31 August 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుల నియామకం

Written By news on Saturday, September 6, 2014 | 9/06/2014

హైదరాబాద్: పార్టీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన కమిటీలోని పీఏసీ సభ్యుల పేర్లను వైఎస్సార్ సీపీ ఖరారు చేసింది. రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ)ని మరింత విస్తరించే క్రమంలో వైఎస్సార్ సీపీ మరో కొంతమందిని నూతన కమిటీలో సభ్యులుగా నియమించింది. 
 
పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అనేక మార్పులు చేశారు. ఇప్పటికే పీఏసీలో పలువురు సభ్యులను నియమించిన పార్టీ..  వీరికి అదనంగా మరో కొంతమందిని ఎంపిక చేసింది. రాష్ట్ర వాలంటీర్స్‌ వింగ్‌ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సరికొత్త బాధ్యతలు అప్పజెప్పగా, సెక్రటరీలుగా నిర్మలాకుమారి, అవ్వారు ముసలయ్య, గాంధీ, మేరుగ మురళీలను నియమించారు. ఈ రోజు ప్రకటించిన వైఎస్సార్ సీపీ నూతన కమిటీలోని సభ్యుల వివరాలు..


పీఏసీ సభ్యులు..సాగి దుర్గా ప్రసాదరాజు, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారధి

జనరల్‌ సెక్రటరీలు.. కారుమూరి నాగేశ్వరరావు, తలశిల రఘురాం నియామకం

డాక్టర్స్‌వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా దుట్టారామచంద్రరావు

వాలంటీర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

సెక్రటరీలుగా నిర్మలాకుమారి, అవ్వారు ముసలయ్య, గాంధీ, మేరుగ మురళీ

సీజీ సీ సభ్యులు.. గురునాథరెడ్డి, రెహమాన్‌, జక్కంపూడి విజయలక్ష్మి
పార్లమెంట్‌ అబ్జర్వర్స్‌..కొత్త కోట ప్రకాశ్‌ రెడ్డి, సురేశ్‌ బాబు

ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?

ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: గడికోట
సాక్షి, హైదరాబాద్: మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదే పదే వైఎస్ రాజశేఖరరెడ్డిని దూషిస్తూ సాగిన మంత్రుల ప్రసంగంపై శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపణ తెలిపారు. 1994 నుంచి 2004 వరకూ మీ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో దానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రతి ప్రాజెక్టుపైనా తాము చర్చకు సిద్ధమని, దీనికి టీడీపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతును రాజుగా చూసేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారని, వైఎస్ హయాంలో రూ.47 వేల కోట్లు ఖర్చు చేస్తే మీరు లక్షకోట్లు అంటూ దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
 ఇంతలోనే మంత్రి ప్రత్తిపాటి... తల్లి కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ అని సంబోధించగానే, శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేస్తూ, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉందని,  ఆ తర్వాత టీడీపీ అలయెన్స్ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు. రాజశేఖరరెడ్డి వారసులుగా ఐదేళ్ల ఆయన పదవీ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నామన్నారు. ఆయన మరణానంతరం అధికారంలో ఉన్న తెలుగు కాంగ్రెస్‌తోనే ప్రజ లకు కష్టాలు మొదలయ్యాయన్నారు. ఉమామహేశ్వరరావు పదే పదే తెలుగు గంగ ఎన్టీఆర్ హయాంలో చేపట్టారని చెబుతూండగా... టీడీపీ ఏదిచేసినా ఎన్టీఆర్ చేశారని చెప్పుకోవచ్చుగానీ, చంద్రబాబు ఏదైనా ప్రాజెక్టు కట్టారని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. మీరు  రైతుల ప్రభుత్వమని మాట్లాడుతున్నారు... మీ ముఖ్యమంత్రే తిన్నది అరక్క రైతులు ధర్నాలు చేస్తున్నారని అన్నారని గుర్తుచేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ

వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ
పార్టీ పటిష్టతకు జగన్ కసరత్తు
అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శులుగా సజ్జల, వైవీ నియామకం

 
హైదరాబాద్: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను పునర్‌వ్యవస్థీకరించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు ఆయా కమిటీల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. ఆయా ప్రాంతాలను, సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత వరుసగా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన అనంతరం కొంత కాలంగా కసరత్తు చేసి ఈ కమిటీలను రూపుదిద్దినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఏర్పడిన తరువాత తొలిసారి తనకు అనుబంధంగా ఇద్దరు రాజకీయ కార్యదర్శులను జగన్ నియమించుకున్నారు. రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ)ని విస్తరించడంతో పాటు కేంద్ర పాలక మండలి (సీజీసీ)లో అనేక మార్పులు చేశారు. సమర్థవంతంగా పార్టీ విధానాలను, వ్యవహారాలను వివరించడానికి వీలుగా అధికారప్రతినిధులు గానూ, టీవీ చర్చల్లో పాల్గొనే ప్రతినిధులుగానూ ఎంపిక చేశారు. ఇప్పటికే పార్టీ పలువురు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించింది. వీరికి అదనంగా శుక్రవారం మరికొందరిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన అధికార ప్రకటనలో పేర్కొన్న నియామకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

 పార్టీ అధ్యక్షుడికి అనుబంధంగా రాజకీయ కార్యదర్శులు: వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి)  ప్రధాన కార్యదర్శులు: వై.ఎస్.అనిల్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, జలీల్‌ఖాన్ (ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే)

కార్యదర్శులు: పిరియా సాయిరాజ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, తానేటి వనిత, కంపా హనోకు, పాలవలస విక్రాంత్ (ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు: డి.ఎ.సోమయాజులు, కొణతాల రామకృష్ణ, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపె విశ్వరూప్, కొడాలి నాని, అంబటి రాంబాబు, జలీల్‌ఖాన్, పేర్ని నాని, ఆదిమూలం సురేష్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి)  కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు: పెనుమత్స సాంబశివరాజు, వై.ఎస్.వివేకానందరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాదరావు, ధర్మాన ప్రసాదరావు, జి.ఎస్.రావు, పి.వి.కృష్ణబాబు, వాసిరెడ్డి పద్మ, ఎన్.లక్ష్మీపార్వతి, ఎడ్మ కృష్ణారెడ్డి, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశరావు, ఎన్.అమరనాథరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, తోట చంద్రశేఖర్, బాలశౌరి, వంకా రవి, బొడ్డు భాస్కరరామారావు, గిడ్డి ఈశ్వరి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి) అధికార ప్రతినిధులు: ధర్మాన ప్రసాదరావు, జ్యోతుల నెహ్రూ, మోపిదేవి వెంకటరమణారావు, ఆర్.కె.రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాం, కిడారి సర్వేశ్వరరావు, జలీల్‌ఖాన్, పేర్ని నాని, వాసిరెడ్డి పద్మ, కె.పార్థసారథి, ఆదిమూలం సురేష్, ఉప్పులేటి కల్పన, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొడాలి నాని (ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే)

టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీ ప్రతినిధులు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోన రఘుపతి, రాజీవ్ కృష్ణ, జోగి రమేష్, ఎ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మద్దాల రాజేశ్, గొట్టిపాటి రవికుమార్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే)

వైఎస్సార్‌సీపీ నూతన కమిటీ నియామకం

Written By news on Friday, September 5, 2014 | 9/05/2014

వైఎస్సార్‌సీపీ నూతన కమిటీ నియామకం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని శుక్రవారం ప్రకటించారు. పార్టీ రాజకీయ కార్యదర్శులుగా ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు నియమితులవ్వగా, ప్రధాన కార్యదర్శులుగా వైఎస్ అనీల్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, జలీల్‌ఖాన్‌లు నియమించబడ్డారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు కసరత్తు చేసిన అనంతరం పార్టీ నూతన కమిటీని ప్రకటించారు.


వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయ కార్యదర్శులు..

వై.వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి

పార్టీ ప్రధాన కార్యదర్శులు..
వైఎస్ అనీల్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి,జలీల్‌ఖాన్‌

పార్టీ కార్యదర్శులు..

పిరియ సాయిరాజ్‌, లావు కృష్ణ
తానేటి వనిత, కంపా హనోకులు నియామకం

రాజకీయ వ్యవహారాల కమిటీ

సభ్యులుగా డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ
మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎం.వి మైసూరారెడ్డి
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
జ్యోతుల నెహ్రు, భూమానాగిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, విశ్వరూప్‌
కొడాలి నాని, అంబటి రాంబాబు, జలీల్‌ఖాన్‌, పేర్ని నాని
ఆదిమూలం సురేష్‌లు నియామకం

కేంద్రపాలక మండలి సభ్యులు..

పెన్మత్స సాంబశివరాజు, వైఎస్‌.వివేకానందరెడ్డి
పాలవలస రాజశేఖరం, రఘురామిరెడ్డి, బుట్టా రేణుక
వరప్రసాదరావు, ధర్మాన ప్రసాదరావు, జీ ఎస్‌ రావు
కృష్ణబాబు, వాసిరెడ్డి పద్మ, ఎన్‌ లక్ష్మీపార్వతి
ఎడ్మ కృష్ణారెడ్డి, గట్టు రామచంద్రరావు
నల్లా సూర్యప్రకాష్‌రావు, ఎన్‌ అమర్‌నాథ్‌రెడ్డి
అయోధ్య రామిరెడ్డి, తోట చంద్రశేఖర్‌, బాలశౌరి
వంక రవి, బొడ్డు భాస్కర్‌ రామారావు, గిద్ది ఈశ్వరి
 

వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధులు..

ధర్మాన ప్రసాదరావు, జ్యోతుల నెహ్రు
మోపిదేవి వెంకటరమణ, ఆర్‌.కె రోజా
భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు
తమ్మినేని సీతారమ్‌, సర్వేశ్వర్‌రావు, జలీల్‌ఖాన్‌
పేర్నినాని, వాసిరెడ్డి పద్మ, కె.పార్థసారధి
ఆదిమూలం సురేష్‌, ఉప్పులేటి కల్పన,
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొడాలి నాని

పీఏసీ ఛైర్మన్ గా భూమా నాగిరెడ్డి

పీఏసీ ఛైర్మన్ గా భూమా నాగిరెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ గా పదవికి  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎంపికయ్యారు. అలాగే పీయూసీ కాగిత వెంకట్రావు, ఎస్టిమేట్ కమిటీ ఛైర్మన్ గా మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. లోక్‌సభ, శాసనసభల్లో పీఏసీ ఛైర్మన్‌ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఈ పదవి దక్కింది.  పీఏసీ ఛైర్మన్ పదవికి భూమా నాగిరెడ్డి నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

రెస్టు రూమ్‌కెళ్లినా రాజకీయమేనా!

రెస్టు రూమ్‌కెళ్లినా రాజకీయమేనా!
అధికార పక్షానికి ప్రతిపక్ష నేత జగన్ చురకలు
మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలంటూ హితవు

 
 సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా?’ అని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ సభ్యుడు సత్యనారాయణకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో జగన్ లేచి బయటకు వెళ్లారు. వెంటనే మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకొని.. ‘ముఖ్యమైన అంశం మీద చర్చ జరుగుతోంది. విపక్ష నేత సభలో లేరు. మళ్లీ వస్తారో లేదో తెలియదు. హడావుడి చేయించి జారుకున్నారు. చర్చించకుండా ఇంటికి జారుకోవడం విపక్ష నేతల లక్షణం కాదు. జగన్ చల్లగా ఇంటికి జారుకున్నారు’ వంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. సత్యనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
 
 నాలుగైదు నిమిషాల తర్వాత జగన్ తిరిగి తన స్థానానికి వచ్చి కూర్చున్నారు. యనమల వ్యాఖ్యలను పార్టీ సభ్యులు ఆయనకు చెప్పారు. స్పందించిన జగన్.. ‘రెస్టురూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా? ఎంత దారుణమైన పరిస్థితి సభలో ఉంది. ఎంత అప్రజాస్వామికం. ముందుగా చర్చించకుండానే ముఖ్యమంత్రి రాజధానిపై సభలో ప్రకటన చేశారు. రెండున్నర గంటలు మాట్లాడారు. అధికార పక్ష సభ్యులు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి’ అంటూ చురకలు వేశారు. ఇరుకున పడిన యనమల నీళ్లు నములుతూ.. తన వ్యాఖ్యలకు స్పందించి విపక్ష నేత వెనక్కి వచ్చినందుకు ధన్యవాదాలంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

రాజధానిపై బాబు తీరును తప్పుబట్టిన జగన్

ప్రకటన చేసే పద్ధతి ఇదేనా?: వైఎస్ జగన్
రాజధానిపై బాబు తీరును తప్పుబట్టిన జగన్ 
 సాక్షి, హైదరాబాద్: రాజధానిపై ముఖ్యమంత్రి  ఒక ప్రకటన చేసాక చర్చించేందుకు ఇంకేముంటుందని ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కీలక అంశంపై ప్రకటన చేసే విధానం ఇదేనా అని  నిలదీశారు.అసెంబ్లీలో సీఎం  చేసిన ప్రకటన అనంతరం  జరిగిన చర్చలో జోక్యం చేసుకుని జగన్ మాట్లాడారు. ‘‘అధ్యక్షా.. ముఖ్యమంత్రి ప్రకటన ఇస్తారంటున్నారు. ప్రకటన చేసిన తర్వాత చర్చకు అర్థం ఏముంటుంది? ముందు చర్చ, ఆ తర్వాత ప్రకటన రావాలి. 1953లో కూడా అదే జరిగింది. ఆనాడు రాజధాని నగరాన్ని ఎక్కడ పెట్టాలనే దానిపై ఐదు రోజుల చర్చ జరిగింది. ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయం చెప్పారు. కానీ, ఇప్పుడేం జరుగుతోంది? ప్రజాస్వామ్యం ఉందా? లేదా? ప్రకటన తర్వాత చర్చ జరుపుతామంటున్నారు.
 
 ఇది ఎంతవరకు న్యాయం? రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి సులభమవుతుందని 30 వేల ఎకరాలు ఎక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే అక్కడ పెట్టడం మంచిదన్నాం. వాళ్లు పెడతామన్న చోట గజం రూ.లక్ష పలుకుతోంది. ఇంత ఖరీదైన ప్రాంతంలో భూసేకరణ ఎలా చేస్తారు? ఇప్పటికే అద్దెలు విపరీతంగా పెరిగి సామాన్యుడికి అందకుండా పోతున్నాయి.  ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అందరి అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కాదంటోంది? ప్రకటన చేస్తామంటోంది. దయచేసి బుల్‌డోజ్ చేయవద్దు’’ అంటుండగా స్పీకర్ అభ్యంతరం చెప్పారు. ఆ తర్వాత సందర్భంలో మరోసారి జగన్ జోక్యం చేసుకుంటూ.. తమ న్యాయబద్ధమైన డిమాండ్‌ను అనుమతించాలని కోరారు.  

మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం

 విజయవాడను రాజధానిగా ప్రకటించడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. కానీ ప్రకటన చేసిన తీరు భయం కలిగించిందని అన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై సభలో జరిగిన చర్చలో జగన్ మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదన్నారు. రాజధాని ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదని,  సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

భయపడిందే జరిగిందన్నారు. చర్చ తర్వాత ప్రకటన రావాలని కోరుకున్నామని చెప్పారు. ప్రకటన చేసిన తర్వాత చర్చ పెట్టుకోండని చెబితే.. ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ‘‘విభజన తర్వాత 13 జిల్లాల చిన్న రాష్ట్రమయింది. ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదు. రాజధాని ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదు. కానీ.. కనీసం 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేస్తే బాగుంటుందని చెప్పాం. అలా అయితే భూముల ధరలను ప్రభుత్వమే నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. సభలో చర్చ లేకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకొని నేరుగా ప్రకటించడం ప్రజాస్వామ్యం కాకపోయినా, రాష్ట్రంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వకూడదని చర్చలో పాల్గొంటున్నాం. నిర్మాణాత్మక సలహాలు ఇస్తాం’’ అని జగన్ చెప్పారు.

ఈ హామీలు ఎలా నెరవేరుస్తారు?

Written By news on Thursday, September 4, 2014 | 9/04/2014

ఈ హామీలు ఎలా నెరవేరుస్తారు?వై.విశ్వేశ్వర రెడ్డి - అత్తర్ చాంద్ బాషా
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాలకు భారీ స్థాయిలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని వైఎస్ఆర్ సిపి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి, కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషాలు ప్రశ్నించారు. రాజధానిపై శాసనసభలో లోతైన చర్చ జరగలేదని చెప్పారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా రాజధాని ఉండాలని వారన్నారు. అనంతపురం జిల్లాకు త్రాగు, సాగు నీటి సరఫరాపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని వారు కోరారు.

నిర్మాణాత్మక సలహాలు ఇస్తాం: వైఎస్ జగన్


నిర్మాణాత్మక సలహాలు ఇస్తాం: వైఎస్ జగన్
హైదరాబాద్ : బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు నిర్మాణాత్మక సలహాలు ఇస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎలాగూ రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, అయితే భావోద్వేగాలకు తావివ్వకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో చర్చలో పాల్గొన్నామని ఆయన అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశం ఏ కోశానా తమకు లేదని, అందుకే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు తాము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. రాజధానిని ఎక్కడైనా పెట్టినా అక్కడ 30వేల ఎకరాలు అందుబాటలో ఉండాలని వైఎస్ జగన్ అన్నారు.

ఆ 30వేల ఎకరాల ప్రభుత్వ భూమే ఉంటే భూమి రేటును నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. దీనివల్ల సామాన్యులు ఎవరైనా రాజధానికి వెళ్లి ఈఎంఐ పద్ధతిలో ఒక ప్లాటు కొనుక్కునే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగస్తులకు అద్దెఇళ్లు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూమి అయితే రేటు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ల్యాండ్ ఫులింగ్ పద్ధతిలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించే పద్దతిలో వెళ్తుందన్నారు.

అడ్డమైనవాటికీ రాజకీయాలేనా?


అడ్డమైనవాటికీ రాజకీయాలేనా?
హైదరాబాద్ : ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారిపోయిందని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని నగరంపై ప్రకటన చేసిన తర్వాత దానిపై చర్చ సమయంలో వైఎస్ జగన్ సభలో లేరంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

ఐదు నిమిషాల విరామం తీసుకోడానికి (రెస్ట్ రూంకు) వెళ్లిన సమయంలోనే ఇలా సభలో లేరంటూ రాజకీయం చేయడాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. చర్చలేకుండా ప్రకటన చేసేస్తారని, ప్రకటన తర్వాత చర్చ అంటారని.. కానీ ఇప్పుడు మాత్రం రెస్ట్ రూంకు వెళ్లినా సభలో లేరంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

అసెంబ్లీ, గోల్కొండ కోట కూడా బాబే కట్టించారేమో!!


అసెంబ్లీ, గోల్కొండ కోట కూడా బాబే కట్టించారేమో!!
హైదరాబాద్ : హైదరాబాద్ ను తానే నిర్మించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని... అసెంబ్లీ, గోల్కొండ కోట, ఫలక్ నుమా ప్యాలెస్ అన్నీ ఆయనే నిర్మించి ఉంటారేమోనని, అందుకే హైదరాబాద్ అంత గొప్పదై ఉంటుందని అనుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీలో రాజధాని ప్రకటనపై చర్చ సందర్భంగా ఆయన అధికారపక్షాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దుమ్ము దులిపేశారు. ఆయన ఏమన్నారంటే...

''చర్చ తర్వాత ప్రకటన వస్తే బాగుంటుందని ఎంత మొరపెట్టుకున్నా.. వినకుండా ముందే ప్రకటన చేసేశారు. నాయకులకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అది ఉండబట్టే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా, ప్రతిపక్ష నాయకుడు దాన్ని స్వాగతించారు. అందుకే మిగులు బడ్జెట్ వచ్చిందని భావిస్తున్నాం. కాగితం మీద చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. కానీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవా, దేవాదుల, తోటపల్లి.. ఇలా అన్ని ప్రాజెక్టులకు ప్రతిసారీ ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేసేస్తారు తప్ప నిధుల కేటాయింపు, పూర్తి మాత్రం ఉండవు. నరమానవుడు కూడా లేనిచోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి తాపీ మేస్త్రిని, ఫొటోగ్రాఫర్ ను కూడా హెలికాప్టర్లలో తీసుకెళ్లారట. ఇవన్నీ చదివారు గానీ, అవి పూర్తవుతాయా లేవా అన్నది చూడాలి. చేస్తే చాలా సంతోషిస్తాం. కానీ గత చరిత్ర చూసినప్పుడు బాధ వేస్తోంది.

ఆయన శంకుస్థాపన చేసిన ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. ప్రాజెక్టులు పూర్తయ్యాయంటే వాటికి దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేయించారు. హైదరాబాద్ ను తానే నిర్మించానని చెబుతున్నా.. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేయించింది వైఎస్సే. హెచ్1బి వీసాలు వస్తున్నాయంటే.. అందుకు కారణం తానేనని చెబుతారు. నేనూ ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను. అవెలా వస్తాయో మాకూ తెలుసు. ఆయన గత చరిత్ర చూస్తే భవిష్యత్తులో ఇవన్నీ జరుగుతాయన్న నమ్మకం ఎవరికీ కలగట్లేదు. గతంలో రాష్ట్రం తమిళనాడు నుంచి విడివడినప్పుడు 1956లో చర్చ ఎలా జరిగిందో, ఓటింగ్ ఎలా జరిగిందో ఆనాటి పేపర్లు చూస్తే తెలుస్తుంది. రాజధాని విషయంలో మేం ఎలాంటి డిమాండ్లూ చేయలేదు. శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ, వినుకొండ, మార్టూరు విషయంలో వివరాలు అడిగినప్పుడు వాటికి సమాధానాలు కూడా పంపలేదు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సభ జరుగుతున్నప్పుడు సభ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు రెండు నిమిషాల కోసం బయటకు వెళ్తేనే కామెంట్లు చేస్తారు గానీ.. రాష్ట్ర విభజన గురించి చర్చించేటప్పుడు ఆయన సభలో లేని విషయం గుర్తులేదా? ''

రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం: వైఎస్ జగన్

హైదరాబాద్ : విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అయితే ఎంపిక విధానాన్నే తాము వ్యతిరేకించామన్నారు.  రాజధాని అంటే అందరికీ అన్నివిధాలా అందుబాటులో ఉండాలన్నారు. ఏకపక్ష నిర్ణయం ప్రజాస్వామ్య వ్యతిరేకం అయినా రాష్ట్రం ఒకటిగా ఉండాలనే విషయంపై మద్దతు ఇచ్చామన్నారు. కాగా రాజధాని  ఎక్కడ ఉన్నా తమకు అభ్యంతరం లేదని ఆయన గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రకటన చేశాక ఇక చర్చించటంలో అర్ధం ఏముందని వైఎస్ జగన్ అన్నారు.

నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ కోడెల: శ్రీకాంత్ రెడ్డి

నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ కోడెల: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: నిబంధనలు, సభా సాంప్రదాయాలకు విరుద్దంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సభా సాంప్రదాయాలను కాపాడాలని ప్రతిపక్ష పార్టీ కోరుతోందని ఆయన అన్నారు. 
 
గతంలో రాజధాని ఏర్పాటుపై చర్చ జరిగిందని, ఇప్పుడు సభలో చర్చించడానికి అభ్యంతరమేమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుపై సభలో చర్చకు స్పీకర్ అనుమతించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

రియల్ రాజధాని లేక రియల్ ఎస్టేట్ రాజధానా?

రియల్ రాజధాని లేక రియల్ ఎస్టేట్ రాజధానా?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రియల్ రాజధాని నిర్మిస్తారా లేక రియల్ ఎస్టేట్ రాజధాని నిర్మిస్తారా అంటూ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి నిలదీశారు. నారా..నారాయణలిద్దరే రాజధానిని నిర్మిస్తారా అంటూ చంద్రబాబు, మంత్రి నారాయణను ప్రశ్నించారు.
 
రాజధాని ఏర్పాటుపై చర్చించేందుకు అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 వరకు కొనసాగిస్తామని ఆయన సూచించారు. రాత్రికి రాత్రి ముహుర్తాలు పెట్టుకుని ప్రకటన చేయడమేమిటని ప్రభుత్వంపై చెవిరెడ్డి మండిపడ్డారు.  
 
రాజధాని అంశంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజధానిపై సమగ్ర చర్చ జరిగిన తర్వాతే సరియైన నిర్ణయం తీసుకుందామన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించవద్దని, ఆరు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులైన ఎమ్మెల్యేలతో ఎందుకు ఈ ప్రభుత్వం చర్చించదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యంలో ప్రతిపక్షానిదే ప్రధానపాత్ర అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.

టీడీపీ తీరుపై వైఎస్సార్ సీపీ శాసన సభాపక్షం ధ్వజం

రాజధానిపై ఏకపక్షంగా వెళ్తున్నారు: వైఎస్సార్‌సీపీ
టీడీపీ తీరుపై వైఎస్సార్ సీపీ శాసన సభాపక్షం ధ్వజం 
 సాక్షి, హైదరాబాద్: ఏపీ నూతన రాజధానిపై ముందుగా అసెంబ్లీలో చర్చించి, ఓటింగ్  తర్వాతే ప్రకటన చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. రాజధాని అంశంపై ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని అధికార టీడీపీ తీరుపై ధ్వజమెత్తింది. అసెంబ్లీ నిబంధనల మేరకు నడుచుకుంటున్న వైఎస్సార్ సీపీ సభ్యులపై టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని కోరినా స్పీకర్ వినలేదని తెలిపింది. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వైఎస్సార్ సీపీ శాసన సభాపక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సునీల్‌కుమార్, జలీల్‌ఖాన్, రక్షణనిధి విలేకరులతో మాట్లాడారు.
 
 రాజధానిపై గురువారం సీఎం అసెంబ్లీలో ప్రకటన చేస్తారని, ఇందుకు సిద్ధాంతి ముహూర్తం పెట్టారని టీడీపీ సభ్యులు చెబుతున్నారని, చర్చ జరిగాక ప్రకటన చేయాలని గడికోట అన్నారు. ఈ విషయంలో రూల్స్ బుక్ స్పీకర్‌కు చూపించినా తమ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారని, దీనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం కుటుంబ వ్యవహారంలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. కేబినెట్ సమావేశంలో సుజనా చౌదరి, సి.ఎం.రమేష్, పరకాల ప్రభాకర్ వంటి వారిని అనుమతిస్తూ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. రాజధాని 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోటే పెట్టాలనేది తమ అభిమతమని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ప్రతిపక్షంతో చర్చించి తర్వాత ప్రకటన చేస్తే ఆహ్వానిస్తామని, లేకుంటే ఓటింగ్‌కు వెళ్లాలని డిమాండ్ చేస్తామన్నారు. ప్రభుత్వం చర్చకు ఎందుకు వెనకడుగు వేస్తోందో అర్థం కావడంలేదని సునీల్‌కుమార్ అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయాలు తెలియవంటూ టీడీపీ సభ్యులు ముఖ్యమైన అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని జలీల్‌ఖాన్ అన్నారు.

కొందరు శ్రీమంతులకే పరిమితమయ్యేలా రాజధాని ఉండకూడదు

ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలి: వైఎస్ జగన్
* రాజధానిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కొందరు శ్రీమంతులకే పరిమితమయ్యేలా రాజధాని ఉండకూడదు
రాజధాని ప్రకటనకు ముందే దానిపై చర్చ, ఓటింగ్ జరగాలి
ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించేదేముంటుంది?
నేను చేసేది చేసేస్తా... మీ చావు మీరు చావండి అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఖరి ఉంది
ఒకే చోట కనీసం 30 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రాజధాని నిర్మించాలని మేం ముందునుంచీ చెబుతున్నాం
కృష్ణా - గుంటూరు జిల్లాల్లో రాజధానికి నేనూ సిద్ధమే.. అక్కడ 30 వేల ఎకరాల వైశాల్యం గల భూమి ఒకే చోట ఉంటే అక్కడే పెట్టమనండి
శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుకుంటున్నాం
ఆ నివేదికలో ఏముందో తెలియకుండా, తెలుసుకోవాలనే బుద్ధీ జ్ఞానం లేకుండా రాజధానిపై ప్రకటనకు  ముహూర్తం కూడా నిర్ణయించారు

 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రజ లందరికీ మేలు జరిగేలా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటు కొందరు శ్రీమంతులకే పరిమితమయ్యేలా ఉండకూడదని తెలిపారు. బుధవారం శాసన సభ వాయిదా పడిన తర్వాత జగన్ అసెంబ్లీలోని తన చాంబర్‌లో మీడియాతో ముచ్చటిం చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో ముడివడి ఉన్నందున ప్రకటన చేయడానికి ముందే ఆ అంశంపై చర్చ, ఆ తర్వాత ఓటింగ్ జరగాలని కోరుతున్నామని చెప్పారు. రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించేదేముంటుందని ప్రశ్నించారు. ‘‘1953 జూలై 1న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడుండాలనే అం శంపై అప్పట్లో 5 రోజులపాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది.
 
 మెజారిటీ శాసన సభ్యులు ఓట్లేశారు. ఆ ప్రకారమే రాజధాని నిర్ణ యం జరిగింది. అలా కాకుండా ఒక నియంత మాదిరిగా రాజధాని ఎక్కడుండాలో ఆయనే నిర్ణయించేస్తానంటే ఎలా? ఈరోజు అష్టమి బాగాలేదు. దశమి రోజున ప్రకటన చేసేస్తానం టే సరిపోతుందా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా’’ అని జగన్ ప్రశ్నించారు. ‘‘ముందు రాజధానిపై ప్రకటన చేస్తాను. ఆ తరువాత చర్చించండి అంటున్నారు. ప్రకటన ఇచ్చాక ఇక చర్చించేదేముంటుంది? నేను చేసేది చేసేస్తా... మీ చావు మీరు చావండి అన్నట్లుగా సీఎం వైఖరి ఉంది’’ అని జగన్ ఘాటుగా విమర్శించారు. ‘‘రాజధా నికి కావాల్సిన భూమి ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ నిర్మిస్తే బాగుంటుందని మేం తొలి నుంచీ చెబుతున్నాం. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూమి లేదా అటవీ భూమినైనా సరే లక్ష ఎకరాల వరకు డీనోటిఫై చేస్తామని కేంద్రం రాష్ట్ర విభజన చట్టంలోనే చెప్పింది. అలాంటప్పుడు అందుకు భిన్నంగా ఆలోచన చేయడమేమిటి? ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో 2 వేల ఎకరాలు, 3 వేల ఎకరాలు తీసుకుని అక్కడే రాజధాని పెడతామంటే ఇక ఆ చుట్టుపక్కల స్థలాలు, ఇళ్ల ధరలు ఏ స్థాయికి వెళ్లిపోతాయో ఆలోచించండి.

ఒక సామాన్యుడు చదువుకున్న తన పిల్లలను తీసుకుని ఉద్యోగాల కోసం రాష్ట్ర రాజధానికి వెళ్లి ఉండాలంటే అతనికి అందుబాటులో ఉండే ధరకు అద్దెకు ఇల్లు దొరుకుతుందా? మీలాంటి ఓ ఉద్యోగి (జర్నలిస్టులనుద్దేశించి) ఉద్యోగం చేసుకోవడం కోసం రాజధానికి వెళ్లి సొంత ఇల్లు కావాలనుకుంటే కొనడం సాధ్యమయ్యే పనేనా!’’ అని జగన్ అన్నారు. ఎవరికో మేలు చేసే ఆలోచనలతో అదే డెరైక్షన్‌లో వెళితే ఎలా? రాష్ట్రానికి ఏం చేస్తే మేలు జరుగుతుందో అది చేయాలి’’ అని జగన్ చెప్పారు. భూసేకరణ చేసి.. ఆ భూమిని అభివృద్ధి చేసి 40 శాతం తిరిగి సొంతదారునికే ఇస్తానని ప్రభుత్వం చెబుతోంది కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘నిజమే.. ఆ తరువాత ఆ భూమి ని యజమాని మీలాంటి వారికి తక్కువ ధరకు అమ్ముతాడా? గజం ఏ యాభై వేల రూపాయలకో విక్రయిస్తాడు కదా..! సామాన్యుడు అంత భారీ ధరకు కొనగలడా..’’ అంటూ జగన్ అందులో ఇమిడి ఉన్న సమస్యను వివరించారు.
 
ఇడుపులపాయ అని నేనన్నానా?
 ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని జగన్ కోరుకుంటున్నారని అధికారపక్షం అరోపిస్తోం దని మరో విలేకరి అనగా.. ‘‘ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని నేను అన్నానా? ఇలాంటివన్నీ వారు (టీడీపీ) అక్కసుతో చేసే విమర్శ లు’’ అని జగన్ సమాధానమిచ్చారు. కృష్ణా - గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టడానికి తాను సిద్ధమేనని, అక్కడ 40వేల ఎకరాలు లేదా కనీ సం 30 వేల ఎకరాల వైశాల్యం గల భూమి ఒకే చోట ఉంటే అక్కడే పెట్టమనండి అని చెప్పారు. దయచేసి రాజధాని విషయంపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. జగన్ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా,,‘‘రాష్ట్రం 13 జిల్లాలకు కుదించుకుపోయింది. ఇంకా ఇబ్బందులు పడ టం మంచిది కాదు.
 
  దీనిని రాజకీయం చేయాలని చూడటం మంచిది కాదు. మనమంతా కల సి ఉంటే బలంగా, దృఢంగా ఉంటాం. లేకుంటే ఇంకా బలహీనం అయిపోతాం’’ అని చెప్పారు. ‘‘రాజధానిని అడ్డుకోవడానికి మేము ప్రయత్నించడంలేదు. రాజధానిని పెట్టండి అనే మేమే కోరుతున్నాం. రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అసెం బ్లీకి వచ్చి దానిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ఆ నివేదికలో ఏముందో తెలియకుండా, తెలుసుకోవాలనే బుద్ధీ లేకుండా రాజధాని ఎక్కడుండాలో ప్రకటన చేయడానికి ముహూర్తం కూడా నిర్ణయించేసుకుంటున్నారు’’ అని జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజధాని ఎక్కడో ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కదా అని ఓ విలకరి అనగా.. రాజధాని ఎక్కడ నిర్మించేదీ అసెంబ్లీలో గురువారం మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రకటిస్తారని, ఇందుకోసం ముహూర్తం నిర్ణయించిన సిద్ధాంతి పేరుతో సహా చంద్రబాబు అనుకూల పత్రిక ఒకటి ప్రచురించిన వార్తను జగన్ ఉదహరించారు. ఒకసారి ఆ వార్త చదవండి అని అన్నారు.
 
 రామారావుపై కేసు ఎత్తివేయడమేంటి?
 చర్చకు అనుమతించాలని జగన్ డిమాండ్ 

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై నమోదైన కేసును ప్రభుత్వం ఉపసంహరించడాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇది చాలా ముఖ్యమైన విషయమైనందున సభలో చర్చించేందుకు సమయం కేటాయించాలని స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రశ్నోత్తరాల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ.. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే రామారావుపై నిర్భయ చట్టం కింద కేసులతో పాటు పలు అత్యాచారం కేసులున్నాయని, అయితే వాటిని ఈ ప్రభుత్వం తొలగించిందని సభ దృష్టికి తెచ్చారు.
 
ఈ రకంగా కేసును ఉపసంహరించడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. దానిపై చర్చ జరగాలని అంటుండగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభ్యంతరం తెలిపారు. జగన్ బదులిస్తూ ఆయనపై కేసు రద్దు విషయం పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. కేసు ప్రా ధాన్యత దృష్ట్యా చ ర్చకు తగిన సమయం కేటాయించాలని కోరారు. ఇలావుండగా.. ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై అసెంబ్లీలో చర్చించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో పార్టీ సభ్యుడు కె.శ్రీని వాసులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించా రు. అయితే స్పీకర్ దీన్ని తిరస్కరించారు. వేలా ది మంది జీవితాలతో ముడిపడిన అంశాన్ని చర్చించకపోతే ఎలా? అని వైసీపీ సభ్యులు స్పీకర్‌ను అడిగారు. ప్రతిపక్ష నేత జగన్ జోక్యం చేసుకుని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు పై చర్చించేందుకు ఏదో విధంగా సమయం ఇవ్వాలని కోరారు.

 ‘వారేం చేసినా బాబు కాపాడేలా ఉన్నారు’

 టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి నేరం చేసినా కాపాడేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు రక్షణనిధి, విశ్వేశ్వరరెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. 2009 సెప్టెంబర్ 1న కొవ్వూరులోని తన న ర్సింగ్ కళాశాలలో కేరళ విద్యార్థినుల్ని లైంగి కంగా వేధించి, అత్యాచార ప్రయత్నాలకు ఒడిగట్టిన టీడీపీ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసులు నమోదయ్యూయని, సీఐడీ విచారణలో నేర నిర్ధారణ సైతం జరిగిందని చెప్పారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుంటే, వాదనలను ఉప సహరించుకోవాల్సిం దిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ జీవో జారీ చేయడం అన్యాయమన్నారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా జీవో ఇప్పించిన చంద్రబాబు సీఎంగా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పిస్తుందో ఈ చర్య ద్వారా తేటతెల్లమౌతోందని దుయ్యబట్టారు.

కృష్ణా అయినా.... గుంటూరు అయినా ఓకే

Written By news on Wednesday, September 3, 2014 | 9/03/2014

ఆంధ్రప్రదేశ్ కు కావాల్సింది శ్రీమంతుల రాజధాని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని ఎక్కడైనా పెట్టండి...తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు.  కనీస సౌకర్యాలున్న ప్రాంతంలో రాజధాని ఉండాలని  వైఎస్ జగన్ అన్నారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. తమకు అన్ని ప్రాంతాలు ఒకటేనని.. కృష్ణా అయినా గుంటూరు అయినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే రాజధానిపై ఏకపక్ష నిర్ణయం ఒప్పుకునేది లేదని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చ జరగాలని, చర్చ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు.

రాజధాని ఎక్కడపెట్టినా లక్ష ఎకరాల వరకూ డీనోటిఫై చేస్తామని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. రాజధానిలో సామాన్య ఉద్యోగికి కూడా భూములు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆలోచనలు చూస్తే శ్రీమంతులకే పరిమితమయ్యే రాజధానిలా ఉందన్నారు. చదువుకునే పిల్లలు భవిష్యత్ లో  ఉద్యోగానికి వెళ్తే రాజధానిలో భూమి కొనుగోలు చేసుకునే అవకాశం ఉండాలన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే ఏం చేయాలి? అని ఆలోచించాలన్నారు. నియంత మాదిరిగా నా ఇష్టం నేను ఇక్కడే పెడతానంటే ఎలా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం బతికే ఉందా అని అడిగారు.  ప్రకటన తర్వాత చర్చ ఉంటే అంతకంటే దారుణం ఉందా అన్నారు.

మేం చేయాల్సింది చేస్తాం, మీ చావు మీరు చావడమంటే ప్రజాస్వామ్యం ఇదేనా అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు పక్కనపెట్టి ఆలోచించాలని, భావితరాలకు ఏం సమాధానం చెప్పాలని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై సభలో చర్చతో పాటు ఓటింగ్ ఉండాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సభ్యుల అభిప్రాయాలు వద్దనడం సమంజసమేనా అన్నారు. ఎవరికో మేలు చేయడం కోసం ఆలోచించవద్దని, విశాల దృక్పధం ఉండాలన్నారు. ఇదే పరిస్థితి 1953లో ఉత్పన్నమైనప్పుడు సభలో అయిదు రోజులపాటు చర్చ జరిగిందన్నారు. చర్చ, ఓటింగ్ జరగాలని... అటువంటి పరిస్థితి లేనప్పుడు అసెంబ్లీ సమావేశాలెందుకని వైఎస్ జగన్ సూటిగా ప్రశించారు.

‘దేశం’ అరాచకాలపై పోరాటం: జగన్

‘దేశం’ అరాచకాలపై పోరాటం: జగన్
సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను అన్యాయంగా ఇబ్బంది పెడితే ఊరుకోబోమని, అసెంబ్లీలోనూ నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పులివెందులకు వచ్చిన ప్రతి పక్షనేత జగన్‌ను గుంటూరు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లె, పెనుగొండ, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన మహిళలు కలిశారు. జగన్ చేతులు పట్టుకొని బోరున విలపించారు. ఏమీ చేయకపోయినా అధికార పార్టీ నేతలు తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అదును చూసి అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పారు.
 
ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరంలేదని.. పార్టీ నిత్యం అండగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే జిల్లాల వారీ సమీక్షలకు వస్తానని, అప్పుడు ఇలాంటి సమస్యలను ప్రస్తావించడంతోపాటు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతానన్నారు.

‘మహా’ నివాళి

‘మహా’ నివాళి
సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం మొదలు మారుమూల గ్రామం వరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి వేడుకలను మంగళవారం జరుపుకున్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

 వైఎస్.మృతి జిల్లా ప్రజలకు తీరని లోటని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పేదల గుండె చప్పుడు విని వారికి ఏం కావాలో అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. నిరుపేదల గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్ ప్రపంచంలోనే మహానేత అంటూ కొనియాడారు. వైఎస్ ఆశయసాధన కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ఎప్పటికీ పోరాటం చేస్తుందని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇలా ప్రతి ఒక్కరూ వైఎస్ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందారని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన మరణానంతరం పాలకులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. తాను అశ్వారావుపేట నుంచి వస్తుంటే ప్రతి గ్రామంలోనూ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద పాలాభిషేకాలు, సేవా కార్యక్రమాలు చేశానని, దీనిని బట్టి వైఎస్‌పై ప్రజలు పెంచుకున్న ప్రేమ ఎంటో అర్థమవుతోందని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు.

 అందరూ వెళ్లి స్థానిక రాపర్తినగర్‌లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాల సమన్వయకర్తలు కూరాకుల నాగభూషణం, డాక్టర్ గుగులోతు రవిబాబునాయక్, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి సాధు రమేష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు తోట రామారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కోటా గురుప్రసాద్, ప్రచార కమిటీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కాంపల్లి బాలకృష్ణ, జిల్లా నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, అడపా వెంకటనర్సయ్య, దామోదర్‌రెడ్డి, బండి సత్యనారాయణ, తుమ్మా అప్పిరెడ్డి, వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, హెచ్.వెంకటేశ్వర్లు, నెల్లూరి షర్మిలా సంపత్, కొంగర జ్యోతిర్మయి పాల్గొన్నారు.

  పాలేరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం వైఎస్ వర్ధంతిని నిర్వహించారు. తిరుమలాయపాలెం మండలం బీరోలు పంచాయతీ బంధంపల్లిలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం, తాటి కలిసి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు రమేశ్‌రెడ్డి, కొప్పుల చెన్నకృష్ణారెడ్డి, తోట చినవెంకటరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

  కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. బూడిదగడ్డలోని స్నేహలత వృద్ధాశ్రమం, స్నేహలత-సంధ్యలత అనాథాశ్రమంలో పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు. మండల పరిధిలోని వేపలగడ్డకు చెందిన కందుల సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు.

పట్టణ కన్వీనర్ భీమా శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్ భీమా శ్రీవల్లి ఆధ్వర్యంలో సెవెన్‌హిల్స్ ప్రాంతంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పండ్లు పంపి ణీ చేశారు. పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.

  భద్రాచలం డివిజన్లోని అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్లో ఉన్న  వైఎస్‌ఆర్ విగ్రహానికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎటపాకలోని సరోజ అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు,రొట్టెలు పంచారు.

 అశ్వారావుపేటలోని ఆరు మండలాల్లో రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్, రింగ్‌సెంటర్‌లలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. దమ్మపేట మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దమ్మపేట, మందలపల్లి, నాగుపల్లి, నాచారం, మొండివ ర్రె, పట్వారీగూడెం, ములకలపల్లి, చండ్రుగొండ, మద్దుకూరు గ్రామాల్లో వైస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పులిహోర పంపిణీ చేశారు.

 బూర్గంపాడులోని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, కైపు సుబ్బిరామిరెడ్డి, బట్టా విజయగాంధీ, కైపు రోషిరెడ్డి  మండల కేంద్రంలో అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకుపండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల మండలాల్లో అన్నదానం చేశారు.  గజ్జల లక్ష్మారెడ్డి, కారం వెంకట్‌రెడ్డి,  రమేష్, ఖదీర్ పాల్గొన్నారు.

 మధిరలోని వైఎస్‌ఆర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ, బోనకల్లు మండలాల్లోని అన్ని గ్రామాల్లో వైఎస్‌ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. - ఇల్లెందులో వైఎస్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఇల్లెందు, గార్ల ఏరియా వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

 వైరా మండలంలో 20 గ్రామ పంచాయితీల్లో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలో వైస్సార్‌సీపీ నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.  వైఎస్సార్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కొణిజర్ల, ఏన్కూరు మండలంలో రోగులు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. జూలూరుపాడు, కారేపల్లి, మండలాల్లో వైఎస్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో  ముక్తి వెంకటేశ్వర్లు, నల్లమల శివకుమార్, పూర్ణకంటి నాగేశ్వరరావు, ఇమ్మడి తిరుపతిరావు, సూరపురెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఈశ్వరి నందరాజ్, ముత్తినేని రామయ్య పాల్గొన్నారు.
   
సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాలలోని గ్రామాలలో వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. సత్తుపల్లిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆస్పత్రుల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి

రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి
వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్షం డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: రైతాంగానికి ఎనలేని ప్రయోజనాలు కల్పించి అన్నదాతను రారాజును చేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8ని రైతు దినోత్సవంగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం డిమాండ్ చేసింది. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు మాట్లాడారు. విత్తన కంపెనీల దోపిడీ నుంచి రైతులను విముక్తులను చేశారన్నారు. పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవడానికి మోన్‌శాంటో లాంటి బహుళ జాతి కంపెనీ మెడలు వంచి రైతుల పక్షాన నిలిచిన రైతు పక్షపాతి వైఎస్ అని చెప్పారు. అలాంటి వైఎస్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ సభ్యుల మానసిక స్థితి సరిగా లేదేమోనని అనుమానం వ్యక్తంచేశారు. కేంద్రం ప్రకటించిన రుణ మాఫీ ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ లబ్ధి చేకూర్చి, రుణాలు కట్టిన రైతులకు రాష్ట్రం భరించేలా రూ.2 వేల కోట్లు అందించిన వైఎస్‌తో చంద్రబాబును ఏ కోణంలోనూ పోల్చలేమని గడికోట అన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీపై రోజుకో మాట, పూటకో నిబంధన పెడుతూ రైతాంగాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనపై టీడీపీ నేతలు ఎందుకు నోరెత్తరని ప్రశ్నించారు.
మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్, షర్మిల, వైఎస్ భారతమ్మ,విజయమ్మ, భారతీరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు
 

 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నివాళి

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ముందు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యేలందరూ పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు. ‘వైఎస్సార్ అమర్ హై’, ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడినుంచి వాహనాల్లో బయలుదేరి పంజాగుట్ట వద్ద గల వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు పేద, బడుగు వర్గాల ప్రజలకోసం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్‌దేనని కొనియాడారు. ఆయన లేని లోటు ఇపుడు తెలుగు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
 
 అసెంబ్లీ సెంట్రల్‌హాలులో..
 
 పంజాగుట్ట నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యేలు సెంట్రల్ హాలులోని వైఎస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు. అక్కడినుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, ఆదిమూలం సురేష్, కిడారు సర్వేశ్వరరావు, మణిగాంధీ, కళత్తూరు నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు, వరుపుల సుబ్బారావు, పాలపర్తి డేవిడ్‌రాజు, షేక్ బేపారి అంజాద్‌బాషా, పి.అనిల్‌కుమార్‌యాదవ్, తిరువీధి జయరామయ్య, మేకా ప్రతాప అప్పారావు, కొరుముట్ల శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, షేక్ ముస్తఫా, కొడాలి నాని, గొట్టిపాటి రవికుమార్, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, విశ్వాసరాయి కళావతి, గిడ్డి ఈశ్వరి, ఐజయ్య, వంతెల రాజేశ్వరి, ఆర్.కె.రోజా, సి.ఆదినారాయణరెడ్డి, కంబాల జోగులు, కలమట వెంకటరమణ, కొక్కిలిగడ్డ రక్షణనిధి, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వై.బాలనాగిరెడ్డి,  పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.
 
 
.
 
 బడుగుల మనసెరిగిన నేత వైఎస్
 
 వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పలువురి నివాళి

 పేద, బడుగు, బలహీన వర్గాల మనసెరిగిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, అందుకే ఆయన దేశంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ వర్గాల ప్రజల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన పథకాలు అమలు చేశారని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ అవిభక్త రాష్ట్రంలో ఆయన అమలు చేసిన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని శ్లాఘించారు. ఇప్పటికీ వైఎస్ లేనిలోటు కనిపిస్తూనే ఉందన్నారు. పరిపాలనంటే ఎలా ఉండాలో చేసి చూపిన వ్యక్తి వైఎస్ అని పీఏసీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ కొనియాడారు.
 
 సంతృప్తస్థాయి విప్లవాత్మకం
 
 వైఎస్ సీఎంగా ఉన్నపుడు కుల, మత, ప్రాంత, రాజకీయాలకతీతంగా ‘సాచ్యురేషన్’ (సంతృప్తస్థాయి) విధానాన్ని సంక్షేమ పథకాల్లో అమలు చేయడమనేది విప్లవాత్మకమని పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నిరుపేదలకు సైతం ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత వైఎస్‌దేనని సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, విజయసాయిరెడ్డి, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాశ్ తదితరులు మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో కొణతాల రామకృష్ణ, విజయసాయిరెడ్డితో సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. అనాథ విద్యార్థులకు ఆర్థిక సాయం, పుస్తకాల పంపిణీ ఈ సందర్భంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో వాసిరెడ్డి పద్మ, రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, పుత్తా ప్రతాపరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చెరగని జ్ఞాపకం

Written By news on Tuesday, September 2, 2014 | 9/02/2014

చెరగని జ్ఞాపకం
సాక్షి, చిత్తూరు: వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లోనూ నిర్లక్ష్యానికి గురైన జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు వైఎస్సార్. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్సార్ చిత్తూరు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపారు. 2004 వరకూ నిర్లక్ష్యానికి లోనైన  గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పనులను శరవేగంగా ముందుకు కదలించారు. నాలుగువేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కాలువల తవ్వకం కూడా పూర్తయింది. వైఎస్ మరణంతో రెండు ప్రాజెక్టుల పురోగతికి బ్రేక్ పడింది.
     
పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమ బెల్ ఏర్పాటుకు మన్నవరంలో శంకుస్థాపన చేశారు. రాజస్థాన్, తమిళనాడు, రాష్ట్రాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టును మన రాష్ర్టంలో ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇది పూర్తయితే 6వేలమందికి ఉపాధి లభిస్తుంది.
     
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు విమానాశ్రయ విస్తరణ పనులకు భూ సేకరణ చేయించారు.
     
తూర్పు మండలాల్లోని మెట్ట ప్రాంత రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా స్వర్ణముఖి-సోమశిల కాలువ పనులకు శ్రీకారం చుట్టారు.
     
చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల రైతాంగం కోసం తిరుపతిలో 14 కోట్ల రూపాయలతో వేపర్‌హీట్ ట్రీట్‌మెంట్ ప్లాంటును ఏర్పాటు చేశారు. పండ్లను శుద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇది అనువుగా ఉంటుంది.
     
తిరుపతి, చిత్తూరు మున్సిపాలిటీలకు కార్పొరేషన్ హోదా కల్పించారు. తిరుపతిని జవహరలాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్(జేఎన్‌ఎన్ యూఆర్‌ఎం) జాబితాలో చేర్చారు. దీని ద్వారా తిరుపతి అభివృద్ధికి 2.223 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు అవకాశం ఏర్పడింది. తిరుపతి నగరంలో 20వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చారు. మొదటి విడత గృహాలు పూర్తి చేసి పేదలకు అందజేశారు.
     
తిరుపతిలో వెటర్నరీ యూనివర్శిటీ స్థాపించారు.
     
వేదవిద్యలో మరింత పురోగతి సాధించేందుకు వీలుగా టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
     
మదనపల్లె పట్టణానికి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు 43 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
     
స్విమ్స్‌లో అత్యాధునిక ఆంకాలజీ యూనిట్ ప్రారంభించారు.
     
రాయలసీమలోనే తొలిసారిగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా కొత్త కలెక్టరేట్ నిర్మించారు.
     
వాల్మీకిపురం వద్ద సుమారు 7కోట్ల రూపాయలతో బోగంపల్లి రిజర్వాయర్, కలిచెర్ల వద్ద ఆకుమానుగుంట రిజర్వాయర్ నిర్మించారు. ఆయన మరణంతో ఎడమకాలువ పనులు నిలిచిపోయాయి.
     
తంబళ్లపల్లె వద్ద చిన్నే ప్రాజెక్టును సుమారు 3 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించారు. ఇలా తాను సీఎంగా ఉన్న కాలంలో ప్రతి అభివృద్ధి పనిని పరుగులు పెట్టించారు.
 
 వైఎస్‌ఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహిద్దాం
 - పార్టీ శ్రేణులకు నారాయణస్వామి పిలుపు
 తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.నారాయణస్వామి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైఎస్‌ఆర్ చిత్రపటాలు లేదా విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించాలని కోరారు. రక్తదానం, పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు వైఎస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని నారాయణ స్వామి కోరారు.
 
 మాట తప్పని నేత వైఎస్సార్
 జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉండి జిల్లా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తే...సొంత జిల్లాలా భావించి చిత్తూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన గొప్ప నాయకుడు వైఎస్సార్. మహిళలను లక్షాధికారులను చేస్తానని మాట ఇచ్చి చేతల్లో చూపిన మాటతప్పని నేత ఆయన. అలాంటి వ్యక్తి ఆశయాల సాధన కోసం ఆవిర్భవించిన పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. మళ్లీ వైఎస్సార్ స్వర్ణయుగం రావడం ఖాయం. వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ సేవాకార్యక్రమాలు చేయాలి. మహిళలంతా వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి.
 -గాయత్రీదేవి, మహిళావిభాగం జిల్లా కన్వీనర్

Popular Posts

Topics :