07 June 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

టిడిపి గతంలో టిఆర్ఎస్ కండువా కప్పుకొందిగా

Written By news on Saturday, June 13, 2015 | 6/13/2015

గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నది ,ఆ పార్టీతో కలిసి పోటీచేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ కుమ్మక్కైయ్యాయన్న టీడీపీ విమర్శలను ఖండించారు. 2009 లో తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్ కలిపి పోటీచేసిన విషయాన్ని జనం మర్చిపోయారని టిడిపి భావిస్తోందని ఆయన అన్నారు.రాష్ట్రానికి ఫోన్ ట్యాపింగ్ గురించి నేర్పిందే చంద్రబాబు అని ఆయన అన్నారు.ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయి పోన్ టాపింగ్ అంటూ దీనిని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రమాద మృతులకు వైఎస్సార్సీపీ నివాళి


విశాఖపట్టణం: ధవళేశ్వరం వద్ద గోదావరిలో పడి మృతి చెందిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతోపాటు వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. అంతకుముందు మృతదేహాలను శనివారం సాయంత్రం వ్యాన్లలో అచ్యుతాపురం మండలం మోసయ్య పేటకు తీసుకురాగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

మళ్లీ మంచి రోజులొస్తాయి


మళ్లీ మంచి రోజులొస్తాయి: షర్మిల
ముగిసిన మలి విడత పరామర్శ యాత్ర
♦  4వ రోజు ఒక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ తనయ
♦  తొలి విడతలో 30, మలివిడతలో 18 కుటుంబాలను కలసిన షర్మిల
♦  ఐదేళ్ల తర్వాత కూడా వచ్చి పలకరించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
♦  నల్లకాల్వ సాక్షిగా జగన్ ఇచ్చిన మాటను నిలుపుకునేందుకే: ఎంపీ పొంగులేటి
♦  నెలాఖరులో రంగారెడ్డి జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
♦  గిరిజనులకు అన్యాయంపై నిరాహారదీక్ష చేపడతామని ప్రకటన


సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలుసుకుని మనోస్థ్యైరా న్ని నింపేందుకు నల్లగొండ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మలివిడత పరామర్శ యాత్ర ముగిసింది. శుక్రవారం నాలుగోరోజు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిట్ర వసంతరావు కుటుంబాన్ని ఆమె పరామర్శిం చారు. వారితో ఆత్మీయంగా మాట్లాడి కష్టసుఖాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. వారికి తమ కుటుంబం అండగా ఉంటుందని, మళ్లీ మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని వసంతరావు కుమారుడు రాము మనోజ్‌కుమార్‌కు చెప్పారు.

వసంతరావు తల్లిదండ్రులు అనంతమ్మ, వెంకటేశ్వర్లు, భార్య వెంకట్రావమ్మలతో ఆత్మీయంగా మాట్లాడారు. వెంకట్రావమ్మ తల్లి 4రోజుల క్రి తం చనిపోయిందంటూ వారు కన్నీటిపర్యంతం కావడంతో షర్మిల కూడా కంటతడి పెట్టారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు పి.సిద్ధార్థరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు బీష్వ రవీందర్, వెల్లాల రామ్మోహన్, ముజ్తబా అహ్మద్, మెండెం జయరాజ్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, అయిలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, సెగ్గెం రాజేశ్, కుసుమకుమార్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, షర్మిలా సంపత్, డాక్టర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోరేపల్లి శ్వేత, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా, నాయకులు ఫయాజ్‌ఖాన్, మందా వెంకటేశ్వర్లు, మరియదాస్, వంగూరి శ్రీనివాస్‌యాదవ్ తదితరులు షర్మిల వెంట ఉన్నారు.
 
10 రోజులు... 48 కుటుంబాలు
నల్లగొండ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర పూర్తయింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో ప్రాణాలొదిలిన 48 మంది కుటుంబాలను ఆమె పరామర్శించారు. తొలివిడతలో గత జనవరి 21 నుంచి 26 వరకు 30 కుటుంబాలను కలిశారు. జూన్ 9 నుంచి శుక్రవారం దాకా మలివిడత యాత్రలో 18 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల యాత్రకు జిల్లా ప్రజల నుంచి అడుగడుగునా ఎంతో స్పందన లభించింది. దివంగత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ఊరూరా సాదర స్వాగతం పలికారు. దాదాపు ప్రతి గ్రామంలోనూ డప్పుచప్పుళ్లు, కోలాటాలతో గ్రామస్తులు ఆత్మీయంగా ఆహ్వానించారు.

షర్మిల వెళ్లిన కుటుంబాల సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. పెద్ద దిక్కును కోల్పోయిన తమను షర్మిల వచ్చి పలకరిస్తామని ఊహించలేదని, ఆమె రాక తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని వారన్నారు. షర్మిలకు ప్రేమతో మజ్జిగన్నం, పాయసం, స్వీట్లు, కొబ్బరిబోండాలు, పాలు... ఇలా తమకు తోచిన విధంగా అందించి ఆప్యాయత చాటుకున్నారు. ప్రతి కుటుంబంలోని వారినీ షర్మిల పేరుపేరునా తెలుసుకోవడంతో పాటు వారి బాగోగుల గురించి వాకబు చేయడం వారిలో సంతోషం నింపింది. వైఎస్ మరణించి ఐదేళ్లు దాటాక కూడా తమను గుర్తుపెట్టుకుని షర్మిల వచ్చి పరామర్శించడాన్నిమర్చిపోలేమని వారన్నారు. ఇది ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
 
అందరి నోటా వైఎస్ అభివృద్ధే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలంతా వైఎస్సార్ చేసిన అభివృద్ధినే తలచుకున్నారని పొం గులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన ప్రతి ఒక్కరి కుటుంబాన్నీ కలుసుకుంటానని నాడు నల్లకాలువ సాక్షిగా వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలుపుకునేందుకే ఆయన తరఫున సోదరి షర్మిల యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఈ నెలాఖరులో రంగారెడ్డి జిల్లాలో ఆమె పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు.

రుణమాఫీని వైఎస్ పూర్తిస్థాయిలో అమలు చేసి, వారంలోనే కొత్త రుణాలిప్పిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీలను, మేనిఫెస్టో వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించా రు. నాలుగు విడతల్లో మాఫీచేస్తే ఆ సొమ్ము ఏటా వడ్డీ కిందే జమవుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాల అంశాన్నే ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గిరిజను ల భూముల పట్టాలను లాక్కోజూస్తోందన్నారు. దీనిపై త్వరలో నిరాహారదీక్ష చేపడతామని ప్రకటించారు.

బాబును ఏ-1గా చేర్చాలి


బాబును ఏ-1గా చేర్చాలి
పులివెందుల : ఓటుకు నోటు వ్యవహారంలో అసలు సూత్రధారి చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం శాసనసభలో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పైన, మరొకరిపైన అవాకులు.. చవాకులు పేలుతున్న చంద్రబాబు రేవంత్‌రెడ్డి విషయంలో ఎందుకు నోరు మెదపడంలేదన్నారు. రేవంత్‌రెడ్డి వీడియో క్లిప్పింగ్‌లో చాలా స్పష్టంగా తన బాస్ చంద్రబాబు పంపితేనే వచ్చానని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో చెప్పడం  దేశ ప్రజలందరూ చూశారన్నారు.

తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్న చంద్రబాబు స్టీఫెన్ సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ఎందుకు ఖండించలేదన్నారు. తన సొంత అవినీతి వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల ప్రజల వివాదంగా చిత్రీకరించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు వ్యవహారంలో ఏసీబీ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన కోరారు.

ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తనను కాపాడాలని వేడుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి తనకు హామీ ఇచ్చారని.. తనకు అనుకూలమైన మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇంత బహిరంగంగా చంద్రబాబు అవినీతికి పాల్పడుతుంటే.. ఆయన మీద ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికే చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతితో పాటు ఇతర కేంద్ర మంత్రులకు వైఎస్ జగనన్న సారథ్యంలో వైఎస్‌ఆర్ సీపీ తరపున వినతిపత్రాలు అందజేసి చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చాలని పార్టీ ఎంపీలతో కలిసి డిమాండ్ చేశామన్నారు. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.

 సమస్యల పరిష్కారానికి కృషి
 ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఆయన పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ వెంగముని, తొండూరు ఎంపీపీ భర్త రవీంద్రనాథరెడ్డి సమస్యలను ఆయన దృష్టికి తేగా వాటిని పరిష్కరించారు.

ధవళేశ్వరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


ధవళేశ్వరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సత్వరమే వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలను సత్వరమే ఆదుకోవాలని వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బాబును ఏ1, రేవంత్ ను ఏ2 గా చేర్చాలి

Written By news on Friday, June 12, 2015 | 6/12/2015


'బాబును ఏ1, రేవంత్ ను ఏ2 గా చేర్చాలి'
నల్గొండ:  ఓటుకు రూ. 5 కోట్ల కేసులో చంద్రబాబునాయుడిని ఏ-1 ముద్దాయిగా, ఈ ఘటనతో సంబంధమున్న ఎమ్మెల్యేలందరినీ ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో షర్మిల మలివిడత పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్, రాష్ట్రపతిలను ఇప్పటికే కలిసి ఫిర్యాదు చేశారన్నారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెప్పడం కాదని, తక్షణమే ఆ పని చేయాలని, చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చి, అరెస్టు చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఒక పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి మారే అంశానికి కూడా తక్షణమే పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రేవంత్‌రెడ్డిని ఏ-2 ముద్దాయిగా, ప్రలోభాలతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలందరినీ ముద్దాయిలుగా చేర్చాలన్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి సరిగా వ్యవహరించాలని పొంగులేటి అన్నారు.
(చౌటుప్పల్)

దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం


'దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం'
హైదరాబాద్:రాజకీయ దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన పట్టిసీమ ప్రాజెక్టు రాజకీయ దురుద్దేశంతోనే చేపడుతున్నదేనని విమర్శించారు.శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన మైసూరా.. విభజన చట్టాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారు.

 రాష్ట్ర విభజన చట్ట ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కృష్ణా రివర్ బోర్డు, సీడబ్యూసీ అనుమతి తీసుకోవాలన్నారు. విభజన చట్టాన్ని ఉల్లఘించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పట్టిసీమ విషయంలో ఏపీ ప్రభుత్వం సీడబ్యూసీ అనుమతి తీసుకుంటే బాగుంటేదని మైసూరా తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు ఆ అనుమతులు తీసుకోకుండా చేపట్టారన్నారు. రెండు రాష్ట్రాలను రెచ్చగొట్టే విధంగా ఇద్దరు సీఎంలు వ్యవహరించడం తగదన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టు నిర్మాణాలపై కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్యూసీకి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాస్తారన్నారు. చట్టాలను రెండు రాష్ట్రాల సీఎంలు గౌరవించాలన్నారు.

చంద్రబాబూ అదే జైలుకు


చంద్రబాబూ అదే జైలుకు వెళతారు..
కాకినాడ: భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాల డీలర్లు ఇద్దరే ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఒకరు పాతూరి రామారావు, మరొకరు కేంద్రమంత్రి సుజనా చౌదరి అని... వాళ్లిద్దరు టీడీపీ నాయకులే అని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, అవునో కాదో చంద్రబాబు నాయుడు చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.


రేవంత్ రెడ్డి విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ చంద్రబాబును అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వేచి చూస్తోందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళతారని అన్నారు. తమను రాజకీయ దురుద్దేశంతో జైలుకు పంపిన చంద్రబాబు కూడా అదే జైలుకు వెళతారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

వైఎస్‌ను తరతరాలూ గుర్తుంచుకుంటాం


వైఎస్‌ను తరతరాలూ గుర్తుంచుకుంటాంనల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తానేదార్ పల్లిలో షర్మిలకు స్వీట్ తినిపిస్తున్న మునగాల పుల్లమ్మ కుటుంబ సభ్యులు
ఆయన నగరబాట... మా జీవితాల్లో వెలుగుబాట
♦ పరామర్శ యాత్రలో షర్మిలతో నల్లగొండవాసులు
♦ నల్లగొండ జిల్లాలో మూడో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ
♦ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్న వైఎస్ తనయ
♦ అడుగడుగునా ప్రజల నుంచి ఆదరణ వెల్లువ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘2006లో వైఎస్ నల్లగొండ పట్టణానికి నగరబాటకు వచ్చారు.ఆ సందర్భంగా మా దుకాణాలు ఇరుకుగా ఉన్న విషయాన్ని గమనించారు.

వెంటనే కలెక్టర్‌ను పిలిపించారు. పాత కలెక్టరేట్ స్థలాన్ని స్వర్ణకారులకు కేటాయించాల్సిందిగా ఆదేశించారు. దాంతో మా 160 కుటుంబాలకు వ్యాపారం చేసుకునేందుకు గూడు దొరికింది. వైఎస్ చేసిన మేలును మేం తరతరాలు గుర్తుంచుకుంటాం’’ నల్లగొండ పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రాచకొండ గిరి మాటలివి. మలి విడత పరామర్శ యాత్రలో భాగంగా గురువారం పట్టణంలో పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని సందర్శించిన షర్మిలకు ఈ విషయాన్ని చెమర్చిన కళ్లతో వివరించారాయన. వైఎస్‌ను ఎన్నోసార్లు కలిశానని, తనను ప్రేమతో చెంపపై తట్టేవారని చెబుతూ మహానేతతో తనకున్న ఆత్మీయానుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

యాత్రలో మూడో రోజు గురువారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఆరుగురి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకుని కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
 
మూడోరోజు పర్యటన ఇలా
రెండో రోజు పరామర్శ అనంతరం నకిరేకల్ పట్టణంలో రాత్రి బస చేసిన షర్మిల మూడో రోజు ఉదయం నకిరేకల్ నుంచి మర్రూర్ మీదుగా నల్లగొండ నియోజకవర్గ పరిధిలో తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి వెళ్లారు. రాయించు నర్సింహ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇంట్లోని చిన్నారులతో ఆడుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం సిలార్‌మియా గూడెంలో వైఎస్ విగ్రహానికి గ్రామస్తుల కోరిక మేరకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబాన్ని కలుసుకుని మాట్లాడారు.

ఆరుబయట ఏర్పాటు చేసిన టెంట్‌లోనే పెద్ద ఎత్తున గుమిగూడిన జనసందోహం నడుమ వారితో గడిపారు. వారు బహూకరించిన గాజులు వేసుకున్నారు. నల్లగొండ మండలం చందనపల్లి వెళ్లి చింతా భిక్షమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పానగల్ ప్రాజెక్టు ముంపు గ్రామమైనందున వైఎస్ హయాంలోనే తమకు రూ.26 కోట్ల నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా ఓ గ్రామస్తుడు గుర్తు చేసుకున్నారు. వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయిస్తే ఆయన్ను రోజూ తలచుకుంటామని చెప్పారు.

అనంతరం నల్లగొండ పట్టణంలోని సిమెంట్ రోడ్డులో ఉన్న పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. బాగా చదువుకోవాలని దయానంద్ పిల్లలకు సూచించారు షర్మిల. కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన కొబ్బరిబొండాం తాగారు. అనంతరం కనగల్ మండల కేంద్రంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాంపల్లి చేరుకుని అస్తర్ బీ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి మర్రిగూడ మండలం తాన్‌దార్‌పల్లిలో మునగాల పుల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.
 
షర్మిల వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి,  కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, సేవాదళం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముజ్తబా అహ్మద్, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెర్బర్ట్.

గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా భిక్షపతి, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ పి.సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ర్ట కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, అమృతాసాగర్, ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇరుగు సునీల్‌కుమార్, పిట్ట రాంరెడ్డి, ఎం.డి.సలీం, ఖమ్మం జిల్లా మధిర ఎంపీపీ లక్ష్మారెడ్డి, యువజన విభాగం నాయకుడు కొన నరందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఆద్యంతం ఆత్మీయ స్వాగతం
షర్మిల పరామర్శ యాత్రకు నల్లగొండ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. షర్మిలను ప్రజలు అడుగడుగునా ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. గురువారం గ్రామగ్రామాన డప్పుచప్పుళ్లు, కోలాటాలతో తమ ఊరి ఆడబిడ్డ మాదిరిగా ఆమెను ఊళ్లోకి తీసుకెళ్లారు. రాజన్న కుమార్తె తమ ఊరికి వచ్చిందంటూ ఆమెను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ కుటుంబంపై ప్రేమను చాటుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు షర్మిలను చూసేందుకు, మాట్లాడేందుకు పోటీలు పడ్డారు. ఆమెను సెల్‌ఫోన్లలో బంధించేందుకు యువతీ యువకులు ఉత్సాహపడ్డారు.  గురువారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలకేంద్రంలో దస్తగిరి కుటుంబ సభ్యులను  ఆప్యాయంగా పలకరిస్తున్న షర్మిల. చిత్రంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ తదితరులు

Popular Posts

Topics :