
ఈ రోజు జగన్ విషయంలో జరుగుతున్న అన్యాయానికి ఈ సంస్కృత శ్లోకం సరిగ్గా సరిపోతుంది.
సస్యానిస్వయమత్తిచే ద్వసుమతీ మాతాసుతం హన్తిచేత్
వేలామంబు నిధిర్విలంఘుయతిచేత్, భూమిందహేత్పావకః
ఆకాశం జనమస్తకే పతతి చేత్, అన్నం విషయం చేద్భవేత్
అన్యాయం కురుతే యదాక్షితి పతిః కస్తం నిరోర్ధుంక్షమః॥
పంటనిచ్చే భూమే ధాన్యాన్ని తింటే, జన్మనిచ్చిన తల్లే బిడ్డను చంపితే, సముద్రం గట్టులను దాటితే, అగ్ని భూమిని కాల్చేస్తే, ఆకాశమే జనాల తలమీద పడితే, అన్నమే విషంగా మారితే, రాజ్యాధిపతులు, న్యాయాధికారులు న్యాయాన్ని వదిలేసి, అన్యాయ మార్గంలో ప్రవర్తిస్తే అడ్డుకోగలవారెవరు?
పై ప్రవర్తనలను అడ్డుకోగలవాడు దేవుడు ఒక్కడే! అన్యాయంగా ప్రవర్తించే రాజ్యాధికారులు, న్యాయాధికారులకు దేవుడే సరియైన శిక్ష వేస్తాడు.
ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని, సోనియా కేంద్ర నేర పరిశోధన శాఖ సహకారంతో జగన్‌ను జైలులో పెట్టించి, బెయిల్ కూడా రాకుండా చేస్తున్న విషయం దేశంలో తెలియనివారుండరు. దేవుడంతా చూస్తున్నాడు. జగన్‌కు అన్యాయం తలపెట్టి బాధించే వ్యక్తులను నామరూపాలు లేకుండా చేస్తాడు. ఈ రోజు జగన్ తల్లి, భార్యాపిల్లలు, బంధువులు, అభిమానులు అనుభవించే బాధను సోనియా, జేడీ కుటుంబాలు కూడా తప్పక అనుభవిస్తాయి.
- వి.రఘుపతి, విశ్రాంత సంస్కృత పండిట్, నెల్లూరుతొమ్మిదేళ్లు ఏమీ చేయని బాబు ఇప్పుడొచ్చి ఏదో చేస్తానంటున్నారు!తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రైతులకు, వృద్ధులకు, అనారోగ్యాలతో బాధపడేవారికి ఏం న్యాయం చేశారని?! పదవిలో ఉండి ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడొచ్చి నేను అధికారంలోకి వస్తే, అన్నీ చేస్తాను అని చెబుతుంటే ప్రజలు నమ్ముతారా? అప్పట్లో వైఎస్సార్‌గారు ఉచిత కరెంటు అంటే, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారు అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తీగల్లో కరెంటు ఉండదనీ, బట్టలు ఆరేసుకోటానికి మాత్రమే కరెంటు తీగలు ఉపయోగపడతాయి అని విమర్శించిన అదే బాబుగారు ఇప్పుడు ఉచిత కరెంటు అంటున్నారు.
బట్టలు ఆరేసుకోటానికి వీలుగా ఇస్తారా? ప్రజలు గ్రహించాలి. మాటిచ్చి మడమ తిప్పని వీరుడు వైఎస్సార్‌గారు. అటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకొచ్చారో నాయకులు కూడా గమనించాలి. ఆపద్బాంధవుడు చనిపోయాడన్న బెంగతో అనేకమంది మరణిస్తే వారి కుటుంబాలను ఓదార్చడం తప్పేం కాదు కదా. ఓ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, తెలిసినవాళ్లు, బంధువులు వెళ్లి ఓదారుస్తారు కానీ, వీళ్లే వాళ్ల ఇళ్లకు వెళ్లి ఓదార్పు పొందరు కదా.
ఈ సంప్రదాయాలేవీ తెలియని సోనియా... బాధితుల్ని మీ దగ్గరకు రప్పించుకుని ఓదార్చండని చెప్పడం ఏ దేశపు రీతి, ఆనవాయితీ?! జగన్‌కు పెరుగుతున్న ప్రజాబలం చూసి ఓర్వలేక ఆయన మీద సీబీఐని ఉసిగొల్పి, తను ముందు నడుస్తూ సీబీఐని వెనక నడిపిస్తూ ఇష్టారాజ్యంగా జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు సోనియా. ఆమె ప్రభుత్వం జగనన్న పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ శ్రద్ధగా గమనిస్తూ ఉన్నారు. వారంతా ‘జగనన్న త్వరగా బయటకు రావాలి’ అని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. తొందర్లోనే మా ప్రార్థనలకు ప్రతిఫలం లభిస్తుందని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని విశ్వసిస్తున్నాం.
- గుమ్మాపు శ్రీనివాసరావు, ఉసులుమర్రు, ప.గో.జిల్లా