15 February 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రైతన్నకు ధైర్యం కల్పించడానికే రైతు భరోసా యాత్ర

Written By news on Saturday, February 21, 2015 | 2/21/2015

అనంతపురం: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలే లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుకాయిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, శంకర్ నారాయణ ఆరోపించారు. శనివారం అనంతపురంలో జరిగిన పార్టీ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ...చంద్రబాబు ప్రభుత్వం మండిపడ్డారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసిన తరువాతే రైతు ఆత్మహత్యలను చంద్రబాబు అంగీకరించారన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సాధించిన నైతిక విజయమన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర గురించి ప్రస్తావిస్తూ...రైతన్నకు ధైర్యం  కల్పించేందుకే జగన్ మోహన్ రెడ్డి యాత్రకు పూనుకున్నారని తెలిపారు.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది


'ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది'
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మాట మార్చుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వెంకయ్యనాయుడు కూడా ప్రస్తుతం రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులోనూ, పార్లమెంటు బయట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తోందని ఆయన అన్నారు.

కేంద్రంలో మంత్రి పదవులను కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ బీజేపీ తో కుమ్మక్కైందని ఎద్దేవాచేశారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడటానికి చంద్రబాబు భయపడుతున్నారని సుబ్బారెడ్డి అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో నిర్మిస్తామని గత ఎన్నికల్లో మోదీ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో సీఆర్డీఏ చట్టంలోని అవకతవకలపై ప్రస్తావిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

కావలి ఎమ్మెల్యేకు అంబటి పరామర్శ

నెల్లూరు : కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పరామర్శించారు. సోమశిల ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ తో ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

కాగా కావలి ఎమ్మెల్యే దీక్షపై మంత్రి నారాయణ విమర్శలు ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలిపేలా ఉన్నాయని అంబటి అన్నారు. వైఎస్ పాలనలో తప్ప రైతులకు ఏనాడూ సుఖం లేదని, చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయన్నారు.

రేపట్నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర


అనంతపురం

 : అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో 'భరోసాయాత్ర'ను నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వివరాలను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి కొడికొండ చెక్ పోస్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారు.

లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హిందూపురం బహిరంగ సభకు వైఎస్ జగన్ హాజరవుతారు. సోమవారం మరకుంటపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన శేషప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం కొత్తకోటకు చేరుకుని రైతు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శిస్తారని తలశిల రఘురాం వివరించారు.

రైతు ప్యాకేజీ.. జగన్ విజయమే!

 రేపటి నుంచి జగన్  ‘రైతు భరోసా యాత్ర’
    వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరిగాయని మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన విజయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్ జగన్.. ఆదివారం నుంచి అనంతపురంలో రైతు భరోసా యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలోనే బాబు ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాకపోయినా జగన్‌మోహన్‌రెడ్డి కృషి, పోరాటాల వల్ల రాష్ట్రంలో రైతాంగానికి న్యాయం జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ అసెంబ్లీలో చెబితే.. ఎక్కడ చేసుకుంటున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అనంతపురానికి చెందిన మంత్రి, చీఫ్ విప్‌లు అసలు ఆత్మహత్యలే జరగలేదన్నారు. ఇంకో సందర్భంలో వ్యవసాయ మంత్రి కేవలం 8 మంది చనిపోతే, వైఎస్సార్ సీపీ మాత్రం 40 నుంచి 50 మంది చనిపోయినట్టు చెబుతోందంటూ విమర్శించారు. ఇప్పుడు అనంతపురం కలెక్టర్ 29 మంది రైతులు, 11 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా ప్రకటించారు. జగన్ కృషితోనే ప్యాకేజీ రూపంలో రైతుకు న్యాయం జరుగుతోంది’ అని సారథి చెప్పారు.
మైండ్‌సెట్ మార్చుకోవడం సంతోషం
సీఎం చంద్రబాబు తన మైండ్‌సెట్ మార్చుకుని దివంగత వైఎస్ తరహాలో రైతులకు పరిహారం ప్రకటించడంపై తమ పార్టీ సంతోషంగా ఉందని సారథి తెలిపారు. జగన్.. ‘ఉద్యమం’ అన్నప్పుడల్లా ప్రభుత్వం ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నమైనా చేస్తోందని చెప్పారు. తాజాగా రైతు భరోసా యాత్రకు జగన్ సిద్ధమవగానే ప్యాకేజీ ప్రకటించారన్నారు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమం.. పంచాయితీలు, మున్సిపాలిటీలకు సర్కారు ఇవ్వాల్సిన నిధులు ఎగ్గొట్టడానికేనని సారథి దుయ్యబట్టారు.
రిఫరెండానికి సిద్ధమా?
తిరుపతి ఉప ఎన్నికలో.. చనిపొయిన ఎమ్మెల్యే కుటుంబంపై సానుభూతితో వైఎస్సార్ సీపీ పోటీ చేయని కారణంగా టీడీపీ విజయం సాధిస్తే.. దాన్ని పాలనకు రిఫరెండమని గొప్పగా చెప్పడం విడ్డూరమని సారథి అన్నారు. టీడీపీకి తమ పాలనపై నమ్మకముంటే 10 స్థానాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అక్కడ పోటీకి తాము సిద్ధమని సవాల్ చేశారు.
 

‘పట్టిసీమ’తో నోట్లు లిఫ్ట్ చేస్తారా?

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు ఒకే రకమైన అవసరాలు తీర్చేవి అయినప్పుడు ప్రభుత్వం కొత్తగా రూ. 1300 కోట్లతో పట్టిసీమను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి, సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. 4 ఏళ్లలోనే పోలవరం పూర్తవుతుందంటూనే పట్టిసీమకు అన్ని నిధులు ఖర్చు చేయడమెందుకన్నారు. పోలవరం నిర్మాణంపై నమ్మకంలేకే ప్రభుత్వం పట్టిసీమ నిర్మాణానికి పూనుకుందనే అనుమాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. ‘పోలవరం పూర్తయ్యే నేపథ్యంలో పట్టిసీమ అవసరమేంటి? ఇది ముడుపుల ప్రాజెక్టుగా మేం భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు నీళ్లను లిఫ్ట్ చేయడానికి కాదు. నోట్లను లిఫ్ట్ చేసుకోవడానికే ప్రాజెక్టు తెచ్చారని ప్రజలు భావిస్తున్నారు’ అని సారథి పేర్కొన్నారు.
పట్టిసీమను ఒక ఏడాదిలోనే పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుబట్టారు. ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని తరలించేందుకు నిర్మించే కాల్వ భూ సేకరణలో 1700 ఎకరాలపై కోర్టు కేసులున్నాయని, అవి పరిష్కారమై.. ఏడాదిలోనే ప్రాజెక్టు ఎలా పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలతో ప్రభుత్వం మాట్లాడిందా?’ అని ప్రశ్నించారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పుడే కృష్ణా డెల్టాకు, సాగర్ ఆయకట్టుకు సరిగా నీరివ్వలేని ప్రభుత్వం.. పట్టిసీమతో శ్రీశైలం ద్వారా రాయలసీమ, ఇతర అవసరాలను తీరుస్తుందంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని అమలు చేయించలేకపోయారు. కేంద్రం నుంచి ఆర్థిక లోటు నిధులనూ రాబట్టలేకపోయారు. దీంతో పోలవరం సాధించలేమన్న భయంతోనే ప్రభుత్వం పట్టిసీమను నిర్మిస్తోందన్న అనుమానాలు ప్రజలకున్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి’ అని సారథి డిమాండ్ చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విస్తరణ


వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ విస్తరణ
* మతీన్ అహ్మద్, గాదె నిరంజన్‌రెడ్డి
సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా విజయచందర్

 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని శుక్రవారం విస్తరించారు. ఈ మేరకు తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జాబితా విడుదల చేశారు. పార్టీ తెలంగాణ కార్యవర్గం విస్తరణలో భాగంగా... ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి (మహబూబ్‌నగర్), మతీన్ అహ్మద్ ముజదాది (హైదరాబాద్), గాదె నిరంజన్‌రెడ్డి (నల్లగొండ) నియమితులయ్యారు. కార్యదర్శులుగా ఎం.భగవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సయ్యద్ ఉద్దీన్ ముఖ్తార్ (నిజామాబాద్), ఎ.పద్మారెడ్డి (రంగారెడ్డి), జి.శ్రీధర్‌రెడ్డి (మెదక్), తుమ్మలపల్లి భాస్కర్ , వేముల శేఖర్‌రెడ్డి (నల్లగొండ), అక్కనపల్లి కుమార్ (కరీంనగర్), కె.పాండురంగాచార్యులు, పాకలపాటి చందు (ఖమ్మం), ఎం.ప్రభు కుమార్ (రంగారెడ్డి), బొడ్డు సాయినాథ్‌రెడ్డి (హైదరాబాద్) నియామకం అయ్యారు. ఇక సంయుక్త కార్యదర్శులుగా.. ధనలక్ష్మి (రంగారెడ్డి), బి.హనుమంతు (మహబూబ్‌నగర్), కె.సుదీప్‌రెడ్డి (నిజామాబాద్), మహమూద్ (హైదరాబాద్), జేవీఎస్ చౌదరి (ఖమ్మం), పిట్టా రామిరెడ్డి, ఎన్.స్వామి, ఎండీ సలీమ్ (నల్లగొండ), కె.నగేష్ (కరీంనగర్), బి.శ్రీనివాసరెడ్డి (రంగారెడ్డి)లను నియమించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ కొండల్‌రెడ్డి, బి.సంజీవరావు (మెదక్), బి.బ్రహ్మానందరెడ్డి (రంగారెడ్డి), బెజ్జం శ్రీనివాసరెడ్డి (ఖమ్మం) నియమితులయ్యారు.

 సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా విజయచందర్

 పార్టీ తెలంగాణ కమిటీ సాంస్కృతిక, ప్రచార విభాగం అధ్యక్షుడిగా సినీ నటుడు టీఎస్ విజయచందర్ (హైదరాబాద్) నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా ఎస్.నరేష్, సుంకరపల్లి జగతి (కరీంనగర్), కార్యదర్శిగా చెరుకు శ్రీనివాస్ (రంగారెడ్డి), రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా భీమ శ్రీధర్ (ఖమ్మం), రాష్ట్ర సేవాదళ్, వలంటీర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నీలం రమేశ్ (నిజామాబాద్), రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నయీం ఖురేషీ (ఖమ్మం), రాష్ట్ర డాక్టర్స్ విభాగం కార్యదర్శిగా డా.డోరేపల్లి శ్వేత (ఖమ్మం), రైతు విభాగం కార్యదర్శిగా యు.లక్ష్మీరెడ్డి(ఖమ్మం), రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా కె.రామాచారి (ఖమ్మం) నియమితులయ్యారు. హైదరాబాద్ నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కొండా సాయికిరణ్‌గౌడ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షేక్ అర్షద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎం.రామేశ్వరీ శ్యామల నియమితులయ్యారు. ఆదిలాబాద్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా బి.అనిల్‌కుమార్, నల్లగొండ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఐల వెంకన్నగౌడ్‌లను నియమించారు.
 
 జిల్లాల పరిశీలకులు, సహ పరిశీలకులు..
  రంగారెడ్డి పార్టీ పరిశీలకుడిగా కె.శివకుమార్, సహ పరిశీలకులుగా వడ్లోజుల వెంకటేష్, పి.రామిరెడ్డి.  వరంగల్ పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, సహ పరిశీలకులుగా ఆకుల మూర్తి, జి.శ్రీధర్‌రెడ్డి.  నల్లగొండ పరిశీలకుడిగా ఎడ్మ కిష్టారెడ్డి, సహ పరిశీలకులుగా షర్మిలా సంపత్, ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి.  మెదక్ పరిశీలకుడిగా మతీన్ అహ్మద్, సహ పరిశీలకులుగా ఎ.పద్మారెడ్డి, జి.రాం భూపాల్‌రెడ్డి.  హైదరాబాద్ పరిశీలకుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి, సహ పరిశీలకులుగా తుమ్మలపల్లి భాస్కర్, సయ్యద్ ఉద్దీన్ ముఖ్తార్.  ఆదిలాబాద్ పరిశీలకుడిగా ఎం.భగవంత్‌రెడ్డి, సహ పరిశీలకులుగా విలియం మునగాల, బి.శ్రీనివాసరావు.
  కరీంనగర్  పరిశీలకుడిగా నల్లా సూర్యప్రకాష్, సహ పరిశీలకులుగా జి.జైపాల్‌రెడ్డి, కె.వెంకటరెడ్డి.  నిజామాబాద్  పరిశీలకుడిగా గాదె నిరంజన్‌రెడ్డి, సహ పరిశీ లకులుగా కె.ఉపేంద్రరెడ్డి, అక్కెనపల్లి కుమార్.  ఖమ్మం జిల్లా పరిశీలకుడిగా సత్యం శ్రీరంగం, సహ పరిశీలకులుగా వై.మహిపాల్‌రెడ్డి, జి.సూర్యనారాయణరెడ్డి.  మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ పరిశీలకుడిగా గున్నం నాగిరెడ్డి, సహ పరిశీలకులుగా కె.సుదీప్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి.

మీకు మీడియా అంటే ఎందుకంత భయం?

Written By news on Friday, February 20, 2015 | 2/20/2015


మీకు మీడియా అంటే ఎందుకంత భయం?
హైదరాబాద్:మీడియా స్వేచ్ఛను తెలంగాణ సర్కారు అడ్డుకోవాలని చూస్తుండటంతో తెలంగాణ వైఎస్సార్ సీపీ మండిపడింది. మీడియాపై తెలంగాణ సర్కార్ ఆంక్షలు విధించడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగంలు విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా అంటే భయపడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ కు మీడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. మీ నిర్ణయాన్ని తక్షణమే మార్చుకుని పాలనపై దృష్టి పెట్టాలన్నారు.
 
సచివాలయంలో మీడియాకు ‘నో ఎంట్రీ’... అంటూ గతంలో ఎన్నడూ లేని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే రోజువారీ పరిపాలనా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తున్నారనే సాకుతో పాత్రికేయులను లోపలకు రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తుండటంతో సర్వత్రా  విమర్శలకు దారి తీస్తోంది.

వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో నియామకాలు

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో శుక్రవారం పలు నియామకాలు చేపట్టారు. ఈ తాజా నియమాకాల్లో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు ఉండగా,10 మంది ఉప కార్యదర్శలున్నారు. ఎడ్మ కిష్టారెడ్డి, మతిన్, గాదె నిరంజన్ రెడ్డిలను వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుంది.
 
దీంతో పాటు కల్చరల్, పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయచందర్ కు బాధ్యతలను అప్పగించగా, తెలంగాణ జిల్లాలకు పర్యవేక్షకులు(అబ్జర్వర్స్), కో అబ్జర్వర్ ను పార్టీ నియమించింది. నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షులను వైఎస్సార్ సీపీ నియమించింది.

రెండో రోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దీక్ష

కావలి: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు.సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతుల సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్ఆర్ సీపీ నేతలు పోరాటం సాగిస్తారని ఆయన అన్నారు.

‘రైతు భరోసా’తో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తాం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
 కూడేరు : రైతు భరోసా యాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.  మండల పరిధిలోని అంతరగంగలో ఈ నెల 24న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి  చేపడుతున్న ‘రైతు భరోసా యాత్ర’ కు మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూడేరులోని ఓ రైస్‌మిల్‌లో గురువారం ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆ యన ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దృతరాష్ట్ర పాలన కొనసాగుతోందన్నారు.
 
  ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు మా్ర తమే ప్రభుత్వానికి ప్రజా సమస్యలు గుర్తుకొస్తున్నాయన్నారు. కరువు ప్ర భావం వల్ల అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదన్నారు.  బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కూడా పాలకులు ముందుకు రావడం లేదని మండిపడ్డారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు వైఎస్సార్ సీపీ నాయకులు, సాక్షి పత్రిక కల్పితాలని  స్వయాన జిల్లా మంత్రులు చెప్పడం సిగ్గు చేటన్నారు. ఆత్యహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి లబ్ధిచేకూర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారన్నారు.
 
 దీంతో  సీఎం చంద్రబాబుకు వణుకు పుట్టి  ఆఘమేఘాలపై బాధిత రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. రైతు భరోసా యాత్రతో రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామగ్రామానా ఈ కార్యక్రమంపై విస్తృత ప్ర చారం చేయాలని ఎమ్మెల్యే సూచిం చారు. రైతులు వారి సమస్యలను జగన్‌కు చెప్పుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజశేఖర్, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, సర్పం చ్‌లు, ఎంపీసీ సభ్యులు,  నాయకులు మాదన్న, దేవేంద్ర, తిమ్మారెడ్డి, మలోబులేసు, బాలన్న, మల్లికార్జున, తిమ్మారెడ్డి, సత్యనారాయణ, గంగాధర్, హనుమంతరెడ్డి, సూర్యనారాయణరె డ్డి,  సూర్యనారాయణ, నారాయణరెడ్డి, ఆది, పెన్నోబులేసు, చిదంబరం, ఓబులేసు, రాజు, శంకర్‌నాయక్, ఛత్రేనాయక్, శంక ర్‌రెడ్డి, తిరుపతయ్య,  ఉజ్జనప్పలు పాల్గొన్నారు.

పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా


విభజన హామీలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా: పొంగులేటి
 వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఈ అంశాలను  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిధులు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
 
  రాష్ర్టంలో భద్రాచలం-కోవూరు, కరీంనగర్-పెద్దపల్లి లైన్లతోపాటు, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వంటి పలు రైల్వే ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రానికి సాగునీటి విషయంలో అన్యాయం జరిగిందని, నదుల అనుసంధానంలో గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించాలని పొంగులేటి సూచించారు. అందుకు చేవెళ్ల-ప్రాణహితతో పాటు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏకపక్షంగా ఆంధ్రలో కలపడంతో ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ అంశాన్ని కూడా పార్లమెంట్‌లో లేవనెత్తుతామని పొంగులేటి చెప్పారు.

రైతులను మరచిన బాబు


రైతులను మరచిన బాబు: పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజధాని పేరుతో దేశాలు పట్టుకు తిరుగుతున్నారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే డిమాండ్‌తో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్‌రెడ్డి కావలిలో మూడురోజుల నిరాహారదీక్ష చేపట్టారు.

ఏరియా ఆస్పత్రి సెంటర్‌లో గురువారం ఉదయం చేపట్టిన నిరాహారదీక్షకు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, రైతుసంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. చంద్రబాబు పాలన పై ఎంపీ, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
 
 దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం తిరుగుతున్నానంటూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కనపెట్టారన్నారు. చిత్తూరు జిల్లాలో ఎనిమి ది నియోజకవర్గాల్లో తాగటానికి నీరులేదని, తంబళ్లపల్లి నియోజకవర్గంలో 1,300 అడుగులు బోరు వేసినా నీరు రావడంలేదని చెప్పా రు. సీఎం చంద్రబాబు ఆప్రాంతంలో నీరు-చెట్టు పేరుతో పైలాన్ ఆవిష్కరించటం ఆయన తీరుకు నిదర్శనమన్నారు.నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడు తూ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిం చేందుకు వైఎస్సార్ ఎంతో కృషిచేశారని చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్టచతుష్టయ పాలన సాగుతోందని చెప్పారు.సుజనాచౌదరి, నారాయణ, పరకాల ప్రభాకర్, సీఎం రమేష్, సీఎం బాబు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

బోర్లు వేయాలన్నా సింగపూర్ నిపుణులే రావాలి

Written By news on Thursday, February 19, 2015 | 2/19/2015

నెల్లూరు :  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి పట్ల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు.  గురువారం నెల్లూరు జిల్లా కావలిలో పార్టీ ఎమ్మెల్యే  ఆర్ ప్రతాప్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు వారు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలో బోర్లు వేయాలన్నా సింగపూర్, జపాన్ ల నుంచి నిపుణులను తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు అంటారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో రైతులకు మేలు జరగలేదని ఆరోపించారు. 
సొంత జిల్లా చిత్తూరులోనే బాబును ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు.  చంద్రబాబు హయాంలో నీటి పారుదల రంగం నిర్వీర్యమైందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోకుండా చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

బాబూ.. విదేశీ మైండ్‌సెట్ వద్దు


బాబూ.. విదేశీ మైండ్‌సెట్ వద్దు
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీలో మరో జపాన్‌ను సృష్టిస్తానని, రాష్ట్రాన్ని సింగపూర్‌లా తయారు చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. విదేశీ మైండ్‌సెట్(ఆలోచన) నుంచి తెలుగు ప్రజల మైండ్‌సెట్‌లోకి రావాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రంలో మరో జపాన్‌ను సృష్టించేందుకు అక్కడి కంపెనీలన్నీ సిద్ధమయ్యాయని చంద్రబాబు భజన పత్రికల్లో వచ్చిన వార్తలను అంబటి ఉటంకించారు.

ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. మార్చిలో జపాన్ కంపెనీలు రాజధాని ప్రాంతంలో పర్యటించి భారీగా పెట్టుబడులు పెడతాయని, 5 లక్షల ఉద్యోగాలు తాము కల్పిస్తామని జపాన్ మంత్రి ఒకరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయని అంబటి అన్నారు. అక్కడి నుంచి కంపెనీలు వచ్చి ఇక్కడి వారికి ఉద్యోగాలిస్తే తమ పార్టీ సంతోషిస్తుందని అయితే జపాన్ కంపెనీలు వచ్చి ఉద్యోగాలిస్తే తప్ప ఏపీ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

బాబు గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా రూ.కోట్లు ఖర్చు పెట్టి ఐదు సార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించడమే కాక 7 సార్లు దావోస్‌లో పర్యటించి కూడా ఇలాంటి కబుర్లే చంద్రబాబు చెప్పారన్నారు. ఆచరణలో చూస్తే ఆయన చెప్పిన దాంట్లో 2 శాతం కూడా పెట్టుబడులు రాలేదన్నారు. మన రాష్ట్రంలో నిష్ణాతులైన పారిశ్రామిక వేత్తలుండగా జపాన్ పారిశ్రామిక వేత్తల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని సూటిగా ప్రశ్నించారు.
 
ఆందోళనలో విద్యార్థులు..
గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల భర్తీ జరగదేమోనన్న ఆందోళనతో ఉన్నారని అంబటి అన్నారు. తాము చెప్పే వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయొద్దని సర్వీస్ కమిషన్‌కు తాఖీదు నివ్వడం దారుణమని.. వెంటనే ఖాళీగా ఉన్న 1.5 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పర్యటన


23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పర్యటన
రాజధాని గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు
 పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి వెల్లడి
- రైతుల్ని బెదిరించి మరీ భూములు తీసుకుంటున్నారు
- దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో ఈ నెల 23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. పార్టీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలంతా ఆ రోజున రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని మార్చి 7 నుంచి ప్రారంభమవనున్న అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళతారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి.. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలసి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఎమ్మెల్యేలందరూ 23న విజయవాడకు చేరుకుని అక్కడినుంచి రాజధాని గ్రామాలకు బయలుదేరతారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో జరగాల్సి ఉండగా సీఎం చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోకుండా నిరంకుశంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పార్థసారథి ధ్వజమెత్తారు. ఈ విషయంలో ప్రజల్నిగానీ, ప్రజా సంస్థలనుగానీ, ప్రతిపక్షాన్నిగానీ లెక్క చేయకుండా చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకోసం అప్రజాస్వామికంగా ముందుకెళుతున్నారని దుయ్యబట్టారు. రైతులనుంచి రాజధానికోసం సేకరిస్తున్న భూమిని వ్యాపార ప్రయోజనాలకోసం వాడుకోబోతున్నట్లు తేటతెల్లమైందన్నారు. అనుభవజ్ఞుడని చంద్రబాబును ప్రజలు ఎన్నుకుంటే రైతుల భూములను లాక్కుని వాటితో వ్యాపారంచేసి కోట్లు గడించాలనుకుంటున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.

స్వచ్ఛందంగా భూములిచ్చేవారి నుంచే సేకరిస్తామని తొలుత చెప్పిన చంద్రబాబు.. ఆచరణలో మాత్రం రైతులను బెదిరించి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారన్నారు. భూములివ్వబోమని తీవ్రంగా ప్రతిఘటించిన బోయపాటి సుధారాణి అనే మహిళను పోలీసుల ద్వారా బెదిరించి భూములను తీసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బహుళ పంటలు పండే భూములను తీసుకోవడాన్నీ తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడినపుడల్లా తుళ్లూరులో రాజధాని ఏర్పాటుకు తాము వ్యతిరేకమని, జగన్‌కు భూములున్నాయి కనుక దొనకొండలో పెట్టాలని చెబుతున్నారని, అసంబద్ధమైన రీతిలో టీడీపీ నేతలు, మంత్రులు మాట్లాడారని ఆయన విమర్శించారు.

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష
కావలి : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం దీక్ష ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని,  కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటిని వెంటనే విడుదల చేస్తే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవని ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు.

అప్పుడు వచ్చిన పెట్టుబడులు రెండు శాతమే

Written By news on Wednesday, February 18, 2015 | 2/18/2015


'అప్పుడు వచ్చిన పెట్టుబడులు రెండు శాతమే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో మినీ జపాన్ ఏర్పాటు చేయడానికి జపాన్ కంపెనీలు సిద్ధం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కొన్ని పత్రికల్లో రాయించుకుంటున్నారంటూ వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు 9ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు వేల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నా.. వచ్చింది కేవలం 2శాతం పెట్టుబడులేనని అన్నారు.


బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పేది కొండంత.. చేసేది గోరంత అని చెప్పారు. చంద్రబాబుకు విదేశీ పారిశ్రామిక వేత్తలంటే ఎందుకంత మోజు.. మన పారిశ్రామికవేత్తలంటే ఎందుకంత చిన్నచూపు అంటూ దుయ్యబట్టారు. విదేశీయులతో రహస్య ఒప్పందాలు ఏమైనా చేసుకుంటున్నారా ? అంటూ అంబటి ఘాటుగా ప్రశ్నించారు. జపాన్ లో భూకంపాలు వస్తూంటాయి.. ఇక్కడ కూడా భూకంపాలు తీసుకొస్తుంటారా ? అంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

తొలి విడద ఐదు రోజుల పాటు ‘రైతు భరోసా యాత్ర’

Written By news on Tuesday, February 17, 2015 | 2/17/2015


జిల్లాలో 22 నుంచి జగన్ పర్యటన
తొలి విడద ఐదు రోజుల పాటు ‘రైతు భరోసా యాత్ర’
 ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్

 
అనంతపురం అర్బన్ : అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారిలో భరోసా కల్పించేందుకు ఈ నెల 22 నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. తొలి విడత యాత్ర హిందూపురం నియోజకవర్గం నుంచి మొదలై ఐదు రోజుల పాటు సాగనుంది. జగన్  పర్యటన వివరాలను సోమవారం ఆ పార్టీ పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల పక్షాన నిలిచి ఓ భరోసాను కల్పించారన్నారు. 2004లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంతకు మునుపు టీడీపీ హాయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు 421 జీవో ద్వారా పరిహారం అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ తర్వాత రైతులకు అండగా నిలిచిన నేతలు లేరన్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం పంటలు పండక, అరకొర పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల భారంతో రైతులు తీవ్రవేదన పడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే బంగారు, బ్యాంకుల్లో రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయారన్నారు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మాభిమానం చంపుకోలేనివారు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఈ కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే.. అసెంబ్లీలో వైఎస్ జగన్ పూర్తి వివరాలు, ఆధారాలతో వివరించి ప్రభుత్వాన్ని ఒప్పించారన్నారు. ఈరోజు ప్రభుత్వం పరిహారం ప్రకటించిందంటే అది తమ పార్టీ ఘనతే అన్నారు.   
 
కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు

సోమవారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసి జిల్లా పరిస్థితి, రైతాంగం పరిస్థితి వివరించారు. జిల్లాలో రైతులు సాగుచేసిన పంటలు చేతిరాక 66 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో తీవ్ర కరువుతో లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. ముందుస్తు కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కలెక్టర్‌కు వివరించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వందలాది గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు.

ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రజలు, పశువులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పశుగ్రాసం కొరత లేకుండా చూడాలన్నారు. పింఛన్లు కోల్పోయిన అర్హులందరికి పింఛన్ సౌకర్యం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్. రాజీవ్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి యుపి నాగిరెడ్డి, నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, యువజన నగరాధ్యక్షుడు ఎల్లుట్ల మారుతి నాయుడు, వెన్నపూస రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

22 నుంచి అనంతలో.. ‘రైతు భరోసా యాత్ర’


22 నుంచి అనంతలో.. ‘రైతు భరోసా యాత్ర’
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం అర్బన్: అప్పుల బాధను తట్టుకోలేక అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22 నుంచి ‘రైతు భరోసా యాత్ర’ నిర్వహించనున్నారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఆ పార్టీ పోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అసెంబ్లీలో ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు ఆధారాలతో సమస్యను లేవనెత్తారని తెలిపారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే, వారికి భరోసా కల్పించేందుకు తానే స్వయంగా వె ళ్లి పరామర్శిస్తానని జగన్ ప్రకటించినట్టు పేర్కొన్నారు.
ఆ పరిణామంతో దిగొచ్చిన చంద్రబాబు.. రైతు ఆత్మహత్యలను ఒప్పుకున్నారన్నారు. తమ పార్టీ ఒత్తిడితోనే జిల్లాలో 29 మంది రైతు, 11 మంది చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటి వరకు 86 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని, వారి జాబితాను అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు అందజేశామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.

చంద్రబాబు విమానయాన ఖర్చు రూ. 16 కోట్లు


రాష్ట్ర ఖజానాకు బాబు ‘విమానం మోత’
  • చంద్రబాబు విమానయాన ఖర్చు రూ. 16 కోట్లు
  • బాబుగారు ఊరు దాటాలంటే ప్రత్యేక విమానం సిద్ధం కావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఖర్చులు తగ్గించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక ఇబ్బందులున్నాయని తరచూ చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిందేమిటో తెలుసా! ఆయన ఎక్కడికి వెళ్లినా కోట్టు ఖర్చు పెడుతూ ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణించడం!! హైదరాబాద్ నుంచి ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు రెగ్యులర్‌గా నడిచే విమానాలున్నప్పటికీ.. అవి కాదని ఆయన ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణించారు. ఒకసారికాదు రెండుసార్లు కాదు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు  67 సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. ఇందుకని రాష్ట్ర ఖజానాపై పడిన భారం మొత్తం.. రూ.16 కోట్లు. గుంటూరులో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక విమానంలోనే హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
 
నిధుల విడుదలకు ఆర్థికశాఖ ఆదేశం...

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశ రాజధాని న్యూఢిల్లీకి మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలంటే రెగ్యులర్ విమానాల్లోనే ప్రయాణిస్తారు. కానీ బాబు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ   రికార్డు సృష్టించారు. ఢిల్లీకి చెందిన క్లబ్-1 ప్రత్యేక విమానంలో చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. విమాన చార్జీల కింద అధికారికంగా  అర కోటి  చెల్లించారు. చంద్రబాబు ఎక్కువగా నవయుగ, కృష్ణపట్నం, జీవీకే, జీఎంఆర్ సంస్థలకు చెందిన తొమ్మిది, పదిహేను సీటర్ల  విమానాలను వినియోగిస్తున్నారు. వాటి చార్జీల కింద రూ.16 కోట్లు ఖర్చు అయినట్టు ప్రభుత్వం లెక్క తేల్చింది. దీనికిబడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో అదనపు కేటాయింపుకోసం ఆర్థికశాఖను ప్రభుత్వం కోరింది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. నేడో రేపో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేయనున్నారు.
 
నెలకు రూ. 2 కోట్లు చొప్పున...

సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు పూర్తయింది. ఈ లెక్కన బాబు నెలకు రూ.రెండు కోట్లను  ప్రత్యేక విమానాల చార్జీలకు ఖర్చు చేశారన్నమాట. ఇప్పటివరకు సీఎం 8 సార్లు ఢిల్లీ పర్యటనకు  ప్రత్యేక విమానాల్లోనే వెళ్లొచ్చారు.
     
ఇటీవల ఛత్తీస్‌గఢ్ పర్యటనకు మూడు ప్రత్యేక విమానాలను వినియోగించారు. నవయుగకు చెందిన విమానంలో చంద్రబాబు, ఆయన పేషీ అధికారులు వెళ్లారు. పోలవరం కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ సమకూర్చిన ప్రత్యేక విమానంలో పారిశ్రామికవేత్తలు వెళ్లగా.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సమకూర్చిన మరో విమానంలో అధికారులు  వెళ్లారు.
     
జన్మభూమి, రైతు సాధికారిత సదస్సులతో పాటు  జిల్లాల పర్యటనలకు కూడా సీఎం ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు.

‘పొదుపు’ పాఠం.. వారికే...

రాజధాని కోసం ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తూ మరోపక్క రూ.కోట్లను ప్రత్యేక విమానాలకు వెచ్చించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మంత్రులు, అధికారులు పొదుపు చర్యలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. స్వయంగా ముఖ్యమంత్రే ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అవసరం లేకపోయినా ప్రత్యేక విమానాల్లో విహరించడం పట్ల ఉన్నతస్థాయి అధికారవర్గాలూ ముక్కున వేలేసుకుంటున్నాయి.
 
చంద్రబాబు ఏ నెలలో ఎక్కడెక్కడికి వెళ్లొచ్చారంటే...
జూన్:  విజయవాడ, విశాఖపట్నం
జూలై:  విజయవాడ, తిరుపతి, పుట్టపర్తి, విజయవాడ, విశాఖపట్నం
ఆగస్టు: విజయవాడ, విశాఖ, రాజమండ్రి
సెప్టెంబర్: విజయవాడ, తిరుపతి, విశాఖ, రాయపూర్, తిరుపతి, విజయవాడ
అక్టోబర్: విజయవాడ, రాజమండ్రి, పుట్టపర్తి, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం-హైదరాబాద్, విజయవాడ-రాజమండ్రి, ముంబై
నవంబర్:  విజయవాడ, బెంగళూరు, తిరుపతి, న్యూఢిల్లీ, తిరుపతి, న్యూఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, సింగపూర్, విజయవాడ, న్యూఢిల్లీ, అహ్మదాబాద్
డిసెంబర్: రాజమండ్రి, విశాఖపట్నం, న్యూఢిల్లీ, తిరుపతి-చిత్తూరు, విజయవాడ-తిరుపతి, విశాఖపట్నం, విశాఖపట్నం, విజయవాడ, విజయవాడ, అహ్మదాబాద్, న్యూఢిల్లీ
జనవరి: విజయవాడ, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, విశాఖపట్నం-తిరుపతి-న్యూఢిల్లీ, విశాఖపట్నం, రాజమండ్రి-విజయవాడ, విజయవాడ
ఫిబ్రవరి (8 వరకు): విజయవాడ, న్యూఢిల్లీ, న్యూఢిల్లీ
బాబు ప్రయాణించిన  విమానాలు వీరివే:  క్లబ్ -1, నవయుగ, జీవీకే, కృష్ణపట్నం,జీఎంఆర్ సంస్థలకు చెందినవి

వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటన ఖరారు

Written By news on Monday, February 16, 2015 | 2/16/2015

హైదరాబాద్:రైతు భరోసా యాత్ర పేరుతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టనున్న పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈమేరకు సోమవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పర్యటన వివరాలను వెల్లడించారు. ఈనెల 22 నుంచి 26 వరకూ వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు.
 
ఇదిలా ఉండగా హామీల అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం చెందారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి పేర్కొన్నారు. రైతులు తాకట్టు పెట్టిన బంగారం తెచ్చిస్తామన్న చంద్రబాబు వేలం వేస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్ 421 జీవో జారీ చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు:వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్లను కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ బృందం సోమవారం సురేష్ ప్రభుతో సమావేశమయ్యింది. ఈ భేటీలో వైఎస్ జగన్ తో పాటు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాస్, వరప్రసాద్ లు పాల్గొన్నారు.
 
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీకి కొత్త రైల్వే జోన్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. నిధులు లేక ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించామన్నారు. వాటికి వెంటనే నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపినట్లు జగన్ తెలిపారు. తమ వినతులకు ఆయన సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు. 

పంట భూములు లాక్కోవడానికి మేం వ్యతిరేకం: జగన్


  • రైతులను ఇబ్బంది పెట్టే ఏ చర్యకైనా మా మద్దతు ఉండదు
  •  ‘హోదా’ను విభజన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు
  •  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్,ఆర్థికమంత్రి జైట్లీతో జగన్ భేటీ
  •  విభజన హామీలన్నీ నెరవేర్చాలని వినతి
 సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి పచ్చని పంట భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఏ చర్యకైనా తమ పార్టీ మద్దతు ఉండబోదని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆదివారమిక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని జగన్ కలిశారు. ఆయన వెంట పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి. వైఎస్ అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఉదయం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిసిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్లమెంట్ సమావేశాలు ఈనెల 23 నుంచి మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి అంశాలను మరోసారి గుర్తుచేయడం కోసం హోంమంత్రిని కలిశాం.

రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజీలు, సీఆర్‌డీఏ వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయం, డ్యాముల్లో గేట్లు ఎత్తి భావోద్వేగాలను రెచ్చగొట్టడం వంటి అంశాలపై రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించాం. ప్రధాని, రైల్వే మంత్రి అపాయింట్‌మెంట్లు కూడా అడిగాం. ఈ ఎనిమిది నెలల్లో వారిని కలవడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు మేం ఢిల్లీకి వచ్చి ప్రధాని మొదలుకుని అందరినీ కలిశాం. రాష్ట్రానికి సహాయం అందించాలని వినతిపత్రాలు ఇచ్చాం.

అందులో భాగంగానే ఇది మూడోసారి రావడం. బడ్జెట్ సమావేశాలు మొదలవనున్నందున మళ్లీ ఒకసారి వారికి గుర్తు చేయడం కోసం మా ధర్మం మేం చేస్తున్నాం. పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన జిల్లాలు, పోలవరం ప్రాజెక్టు, జాతీయస్థాయి విద్యాసంస్థలు, రైల్వే జోన్ తదితర అంశాలపై వినతిపత్రం ఇచ్చాం’’ అని తెలిపారు. ప్రత్యేక హోదా రాకపోయినా అంతకంటే ఎక్కువ నిధులు సాధించుకుంటామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు కదా.. ప్రత్యేక హోదాపై రాజ్‌నాథ్‌సింగ్ ఏమన్నారు అని విలేకరులు ప్రశ్నించగా ‘‘మేం మూడోసారి వచ్చి కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా నాలుగు అడుగులు ముందుకు వేసి కేంద్రాన్ని కోరుతున్నాం. మా ధర్మం మేం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వ ప్రయత్నం ఎలా ఉందని అడగ్గా.. ‘‘చంద్రబాబునాయుడు గారిని అడగాలి. ఆరోజు చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీతో కలిసి దగ్గరుండి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎవ రూ కూడా ఆరోజు కనీసం రెండు రోజులు ఆగి ప్రతి అంశాన్నీ చట్టంలో చేర్చాలని యోచించలేదు. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండానే విడగొట్టారు. దీన్ని అప్పుడే చట్టంలో చేర్చి ఉంటే బహుశా ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ అప్పుడు మేం మొత్తుకుని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.

చంద్రబాబు ఆ రోజు దగ్గరుండి ఓటు వేయించారు. మొట్టమొదటి ఓటు మేమే వేశామని చేతులెత్తి చూపించారు. నిన్న వరంగల్‌కు వెళ్లినప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం... రాష్ట్రాన్ని మేమే విడగొట్టామని చెప్పారు. విభజన సమయంలో అన్నీ హడావుడిగా చేశారు. ఈరోజు కొన్ని విషయాలు చట్టంలో కూడా లేవు కనుక... కోర్టులకెళ్లినా ఏ మేరకు న్యాయం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అయినా ఆ రోజు ప్రధానమంత్రి సభలో ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేయాలని ప్రతిపక్షంగా మేం అభ్యర్థిస్తున్నాం’’ అని వివరించారు.

ముఖ్యమంత్రికి ఏమీ ఎక్కడం లేదు..


‘రాజధాని ప్రాంతంలో రైతుల భూములు బలవంతంగా లాగేసుకుంటున్నారు. అలాంటి వారిని ఏమైనా కేంద్రం వద్దకు తీసుకువచ్చే ఆలోచన ఉందా?’ అని విలేకరులు జగన్‌ను అడగ్గా... ‘‘సీఆర్‌డీఏకి సంబంధించి రైతులు ఎలా నష్టపోతున్నారు? రైతులకు ఇష్టం లేకున్నా వారిపై ఎలా ఒత్తిడి తెస్తున్నారన్న అంశాలను కూలంకశంగా వివరంగా చెప్పాం. రైతు ఒప్పుకుంటే  ఫర్వాలేదు. కానీ ఒప్పుకోకున్నా అన్యాయంగా వారి వద్ద నుంచి భూములు తీసుకోవడం సరైన పద్ధతి కాదని మేం ముందు నుంచీ చెబుతున్నాం.

ఇంతకు ముందు కూడా రైతులు కేంద్రం వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే మొన్న రైతులను తీసుకు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. రైతులు అంతకన్నా చేసేది ఏముంది? ఎన్నిసార్లు ఏం చేసినా మన ఖర్మ ఏందంటే.. చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. ఆ సీఎంకు ఏమీ ఎక్కడం లేదు. అది మన ఖర్మ’’ అని జగన్ మండిపడ్డారు. ‘భూసేకరణ చ ట్టం ఆర్డినెన్స్‌పై అన్నా హజారే ఈనెల 24 నుంచి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. మీరు అందుకు మద్దతు ఇస్తారా..?’ అని ప్రశ్నించగా... ‘‘మేం మొదట్నుంచీ ఒకటే చెబుతున్నాం. అంశాలవారీగా మద్దతిస్తామని.

భూసేకరణ చట్టానికి సంబంధించి మల్టీక్రాప్ ఏరియాను తీసుకోవడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుంది. సీఆర్‌డీఏలో అదే జరుగుతోంది. రైతుల దగ్గర నుంచి మల్టీక్రాప్ భూములను తీసుకునే కార్యక్రమం దౌర్జన్యంగా చేస్తున్నారు. కచ్చితంగా మేం దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రజలకు మంచి జరిగే విషయాల్లో కచ్చితంగా మద్దతిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ అంశానికైనా మా మద్దతు ఉండదు. మిగిలిన ఇన్సూరెన్స్ బిల్లు పలు  అంశాలపై పార్లమెంట్‌లో మా పార్టీ మద్దతు ఇస్తుంది’’ అని పేర్కొన్నారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవు

Written By news on Sunday, February 15, 2015 | 2/15/2015


'రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు.  అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అన్నారు. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన సాగించారని ఆమె గుర్తు చేశారు. వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బతికించుకుందామని... పార్టీని అందరం కలిసి ముందు తీసుకెళ్తామని వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోని తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ... ప్రతి నిమిషం ప్రజలకు ఏం చేయాలన్న తపనే వైఎస్ఆర్ లో ఉండేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయపడాలన్నదే వైఎస్ఆర్ సంకల్పమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఆయన తపించారని చెప్పారు. వైఎస్ఆర్ కు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడాల్లేవని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వమని ప్రజలందరూ భావించేలా కృషి చేశారని వైఎస్ విజయమ్మ తెలిపారు.

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ బృందం భేటీ

వీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తో ఆదివారం సాయంత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం భేటీ అయ్యింది.  కేంద్రమంత్రులు, ప్రధానమంత్రిని కలిసేందుకు రెండు రోజుల పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ బృందం అరుణ్ జైట్లీతో భేటీ అయ్యింది. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్ జగన్ బృందం భేటీ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రానికి నివేదించడానికి ఆయన తన పార్టీకి చెందిన ఎంపీలతో కలసి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన తలపెట్టారు.

టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు

హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.  

చర్మం మందంగా ఉన్న సీఎం ఉండటం మన ఖర్మ


చర్మం మందంగా ఉన్న సీఎం ఉండటం మన ఖర్మ
న్యూఢిల్లీ : చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి ఉండటం మనం చేసుకున్న ఖర్మ అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలియజేశామని ఆయన తెలిపారు. కేంద్రమంత్రులు, ప్రధానమంత్రిని కలిసేందుకు రెండు రోజుల పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన అనంతరం ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

కృష్ణా జలాల విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి డ్యాం వద్ద గొడవలు రేపారని, రైతుల ప్రయోజనాలను మంటగలుపుతున్నారని.. ఈ విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ కు చెప్పామని ఆయన అన్నారు. ప్రధాని, రైల్వే మంత్రుల అపాయింట్ మెంట్ కూడా కోరామని, రాష్ట్రానికి అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వాళ్లకు వివరిస్తామని అన్నారు. ఇప్పటికే ఢిల్లీకి చాలాసార్లు వచ్చి విజ్ఙప్తులు ఇస్తున్నామని, తమవంతు బాధ్యతగా విభజన చట్టంలోని అంశాలను అమలుచేయాల్సిందిగా కోరతున్నామని తెలిపారు. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మరోసారి వచ్చామన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...
* రైల్వేలకు సంబంధించి కొత్త జోన్ ఏర్పాటు, ఇతర అంశాలపై కోరాం.

* మాకు సంబంధించిన అంశం పూర్తిగా కాకపోయినా, నాలుగు అడుగులు ముందుకేసి మా ధర్మంగా ఇక్కడికొచ్చి కోరుతున్నాం.
* ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తారన్నది చంద్రబాబు నాయుడిని అడగాలి.
* చంద్రబాబు నాయుడు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఓటేసి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు.
* చట్టంలో ప్రత్యేక హోదా అన్న పదాన్ని కూడా చేర్చలేదు. అప్పుడే చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు.
* అప్పుడు మొత్తుకుని చెప్పినా, ఎవరూ వినిపించుకోలేదు. మొదటి ఓటు తామే వేశామని చంద్రబాబు అన్నారు.
* తనకు రాజకీయ ప్రయోజనం చేకూరాలన్న ఒకే ఒక దృక్పథంతో వరంగల్ లోకూడా రాష్ట్రాన్ని తామే విడగొట్టామని చెప్పారు.
* బీజేపీ కూడా అరాచకంగా వ్యవహరించింది. రెండు రోజులు ఆగి, ఈ విషయాలను చట్టంలో పెట్టి ఉంటే ఇంత దారుణ పరిస్థితి ఉండేది కాదు.
* ఇప్పుడు చట్టంలో లేదు కాబట్టి ఏ మేరకు న్యాయం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం.
* చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి ఉండటం మనం చేసుకున్న ఖర్మ
ఢిల్లీ పర్యటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట పార్టీకి చెందిన ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో వైఎస్ జగన్ భేటీ


కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలోని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఆదివారం న్యూఢిల్లీలో రాజ్ నాథ్ తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాజధాని భూ సమీకరణలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ సందర్బంగా వైఎస్ జగన్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు.  జగన్ వెంట ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు ఉన్నారు.
ఫిబ్రవరి 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులోభాగంగా ఆ పార్టీ ఎంపీలతో కలసి ఆయన శనివారం న్యూఢిల్లీ చేరుకున్నారు. అలాగే కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభు తదితరులతో వైఎస్ జగన్ భేటీ అవుతారు.

సైనికుల్లా పనిచేయండి


సైనికుల్లా పనిచేయండి
 సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం మున్సిపాల్టీ :  చంద్రబాబు దుర్మార్గపు పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల్ని మోసగించారని, ఈ ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం వచ్చిందని, ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయుడు ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగిన జిల్లా పార్టీ విసృ్తత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా  ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరే క విధానాలు ఎండగడుతూనే, సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ని సీఎం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని వైఎస్సా ర్‌సీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని కోరారు.
    
 హామీలపై నిలదీయాలి : సుజయ్‌కృష్ణ రంగారావు
 చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పాలకుల్ని నిలదీయాలని, అందుకు తగ్గట్టుగా కార్యకర్తలు, నాయకులు సంసిద్ధులై ఉండాలని బొబ్బిలి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్ కృష్ణ రంగారావు పిలుపునిచ్చారు. రాజకీయ నిరుద్యోగ   సమస్యను తొలగించేందుకే ఈ కమిటీలు వేశారని అనుకోవద్దని, అంకిత భావంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎక్కువ, తక్కువ అనేది చూడకుండా కమిటీల్లో వేసిన వారంతా కష్టపడి పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకుని, వారి తరఫున పార్టీ శ్రేణులు పోరాడాలన్నారు. రాష్ట్ర విభజన జరిగితే విద్యా రంగంలోనూ, సాగునీటి రంగంలోనూ ఇబ్బందులుంటాయని ముందే తెలిసినప్పటికీ చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతవరకు కేంద్రాన్ని గాని, గవర్నర్‌ను గాని కలిసి ఆ సమస్యలను పరిష్కరించాలని కోరలేదన్నారు.

 దాని పర్యావసనమే నాగార్జున సాగర్ డామ్ వద్ద చోటు సంఘటన అని సుజయ్‌కృష్ణ రంగారావు అభిప్రాయపడ్డారు. దానిని భారత్, పాకిస్థాన్ సరిహద్దు సమస్యగా మార్చేశారని, ఎస్‌ఈ స్థాయి అధికారిని కూర్చోబెడితే ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయన్నారు. ఈ సమయంలో తెలంగాణ వాళ్లు నీరివ్వకపోతే ఆంధ్రా రైతులు ఏమైపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలు చేయకపోతే ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే ఇక్కడ టీడీపీకి పడుతుందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేసినంత మాత్రాన, లక్షలు ఖర్చు పెట్టి సూట్‌లేసుకున్నా మాత్రాన ప్రజలు ఓటేసేయరని, సామాన్యుడు అవసరాలు తీర్చే విధంగా పనిచేసే వారికే పట్టం కడతారని డిల్లీ ప్రజలు నిరూపించారన్నారు. ఇప్పుడేసిన కమిటీలన్నీ ప్రణాళిక బద్దంగా పనిచేయాలని, కమిటీ సభ్యులకు అన్నీ విషయాలపై అవగాహన ఉండేలా ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో వివరించే బుక్‌లెట్లు ముద్రించి అందజేస్తే బాగుంటుందని అన్నారు.

 చంద్రబాబువి ప్రజా వ్యతిరేక చర్యలు : రాజన్నదొర
 చంద్రబాబువన్నీ ప్రజా వ్యతిరేక చర్యలేనని, ప్రజలు తిరగబడాల్సిన సమయం వచ్చిందని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. శాసన సభలో తామెలాగైతే ప్రశ్నిస్తున్నామో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కూడా నిలదీసే విధంగా వ్యవహరించాలన్నారు. కొత్తగా నియమించిన కమిటీలన్నీ క్రమ పద్ధతిలో పనిచేసినట్టయితే ప్రజాధరణ చూరగొని ముందుకెళ్లగలుగుతామన్నారు. పెట్రోలు చార్జీలు పెంపు, పన్నుల వడ్డన తదితర ప్రజావ్యతిరేక కార్యక్రమాలతో  పేదలను చంద్రబాబు ఇబ్బందులుకు గురి చేస్తున్నారని, వారికి అండగా నిలిచి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక నిధుల కింద కనీసం రూ.100 కోట్లు ఇచ్చినా బాగుండేదని, కేంద్రం ప్రకటించిన రూ.50 కోట్లు ఎటూ చాలవని, ఈ విషయమై  కేంద్ర,రాష్ట్ర మంత్రులు, జెడ్పీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులిస్తే ఈ ప్రభుత్వం ఇళ్లుకు బిల్లు ఇవ్వకపోగా, రేషన్‌కార్డులను 14వేల వరకు తీసేసిందని, పింఛన్లు రద్దు చేసేసే కార్యక్రమానికి ఒడిగట్టిందన్నారు.

  మోసపూరిత హామీలిచ్చి ఉంటే జగనే సీఎం : పాముల పుష్ప శ్రీవాణి
  రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల.పుష్ప శ్రీవాణి అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ర్ట విభజన జరిగిపోయినప్పటికీ   ప్రజలను మభ్యపెట్టేందుకు మ్యానిఫేస్టోలో ఆచరణలో సాధ్యం కానీ హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్రంలో లోటుబడ్జెట్ ఉందంటూ కల్లబొల్లి కబర్లు  చెబుతున్నారని విమర్శించారు.   రోజుకో మాట.. పూటకో నిర్ణయంతో ప్రజలను ఆందోళన కర పరిస్థితిల్లోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరిత, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే సీఎం అయ్యేవారని  పుష్ప శ్రీవాణి అన్నారు.   బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. కేంద్రం ప్రకటించిన రూ.500కోట్లు ఎక్కడ సరిపోతాయని, దీని కోసం గట్టిగా అడగలేరా అని ప్రశ్నించారు.

 ఎన్టీఆర్ అభిమానులూ... చంద్రబాబు కపటనాటకాలు తెలుసుకోండి: కోలగట్ల
 తన మామ ఎన్టీర్ పేరు చెప్పుకుని  మూడు మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు కపటనాటకాలను ఎన్టీఆర్ అభిమానులు తెలుసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల.వీరభద్రస్వామి హితవుపలికారు. బయటకు ఆయన పేరు చెబుతున్నా మనసులో మాత్రం నిత్యం తిట్టుకుంటూనే ఉంటారని విమర్శించారు. అదే తరహాలో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని చూడటంలో తిరుగులేని ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు సాధించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి మరణానంతరం ఆయన అభిమానులు విగ్రహాలు పెట్టుకుంటే వాటిని తొలగించాలంటూ ఆదేశించడం విడ్డూరమన్నారు.

 అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా, రైతు రుణామాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు సవాలక్ష ఆంక్షలతో  ఆ హమీని తుంగలోకి తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఢిల్లీ తరహాలో ఫలితాలు రావటం ఖాయమని జోస్యంచెప్పారు. ప్రజలకు లేనిపోని ఆశ లు కల్పించి వాటిని ఆచరణలో చూపించకపోతే ప్రజలు ఇటువంటి తీర్పులనే ఇస్తారని హెచ్చరించారు.  రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక పార్టీ చిరంజీవి గ్లామర్‌తో, మరో పార్టీ బాలకృష్ణ వంటి సినీ నటుల గ్లామర్‌తో ప్రజలను ఆకర్షితులను చేస్తే, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఎటువంటి గ్లామర్‌లేకుండానే ప్రజల్లోకి వెళ్లి వారి మన్ననలు పొందుతున్నారన్నారు. జిల్లాలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయటంలో భాగంగా సుమారు 4000 మంది సభ్యులతో జిల్లా , మండల, పట్టణ, గ్రామ స్థాయికమిటీలను నియమిస్తున్నట్టు తెలిపారు. కమిటీల్లో సభ్యులుగా ఉన్న వారంతా పార్టీకోసం సమయం వెచ్చించి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.

 పథకాల అమల్లో ప్రభుత్వం విఫలం : వరుదు కళ్యాణి
 ఎన్నికలకు ముందు అమలకు సాధ్యం కాని హమీలు  గుప్పించి వాటిని ఆచరణలో చేసి చూపించటంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుదు.కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ  8 నెలల కాలంలో అబద్ధపు హమీలతోనే  కాలం వెళ్లదీస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించాల్సిన  ప్రభుత్వం ఇప్పటికీ దివంగత నేత డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేసేందుకు ప్రాధాన్యతనివ్వడం దారుణమన్నారు. మహిళలను లక్షాధికారులు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కనీసం వారి డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవటం ఏంటని ప్రశ్నించారు.

   ఈ కార్యక్రమంలో పార్టీ  కేంద్రపాలకమండలి సభ్యులు పెనుమత్స.సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి,   రాష్ట్ర ఐటీ విభాగం  అధ్యక్షుడు చల్లా.మధుసూధనరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శత్రుచర్ల.పరీక్షిత్‌రాజు, సంగిరెడ్డి.బంగరునాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు.ఉదయభాను, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు కడుబండి.శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, సీఈసీ మెంబర్ కాకర్లపూడి.శ్రీనివాసరాజు, పార్టీ కోశాధికారి కందుల.రఘుబాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు అంబళ్ల.శ్రీరాములనాయుడు, కెవిఎన్.సూర్యనారాయణరాజు,  రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కెవిఎన్ తమ్మన్నశెట్టి, మైనార్టీ జిల్లా కార్యదర్శులు ఎండి.మున్వర్,  వివిధ విభాగాల అధ్యక్షులు గొర్లె వెంకటరమణ, పీరుబండి జైహింద్‌కుమార్, మారంబాలబ్రహ్మారెడ్డి, రెడ్డి పద్మావతి పతివాడ.అప్పలనాయుడు ఎంఎం.శివాజీ, రొంంగలి జగన్నాధం, సత్యంనాయుడు,త్రినాధ్,  గర్బాపు ఉదయ బాను,మజ్జి వెంకటేష్, వర్రి నర్సింహమూర్తి, నెల్లిమర్ల జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, చనుమళ్ల వెంకటరమణ, ఆశపు.వేణు,నడిపేన.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్న జగన్‌


ఏపీకి చేయూతనివ్వండి: వినతులతో ఢిల్లీకి చేరిన జగన్
  • ఏపీకి చేయూతనివ్వండి: వినతులతో ఢిల్లీకి చేరిన జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రానికి నివేదించడానికి ఆయన తన పార్టీకి చెందిన ఎంపీలతో కలసి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన తలపెట్టారు.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించి తగిన రీతిలో ఆదుకోవాలని కోరడానికిగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు తదితరుల అపాయింట్‌మెంట్ కోరారు. వారి అపాయింట్‌మెంట్ ఖరారవగానే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయన నివేదించనున్నారు. కాగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి కలవనున్నారు.

ఈ నెల 26న రైల్వే బడ్జెట్, 28న సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపాలని జగన్ నేతృత్వంలోని బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక రాయితీలు కల్పించడం, ప్రత్యేక రైల్వే జోన్, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు తగిన కేటాయింపు జరపడం వంటి అంశాలను వైఎస్ జగన్ ప్రధానికి, కేంద్ర మంత్రులకు వివరించనున్నారు.

సీఆర్‌డీఏ పరిధిలో రాష్ట్ర రాజధాని పేరుతో భూసమీకరణ అంశంలో ప్రభుత్వం నుంచి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్నీ కేంద్రం దృష్టికి తేనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లమధ్య తలెత్తిన జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కారం చూపించాలని కోరనున్నారు. నాలుగు రోజులుగా నలిగిన నాగార్జున సాగర్ జలవివాదం, అందుకు దారితీసిన పరిస్థితుల్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కోరిన నేపథ్యంలో జగన్ సోమవారం వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి.

Popular Posts

Topics :