26 March 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు

Written By news on Saturday, April 1, 2017 | 4/01/2017



వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన షెల్ కంపెనీపై ఈడీ దాడులు నిర్వహించిందంటూ అడ్డగోలు ప్రసారాలు చేసిన చానెళ్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్‌ షెల్ కంపెనీ జగన్ మోహన్ రెడ్డికి చెందినదంటూ శనివారం కొన్ని టీవీ చానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయి. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రసారాలు చేసిన చానెళ్లకు వైఎస్ జగన్ తరఫున న్యాయవాదులు లీగల్ నోటీసులు పంపించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించినదైన రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్‌ తో పాటు మరికొన్ని షెల్ కంపెనీలపై సోదాలు నిర్వహించామని ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం తన ట్విటర్ లో ట్వీట్ చేసింది. ఎలాంటి వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా ఈడీ చేసిన ట్వీట్ ను ఆధారంగా కొన్ని ఎల్లోమీడియా చానెళ్లు అడ్డగోలు కథనాలు అల్లుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికి శతవిధాలా ప్రసారాలు చేశాయి. ఈడీ చేసిన ట్వీట్ వాస్తవ విరుద్ధమని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. అందులో పేర్కొన్న షెల్ కంపెనీతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఈడీ ట్వీట్ చేయడంపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈడీకి లేఖ రాశారు. అందులో పేర్కొన్న కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని, పూర్తి వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు.
దాని ఆధారంగా కొద్ది నిముషాల వ్యవధిలో ఎల్లో మీడియాలో కథనాలు రావడం చూస్తే అంతా పక్కా ప్లాన్‌ ప్రకారం కుట్ర పూరితంగా సాగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షణాలపై ఏబీఎన్, టీవీ9, ఈటీవీలు వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలు ప్రసారాలకు ఒడిగట్టాయి. దీనిపై జగన్ తరఫున న్యాయవాది ఆయా చానెళ్లకు లీగల్ నోటీసులు పంపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రచారాలు చేయడమేంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలావుండగా, ఇంతకు ఈడీ ట్వీట్‌ చేసినట్లు చెపుతున్న సమాచారం ఈడీ ద్వారా బయటకు వచ్చిందా లేదా కావాలని ఎవరి ప్రోద్బలంతోనైనా జరిగిందా? తెరవెనుక కుట్ర ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ అప్పు రూ. 2.16 లక్షల కోట్లకు పెరుగుతుంది


ఏపీ అప్పు రూ. 2.16 లక్షల కోట్లకు పెరుగుతుంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని, వృథా ఖర్చులు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017-18 సంవత్సరానికి ఏపీ అప్పు రూ. 2.16 లక్షల కోట్లకు పెరగనుందని చెప్పారు.

నాసిరకం బొగ్గు కొనుగోలు చేయడం వల్ల జెన్‌కోకు నష్టం వాటిల్లిందని చెప్పారు. విద్యుత్ వ్యవస్థలోని లోపాలను కాగ్ బయట పెట్టిందని వెల్లడించారు. అయినా, విద్యుత్ రంగంలో అవార్డులు పొందామని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని బుగ్గన అన్నారు. బడ్జెట్ మేనేజ్‌మెంట్ అధ్వాన్నంగా ఉందని  విమర్శించారు. పాత పీడీ అకౌంట్లు క్లోజ్ చేయకుండా కొత్త పీడీ అకౌంట్లు ప్రారంభించారని కాగ్ ఆక్షేపించిన విషయాన్ని బుగ్గన తెలిపారు. హెలికాప్టర్ అద్దెలోనూ దుబారా చేశారని, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ రూ.14.37 కోట్లు అదనంగా ఇచ్చారని చెప్పారు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునేటప్పుడు సరైన ప్రమాణాలు పాటించలేదని కాగ్ తప్పులు ఎత్తి చూపిందన్నారు. పూర్తి సమయం హెలికాప్టర్‌ తిరగకుండా అద్దెలు చెల్లించిన విషయాన్ని కాగ్ స్పష్టం చేసిందని బుగ్గన వివరించారు.

రాజధాని విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని దేశాలు తిరిగి.. చివరకు సినిమా సెట్టింగ్స్ దగ్గర ఆగిందన్నారు. ఎన్సీఈఆర్ రిపోర్ట్ చూస్తే అవినీతిలో ఏపీ నెం.1 అని తేలిందని బుగ్గన గుర్తు చేశారు. చివరకు చంద్రబాబు, మరో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఎంఏ ఎకనామిక్స్ చదవినట్టుగా టీడీపీ నేతలు భ్రమల్లో ఉన్నారని, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా చంద్రబాబు చదివిన యూనివర్శిటీలోనే చదివారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారన్నారు. పెద్దిరెడ్డి ఏనాడూ తన పేరుకు ముందు డాక్టర్ అని తగిలించుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చాలా వాగ్ధానాలు ఇచ్చారని, నెరవేర్చలేని వాగ్ధానాలపై ఆయన ప్రజల ముందు ఒప్పుకోవాలన్నారు. సరైన పరిపాలన అందించటం ద్వారా ప్రజల మనస్సు చూరగొనాలని బుగ్గన సూచించారు. ఆర్భాటాలకు పోకుండా పాలన కొనసాగించాలని చెప్పారు.

జగన్ కోసం వస్తే తరిమేశారు

Written By news on Friday, March 31, 2017 | 3/31/2017


అమరావతి : ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలుసుకోవడానికి వచ్చిన సందర్శకులతో శుక్రవారం అసెంబ్లీ లాబీలు కిక్కిరిసి పోయాయి. ఓ వైపు సభ జరుగుతుండగా జగన్‌ ను కలుసుకోవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన చాంబర్‌ ముందు గుమికూడారు. జగన్‌ తన చాంబర్‌లో ఉండగా బయటకు వస్తే కలుద్దామని వేచి ఉన్నారు. జగన్‌ వ్యక్తిగత సిబ్బంది వారందరినీ వరుసగా  కలిపే యత్నం చేస్తుండగా అసెంబ్లీ ప్రధాన భద్రతాధికారి అక్కడకు వచ్చి ‘ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు...’ అంటూ అందరినీ గద్దించి పంపేశారు.

చాలా మందిని అసెంబ్లీ ఆవరణను దాటించే వరకు వదల్లేదు. ఎంతో ఆశతో జగన్‌ను కలుద్దామని వచ్చిన సందర్శకులు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు నిరాశతో వెనుదిరిగారు. వాస్తవానికి జగన్‌ అసెంబ్లీకి వచ్చినపుడల్లా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు ప్రతిరోజూ ఆయన్ను కలవడానికి తాపత్రయపడుతున్నారు. అసెంబ్లీ ముగియగానే అదే పనిగా వేచి ఉండి ఆయనను కలిసే వెళుతున్న సందర్భాలు రోజూ జరుగుతున్నాయి. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు, ఇతర అసెంబ్లీ సిబ్బంది కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ హడావిడి కొనసాగుతోంది.

అయితే శుక్రవారం అసెంబ్లీ చివరి రోజు కావడంతో సందర్శకుల రద్దీ మరితంగా పెరిగింది. చాలా మంది సెల్ఫీలు తీసుకుందామని ఆసక్తిని చూపారు. ఇలా ప్రజలు జగన్ కోసం అసెంబ్లీకి రావడం అధికారపక్షానికి కంటగింపుగా తయారైందట. అసెంబ్లీలో ఏ నేతకు కూడా లేని విధంగా ఇంత మంది సందర్శకులు జగన్‌ కోసం రావడం చూసి, వెంటనే భద్రతా సిబ్బందికి పురమాయించిన కారణంగానే వారందరినీ బయటకు పంపేశారని  చెబుతున్నారు.

చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రాదు


చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రాదు
హైదరాబాద్ :
తాను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 5.45 లక్షల మెజారిటీ వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ రాదన్నారు. మీ జీవితంలో ఎప్పుడూ అంత మెజారిటీ చూడలేదని మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పారు. తన చదువు గురించి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని వైఎస్ జగన్ సవాలు చేశారు. ఇది తనకు, చంద్రబాబుకు సవాలని గట్టిగా చెప్పారు. తాను ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే మంత్రి మాత్రం తన విద్యార్హతల గురించి సంబంధం లేని విషయాలు మాట్లాడారన్నారు.

తనతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఓ వ్యక్తి మాట్లాడారని అంటూ లేనిపోని ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడికి వైఎస్ జగన్ దీటుగా సమాధానం ఇచ్చారు. అలాగే తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినందున తన స్థాయి ఎక్కువంటూ అచ్చెన్నాయుడు చెప్పిన అంశాలకు కూడా గట్టిగా జవాబు చెప్పారు. చట్టసభలు తనకు కొత్త కాదని, సభా సంప్రదాయాలు తనకు బాగా తెలుసని స్పష్టం చేశారు. తన స్థాయి అదని... మీ స్థాయి ఇదని గట్టి సమాధానం ఇచ్చారు.

ప్రశ్నపత్రాల లీకేజీలపై చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ సవాల్‌


సీబీఐ విచారణకు సిద్ధమా?
ప్రశ్నపత్రాల లీకేజీలపై చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ సవాల్‌
- సీబీఐ అయితేనే మంత్రి నారాయణ పాత్ర బట్టబయలవుతుంది

సాక్షి, అమరావతి: ‘పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ విచారణకు సిద్ధమా? సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సాక్షి ఆధారాలను సీబీఐకి ఇచ్చి.. విచారణకు పూర్తిగా సహకరిస్తుంది. తప్పులను కట్టడి చేయాలనే తపన ఉండాల్సిన ముఖ్యమంత్రి.. వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి మంత్రులను రక్షించడానికి యత్నిస్తున్నారు. దమ్మూ ధైర్యం ఉంటే మా సవాల్‌ను స్వీకరించాలి’ అని  ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. శాసనసభలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. నాలుగు సార్లు వాయిదా అనంతరం మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది.

ప్రశ్నాపత్రాల లీకేజీపై మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేసిన అనంతరం స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష నేత  జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి సీఎం చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, చీఫ్‌ విప్‌ కాలవ శ్రీనివాసులు, విప్‌ కూన రవికుమార్, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌ రాజులు అడుగడుగునా అడ్డుతగిలేందుకు వారికీ అవకాశమిచ్చారు.. వారు వ్యక్తిగత దూషణలకు దిగుతూ కవ్వించినా జగన్‌ సంయమనం కోల్పోలేదు.  లీకేజీ వ్యవహారంపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ.. సీఎం వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలను విసురుతూ.. ప్రభుత్వ తీరును కడిగిపారేశారు.వివిధ అంశాలను ఎత్తిచూపుతూ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు.

నేను ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ను..
సీఎం చంద్రబాబు తనపై చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన జగన్‌ ‘‘చంద్రబాబు తరచూ నా చదువులు గురించి మాట్లాడుతారు.. నీ మాదిరిగా నేను వచ్చిరాని ఇంగ్లీషు మాట్లాడలేను.. బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాను..  పదో తరగతిలో.. ఇంటర్మీడియట్‌లో.. డిగ్రీలో నేను ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ను. నీ మాదిరిగా ఎంఫిల్‌ చేయకుండానే చేసినట్లు చెప్పుకోను. నీ మాదిరిగా పీహెచ్‌డీ డీస్‌కంటిన్యూ చేయలేదు.. ప్రపంచంలో ఇంత దరిద్రమైన ఇంగ్లీషు ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే మాట్లాడగలరని పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు.. నీ ఇంగ్లీషు ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసుకో.. ప్రజలను నమ్మించలేకపోతే గందరగోళానికి గురిచేయడమే చంద్రబాబు వ్యక్తిత్వం.’’ అని ఘాటుగా స్పందించారు.

ఆ ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దుచేయాలి

Written By news on Thursday, March 30, 2017 | 3/30/2017





నరసాపురం (పశ్చిమ గోదావరి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆక్వా ఫ్యాక్టరీల లైసెన్సులను రద్దు చేయాలని, ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలను సముద్రతీరంలోనే ఏర్పాటుచేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి మృతిచెందిన ఐదుగురి కుటుంబాలను ఆయన గురువారం సాయంత్రం పరామర్శించారు. నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ మృతుల కుటుంబాలతో మాట్లాడి.. వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలకు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ మాకొద్దని తొందూర్రులో గత రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నారని, ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మొగల్తూరు ఘటనతో అందరికీ అర్థమైందని అన్నారు. ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలను సముద్రతీరంలోనే పెట్టాలని డిమాండ్‌ చేశారు. మొగల్తూరు ప్రమాద ఘటనలో చనిపోయిన వారంతా 20 నుంచి 30 ఏళ్ల లోపువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

మొగల్తూరులో ఉన్న ఈ ఆక్వా ఫుడ్‌ కంపెనీ కెపాసిటీ 30 టన్నులు మాత్రమే.
తుందుర్రులో 350 టన్నుల కెపాసిటీతో ఇదే యాజమాన్యం మెగా ఆక్వా ఫుడ్ పార్కును ఏర్పాటు చేస్తున్నది.
అక్కడ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉండబోతున్నది.
ఆక్వా ఫ్యాక్టరీలతో కాలుష్యం ఉంటుందని అందరికీ తెలసు. అయినా కాలుష్యం ఉండబోదని ప్రభుత్వం చెప్తోంది
అక్కడి నుంచి సముద్రం దాకా పైపు వేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఆయన ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు.
మొగల్తూరు ఫ్యాక్టరీ కాలుష్య రహిత ఫ్యాక్టరీ అని చెప్పారు. కానీ ఈ ఫ్యాక్టరీలో రొయ్మల తలలు తీసేసి పక్కన పడేస్తారు.
ఈ ఫుడ్‌ ప్రాసెస్‌ వ్యర్థాలను పక్కనే ఉన్న పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు
దీంతో పంటకాలువలు డ్రైనేజీగా మారిపోయి.. ఆ నీళ్లు తాగడానికి, వ్యవసాయానికి సైతం పనికిరాకుండా పోతున్నాయి.
ఇలా పంటకాలువలో వదిలేయవద్దంటూ ఒత్తిడి తేవడంతో కంపెనీ ఈ కాలుష్యాన్ని ట్యాంకులోకి వదిలింది.
ఆ ట్యాంకును శుభ్రం చేస్తుండగా అమోనియో గ్యాస్‌ వెలువడి ఇంతమంది ప్రాణాలను బలిగొన్నది.
మరోవైపు ఇది కాలుష్య రహిత ఫ్యాక్టరీ అని ప్రభుత్వం మోసం చేస్తున్నది
కాలుష్యం ఉంటుందని అందరికీ తెలిసినా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతున్నది
ఇంతపెద్ద ఘటన జరిగినా కంపెనీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదు
యాజమాన్యం నుంచి బాధిత కుటుంబాలకు మరింత ఎక్కువ పరిహారం ఇప్పించాలి
కంపెనీకి వచ్చే ఇన్సూరెన్స్‌ డబ్బులు కూడా బాధితులకే ఇప్పించాలి
దయచేసి ప్రజల జీవితాలతో కంపెనీలు చెలగాటం ఆడొద్దు


గురువారం ఉదయం నల్లావారి చెరువులోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడటంతో ఐదుగురు కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. రసాయనిక ట్యాంకులను శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయినట్టు సమాచారం.

ఇలాంటి సభను ఎక్కడా చూడలేదు: వైఎస్‌ జగన్‌


ఇలాంటి సభను ఎక్కడా చూడలేదు: వైఎస్‌ జగన్‌
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి సభను ఎక్కడా చూడలేదని అన్నారు. ప్రతిపక్షానికి మైక్‌ ఇవ్వకుండా సభను అన్యాయంగా నడుపుతున్నారని అన్నారు. కాగా, గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షం పట్టుబట్టింది. 
 
ప్రభుత్వం అందుకు విముఖత చూపడంతో స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. అనంతరం స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

పదో తరగతి పేపర్ల లీకేజిపై దద్దరిల్లిన అసెంబ్లీ


పదో తరగతి పేపర్ల లీకేజిపై దద్దరిల్లిన అసెంబ్లీ
అమరావతి :
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఉదయమే ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై అత్యవసరంగా చర్చించేందుకు గురువారం వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందువల్ల దానిపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. లీకేజిల ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెండోరోజు కూడా ఇదే అంశంపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార పక్ష సభ్యులు మాత్రం యథావిధిగా ప్రతిపక్ష సభ్యులను నిందించడానికే తమ ప్రసంగాలను ఉపయోగించుకున్నారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

మూసివేత దిశగా ప్రభుత్వ పాఠశాలలు

Written By news on Tuesday, March 28, 2017 | 3/28/2017


మూసివేత దిశగా ప్రభుత్వ పాఠశాలలు...
► వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి
 
అమరావతి: ప్రైవేటు విద్యావ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా 7,500 ప్రభుత్వం పాఠశాలను మూసివేస్తోందని ఆయన ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద చెవిరెడ్డి మాట్లాడుతూ హేతుబద్ధీకరణ పేరుతో ఇప్పటికే 1,446 పాఠశాలలను రద్దు చేసిందని పేర్కొన్నారు., ఈ ఏడాది మరో 1,500 పాఠశాలలను మూసివేయడానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు.

అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగంలో ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల పేరుతో మూడెంచల విద్యావ్యవస్థ ఉంది., ఇప్పుడు దీన్ని ప్రాధమిక, ఉన్నత పేరుతో రెండెంచలకు కుదించాలని నిర్ణయించిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న సుమారు 4,500 ప్రాధమికోన్నత పాఠశాలలు మూతపడి విద్యార్థులకు చదవు దూరమయ్యే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ స్కూల్స్‌ని ప్రోత్సహించడం కోసం ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం అత్యంత భాధాకరమైన విషయామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 61,529 పాఠశాలలు ఉంటే అందులో కేవలం 16,273 మాత్రమే ప్రైవేటు పాఠశాలుగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయని సూచించారు.

కానీ చాలా ప్రైవేటు పాఠశాలలు ఒకే రిజిస్ట్రేషన్‌తో అనేక పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,870 ఆదర్శ పాఠశాలకు రూ. 3,000 కోట్లు కేటాయిస్తే ఈ మొత్తం కాంట్రాక్టును ముఖ్యమంత్రి క్లాస్‌మేట్‌కి కట్టబెట్టారని ఆయన అన్నారు. అలాగే యూనిఫాంలకై రూ. 132 కోట్లు ఇస్తే ఈ మొత్తాన్ని ఒకే కాంట్రాక్టరుకి ఇవ్వడం వల్ల పిల్లలకు బట్టల సైజులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మధ్యాహ్నం భోజనం పథకంలో నాసిరకమైన ఆహారాన్ని అందిస్తూ పిల్లలను పరుగుల్లా ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. మరింతమందికి విద్యను అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను పెంచడమే కాకుండా ఉన్న వాటిలో మౌలిక వసతులు పెంచాలని చెవిరెడ్డి డిమాండ్‌ చేశారు.

విష్ణుకుమార్‌కి ఏదైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత

ఒక శాసన సభ సభ్యుని చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడం అత్యంత విచారకరమన్నారు. విశాఖలో భూ కుంభకోణం వెలికితీసినందుకు రియల్‌ మాఫీయా విష్ణుకుమార్‌ రాజ్‌ను బెదిరిస్తోందని, అతనికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనేక ప్రజాసమస్యలను నిత్యం సభలో ప్రస్తావించే విష్ణుకుమార్‌ రాజుకు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌పార్టీ అండంగా ఉంటుందని చెప్పారు.

సీబీఐ ఎంక్వైరీ వేయాలి: వైఎస్‌ జగన్‌


సీబీఐ ఎంక్వైరీ వేయాలి: వైఎస్‌ జగన్‌
అమరావతి:  పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.  ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ సందర్భంగా ...‘ఈ రోజు ఆరున్నర లక్షల కుటుంబాలకి సంబంధించిన అంశంలో ఏమాత్రం లెక్కలేనితనం ఈ ప్రభుత్వానిది. దాన్ని ఎంతసేపూ కవర్ చేసే ప్రయత్నమే తప్ప పరిష్కరించే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చెయ్యడం లేదు. ఈ ప్రశ్నా పత్రాల లీకేజీ ఇష్యూ లో తప్పు జరిగింది అని విద్యాశాఖే ఒప్పుకుంటుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఢిల్లీ నుండి మాట్లాడుతూ అటెండర్ ఫోన్ ద్వారా లీక్ అయింది అని చెబుతున్నారు.
ఆ అటెండర్ ఏ కాలేజీకి చెందిన వాడో అందరికీ తెలుసు. ఆ కాలేజీ ఎవరిదో ఎఫ్‌ఐఆర్‌ కాపీయే చెబుతుంది. ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే కష్టపడి చదివిన విద్యార్థులకు కనీసం 100వ రాంకైనా వస్తుందా? ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు. అది వేస్తేనే కదా మిగిలిన ఎన్ని కాలేజీలలో ఇలాంటి భాగోతాలు జరుగుతున్నాయో తెలుస్తాయి. చంద్రబాబుకి మంత్రి నారాయణ బినామీ అని చెబుతారు. నారాయణ కాలేజీలో చంద్రబాబుకి వాటాలున్నాయని పుకార్లు ఉన్నాయి.
స్కామ్ జరిగిన కాలేజీ ఒకమంత్రికి చెందినది.. దానిపై విచారణ జరిపించాల్సిన మరొక మంత్రి ఆయన వియ్యంకుడు. ఇది చాలదా ఈ కేసు ఎంత బాగా నడుస్తోంది అని చెప్పడానికి? చిన్న చిన్న అధికారుల పైనో..అటెండర్ ల పైకో ఈ కేసు గెంటేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఈ కేసుపై చంద్రబాబు ఎందుకు స్పందించరు? చంద్రబాబు తరువాత ఎప్పుడో దీనిపై స్పందిస్తాననడం రోమ్ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉంది. బహుశా కాపీలు కొట్టిన నారాయణ విద్యార్థులకు ఫస్ట్‌  రాంకు వచ్చాక స్పందిస్తారేమో’ అని ఎద్దేవా చేశారు.
మంత్రి నారాయణ కారణంగా విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. నారాయణ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. తాము ఏ విషయాన్ని ప్రస్తావించినా చర్చకు అనుమతించడం లేదని, ప్రశ్నపత్రాల లీక్‌ గురించి ప్రశ్నిస్తే దాన్ని పక్కనపెట్టి ల్యాండ్‌ బిల్లును ఆమోదించారని అన్నారు. ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై వేసిన విచారణకు ఇప్పటికీ అతీగతి లేదని, ఏ విషయం అయినా దాటవేత ధోరణే అవలంభిస్తోందన్నారు. తాము అన్ని ఆధారాలు చూపించినా ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని వైఎస్‌ జగన్‌ అన్నారు


మరోవైపు టెన్త్‌ పేపర్ల లీకేజీపై ఏపీ అసెంబ్లీ మంగళవారం అట్టుడుకిపోయింది. ప్రశ్నాపత్రాల లీకేజీపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్‌సిపి .. చర్చకు పట్టుబట్టింది. స్పీకర్‌ తిరస్కరించడంతో సభను స్తంభింపజేసింది. సభ ప్రారంభం కాగానే.. ఈ అంశాన్ని ప్రస్తావించిన విపక్షం.. వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని కోరింది. లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు ఏం సమాధానం చెబుతారని మండిపడింది.
టెన్త్‌ క్లాస్‌ పేపర్ల లీకేజీపై ఏపీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఇచ్చిన నివేదికను విపక్ష నేత వైఎస్‌ జగన్‌ సభలో బయటపెట్టారు. నారాయణ విద్యాసంస్థల్లో పేపర్‌ లీకైందని నివేదికలో తేలిందనీ..దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో వైఎస్‌ జగన్‌ మైక్ కట్‌ చేయడంతో వైఎస్ఆర్‌ సిపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పలుమార్లు సభ వాయిదా పడింది.

మేం ప్రశ్నిస్తే కేసులు... మీరు నేరం చేస్తే రాజీలా?


మేం ప్రశ్నిస్తే కేసులు... మీరు నేరం చేస్తే రాజీలా?
⇔ చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్న
⇔ ముఖ్యమంత్రే రాజీలు, సెటిల్‌మెంట్లు చేయడమేమిటి?
⇔ తప్పు చేసినోళ్లని కాపాడటం ఏమిటి?
⇔ నేను నోరు తెరిస్తే బాగోతాలు బయటకొస్తాయంటే దానర్థం ఏమిటి!
⇔ ఐపీఎస్‌ అధికారికే క్షమాపణలా..?
⇔ కానిస్టేబుల్‌కు చెప్పరా... వారికి ఆత్మగౌరవం ఉండదా!
⇔ మాకో న్యాయం, వాళ్లకో న్యాయం అన్నందుకు చెవిరెడ్డిని అరెస్టు చేస్తారా?


సాక్షి, అమరావతి: చట్టం తన పని తాను చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని రాజీలు, సెటిల్‌మెంట్లు, పంచాయితీలు చేయడం ధర్మమేనా! అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించి తరలించడంపై అసెంబ్లీలో ప్రస్తావించేందుకు విఫలయత్నం చేసిన జగన్‌ స్పీకర్‌ అనుమతి ఇవ్వకపోవడంతో లాబీల్లోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మావాళ్లు తిరుపతి ఎయిర్‌పోర్టులో అధికారులపై దౌర్జన్యం చేసినట్లు ఎక్కడా లేక పోయినా మా ఎంపీని, ఎమ్మెల్యేను 25 రోజులు జైల్లో పెట్టారు.

అదే టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విజయవాడలో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌పై దురుసుగా మాట్లాడినా... ఆయన గన్‌మెన్‌ అయిన కానిస్టేబుల్‌ను దౌర్జన్యంగా తోసి వేసినా అరెస్టు చేయరు. గన్‌మెన్‌పై ఎమ్మెల్యే చెయ్యేసి గట్టిగా తోసినట్లు స్పష్టంగా టీవీల్లో కనిపిస్తున్నా...చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేస్తారు... ఇదే విషయాన్ని మాకో న్యాయం... తన వారికో న్యాయమా! అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించినందుకు అరెస్టు చేసి తీసుకెళతారా... మా ఎమ్మెల్యేను ఉదయం అరెస్టు చేసి సాయంత్రం వరకూ విడుదల చేయలేదు. మా సహచర ఎమ్మెల్యేలు వెళ్లినా కూడా పోలీస్‌స్టేషన్‌లో చెవిరెడ్డితో మాట్లాడ్డానికి గాని, కనీసం చూడ్డానికి గాని అనుమతించలేదు. ఇదెక్కడి న్యాయం?’’ అని జగన్‌ ప్రశ్నించారు. వివరాలు ఆయన మాటల్లోనే....

సీఎం ఆదేశించినందుకే సారీ చెప్పారట...
ముఖ్యమంత్రి తమను ఆదేశించినందుకే సారీ చెప్పామని టీడీపీ నేతలంటున్నారు. ఐపీఎస్‌కు సారీ చెప్పారు సరే... మరి కానిస్టేబుల్‌ మాటేమిటి? ఆయనకు సారీ చెప్పరా... సాధారణ పోలీసు కానిస్టేబుల్‌కు ఆత్మగౌరవం ఉండదా? ముఖ్యమంత్రి చెబితేనే సారీ చెప్పామంటున్న వారికి కానిస్టేబుల్‌కు క్షమాపణలు చెప్పమని చంద్రబాబు ఆదేశించలేదా? నేను నోరు తెరిస్తే చాలా బాగోతాలు బయటకు వస్తాయని సదరు ఐపీఎస్‌ అధికారి అన్నారంటే...దానర్థం ఏంటి? మీరు (అధికారపక్షం) చేసిన అన్యాయాలు చెప్పకనే చెప్పినట్లు కాదా? టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లింది ప్రజల కోసమో, వారి మంచికోసమో కానే కాదు,  తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం. తమకు పోటీగా బస్సులను నడుపుతున్న మరో ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇప్పించేలా, తమకు అనుకూలంగా వ్యవహరించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు వెళ్లారు. దీన్ని సాక్షాత్తూ ఆ అధికారే ధృవీకరించారు.

అధికార యంత్రాంగాన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసే విధంగా చంద్రబాబు జోక్యం చేసుకుని రాజీ చేయించడం సబబేనా? గతంలో ఎమ్మార్వో వనజాక్షి ఉదంతంలో కూడా ముఖ్యమంత్రి ఇలాగే చేశారు. ఆమెను జుట్టు పట్టుకుని దౌర్జన్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యేను మంచివాడంటూ మంత్రివర్గంలో చంద్రబాబు పొగిడి కేసుల్లేకుండా చేశారు. టీడీపీ నేతలు అధికారులపై తిరగబడి దౌర్జన్యం చేసిన వ్యవహారాలన్నింటిలోనూ కేసులు లేకుండా చంద్రబాబు సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అధికారులను కొట్టించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఆ తరువాత రాజీలు చేయించడం సబబేనా?  

ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలే!
ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. ఆరెంజ్‌ కంపెనీ ఏందో నాకు తెలియనే తెలియదు. టీడీపీ ఎంపీ తమ సొంత వ్యవహారానికి సంబంధించి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి గొడవ పడ్డారనేది అసలు విషయమైతే దానిని తప్పుదోవ పట్టించేందుకే జగన్‌ పేరును లాగుతున్నారు. ఆరెంజ్‌ కంపెనీతో నాకు సంబంధాలున్నాయని అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా... చివరకు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఏదైనా అన్నా దీని వెనుక జగనే ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. మసిపూసి మారేడు కాయ చేయడమే కాక నాపై బురద జల్లి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. టీడీపీ వారు చేసిందానికి సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి నాపై నిందలు వేస్తున్నారు.

పోలవరానికి రూ 3,000 కోట్లా!


పోలవరం ప్రాజెక్టుకు గత మూడేళ్లలో కేటాయించింది రూ. 3,000 కోట్లే... వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే  దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రూ 5,500 కోట్లు ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టారు. కానీ జాతీయ ప్రాజెక్టుగా దీనిని ప్రకటించిన తరువాత మూడేళ్లలో మూడు వేల కోట్లు  మాత్రమే ఇచ్చారు.

 ఇక అలాంటి దానిపై ఇంకా ప్రెజెంటేషన్‌ ఏమిటి? ఇపుడు తాజాగా పోలవరం నుంచి బొల్లాపల్లి, అక్కడి నుంచి సోమశిలకు పెన్నా అనుసంధానం పేరుతో రూ . 1 లక్ష కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకే ఏడాదికి రూ .వెయ్యి కోట్లు మించి ఇవ్వని మహానుభావుడు (చంద్రబాబు) మళ్లీ రూ. 1 లక్ష కోట్లతో అనుసంధానం అని ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.   రాష్ట్రంలో ప్రతిదీ కుంభకోణమే కొనసాగుతోంది.

భాస్కర్‌రెడ్డి చేసిన తప్పేమిటి-జగన్


ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనల్లో తాము అధికారిపై దౌర్జన్యం చేసినట్లు ఎలాంటి దృశ్యపరమైన ఆధారాలు లేక పోయినా తననూ, ఎంపీని ఎందుకు అరెస్టు చేశారు? ఇపుడు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేసినట్లు, అధికారులను దుర్భాషలాడినట్లు టీవీల్లో సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎందుకు వారిని అరెస్టు చేయరు? వారికో న్యాయం? మాకో న్యాయమా? అని ప్రశ్నించినందుకే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు.

నందిగామ వద్ద బస్సు ప్రమాదం జరిగిన ఘటనలో పరామర్శ కోసం నేను వెళ్లింది ప్రజలకు సంబంధించిన సమస్యమీద. నేనక్కడకు వెళ్లి పోస్టుమార్టం చేశారా అని ప్రశ్నించినందుకు వైద్యాధికారి తడబడుతూ  చేయలేదన్నారు. అలాంటపుడు తరలించేయడానికి కొన్ని మృతదేహాలను ఎలా ప్యాక్‌ చేసి పెట్టారని గట్టిగా అడిగాను. అక్కడ ఆయన చూపించిన కాగితాన్ని నేను తీసుకున్నాను. నేనే మాత్రం లాక్కోలేదు.

ఈ విషయం టీవీలు చూస్తే తెలుస్తుంది. కానీ నా మీద రివర్స్‌ కేసు పెట్టారు. నేను ఆసుపత్రిలోకి ఆరోజు వెళ్లినపుడు ఏం జరిగిందీ మీడియా మొత్తం కవర్‌ చేసింది. నేనెక్కడా ఎవరినీ టచ్‌ చేయలేదనేది టీవీలు చూస్తే తెలుస్తుంది. కానీ రవాణా శాఖ కమిషనర్‌ విషయంలో జరిగిన సంఘటనకు, ఆసుపత్రి సంఘటనకూ నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది.

మనస్సాక్షిని అమ్ముకుంటే ఎలా...
ప్రతిపక్షం గాని, మీడియా గాని అధికారపక్షానికి తమ మనస్సాక్షికి అమ్ముకుంటే ప్రజాస్వామ్యం అనేది నిలబడదు. ఈ అన్యాయాలను మీడియా కూడా ప్రశ్నించాలి. ఇలాంటి అన్యాయాలను కనుక మనం ప్రశ్నించక పోతే ఇక ప్రజల తరపున మాట్లాడ్డానికి ఎవరూ ముందుకు రారు. రేపు జర్నలిస్టులకు అన్యాయం జరిగినా ఎవరూ అడగడానికి ముందుకు రాలేరు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

'నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ


'టెన్త్‌'కు లీక్‌ తెగులుజవాబులతో చీటీలను సిద్ధం చేస్తున్న ‘నారాయణ’ సిబ్బంది. పక్క ఫొటో లీకైన ప్రశ్నపత్రం
‘నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ
- పరీక్షా కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాల సేకరణ
- తమ విద్యార్థులకు వాట్సాప్‌లో సమాధానాల చేరవేత
- నెల్లూరులో సైన్స్‌ పేపర్‌ –1, మడకశిరలో తెలుగుపేపర్‌ –1 లీక్‌
- కదిరిలో ముందుగానే బయటకొచ్చిన హిందీ పేపర్‌
- జవాబులు సిద్ధం చేస్తూ మీడియాకు చిక్కిన ‘నారాయణ’ సిబ్బంది
- రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయిన లీకేజీలు
- పరీక్షల ప్రారంభానికి ముందే వాట్సప్‌లలో ప్రత్యక్షం
- టెన్త్‌ పత్రాలు రోజూ బయటకు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
- కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం


సాక్షి, అమరావతి
లీక్‌... లీక్‌... లీక్‌... ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకొచ్చేస్తున్నాయి. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్‌ విద్యాసంస్థ ‘నారాయణ’  హస్తం ఉండడం నిర్ఘాంతపరుస్తోంది. ఇప్పటివరకు పరీక్ష పత్రాల లీకేజీలు జరిగిన కేంద్రాలన్నీ నారాయణ స్కూళ్లే కావడం గమనార్హం.

అయితే పరీక్షా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతరులను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం వరకే  విద్యాశాఖ పరిమితమవుతోంది. ఈ సంస్థ మంత్రి నారాయణకు సంబంధించినది కావడం, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనా స్వయానా వియ్యంకులు కావడం వల్లే అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీలపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో ప్రశ్నపత్రం లీకవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకపోవడం పట్ల విద్యారంగ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని చోట్లా ‘నారాయణ’ నుంచే...
– నెల్లూరులోని నారాయణ హైస్కూల్‌నుంచి టెన్త్‌ సైన్స్‌ పేపర్‌–1ను శనివారం వాట్సప్‌ ద్వారా బయటకు పంపించారు. అధికారులు చీఫ్‌సూపరింటెండెంటు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. నారాయణ సంస్థకు చెందిన వ్యక్తులతో పాటు కొంతమంది ప్రభుత్వ టీచర్లుకూడా ఈ లీకేజీ వెనుక ఉన్నారని చెబుతున్నారు.

– పదో తరగతి పరీక్షలు ఈనెల 17నుంచి ప్రారంభం కాగా,  తొలిరోజే తెలుగు పేపర్‌–1 ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి లీకైంది. అరగంటకే నలుగురు యువకులు కిటికీలోనుంచి ప్రశ్నపత్రం సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టారు.  ఈ ఘటనకు కారకుడైన  హిందూపురం పట్టణంలో నారాయణ పాఠశాలకు సంబంధించిన ఏఓ ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన మొబైల్‌ ఫోన్‌ నుంచి పలువురికి ప్రశ్నపత్రం పంపాడని తేలింది.

– ఆ తర్వాత రెండు రోజులకే కదిరి పట్టణంలో హిందీ ప్రశ్నపత్రం లీక్‌ అయింది. నారాయణకు చెందిన పాఠశాలలో సిబ్బంది జవాబులు సిద్ధం చేస్తూ మీడియా కంట పడ్డారు. పట్టణంలో నారాయణ పాఠశాల విద్యార్థులు రాస్తున్న అన్ని కేంద్రాలకు జవాబులు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు కదిరి పట్టణంలోని అన్ని కేంద్రాల నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లు సీజ్‌ చేసి విచారణ చేశారు.  ప్రశ్నపత్రం ఈ ప్రాంతం నుంచి లీక్‌ కాలేదని తేల్చారు. అయితే ఈ ప్రశ్నపత్రం, సమాధానాల పత్రాలు  నారాయణ పాఠశాలకు అనంతపురం జిల్లా నుంచి కాకుండా బయట జిల్లాల నుంచి  వచ్చినట్లు విద్యాశాఖాధికారులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నారాయణ పాఠశాలలకు ఇదే తరహాలో ప్రశ్నపత్రం వెళ్లిందని, అందులో భాగంగానే కదిరి బ్రాంచ్‌కు వచ్చిందని వారు అంతర్గతంగా చెబుతున్నారు. ఆ సంస్థల్లో ఏటా ఇదేతంతు సాగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై డీఈఓ లక్ష్మినారాయణ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. వేరే ప్రాంతం నుంచి ఈ ప్రశ్నపత్రం వచ్చిందని వారు పేర్కొనగా తమ పరిధిలో ఈ ఘటన జరిగితేనే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కేసు నమోదుకు అంగీకరించకపోవడం విశేషం.
–చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, పీలేరు, పుత్తూరు పరీక్షా కేంద్రాల్లో రోజు ప్రశ్నాపత్రాలు బయటకు వస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి సంబంధిత సబ్జెక్టు నిపుణులకు వాట్సాప్‌లో పంపిస్తున్నారు. వారి నుంచి సమాధానాలు సేకరించి పిల్లలతో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్‌ చేయిస్తున్నారు.

– కడప జిల్లాలోనూ ఇదే తరహా లీకేజీలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాట్సప్‌లలో ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే దర్శనమిస్తున్నా మౌనం దాలుస్తున్నారు.  

గ్రేడ్ల పోటీ వల్లే లీకేజీలు..
నారాయణ సంస్థలో ఆయా స్కూళ్ల డీన్లు, ప్రిన్సిపాళ్లకు ఎవరు ఎక్కువ ఏ గ్రేడ్లు సాధిస్తే వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతుండడంతో ఆ స్కూళ్లన్నీ ఈ అక్రమాలకు తెగబడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ముందుగానే ఆయా స్కూళ్ల సిబ్బందితో కుమ్మక్కై  ప్రశ్నపత్రాలను బయటకు తెస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ షరామామూలుగా మారినా ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. ఈ లీకేజీల వ్యవహారంపై మంత్రి గంటాతోపాటు ఉన్నతాధికారులు కూడా పట్టీపట్టనట్లుంటున్నారు.

కఠిన చర్యలు శూన్యం
పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రాలు వాట్సప్‌లలో ప్రత్యక్షమవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాలను ముందుగానే బయటకు తెచ్చి, ఫోన్లలో వాట్సాప్‌ల ద్వారా తమ విద్యార్థులకు పంపించి, పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నా విద్యాశాఖ కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. అప్పుడప్పుడు మొక్కుబడిగా ఆయా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు చేపట్టకపోవడంతో లీకేజీ ఆగడాలకు బ్రేకులు పడడం లేదు. పరీక్షా కేంద్రాల్లో స్మార్ట్‌ ఫోన్లను నిషేధించామని అధికారులు చెబుతున్నారు. అయితే, నిత్యం పరీక్షకు ముందుగానే ఈ ఫోన్లలోనే ప్రశ్నపత్రాలు çబయటకు వస్తున్నాయి. సమాధానాలు వాట్సాప్‌ల ద్వారా పరీక్ష కేంద్రాల్లో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులకు చేరుతున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు ఈ లీకేజీలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు.

ప్రశ్నపత్రాల లీక్‌ నిజమే: పరీక్షల విభాగం డైరెక్టర్‌
పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్న మాట నిజమేనని, వీటిపై విచారణ జరుగుతోందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ భార్గవ చెప్పారు. నెల్లూరు నారాయణ హైస్కూల్‌ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై ఇంకా తమకు పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు.

‘నారాయణ’లో లీక్‌లపై ఫిర్యాదులు.. సస్పెన్షన్లు..
నెల్లూరు(టౌన్‌): పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్‌లో ఫిజిక్స్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నారాయణ స్కూల్లో జరుగుతున్న పరీక్షల్లో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. మహేష్‌ ఈదూరు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్కడి చీఫ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, డిపార్ట్‌మెంటల్‌ అధికారి ముంతాజ్‌ తెహజాలను పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఫిజిక్స్‌ పేపర్‌ లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం సైబర్‌ క్రైం కింద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రశ్నపత్రం లీకైన పాఠశాల మంత్రి నారాయణకు చెందినది కావడంతో ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారా? లేక తూతూమంత్రంగా ముగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రంథి సుబ్బారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Monday, March 27, 2017 | 3/27/2017


గ్రంథి సుబ్బారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
గుంటూరు: క్రేన్ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. గత శుక్రవారం గ్రంథి సుబ్బారావు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. క్రేన్‌ సంస్థలను స్థాపించి వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆయన ఉపాధి కల్పించారు.

సోమవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన తర్వాత వైఎస్ జగన్ అమరావతి నుంచి గుంటూరు వెళ్లారు. గుంటూరులో గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు.

బాబు మీడియా పిచ్చే అమాయకుల ప్రాణాలు తీసింది!


బాబు మీడియా పిచ్చే అమాయకుల ప్రాణాలు తీసింది!
పుష్కరాలలో తొక్కిసలాటపై సభలో చర్చ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా పిచ్చితోనే గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. మరణించిన వారి కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం అందలేదని, ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ అంతా ఇంత కాదని సోమవారం ఏపీ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన సమాధానంపై జగ్గిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీవై సోమయాజులు నాయకత్వంలోని కమిటీ విచారణ జరుపుతోందని, త్వరలో నివేదిక వస్తుందని, ఈ పరిస్థితుల్లో సభలో చర్చించలేమని యనమల చెప్పారు. దీనిపై జగ్గిరెడ్డి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ విచారణ కమిటీకి జిల్లా కలెక్టర్‌ సీసీటీవీ ఫుటేజీ కూడా ఇవ్వలేదన్నారు. వీఐపీలకు కేటాయించిన ఘాట్లలో కాకుండా చంద్రబాబు పుష్కరఘాట్‌కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని చెప్పారు. తొక్కిసలాటకు కారణం చంద్రబాబేనన్నారు. ఘాట్‌ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలున్నా సుమారు 90 వాహనాలు అక్కడకు చేరాయని వివరించారు. ఆ మేరకు ఫోటోలను కూడా సభలో ప్రదర్శించారు. చంద్రబాబు స్నానం చేసే ఘట్టాన్ని చిత్రీకరించడంతో పాటు పుష్కరాలపై డాక్యుమెంటరీ తీసేందుకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను నానా హంగామా చేశారని, ఓ ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
తొక్కిసలాట ఘటనపై కమిషన్‌ను నియమించినా అటు జిల్లా కలెక్టర్‌ గానీ ఇటు ఇతర అధికారులు గానీ సహకరించడం లేదని, అటువంటప్పుడు ఈ కమిషన్‌తో ఏమి ప్రయోజనం ఉంటుందని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సార్లు సోమయాజులు కమిషన్‌ గడువును పొడిగించారని, ఇంకెంత కాలం సాగదీస్తారని నిలదీశారు. చంద్రబాబు మీడియా పిచ్చితో అనర్థం జరిగిందన్నప్పుడు సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య.. చంద్రబాబు తప్పేమీ లేదని, ప్రతిపక్ష సభ్యులు ప్రతి అంశానికీ వక్రభాష్యం చెబుతున్నారన్నారు. దీనిపై మంత్రి యనమల మాట్లాడుతూ తమ లెక్కల ప్రకారం 27 మందే చనిపోయారని, 50 మంది గాయపడ్డారని, అందరికీ ఆర్థిక సాయం అందించామని, ఇంకా ఎవరికైనా రాకుంటే వారి వివరాలను తన దృష్టికి తీసుకువస్తే అందిస్తామన్నారు.

6 గంటల నిర్బంధం తర్వాత చెవిరెడ్డి విడుదల


6 గంటల నిర్బంధం తర్వాత చెవిరెడ్డి విడుదల
గుంటూరు: రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన్ను విడుదల చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డిని దాదాపు 6 గంటల పాటు పోలీసులు నిర్బంధించారు.

విడుదలైన తర్వాత చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన తాలిబన్ల పాలన కంటే దారుణంగా ఉందని విమర్శించారు. తనను అరెస్ట్ చేసినా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమాలను అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు పోలీసుల తీరు కారణంగా మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను పరామర్శించేందుకు ఐదుగురు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లగా, పోలీసు స్టేషన్ గేట్లు కూడా వేసేసి కనీసం ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు.

చెవిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సభ జరుగుతుండగా ఎమ్మెల్యే చెవిరెడ్డిని అక్రమంగా నిర్బంధించారని, దీనిపై అడగడానికి ప్రయత్నిస్తే సభలో మైక్ ఇవ్వలేదని చెప్పారు. రవాణా శాఖ కమీషనర్‌పై దాడికి సంబంధించి అడిగితే ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా? చట్టం తన పని తాను చేయకుండా సీఎం అడ్డుతగలడం భావ్యమేనా అని వైఎస్ జగన్ నిలదీశారు.

రౌడీయిజానికి అడ్డాగా రాజధాని


రౌడీయిజానికి అడ్డాగా రాజధాని
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని రౌడీయిజానికి అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద మాట్లాడిన రోజా.. 'లా అండ్‌ ఆర్డర్‌ను తనలా ఎవరూ కంట్రోల్‌ చేయలేరని అసెంబ్లీలో చెప్పే చంద్రబాబు.. ఇప్పుడు రౌడీయిజానికి అండగా నిలుస్తున్నారు' అని మండిపడ్డారు.

ఆర్టీఏ అంశంలో సెటిల్మెంట్‌ చేయడం ద్వారా సీఎం.. 'చీప్‌ మినిస్టర్‌' అనిపించుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. గతంలో వనజాక్షి, జానిమూన్‌ విషయంలోనూ సీఎం ఇదే విధంగా సెటిల్మెంట్‌ చేశారని ఆమె గుర్తు చేశారు. బస్సు ప్రమాదం ఘటన సందర్భంగా జగన్‌ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పలేదని, ఇప్పుడు తప్పు చేసి కూడా 'మేం సారీ చెప్పం' అని బోండా ఉమ నిస్సిగ్గుగా చెబుతున్నారని రోజా అన్నారు.

టెంపరరీ డీజీపీ ప్రతిపక్షంపై కేసులు పెట్టడంలో ముందున్నారని, ప్రజలను కాపాడటంలో మాత్రం ఆయనకు శ్రద్ధ లేదని రోజా విమర్శించారు. రాష్ట్రంలో నారావారి నరకపాలన కొనసాగుతుందని, రౌడీయిజాన్ని అరికట్టడానికి చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

బలవంతంగా ఏపీ ఎమ్మెల్యే తరలింపు


బలవంతంగా ఏపీ ఎమ్మెల్యే తరలింపు
అమరావతి: రవాణాశాఖ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ వెలుపల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపే హక్కు లేదంటూ ఆయనను మార్షల్స్ లాక్కెళ్లారు. పోలీసులు, మార్షల్స్ ను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ  నాలుగో నంబరు గేటు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చెవిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు. ఆయనను మంగళగిరి తరలించనున్నారని సమాచారం.

సీఎం చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నాక పరిణామాలు చకాచకా మారిపోయాయి. దీక్ష చేస్తున్న చెవిరెడ్డిని చూస్తూ అసెంబ్లీలోకి వెళ్లిన 10 నిమిషాల తర్వాత మార్షల్స్ రంగంలోకి దిగారు. బలవంతంగా చెవిరెడ్డిని తరలించారు. ఐపీఎస్ అధికారిపై దాడి చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని అంతకుముందు చెవిరెడ్డి ప్రకటించారు. తప్పుడు కేసుల్లో తనను ఇరికించారని, మీడియా సాక్షిగా దాడి చేసిన టీడీపీ నాయకులపై ఎందుకు కేసులు నమోదు చేయరని ఆయన ప్రశ్నించారు.

మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి:గట్టు


‘మిర్చి’ కే్రందాలు ఏర్పాటు చేయాలి
వైఎస్సార్‌ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
మిర్యాలగూడ: రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాం డ్‌ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న మిర్చికి పూర్తి స్థాయి లో గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను పత్తి సాగుకు బదులుగా కంది పంట సాగు చేయాలని చెప్పిన వ్యవసాయాధికారులు కనీసం మద్దతు ధర చెల్లించడం లేదని విమర్శించారు.

ఏపీ అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యే దీక్ష


ఏపీ అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యే దీక్ష
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వెలుపల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం దీక్ష చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్ల రంగు దుస్తులు ధరించి దీక్షకు దిగారు. రవాణాశాఖ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన కేశినేని ట్రావెల్స్‌ అధినేత, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పక్షపాత వైఖరి నిరసిస్తూ బహిరంగ లేఖ రాశారు.

తిరుపతి విమానాశ్రయంలో తాను, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్ సీపీ కాళహస్తి ఇంఛార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అసత్యపు కేసు పెట్టి 21 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారని లేఖలో రాశారు. నెల్లూరు జైలులో ఉండగానే మరో కేసులు పెట్టి రాజమండ్రి, పీలేరుకు తరలించారని గుర్తు చేశారు. మీ పార్టీ నేతలు తమ అనుచరులతో కలిసి ఐజీ స్థాయి అధికారిని దుర్భాషలాడి, దాడి చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. మధ్యవర్తిత్వం పేరుతో నాటకాలాడి కేసులు లేకుండా చేశారని ఆరోపించారు. మీ పార్టీకి చెందినవాళ్లయితే కేసులు ఉండవా అని సూటిగా ప్రశ్నించారు.

బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి

Written By news on Sunday, March 26, 2017 | 3/26/2017


డోన్‌ టౌన్‌: డోన్‌ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి అనుచరులు చేస్తున్న అరాచకాలపై ఆయన మౌనం వీడాలని పీఏసీ చైర్మన్‌ బుగ్గన డిమాండ్‌ చేశారు. ఆదివారం తన స్వగృహంలో బుగ్గన డోన్‌ జెడ్పీటీసీ శ్రీరాములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ వేలాల సందర్భంగా శుక్రవారం టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారు బీసీలు కాదా అని కేఈని నిలదీశారు. బీసీలకు పెద్దదిక్కుగా చెప్పుకుంటున్న కేఈ బీసీలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం దారుణమన్నారు.  అధికారపార్టీ ముసుగులో కొందరు పట్టణంలోని ప్రధానమైన వనరులను కొల్లగొడుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. ఆర్యవైశ్యులకు చెందిన విలువైన స్థలాలను కబ్జాచేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఏకపక్షంగా టెండర్లను దక్కించుకునేందుకే అధికార పార్టీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కేఈ కృష్ణమూర్తి తమ అనుచరులను అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే  ఏదో ఒక రోజు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు

చంద్రబాబూ.. ఇదేం వైఖరి..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మహిళలనీ చూడకుండా దుర్భాషలాడుతున్నారు. చేయి చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు మహిళలు, అధికారులు కంటతడి పెట్టిన సందర్భాలున్నాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా.. అధికార పార్టీ నాయకులను వెనకేసుకు వచ్చింది. అదే ప్రతిపక్ష నాయకుల విషయానికి వస్తే వారు ప్రశ్నిస్తేనే లేనిపోని కేసులు పెట్టి వేధిస్తోంది.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాద దుర్ఘటనలో 12 మంది  మరణించినపుడు.. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లిన సందర్భంగా పోస్టుమార్టమ్ నివేదిక కోరిన విషయంలో కలెక్టర్‌తో ఇష్టానుసారం ప్రవర్తించారంటూ ప్రభుత్వం నానా రభస సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం ఏర్పాటు చేయించారు. వైఎస్ జగన్‌ను తప్పుపడుతూ, జరిగిన ఘటనను ఖండించాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అదే అధికార పార్టీ నాయకులు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. తాజాగా రవాణ శాఖ కమీషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుల దాడి ఘటనే ఇందుకు ఉదాహరణ. టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు ఇద్దరు ఏకంగా ఒక ఐపీఎస్ అధికారితో ఇష్టానుసారంగా మాట్లాడినా ప్రభుత్వం స్పందించలేదు. ఐఏఎస్ అధికారుల తరహాలోనే ఈ విషయంలో ఐపీఎస్ అధికారుల సమావేశం జరగలేదు. ఈ ఘటనను ముఖ్యమంత్రి గానీ, రవాణా శాఖ మంత్రిగానీ ఎక్కడా ఖండించలేదు.

ఇదే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అధికారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్‌ వనజాక్షి విషయంలో ఇష్టానుసారం వ్యవహరించినప్పటికీ చర్యలు లేకపోగా చంద్రబాబు అసెంబ్లీలో ఆ ఘటనను సమర్థించుకున్నారు. కాల్ మనీ కేసు, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు, అనంతపురం జిల్లాలో మహిళపై దాడి.. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా చంద్రబాబు నిందితులపై తగిన చర్యలు తీసుకోలేదని, కొందరిని కాపాడే ప్రయత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి.


ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న ఉద్దేశంతోనే బాలసుబ్రహ్మణ్యం పై దాడికి సంబంధించి ఆదివారం హడావిడి చేసినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను పిలిపించి చంద్రబాబు మందలించినట్టు, దానిపై వారు జరిగిన దానికి చింతిస్తున్నామంటూ ప్రకటన చేయడం అంతా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న భయంతోనే చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం అనంతరం వారు బాలసుబ్రహ్మణ్యం కార్యాలయానికి వెళ్లి కలుసుకోవడం, ఈ ఘటనను తేలిక చేసే ఉద్దేశంతోనే చేసినట్టుగా ఉందని వారంటున్నారు.

Popular Posts

Topics :