29 January 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబు అనైతికంగా వ్యవహరిస్తున్నారు

Written By news on Friday, February 3, 2017 | 2/03/2017


చంద్రబాబు అనైతికంగా వ్యవహరిస్తున్నారు
కడప: టీడీపీ అధికారమదంతో అనైతిక రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లో పలుచనైపోతున్నాడనని తెలిసి, ఆయన అనైతికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అసమర్థ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరల్లోనే ఉందని అన్నారు.

కడపలో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 14 రీళ్ల సినిమాలో 13 రీళ్లలో అన్యాయానిదే పైచేయిగా కనిపిస్తుందని, 14వ రీలు క్లైమాక్స్ లో న్యాయం గెలిచి కథ అడ్డం తిరుగుతుందని వైఎస్ జగన్ చెప్పారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు.వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. తన వ్యక్తిగత కార్యదర్శి రవి శేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వర్గీయులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
 రథ సప్తమి సందర్భంగా ప్రసిద్ద దేవుని కడప లక్ష్మి వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. రధంపై ఊరేగుతూన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. రథ సప్తమి రోజున స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో అక్కడి భక్తులు జగన్‌ను చూసేందుకు తరలి వచ్చారు.
 
అనంతరం బాలిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన సైదాపురం ఓబుల్‌ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశ్వీరించారు. అదే విధంగా స్ధానిక టీటీడీ కల్యాణమండపంలో జరిగిన అలవలపాడు వెంకటేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి కూడా వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు.

వైఎస్ఆర్ సీపీలో చేరిన డీఎల్ వర్గీయులు


వైఎస్ఆర్ సీపీలో చేరిన డీఎల్ వర్గీయులు
కడప: వైఎస్ఆర్ సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వర్గీయులు పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కాజీపేట జెడ్పీటీసీ లక్ష్మిదేవి, మరో ఆరుగురు ఎంపీటీసీలు పార్టీలోకి వచ్చారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు.

గతంలో వైఎస్ఆర్ సీపీని వీడిన ఆరుగురు కడప కార్పొరేటర్లు గురువారం మళ్లీ సొంతగూటికి చేరారు. ఇడుపులపాయలో వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీలో చేరారు.  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్ సురేష్‌ బాబు నేతృత్వంలో వారు మళ్లీ పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరిన కడప కార్పొరేటర్లు

Written By news on Thursday, February 2, 2017 | 2/02/2017


మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరిన కడప కార్పొరేటర్లు
కడప: గతంలో వైఎస్ఆర్ సీపీని వీడిన ఆరుగురు కడప కార్పొరేటర్లు మళ్లీ సొంతగూటికి చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. గురువారం వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరఫున గెలిచిన ఈ ఆరుగురు కార్పొరేటర్లు గతంలో టీడీపీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్ సురేష్‌ బాబు నేతృత్వంలో మళ్లీ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న జగన్ పలు కార్యక్రమాల్లో  పాల్గొంటారు.

'అనంత'లో టీడీపీ నేతల దాష్టీకం


'అనంత'లో టీడీపీ నేతల దాష్టీకం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో సామాన్య ప్రజలను, తమకు ఎదురొస్తే పార్టీలోని చిన్న నేతలపై, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపై సైతం దాడులకు వెనుకాడటం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. సమస్యలపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కూడేరు మండలం జల్లిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర మహిళపై దాడిచేస్తూ కాళ్లతో తన్ని హింసించారు. వీరంతా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరులని సమాచారం. సమస్యపై ప్రశ్నించినందుకే సుధ అనే మహిళను అందరూ చూస్తుండగానే దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపివేశారు. దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


నేటి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన


నేటి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన
► ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశం
► పలు పరామర్శలు.. వివాహాలకు హాజరు
► పైడిపాలెం ప్రాజెక్టు సందర్శన  

పులివెందుల : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో రావాల్సి ఉండగా.. స్వల్ప మార్పులు  చోటుచేసుకున్నట్లు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్‌  జగన్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డుమార్గాన నేరుగా ఇడుపులపాయ ఎస్టేట్‌కు  చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు ఇడుపులపాయకు చేరుకుని అక్కడ పార్టీకి చెందిన నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం 8.30గంటలకు పాల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో తొండూరు మండలం సైదాపురం గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు ఓబుళరెడ్డి కుమార్తె వివాహ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం 8.45గంటలకు స్థానిక టీటీడీ కల్యాణ మండపానికి చేరుకొని వేంపల్లె మండలం అలవలపాడు గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొంటారు.

అక్కడ నుంచి ఉదయం 10.15గంటలకు దేవునికడపకు చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు. 11.30గంటలకు కడపలోని జయరాజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. 4వ తేదీ ఉదయం 9.00గంటలకు తొండూరు మండలం కోరవానిపల్లె గ్రామానికి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గొర్రెల కాపరులు వెంకటసుబ్బయ్య, రామ్మోహన్, సుదర్శన్‌ల కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడ నుంచి పైడిపాలెం ప్రాజెక్టు వద్దకు చేరుకుని గండికోట నుంచి వచ్చే కృష్ణజలాలను పరిశీలిస్తారని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు.

రూ.లక్షల కోట్ల పెట్టుబడులన్నీ తుస్‌!

Written By news on Tuesday, January 31, 2017 | 1/31/2017


రూ.లక్షల కోట్ల పెట్టుబడులన్నీ తుస్‌!దొడ్డాల సుధీర్‌ నివాసం
ఎంవోయూలపై సంతకాలు చేయడానికి ముందుకు రాని పెద్ద కంపెనీలు  
చిన్నా చితక కంపెనీలు, వ్యక్తులను తీసుకురమ్మని పురమాయించిన సర్కారు
ఆ బాధ్యత ప్రైవేట్‌ సంస్థకు అప్పగింత
నర్సరావుపేటకు చెందిన దొడ్డాల సుధీర్‌ ఇలా∙వచ్చిన బాపతే..


సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఈ ఇల్లు చూశారా.. ఈ ఇంటికి, విశాఖ భాగస్వామ్య సదస్సులో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో ఎంవోయూ కూదుర్చుకున్న వ్యక్తికి లింక్‌ పెట్టాలంటే ఏమని చెప్పాలి? రూ.లక్షల కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త తన బాల్యం జ్ఞాపకాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెబితే సరిపోతుందా? ప్రభుత్వమైతే ఇలానే చెబుతామంటోంది. రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన ఆ సదస్సులో సాక్షాత్తూ సీఎం చంద్రబాబుతో ఫొటో దిగిన దొడ్డాల సుధీర్‌ నివాసం ఇది. ఆయన పారిశ్రామికవేత్త కాదు కదా.. కనీసం ఓ చిన్న కంపెనీకి షేర్‌ హోల్డర్‌ కూడా కాదు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డాల చిట్టిబాబు, కోటేశ్వరమ్మ ఏకైక కుమారుడు దొడ్డాల సుధీర్‌. పాత పెంకుటిల్లుతోపాటు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఆయనకున్న ఆస్తి. భార్య అంగన్‌వాడీ టీచర్‌.

లక్షల కోట్లు వచ్చాయని నమ్మించాలని..
ఈవీఎం కాలేజీలో సుధీర్‌ పీఆర్వోగా పనిచేస్తూ ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్‌ విద్యార్థులను కాలేజీలో చేర్చించి కమీషన్లు తీసుకుంటుండేవారు. రెండేళ్ల క్రితం నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలో విరించి టౌన్‌షిప్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ భూములు కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు ప్లాట్లు వేసి అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ కంపెనీలో సుధీర్‌ ప్లాట్లు విక్రయించేందుకు ఏజెం ట్‌గా చేరారు. కమీషన్లే ఆధారం. కానీ రూ.కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం మీద సంతకం చేశారు. రూ.కోట్లాది సొమ్ము ఎలా తెస్తారో అని స్థాని కులు చర్చించుకుంటున్నారు.

రికార్డు బ్రేక్ చేసిన చంద్రబాబు

Written By news on Monday, January 30, 2017 | 1/30/2017


‘కిరణ్‌ రికార్డు బ్రేక్ చేసిన చంద్రబాబు​’
హైదరాబాద్: పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ లెక్కలేనని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, ఇవి ఎక్కడ నుంచి వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

సోమవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అంకెలతో గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కిరణ్‌ కుమార్ రెడ్డి రికార్డును చంద్రబాబు బ్రేక్ చేశారని ఎద్దేవా చేశారు. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఒక రోజులో రూ. 6.50 లక్షల కోట్ల ఎంవోయూలు చేస్తే, చంద్రబాబు ఒక్కరోజులో రూ.10.50 లక్షల కోట్ల ఎంవోయూలు చేశారని తెలిపారు.

విద్యుత్ పై ఎంవోయూలు ఎందుకో అర్థం కాదని వాపోయారు. అదనంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను అమ్మకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ‘ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని చెప్పుకోవడాన్ని రాజేంద్రనాథ్‌ తప్పుబట్టారు.

విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు


‘విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు’
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు హాయంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో సోమవారం ఉదయం ఆయన పర్యటించారు. నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పంటల పరిస్థితి ఈ విధంగా ఉండడం దారుణమన్నారు. ‘ప్రతి రోజు చంద్రబాబు ఇక్కడ నుంచే ఫ్లైట్‌ ఎక్కుతారు. విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు కానీ, రైతుల కష్టాలను పట్టించుకోర’ని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోగా, బలవంతంగా భూములు లాక్కుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో 18 వేల ఎకరాలకు గాను.. వెయ్యి ఎకరాలే సాగు అవుతున్నాయన్నారు. రైతుల పరిస్థితిపై సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

రాజధాని ప్రాంతంలో మూడు, నాలుగు పంటలు పండే భూములు నీరు లేక ఎండిపోతున్నాయని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మెట్టప్రాంతాల్లో పంటలు ఎండిపోతాయని.. కానీ డెల్టా ప్రాంతంలో నీరు లేక పంటలు ఎండిపోవడం బాధకరమన్నారు. మినుము ధర క్వింటాకు రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయిందని రైతులు జగన్‌ దృష్టికి తీసుకవచ్చారు. కనీసం పంటను కూడా కాపాడుకోలేక పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. పంట నష్టంపై ఎలాంటి సర్వే చేయరు. ఏ అధికారి పర్యవేక్షణకు రారని జగన్‌ ధ‍్వజమెత్తారు. నష్టపోయిన పంటలకు పైసా నష్టపరిహారం ఇవ్వట్లేదన్నారు. ఈ పర్యటనలో జగన్‌ వెంట ఎమ్మెల్యేలు కొడాలి నాని, రక్షణనిధి, మేకా ప్రతాప్‌ అప్పారావు, పార్టీ నేతలు రామచంద్రరావు, జోగి రమేష్‌, పేర్ని నాని తదితరులు ఉన్నారు.

టీడీపీలో మాత్రం చేరవద్దన్నారు

Written By news on Sunday, January 29, 2017 | 1/29/2017


ద్వారకా తిరుమల: ఏ పార్టీలో అయినా చేరుకానీ, టీడీపీలో మాత్రం చేరవద్దని తన తండ్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు చెప్పారని కోటగిరి శ్రీధర్ అన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ తో తన తండ్రికి మంచి సంబంధాలున్నాయని, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన నాయకత్వంలో పనిచేయాలని సలహా ఇచ్చారని చెప్పారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ సమక్షంలో కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం చెప్పారంటే..
 
  • ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి కారణమేంటంటే.. తమ కుటుంబంలో ప్రతి శుభకార్యక్రమం ఇక్కడి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది
  • వెంకటేశ్వర స్వామి ముందు ఈ కార్యక్రమం పెట్టాలని వైఎస్ జగన్ ను కోరాం
  • ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్ కు, వైఎస్ఆర్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు, కోటగరి విద్యాధర రావు అభిమానులకు కృతజ్ఞతలు
  • కోటగిరి విద్యాధర రావు ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ గా, ఆ తర్వాత వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
  • 2004లో కోటగిరి ఓడిపోయినా వైఎస్ఆర్ గెలిచారని సంతోషించారు
  • గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని సంతోషించారు
  • వైఎస్ఆర్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి
  • నాన్న చివరి రోజుల్లో నా తర్వాత నువ్వు రాజకీయ వారసుడిగా కొనసాగాలని చెప్పారు
  • ఏ పార్టీలో చేరినా ఫర్వాలేదు కానీ టీడీపీలో మాత్రం చేరవద్దన్నారు
  • నాన్న గారు మరో సలహా ఇచ్చారు. వైఎస్ జగన్ తో చేరాలని చెప్పారు
  • చిన్న వయసులో పార్టీ పెట్టి సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు
  • ఇక చంద్రబాబు గురించి కొంచెం మాట్లాడుకోవాలి
  • ఆయన, ఆయన జీవితానుభవంలో ప్రతి ఎన్నికల్లో మనల్ని ఎలా మభ్యపెట్టాలో ఆలోచిస్తున్నారు
  • ఎవర్ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లాలి.. ఎలా మభ్య పెట్టాలా అని ఆలోచిస్తారు
  • ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పారు. ఈ రోజు ఎన్నెన్నో కబుర్లు చెబుతున్నారు
  • మనం ఢిల్లీ నాయకులను ముక్కు పిండి పనిచేయించుకోవాలంటే అందుకు బలమైన నాయకుడు కావాలి
  • అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రావాలి
  • రాష్ట్ర విభజన జరిగినపుడు మనం ఎంతో బాధపడ్డాం
  • మొదటి ముద్దాయి కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేశాం
  • వచ్చే ఎన్నికల్లో రెండో ముద్దాయి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం
  • వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సాధించారు. ఆయన సీఎం అవడానికి సిద్ధం
  • 12 ఏళ్లు నాన్నగారికి రాజకీయాల్లో సాయం చేశాను. మూడు ఎన్నికల్లో పనిచేశాను. చాలా మందితో పరిచయం ఏర్పడింది.
  • నాకు కోపం లేదు, ఓర్పు ఉంది, సహనం ఉంది, హంగూ ఆర్భాటం లేదు
  • మీరు ఏ సమయంలోనైనా నా దగ్గరకు రావచ్చు
  •  మీరు మేనిఫెస్టోలను చూసి మోసపోవద్దు
  • మనమందరం వైఎస్ జగన్ ను గెలిపిద్దాం
     

భూములు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ కాదు ఇక్కడే అంటారు


ద్వారకా తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనంతా అవినీతి, అసమర్థత, అసత్యం, అప్రజాస్వామికంతో కూడుకున్నదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్ 1గా ఉందని అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని,  అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
 
  • వైఎస్ఆర్ సీపీలోకి కోటగిరి శ్రీధర్ ను ఆహ్వానిస్తున్నాను
  • యువకుడు, ఉత్సాహవంతుడు అయిన శ్రీధర్ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు
  • మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది
  • రాష్ట్రం వైపు ఓ సారి తిరిగి చూస్తే చంద్రబాబు పరిపాలన కనిపిస్తుంది
  • మనం ఎవరికైనా ఎందుకు ఓటు వేస్తాం అభివృద్ధి కోసం. నిన్నటి కన్నా ఈ వాళ, ఈ రోజు కన్నా రేపు బాగుంటే అభివృద్ధి జరుగుతోందని చెబుతాం
  • చంద్రబాబు పాలనలో అవినీతి, అసమర్థ పాలన జరుగుతోంది
  • ఇవాళ అసత్యాల, అప్రజాస్వామిక పాలన జరుగుతోంది
  • దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే.. చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో నెంబర్ 1గా ఉంది.
  • చంద్రబాబు వ్యవస్థలను, మనుషుల్ని, మీడియాను మేనేజ్ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడు
  • దేశంలో చాలా మంది సీఎంలు ఉన్నారు. రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు. ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశారా?
  • సూట్‌ కేసుల్లో బ్లాక్ మనీ తీసుకువెళ్లి ఎమ్మెల్యేలను కొంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా సీఎం రాజీనామా చేయకపోవడం, జైలుకు వెళ్లకపోవడం ఎక్కడైనా చూశామా..? ఒక్క చంద్రబాబు విషయంలోనే జరుగుతోంది
  • రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందని తెలిసినా ఎక్కడో వస్తుందని చెప్పారు
  • రాజధాని ప్రాంతంలో మంత్రులు, చంద్రబాబు బినామీలు భూములు కొనుగోలు చేస్తారు
  • భూములు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ కాదు ఇక్కడే అంటారు
  • దీనివల్ల రైతులు నష్టపోతారు, చంద్రబాబు ఆయన బినామీలు లాభపడతారు
  • రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకుని, తనకు ఇష్టమైన వారికి కమీషన్లు తీసుకుని ఇస్తున్నారు
  • ఇవాళ ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో నీళ్లు రావడం లేదు, చంద్రబాబు పాలనలో అవినీతి పొంగిపొర్లుతోంది
  • కాంట్రాక్టర్లతో కమీషన్లు మాట్లాడుకుని నచ్చినవారికి చెక్ లు ఇచ్చేస్తున్నారు
  • పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంచేశారు
  • అవినీతి జరిగిందని తెలిసినా కాంట్రాక్టర్లను కొనసాగిస్తున్నారు
  • మద‍్యం షాపులు, బొగ్గు కొనుగోళ్లు అన్నింటా అవినీతి కనిపిస్తోంది
  • చివరకు దేవుడి భూములను కూడా వదిలిపెట్టడం లేదు
  • రెండున్నరేళ్ల పాలనలో ఎక్కడ చూసినా అవినీతిమయం
  • రెండున్నరేళ్లు కావస్తున్నా చంద్రబాబు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయలేదు
  • ఇందులో గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్ సీపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కమిటీ వేస్తే  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉంటారని వేయలేదు. పేదలకు అన్యాయం చేస్తున్నాడు
  • చంద్రబాబు ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేస్తున్నాడు, పంచాయతీ సర్పంచ్ లకు విలువ లేదు
  • పేద ప్రజల నుంచి భూములు ఎలా లాక్కోవాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు
  • చింతలపూడి ప్రాజెక్టును చూస్తే ఒకే ప్రాజెక్టు పరిధిలో ఒక్కో గ్రామానికి ఒక్కో ధర ఇస్తున్నారు
  • గిరిజనులం కాబట్టి అడగలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
  • చంద్రబాబు వేరే పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి చేర్చుకుంటున్నారు
  • వాళ్లతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు
  • గాంధేయ పద్ధతిలో రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ప్రదర్శన చేయకుండా అడ్డుకున్నాడు
  • చంద్రబాబు అప్రజాస్వామిక పాలన పోవాలి. మేధావులు, యువకులు కదలాలి. గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ రావాలి

బాబు అలా చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు


‘బాబు అలా చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు’
విజయవాడ:  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పుట్టు పూర్వోత్తరాలు తెలుసు కాబట్టే.. ఆయన సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ 8 సీట్లను గెలుచుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విశాఖలో జరిగింది భాగస్వామ్య సదస్సు కాదని.. అది గెట్ టు గెదర్ లా ఉందన్నారు. రాబోయే రోజుల్లో విశాఖను నేనే నిర్మించానని చంద్రబాబు చెప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని బొత్స అన్నారు. రూ.10.50 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారని, రూ.20 లక్షల కోట్లు వస్తున్నట్లు చెప్పుకుంటే బాగుండేదని ఎద్దేవాచేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న కంపెనీల నెట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ క్రెడిబిలిటీని బయటపెట్టాని బొత్స డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంత దూరమైన వెళ్తామని, ఏం జరిగినా సరే హోదా సాధించే వరకు పోరాడతామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హత్య, ఫ్యాక్షన్ రాజకీయాలను పోషించేదెవరో అందరికీ తెలుసునని, రాజకీయ నేత హత్యలో ఎవరున్నారో బెజవాడ ప్రజలందరికీ తెలుసునని, పింగళి వంశానికి చెందిన పాత్రికేయుడి హత్య, సీఎస్ యాక్సిడెండ్.. పింగళి నరసింహారావు ఎన్ కౌంటర్ గురించి బాబు కేబినెట్ లో పనిచేసిన హరిరామజోగయ్య పుస్తకంలో రాశారాని ఈ సందర్భంగా బొత్స గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో అన్ని రంగాలు కుంటుపడ్డాయని తెలిపారు.

వైఎస్ఆర్ సీపీలో చేరిన కోటగిరి శ్రీధర్

ద్వారకా తిరుమల: మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌ వైఎస్ఆర్ సీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ రోజు వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వెళ్లి అక్కడి నుంచి ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. ద్వారకా తిరుమలలో చినవెంకన్న దర్శనం చేసుకున్న తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.

పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం


హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత‍్యేక హోదాయే సంజీవిని, హోదా లేకపోతే రాష్ట్రానికి భవిష‍్యత్తులేదని వైఎస్సార్‌సీపీ అధ‍్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అందుకోసం పార‍్లమెంట్‌లో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార‍్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

ఈ సందర‍్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రత‍్యేక ప్యాకేజీ పేరుతో ముఖ‍్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రత‍్యేక హోదాకు ఏదీ సాటిరాదని దీనిపై పార‍్లమెంట్‌ ఉభయ సభల‍్లో గళం వినిపించాలని, కేంద్ర సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశం ముగిసిన తర్వాతఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానంగా చర్చ జరిగిందని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చి మాట మార్చారన్నారు. ఇప్పుడు హోదాతో ప్రయోజనం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి హోదాతోనే పరిశ్రమలు రాయితీలు వస్తాయని చెప్పారు. హోదాతోనే 11 రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు.

చట‍్టంలో ఉన‍్నవే చేస్తున‍్నప్పుడు మళ్లీ చట‍్టబద‍్ధత అనే మాటకు అర‍్థంలేదని చెబుతున‍్నారని, దీన్ని బట్టి చూస్తే ప్రత్యేక ప్యాకేజీ, చట‍్టబద‍్ధత అనే మాటలు బూటకమని, ఆ పేర‍్లతో ముఖ‍్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయని బాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. గత ఏడాది నిర్వహించిన సదస్సుల్లో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి, బుట్టారేణుక, విజయసాయిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Popular Posts

Topics :