
వస్తున్నది! ‘జగన్’నాద రథం!
వస్తున్నది వస్తున్నది ‘జగన్’నాద రథం!
రానున్నది రానున్నది రాజన్న సువర్ణయుగం!
ఎద ఎదలో మెదులుతున్న, ఎపుడెపుడా అని రగులుతున్న
జన జీవన చైతన్య రథం! పూరించిన సమర శంఖారావం!
కదలండిక కదలండిక చేయి చేయి కలిపి!
నడవండిక నడవండిక అడుగు అడుగు కలిపి!
రాజన్నకు, జగనన్నకు, విజయమ్మకు మద్దతుగా!
షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం దిశగా!
ఏ శక్తులు ఆపలేవు, కుయుక్తులిక సాగబోవు!
కుత్సిత బుద్ధుల పెద్దల కుతంత్రాలు పారబోవు!
ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కై కుట్రలెన్ని చేసినా
అంతిమ విజయం మనదే! సత్యమేవ జయతే!
ఎండనకా వాననకా రేయనకా పగలనకా
ఆలుబిడ్డలను వదలి ఆకలి దప్పులనే మరచి
మడమ తిప్పనంటూ మాట తప్పనంటూ విశ్వసతనే చూపేందుకు!
ప్రజలతో మమేకమై... ప్రజలే తన లోకమై!
ఓదార్పును చేస్తుంటే... ఓర్వలేకపోయారు!
జగన్‌పై కన్నుకుట్టి... సీబీఐని రెచ్చగొట్టి
జగనన్నపై కక్ష కట్టి జైలుపాలు చేశారు!
దేవుడు చూస్తున్నాడనే మాటనే మరిచారు!
రాజన్న కొడుకునే రాచి రంపాన పెట్టారు!
తండ్రి లేని పిల్లవాణ్ని తల్లడిల్లేలా జేశారు!
భర్తను కోల్పోయిన విజయమ్మను బాధలెన్నో పెట్టారు!
ఎన్నడూ గడప దాటని తల్లిని బజారుకే లాగారు!
ప్రభుత్వం ప్రతిపక్షాలకు ధరావతులు పోయినా
చేవ చచ్చి జావగారి చతికిలపడిపోయినా
బిక్కచచ్చి బక్కచిక్కి బొక్కబోర్లా పడినా
వరుసగా ఒక్కొక్కరు మీ పార్టీలను వీడినా
దుకాణాలు సర్దుకునే సమయమే వచ్చినా!
ఓటుతో ప్రజలు మిమ్ము ఎన్నిసార్లు ఓడించినా
తలలు బొప్పి కట్టేటట్లు ఎన్నిసార్లు మొట్టినా సిగ్గు రాలేదా?
కాచుకుని ఉన్నారు ప్రజలు మిమ్ము కాటికి పంపేందుకు!
వేచి ఉన్నారు ప్రజలు మిమ్ము గోతిలోన పూడ్చేందుకు!
ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్నారు జనం
జగనన్నకు పట్టం కట్టేందుకు! మీకు గోరీ కట్టేందుకు!
కసికసిగా కదులుతున్న రాజకీయ చిత్రపటం!
వడివడిగా అడుగులేస్తూ కదులుతున్న జనం!
జగన్ వెంట జనం! జనం! జనం కాదు ప్రభంజనం!
- భారతుల సునీల్ భార్గవ్, గుంటూరుకాంగ్రెస్ డ్రామా - చంద్రబాబు హైడ్రామాతొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలుజేసిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సమయంలో అన్నివర్గాలకు చెందిన ప్రజానీకానికి ఆత్మవిశ్వాసం కల్పించడానికి, సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తేవడానికి వై.ఎస్. చేసిన కృషి మరువరానిది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అభివృద్ధి మంత్రంతో కాంగ్రెస్ సర్కార్‌ను అధికారంలోకి తెచ్చినప్పటికీ, ఆయన అకాల మరణంతో రాష్ట్రం అంధకారంలో పడిపోయింది. ఏ రోజూ ప్రజల మధ్యకు వెళ్లని వృద్ధనేతలు కుర్చీకోసం ఆరాటపడి, ప్రజల కోసం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఖ్యాతిగాంచిన వై.ఎస్. కుటుంబాన్ని విస్మరించి, బురద జల్లించే ప్రయత్నాలు చేశారు.
ఈ నేపథ్యంలో తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ముందుకొస్తున్న జగన్ వల్ల కాంగ్రెస్ లాభపడుతుందేమో గానీ తాము లాభపడలేమని భావించిన ముసలి నక్కలు కొన్ని, అధిష్టానం చెవులు కొరికి కొనసాగించిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. అదే అదనుగా - మామకు వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు - కాంగ్రెస్‌తో కుమ్మక్కై కొనసాగిస్తున్న పాదయాత్ర డ్రామా ఏమిటో ప్రజలకు తెలిసిపోయింది. జగన్ జైల్లో ఉన్నప్పటికీ తెలుగు జాతి యావత్తూ తాము ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయం ఎప్పుడు వస్తుందన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఆ కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది.
- మంజులారెడ్డి, పుత్తూరు