- విభజన బిల్లుపై కాంగ్రెస్, టీడీపీల నుంచి సవరణల మాటే లేదు.. సమరం ఊసేలేదు
- క్లాజులపై అభిప్రాయాలు చెప్పి చేతులు దులుపుకున్న పాలక, ప్రధాన ప్రతిపక్షాలు
- ఆయా పార్టీల సీమాంధ్ర నేతల చర్యలతో సంతోషం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రాంత నేతలు
- అధిష్టానానికి కష్టం కలగకుండా అభిప్రాయాలు కూడా రాయని కిరణ్, బొత్స, చంద్రబాబు
- బిల్లులోని అన్ని క్లాజులను తొలగించాల్సిందేనంటూ సమైక్య స్వరాన్ని చాటిన వైఎస్సార్‌సీపీ
- ‘సమగ్రాభివృద్ధి బిల్లు’గా మార్చాలన్న సీపీఎం..
- ‘ఉమ్మడి రాజధాని’గా రెండేళ్లు చాలన్న ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తామని, వాటిపై ఓటింగ్ నిర్వహిస్తామని, బిల్లును ఓడిస్తామని మొదటినుంచీ ఘంటాపథంగా చెప్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు.. చివరికి సవరణల మాట పక్కనపెట్టి బిల్లుపై అభిప్రాయాలు తెలియజేయటానికే పరిమితమయ్యారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సారథ్యంలోని టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సైతం సవరణ అనే ఊసే ఎత్తలేదు.. కేవలం బిల్లులోని క్లాజులపై అభిప్రాయాలు తెలియజేసి చేతులు దులుపుకున్నారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలైతే.. అసలు బిల్లుపై సవరణ సంగతి దేవుడెరుగు.. కనీసం తమతమ అభిప్రాయాలను కూడా రాయలేదు. దీంతో రాష్ట్ర విభజనపై సమరం చేస్తామని.. బిల్లుకు సవరణలు పెట్టి ఓటింగ్ నిర్వహించి ఓడిస్తామని సీఎం కిరణ్ ఇతర నేతలు చెప్పిన మాటలన్నీ వట్టి బీరాలేనని తేలిపోయిందని రాజకీయ పరిశీలకులు, సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. శాసనసభలో ప్రకటించినట్టుగానే పార్టీ సభాపక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా.. బిల్లులోని ఒక్కో క్లాజుకూ దాన్ని ‘తొలగించండి’ అంటూ స్పీకర్‌కు సవరణలు ప్రతిపాదించారు.
అసెంబ్లీలో చర్చకు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013 ముసాయిదాలోని వివిధ అంశాలపై శాసనసభ్యులు శుక్రవారం లోగా నిర్దేశిత ఫార్మాట్‌లో తమ అభిప్రాయాలు, ప్రతిపాదిత సవరణలు, అందుకు కారణాలను తెలియజేయాలంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు శుక్రవారం గడువు ముగియగాా.. కిరణ్, చంద్రబాబు, బొత్స మినహా మిగతా సభ్యులంతా ఏదో ఒక రూపంలో అభిప్రాయాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కిరణ్, బొత్సలు ఎలాంటి సవరణలు ప్రతిపాదించలేదని చెప్తున్నారు.
కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సైతం ప్రధానంగా అభిప్రాయాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇవ్వగా నామమాత్రంగా ఒకటీ అరా సవరణలు ప్రతిపాదించి చేతులు కట్టుకున్నారు. బిల్లులోని 108 క్లాజులపై సవరణలు కోరతామని చెప్పిన టీడీపీ సీమాంధ్ర నేతలు చివరకు సవరణలు ప్రతిపాదించకుండా ఆయా క్లాజులపై అభిప్రాయం చెప్పడానికి మాత్రమే పరిమితమయ్యారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతల్లో సంతోషం వ్యక్తమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐలకు చెందిన తెలంగాణ ప్రతినిధులు మాత్రం బిల్లుకు ఎలాంటి సవరణలు కోరలేదు. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే చేశారు.
బిల్లుపై సవరణలు కోరడం వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తొచ్చన్న అనుమానాల మేరకు సవరణలు అన్న చోట సలహాలు, సూచనలను మాత్రమే చేయాలని ఈ పార్టీల నేతలు నిర్ణయించారు. ఆ మేరకే వాటిని స్పీకర్‌కు వేరువేరుగా అందజేశారు. సీపీఎం మాత్రం ఒకటో క్లాజు ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు’ అన్నచోట ‘ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి బిల్లు’గా మార్చాలంటూ సవరణ ప్రతిపాదించింది. ఎంఐఎం బిల్లులో మొత్తంగా 15 సవరణలను కోరింది.
కొన్ని సవరించాలి.. కొన్ని తొలగించాలి!
బిల్లుకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సవరణలివీ...
విభజన బిల్లులో కీలకమైనవిగా భావిస్తున్న కొన్ని క్లాజ్‌లకు సీవూంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవరణలు ప్రతిపాదించారు. వీటిని తొలగించాలని ప్రతిపాదనలను స్పీకర్ నాదెండ్ల వునోహర్‌కు సవుర్పించారు. ఒకే రకమైన సవరణ ప్రతిపాదన కాపీలపై సీవూంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ పంపిణీ చేసి వారి సంతకాలతో స్పీకర్‌కు అందింపచేశారు. ప్రధానంగా 3, 4, 5, 8, 46, 84, 89, 90, 92, 93 క్లాజులతో సహా వురో రెండు క్లాజ్‌లకు సవరణ ప్రతిపాదనలు అందించారు. సీవూంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ ప్రతిపాదనలు చేయుడంతో పాటు కొందరు నేతలు వ్యక్తిగతంగా కూడా వురికొన్ని సవరణలను స్పీకర్‌కు అందించారు. వారందరు ప్రతిపాదించిన సవరణలు...
బిల్లులోని 3, 4, 5 (1) క్లాజులను తొలగించాలి.
క్లాజ్ నెం 8 : ఉవ్ముడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ పర్యవేక్షణలోకి చేర్చడం సరికాదు. బిల్లులోని పార్ట్-2-8(1) టు (4) క్లాజ్ రాజ్యాంగంలోని 249వ అధికరణానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఉవ్ముడి రాజధానిగా హైదరాబాద్‌లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయూలకు, పరిపాలనా వ్యవహారాల కొనసాగింపునకు భవనాలు, ఇతర సదుపాయూల కేటారుుంపు అంశవుూ గవర్నర్‌కే అప్పగించడవుూ రాజ్యాంగ విరుద్ధమే. ఈ క్లాజ్‌ను తొలగించాలి.
క్లాజ్ నెం 46: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదవుూడో ఆర్థిక సంఘం ఇచ్చిన అవార్డును జనాభా దావూషా, ఇతర పరిమితుల ప్రాతిపదికపై కేంద్రం ఇరు రాష్ట్రాలకు పంపకం చేయూలి.
క్లాజ్ నెం. పార్ట్ - 9 - 84 (1) (2) (3) లో నదీజలాలపై అత్యున్నతాధికార కమిటీ (అపెక్స్ కౌన్సిల్) ఏర్పాటు కూడా రాజ్యాంగస్ఫూర్తికి భిన్నమైనదిగా ఉంది. నదీజలాల నిర్వహణ, నియుంత్రణ, పంపిణీ తదితర అంశాలన్నీ పరీవాహక రాష్ట్రాల అధికార పరిధిలోనే ఉంటారుు. రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లో 17వ నిబంధన దీన్ని స్పష్టంగా చెబుతోంది. దీన్ని అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం. నదీజలాల నిర్వహణ బోర్డులతో ప్రాజెక్టుల నిర్వహణ సాధ్యం కాదు.
క్లాజ్ నెం 89 : కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇంతకువుుందు ఏ ట్రిబ్యునల్ చేయుయుపోరుునట్లరుుతే ప్రాజెక్టు వారీగా నిర్దిష్ట నీటి కేటారుుంపులు చేస్తుంది. నీటి ప్రవాహంలో తగ్గుదల ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా విడుదల చేయువలసిన నీటిని పర్యవేక్షిస్తుంది. ఈ క్లాజ్ వల్ల జలవివాదాలు పరిష్కారం కావు. ఈ క్లాజ్‌ను తొలగించాలి. మిగులు జలాలను వినియోగించుకొనే అవకాశం దిగువ రాష్ట్రాలకు ఉండేలా గతంలో కృష్ణా నదీజలాలపై ఏర్పాటైన రెండు ట్రిబ్యునళ్లు తీర్పులిచ్చారుు. రాష్ట్రంలో ఈ మిగులు జలాల ఆధారంగా అనేక ప్రాజెక్టులను చేపట్టారు.
క్లాజ్ నెం 90: పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయు ప్రాజెక్టుగా ప్రకటించబడుతుంది. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలను సంప్రదించి కేంద్రం ఈ ప్రాజెక్టు పనులను నిర్వహిస్తుంది.
క్లాజ్ నెం 92: బొగ్గు, చవుురు, సహజవాయుువు, విద్యుదుత్పత్తి, పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వూర్గదర్శకాలను అనుసరించి కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు అవులు చేయూలి. ఈ క్లాజ్ కూడా అసవుంజసంగా ఉంది. తొలగించాలి. ఉవ్ముడి రాష్ట్ర వనరులతో అభివృద్ధి చేసిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆస్తులను ప్రస్తుత వూర్కెట్ విలువ ప్రకారం నిర్ణరుుంచి పంచాలి. కానీ దురదృష్టవశాత్తు బిల్లులోని 92 క్లాజ్ ఇందుకు విరుద్ధంగా ఉంది. ఉవ్ముడి జలాలను వినియోగించి ఉత్పత్తి చేసే జలవిద్యుత్తును ఎలా కేటారుుస్తారో బిల్లులో పేర్కొనలేదు.
క్లాజ్‌నెం 93: ఈ క్లాజ్ కూడా న్యాయుసవ్ముతంగా లేదు. విభజన అనంతరం విడిపోయే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అభివృద్ధి, వలిక సదుపాయూల కల్పనకు నిర్ణీత గడువు విధించలేదు. ఆ రాష్ట్ర అభివృద్ధి, వివిధ సంస్థల, కేంద్ర ప్రభుత్వ రంగ విభాగాల ఏర్పాటుపై కూడా స్పష్టత లేదు. ‘సాధ్యాసాధ్యాలను అనుసరించి పరిశీలిస్తాం’ అని పేర్కొనడం కూడా సరిగా లేదు. ఆర్థికాంశాలకు సంబంధించిన ఫైనాన్సియుల్ మెమొరాండాన్నీ బిల్లులో పొందుపర్చలేదు. ఎలాంటి స్పష్టత లేని ఈ క్లాజ్‌ను కూడా తొలగించాలి.