22 November 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కేసీఆర్ పర్మిషన్ తోనే హైదరాబాద్ కు బాబు

Written By news on Saturday, November 28, 2015 | 11/28/2015


'కేసీఆర్ పర్మిషన్తోనే హైదరాబాద్కు బాబు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతితోనే హైదరాబాద్లో తిరిగి అడుగుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేసీఆర్కు చంద్రబాబుకు మధ్యవర్తిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యవహరించారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్ ఇచ్చిన కండీషన్ బెయిల్ మీద చంద్రబాబు ఏపీని పరిపాలిస్తున్నారని అన్నారు. కుమ్మక్కు రాజకీయాలు చేసే చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే హక్కులేదని అంబటి ధ్వజమెత్తారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో.. 'వాట్ ఐయామ్ సేయింగ్ అంటూ' ఫోన్ సంభాషణల్లో అడ్డంగా దొరికిపోయినా, ఇప్పటి వరకు ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని అంబటి చెప్పారు. బినామీ పేర్లతో టీవీ చానళ్లను నడిపించే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో తనకు మద్దతుగా వార్తలు ప్రసారం చేయడంలేదని 13 జిల్లాల్లో ఓ టీవీ చానల్  ప్రసారాలను నిలిపివేశారన్నారు. అంగన్ వాడీ వర్కర్స్ కోసం గతంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలు..ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అంగన్ వాడి వర్కర్స్ను ఉద్దేశించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు.

మమ్మల్ని పట్టించుకున్నవాడే లేదు


మమ్మల్ని పట్టించుకున్నవాడే లేదు
జగన్‌కు మొర పెట్టుకున్న రైతులు
కొత్తపేట/రావులపాలెం : భారీ వర్షాలకు పంట నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లినా ప్రభుత్వం తరఫున పట్టించుకున్న నాథుడే లేడని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి పలువురు రైతులు మొర పెట్టుకున్నారు. ఇటీవలి భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పంటల పరిశీలనకు శుక్రవారం వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి కొత్తపేట శివారు చినగూళ్ళపాలెం, పెదగూళ్ళపాలెం; రావులపాలెం మండలం దేవరపల్లి, ఈతకోట గ్రామాలను సందర్శించారు.

నేలనంటిన వరి పంటను పరిశీలించారు. ఎక్కడిక్కడ రైతులతో మమేకమయ్యారు. ఇంతవరకూ ప్రభుత్వం తరఫున సరైన భరోసా పొందని రైతులు జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తొలుత చినగూళ్ళపాలెంలో నేలనంటి మొలకవస్తున్న విత్తనాల రామకృష్ణకు చెందిన వరి చేనును జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. నీట మునిగి, మొలక వచ్చి, రంగు మారిన ధాన్యాన్ని ఆ రైతు చూపించారు. ఈ సందర్భంగా వారిమధ్య సంభాషణ ఇలా సాగింది.
 
జగన్ : రామకృష్ణా! ఎన్నెకరాలు సాగు చేస్తున్నావు? సొంత భూమా? కౌలుకా?
రామకృష్ణ : సార్, రెండెకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. చేతికొచ్చే సమయంలో మాయదారి తుపాను వచ్చి పంటను ముంచేసింది. కోయకుండానే నీటిలో ఇలా మొలక వచ్చింది.
 
జగన్ : ఈ వరి కోసి మాసూళ్లు చేస్తే ఏమైనా దిగుబడి వస్తుందా?
రామకృష్ణ : 
ఇప్పటికే పది రోజుల నుంచి నీటిలో నానుతోంది. మొలక కూడా వచ్చింది. ఇది ఎందుకూ పనికొచ్చే పరిస్థితి లేదు. కోసి మాసూళ్లు చేసినా కొంటారో కొనరో తెలియదు.
 
జగన్ : ఎంత పెట్టుబడి అయింది?
రామకృష్ణ :
 ఎకరానికి దాదాపు 20 వేలు పెట్టుబడి పెట్టామండి. ఇది కాకుండా 15 బస్తాల శిస్తు చెల్లించాలి.
బొక్కా సత్యనారాయణ, కొప్పిశెట్టి గణపతి, సుబ్రహ్మణ్యం, కాండ్రేగుల బాబూరావు తదితర రైతులు : మొలకొచ్చిన, రంగు మారిన ధాన్యం గురించి పట్టించుకున్న నాథుడు లేడు. అసలు ఆ ధాన్యం కొంటారో లేదో తెలియదండి. కొనకపోతే తీవ్రంగా నష్ట పోతాం సార్!
 
జగన్ : ప్రభుత్వం తరఫున ఎవరైనా వచ్చారా? హామీ ఇచ్చారా?
రైతులు :
 మొన్న ఎవరో అధికారి వచ్చి, చూసి వెళ్లారు. ఏ హామీ ఇవ్వలేదండి. మా పరిస్థితి అంతా అయోమయంగా ఉంది సార్ ! మీరే వచ్చారు. మీరు దయతలచి పట్టించుకొంటే మా కష్టాలు తీరుతాయి.
 
జగన్ : ఇంతవరకూ ప్రభుత్వం తరఫున ఎవ్వరూ రాకపోవడం చాలా దారుణం. మొలకొచ్చిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు హామీ ఇవ్వకపోవడం బాధాకరం. ఈ నియోజకవర్గంలో 37 వేల ఎకరాలు సాగవుతూ అత్యధిక శాతం పంట దెబ్బ తింటే అధికారులు మాత్రం కేవలం సుమారు 2 వేల ఎకరాలు దెబ్బతిన్నట్టు లెక్కలు చూపుతున్నారు. గతంలో నీలం, లైలా, పైలీన్ తదితర తుపాన్లు వచ్చాయి. పంటను దెబ్బ తీశాయి. ఆ పరిహారం కూడా ఇవ్వలేదు. సరే దీనిపై మీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పరిహారం ఎలా చెల్లించరో చూస్తాం.
 దేవరపల్లి శివారు బాలయోగిపేట వద్ద రైతులు బయ్యే పెద్దిరాజు, గుత్తుల సత్యనారాయణ, దంగేటి సత్యనారాయణ, దంగేటి రాముడు తదితరులు మొలకొచ్చిన వరిపనలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చూపి తమ కష్టాలు గట్టెక్కించాలని కోరారు. వారి సంభాషణ సాగిందిలా..

జగన్ : అధికారులు వచ్చారా? మీ పంట నష్టాలు నమోదు చేశారా?
రైతులు :
 వచ్చారండి. అయితే ఇలా గట్టుకు తెచ్చుకోకూడదంట సార్! చేలోనే మునిగిపోవాలంట. చేలోనే మొలిచేయాలంట. అలా ఉంటేనే రాసుకుంటారంట సార్! వారికిష్టం వచ్చినచోట కూర్చొని, ఇష్టం వచ్చిన వారి పేర్లు రాసుకు వెళ్లారు. మా ఊరికి జేసీగారు వచ్చి అసలు మీ పంట నష్టపోలేదని చెప్పారు.
 
జగన్ : ఇదేం దారుణం? ఉన్న పంటను కూడా ఒబ్బిడి చేసుకోనివ్వరా? ఇదేం ప్రభుత్వం? ఇదేం అధికారులు? వారి ఆటలు అలా సాగుతున్నాయి. పోనీ ఈ ధాన్యం ఎవరైనా కొంటారా?
రైతులు :
 ఎవ్వరూ కొనే పరిస్థితి లేదు సార్! మిల్లర్లను అడిగితే అయిన కాడికి అడుగుతారు. బస్తా రూ.1057 ఉండగా రూ.600కు అడుగుతారు. వారు ఎక్కువకు అమ్ముకుంటారు.
 
జగన్ : ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొంటున్నామని ప్రకటించింది. ఈ ధాన్యాన్ని పట్టుకుపోతే కొనరా? పోనీ మీ పంట రుణాలు మాఫీ అయ్యాయా?
రైతులు :
 మాఫీ కాలేదండి. ఇళ్లు వేలం వేస్తామంటే వడ్డీకి అప్పులు తెచ్చి కట్టాం.
 
జగన్ : రుణాలు మాఫీ కాకపోగా ఇళ్లు వేలం వేస్తామంటే వడ్డీకి తెచ్చి కట్టారా? రుణమాఫీ చేశామని గొప్పగా చెప్పుకున్నారు. కనీసం ముఖ్యమంత్రిగా చంద్ర బాబు ఏ హామీ ఇవ్వలేదు. మీ దగ్గరకొచ్చిందీ లేదు. ఇదీ ఆయన పాలన.
రైతులు :
 ఏం పాలనండీ బాబూ! పేదలు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఇసుక రేటు బంగారంలా మారింది. లారీ రూ.25 వేలు అంటున్నారు. రుణామాఫీ అన్నాడు. ఏదో చేస్తాడని ఎదురు చూశాం. తీరా చేసిందేమీ లేకపోగా వేలకు వేలు వడ్డీలు కట్టాం.
 
జగన్ : సరే ఈ సమస్యలపై మీ తరఫున ప్రభుత్వంతో పోరాడి రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కృషి చేస్తా.
 
వీఆర్‌ఏల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా
రాజమండ్రి రూరల్ : వీఆర్‌ఏల న్యాయ సమ్మతమైన సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వీఆర్‌ఏలు శుక్రవారం మధురపూడి విమానాశ్రయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.

వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ తమను ఫుల్‌టైమ్ ఉద్యోగులుగా గుర్తించి  పేస్కేలు మంజూరు చేయాలని కోరారు. రాజేష్, కుమార్, దార్ల ప్రసాద్, సుబ్బారెడ్డి, ఆర్.లావణ్య, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం: వైఎస్ జగన్

Written By news on Friday, November 27, 2015 | 11/27/2015


ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దువ్వ, వరిఘేడులలో పంటపొలాలను ఆయన పరిశీలించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు తమ కష్టాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వర్షాలతో రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ఈ సమస్యలను ప్రస్తావించి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
తణుకులో వీఆర్ఏలు నిర్వహిస్తున్న దీక్షకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపారు. నేరుగా ఎంపికైన వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ కు వినతిపత్రం సమర్పించారు. వీఆర్ఏలతో పాటు అంగన్ వాడీల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
వైఎస్ జగన్ అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం జిల్లాకు రాకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

రైతుల వద్దకు చంద్రబాబు రాకపోవడం దారుణం


'రైతుల వద్దకు చంద్రబాబు రాకపోవడం దారుణం'
కాకినాడ : భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతుల వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం చినగొళ్లపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు.  అనంతరం వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మాట్లాడుతూ... జిల్లాలో లక్షన్నర ఎకరాలకుపైగా పంట నష్టపోతే... కేవలం 18 వేల ఎకరాలే పంట నష్టం జరిగినట్లు అధికారులు చూపుతున్నారని విమర్శించారు.

చాలా చోట్ల నష్టపోయిన రైతుల వద్దకు అధికారులు వెల్లడంలేదని మండిపడ్డారు. గత తుపానులో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ఎంత పంట నష్టం జరిగిందో తెలిసినప్పుడు... రైతులకు ఒకే రకమైన పరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కానీ అలా జరగడం లేదన్నారు. ఒకే రకంగా పరిహారం ఇవ్వకుండా ఎందుకు వివక్ష చూపుతున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ప్రశ్నించారు.

అప్పులు చేసి మరీ పంటలు వేశామని రైతులు వైఎస్ జగన్ వద్ద కన్నీరుమున్నీరయ్యారు. దాంతో అన్ని విధాల అండగా ఉంటామంటూ రైతులకు వైఎస్ జగన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కొత్తపేట మండల బాలయోగిపేటలో వైఎస్ జగన్ పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక మీద పెట్టే దృష్టి రైతులపై చూపితే బాగుంటుందని అన్నారు. తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు జల్లాల్లో ఇప్పటికే పర్యటించి... వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సంగతి తెలిసిందే.

రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్

పంట నష్టపోరుున రైతులకు పరామర్శ

 కాకినాడ/ ఏలూరు: అకాల వర్షాలతో దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉభ య గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటల నష్టంతో కుదేలైన అన్నదాతలను ఆయన పరామర్శిస్తారు. 

రావులపాలెం మీదుగా దేవరపల్లి, ఈతకోట గ్రామాలకు వెళతారు. అక్కడ పంటల్ని పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేరుకుంటారు. దువ్వ, వరిఘేడు, తిరుపతిపురం, బల్లిపాడు గ్రామాల్లో పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. పర్యటన అనంతరం శుక్రవారం సాయంత్రం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.

వీఆర్ఏల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా: వైఎస్ జగన్


రాజమండ్రి : వీఆర్ ఏ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం రాజమండ్రిలోని ఎయిర్ పోర్ట్ కు వైఎస్ జగన్ విమానంలో చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద వైఎస్ జగన్ ను వీఆర్ ఏలు కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మీ సమస్యలను ప్రస్తావిస్తామని వీఆర్ఏలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం విదితమే. దీంతో ఇరు జిల్లాల్లో దెబ్బతిన్న పొలాలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.  

వరదలొచ్చాక కరువు మండలాలు ప్రకటిస్తే ఎలా

Written By news on Thursday, November 26, 2015 | 11/26/2015


జనం చెవిలో పువ్వులు పెడుతున్నారు
► వరదలొచ్చాక కరువు మండలాలు ప్రకటిస్తే ఎలా
► ఇళ్లు కట్టించకుండా కూల్చేస్తే ఊరుకునేది లేదు
► నెల్లూరు పర్యటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన అంతా మోసం.. మోసం.. మోసం అన్న మూడు పదాల చుట్టూనే తిరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా గురువారం నెల్లూరు నగరంలో పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు మన్సూర్‌నగర్‌లో ప్రసంగించారు. ''చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఇంటింటికో ఉద్యోగం అన్నారు. రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు రూ.1,690 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక ఇవ్వను పో అని మోసం చేశారు. ఉద్యోగం మోసం.. నిరుద్యోగభృతి మోసం... రుణాల మాఫీ మోసం... ఇన్‌పుట్ సబ్సిడీ మోసం... చంద్రబాబు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు'' అని ధ్వజమెత్తారు.

కరువు మండలాలను వరదలొచ్చాక ప్రకటించారని ఆరోపించారు. మొదట్లో 196 మండలాలను ప్రకటించారని, తర్వాత మొన్నటికి మొన్న మరో 163 మండలాలను ప్రకటించారన్నారు. వరదలొచ్చాక కరువు మండలాలను ప్రకటించటం వల్ల అధికారులు ఎన్యుమరేషన్‌కు వెళితే ఫలితాలు ఎలా అనుకూలంగా వస్తాయని ప్రశ్నించారు.

వారి జోలికొస్తే ఊరుకోం
ఇళ్లు కట్టించకుండా పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన్సూర్‌నగర్‌లో సుమారు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారి నివాసాలను కూల్చేస్తామనటం అన్యాయమన్నారు. కాలనీవాసులది దురాశైతే.. విజయవాడలో నదీతీరాన చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చా? అని ప్రశ్నించారు. నెల్లూరు మునిగిపోవటానికి ఆక్రమణలే కారణమంటూ పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇళ్లు తొలగించాలంటే వారికి పక్కాగృహాలు కట్టించాలి, లేకపోతే మార్కెట్ ధర ప్రకారం వారికి పరిహారం ఇవ్వాలి, అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే పేదల తరఫున వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. నగరంలో పంట కాలువలన్నింటినీ ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని, వారి జోలికి వెళ్లకుండా పేదల జోలికి వెళ్లటం అన్యాయమన్నారు.

రూ.5వేల చొప్పున తక్షణ సాయం ఇవ్వాలి
నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, ఉభయగోదావరి జిల్లాల్లో వరదలకు నష్టపోయి నిరాశ్రయులైన వారికి తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరదల వల్ల ఇళ్లు పోగొట్టుకుని పది రోజులుగా నీళ్లలో నానుతున్నవారికి ప్రస్తుతం ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కొందరికి బియ్యం ఇచ్చి, మరికొందరికి ఇవ్వకపోవటం.. ఇంకొందరికి తక్కువగా ఇచ్చి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరూ ఊహించని విధంగా ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయని, అన్నీ తెలిసి చంద్రబాబు బాధితులకు తక్షణ సాయం చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను గుర్తించటంలోనూ అన్యాయం చేస్తున్నారని, నామమాత్రపు సర్వేలు చేయిస్తున్నారని ప్రభుత్వంపై జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.

కాగా వైఎస్ జగన్ గత మూడు రోజులుగా చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తొలుత 23, 24 తేదీల్లోనే పర్యటన ఉంటుందని భావించినా, వరద నష్టం తీవ్రంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో పర్యటనను వైఎస్ జగన్ పొడిగించారు. గురువారం రాత్రికి ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగివస్తారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు వెళతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న ప్రాంతాల్ని సందర్శించి ప్రత్యక్షంగా పంటనష్టం వివరాల్ని, ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుంటారు.

చంద్రబాబు పాలన అంతా మోసం: వైఎస్ జగన్


చంద్రబాబు పాలన అంతా మోసం: వైఎస్ జగన్
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన మూడోరోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఆయన మన్సుర్ నగర్ లో పర్యటించారు. వరద బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారన్నారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు నష్టపోయారని, ప్రతి ఇంటికి రూ.5వేల చొప్పన ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా సర్కార్ కళ్లు తెరిచి బాధితులను ఆదుకోవాలన్నారు. అధికారులు కొందరి పేర్ల మాత్రమే నమోదు చేస్తున్నారని, వరద సాయంలో వివక్ష చూపడం తగదని వైఎస్ జగన్ సూచన చేశారు. సర్వేల పేరుతో ఒకరు...ఇద్దరు పేర్లు రాసుకోవటం సరికాదన్నారు. బాధితులను ఆదుకోవడం పోయి... చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. మోసపూరిత హామీలతో బాబు అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పాలన అంతా మోసం... మోసం... మోసం అన్న పదాల చుట్టే తిరుగుతుందని అన్నారు.

కరవు మండలాల ప్రకటన, ఇన్ పుట్ సబ్సిడీలోనూ ప్రజలకు చెవిలో పూలు పెడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే కొత్త ఇళ్లు కట్టిస్తామన్న చంద్రబాబు...ఇప్పుడు 30 ఏళ్లుగా ఉన్న ఇళ్లను   కూల్చివేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. చంద్రబాబు మాత్రం అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ... పేదల కడుపు కొడతాననడం దారుణమన్నారు. వరద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాల తోడుగా ఉంటుందని, వరద సాయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

కాగా వైఎస్ జగన్  గత మూడు రోజులుగా చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో  పర్యటిస్తున్నారు. తొలుత 23, 24 తేదీల్లోనే పర్యటన ఉంటుందని భావించినా, వరద నష్టం తీవ్రంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో పర్యటనను వైఎస్ జగన్ పొడిగించారు. గురువారం రాత్రికి ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగివస్తారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు వెళతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న ప్రాంతాల్ని సందర్శించి ప్రత్యక్షంగా పంట నష్టం వివరాల్ని, ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకుంటారు.

ఇల్లిల్లూ తిరుగుతూ.. కన్నీరు తుడుస్తూ.

Written By news on Wednesday, November 25, 2015 | 11/25/2015


ఇల్లిల్లూ తిరుగుతూ.. కన్నీరు తుడుస్తూ..
నెల్లూరు జిల్లా వరదబాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ విస్తృత పర్యటన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎడతెరిపి లేని వర్షాలకు సర్వం కోల్పోయి వీధినపడ్డ వరద బాధిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించి భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా వెంకటగిరి, బంగారుపేట, నాయుడుపేటల్లో విస్తృతంగా పర్యటించారు. మంగళవారం ఉదయం 9.15 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరదబాధిత ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ బాధితుల కన్నీరు తుడిచారు.
అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసా కల్పించారు. ఆయన వెంకటగిరి పట్టణం పాతకోట వీధి, పోలేరమ్మ ఆలయం మీదుగా రాజావీధి, కైవల్యానది కూడలి, తహశీల్దార్ కార్యాలయం, తూర్పువీధి, పాతబస్టాండ్, పాలకేంద్రం మీదుగా బంగారుపేట బీసీ కాలనీ, బంగారుపేటలో పర్యటించారు. బీసీకాలనీలో భారీగా ప్రవహిస్తున్న వరదనీటిలోనే రెండు గంటలపాటు కలియతిరిగారు. ఇల్లిల్లూ తిరిగి నీటమునిగిన చేనేత మగ్గాలను పరిశీలిస్తూ, కార్మికులను పలుకరించారు.

అడుగడుగునా బాధితుల ఆక్రందన
వెంకటగిరి నుంచి సాయంత్రం 4.20కి నాయుడుపేటకు బయలుదేరిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారిపొడవునా బాధితులు తాముపడుతున్న బాధలను విన్నవించారు. బీడీ కాలనీలో మోకాలు లోతు బురదలో పర్యటించి బీడీ కార్మికులను పరామర్శించారు. మల్లిక అనే మహిళ భర్త షేక్‌జమీల్ చలిగాలులకు మరణించటంతో ఆమెకు సహాయంగా నాయుడుపేట మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షేక్ రఫీతో రూ.10 వేల చెక్కును ఇప్పించారు. అనంతరం కొత్తబీడీ కాలనీ, లక్ష్మీఅనంతసాగరం, గోమతి, కోళ్లఫారం సెంటర్‌లలో పలువురు బాధితులను పరామర్శించారు. మీకు అండగా తాను పోరాడతానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అనంతరం వాకాడు మండలం గొల్లపల్లికి చేరుకున్నారు.

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి


ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి
♦ వరంగల్‌లో టీఆర్‌ఎస్ గెలిచినా మున్ముందు ప్రజాగ్రహం తప్పదు
♦ దీక్ష విరమణ సభలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి

 సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘వరంగల్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రజాతీర్పు మెజారిటీ ఇచ్చినా  ఓడలు బండ్లు...బండ్లు ఓడలవుతాయి. దీనికి ఎంతో సమయం పట్టదు. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయపార్టీలతో కలసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలోకి పోతాం. అప్పుడు ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  జిల్లా సమగ్రాభివృద్ధి, పలు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాకేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద ఆయన చేపట్టిన రెండురోజుల దీక్ష మంగళవారం సాయంత్రంతో ముగిసింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, సీపీఐ నేత సింగు నర్సింహారావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, లంబాడీ మహిళలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపట్టిన దీక్షకు ప్రజాభిమానం వెల్లువెత్తింది. దీనికి ముందు ఆయన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాదిన్నరలో ప్రజాసమస్యలపై ఖమ్మం జిల్లాకు సీఎం ఒక్కసారైనా వచ్చా రా..? అని  ప్రశ్నించారు. పాలకులు జిల్లాపై తీవ్ర వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నా రు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వా త కేసీఆర్ ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేద న్నారు. రాష్ట్ర విభజనతో ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలు పోయి అన్యాయం జరిగిందన్నారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం ఊసెత్తకుండా కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోం దని పొంగులేటి అన్నారు. ప్రభుత్వం సమస్యలపై స్పందించకపోతే కలసి వచ్చేపార్టీలతో ఆమరణదీక్ష  చేపడతానన్నారు.

వరద బాధితులు పస్తులున్నా కనికరించలేదు


మంచినీళ్లిచ్చే దిక్కులేదు
మానవత్వంలేని సర్కారిది
వరద బాధితులు పస్తులున్నా కనికరించలేదు
బాధితులకు ఇచ్చే సాయంలోనూ వివక్ష
చంద్రబాబుది అడుగడుగునా మోసం.. దగా
ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీల్లో రైతులను మోసం చేశారు
వరదలొచ్చాక కరువు మండలాలు ప్రకటించారు
ఇప్పుడు సర్వే చేస్తే ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుందా?
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘మానవత్వం లేని ప్రభుత్వమిది. సర్వం కోల్పోయిన వారికి కనీసం మంచినీరిచ్చే దిక్కులేదు. పస్తులున్నా కనికరించలేదు. కంటితుడుపుగా ఒకటి రెండు రోజులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. బాధితులకు ఇచ్చే సాయంలోనూ వివక్ష చూపుతున్నారు. కొంతమందికి ఇస్తున్నారు. మరి కొంతమందికి ఇవ్వటం లేదు. కనీసం బాధితులను పరామర్శించిన పాపానపోలేదు. వరద బాధితులను పట్టించుకోరా?’’ అంటూ  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారుపై ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు జీవితమంతా మోసమేనని.. అబ ద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. వరదలకు పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన సీఎం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

 ఆయన మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పరిధిలోని బంగారుపేటలోని వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతోనూ మాట్లాడుతూ... చంద్రబాబు కరువు మండలాలను ప్రకటించిన తీరును దుయ్యబట్టారు. గతంలో 196 కరువు మండలాలను ఆలస్యంగా ప్రకటించి ఎన్యుమారేషన్ సర్వే పూర్తిచేయలేదని గుర్తుచేశారు. కరువు మండలాలపై కేంద్రం చీవాట్లు పెట్టిన తర్వాత మరోసారి 163 కరువు మండలాలను ప్రకటించారని తెలిపారు. మొదట్లో ప్రకటించిన సమయంలో ఈ 163 మండలాలను ఎందుకు ప్రకటించలేదన్నారు. వాస్తవంగా అయితే సెప్టెంబర్ 30కంతా నోటిఫై చేసి అక్టోబర్ రెండో వారంలోపు కేంద్రానికి రిపోర్ట్ చేయాల్సి ఉండగా.. నవంబర్‌లో ప్రకటించారని చెప్పారు. అయితే ఈ రోజుకీ పాతవాటికి సంబంధించి ఎన్యుమరేషన్ చేయకపోవటాన్ని తప్పుబట్టారు. కరువు మండలాల్లో ఇప్పుడు సర్వే చేస్తే ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుందా? అని ప్రశ్నించారు.

 ఎన్నికల ముందో మాట.. తరువాత మరోమాట
 చంద్రబాబు జీవితాంతం మోసాలు.. అబద్ధాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు మాఫీ, ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి ఇస్తానని చెప్పి ఓట్లేయించుకున్నారని గుర్తుచేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలోనూ ఎన్నికల ముందు రూ.1,690 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మాటమార్చారని విమర్శించారు. 2014-15 సంవత్సరానికి రూ.736 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా.. అందులో రూ.254 కోట్లు మాత్రం ఇచ్చారని తెలిపారు. ఇలా అడుగడుగునా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

వైఎస్ జగన్ ఏజెన్సీ పర్యటన డిసెంబర్ 10కి వాయిదా

Written By news on Tuesday, November 24, 2015 | 11/24/2015


విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఏజెన్సీ పర్యటన డిసెంబర్ 10 వ తేదీకి వాయిదాపడింది. ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 2న పర్యటించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మంగళవారం  ఓ ప్రకటనలో తెలిపారు.

విశాఖ ఏజెన్సీలో టీడీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ జీవో జారీ జేసిన విషయం తెల్సిందే. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఓ భారీ ఉద్యమం లేవనెత్తనుంది. అందులో భాగంగా డిసెంబర్ 10న జగన్ చింతపల్లిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం లంబసింగిలో గిరిజనులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు.

అడుగడుగునా వైఫల్యం


అడుగడుగునా వైఫల్యం
 సీఎం చంద్రబాబుపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

సాక్షి ప్రతినిధి, కడప: ‘‘వరద బాధితులు సర్వస్వం కోల్పోయారు. అధికారులు ఇలా వచ్చి అలా చూసి వెళ్లారు. ఎన్ని ఇళ్లు నష్టపోయాయి? ఎంత మంది బాధితులు ఉన్నారు? అన్న విషయాలను ఇష్టమొచ్చినట్లు నమోదు చేసుకుంటున్నారు. నమోదు చేసుకున్నవాటికి పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. స్వయంగా ముఖ్యమంత్రి సైతం ఈ ప్రాంతంలో పర్యటించినా ప్రజలకు ఒరిగిందేం లేదు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాధితులను ఆదుకునేందుకు నిధులివ్వకుండా ముఖ్యమంత్రి అధికారులను దబాయిస్తున్నారని దుయ్యబట్టారు.

వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో సోమవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ‘‘అన్నా.. సర్వస్వం కోల్పోయాం.. మమ్మల్ని పలకరించే నాథుడే లేడు. ఉచితంగా ఇచ్చే బియ్యం కూడా ఒకటి, రెండు ఇళ్లకు ఇచ్చి వెళుతున్నారు. పదిహేను రోజులుగా బతకడమే కష్టంగా ఉంది’’ అని ప్రతి గ్రామంలో వరద బాధితులు ఆయనతో చెప్పుకుని వాపోయారు. అనంతరం రైల్వేకోడూరులోని గుంజనేరు వద్ద జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘25 కిలోలు చొప్పున బియ్యం కొన్ని కుటుంబాలకు మాత్రమే అందించారు. కనీసం పావువంతు బాధితులకు కూడా బియ్యం అందలేదు. 15 రోజులుగా ఉపాధి లేదు. మరో 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి రూ.4 వేలు ఆర్థికసాయం చేయాలి. బాధిత కుటుంబాలన్నింటికీ 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర, ఇతర నిత్యావసర సరుకులు అందించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

 నిధులివ్వకుండా దబాయింపు ఏమిటి?
 వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను దబాయిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం నిధులు, వనరులిస్తేనే అధికారులు ప్రజలకు సహాయ పడగలరని చెప్పారు. అవి ఇవ్వకుండా ఉత్త దబాయింపుల వల్ల ఉపయోగం లేదన్నారు. ‘‘గ్రామ గ్రామాన వరద బాధితులను పలుకరిస్తూ వచ్చాం.. బతకడమే కష్టంగా ఉందని బాధితులు వాపోతున్నారు. వరద సహాయక చర్యలు అరకొరగానే కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి వంద శాతం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం బాధితులకు మద్దతుగా నిలవాల్సిన తరుణమిదే’’ అని చెప్పారు. వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీడియా వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్తే వారి బాధలు, ఆవేదన ఏమిటో విడమరచి చెబుతారని చెప్పారు. మీడియాద్వారానైనా చంద్రబాబులో మార్పు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి వెంట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, పార్టీ రైల్వేకోడూరు సమన్వయకర్త కొల్లం బ్రహ్మనందరెడ్డి, పోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఉన్నారు.

కన్నీరు తుడుస్తూ.. బాసటగా నిలుస్తూ..


కన్నీరు తుడుస్తూ.. బాసటగా నిలుస్తూ..
బాధితులకు అండగా నిలుస్తానని భరోసా
పంట నష్టాన్ని పరిశీలించిన విపక్షనేత
స్పందించని సర్కారు తీరుపై ఆగ్రహం
వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

 
వర్షాలతో కకావికల మయిన పంటలను చూసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో కొట్టుపోయిందని బోరున విలపించిన అన్నదాతను ఓదార్చారు. వారి కన్నీటిని తుడిచారు. వరద బాధిత గ్రామాల్లో నష్టాలను సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సాయం అందేవరకు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటామని అన్నదాతకు భరోసా ఇచ్చారు.  
 
తిరుపతి: ‘ఇళ్లలోకి నీరు వచ్చింది.. వస్తువులన్నీ తడిసిపోయాయి. రేషన్‌కార్డులున్నా కనీసం బియ్యం కూడా ఇవ్వలేదు.. మమ్మల్ని అధికారులు పట్టించుకోలేదం టూ’ అంటూ గురవమ్మ, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు మహిళలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి తన సమస్యను వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. జిల్లాలోని రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో పర్యటించి వరదల్లో నష్టపోయిన రైతులను పరామర్శించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నా రు. నేనున్నాననే భరోసా ఇచ్చారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని పలువురు ఆయన దృష్టికి  తీసుకువచ్చారు. తమ అభిమాన నేతను చూసేందుకు జనాలు రోడ్ల వెంబడి బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటలకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తారన్న సమాచారంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఆయన రాక ఆలస్యం అయినప్పటికీ ఇళ్లకు వెళ్లకుండా అలాగే వేచి చూశారు.

చలించిపోయిన జగన్..
పంట పొలాలన్నీ చెరువులుగా మారటాన్ని చూసి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. వరద కారణంగా జరిగిన పంట నష్టాన్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దారివెంట తనను చూసేందుకు వచ్చిన వారిని పలకరిస్తూ, వారి కష్టాలను అడుగుతూ భరోసానింపే యత్నం చేశారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడండి..
‘ప్రత్యేక హోదా కోసం పోరాడండి’ అంటూ కరకంబాడీ వద్ద సుబ్బరత్నంతో పాటు పలువురు ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ‘మీరు నా వెనుక ఉన్నారు. మీకు నేనున్నానంటూ’ జగన్ వారికి చెప్పి ప్రత్యేక హోదా కోసం కచ్చితంగా పోరాడుతానన్నారు.
 
పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు..
 వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన తమనేతకు స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు పెద్ద ఎ త్తున తరలివచ్చారు. చిత్తూరు జిల్లాలో జరిగిన నష్టాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని జిల్లాలోని నేతలకు సూచించారు. విమానాశ్రయానికి తరలివచ్చిన నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలం, తిరుప తి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత పుల్లూరు అమరనాథ్‌రెడ్డితోపాటు పెద్దఎత్తున జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.


జగన్‌కు ఘన స్వాగతం
రేణిగుంట: వైఎస్సార్ సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో రేణిగుంట న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కార్యకర్తలు, ప్రజలతో నిం డిపోయింది. టెర్మినల్ బయట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది యువకులు ప్ల కార్డులతో ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కడప, చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన ఉదయం 9.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, బి య్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, మాజీఎమ్మెల్యే గాంధీ, నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సి ద్ధారెడ్డి, పుల్లూరు అమరనాథరెడ్డి, ఆంజనేయులు, వి రూపాక్షి జయచంద్రారెడ్డి, అత్తూరు త్రివిక్రమ్, సిరాజ్, శ్రీకాంత్ రాయల్, బాల, మహిళా విభాగం నాయకురా లు మమత, తిరుపతి, శ్రీకాళహస్తికి చెందిన నాయకు లు స్వాగతం పలికారు. రిజర్వుడు లాంజ్‌లో 10 నిమిషాలు పార్టీ నేతలతో మాట్లాడిన జగన్ మోహన్‌రెడ్డి ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో రైల్వే కోడూరుకు బయలుదేరారు.

 మహిళల కన్నీరు తుడిచిన జగన్
 భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి తడిసి ముద్దవుతున్నా తమను అధికారులు పట్టించుకోవడం లేదని కరకంబా డి పంచాయతీ రాజీవ్‌గాంధీకాలనీ మహిళలు వైఎస్సా ర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కంటతడి పెట్టారు. రైల్వేకోడూరు పర్యటన నిమిత్తం రోడ్డు మా ర్గాన వెళుతున్న ఆయనకు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కరకంబాడి వద్ద స్వా గతం పలికారు. రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన మహిళ లు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుని, తమ బాధలు చె ప్పుకుని బోరుమన్నారు. 30 ఏళ్లకు ముందు కట్టించిన ఇళ్ల పెచ్చులు ఊడి ఉరుస్తున్నాయని సమస్యలు ఏకరు వు పెట్టారు. స్పందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి కన్నీళ్లు తుడిచారు. సమస్యను పరిష్కరించే బాధ్యతను శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ బియ్యపు మధుసూదన్‌రెడ్డికి అప్పగించారు. అధికారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆ పార్టీ అత్తూరు సర్పంచ్ హరినాథ్ యాదవ్, నాయకులు గంగారి రమేష్, గురవరాజపల్లె శంకర్‌రెడ్డి, ఆవుల మురళి, గురునాథం యాదవ్ గ్రామ పెద్దలు రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
 

పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదు: వైఎస్ జగన్

Written By news on Monday, November 23, 2015 | 11/23/2015


పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదు: వైఎస్ జగన్
రైల్వేకోడూరు :
భారీవర్షాల తాకిడికి అతలాకుతలమైన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం పర్యటించారు. గుంజనా నది వరదలతో ప్రభావితమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

27 రోజులుగా వర్షబీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సాయం అందడం లేదని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఇంటికి 25 కిలోల చొప్పున బియ్యం, నగదు అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదని.. నిధులిచ్చి అధికారులను పనిచేయమని చెబితే వారు చేస్తారని ఆయన చెప్పారు.
''బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులు, బియ్యం, వనరులు ఇచ్చి.. ఆ తర్వాత అధికారులను ఏమైనా అంటే బాగుంటుంది. కానీ ప్రజలు ముఖ్యమంత్రిని తిట్టకముందే ఆయనే అధికారులను తిడుతున్నారు. ఎంతమందికి మేలు జరిగిందో ప్రజలనే అడిగి తెలుసుకోండి. పనులకు పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 3, 4 వేల రూపాయల డబ్బులు, 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర ఇస్తేనే బతకగలరు. అవేవీ ఇవ్వకుండా అధికారులను తిట్టడం మానవత్వం ఉన్న పని కాదు. ప్రతి గ్రామంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి, తమకేమీ జరగట్లేదని.. బతకడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Popular Posts

Topics :