27 December 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జనవరి 3 నుంచి మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Thursday, December 31, 2015 | 12/31/2015


హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల జనవరి 3వ తేదీ నుంచి మెదక్ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లో ఆపార్టీ నేతలు  శివకుమార్, నల్యా సూర్యప్రకాశ్,  భిక్షపతి విలేకర్లతో మాట్లాడుతూ... పరామర్శయాత్రలో భాగంగా జిల్లాలో మొత్తం 13 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారని తెలిపారు. మెదక్ జిల్లాలో మొత్తం మూడు రోజులపాటు షర్మిల పరామర్శ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు.
జనవరి 5వ తేదీతో మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ముగియనుందన్నారు. ఆ తర్వాత అంటే జనవరి 6వ తేదీన నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ జిల్లాలో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారని వివరించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాల్లో పరామర్శ యాత్ర పూర్తయిందని చెప్పారు.  గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ నగరంలో పరామర్శయాత్ర ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

కడప కలెక్టరేట్ లో అంబేద్కర్ విగ్రహం కూల్చడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు శివకుమార్, నల్యా సూర్యప్రకాశ్,  భిక్షపతి స్పందించారు. ఈ ఘటన దారుణమని వారు అభివర్ణించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ను అరెస్ట్ చేయాలని వారు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలగించిన విగ్రహం స్థానంలో మరో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. దళితుల్ని అణచివేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కుట్రకు పాల్పడ్డారని వారు విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ బహిరంగ లేఖ


ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా?
► ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ బహిరంగ లేఖ
► చంద్రబాబు చేసిన 15 వాగ్దానాలపై సూటి ప్రశ్నలు
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం బహిరంగ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 15 వాగ్దానాలపై జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే మూడోవిడత జన్మభూమి కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలని వైఎస్‌ఆర్‌సీపీ విజ్ఞప్తి చేసింది. రెండు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో మొత్తంగా 13 జిల్లాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు 33,27,506. ఇందులో 28,52,938 పెండింగులో ఉన్నాయని కోర్‌ డాష్‌బోర్డు డిసెంబర్‌ 31న స్పష్టం చేసింది. మూడో విడత జన్మభూమి అంటూ డ్రామా ఎందుకు మొదలుపెడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించాలని వైఎస్‌ఆర్‌సీపీ పేర్కొంది.

మూడో జన్మభూమి డ్రామా ఆడటానికి వచ్చే టీడీపీ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను, మంత్రుల్ని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ కింది 15 వాగ్దానాలూ ఎందుకు అమలు చేయలేదని ప్రజలు నిలదీయాల్సిందిగా వైఎస్‌ఆర్‌సీపీ విజ్ఞప్తి చేసింది.

బాబూ.. ఒక్క వాగ్దానాన్ని అయినా అమలు చేశారా?
1. మీ వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? కనీసం వడ్డీ అయినా మాఫీ అయిందా?
2. డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా?
3. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం, నిరుద్యోగులకు రూ. 2 వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?
4. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించారా?
5. బెల్టు షాపులు రద్దు అయ్యాయా?
6. పేదలందరికీ హైటెక్‌ ఇళ్లు అన్నారు.. ఎవరికైనా ఇచ్చారా?
7. గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తున్నారా?
8. ఇంటింటికీ రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇచ్చారా?
9. బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టారా?
10. కాపులను బీసీల్లో చేర్చుతామన్నారు.. చేర్చారా?
11. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు.. కొంచెమైనా ముందుకు కదిలిందా?
12. నేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ ఏమైంది?
13. భూమిలేని పేదవారికి రెండు ఎకరాల భూమి ఇచ్చారా?
14. లారీ, ట్యాక్సీ, ఆటో డ్రైవర్ల వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు ఇచ్చారా?
15. అవినీతి లేని పరిపాలన అందిస్తామన్నారు... అందిస్తున్నారా?

జన్మభూమిలో ప్రభుత్వాన్ని నిలదీయండి


జన్మభూమిలో ప్రభుత్వాన్ని నిలదీయండి
 ప్రజలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపు

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు దఫాలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన హామీల అమలు ఏమేరకు జరిగిందో మూడోవిడత జన్మభూమిలో గట్టిగా నిలదీయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జనవరి 2 నుంచి మూడోవిడత జన్మభూమి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రజలనుంచి కొన్ని లక్షల అభ్యర్థనలు జన్మభూమి సందర్భంగా ముందుకొస్తే ఒక్కటీ పరిష్కారం కాలేదని పత్రికల్లో వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సీఎం చంద్రబాబుకు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు.

రెండో జన్మభూమి సందర్భంగా వైఎస్సార్‌సీపీ వంద ప్రశ్నలు సంధించిందని, వాటిని మళ్లీ మీడియాద్వారా విడుదల చేస్తామని, వాటన్నిటినీ దగ్గరుంచుకుని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు దక్కాల్సిన అధికారాలన్నింటినీ జన్మభూమి కమిటీలకు అప్పగించి ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని వైవీ మండిపడ్డారు.

 జన్మభూమి కమిటీకే  పాలన ఇస్తే సరి..!
 రాష్ట్రస్థాయిలోనూ సీఎం, మంత్రివర్గం వీరంతా ఎందుకు? మొత్తం పరిపాలనను జన్మభూమి కమిటీకే ఇస్తే సరిపోతుందికదా... టీడీపీ కార్యాలయం నుంచే పరిపాలన చేసుకోవడానికి సులువుగా ఉంటుంది.. అని వైవీ ఎద్దేవా చేశారు. కేవలం టీడీపీకీ, పార్టీ కార్యకర్తలకు మేలు చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు ‘జన్మభూమి’కోసం విడుదల చేసిన రూ.13 కోట్లూ పచ్చచొక్కాల జేబుల్లోకి వెళతాయన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని వినియోగించే అధికారం ఎమ్మెల్యేలదని, అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నచోట్ల టీడీపీ ఇన్‌చార్జీలకు నిధులివ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయంటూ.. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఆయన చూపారు.

 అభివృద్ధి లేదు.. అన్నీ కుంభకోణాలే
 రాష్ట్రంలో అభివృద్ధి గురించి మీడియాలో ఊదరగొడుతూ పబ్లిసిటీ చేసుకోవడంతప్ప.. నిజానికి టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయట్లేదని, జరుగుతున్నదంతా కుంభకోణాల అభివృద్ధేనని వైవీ దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టు.. ఇలా ఏది తీసుకున్నా కుంభకోణమేనని, త్వరలో రానున్న విద్యుత్ ప్రాజెక్టుల్లోనూ అవినీతేనన్నారు. రాజధాని నిర్మాణంలో లక్షల కుంభకోణానికి నాంది పలికారన్నారు. రైతులనుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూమిని తీసుకుని సింగపూర్ సంస్థలకు ధారాదత్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు.

రాజధాని ముసుగులో రూ.లక్షల కోట్ల దోపిడీ

Written By news on Wednesday, December 30, 2015 | 12/30/2015


సింగపూర్‌తో ఒప్పందాలన్నీ బయటపెట్టండి
♦ వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్
♦ రాజధాని ముసుగులో రూ.లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతోనూ, ప్రైవేటు కంపెనీలతోనూ ఇప్పటివరకూ చేసుకున్న ఒప్పందాలన్నింటినీ తక్షణమే బయట పెట్టి చర్చించాలని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సింగపూర్ మంత్రి ఈశ్వరన్, అధికారులు చంద్రబాబుకు వ్యాపార భాగస్వాములేనని తాము చెప్పినవన్నీ ఇపుడు నిజాలవుతున్నాయన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై సింగపూర్ ప్రభుత్వం తరపున మంత్రి ఈశ్వరన్ సమక్షంలో సంతకాలు చేసిన టో యెంగ్ అనే అధికారి ఇపుడు అక్కడ తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

మాస్టర్‌ప్లాన్ తయారు చేసిన రెండు సింగపూర్ కంపెనీలు విలీనమై ఏర్పడిన కంపెనీకి టో యెంగ్ సీఈఓగా నియమితులయ్యారని తెలిపారు. దీన్ని బట్టి ప్రజల ధనాన్ని దోపిడీ చేయడానికి చంద్రబాబు, ఆయన వందిమాగధులు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందని విమర్శించారు. ఉన్నత స్థానంలో ఉన్న ఒక ప్రభుత్వాధికారి సంతకాలు చేశాక ఆ పదవి నుంచి తప్పుకుని అదే సింగపూర్‌లోని ప్రైవేటు సంస్థకు సీఈఓగా వస్తున్నారంటే ఇందులో ఎంత మాయాజాలం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థ తరపున  సంతకం చేసిన టో యెంగ్ తప్పుకున్న తరువాత ఇంకా ఆ ఒప్పందాలు అమలులో ఉన్నట్లా లేనట్లా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజధాని కోసమని ప్రజల దగ్గరి నుంచి తీసుకున్న భూములను ఇలా సింగపూర్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేసి టీడీపీ ప్రభుత్వం తన ధనదాహం తీర్చుకుంటున్న మాట వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎవరికీ పనులు ఇవ్వరాదని, అంతర్జాతీయ టెండర్లను మాత్రమే పిలిచి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం ఈ విధానంపై నియమించిన కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుందని వివరించారు. అలాంటపుడు ఇక్కడ(ఏపీలో) స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అందుకే తొలి నుంచీ ఇందులో జరిగిన ప్రతి ఒప్పందాన్ని బయట పెట్టాలని, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేయవద్దని బొత్స హెచ్చరించారు.

 లోకేష్ కోసమే అభీష్ట బలి
 రాజ్యాంగేతర శక్తిగా అవతరించిన చంద్రబాబు కొడుకు లోకేష్‌బాబు కోసమే సీఎంవోలో ఓఎస్డీగా పని చేస్తున్న అభీష్టను రాజీనామా చేయించారని బొత్స విమర్శించారు. అభీష్ట అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే అభియోగం మోపడం సరికాదని, లోకేష్, చంద్రబాబు చెబితేనే ఆయన జోక్యం చేసుకుని ఉంటారనే విషయం మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.

గెలుపే ధ్యేయం


గెలుపే ధ్యేయం
వైఎస్, జగన్ అభిమానులందరినీ ఏకతాటిపైకి తెస్తా
నిరుద్యోగ, రైతు సమస్యలపై ఉద్యమం
ప్రజా సమస్యలపైనా నిరంతర పోరాటం
గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి

సంగారెడ్డి జోన్:  రానున్న 2019లో గెలుపే ధ్యేయంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అభిమానులందరినీ పార్టీలకతీతంగా ఏకం చేసి ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు. జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతానికి, పటిష్టవంతానికి పాటు పడతానన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రజల తరఫున పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పారు. కాగా జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం మాత్రం కొద్దిమందికి మాత్రమే పరిహారం అందజేసి మిగతా వారికి మొండిచేయి చూపించిందని విమర్శించారు.

రైతులను ఆదుకోవడం కోసం జిల్లాలో వైఎస్‌ఆర్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైఎస్ షర్మిల త్వరలో జిల్లాలో రైతు పరామర్శ యాత్ర నిర్వహిస్తారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుగా నియామకమైన సందర్భంగా గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి సాక్షితో మాట్లాడారు.
 
సాక్షి: జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు?
శ్రీధర్‌రెడ్డి : 
పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదే శాల మేరకు పార్టీ పటిష్టానికి పాటు పడతా. జిల్లాలో పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ కమిటీల నియామకానికి గ్రామస్థాయి నుంచి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తా.

సాక్షి: ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల అమలుకోసం ఏం చేస్తారు?
శ్రీధర్‌రెడ్డి : 
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. అలాగే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో వున్నాయి. యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతా.
 
సాక్షి: రైతు సమస్యలపై మీ అభిప్రాయం?
శ్రీధర్‌రెడ్డి : 
 జిల్లాలో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు సైతం రాక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కొందరికి మాత్రమే పరిహారం అందింది. రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యమిస్తాం.

సాక్షి: రానున్న గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ బరిలో వుంటుందా?
శ్రీధర్‌రెడ్డి : 
 జిల్లాలో మూడు స్థానాలు గ్రేటర్ మున్సిపాలిటీలో వున్నాయి. పటాన్‌చెరు, భరత్‌నగర్, రామచంద్రాపురంలలో పార్టీ అభ్యర్థులను గ్రేటర్ ఎన్నికల బరిలో వుంటారు. పార్టీ బలోపేతం కోసం అన్ని వర్గాలతో, ప్రజలతో ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.

ఆ ఒప్పందాలను బయటపెట్టండి

Written By news on Tuesday, December 29, 2015 | 12/29/2015


'ఆ ఒప్పందాలను బయటపెట్టండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో రూ. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని వైఎస్ఆర్ సీపీ నాయకుడు బొత్స సత్యానారాయణ ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ దోపిడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, టీడీపీ దోపీడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో లొసుగులు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో ప్రజలంతా తెలుసుకోవాలని కోరారు. సామాన్యుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను సింగపూర్ లోని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు సర్కారుతో ఒప్పందాలు చేసుకున్న సింగపూర్ ప్రతినిధులు ఇప్పుడు రాజీనామా చేసి ప్రైవేటు కంపెనీలక సీఈవోలుగా వెళ్తున్నారని చెప్పారు. ధనదాహంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని చంద్రబాబుకు హితవు పలికారు.

నారా లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందేనని అన్నారు. చంద్రబాబు ఓఎస్డీ సీతేపల్లి అభీష్ట రాజీనామాతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రవర్తన మార్చుకోవాలని ముందు లోకేశ్ కు చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని, నిజాయితీ గల పోలీసు అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు


వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో పలువురికి చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జె.మహేందర్‌రెడ్డి(వరంగల్), మెదక్ జిల్లా అధ్యక్షుడిగా జి.శ్రీధర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా డి.సాంబయ్య, ప్రధానకార్యదర్శిగా వి.రాజ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా బండారు వెంకట రమణ(రంగారెడ్డి), విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యద ర్శిగా డి.రాహుల్‌గౌడ్(రంగారెడ్డి జిల్లా), కార్యదర్శిగా బత్తుల సంతోష్ కుమార్(వరంగల్)లను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియమించారు. ఆ మేరకు సోమవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

సొంతవాళ్లకు అంతులేని ప్రయోజనాలా?

Written By news on Monday, December 28, 2015 | 12/28/2015


సొంతవాళ్లకు అంతులేని ప్రయోజనాలా?
♦ ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలి
♦ చంద్రబాబు తన బినామీలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు
♦ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో సొంతవాళ్లకు అంతులేని ప్రయోజనాలను చేకూరుస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తాజాగా టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్‌కు ఇచ్చిన రూ.333 కోట్ల ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పారదర్శకత గురించి ఎక్కువగా చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తన బినామీలకు మేలు చేస్తున్నారని విమర్శించారు.

గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెబుతూ ఈ ప్రాజెక్టును సీఎం సొంత మనిషి వేమూరి హరికృష్ణకు చెందిన సోదర సంస్థ టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగించారని పేర్కొన్నారు. టీడీపీకి ఐటీ సలహాదారు అయిన హరికృష్ణ ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలోని మూడు సంస్థల్లో డెరైక్టర్‌గా ఉన్నారని, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌తో కూడా అనుబంధం ఉందని, అలాంటి వ్యక్తికి ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. టెరా సంస్థ చౌక దుకాణాలకు ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను తీసుకొని వైఫల్యం చెందడంతో బ్లాక్‌లిస్టులో ఉందని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. గతంలో ఈవీఎంలు దొంగిలించిన కేసులో మహారాష్ట్రలో హరికృష్ణ నిందితుడు అని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ధారించే కమిటీలో హరికృష్ణ ఒక సభ్యుడని పేర్కొన్నారు. ‘‘కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది వారే. దక్కించుకునేది వారే’’ అన్న పద్ధతిలో చంద్రబాబు పాలన సాగుతోందని దుయ్యబట్టారు.

 బినామీలకు అనుకూలంగా నిర్ణయాలు
 చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించే కమిటీలో సీఎం సొంత మనిషి, మధుకాన్ షుగర్స్ అధినేత నామా నాగేశ్వరరావు, విద్యా సంస్థలకు సంబంధించిన కమిటీల్లో మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావులే ఉంటారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. సహజంగానే వారిద్దరూ నారాయణ విద్యాసంస్థలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటారని అన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా ఆయా కమిటీల్లో నియమితులయ్యే మంత్రులంతా బినామీల ద్వారా వ్యాపారాలు చేసుకునే వారేనని, వీరు తీసుకునే నిర్ణయాలు బినామీలకు అనుకూలంగానే ఉంటాయని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం తమకు సంబంధం ఉన్న కేసుల ను విచారించడానికి నిరాకరిస్తారని, చంద్రబాబు ప్రభుత్వం అలాంటిది కూడా పాటించడం లేదన్నారు. సమాజం ఏమనుకుంటుందో, జనం ఏమనుకుంటారోనన్న బెరుకు లేకుండా చంద్రబాబు రాష్ట్రాన్ని తన మనుషులకు దోచి పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

మద్దతు పలికిన టీడీపీ శ్రేణులు, నేతలు

Written By news on Sunday, December 27, 2015 | 12/27/2015


చంద్రబాబును నమ్మి మోసపోయాంశనివారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్ జగన్ వద్ద వాపోయిన ప్రజలు
జమ్మలమడుగులో రాజన్న బిడ్డకు నీరాజనం
మద్దతు పలికిన టీడీపీ శ్రేణులు, నేతలు
ఆద్యంతం ఆసక్తిగా సాగిన పర్యటన

 
(జమ్మలమడుగు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లేసినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో ఆయన అసలు రూపం బయటపడింది. ఇప్పుడు జన్మభూమి కమిటీ పేరుతో పచ్చటి పల్లెల్లో చిచ్చు రేపుతున్నారు. పింఛన్ల పంపిణీ, రేషన్ సరుకులు ఇచ్చే విషయంలోనూ జన్మభూమి కమిటీ పెత్తనం పెరిగిపోయింది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి’ అని వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాజన్న హయాంలో సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందేవని గుర్తుచేసుకున్నారు. అందరి కష్టాలు తీరే రోజులు త్వరలోనే వస్తాయని ఆయన వారికి భరోసానిచ్చారు. శనివారం మధ్యాహ్నం జమ్మలమడుగు చేరుకున్న జగన్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రాయపల్లె మునిరెడ్డి కుమారుడు సురేందర్‌రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అక్కడే ఆయన్ను ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం వద్దిరాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రామాంజనేయ యాదవ్ కుమార్తె మహాలక్ష్మి దంపతులను ఆశీర్వదించారు.
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దన్నవాడ మహేశ్వరరెడ్డి తండ్రి అనారోగ్యంతో ఉన్నాడన్న విషయం తెలుసుకుని ఇంటికివెళ్లి పరామర్శించారు. అంతకుముందు దన్నవాడ సర్కిల్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికార పార్టీ నేతలు కూడా జగన్‌ను కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
 
అడుగడుగునా బ్రహ్మరథం...
జిల్లా పర్యటనలో భాగంగా శనివారం జమ్మలమడుగు నియోజకవర్గానికి వచ్చిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అభిమాన నేతకు స్వాగతం పలికేందుకు యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందకుపైగా వాహనాలు కాన్వాయ్‌గా కదిలాయి. అడుగడుగునా ఆడపడుచులు పూలవర్షంతో స్వాగతం పలికారు. కరచాలనంకోసం యువకులు, మహిళలు, వృద్ధులు, పార్టీ కార్యకర్తలు పోటీ పడ్డారు. దీంతో జమ్మలమడుగు నుంచి 20 కిలోమీటర్లు ఉన్న వద్దిరాలకు వెళ్లేందుకు సుమారు 5 గంటలు పట్టింది. పర్యటనలో జగన్ వెంట కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు  అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి


 కార్యకర్తల కుటుంబసభ్యులతో వైఎస్ జగన్
 బెంగళూరులో అనుమానాస్పదంగా మృతి
 చెందిన నలుగురి కుటుంబాలకు పరామర్శ

 
కడప: పోలీసుల చర్యలకు భయపడి బెంగళూరుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన నలుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. అధైర్య పడవద్దని పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. వైఎస్‌ఆర్ జిల్లా తొండూరు మండలం భద్రంపల్లె గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, లింగాల మండలం అంకేవానిపల్లెకు చెందిన వీరచంద్రారెడ్డిలు ఇటీవల బెంగళూరు సమీపంలోని కోళ్ల ఫారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ శనివారం ఉదయం భద్రంపల్లెలోని మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు అరుణ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరుణ్‌కుమార్‌రెడ్డి భార్య గంగాదేవి జగన్‌ను చూడగానే కన్నీటిపర్యంతమయ్యారు. అరుణ్‌కుమార్‌రెడ్డి పిల్లలు దుష్యంత్‌రెడ్డి, కృష్ణవేణిలను జగన్ దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. తామంతా అండగా ఉంటామన్నారు. అనంతరం సమీపంలోనే రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి పద్మావతి, కుమారుడు అనిల్, కుమార్తె అనితలను ఓదార్చారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని భార్య వెంకటలక్షుమ్మ, కుమారులు మునిరెడ్డి, పక్కీరారెడ్డిలను ఓదార్చారు.
అనంతరం లింగాల మండలం అంకేవానిపల్లెకు చెందిన వీరచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్య విజయమ్మ, కుమారుడు శివప్రకాష్‌రెడ్డి, కుమార్తె దీప్తిలను ఓదార్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. ఆందోళన చెందవద్దని ధ్యైర్యం చెప్పారు. ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా.. వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు ఉన్నారు.

జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు


జమ్మలమడుగు/ముద్దనూరు : వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం బోడితిప్పనిపాడు గ్రామానికి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి బంధువు రామలింగేశ్వరరెడ్డి శనివారం జమ్మలమడుగులో వైఎస్ జగన్‌ను కలిశారు. త్వరలో తాము టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి వస్తామని తెలిపారు. అంతకుముందు పులివెందుల నుంచి జమ్మలమడుగుకు వెళ్తున్న జగన్‌ను మార్గంమధ్యలో ముద్దనూరు మండలం యామవరం, నల్లబల్లె గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు బాలమునిస్వామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి కలిశారు. వైఎస్‌ఆర్‌సీపీ స్థానిక నేతలు వారిని జగన్‌కు పరిచయం చేయగా, ఆయన వారిని ఆప్యాయంగా పలకరించారు.

బాబు బినామీకి రూ.320 కోట్ల ప్రాజెక్టు



బాబు బినామీకి రూ.320 కోట్ల ప్రాజెక్టు
సులువుగా దక్కించుకున్న టీడీపీ ఐటీ అడ్వయిజర్

 సాక్షి, హైదరాబాద్: ఈవీఎంల దొంగతనం, ట్యాంపరింగ్ కేసులో నిందితుడతను.. తెలుగుదేశం పార్టీ ఐటీ వ్యవహారాల అడ్వయిజర్‌గా బాధ్యతలు చేపట్టాడు..పార్టీ సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డుల జారీ అతని చేతుల మీదుగానే జరిగాయి... ఆ తర్వాత చంద్రబాబు కుటుంబానికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో డెరైక్టర్‌గా ఎదిగాడు... చంద్రబాబు సీఎం అయిన తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేస్తున్నాడు.. మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో అతడిని సభ్యుడిగా చంద్రబాబు నియమించారు.

ఇపుడు ఏకంగా ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలిదశ పనుల టెండర్ కొట్టేశాడు.. హైలెవల్ కమిటీ ఖరారు చేసిన ఆ టెండర్ విలువ రూ. 320 కోట్లు.. చినబాబు ‘సన్నిహితుడు’ అయినందునే అనుమతులన్నీ ఆగమేఘాలపై వచ్చేశాయని వినిపిస్తోంది. బాబుగారి బినామీ గణంలో కనిపిస్తున్న ఈ కొత్త ముఖం.. పేరు వేమూరి హరికృష్ణప్రసాద్.. అతను డెరైక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్‌కి సోదరసంస్ధ అయిన టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కే ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ టెండర్ దక్కింది. విచిత్రమేమిటంటే.. ఈ టెండర్ మదింపు, పర్యవేక్షణ కమిటీల్లోనూ అతను సభ్యుడు..  నారా చంద్రబాబు నాయుడు పాలన ఎలా సాగుతోందో తెలుసుకునేందుకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక.

 ఈనాటి ఈ బంధం ‘ఈవీఎం’కేసు నాటిది..
 టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జట్టు కట్టి మహాకూటమిని ఏర్పాటు చేసినా 2009 ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనాన్ని ఆపలేకపోయారు. ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ఆ నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టారు. ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేమూరి హరికృష్ణ ప్రసాద్ రంగంలోకి దిగారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని నిరూపించేందుకు పూనుకున్నారు.

ముంబైలోని ‘కోట’లో గల గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను దొంగలించిన హరికృష్ణప్రసాద్, వాటిని ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్‌లో ప్రదర్శించారు. ఈవీఎంలు దొంగిలించినందుకు గాను ఏప్రిల్ 28, 2010న ముంబై పోలీసులు హరికృష్ణ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ చంద్రబాబు రాద్ధాంతం చేశారు. దాంతో చంద్రబాబు, హరికృష్ణ ప్రసాద్‌ల బంధం బైటపడింది. ఆ తర్వాత  హరికృష్ణ ప్రసాద్‌కు టీడీపీ ఐటీ వ్యవహారాలను చంద్రబాబు అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల జారీలో ఆయన కీలక భూమిక పోషించారు. చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న హరికృష్ణ ప్రసాద్ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ సంస్థలో ఆగస్టు 10, 2012 నుంచి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.

 పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దపీట
 చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అటు పార్టీ.. ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఈ-గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీల్లో ఆయనను సభ్యునిగా నియమించారు. రాష్ట్రంలో చౌక దుకాణాల్లో ఈ-పాస్ పద్ధతిలో సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చౌక దుకాణాలకు ఈ-పాస్ యంత్రాల సరఫరా, ఏర్పాటు పనులకు జూలై 19, 2014న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వేమూరి హరికృష్ణ ప్రసాద్ డెరైక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ సోదర సంస్థ అయిన టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసి.. ఎల్-3గా నిలిచింది. ఎల్-1, ఎల్-2లను కాదని ఉన్నత స్థాయి ఒత్తిళ్ల మేరకు ఈ-పాస్ టెండర్లను టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్) కట్టబెట్టింది. కానీ.. యంత్రాలను సరఫరా చేయకపోవడంతో టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌ను ఏడాదిపాటూ బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ ఏపీటీఎస్ మే 11న ఉత్తర్వులు జారీ చేసింది.

 టెండర్ ఖరారు కమిటీలో స్థానం..
 రాష్ట్రంలో అన్ని గ్రామాలకూ ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ర్టప్రభుత్వం ైఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా అన్ని మండల కేంద్రాలకూ ఇంటర్ నెట్ సౌకర్యాన్ని కల్పించే పనులకు రూ.333 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ పనులకు టెండర్ విధి విధానాలను రూపొంది స్తూ ఆగస్టు 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండరు మదింపు, పర్యవేక్షణ కమిటీల్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు స్థానం కల్పించింది. ఆయన్ను ఏ ప్రాతిపదికన సభ్యునిగా నియమించారన్నది ఎవరికీ అర్ధంకాని విషయం.

టెండర్ మదింపు కమిటీ ఎవరిని ప్రతిపాదిస్తే.. వారికే పనులు కట్టబెట్టాలంటూ హైలెవల్ టెండర్ అప్రూవల్ కమిటీకి ఆదిలోనే ప్రభుత్వం మార్గనిర్దేశనం చేసింది. ఫైబర్ గ్రిడ్ తొలి దశ పనులను రూ.320.85 కోట్లకు కోట్ చేస్తూ టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసింది. టెండర్ మదింపు కమిటీ సూచన మేరకు.. (అంటే హరికృష్ణప్రసాద్ సభ్యుడిగా ఉ న్న కమిటీ సూచన మేరకు..) ఆ సంస్థకే ఫైబర్ గ్రిడ్ పనులను అప్పగించారు. నవంబర్ 2న హైలెవల్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌ను మే 11న ఏపీటీఎస్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టడాన్ని టెండర్ మదింపు కమిటీ ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. సీఎం బాబు ఒత్తిళ్ల మేరకే నిబంధనలను తోసిరాజని.. ఆ సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులు కట్టబెట్టినట్లు అధికారవర్గాలు అంటున్నాయి.

 ‘టెరా’ సంస్థలకు బాబుగారి సంస్థలకు మధ్య బంధం..
 టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థల్లో టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్‌తో పాటు సీతపల్లి గ్యాస్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, టెక్నాలజీ ట్రాన్సఫరెన్సీ ఫౌండేషన్, ప్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్యూచర్ స్పేస్ లిమిటెడ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్క టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ మినహా తక్కిన సంస్థలన్నింటీలోనూ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.

టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థలకూ చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ పుడ్స్, ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకూ అవినాభావ సంబంధం ఉంది. హెరిటేజ్ పుడ్స్, ఫిన్ లీజ్ సంస్థల్లో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న దేవినేని సీతారామయ్య టెరా సాఫ్ట్‌వేర్‌లో సెప్టెంబరు 30, 2014 వరకూ డెరైక్టర్‌గా పనిచేశారు. హెరిటేజ్ సంస్థల్లో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న కోలారు రాజేష్.. సీతపల్లి గ్యాస్ పవర్ లిమిటెడ్‌లో వేమూరి హరికృష్ణప్రసాద్‌తోపాటూ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. టెరా సంస్థలు.. హెరిటేజ్ సంస్థల ఆడిటింగ్ వ్యవహారాలను ఆర్‌ఎస్ బక్కన్నవార్ పర్యవేక్షిస్తున్నారు. టెరా అనుబంధం సంస్థలన్నీ చంద్రబాబు కుటుంబ బినామీ సంస్థలేనని వ్యాపారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను బినామీ సంస్థ అయిన టెరా సాఫ్ట్‌వేర్‌కు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచుకోవడానికి ‘ముఖ్య’నేత వ్యూహం రచించారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.

Popular Posts

Topics :