14 September 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రుణ మాఫీ కోసం ఇక పోరుబాట

Written By news on Saturday, September 20, 2014 | 9/20/2014

రుణ మాఫీ కోసం ఇక పోరుబాట
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  
 అక్టోబర్ 16న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా
 
సాక్షి, అనంతపురం: రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించిన చంద్రబాబు అసలు స్వరూపాన్ని బయట పెట్టడంతోపాటు, రుణమాఫీ అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అక్టోబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో మనోవేదనకు గురవుతున్న రైతన్నలకు దన్నుగా, అక్కాచెల్లెళ్లకు అండగా నిలవాలన్నదే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. అక్టోబర్ 16న తహశీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టనున్న ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అక్కాచెల్లెళ్లు పాల్గొని చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతపురంలోని బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న రామకృష్ణ ఫంక్షన్ హాలులో రెండు రోజులపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు నిర్వహించారు. శుక్రవారం అనంతపురం, కళ్యాణదుర్గం, రాప్తాడు, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల సమీక్ష ముగింపులో ఆయన మాట్లాడారు. అనంతరం మీడియాతోనూ ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు...
 
 చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంతో డ్వాక్రా చెల్లెమ్మ పొదుపు ఖాతాలో నుంచి బ్యాంకు అధికారులు డబ్బులు తీసేసుకుంటున్నారు. దీంతో కడుపుమండి చెల్లెమ్మలు నిన్నటికి నిన్న శ్రీకాకుళంలో చుట్టుముట్టారు. మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాను.. మీ వడ్డీనంతా నేనే కడతానని బాబు మోసపూరిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇప్పుడిస్తున్నది వడ్డీ లేని రుణాలే కదా! 
 
 చంద్రబాబు మాటలు నమ్మి.. బ్యాంకులకు పాత రుణాలు చెల్లించక, కొత్త రుణాలు పుట్టక, రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జూన్ 30లోపు రుణాలు కట్టలేదు కాబట్టి 13 శాతం వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకులు చెబుతున్నాయి. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. పంటల బీమా లేదు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి బాబును రక్షించేందుకు టీవీ-9, ఈనాడు, ఆంధ్రజ్యోతి కలసికట్టుగా పని చేస్తున్నాయి. 
 
 బీసీలపై బాబు కపట ప్రేమ
 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేందుకే బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారే తప్ప బీసీలపై ప్రేమతో కాదు. అనంతపురంలో ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు గెలిస్తే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడమే బాబుకు బీసీలపై ఉన్న కపట ప్రేమకు నిదర్శనం.
 
 ప్రస్తుతం రాష్ట్రంలో తమిళనాడు తరహాలో రెండే పార్టీలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నిర్దేశించిన మూడోవంతు నియోజకవర్గాల్లో బీసీలకే టికెట్లు ఇస్తే అప్పుడు ఏ పార్టీవారు గెలిచినా అసెంబ్లీలో బీసీలకు మూడోవంతు ప్రాతినిధ్యం ఉంటుంది. అందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు సిద్ధమేనా? 
 
 పచ్చ చొక్కాల వారి కోసమే 135 జీవో
 పేదలకు అందాల్సిన పింఛన్లను పచ్చ చొక్కాలవారికి అందించడానికి బాబు భారీ కుట్రకు తెరలేపారు. ఇందులో భాగంగానే 135 జీవో జారీ చేశారు. ఈ జీవో ప్రకారం పింఛన్ లబ్ధిదారుల అర్హతలను గుర్తించడానికి వేసే కమిటీల్లో సభ్యులను నిర్ణయించే అధికారాన్ని మంత్రులకు కట్టబెట్టారు. టీడీపీ మంత్రులు నిర్ణయించిన వ్యక్తులతో కమిటీల ఏర్పాటు, ఆ కమిటీలు నిర్ణయించిన వారికే పింఛన్లు అందుతాయంటే ఏం జరగనుందో తెలుస్తోంది. 
 
 ఏపీలో 43,11,688 మంది పింఛన్‌దారులుండగా కొత్త పింఛన్లకోసం 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త దరఖాస్తులను పక్కన పెట్టినా, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తం నెలకు రూ.130 కోట్లు చొప్పున ఐదు నెలలకు రూ.650 కోట్లు అవుతుంది. అక్టోబర్ 2 నుంచి పెంచనున్న మొత్తంతో ఏడు నెలలకు రూ.3,050 కోట్లు అవుతుంది. అంతా కలిపి రూ.3700 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో చంద్రబాబు రూ.1338 కోట్లే కేటాయించారు. ఈ కేటాయింపులను బట్టి చూస్తే పింఛన్లలో భారీగా కోత పెట్టడానికి జరుగుతున్న కుట్ర ఎవరికైనా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పుడు పింఛన్లు అందుకుంటున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారనే కొత్త నాటకానికి తెర లేపారు.

పార్టీ పటిష్టతకు పాటు పడదాం

ప్రతిపక్షంగా ప్రజలకు బాసటగా ఉందాం..
- పార్టీ పటిష్టతకు పాటు పడదాం  
- జగన్ స్ఫూర్తితో పోరాడదాం
- తుని సమావేశంలో వైఎస్సార్ సీపీ శ్రేణులకు జ్యోతుల పిలుపు
తుని : ‘ఎన్నికలు ముగిసిన ఘట్టం.. ఇకపై అందరం పార్టీ పటిష్టతకు కార్మోన్ముఖులై, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజలకు బాసటగా ఉందాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలకు తూర్పు సెంటిమెంట్‌తో శుక్రవారం తునిలో శ్రీకారం చుట్టారు. మర్చంట్స్ అసోషియేషన్ కళ్యాణమండపంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన సమావేశానికి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.
 
ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఉత్తేజభరితంగా ప్రసంగించారు. పోరాట పటిమ ఉన్న పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని స్పూర్తిగా తీసుకుని ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తండ్రి ఆశయసాధనకు జగన్ ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని అవిశ్రాంత పోరాటం చేస్తున్నారన్నారు. ఉచ్ఛనీచాలు లేని చంద్రబాబును ఎదుర్కోవాలంటే అంకితభావం కలిగిన కార్యకర్తలకు దన్నుగా నిలవాలని నేతలకు సూచించారు. పార్టీ కోసం పాటు పడే నేతలకు అండదండగా ఉండేందుకు తన కుటుంబాన్ని కూడా వదిలి సేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. జిత్తులమారి యనమల రామకృష్ణుడుని సవ్యసాచిలా ఎదుర్కొందామని భరోసానిచ్చారు. టీడీపీ నాయకులు గ్రామాల్లో దారుణమైన పరిస్థితిని సృష్టిస్తున్నారని, ఫించన్ ఏరివేతలో  వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులను ఇరికించాలని చూస్తున్నారని, నిజాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని జ్యోతుల అన్నారు.
 
నూరు పాత్రలు పోషిస్తున్న     టీడీపీ కార్యకర్తలు : జక్కంపూడి
పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ పార్టీని విజయవంతంగా నడపడంలో నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలన్నారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ సినిమా యాక్టర్లు రెండు, మూడు పాత్రలు పోషిస్తే, చంద్రబాబు టీడీపీ కార్యకర్తలు వంద పాత్రలు పోషించేలా చేస్తున్నారని విమర్శించారు. జక్కంపూడి రామ్మెహనరావు పోరాటస్ఫూర్తితో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఇప్పుడు ఉన్న జాబులకు మంగళం పలుకుతున్నారని విమర్శించారు.

పేదను ఎమ్మెల్యేని చేసిన జగన్ : వంతల
పేదరాలైన తనను జగన్ ఎమ్మెల్యే చేశారని రంపచోడవరం ఎమ్మెల్యే వంతం రాజేశ్వరి అన్నారు. వాగ్దానాలను నెరవేర్చే సంస్కృతి చంద్రబాబుకు లేదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ధ్వజమెత్తారు. మీ ఇంటి పెద్ద కొడుకునై సెజ్ భూములన్నీ రైతులకు అప్పగిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు సెంట్ భూమిని కూడా ఇవ్వని పరిస్థితికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. సెజ్ భూములన్నీ జగన్‌వేనని మోసపూరితమై విమర్శలు చేశారని, అవి జగన్‌వేనని రుజువు చేస్తే పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేదనడానికి తనపై పెట్టిన కేసే ఉదాహరణని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ అన్నారు.
 
పార్టీ రాష్ట కార్యదర్శలు జక్కంపూడి రాజా, గుండా వెంకటరమణ, పార్టీ కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, గిరజాల స్వామినాయుడు, తోట సుబ్బారావు నాయుడు,  పెండెం దొరబాబు, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, గారపాటి ఆనంద్, రొంగలి లక్ష్మి ప్రసంగించారు. పార్టీ అధికార ప్రతినిధులు కొమ్మిశెట్టి బాలకృష్ణ, పి.కె.రావు, రావూరి వేంకటేశ్వరరావు, నాయకులు వాసిరెడ్డి జమీలు, అత్తిలి సీతారామస్వామి, విప్పర్తి వేణుగోపాల్, దుంగా రామసత్యనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస్, కుసుమంచి శోభారాణి తదితరులు పాల్గోన్నారు.
 
జ్యోతులకు సన్మానం
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తుని తొలిసారిగా వచ్చిన జ్యోతులను తుని నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఘనంగా సత్కరించారు. పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

రోజాపై దాడిలో ఎర్రచందనం స్మగ్లర్ కీలక పాత్ర

రోజాపై దాడిలో ఎర్రచందనం స్మగ్లర్ కీలక పాత్ర
  • నియోజకవర్గనేత తనయునికి సన్నిహితుడు  
  •  బియ్యం, ఇసుక, లిక్కర్ మాఫియాలో టీడీపీ ముఠా: రోజా  
పుత్తూరు: నగరి పట్టణంలో వారం కిందట జరిగిన గంగ  జాతర ఉత్సవాల్లో నగరి ఎమ్మెల్యే రోజాపై చోటుచేసుకున్న దాడి సంఘటనలో నగరికి చెందిన టీడీపీ నాయకుడు, ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర ఉందనే విషయం తెలిసింది. దాడికి ప్రోత్సహించడంతో పాటు రోజాపై వ్యతిరేకంగా ధర్నాలకు సహకరించిన శ్రీనివాసులు ఎర్రచందనం తరలిస్తూ శుక్రవారం వడమాలపేట పోలీసులకు పట్టుపడ్డారు. ఇతనితోపాటు స్నేహితుడు చంద్రబాబు, నగరిపట్టణం సత్రవాడకు చెందిన రమేష్‌కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

టీడీపీలో మండల యువత అధ్యక్షుడి  హోదాలో కొంతకాలం, ప్రస్తుతం మండలస్థాయి నాయకుడి హోదాలో పట్టణంలోని బేరి వీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ప్రతిరోజూ లక్షల్లో ఫైనాన్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 
మరోవైపు టీడీపీ నియోజకవర్గనేత, మాజీ ప్రజాప్రతినిధి తనయుడితో సన్నిహితంగా ఉంటున్నారనేది ఆ పార్టీ వర్గాల వాదన. దీనిని పరిశీలిస్తే ఆపార్టీ నేతకు నగరిలో ఇసుక, బియ్యం స్మగ్లింగ్‌తోపాటు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. దొంగలు దొంగ లు కలసి ఊర్లు పంచుకున్నట్లుగా అధికారపార్టీకి చెందిన నాయకులు ఇలా బరితెగిస్తున్నరంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా నగరి గంగజాతరలో రోజాపై జరిగిన దాడిలో టీడీపీకి చెందిన ఆరుగురిని ప్రోత్సహించి  కీలకపాత్ర వహించడంలో శ్రీనివాసులుపై ఎర్రచందనం దొంగలించినట్లుగా  కేసు నమోదు కావడం సందేహాలకు తావిస్తోంది.

పట్టుపడ్డ వారు అధికారపార్టీకి చెందిన వారు కావడంతో వారిని బహిరంగంగా చూపించడలో ముఖానికి ముసుగు వేసి  పోలీసులు జాగ్రత్త వహించారనే వాదనలు లేకపోలేదు. ఇటీవల ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడిన తమిళ తంబీలు, ఇతర ప్రాంతాలకు చెందిన వారి ముఖాలు కనిపించే విధంగా పోలీసు, అటవీ శాఖ అధికారులు వాహనాలతో సహా ఫోటోలు దిగారు. అయితే ఇందుకు భిన్నంగా వడమాలపేటలో పోలీసు అధికారులు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
ముందుగా పోలీసుల దృష్టికి తెచ్చా
నగరిలో బియ్యం, లిక్కర్, ఇసుక మాఫీయాతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో టీడీపీ నాయకులు ఉన్నారనే విషయాన్ని ముందుగానే పోలీసుల దృష్టికి తెచ్చాను. కాగా ఈనెల 12 వ తేదీన నగరిలో నిర్వహించిన జాతర సందర్భంగా అమ్మవార్లు ఊరేగింపులో నాపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డాడు.
 -ఆర్‌కే. రోజా, నగరి ఎమ్మెల్యే

చంద్రబాబును గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిందే

Written By news on Friday, September 19, 2014 | 9/19/2014


చంద్రబాబును గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిందే: అంబటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆస్తుల ప్రకటన ప్రజలను వంచించే విధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటించి ఆస్తుల ప్రకటన కాదని.. అక్రమ ఆస్తుల ప్రకటన అని వ్యాఖ్యానించారు. 
 
హెరిటేజ్ కంపెనీలో వందల కోట్ల ఆస్తులు, బాలాయపల్లి భూములు, హైటెక్ సిటీ పరిసరాల్లో ఫామ్ హౌజ్, తనయుడు లోకేశ్ పేరు మీద ఇల్లు, ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు, సంపద, నగలు, నగదు రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సాధించారంటే ఆశ్యర్యమేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ ఈ స్థాయిలో సంపాదించారంటే గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాల్సిన అవసరముందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 

మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి


'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి'
హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావుపై దాడి చేసిన ఏలూరు ఎంపీ మాగంటి బాబును వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణలోని వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో గట్టు రామచంద్రరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మాగంటి బాబు ఆయన గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు నీకేమైనా ఓటు వేశారా అని మాగంటి బాబు ను గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే దాడిపై తెలంగాణ గిరిజన ఎమ్మెల్యేలు, ఆ రాష్ట్రా సీఎం, గవర్నర్ ను కలవనున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని గట్టు ఆరోపించారు.

అయితే తాటి వెంకటేశ్వరరావు పై దాడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు ఖండించారు. శుక్రవారం తాటి వెంకటేశ్వరరావుకు హరీష్ రావు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి గల కారణాలను హరీష్ రావు ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు.

బాబు మంచోడు..కేంద్రం, ఆర్‌బీఐ చెడ్డవట!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో రెండోరోజు పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.  శుక్రవారం ఆయన అనంతపురం, కల్యాణదుర్గం నియోజకవర్గ నేతలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే వైఎస్ఆర్ సీపీనే అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. అధికారం కోసం ఏ గడ్డైనా తిన పద్ధతి మంచిది కాదని, సీఎం పదవి కోసం మోసం చేయాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రబాబు రోజుకో అబద్ధంతో పాలన సాగిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. డ్వాక్రా మహిళల వడ్డీ తానే చెల్లిస్తాననడం సిగ్గుచేటు అని, వాస్తవానికి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తున్నారని, లేని వడ్డీని  ఎలా కడతారో చంద్రబాబే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానన్న బాబు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నారన్నారు. రుణాల మాఫీపై  ప్రభుత్వ కాలయాపన వల్ల కొత్త రుణాలు మంజూరు కాలేదన్నారు.

జాబు రావాలంటే బాబు రావాలన్నారని...జాబు ఇవ్వలేకపోతే రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో నిలదీస్తే నేనెప్పుడు చెప్పానంటూ బాబు తప్పుకున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 43 లక్షల 11వేల పెన్షన్లు ఉన్నాయని, కొత్తగా 15 లక్షల మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వృద్ధులకు 1000, వికలాంగులకు 1500 పెన్షన్ అందాలంటే రూ.3700 కోట్లు అవసరమన్నారు. బడ్జెట్‌లో మాత్రం రూ. 1338 కోట్లు మాత్రమే కేటాయించిందని వైఎస్ జగన్ అన్నారు. 135 జీవో ఆధారంగా పెన్షన్లను ఎలా కత్తిరించాలో ప్రభుత్వం చూస్తోంది. అమ్మహస్తం పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.

చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 మద్దతు ఇస్తున్నాయని, బాబు చెప్పే ప్రతి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు మంచోడు..కేంద్రం, ఆర్‌బీఐ, బ్యాంకులు చెడ్డవని ప్రచారం చేస్తాయని వైఎస్ జగన్ అన్నారు. బాబుకు లేనిది...మనకు ఉన్నది విశ్వసనీయతే అని ఆయన వ్యాఖ్యానించారు. బాబు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేద్దామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

కత్తెర వేయడమే చంద్రబాబు విధానం

కత్తెర వేయడమే చంద్రబాబు విధానం
పింఛన్ల జీవోపై వాసిరెడ్డి పద్మ ధ్వజం 
సాక్షి, హైదరాబాద్: రకరకాల షరతులు విధించి ఏదో రకంగా సంక్షేమ పథకాలకు కోత పెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబా బు విధానంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. వృద్ధులకు పింఛన్లను అందకుండా చేయడానికే తాజాగా పింఛన్ల జీవో తెచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నష్టం చేకూర్చే 135 వ జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. ఎన్నికల ప్రచార సమయంలో వృద్ధాప్య పింఛన్లను వె య్యి రూపాయలు చేస్తానని ఆశపెట్టిన చంద్రబాబు ఇప్పుడు తీరా ఎన్నికలయ్యాక, ఇపుడు సమీక్ష పేరుతో పింఛన్ల తొల గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ‘‘జీవో 135 ప్రకారం పింఛన్ల సమీక్షా కమిటీలో ఆ యా గ్రామాల సర్పంచ్‌లు, మునిసిపల్ ఛైర్మన్లు, మేయర్లతో పాటుగా ఇద్దరు స్వయం సహాయక గ్రూపు వారు, మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉంటారని పేర్కొన్నారు.
 
  సహా యక గ్రూపులు, సామాజిక కార్యకర్తల పేరుతో సమీక్షా కమిటీలను టీడీపీ వారితో నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది. హడావిడిగా జీవోను జారీ చేసి 19, 20 తేదీల్లోపు కమిటీలు సమావేశమై పింఛను లబ్ధిదారులను సమీక్షించాలని నిర్ణయిం చడం అన్యాయం. అక్టోబర్ 2 నుంచి పెన్షన్ల మహోత్సవమం టూ దానికి ముందు సమీక్ష పేరుతో వృద్ధుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇది జాతర ముందు బలివ్వడంలా ఉంది. రూ.200 స్వల్ప మొత్తాన్ని కూడా వృద్ధులకు అందకుండా చేయడం దారుణం. ఇప్పటికే 15 లక్షల దరఖాస్తులు అపరిషృ్కతంగా ఉన్నా వాటి గురించి ఆలోచించకుండా ఉన్న వాటిని తొలగించాలని చూడటం విచిత్రం. పింఛన్లు అదనంగా పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తే వారిని తొలగించడానికి అధికారులతో ఒక శాస్త్రీయ ప్రక్రియ ద్వారా చేయాలి తప్పితే ఇలా హేతు రహితంగా కమిటీలను నియమించడమేమిటి? ’’ అని పద్మ మండిపడ్డారు.

ఆయన మోసాన్ని రైతులు, చెల్లెమ్మలే ప్రశ్నిస్తారు

చంద్రబాబును నిలదీసే రోజులొస్తున్నాయి
 * వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* ఆయన మోసాన్ని రైతులు, చెల్లెమ్మలే ప్రశ్నిస్తారు
* రుణ మాఫీపై రోజుకో మాట.. తాజాగా పింఛన్లలో కోత


సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు, చెల్లెమ్మలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నాలుగు నెలలుగా రుణమాఫీ అంశంపై రోజుకో మాట మారుస్తూ వస్తున్న చంద్రబాబు.. తాజాగా పింఛన్లలో కోతలకు సిద్ధమవుతున్నాడు. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ల సంఖ్యను భారీగా తగ్గించడం, ఆ ఇచ్చే పింఛన్లు కూడా పచ్చ చొక్కాలకే అందేలా విధివిధానాలు రూపొందిస్తున్నాడు.

*ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా సక్రమంగా నెరవేర్చని చంద్రబాబు మోసపూరిత వైఖరిని రైతులు, చెల్లెమ్మలు నిలదీసే రోజులొస్తున్నాయి’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గాల వారీగా రెండు రోజుల సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు గురువారం ఉదయం ఆయన నగరానికి చేరుకున్నారు. బెంగళూరు జాతీయ రహదారిలోని రామకృష్ణ ఫంక్షన్ హాలులో గురువారం మొదలైన సమీక్ష సమావేశం ప్రారంభంలో జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..

చంద్రబాబు మాటలకు మోసపోయిన ప్రజలు ఈ రోజు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలబడి బాబు ప్రజా వ్యతిరేక చర్యలపై ముందుండి పోరాడాలి.

ఎన్నికల్లో బాబు కూటమికి, మనకి తేడా దాదాపు ఐదు లక్షల ఓట్లు మాత్రమే. గడిచిన కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో నాకు వచ్చిన మెజార్టీనే 5.45 లక్షల ఓట్లు. ఈ మెజార్టీతో పోల్చుకుంటే చంద్రబాబు కూటమికి రాష్ర్టవ్యాప్తంగా వచ్చిన ఓట్లు పెద్దలేక్కేమీ కాదు. నేనూ చంద్రబాబులా అబద్ధపు మాటలు చెప్పి ఉంటే.. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉండేది, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండేవారు. ఎలాగోలా అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నాడు. గ్రామాల్లోకెళ్తే రైతులు, అక్కచెల్లెళ్లు నిలదీస్తున్నారు. తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు.

పింఛన్లను కత్తిరించడానికి చంద్రబాబు జీవో 135ను కొత్తగా తయారుచేశారు. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఇతర పింఛన్లకు సంబంధించి 43,11,668 మంది లబ్ధిదారులు ఉన్నారు. పింఛన్ మొత్తం పెంచడానికి రూ. 3,700 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.1300  కోట్లు కేటాయించారంటే దాని అర్థం రూ. 2,400 కోట్లు కోత విధించడమే. ఈ పింఛన్ల లబ్ధిదారులపై కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల్లో టీడీపీ వారికి మాత్రమే స్థానం కల్పిస్తుండటం మరో దారుణం. టీడీపీ శ్రేణులకే ఫించన్లు వచ్చే మాదిరి గా బాబు మాయోపాయాలు పన్నుతున్నాడు.

జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేటు ఉద్యోగాలంటూ మాట మారుస్తున్నాడు.

 బాబు మాటలతో మోసపోయిన రైతన్నలు
* రైతులకు సంబంధించి రూ.87 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తానని తన మోసపూరిత మాటలతో చంద్రబాబు కొద్దో గొప్పో రైతులను నమ్మించాడు. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతన్నలు నేడు దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్‌లో వారికి బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలకు 13 శాతం వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకులు చెబుతున్నాయి. మరోవైపు పంటల బీమా అం దని పరిస్థితి. డ్వాక్రా మహిళల పొదుపు నుంచి సొమ్మును బ్యాంకులు తీసుకుంటున్నాయి. ఇంత దారుణంగా బాబు ప్రజలను మోసం చేస్తున్నాడు

హామీల ఎగవేతకు బాబు ప్రయత్నం

హామీల ఎగవేతకు బాబు ప్రయత్నం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ఎగవేతకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దొడ్డిదారులు వెతుకుతున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.ఒక ఉత్పాదక వ్యయంగా ఖర్చు పెట్టాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటు గానీ, వయో వృద్ధులను ఆదుకోవడం కోసం ఇచ్చే పెన్షన్ల విషయంలో గానీ ప్రభుత్వ తీరు సక్రమంగా లేదని దుయ్యబట్టారు.
 
సీనియర్ మంత్రులను కూడా పక్కన పెట్టి చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన నేతలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.  ‘‘పెన్షన్ల కోసం రూ. 2,882 కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ. 1,338 కోట్లు కేటాయించారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ. 4,300 కోట్లు అవసరం కాగా 2040 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆహార సబ్సిడీకి రూ. 4,173 కోట్లు అవసరం కాగా కేవలం రూ. 2,318 కోట్లు కేటాయించారు. ఇది వృద్ధులు, విద్యార్థులు, పేదలకు మొండిచేయి చూపించే ప్రయత్నమే ’’ అని నె్రహూ దుయ్యబట్టారు.

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపై టీడీపీ కార్యకర్తల దాడి

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపై టీడీపీ కార్యకర్తల దాడి
  •  పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సాక్షిగా పిడిగుద్దులు  
  •  రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన గిరిజన ఎమ్మెల్యే
 అశ్వారావుపేట/కుక్కునూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఏపీకి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలవరం ముంపు మండలాల ఆదివాసీలకు మెరుగైన ప్యాకే జీతో కూడిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సాక్షిగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. కిందపడేసి కుర్చీలతో దాడి చేశారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వివరాలివీ.. పోలవరం ముంపు ప్రాంతాల కింద ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గురువారం సమావేశాలు నిర్వహించారు. కుక్కునూరులో సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు వెళ్లారు. 
 
ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఎందుకు పిలవలేదని కలెక్టర్ కాటమనేని ప్రశ్నించారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ‘సారీ సార్ మర్చిపోయాం.. మరోసారి సమావేశాలను తెలియజేస్తామ’ని చెప్పారు. ఎంపీ మాగంటి బాబుతో ఎమ్మెల్యే కరచాలనం చేసి తన డిమాండ్‌లను వినిపిస్తుండగా.. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ.. పరుష పదజాలంతో మాట్లాడారు. ‘నువ్వెవడివిరా.. తెలంగాణ వాడివి.. ఆంధ్రకు నువ్వెందుకు వచ్చావు..’ అంటూ దాడికి దిగారు. మాగంటి అనుచరుడు కూడా ఎమ్మెల్యేపై దాడి చేశాడు. ప్రాంగణంలోని దాదాపు 20మందికి పైగా టీడీపీ కార్యకర్తలు గిరిజన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దారు. కులం పేరుతో దూషిస్తూ.. చంపేస్తామంటూ హెచ్చరించారు. దాడిని ఆపాల్సిన పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారు. 
 
కలెక్టర్, ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఎమ్మెల్యే తాటిని కుక్కునూరు పోలీసులు విచక్షణారహితంగా రోడ్డు మీదకు ఈడ్చుకురావడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. తనపై జరిగిన దాడికి నిరసనగా రోడ్డుపైనే దాదాపు మూడు గంటలపాటు బైఠాయించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తాటికి మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దాడికి నిరసనగా శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ బంద్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. కాగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి పాల్పడిన, పురికొల్పిన 15 మందిపై కుక్కునూరు ఎస్సై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 అబద్ధాల ప్రచారం

Written By news on Thursday, September 18, 2014 | 9/18/2014


'ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 అబద్ధాల ప్రచారం'
అనంతపురం: చంద్రబాబు నాయుడులా అబద్దాలు చెప్పలేదు, మోసం చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా నేతలతో ఆయన గురువారం నియోజవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్ జగన్ ...ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు.  ఎన్నికల్లో గెలుపుకు 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉందన్నారు.

ఒక్క కడప ఉప ఎన్నికల్లోనే  వైఎస్‌ఆర్‌సీపీకి 5.30 లక్షల మెజార్టీ వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. గత ఎన్నికల్లో ఓటమికి నరేంద్ర మోడీ హవా...రుణమాఫీ హామీ ప్రధాన కారణాలుగా చెప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని, ఇప్పుడు ఆ హామీల అమలు నుంచి తప్పించుకోవాలనుకోవటం సమంజసమా అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఎన్నికల సందర్భంగా అబద్ధాలు ప్రచారం చేశాయని వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేవు కదా అని బాబు అడ్డగోలు పాలన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మనకు ఉన్నది...చంద్రబాబుకు లేనిది విశ్వసనీయతే అని వైఎస్ జగన్ అన్నారు. పార్టీ బలోపేతం కోసమే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, గత ఎన్నికల్లో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేశామని, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ అన్నారు.

కొడికొండలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం


కొడికొండలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొడికొండలోలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ గురువారం అనంతపురం జిల్లా చేరుకున్నారు. ఆయన  రెండు రోజుల పాటు జిల్లాలో పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
అనంతపురంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో పెనుకొండ, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, మడకశిర, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గ నేతలతో  వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు జిల్లాలో పార్టీ పరిస్థితులు, పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లా నియోజకవర్గ నేతలు హాజరు కానున్నారు.

నీచ రాజకీయాలు వద్దు

Written By news on Wednesday, September 17, 2014 | 9/17/2014

నీచ రాజకీయాలు వద్దు
నగరి : జాతర గొడవల్లో తాను కులదూషణ చేసినట్లు టీడీపీ నాయకులు అనవసరంగా రాద్దాంతం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. మంగళవారం ఆమె విలేకరితో మాట్లాడారు. కుల దూషణ చేసే తత్వం తనది కాదన్నారు. వీడియో క్లిప్పిం గులు పరిశీలించినవారికి నిజం తెలుస్తుందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే కులదూషణ చేసినట్లు బూటకపు మాటలు చెబుతూ పబ్బంగడుపుతున్నారన్నారు. జాతరలో దేవతల హారతికి వచ్చాను తప్ప, తొలి హారతి ఇవ్వాలని తాను అడగలేదన్నారు. హారతి కోసం వచ్చిన తనపై అపవాదు వేయడం సబబుకాదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తిలేదన్నారు.

వైఎస్ఆర్ సిపి తెలంగాణ కమిటీ సమావేశం వాయిదా

Written By news on Tuesday, September 16, 2014 | 9/16/2014


హైదరాబాద్: రేపు జరుగవలసిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతల సమావేశం వాయిదాపడింది.   లోటస్‌పాండ్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో రేపు ఉదయం 11 గంటలకుపార్టీ తెలంగాణ కమిటీ నేతల సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించారు.

ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తారని అనుకున్నారు. అయితే అనుకోని పరిస్థితులలో ఈ సమావేశం వాయిదాపడింది.

పార్టీ నేతలకు రేపు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం


పార్టీ నేతలకు రేపు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశంవైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు దిశానిర్దేశం చేయనున్నారు. లోటస్‌పాండ్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో రేపు ఉదయం 11 గంటలకు పార్టీ తెలంగాణ కమిటీ నేతల సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశంలో పార్టీ నేతలకు జగన్ కొన్ని కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి వివరిస్తారు.

వైఎస్ జగన్ పిటిషన్ పై వచ్చే వారం విచారణ


వైఎస్ జగన్ పిటిషన్ పై వచ్చే వారం విచారణవై.ఎస్.జగన్‌మోహన్‌ రెడ్డి
హైదరాబాద్: భద్రత కుదింపుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపి ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తనకున్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ జగన్ నిన్న హైకోర్టును ఆశ్రయించారు. గత మూడేళ్ల నుంచి తనకు కొనసాగుతూ వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతను యథాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వైఎస్సార్ జిల్లా ఎస్‌పీ, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టులపై నిషేధం విధించారని, ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భద్రతనిచ్చారని, అందులో భాగంగా తనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించారని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మావోయిస్టుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు కొనసాగుతూ వస్తోందని తెలిపారు. ‘నా తండ్రి మరణించిన తరువాత కూడా నాకు జెడ్ కేటగిరి భద్రత కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి కూడా ఇదే రకమైన భద్రత కల్పిస్తూ వస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులకు ఇప్పటికీ జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. ప్రతిపక్షనేతగా నాకు కేబినెట్ హోదా ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 13న ప్రతివాదులు నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా నాకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారు. ఉపసంహరణకు సంబంధించి ఇప్పటివరకు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. హైదరాబాద్‌లో నివాసం ఉండే నేను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇరు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను. రాజకీయ దురుద్దేశాల్లో భాగంగానే ఇరు ప్రభుత్వాలు కలిసి నా భద్రతను ఉపసంహరించాయి. నాకున్న ప్రాణహానికి, ఈ విషయాన్ని ధృవపరుస్తున్న నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భద్రతను ఉపసంహరించారు. నాకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. అందువల్ల నాకున్న జెడ్ కేటగిరి భద్రతను మెరుగుపరిచి, దానిని కొనసాగించాలని నిఘా వర్గాలు చెప్పాయి. నిఘా వర్గాల నివేదికలకు విరుద్ధంగా ప్రతివాదులు నాకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారు. నాకు జెడ్ కేటగిరి భద్రతను కల్పించేటప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రాణహాని ఉన్న వ్యక్తులు, నాయకులు భద్రత కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చునని ఇదే హైకోర్టు ధర్మాసనం 1996లో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాజకీయ దురుద్దేశాలతో నాకు తొలగించిన జెడ్ కేటగిరి భద్రతను యథాతథంగా పునరుద్దరించేలా ప్రతివాదులను ఆదేశించండి’ అని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు.  ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ లకు కూడా ఏపి ప్రభుత్వం భద్రత కుదించింది. వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం వారికి  భద్రత పునరుద్దరించింది.

ఎగనామం పెట్టి పండగ చేసుకుంటారా?


ఎగనామం పెట్టి పండగ చేసుకుంటారా?
హైదరాబాద్: వంద రోజుల సంబరాలు కాదు, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయామని సంతాప సభ చేసుకోండని టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. 24 గంటల విద్యుత్‌ హామీ రాష్ట్ర ఘనత కాదని, అది కేంద్రప్రభుత్వం ఇస్తున్న నజరానా అని వెల్లడించారు.

అర్హులైనవారికి గత మూడురోజులుగా పెన్షన్‌లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పాతవారితో కలిసి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు, రైతులకు ఎగనామం పెట్టి ప్రభుత్వం పండగలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. హీరో ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి రావడానికి వైఎస్ రాజశే్ఖరరెడ్డి అని చెప్పారు.

18, 19లలో అనంతపురంలో జగన్ పర్యటన

18, 19లలో అనంతపురంలో జగన్ పర్యటన
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 18, 19 తేదీల్లో అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. జిల్లా పార్టీ ముఖ్య నేతలతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ చర్చిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి(ప్రోటోకాల్) తలశిల రఘురామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

తొలిరోజు చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటైనా అమలైందా?

ఏం సాధించారని వంద రోజుల పండుగ?
ధ్వజమెత్తిన అంబటి రాంబాబు

చంద్రబాబుది పచ్చి అబద్ధాల పాలన
మనీ, మర్డర్స్, మ్యానిపులేషన్, మీడియా మేనేజ్‌మెంట్... ఇదే బాబు ఫిలాసఫీ
తొలిరోజు చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటైనా అమలైందా?
రుణమాఫీ అమలు కాకుండానే అబద్ధాలెందుకు?
వందరోజుల్లో దౌర్భాగ్యపు పాలన అందించారు

 
హైదరాబాద్: రైతుల రుణమాఫీ మొదలు, ప్రజలకిచ్చిన అన్ని వాగ్దానాలనూ గాలికొదిలేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం సాధించారని వంద రోజులు పండు గు జరుపుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయవ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం తమకు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మంగళవారంతో చంద్రబాబు వంద రోజు ల పాలన పూర్తవుతోందని టీడీపీ వాళ్లు చెబుతున్నారని, కానీ తమ లెక్క ప్రకారం చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి నాలుగు నెలలు పూర్తయిందని, ఆయనే ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. సినిమా హిట్టయితే వంద రోజుల పండుగ జరుపుకోవడం సినిమా రంగంలో ఆనవాయితీ అని కానీ రాష్ట్రంలో చంద్రబాబు పాల న ‘ఫట్’ అయినా కూడా బాబు పాలన బ్రహ్మాం డం అని హోరెత్తిస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రమాణస్వీకారానికి ముందే పోలవరం సాధించినట్లు ప్రకటనల్లో పేర్కొనడాన్ని అంబటి ప్రశ్నిస్తూ ‘పోలవరాన్ని చంద్రబాబు సాధించారా! హవ్వ... పోలవరం ఎవరు రూపకల్పన చేశారో... ఎవరు సాధించారో, దాని కోసం ఎవరు తాపత్రయపడ్డారో అనేది జగమెరిగిన సత్యం’. బాబు పాలన మొత్తం ‘మనీ’ మర్డర్లు, మేనిపులేషన్, మీడియా మేనేజ్‌మెంట్ చేయడమే ఫిలాసఫీగా మారిందని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే...

చంద్రబాబు ఈ వంద రోజుల్లో ఒక్క వాగ్దా నం కూడా నెరవేర్చకుండా అబద్ధాల పాలన సాగిస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో 200 వాగ్దానాలు, పాదయాత్ర సందర్భంగా 300 మొత్తం 500 వాగ్దానాలు చేశారని వీటిలో ఏ ఒక్కటీ ఆయన నెరవేర్చలేకపోయారు.

తొలి రోజే ఐదు కీలకమైన అంశాలపై చంద్రబాబు సంతకాలు చేశారని చెప్పుకుంటున్నారని, మరి సంతకాల ప్రకారం వాగ్దానాలు అమలు జరిగాయా? తాను అధికారంలోకి వస్తే రైతులు రుణాలు కట్టక్కర లేదన్నారు, మరి ఇపుడు రుణాలు రద్దయ్యాయా? ఆర్బీఐ ఒప్పుకోలేదని రుణమాఫీ ఎగ్గొట్టింది కాక పచ్చి అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? అని దుయ్యాబట్టారు.

బాబు వచ్చాక విద్యుత్ వెలుగులు వచ్చాయ ని మరో అబద్ధం చెప్పారు. ఆర్టీపీపీ (220 మెగావాట్లు)తో సహా పలు థర్మల్ కేంద్రాలు బొగ్గు కొరతవల్ల మూత పడుతుంటే రాష్ట్రంలో విద్యుత్ వెలుగులున్నాయని చెప్పుకుంటారా? రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా, 365 రోజుల పాటు కరెంటు ఇవ్వడం అనేది  మోడీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సాధ్యమైతే దానిని కూడా తన ఘనతగా బాబు చెప్పుకుంటున్నారు.

పెంచుతానన్న వృద్ధాప్య పెన్షన్లు ఇప్పటికీ పంపిణీ చేయలేదు. ప్రభుత్వోద్యోగులకు మాత్ర మే 58 నుంచి 60 ఏళ్లకు వయో పరిమితి పెంపు వర్తింపజేసి విద్యుత్, ఆర్టీసీ వంటి 44 ప్రభుత్వ రంగ సంస్థల  ఉద్యోగులను గాలికి వదిలేశారు.

బెల్ట్ షాపుల రద్దు పేరుతో చేసిన సంతకం అమలు కాలేదు. రాష్ట్రంలో నిజంగా బెల్ట్ షాపులు రద్దు అయితే మద్యం అమ్మకాలు ఇంకా ఎలా పెరుగుతాయి? బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం 35 శాతం వరకూ ఉండగా దానిని బాగా తగ్గించారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీరని ద్రోహం చేసినట్లే.

రాజధాని ఎంపిక కోసం కేంద్ర కమిటీ పర్యటిస్తూ ఉండగానే ఫలానా చోట రాజధాని అని ప్రకటించేశారు. విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడం మంచి నిర్ణయమే అయినప్పటికీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలతో చర్చిం చి వారిని సంతృప్తిపర్చకుండా అహంకారంతో బాబు ప్రకటన చేయడాన్ని ప్రశ్నిస్తున్నాం.

రాజధాని పెట్టే చోట చంద్రబాబు తాబేదార్లు, సుజనా చౌదరి, దేవినేని ఉమా మహేశ్వరరావు, సి.ఎం.రమేష్ పెద్ద ఎత్తున భూములు కొనేశారు. భవిష్యత్‌లో వారి పేర్లతోనే నారా నగర్, దేవినేని నగర్, సుజనా నగర్ వంటివి వెలియడానికి దోహదం చేస్తున్నారు.

వంద రోజుల పాలనలో స్థానిక సంస్థల్లో నయాన, భయాన ఎంపీటీసీ, జడ్పీటీసీలను లొంగదీసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సాక్షాత్తూ స్పీకర్ నియోజకవర్గంలోనే దౌర్జన్యం చేసి ఎంపీటీసీలను లోబర్చుకున్నారు. అనేక చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నాయకులను దారుణంగా హత్య చేశారు.

భద్రత కుదింపుపై కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు ,సమాచారం కూడా లేదు

భద్రత తొలగింపు అన్యాయం: వైఎస్ జగన్
‘జెడ్ కేటగిరీ’పై హైకోర్టుకు విన్నవించిన జగన్
  కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు
  ఇప్పటివరకు సమాచారం కూడా లేదు
  నాకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు 
  నివేదికలు ఇచ్చాయి
  అయినా కూడా జెడ్ కేటగిరీ తొలగించారు
  జెడ్ కేటగిరీని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
  భద్రత కుదింపుపై వైవీ సుబ్బారెడ్డి పిటిషన్
 
 సాక్షి, హైదరాబాద్: తనకున్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత మూడేళ్లనుంచి తనకు కొనసాగుతూ వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతను యథాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వైఎస్సార్ జిల్లా ఎస్‌పీ, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టులపై నిషేధం విధించారని, ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భద్రతనిచ్చారని, అందులో భాగంగా తనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించారని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
మావోయిస్టుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు కొనసాగుతూ వస్తోందని తెలిపారు. ‘నా తండ్రి మరణించిన తరువాత కూడా నాకు జెడ్ కేటగిరి భద్రత కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి కూడా ఇదే రకమైన భద్రత కల్పిస్తూ వస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులకు ఇప్పటికీ జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. ప్రతిపక్షనేతగా నాకు కేబినెట్ హోదా ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 13న ప్రతివాదులు నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా నాకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారు. ఉపసంహరణకు సంబంధించి ఇప్పటివరకు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. హైదరాబాద్‌లో నివాసం ఉండే నేను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇరు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను. రాజకీయ దురుద్దేశాల్లో భాగంగానే ఇరు ప్రభుత్వాలు కలిసి నా భద్రతను ఉపసంహరించాయి. నాకున్న ప్రాణహానికి, ఈ విషయాన్ని ధృవపరుస్తున్న నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భద్రతను ఉపసంహరించారు. 
 
నాకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. అందువల్ల నాకున్న జెడ్ కేటగిరి భద్రతను మెరుగుపరిచి, దానిని కొనసాగించాలని నిఘా వర్గాలు చెప్పాయి. నిఘా వర్గాల నివేదికలకు విరుద్ధంగా ప్రతివాదులు నాకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారు. నాకు జెడ్ కేటగిరి భద్రతను కల్పించేటప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ప్రాణహాని ఉన్న వ్యక్తులు, నాయకులు భద్రత కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చునని ఇదే హైకోర్టు ధర్మాసనం 1996లో స్పష్టమైన తీర్పునిచ్చింది. రాజకీయ దురుద్దేశాలతో నాకు తొలగించిన జెడ్ కేటగిరి భద్రతను యథాతథంగా పునరుద్దరించేలా ప్రతివాదులను ఆదేశించండి’ అని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. తనకు హైదరాబాద్‌లో ఉన్న (2+2) భద్రతను ఉపసంహరించి, ప్రకాశం జిల్లాలో (1+1) భద్రతను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కూడా సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జనం గుండెల్లో వైఎస్‌ఆర్

జనం గుండెల్లో వైఎస్‌ఆర్
వేంసూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఇంకా జనంగుండెల్లో ఉన్నాయని, అందుకే సొంత ఖర్చుతో ప్రజలు ఆయన విగ్రహాలను ఏర్పా టు చేస్తున్నారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని యర్రగుంటపాడులో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని సోమవారం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మట్టా దయానంద్ విజయ్‌కుమార్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి వరద బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందించారని, కానీ ప్రస్తుతం బాధితులు వరద సాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు.

తొలుత యర్రగుంటపాడు ఎంపీటీసీ ఒం గురు లక్ష్మి దంపతులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మట్టా దయానంద్‌లను సన్మానించారు. అనంతరం దేశిరెడ్డి మాధవరెడ్డి నివాసంలో ఎంపీ పొంగులేటిని, దయానంద్‌లను సన్మానించారు. కార్యక్రమం లో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ అట్లూరి సత్యనారాయణరెడ్డి, రావి సత్యనారాయణ, తుమ్మురు రంగరెడ్డి, దేశిరెడ్డి మాధవరెడ్డి, గడ్డ రామకృష్ణరెడ్డి, తుమ్మరు శ్రీనివాసరెడ్డి, గోగులముడి రామచంద్రరెడ్డి, గాదె శ్రీనివాసరావు, గడిపర్తి శ్రీనివాసరావు, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, దొడ్డ చెన్నకేశవరెడ్డి, చీపు కృష్ణ, గాయం రాం బాబు, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భీమిరెడ్డి చెన్నకేశవరెడ్డి, అల్లం చిన్నబ్బాయి పాల్గొన్నారు.

భద్రత తగ్గింపుపై వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్

Written By news on Monday, September 15, 2014 | 9/15/2014

భద్రత తగ్గింపుపై వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్వైఎస్ జగన్మోహన్ రెడ్డి
హైదరాబాద్: ఏపి రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత తగ్గించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెడ్ కేటగిరిలో ఉన్న తనకు భద్రత తగ్గించారని  పిటిషన్‌లో పేర్కొన్నారు.  మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని తెలిపారు.

ప్రతిపక్ష నేతగా తనకు కేబినేట్ హోదా ఉన్నప్పటికీ,  ప్రభుత్వం భద్రతను కుదించడం ఆక్షేపణీయం అని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే సెక్యూరిటీని తగ్గించారని తెలిపారు. మూడేళ్లుగా తనకు జెడ్ కేటగిరీ భద్రత ఉందని జగన్ ఆ పిటిషన్‌లో వివరించారు.

సినిమా ఫ్లాపయినా... హిట్ సంబరాలా?


సినిమా ఫ్లాపయినా... హిట్ సంబరాలా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందరోజుల పాలనపై వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల సినిమా ఫ్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవటం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. బాబు వందరోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు తన ఖాతలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో అంబటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కొన్నిచోట్ల బొగ్గులేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతే విద్యుత్ వెలుగులు అంటూ బాబు గొప్పలు చెబుతున్నారన్నారు.

రుణమాఫీపై చంద్రబాబు చేశారా అని ఈ సందర్భంగా అంబటి సూటి ప్రశ్న వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు 200 వాగ్ధానాలు చేశారని, పాదయాత్రలో మరో 300 వాగ్దానాలు చేశారని ఆయన గుర్తు చేశారు.  ఇప్పటిదాకా చంద్రబాబు ఒక్క వాగ్దానాన్నీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎక్కడైనా అమలయిందా అని ప్రశ్నించారు. రూ.2కే మినరల్ వాటర్ ఎవరైనా ఇప్పటిదాకా తాగారా అన్నారు.

బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పిన బాబు ...మద్యం అమ్మకాలు ఎక్కడైనా తగ్గాయా .... పదవీ విరమణ వయస్సును ఎవరికి పెంచారని అంబటి ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు పరిపాలన అధ్వాన్నంగా ఉందే తప్ప...ఏమాత్రం మెచ్చుకోదగ్గ పాలన కొనసాగలేదన్నారు. రుణమాఫీ చేస్తానన్న బాబు... మాఫీ అమలు కోసం కమిటీ వేశారని, మరోవైపు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే మళ్లీ తను ఒక కమిటీ వేసి చంద్రబాబే ఏపీ రాజధానిని ప్రకటించారని అంబటి విమర్శించారు. శాసనసభలో చర్చ జరగకుండానే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.

ముంపు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన

ముంపు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన
కుక్కునూరు: గోదావరి వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి వరద ప్రభావిత గ్రామాలను సందర్శించారు. వరదల వల్ల దెబ్బతిన్న పాలవాగు చప్టా, వింజరం గ్రామంలో పొలాలకు వెళ్లే దారిపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు.

వరద బాధితులను ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు మండలాలకు అందించే పరిహారం, నిర్వాసితుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
 అనంతరం వరదల వల్ల దెబ్బతిన్న కుక్కునూరులోని రామసింగారం సెంటర్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే రోడ్డు, దాచారానికి వెళ్లే దారిలో గుండేటివాగుపై లోలెవెల్ చప్టాను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు.

ఆంధ్రలో కలిసిన ముంపు మండలాలల్లో వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వరద బాధితులకు న్యాయం జరిగేంత వరకూ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్ర ప్రభుత్వంతో పోరాడతారని తెలిపారు.

 ఎకరానికి రూ. 25 వేలు అందించాలి : వేలేరుపాడు మండలంలోని తాట్కూరుగొమ్ము, తిర్లాపురం, రుద్రంకోట గ్రామాల్లో వరదల వల్ల దెబ్బతిన్న పత్తి, మిర్చి, వరి పంటలను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంపీ పొంగులేటి  డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పార్టీ  రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వరరావు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల కన్వీనర్లు కుచ్చర్లపాటి నరసింహరాజు, కేసగాని శ్రీనివాసగౌడ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, సర్పంచ్‌లు వర్సా లక్ష్మి, సోడె బుల్లెమ్మ, ఊకే రాధ, పొడియం వెంకటరమణ, జగిడి బాలరాజు, నాయకులు మన్యం సత్యనారాయణ, వెంక్నబాబు, రాజారావు, చిన రసింహరాజు,సూర్యనారాయణరాజు, రాజేశ్, వినోద్, రవి, రామారావు, మధు, శ్రీను, రామకృష్ణ, తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
 వీఆర్‌పురం : కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ముంపు  మండలాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి ఎంపీ ఆదివారం పర్యటించారు. వేలేరుపాడు మండలంలో పర్యటన ముగించుకున్న అనంతరం లాంచీపై వీఆర్‌పురం మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి చేరుకున్నారు.

 ఇటీవల వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అనంతరం వారితో మాట్లాడుతూ  ముంపు గురైయ్యే ప్రతి కుటుంబానికీ అత్యున్నతమైన ప్యాకేజీ అందేలా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు  వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొం దించిందని విమర్శించారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముంపు ప్రాంత సమస్యలపై నివేదికను రూపొందించి ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఇవ్వనున్నామని చెప్పారు.

అనంతరం శ్రీరామగిరి, సీతపేట గ్రామాల్లోని వరదల  ప్రభావానికి దెబ్బతిన్న మిర్చి, వరి చేలను పరిశీలించారు. అప్పులు చేసి వ్యవసాయం చేసుకునే చిన్న సన్నకారు రైతులను వరద కోలుకోలేని దెబ్బతీసిందని అన్నారు. వరదలతో దెబ్బతిన్న మిర్చికి ఎకరాకు రూ.35 వేలు, వరికి ఎకరాాకు రూ. 25 వేలు నష్టపరిహారం ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేలా పోరాడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ డివిజన్ నాయకుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కడియం రామాచారి, మంత్రిప్రగడ నరసింహరావు, మండల నాయకులు పొడియం గోపాల్, ముత్యాల శ్రీనివాస్, మాచర్ల గంగులు, బంధ విజయలక్ష్మి, రేవు బాలరాజు, కోలా బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ నాలుగు నెలల పాలన తీరు

నారావారి నత్త సవారీ!
కుంటి సాకులు.. హామీలకు కోతలు
 ఇదీ నాలుగు నెలల పాలన తీరు
Chandrababu Naidu, 100 days rule, Manifesto
చంద్రబాబు నాయుడు, వంద రోజుల పాలన, మ్యానిఫెస్టో
 
 చంద్రబాబు తొలి ఐదు సంతకాలు
  •  జూన్ 8వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 
  •  అనంతరం చేసిన తొలి అయిదు సంతకాలు..
  •  మొదటి సంతకం: రుణ మాఫీ విధివిధానాల కమిటీ ఏర్పాటు. ‘15 రోజుల్లో కమిటీ ఇచ్చే ప్రాథమిక నివేదికను అనుసరించి రైతులకు కొత్తగా రుణాల పంపిణీ చేయిస్తాం. 45 రోజుల తరువాత తుది నివేదిక రాగానే రైతులకు తగిన న్యాయం చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటన.
  •  రెండో సంతకం: వృద్ధులు, వితంతువుల నెలవారీ పింఛన్ రూ. 1,000కి, వికలాంగుల పింఛన్ 
  •  రూ. 1,500కు పెంపు. ఈ చెల్లింపులు గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి 
  •  అమల్లోకి వస్తాయని ప్రకటన.
  •  మూడో సంతకం: ప్రతి గ్రామానికీ మంచి నీరు అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం. 
  •  రూ. 2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని ప్రకటన.
  •  నాలుగో సంతకం: రాష్ట్రంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు.
  •  అయిదో సంతకం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంపు.
 
 చంద్రబాబు హామీలు
 తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల చిట్టాలో ముఖ్యమైనవి..
 + అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై మొదటి సంతకం
 + రైతుల పంటల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి, పెట్టుబడి కే కాకుండా దిగుబడికీ బీమా
 + రూ.5 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్
 + పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి
 + హంద్రీ-నీవా, గాలేరు-నగరి, ఉత్తరాంధ్ర సు జల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి
 + వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్తు
 + గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తు
 + మద్యం బెల్టు షాపుల రద్దు
 + డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ. లక్ష రూపాయల వరకు వడ్డీ లేని కొత్త రుణం
 + పుట్టిన ఆడబిడ్డ పేరుతో ‘మహాల క్ష్మి పథకం’ కింద అర్హులైన కుటుంబాలకు రూ. 30 వేలు బ్యాంకులో డి పాజిట్
 + పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణిల ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం రూ. 10 వే లు
 + అన్ని ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థినులకు హాస్టళ్లు
 + ఇంటికో ఉద్యోగం, ఉపాధి. నిరుద్యోగ యువతకు రూ. వెయ్యి నుంచి 2 వేల వరకు భృతి
 + పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
 + ఇంటర్మీడియట్ వరకు ఉచిత బస్‌పాస్.. కాలేజీ విద్యార్థులకు ట్యాబ్లెట్ కంప్యూటర్లు, ఐపాడ్‌లు
 + యువత స్వయం ఉపాధికి 3 శాతం వడ్డీతో రూ. 50 లక్షల వరకు రుణం
 + బీసీలకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్, 25 శాతం నిధులతో బీసీ ఉపప్రణాళిక
 + {పమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు
 + చేనేత కార్మికుల రుణాల మాఫీ. చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి. బడ్జెట్లో ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయింపు
 + వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 200 కోట్లు. వికలాంగులకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ. వికలాంగులకు రూ.1,500 పెన్షన్
 + ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంటు కోసం హెల్త్‌కార్డులు. పెన్షనర్లకు ఉద్యోగులతోసమానంగా ఆరోగ్య ఖర్చులు
 + వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు పింఛన్
 + ఎన్టీఆర్ హెల్త్ కార్డుల పథకం ద్వారా ఏటా రూ. 2.5 లక్షల వరకు ముందుగా డబ్బు చెల్లించే అవసరం లేకుండా ఉచితంగా పరీక్షలు, చికిత్సలు
 + ఎన్టీర్ సుజల స్రవంతి కింద ప్రతి గ్రామానికి, ప ట్టణానికి రక్షిత నీటిసరఫరా. 
 
  •   ఎన్నికల హామీలన్నింటినీ అటకెక్కించిన చంద్రబాబు
  •   సాంకేతికంగా ముహూర్తం కోసం జూన్ 8న ప్రమాణం చేసినా...
  •   మే 16న ఫలితాలు వచ్చినప్పటి నుంచి పాలనా పగ్గాలు చేపట్టి
  •   4 నెలలుగా హడావుడి
  •   రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలకిచ్చిన హామీలన్నీ నీటిమూటలే
  •   మూలనపడ్డ రైతు, డ్వాక్రా రుణాల మాఫీ
  •   అన్నింటికీ రాజధానే పరిష్కారమన్నట్లుగా ‘షో’
  •   విపక్షంపై కొనసాగుతున్న హత్యాకాండ.. పట్టించుకోని సర్కారు
  •   అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా విపక్షంపై ఎదురుదాడి
 
 
 సాంకేతికంగా చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి వంద రోజులే అవుతున్నప్పటికీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించారు. మే 16న అ సెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అప్పటికి రా ష్ట్రం విడిపోలేదు. మే 22న చంద్రబాబు అప్పటి ఉమ్మ డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్, ప్రత్యేక కార్యదర్శి రామకష్ణరావులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చ ర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ఆ మ రుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీగా రాముడు నియామకాలపై నిర్ణ యం తీసుకున్నారు. జూన్ 3న ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్‌రావును ఎంపిక చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే తన బాధ్యతలు నిర్వర్తించడం ఆరంభించారు.
 
 విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకొచ్చి నాలుగు నెలలైంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సర్కారు పనిచేస్తోంది. తొలి సంతకాలకే దిక్కు లేకుండా పోయింది. ఖరీఫ్ దాటిపోతున్నా.. రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఆకాశాన్ని అంటిన ధరలను తగ్గించే కనీస చర్యలు తీసుకోలేకపోయారు. ఎన్నికలకు ముం దు ఇచ్చిన హామీల అడ్రస్ లేకపోగా.. అమలులో ఉన్న పథకాలు సైతం ప్రశ్నార్థకంగా మారాయి. ఎన్నికలకు ముందు ఆధార్‌తో లింకేమిటి అంటూ ఊరూవాడా ప్రశ్నించిన బాబు ఇప్పుడు అడుగడుక్కీ ఆధార్ ఉండాలంటూ తనదైన శైలిలో పాలనా సంస్కరణలకు తెరతీశారు. పథకాలకు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకు ఏమాత్రం పొంతనలేదు. ఏ వర్గానికీ న్యాయం చేయలే దు. ఆ దిశగా ఏ ప్రయత్నం లేకుండానే నాలుగు నెలలు నెట్టుకొచ్చారు. ప్రజలు అవస్థలు పడుతుంటే.. అన్నిం టికీ రాజధాని ఒక్కటే పరిష్కారమన్న రీతిలో ప్రజలను ఏమార్చుతున్నారు. కొత్త రాష్ట్రాన్ని సింగపూర్, మలేషి యా, చికాగోలా మార్చివేస్తామంటూ ప్రజల ముందు పంచరంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూనే.. మరోవైపు తన దగ్గర మంత్రదండమేమీ లేదని అంటున్నారు.
 
 మరోపక్క.. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా వ్య వహరిస్తోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించడానికి వెనకడుగు వేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన శాసన సభ తొలి బడ్జెట్ సమావేశాల్లో ఏకైక ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కి ప్రజా సమస్యలపై చర్చలను దాటవేసింది. ప్రశ్నించే వారే ఉండొద్దని విపక్షంపై ఎదురుదాడికి దిగింది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సమయానికే 14 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ శాసన సభ దృష్టికి తెచ్చింది. అయినా అధికారపక్షంలో మార్పు లేదు. 
 
 దేశంలోనే అట్టహాసమైన ప్రమాణ స్వీకారం
 జూన్ 8న గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారీ ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా చంద్రబాబు సీఎంగా పదవీ స్వీకార ప్ర మాణం చేశారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో కలుపుకొని 19 మందితో కేబినెట్ కొలువుదీరింది. అత్యంత ఆర్బాటంగా సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో సహా ఆ పార్టీకి చెందిన జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, పలువురు ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. దాదాపు 30 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమమైతే భారీగా చేశారే గానీ, ఆ తర్వాత హామీ ల ఆచరణలో మాత్రం అడుగులు తడబడ్డాయి.
 
 రుణ మాఫీపై దోబూచులాట
 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ ఉన్నాయి. అధికారంలోకి వస్తే తొలి సంతకంతోనే ఈ రుణాలన్నీ మాఫీ అయిపోతాయన్న హామీని అధికార పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. నాలుగు నెల లవుతున్నా ఇంతవరకు తొలి సంతకం ఫలితం రాలే దు. తొలి సంతకంతో మాఫీ కావలసిన ఈ రుణాలపై ప్రభుత్వం ఒక్కో దశలో ఒక్కో మెలిక పెడుతోంది. విధివిధానాల ఖరారు పేరుతో నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సీఎస్ రావు, ఆర్థిక నిపుణుడు చెరుకూరి కుటుం బరావులు సభ్యులుగా కమిటీని వేశారు. ఈ కమిటీ 45 రోజుల్లో తుది నివేదిక ఇస్తుందని, ఆ వెంటనే రుణ మాఫీ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కానీ కమిటీ ఏర్పాటై మూడు నెలలు దాటినా రుణ మాఫీపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఆ తర్వాత కొంతకాలం రీషెడ్యూలు పాటపాడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలున్నాయి. హామీ ఇచ్చే రోజునే ఈ విషయం తెలిసినప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఆనాడేమీ పరిమితుల గురించి చెప్పలేదు. అధికారంలోకి రాగానే ఆంక్షలు, షరతులు విధిస్తూ ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవాలా అన్న అంశం చుట్టూనే ప్రభుత్వం చక్కర్లు కొ డుతోంది. ఆధార్‌తో వ్యవసాయదారుడిని లింక్ చేయ డం, ఇంటికి ఒక్క రుణమే మాఫీ చేస్తామనడం, లక్షన్నరకంటే మాఫీ చేయబోమని, పంట రుణాలకే వర్తింపజేస్తామని, డిసెంబర్ 31 లోపు తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని ఇలా రోజుకో షరతు పెడుతోంది. 
 
 మహిళలకిచ్చిన హామీ పైనా ఇదే తీరు..
 డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన బాబు అధికారంలోకి వచ్చాక మాట మా ర్చినప్పటికీ, సూటిగా చెప్పింది ఈ విషయంలోనే. ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పటికీ అబ్బబ్బే.. అలాంటిదేమీ లేదని, ప్రతి సంఘానికి స్వావలంబన కోసం లక్ష రూపాయల నిధిని మాత్రం సమకూర్చుతామని చెప్పి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు.
 
 ఉద్యోగుల పీఆర్సీ మరిచిన సర్కారు
 అవశేషాంధ్రప్రదేశ్‌లో జూన్ నెలాఖరులో భారీ సంఖ్య లో ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సి ఉండగా వా రికి ఏకమొత్తం చెల్లింపుల తక్షణ భారం నుంచి బయట పడటానికని కొత్త ప్రభుత్వం వరాలు ఇచ్చింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి రోజే పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫారసులను అమలు చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. 2013 నుంచి పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశే మిగిలిం ది. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో పదో షెడ్యూలులో చేర్చిన సంస్థల్లో(కార్పొరేషన్లు, ఎయిడెడ్ సిబ్బం ది) ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఏపీకి చెందిన ఆ సంస్థల్లోని ఉద్యోగులు కొందరు పదవీ విరమణ చేశారు.
 
 రాజధానిపై లోపించిన వ్యూహం ..!
 రాజధాని విషయంలోనూ సరైన వ్యూహంతో ముందుకెళ్లడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ప్రమా ణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే చంద్రబాబు విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఉంటుందని ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏపీ పునర్వ్య వస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు రాజధాని నగరం ఎంపికకు కేంద్రం శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ పరిశీలన కొనసాగిస్తున్న దశలోనే రాజధానిపై బాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రకటనలు చేస్తూ గందరగోళానికి తెరతీశారు. రాజధానిపై అందరినీ సంప్రదించడం లో, ఒప్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. పైగా తొలి నుంచీ చేస్తూ వచ్చిన ప్రకటనతో కృష్ణా, గుం టూరు జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంట డంతో రేపటి రోజున రాజధాని సామాన్యులకు మరింత భారంగా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వ వైఖరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు కలిగేలా చేసింది. శివరామకృష్ణన్ కమిటీ లేవనెత్తిన సాంకేతిక అంశాలను కనీసం చర్చకు పెట్టడానికి కూడా ప్రభుత్వం సుముఖత చూపలేదు. పంతానికిపోయి ఏకపక్షంగా నిర్ణయానికి రావడంతో ఇప్పుడు అనుకున్న చోట ప్రణాళికాబద్ధమైన నగరాన్ని నిర్మించడం ఆ ప్రభుత్వానికే ఒక సవాలుగా మారే ప్రమాదం ఏర్పడిందన్న విమర్శలున్నాయి. సింగపూర్‌లో ఉన్నట్టు రెండు భారీ భవనాలు (ట్విన్ టవర్స్) నిర్మించి అదే రాజధాని అని చెప్పినంత సులభం కాదన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించడం విమర్శలకు తావిచ్చింది.
 
 కమిటీలు..! ఉపసంఘాలు..!
 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించని చంద్రబాబు.. ఈ నాలుగు నెలల్లో కమిటీల మీద కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘాలను నియమించడానికే మొగ్గుచూపారు. ఏ ఒక్క అంశంపైనా నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు. రుణమాఫీపై కోటయ్య కమిటీ, అవసరమైన వనరుల సమీకరణ కోసం ఎంపీ సుజనాచౌదరి నేతృత్వంలో మరో కమిటీ వేశారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ పనిచేస్తుండగానే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని నిర్మాణానికి సలహా కమిటీ వేశారు. రాజధానికి భూసేకరణకు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు తదితరులతో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. అవినీతిపై మంత్రులు యనమల, పల్లె రఘునాధరెడ్డి, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్‌లతో ఓ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో మరో ఉపసంఘం వేశారు. తమిళనాడు తరహాలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఇంకొక ఉపసంఘాన్ని నియమించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై పారిశ్రామికవేత్తలతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇవేమీ ఇంతవరకు పూర్తిస్థాయిలో ఫలితాలనివ్వలేకపోయాయి.
 
 శ్వేతపత్రాలు...!
 చంద్రబాబు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం, ప్రజలకిచ్చి హామీలను పక్కన పెట్టి అధికారం ఖాయమైన తొలి రోజు నుంచే గత ప్రభుత్వాలను నిందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టగా, అధికారం చేపట్టిన తర్వాతా అవే విషయాలను చెప్పడంలో అర్థం లేదు. దీన్ని మరించి, గత ప్రభుత్వ వైఫల్యాలం టూ అనేక శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, రేపటి రోజున వాటిని ప్రశ్నిస్తే విపక్షాలపై నెపం నెట్టివేయొచ్చ న్న రాజకీయ కారణాలతోనే బాబు వరుస క్రమంలో శ్వేతపత్రాలను విడుదల చేస్తూ వచ్చారన్న విమర్శలొచ్చాయి. ఈ నాలుగు నెలల్లో ఆయన వివిధ రంగాలపై ఏడు శ్వేతపత్రాలను విడుదల చేశారు. ప్రతి శ్వేతపత్రంలోనూ గత పదేళ్ల కాంగ్రెస్‌పైన.. మరీ ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని లక్ష్యంగా చేసుకొని దుమ్మెత్తిపోయడంలోనే కాలాన్ని వెళ్లబుచ్చారు.
 
 ‘సాగుతూ’నే ఉన్న సంక్షేమ పథకాలు..
 అధికారాన్ని చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై బాబు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని పథకాలకు పేర్ల మార్పుతో సరిపెట్టా రు. బంగారు తల్లిని మా ఇంటి మహలక్ష్మిగా మార్చా రు. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్థానంలో ఎన్టీఆర్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. విద్యార్థులకు అ త్యంతావశ్యకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నాలుగు నెలలైనా స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లను అక్టోబర్ 2 నుంచి ఇస్తామని ప్రకటించింది. అయితే ఈలోగా ఒక్కో సంక్షేమ పథకంలో భారీగా కోతలు పెట్టే ప్రక్రియ మొదలెట్టింది. ఆధార్‌తో అనుసంధానం పేరుతో రేషన్ కార్డుల ఏరివేత, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌లో కోతలు పెట్టే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో వాటిలో కోతలు తప్పవని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.
 
 జవాబుదారీతనం కన్నా విపక్షం టార్గెట్‌గా!
 తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పలు రాజకీయ హత్యలు జరిగాయి. ప్రధానంగా ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు హత్యకు గురయ్యారు. రాజకీయ హత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే ప్రత్యర్థి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులపై వల వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలను నయానా భయానా పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అసెంబ్లీలో ఏకైక విపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ గొంతు నొక్కారన్న విమర్శలు మూటకట్టుకుంది. శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన ఆగస్టు 18 నుంచి నిరవధికంగా వాయిదా పడిన సెప్టెంబర్ 6 వ తేదీ వరకు విపక్షంపై ఎదురుదాడికి దిగడం, దివంగత వైఎస్‌పై దుమ్మెత్తిపోయడం తప్ప మరో కార్యక్రమం లేదన్నట్లుగా కాలం వెళ్లదీసింది. హామీలను అమలు చేయలేదన్న విమర్శలకు జడిసి తెలుగుదేశం ప్రభుత్వం ఈరకమైన ప్రతిదాడికి దిగిందన్న విమర్శలను మూటకట్టుకుంది. పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. రాజధాని ప్రకటన విషయంలో, బీసీ తీర్మానం విషయంలో అసెంబ్లీలో అధికార పక్షం వ్యవహారం అత్యంత రహస్య ఎజెండాగానే నడిపించడం గమనార్హం.
 
 టీడీపీ హత్యారాజకీయాలు..
 ఎన్నికల ఫలితాల వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 15 మంది కార్యకర్తలు, నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారి చేతిలో హత్యకు గురయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ముస్తాఫా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబులపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మే 16నఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పెద్ద మునయ్య (వినుకొండ, గుంటూరు జిల్లా), పెరవలి ప్రభాకరావు (వేమూరు, గుంటూరు జిల్లా), గోగాడి సింగయ్య (కనిగిరి, ప్రకాశం జిల్లా), నెర్ల దశయ్య (సీతానగరం, తూ.గో. జిల్లా), వేపూరి వెంకటేశ్వరరావు (గోకవరం, తూ.గో. జిల్లా), అలోకం కృష్ణారావు (గొట్టుముక్కల, కృష్ణా జిల్లా), రేపల్లె సురేష్ (అవనిగడ్డ, కృష్ణా జిల్లా), బురిడె సన్యాసిరావు (నెల్లిమర్ల, విజయనగరం జిల్లా), బలిజ బంగారు రెడ్డి (బేతంచెర్ల, కర్నూలు జిల్లా), సూర్య ప్రకాశం శెట్టి (శింగనమల, అనంతపురం), మర్రిబోయిన ఓబులేశు (చాపాడు, వైఎస్సార్ జిల్లా), బూసి చిన నాగిరెడ్డి, బూసి పెద్ద నాగిరెడ్డి (మేళ్లవాగు, గుంటూరు జిల్లా), మల్లిఖార్జున (ఎల్లుట్ల, అనంతపురం జిల్లా)లు టీడీపీ శ్రేణుల చేతు ల్లో హత్యకు గురయ్యారని వైఎస్సార్‌సీ ఆరోపించింది. నేతలు, కార్యకర్తలే కాదు ఎన్నికైన ప్రజాప్రతినిధుల పైనా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే రోజాపైనే దాడికి దిగారు. దేశమ్మ, ఓరుగుంటాలమ్మ గ్రామదేవతల ఊరేగింపు సందర్భంగా ప్రధాన హారతి విషయమై స్థానిక టీడీపీ నేత కుమరేశన్ మొదలియూర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా చేతిలోని హారతి పళ్లేన్ని టీడీపీ వర్గానికి చెందిన వారు లాక్కోవడంతో పాటు ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో రోజా చేతికి గాయమైంది. ఈ నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడుల్లో 119 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు గాయపడగా, పలువురు ఎమ్మెల్యేలతో పాటు స్థానికంగా ఉండే పార్టీ కీలక నేతలపై అక్రమ కేసులు బనాయించారని  పార్టీ ఆరోపించింది. 


Popular Posts

Topics :