17 July 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరపాలి

Written By news on Saturday, July 23, 2016 | 7/23/2016


హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.5 కో్ట్లకు అదనంగా సదావర్తి భూముల కొనుగోలు చేస్తామన్న కంపెనీని నిబంధనల పేరుతో బెదిరించడం ఎంతవరకూ సమంజసమని వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. బాధ్యతగల పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలాగేనా వ్యవహరించేందంటూ ధ్వజమెత్తారు.
సదావర్తి భూముల కుంభకోణంలో రూ.వెయ్యి కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బందరు పోర్టుకు ఎంత భూమి సేకరించాలనుకుంటున్నారో వెల్లడించలేదన్నారు. పోర్టు భూ సమీకరణపై మంత్రులు తలోమాటా మాట్లాడుతున్నారని వేణుగోపాలకృష్ణ అన్నారు. దీని వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

‘హోదా’ కోసం లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు పెడతాం


 వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి
 
 సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తమ పార్టీ ప్రైవేట్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ మూడుసార్లు లోక్‌సభను స్తంభింపజేసిందని తెలిపారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హోదా సాధన కోసం తమ పార్టీ గుంటూరులో ఎనిమిది రోజులపాటు దీక్ష చేసిందని గుర్తుచేశారు. దీనిపై వివిధ జిల్లాల్లో ఆందోళన చేపట్టామన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన  ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సుబ్బారెడ్డి విమర్శించారు.

 ‘ప్రకాశం’ను వెనుకబడిన జిల్లాల్లో చేర్చాలి
 వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ చట్టానికి సవరణను ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లును శుక్రవారం నాటి లోక్‌సభ ప్రైవేట్ మెంబర్ బిజినెస్ ఎజెండాలో పొందుపరిచారు. అయితే సభ మధ్యాహ్నమే వాయిదాపడడంతో ఈ బిల్లు రాలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతోపాటు అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాను కూడా ఇందులో చేర్చాలని వైవీ సుబ్బారెడ్డి ఈ బిల్లులో ప్రతిపాదించారు.

రిషితేశ్వరిలా మరొకరు బలికాకూడదు


రిషితేశ్వరిలా మరొకరు బలికాకూడదు
 ‘ర్యాగింగ్ నిరోధించండి’ పోస్టర్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

 సాక్షి, హైదరాబాద్ : నాగార్జున యూనివర్శిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్‌కు బలైనట్లు మరొకరు బలికావడానికి వీల్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ర్యాగింగ్ నిరోధించండి’ అనే పోస్టర్‌ను శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ర్యాగింగ్‌ను నిరోధించే విషయమై విస్తృతంగా ప్రచారం చేయాలని విద్యార్థి నాయకులకు ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాం బాబు, ప్రధాన కార్యదర్శి రాకేష్‌రెడ్డి, కార్యదర్శి కందుల దినేష్‌రెడ్డి, సాయి ప్రతాప్‌రెడ్డి, నదీప్‌రెడ్డి, దివాకర్, యశ్వంత్, గణేష్, శంకర్‌రెడ్డి  పాల్గొన్నారు.

చంద్రబాబు ఎప్పుడు దిగిపోతారో?

Written By news on Friday, July 22, 2016 | 7/22/2016


విజయవాడ : ప్రజల్లో స్పందన చూస్తే చంద్రబాబు ఎప్పుడు వెళ్లిపోతారా? ఆయన ముఖ్యమంత్రి పదవినుంచి ఎప్పుడు దిగిపోతారా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని జిల్లా పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం పార్టీ విజయానికి పెద్ద ఎత్తున దోహద పడుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్‌కు తొలిమెట్టు అన్నారు.
జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన చెప్పిన మాటలేవీ కాపాడుకోలేకపోయారని, రైతులు, డ్వాక్రాసంఘాల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పక్కా గృహాలు ఇలా ఏ ఒక్క హామీ అమలు జరగలేదన్నారు. దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా ఇళ్లు, పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీవంటి ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పకుండానే చేశారన్నారు. ఆ విధంగానే చంద్రబాబు చేస్తారని ఆలోచన చేసి ఓట్లు వేసిన వాళ్లంతా ఇవాళ చింతిస్తున్నారన్నారు.
గృహనిర్మాణం తీసుకుంటే ఎక్కడా కూడా ఇక్క ఇళ్లు నిర్మించలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 3 సెంట్ల స్థలం, 1.50 లక్షలతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు. రెండున్నరేళ్ల పాలనపూర్తయిందని, మిగిలిన రెండున్నరేళ్లలో ఆయన ఇచ్చిన హామీలు పూర్తిచేస్తారన్న నమ్మకం ప్రజల్లో లేదన్నారు. చంద్రబాబు మాత్రం తాను మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి అన్నీ చేసేశానని ప్రకటించుకుంటున్నారన్నారు. తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన ప్రజల్లో ఉందన్నారు. 100 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి చంద్రబాబుపై పాజిటివ్‌గా ఎవరూ జవాబు ఇవ్వడం లేదన్నారు.
చంద్రబాబుకు తెలిసే అవినీతి జరుగుతోంది...
కృష్ణా పుష్కరాల్లో ఘాట్లనిర్మాణానికి రూ. 1200 కోట్లు ఖర్చుచేస్తున్నారని, పనుల్లో అవినీతి జరుగుతోందని, నాణ్యతా లోపం ఉందన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ఆగస్టు నుంచే పుష్కరాల పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కాలయాపన చేసి మేనెలలో పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు. టెండర్లు పిలిచేందుకు సమయం లేదన్న సాకుచూపి నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయలు టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అప్పగిస్తున్నారన్నారు. రూ.1200 కోట్లలో వంద, రెండొందల ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు జేబుల్లో నింపుతున్నారన్నారు. పనుల్లో నాణ్యతాలోపం, సక్రమంగా జరగడం లేదని చెప్పడం ప్రజల్ని మోసగించేందుకేనన్నారు. నాణ్యతా లోపం ఉంటే ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
మంత్రిని తొలగించారా? లేక సంబంధిత అధికారిని సస్పైండ్ చేశారా? అని చంద్రబాబును నిలదీశారు. కృష్ణా పుష్కరాల పేరుతో నదీపరివాహక ప్రాంతంలోని దేవాలయాలను కూల్చివేస్తున్నారన్నాని, పురాతన దేవాలయాలు, పేదల ఇళ్లు కూల్చడం తప్పని చంద్రబాబు ఆలోచించడం లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల, తూర్పు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తలు బొప్పన భవకుమార్, ఆసిఫ్, నగర అధికార ప్రతినిధి జానారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఆ మూడు పార్టీలు డ్రామాలాడుతున్నాయి


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజ్యసభలో ఆ మూడు పార్టీలు కుమ్మక్కై ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్ కు రాకుండా చేశాయని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యులే పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పారు.

సమస్యను పొడగించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు. రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్ సీపీ ఒక్కటేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు. రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.

చాలా భాగం ఆయన హయాంలోనే...


ప్రాజెక్టులపై చెరగని సంతకం.. వైఎస్
♦ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా,
♦ కోయల్‌సాగర్ ప్రాజెక్టుల పనుల్లో
♦ చాలా భాగం ఆయన హయాంలోనే..
.

సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి బీళ్లుగా ఉండిపోయిన పాలమూరు జిల్లా భూములకు నీరందించి, సస్యశ్యామలం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలు ఇప్పుడు ఆ జిల్లా వాసులకు అందుతున్నాయి. కరువు రక్కసితో అల్లాడుతూ వలసబాట పట్టిన  ఆ జిల్లా రైతుల ముఖంపై చిరునవ్వు వెల్లివిరియాలన్న వైఎస్ కలలు నేడు నిజాలవుతున్నాయి. జలయజ్ఞంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు) ప్రాజెక్టులను ఆయన హయాంలో చేపట్టారు. 7.8 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు.
వీటితోపాటు 3.9 టీఎంసీల సామర్థ్యంతో 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా కోయల్‌సాగర్ ప్రాజెక్టును చేపట్టారు. నిర్మాణం వేగంగా జరగాలన్న ఉద్దేశంతో భారీగా నిధులు ఇవ్వడంతో శరవేగంగా ఆ ప్రాజెక్టుల పనులు జరిగాయి. సుమారు రూ.5 వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం కొన్ని అవాంతరాలు వచ్చినా... ప్రస్తుత ఏడాదిలో ఆ పనులన్నీ కొలిక్కి వచ్చాయి. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల ఎకరాలు వృద్ధిలోకి రాగా.. ఈ ఏడాది పాత ఆయకట్టు కలుపుకొని 4.6 లక్షల ఎకరాలకు నీరందనుంది. ప్రస్తుతం కృష్ణా నుంచి జూరాలను చేరుతున్న వరద మరికొంత కాలం కొనసాగితే నెట్టెంపాడు కింద 1.5 లక్షల ఎకరాలు, కోయల్‌సాగర్ కింద 20 వేల ఎకరాలు, భీమా కింద 1.40 లక్షల ఎకరాలకు నీరందనుండగా... కృష్ణా నీరు శ్రీశైలాన్ని చేరితే కల్వకుర్తి కింద 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. ఇన్నాళ్లూ బీడుగా ఉన్న భూములకు వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులతో జలాభిషేకం జరుగుతోంది.

‘హోదా’ బిల్లుకు మద్దతిస్తాం: బొత్స


‘హోదా’ బిల్లుకు మద్దతిస్తాం: బొత్స
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ శుక్రవారం రాజ్యసభకు రానున్న ప్రైవేటు బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని తమ పార్టీ పూర్తిగా విశ్వసిస్తోందని, దీనికోసం ఎవరు ఏ రీతిలో పోరాడినా తమ మద్దతు ఉంటుందని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం  విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ చెప్పిందన్నారు. అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వం రెండుసార్లు తీర్మానం పెట్టినపుడు కూడా తాము సమర్థించామన్నారు.

హోదా కోసం పార్లమెంటులోగాని, అసెంబ్లీలోగాని బిల్లు పెట్టాల్సిన అవసరమే లేదని, దానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే చాలునన్నారు. 2014, మార్చి 2న అప్పటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలోప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ప్రణాళికా సంఘానికి సిఫార్సు చేశారన్నారు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు ఆమోదం పొందకపోతే దీన్ని సాకుగా చూపి హోదా అంశాన్ని అటకెక్కించేస్తారనే భయం కూడా తమకుందని బొత్స చెప్పారు.

ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా సిద్ధం


'ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా సిద్ధం'
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా బిల్లుకు వైఎస్ఆర్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వద్దన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రాన్ని విడదీసిందని ఆయన గుర్తు చేశారు.
ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని టీడీపీపై మేకపాటి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీని ఒప్పించడంలో టీడీపీ విఫలమైందని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యూఢిల్లీలో దీక్షలు చేసి అరెస్ట్ య్యారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.

పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు సీఎం వ్యూహం


ఇదో అధికార కబ్జా!
♦ పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు సీఎం వ్యూహం
♦ శ్రీ‌కాకుళం, కాకినాడల్లో ఇప్పటికే విలువైన భూములు ఎన్టీఆర్ ట్రస్టుకు సంతర్పణ
♦  రాజధానితో పాటూ జిల్లా కేంద్రాల్లోనూ భూములు కొట్టేయడానికి వీలుగా ఉత్తర్వులు
♦ శాసనసభలో బలం ఆధారంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు భూములు కేటాయింపు

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట! టీడీపీ కార్యాలయం ముసుగులో శ్రీకాకుళంలో రూ.30 కోట్ల విలువైన రెండెకరాలు, కాకినాడలో రూ.25 కోట్ల విలువైన రెండువేల చదరపు గజాల భూమిని ఇప్పటికే కాజేశారు.

తాజాగా రాజధానితో పాటూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా అత్యంత ఖరీదైన భూములను కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాజధానిలోనూ, జిల్లా కేంద్రాల్లోనూ కార్యాలయాల నిర్మాణానికి భూములను నామమాత్రపు ధరకు 99 ఏళ్లకు లీజులకు కేటాయించేందుకు వీలుగా గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకు కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయిస్తారు. కానీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే భూములు కేటాయించాలనే మెలిక పెట్టడం వెనుక టీడీపీకి భారీ ఎత్తున భూములు దోచిపెట్టడానికే అన్నది స్పష్టమవుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు శ్రీకాకుళం, కాకినాడల్లో కాజేసిన తరహాలోనే మిగతా జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఖరీదైన భూములను గుర్తించి, వాటిని కేటాయించాలని కోరుతూ ఆపార్టీ జిల్లాల అధ్యక్షుల ద్వారా ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపారు.
 
వ్యూహాత్మకంగా ఉత్తర్వులు..
రాజకీయ పార్టీలకు రాజధాని, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎకరం లోపు భూమిని 30 ఏళ్లకు లీజు పద్ధతిలో కేటాయించేలా ఆగస్టు 31, 1987లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో నాలుగు, జిల్లా కేంద్రాల్లో రెండెకరాలకు పైగా ఉన్న అత్యంత ఖరీదైన భూములను పార్టీ కార్యాలయాల ముసుగులో కాజేయడానికి ప్రతిపాదనలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. ఆ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేయాలని నిర్ణయించారు. టీడీపీ మినహా మరే ఇతర పార్టీకి భారీ ఎత్తున భూములు దక్కకుండా నిబంధనలు పెట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం..
 
శాసనసభలో 50 శాతం కన్నా ఎక్కువ స్థానాలు దక్కిన పార్టీకి రాజధానిలో నాలుగు ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల చొప్పున కేటాయించవచ్చు.
అసెంబ్లీలో 25 శాతం నుంచి 50 శాతం లోపు స్థానాలు దక్కిన పార్టీకి రాజధానిలో అరెకరం వరకూ.. జిల్లా కేంద్రాల్లో వెయ్యి చదరపు గజాల వరకూ కేటాయించవచ్చు.
శాసనసభలో 25 శాతం లోపు స్థానాలుగానీ.. కనీసం ఒక్క స్థానంగానీ దక్కిన పార్టీకి రాజధానిలో వెయ్యి, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాల భూమిని కేటాయించవచ్చు.
తొలుత 33 ఏళ్లకు లీజుకు ఇస్తారు.. ఆ తర్వాత 99 ఏళ్ల వరకూ లీజును రెన్యూవల్ చేసుకోవచ్చు.
ఏడాదికి ఎకరానికి గరిష్ఠంగా రూ.వెయ్యి చొప్పున లీజుగా చెల్లించాలి.
కేటాయించిన ఏడాదిలోగా పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభించకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. ఆ భూమిని వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించకూడదు.
ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మినహా తక్కిన విపక్ష పార్టీలకు భూములు దక్కవు. శాసనసభలో 67 మంది సభ్యుల బలం ఉన్న వైఎస్సార్‌సీపీకి రాజధానిలో గరిష్ఠంగా అరెకరం, జిల్లా కేంద్రాల్లో వెయ్యి చదరపు గజాల భూమిని మాత్రమే లీజుకు పొందే అవకాశం ఉంది. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీకి రాజధానిలో వెయ్యి, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాల భూమి కేటాయించే అవకాశం ఉంది. సంఖ్యా బలం ఆధారంగా భూములు కేటాయించడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.

పుష్కర పనుల్లో అవినీతి, నాణ్యత లేమికి బాధ్యుడు ముఖ్యమంత్రే

Written By news on Thursday, July 21, 2016 | 7/21/2016


బాబుకు రోజులు దగ్గర పడ్డాయ్: ఆర్కే
-పుష్కర పనుల్లో అవినీతి, నాణ్యత లేమికి బాధ్యుడు ముఖ్యమంత్రే

మంగళగిరి (గుంటూరు జిల్లా)

 ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర ప్రజలు రాజకీయంగా బ్లాక్‌లిస్టులో పెట్టే రోజులు దగ్గరపడ్డాయని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పుష్కర పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి అక్రమ నివాసానికి కూతవేటు దూరంలో సీతానగరం ఘాట్ పనులు నెల రోజులుగా జరుగుతుంటే పట్టించుకోని చంద్రబాబు వైఎస్సార్ సీపీ నాయకులు పరిశీలించి అవినీతిని వెలుగులోకి తెచ్చాక స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. తాము వెళ్లివచ్చాక ముఖ్యమంత్రి వెంటనే పరిశీలించి కాంట్రాక్టర్‌పై చిందులు తొక్కడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పుష్కర పనులపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రికి తమ పార్టీ నాయకులు ఆ పనులలో చేస్తున్న అవినీతి కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సమయం ముగిసేవరకు పనులు ప్రారంభించకుండా చివరలో నామినేషన్ పద్ధతిపై తమ పార్టీ నాయకులకు కోట్ల రూపాయల పనులను కట్టపెట్టి దోచుకునేందుకు అవకాశమిచ్చింది ముఖ్యమంత్రి కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయంగా బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, అరోజులు ఎంతో దూరంలో లేవని ఆర్కే పేర్కొన్నారు. పుష్కరాల ప్రారంభానికి ఉన్న కొద్దిపాటి సమయంలోనైనా అవినీతికి తావులేకుండా నాణ్యతతో కూడిన పనులు చేయాలని హితవు పలికారు.

నరకం అనుభవిస్తున్నం..!


నరకం అనుభవిస్తున్నం..!వృద్ధురాలికి అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
– మురుగుకాలువలు లేవు...సరైన రోడ్డు సౌకర్యం లేదు
– కాలనీలను మృత్యు కూపంగా మర్చుతున్నారు..
– ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మొరపెట్టుకున్న మల్లంగుంట వాసులు
మల్లంగుంట(తిరుపతి రూరల్‌):
‘‘మురుగు కాలువలు లేవు...రోడ్డు వసతి లేదు...ఇంటికో మురికి గుంట ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయి...అనారోగ్యంతో ఇప్పటికే దాదాపు ఐదుగురు మృతి చెందారు...ప్రతి రోజు నరకం చూస్తున్నాం.. పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదు..మీరైనా న్యాయం చేయండయ్యా’’...అంటూ మల్లంగుంట వాసులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు.
వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్టేలు మునస్వామియాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మల్లంగుంటలోని వినాయకనగర్, ప్రియదర్శిని కాలనీ, అంబేద్కర్‌కాలనీల్లో గడప గడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గడప గడపకూ వెళ్లి స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి సమస్యల గురించి ఆరా తీయడంతో స్థానికులు తాము ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, మురుగుకాలువల సమస్యలను ఏకరువు పెట్టారు. పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వీధిలైట్లు అమర్చడంలో రాజకీయ వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. తాగునీరు ఐదు రోజులకు ఒకసారి కూడ రావడం లేదని వాపోయారు. అర్హత ఉన్నా ఇంటి పట్టాల ఇవ్వడం లేదని కొందరు మహిళలు ఎమ్మెల్యేకు వినతులు ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీ కార్యదర్శితో ఫోన్‌ ద్వారా మాట్లాడి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
రాజన్న పాలన.. జగన్నతోనే సాధ్యం
ప్రతి ఇంటికి కనీసం రెండు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో దేవుడుగా నిలచారని వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజన్న ప్రజా సంక్షేమ పాలన వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం చంద్రబాబు సాగిస్తున్న రాక్షస పాలన ఇంత వరకు చూడలేదని జనం దుమ్మెత్తి పోస్తున్నరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అజయ్‌కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దారం రామస్వామి, రామచంద్రాయ్య, ఆటో రవి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, వీరనారాయణరెడ్డి, పీపాసీ, వెంకటరమణ, భానుప్రకాష్, మునస్వామిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

జీరో మార్కులు

Written By news on Wednesday, July 20, 2016 | 7/20/2016


చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో రాక్షసపాలన సాగుతోందని పుంగనూరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ సంధించిన 100 ప్రశ్నలకు ఇప్పటివరకు వచ్చిన సమాధానాల్లో జీరో మార్కులు వచ్చాయని వెల్లడించారు. చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాల పేరుతో 30 దేవాలయాలను కూల్చివేయించిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కృష్ణా పుష్కరాల పేరు చెప్పి చందాలు అడగడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శమని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.

నిజాం గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌సీపీ భారీ సభ


నిజాం గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌సీపీ భారీ సభ
పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
తెలంగాణలో పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుందని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన భూమిక పోషించనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల ఓట్ల తేడాతో పార్టీ అధికారానికి దూరమైందని, తెలంగాణలో చాలా తక్కువ ఓట్లతో కొన్ని అసెంబ్లీ సీట్లను చేజార్చుకున్నామని, సమైక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ ప్రధాన భూమిక పోషించే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జిల్లా కమిటీల సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని 150 డివిజన్లలోనూ, రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ త్వరగా కమిటీల ప్రక్రియ పూర్తి చేయాలని, ప్రజా సమస్యలను గుర్తించి దశలవారీగా పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న తీరును ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు మహానేత వైఎస్సార్ పాలనను చంద్రబాబు, కేసీఆర్‌ల పాలనను పోల్చి చూసుకుంటున్నారని చెప్పారు. ఇద్దరు సీఎంల పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ అందరికీ గుండెకాయ లాంటిదని, ఇక్కడ 23 జిల్లాల వాసులు నివసిస్తున్నారని చెప్పారు. పార్టీ నగరంలో బలంగా ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ బలంగా ఉన్నట్లేనన్నా రు. త్వరలో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మా ట్లాడుతూ పార్టీని నగరం, రాష్ట్రంలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎ.కుమార్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, గ్రేటర్ మహిళా విభా గం అధ్యక్షురాలు శ్యామల, నాగదేశి రవికుమార్, రైతు విభాగం అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

బిల్లు ఎవరు పెట్టారనేదానికంటే హోదా రావడమే ముఖ్యం

Written By news on Tuesday, July 19, 2016 | 7/19/2016

 తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జీఎస్టీ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీలతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. దీనికి వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బరెడ్డిలు వెంకయ్యతో మాట్లాడిన విషయాన్ని మీడియాకు తెలిపారు. జీఎస్టీ బిల్లుకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఎంపీలు 20న పార్లమెంట్ ముందుకు రానున్న ప్రైవేట్ బిల్లుకు కూడా బేషరతుగా మద్దతు పలకుతామన్నారు. తాము కూడా పలు మార్లు హోదా అంశాన్ని లేవనెత్తామని, 20న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇస్తామని, బిల్లు ఎవరు పెట్టారనేదానికంటే హోదా రావడమే తమకు ముఖ్యమని ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డిలు తెలిపారు.

ఈ దొంగ కేసులన్నింటిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తాం


పాల్మన్‌పేటలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
- ఈ మోసకారి సీఎంను ఏం చేయాలో మీరే నిర్ణయించండి..
- రౌడీ రాజ్యం నడుపుతున్నారు.. తప్పు చేసిన మంత్రిని బర్తరఫ్ చేయకుండా రక్షిస్తారా
- ఈ అరాచక పాలన బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుంది
- పాల్మన్‌పేట ఘటనలపై విచారణ జరిపిస్తాం..
- నిందితులందరినీ జైలుకు పంపిస్తాం..
- బాధితులకు అండగా ఉంటాం.. న్యాయం కోసం పోరాడతాం.
 
 సాక్షి, విశాఖపట్నం : ‘రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. రౌడీ రాజ్యం నడుస్తోంది. మాఫియాను సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తూ నాకింత నీకింత అని గ్రామాలు పంచుకుంటున్నారు. తప్పు చేసిన మంత్రిని బర్తరఫ్ చేయడం మానేసి, అతన్ని కాపాడుకోవడానికి అబద్ధపు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారు. బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టారు. ఎల్లకాలం చంద్రబాబు పాలనే సాగదు. మా ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు అరాచక పాలనను బంగాళాఖాతంలో కలిపేసే రోజొస్తుంది. మా ప్రభుత్వం రాగానే పాల్మన్‌పేట కేసులపై విచారణ జరిపి దాడికి సహకరించిన వారితో సహా అందరినీ జైలుకు పంపిస్తాం’.. అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట గ్రామంలో టీడీపీ గూండాల దాడికి గురైన గ్రామస్తులను సోమవారం ఆయన పరామర్శించారు. ఇంటింటికీ వెళ్లి జరిగిన దారుణాన్ని కళ్లారా చూశారు. బాధితులతో మాట్లాడారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడి ఎలిమెంటరీ స్కూల్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆసాంతం కదలకుండా నిలబడి ఆయన ప్రసంగాన్ని విన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

 అరాచకాన్ని అడిగే నాథుడు లేడు
 ‘‘అకారణంగా తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసేందుకు గత నెల 24న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారన్న ఒకే ఒక్క కారణంతో ‘మాపైనే కేసుల పెడతారా, మమ్మల్ని పంపిన వ్యక్తి యనమల కృష్ణుడు అని మీకు తెలియదా’ అని 26న రెండోసారి దాడులు చేశారు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే అదే పరిస్థితి, ఎస్సై సత్యనారాయణ కేసులు నమోదు చెయ్యడు, ఎవరినీ అరెస్ట్ చేయడు. 28న మత్స్యకార గ్రామస్తులంతా కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయాలనుకుంటే, మీరు ధర్నా చేసేంత గొప్ప వ్యక్తులా అంటూ కృష్ణుడు గూండాలను పంపించాడు. 400 మంది మనుషులను పంపించి ఆడా మగా తేడా లేకుండా దాడులు చేసి తలలు పగులగొట్టినా, చిన్న పిల్లల్ని కూడా గాయ పరిచినా.. ఇళ్లలో దూరి బీరువాలు పగులగొట్టి, బంగారం, డబ్బులు లూటీ చేసినా.. ఆస్తులు ధ్వంసం చేసినా అడిగే నాథుడు లేడు. ఇవన్నీ ఎస్సై సత్యనారాయణ సమక్షంలో జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. 24వ తేదీన, 26వ తేదీన, 28వ తేదీన మూడుసార్లు దాడులకు పాల్పడటం దారుణం. 28నజరిగినది ఎంత దారుణమైన ఘటన అంటే.. మొత్తం రాష్ట్రం అంతా, చంద్రబాబు పరిపాలనకు సిగ్గుతో తలవంచుకోవాలి.

 బాబు మొసలి కన్నీరు
 వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్రామానికి వచ్చారని, మత్స్యకారులంతా ఏకమవుతున్నారని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు. దాడుల్లో నష్టపోయిన వారందరికీ రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు ఎంతటి మోసగాడంటే.. మీలో ఎంత మందికి రూ.50 వేలు అందలేదో రెండు చేతులెత్తి చెప్పండి.. (జగన్ అడగ్గానే అందరూ చేతులెత్తి అందలేదని చెప్పారు.) చంద్రబాబుకు మోసాలు కొత్తకాదు. కుర్చీ కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. మొన్న ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి రైతన్నలు, ఆడవాళ్లు, చిన్న పిల్లలు.. అందరికీ అబద్ధాలు చెప్పి మోసం చేశారు.

పాల్మన్‌పేట వాసులను మోసం చేస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గ్రామంలో ముగ్గురికి మాత్రమే లక్షన్నర, మరో ముగ్గురికి లక్ష, మిగిలిన వారందరికీ ఐదు పదివేలు అందాయట. నిజంగా మీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రి ఈ ఊరి మీద పడమని చెప్పి పురమాయిస్తే .. నాలుగొందల మంది ఊరిమీదకు వచ్చి దౌర్జన్యం చేస్తూ బీరువాలు పగుల గొట్టి నగలు, డబ్బులు దోచుకుపోతే ఆ మంత్రిని బర్తరఫ్ చేయకుండా, ఆ మంత్రి చేసిన తప్పును సమర్ధిస్తూ తప్పుడు వాగ్దానాలు చేయడం మీకు ఎంత వరకూ సమంజసం అని చంద్రబాబును అడుగుతున్నా. చంద్రబాబు పరిపాలన చూస్తుంటే మన రాష్ట్రం ఆటవిక  రాష్ట్రమో, ఏ బీహారో అనిపించే పరిస్థితి ఉంది. ఈ రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతి మాత్రం చేశారు. రౌడీ రాజ్యం సృష్టిస్తూ ఇసుకను, మట్టిని సైతం వదలకుండా గ్రామగ్రామాన మాఫియాను సృష్టించి నాకింత నీకింత అని భాగాలు పంచుకుంటున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఈ మాఫియా చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా బంగాళాఖాతంలో కలిపే రోజు తొందరలోనే వస్తుంది.

 బాధితులపైనే కేసులా?
 వీళ్ల రాజకీయాలు ఎంత నీచానికి దిగజారాయంటే వాళ్లొచ్చి ఈ గ్రామంపై మూడుసార్లు దాడులు చేస్తే వారి మీద కేసులు పెట్టడం మానేసి, ఇదే గ్రామంలోని 18 మందిపై ఎదురు కేసులు పెట్టారు. ఎంత దారుణం చేస్తున్నారంటే పక్క గ్రామంలో 70 ఏళ్ల ముసలాయన చనిపోతే ఆయనను నీళ్లలో పడేసి ఈ గ్రామం వాళ్లే చంపేశారని కౌంటర్ కేసులు పెట్టి జైళ్లకు పంపారంటే ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా? మీ కేబినేట్‌లో ఉన్న మంత్రి 400 మందిని పంపిస్తాడు. యనమల రామకృష్ణ తమ్ముడు కృష్ణుడు వాళ్లని తీసుకువస్తే వాళ్లంతా ఇక్కడ కొట్టి దౌర్జన్యం చేయడమే కాకుండా లూటీ చేస్తే ఆ మంత్రిని బర్తరఫ్ చేయడం మానేసి, మంత్రులను కాపాడుతూ, దొంగతనాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ఈ ముఖ్యమంత్రి నిజంగా ముఖ్యమంత్రేనా? ఆయనకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే అర్హత ఉందా?  ఈ దొంగ కేసులన్నింటిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తాం.

వీళ్లకు సహకరించిన ఎస్సై సత్యనారాయణతో సహా అందరినీ జైలుకు పంపిస్తాం. ఈ రెండేళ్లు కాస్తో కూస్తో కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉన్నా ధైర్యంగా ఎదుర్కొందాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా, తోడుగా ఉంటుంది. ఎల్లకాలం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సాగదు. రెండేళ్లకో,  ఏడాదికో మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వీళ్లు చేసిన దానికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష తప్పదు. న్యాయ స్థానం మీద నమ్మకం ఉంది.  మంచి లాయర్లను పెడదాం. న్యాయ స్థానంలో పోరాడదాం. ఆ కుటుంబాలన్నిటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.’’అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ పర్యటనలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
 
 ఈ ముఖ్యమంత్రిని ఏం చేయాలి?

  అంతకుముందు మునగపాకలో జరిగినసభలో జగన్ మాట్లాడుతూ... ‘‘ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఏమీ చేయకపోతే.. మోసం చేస్తే.. ఆ వ్యక్తిని ఏం చేయాలి?.. నేను సీఎం కదా, ముఖ్యమంత్రి అభ్యర్ధిని కదా ఏం చేసినా చెల్లుతుందంటే రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది.. మోసకారి బాబును ఏం చేద్దాం? మీరే నిర్ణయించండి. మా నాయకులకు ఒకటే చెబుతున్నా.. ఇవాళ మనం చేయాల్సిందేమిటంటే.. ప్రజల్లోకి వెళదాం. వారు పడుతున్న బాధలు చూద్దాం. వారందరికీ మనం తోడుగా ఉన్నామన్న భరోసా ఇద్దాం.. చంద్రబాబు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికలు అయ్యాక ఏం చేశారు అనేది ప్రజలకు చెబుదాం. ఎన్నికల్లో గెలవడం కోసం బాబు చెప్పిన అబద్ధాలను ప్రజలల్లో తీసుకువెళ్లి ప్రజల చేతే మార్కులు వేయించండని ప్రజా బ్యాలెట్ ఇచ్చాం.

చంద్రబాబు ఇచ్చిన హామీలు, మాటలు ఆ పాంప్లెట్‌లో ఉంచాం.  బాబు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీలన్నింటినీ నిలబెట్టుకున్నారా అని ప్రజలనే అడగండని, ప్రజల చేతే అలోచింపజేయండని చెప్పాం. గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమం పేరుతో ప్రజల్లో వెళ్లమని చెప్పా. చంద్రబాబు పాలనపై మార్కులు వేయించమని చెప్పాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ప్రజల్లోకి వచ్చి వారికి ఏదో చేస్తానని ప్రజలతో పని అయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజలకు మేలు చేయకపోతే, మోసంచేస్తే ఆ వ్యక్తిని ఏం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిని కదా ఏమైనా చేయెచ్చు, నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నా కదా ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లుతుందంటే రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది. పాలక వ్యవస్థ మారాలన్నా, రాజకీయ వ్యవస్థ మారాలన్నా మనలో చైతన్యం రావాలి.

ఫలానా పని చేస్తానని మైక్‌పట్టుకుని చెప్పిన వ్యక్తి చేయకపోతే రేప్పొద్దున్న జనం నిలదీస్తారన్న భయముంటేనే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకుల్లో మార్పు రావాలన్నా, వ్యవస్థను మార్చాలన్నా మనమంతా ఒక్కటై ‘ఆరోజు ఎన్నికల ముందు ఏ చెప్పావ్, ఎన్నికలయ్యాక మోసం చేస్తావా’ అని నిలదీయాలి. అందుకే గడప గడపకు వైఎస్సార్ ప్రారంభించాం. వైఎస్సార్‌సీపీకి మీరందరూ తోడుగా ఉండాలి. మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది.’’ అని వివరించారు.

సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందమేంటి?

Written By news on Monday, July 18, 2016 | 7/18/2016


సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందమేంటి?
చంద్రబాబు అవినీతికి ఇదే నిదర్శనం: బొత్స సత్యనారాయణ

 ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : రాజధాని నిర్మాణం విషయంలో.. నిబంధనల ప్రకారం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా, ఆ దేశానికి చెందిన ప్రైవేటు కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇది సీఎం చంద్రబాబు అవినీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ పద్ధతిని కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు తప్పుపట్టినా అదే విధానాలను అనుసరించడం దారుణమన్నారు.

రాష్ట్రంలో అప్రజాస్వామిక, అరాచక పాలన సాగుతోందని, టీడీపీ నాయకులు తమకు నచ్చినరీతిలో దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి చెందిన గ్రామస్థాయి కార్యకర్త నుంచి సీఎం వరకూ ప్రజల్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. స్వలాభాలకోసమే పాలన అన్నట్టుగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు తరతరాలకు సరిపడా ఆస్తులు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐతోగానీ, సిట్టింగ్ న్యాయమూర్తితోగానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల బాబు పాలనలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకోవడానికే తమ పార్టీ ఆధ్వర్యంలో ‘గడపగడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇందులోభాగంగా చంద్రబాబు అవినీతిపైన, ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన వైనంపైన ప్రజల్ని చైతన్యం చేస్తున్నామని వివరించారు.

నేడు విశాఖకు వైఎస్ జగన్


నేడు విశాఖకు వైఎస్ జగన్
పాల్మన్ పేటలో బాధితులకు పరామర్శ

 సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్‌పేటకు వెళ్లి స్థానిక మత్స్యకారులను పరామర్శిస్తారు.

గత నెలలో అధికార టీడీపీ నేతల అండతో కొందరు ఈ గ్రామంపై దాడిచేసి స్థానికులను గాయపర్చడంతోపాటు, వారి ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడి భరోసా కల్పించనున్నారు.

టీడీపీ ఆరిపోయే దీపం


టీడీపీ ఆరిపోయే దీపం
అక్రమ  కేసులకు భయపడేది లేదు
2019లో జగనే సీఎం
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటా
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

నగరి:  టీడీపీ ఆరిపోయే దీపమని, అక్రమ కేసులకు భ యపడేది లేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు.  పట్టణ పరిధిలోని సీవీఆ ర్ కళ్యాణ మండపంలో ఆదివారం  ఆర్కే రోజా అధ్యక్షతన  నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది.  ముఖ్యఅతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణకరరెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సు నీల్‌కుమార్, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జీ ఆది మూలం, రాష్ట్ర సంయుక్త కమిటీ సభ్యుడు పోకల ఆశోక్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడిని  నియోజకవర్గ ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదన్నారు. ఈ అక్కసుతోనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రోటోకాల్ పేరుతో పోలీసులను అడ్డం పెట్టుకొని  ప్రశ్నించిన వారిపై  అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కే సులు పెట్టి జైలుకు పంపిన  ఘనత ఎమ్మెల్సీకే దక్కుతుందని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేజే కుమార్ కుటుంబం, నాయకులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాసనసభ్యురాలైన తనపై నగరి జాతరలో దాడి జరిగి రెండేళ్లు గడిచినా  ఇంత వరకు ఏం చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఈటీపీ ప్లాం ట్ ప్రారంభానికి అడ్డుపడుతూ, అధికారులను బెదిరి స్తూ, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
 
2019లో జగనే సీఎం

చంద్రబాబు మోసపూరిత  హామీలు ప్రజలకు తెలిసిపోయాయని,  2019లో ఎన్నికలలో జగనన్న సీఎం కావడం ఖాయమని రోజా పేర్కొన్నారు. అంత వరకు నాయకులు, కార్యకర్తలు ఓర్పుతో  పని చేయాలని పిలుపునిచ్చారు. గడప గడపకూ  వైఎస్సార్ ద్వారా టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

రాక్షస పాలన
కేజే కుమార్‌పై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, దీనికి భయపడేది లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ పీజీ నీలమేఘం అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ తుడుచిపెట్టుకొని పోతుందని, రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న పాలన రావాలని మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి అన్నారు. ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడు  నామినేట్ పదవి తీసుకుని ప్రజల్లో తిరుగుతూ చిచ్చుపెటుతున్నారని రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్ అన్నారు. అంతకుముందు అతిథులను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సభావేదికపై జ్యోతి వెలిగించి, వైఎస్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళ్లు అర్పించారు. సమావేశంలో విజయపురం, పుత్తూరు, నిండ్ర, వడమాలపేట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Popular Posts

Topics :