28 September 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రైతుల చేతిలో బాండ్లు, చెవిలో పువ్వులు

Written By news on Thursday, October 2, 2014 | 10/02/2014


'రైతుల చేతిలో బాండ్లు, చెవిలో పువ్వులు'ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సలహా ఇచ్చారు. రుణ మాఫీ అంశం రైతుల చేతిలో బాండ్లు పెట్టి, వారి చెవిలో పూలు పెట్టినవిధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రైతులను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు.

ఏపిలో గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా పాలన కొనసాగుతోందన్నారు. గాంధీ జయంతి రోజున అసత్యాలు వల్లిస్తున్నారని విమర్శించారు. మద్య నిషేదం అన్న వ్యక్తి ఇప్పుడు డోర్ డెలివరీ ఇస్తున్నారన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారో కేలండర్ విడుదల చేయాలని టిడిపి నేతలను డిమాండ్ చేశారు. కమిటీలు, చర్చల పేరుతో కాలయాపన వద్దన్నారు. జన్మభూమి కార్యక్రమాలలో ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారని ఉమ్మారెడ్డి హెచ్చరించారు.

తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు


తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధిం చిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండు గ తెలుగు ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని బుధ వారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. లోకాన్ని రక్షించే దుర్గామాత ప్రజలందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు

జ్యోతుల నెహ్రుకు ఫోన్ లో వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Wednesday, October 1, 2014 | 10/01/2014

వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. బుధవారం ఫోన్ చేసిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా నెహ్రు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జ్యోతుల నెహ్రు అస్వస్థతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన కాకినాడ సేఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జ్యోతుల నెహ్రును వివిధ రాజకీయ పక్షాల నేతలు పరామర్శించారు

మాటలతో మాయ చేస్తున్నారు


మాటలతో మాయ చేస్తున్నారు
టీడీపీ పాలనపై వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని ధ్వజం
 
హైదరాబాద్: చంద్రబాబు వంద రోజుల పాలనలో పురోగతిపై శ్వేతపత్రం విడుదల చే యాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఈ వంద రోజు ల్లో టీడీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని పే ర్కొంటూ.. తాము ఫలానా పని చేశామని అధికారపక్షం చెప్పగలదా? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా? అని ఆయన సవాలు విసిరారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలపై మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని చంద్రబాబు చెబుతుంటే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం మరోవైపు మద్యాంధ్రప్రదేశ్ అంటున్నారని విమర్శించారు. బెల్ట్‌షాపుల రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేస్తే.. యనమల మాత్రం సెప్టెంబర్ నెలాఖరు కు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ‘వ్యాట్’ వసూళ్లు రావాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ ముగిసేనాటికి రూ.2,314.20 కోట్ల మేరకు రావాల్సిన వసూళ్లు రూ.1,805.13 కోట్లకే ఎందుకు పరిమితమయ్యాయని యనమల ప్రశ్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం తగ్గడానికి వీల్లేదని మంత్రి తాఖీ దులిచ్చారని అన్నారు.

మద్యం నుంచి వచ్చే ఆదాయమే ఖజానాకు శరణ్యమని మంత్రి చెప్ప డం ప్రజలను ఫుల్లుగా తాగండని సందేశమివ్వడమేనన్నారు. బాబు గతంలో తొమ్మిదేళ్ల పాలనలో ఇలాగే ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించా రన్నారు. 2003 జనవరిలోనే 40 వేలకుపైగా బెల్ట్‌షాపులుండేవి. ఇపుడు మళ్లీ అలాగే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ఆదాయాన్ని సమీక్షిస్తూ పెంచుకునే యత్నం చేస్తున్నారన్నారు.  రైతుల రుణమాఫీ గురించి ఎన్నికల్లో చెప్పిందొకటి, ఇపుడు చేస్తున్నది మరొకటని, ఆర్‌బీఐ గురించిగానీ, కోట య్య కమిటీ వేస్తామనిగానీ అపుడు చెప్పలేదని అన్నారు. రుణమాఫీ కోసం సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఓ సంస్థను ఏర్పాటు చే యడమెందుకు? రుణాలన్నీ కట్టేయమని చంద్రబాబు ఒక్కమాట చెబితే చాలు ఆయనే చెల్లిస్తారని సలహాఇచ్చారు.
 

ఫెడరేషన్లు లేని బీసీ కులాలకు సొసైటీలు నియమించాలి

Written By news on Tuesday, September 30, 2014 | 9/30/2014


ఫెడరేషన్లు లేని బీసీ కులాలకు సొసైటీలు నియమించాలి
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం డిమాండ్
పార్టీ బీసీ విభాగం ఏపీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్

 
 సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్లు లేని బీసీ కులాలకు సొసైటీలను ఏర్పాటు చేసి వెనుకబడిన తరగతులకు రుణ సదుపాయం కల్పించాలని వైఎస్సార్‌సీపీ బీసీ ఆంధ్రప్రదేశ్ విభాగం డిమాండ్ చేసింది. పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. మరో ఐదు తీర్మానాలను కూడా సమావేశం ఆమోదించింది. అనంతరం కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో బీసీల్లోని వివిధ కులాల కోసం 9 ఫెడరేషన్లు ఏర్పాటు చేశారని, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఫెడరేషన్లు లేని ఇతర బీసీ కులాలకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఉన్న బీసీ ఫెడరేషన్లకు తగినన్ని నిధులు మంజూరు చేయాలని అన్నారు. బీసీ వృత్తిదారుల రుణాలన్నింటినీ రద్దు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లతోపాటు ప్రభుత్వోద్యోగాలు, ప్రమోషన్లలో బీసీ రిజర్వేషన్లను విధిగా అమలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకానికి  పరిమితులు విధించకుండా అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు.
 
  పార్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించిన గట్టు రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యూరు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ బీసీ విభాగం అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశారు. జిల్లా నేతలు జి.రమాదేవి, అవ్వారు ముసలయ్య, దేవరకొండ శ్రీనివాసరావు, కె.గురవాచార్య, ఎం.రాజాయాదవ్, డాక్టర్ ఎ.మధుసూదన్, టి.పుల్లయ్య , ఎం.పురుషోత్తం, ఎం.ప్రభాకర్, బి.రాజశేఖర్, ఎం.హరి, కె.ఎన్.రాజా, కత్తి రాజకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

హామీలనే మాఫీ చేస్తున్న చంద్రబాబు


* ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
రైతులకిచ్చిన హామీలు అమలు చేయకపోతే పోరాటమే

 సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తానిచ్చిన హామీలనే మాఫీ చేసే యత్నంలో పడిపోయారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం దుయ్యబట్టింది. బాబు ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతుల తరపున పోరాటం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, రైతుల సమస్యలపై క్రియాశీలంగా ఉంటూ ఎప్పటికపుడు వాటి పరిష్కారానికి ఉద్యమించాలని తీర్మానించింది. రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి అధ్యక్షతన సోమవారం మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై లోతుగా చర్చించారు. పార్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి హాజరైన ఈ సమావేశంలోనే తొలి అధ్యక్షునిగా నాగిరెడ్డి పదవీ స్వీకారం చేశారు. షరతుల్లేకుండా రైతుల పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, వ్యవసాయ పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, రూ.ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదని సమావేశం దుయ్యబట్టింది. జిల్లాల వారీ గా పరిస్థితిని సమీక్షిస్తూ మొత్తం మీద ఒక్క ప్రత్తి మినహా అన్ని పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది.  కనీస మద్దతు ధరను నామమాత్రంగా ప్రకటిస్తున్నా కేంద్రం వైఖరిని రాష్ట్రం ప్రశ్నించకపోవడాన్ని సమావేశం గర్హించింది.
 
 బలవంతంగా భూసేకరణ చేస్తే ఊరుకోం..
 రాజధాని నిర్మాణం పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తే వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రతిఘటిస్తుందని సమావేశం హెచ్చరించింది. స్వచ్ఛం దంగా ముందుకు వచ్చే రైతుల నుంచే ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని తీసుకుంటామని తొలుత చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇపుడు బల వంతంగానైనా సరే తీసుకుంటామని మాట్లాడుతున్నారని, ఇదెంత మాత్రం శ్రేయస్కరం కాదని రైతు ప్రతినిధులు హెచ్చరించారు. సమావేశానంతరం అధ్యక్షుడు నాగిరెడ్డి, విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ... ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రైతుల తరపున ఎలా పోరాడాలో అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. షరతుల్లేకుండా పంట రుణాల మాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. సమావేశంలో జిల్లాల రైతు నేతలు కొల్లి రాజశేఖర్, శ్రీధర్, రాజబావు, మధుసూదనరెడ్డి, ప్రసాదరెడ్డి , ఆదికేశవరెడ్డి , సుబ్రమణేశ్వరరెడ్డి,సుబ్బారెడి, శివరామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

Popular Posts

Topics :