27 November 2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

21 Jagan loyalists to vote against Congress government

Written By ysrcongress on Saturday, December 3, 2011 | 12/03/2011


As many as 21 legislators loyal toYSR Congress party chief YS Jaganmohan Reddywill vote against the Congress government during the no-confidence motion in the assembly.

The legislators including 19 of the ruling Congress party attended a meeting with Jaganmohan Reddy at his residence here to chalk out the party's strategy on the no-confidence motion moved by main opposition Telugu Desam Party (TDP).

After the meeting, legislator P Subhash Chandra Bose told reporters that they would abide by Jagan's decision on the issue.

"It does not matter who moves the no-confidence motion because it is to defeat anti-farmers government," he said dropping hints that they would vote against the government and were ready to face the consequences of violating party whip. Jagan will hold another meeting with his loyalists Sunday to take the final decision.

A total of 23 legislators attended the meeting but two of them left midway, reportedly opposing Jagan's decision to vote against the government.

As many as 29 legislators including 26 belonging to Congress party had submitted their resignations to assembly speaker in August protesting the Central Bureau of Investigation (CBI) move to include late chief minister Y.S. Rajasekhara Reddy's name in the FIR registered in the case relating to Jagan's assets.

Some Congress legislators have since returned to the party fold while the speaker has accepted the resignation of a Jagan loyalist belonging to the TDP.

Meanwhile, the assembly Saturday took up the no-confidence motion moved by TDP. A total of 76 legislators stood up in support of the motion. The members of the Telangana Rashtra Samiti (TRS), the Bharatiya Janata Party (BJP) and the Communist Party of India (CPI) staged a walk out.

TRS, which has moved a separate no-confidence motion, is demanding the TDP and Jagan group support it.

The house will take up debate on the TDP's motion Sunday while the voting is likely on Monday, the last day of the winter session.

Congress, which has 153 members in 295-member assembly, claims that there is no threat to the government as it enjoyed support of the Praja Rajyam Party (PRP), which has 18 members.

Majlis-e-Ittehadul Muslimeen (MIM), an ally of Congress with seven members, is also likely to vote against the motion.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం

Written By ysrcongress on Friday, December 2, 2011 | 12/02/2011

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం మామిళ్లపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ... విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడే అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను లోబరుచుకోవటానికి ఈ ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసానికి తమ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలతో అయినా రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలుగుతుందన్నారు.


విలువలు, విశ్వాసం అంటే అర్థం తెలియని పార్టీలు కాంగ్రెస్, టీడీపీలేనని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానంలో నిజాయితీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు, రైతులపై ప్రేమతో అవిశ్వాసం ప్రవేశపెట్టలేదని, రైతుల కోసమైతే ఆరు నెలల క్రితమే అవిశ్వాసం పెట్టేవారని అన్నారు.

ఫీజుల కోసం పిల్లలు అల్లాడిపోయినా అవిశ్వాసం ఊసెత్తని బాబు, సర్కార్ ను ఇంటికి పంపించే సమయం వచ్చినా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం పడిపోదనే నమ్మకం వచ్చాకే బాబు అవిశ్వాసం అంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు కుమ్మక్కైనందునే ప్రభుత్వంలో ధీమా కనిపిస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ బయల్దేరనున్నారు.

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు మూడు రోజులు పాటు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. పొన్నూరు మండలం కట్టెంపూడిలో శుక్రవారం ఆయన తన యాత్రను ముగించనున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి జిల్లాలో ఓదార్పు యాత్ర పునప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానంపై వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలతో చర్చించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ బయల్దేరనున్నారు.

11 రోజులలో అంధులు లేకుండా చేయవచ్చు-YSR CONGRESS IT WING

Written By news on Thursday, December 1, 2011 | 12/01/2011

మేం అవిశ్వాసానికి మద్దతిస్తాం


వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ
బాబు పెట్టే అవిశ్వాస తీర్మానం వెనుక కుతంత్రాలున్నాయి
ఆయన, కాంగ్రెస్ కలిసి నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారు
అయినా సరే... రైతన్నకు అండగా నిలిచేందుకు
మేం అవిశ్వాసానికి మద్దతిస్తాం
నా వెంట నడిచే ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌వాళ్లు ప్రలోభపెడుతున్నారు
లేదంటే బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వెనుక రాజకీయ కుతంత్రాలు ఉన్నప్పటికీ.. రైతన్నలకు అండగా నిలిచేందుకు, వారి కష్టాలను ఢిల్లీ దాకా వినిపించేందుకు తాము ఆ తీర్మానానికి మద్దతు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్ర 32వ రోజు బుధవారం ఆయన కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు, ముట్లూరులలో జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో చిత్తశుద్ధి లేనప్పటికీ.. మేం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ తీర్మానాన్ని బలపరుస్తాం. నాతో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎంత మంది తగ్గిపోయినా.. నాతో నడిచే.. నాతో ప్రయాణం చేసే ప్రతి ఎమ్మెల్యే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసేవారే నాతో ప్రయాణం చేస్తారు. కష్టాలతో పోరాడుతున్న రైతన్నకు మద్దతుగా నిలిచేందుకు ప్రతి ఎమ్మెల్యే బై ఎలక్షన్లకు సైతం సిద్ధంగా ఉంటారు’ అని జగన్ ఉద్ఘాటించారు. ప్రసంగాల సారాంశమిదీ..

రైతన్న పరిస్థితి అధ్వానం

ఇవాళ రైతన్నకు మద్దతు ధరలేదు. పండించిన పంట అమ్ముదామంటే మార్కెట్లో బస్తా ధాన్యం ధర రూ.700 మించి రావట్లేదు. పంట కోయాలంటేనే రైతు భయపడుతున్నాడు. రైతు కూలీకి రోజుకు రూ.100 కూడా రాని దుస్థితి. అంత ఇవ్వలేని పరిస్థితి రైతుది. పొగాకు, పసుపు, పత్తి రైతులదీ ఇదే దయనీయ స్థితి. వారి కష్టాలు చూస్తుంటే ఎంతో బాధేస్తోంది. ఇటు ఇల్లు కట్టలేక, ఆరోగ్యం సరిగా అందక పేదవాడు, చదువుకొనే పిల్లాడు, చదివించే తల్లిదండ్రులు.. అందరూ కూడా ఆ మహానేతే ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు కదా అనుకుంటున్నారు. వారు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే.. ఈ రాష్ట్ర పాలకులు, చంద్రబాబు మాత్రం వారిని గాలికొదిలేసి.. దివంగత మహానేతను ఎలా అప్రదిష్టపాలు చేయాలా అని ఆలోచిస్తున్నారు. నీచ రాజకీయాలు చేస్తున్నారు.

చంద్రబాబు ఉద్దేశం అదే

రాజకీయాలు ఎంత దిగజారిపోయాయంటే.. ఇవాళ చంద్రబాబు నాయుడుగారు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతాం అంటున్నారు. ఇన్ని రోజులూ అవిశ్వాసం పెట్టని ఆయన.. ఇవాళ ఇలా మాట్లాడ్డానికి కారణం.. రైతుల మీద ఆప్యాయతో, పేదవాడి మీద ప్రేమో కాదు. ఇవాళ కాంగ్రెస్, చంద్రబాబూ ఏకమై.. జగన్ తరఫు ఎమ్మెల్యేలను ఇబ్బందులపాలు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు ఆలోచనలన్నీ రాజకీయంగానే ఉంటా యి. కారణమేదైనా కానీయండి.. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తే డిస్‌క్వాలిఫై అయిపోయి తమ పదవులు పోయి బై ఎలక్షన్లు వచ్చే పరిస్థితి ఉందని నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలకు తెలుసు. అయినప్పటికీ ఇవాళ రైతన్నకు తోడుగా ఉండేందుకు బై ఎలక్షన్లకూ వారు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా మాలో విశ్వసనీయత ఉంది. నాలో విశ్వసనీయత ఉంది. విలువల కోసం, విశ్వసనీయత కోసం అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నాం.

పేదోడి కష్టాలు ఢిల్లీకి వినిపిస్తాం

ఎమ్మెల్యేలు బై ఎలక్షన్లకు కూడా పోవడానికి సిద్ధంగా ఉండటానికి కారణం... ఇవాళ రైతన్న కష్టాల్లో ఉన్నాడు.. నష్టాల్లో ఉన్నాడు. పేదవాడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. చింతపండు దగ్గర నుంచి గ్యాస్ వరకు ప్రతి ధర ఆకాశాన్ని అంటుతోంది. అవసరమైతే ఉప ఎన్నికల్లో పోటీ చేసి నా రాష్ర్టం ఏ పరిస్థితిలో ఉందో ఢిల్లీ పెద్దలకు చూపిస్తా. మేం రైతులు.. పేదవాడి పక్షాన నిలబడుతాం కాబట్టి మాకు ధైర్యం ఉంది.

దేవుడు చూస్తున్నాడు

ఇవాళ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. నన్ను ఇంకా ఏకాకిని చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్లు.. నా దగ్గర ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలను భయపెట్టో.. ప్రలోభపెట్టో.. తమవైపు లాగేందుకు యత్నిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్, టీడీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాడు.

14 విగ్రహాల ఆవిష్కరణ..

ఓదార్పు యాత్రలో భాగంగా బుధవారం పలు గ్రామాల్లో 14 వైఎస్సార్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. కాకుమాను మండలం వల్లూరులో 4 విగ్రహాలు ఏర్పాటు చేయగా.. ముట్లూరులో మూడిం టిని ఏర్పాటు చేశారు. ముట్లూరులో ప్రజలు నీరాజనాలు పలికారు. మహిళలు ఎదురొచ్చి హారతులిచ్చారు. ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జి.బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి యాత్రలో జగన్ వెంట ఉన్నారు.

అబద్ధపు ఆధారాలతో ‘ఈనాడు’

విజయమ్మ పిటిషన్లో అడిగింది వేరు... రామోజీ చెబుతున్నది వేరు
బాబు ముందస్తుగా సమాచారాన్ని లీక్ చేయడంతోనే రామోజీకి లబ్ధి
బినామీల ద్వారా విలువైన భూములు కారుచౌకగా కొనుగోళ్లు
పాలమాకుల భూముల లావాదేవీలు స్పష్టంగా చెబుతున్న వాస్తవమిది
2006లో సీబీఐ విచారణకు ఆదేశించింది వైఎస్సే
అది కూడా ‘ఈనాడు’ అబద్ధపు రాతల్లో నిజాల్ని నిగ్గు తేల్చేందుకే...
విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాల్లో జరిగిన భూ సేకరణకే పరిమితమైన సీబీఐ విచారణ
అదికూడా 1997 - 1999 మధ్య జరిగిన లావాదేవీలకే
అక్కడ ఎలాంటి అవకతవకలూ జరగలేదని స్పష్టం చేస్తూ నివేదిక
బాబు 5,492 ఎకరాలు కేటాయించడాన్ని తప్పుబట్టిన సీబీఐ
అసలు పాలమాకుల ఊసే లేదు...
కానీ తనకే క్లీన్‌చిట్ వచ్చిందంటూ రామోజీ రంకెలు
{పస్తుత విచారణపై భయంతో... సీబీఐని తప్పుదోవ పట్టించేందుకు ప్రయాస

నిజం నిప్పులాంటిదే! కాకుంటే నిస్సిగ్గుగా దాన్నెలా నీరుగార్చాలో ‘ఈనాడు’ పత్రికాధిపతి రామోజీరావుకు బాగా తెలుసు. వాస్తవాలకు ఎలా పాతరెయ్యాలో... వాటికెలా సమాధి కట్టాలో... అవసరమైతే తనకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని కూడా అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆయనకు చాలా బాగా తెలుసు. మరింత స్పష్టంగా చెప్పాలంటే... ఈ విద్యలన్నీ ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియనే తెలియవు కూడా. తన సొంత పత్రిక ‘ఈనాడు’లో బుధవారం పెద్దపెద్ద అక్షరాలతో ‘‘సీబీఐ నిగ్గుతేల్చిన నిజాన్ని చూడలేరా?’’ అంటూ తనకు తనే క్లీన్‌చిట్ ఇచ్చేసుకుంటూ ఆయన రాసిన రాతల్లోని మర్మం ఇదే. సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించి... దానితో తనకే మాత్రం సంబంధం లేదని చెబుతూ ఆయన తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరిని? ప్రజలనా? తన పాఠకులనా? లేక ఇప్పటికే విచారణ మొదలుపెట్టిన సీబీఐనా? ప్రజలన్నా... ప్రజాస్వామ్య వ్యవస్థలన్నా రామోజీకి ఎంతటి చిన్నచూపో... వాటిని ఏమార్చగలగటంలో తనపై తనకెంత నమ్మకమో బుధవారం నాటి ‘ఈనాడు’ పతాక కథనం ఒక్కటి చూస్తే తెలిసిపోతుంది. లిటిగేషన్లలో తనకెవ్వరూ సాటిరారని ఇన్నాళ్లూ విర్రవీగిన రామోజీ అక్రమాలపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విచారణకు ఆదేశించటంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే తన పని మొదలుపెట్టింది. అక్రమాల తీగను లాగుతుండటంతో డొంక కదులుతుందేమోనని భయపడిన రామోజీ... పత్రికను అడ్డంపెట్టుకుని చేస్తున్న వాదనల్లో నిజానిజాలివిగో...

దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తన ప్రజాహిత వ్యాజ్యంలో రామోజీపై చేసిన ఆరోపణేమిటంటే... శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు, అనుమతులకు సంబంధించిన అధికారిక సమాచారం చంద్రబాబు చలవతో జనానికన్నా ముందుగా రాజ గురువుకే తెలిసిందని. దాన్ని ఉపయోగించుకున్న రామోజీ... అక్కడ వందల ఎకరాల భూముల్ని కొని భారీగా లబ్ధి పొందారని. అంతే తప్ప రామోజీకి అక్కడ భూములున్నాయి కనుక ఆయనకు లబ్ధి చేకూర్చడం కోసం అక్కడ విమానాశ్రయాన్ని ప్రకటించారని కాదు. ఈ తేడాను ‘గుర్తించని’ రామోజీ తప్పుడు వాదనలతో పేజీలకు పేజీలు నింపటమే విచిత్రం.

నిజమే! శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది 1998 డిసెంబర్లోనే. అప్పటిదాకా అటు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరువలోనా... ఇటు శంషాబాద్‌లోనా అంటూ ఊగిసలాడిన చంద్రబాబునాయుడి ప్రభుత్వం చివరకు శంషాబాద్‌వైపే మొగ్గు చూపింది. అంతమాత్రాన దానికి అన్ని అనుమతులూ వచ్చేసి... 1998లోనే పనులు మొదలైపోవటమన్నది జరగలేదు. ఈ స్థలాన్ని అనుకున్నాక కూడా ప్రభుత్వం వివిధ అనుమతుల కోసం ఎదురు చూడక తప్పలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు చాలా ఆలస్యంగా వచ్చాయి. విమాన యాన శాఖ నుంచి 29-5-2000న, పర్యావరణ శాఖ నుంచి 6-3-2003న అనుమతులొచ్చాయి. అంటే అప్పటిదాకా శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఖరారు కానట్లే లెక్క.

రామోజీరావు తన ఉద్యోగుల ద్వారా బినామీ కొనుగోళ్లను మొదలు పెట్టించింది కూడా కేంద్ర విమానయాన శాఖ నుంచి అధికారిక అనుమతి వచ్చిన తర్వాతేనన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఎయిర్‌పోర్టుకు అదే కీలకం. అందుకే శంషాబాద్ విషయంలో కూడా ఆ అనుమతి వచ్చాకే... విమానాశ్రయం పరిధిలోకి వచ్చే గ్రామాలను గుర్తిస్తూ 2001 జులై 31న జీవో ఎంస్ నెంబరు 352ను విడుదల చేసింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (హాడా) పరిధిలోకి వచ్చే గ్రామాల్ని స్పష్టంగా గుర్తించింది.

ఖరారుకు ముందే రామోజీ కొనుగోళ్లు...

2000 మే 29న విమానయాన మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ వచ్చాక విమానాశ్రయం ఏర్పాటు తథ్యమని తేలిపోయింది. అప్పటిదాకా తెరవెనక చక్రం తిప్పిన రామోజీ... అది ఖరారు కావటంతో తన ఉద్యోగుల్ని రంగంలోకి దించారు. ఏయే గ్రామాలు విమానాశ్రయం పరిధిలోకి వస్తున్నాయనే జీవో 2001 జూలై 31న విడుదల కాగా... చంద్రబాబు మనసులో మాట లాంటి రామోజీకి దానికన్నా ముందే ఆ వివరాలన్నీ తెలిసిపోయాయి. ఫలితం... 2001 ఫిబ్రవరిలో రామోజీ బినామీలుగా ఆయన ఉద్యోగులు కొల్లి బాపినీడు చౌదరి, గోగినేని రాజేంద్రబాబు, వోరుగంటి గోవిందరావు, వి.వి.రాఘవేంద్రరావు, ఆర్.సుధాకర్ తదితరులు రంగంలోకి దిగారు. అప్పటికే ‘మై హోమ్ గ్రూప్’ అధిపతి జె.రామేశ్వరరావు తన డెరైక్టర్ల పేరిట, బంధుమిత్రుల పేరిట, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపెనీల పేరిట అప్పటికే అక్కడ భూములు కొనిపెట్టి సిద్ధంగా ఉంచారు. పనిలో పనిగా కొన్ని అసైన్డ్ భూముల్ని కూడా కొనేశారు. దాంతో వారి దగ్గర రామోజీ ఉద్యోగులు కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేశారు. 2001 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉద్యోగుల కొనుగోళ్లు పూర్తయిపోయాయి. నిజానికి తన ఉద్యోగుల్ని రంగంలోకి దింపి... ఒకే ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయాలంటే దానికి ముందస్తు ప్రణాళిక, అమ్మకందార్లతో చర్చించడానికి కొంత సమయం ఇవన్నీ అవసరమవుతాయి. ఎంత లేదన్నా 420 ఎకరాల భూములు కొనుగోలు చేయడానికి... అదికూడా పలువురు ఉద్యోగుల చేత బినామీలుగా కొనిపించడానికి కనీసం ఐదారు నెలల సమయం అవసరం. అంటే కేంద్ర విమానయాన శాఖ నుంచి అనుమతి వచ్చిన తక్షణం రామోజీ రంగంలోకి దిగారన్న మాట.

ఏడాది తిరిగాక రామోజీ కొనుగోళ్లు...
అప్పటికే బినామీలుగా బరిలోకి దిగిన ఉద్యోగులు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనుగోలు చేయడంతో పాటు... భూ వినియోగ మార్పిడికి సంబంధించిన మార్పులన్నీ చేయించేయటంతో రామోజీ స్వయంగా రంగంలోకి దిగారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే ఆ ఉద్యోగులు దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ అవసరాలకు వాడాల్సి ఉన్న భూమిని వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించుకునేలా మార్పులు చేస్తూ అనుమతులిచ్చారన్నది ఇక్కడ ఎవ్వరికైనా తేలిగ్గా అర్థమయ్యే అంశం. రామోజీ గానీ, ఆయన తనయులు గానీ నేరుగా దరఖాస్తు చేస్తే తమ చేతికి మట్టి అంటుకుంటుందనే భయంతో ముందుగా ఉద్యోగుల చేత కొనుగోళ్లు చేయించి, వారి చేత భూ వినియోగ మార్పిడికి అనుమతి కోరుతూ దరఖాస్తులు చేయించారన్నదీ స్పష్టం. తన చేతికి మట్టి అంటకుండా మై హోమ్ గ్రూప్‌తో అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేయించిందీ స్పష్టం. లైన్ క్లియర్ కావటంతో 2002 ఏప్రిల్లో రామోజీరావు, ఆయన తనయులు కిరణ్, సుమన్ నేరుగా రంగంలోకి దిగారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌నూ దించారు. తమ ఉద్యోగుల దగ్గర్నుంచి ఏడాది కిందట వారు ఏ ధరకు కొన్నారో అదే ధర చెల్లిస్తున్నట్లుగా చూపించి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పనిలో పనిగా మధ్యలోని ప్రభుత్వ భూమిని కూడా తమ ఖాతాలో వేసేసుకున్నారు. మొత్తానికీ కంచె వేసేసి, ‘ఎంసీఎఫ్ గార్డెన్స్’ అని బోర్డు పెట్టేశారు.

ఎన్నెన్ని ఉల్లంఘనలో..
ఇదీ... రామోజీ భూముల కథ. ఈ తప్పుడు వ్యవహారమంతా ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చేదాకా లోకానికి తెలియదు. ‘సాక్షి’లో వార్తలు వచ్చిన నేపథ్యంలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ప్రభుత్వ భూముల కబ్జాపై అధికారులు నోటీసులిచ్చారు. మొదట బుకాయించిన రామోజీ... చివరకు ప్రభుత్వ భూములు ఉన్న సంగతి తనకు తెలియదని, కావాలంటే వచ్చి చూసుకుని స్వాధీనం చేసుకోవచ్చని అమాయకత్వం నటించారు. అధికారులు కొంతవరకూ సర్వే చేసి... అక్రమాలు నిజమేనని తేల్చినా ఆ తరువాతి చర్యలు ఎందుకనో ఆగిపోయాయి!! తాజా సీబీఐ విచారణతో ఈ అక్రమాలన్నీ బయటపడతాయనే భయంతోనే... సీబీఐ తనకెప్పుడో క్లీన్‌చిట్ ఇచ్చేసినట్లు రామోజీ తప్పుడు కథనాలు రాస్తున్నారన్న అనుమానాలు ఎవ్వరికైనా రాకమానవు.
మై హోమ్ గ్రూప్ ఎందుకు విక్రయించింది?

కొద్దిరోజుల కిందట రామోజీరావు-పాల్మాకుల కుంభకోణంపై ‘సాక్షి’లో వార్తలు వెలువడ్డప్పుడు పిలవని పేరంటం మాదిరిగా మై హోమ్ గ్రూప్ అధిపతి రామేశ్వరరావు తెరపైకి వచ్చారు. రామోజీ తరఫున వకాల్తా పుచ్చుకుని... ‘‘ఆయన మా నుంచే భూములు కొన్నారు. మా సంస్థలే ఆయనకు భూములు విక్రయించాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి మై హోమ్ గ్రూప్ కాస్త పేరున్న రియల్టీ సంస్థ. తనకు వెంచర్లున్న ప్రతి చోటా అపార్ట్‌మెంట్లు లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి విక్రయించిందే తప్ప కనీసం ఖాళీ స్థలాల్లో వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించిన దాఖలాలే లేవు!

అలాంటిది శంషాబాద్‌లో విమానాశ్రయం వస్తున్న నేపథ్యంలో అక్కడ ముందే... అంటే 1996, 1997 సంవత్సరాల్లోనే భూములు కొన్న ఈ సంస్థ, వాటిని రామోజీ బినామీలకు ఎందుకు విక్రయించేసిందన్నది ఇప్పటికీ ప్రశ్నే. విమానాశ్రయం ఏర్పాటు ఖరారయ్యాక... విమానయాన శాఖ క్లియరెన్స్ కూడా వచ్చాక ఎందుకో ఈ సంస్థ తన భూములన్నీ అమ్మేసింది. దాదాపు ఎకరం రూ.50 వేలు, రూ.లక్ష చొప్పున కొనుగోలు చేసిన ఈ సంస్థ... ఎకరా రూ.4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో రామోజీకి విక్రయించేసింది. నిజానికి విమానాశ్రయం ఖరారుతో అప్పటికే అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆఖరికి రైతుల నుంచి సేకరించిన భూములకు కూడా ప్రభుత్వం ఎకరాకు రూ.4 లక్షలు చెల్లించింది! అదే ధరకు మై హోమ్ గ్రూపు రామోజీ ఉద్యోగులకు ఆ భూములు అమ్మేసిందంటే విచిత్రమే!

ఇంకా చిత్రమేంటంటే మైహోమ్ గ్రూపు సంస్థలు రామోజీ బృందానికి ఎకరా రూ.4-5 లక్షల మధ్య విక్రయించగా... మైహోమ్ డెరైక్టర్లు, రామేశ్వరరావు బంధువులు మాత్రం కారుచౌకగా అప్పగించేశారు. ఒక దశలో జి.వెంకటరావు అనే డెరైక్టరైతే 2001 ఫిబ్రవరిలో ఎకరా లక్ష రూపాయల చొప్పున కొని... ఆరు రోజులు గడిచేసరికి అదే ధరకు రామోజీ ఉద్యోగికి అమ్మేశారు. అసలు ఆరు రోజుల భాగ్యానికి ఆయన స్టాంపు డ్యూటీ కూడా చెల్లించి ఆ భూమి ఎందుకు కొన్నారో, రూపాయి కూడా లాభం లేకున్నా అదే ధరకు ఎందుకు విక్రయించేశారో రామోజీకే తెలియాలి. సీబీఐ విచారణలో ఇవన్నీ బయటికొస్తాయన్న భయం రామోజీకి పెరుగుతోందేమో!!!
-సాక్షి ప్రతినిధి, హైదరాబాద్

ఇదీ... సీబీఐ నివేదిక అసలు కథ

2006 సెప్టెంబరు 25: ‘‘పెద్దలా.. గద్దలా?’’ అంటూ వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఈనాడు’లో పతాక స్థాయి వార్త ప్రచురితమైంది. దానికి నాలుగు పేజీల అనుబంధం కూడా తోడయింది.

2006 సెప్టెంబరు 25: నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రోజు తిరుపతిలో ఉన్నారు. విలేకరులు ఆయన చుట్టూ చేరి ‘ఈనాడు’లో వచ్చిన వార్తను ప్రస్తావించారు. ‘‘దానిపై మేం సీబీఐ విచారణకు ఆదేశిస్తాం. నిజానిజాల్ని నిగ్గుతేల్చమని చెబుతాం’’ అన్నారాయన.

2006 సెప్టెంబరు 28: వైఎస్సార్ తన మాటకు కట్టుబడి సీబీఐ విచారణకు ఆదేశించారు. ‘‘ఔటర్ రింగురోడ్డు, కోకాపేట, మంఖాల్ టౌన్‌షిప్‌లతో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భూ సేకరణలో అక్రమాలేమైనా జరిగాయా? ఆ ప్రాజెక్టుల్ని చేపట్టడం ద్వారా ప్రభుత్వం ఎవరికైనా అయాచితంగా లబ్ధి చేకూర్చిందా?’’ అనే అంశాలపై విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఫలితంగా ‘జీవో నంబరు 240’ విడుదలయింది.

2006 అక్టోబరు 20: సీబీఐ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. 2007 మే 31వ తేదీ వరకు విచారణ కొనసాగింది.

2007 జులై 3: విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, మంఖాల్ టౌన్‌షిప్, కోకాపేట వ్యవహారాలన్నిటిపై విచారణ జరిపిన సీబీఐ... ప్రతి అంశాన్నీ స్వతంత్రంగా విడిగానే పరిశీలించింది. తదనంతరం అన్నిటికీ వేరువేరు నివేదికలు అందజేసింది. ‘ఈనాడు’ రాతలు తప్పుల తడకలని తేల్చింది. భూ సేకరణలో అవకతవకలేవీ జరగలేదని, కాబట్టి కేసును మూసేయవచ్చంటూ సిఫారసు చేసింది.
ఇదండీ.. సంగతి. అంటే ‘ఈనాడు’ రాసిన తప్పుడు కథనాలపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి సీబీఐ విచారణకు ఆదేశిస్తే... రామోజీరావు రాసినట్లుగా అక్కడ అవకతవకలేవీ జరగలేదని సీబీఐ నిర్ధారిస్తే... దాన్నిపుడు రామోజీ తనకు అనుకూలంగా వచ్చిన నివేదికగా ప్రచారం చేసుకుంటున్నారన్నమాట!!!. ఇంతకన్నా ఘోరం ఇంకేదైనా ఉంటుందా? ఇంతకన్నా దిగజారుడుతనం ఎక్కడైనా కనిపిస్తుందా? ఇంతకన్నా బరితెగింపు ఇంకెవరికైనా సాధ్యమవుతుందా?

సీబీఐ నివేదికలోని ఈ పేరా చూడండి...
‘‘విచారణలో భాగంగా 1997 నుంచి 1999 వరకు అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని శంషాబాద్, మక్తా బహదూర్ అలీ, గొల్లపల్లి కుర్ద్, గొల్లపల్లి కలాన్, మామిడిపల్లి, మంఖాల్, శ్రీనగర్ గ్రామాల్లో ఐదెకరాలు, అంతకన్నా పైబడి జరిగిన భూముల క్రయవిక్రయాలన్నిటినీ పరిశీలించాం. మంఖాల్‌లో 30, శ్రీనగర్‌లో 4, చిన్న గొల్లపల్లిలో 4, మక్తా బహదూర్ అలీలో 4, మామిడిపల్లిలో 8 లావాదేవీలు కనిపించాయి. శంషాబాద్‌లో ఒక లావాదేవీ బయటపడింది. మన్నెగూడ, రషీద్‌గూడ, ఖాజాగూడ గ్రామాల్లో ఇలాంటి లావాదేవీలేవీ జరగలేదు. పెపైచ్చు ఈ లావాదేవీలతో ఏ వీఐపీకీ సంబంధం లేదని తేలింది. దీనికి తోడు ఆయా గ్రామాల్లో ఐదెకరాల కన్నా ఎక్కువ భూమిని కలిగి ఉన్న 13 మందిని పిలిచి విచారించాం కూడా. వారికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తేలింది’’

సీబీఐ తన నివేదికలో ఇంత స్పష్టంగా చెబుతున్నా రామోజీ ఎందుకు రంకెలేస్తున్నారు?

ఈ గ్రామాల్లో పాల్మాకుల పేరే లేదు కదా? అక్కడ భూములు కొన్న రామోజీ... తనకే సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చినట్టు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?

ఐదెకరాల కన్నా ఎక్కువ భూమిని కలిగి ఉన్న 13 మందిని పిలిచి విచారించినట్టు సీబీఐ చెబుతోంది. మరి తన పేరిట, తన కుమారుల పేరిట, కంపెనీ పేరిట ఏకంగా 421 ఎకరాలు కలిగి ఉన్న రామోజీని సీబీఐ పిలిచిందా? ఆయన సీబీఐ ఎదుట హాజరయ్యారా? లేనపుడు తనకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చేసినట్లు పేజీలకు పేజీలు ఆ రాతలెందుకు?

సీబీఐ తాను కేవలం 1997 నుంచి 1999 మధ్య జరిగిన వ్యవహారాలనే పరిశీలించినట్లు చెబుతున్నా... ‘‘1999 నుంచి 2006 వరకూ జరిగిన అన్ని వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపింది’’ అంటూ రామోజీ అబద్ధాలెందుకు చెబుతున్నారు?

తాము విచారించిన గ్రామాల్లో వీఐపీలెవరికీ ఐదెకరాలకు మించి భూములు లేవని సీబీఐ చెబుతోంది. అంటే రామోజీ భూములు కొన్న గ్రామాన్ని విచారించలేదనే కదా అర్థం! లేకుంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఈ రాష్ట్రాన్ని అనధికారికంగా శాసిస్తున్న రామోజీ వీఐపీ కాదనా?


బాబు అంత భూమి ఎందుకిచ్చారు?
అసలు శంషాబాద్ విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదని, అయినా ఎందుకు కేటాయించారని వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ప్రశ్నిస్తూనే వచ్చింది. దానికి తగ్గట్టు సీబీఐ తన విచారణలో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ‘‘విమానాశ్రయానికి 3,000 ఎకరాలు సరిపోతాయని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకనో ఆ సిఫారసును పక్కనబెట్టింది. 5,492 ఎకరాల భూమిని కట్టబెట్టింది’’ అని సీబీఐ స్పష్టంగా పేర్కొంది. నిజానికి విమానాశ్రయం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రభుత్వానికి సొంతంగా 3,574 ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు ఆయా గ్రామాల్లో పట్టాదారుల నుంచి 1,918 ఎకరాలను సేకరించింది. వారికి ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామనటంతో వారు ఎదురుతిరిగారు. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి ఎకరాకు రూ.4 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చింది. దీనిక్కూడా కొందరు నిరాకరించారు. ప్రభుత్వం గనక విమానాశ్రయం స్థలాన్ని ప్రభుత్వానికున్న 3,500 ఎకరాలకైనా పరిమితం చేసి... అవసరాల మేరకు భూమిని సేకరించాల్సి వస్తే వారికి ఆ పక్కనే ‘భూమికి భూమి’ కేటాయించి ఉంటే వారిక్కూడా న్యాయం జరిగేదన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. కానీ బాబు ప్రభుత్వం ఎందుకనో దాన్ని పెడచెవిన పెట్టింది.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

వివరాలు..

1-12-2011 గురువారం

వట్టిచెరుకూరు మండలం
* ముట్లూరు నుంచి యాత్ర ప్రారంభం
* కోవెలమూడిలో వైఎస్ విగ్రహావిష్కరణ
* కారంపూడిపాడులో విగ్రహావిష్కరణ

చేబ్రోలు మండలం
* చేబ్రోలులో పర్యటన
* మంచాలలో విగ్రహావిష్కరణ పొన్నూరు మండలం
* బ్రాహ్మణకోడూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* గోళ్ళమూడిపాడులో విగ్రహావిష్కరణ
* మునిపల్లెలో విగ్రహావిష్కరణ
* పచ్చలతాడిపర్రులో విగ్రహావిష్కరణ
* దండమూడిలో విగ్రహావిష్కరణ

రేపు పొన్నూరులో జగన్ బహిరంగసభ



పొన్నూరు(చేబ్రోలు), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్ర గురువారం పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ ఎన్.రూత్‌రాణినివాసంలో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణకోడూరులో మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణతో పొన్నూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం పొన్నూరు సెంటర్‌లో బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. ఓదార్పుయాత్రను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని నాయకులందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.

రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలో ఓదార్పు ముగిసేలా ప్రణాళిక తయారుచేసినట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారమే యాత్ర సాగుతుందని స్పష్టం చేశారు. షెడ్యూల్‌లో లేని గ్రామాలకు చెందిన వారు సహకరించాలని కోరారు. జగన్ తమ గ్రామానికి రావాలని కాన్వాయ్‌ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ కృష్ణా జిల్లా పరిశీలకుడు రావి వెంకటరమణ, నియోజకవర్గ నాయకులు షేక్ యాసిన్, దాసరి నారాయణరావు, ఎస్‌ఎం బాషా, డాక్టర్ ఎన్.రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ ఎన్.రూత్‌రాణి, గేరా సుబ్బయ్య, జాఫర్, సైయిఫుల్లా, రుద్రపాటి బాబు, హైమారావు, జాకీర్‌హుస్సేన్, అప్పయ్య, శివరామకృష్ణ, రుద్రపాటి శేషు తదితరులు పాల్గొన్నారు.

ఉప ఎన్నికలలో సత్తాచాటేందుకు సిద్ధం: జగన్


గుంటూరు: దమ్ముంటే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని, ఉప ఎన్నికలకు తాము సిద్దమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సవాల్ విసిరారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టేది రైతుల కోసం కాదని, తన వర్గం ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేందుకేనన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తనతో ఉన్న ప్రతి ఎమ్మెల్యే దానికి మద్దతు తెలుపుతారని చెప్పారు. 

ఉప ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలో సోనియా గాంధీ రాజ్యమేలుతుందంటే అది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమేనన్నారు.
 
 
కుమ్మక్కులో భాగమే అవిశ్వాసం: జగన్


గుంటూరు: అవిశ్వాస తీర్మానం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కుమ్మక్కులో భాగమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న ఓదార్పుయాత్రలో భాగంగా ముట్లూరులో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం పేరుతో తన వెంట ఉన్న ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు నాటకమాడుతున్నారు అని జగన్ అన్నారు. రైతుల కోసం ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. 
 
 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ వర్గం ఓటు'




ఒంగోలు: చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి జిమ్మిక్కులు లేకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. అంతకంటే ముందు అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్న పార్టీలతో చంద్రబాబు చర్చించాలని ఆయన అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన చెప్పారు. జగన్ వర్గం నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లినా ఏమీకాదన్నారు. జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. విశ్వసనీయత కలిగిన నేతకాబట్టే జనం అంతా జగన్ వెంట నడుస్తున్నారన్నారు.

రైతుల కోసం కాదు ఉప ఎన్నికల కోసం:జగన్

Written By news on Wednesday, November 30, 2011 | 11/30/2011

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేది రైతుల కోసం కాదని, ఉప ఎన్నికల కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా ఈరోజు ఆయన అనంతవరప్పాడు గ్రామం వెళ్లారు. అభిమానులు, కార్యకర్తలు జగన్ కు ఘనస్వాగతం పలికారు. జగన్ వస్తున్నారని జనం భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు జరుగుతుందంటే అవిశ్వాస తీర్మానానికి తాము కూడా మద్దతు పలుకుతామన్నారు. తనకు, తన ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉందని చెప్పారు. 

ధాన్యానికి 730 రూపాయల మద్దతు ధర చూసి పంట కోయడానికే రైతు భయపడుతున్నారన్నారు. విద్యుత్, నీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.

http://www.hindu.com/2009/09/13/stories/2009091352540300.htm

Photo: G.N. Rao

A temple for Y.S. Rajasekhara Reddy under construction at Vanamvari Kistapuram in Khammam district. —
VANAMVARI KISTAPURAM (KHAMMAM Dt.): The tiny village of Vanamvari Kistapuram in Mundigonda mandal is agog with activity, as denizens are engaged in building an ‘alayam’ (temple) for their loved one – late Chief Minister Y.S. Rajasekhara Reddy. The village was once a stronghold of the Communist parties.
Community needs The village, which is part of the Muttaram gram panchayat, was the major beneficiary of over Rs. 2 crores spent on fulfilling community needs such as construction of roads and water supply. Many families had individual benefits such as loan waiver, sanction of Indiramma houses and medical assistance under Arogyasri. While a few persons grieving the death of Rajasekhara Reddy went into a state of despair in the neighbouring pockets, the residents of Vanamvari Kistapuram resolved to prove themselves to be different and their collective decision favoured construction of a monument. Contributions poured in, mainly from the farmers and farm workers, and they all embarked upon the construction of the temple. Kotapalli Swamy, a sculptor from Krishna district, was drafted for the special assignment.
The whole community was working day and night to get the structure completed in a record time for installing the statue of the late chief minister by Sunday. Government chief whip Bhatti Vikramarka consented to attend the rituals of the first day worship at the temple.
The Ramalayam in the village has over 300 acres of land to support the daily protocol of services as well as the annual upkeep. The temple built for worship of the late chief minister would also be endowed with some land for its regular maintenance, said village sarpanch Apparao, who heads the panels that work on the appointment of priest and mobilisation of resources.
The sarpanch claims that Rajasekhara Reddy was singularly responsible for development of gram panchayat, which was likely to get Nirmal Purashkar this year.

లింగంగుంట్లపాలెంలో వైఎస్ఆర్ ఆలయం

 కాకుమాను మండలం లింగంగుంట్లపాలెం గ్రామస్తులు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో వైఎస్ఆర్ దేవాలయాన్ని నిర్మించారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రతి ఒక్కరూ లబ్ది పొందారని, ఆయన పేరుతో దేవాలయం నిర్మిస్తే అందరికి మేలు జరుగుతుందని ఈ ఆలయం నిర్మించామని స్థానికులు చెప్పారు. గ్రామంలోని రామాలయం పక్కనే నిర్మించిన ఈ ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ


వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఆదేశిస్తే ఆ క్షణంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. పార్లమెంట్ లో ఉన్నంతవరకూ తాను కాంగ్రెస్ ఎంపీనని, అప్పటివరకూ పార్టీ ఆదేశాలను పాటిస్తానని సబ్బం హరి తెలిపారు.


వల్లూరులో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ
గుంటూరు : ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కాకుమాను మండలం వల్లూరులోని రైస్ మిల్ సెంటర్ వద్ద గ్రామస్తులు ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు

టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ రావిబత్తిన మల్లికార్జునరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు

అనంతవరం(తుళ్లూరు), న్యూస్‌లైన్: అనంతవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ రావిబత్తిన మల్లికార్జునరావు సోమవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు మందపాటి శేషగిరిరావు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనతో పాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కట్లగుంట రమేష్, ఎనికేపాటి రవి, మాదల సుబ్బారావు, మాదల శేషగిరిరావు, పిన్నమనేని సాంబశివరావు, నీరుకొండ కోటేశ్వరరావు, పురమ పుల్లారావు, గొట్టిముక్కల వెంకటేశ్వరరావుతోపాటు మరో 40 మంది పార్టీ లో చేరారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంటుపల్లి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుమారు 20 మంది రూ.100 సభ్యత్వం తీసుకోగా మరో 30 మంది సాధారణ సభ్యత్వం తీసుకున్నారు. డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ వైఎస్ పథకాలకు ఆకర్షితుడినయ్యానని, ఆ పథకాలు మళ్లీ ప్రజలకు చేరువ కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. శేషగిరిరావు మాట్లాడుతూ జగన్ సీఎం అయితేనే మేలు జరుగుతుందని భావించి ప్రతి ఒక్కరూ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు కుటుంబరావు, కొమ్మినేని కృష్ణారావు, బుర్రా వెంకటశివారెడ్డి, అట్లూరి శ్రీనివాసరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి చెందిన 50 మంది మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదార్పుయాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ కృష్ణా జిల్లా ఇన్‌చార్జి రావి వెంకటరమణ ఆధ్వర్యంలో వారు కలిశారు. తామంతా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. జగన్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. వీరు గతంలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు

నేనూ మీ కుటుం బసభ్యుల్లో ఒకరిని


మండలంలోని చినలింగాయపాలెంలో వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన బోరుగడ్డ శ్యాంసన్‌కు చెందిన కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి ఓదార్చారు. శ్యాంసన్ మరణించిన తీరు ను ఆయన భార్య బోరుగడ్డ రూత్‌ను అడిగి తెలుసుకున్నారు. ‘నేనూ మీ కుటుం బసభ్యుల్లో ఒకరిని..’ అంటూ వారికి భరోసా ఇచ్చి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా రూత్ చెప్పారిలా..

ఓదార్పుకు ముందు..: నా భర్తకు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రాణం. ఆయన మరణించాక సంక్షేమ పథకాలు అమలుకావనే బాధతో ఈయనా రెండు రోజులకే గుండెపోటుతో చనిపోయాడు. జగన్‌మోహన్‌రెడ్డి మా ఇంటికి వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆయన కోసం మేం ఎదురుచూస్తున్నాం.

ఈరోజును మేము మరువలేం..


ఇప్పటివరకు జగన్‌మోహన్‌రెడ్డిని టీవీల్లో, పేపర్లలో చూడడమే గానీ నేరుగా చూడలేదు. అంతటి మహానుభావుడు మా ఇంటి కి వచ్చి మాతోపాటు కూర్చొని మమ్మల్ని ఓదార్చడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజును మేం ఎన్నటికీ మరువలేం.

రెండు మండలాల్లో కొనసాగిన ఓదార్పుయాత్ర
మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
ఓ కుటుంబానికి ఓదార్పు
29 కిలోమీటర్లు పర్యటించిన జగన్

జగనన్నా.. అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ‘యువతరం’గం కదిలి వస్తోంది. గ్రామగ్రామాన యువజనమంతా జననేత వెంట నడుస్తోంది. తమ భావినేత జగనంటూ అభిమానం చాటుతోంది. ఇప్పటికీ ఎప్పటికీ తాము వెన్నుదన్నుగా నిలుస్తామని మాటిస్తోంది. రాజన్న రాజ్యం కోరుకుంటూ.. జననేత మాటే మా బాట అంటూ.. జగన్‌మోహన్‌రెడ్డి అడుగుల్లో అడుగులు కలుపుతోంది. 

పెదనందిపాడు, న్యూస్‌లైన్: పల్లెల్లో పచ్చటి పూలతివాచీలు ఏర్పాటయ్యాయి. జననేత రాకకోసం ఊరూరు ముస్తాబైంది. ఏ నోట విన్నా జగనన్న రాక గురించే. ఎక్కడ చూసినా జననేత ఫ్లెక్సీలే. జగన్‌తో కరచలనం చేయాలని కొందరు, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని మరికొందరు రోడ్ల వెంట బారులు తీరారు. చెరగని చిరునవ్వుతో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. మలివిడత 14వ రోజు ఓదార్పుయాత్రలో మంగళవారం ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించారు. మొత్తం 29 కిలోమీటర్లు పర్యటించి, మూడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఓ కుటుంబాన్ని ఓదార్చారు. 

యాత్ర ప్రారంభమైందిలా..

మంగళవారం ఉదయం 9.50 గంటలకు నాగులపాడు గ్రామం నుంచి ఓదార్పుయాత్ర ప్రారంభమైంది. అక్కడినుంచి వరగాని గ్రామం చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగ తం పలికారు. గ్రామ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహాన్ని జననేత ఆవిష్కరించి ప్రసంగిం చారు. అనంతరం ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రావిపాడు మీదుగా అబ్బినేని గుంటవారిపాలెం పయనమైన జగన్‌ను మార్గంమధ్యలో వైఎస్సార్ జిల్లా పులివెందుల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అబ్బినేని గుంటవారిపాలెం చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు బాణసంచా పేల్చి ఘనస్వాగతం పలికారు. సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. 

అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ నివాసంలో జరిగిన అల్పాహార విందులో పాల్గొన్నారు. పీఆర్పీ నాయకుడు మిరియాల ఏడుకొండలు నేతృత్వంలో 50 మంది నాయకులు, కార్యకర్తలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి పయనమైన జగన్‌కు సెయింట్ ఇగ్నేషియస్ విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఓదార్పుయాత్రికుడికి పండ్ల రసం అందజేశారు. గిరిజవోలుగుంట వారిపాలెంవాసులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రెండు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సెంటర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

వేణుగోపాలస్వామి ఆలయం, స్థానిక చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం రావిపాడు చేరుకున్న జగన్‌కు మహిళలు అపూర్వస్వాగతం పలికారు. పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేకపూజలు చేసిన ఆయన, ఆ తర్వాత దళితవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వరగాని మీదుగా పాండ్రపాడు బయలుదేరిన జననేత దారిలో సుబ్బాయమ్మ అనే వృద్ధురాలిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వ్యవసాయ కూలీలతో కొద్దిసేపు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పాండ్రపాడు గ్రామస్తులు జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొండబాలవారిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చినలింగాయపాలెంలో వికలాంగుడు షేక్ పీర్‌సాహెబ్ తన సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. గ్రామ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన బోరుగడ్డ శ్యాంసన్ కుటుంబసభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి పెదనందిపాడు మీదుగా నాగులపాడు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి అరవపల్లి కృష్ణమూర్తి నివాసంలో రాత్రి బస చేశారు. 

ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరు.. 

ఓదార్పుయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీమంత్రి, రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ కలిశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాత్రలో పాల్గొన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ విగ్రహావిష్కరణ సభలకు అధ్యక్షత వహించారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, కృష్ణాజిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, నాయకులు ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, మహ్మద్ నసీర్ అహ్మద్, కావటి మనోహర్, యేటిగడ్డ నరసింహారెడ్డి (బుజ్జి), చింతగుంట్ల రంగారెడ్డి, ఎనమల లింగయ్య, చిడిపూడి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం పెదనందిపాడు మండలం నాగులపాడు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

30-11-2011 బుధవారం 

పెదనందిపాడు మండలం, నాగులపాడు నుంచి యాత్ర ప్రారంభం 

కాకుమాను మండలం, వల్లూరులో నాలుగు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ, లింగంగుంటపాలెంలో విగ్రహావిష్కరణ

వట్టిచెరుకూరు మండలం..

వట్టిచెరుకూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
లేమల్లెపాడులో విగ్రహావిష్కరణ
అనంతవరప్పాడులో విగ్రహావిష్కరణ
ముట్లూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
కారంపూడిపాడులో విగ్రహావిష్కరణ
కోవెలమూడిలో విగ్రహావిష్కరణ

Popular Posts

Topics :