21 June 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

షర్మిల పరామర్శ యాత్రను జయప్రదం చేయండి

Written By news on Saturday, June 27, 2015 | 6/27/2015

శుక్రవారం లోటస్ పాండ్ లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పొంగులేటి. చిత్రంలో నల్లా సూర్యప్రకాశ్, శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి గాదె నిరంజన్ రెడ్డి తదితరులు
రంగారెడ్డి జిల్లాలో 29న జిల్లెలగూడ మంద మల్లమ్మచౌరస్తా నుంచి యాత్ర ప్రారంభం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ప్రతి కార్యకర్తా నాలుగు రోజులూ షర్మిల వెంట నడవాలి
పరామర్శయాత్ర నియోజవర్గ ఇన్‌చార్జిలతో భేటీ

సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్న పరామర్శ యాత్రను జయపద్రం చేయాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

ప్రతి కార్యకర్తతోపాటు మండలం నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న నాయకులంతా ఈ నాలుగు రోజులు షర్మిల వెంట నడవాలన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి అధ్యక్షతన ‘పరామర్శ యాత్ర నియోజకవర్గ ఇన్‌చార్జి’లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల బెంగళూరు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి ఆమె జిల్లెలగూడ మంద మల్లమ్మ చౌరస్తా, కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి మహానేత వైఎస్సార్ ఆకస్మిక మృతి తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారన్నారు. ప్రతీ కుటుంబాన్నీ పరామర్శించి వారికి భరోసా కల్పిస్తారన్నారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ కార్యదర్శి ఎనుగు మహిపాల్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహిళా నేతలు అమృతసాగర్, సూరజ్ ఎజ్ధానీ, జి.ధనలక్ష్మి, ఎం.శ్యామల, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం. ప్రభుకుమార్, కార్మిక నేత నర్రా భిక్షపతి, మైనార్టీ నేతలు ముజ్‌తబ అహ్మద్, మసూం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, నగర యువజన, సేవాదళ్ విభాగాల అధ్యక్షులు ఎ.అవినాష్‌గౌడ్, బండారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :