|
6/01/2013
ఆనం క్షమాపణ చెప్పాలి: వైఎస్‌ఆర్ సీపీ
Written By news on Saturday, June 1, 2013 | 6/01/2013
6/01/2013
జగన్ కు జాతీయస్థాయి మద్దతు!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో మద్దతు రావడం ఆసక్తికరంగా ఉంది.జగన్ పై సిబిఐని ఉసికొల్పారని అకాలీదళ్,బిజెపి నేతలు వ్యాఖ్యానించడం నైతికంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు కొంత ఉపశమనం కలిగించే అంశమే. ఇంతవరకు జాతీయ స్థాయిలో జగన్ కు ఎవరూ పెద్దగా మద్దతు ఇచ్చిన దాఖలా లేదు. శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగిన జగన్‌ను అణగదొక్కడానికే సిబిఐని కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాళీదళ్ నేత, మాజీ ప్రధాని కుమారుడు నరేష్ గుజ్రాల్ వ్యాఖ్యానించారు.అలాగే బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా జగన్ కొత్త పార్టీని పెట్టుకున్నందునే కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఉసికొల్పిందని అభిప్రాయపడ్డారు.సిబిఐని దుర్వినియోగం చేయడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు
Kommineni
6/01/2013
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63282&Categoryid=11&subcatid=24#sthash.2YH5d9Xf.dpuf
జగన్‌ను అభిమానిస్తున్నందుకు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు
ప్రజానేత స్వర్గీయ వైఎస్సార్ తనయుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన యువనేత వై.ఎస్.జగన్‌ని వివిధ ఆరోపణల కింద ఏడాదిగా నిర్బంధంలోనే ఉంచి ఆయనకు బెయిలు రాకుండా ఈ కాంగ్రెస్, సీబీఐ లు కలిసి చార్జిషీట్ల పేరుతో కాలయాపన చేస్తున్నాయని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అర్థమైపోయింది. దినపత్రికలు చదివే, టీవీలు చూసే ప్రతి వ్యక్తీ జగన్‌కి జరుగుతున్న అన్యాయం గురించే చర్చించుకుంటున్నారు. ఏ చట్టం అయినా శిక్షతో పాటు, శిక్ష నుంచి ఉపశమనం కూడా కలిగించే వెసులుబాట్లతో నిర్మితమై ఉంటుంది.
![]() ఆ నమ్మకంతోనే వైఎస్సార్ తనయుడి పార్టీకి ప్రజాదరణ మెండుగా ఉంది. దీనికి తోడు ప్రభుత్వ అనుచిత ఆలోచనలతో విద్యుత్ చార్జీలు, పన్నులు పెంచి, రేషన్ కార్డులు కుదించి, విద్యుత్ కోతలు విధించి ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోంది. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేసిన తప్పును గ్రహించి కాంగ్రెస్‌లో అతిపెద్ద ప్రజాదరణ కలిగిన నాయకుడైన వై.ఎస్.జగన్‌ను తక్షణం విడుదల చెయ్యాలి. జగనన్న బయటికి వస్తేనే ప్రజాసంక్షేమం, ప్రజాభ్యున్నతి. - వట్టికూటి నర్సుబాయి, బచ్చోడు, ఖమ్మం జిల్లా నిర్బంధించినంత మాత్రాన ప్రజాదరణ తగ్గుతుందా?! వై.ఎస్.జగన్‌ని అక్రమంగా జైల్లో బంధించి, కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేసింది. ఫలితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగవ్వక తప్పదు. జగన్‌కు బెయిల్ వస్తుందనుకున్న ప్రతిసారీ సీబీఐ కుట్రపూరిత ఛార్జిషీట్లతో ఏదో ఒక పీటముడి వేస్తోంది. జగన్‌గారు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులను తప్పుదోవ పట్టిస్తోంది. బయట ఉన్న మంత్రుల సంగతిని మాత్రం గాలికొదిలేస్తోంది. నిజానిజాలను రాష్ట్రప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలొస్తాయా, ఎప్పుడు వైఎస్సార్ రుణం తీర్చుకుందామా అని ఎదురుచూస్తున్నారు. జగన్‌ను అక్రమంగా బంధించారని, పదవుల్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం కుటిల రాజకీయాలను ఉపయోగిస్తున్నారని ప్రజలకు అర్థమైపోయింది. రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్. ఆయనను నిర్బంధించినంత మాత్రాన ప్రజాదరణ తగ్గుతుందనుకోవటం అవివేకమే అవుతుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేద హృదయాలను తాకింది. అందుకే ఆయన్ని ప్రజలు ఆపద్బాంధవునిగా భావించారు. ఆయన మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఎన్నివిధాలుగా ఇబ్బందికి గురిచేస్తోందో గమనిస్తుంటే, హృదయం కదిలిపోతోంది. వై.ఎస్. పథకాలు అమలు కావాలంటే, జగన్ సీఎం కావాలి. అదే ప్రజల కోరిక. - బి.సత్యనారాయణ, అమలాపురం మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com |
6/01/2013
నాలుగుసార్లు మాటమార్చారు
ఉచిత విద్యుత్‌పై నాలుగుసార్లు మాటమార్చారు
* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ధ్వజం
* ఓసారి ఉచిత విద్యుత్ కుదరదన్నారు
* ఇంకోసారి ఉచిత విద్యుత్ కావాలా..
* నాణ్యమైన విద్యుత్ కావాలా అన్నారు
* మరోసారి 12 గంటలు ఉచితంగా ఇస్తామన్నారు
* ఇప్పుడు 9 గంటలిస్తామని మాటమార్చారు
* పల్లెల్లో బెల్టుషాపులకు జీవం పోసింది చంద్రబాబే
* ఇప్పుడు వాటిని రద్దు చేస్తానంటున్నారు
* ఇచ్చిన మాట నిలుపుకోవడం ఆయనకు చేతకాదు
* చంద్రబాబు పాలన, కిరణ్ పాలన దొందూదొందే
మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్తు కుదరనే కుదరదు అన్నారు. 2004లో మీకు ఉచిత విద్యుత్తు కావాలా..? నాణ్యమైన విద్యుత్తు కావాలా..? తేల్చుకోండి అని అన్నారు. 2009 ఎన్నికల్లో మాట మార్చి 12 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు. ఇప్పుడు 2013లో 12 గంటలు అవసరం లేదు.. 9 గంటలు ఇస్తే చాలనుకొని 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానంటూ మళ్లీ మాట మార్చారు. అంటే ఒకే అంశాన్ని 14 ఏళ్లలో నాలుగుసార్లు మాట మార్చి చెప్పారు. ఒక మాట మీద నిలబడటం, ఇచ్చిన మాట నిలుపుకోవడం చంద్రబాబుకు ఎప్పుడూ చేత కాదు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు.
‘‘వ్యవసాయాన్ని దండగ చేసింది ఈ చంద్రబాబే.. పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ బెల్టు దుకాణాలకు జీవం పోసింది ఈ చంద్రబాబే.. ఇప్పుడేమో రుణమాఫీ చేస్తాను, ఉచిత విద్యుత్తు ఇస్తాను, బెల్టు దుకాణాలు రద్దు చేస్తానంటూ మాయమాటలు చెప్పి మళ్లీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు..’’ అని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ ప్రభుత్వాన్ని కాపాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో సాగింది. తణుకులో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
మనం వింటే చార్మినార్ కూడా తానే కట్టానంటారు..
ఉచిత విద్యుత్తు చంద్రబాబు వల్లే సాధ్యమయిందటా.. ఫీజు రీయింబర్స్‌మెంటు కూడా చంద్రబాబు నాయుడే చేశాడటా.. ఇంకొంచెం ఉంటే ఆరోగ్యశ్రీ నేనే చేశాను, వైఎస్సార్ ప్రతి పథకం నేనే చేశాను అని చెప్తారేమో! మనం వింటూ పోతే హైదరాబాద్‌లో చార్మినార్, కృష్ణా నది మీద నాగార్జునసాగర్‌ను నేనే కట్టాను అని చంద్రబాబు చెప్తారు. పట్టపగలు కళ్లార్పకుండా ఎన్ని అబద్ధాలైనా చె ప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారి రెక్కల కష్టం మీద అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ రెక్కల కష్టం మీద ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చింది. ఎన్టీఆర్ ప్రజలకు ఇచ్చిన రెండు వాగ్దానాలను చంద్రబాబు నిలబెట్టుకోలేదు. వైఎస్సార్ ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్తు, 30 కిలోల బియ్యం పథకం వాగ్దానాలను ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి గారు నిలుపుకోలేదు. చంద్రబాబు గారికి, కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి తేడా ఏమీ లేదు. దొందూ దొందే. వారిద్దరికీ ఏమీ తేడా లేదు. ప్రజలంతా చంద్రబాబును ఇంటికి పంపించినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
కిరణ్ మాటలు కోటలు దాటుతున్నా..
కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి పేదలంటే కనికరం లేదు. ప్రజల గురించి ఆలోచన లేదు. గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో ఎక్కడ కూడా రోజుకు ఐదు, ఆరు గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు. ఇంత ఎండలో ప్రజలు బయటే ఉంటే వాళ్ల ప్రాణాల మీదకు వస్తుంది కనుక వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి వీలు కలిపిస్తూ ప్రభుత్వం ఈ నెలలో కరెంటు కోతలు లేకుండా చూడాలి. కానీ కిరణ్ సర్కారేమో మార్చిలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిసినా కరెంటివ్వలేదు. మేలో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిసి కూడా కరెంటు ఇవ్వలేదు. ఎండలకు వందల కొద్ది మంది ప్రజలు చనిపోయారంటే ఆ పాపం ఈ సర్కార్‌ది కాదా? అని అడుగుతున్నాం. పవర్ కట్‌తో వేలకొద్ది పరిశ్రమలు మూతపడిపోయి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఈ సీఎం మాత్రం లక్షల మందికి ఉద్యోగాలిస్తున్నామని, లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెబుతున్నారు. కిరణ్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదు.
బాబు హయాంలో ‘మద్దతు’ రూ.50..
వైఎస్ హయాంలో రూ.450
చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో వరికి కేవలం రూ.50 మాత్రమే మద్దతు ధర పెంచారు. వైఎస్సార్ అదే వరికి ఐదేళ్ల కాలంలో రూ.450 పెంచారు. ఇప్పుడున్న కిరణ్ సర్కారు ఈ నాలుగేళ్లలో కేవలం రూ.250 మాత్రమే పెంచి, ఎరువుల ధరలు మాత్రం 300 శాతం పెంచారు. ఎక్కడ చూసినా రైతులు అప్పుల పాలైపోయామని బాధపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా సాగునీరు లేదు. తాగునీరు లేదు. ఈ పాలకులకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ప్రజల సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాసం పెడితే ప్రధాన ప్రతిపక్షం నాయకుడు చంద్రబాబు మాత్రం అవిశ్వాసానికి మద్దతివ్వకుండా రెండు చేతులు అడ్డుపెట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడారు.
12.2 కిలోమీటర్ల యాత్ర..
శుక్రవారం 165వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని కొత్తపాడు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి ఇరుగవరం, గోపాలపురం మీదుగా తణుకు నియోజకవర్గ కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. ఇక్కడ భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే పట్టణంలోని సొసైటీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,180.2 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యే మద్దాల రాజేష్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరు ప్రసాదరాజు, స్థానిక నాయకులు చీర్ల రాధయ్య, చిట్టూరి నరేంద్ర, విడివాడ రామచంద్రరావు, కర్ర రాజారావు, కండిబోయిన శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
4న తూర్పుగోదావరిలోకి ప్రవేశం..
10 జిల్లాలను పూర్తి చేసుకొని మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 11వ జిల్లాలోకి అడుగుపెట్టబోతోంది. ఈనెల 4వ తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బ్రిడ్జి దాటుకొని షర్మిల తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారన్నారు. ఈ జిల్లాలో మొత్తం 20 రోజుల పాటు, 275 కి.మీ. మేర యాత్ర సాగుతుందని, 13 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేస్తారని చెప్పా - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=609747&Categoryid=1&subcatid=33#sthash.i50ZT57Y.dpuf
* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ధ్వజం
* ఓసారి ఉచిత విద్యుత్ కుదరదన్నారు
* ఇంకోసారి ఉచిత విద్యుత్ కావాలా..
* నాణ్యమైన విద్యుత్ కావాలా అన్నారు
* మరోసారి 12 గంటలు ఉచితంగా ఇస్తామన్నారు
* ఇప్పుడు 9 గంటలిస్తామని మాటమార్చారు
* పల్లెల్లో బెల్టుషాపులకు జీవం పోసింది చంద్రబాబే
* ఇప్పుడు వాటిని రద్దు చేస్తానంటున్నారు
* ఇచ్చిన మాట నిలుపుకోవడం ఆయనకు చేతకాదు
* చంద్రబాబు పాలన, కిరణ్ పాలన దొందూదొందే

‘‘వ్యవసాయాన్ని దండగ చేసింది ఈ చంద్రబాబే.. పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ బెల్టు దుకాణాలకు జీవం పోసింది ఈ చంద్రబాబే.. ఇప్పుడేమో రుణమాఫీ చేస్తాను, ఉచిత విద్యుత్తు ఇస్తాను, బెల్టు దుకాణాలు రద్దు చేస్తానంటూ మాయమాటలు చెప్పి మళ్లీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు..’’ అని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ ప్రభుత్వాన్ని కాపాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో సాగింది. తణుకులో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
మనం వింటే చార్మినార్ కూడా తానే కట్టానంటారు..
ఉచిత విద్యుత్తు చంద్రబాబు వల్లే సాధ్యమయిందటా.. ఫీజు రీయింబర్స్‌మెంటు కూడా చంద్రబాబు నాయుడే చేశాడటా.. ఇంకొంచెం ఉంటే ఆరోగ్యశ్రీ నేనే చేశాను, వైఎస్సార్ ప్రతి పథకం నేనే చేశాను అని చెప్తారేమో! మనం వింటూ పోతే హైదరాబాద్‌లో చార్మినార్, కృష్ణా నది మీద నాగార్జునసాగర్‌ను నేనే కట్టాను అని చంద్రబాబు చెప్తారు. పట్టపగలు కళ్లార్పకుండా ఎన్ని అబద్ధాలైనా చె ప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారి రెక్కల కష్టం మీద అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ రెక్కల కష్టం మీద ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చింది. ఎన్టీఆర్ ప్రజలకు ఇచ్చిన రెండు వాగ్దానాలను చంద్రబాబు నిలబెట్టుకోలేదు. వైఎస్సార్ ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్తు, 30 కిలోల బియ్యం పథకం వాగ్దానాలను ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి గారు నిలుపుకోలేదు. చంద్రబాబు గారికి, కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి తేడా ఏమీ లేదు. దొందూ దొందే. వారిద్దరికీ ఏమీ తేడా లేదు. ప్రజలంతా చంద్రబాబును ఇంటికి పంపించినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
కిరణ్ మాటలు కోటలు దాటుతున్నా..
కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి పేదలంటే కనికరం లేదు. ప్రజల గురించి ఆలోచన లేదు. గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో ఎక్కడ కూడా రోజుకు ఐదు, ఆరు గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు. ఇంత ఎండలో ప్రజలు బయటే ఉంటే వాళ్ల ప్రాణాల మీదకు వస్తుంది కనుక వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి వీలు కలిపిస్తూ ప్రభుత్వం ఈ నెలలో కరెంటు కోతలు లేకుండా చూడాలి. కానీ కిరణ్ సర్కారేమో మార్చిలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిసినా కరెంటివ్వలేదు. మేలో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిసి కూడా కరెంటు ఇవ్వలేదు. ఎండలకు వందల కొద్ది మంది ప్రజలు చనిపోయారంటే ఆ పాపం ఈ సర్కార్‌ది కాదా? అని అడుగుతున్నాం. పవర్ కట్‌తో వేలకొద్ది పరిశ్రమలు మూతపడిపోయి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఈ సీఎం మాత్రం లక్షల మందికి ఉద్యోగాలిస్తున్నామని, లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెబుతున్నారు. కిరణ్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదు.
బాబు హయాంలో ‘మద్దతు’ రూ.50..
వైఎస్ హయాంలో రూ.450
చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో వరికి కేవలం రూ.50 మాత్రమే మద్దతు ధర పెంచారు. వైఎస్సార్ అదే వరికి ఐదేళ్ల కాలంలో రూ.450 పెంచారు. ఇప్పుడున్న కిరణ్ సర్కారు ఈ నాలుగేళ్లలో కేవలం రూ.250 మాత్రమే పెంచి, ఎరువుల ధరలు మాత్రం 300 శాతం పెంచారు. ఎక్కడ చూసినా రైతులు అప్పుల పాలైపోయామని బాధపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా సాగునీరు లేదు. తాగునీరు లేదు. ఈ పాలకులకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ప్రజల సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాసం పెడితే ప్రధాన ప్రతిపక్షం నాయకుడు చంద్రబాబు మాత్రం అవిశ్వాసానికి మద్దతివ్వకుండా రెండు చేతులు అడ్డుపెట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడారు.
12.2 కిలోమీటర్ల యాత్ర..
శుక్రవారం 165వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని కొత్తపాడు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి ఇరుగవరం, గోపాలపురం మీదుగా తణుకు నియోజకవర్గ కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. ఇక్కడ భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే పట్టణంలోని సొసైటీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,180.2 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యే మద్దాల రాజేష్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరు ప్రసాదరాజు, స్థానిక నాయకులు చీర్ల రాధయ్య, చిట్టూరి నరేంద్ర, విడివాడ రామచంద్రరావు, కర్ర రాజారావు, కండిబోయిన శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
4న తూర్పుగోదావరిలోకి ప్రవేశం..

6/01/2013
సింగిల్‌విండోల్లో వైఎస్సార్‌సీపీ హవా
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా నడుస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం సింగిల్‌విండో డెరైక్టర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 13 స్థానాలకుగాను 6 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు-3, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు ఇద్దరేసి చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎన్.మురళి తెలిపారు. ప్రకాశం జిల్లాలో 16 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో వైఎస్సార్‌సీపీ హవా నడుస్తోంది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ 16 సొసైటీల్లో శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఐదు సొసైటీల్లో మెజార్టీ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన వాటిలో నామమాత్రపు పోటీ నెలకొంది. ఒక్కో సొసైటీలో 13 డెరైక్టర్ స్థానాలుంటాయి. సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెం సొసైటీలో11, బేస్తవారిపేటలో10, గలిజేరుగుళ్లలో 8, పెద్దారవీడులో 8, అద్దంకి మండలం ధర్మవరం సొసైటీలో 7 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన వారు ఏకగ్రీవమయ్యారు. దీంతో ఆ సొసైటీలు వైఎస్‌ఆర్‌సీపీ వశం కానున్నాయి.
6/01/2013
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 166వ రోజు శనివారం 14.5 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలంగి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మునిపల్లి చేరుతుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు : పాలంగి, ఉండ్రాజవరం, మోర్త, దమ్మెన్ను, నడిపల్లికోట, కానూరు ఎక్స్ రోడ్డు, మునిపల్లి
పర్యటించే ప్రాంతాలు : పాలంగి, ఉండ్రాజవరం, మోర్త, దమ్మెన్ను, నడిపల్లికోట, కానూరు ఎక్స్ రోడ్డు, మునిపల్లి
5/31/2013
పెద్దారవీడు సింగిల్ విండో వైఎస్ఆర్ సీపీ కైవసం!
Written By news on Friday, May 31, 2013 | 5/31/2013
పెద్దారవీడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు సింగిల్ విండో కు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 13 డైరెక్టర్లకు జరిగిన ఎన్నికల్లో 8 చోట్ల వైఎస్‌ఆర్ సీపీ ఏకగ్రీవంగా గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున విజయం సాధించిన డైరెక్టర్లని పార్టీ నేతలు అభినందించారు.
5/31/2013
చంద్రబాబు, కిరణ్ దొందూ దొందే: షర్మిల
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది అని వైఎస్ జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం... కరెంట్ కోతలతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని తెలుసుకోవడం లేదని షర్మిల విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలనలో చంద్రబాబు, కిరణ్ ఇద్దరు దొందూ దొందే అని షర్మిల అన్నారు.
9 గంటల విద్యుత్ ఇస్తామన్న వైఎస్ హామీని కిరణ్ గాలికొదిలేశారని..విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబుకు పదవీ వ్యామోహం తప్ప మరో ద్యాసలేదని, ఆయనకు మాటపై నిలబడటం చేతకాదని అన్నారు. హైదరాబాద్‌లో చార్మినార్, నాగార్జునసాగర్‌ను కూడా తానే కట్టించానని అంటారేమోనని షర్మిల ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు నీతి న్యాయం లేదని, మూడో పార్టీ ఉండకూడదని కుట్రపన్ని జగనన్నను జైలుకు పంపించారని షర్మిల అన్నారు. తణుకు సెంటర్‌లో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలవేసి షర్మిల నివాళుల్పించారు.

బాబు మానసికస్థితిపై జూపూడి అనుమానాలు
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మానసిక పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గానీ, మిత్రుల గానీ ఆయనను విదేశాలకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం మంచిదని సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైదీలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జైళ్లలో అభ్యంతరకర సౌకర్యాలు అందజేస్తున్నారని చంద్రబాబు చేసిన నిరాధారమైన ఆరోపణలపై జైళ్ల శాఖ డిజి కృష్ణంరాజు స్పందించారని తెలిపారు. టీడీపీ నేతలకు చెంపపెట్టులా కృష్ణరాజు వివరణ ఇచ్చారని చెప్పారు. ఆయన వివరణకు టీడీపీ నేతలు ఇంతవరకూ ఎందుకు స్పందిచలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ములాఖత్లపై గతంలో వైఎస్ భారతి విసిరిన ఛాలెంజ్కు ఇప్పటి వరకూ స్పందన లేదన్నారు. చంద్రబాబు తన అలవాట్లను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్పై టిడిపి నేతలు అనుచిత ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. జగన్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా జూపూడి హెచ్చరించారు - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=609408&Categoryid=14&subcatid=0#sthash.FAzbWCRx.dpuf

జగన్‌ను అణగదొక్కడానికే సీబీఐని ఉసిగొల్పారు' :నరేష్ గుజ్రాల్
న్యూఢిల్లీ : శక్తిమంతమైన ప్రజానాయకుడు జగన్‌ను అణగదొక్కడానికే సిబిఐని కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాళీదళ్ నేత, మాజీ ప్రధాని కుమారుడు నరేష్ గుజ్రాల్ అంటున్నారు. సిబిఐని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు.
|
5/31/2013
జగన్ తప్ప, ఒక్కరైనా ఉన్నారా...ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడు?
![]() అధికార, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ఎన్ని ఇబ్బందులు పెట్టినా జనం జగనన్న వెంట ఉంటారని ఇప్పటికే గత ఉప ఎన్నికల్లో రూఢీ అయింది. ప్రజలు ఓదార్పుయాత్రను చూశారు. మరో ప్రజాప్రస్థానాన్నీ చూస్తున్నారు. నాయకులంటే ప్రజల కష్టాలు తీర్చడానికి ఉండాలి తప్ప ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి కాదు అని నిరూపించిన వ్యక్తి వైఎస్సార్ మాత్రమే. అందుకనే రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఆయనను పెద్దాయన అంటారు. ఆ పెద్దాయన లక్షణాలు జగనన్నలో ఉన్నాయి కాబట్టే తమ పీఠాలెక్కడ కదిలిపోతాయోనని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు ఈ స్వార్థ నాయకులు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా జగనన్న జైలు నుంచి రావడం, రాజన్న రాజ్యం స్థాపించడం ఖాయం. - షేక్ అమీర్ జానీ, పొన్నూరు, గుంటూరు జిల్లా |
5/31/2013
సీజన్ మొదలవుతున్నా విత్తనాల జాడ లేదు ...
|
5/31/2013
మా నిరసన సీబీఐ వ్యవహార శైలిపైనే..
013 3:11:00 AM
| |
|
5/31/2013
165వ రోజు యాత్రను ప్రారంభించిన షర్మిల
మహానేత వైఎస్సార్ తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర చేస్తారు. 165వ రోజున గోటేరు క్రాస్ రోడ్స్ , గోపాలపురం, తణుకు ఇరగవరం ఎస్సీ కాలనీ, ఆర్పీ రోడ్, తణకు జెడ్పీ హైస్కూల్ మీదుగా వెంకటేశ్వరా థియేటర్ రోడ్డు వరకు షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వెంకటేశ్వరా థియేటర్ రోడ్ వద్ద బస చేయనున్నారు. ఇవాళ మొత్తం 12.2కి.మీ మేర షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
5/30/2013
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63210&Categoryid=1&subcatid=18#sthash.TgkSUQ1Q.dpuf
ఈదుతున్న మాకే తెలుసు
Written By news on Thursday, May 30, 2013 | 5/30/2013
* వేధింపులపై వైఎస్ భారతి ఆవేదన
* దేవునిపై నమ్మకముంది.. ఆయనే దారి చూపిస్తాడు * జగన్ జనం మనిషి.. ఆ భయంతోనే జైల్లో పెట్టారు * అయినా ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు ![]() * చీకటి పోయాక వెలుగేనంటూ ధైర్యం చెబుతుంటాడు * జైల్లో ఉన్నట్టుగా గడుపుతున్నది కిరణ్, చంద్రబాబే * ఈర్ష్య, అభద్రతా భావాలతో దహించుకుపోతున్నారు * తాను హీరో కావాలని జగన్ ఏనాడూ అనుకోలేదు * కాంగ్రెస్ అధిష్టానమే జగన్‌ను హీరోను చేసింది * మా మామలాగే జగన్ కూడా ప్రేమమూర్తి * స్వతహాగా రావాలే తప్ప తెచ్చిపెట్టుకునేది కాదది * ఏం చేసినా చాలా సిన్సియర్‌గా, కమిటెడ్‌గా చేస్తాడు * మహా టీవీ ఎడిటర్ ఐ.వెంకట్రావుతో ముఖాముఖి ‘‘మా మామ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు జగన్ చేసినవి తప్పులుగా అనిపించలేదు. ఆయన మరణించిన తరవాతే తప్పులుగా అనిపించాయి. మా మీద కేసులు వేసే వాళ్లు వేశారు. చార్జిషీట్లు వేస్తున్న వాళ్లు వేస్తున్నారు. కానీ ఇవన్నీ ఈదుకుంటూ వెళ్లడం ఎంత ఇబ్బంది అనేది మాకు మాత్రమే తెలుస్తోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై రెండేళ్లుగా వేధింపులు ఎలా సాగుతున్నదీ మంగళవారం మహా టీవీ చీఫ్ ఎడిటర్ ఐ.వెంకట్రావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. ‘క్విడ్ ప్రో కో’కు కారణంగా సీబీఐ చూపుతున్న 26 జీవోలపై విచారణ జరపకుండా తమ ఇళ్లపైనా, సంస్థలపైనా దాడులు జరపడాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్ భారతి వెల్లడించిన అంశాలు... జగన్ అరెస్టయి ఏడాది అయింది కదా! మీ మనోభావాలేమిటి? ఒకటి, ఈ రోజు జగన్‌ను జైల్లో పెట్టింది ఏదో తప్పు చేసినందుకు కాదు. జనం ఆయనను కోరుకుంటున్నారనే భయంతోనే అని నేననుకుంటున్నాను. జగన్ జనాన్ని కోరుకుంటున్నాడు. జనం కూడా ఆయనను కోరుకుంటున్నారు. మా మామ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ను ఎవరూ తప్పు పట్టలేదు. వాస్తవానికి మా మామ హయాంలో మనం అభివృద్ధిలో గుజరాత్‌తో పోటీ పడుతూ ఉన్నాం. సంక్షేమంలో గుజరాత్‌ను దాటిపోయాం. అసలు అప్పుడు నేనూ, జగన్ బెంగళూరులో ఉన్నాం. మేం 2001లోనే బెంగళూరుకు వెళ్లి అక్కడే ఉంటూ వచ్చాం. రెండు చిన్న విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించాం. 2004 డిసెంబర్‌కు మరో పెద్ద ప్రాజెక్టును కూడా పూర్తి చేశాం. మా మామ గారు కూడా జగన్‌ను బెంగళూరులోనే ఉండమని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని కనుక హైదరాబాద్‌లో ఉంటే ఏదో ఒకటి ఆపాదిస్తూ ఉంటారు కనుక అక్కడ ఉండటమే మేలని అన్నారు. అందుకే... జగన్ తప్పు చేశాడని జైల్లో పెట్టలేదు. అసలాయన ఇక్కడ లేను కూడా లేడు. కొన్నేళ్లుగా ఆయన ప్రజల అవసరాలను గమనించి ఎప్పటికప్పుడు వాటిపై పాలకులను నిలదీస్తూ వచ్చాడు. అందువల్ల ప్రజలకు దగ్గరయ్యాడు. అందుకే కష్టాలు పడుతున్నాడు. జగన్ ఎంపీ కాక ముందు నుంచీ కడప జిల్లాలో 16, 17 ఏళ్లుగా ప్రజా సంబంధాలు మెండుగా ఉన్న వ్యక్తి. ఎక్కువగా ఉద్యోగాలు ఇప్పించమంటూ వచ్చేవారికి సాయం చేసేవాడు. జగన్‌తో ఎవరైనా ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటే ఆయన వద్దకు వెళ్లి మీ వాళ్లకు పది ఉద్యోగాలిస్తామని చెబితే చాలు, వాళ్లతో ఆయన చాలా బాగా ఉండేవాడు. రాజకీయంగానే కాక సామాజికంగా కూడా మంచి సంబంధాలున్న వ్యక్తి జగన్. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్‌లో జగన్ రాజకీయ ప్రాధాన్యత కోల్పోవడమే నేటి పరిణామాలకు కారణమనుకుంటున్నారా? జగన్ ఏనాడూ ప్రాధాన్యత కావాలనుకోలేదు. అలా అనుకునే వ్యక్తే అయితే బెంగళూరులో ఉండడు. హైదరాబాద్‌లోనే ఉండేవాడు. ‘ఎప్పుడైతే నేను ప్రజలకు ఉపయోగపడనని అనుకుంటానో అప్పుడు రాజకీయాలు చాలించుకుని వె ళ్లిపోతాను’ అని జగన్ మాతో చెప్పేవాడు. అదీ ఆయన వ్యక్తిత్వం! ఆయనకు నిజంగా పదవీ కాంక్ష ఉంటే 2004 నుంచీ రాష్ట్రంలోనే ఉండేవాడు. మనం ఎంతమంది ముఖ్యమంత్రుల కుమారులను చూడలేదు! వాళ్లు చక్రం తిప్పుతూ ఉంటారు. కానీ జగన్ ఏనాడూ అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ![]() జగన్ తక్కువగా మాట్లాడతారనుకుంటా... అవును. సహజంగానే తక్కువ మాట్లాడతాడు. వాళ్ల నాన్నను చాలా దగ్గర నుంచి చూశాడు కదా. ఉన్నదున్నట్టు మాట్లాడటం జగన్ అలవాటు. అనుకున్నదే చెబుతాడు. కల్పించి ఏదీ చెప్పడు. అయితే అందరూ చెప్పేది చాలా ఓపిగ్గా వింటాడు. చెప్పాలనుకున్నది ఓపెన్‌గా చెబుతాడు. కాంగ్రెస్‌తో విభేదాలు ఎందుకొచ్చాయి? మా మామ చనిపోవడం మా కుటుంబానికంతటికీ పెద్ద షాక్. ఆయన్ను చూసిన వారెవరూ కూడా ఆయన మన మధ్య లేరంటే నమ్మలేదు. ఆయన మృతిని తట్టుకోలేక చాలామంది చనిపోయారని విన్నాం. మేమైతే ఆ విషాదంలో ఎవరమూ టీవీలు చూడలేదు. కుటుంబ పెద్దను కోల్పోయి మనమే ఇంత బాధపడుతున్నాం కదా, ఇక చిన్న కుటుంబాల వాళ్లు ఎంత బాధపడుతూ ఉంటారో అని అప్పట్లో షర్మిల, అత్తమ్మ చెప్పుకుంటూ ఉన్నారు. వారి కుటుంబాల వద్దకు జగన్ వెళ్లి కలవాలని అనుకుంటూ ఉన్నారు. జగన్ పావురాల గుట్టలో కూడా అదే చెప్పాడు. అది సమస్య అవుతుందని ఆ రోజు అనుకోలేదు. అవుతుందనుకుంటే వేరేలా ఉండేదేమో. మొదటిసారిగా అత్తమ్మ, జగన్, షర్మిల, నేను సోనియాగాంధీ దగ్గరకు వెళ్లాం. ఓదార్పు గురించి తొలుత సోనియాను అడిగితే పొమ్మని చెప్పింది. కానీ ప్రజలు చాలా భావోద్వేగాలతో ఉన్నారు, కొంతకాలం తరువాత వెళ్లమని చెప్పారు. అందువల్ల మూడు నెలలు ఆగాం. జగన్ మళ్లీ డిసెంబర్‌లో అడిగాడు. అప్పటికే ఆలస్యమైందని చెప్పాడు. మార్చి, ఏప్రిల్‌లో అనుకుంటా, అహ్మద్‌పటేల్‌ను అడిగితే ‘మేడమ్‌కు ఒక లేఖ రాసిచ్చి పో’ అని జగన్‌కు చెప్పారు. జగన్ బెంగళూరుకు వచ్చాక ఒక రోజు అహ్మద్ పటేల్ ఫోన్ చేసి, ‘అర్జంట్‌గా రా’ అంటే జగన్ ఢిల్లీ వెళ్లి వాళ్లను ఒప్పించి వచ్చాడు. పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. యాత్ర ప్రారంభించిన తొలి రోజే ప్రజలంతా మామ మీద ఉన్న అభిమానాన్ని జగన్ పై చూపించారు. నాలుగు రోజుల తరువాత అనుకుంటా, వెనక్కి వచ్చేయమన్నారు. అది తొలుత వారం రోజుల యాత్రే కనుక పూర్తి కాగానే వస్తానని జగన్ చెప్పాడు. పూర్తయ్యాక ఢిల్లీ వెళ్తూ వెంట పేపర్ క్లిప్పింగ్‌లు తీసుకెళ్లాడు. వాటిలో అన్నిచోట్లా కాంగ్రెస్ జెండాలే ఉన్నాయి. అదేమీ పార్టీ వ్యతిరేక చర్య కాదు. చనిపోయిన వారు, తన వెంట వస్తున్న వాళ్లు అందరూ కాంగ్రెస్ వాళ్లేనని చెప్పాడు. దీనివల్ల పార్టీకి మేలే జరుగుతుందన్నాడు. ఢిల్లీలో చాలామంది పెద్ద లీడర్లను కలిశాడు. ‘మా నాయన చనిపోయిన దగ్గర నేను మాట ఇచ్చాను, మీరు ఒప్పించండి’ అని కోరారు. ఒకరోజు వీరప్ప మొయిలీ యాత్రకు ఒప్పుకున్నారు. ‘బయట ప్రెస్ వాళ్లు వేచి ఉన్నారు. ఓదార్పుకు అనుమతిచ్చారని చెప్పుకోవాలా, వెనక ద్వారం నుంచి వెళ్లి పోవాలా’ అని జగన్ అడిగితే ఆయన చెప్పుకో అన్నారు. తీరా మేం ఇంటికి వెళ్లి భోంచేసేటపుడు అహ్మద్ పటేల్ ఫోన్ చేసి బెంగళూరు వెళ్లిపొమ్మని చెప్పారు. తీరా హైదరాబాద్‌లో విమానం దిగాక మొయిలీ తానలా అనలేదని చెప్పినట్టు ప్రకటించారు. అంటే జగన్ అబద్ధమాడినట్టుగా చూపాలనే కదా! వాళ్ల ప్రయోజనా ల కోసం ఇలా చేయడం తప్పు కదా! మేం అదే అనుకున్నాం. జూలై 8న జగన్ మళ్లీ ఓదార్పుయాత్ర ప్రారంభించాడు. మళ్లీ మా అత్త, జగన్, షర్మిల ఢిల్లీలో సోనియాను కలిశారు. ‘‘మా ఆయన చనిపోతే మేం చిన్నవారమైనా మీరే మా ఇంటికి వచ్చి కలిశారు కదా! మృతి చెందిన కుటుంబాలను పిలిపించుకుని మాట్లాడటం సరికాదు’’ అని మా అత్త చెప్పారట. వాళ్లకది నచ్చలేదు. ‘ఒకసారి మాటిచ్చాక ఇక వెనక్కి తిరగబోను’ అని జగన్ కూడా ఒకసారి నాతో అన్నాడు. మొత్తం మీద హైకమాండ్‌ను ఎదిరించి హీరో అయ్యారు! హైకమాండ్‌ను ఎదిరించాలని జగన్‌కు ఎప్పుడూ లేదు. మాట నిలబెట్టుకోవాలనే తపన పడ్డాడు. అలా అనుకుంటే వాళ్లే జగన్‌ను హీరోను చేశార ని చెప్పొచ్చు. వారు అనవసరంగా ఓదార్పుకు అడ్డం చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వాళ్లు వ్యతిరేక సమాచారం ఇవ్వడం వల్లే అధిష్టానం అలా వ్యవహరించిందని అనుకుంటున్నారా? ఏమైందో, వారెందుకలా చేశారో! మా మామ 30 ఏళ్లు ఆ పార్టీ కోసం కష్టపడ్డారు. అలాంటి ఆయన కుమారుడిపై ఏదో కేసులు పెట్టి భయపెడతారని మాత్రమే అనుకున్నాం గానీ ఇంత చేస్తారను కోలేదు. విజయసాయిరెడ్డి అరెస్టు, బెయిల్ నేపథ్యంలో జగన్‌ను కూడా అరెస్టు చేస్తారని ఊహించారా? పుకార్లయితే ముందు నుంచే ఉన్నాయి. ఇంత కష్టమవుతుందనుకోలేదు. విచిత్రంగా అనిపించిందేమంటే, మామ ఉన్నప్పుడు వాళ్లకు ఏదీ తప్పుగా అనిపించలేదు. ఆయన చనిపోయిన పదిహేను నెలల తరువాత ఒకాయన కేసు వేశారు. ఆయనకు ఆ తరవాత మంత్రి పదవి కూడా వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో తప్పులున్నాయేమో చూడండంటే, దాన్ని వదిలివేసి దాడులు చేశారు. భయపెట్టాలని చూశారు. జీవోల కథే పక్కనపెట్టి మా వ్యాపారాల మీదకు వచ్చారు. రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ పెద్దోళ్లను ఎదిరిస్తే ఇలాగే ఉంటుందని ఒక భయం సృష్టించాలని చూశారు. ఫోన్ ట్యాపింగ్‌లు చేశారు. దాడులు చేశారు. ఆగస్టు నుంచి మార్చి దాకా దర్యాప్తు చేసి ఒక చార్జిషీటు వేశారు. జగన్‌ను అరెస్టు చేసే నాటికే మూడు చార్జిషీట్లు వేశారు. ‘ఇది చేశావా?’ అని అప్పటికి జగన్‌ను కనీసం ఒక్కసారైనా అడగలేదు. ఆయన చెప్పేది వారు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ అడగాలిగా! అడగలేదు. ఇంకా చార్జిషీట్లు వేస్తామని, అన్నింట్లోనూ జగనే ఏ-1 (తొలి నిందితుడు)గా ఉంటాడని దర్యాప్తు చేస్తున్న అధికారే చెప్పారు. సీఆర్పీసీ 173 ప్రకారం ఒక ఎఫ్‌ఐఆర్‌కు ఒక చార్జిషీటే, అది కూడా దర్యాప్తు పూర్తయ్యాకే వేయాలి. ఇంకేమైనా ఉంటే అనుబంధ చార్జిషీట్లు వేయాలి. కానీ ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వేస్తున్నారు. కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడి మాట నెగ్గించుకునే ప్రయత్నం ఎందుకు జరగలేదు? రాజకీయంగా ఆలోచించి పార్టీ పెట్టారా? కాదు, రాజకీయంగా ఆలోచించి చేసింది కానే కాదు. అలా అనుకుని ఉంటే (ఎన్నికలకు) ఏడాది ముందు బయటికొస్తే బాగుండేది. ఇది రాజకీయంగా ఆలోచించి చేసిన నిర్ణయం కాదు. లేకుంటే అన్ని సంవత్సరాల ముందు వారితో విభేదించి బతగ్గలమా అనుకున్నాం. కానీ, తప్పలేదు. జగన్ విషయంలో రెండు అంశాలు చెప్పాలి. అతను చాలా సిన్సియర్. ఒక పని చేపట్టినా, మాట ఇచ్చినా సిన్సియర్‌గా ఉంటాడు. కమిటెడ్‌గా ఉంటాడు. పవర్ ప్రాజె క్టులు కావచ్చు, సాక్షి, కావచ్చు, భారతి (సిమెంట్స్) కావచ్చు... ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంత కమిటెడ్ గా ఉంటాడు. రెండోది వెరీ వెరీ హ్యూమన్, మా మామ గానీ, జగన్ గానీ చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఎవరైనా కష్టాలు చెబుతూ ఉంటే మా మామకైతే కన్నీళ్లు వస్తాయి. జగన్ కూడా అంతే. ఓదార్పు యాత్ర అంతా విజువల్స్‌లో చూస్తూ ఉంటాం కదా. వాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు, వాళ్లు కలిపిచ్చిన అన్నం తినే విషయంలో. మా బంధువులు కూడా చెబుతూ ఉంటారు... వాళ్లంత ప్రేమతో పెడుతున్నప్పుడు తినాలి అని జగన్ చెబుతాడు. దారిలో తన కోసం ఇద్దరు ముగ్గురు వేచి ఉన్నా ఆగి పలకరించి వెళతాడు. ఈ స్వభావం తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు. స్వతహాగా రావాలి. అర్ధరాత్రి వరకూ తిరిగారంటే అదే కారణం. జగన్ ఫక్తు వ్యాపారవేత్త అనే విమర్శలున్నాయి... అది నిజం కాదు. ఆయన అలాంటి వ్యాపారవేత్త కాదు. భారతి సిమెంట్స్‌ను ఫ్రెంచ్ వాళ్లకు అమ్మినప్పుడు ఎవరి దగ్గరైతే భూమి కొన్నారో వారికి అదనంగా డబ్బు ఇప్పించాం. మాకు తగ్గించుకోనైనా రైతులకు ఇవ్వండని చెప్పాం. సాక్షి నుంచి మేం ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు. సాక్షిలో వచ్చేది దాంట్లోనే పెట్టాం. మా సమయంలో ఎక్కువగా సాక్షికే కేటాయిస్తున్నాం. సాక్షిని ఏ రోజూ మేం భారంగా చూడలేదు. మీరన్నట్లు జగన్ ఫక్తు వ్యాపారవేత్తే అయితే అలా ఉండడు. జగన్ మంచి బిజినెస్ మాన్. భారతి సిమెంట్స్ చాలా అల్ట్రా మాడ్రన్ ప్లాంటు. సాక్షి దేశంలోనే ఏడో స్థానంలో ఉంది. ఈ రెండూ పేరు మోసిన సంస్థలు. భారతి సిమెంట్స్‌ను జర్మనీ నుంచి వచ్చిన వాళ్లు చూసి ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఇంత కష్టపడి పని చేస్తారని అనుకోలేదన్నారు. భారతిలో కిందిస్థాయి నుంచీ అన్ని విషయాలను జగన్ శ్రద్ధగా చూశాడు. సాక్షి విషయంలో కూడా అంతే. ప్రతి చిన్న విషయంలో కూడా, డిజైనింగ్‌లోనూ, టెక్నాలజీలోనూ, యంత్రాల విషయంలోనూ చొరవ, శ్రద్ధ తీసుకున్నాడు. ఈ రోజు సాక్షికి కోటిన్నర మందికి పైగా పాఠకులున్నారు. ప్రజలకు ఏం చెప్పి కొనిపించగలం? ఎలా మభ్యపెట్టగలం? ఉత్పాదనలో నాణ్యత లేకుంటే ఎందుకు కొంటారు? మోసం చేసి షేర్లు కొనిపించామని సీబీఐ అంటోంది. ఇదేమీ డమ్మీ పేపర్ కాదు. పనికి మాలినది అంతకంటే కాదు. నిజమే. సాక్షి చాలా అభివృద్ధి చెందింది. ఇంత రీడర్‌షిప్ పెంచుకోవడం చిన్న విషయం కాదు. దేవుని దయ. జగన్ తన టీమ్‌లోని వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తాడు. అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాడు. నన్ను, విజయమ్మను, షర్మిలను ప్రోత్సహిస్తాడు. కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతోందని విజయమ్మ బాధపడుతూ ఉంటారా? బయటి వాళ్లు వైఎస్‌ను, జగన్‌ను ఇన్నేసి మాటలు అంటున్నందుకు బాధపడుతూ ఉంటారు. కానీ ఆమె చాలా కృతనిశ్చయంతో ఉంటారు. జగన్ కూడా తన తల్లికి, మాకు ధైర్యం ఇస్తూ ఉంటాడు. కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి ఎంతోకాలం ఉండదు. రాత్రి పోయినాక వెలుగు వస్తుందని చెబుతూంటాడు. కుటుంబంలో విభేదాలున్నట్టు బయట చెప్పుకుంటూ ఉంటారు... నిజం కాదు. మేమంతా చాలా ఐక్యంగా ఉంటాం. షర్మిల తన భర్త కోసమో, కొడుకు కోసమో కాకుండా ఇంత ఎండలోనూ తన అన్న జగన్ కోసం తిరుగుతున్నారు. ఆమెకు జగన్ అంటే చాలా ఇష్టం. అదే మీ కుటుంబం గొప్పతనం. మీరు ఒక పాయింట్‌ను తీసుకుంటే దాన్ని విజయవ ంతంగా జనంలోకి తీసుకు వెళతారు మేం చెబుతున్నది అదే. జగన్‌ను ఇన్ని రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? అతను ఒక్క సంతకం పెట్టలేదు. భూములు ఫలానా వారికి ఎందుకిచ్చారో, ఎందుకు నీళ్లిచ్చారో ఆయనకు తెలియదు. ప్రజలకు అన్యాయం జరిగితే మా మామ సహించేవారు కాదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భూ సేకరణ ప్రకటన తిరుపతి ఎడిషన్‌లో అచ్చవడం చూసి, ‘అక్కడిది ఇక్కడెందుకు ఇస్తున్నారు?’ అని మా మామ ప్రశ్నించారట. ఇది విధాన నిర్ణయమంటే, దానివల్ల ఖజానాకు నష్టం వాటిల్లుతుందని చెప్పి ఆ విధానాన్నే వైఎస్ మార్చేశారు. దానివల్ల సాక్షికి కూడా ఆదాయం తగ్గుతుందని తెలిసినా ఆ నిర్ణయం తీసుకున్నారు. మా సరస్వతి పవర్ ప్రాజెక్టుకు కూడా వైఎస్ ఉన్నప్పుడు నీళ్లు తక్కువగా వచ్చేవి. ‘గత ప్రభుత్వంలోనే ఎక్కువగా వచ్చేవి’ అని అంటే, మీ ప్రాజెక్టు కోసం నీళ్లివ్వలేనని, ప్రజలే ముఖ్యమని మామ చెప్పారు. ఈ పరిణామాల వల్ల మీకు రాజకీయంగా సానుకూల పరిస్థితి ఉంది బెయిల్ లభించడంలో ఇంకా జాప్యమవుతోంది. దీన్నెలా తీసుకుంటున్నారు? మీకున్న విశ్వాసం ఏమిటి? మాకు దేవుని మీద నమ్మకముంది. ఆయన తప్పకుండా దారి చూపిస్తాడు. మాకున్న విశ్వాసమల్లా... ఇవన్నీ అబద్ధాలు, ఆరోపణలు. సీబీఐ వేసిన ఐదు చార్జిషీట్ల గురించి మీకు చెబుతాను. అరబిందో, హెటెరో సంస్థలకు ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఎకరా భూమిని రూ.15 లక్షలకు ఇవ్వాలని సూచిస్తే, ఏడు లక్షలకే ఇవ్వాలని నిర్ణయించారని అభియోగం మోపుతున్నారు. అసలు ఆ ప్రాంతంలో ఎకరా లక్ష, రెండు, రెండున్నర లక్షలకు కూడా అమ్ముడుపోదు. అసలు ఆ నిర్ణయం జరిగిన విషయం కూడా మా మామకు తెలియదు. అంతా పూర్తయి, టేబుల్ వద్దకు వచ్చాక , వెనకబడిన తెలంగాణ ప్రాంతంలో మీ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రకటించండంటూ తెచ్చిపెట్టారు. వాస్తవానికి ఈ సంస్థలకు రూ.16 కోట్లు లబ్ధి చేకూరితే 32 కోట్లు ఎలా పెట్టుబడి పెడతారు? ఇక రెండోది ప్రైవేటు ఇన్వెస్టర్ల వ్యవహారం. మూడోది రాంకీ సంస్థకు స్థలమిచ్చింది చంద్రబాబే. అందులో వైఎస్, జగన్ చేసిందేమీ లేదు. తప్పులేమైనా చేసి ఉంటే చంద్రబాబే చేసి ఉండాలి. ఇక వాన్‌పిక్‌కు ఇచ్చిన ప్రభుత్వ భూమి కేవలం 200 ఎకరాలే. మిగతాది ప్రైవేటుగా కొనుక్కున్నదే. ప్రభుత్వం కేవలం కొనుగోలుకు సహకరించింది. పైగా అది ఒక ప్రభుత్వానికి, మరో ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం. రాష్ట్ర ప్రభుత్వానికి రస్ అల్‌ఖైమా ప్రభుత్వానికి మధ్య జరిగింది. ఇందుకు సంబంధించి చంద్రబాబు హయాంలోనే ఒప్పందం జరిగింది. ఇక దాల్మియా కంపెనీకి మైనింగ్ లీజు ఇవ్వడానికి సంబంధించింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్పు చేయడం సర్వసాధారణం. ఒకటి దాల్మియా సొంత కంపెనీ అయితే రెండోది వారి సబ్సిడరీ. ఇలాంటి మార్పు చేయడాలు ఏడాదికి కొన్ని వందలు జరుగుతూ ఉంటాయని సోమయాజులు గారు చెబుతూ ఉంటారు. మా సంస్థల్లో పెట్టుబడులు పెట్టినోళ్లందరికీ షేర్లు ఇచ్చాం. ఈనాడు కన్నా ఉత్తమమైన సంస్థలు మావి. రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉండే ‘ఈనాడు’ సంస్థలో రూ.2,600 కోట్లు పెట్టారు. ‘ఈనాడు’ షేర్‌ను రూ.5 లక్షల పై చిలుకు ధరకు కొన్నారు. ‘ఈనాడు’లో పెట్టుబడి పెట్టిన వారికి ఒక్క రూపాయి అయినా లాభం కింద దొరికిందా? ఈనాడు కన్నా సాక్షి అన్నివిధాలా మెరుగైన సంస్థ. అలాంటి దానిలో పెట్టుబడి పెడితే క్విడ్ ప్రొ కో ఎలా అవుతుంది? ఇంతటి మెరుగైన సంస్థ షేర్లు రూ.350కే దొరికినప్పుడు ఇన్వెస్టర్లు ఎందుకు కొనరు? పైగా భారతి సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా ఆదాయాలు వచ్చాయి. మా కంపెనీలో ఇన్వెస్టర్లకు 2006-07లోనే షేర్లను పంపించాం. అన్నీ ప్రొసీజర్ ప్రకారమే ఫైల్ చేశాం. ఆ రశీదులు మా కార్యాలయంలో ఉన్నాయి. ఇతరులు పెట్టుబడి పెట్టి, షేర్లు మా పేరు మీద ఉంటే తప్పవుతుంది గానీ పెట్టుబడి పెట్టినవారి పేరు మీదనే షేర్లుంటే తప్పెలా అవుతుంది? జైల్లో జగన్ ఎలా ఉన్నారు? చాలా ధైర్యంగా ఉన్నాడు. మాకందరికీ కూడా ధైర్యం చెబుతున్నాడు. బయట ఉన్నంత స్వచ్ఛంగా ఉన్నాడు. నిజానికి బయట ఉన్న చంద్రబాబు, కిరణే రెండేళ్లుగా జైల్లో ఉన్నట్టుగా గడుపుతున్నారు. ఏమంటే వాళ్లకు రాజకీయ అభద్రతా భావం, ఈర్ష్య. మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు వచ్చేముందు కూడా జగన్‌ను జైల్లో కలిశాను. మరో నాలుగు నెలలు జగన్‌ను ఎలాగోలా జైల్లోనే ఉంచితే ఆ లోపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానని ఢిల్లీ పెద్దలతో కిరణ్ చెప్పారని నా దృష్టికి వచ్చింది. అదే మాట జగన్‌తో చెప్పి, ‘ఎట్ల జగన్?’ అని అడిగాను. అంటే ఒకటే చెప్పినాడు. ‘కష్టాలు కలకాలం ఉండవు. ఈ దశను దాటిపోతాం. పైన దేవుడున్నాడు. ఆయనను నమ్ముకున్నాం. ఏం జరిగినా మంచే జరుగుతుంది’ అని ధైర్యం చెప్పినాడు. (బెయిల్ పిటిషన్‌పై) తీర్పు ఎటైనా రావచ్చని జగన్‌కు కూడా తెలుసు. అయినా అంత ధైర్యంగా ఉన్నాడు. సుప్రీంకోర్టులో తీర్పు వింటున్నప్పుడు పదేపదే నాకు జగన్ మాటలే గుర్తుకొచ్చినయి. కాంగ్రెస్ కోసం సాక్షిని, టీవీని స్థాపిస్తే తమపైనే అస్త్రాలు సంధిస్తున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు. అఫ్‌కోర్స్, అది మీ ఫ్యామిలీ ఆస్తి అనుకోండి... కాదు. సాక్షి మా ఫ్యామిలీది మాత్రమే కాదు. అది ఇన్వెస్టర్లందరి ఆస్తి. మా మామ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాయాల్సిందిగా జగన్‌ను ఎంకరేజ్ చేసేవాడు. నువ్వు క్రిటిసైజ్ చేయి, వాటిని మేం రెక్టిఫై చేసుకుంటాం అనేవాడు. పత్రిక స్థాపించడానికి ముందు అది ఎలా ఉండాలనే విషయమై జగన్ ఏడు పేజీలు రాసుకున్నాడు. సాక్షి పెట్టి ఐదేళ్లు పూర్తయిన సందర్భంలో దాన్ని నేను చూశా. ఫలానా పార్టీకో, వ్యక్తికో మనం కొమ్ముకాసేలా ఉండరాదనేది ఆయన అభిమతం. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి... అందరి వార్తలూ పెద్దగా వేస్తున్నాం. కానీ మీ పేపర్‌ను బ్యాన్ చేయాలంటున్నారు...! అది వాళ్ల కోరిక. దేవుడున్నాడు. ఆయన అనుమతించాలి కదా! సాక్షి పత్రికలో ప్రజా సమస్యల గురించే ఎక్కువగా రాస్తున్నాం, రాస్తాం. ప్రజా సమస్యలపై రాసినందుకే ఈ మంత్రులు బాధపడితే... వారంతా మా మామగారితో కలిసి పని చేశారు. వీళ్లన్న మాటలు విని మేమెంత బాధపడాలి! ‘ఉరి తీయాలి, వెలేయాలి’ అని మాట్లాడారు. మేమేం చేశామని అలా మాట్లాడారు? వాళ్ల గురించి ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ల కుటుంబాలు బాధ పడవా? అయినా ఎవరి సభ్యత వారికుంటుంది. సమస్యలపై మీ పార్టీ చాలా దూకుడుగా ఉంది. విజయమ్మ నిబ్బరంతో ముందుకు పోతున్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఏనాడూ బయటకు రాని ఆమె ఈ రోజు పార్టీని నడిపిస్తున్నారు... మామ మృతి అత్తకు ఎక్కువ బాధాకరం అనుకుంటా. మామను విడిచిపెట్టి అత్త ఒక్క రోజు కూడా ఉండేవాళ్లు కాదు. కడపకు పెళ్లికి వెళ్లినా రాత్రికి వచ్చేవాళ్లు. మామ, జగన్, షర్మిలలే అత్తకు ప్రపంచం. రాజకీయాలకు ఆమె దూరం. ఎంత దూరమంటే, వేంపల్లె ఎస్టేట్‌కు వెళ్లినప్పుడు అక్కడి సర్పంచ్ ఎవరో కూడా అత్తకు తెలియదు. మామ మరణంతో ఆమె ప్రపంచమే కుప్పకూలినట్టుగా అయింది. అయితే ఇప్పుడు ఆమే మాకు బాగా ధైర్యం చెబుతున్నారు. 35 సంవత్సరాలు కష్టపడి వైఎస్ ప్రజాదరణను సంపాదించుకున్నారు. జగన్ కూడా రెండేళ్లు బాగా కష్టపడి ప్రజాభిమానం సంపాదించారు. జగన్ బయటకు వచ్చే వరకూ ఆ ఆదరణను కాపాడుతూ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని అత్తమ్మ భావిస్తూ ఉంటారు. ఇదంతా కొలిక్కి వచ్చేటప్పటికి చాలాకాలం పట్టేటట్టుంది? నేనదే అనుకుంటున్నా. కేసులు వేసే వాళ్లు సులభంగా వేశారు. చార్జిషీట్లు సులభంగా వేశారు. ఇందులో ఈదుకుని పోయేటోళ్లకు, మాకు అర్థం అవుతోంది ఎంత కష్టమో. అందులోనూ ఏమీ చేయని దానికి ఇవన్నీ. జగన్ స్థాపించిన సాక్షి, భారతి సిమెంట్స్ సంస్థలు 35 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. భారతి సిమెంట్స్‌ను అమ్మేసే వరకూ మేం అందులోంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. సాక్షిలో నుంచి కూడా ఈ రోజు వరకూ రోజు ఒక్క రూపాయి తీసుకోలేదు. ఇంత నిబద్ధతతో పని చేసి ఆంధ్రప్రదేశ్‌కే జగన్ మంచి పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఈ రోజు భారతి సిమెంట్స్ కేరళ, తమిళనాడు, గోవాల్లో అమ్ముడుపోతోంది. సాక్షి పత్రిక అంశాన్ని ముద్రా ఇన్‌స్టిట్యూట్ వాళ్లు అధ్యయనాంశంగా తీసుకున్నా |
5/30/2013
రైతును జగనన్న రాజులా చూసుకుంటారు
* వైఎస్ మరణం తర్వాత ఆధునీకరణ పనులను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది
* కాలువలను బాగు చేయించేందుకు వైఎస్ రూ.1,464 కోట్లతో పనులు ప్రారంభించారు
* ఆయన ఉన్నంతకాలం పనులు వేగంగా సాగాయి.. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరు
* పనులు పూర్తి చేస్తే వైఎస్‌పై జనం ఇంకా అభిమానం పెంచుకుంటారని, అది జగన్‌కు అనుకూలంగా మారుతుందని ఈ పాలకులు అనుకుంటున్నారు
* ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత.. ఊడితే ఎంత.. అని రైతన్నల ఆగ్రహం
* రైతును జగనన్న రాజులా చూసుకుంటారు: షర్మిల భరోసా
మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ధాన్యాగారమైన గోదావరి డెల్టా వట్టిపోతోంది.. పాలకుల నిర్లక్ష్యం, కుట్రలతో నిండా మునుగుతోంది.. అన్నం పెట్టాల్సిన ‘అన్నపూర్ణ’ అన్నమో రామచంద్రా అని అలమటిస్తోంది. ఐదేళ్లుగా పంట వేయడమే కానీ ఆ పంట చేతికి అందింది లేదు. పంట కోసే వేళ వరదలొచ్చి పంటంతా నీటిపాలైపోతోంది. ఆక్వా, అరటి, కొబ్బరి, వరి... ఇలా ప్రతి రైతు అప్పుల పాలైపోయారు. 150 ఏళ్ల కిందట ధవళేశ్వరం, విజ్జేశ్వరం వద్ద ఆనకట్టలతో పాటు సాగునీటి కాల్వలు కట్టించిన కాటన్‌దొరను ఇక్కడి ప్రజలు దేవుడిలా కొలిస్తే.. ఆ కాలువల్లో పూడిక తీయించి నీటిని ఉరకలెత్తించిన దివంగత నేతను గుండెల్లో పెట్టుకున్నారు. ఈ కాల్వల్లో పూడిక తీయించి ఆధునీకరించడం కోసం వైఎస్సార్ రూ.1,464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. ఆయన బతికి ఉన్నంత కాలం పనులు శరవేగంగా సాగాయి.
అందుకే తీర వాసులు తమ పల్లెల్లో కాటన్‌దొర విగ్రహం పక్కనే వైఎస్సార్ విగ్రహం పెట్టుకున్నారు. ఈ అభిమానాన్ని చూసి పాలకులు ఓర్చుకోలేకపోయారు. పనులు పూర్తై తీరప్రాంతమంతా వైఎస్సార్‌పై ఇంకా అభిమానం పెంచుకుంటారని, అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో ఏవేవో సాకులు చూపుతూ డెల్టా ఆధునీకరణ పనులను నిలిపివేసే కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్ మరణించిన తర్వాత డెల్టా ఆధునీకరణ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో సాగింది. పలుచోట్ల షర్మిలను కలిసిన రైతులు.. డెల్టా ఆధునికీకరణ పనులు జరగకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ప్రభుత్వం ఉంటే ఎంత.. ఊడితే ఎంత?
వేసిన పంట చేతికందే సమయంలో వరదొచ్చి పంటను ముంచేస్తోంది. మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి. తుపాను వస్తే పంటల సంగతి దేవుడెరుగు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది. కాల్వల్లో పూడిక తీస్తే ఈ సమస్య ఉండేది కాదు. కానీ ఈ పాలకులకు చేతగాక, వ్యవసాయం మీద అవగాహన లేక, రైతుల అవసరాలు గుర్తించలేక డెల్టాను ఏటా ముంచేస్తున్నారు. డెల్టా ఆధునీకరణ కోసం వైఎస్సార్ ఇచ్చిన నిధులను కూడా ఖర్చుపెట్టలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత? డెల్టా ప్రాంతంలోని కాలువలు, డ్రెయిన్ల వ్యవస్థను బాగుచేసి, పూడికలు తీయించి ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చి ఉండేదే కాదు. - కుంజం సత్యనారాయణ, రైతు, పాలకొల్లు
వైఎస్ ఉన్నప్పుడు చేసిన పనులే
భారీ వర్షాలు పడితే డ్రెయిన్లలో నీరు పారే అవకాశం లేక ఎగదన్ని పొలాలు మునిగిపోవడం డెల్టాలో నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితిని నివారించి రైతులను ఆదుకునేందుకు వైఎస్ 2007లో డెల్టా ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. 5.30 లక్షల ఎకరాలకు నీరందించే కాలువలు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ.1,464 కోట్లను కేటాయించారు. పనులు పూర్తవడానికి నిర్దేశించిన ఐదేళ్ల కాలపరిమితి పూర్తి అయ్యింది. వైఎస్సార్ ఉన్నప్పుడు చేసిన పనులే గానీ.. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ పనీ చేయలేదు.
- మేడపాటి గొల్లారెడ్డి, మట్టపర్రు నీటితీరువా సంఘం అధ్యక్షుడు
జగనన్నపై అభిమానం చూపెడతారనే..
ఆధునీకరణ పనులు చేయాలంటే కాలువలకు నీరు విడుదల చేయకుండా ఆపాలని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారమ్మా! పనులు పూర్తిచేయడానికి 2012 ఖరీఫ్ సీజన్‌కు పంట విరామం ఇచ్చాం. ఆ సమయంలో కూడా పనులు సరిగ్గా చేయలేదు. అసలు వీళ్ల మనసులో ఉన్న ఉద్దేశం వేరే ఉందమ్మా.. నాన్నగారు కాల్వలు, డ్రెయిన్‌ల ఆధునీకరణ కోసం నిధులిచ్చారు. 30 శాతం పనులు చేశారు. ఈ పనులు పూర్తై జనమంతా జగనన్న మీద అభిమానం చూపెడతారని కిరణ్‌కుమారెడ్డి కుట్ర చేసి పనులు పక్కన పెట్టిస్తున్నాడమ్మా..
- సత్తి వెంకటరెడ్డి, రైతు, మార్టేరు - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=608502&Categoryid=1&subcatid=33#sthash.TPGYlmfl.dpuf
* కాలువలను బాగు చేయించేందుకు వైఎస్ రూ.1,464 కోట్లతో పనులు ప్రారంభించారు
* ఆయన ఉన్నంతకాలం పనులు వేగంగా సాగాయి.. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరు
* పనులు పూర్తి చేస్తే వైఎస్‌పై జనం ఇంకా అభిమానం పెంచుకుంటారని, అది జగన్‌కు అనుకూలంగా మారుతుందని ఈ పాలకులు అనుకుంటున్నారు
* ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత.. ఊడితే ఎంత.. అని రైతన్నల ఆగ్రహం
* రైతును జగనన్న రాజులా చూసుకుంటారు: షర్మిల భరోసా

అందుకే తీర వాసులు తమ పల్లెల్లో కాటన్‌దొర విగ్రహం పక్కనే వైఎస్సార్ విగ్రహం పెట్టుకున్నారు. ఈ అభిమానాన్ని చూసి పాలకులు ఓర్చుకోలేకపోయారు. పనులు పూర్తై తీరప్రాంతమంతా వైఎస్సార్‌పై ఇంకా అభిమానం పెంచుకుంటారని, అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో ఏవేవో సాకులు చూపుతూ డెల్టా ఆధునీకరణ పనులను నిలిపివేసే కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్ మరణించిన తర్వాత డెల్టా ఆధునీకరణ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో సాగింది. పలుచోట్ల షర్మిలను కలిసిన రైతులు.. డెల్టా ఆధునికీకరణ పనులు జరగకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ప్రభుత్వం ఉంటే ఎంత.. ఊడితే ఎంత?

వైఎస్ ఉన్నప్పుడు చేసిన పనులే
భారీ వర్షాలు పడితే డ్రెయిన్లలో నీరు పారే అవకాశం లేక ఎగదన్ని పొలాలు మునిగిపోవడం డెల్టాలో నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితిని నివారించి రైతులను ఆదుకునేందుకు వైఎస్ 2007లో డెల్టా ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. 5.30 లక్షల ఎకరాలకు నీరందించే కాలువలు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ.1,464 కోట్లను కేటాయించారు. పనులు పూర్తవడానికి నిర్దేశించిన ఐదేళ్ల కాలపరిమితి పూర్తి అయ్యింది. వైఎస్సార్ ఉన్నప్పుడు చేసిన పనులే గానీ.. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ పనీ చేయలేదు.
- మేడపాటి గొల్లారెడ్డి, మట్టపర్రు నీటితీరువా సంఘం అధ్యక్షుడు
జగనన్నపై అభిమానం చూపెడతారనే..
ఆధునీకరణ పనులు చేయాలంటే కాలువలకు నీరు విడుదల చేయకుండా ఆపాలని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారమ్మా! పనులు పూర్తిచేయడానికి 2012 ఖరీఫ్ సీజన్‌కు పంట విరామం ఇచ్చాం. ఆ సమయంలో కూడా పనులు సరిగ్గా చేయలేదు. అసలు వీళ్ల మనసులో ఉన్న ఉద్దేశం వేరే ఉందమ్మా.. నాన్నగారు కాల్వలు, డ్రెయిన్‌ల ఆధునీకరణ కోసం నిధులిచ్చారు. 30 శాతం పనులు చేశారు. ఈ పనులు పూర్తై జనమంతా జగనన్న మీద అభిమానం చూపెడతారని కిరణ్‌కుమారెడ్డి కుట్ర చేసి పనులు పక్కన పెట్టిస్తున్నాడమ్మా..
- సత్తి వెంకటరెడ్డి, రైతు, మార్టేరు - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=608502&Categoryid=1&subcatid=33#sthash.TPGYlmfl.dpuf
5/30/2013
జగన్నాథపురం నుంచి షర్మిల పాదయాత్ర
ఆచంట : వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 164వ రోజు పశ్చిమ గోదావరిజిల్లా ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో సాగనుంది. గురువారం ఉదయం ఆమె జగన్నాథపురం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. మార్టేరు, ఆలమూరు, కట్టవపాడు, కంతేరు మీదుగా కొట్టపాడు వరకు కొనసాగుతుంది. రాత్రికి కొట్టపాడులో షర్మిల బసచేయనున్నారు. ఇవాళ మొత్తం 14.2 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర కొనసాగనుంది
5/29/2013
విచారణ జరిగితే బాబు జీవితాంతం జైలులోనే
Written By news on Wednesday, May 29, 2013 | 5/29/2013
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణంటూ జరిగితే ఆయన జీవితాంతం జైలులో ఉంటారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. బాబు తనపై కేసులు నమోదైనప్పుడు ఒక రకంగా, మరొకరి విషయంలో మరోలా మాట్లాడతారని విమర్శించారు. బాబు మాటలకు, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మాటలకు తేడా ఏమన్నా ఉందా? అని అడిగారు. వ్యవస్థను మేనేజ్ చేయగల సత్తా చంద్రబాబుకు ఉందని బ్రిటిష్ సంస్థ గతంలోనే చెప్పిందని గుర్తు చేశారు. తమకు కోర్టులపై నమ్మకం ఉన్నందునే విచారణను ధైర్యంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇవే కేసులు చంద్రబాబుపై ఉంటే విదేశాలకు పారిపోయి ఉండేవారన్నారు.
టీడీపీ సమావేశం మహానాడు కాదని, మహాపాడు అని అన్నారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఉన్న ఎజెండానే మహానాడులో ఉందన్నారు. చంద్రబాబు తీవ్రవత్తిడికి లోనై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా తన పాపాలు కడుక్కోవడం మంచిదని సలహా ఇచ్చారు

5/28/2013
హైదరాబాద్ : ప్రజల పక్షాన నిలిచిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని జైలులో పెట్టారని ఆయన సతీమణి భారతి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జగన్ నిర్బంధానికి నిరసన తెలుపుతూ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో భారతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల పక్షాన మాట్లాడేవారు ఉండకూడదన్నదే వారి ఉద్దేశమని, అందుకే జగన్ ను జైలుకు పంపారని చెప్పారు. ఎలాంటి తప్పు చేయకుండా ఏడాదిపాటు జైలులో పెట్టడం అన్యాయం అన్నారు. దేవుడు ఉన్నాడు, న్యాయం తప్పక జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని తెలిపారు. ఈ రోజు మంత్రులుగా ఉన్నవారందరూ రాజశేఖర రెడ్డి వల్లే మంత్రులయ్యారని చెప్పారు. వైఎస్ కుటుంబాన్నే ఇన్ని కష్టాలు పెడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని భారతి ప్రశ్నించారు.
జనం కోసం పోరాడినందుకే జగన్ కు జైలు:భారతి
Written By news on Tuesday, May 28, 2013 | 5/28/2013

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని తెలిపారు. ఈ రోజు మంత్రులుగా ఉన్నవారందరూ రాజశేఖర రెడ్డి వల్లే మంత్రులయ్యారని చెప్పారు. వైఎస్ కుటుంబాన్నే ఇన్ని కష్టాలు పెడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని భారతి ప్రశ్నించారు.
5/28/2013
మనుషులను పశువులుగా చూసే బాబు: దాడి
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుది మనుషులను పశువులుగా చూసే నీచసంస్కృతని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత దాడి వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని, తక్కువగా చూడటం బాబుకు తగదన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను పిల్ల కాంగ్రెస్ అని ఆయన అంటున్నారని, కానీ కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నది అతనేనని విమర్శించారు. బాబు విధానాల వల్లే టీడీపీ భ్రష్టుపట్టిందన్నారు.
5/28/2013
పోరాటం కొనసాగుతుంది: విజయమ్మ
రాజ్యాంగాన్నే దుర్వినియోగ పరుస్తూ జగన్‌ను జైల్లో పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ పనిచేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. ద్వంద్వ నీతితో సీబీఐ విచారణ చేస్తోందని ఆమె అన్నారు. జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టిన విజయమ్మ ఈ సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తమపై వచ్చింది ఆరోపణలేనని, నేరం రుజువుకాలేదని మంత్రులు చెప్తున్నారని... జగన్‌పై కూడా వచ్చినవి ఆరోపణలేనని గుర్తు చేశారు. ఆయన్ను ఏడాదిగా ఎందుకు జైల్లో ఉంచారని ప్రశ్నించారు. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి.. జగన్ ఎన్నడైనా మీ కార్యాలయాలకు వచ్చిగానీ, క్యాంప్ ఆఫీసుకు వచ్చిగాని కనపడ్డాడా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన వారంలోనే జగన్ ను ఐటీ నోటీసులొచ్చాయని తెలిపారు. వివాదస్పద 26 జోవోలు సక్రమమా కాదా అని ప్రభుత్వానికి నోటీసులందినప్పుడు కనీసం ఒక్క జోవోపై కూడా కాంగ్రెస్ సర్కారు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. మంత్రులు కూడా వ్యక్తిగతంగా కౌంటర్ దాఖలు చేయలేకపోయరన్నారు. శంకర్రావు ఆధారాలు లేని పిటిషన్ వేస్తే.. చంద్రబాబు ఇంప్లీడ్ అయ్యారని, జగన్‌పై జరిగిన కుట్రకు ఇవన్నీ ఉదాహరణలని విజయమ్మ అన్నారు.
జగన్‌బాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదనే నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఏడాదిగా జైల్లో ఉంచారని ఆరోపించారు. ఇందిరాగాంధీని చంపిన హంతకులను సైతం విచారించిన తర్వాతే కేసు నమోదుచేశారని, ఎలాంటి విచారణ లేకుండా మూడు ఛార్జ్‌షీట్లలో ఏ1గా నిందితుడిగా జగన్‌ను పేర్కొనడం కుట్ర కాక మరేమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టును తీర్పులను కూడా సీబీఐ లెక్కచేయడంలేదన్నారు. చనిపోయిన వైఎస్సార్ పేరును చార్జిషీట్ లో పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
విప్ జారీచేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడిన ఘనత ప్రతిపక్ష నేత చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎన్నికల ఫిక్సింగ్‌కు పాల్పడుతుంది చంద్రబాబే అన్నారు. నోట్ల కట్టలను బస్తాలలో, లారీలలో ఎలా నింపాలో చంద్రబాబుకు తెలిసినంతగా.. మరెవరికీ తెలియదన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు కాబట్టే చంద్రబాబుపై ఎటువంటి విచారణలు జరగడం లేదన్నారు. జగన్ అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని విజయమ్మ ప్రకటించారు. నిన్న, నేడు జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమకు అండగా నిలిచిన వారందరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

దీక్ష ప్రారంభించిన వైఎస్ విజయమ్మ
వైఎస్ జగన్ అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర చేపట్టిన దీక్షలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు దీక్షకు తరలి వచ్చారు
5/28/2013
జగన్ కోసం జనం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, నిరాధారమైన ఆరోపణలతో, కుట్రలు కుతంత్రాలతో అరెస్టుచేసి ఏడాది కాలం పూర్తయింది. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని జననేతకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసించారు. జగన్‌మోహన్‌రెడ్డి జనంలోఉంటే ఆయన ప్రభంజనాన్ని తట్టుకోవడం అసాధ్యమని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు చీకటి ఒప్పందానికి వచ్చి ఆయన్ను అక్రమంగా జైలుకు పంపించాయని వైఎస్సార్సీపీ నేతలు పలువురు ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలతో జగన్‌ను ఏడాది పాటు జైల్లో నిర్బంధించడమే గాక నిబంధలనకు విరుద్ధంగా చార్జిషీట్లు వేస్తూ సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో సీబీఐ నడుచుకుంటూ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తుండ డాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో వారు తగు విధంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

28-5-13-21956.jpg)

5/28/2013
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=607134&Categoryid=1&subcatid=33#sthash.atRDLnGq.dpuf
వచ్చే నెలలో ‘పంచాయతీ
12 - 15 తేదీల మధ్య నోటిఫికేషన్..
- ఆ తర్వాత 15 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి
- మూడు దశల్లో ఎన్నికలు.. బ్యాలెట్ పత్రాల వినియోగం - ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్.. సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాలు - వచ్చేనెల 5 లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా - బీసీ జనాభా శాతం అంచనాలు నేడో రేపో అందే అవకాశం - దాని ఆధారంగా జిల్లాల్లో ఏ కేటగిరీకి ఎన్ని స్థానాలో తేల్చనున్న పంచాయతీరాజ్ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 12 - 15 తేదీల మధ్య విడుదల కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత 15 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 5వ తేదీలోగా పంచాయతీల రిజర్వేషన్లను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 29లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని భావించినా.. రాష్ట్ర అర్థ గణాంక శాఖ నుంచి బీసీ జనాభా శాతం వివరాలు రాకపోవడంతో రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఇవి ఒకట్రెండు రోజుల్లో పంచాయతీరాజ్ శాఖకు అందుతాయని, ఆ వెంటనే రిజర్వేషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయని అధికారులు చెబుతున్నారు. వీటి ఆధారంగా పంచాయతీరాజ్ కమిషనర్ రాష్ట్రం యూనిట్‌గా సర్పంచుల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఇచ్చిన తరువాత వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. షెడ్యూల్ ప్రకటన తరువాత మూడు రోజుల్లో జిల్లాల్లోని ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో జిల్లాలో మూడు, అంతకంటే ఎక్కువ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, డివిజన్ మొత్తానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తామని, సాయంత్రానికి ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు అందిన అనంతరం వారం తరువాత నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. ఈలోగా రాజకీయ పార్టీలు, పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. నోటిఫికేషన్ వెలువడిన తరువాత 12 నుంచి 15 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు దాదాపు 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలు అవసరం ఉంటుందని, వీటికి సిబ్బందిని సమకూర్చుకునే బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారికి అప్పగిస్తామని చెప్పారు. అధికారులతో పంచాయతీరాజ్ కమిషనర్ సమావేశం ఈ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఖరారుపై చర్చించడానికి పంచాయతీరాజ్ కమిషనర్ రాంగోపాల్ అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో సోమవారం ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ’లో సమావేశమయ్యారు. రాష్ట్రం యూనిట్‌గా సర్పంచుల రిజర్వేషన్లు ఉంటాయని, ఒక్కో జిల్లాకు ఏ కేటగిరీ కింద ఎన్ని సర్పంచి పదవులు రిజర్వ్ అవుతాయన్న సంఖ్యను ప్రకటించి, వాటిని జిల్లాలకు పంపిస్తామని కమిషనర్ జిల్లాల అధికారులకు స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామ పంచాయతీలను రిజర్వ్ చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని కూడా ఆయన అధికారులకు వివరించారు. 2001 జనాభా లెక్కలా లేక 2011 లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయా అన్న విషయంపై మార్గదర్శకాలతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. కమిషనరేట్ నుంచి రిజర్వేషన్ల సంఖ్య అందిన మూడు రోజుల్లోగా జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు పోలీసులతో సమన్వయం చేసుకుని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, వాటికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ సూచించారు. పంచాయతీ తరువాత మునిసిపల్ ఎన్నికలు! గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత మునిసిపల్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత ఎంపీటీసీ స్థానాల పునర్విభజన నోటిఫికేషన్ జారీ చేస్తామని, వాటి కసరత్తుకు ప్రభుత్వం కొంత వ్యవధి ఇచ్చిందని పంచాయతీరాజ్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. జనాభా పెరిగినందున ఎంపీటీసీ స్థానాలు పెరిగే అవకాశముందని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రిజర్వేషన్లు దేనికి ప్రకటిస్తే వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపా |
Subscribe to:
Posts (Atom)