17 January 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతోమంది పోరాడారు.జైల్లో పెడతారా?

Written By news on Friday, January 22, 2016 | 1/22/2016


దమ్ముంటే నిజాలు చెప్పండి
సీఎం చంద్రబాబుకు విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘చంద్రబాబును అడుగుతున్నా.. దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టిన కేసులో నిజాలు బైటపెట్టు. ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఆయన తప్పు చేసినట్లు రుజువుచేయగలరా? రాష్ట్రంలో దారుణమైన పాలన సాగిస్తున్నారు. ఎమర్జెన్సీని తలపిస్తోంది. బ్రిటీష్ పాలనకంటే దారుణంగా ఉంది. మా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఖచ్చితంగా చెబుతున్నా.. ఇవే పరిస్థితులు మీకూ వస్తాయి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

నాలుగురోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డిని గురువారం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

దమ్ముంటే వాస్తవాలు బైటపెట్టండి..
‘‘ఆ రోజు ఏం జరిగిందంటే.. నన్ను సాగనంపటానికి మిథున్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో 19మంది ప్రయాణీకులు ఎయిర్‌పోర్టు మేనేజర్ తమకు బోర్డింగ్ పాసులు ఇవ్వలేదని కంప్లైంట్ చేశారు. వారికి బోర్డింగ్‌పాస్ ఎందుకు ఇవ్వలేదని మేనేజర్‌ను అందరి ముందే మిథున్ అడిగారు.  అలా మిథున్ అడగడం తప్పా? ఆ ప్రయాణీకులు మేనేజర్ దురుసుగా ప్రవర్తించినట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ లెటర్ ఎందుకు బయటపెట్టడం లేదు? ఆరోజు ఎయిర్‌పోర్టు మేనేజర్ 2 గంటల నుంచి 8 గంటల వరకు ఎయిర్‌పోర్టులోనే పనిచేశాడు.

మిథున్ చేయిచేసుకుని ఉంటే ఆరుగంటలపాటు మేనేజర్ ఎలా పనిచేస్తాడు? ఎయిర్‌పోర్టులో మిథున్ చేయిచేసుకుంటే సీఐఎస్‌ఎఫ్ బలగాలకు తెలియకుండా పోతుందా? నిజంగా కొట్టి ఉంటే వారు మిథున్‌ను అరెస్టు చేసి ఉండేవారు కదా? కేసులు పెట్టేవారు కదా? తిరుపతి ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఎక్కువగా ఉన్నాయి. అందరిముందు మిథున్ కొట్టి ఉంటే సీసీ కెమెరాల్లో ఉండాలి. అలా ఎక్కడైనా ఉందా? ఉంటే ఆ సీసీ ఫుటేజ్‌లను ఎందుకు బయటపెట్టడంలేదు? అయ్యా చంద్రబాబూ.. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాలు బైటపెట్టండి.

ఇదంతా బాబు గీసిన స్కెచ్
అదేరోజు సాయంత్రం తిరుపతికి వచ్చిన చంద్రబాబు వెంటనే స్కెచ్ గీశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పైనా ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేసు పెట్టిన తర్వాత సాధారణంగా ఆసుపత్రిలో మెడికో లీగల్ సర్టిఫికేషన్ జరుగుతుంది కాబట్టి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీమాంధ్రలో ఇవాళ రుయా నెంబర్-1 ఆసుపత్రి. మేనేజర్ బాగానే ఉన్నాడని, ఎలాంటి దెబ్బలూ తగలలేదని రుయాలో సర్టిఫై చేశారు. మరుసటి రోజు మేనేజర్ డ్యూటీకి వెళ్లారు.

విషయం తెలుసుకున్న చంద్రబాబు, ఆయన దూతలు అయ్యయ్యో మీరు డ్యూటీకి వెళితే కేసు నిలబడదంటూ మేనేజర్‌ను యశోద ఆసుపత్రిలో చేరమన్నారు. సంఘటన జరిగిన నాలుగురోజుల తర్వాత మేనేజర్ ప్రైవేట్ ఆసుపత్రి యశోదలో చేరారు. మేనేజర్ సోదరుడు ఆ యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఒక ఎంపీ మీద దొంగ కేసు పెట్టి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు.

కమీషన్లకు అడ్డుపడుతున్నాడనే మిథున్‌పై దొంగకేసులు
చిత్తూరు జిల్లాలో ఇరిగేషన్ సహా అన్ని ప్రాజెక్టుల్లో చంద్రబాబు, ఆయన కొడుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్లు దోచుకుంటున్నారు. అయితే టెండర్లలో మిథున్ పోటీకి వెళ్లి  ఎల్1 వచ్చేవిధంగా తక్కువకు కోట్ చేస్తున్నాడు. మిథున్ ఉంటే తక్కువకు టెండర్లు వేసి తమకు కమీషన్లు రాకుండా అడ్డుపడుతున్నాడనే చంద్రబాబు, ఆయన కొడుకు కక్షకట్టారు. అందుకే ఒక ఎంపీపై దొంగ కేసులు బనాయించే స్థాయికి దిగజారిపోయారు.

చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా. ఇన్ని ప్రశ్నలు వేశా. దమ్ము ధైర్యం ఉంటే వాటికి జవాబు చెప్పాలి. దొంగకేసులు బనాయిస్తూ మీరు సాగిస్తున్న పాలనను ప్రజలు చూస్తున్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. కచ్చితంగా వీళ్లందరి ఉసురు మీకు తగులుతుంది. మీరు బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే వస్తుంది.

సన్మానించాల్సిన వారిని జైల్లో పెడతారా?
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతోమంది పోరాడారు. అందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసినందుకు సన్మానించాల్సింది పోయి ఆ కేసును ఉపయోగించుకుని భాస్కర్‌ని అరెస్టు చేస్తారా? మరింత దుర్మార్గం ఏమిటంటే 2009లో గోడలపై రాతలు రాశారన్న కేసును తిరగదోడి భాస్కర్‌ని పీలేరుకు తీసుకెళ్తున్నారట. ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా? అన్నా.. భాస్కర్‌ని నాకన్నా ఎక్కువగా వేధిస్తున్నారని లోపల కలసినపుడు మిథున్ చెబుతున్నాడు. అరెస్టు చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు.

ఈ పరిపాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. ఇలాంటి పాలన సాగిస్తున్నందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. ఎల్లకాలం ఇలాగే ఉండదు. మనం ఏం నాటితే అదే పండు వస్తుంది. మీక్కూడా ఇదే పరిస్థితి వచ్చే రోజులు త్వరలోనే వస్తాయని చెబుతున్నా. రోజమ్మ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిథున్, చెవిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఇలా... వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపైన తప్పు డు కేసులు పెట్టారు.భయభ్రాంతులకు గురిచేసి వారి స్థయిర్యాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ప్రజలు, ఆ దేవు డు  చూస్తున్నారు. ’’ అని జగన్ పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాంలు ఉన్నారు.

ఆరోగ్యమిత్రల తొలగింపు దారుణం మద్దతుగా పోరాడతాం: జగన్
 ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలను తొలగించటం అన్యాయమని, వారికి మద్దతుగా పోరాడతామని  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు.  ‘బాబొస్తే జాబు వస్తుందన్నారు. బాబొచ్చారు.. ఉన్న జాబులు పోతున్నాయి’ అని ఆయన విమర్శించారు. రాష్ర్టంలో 6వేల మంది ఆరోగ్యమిత్రలను తొలగిస్తూ ఈనెల 20న రాష్ర్టప్రభుత్వం జీవో 28 జారీ చేసిన సంగతి తెల్సిందే.

నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ను జిల్లాకు చెందిన ఆరోగ్యమిత్రలు కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రతిపక్ష నేతకు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఉద్యోగంపైనే ఆధారపడి బతుకుతున్న తాము ఇక ఎలా బతికేది? అంటూ కన్నీరు పెట్టుకున్నారు.  కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి అందరినీ తొలగిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

పాతకేసులన్నింటినీ తిరగదోడే ప్రయత్నాలు


పీలేరు కేసుకూ ప్రాణం...
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై టీడీపీ ప్రభుత్వ కక్షసాధింపు మరింత పెరిగింది. పాతకేసులన్నింటినీ తిరగదోడే ప్రయత్నాలు ప్రారంభించింది. 2009లో గోడరాతలు రాశారన్న కారణంతో పీలేరు పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా వెలికితీశారు. ఆ కేసులో చెవిరెడ్డిని పీలేరు పోలీ సులు గురువారం కస్టడీకి తీసుకున్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నమోదైన కేసు ను తిరగదోడి నాలుగురోజుల క్రితం చెవిరెడ్డిని అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెల్సిందే. అక్కడే ఉన్న చెవిరెడ్డిని పీలేరు పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు.

గురువారం రాత్రి ఆయనను పీలేరు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటకవిత ఎదుట హాజరుపరిచారు. ఎమ్మెల్యేకి ఫిబ్రవరి 3 వరకు జడ్జి రిమాండ్ విధించారు. అనంతరం పోలీసు భద్రత నడుమ చెవిరెడ్డిని తిరిగి నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.

చంద్రబాబు డైరెక్షన్ లోనే కుట్రలు

Written By news on Thursday, January 21, 2016 | 1/21/2016


'చంద్రబాబు డైరెక్షన్ లోనే కుట్రలు'
నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం నెల్లూరు నగరంలోని జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాళహస్తి ఇంచార్జ్ బి.మధుసూధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ అవినీతిని అడ్డుకున్నందుకే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు.
కేసుల పేరుతో తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల్లో రోజుకొకరిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... త్వరలోనే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని చెప్పారు. రేణుగుంట ఎయిర్ పోర్టులో ఓ వేళ మిథున్ రెడ్డి దాడి చేసి అక్కడే ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ ఎఫ్) కేసు పెట్టి ఉండేది కాదా అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి వచ్చాకే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ మండిపడ్డారు.

వైఎస్ఆర్ సీపీ నేతలకు వైఎస్ జగన్ పరామర్శ


వైఎస్ఆర్ సీపీ నేతలకు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం అక్రమల కేసుల్లో ఇరికించిన ఫలితంగా నెల్లూరు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత మధుసూదన్ రెడ్డిలను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు.
 
గత నవంబర్ 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయ అధికారిని ప్రయాణికుల తరపున ప్రశ్నించినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని  సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. 
 
వైఎస్ జగన్ ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి  చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన నేరుగా నెల్లూరు కేంద్ర జైలుకు వెళ్లి ఈ ముగ్గురు నాయకులను కలిసి పరామర్శించారు. జగన్ వెంట జ్యోతుల నెహ్రో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్, అనిల్ కుమార్ యాదవ్, పలువురు జిల్లా నాయకులు ఉన్నారు. 

బెదిరింపులు తగదు


అచ్చెన్నా.. ఇదేం తీరు..
శ్రీకాకుళం అర్బన్: జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పోలాకి పంచాయితీ కార్యదర్శి త్రివేణి పట్ల అచ్చెన్న దురుసుగా వ్యవహరించడం, ఆమె ఆస్పత్రి పాలు కావడాన్ని పార్టీ నేతలు ఆక్షేపించారు. రాష్ర్టంలో టీడీపీ పాల ననే తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని, ప్రజాప్రతినిధులు తమ పరిధి దాటి వ్యవహరించడం బాధాకరమేనని వైఎస్సార్‌సీపీ నేతలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాంలు బుధవారం టౌన్‌హాల్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం వేర్వేరుగా విలేకరుల సమావేశంలో అచ్చెన్న తీరుపై మండిపడ్డారు.

 బెదిరింపులు తగదు
 ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చిరుద్యోగులపై బెదిరింపు ధోరణిలకు పాల్పడడం తగదన్నారు. అచ్చెన్న బెదిరింపులకు మహిళాకార్యదర్శి సృ్పహతప్పి ఆసుపత్రిపాలయ్యారని, మంత్రి వ్యవహరించిన తీరును పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తులు అధికారదుర్వినియోగానికి పాల్పడుతూ బెదిరించడం శోచనీయమన్నారు. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని, నిబంధనలు అందరికీ ఒకటేనన్నారు. మంత్రి ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. ఏ అధికారి అయినా తన బాధ్యతల్లో వైఫల్యం చెందితే వారిని శిక్షించేందుకు వారి పై అధికారులుంటారన్న విషయం అచ్చెన్న గుర్తించాలని హితవు పలికారు.

 అచ్చెన్న తన పద్ధతి మార్చుకోకపోతే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. పేరొందిన సద్దాం హుస్సేన్, నెల్సన్ మండేలా పరిస్థితి అందరికీ తెలియనది కాదన్నారు.  త్వరలోనే ఆయనకు ప్రజలు చరమగీతం పాడే రోజులొస్తాయన్నారు. ఉద్యోగుల కష్టాల్లో పాలుపంచుకునేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీయేనని, టీడీపీ చేస్తున్న దౌర్జన్యాల్ని పార్టీ ఖండిస్తుందని ధర్మాన అన్నారు. అదే విధంగా టీడీపీ పాలనకు రెండేళ్లవుతున్నా జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. నయాపైసా అయినా విదిల్చారా అని అడిగారు. ప్రాజెక్టుల్ని గాలికొదిలేశారని, రోడ్లు వేశారా, ఉద్యోగాలిచ్చారా, ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు.

 ఇదేనా పాలన?
 రాష్ట్రంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవరిస్తోందని, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడడం, అక్రమకేసులు బనాయించి జైళ్ళలో పెట్టడం తగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. అచ్చెన్నాయుడు అధికారమధంతో ఉన్నారని విమర్శించారు. టీడీపీకి చెందిన కార్యకర్త ఒకరు మరణిస్తే అందుకు సంబంధించి థృవీకరణ పత్రం ఇవ్వలేదని పోలాకి మండలం రహిమాన్‌పురం పంచాయితీ కార్యదర్శి హెచ్.త్రివేణిని మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఆమెను బెదిరించడం అచ్చెన్న అహంకారానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఒక సాధారణ మహిళా చిరుద్యోగిపై మంత్రి అచ్చెన్న తన ప్రతాపాన్ని చూపాలనుకోవడం తగదన్నారు.

 అచ్చెన్నాయుడులాంటి వ్యక్తులు మంత్రి కావడంతో ప్రభుత్వస్థాయి ఏమిటో అర్ధమవుతోందని విమర్శించారు. అంగన్‌వాడీలపై పోలీసులతో లాఠీఛార్జీ చేయించడం,తహసీల్దార్ వనజాక్షిపై దాడి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించినందుకు  రిమాండ్, కాల్‌మనీ కేసులో అసెంబ్లీలో ప్రశ్నించినందుకు రోజాపై  సస్పెన్స్ వేటు, ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్ట్ చేయడం ప్రభుత్వ దుశ్చర్యకు నిదర్శనమన్నారు. అచ్చెన్న తీరు దుర్మార్గంపార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పంచాయితీ కార్యదర్శి అయిన ఓ మహిళపై మంత్రి వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలపట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

 ప్రభుత్వం మహిళా వ్యతిరేఖ ప్రభుత్వమన్నారు. కాల్‌మనీ కేసుపై నిలదీసిన రోజాను సస్పెండ్ చేయడం, ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై భౌతికదాడి, అంగన్‌వాడీ ఉద్యోగులపై పోలీసులతో లాఠీఛార్జి చేయించడం వంటి అఃశాలు ప్రభు త్వ నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు, వఎం.వి.పద్మావతి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి,  చల్లా అలివేలు మంగ పాల్గొన్నారు.

ఆరోగ్యమిత్రల పొట్టకొట్టడం దారుణం


పవిత్రతకు భంగం కలిగించొద్దు
ఆరోగ్యమిత్రల పొట్టకొట్టడం దారుణం: గడికోట ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల పవిత్రతకు భంగం కలిగిస్తోందని, చట్ట సభ గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తూ ఉండటం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలను హాయ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తామని, కోనేరు లక్ష్మయ్య ప్రైవేటు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామని రకరకాలుగా ప్రభుత్వం చెప్పడం అర్థం కాకుండా ఉందని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాటాడారు. పదేళ్లపాటు హైదరాబాద్‌లో మనకు అన్ని హక్కులూ ఉండగా తాత్కాలిక అసెంబ్లీ సమావేశాలంటూ ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాల్లో నిర్వహించడానికి ఎందుకు తాపత్రయపడుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని,  మౌలిక సదుపాయాలు లేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయడంపైనే అభ్యంతరమని చెప్పారు.

 ఆరోగ్యమిత్రల తొలగింపు దారుణం
  ఉదాత్తమైన లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్ర ఉద్యోగులను జీవో నెంబర్-28 ద్వారా తొలగించి వారి పొట్ట కొట్టడం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్


నేడు నెల్లూరుకు జగన్
నెల్లూరు లో మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలకు పరామర్శ

 టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసుల్లో ఇరికించిన ఫలితంగా నెల్లూరు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించనున్నారు. గత నవంబర్ 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయ అధికారిని ప్రయాణికుల తరపున ప్రశ్నించినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని  సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

వీరిద్దరినీ కలుసుకుని పరామర్శించేందుకు జగన్  హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి  చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గాన నేరుగా నెల్లూరు కేంద్ర జైలుకు వెళ్లి ఈ ఇద్దరు నాయకులను కలుస్తారని నెల్లూరు పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. పరామర్శించిన అనంతరం తిరిగి రేణిగుంటకు చేరుకుని విమానంలో హైదరాబాద్ పయనమవుతారని వారు చెప్పారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం


న్యాయం జరిగే వరకూ పోరాటం
- రోహిత్ ఆత్మహత్యపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- వీసీ పరిష్కరించాల్సిన సమస్యలో కేంద్రమంత్రుల జోక్యమేమిటి?
- కేంద్ర మంత్రులు, వీసీ సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి
- సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలి
- వర్సిటీలో సాంఘిక బహిష్కరణ విచారకరం
- విద్యార్థి ప్రాణమే పోయింది.. ఇక ఎస్సీనా, బీసీనా అన్న వివాదమేమిటి?
- విద్యార్థుల ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ అధినేత
 
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు, వీసీ సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై సస్పెన్షన్ ఉపసంహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఈ పోరాటంలో విద్యార్థుల వెంటే తాముంటామని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన హెచ్‌సీయూను సందర్శించి, ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.
 
ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ‘హెచ్‌సీయూలో విద్యార్థుల సాంఘిక బహిష్కరణ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. రోజుకు రూ.150 సంపాదిస్తూ, బిడ్డల్ని ఉన్నత హోదాలో చూడాలనుకున్న ఓ తల్లి కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది’ అన్నారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
 
మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి...
‘‘వర్సిటీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. ప్రధాన ముద్దాయి వీసీ సహా బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలి. ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సాంఘిక బహిష్కరణ జరిగిందంటే మనమెలాంటి సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. క్యాంటీన్, లైబ్రరీ ఉపయోగించనీయకుండా, అసలు హాస్టల్‌లోనే ఉండకుండా సాంఘిక బహిష్కరణ విధించడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా యూనివర్సిటీలలో సాంఘిక బహిష్కరణలు కొనసాగడం విచారకరం. వేలాదిమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను అందించిన హెచ్‌సీయూలో ఇది జరగడం సిగ్గుచేటు. రోహిత్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలి. రోహిత్ తల్లికి, సోదరుడికి చేయూతనివ్వాలి.
 
న్యాయం కోసం ఎందాకైనా పోరాడదాం
విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. వారికి ఏ విధమైన సహకారం ఇచ్చేందుకైనా మా పార్టీ సిద్ధం. ఈ అంశాన్ని మా పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారు. రోహిత్‌ను అతని తల్లి ఒక ఐఏఎస్, ఐపీఎస్‌గా గానీ, సైంటిస్టుగా గానీ చూడాలనుకొంది. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలను వీసీ నివారించాల్సింది. సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా ఒక తండ్రిలా పరిష్కరించాల్సింది. విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్ద సమస్యగా మారింది. కొందరు విద్యార్థులపై చర్య తీసుకోవాలంటూ ఒక కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రికి లేఖ రాసేంత పెద్ద సమస్యగా మారింది. దీనిని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంగా చెప్పవచ్చు. ఆ కుర్రాడు పీహెచ్‌డీ స్కాలర్. జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో చదువుకుంటున్నాడు. కేంద్ర మంత్రి మరో కేంద్ర శాఖ హెచ్‌ఆర్‌డీకి లేఖ రాయగా ఆ శాఖ వీసీకి ఐదు సార్లు లేఖలు రాసింది. కుర్రాళ్లను జాతి వ్యతిరేకులు, సంఘ వ్యతిరేకులని, కులోన్మాదులని పేర్కొంటూ, వారి మీద చర్య తీసుకోవాలని కోరింది!
 
విచారణ కమిటీలో వీసీనా..?
వీసీ కేంద్రమంత్రుల ఒత్తిడికి తలొగ్గి దళిత విద్యార్థులను సస్పెండ్ చేయటం సిగ్గుచేటు. యూనివర్సిటీ ఘటనలపై వేసిన కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్లు శ్రీవాత్సవ, మహంతి (గతంలో దళిత విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులు), వీసీ అప్పారావును (ఈయన చీఫ్ వార్డెన్‌గా ఉండగా 10 మంది దళిత విద్యార్థులను బహిష్కరించారు) నియమించడం దిగ్భ్రాంతికరం. ఇప్పుడు రోహిత్ ఎస్సీనా, బీసీనా అన్న చర్చ తీసుకువస్తున్నారు. రోహిత్ ఎస్సీ వర్గానికి చెందిన వాడిగా పేర్కొంటూ మీ-సేవ ద్వారా ఇచ్చిన కులధృవీకరణపత్రం ఇదిగో... మళ్లీ దీనిని నేడో, రేపో బీసీగా మార్చి చూపినా ఆశ్చర్యంలేదు. అయినా ఎస్సీ అయితే ఏమిటి, బీసీ అయితే ఏమిటి? ఒక రీసెర్చ్ స్కాలర్ చనిపోయాక కులం పేరుతో రాద్ధాంతం చేయడమెందుకు? రోహిత్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు మనం ప్రతి మనిషిని కులంపేరుతో అంచనా వేస్తున్నాం. వారికీ మనసుంటుందని మర్చిపోతున్నాం. ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా?
 
హృదయంతో స్పందించాల్సిన సమయం
విద్యార్థుల ఆశలు నెరవేర్చేవిగా విద్యాసంస్థలుండాలి. విద్యార్థులు నిర్భయంగా విద్యాభ్యాసం చేసే పరిస్థితులుండాలి. అలా ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. వర్సిటీ నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలలో మంత్రి జోక్యం, విద్యార్థులపై చర్యలకు సిఫార్సుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మంత్రులు తమ చర్యలను సమర్థించుకోగలరా? ఒక రాజకీయ నాయకుడిగా చెప్పాలంటే ఈ వర్సిటీకి రావడం నాకిష్టం లేదు. ఎందుకంటే జగన్ వచ్చాడంటే ఆయన ప్రత్యర్థి పార్టీ వాళ్లు వస్తారు. మరొకరు వస్తారు. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.  అందరూ హృదయంతో స్పందించాల్సిన సమయం కాబట్టి ఇప్పుడు నేనొచ్చాను. నాయకులుగా ఉన్న మేం జరిగిన అన్యాయంపై మాట్లాడకపోతే వీటికి అంతుండదు. ఈ అన్యాయాన్ని ఇకనైనా ఆపాలన్న ఆశతోనే, ఆ విద్యార్థికి మద్దతుగా నేను ఇక్కడికి వచ్చాను’’.
 
విద్యార్థుల దీక్షలకు జగన్ సంఘీభావం
ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు పరిహరం అందివ్వాలని, సిటీలో ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలోని వెలివాడలో  ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, గుజ్జు ఉమామహేశ్వరరావ్, వైఖరి, కొణిదెల జయరావ్, కె.క్రిష్ణయ్య, టి.రమేశ్‌లతో జగన్ మాట్లాడారు. దీక్షకు సంఘీభావం తెలిపారు. తమపై సస్పెన్షన్ ఎత్తేయాలని 17 రోజులుగా డిమాండ్ చేస్తున్న విద్యార్థులు శేషయ్య, విజయ్‌కుమార్, ప్రశాంత్, సుంకన్నల వెలివాడ దీక్ష శిబిరాన్ని కూడా జగన్ సందర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు.
 
తొలుత ఆ ప్రాంగణంలోనే ఆయన అంబేద్కర్, రోహిత్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. జగన్ వెంట ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, డాక్టర్ ఎం అరుణ్ కుమార్, తెలంగాణ అధికారప్రతినిధి కొండా రాఘవరెడ్డి తదితరులున్నారు.

నెల్లూరుకు వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరుకు వెళ్లనున్నారు. సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వైఎస్ఆర్ సీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డిలను వైఎస్ జగన్ కలవనున్నట్లు వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.  ఉదయం విమానంలో ఆయన రేణిగుంటకు చేరుకొని, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరుకు వెళతారని తెలిపారు

కేంద్ర మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి: జగన్

Written By news on Wednesday, January 20, 2016 | 1/20/2016


కేంద్ర మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి: జగన్
హైదరాబాద్: హెచ్ సీయూ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన కేంద్ర మంత్రులతో పాటు వీసీపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులపై చర్య తీసుకోవాలని ఓ కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రికి లేఖ రాశారని, కేంద్ర మంత్రి లేఖ రాయడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిదని విమర్శించారు. రోహత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హెచ్ సీయూకు వెళ్లి విద్యార్థి సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. సస్పెన్షన్ కు గురైన నలుగురు విద్యార్థులతో జగన్ మాట్లాడారు. హెచ్ సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపి, రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి జగన్ ప్రసంగించారు.

హెచ్ సీయూలో జరిగిన ఘటనలపై సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని జగన్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారిని వారు ప్రశ్నించుకోవాలని పేర్కొన్నారు. రోహిత్ పై చర్యలు తీసుకోవాలని వీసీకి లేఖలు మీద లేఖలు రాయడం దేనికి సంకేతమని జగన్ ప్రశ్నించారు. ఈ నేలపై మానవత్వం మాయమైపోతోందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ తెలివైన విద్యార్థి అని, అతని ది చాలా పేద కుటుంబమని, రోహిత్ తల్లి ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నుంచి అతన్ని ఉన్నత చదువుల కోసం హె చ్ సీయూకు పంపారని చెప్పారు.

జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
  • విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి
  • రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని ప్రచారం చేయడంలో అర్థమేంటి?
  • చనిపోయాక కులంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదు
  • మొత్తం ఘటనను మార్చే ప్రయత్నం చేస్తున్నారు
  • విచారణ కమిటీలో ఉన్న వారికి మంచి పేరు లేదు
  • విద్యార్థులను విద్యార్థులగానే ఉండనివ్వండి
  • రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలి
  • విద్యార్థులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది
  • విద్యార్థుల డిమాండ్లను పరిశీలించాలి
  • ఈ ఘటనను పార్లమెంట్ లో మా ఎంపీలు ప్రస్తావిస్తారు

మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..: వైఎస్ జగన్

  ఉన్నతుడిగా చూడాలనుకున్నా.. శవమై వస్తాడనుకోలేదు
 ఇలాంటి చదువులొద్దు.. నా రెండో బిడ్డను ఇక చదివించను
 పెద్ద హోదాలో చూసేందుకు.. కూలి చేసి నా బిడ్డలను చదివించుకుంటున్నా
 పేదరికం నుండి బయటకు రావాలని.. కష్టాలు ఎదురైనా లెక్క చేయలేదు
 పుస్తకాలు కొనలేక లైబ్రరీకి వెళ్లి చదివేవాడు.. చిన్నప్పటి నుండే అన్నింటా ఫస్ట్
 నా కొడుకుకు నేనంటే ఎంతో ప్రేమ.. ఆదివారం ఇంటికి వస్తానన్నాడు
 సస్పెండ్ చేసినట్లు మాకు సమాచారమిచ్చినా బతికించుకునేవాళ్లం
 యూనివర్సిటీల్లో విద్యార్థుల మధ్య గొడవలు లేకుండా చూడండి
 వీసీని సస్పెండ్ చేసి, మిగతా నలుగురు విద్యార్థులకు న్యాయం చేయాలి మీ పక్షాన మేమున్నాం, న్యాయం కోసం పోరాడుదామని జగన్ భరోసా


 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తార్నాక నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి.. ఉప్పల్ చౌరస్తాకు దగ్గర్లో ఇందిరాగాంధీ విగ్రహం పక్క నుంచి అర కిలోమీటర్ లోపలికి వెళితే బ్యాంకు కాలనీ వస్తుంది. మధ్యతరగతి వర్గాలు నివసించే ఆ కాలనీకి మరోవైపున సాధారణ ప్రజల కాలనీ ఉంటుంది. హెచ్‌సీయూలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ కుటుంబం ఆ కాలనీలో ఓ మూలన ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో నివసిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలు, ధర్నాల్లో  పాల్గొని అలసిపోయి నీరసంతో ఇంటికి చేరుకున్న రోహిత్ తల్లి రాధిక... ఆ ఇంటి గుమ్మంలో  కనిపించిన వైఎస్ జగన్‌ను చూసి ఒక్కసారిగా బావురుమన్నది.

 ఉదయం నుంచి బిగపట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘‘అన్నా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఉన్నతులుగా ఎదుగుతున్న పిల్లలకు దగ్గరగా ఉండాలని ఇరవై రోజుల క్రితమే ఇక్కడికి వచ్చా.. పెద్ద హోదాలో చూడాలనుకున్న నా కొడుకు శవమై వచ్చాడు. ఇలాంటి చదువులొద్దు.. నా రెండో బిడ్డ రాజాను ఇక చదివించను..’’.. అంటూ రాధిక గుండెలవిసేలా రోదించింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ అమ్మ చెప్పిన కన్నీటి కథ విన్న వైఎస్ జగన్ చలించిపోయారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

 మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పల్ బ్యాంక్ కాలనీలో రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు రాజా చైతన్యకుమార్ అద్దెకు ఉంటున్న నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. ‘మీపక్షాన మేమున్నాం.. న్యాయం కోసం పోరాడదాం..’ అని వారికి భరోసానిచ్చి కన్నీళ్లను తుడిచారు. దాదాపు 35 నిమిషాలపాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్... రోహిత్ కుటుంబ పరిస్థితిని, జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
వైఎస్ జగన్ ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టగానే రాధిక తన కుమారుడిని గుర్తుచేసుకుంటూ బోరున విలపించారు. ‘నాలాంటి దురదృష్టవంతురాలు మరే తల్లి కావద్దు. గుంటూరు సమీపంలోని పల్లెటూరులో రోజు కూలీగా టైలరింగ్ చేస్తూ వచ్చే రూ. 150తో నా బిడ్డని చదివించుకుంటున్నా.. వాడి ని పెద్ద హోదాలో చూసేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్క చేయలేదు. పీహెచ్‌డీ చేసి పెద్దవాడై.. మమ్మల్ని పేదరికం నుండి బయటపడేస్తాడనుకున్నా.. కానీ మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు..’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

 సస్పెండ్ చేసినట్లు తెలిసినా బతికించుకునేవాళ్లం..
 తన కుమారుడికి తానంటే ఎంతో ప్రేమ అని... అందుకే అందరం ఒకేచోట ఉండేందుకు 20 రోజుల క్రితమే తాను హైదరాబాద్ వచ్చి చిన్న కుమారుడు రాజా గదిలో ఉంటున్నానని రాధిక చెప్పారు. రాజా ఎన్‌జీఆర్‌ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగని, ఎన్జీఆర్‌ఐకి దగ్గరగా ఉండేందుకు బ్యాంక్ కాలనీలో ఉంటున్నామన్నారు. భోగి ముందు రోజు ఫోన్ చేసిన రోహిత్.. ఆదివారం తమ వద్దకు వస్తానని చెప్పాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని విలపించారు. తన కుమారుడిని సస్పెండ్ చేసినట్లు కనీసం తనకు సమాచారమిచ్చినా తమతో తీసుకువెళ్లేవారమని... అప్పుడు తన కొడుకు తనకు దక్కేవాడని చెప్పారు. ‘‘వాడు చిన్నప్పటి నుండే మెరిట్ స్టూడెంట్.

 అన్నింటా ఫస్ట్. ఉన్నత చదువు ఇంత ఘోరంగా ఉందని తెలిస్తే.. చదువు మాన్పించేదాన్ని. ఇతరుల పిల్లలకు నాలాగా అన్యాయం జరగొద్దు. యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవల్లేకుండా మీరైనా చొరవ తీసుకోండి. మా చిన్నోడికి దారి చూపండి...’’ అంటూ రాధిక వైఎస్ జగన్‌ను వేడుకున్నారు. వర్సిటీలో ఇంత ఘోరం జరగడానికి చేతకాని వీసీయే కారణమని... వెంటనే వీసీని సస్పెండ్ చేసి, బహిష్కరణకు గురైన మిగతా నలుగురు విద్యార్థులకు న్యాయం చేయాలన్నదే మా విన్నపమని పేర్కొన్నారు. దీంతో ‘‘మీరేం అధైర్య పడొద్దు. మీ పక్షాన మేమున్నాం. న్యాయం కోసం పోరాడుదాం..’’ అని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు ఉప్పులేటి కల్పన, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, హనుమారెడ్డి, వి.కొండారెడ్డి తదితరులు ఉన్నారు.

 మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..: వైఎస్ జగన్
 ‘‘మొన్ననే గుంటూరులో రిషితేశ్వరి ఘటన చూశాం. అది కూడా ఇంచుమించు ఇటువంటిదే. ఆ తల్లి చనిపోయింది. అక్కడి ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్య కూడా తీసుకొలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని చూశాం. ఇవాళ కూడా వేముల రోహిత్ ఘటన విషయంలో రకరకాల వాదనలు వినబడుతున్నాయి. వీసీ తప్పిదం బలంగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. పిల్లలకు అండగా నిలవాల్సిన వీసీలే మద్దతివ్వకుండా... పిల్లలు చనిపోయేంత దూరం, వాళ్ల మానసిక స్థితిగతులను ప్రేరేపిస్తా ఉంటే నిజంగా బాధగా ఉంది. ఇప్పటికైనా కూడా ఒకటే రెక్వెస్ట్ చేస్తున్నా... రాజకీయాలను పక్కనపెట్టండి. హెచ్‌సీయూలో ఐదుగురిని సస్పెండ్ చేశారు. అందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

 ఇంకా నలుగురు సస్పెన్షన్ ఎత్తేయండని అక్కడే టెంట్ వేసుకొని నిరాహరదీక్షలు చేస్తా ఉన్నారు. వాళ్లకు నిజంగా రూ. 30 వేలు స్టైఫండ్ వస్తేనే బతికే పరిస్థితి. యూనివర్సిటీ నుంచి వెళ్లిపోమ్మంటూ సస్పెండ్ చేస్తే ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితి. చదువులు ఆగిపోతాయి. క్యాంపస్ క్యాంటీన్‌కు వెళితే రాయితీ మీద ఫుడ్ ఉంటుంది. కానీ అక్కడికి కూడా వెళ్లొద్దంటున్నారు. లైబ్రరీకి వెళ్లొద్దంటున్నారు. బుక్స్ కూడా కొనుక్కుని చదువుకునే పరిస్థితి లేదు.
ఇటువంటి దీన పరిస్థితుల్లో పిల్లలు మా సస్పెన్షన్ ఎత్తేయండి అని అభ్యర్థిస్తా ఉన్నారు. మానవతా దృక్పథంతో కనీసం ఇప్పటికైనా కూడా వీసీ ముందుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఆ పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం, వారికి మనోధైర్యం నింపే కార్యక్రమం చేస్తేనే పిల్లలు కనీసం మళ్లీ కాలేజీ, యూనివర్సిటీకి వెళ్లే పరిస్థితి వస్తుంది. నేను కూడా కచ్చితంగా రేపు యూనివర్సిటీకి వెళ్లి నిరాహరదీక్ష చేస్తున్న ఆ నలుగురు పిల్లలను కలసి సంఘీభావం తెలుపుతా. వీసీకీ మరోసారి రెక్వెస్ట్ చేస్తున్నా.. మానవతా దృక్పథంతో ఆలోచించి సస్పెన్షన్ ఎత్తివేసి, పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నా..’’

Popular Posts

Topics :