో వివిధ పార్టీ నేతల్ని కలిసి మద్దతు కూడగడుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే వామపక్ష, బీజేపీ పార్టీ నేతల్ని కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏ విధంగా ముక్కలు చేయాలని భావిస్తున్నదనే దానిపై జగన్ ఈ సందర్భంగా మమతకు వివరించనున్నారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు మద్దతు ప్రకటించాలని ఆయన ....దీదీని కోరనున్నారు. ఇందు కోసం జగన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం కోల్‌కతా బయలుదేరి వెళ్లింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనను అడ్డుకుని తీరతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్‌నేత కొణతాల రామకృష్ణ తెలిపారు
సమైక్యయత్నాలు ముమ్మరం చేసిన జగన్

Jagan on a mission
Scheduled to meet Mamata, Mulayam to muster support against State division

Y.S. Jaganmohan Reddy
The YSR Congress Party has intensified its efforts to muster support from various political parties in the country against the Centre’s decision to bifurcate Andhra Pradesh with its president Y.S. Jaganmohan Reddy planning to meet the Chief Ministers of West Bengal and Uttar Pradesh, Mamata Banerjee and Akhilesh Yadav respectively.
Mr. Jagan’s visit to Kolkata and Lucknow scheduled on November 20 and 21 assumes significance in the backdrop of demands for separate States there. He would also call on Samajwadi Party president Mulayam Singh Yadav in Lucknow. The schedule of his visits was finalised after a special court here allowed his petition seeking permission to visit the two places on Tuesday. The Kadapa MP would be accompanied by a team of senior party leaders to impress upon the leaderships of Trinamool Congress and Samajwadi Party against “the unilateral decision” of the Centre to bifurcate AP.
The demand for Gorkhaland State has been a contentious issue in West Bengal for over three decades. The CPI (M)-led government in the past and the Trinamool Congress government led by Ms. Banerjee now are opposed to the idea. The two parties fear that statehood to Telangana would give fresh impetus to Gorkhaland movement.
Similarly, the demand for carving out Bundelkhand and Haritha Pradesh from Uttar Pradesh was being opposed by the Samajwadi Party. However, the Bahujan Samaj Party (BSP) government led by Mayawati had proposed division of UP into three States months before it was ousted in the last Assembly elections.
Senior leader of YSR Congress M.V. Mysoora Reddy told The Hindu that support of various parties was being sought against the proposed bifurcation of AP. They would also impress upon the two Chief Ministers on the need to amend the Article (3) of the Constitution to prevent the Centre from acting authoritatively and arbitrarily in creating new States, he said.
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/jagan-on-a-mission/article5370188.ece
11/20/2013
రాష్ట్రాల విభజన విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ స్థాయిలో ఆయా పార్టీల సహకారాన్ని కోరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ ప్రయత్నంలో భాగంగా బుధవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. ఈ మేరకు జగన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో కోల్‌కతాకు బయలుదేరుతోంది. పార్లమెంట్లో మెజారిటీ ఉందన్న కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ బలమైన రాష్ట్రాలను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జగన్ అదే విషయంలో.. ఇటీవల ఢిల్లీ వెళ్లి సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులను కలిసిన సంగతి తెలిసిందే. ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటులలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం చేసే విధంగా ఆర్టికల్ 3కు సవరణలు ప్రతిపాదించడమే కాకుండా ఆ రకంగా చట్ట సవరణకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని ఆయా నేతలకు అందజేసిన వినతిపత్రంలో ఆయన కోరారు. తాజాగా కోల్‌కతా, లక్నో వెళ్లడానికి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో జగన్.. మమతా బెనర్జీని కలిసి మద్దతు కోరతారని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. జగన్ వెంట తనతో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పీఏసీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎంపీ వి.బాలశౌరి వెళుతున్నట్టు చెప్పారు. మమతను కోల్‌కతాలో మధ్యాహ్నం 2 గంటలకు కలుస్తున్నామన్నారు. తాము జాతీయ పార్టీలే కాకుండా కోర్టు అనుమతిని బట్టి అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కలుస్తామని అన్నారు.
కోల్‌కతా, లక్నో వెళ్లేందుకు జగన్‌కు అనుమతి
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోల్‌కతా, లక్నో వెళ్లేందుకు సీబీ ఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అఖిలేశ్‌యాదవ్‌లను కలవాల్సి ఉందని, ఈ మేరకు కోల్‌కతా, లక్నో వెళ్లేం దుకు అనుమతించాలని ఇటీవల జగన్మోహన్రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలి సిందే. దీన్ని రెండో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ మంగళవారం విచారించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఆయాపార్టీల నేతలను కలిసి విభజనతో జరిగే ఇబ్బందులను వివరించాల్సి ఉందని జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. మమతా, అఖిలేశ్ లు నేతృత్వం వహిస్తున్న పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించాలని జగన్ ప్రత్యక్షంగా కలిసి కోరాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. బుధవారం కోల్‌కతా, గురువారం లక్నో వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఫోన్ లేదా ఫ్యాక్స్ నంబర్‌ను కోర్టుకు ఇవ్వాలని, ఆ నంబర్లో అందుబాటులో ఉండాలని షరతు విధించారు.
నేడు మమతతో వైఎస్ జగన్ భేటీ

- కోల్‌కతా వెళ్లనున్న వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం
- విభజనకు వ్యతిరేకంగా, ఆర్టికల్ 3 సవరణ దిశగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతోన్న జగన్మోహన్రెడ్డి
- ఇప్పటికే సీపీఎం, సీపీఐ, బీజేపీ అగ్రనేతలతో సమావేశాలు

రాష్ట్ర విభజన జరగరాదని భావిస్తే తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఎందుకు వెనక్కి తీసుకోవడంలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ‘‘విభజన జరగకూడదని చంద్రబాబు భావిస్తే తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. లేదా సమైక్యంగా ఉంచాలని కోరుతూ లేఖ రాయాలి. ఆ రెండూ చేయకుండా వస్తే ప్రజలు నిలదీయాలి’’ అని అన్నారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 27న కుప్పంలో పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆయనను చూడటానికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అంబటి మంగళవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి కుప్పం వెళితే చంద్రబాబుకు అంత భయమెందుకు? జగన్ వచ్చి జనంతో మాట్లాడితే కుప్పం ప్రజలు బాబుకు ఓట్లేసే పరిస్థితి ఉండదని భయపడుతున్నారా? అందుకే అలా మాట్లాడుతున్నారా? అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుడి సభకు వెళ్లొద్దని తాము పిలుపునివ్వబోమని, అయితే రాష్ట్ర విభజనకు సంబంధించి వైఖరీ చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడే చంద్రబాబు లాంటి వారిని ప్రశ్నించాలని ప్రజలకు చెబుతామన్నారు.
టీడీపీని మూసేదశకు తెచ్చారు..
సమైక్యమో విభజన వాదమో చెప్పలేని స్థితిలో టీడీపీని మూసివేసే దశకు చంద్రబాబు తెచ్చారని అంబటి విమర్శించారు. జగన్ వల్ల తనకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకున్న చంద్రబాబు.. సోనియా గాంధీతో ఆయన కుమ్మక్కయ్యారంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కుమ్మక్కయి ఉంటే ఆయన 16 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తుంది? సమైక్య శంఖారావం సభలో సోనియాగాంధీని ఆమె పౌరసత్వంపై ప్రశ్నించే వారా? అని అంబటి అన్నారు.
ఆనాడు ఏం చేశావు కిరణ్?
రాష్ట్ర విభజనపై కేంద్రానికి నివేదికలు పంపిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పైకి మాత్రం సమైక్యవాదినని చెప్పుకుంటున్నారని అంబటి అన్నారు. ఆయన నిజంగా సమైక్యంగా ఉండాలని కోరేవారే అయితే కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్‌కు ఆమోదముద్ర వేయకముందే అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపిద్దామంటే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశానికి వైవీ సుబ్బారెడ్డి, షర్మిల రాలేదని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను విలేకరులు ప్రస్తావించగా, చంద్రబాబు, కిరణ్ ప్రభావానికి లోనైన పత్రికలు కావాలనే ఇలాంటి అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.

11/19/2013

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన రెడ్డి 'సాక్షి అభయ' ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్రారంభించారు. ప్రమాదంలో ఉన్న వారి కోసం, ముఖ్యంగా మహిళలు, పిల్లలు కోసం ఈ అప్లికేషన్ రూపొందించారు. ఒక్క క్లిక్ తో ప్రమాదంలో ఉన్న విషయాన్ని పోలీసులకు, తమకు కావలసిన వారికి వెంటనే తెలియజేయవచ్చు. అపాయంలో ఉన్న వారందరికీ ఇది ఉపయోగపడుతుంది.
సాక్షి అభయ అప్లికేషన్
ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత కావలసిన ముఖ్యమైన మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి, ఫేస్ బుక్ ఐడిని రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదంలో ఉన్నవారు తమ మొబైల్ హోం స్క్రీన్ పైన 'HELP' అనే బటన్ నొక్కాలి. జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా వెంటనే ప్రమాదంలో ఉన్నవారు ఎక్కడ ఉన్నారో తెలియజేస్తూ సహాయాన్ని కోరుతూ మెసేజ్ వెళుతుంది.
అంతేకాకుండా పది సెకండ్ల వీడియో కూడా మెమరీ కార్డులో రికార్డు అవుతుంది. వెంటనే దానంతట అదే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు కాల్ వెళుతుంది.
సాక్షి అభయ' అప్లికేషన్ ప్రారంభించిన జగన్
Written By news on Tuesday, November 19, 2013 | 11/19/2013

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన రెడ్డి 'సాక్షి అభయ' ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్రారంభించారు. ప్రమాదంలో ఉన్న వారి కోసం, ముఖ్యంగా మహిళలు, పిల్లలు కోసం ఈ అప్లికేషన్ రూపొందించారు. ఒక్క క్లిక్ తో ప్రమాదంలో ఉన్న విషయాన్ని పోలీసులకు, తమకు కావలసిన వారికి వెంటనే తెలియజేయవచ్చు. అపాయంలో ఉన్న వారందరికీ ఇది ఉపయోగపడుతుంది.
సాక్షి అభయ అప్లికేషన్
ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత కావలసిన ముఖ్యమైన మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి, ఫేస్ బుక్ ఐడిని రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదంలో ఉన్నవారు తమ మొబైల్ హోం స్క్రీన్ పైన 'HELP' అనే బటన్ నొక్కాలి. జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా వెంటనే ప్రమాదంలో ఉన్నవారు ఎక్కడ ఉన్నారో తెలియజేస్తూ సహాయాన్ని కోరుతూ మెసేజ్ వెళుతుంది.
అంతేకాకుండా పది సెకండ్ల వీడియో కూడా మెమరీ కార్డులో రికార్డు అవుతుంది. వెంటనే దానంతట అదే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు కాల్ వెళుతుంది.
11/19/2013
హైదరాబాద్ : సమైక్యం అనే అక్షరాలు పలకడానికి చంద్రబాబు ఎందుకంత సందేహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్ కుప్పం వెళ్తున్నారంటే బాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. కుప్పం ప్రజలు చంద్రబాబుని చొక్కాపట్టుకుని ప్రశ్నించాలని కోరారు. ''చంద్రబాబూ...నీవు నిప్పులా ఎప్పుడు బతికావో చెప్పు? అందర్నీ మోసం చేసే నువ్వు నిప్పు అవుతావా? రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా ఏ ప్రాంతంలోనూ ముఖ్యమంత్రివి కావన్న విషయం నీకూ తెలుసు'' అని ఆయన విమర్శించారు.
పైకి సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నట్లు గొప్పలు చెప్పుకొంటూ.. లోలోపల మాత్రం విభజనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా అంబటి రాంబాబు మండిపడ్డారు. కొన్ని పనికిమాలిన పత్రికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
జగన్ కుప్పం వెళ్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?
పైకి సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నట్లు గొప్పలు చెప్పుకొంటూ.. లోలోపల మాత్రం విభజనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా అంబటి రాంబాబు మండిపడ్డారు. కొన్ని పనికిమాలిన పత్రికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
11/19/2013
కోల్ కతా, లక్నో వెళ్లేందుకు జగన్ కు కోర్టు అనుమతి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కోల్ కతా, లక్నో వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ రేపు కోల్ కతా వెళతారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తారు. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ లోని లక్నో వెళతారు. అక్కడ సమాజ్‌వాది పార్టీ అధినేత మూలాయం సింగ్ యాదవ్ ను, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలుస్తారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జాతీయ నాయకులను కలుస్తున్నదానిలో భాగంగా జగన్ వారిని కలుస్తారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను జగన్ వారికి వివరిస్తారు. పార్లమెంటులో విభజన బిల్లును వ్యతిరేకించాలని వారిని కోరతారు

కోల్ కతా, లక్నో వెళ్లేందుకు వైఎస్ జగన్ కు కోర్టు అనుమతి

Subscribe to:
Posts (Atom)