10 February 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

నేడు 6 కిలోమీటర్లు నడిచిన షర్మిల

Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నల్గొండ జిల్లాలో సాగుతోంది. శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా పాదయాత్ర పూర్తిగా సాగలేదు. షర్మిల ఈరోజు మొత్తం 6 కిలోమీటర్లు నడిచారు. వర్షం కారణంగా మిర్యాలగూడలో తలపెట్టిన బహిరంగ సభ కూడా రద్దయింది. ఇప్పటివరకు మొత్తం 977.3 కిలోమీటర్ల వరకు షర్మిల పాదయాత్ర చేశారు.

'ప్రజలకష్టాలుచూస్తూ అవిశ్వాసంపెట్టని బాబు'

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూస్తూ కూడా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అవిశ్వాసం పెట్టడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల విమర్శించారు. మిర్యాలగూడ నియోజకవర్గం తుంగపాడులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ వర్గానికీ నమ్మకంలేదన్నారు. కేవలం టీడీపీ నేత చంద్రబాబుకే ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. సొంతమామకే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుదని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు నీచ రాజకీయాలకు పాల్పడి జగనన్నను జైలులో పెట్టారన్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారని, రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు ఆమె భరోసా ఇచ్చారు.

' పెంచిన ధరలను ప్రభుత్వమే భరించాలి'

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2010 నుంచి ఇప్పటిదాకా 20 సార్లు ధరలు పెంచారని వైఎస్‌ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకరరావు గుర్తు చేశారు. చమురు కంపెనీలకు కేంద్ర, రాష్ట్రాలు దాసోహమయ్యాయని అన్నారు. ప్రజలతో సంబంధంలేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఆనాడు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయంలా పెరిగిన ధరలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలన్నారు.

Special edition on Nalgonda Gunde Sadi 15th Feb 2013

YS Sharmila Padayatra in Nagarjuna Sagar, Nalgonda

YS Sharmila speech in Thungapadu, Nalgonda

YSRCP slams Cong govt on Petrol price hike

షర్మిల పాదయాత్ర ప్రారంభం

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం 68వ రోజు పాదయాత్రను ముకుందాపూర్ నుంచి ప్రారంభమైంది. ముకుందాపురంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసినప్పటికీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రోడ్లు పూర్తిగా జలమయమైయ్యాయి. బురద పేరుకుపోయింది. అయినా జనం ఏమీ లెక్కచేయడంలేదు. వస్తూనే ఉన్నారు. భారీ వర్షాల కారణంగా పాదయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం వల్ల పాదయాత్రను ఆరు కిలోమీటర్లకు కుదించారు. మిర్యాలగూడ సభను కూడా రద్దు చేశారు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి మరో టిడిపి ఎమ్మెల్యే !

తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం ఆరంభమైంది.ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ టిడిపి నుంచి తప్పుకుని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెవరైనా వెళతారా అన్న చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో నల్లగొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి కాని, విశాఖ జిల్లాకు చెందిన ఒకరు కాని ఉండవచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు.నిజంగానే తెలంగాణ నుంచి కూడా టిడిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడితే అది పార్టీకి ఇబ్బందికరంగానే ఉండవచ్చు.కారణాలు ఏమైనా, టిడిపిలో కొంత ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది.కాగా నర్సీపట్నం కు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా పార్టీ మారవచ్చని కధనాలు వస్తున్నాయి.అయితే ఆయన తన పాలిట్ బ్యూరో సభ్యత్వాన్ని వదలిపెడుతున్నానని ప్రకటించిన రోజున తాను జీవితాంతం టిడిపిలోనే ఉంటానని చెప్పారు. అయినా రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు

http://kommineni.info/articles/dailyarticles/content_20130216_7.php

జగనన్నను చూడాలని ఉంది...


ఆంధ్రుల ప్రియతమ నాయకుడు, కడప ఎం.పి, వైయస్సార్ ిసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ‘ఆస్తులు సంపాదించుకున్నారు’ అనే నింద మోపి సీబీఐ విచారణ పేరిట ఈ ప్రభుత్వం జగనన్నను జైలుపాలు చేసి రాష్ట్రప్రజలను ఎంతో బాధకు, ఆవేదనకు గురి చేసింది. విచారణ కొనసాగింపు పేరుతో ఎనిమిది నెలలు దాటినా విడుదల చేయలేదు. ఆంధ్రప్రజలు తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించిన జగన్‌ని ఇన్నిరోజుల పాటు కళ్లకి కనపడకుండా, జైలు గోడల మధ్య ఉంచడం ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. జగన్ త్వరలోనే బయటికి రావాలని, గాడి తప్పి పక్కదోవ పడుతున్న రాష్ట్ర రాజకీయాలను చక్కదిద్ది, సక్రమ మార్గంలో నడపాలని కోరుకుంటున్నాను.

- నాగ బ్రహ్మం, ఒంగోలు

సూర్యుడు ఉండాల్సింది మబ్బుల చాటున కాదు!


కొమ్మపై కూర్చున్న పక్షి పెనుగాలికి కొమ్మ ఊగినా, విరిగినా భయపడదు. ఎందుకంటే ఆ పక్షికి కొమ్మలు, చెట్టురెమ్మల కంటే తన రెక్కల పైనే విశ్వాసం. అలాగే మా జగనన్నకు తన మీద తనకు నమ్మకం ఉంది. మాకూ ఆయన మీద నమ్మకం ఉంది. కల్లాకపటం తెలియని నవ్వుతో నిష్కల్మషంగా ఉండే మా జగనన్న అనునిత్యం ప్రజల గుండెల్లో చోటుకోసం మాత్రమే తపిస్తుంటారు. ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. ప్రజాసమస్యలపై పోరాడేతత్వం, ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం జగనన్నలో ఉన్నాయి. లీడర్ అంటే ఇలాగే ఉండాలని ఆనాడు మహానేత వైయస్సార్ గారిని చూసి అనుకున్నాం. ఈరోజు అలా జగనన్నని చూస్తున్నాం. తండ్రి వారసత్వాన్నే కాక ఆయన ఆశయాలనూ వారసత్వంగా స్వీకరించిన పులిబిడ్డ మా జగనన్న. అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని వైయస్సార్ ఆనాడు తన పాదయాత్రతో తిరిగితెస్తే... ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఓదార్పుయాత్రతో అధికారాన్ని, పదవినీ త్యాగం చేసిన యువనేత జగన్.

పార్టీలు, పదవులు శాశ్వతం కాదని నమ్మి, ప్రజల కోసమే ఆయన రాజకీయాలలోకి వచ్చారు. అలాగే నాయకుడనేవాడు ఎన్నేళ్లు పరిపాలించామని కాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా పరిపాలించాలని వైఎస్సార్ అనేవారు. ఆ మాటనే జగన్ నేడు ఆచరిస్తున్నారు. వైఎస్సార్ మరణంతో మన రాష్ట్రానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందనీ, ఆ లోటును జగనన్న తప్ప మరెవరూ భర్తీ చేయలేరనీ గుర్తించి, ఆ నిజాన్ని భరించలేకపోయిన ప్రభుత్వం, ప్రతిపక్షం, ఈ రెండు పార్టీలకు తొత్తులుగా మారిన ఎల్లో మీడియా కలిసి నీచ రాజకీయాలతో కుమ్మక్కయి, కుట్రపన్ని మహానేత కుటుంబంలో ఆడపడుచులను సైతం రోడ్డుపైకి వచ్చేటట్లు చేశారు.

పదవుల కోసం, అధికారం కోసం ఆనాడు వైఎస్సార్‌తో ఉన్న వాళ్లంతా ఇప్పుడు జగన్‌కు దూరం అయ్యారు. అయితేనేం, ఆనాడు అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు మాత్రం నేటికీ పెద్దాయన కుటుంబంతోనే ఉన్నారు. జగనన్నపై ఆదరణ కురిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కుటిలకూటములు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వై.ఎస్. కుటుంబ సభ్యులను వేధించడం మానుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడ్డానికి సిద్ధం కావాలి. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఉండవలసింది మబ్బులచాటున గాదు, ప్రజల మధ్యలో. ఆ విషయాన్ని పాలకులు గుర్తెరగాలి. నా కుటుంబమే నా ప్రపంచం అనుకోకుండా ఈ ప్రపంచమే నా కుటుంబం అని ముందుకు సాగుతున్న వై.ఎస్. కుటుంబానికి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

- ఎ.కృపావతి, కపాడిపాలెం, నెల్లూరు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

17న వైఎస్సార్ టీయూసీ భేటీ

అంగన్‌వాడీ సమస్యలపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు 17న పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమ వుతున్నట్లు ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. అనుబంధ యూనియన్లు హాజరుకావాలని కోరారు.

టీడీపీ కంచుకోట బద్దలు!

ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకప్పడు తనకు కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేం పార్టీ అత్యంత దయనీయ స్థితికి దిగజారిపోయింది. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితిలో పడిపోయింది. 2009 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం) వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి వెన్నంటి నిలిచారు. ఆ వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీప్రకటించడంతో జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండాపోయారు. 1983 తరువాత జిల్లాలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన 1983 ఎన్నికల్లో ఉన్న 12 స్థానాల్లో 11 చోట్ల ఆ పార్టీ గెలిచింది. సోంపేట మినహా అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. 1985లో పది స్థానాలు చేజిక్కించుకుంది. కాగా 1989లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీరామారావు వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ జిల్లాలో మాత్రం ఆ పార్టీ ఎనిమిది స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. 1994 ఎన్నికల్లో జిల్లాలో 11(అందులో ఒకటి టీడీపీ అనుబంధ సభ్యుడు) స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 1999 ఎన్నికల్లో కూడా టీడీపీ 11 స్థానాలు గెలుచుకుంది. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో జిల్లాలో టీడీపీ తిరోగమనం ప్రారంభమైంది. 

ఆ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ ప్రత్యర్థి పార్టీ కంటే తక్కువ సీట్లకు పరిమితమైంది. వైఎస్ జనాదారణతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు చోట్ల ఘనవిజయం సాధించగా.. టీడీపీ ఐదు సీట్లకే పరిమితమైంది. కాగా 2009 ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గి 10 స్థానాలు ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో వై.ఎస్. నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ ఒక్క ఇచ్ఛాఫురం నియోజకవర్గంలోనే గెలిచింది. వైఎస్ మరణానంతరం జిల్లా రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే సాయిరాజ్ పునరాలోచనలో పడ్డారు. ప్రజాభీష్టం మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలవాలని నిర్ణయించారు. ఆయన శుక్రవారం జగన్‌ను కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతోనూ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి దృష్ట్యా జగన్ తో కలసి పనిచేస్తానని ప్రకటించారు. దాంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. విధిలేని పరిస్థితుల్లో సాయిరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ ఇక కోలుకోవడం దుర్లభమేనని టీడీపీ శ్రేణులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నాయి.

బాబు, కిరణ్‌ల ఇలాకాలో పరస్పర ‘సహకారం’

డీసీసీబీ చైర్మన్‌గా అమాస, డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్యామరాజు 
21 మంది ఉన్నా డీసీఎంఎస్‌కు నామినేషన్లే వేయని కాంగ్రెస్ 
కాంగ్రెస్ - టీడీపీల మధ్య రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన చీకటి పొత్తు చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల సందర్భంగా మరింత బలపడింది. టీడీపీ సహకారంతో కాంగ్రెస్ చిత్తూరు డీసీసీ బ్యాంకు ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా టీడీపీకి డీసీఎంఎస్ చైర్మన్ పదవితో పాటు పాలకవర్గం మొత్తం అప్పగించేందుకు మార్గం సుగమం చేసింది. 59 సింగిల్ విండోలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 21 గెలవటం ఆ రెండు పార్టీలకు ఆందోళన కలిగించింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన 8 విండోలను డీఫాల్ట్ జాబితాలో చేర్పించిన కాంగ్రెస్ పార్టీ.. నామ్‌కే వాస్తే అన్నట్లుగా టీడీపీకి చెందిన ఒక విండోను కూడా ఇందులో చేర్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు గాలిముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి రెండు పార్టీల మధ్య పదవులు పంచుకునే ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. 

ఇవి ఫలించటంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆమోదంతో డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌కు ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. పెద్ద పంజాణికి చెందిన కాంగ్రెస్ సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి డీసీసీ బ్యాంకు డెరైక్టర్‌గా నామినేషన్ వేయటానికి ప్రతిపాదకుడు తక్కువ పడ్డారు. దీంతో విజయభాస్కర్‌రెడ్డిని కుప్పం నియోజకవర్గం శాంతిపురం సింగిల్ విండో అధ్యక్షుడు శ్యామరాజు ప్రతిపాదించారు. ఏ క్లాస్‌లో 16 డెరైక్టర్ స్థానాలకు రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు అందుబాటులో లేకపోవటంతో 9 కాంగ్రెస్, 3 టీడీపీ పంచుకుని నామినేషన్లు వేయించుకున్నారు. బి క్లాస్‌లోని 5 డెరైక్టర్ స్థానాలకు కాంగ్రెస్ మద్దతుదారులైన ముగ్గురే నామినేషన్ వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత మిగిలిన డెరైక్టర్లను రెండు పార్టీలు ఒక అవగాహనతో కో-ఆప్షన్ పద్ధతిలో నామినేట్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

డీసీఎంఎస్ పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్

టీడీపీతో కుదిరిన రహస్య ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీ డీసీఎంఎస్ పాలకవర్గం ఎన్నికల నుంచి తప్పుకుంది. మొత్తం 10 డెరైక్టర్ పదవులకు రిజర్వేషన్ అభ్యర్థులు అందుబాటులో లేకపోవటంతో టీడీపీ 7 నామినేషన్లు మాత్రమే దాఖలు చేసింది. టీడీపీకి చెందిన శాంతిపురం సింగిల్ విండో అధ్యక్షుడు శ్యామరాజును చైర్మన్ చేయటానికి రంగం సిద్ధం చేసింది. ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ పదవి కూడా టీడీపీకే ఇవ్వటానికి కాంగ్రెస్ సుముఖంగా ఉంది.

రూ. 22 కోట్ల విలువైన పరిశ్రమను రూ. 9.58 కోట్లకే నామాకు ధారాదత్తం చేసిన చంద్రబాబు


నష్టాల్లేని పరిశ్రమను ఖాయిలా తీయించిన చంద్రబాబు ‘పాలసీ’లు
రైతులు, షేర్ హోల్డర్లకు తెలియకుండానే 2002లో అమ్మకానికి
చంద్రబాబు కనుసన్నల్లోనే బిడ్డింగ్ ప్రక్రియ
కలెక్టర్, ఆడిట్ విభాగం అంచనా వేసిన ధరకంటే అతి తక్కువకే నామాకు అప్పగింత
షేర్ హోల్డర్లకు డబ్బులూ ఇవ్వలేదు

 ఒక కుక్కను చంపాలంటే పిచ్చికుక్కగా ముద్రవేయాలనేది సామెత..
ప్రభుత్వరంగ సంస్థలను తన వారికి తెగనమ్మాలంటే వాటిని ఖాయిలా పరిశ్రమలుగా మార్చాలనేది చంద్రబాబు పాలసీ..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్క దానిని కూడా బతకనీయలేదు. వాటిని ఆయన అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్రపూరిత ప్రణాళికలతో ఖాయిలా పరిశ్రమలుగా మార్చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇప్లిమెంటేషన్ సెక్రటేరియట్’ను స్థాపించారు. ప్రతి ప్రభుత్వ పరిశ్రమనీ కారుచౌకగా అనుయాయులకు అప్పగించారు. సొంత హెరిటేజ్ డెయిరీ కోసం ప్రభుత్వ డెయిరీనే నాశనం చేసిన బాబు.. మిగతా ప్రభుత్వరంగ సంస్థలకూ ఇదే గతి పట్టించారు.

ఎగుమతులు లేక రాష్ట్రంలో చక్కెర నిల్వలు పేరుకుపోయి షుగర్ ఫ్యాక్టరీలు తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో.. రెండు లక్షల టన్నుల చక్కెర దిగుమతి చేసుకొని రాష్ట్ర పరిశ్రమలను కోలుకోని విధంగా దెబ్బతీశారు. వస్త్ర పరిశ్రమలపై పన్నులు పెంచి స్పిన్నింగ్ మిల్లులను పెను సంక్షోభంలోకి నెట్టారు. చంద్రబాబు విధానాలతో రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు తీవ్రంగా దెబ్బతిని, నష్టాల ఊబిలోకి కూరుకుపోయాయి. ఆ వెంటనే వాటిపై ఖాయిలా ముద్ర వేసి, తన పని కానిచ్చేశారు. ఇలా నష్టాల సాకుతో 71 సహకార చక్కెర, స్పిన్నింగ్ మిల్లులను దశలవారీగా ప్రైవేటు పరం చేసేందుకు ప్రణాళిక రచించారు. దాదాపు రూ.1,500 కోట్ల విలువ చేసే 20 మిల్లులను కేవలం రూ.300 కోట్లుకు అమ్మేశారు. వీటిలో ఖమ్మం జిల్లాలోని పాలేరు షుగర్స్ కూడా ఒకటి. ఎటువంటి నష్టాలు లేకుండా నడుస్తున్న ఈ పరిశ్రమను ముందుగా ఖాయిలా పడేలా చేశారు. ఆ తర్వాత బిడ్డింగ్ డ్రామాతో బాబుకు సన్నిహితుడైన నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ చేతుల్లో పెట్టారు. రైతులు, షేర్ హోల్డర్లకు, కనీసం సహకార సంఘం సభ్యులకు కూడా చెప్పకుండా ఈ మంత్రాంగమంతా నడిపించేశారు. రూ. 22 కోట్లు విలువైన కర్మాగారాన్ని కేవలం రూ. 9.58 కోట్లకే ధారాదత్తం చేశారు.

రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరీపురం, అమ్మగూడెం గ్రామాల మధ్య 1976లో పాలేరు చక్కెర కర్మాగారాన్ని నిర్మించారు. 1984లో ఇక్కడ చక్కెర ఉత్పత్తి మొదలైంది. ఈ కర్మాగారంలో 84 శాతం ప్రభుత్వ వాటా కాగా, 16 శాతం రైతుల వాటా ఉంది. అప్పట్లో ఒక్కొక్క షేర్ రూ.500 చొప్పున మూడు వేల మంది రైతులు 4,600 షేర్లు కొనుగోలు చేశారు. 2002 డిసెంబర్‌లో ఈ పరిశ్రమను నామా నాగేశ్వరరావుకు అప్పగించే సమయానికి ఈ షేర్ల విలువ రూ.3 కోట్లు. ఎటువంటి లాభ నష్టాలు లేకుండా నడుస్తున్న ఈ పరిశ్రమ చంద్రబాబు ఆర్థిక విధానాల పుణ్యమా అని నష్టాల్లోకి వెళ్లింది. తొలిసారిగా రూ.2 కోట్ల రన్నింగ్ నష్టం వచ్చింది. ఇదే కారణాన్ని చూపి చంద్రబాబు 2002లో కంపెనీని అమ్మకానికి పెట్టారు. ఈ విషయం ముందుగా రైతులకు, షేర్ హోల్డర్లకు తెలియజేయలేదు. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వమే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.సుబ్రమణ్యం చైర్మన్‌గా ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసింది.

‘పాలేరు షుగర్స్‌ను నమ్ముకొని ప్రత్యక్షంగా 8 వేల మంది రైతులు, 3 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వం కొద్దిగా చేయూతనందిస్తే ఈ పరిశ్రమ అన్ని సమస్యలను అధిగమించి, మెరుగైన లాభాలను ఆర్జిస్తుంది’ అని ఈ కమిటీ సిఫారసు చేసింది. చంద్రబాబు ఈ సూచనలను పట్టించుకోలేదు. కనీసం స్థానిక సహకార సంఘం అనుమతి కూడా తీసుకోకుండా 280 నుంచి 328 వరకు సర్వే నంబర్లలో ఉన్న 134. 23 గుంటల భూమితో పాటు, యంత్రాల విక్రయానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 134 ఎకరాల భూమి విలువ రూ.9.40 కోట్లు, యంత్రాలు, ఇతర వస్తువుల విలువ రూ.12 కోట్లు, మొత్తం రూ.21.40 కోట్లుగా అప్పటి జిల్లా కలెక్టర్ లెక్కించారు. జిల్లా సహకార సంఘం ఆడిట్ విభాగం దీని విలువ రూ.22 కోట్లుగా అంచనా వేసింది. ఇక బిడ్డింగ్ వ్యవహారమంతా చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచింది.

ఎవరు బిడ్ వేయాలి, ఎంత సొమ్ము కోట్ చేయాలి, డమ్మీలుగా ఎవరు బిడ్ వేయాలో ముందే నిర్ణయమైంది. ఈ పథకం ప్రకారం నామా నాగేశ్వర్‌రావు రూ.9,58,88,888కు బిడ్ వేయగా, పి.వెంకటేశ్వర్లు రూ.7,77,15,000కు బిడ్ వేశారు. ఇతను డమ్మీ అభ్యర్థి అని అందరూ చెబుతుంటారు. మరో విశేషం ఏమిటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, చంద్రబాబు సన్నిహితుడు గోకరాజు రంగరాజుకు ఒక రకంగా ఖమ్మం జిల్లా ముఖ్య వ్యాపార కేంద్రం. ఆయన వ్యాపారమంతా ఇక్కడే ఉంది. అలాంటిది గోకరాజు పాలేర్ షుగర్స్ కోసం కనీసం బిడ్ కూడా వేయలేదు. దీనినిబట్టి చూస్తే పథకం ప్రకారమే అంతా జరిగిందన్న విషయం బోధపడుతుంది. 2002 డిసెంబర్‌లో పరిశ్రమ నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ సంస్థ పరమైంది. అప్పటికి పరిశ్రమలో 30 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయి. వీటి విలువే రూ.2.10 కోట్లు ఉంటుందని అంచనా. రైతుల షేర్ల విలువ రూ.3 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వంగానీ, నామా నాగేశ్వర్‌రావు గానీ రైతులకు చెల్లించలేదు. ఈ విధంగా జిల్లా కలెక్టర్ అంచనా వేసిన విలువ (21.40 కోట్లు)కన్నా, జిల్లా సహకార సంఘం ఆడిట్ విభాగం అంచనా (22 కోట్లు)కన్నా అతి తక్కువ ధర (రూ.9.58 కోట్లు)కే పాలేరు షుగర్స్ ఫ్యాక్టరీ నామా వశమైంది. ప్రస్తుతం ఆ కర్మాగారం రోజుకు 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, క్రషింగ్ సామర్థ్యంతో పనిచేస్తోంది.

బాబు సంతర్పణలు మరికొన్ని..

రూ.35 కోట్లు విలువచేసే నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును కేవలం రూ. 12.33 కోట్లకే చంద్రబాబుకు సన్నిహితుడైన సి.ఎం.రమేష్‌కు చెందిన రిత్విక్ ఎంటర్ ప్రైజెస్‌కు కట్టబెట్టారు. రూ.6 కోట్ల విలువైన గురజాల చక్కెరమిల్లు, రూ.30 కోట్లు పలికే ఇంకొల్లు నూలు మిల్లును కలిపి కేవలం రూ.9.86 కోట్లకే నూజివీడు సీడ్స్‌కు ఇచ్చేశారు. ఈ సంస్థ టీడీపీతో సన్నిహితంగా మెలుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని ఏకంగా అప్పటి హోం మంత్రి దేవేందర్‌గౌడ్ తమ్ముడు అశోక్ గౌడ్ కొన్నారు. ఇవే కాకుండా నిజాం షుగర్స్, పాలకొల్లు, నంద్యాల, హిందూపురం చక్కెర మిల్లులు, అదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లును కూడా చంద్రబాబు పరివారగణానికి కారుచౌకగా ధారాదత్తం చేశారు.

అక్రమాలపై చర్యలేవీ: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

 నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ, ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అక్రమాలపై కోర్టులు జోక్యం చేసుకొనేంతవరకు చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కే యాదవరెడి ్డ, కేఆర్ ఆమోస్ విమర్శించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా నిజాం షుగర్స్‌ను, రూ.కోట్ల విలువైన ఆస్తులను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారని, ఇందులో అప్పటి మంత్రులు, అధికారులకు కూడా సంబంధముందని ఆరోపించారు. సభాసంఘం సిఫార్సులను అమలు చేయకపోవడానికి కారణాలేమిటో బయటకు రావాలన్నారు. నిజాం షుగర్స్‌ను కొనుగోలు చేసిన వ్యక్తులకు అధికారంలో ఉన్న వారితో బంధుత్వాలు ఉన్న కారణంగానే కమిటీ సిఫార్సులను పట్టించుకోవడం లేద ని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

తప్పుడు అప్పులు చూపారు: కేటీఆర్

నిజాం షుగర్స్‌కు తప్పుడు అప్పులు చూపించి అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తక్కువ ధరకు అమ్మేశారని టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు కె.తారక రామారావు  ఆరోపించారు. ఈ అమ్మకం అతిపెద్ద ఆర్థిక అవకతవకలతో కూడుకున్నదని శాసనసభా కమిటీ తప్పుపట్టిందని, హైకోర్టు కూడా మందలించిందన్నారు. చంద్రబాబుతోపాటు అప్పటి ఆర్థిక, పరిశ్రమలు, చక్కెర శాఖామంత్రులు ఈ ఆర్థిక నేరానికి బాధ్యులని శాసనసభా కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అనంతరం వైఎస్, రోశయ్య, కిరణ్ సీఎంలుగా ఉన్నా చర్యలు తీసుకోకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ల్యాంకో, జీఎంఆర్ విద్యుత్ సంస్థల నుంచి కరెంట్‌ను ఎక్కువ ధరకు కొనడం తో ప్రజలపై రూ.2 వేల కోట్ల భారం పడిందన్నారు. ల్యాంకో, జీఎంఆర్ నుంచి డబ్బు రికవరీ చేయకుంటే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. 

వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తా

చంచల్‌గూడ జైల్లో జగన్‌తో ప్రత్యేక ములాఖత్

 తెలుగుదేశం అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోందని, దీనిపై తాను తీవ్రంగా కలత చెందానని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే పిరాయి సాయిరాజ్ చెప్పారు. పార్టీలో సమస్యలు పరిష్కరించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. చంచల్‌గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి టీడీపీ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. తన రాజకీయగురువు ఎర్రన్నాయుడు అకాలమరణంతో పార్టీలో తన పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. రాజకీయాల నుంచి వైదొలగుదామని నిశ్చయించుకున్న తరుణంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏవిధంగా లాభం చేకూర్చాయో గుర్తొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రజాసేవకే పూనుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తనది కాదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతానన్నారు. జగన్‌ను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సాయిరాజ్ వెంట నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తోపాటు శ్రీకాకుళం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ పద్మప్రియ కృష్ణదాస్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు ఉన్నారు. 

ప్రజలను మోసగిస్తున్న బాబు: అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో స్పష్టం చేయాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు అన్నారు. తన కుమారుడు, టీడీపీ నేత కలమట వెంకటరమణతో కలిసి శుక్రవారం చంచల్‌గూడ జైల్లో జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై 2008లో కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. వైఎస్ మృతి తర్వాత ఆయన పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందన్నారు. 

విజయమ్మను కలిసిన సాయిరాజ్

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్ శుక్రవారమిక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కలమట వెంకటరమణమూర్తి, మోహన్‌రావు విజయమ్మతో భేటీ అయ్యారు. వీరి వెంట ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, సుజయకృష్ణ రంగారావు, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు దర్మాన పద్మప్రియ ఉన్నారు. మరోవైపు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఆంజనేయరాజు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనను వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంజనేయరాజుతో పాటు పలువురు నేతలు పార్టీలో చేరారు. వీరి వెంట పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులున్నారు.



పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేని టీడీపీ సస్పెండ్ చేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నశ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం శాసనసభ్యుడు పిరియా సాయిరాజ్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున సాయిరాజ్‌పై ఈ చర్యతీసుకున్నట్టు పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ మీడియాకు పంపిన ఎస్సెమ్మెస్‌లో తెలిపారు. సాయిరాజ్‌తో పాటు శుక్రవారం జగన్‌ను కలుసుకున్న శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకట రమణను కూడా సస్పెండ్ చేసినట్లు ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభకు 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎన్నికకాగా, ఇప్పటివరకూ 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ప్రస్తుతం శాసనసభలో టీడీపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ తరఫున ఉన్న ఏకైక శాసనసభ్యుడైన సాయిరాజ్ కూడా పార్టీని వీడటంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచి టీడీపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 

అగస్టా కుంభకోణంలో ఎమ్మార్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర

అగస్టా కుంభకోణంలో ఎమ్మార్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర పోషించారు
ఆ సంస్థతో మొదటి నుంచీ లింకులున్నది ఎవరికి?
హెలికాప్టర్ల కుంభకోణానికీ వైఎస్ కుటుంబాన్ని ముడిపెడతారా?
స్కాంపై కాంగ్రెస్‌ను ప్రశ్నించకుండా వైఎస్ కుటుంబానికి అంటగడతారా? 
కాంగ్రెస్ సర్కారును మోస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ యత్నం 
బాబు కొన్న బెల్-430 కాప్టరే వైఎస్ ప్రాణాలు బలిగొందని రేవంత్ గమనించాలి 

 ‘‘అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఎమ్మార్ సంస్థకు చెందిన ఒక వ్యక్తి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం వెలువడుతోంది. ఎమ్మార్ అనే సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది ఎవరు? ఆ సంస్థతో ఒప్పందం కోసం దుబాయి వెళ్లి 3 రోజులు పర్యటించిదెవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మార్‌కు హైదరాబాద్ నడిబొడ్డున 535 ఎకరాలు పప్పుబెల్లంలా కట్టబెట్టింది ఎవరు? వీటన్నింటికీ చంద్రబాబు తాబేదార్లు సమాధానం చెప్పాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిని ధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ పరిశీలిస్తే హెలికాప్టర్ల కుంభకోణంలో కూడా చంద్రబాబు నిష్ణాతులుగా వెల్లడవుతోందన్నారు. వైఎస్‌ను బలిగొన్న బెల్-430 హెలికాప్టర్ క్రాష్ అవటానికి చంద్రబాబు హస్తం కూడా ఉన్నట్లుందని గట్టు అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ మరణంపై నెలకొన్న అనుమానాలపై చంద్రబాబు నోరు మెదపకపోవటం కూడా అందులో భాగమేనా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి బాగోతాల గురిం చి మాట్లాడితే రోజుల తరబడి చెప్పినా తరగనిదని, ఆయనపై కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలు ముద్రించిందని గుర్తుచేశారు. గట్టు రామచంద్రరావు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి సంఘటనతోనూ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి సంబంధం అంటగట్టి బురద చల్లకపోతే చంద్రబాబు, ఆయన తాబేదార్లకు నిద్రపట్టేట్లులేదని ఎద్దేవా చేశారు. 

పైశాచిక ఆనందానికి పరాకాష్ట... : వైఎస్ కుటుంబాన్ని విమర్శించకపోతే తాము బతికి బట్టకట్టే పరిస్థితిలేదనే భయం వారిలో నెలకొన్నట్లుందని గట్టు వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పెద్దల హస్తంతో జరిగిన హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వైఎస్ కుటుంబ ప్రమేయం ఉందని పేర్కొన టం టీడీపీ పైశాచికానందానికి నిదర్శనమని మండిపడ్డారు. అగస్టా హెలికాప్టర్ కొనుగోళ్లలో భాగంగా బయటపడ్డ అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినది కూడా ఉన్నట్లయితే విచారణ జరిపించాలన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన అవకతలపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ప్రశ్నించకపోగా.. దాన్ని వైఎస్ కుటుంబానికి అంటగట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరమన్నారు. ప్రజలను కష్టాల పాలుచేస్తున్న కాంగ్రె స్ ప్రభుత్వాన్ని తన భుజాలపై మోస్తున్నందు వల్లే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు, ఆయ న తాబేదార్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని గట్టు విమర్శించారు. 

బెల్-430 కొన్నది బాబే కదా! : దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ప్రాణాలను బలిగొన్న హెలికాప్టర్‌పై టీడీపీ నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన పలు అనుమానాలు లేవనెత్తారు. ‘‘అవినీతితో కొనుగోలు చేసిన హెలికాప్టర్ వల్లే రాజశేఖరరెడ్డి మరణించారని రేవంత్ చెప్తున్నారు! అయితే బెల్-430 హెలికాప్టర్ కొనుగోలు చేసింది చంద్రబాబే అనే విషయాన్ని ఆయన గుర్తుచేసుకోవాలి. ప్రమాదం జరిగిన ఆ హెలికాప్టర్ కొనుగోలులో చంద్రబాబు ఏమేర అవినీతికి పాల్పడ్డారో ప్రభుత్వం విచారణ చేపట్టాలి. రేవంత్ సైతం వారి పార్టీ అధినేతకు వత్తాసు పలకకుండా ఇదే డిమాండ్ చేయాలి. అగస్టా హెలికాప్టర్ ఎగరటానికి పనికి రాకపోతే.. చంద్రబాబు కొనుగోలు చేసిన బెల్-430 ప్రాణాలు బలిగొందనే విషయాన్ని ఆయన గమనించాలి’’ అని గట్టు పేర్కొన్నారు. 

బాబుకు ప్రజలు విధించిన శిక్ష...: వ్యవస్థలను మేనేజ్ చేసి శిక్షలు తప్పించుకున్న చంద్రబాబుకు ప్రజాకోర్టు విధించిన శిక్షను అనుభవిస్తున్నారని గట్టు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను నరకంలోకి నెట్టినందుకే వారు విధించిన శిక్షను నేడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. ‘బిల్‌క్లింటన్, టోని బ్లేయర్‌లతో కలిసి టీ తాగాను, ప్రపంచంలో చక్రం తిప్పానంటూ చెప్పుకున్న చంద్రబాబును ఒక్క తోపు తోస్తే దేశంలో వచ్చి పడ్డారు. ఫోన్‌ల ద్వారా దేశ ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేసిందే తానే అంటూ చెప్పుకున్నారు. అక్కడ ఒక్క తోపు తోస్తే రాష్ట్రంలో పడ్డారు. ఇక్కడ ప్రజలు లాగికొడితే నడివీధిలో పడ్డారు’ అని గట్టు ఎద్దేవా చేశారు. వీధుల వెంట తిరుగుతున్న చంద్రబాబు ప్రజలకు తన తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పకుండా వైఎస్ పాలనలో ఇచ్చినవన్నీ తానూ అందిస్తానని చెప్పుకోవటాన్ని బట్టే ఆయన పరిపాలన ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలకు చంద్రబాబు పట్ల విశ్వసనీయత, మాటమీద నిలబడే మనస్తత్వం లేనందు వల్లే ఆయన్ని నమ్మడంలేదన్నారు. టీడీపీ నమ్ముకున్న పార్టీ నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు సైతం ఆ పార్టీని వదిలి వెళ్లటం.. బాబుపై నమ్మకం లేకపోవటం వల్లనేనని తేటతెల్లమవుతోందన్నారు.

పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన

పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన
పెరిగిన ధరలతో బతుకు భారంగా మారిందని కన్నీళ్లు..
వైఎస్సార్ పోయాక తమను పట్టించుకున్న వాళ్లే లేరని మండిపాటు
రోజుకు రెండు గంటలే కరెంటా? ఇదెక్కడి న్యాయం?: షర్మిల
చంద్రబాబు గారూ.. ప్రజల గోడు మీకు వినిపిస్తోందా?
ఇప్పటికైనా ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దించండి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 67, కిలోమీటర్లు: 972.4

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఆఖరి వాన కురిసి ఐదు నెలలు దాటింది.. పంటల సంగతి దేవుడెరుగు.. ఊళ్లలో మనుషులు తాగడానికి.. అడవి మీద పశువులు తాగడానికి కూడా నీళ్లు లేవు.. రోజుకు రెండు గంటలకు మించి కరెంటు రాదు. మోటారు నుంచి నీళ్లు దునికి మడికి పారకముందే మళ్లీ కరెంటు పోతది.. పొద్దంతా కష్టం చేసి ఇంటికి పోయి పడుకుందామంటే దోమల మోత.. వైఎస్సార్ పోయిన తరువాత మా బతుకంతా చీకట్లే’’ అని ముకుందాపురం గ్రామానికి చెందిన రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘మా మహిళా సంఘం తరఫున బ్యాంకు నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాం. మూడేళ్ల నుంచి అప్పు కడుతున్నాం. ఇంకా రూ.1.66 లక్షల అప్పుంది. నెల నెలా వడ్డీ కట్టించుకుంటున్నారు. పావలా వడ్డీ అని చెప్తున్నారు కానీ రూ.3 వడ్డీ దాకా లెక్కొస్తోంది..’’ ముకుందాపురం గ్రామానికే చెందిన నాగమణి గోడు వెళ్లబోసుకుంది.

‘‘అక్కా పరీక్షలు దగ్గర పడ్డాయి. చదువుకుందామంటే రాత్రి కరెంటు ఉండటం లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంటు ఇంత వరకు రాలేదు. ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని యాజమాన్యం చెప్తోంది. అమ్మ వాళ్లను ఫీజు అడిగితే.. చూస్తున్నావుగా బిడ్డా పంట చేతికి రాలేదు. ఫీజు ఎట్టా కట్టాలే అంటున్నారు. భయం వేస్తోందక్కా..’’ అని నిడమనూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చంద్రకళ కళ్లనీళ్లు పెట్టుకుంది.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాగింది. నిడమనూరు, ముకుందాపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండల్లో రాములమ్మ, నాగమణి, చంద్రకళ ఇలా తమ గోడు చెప్పుకొన్నారు. వీరే కాదు.. పాదయాత్రలో రోజూ ఏ పల్లెకు వెళ్లి పలకరించినా ఇవే కష్టాలు! ఎవరిని కదిలించినా.. ఇవే కన్నీళ్లు. ఏ రైతు ముఖం మీదా చిరునవ్వు లేదు. ఏ మహిళ నోటి నుంచీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న మాట లేదు. నిడమనూరు, ముకుందాపురం గ్రామాల్లో జరిగిన రచ్చబండల్లోనూ ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెరిగిన ధరలతో తమకు బతుకే భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు విన్న షర్మిల.. జనాన్ని గాలికొదిలేసిన పాలకులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండి పడ్డారు. రోజుకు రెండు గంటలే కరెంటు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబూ మీకు వినిపిస్తోందా?

‘‘చంద్రబాబు గారూ.. వీళ్ల మాటలు మీకు వినిపిస్తున్నాయా? ప్రజల కన్నీళ్లు మీకు కనిపిస్తున్నాయా? ఇక ఆపండి.. పాదయాత్రల పేరుతో మీరు చేస్తున్న డ్రామాలు ఆపండి. మీరు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని అంటున్నారు. ఈ ప్రజల అవసరాలు మీకు కనిపించడం లేదా? మీకు ప్రజల మీద ప్రేమ కంటే కుర్చీ మీద మమకారమే ఎక్కువ. అందుకే అవిశ్వాసం పెట్టకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓటేసేముందు గుర్తుంచుకోవాలంటూ పాదయాత్ర డ్రామాలాడుతున్నారు. మీరు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మీపై కేసులు పెట్టదు.. విచారణ జరపదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

ఇది బాబు పాలనే..

రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి వేస్తే రైతన్న కష్టం పోనూ క్వింటాల్‌కు రూ. 5 వేల ఖర్చు వస్తోంది. కానీ మార్కెట్‌లో పత్తి మద్దతు ధర రూ. 3,900కు మించలేదు. తరుగు, దళారుల మోసం తీసేస్తే రైతన్న చేతికి వస్తుంది కేవలం రూ. 2,500లే. అప్పుల బాధలు పడలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క పత్తి రైతులే కాదు.. టమాటా, మిర్చి.. వరి సాగు చేసే ప్రతి రైతూ కన్నీళ్లు పెడుతున్నారు. రైతులు పంటలు చేతికి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యారు. ఆదుకునే నాథుడు లేకఅల్లాడిపోతున్నారు. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు పెంచారు. రైతు మద్దతు ధరనేమో దించారు. ఇవే కష్టాలు, కన్నీళ్లను చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో చూశాం.. ఆయన హయాంలో దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు పాలనను తలపిస్తోంది. ఇది చంద్రబాబు నాయుడి పాలన రెండో భాగం.’’

వైఎస్ హయాంలో రూ.12 వేల కోట్ల రుణమాఫీ..

ఇప్పుడైతే రైతులకు కూడా కరెంటు బిల్లులు ఇస్తున్నారు. ఆ బిల్లులు కట్టకపోతే మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకు పోతున్నారు. అమ్మా ఇదెక్కడి అన్యాయం అంటున్నారు రైతులు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే రూ.1,300 కోట్ల విద్యుత్తు బకాయిలను రద్దు చేశారు. 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని మాటిచ్చి.. ఇచ్చి చూపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉంటే ఈ రోజు విద్యుత్తు చార్జీలు పెరిగేవే కాదు. వైఎస్ విత్తనాల ధరలను దించారు.. ఎరువుల ధరలు పెరగనివ్వలేదు. మద్దతు ధర కల్పించారు. వైఎస్సార్ రైతులను గౌరవించారు.. ప్రేమించారు.. అందుకే రైతన్నలు బాగుపడాలని రూ. 12 వేల కోట్ల రుణాలనుమాఫీ చేశారు. కానీ ఇప్పుడున్న ఆ సర్కారుకు పెద్దమనసు లేదు. మహిళలైతే తమ పిల్లలను స్కూల్‌కు పంపించకుండా తమ వెంట పనులకు తీసుకొని పోతున్నారు. ఎందుకక్కా అని అడిగితే ‘కూలికి తీసుకొని పోతే కూలి డబ్బులు వస్తాయి కదమ్మా.. కనీసం రెండు పూటలైనా తింటాం’ అని చెప్తున్నారు. ‘ఒక రోజంతా కూలి చేస్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి. నెల రోజులు కష్టం చేస్తే 3,000 రూపాయలు వస్తాయి.. పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలకు ఈ డబ్బులు ఎలా సరిపోతాయమ్మా.. మేం ఎలా బతకాలమ్మా’ అని అంటున్నారు.

విద్యార్థులు చదువులు నిలిపేస్తున్నారు..

పేదోళ్లు పెద్ద చదువులు చదవాలని, ప్రతి ఇంటి నుంచి డాక్టరో.. ఇంజనీరో.. కలెక్టర్ లాంటి పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఆయన ఉన్నంత కాలం విద్యార్థుల ఫీజులను ఆయనే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఏం చేశారు? విద్యార్థి ఫీజులో రెండు వాటాలు తల్లిదండ్రులు భరిస్తే... ఒక వాటా మేం ఇస్తామని విద్యార్థులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు మధ్యలోనే నిలిపేస్తున్నారు.’’

‘మరో ప్రజాప్రస్థానం’ 67వ రోజు శుక్రవారం నల్లగొండ జిల్లా అలీనగర్ గ్రామ శివారు నుంచి షర్మిల యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటేశ్వర నగర్, నిడమనూరు, నర్సింహుల గూడెం, బీకే తాండా, బొక్కముంతలపాడు గ్రామాల మీదుగా ముకుందాపురం చేరుకున్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 14.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 972.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, గట్టు శ్రీకాంత్, బాలమణెమ్మ, స్థానిక నాయకులు బండారు మోహన్‌రెడ్డి, గాదె నిరంజన్, విరిగినేని అంజయ్య, ఇరిగి సునీల్ కుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, సూరపల్లి సత్యకుమారి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ - టీడీపీ చెట్టాపట్టాల్.. పరస్పరం మద్దతు

చిత్తూరులో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 
నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ వ్యూహం
గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఉద్దేశపూర్వకంగా అధికారుల జాప్యం
సమయం ముగిసిందంటూ నామినేషన్లు తిరస్కరించిన ఎన్నికల అధికారి 
అధికారి తీరుపై నిరసనకు దిగిన మద్దతుదారులు, వైఎస్సార్ సీపీ నేతల అరెస్ట్ 
కృష్ణాలో టీడీపీకి షాక్... డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ 
వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ - టీడీపీ చెట్టాపట్టాల్.. పరస్పరం మద్దతు
జిల్లాల్లో డీసీసీబీ ఎన్నికలకు జోరుగా నామినేషన్లు 


సాక్షి నెట్‌వర్క్: చిత్తూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల పరంపర జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికలకు నామినేషన్ల సమయంలోనూ కొనసాగింది. పీలేరు, కాయంపేట సహకార సంఘాలకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్.. డీసీసీబీ విషయంలోనూ ఇదే దౌర్జన్యం కొనసాగించింది. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని.. టీడీపీ సహకారంతో డీసీసీ బ్యాంకు చైర్మన్ పదవిని ఏకగ్రీవం చేసుకుంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలతోపాటు, 20 మంది సింగిల్ విండో అధ్యక్షులను అరెస్టు చేయించింది. నామినేషన్ల తీరును పరిశీలించేందుకు ప్రయత్నించిన విలేకరులను అధికారులు లోనికి అనుమతించలేదు. 

క్యూలోనే వాగ్వాదం... 

డీసీసీబీ, సీడీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్ పాలక వర్గాల ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన జరిగింది. డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి ఉదయం సీడీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్‌ల వద్ద పరిశీలన చేసి నేరుగా డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సీడీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయాల వద్ద నామినేషన్ల ప్రక్రియ ఒకింత ప్రశాంతంగానే సాగినప్పటికీ.. డీసీసీబీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 12 గంటల దాకా రాహుకాలం ఉండటంతో అభ్యర్థులు క్యూలో నిల్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, వైస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. డీసీసీబీలోకి మీడియాను అనుమతించేందుకు అధికారులు సమ్మతించలేదు. పోలీసులు ప్రధాన గేటు వద్దే మీడియాను అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేయటంతో ఫొటో జర్నలిస్టులను మాత్రం అనుమతించారు. 

సమయం ముగిసిందంటూ తిరస్కరణ: క్యూలో ముందు వరుసలో నిల్చున్న కాంగ్రెస్, టీడీపీ మద్దతుదారుల నామినేషన్ల దాఖలులో ఉద్దేశపూర్వకంగానే తీవ్ర జాప్యం చేశారు. దీంతో వారు మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు క్యూలో ఉన్న అభ్యర్థులందరి నామినేషన్లు స్వీకరించాల్సిన ఎన్నికల అధికారి సమయం ముగిసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల నామినేషన్లను స్వీకరించలేదు. కాంగ్రెస్ అనుకూలురు 9 మంది, టీడీపీ అనుకూలురు నలుగురు నామినేషన్లను స్వీకరించిన అధికారులు.. పరిశీలనలో రెండు పార్టీల మద్దతుదారుల్లో ఒక్కో అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌కు 8, టీడీపీకి 3 డెరైక్టర్ పదవులు దక్కాయి. రెండోసారి డీసీసీబీ అధ్యక్షుడిగా అమాస పదవి చేపట్టడం ఖాయమైపోయింది.

వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ - టీడీపీ చెట్టపట్టాల్ 

వైఎస్సార్ జిల్లా సహకార ఎన్నికల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ డెరైక్టర్ల స్థానాలకు నామినేషన్ల సమయంలో కాంగ్రెస్, టీడీపీలు పరస్పరం సహకారం అందించుకున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారుడు పల్లేటి మోహన్‌రెడ్డిని టీడీపీ మద్దతుదారుడు జగదీశ్‌కుమార్‌రెడ్డి బలపరచటం గమనార్హం. డీసీఎంఎస్ డెరైక్టర్ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ మద్దతుదారుడు జగదీశ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, కమలమ్మలతో పాటు ముఖ్య నేతలు అంతా హాజరయ్యారు. డీసీసీబీకి ‘ఎ’ గ్రూప్‌లో 16 డెరైక్టర్ స్థానాలకు గాను కేవలం 10 డెరైక్టర్ స్థానాలకే నామినేషన్లు స్వీకరించారు. 

మిగతా 6 డెరైక్టర్ స్థానాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు లేకపోవటంతో నామినేషన్లను స్వీకరించలేదు. ఈ పది డెరైక్టర్ స్థానాలకు సంబంధించి 11 నామినేషన్లు దాఖ లయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు ఆరు, కాంగ్రెస్ మద్దతుదారులు 4, టీడీపీ మద్దతుదారులు 1 చొప్పున నామినేషన్లు వేశారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఎమ్మెల్యే వీరశివారెడ్డి కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డిలు డీసీసీబీ చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. బి క్లాస్ సంఘాలకు సంబంధించి ఐదు డెరైక్టర్ స్థానాలు ఉండగా, ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో కేవలం నాలుగు స్థానాలకే నామినేషన్లను స్వీకరించారు. రెండు బీసీ డెరైక్టర్ స్థానాలకు 14 మంది, ఓసీ స్థానానికి నలుగురు, ఎస్సీ స్థానానికి ముగ్గురు నామినేషన్లను దాఖలు చేశారు. 

జోరుగా నామినేషన్ల దాఖలు... 

శ్రీకాకుళం డీసీసీబీలో ఎ కేటగిరిలో 12 డెరైక్టర్ పదవులు ఏకగ్రీవం కాగా.. బి కేటగిరిలో ఐదు డెరైక్టర్ పోస్టులకు గాను ఎస్సీ, ఎస్టీ, ఓసీ స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. రెండు బీసీ స్థానాలకు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ జిల్లాల్లో డీసీసీబీలకు శుక్రవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో వరంగల్ 33, ఖమ్మం 43, కరీంనగర్ 43, మెదక్ 24, రంగారెడ్డి 25, మహబూబ్‌నగర్ 25, నల్లగొండ 40, నిజామాబాద్ 43, ఆదిలాబాద్ 21, విశాఖ 15, పశ్చిమగోదావరి 62, తూర్పుగోదావరి 65, కర్నూలు 27 నామినేషన్లు దాఖలయ్యాయి.

నెల్లూరులో 15 స్థానాలకు సింగిల్ నామినేషన్లు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సహకార సంఘం లో 21 డెరైక్టర్ స్థానాలు ఉండగా 15 స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జిల్లా మార్కెటింగ్ సహకార సంఘానికి 10 స్థానాలు ఉండ గా ఆరింటికి సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. 

వైఎస్సార్ సీపీ నేతల అరెస్ట్

చిత్తూరు డీసీసీబీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ సవ్యంగా సాగటం లేదన్న సమాచారంతో వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్కడకు చేరుకున్నారు. నామినేషన్ల తీరుపై ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ఆయన్ను పోలీసులు ప్రధాన గేటు వద్దే నిలిపేశారు. ఆయనతోపాటు 20 మంది వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన సింగిల్ విండో అధ్యక్షులు సహా పార్టీ నేతలను అరెస్ట్ చేసి గుడిపాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చెవిరెడ్డి అరెస్ట్ అరుున మరుక్షణమే నామినేషన్లు వేసేందుకు వెళ్లిన ఓ సింగిల్ విండో అధ్యక్షుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే యత్నం చేశారు. అతన్ని జీపులోకి ఎక్కించటంతో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన అభ్యర్థులు పోలీసులపై మండిపడ్డారు. కార్యాలయం ముందు బైఠాయించారు. ఎన్నికల అధికారి వనజ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని.. కలెక్టర్ వచ్చి ఎన్నికల తీరును పరిశీలించాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్తూరు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఈడ్పుగంటి నామినేషన్ తిరస్కరణ 

సహకార ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. కేడీసీసీబీ చైర్మన్ పదవికి తమ అభ్యర్థిగా టీడీపీ ముందే ప్రకటించిన ఈడ్పుగంటి వెంకట్రామయ్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. ముదినేపల్లిలో రామచంద్ర ఫైనాన్సర్ పేరుతో లెసైన్స్‌డ్ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న ఆయన.. 1964 సహకార చట్టంలోని 21-ఎ నిబంధన ప్రకారం ఎన్నికల్లో పోటీకి అనర్హుడని ఎన్నికల అధికారిణి చిత్రపు శైలజ ప్రకటించారు. వెంకట్రామయ్య నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని ముందునుంచే ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ నాయకులంతా బ్యాంకులో మకాం వేసి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ, కార్యదర్శి బచ్చుల అర్జునుడు సంప్రదింపుల్లో మునిగిపోయారు. రాత్రి 8 గంటల వరకు ఈడ్పుగంటి నామినేషన్ పరిశీలన ప్రక్రియ సాగింది. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు న్యాయవాదితో సహా లోపలకు వెళ్లి చర్చలు జరిపారు. అయినా ఈడ్పుగంటి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. తమను లోపలకు ఎందుకు అనుమతించరంటూ కాంగ్రెస్ పార్టీ డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావు వాగ్వాదానికి దిగారు. టీడీపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ బ్యాంకు ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈడ్పుగంటి నామినేషన్ తిరస్కరణకు గురవటంతో ఖంగుతిన్న టీడీపీ నేతలు యెర్నేని లక్ష్మణప్రసాద్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. కేడీసీసీబీకి 43 నామినేషన్లు దాఖలు కాగా ఒకటి తిరస్కరించారు. 

మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా...

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం త్రిపురారం మండల కేంద్రం, మిర్యాలగూడ మండలాలలో సాగుతుంది. 

మిర్యాలగూడ మండలం లోని తుంగపాడు, శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్ మీదుగా పట్టణానికి చేరుకుంటుంది. అనంతరం పట్టణంలోని రాజీవ్‌చౌరస్తా వద్ద బహిరంగ సభ ఉంటుంది. పట్టణంలో షర్మిల రాత్రి బస చేస్తారు.

'రూ.20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి’

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

సింగరేణి మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. మృతుల కుటుంబాల్లో ఒకరు చొప్పున ఉద్యోగ భద్రత కల్పించాలని వైఎస్సార్ రాష్ట్ర టీయూసీ అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన విమర్శించారు. కార్మికుల భద్రతపై యాజమాన్యాలు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని జనక్‌ప్రసాద్ కోరారు.

ముగిసిన షర్మిల 67వ రోజు పాదయాత్ర

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం 67వ రోజు పాదయాత్ర ముకుందాపురంలో ముగిసింది. శుక్రవారం రోజున షర్మిల 14.8 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు 972.4 కి.మీ పాటు పాదయాత్రలో షర్మిల నడిచారు. శుక్రవారం రాత్రి ముకుందాపురం సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.

'గుంటూరులో 18 నుంచి షర్మిల పాదయాత్ర'

ఫిబ్రవరి 18వ తేది నుంచి గుంటూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని 'మరో ప్రజాప్రస్థానం' సమన్వయ కర్త తలశిల రఘురాం తెలిపారు. 18 సాయంత్రం గురజాల నియోజకవర్గంలోకి షర్మిల పాదయాత్ర ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో 270 కి.మీ షర్మిల నడవనున్నారని ఆయన వెల్లడించారు.

Sharmila's Padayatra on 66th day

YS Sharmila's Rachabanda in Gouraram, Nalgonda

YSRCP Leader Gattu Ramachandra rao press meet in YSRCP office

చంద్రబాబుకు పిచ్చి ముదిరింది: గట్టు

అధికారం లేక చంద్రబాబుకు పిచ్చి ముదిరిపోయిందని వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గట్టు మాట్లాడుతూ..చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలపై మండిపడ్డారు. 

బాబు బూతులు ప్రచారం చేయడానికి చెంబు బ్యాచ్ తయారైందని గట్టు అన్నారు. చెంబు బ్యాచ్ అబద్దాలకు ఎల్లోబ్యాచ్ వంతపాడుతోందని గట్టు విమర్శించారు. హెలికాప్టర్ల కుంభకోణానికి, వైఎస్‌కు ముడిపెట్టడం దారుణమని గట్టు అన్నారు. వైఎస్ ప్రయాణించిన బెల్ 430 హెలికాప్టర్ కొన్నది చంద్రబాబేనని గట్టు మీడియాకు తెలిపారు. 

హెలికాప్టర్ కూలిపోయిందంటే అవినీతి జరిగినట్టేనా అని గట్టు ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరపమని రేవంత్‌రెడ్డి కోరతారా గట్టు అన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి.. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని గట్టు రామచంద్రరావు తెలిపారు.

special edition on nalgonda gunde sadi 15th feb

టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో తాను కలత చెందినట్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిసిన అనంతరం చంల్ గూడా జైలు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ గురువు ఎర్రన్నాయుడు అకాల మృతిలో తనకు ఇబ్బందులు ఎదరయ్యాయన్నారు. ఆయన తరువాత జిల్లాలో సమస్యలు పరిష్కరించేవారు లేరన్నారు. విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. ఆ పరిస్థితులలో రాజకీయాల నుంచి తప్పుకుందామని అనుకున్నానని చెప్పారు. అయితే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తానని జగన్మోహన రెడ్డి ముందుకు వచ్చారన్నారు. అందువల్ల ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీ పరంగా తనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వెంట నడుస్తానని చెప్పారు.

జగన్ ను కలిసి తమ జిల్లాలో సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో చర్చించానన్నారు. ప్యాకేజీకి అమ్ముడు పోయినట్లు వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. తన గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. తాను అటువంటివాడిని కాదన్నారు. ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాలలోకి వచ్చినట్లు తెలిపారు. రాజకీయాలలో యువతను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సాయిరాజ్ తోపాటు మాజీ ఎమ్మెల్యే కె.మోహనరావు, టిడిపి ఇచ్ఛాపురం ఇన్ ఛార్జి వెంకటరమణలు ..

Sharmila rachabanda in Nidamanuru

నల్గొండ: చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఆయనకు పట్టిన గతే పడుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల హెచ్చరించారు. నిడమానూరులో ఆమె రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు కూడా విద్యుత్ చార్జీలు పెంచి రైతులను ఇబ్బంది పెట్టారు. మోటార్లు లాక్కొచ్చి రైతులను జైల్లో పెట్టారు. అందుకే చంద్రబాబును రైతులు ఇంటికి పంపారు. మళ్లీ ఇప్పుడు కిరణ్ సర్కార్ కూడా రైతులను కష్టపెడుతోందన్నారు.

బాబుకు ఈ ప్రభుత్వాన్ని దించే బలముంది. అయినా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నారని విమర్శించారు. మీ వద్దకు వస్తే చంద్రబాబును నిలదీయండని ఆమె ప్రజలకు పిలుపు ఇచ్చారు. విద్యుత్ లేక పరిశ్రమలు మూతబడుతున్నాయన్నారు. జగన్ సీఎం అయితే రైతుల కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు.

Tdp MLA sairaj meets Jagan

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్ ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. ఆయన తోపాటు మాజీ ఎమ్మెల్యే కె.మోహనరావు, టిడిపి ఇచ్ఛాపురం ఇన్ ఛార్జి వెంకటరమణలు కూడా జగన్ ను కలిశారు. ఈ ముగ్గురితోపాటు వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో సాయిరాజ్ ఒక్కరే తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు

TDP MLA Pedia Sairaj To Meet Jagan In Jail

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ ఉదయం హాలియా శివారు నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ఈరోజు హాలియా, నిడమనూరు మండలాల్లో కొనసాగనుంది. హాలియా మండల పరిధిలోని అలీనగర్‌తో పాటు నిడమనూరు మండల పరిధిలోని వెంకటాద్రినగర్, నిడమనూరు, నర్సింహులగూడెం, బొక్కముంతలపాడు, ముకుందాపురంలలో సాగుతుంది. షర్మిల ముకుందాపురం సమీపంలో ఈ రాత్రికి బస చేస్తారు.

వైఎస్ఆర్ సీపీలో చేరనున్న స్వామినాయుడు

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రావు సస్పెన్షన్‌కు నిరసనగా టీడీపీ జిల్లా కార్యనిర్వాహాక కార్యదర్శి తుమ్మల వీరాస్వామినాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు.

టిడిపి నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి ప్రముఖుల వలసలు


ఒకపక్క టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానని సంతోషపడుతుంటే, మరో పక్క టిడిపి నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి ప్రముఖుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ తోపాటు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు,ఆయన కుమారుడు వెంకటరమణ కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి చేరుతుండడం ఆ పార్టీకి కొంత షాక్ గానే చెప్పాలి. సాయిరాజ్ తొలిసారి ఎమ్మెల్యే అయితే,కలమట మోహన్ రావు ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.ఆయన కొంతకాలం కాంగ్రెస్ లో కూడా ఉన్నారు.కాగా విశాఖ జిల్లా భీమునిపట్నం టిడిపి ఇన్ ఛార్జీ ఆంజనేయరాజు కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.సాయిరాజ్, మోహన్ రావు, వెంకటరమణలు హైదరాబాద్ వచ్చి జగన్ ను జైలులో కలిసి , ఆ తర్వాత విజయమ్మ సమక్షంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించవచ్చని చెబుతున్నారు.శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్ అవుతారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20130215_6.php

బాబును రక్షిస్తోంది కాంగ్రెస్ సర్కారే .బాబు ‘షుగర్’కు సర్కారు మందేదీ?

చర్యలు తీసుకోకపోవడంపై రాష్ర్ట ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు

సభాసంఘం చెప్పిందిదీ...

నిజాం షుగర్స్‌ను బాబు కారుచౌకగా అమ్మి ఖజానాకు నష్టం కలిగించారు.. ఆయన సర్కారులోని ముగ్గురు మంత్రులు మోసానికి పాల్పడ్డారు
స్విస్ చాలెంజింగ్ పద్ధతే పెద్ద గోల్‌మాల్ 
ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్, కేబినెట్ కుమ్మక్కయ్యాయి
అడ్వొకేట్ జనరల్ సలహానూ పట్టించుకోలేదు
కేబినెట్ సబ్‌కమిటీ భేటీలో తప్పుడు లెక్కలు చెప్పిన బాబు
.............................
అయినా సభా సంఘాలు తప్పుపట్టలేదంటూ ఇప్పుడు చంద్రబాబు ఉపన్యాసాలు

బాబును రక్షిస్తోంది కాంగ్రెస్ సర్కారే 

 ‘‘నేనేదో అక్రమాలు చేశానంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సభా సంఘాలు వేసింది... ఏ సభాసంఘమూ నన్ను తప్పుపట్టలేదు’’ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఊరూరా ఉపన్యాసాలు దంచుతున్నారు.. ఆయన అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు యథాశక్తిగా సాయం చేస్తోంది. బాబు హయాంలో జోరుగా సాగిన అవినీతిపై సభా సంఘాలు ఇచ్చిన నివేదికల గుట్టుమట్లు విప్పేందుకు, చర్యలు తీసుకునేందుకు అది ఏ మాత్రం ఆసక్తిని కనబరచడంలేదు. హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెడుతున్నా దానిలో చలనం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారంపై ఏర్పాటైన శాసనసభా సంఘం నివేదికపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు 2012 జూలైలో ఆదేశాలు జారీ చేసింది. కానీ సర్కారు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో పిటిషనర్లు మళ్లీ హైకోర్టు గడపెక్కగా... ‘గడువు’ పేరుతో కేసు నాన్చివేతకు ప్రయత్నించిన సర్కారుకు చీవాట్లు కూడా పెట్టింది. మూడువారాల్లోగా సభాసంఘం నివేదికపై నిర్ణయం తీసుకోవాలని తాజాగా ఆదేశించింది. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సభాసంఘం వేసింది. దర్యాప్తు అనంతరం ఆ సభా సంఘ ఇచ్చిన నివేదిక పేర్కొన్న అంశాలను చూస్తే.. బాబును తప్పు బట్టిందో లేదో తేలిగ్గా అర్థమౌతుంది.

నిజాం షుగర్స్ యూనిట్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసేందుకు అనుసరించిన ‘స్విస్ చాలెంజింగ్ పద్ధతే’ పెద్ద గోల్‌మాల్ వ్యవహారం. ఆస్తులను అమ్మటానికి ప్రైవేట్ వ్యక్తులతో చర్చలు జరపడమనేది ప్రపంచంలో ఇంకెక్కడా జరగని వ్యవహారమని బాబు నిత్యం కొలిచే ప్రపంచ బ్యాంకు అధికారులే చెప్పారు. పెపైచ్చు ఈ పద్ధతిలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి మంత్రివర్గం అనుమతి కూడా లేదు. ఈ పద్ధతి అనుసరించి ప్రభుత్వం మోసానికి పాల్పడింది. (నివేదికలోని 204 పేజీలో..)

నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల అమ్మకం విషయంలో అడ్వొకేట్ జనరల్, ప్రపంచ బ్యాంకు సలహాలను మంత్రివర్గ ఉపసంఘం పెడచెవిన పెట్టింది. (పేజీ 74లో)

మంత్రివర్గ సబ్‌కమిటీలోని యనమల (అప్పటి ఆర్థికమంత్రి), ఇ. పెద్దిరెడ్డి (చక్కెరశాఖ మంత్రి), కె. విద్యాధరరావు(పరిశ్రమలశాఖ మంత్రి) ముగ్గురూ ఈ మోసానికి ప్రధాన కారకులు. (పేజీ 204లో)

ప్రైవేట్ వ్యక్తులతో ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్, మంత్రివర్గ ఉపసంఘం కుమ్మక్కవడం కారణంగా ప్రభుత్వానికి రూ.300 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. (పేజీ 204లో)

నిజాం షుగర్స్‌కి ప్రభుత్వం రూ. 173 కోట్లు సాయం చేసిందంటూ 2000 సెప్టెంబర్‌లో నాటి సీఎం చంద్రబాబు అసెంబ్లీకి తప్పుడు సమాచారమిచ్చారు. నిజానికి అదేమీ సహాయం కాదు. వివిధ కార్పొరేషన్ల నుంచి నిజాం షుగర్స్ తీసుకున్న రుణాలవి. వాటిలో 2000 సెప్టెంబర్ నాటికి రూ. 127 కోట్లు తిరిగి చెల్లించేశారు. మిగిలిన రూ. 46 కోట్లు కూడా తర్వాత చెల్లించారు. (పేజీ 206, 207లో..)

2001 ఆగస్టు 1న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనూ కంపెనీకి రాష్ట్రప్రభుత్వ సాయం గురించి చంద్రబాబు తప్పుడు లెక్కలు వినిపించారు. (పేజీ 208లో..)

అమ్మకానికి పెట్టిన నిజాం షుగర్స్ ఆస్తుల్లో కొన్నింటికి అతి తక్కువ విలువ కట్టారు. కొన్నింటికి అసలు విలువే కట్టలేదు. అలా ప్రస్తావించని ఆస్తుల విలువ రూ. 40 కోట్లు. దీంతో కొనుగోలుదారులు ఈ నాలుగు యూనిట్లకు చాలా తక్కువ బిడ్లు దాఖలు చేశారు. (పేజీ 210లో..)

సీజన్ ప్రారంభంలోనే (2002 జనవరి 1న) ఫ్యాక్టరీలను అప్పగించేశారు. దాంతో కొనుగోలుదారుడు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకపోయింది. ఉద్యోగులపై ఖర్చు, వడ్డీ నామమాత్రమే. ఏ ఇతర షుగర్ ఫ్యాక్టరీతో పోల్చినా ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు లేదా మినహాయింపులు కూడా ధారాళంగా అందజేసింది. వీటిలో ఆస్తుల బదిలీపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు, కొనుగోలు, అమ్మకపు పన్నులో ఏడేళ్లపాటు రాయితీ, కొత్త డిస్టిలరీల స్థాపనకు లెసైన్స్ ఫీజు మినహాయింపు వంటివి అనేకం. (పేజీ 213లో..)

నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను బాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు, భారీ నష్టానికి అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తరువాత, ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న సమయంలో 2003 నవంబర్ 14న. సేల్‌డీడ్ 2004 ఫిబ్రవరి 25న, 2004 మే20న రిజస్టరయ్యాయి. కొత్త ప్రభుత్వం కొద్దిరోజుల్లో రానుండగా చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా ఈ తంతు పూర్తి చేసింది. అదనపు భూమికి సంబంధించిన సేల్‌డీడ్స్ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక జరిగినప్పటికీ తీగలాగితే డొంక కదులుతుందన్న భయంతో నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ(పీఈడీ) పన్వర్ ఈ విషయాన్ని కొత్త ప్రభుత్వానికి తెలియకుండానే భూమి బదిలీ జరిగిపోయింది. (పేజీ 214లో..)

అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ రాసిన లేఖకు 2002 మే 3న జవాబు రాస్తూ నాటి ఆర్థిక మంత్రి యనమల ‘అదనపు ఆస్తులలోని 101 ఎకరాలకు డీపీఎం రూ. 10 కోట్లను చెల్లిస్తోంది’ అంటూ అబద్ధమాడారు. నిజానికి డీపీఎం చెల్లించింది రూ. 6. 16 కోట్లే. (పేజీ 215లో..)

అమ్మింది ఆపద్ధర్మ సీఎం హోదాలో...

నిజాం షుగర్స్‌కు చెందిన నాలుగు యూనిట్లను శాసనసభ రద్దయిన తర్వాత 2003 నవంబరు 14న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అస్మదీయులకు కట్టబెట్టేశారు. ఇందులో ఒకటైన పాలేరు షుగర్ ఫ్యాక్టరీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (టీడీపీ)కి ఇచ్చారు.

సభా సంఘం చెప్పిందిదీ...

దీనిపై ప్రతిపక్ష నేత హోదాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చాక సభా సంఘం వేశారు. 2004 ఆగష్టు నుంచి 2006 ఆగష్టు వరకు... రెండేళ్లు విచారణ జరిపిన సభాసంఘం ఈ అమ్మకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 300 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చింది. ఉపసంఘంలోని ముగ్గురు మంత్రులు మోసం చేశారని పేర్కొంది.

బాబు చెప్పుకుంటోంది...

నేనేదో అక్రమాలు చేశానని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సభాసంఘాలు వేసింది. ఏ సభాసంఘమూ నన్ను తప్పుపట్టలేదు. నాపై అనేక విచారణలు కూడా చేశారు. ఏమీ రుజువు చేయలేకపోయారు. నేనే తప్పూ చేయలేదు కాబట్టే వారేం చేయలేకపోయారు.

కోర్టు ఆగ్రహం

సభాసంఘం సిఫారసులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ 2012లో కొందరు హైకోర్టుకు వెళ్లారు. దాంతో నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సర్కారులో కదలిక లేదు. దాంతో పిటిషనర్లు మళ్లీ కోర్టు తలుపు తట్టారు. ఎందుకీ జాప్యమంటూ హైకోర్టు బుధవారం (ఫిబ్రవరి 13, 2013) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

కాపాడుతోంది ఎవరు?

అంటే ఎవరు ఎవరిని కాపాడుతున్నారు. ఎందుకు? ఏ చీకటి ఒప్పందాలు, తెరచాటు పొత్తులు పనిచేస్తున్నాయి? విపక్షాన్ని ఇరుకునపెట్టేందుకు తమ చేతిలో అస్త్రం (సభాసంఘం సిఫారసులు... చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం) సిద్ధంగా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? 

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి?

 కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్.వి. సుబ్బారెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. త్వరలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో ‘ములాఖత్’లో కలుసుకోనున్నారు. ఎస్.వి. సుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే రాయలసీమలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ అని ఆ పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె భూమా శోభానాగిరెడ్డి, ఆమె భర్త, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా శోభ 2009లో పిఆర్‌పి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనందున శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డిని పార్టీలో అందరూ ‘పెద్దాయన’గా పిలిచే వారు. అదేవిధంగా ఎస్.వి. సుబ్బారెడ్డికి కూడా జిల్లాలో ‘పెద్దాయన’గా గుర్తింపు ఉంది. గతంలో కోట్ల విజయభాస్కర రెడ్డిపై పోటీ చేసేందుకు సమవుజ్జీ ఎవరూ లేరని భావించిన టిడిపి నాయకత్వం సుబ్బారెడ్డిని పోటీకి దింపింది. కాగా వైఎస్ హయాంలో ఎస్‌వి టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.
కర్నూలు లోక్‌సభకు..!
ఇలాఉండగా త్వరలో ఎస్.వి. సుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలియగానే, కర్నూలు లోక్‌సభకు ఆయనను పోటీకి దించే అవకాశాలూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్నూలు లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, టిడిపి తరఫున మాజీ ఎంపి కె.ఇ. కృష్ణమూర్తి పోటీ చేస్తారు కాబట్టి వారిని ఎదుర్కొవాలంటే ఎస్‌వితోనే సాధ్యమని నాయకులు అంటున్నారు


http://www.andhrabhoomi.net/content/ysr-congress-1

అభయమిచ్చే మనిషివి నువ్వన్నా... అంతిమ విజయం నీదేనన్నా..!

జగనన్నా!
నువ్వెంత ఎదిగినా అంత ఒద్దికగా ఉంటావు.
సిరిసంపదలు నీకెన్ని వున్నా...
నిరుపేదలకెప్పుడూ ఆపద్బాంధవుడివై ఉంటావు.
ఇచ్చిన మాటపై నిలిచావు.
కొండంత ఓదార్పు నిచ్చావు.
జనంకోసం దీక్షలు చేశావు.
రైతన్న కోసం నిరసనలు చేశావు.
అందుకేగా ఈ కాంగ్రెస్ నిన్ను...
జనానికి దూరం చేసింది!
ప్రజాప్రతినిధివైన నిన్ను జైల్లో నిర్బంధించింది!
ఇంతకాలం గడచినా ఇంకా రిమాండులోనే ఉంచింది!
ప్రజాస్వామ్యం మనదని మరచిపోయిందేమో! 
జగనన్నా!
అభయమిచ్చే మనిషివి నువ్వన్నా.
ఎవరి భయం నీకు లేనేలేదన్నా.
త్వరలోనే విడుదలౌతావు. జనం మధ్యకు వస్తావు.
ప్రజాకోర్టులో విజయం పొందుతావు
జననేతవై సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తావు.
- దుర్గం ఉమ, తిరుపతి

సీబీఐ వాదన అన్యాయంగా ఉంది!
జగన్‌గారిపై పెట్టిన అక్రమ కేసులు, వాటి స్వభావం, పక్షపాతం, పర్యవసానం అధికార ప్రతిపక్ష పార్టీల అనుకూల ఓటర్లకు సైతం కొంతమేరకు తెలియవచ్చినదిగా జూన్‌నాటి ఉప ఎన్నికలు తేటతెల్లం చేశాయి. పై కేసులు పెట్టుబడులకు సంబంధించినవి. పెట్టుబడులు వేరు, లంచాలు వేరు. లంచాలపై లాభాలు తిరిగిరావు కాని, పెట్టుబడులపై లాభాలు తిరిగి తీసుకోవచ్చు. అయితే చర్చాకార్యక్రమాల్లో ప్రతినిధులు ఈ వాదనను వినిపించుట లేదు. జగన్‌గారి బెయిల్ విషయంలో 1. క్యాబినెట్ నిర్ణయాల ప్రకారం భూములు కేటాయించినట్లు అప్పటి సమాచార మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రిగారి పత్రికా సమావేశ వివరాలు పత్రికల్లో, టీవీ చానెళ్లలో రికార్డయి ఉన్నాయి. కోర్టులో వాటిని సాక్ష్యాలుగా చూపి జగన్ తప్పులేదని, అవి క్యాబినెట్ నిర్ణయాలు తప్ప జగన్‌వి కావని వాదించాలి. 2. జగన్‌గారి అకౌంట్స్, టాక్స్ రిటర్న్స్ ప్రతి యేడూ పరిశీలిస్తున్నవే. ఏమైనా తప్పులు జరిగి ఉంటే అప్పుడే నోటీసులు ఇచ్చి విచారించేవారు. సీబీఐవారికి అనుమానాలుంటే ఇన్‌కమ్‌టాక్స్‌వారిని విచారించాలి. అలా కాకుండా విచారణ కీలక దశలో ఉంది, బెయిల్ ఇవ్వొద్దు, జగన్ జైల్లోనే ఉండాలని కోరటం సమంజసం కాదు. 3. చంద్రబాబుకి సంబంధించిన కేసులో తగినంత సిబ్బంది లేని కారణంగా విచారణ చేయని సీబీఐ వారికి ప్రస్తుతం అదే సిబ్బందితో జగన్ కేసు విచారణ జరిపిస్తే ఉద్దేశపూర్వక జాప్యం జరగదని గ్యారెంటీ ఏమిటి? సీబీఐవారు తమ అవసరం, అనుకూలతల కోసం జగన్‌గారికి ఎక్కువకాలం బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది. అలా అడ్డుకోవటం సమ్మతం కాదనే వాదనను కోర్టులో బలంగా వినిపించాలి. సీబీఐవారి అనుకూలత ఇతరులకు శాపం కాకూడదు. ఈ మూడు విషయాలను గౌరవనీయులైన న్యాయమూర్తులు గమనించాలని న్యాయాన్ని కోరుకునే ఒక పౌరుడిగా నేను కోరుతున్నాను. 
- ఎం.వేణుగోపాలరావు, కర్నూలు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, 
బంజారాహిల్స్, హైద్రాబాద్-34. 
e-mail: ysjagankosam@gmail.com

Popular Posts

Topics :