16 April 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

'టీడీపీ' దౌర్జన్యంపై స్పందించిన హైకోర్టు

Written By news on Saturday, April 22, 2017 | 4/22/2017


హైదరాబాద్: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై హైకోర్టు స్పందించింది. విజయవాడ ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం‌, ఆయన గన్‌మెన్ దశరథపై టీడీపీ ఎంపీ, కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు దాడి కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. 'ఐపీఎస్‌పై గుండాగిరి' అని ప్రచురితమైన సాక్షి కథనాన్ని పిల్‌గా కోర్టు స్వీకరించింది. వచ్చే మంగళవారం ఈ కేసును ధర్మాసనం విచారణ జరపనుంది.

'నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా' అని విజయవాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్‌ అధినేత కేశినేని శ్రీనివాస్‌(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అదే సమయంలో 'ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా..? ఏం బతుకు నీది?' అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను తూలనాడుతూ చిందులు తొక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కేశినేని నాని, బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్‌ హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ నాగుల్‌ మీరా, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ దాదాపు 200 మంది కార్యకర్తలతో కలసి కమిషనర్‌ను విజయవాడ నడిరోడ్డుపై దిగ్బంధించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని దాదాపు రెండు గంటలపాటు నిలబెట్టిమరీ దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు. ఐపీఎస్ అధికారిపై గత నెలలో జరిగిన ఈ దాడి ఘటనను హైకోర్టు సీరియస్‌గా పరిగణించింది. సాక్షి కథనాన్ని పిల్‌గా స్వీకరించిన హైకోర్టు వచ్చే మంగళవారం ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.

చంద్రబాబు అరాచకాలపై దండెత్తండి: వైఎస్సార్‌సీపీ


చంద్రబాబు అరాచకాలపై దండెత్తండి: వైఎస్సార్‌సీపీ
హైదరాబాద్‌: ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా.. అందుబాటులో ఉండే ప్రతి మాద్యమం ద్వారా ప్రజలు చంద్రబాబు నాయుడి అరాచకాలపై దండెత్తాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు దురాగతాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా నిలదీయాలని కోరింది.

ఏపీ సీఎం చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలపై ప్రజాస్వామిక యుద్ధం ప్రకటించాలన్న వైఎస్ జగన్‌ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం హరిస్తున్నదని, ఈ దమనకాండకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా ద్వారా చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న దాడిని ప్రతిఘటించాలని ఆశించింది.

ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన సోషల్‌ మీడియా విభాగం.. గడిచిన కొన్నేళ్లుగా వైఎస్‌ కుటుంబంపై అత్యంత హేయమైన అసత్యప్రచారాలు చేస్తోన్న వైనాన్ని వైఎస్సార్‌సీపీ గుర్తుచేసింది. ఈ మేరకు టీడీపీ రూపొందించిన కొన్ని క్లిప్పింగ్‌లను విడుదలచేసింది. 'ఆయన చేసిన దాడిని వైఎస్సార్‌సీపీ అభిమానులు సమర్థవంతంగా తిప్పికొట్టడంతో చంద్రబాబు తట్టుకోలేక, ఏకంగా పోలీసులను రంగంలోకి దింపి భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు'అని ప్రకటనలో పేర్కొన్నారు.

అధికార మదం తలకెక్కిన స్థితిలో పోలీసుల్ని పంపి చేయించిన దాడులకు ఎవ్వరూ భయపడరని, ప్రజల గొంతుగా, ప్రజలు తమ వాణిగా సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్న ప్రతిఘటనను మరింత శక్తిమంతంగా, మరింత బలంగా చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ప్రజల అభిప్రాయం దేవుడి మాటతో సమానం అన్నది నానుడి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న దుర్మార్గాలను, అసత్య ప్రచారాలను లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఆడుకునే మరో మీడియాగా రూపాంతరం చెందిన సోషల్‌ మీడియాను తట్టుకోలేకే పోలీసుల సహాయంతో కండబలం ప్రదర్శిస్తున్నారని విమర్శించిన వైఎస్సార్‌సీపీ.. చంద్రదండుపై ప్రజాస్వామికంగా పోరాడుతూ, అహింసాయుతంగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చింది.

ఆంధ్రా ఫ్యూచర్


అసెంబ్లీ టైగర్, ఆంధ్రా ఫ్యూచర్
రాప్తాడు :
అసెంబ్లీ టైగర్, ఆంధ్రా ఫ్యూచర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీలో ఆయన మైకు ముందు నిలబడితే ప్రభుత్వానికి దడ పుడుతోందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలనైతే కూలుస్తారేమో గానీ, ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న ఆయన ప్రతిరూపాన్ని ఏమీ చేయలేరని మండిపడ్డారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
  • ఈ ప్రాంత రైతుల కోసం మా అన్న.. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎంత పోరాడుతున్నారో మీ అందరికీ తెలుసు
  • ఆయన అసెంబ్లీలోను, బయట కూడా రైతుల గురించే మాట్లాడతారు
  • చాలా సందర్భాల్లో రైతుల ప్రయోజనాల కోసం నిరాహార దీక్షలు చేశారు
  • 20 రోజుల్లో లోకేష్ కామెడీ చూసి అలసిపోయాం
  • గూగుల్‌లో పప్పు అని కొడితే ముద్దపప్పుతో పాటు ఆయన ఫొటో కూడా వస్తోంది
  • జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియని అసమర్ధ మంత్రిని మన రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దారు
  • పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి ఎందుకయ్యారంటే తాగునీటి సమస్య సృష్టించడానికే అంటారు
  • సోషల్ మీడియాలో ఆయన గురించి పెడుతున్నారని రవికిరణ్‌ను రాత్రికి రాత్రి పక్క రాష్ట్రంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు
  • తెలుగుదేశం అరాచక పాలన ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది
  • సూర్యుడిని అరచేత్తో ఆపడం ఎంత కష్టమో, మీరు చేసే తప్పులను మీరు చేసే అవినీతిని, అరాచకాలను చూపే సోషల్ మీడియాను ఆపడం కూడా అంతే కష్టం
  • రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లున్నాయో కూడా తెలియకుండా 200 సీట్లలో గెలుస్తామన్నారు
  • ఇంత దద్దమ్మ మంత్రిని మన నెత్తిన పెట్టిన చంద్రబాబుకు కూడా బుద్ధి చెప్పాలి
  • నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈయన మంత్రి అయి కూర్చున్నారు
  • ఇక చంద్రబాబు కూడా తమకు 16 శాతం ఆదరణ పెరిగిందని చెబుతారు.. ఏవిధంగా పెరిగిందంటే అది చెప్పరు
  • ఇదే చంద్రబాబు సొంత జిల్లాలో పట్టభద్రులు.. అంటే మేధావులు, యువత, మహిళలు వేసిన ఓట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్ఆర్‌సీపీ మద్దతిచ్చిన యండవిల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు.

అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి: వైఎస్ జగన్


అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి: వైఎస్ జగన్
హైదరాబాద్ :
సోషల్ మీడియాను అణగదొక్కుతున్న చంద్రబాబు మీద అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని పోరాటం చేయాలని, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులంతా ఈ దారుణంపై స్పందించాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.

సోషల్ మీడియా మీద ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న అసహనం, గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు. పొలిటికల్ పంచ్ అనే ఫేస్‌బుక్ పేజీ అడ్మినిస్ట్రేటర్ అయిన రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం, తర్వాత వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం కార్యాలయంలో సోదాలు చేయడం, అక్కడి సిబ్బందికి నోటీసులు ఇవ్వడం తదితర ఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలన్న చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని, సర్కారు నిరంకుశ వైఖరిపై ధ్వజమెత్తాలని వైఎస్ జగన్ కోరారు. ఏపీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను కలిసకట్టుగా వ్యతిరేకించాలని అన్నారు.
 

Request YSRCP supporters across the globe to condemn CBNs undemocratic tyrannical act in throttling social media, using the very same media.

సోషల్‌ మీడియా వ్యవస్థనే మూసేస్తారా?


సోషల్‌ మీడియా వ్యవస్థనే మూసేస్తారా?
హైదరాబాద్‌: సోషల్‌ మీడియాపై చంద్రబాబు సర్కారు అసహనం ప్రదర్శించడాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు. వైఎస్సార్ సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు. సోషల్‌ మీడియా విషయంలో టీడీపీ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందని వైఎస్సార్ సీపీ నేత కన్నబాబు అన్నారు. లోకేశ్‌ కు మంత్రిగా ఉండే సామర్థ్యం లేదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ లోపాలు, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారకూడదని మరో నాయకుడు జోగి రమేశ్‌ అన్నారు. సోషల్‌ మీడియా వ్యవస్థను మూసేయాలని భావించడం మంచి పరిణామం కాదని పేర్కొన్నారు. గూగుల్‌ లో పప్పు అని కొడితే లోకేశ్‌ కు సంబంధించిన సమాచారం వస్తోందని తెలిపారు. మంత్రి పదవి నిర్వహించే ప్రతిభా పాటవాలు లోకేశ్‌ కు లేవని జనం నమ్ముతున్నారన్నారు.  చంద్రబాబుకు కంటిమీద కనుకు కరువయ్యే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

మంత్రి పదవికి లోకేశ్‌ అనర్హుడు: అంబటి


మంత్రి పదవికి లోకేశ్‌ అనర్హుడు: అంబటి
గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ఏపీ సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు.  సోషల్‌ మీడియా ఫిప్త్‌ ఎస్టేట్‌గా మారిందని, దాన్ని అణచివేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే సోషల్‌ మీడియాలో అన్ని నిజాలే ఉంటాయని తాను అనడం లేదని, అయితే వాస్తవాలకు దగ్గరకు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. 
మంత్రి పదవికి లోకేశ్‌ అనర్హుడని, పరిజ్ఞానం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. విమర్శలు చేసినంత మాత్రాన పొలిటికల్‌ పంచ్‌  రవికిరణ్‌ ను అరెస్ట్‌ చేశారా అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. అసలు రవికిరణ్‌ ను ఎందుకు అరెస్ట్‌ చేశారని, కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని, దీనిపై పోలీసులపై కూడా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

అరెస్ట్‌లు చేసేకంటే లోకేశ్‌కు ఎలా మాట్లాడాలో ట్రైనింగ్‌ ఇస్తే మంచిదని సూచించారు. పరిణితి లేని వ్యక్తిని తీసుకువచ్చి మూడు శాఖలకు మంత్రిని చేస్తే... పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. లోకేశ్‌ కు మంత్రి స్థాయిలేదని, అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ ఏం చెబితే అది చేయాలనే మైండ్‌సెట్‌ తో పోలీసులు ఉన్నారని, ఆ పద్ధతి మార్చుకోవాలన్నారు. అభద్రతా భావంతో ఏపీ సర్కార్‌ వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు అందరూ సోషల్‌ మీడియావైపు చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. మీడియాను కంట్రోల్‌ చేయాలని చూడటం సరికాదని అన్నారు.

వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి


వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి
హైదరాబాద్‌ : ఓ వైపు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా...మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై దాడులు కొనసాగిస్తోంది. ఏపీ పోలీసులు శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి చేశారు. హైదరాబాద్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన పోలీసులు సోదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,  ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, జోగి రమేష్‌ తదితరులు హుటాహుటీన సోషల్‌ మీడియా కార్యాలయానికి చేరుకున్నారు. సోదాలు చేస్తున్న పోలీసుల చర్యలకు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే తప్ప, తాబేదారులుగా ఉండకూడదన్నారు. ఇవ్వాళ జరిగినవే రేపు జరుగుతాయని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

చట్టబద్ధంగా వ్యవహరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసుల సమక్షంలోనే ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి ఫోన్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఫిర్యాదుపై మీరెలా స్పందిస్తారంటూ ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిని విజయసాయిరెడ్డి నిలదీశారు.

వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై అనేక అవాకులు, చవాకులు పేలారని, సభ్య సమాజం హర్షించలేని పోస్టింగ్‌లు వైఎస్‌ జగన్‌పై పెట్టారన్నారు. ఈ విషయంలో టీడీపీ కార్యాలయంలో సోదాలు చేసే శక్తి మీకు ఉందా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ను దూషిస్తూ మంత్రి లోకేశ్‌ పెట్టిన ట్వీట్లను వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పోలీసులకు చూపించారు. వైఎస్‌ఆర్‌ సీపీలోని అన్ని విభాగాలకు తానే ఇంఛార్జ్‌ని అని, నోటీసులు ఇవ్వదలిస్తే తనకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి అన్నారు. చర్యలు తీసుకుంటే తనపై తీసుకోవాలని ఆయన పోలీసులుతో తెలిపారు.
కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాపై విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అనంతపురం పర్యటనలో ఆయన సోషల్‌ మీడియాపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ తప్పులు, లోపాలను సోషల్‌ మీడియా ఎత్తిచూపడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సర్కార్‌  నేరుగా ఎదుర్కోలేకే అరెస్ట్‌లు చేసి భయభ్రాంతులను చేయాలని వ్యూహంతో ముందుకు వెళుతోంది.
దానిలో భాగంగానే పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ మరవక ముందే ఇవాళ వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలో పోలీసులు సోదాలు చేపట్టారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ వింగ్‌కు చెందిన చల్లా మధుసూదన్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని, ఈనెల 25న విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసులు తెలిపారు. ఆ మేరకు చల్లా మధుకు పోలీసులు పోలీసులు జారీ చేశారు.







1,2 తేదీల్లో గుంటూరులో వైఎస్‌ జగన్‌ రైతు దీక్ష

Written By news on Friday, April 21, 2017 | 4/21/2017

)
1,2 తేదీల్లో గుంటూరులో వైఎస్‌ జగన్‌ రైతు దీక్ష
గుంటూరు : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చే నెల 1, 2వ తేదీల్లో గుంటూరులో రైతుదీక్ష చేపట్టనున్నారు. కాగా ఈనెల 26, 27తేదీల్లో జరగాల్సిన దీక్ష వాయిదా పడినట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి తరఫున వైఎస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు.

మే ఒకటి, రెండు తేదీల్లో గుంటూరులో వైఎస్‌ జగన్‌ రైతు దీక్ష చేపడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే వైఎస్‌ జగన్‌ ఈ దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లభించక, రుణ మాఫీ కాక ఆత్మహత్యల బాట పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందని బొత్స ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబుది మాటల సర్కారే కానీ, చేతల సర్కార్‌ కాదని మండిపడ్డారు. రైతులంతా ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని బొత్స సత‍్యనారాయణ కోరారు.

ముందస్తు ఎన్నికలు రావాలని తాము కోరుకోవడం లేదని, అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమే అని బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ తగ్గుతుందన్న చంద్రబాబు మాటలు నిజమైతే ...పార్టీ ఫిరాయించిన 21మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఎందుకు ఉప ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష

Written By news on Wednesday, April 19, 2017 | 4/19/2017


గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష
గుంటూరు :
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై రెండు రోజుల దీక్ష చేపడుతున్నారు. గుంటూరు వేదికగా ఈనెల 26, 27 తేదీలలో జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తారు. ఒకవైపు పంటల దిగుబడి వచ్చి రైతులు తమ పంటలను అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించడం.. అయినా ఈ అంశంపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన దీక్ష మొదలుపెడుతున్నారు.

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పతనం అవుతున్నాయి. దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. ధరలు లేకపోవడంతో ఇద్దరు మిర్చి రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి రంగంలోకి దిగాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీక్షా స్థలాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. స్థలాన్ని నిర్ణయించిన తర్వాత పోలీసుల అనుమతి తీసుకుని అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు. గతంలో కూడా రైతుల ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ తీవ్రంగా పోరాడిన విషయం తెలిసిందే.

ప్రొద్దుటురులో పేట్రేగిన ‘పచ్చ’ రౌడీయిజం!

Written By news on Sunday, April 16, 2017 | 4/16/2017



  • మరోసారి ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా
  • తీవ్ర నిరసన తెలిపిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు

వైఎస్‌ఆర్‌ జిల్లా: అధికార టీడీపీ నేతలు తీవ్ర దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వరుసగా రెండోరోజూ వాయిదా పడింది. మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని చేజిక్కించుకునేందుకు కావాల్సిన బలం తమకు లేకపోవడంతో అధికార టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీసింది. చైర్మన్‌ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సినంత కౌన్సిలర్ల బలమున్న ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకోవడానికి రౌడీయిజానికి, దౌర్జన్యానికి దిగింది. ఎన్నికను అడ్డుకోవడమే లక్ష్యంగా వరుసగా రెండోరోజు ఆదివారం కూడా టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసాలకు దిగారు. కౌన్సిలర్లకు మద్దతుగా ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులతో టీడీపీ నేతలు విస్తృత మంతనాలు జరిపారు. వారి ఒత్తిళ్లకు, రౌడీయిజానికి తలొగ్గిన అధికారులు మరోసారి ఎన్నికను వాయిదా వేశారు. పట్టపగలు పచ్చనేతల రౌడీయిజానికి తలొగ్గి అధికారులు ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది.
ఈ దారుణంపై ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎన్నిక జరపాల్సిందేనంటూ కౌన్సిల్‌ హాల్‌లో అధికారులకు అడ్డంగా  పడుకొని నిరసన తెలిపారు. ప్రసాద్‌రెడ్డిని పక్కకు తోసేసి మరీ అధికారులను పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అధికారులు, పోలీసులు, టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

చెప్పుతో కొట్టుకొని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే నిరసన!



టీడీపీ దౌర్జన్యంపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా

ఆయన ఓ ప్రజాప్రతినిధి.. ఎమ్మెల్యే. పట్టపగలు ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేస్తుంటే తట్టుకోలేకపోయారు. అధికార పార్టీ నేతలు, అధికారులు అంతా కలిసి వ్యవస్థను నాశనం చేస్తుంటే.. తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. ఈ దుర్మార్గాన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ఆయనే ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయడానికి మరోసారి టీడీపీ డ్రామా ఆడటం, అధికారులు అందుకు వత్తాసు పలుకడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి అధికారులు లొంగిపోవడాన్ని తప్పుబట్టారు.

పోలీసులు, అధికారుల తీరును తప్పుబడుతూ.. తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను తీవ్రంగా ఎండగట్టిన ఆయన.. ఈ ఎన్నిక నిర్వహించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన మండిపడ్డారు. చైర్మన్‌ పదవికి కావాల్సిన మెజారిటీ వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్నా కావాలనే ఎన్నికను టీడీపీ వాయిదా వేయించిందని ఆరోపించారు. టీడీపీ నేతల కుట్రలకు అధికారులు మద్దతు పలుకడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే దమ్ములేకే టీడీపీ రౌడీయిజానికి దిగిందని మండిపడ్డారు. తమకు 26మంది కౌన్సిలర్ల బలముందని తెలిపారు. ‘అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు.. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారు’ అని ఆయన మండిపడ్డారు.

వైఎస్‌ఆర్‌సీపీ కార్యదర్శిగా రోశయ్య నియామకం

హైదరాబాద్‌: కిలారి వెంకట రోశయ్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. రోశయ్య గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Popular Posts

Topics :