01 June 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలి

Written By news on Saturday, June 7, 2014 | 6/07/2014

వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తుండటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సభ కోసం పేదల ఇళ్లు కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని, తొలి సంతకం చేసే ఫైలులో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలుపై టీడీపీ నేతలు స్పష్టత ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.


కొత్త రాజధాని నిర్మాణం కోసం ఓ వైపు నిధులు వసూలు చేస్తూ.. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తుండటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తప్పుపట్టారు. అయితే వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం తగదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రమోహన్ రెడ్డి దష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి టీడీపీ ఎంత ఖర్చు చేసిందో చంద్రబాబు ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఆ వృధా ఖర్చులో భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్

ఆ వృధా ఖర్చులో భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
రాజమండ్రి : తాము అధికారం కోల్పోయినందుకు సమీక్ష చేయలేదని సంస్థాగత తప్పులను అధిగమించడంపై చర్చించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓడిన స్థానాల్లో ఎందుకు దెబ్బ తగిలిందో విశ్లేషించుకున్నామని ఆయన చెప్పారు.  తాము గతంలో ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తు చేశారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి 9 మంది ఎంపీలు, 70మంది ఎమ్మెల్యేలకు తమ పార్టీ సంఖ్య పెరిగిందన్నారు.

రైతు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం డ్రామా అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏ తేదీ నుంచి రుణాలు మాఫీ అవుతాయో చెబితేనే తొలి సంతకానికి అర్థం ఉంటుందన్నారు. రుణమాఫీపై ఎల్లో మీడియా, చంద్రబాబు ఓ పథకం ప్రకారం డ్రామా నడిపిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. కొత్త రాజధానికి డబ్బులు లేవని ఓవైపు చందాలు అడుగుతున్న ఆయన మరోవైపు ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

ఇటువంటి సమయంలో ఏ అవసరం లేకున్నా అంత ఖర్చు చేయడం ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రూ.5వేలు, రూ.10వేలు కూడా రాజధాని కోసం విరాళాలు అడుగున్నవారు ప్రమాణ స్వీకారానికి అంత ఖర్చు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. అటువంటి కార్యక్రమానికి తాను వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. ఆ వృధా ఖర్చులో తాను భాగస్వామిని కాలేనని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తేవాలని తమకు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి అంశంపైనా పోరాడుతామని ఆయన తెలిపారు.

తెల్లవారుజాము వరకూ సమీక్షలు

బాబు మోసాన్ని ఎండగడదాం: వైఎస్ జగన్
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
మరో 15 రోజుల్లోనే బాబు అసలు స్వరూపం బయటపడుతుంది
ఆయన మోసాలను ఎల్లో మీడియా కప్పిపుచ్చడానికి చూస్తోంది
కాబట్టి వాటిని ఎండగట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది
కార్యకర్తలకు అండగా ఉందాం.. ప్రజాసమస్యలపై పోరాడుదాం
సార్వత్రిక ఫలితాలపై ముగిసిన తొలి విడత సమీక్షలు
కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపిన జగన్

 
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘మోసాలతో మాయ చేసి అధికారం చేపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు అసలు స్వరూపం కేవలం 15 రోజుల్లోనే ప్రజలకు తెలియబోతోంది. గతంలో మద్యపాన నిషేధం ఎత్తివేసిన సమయంలో బాబుకు వెన్నుదన్నుగా నిలిచినట్టే.. ఇప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 వంటి ఎల్లో మీడియా సంస్థలు ఆయనకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయన మోసాలు బయటకు రానీయకుండా కంటికి రెప్పలా బాబును కాపాడనున్నాయి. బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేద్దాం. కార్యకర్తలకు బాసటగా నిలుద్దాం. గ్రామ కమిటీలను పునరుజ్జీవింపజేసి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఆ కమిటీల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్దాం. పోరాటాల ద్వారా ప్రజలకు అండగా నిలుద్దాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
 సార్వత్రిక ఎన్నికల గెలుపు ఓటములపై రాజమండ్రి వేదికగా బుధవారం నుంచి శుక్రవారం వరకూ.. మూడు రోజులపాటు నిర్వహించిన తొలి విడత సమీక్షా సమావేశాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో 8 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఓటములపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించి నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. పేరుపేరునా కార్యకర్తలను పలకరిస్తూ వారిలో మనోధైర్యం నింపారు. చివరి రోజైన శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆచంట, పాలకొల్లు, ఉండి, నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు.
 
 తెల్లవారుజాము వరకూ కొనసాగిన సమీక్షలు
 ఆయా నియోజకవర్గాలకు కేటాయించినదానికంటే ఎక్కువ సమయం వెచ్చించడంతో.. సమీక్షల షెడ్యూల్‌లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటూ వచ్చింది. తొలి రోజు నుంచీ సమీక్షలు అర్ధరాత్రి దాటేవరకూ కొనసాగుతూ వచ్చాయి. కార్యకర్తలు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి వారి సూచనలు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సమీక్షలు తెల్లవారుజామున ఐదు గంటల వరకూ సాగాయి. శుక్రవారం ఇదే తరహాలో అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సమీక్షలో, గ్రామ కమిటీలు, మండల కమిటీలను పునర్వ్యవస్థీకరించి, నిత్యం ప్రజలతో మమేకమయ్యేలా చూడాలని పి.గన్నవరం గ్రామానికి చెందిన బంగారు నాయుడు జగన్‌కు సూచించారు.
 
  వైఫల్యాలకు ఒకరిపై మరొకరు కారణాలు నెట్టుకోవడం మాని, ఇకనైనా నేతలు సమన్వయంతో పరస్పరం సాయపడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పెనుమంట్ర సర్పంచ్ దాట్ల రంగవతి సూచించారు. ‘ఓడినా మేమేమీ అధైర్యపడడం లేదు. మీరూ అధైర్యపడకండి. గెలుపు అవకాశం ఉన్న పార్టీగా వైఎస్సార్ సీపీని బలోపేతం చేద్దాం’ అని ఉండి కార్యకర్త అర్చారావు అన్నారు. ‘మీకోసం నాలుగున్నరేళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రానున్న ఐదేళ్లు కూడా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం. అవసరమైతే ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నానని కుటుంబం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ఆచంటకు చెందిన డాక్టర్ మునుబాబు అన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సమీక్ష సమావేశాల్లో నాయకులు, కార్యకర్తల మనోగతాలను తెలుసుకునేందుకే జననేత అధిక ప్రాధాన్యతనిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ విధివిధానాలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
 
 అధికారం కన్నా విశ్వసనీయత ముఖ్యం: జగన్
 నాయకులకు అధికారం కన్నా విశ్వసనీయత ముఖ్యమని, విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడే ప్రజలు మనల్ని ఆదరిస్తారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సమీక్షల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘‘రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలిచాం. రానున్న రోజుల్లో పదునైన వ్యూహాలతో పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేద్దాం. దేశంలో ఇప్పటివరకూ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు భిన్నంగా, బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుంచే కార్యోన్ముఖులు కావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ కూటమి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం 5.60 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ తెచ్చుకుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా రుణమాఫీ హామీతో చంద్రబాబు ప్రజలను నమ్మించగలిగారు. మరో 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది.
 
 రైతులు రుణాల కోసం బ్యాంకర్ల వద్దకు వెళ్తారు. పాత రుణాలు మాఫీ చేస్తేనే కానీ కొత్త రుణాలు ఇవ్వరు. అప్పుడు చంద్రబాబు మోసం బయటపడుతుంది. రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు’’ అని అన్నారు. ‘‘నేను కూడా రైతు రుణ మాఫీ హామీ ఇచ్చి ఉంటే మూడు నెలలు తిరక్కుండానే మీరంతా నా దగ్గరకు వచ్చి ఆచరణ సాధ్యం కాని హామీలు ఎందుకిచ్చావన్నా? గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామన్నా.. అని అనేవారు. ఆ పరిస్థితి రాకూడదనే నేను ఆ హామీ ఇవ్వలేదు. నేను ముఖ్యమంత్రి కావాలనుకునే లక్ష్యం వెనుక ఒక బలమైన ఆశయం ఉంది. ఒకసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు వరుసగా తిరిగి ఎన్నుకునేలా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ఓటమిపై దిగులు చెందాల్సిన పనిలే దు. ధైర్యంగా ఉండండి. భవిష్యత్ మనదే’’ అంటూ జగన్ కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు.

చంద్రబాబుకు ఫోన్లో జగన్ అభినందనలు

Written By news on Friday, June 6, 2014 | 6/06/2014

వైఎస్ జగన్ కు చంద్రబాబు ఆహ్వానంవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: తన ప్రమాణ స్వీకారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వైఎస్ జగన్ కు ఫోన్ చేసి ఈ మేరకు ఆహ్వనం పలికారు. ఎల్లుండి తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. చంద్రబాబుకు ఫోన్లో జగన్ అభినందనలు తెలిపారు. జగన్ ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఆర్భాటంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం రాత్రివేళ జరగనున్న నేపథ్యంలో రెండు వేల హైమాస్ట్ లైట్లను సభాప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 480 అడుగుల వేదికను పూర్తిగా కవర్ చేసేలా ఐరన్ బారికేడ్లను నిర్మించారు. దాంతో పాటు రెయిన్ ప్రూఫ్ టెంట్లను హైదరాబాద్ నుంచి తెప్పించి ఏర్పాటు చేస్తున్నారు.

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్వీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు : చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం గుంటూరు బస్టాండ్‌ సెంటర్‌లోని రోడ్డు పక్కన వుండే చిరువ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఆయన ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వెళ్లే మార్గాలకు ఇరువైపుల వున్న దుకాణాలను అధికారులు శుక్రవారం కూల్చివేశారు. రోజు పనిచేస్తే కానీ పూట గడవలేని తమకు బాబు ప్రమాణ స్వీకారం ఉపాధి లేకుండా చేస్తుందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ముస్తఫా అధికారుల తీరును తప్పుపట్టారు. కూల్చివేతలను అడ్డుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధితుల పక్షాన ఆయన చేస్తున్న ఆందోళనను అడ్డుకుని, అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం

ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం
* ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం
రికార్డు స్థాయిలో లోక్‌సభ సభ్యుల ప్రమాణం
సంప్రదాయ దుస్తులు, పలకరింపులు, అభినందనలతో ఉల్లాస వాతావరణం
మోడీ సహా 300 మందికిపైగా తొలిసారి ఎన్నికైన వారే
నేడు మిగతా వారితో ప్రమాణం.. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక

 
గురువారం లోక్‌సభలో ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక
 
న్యూఢిల్లీ: ప్రధానితో సహా రికార్డు స్థాయిలో 510 మంది కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు, నేతల పలకరింపులు, పరస్పర శుభాకాంక్షలతో 16వ లోక్‌సభ సమావేశాల రెండో రోజు పండుగ వాతావరణం నెలకొంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 300 మందికిపైగా ఎంపీలు తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన వారే కావడం విశేషం. దీంతో సభలో ఏకత్వంలో భిన్నత్వం ప్రస్ఫుటించింది. ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ గురువారం భారీ సంఖ్యలో ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక్క రోజులోనే 510 మంది ప్రమాణం చేయడం మరో విశేషం. చాలా మంది తమ మాతృభాషలోనే ప్రమాణం చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు. తెల్లటి కుర్తా పైజామాలో సభకు వచ్చిన ప్రధాని మోడీ సభ్యుల హర్షధ్వానాల మధ్య తొట్టతొలిగా దేవునిసాక్షిగా హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.
 
 తర్వాత బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రమాణం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు హిందీలో ప్రమాణం చేయగా.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జలవనరుల మంత్రి ఉమాభారతి, మరో మంత్రి హర్షవర్ధన్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అలాగే ఇతర కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత్‌కుమార్, సిద్ధేశ్వర  కన్నడలో... సర్వానంద సోనోవాల్ అస్సామీలో.. జుయల్ ఓరం ఒడియాలో ప్రమాణ పత్రాన్ని చదివారు. వరుసకు సోదరులైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కూడా ఒకరి తర్వాత మరొకరు హిందీలో ప్రమాణం చేశారు. ప్రమాణం పూర్తయ్యాక వరుణ్ తన సీటు వద్దకు వెళ్తూ సోనియాకు వందనం చేశారు.
 
అయితే ఆయన రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడంతో సోనియా ఆ విషయాన్ని గుర్తు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌తో పాటు ఆయన కోడలు డింపుల్, ఇద్దరు మేనల్లుళ్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అన్నాడీఎంకే సభ్యుల్లో అత్యధికులు తమిళంలో.. పశ్చిమబెంగాల్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషల్లోనే ప్రమాణం చేశారు. కొత్త రాష్ర్టం తెలంగాణ నుంచి ప్రమాణం చేసిన మొదటి ఎంపీగా జి. నగేశ్ (టీఆర్‌ఎస్) ప్రత్యేకంగా నిలిచారు. మొత్తానికి అధికార, విపక్ష సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకోవడంతో లోక్‌సభలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. శుక్రవారం మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఎన్నిక జరగ నుంది. రెండో రోజు దాదాపు 30 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. తెలంగాణకు చెందిన మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకతను చాటుకున్నారు.
 
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 37 మంది ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోక్‌సభ సభ్యులు కూడా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలకు గాను తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ హాజరుకాలేదు. తెలంగాణలో 17 స్థానాలుండగా.. మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన 16 మంది ఎంపీల్లో ఇద్దరు గైర్హాజరయ్యారు. ముందుగా కేంద్ర మంత్రులు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్‌గజపతి రాజు హిందీలో ప్రమాణం చేశారు. తర్వాత మధ్యాహ్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిగతా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.
 
 ఎంపీలు కొత్తపల్లి గీత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డాక్టర్ రవీంద్రబాబు, గోకరాజు గంగరాజు, మాగంటి వెంకటేశ్వరరావు, కేశినేని శ్రీనివాస్, జయదేవ్ గల్లా, మాల్యాద్రి శ్రీరాం, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, వి.వరప్రసాద్‌రావు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయగా.. డాక్టర్ కంభంపాటి హరిబాబు, తోట నర్సింహం, మురళీమోహన్, కొనకళ్ల నారాయణ రావు, రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ైవె..ఎస్.అవినాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తెలుగులో ప్రమాణం చేశారు. ఇక కింజారపు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 4.25 గంటలకు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. బాల్క సుమన్, బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత , కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎ.పి.జితేందర్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కడియం శ్రీహరి ఆంగ్లంలో ప్రమాణం చేయగా సి.హెచ్.మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుగులో.. జి.నగేశ్, బండారు దత్తాత్రేయ, నంది ఎల్లయ్య హిందీలో.. అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు.

అధైర్యం వద్దు.. భవిష్యత్ మనదే: వైఎస్ జగన్

* గ్రామ కమిటీలను పటిష్టం చేస్తాం..
ప్రతి నెలా సామాజిక, రాజకీయ అంశాలపై చైతన్యం చేసే కార్యక్రమాలు
రెండోరోజు అరకు, విజయనగరం, అమలాపురం ఎంపీ నియోజకవర్గాలపై సమీక్ష
పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపిన జగన్‌మోహన్‌రెడ్డి
కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా పార్టీ యంత్రాంగమంతా తోడు ఉంటుంది

 సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘ప్రతి కార్యకర్తకూ నాతో పాటు పార్టీ యంత్రాంగమంతా అండగా ఉంటుంది. వారికి ఏ చిన్న కష్టమొచ్చినా కలసికట్టుగా పోరాడదాం. ఏ ఒక్కరూ అధైర్యపడనవసరం లేదు. అధికారంలోకి రాలేదనే దిగులు అసలే వద్దు. భవిష్యత్తు మనదే. భరోసాతో ముందుకు కదలండి. ఏ కార్యకర్తకు ఏ చిన్న కష్టమొచ్చినా స్థానిక నాయకులే కాదు.. ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులంతా ఏకమై అండగా ఉండాలి. అవసరమైతే పక్కనున్న జిల్లాల నుంచి కూడా నేతలు తరలి రావాలి.
 
 కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో చేపట్టిన పార్టీ సమీక్షలో రెండోరోజైన గురువారం అరకు, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటములపై అక్కడి నాయకులు, కార్యకర్తలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. సంస్థాగతంగా నెలకొన్న సమస్యలతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఆయా నియోజకవర్గాల నేతలు, గెలుపొందిన ఎమ్మెల్యేలకు రానున్న ఐదేళ్లలో అవలంభించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.
 
 రెండోసారీ గెలవాలి..
 కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ‘తొలిసారి గెలవడం గొప్పకాదు. పదవీకాలంలో విశ్వసనీయతతో పనిచేసి వారి మధ్యే ఉంటూ వారి సమస్యలపై పోరాడగలగాలి. అలా చేస్తూ రెండోసారి ప్రజలతో ఎన్నుకోబడినప్పుడే నాయకుడిగా మనకు నిజమైన పాస్‌మార్కులు లభించినట్టు’ అని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామ కమిటీలను పటిష్టం చేసి, తెలుగుదేశం ప్రభుత్వం అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలను, మోసాలను వాటి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి నెలా సామాజిక, రాజకీయ అంశాలపై చైతన్యం చేసే కార్యక్రమాలు చేపడతామని, అందుకు కావాల్సిన మెటీరియల్‌ను అవసరమైతే హైదరాబాద్ నుంచి పంపిస్తామని చెప్పారు. పార్టీ యువతకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు.

 ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు తపన..

 ‘మనం బలమైన ప్రతిపక్షంగా అవతరించాం. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వపరంగా జరిగే లోపాలను ఎత్తి చూపేందుకు బలమైన ప్రతిపక్షం కావాలని అధికార పక్షం కోరుకుంటుంది. కానీ మన రాష్ర్టంలో అధికారం చేపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రజలకు సేవచేయడానికంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న తపనతో పనిచేస్తారు’ అని జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు చేసే మోసాలను కప్పిపుచ్చేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 వంటి మీడియా సంస్థలు నిత్యం కంటికిరెప్పలా పనిచేస్తాయి. ఈ శక్తులన్నీ కలిపి చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు మనం సిద్ధంగా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ టార్గెట్‌గా అప్పుడే కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు డబ్బు ఎర చూపి వార్ని తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి. అక్రమ కేసులు కూడా బనాయిస్తారు. కార్యకర్తలకు అండగా నిలవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది’’ అని సూచించారు.
 
 బాబు బండారం త్వరలోనే బయటపడుతుంది..
 ‘‘మరో పదిహేను రోజుల్లో వర్షాలు పడనున్నాయి. రైతులు రుణాల కోసం బ్యాంకర్ల వద్దకు వెళ్తారు. పాత రుణాలు చెల్లిస్తే కానీ వారికి కొత్త రుణాలు ఇవ్వరు. అప్పుడు చంద్రబాబు బండారం బయటపడుతుంది. ఇదొక్కటే కాదు.. ఆయన ఇచ్చిన అబద్ధపు హామీలు, మోసాలన్నీ ప్రజలందరూ త్వరలోనే తెలుసుకుంటారు. బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు కర్తవ్యాన్ని నిర్దేశించారు.

గ్రామస్థాయి నుంచి బలోపేతం దిశగా వైఎస్పార్ సీపీ అడుగులు

Written By news on Thursday, June 5, 2014 | 6/05/2014

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విశ్లేషిస్తూనే, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా, ప్రతి కార్యకర్తలో మనోస్థైర్యాన్ని నింపే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యేందుకు దారితీసిన పరిస్థితులపై లోతైన పరిశీలన చేపట్టింది. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, పురోగమించే దిశగా ఎన్నికల ఫలితాలపై క్షేత్రస్థాయి సమీక్షకు శ్రీకారం చుట్టింది.

ఆ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాజమండ్రిలో రెండోరోజూ క్షేతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి కార్యకర్తనూ పేరుపేరునా పలకరించారు. అరకు, అమలాపురం, విజయనగరం జిల్లాల నేతలతో వైఎస్ జగన్ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో కార్యర్తల సూచనలు, సలహాలు వైఎస్ జగన్ ఓపిగ్గా విన్నారు. మరికొందరు కార్యకర్తలు, నాయకులు పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని అధినేతకు విన్నవించారు.

ప్రజల కోసమే బతుకుతున్నట్లు బిల్డప్పులిచ్చి...

ప్రజల కోసమే బతుకుతున్నట్లు బిల్డప్పులిచ్చి...
హైదరాబాద్: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రమాణస్వీకారానికి హంగు-ఆర్భాటాలు అవసరమా అని నిలదీశారు. ప్రజల కోసమే బతుకుతున్నట్లు బిల్డప్‌లు ఇచ్చే చంద్రబాబు మాటలన్నీ వట్టి మాటలేనని తేలిపోయిందన్నారు.

ప్రజా ప్రయోజనాల కంటే పబ్లిసిటీ ముఖ్యమన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, విల్లాల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి  ప్రజలను చందాలు ఇవ్వాలని కోరిన చంద్రబాబు ఆ డబ్బునే మంచినీళ్లలా ఖర్చుపెట్టడం సమంజసమా అని శ్రీకాంత్‌రెడ్డి అడిగారు.

ఇక పోరాటమే మన పంథా

ఇక పోరాటమే మన పంథా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల ఫలితాల సమీక్ష.. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను విడివిడిగా నిర్వహించారు. బుధవారం నిర్వహిం చాల్సిన అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పాలకొండ నియోజకవర్గ సమీక్షను గురువారానికి వాయిదా వేశారు. ఆ నియోజవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ సీజీసీ సభ్యుడు పాలవలస రాజశేఖరం జగన్‌తో సమావేశమై పార్టీ పరిస్థితిని వివరించారు. కాగా విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ స్థానాల సమీక్ష కూడా గురువారం నిర్వహిస్తారు.

శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని పార్టీ అభ్యర్థులు, ముఖ్యనేతలతో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. మొదట శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంతో సమీక్ష ప్రారంభించారు. అనంతరం ఆమదాల వలస, పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట, పలాస,ఇచ్ఛాపురం నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ సమీక్షలు కొనసాగాయి. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడానికి కారణాలపై నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీపట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్లుగా మలచుకోవడంలో కొంత వెనుకబడ్డామని నేతలు చెప్పారు. అదే విధంగా సంస్థాగత నిర్మాణం, ఇతరత్రా అంశాలపై కూ డా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ కారణాలను విశ్లేషిస్తూనే పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సి చర్యలను సూచించాలని చెప్పారు.

 ప్రజల పక్షాన నిలబడదాం
 పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలబడటంలో పార్టీ అందరికంటే ముందుంటుందన్నారు. రాష్ట్ర ప్రగతికి అవసరమైన విధంగా ప్రజాపోరాటాలు చేస్తుం దన్నారు. అంశాల ప్రాతిపదికన పార్టీ ఎప్పటికప్పుడు స్పష్టమైన విధానా నిర్ణయాలతో ప్రజ లకు అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి పోరాటపథంలో సాగుతామని చెప్పారు. ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన అన్ని హక్కులను కాపాడతామన్నారు. అదే విధంగా పార్టీని పంచాయతీస్థాయి నుంచి అభివృద్ధి పరిచేందుకు సంస్థాగత విషయాలపై దృష్టి సారిస్తామని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

 అందుకోసం తాను త్వరలో జిల్లా పర్యటనలకు కూడా వస్తానన్నారు. పంచాయతీ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో పార్టీ పటిష్టతకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తామని చెప్పారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఏ ఒక్కరు అధైర్య పడవద్దన్నారు. కేవలం 1.93 శాతం ఓట్ల తేడాతోనే పార్టీ వెనుకబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాబట్టి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉం దని.. దాన్ని అందుకునే దిశగా పార్టీని పటిష్ట పరుస్తామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పార్టీ కార్యకర్తలకు తాను ఎళ్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కిందిస్థాయి కార్యకర్త కూడా తనతో నేరుగా మాట్లాడవచ్చని.. పార్టీ పటిష్టతకు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని చెప్పారు. నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా రూపొం దించడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమీక్ష  సమావేశాలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, వి.కళావతిలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూరావు, నర్తు రామారావులు పాల్గొన్నారు. వీరితోపాటు పార్టీ నేతలు పిరియా సాయిరాజ్, వరుదు కల్యాణి, హనుమంతు కిరణ్, దుప్పల రవీంద్ర,  వై.వి.సూర్యనారాయణ, ధర్మాన పద్మప్రియ, అంధవరపు సూరిబాబు, కిల్లి వెంకట సత్యనారాయణ, పాలవలస విక్రాంత్, సువ్వారి అనిల్ కుమార్, బొడ్డేపల్లి రమేష్, కూర్మాన బాలకృష్ణ,  పేరాడ తిలక్, సలాన మోహనరావు, చింతాడ గణపతి, సత్తారు సత్యం, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్, ఆరంగి మురళీ, టి.కామేశ్వరిలతోపాటు పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.

బంగారు తెలంగాణ నిర్మాణంలోభాగస్వాములమవుతాం

బంగారు తెలంగాణ నిర్మాణంలోభాగస్వాములమవుతాం
 పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 మణుగూరు, న్యూస్‌లైన్ : బంగారు తెలంగాణ నిర్మాణంలో వైఎస్సార్ సీపీ భాగ్యస్వామ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని పార్టీ మండల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ శాసన సభా ఉప నేతగా తనను ఎంపిక చేసిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం అసెంబ్లీ లోపల, బయట నిర్మాణాత్మకంగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టే ్రపజా సంక్షేమ కార్యక్రమాలను స్వాగతిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతామన్నారు.

 అసెంబ్లీలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై చర్చిస్తూ పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ ముందుంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో తాను తీసుకొచ్చిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి వాటిని త్వరిత గతిన పూర్తిచేయడానికి కృషిచేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని తాగునీరు, సాగునీరు.బొగ్గుగనుల ఏర్పాటు, బొగ్గు  ఆదారిత పరిశ్రమల ఏర్పాటుకు పాటుపడాతనన్నారు.

 నియోజకవ ర్గంలో ప్రవిహ స్తున్న గోదావరి జాలాలను సాగునీరు, తాగునీటి కోసం సద్వినియోగం చేసుకొని ప్రజల దాహంతోపాటు నియోజవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. నియోజకవర్గంలోని బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నందున కొత్త గనుల, ఎన్‌టీపీసీ, 500ల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న రెగులగండి కాల్వలు, రూ. 5 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం, సింగిరెడ్డిపల్లి లిఫ్టు, కిన్నేరసాని కాల్వల నిర్మాణం పూర్తి చేయడానికి పాటుపడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే నియోజకర్గంలోని వివిధ విభాగాల అధికారులతో చర్చించి సమస్యలను తెలుసుకుంటానన్నారు.

 పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు సరైన ప్యాకేజీ అందడంతోపాటు ఆ గ్రామాలను జిల్లాలోనే కొనసాగేలా కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మణుగూరులోని సింగరేణి గనుల్లో పంచ్‌ఎంట్రీ ఏర్పాటు కోసం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కేంద్రాన్ని కలిసి అనుమతి తీసుకొస్తామన్నారు. పంచ్‌ఎంట్రీ ఏర్పాటు వల్ల ఇటీవల మణుగూరు ఏరియా నుంచి బదిలీ అయిన కార్మికులు మళ్లీ ఇక్కడే పనులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏరియాలో కొత్తగనులు ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

అందుకు తన వంతు సహాయ సహాకారాలు ఉంటాయన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పాలకాలపాటి చంద్రశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఆవుల నర్సింహారావు, మండల నాయకులు పెద్ది నాగకృష్ణ, గాండ్ల సురేష్, హరగోపాల్, మెడ నాగేశ్వరరావు, ముసలి శ్రీనివాస్,  ఈసాల ఏడుకొండలు, మిట్టపల్లి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకుల్లో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించాలి

వాల్మీకుల్లో ప్రాంతీయ  వ్యత్యాసాలు తొలగించాలి
 వైఎస్ జగన్‌కు వీఆర్‌పీఎస్ నేతల వినతి

 కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్:వాల్మీకుల్లో ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి, ఎస్‌టీ జాబితాలో చేర్చేందుకు పూర్తి సహకారం అందించాలని వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మంగళవారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ నేతలు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం అందించినట్లు సుభాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేర్చే అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చిన విషయాన్ని గుర్తు చేశామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న తెలుగుదేశం ప్రభుత్వాలు వాల్మీకులకు ఇచ్చిన హామీని విస్మరించకుండా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వాల్మీకులకు మద్దతుగా నిలవాలని కోరామన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వాల్మీకులు ఎస్‌టీ రిజర్వేషన్‌లో కొనసాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వాల్మీకుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సుభాష్ పేర్కొన్నారు.

 జెడ్పీ చైర్మన్ పీఠం వాల్మీకులకే..: గతంలో ప్రకటించిన విధంగానే కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వాల్మీకులకే కేటాయిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వేరే సామాజిక వర్గానికి  జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జగన్ చెప్పినట్లు సుభాష్ పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన వారిలో వీఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, రాష్ట్ర కార్యదర్శి జీ రాంభీంనాయుడు,   గోపి, మల్లేష్, గోవర్ధన్, గణేష్ ఉన్నారు.

అండగా ఉంటాం

అండగా ఉంటాం
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :‘అండగా ఉంటాం... మీరేమీ భయపడవద్ద’ని...ధవళేశ్వరం పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పడవ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను ఆయన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం పరామర్శించారు. ఆయన జరిగిన సంఘటనను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటకుపైగా ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి బాధను పంచుకున్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, అయితే మీ అందరికీ తోడుగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మృతురాలు రాజేశ్వరి తల్లి సుగుణ, వృద్ధురాలు అయిన జ్యోతి తల్లి, ఇతర మృతుల కుటుంబాల సభ్యుల వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు.

  వారి కన్నీటిని ఆయన చేతితో తుడిచారు. ఏడవ వద్దని, చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా కొండంత అండగా ఉంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. చాలా సమయం బాధితులతో పాటు అలాగే కిందకూర్చుని మాట్లాడి వారిని ఓదార్చారు. మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించిన ఆయన పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను త్వరగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆసుపత్రి వైద్యాధికారులకు సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి రాకతో తమ గుండెల్లో కొంత బాధ తగ్గినట్టయిందని బాధిత కుటుంబాలు తెలిపాయి.
 

వైఎస్సార్ సీపీ సమీక్షలో నేటి షెడ్యూల్

అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి
 పాలకొండ    9.00- 9.30
 సాలూరు    9.30-10.00
 పార్వతీపురం    10.00- 10.30
 కురుపాం    10.30- 11.00
 అరకు    11.00-11.30
 పాడేరు    11.30-12.00
 
 అమలాపురం పార్లమెంట్ పరిధి
 మండపేట    12.30-1.00
 రామచంద్రపురం    1.00-1.30
 కొత్తపేట    1.30-2.00
 భోజన విరామం 2.00-2.30
 
 విజయనగరం పార్లమెంట్ పరిధి
 ఎచ్చెర్ల    2.30-3.00
 రాజాం    3.00-3.30
 విజయనగరం    3.30-4.00
 చీపురుపల్లి    4.00-4.30
 గజపతినగరం    4.30-5.00
 నెల్లిమర్ల    5.00-5.30
 బొబ్బిలి    5.30    -6.00
 
 ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం
 కైకలూరు    6.00- 6.30
 నూజివీడు    6.30-7.00
 దెందులూరు    7.00-7.30
 చింతలపూడి    7.30-8.00
 ఏలూరు    8.00-8.30
 పోలవరం    8.30-9.00
 ఉంగుటూరు    9.00-9.30

భవిష్యత్‌పై భరోసాతో ముందుడుగు వేద్దాం

కదనపథంలో..కదం తొక్కుదాం
 గెలుపు ఎవరినైనా వరించొచ్చు గాక.. మడమ తిప్పని పోరాటమే ధీరుని లక్షణం. నాలుగున్నరేళ్లు జనపక్షాన అలుపెరగని కదనం సాగించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్షనేత గా రెట్టింపు ధీరత్వంతో పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. ‘నువ్వా, నేనా’ అన్నట్టు సాగిన ఎన్నికల పోరులో ‘ఫొటో ఫినిష్’ లాంటి అతిస్వల్ప వ్యత్యాసంతో అధికారం చేజారినా.. ప్రజల తరఫున పోరులో మరింత కాకలు తీరాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అధికారపక్షం ఏ మాత్రం జనకంటక విధానాలకు ఒడిగట్టినా.. ఎండగట్టాలని ఎలుగెత్తారు.   

 సాక్షి, రాజమండ్రి :‘నాలుగున్నరేళ్లు అలుపెరగని పోరు సాగించాం. అధికారంలోకి వస్తామని భావించాం. దొంగ హామీలతో చంద్రబాబు ప్రజలను మాయచేసి గెలిచారు. బాబు మోసాలను ఎండగడదాం. ప్రజల పక్షాన పోరాడదాం. భవిష్యత్‌పై భరోసాతో ముందుడుగు వేద్దాం’ అంటూ బుధవారం రాజమండ్రి వేదికగా ప్రారంభమైన ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. తొలిరోజు జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు శ్రీకాకుళం, ఆముదాలవలస, టెక్కలి నియోజకవర్గాల్లో  పార్టీ గెలుపోటములపై సమీక్షించారు.

 హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 10 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఘన  స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న జగన్‌కు మంగళవారం రాత్రి గోదావరిలో బోటు బోల్తా పడి అయిదుగురు మృతి చెందిన విషయాన్ని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజా వివరించగా చలించిపోయారు. సమీక్షలకు ముందే వారి కుటుంబాలను పరామర్శించాలని హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వె ళ్లారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ పరంగా ఆర్థిక సహాయం ప్రకటించారు. అనంతరం తిరిగి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని సమీక్షలకు శ్రీకారం చుట్టారు.

 పేరుపేరునా పలకరిస్తూ.. ప్రతి పలుకూ ఆలకిస్తూ
 ఉదయం 12 గంటలకు ప్రారంభ మైన సమీక్షలు రాత్రి 11 గంటల వరకు సాగాయి. తొలిరోజు జిల్లాలోని తుని, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘంగా సమీక్షించారు. తొలుత ఒక్కో సమీక్షకు అరగంట మాత్రమే కేటాయించినా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మనోభావాలు తెలిపేందుకు ఆసక్తి చూపడంతో వారిని నిరుత్సాహపర్చకుండా సూచనలు, సలహాలు తీసుకుని వారిలో ఉత్తేజాన్ని నింపారు. అధినేత తమను పేరుపేరునా పలకరించడం, తాము చెప్పిన అంశాలను ఓపిగ్గా చెరగని చిరునవ్వుతో నోట్ చేసుకోవడం కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపాయి.

 గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఓటమి చెందిన కొద్దిరోజులకే ఒక పార్టీ రాష్ట్రాధినేత ఇలా జిల్లాలకు వచ్చి నియోజకవర్గ సమీక్షలు నిర్వహించడం, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు, పార్టీ లోటుపాట్లు తెలుసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం ఇతోధికమైంది. అబద్ధపు హామీలతో ప్రజలను మాయ చేసి గద్దెనెక్కుతున్న చంద్రబాబు బండారం ఈ నెలలోనే బయటపడుతుందని, బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందంటూ జగన్ వారిని ఉత్తేజ పరిచారు. రానున్న ఐదేళ్లలో సాగించే పోరుబాటలో అధికార పార్టీ కేసులు, వేధింపులు ఎక్కువవుతాయని, అయినా ప్రతి కార్యకర్తకూ  అండగా ఉంటానని అన్నప్పుడు కార్యకర్తలు ‘జై జగన్’ అంటూ నినదిం చారు. పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని, నేతలు సమన్వయంతో కార్యకర్తలకు అండగా ఉండాలని జిల్లాలోని పలు నియోజకవర్గాల సమీక్షల్లో నాయకులు, కార్యకర్తలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

 వెల్లివిరిసిన ఉత్సాహం
 రాష్ర్ట స్థాయి సమీక్షలకు తూర్పు నుంచే శ్రీకారం చుట్టడం, అందుకు చారిత్రాత్మక రాజమండ్రి వేదిక కావడంతో జిల్లా పార్టీ శ్రేణుల ఉత్సాహం వెల్లివిరిసింది. సమీక్షలతో సంబంధం లేకుండా జగన్‌ను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావడంతో ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్ ప్రాంతం కిక్కిరి సి పోయింది. కాగా రాత్రి 11.30 గంటలకు రం పచోడవరం నియోజకవర్గ సమీక్ష ప్రారంభమై, కొనసాగుతోంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు,ఆ దిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు పిల్లి సు భాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, పార్టీ సీజీ సీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,

  పెండెం దొరబాబు, పార్లమెం టు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చలమలశెట్టి సునీల్, గిరజాల వెంకటస్వామినాయుడు, చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావునాయుడు, గుత్తుల సాయి, ఆకుల వీర్రాజు, రాష్ర్ట సేవాదళ్, యూత్ కమిటీ సభ్యులు సుం కర చిన్ని, తాడి విజయభాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, అనుబంధ కమిటీల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, మార్గన గంగాధర్, రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల రాజబాబు, పంపన రామకృష్ణ, గారపాటి ఆనంద్, మంతెన రవిరాజు, పార్టీ అధికార ప్రతినిధి పి.కె.రావు, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, జ్యోతుల నవీన్‌కుమార్, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాల్, ఆర్‌వీవీ సత్యనారాయణ చౌదరి, మాకినీడి గంగారావు, లాలం బాబ్జి, కర్రి సత్యనారాయణ, గుబ్బల వెంకటేశ్వరరావు, రావు చిన్నారావు, అయితే శోభ, ముప్పన వీర్రాజు, అత్తిలి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం..

బూటకపు హామీలివ్వలేదు: జగన్
 - అధికారం కోసం బాబు రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని అబద్ధాలాడారు
 - ఆ హామీని ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మడం వల్లే ఆయనకు అధికారం..
 - చంద్రబాబు బండారం బయటపడే సమయం దగ్గరపడింది
 - చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి
 - ఇందుకోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి... ఈ ఐదేళ్లలో
 కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే అవకాశముంది..
 - ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా జిల్లా స్థాయి నాయకులు సైతం వెళ్లి అండగా నిలవాలి
 
 సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘తెలంగాణ  విడిపోక ముందు దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. వాటిలో ఏ ఒక్క రాష్ర్టంలోనూ అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ రైతుల రుణ మాఫీ చేస్తానని చెప్పలేదు. ఒక్క మన రాష్ర్టంలోనే అధికారం కోసం చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలల్లా ఇచ్చారు. రూ.87 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానని అబద్దాలాడారు. రాష్ర్టంలో కోటీ 30 లక్షల మంది మనకు ఓటు వేస్తే.. టీడీపీకి కోటీ ముప్పై ఐదున్నర లక్షల మంది ఓట్లు వేశారు. మనం చెప్పిన మాటల కంటే చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను కేవలం ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మారు. అందువలనే ఆయన అధికారంలోకి వచ్చాడు. మనం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘సీఎం స్థానంలో ఒకసారి కూర్చుంటే కనీసం 30 ఏళ్ల పాటు ప్రజలకు మేలు చేయాలన్నదే నా తపన. విశ్వసనీయత, విలువలకు కట్టుబడి ఉన్నాను కాబట్టే బాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయాను’’ అని చెప్పారు. రాజమండ్రిలో పార్టీ సమీక్షల సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
 
 ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తోనూ పోరాటం..
 ‘‘రుణ మాఫీ అబద్ధం ఆడి ఉంటే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే వాడిని. అయితే మూడు నెలల్లోనే రాష్ర్ట ప్రజలే కాదు.. ఆచరణ సాధ్యం కాని ఆ హామీలు ఎందుకిచ్చారంటూ మీరు కూడా నన్ను తిట్టేవారు. ఆ పని చేయలేకనే నేను ఆ హామీ ఇవ్వలేకపోయాను. మనం గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేసింది ఒక్క చంద్రబాబుతోనే కాదు. చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తోకూడా పోరాటం చేశాం. బాబును సీఎం చేయాలని వీరంతా సర్వశక్తులూ ఒడ్డారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రైతుల రుణమాఫీ ఒక్క బాబు వల్లే సాధ్యమని ‘ఈనాడు’లో బ్యానర్ కథనం రాస్తారు. ఇప్పుడు అదే ‘ఈనాడు’ పేపర్‌లో నాలుగు రోజుల క్రితం చూస్తే అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ర్టంలో చంద్రబాబు అధికారం చేపట్టాల్సి వస్తోందని, పైగాా విభజనకు ముందు ఈ హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఏ విధంగా అమలు చేయగలరనే సందేహాలు ప్రజల్లో కలిగేలా కథనాలు రాస్తున్నారు.
 
 కార్యకర్తలకు అండగా నిలుద్దాం..
 ఈ నెలలోనే చంద్రబాబు బండారం బయట పడుతుంది. ఖరీఫ్ సీజన్ మొదలైంది. రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ అమలవుతుందో లేదోననే ఆందోళన వారిలో నెలకొంది. ఒక్క రుణమాఫీయే కాదు.. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఏ విధంగా అమలు చేయగలడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి. ఇందుకోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి. ఈ సమయంలో నాయకులపైనే కాదు.. కార్యకర్తలపై కూడా కేసులు పెట్టవచ్చు. వేధింపులకు గురిచేయవచ్చు. ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్తపై ఇటువంటి దాడులు జరిగినా ఆ ఒక్క నియోజకవర్గ పరిధిలోని నాయకులే కాదు.. జిల్లా మొత్తం అక్కడకు వెళ్లి ఆ కార్యకర్తకు అండగా నిలవాలి.. మరోసారి అలాంటి దాడులు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడాలి.
 
 గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం..
 ఇకపై గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామ కమిటీలను వేయడమే కాకుండా నిరంతరం వాటి  పనితీరును మెరుగుపర్చేందుకు కృషి చే స్తాం. అధిష్టానం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ గ్రామస్థాయిలో చర్చించి ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా పార్టీని బూత్ స్థాయి వరకు పటిష్టం చేస్తాం.’’

టీడీపీ ఎమ్మెల్యేలే మా పార్టీలోకి వస్తున్నారు

Written By news on Wednesday, June 4, 2014 | 6/04/2014

'టీడీపీ ఎమ్మెల్యేలే మా పార్టీలోకి వస్తున్నారు'
విజయవాడ : తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్న వార్తలను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలీల్ ఖాన్ ఖండించారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ... టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో చోటు దక్కదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తున్నారని...తమ పార్టీలోకి వచ్చేందుకు వారంత సిద్ధంగా ఉన్నారని జలీల్ ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 67 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ వందకు పైగా స్థానాలను గెలుచుకుంది. జూన్ 8న ఆ పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. కాగా అధికారంలోకి రానున్న టీడీపీలోకి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ పై విధంగా స్పందించారు

మృతుల కుటుంబాలకు జగన్ ఎక్స్ గ్రేషియా

మృతుల కుటుంబాలకు జగన్ ఎక్స్ గ్రేషియా
రాజమండ్రి : ధవళేశ్వరం పడవ బోల్తా దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా పార్టీ సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్ రాజమండ్రి వచ్చారు. ఈ సందర్బంగా రాజమండ్రిలో ధవళేశ్వరం పడవ బోల్తా పడి మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 
మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మధురపూడి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరో రెండు బాధిత కుటుంబాలను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. పార్టీ తరఫున ఆయా కుటుంబాలకు కూడా రూ. లక్ష చొప్పును ఆర్థిక సాయం అందించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.

సార్వత్రిక ఫలితాలపై వైఎస్ జగన్ సమీక్ష

రాజమండ్రి : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్షిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన నియోజకవర్గాల సమీక్షలు జరుపుతున్నారు. తొలిరోజు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష ముగిసింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై విశ్లేషణ జరపనున్నారు.

పార్లమెంటు నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వహించి ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితిని జగన్ చర్చిస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బలమైన, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించే విధంగా, ప్రజల పక్షాన నిలిచి నిర్మాణాత్మకంగా వ్యవహరించే దిశగా క్యాడర్‌ను ఆయన ఉత్తేజపరచనున్నారు. నేటి నుంచి మూడురోజుల పాటు వరుసగా ఈ సమీక్షలు కొనసాగనున్నాయి.

ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ ప్రత్యేక బృందాలు పర్యటించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల పరిస్థితులపై బృందాలు అధినేతకు నివేదికలు సమర్పించాయి. వాటిని అధ్యయనం చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి నేతలతో చర్చించి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పది పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలు ఈ సమీక్షలకు హాజరయ్యారు. వీరందరితో అధినేత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విడివిడిగా సమావేశమై ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా ఘన స్వాగతం పలికారు.  అక్కడి నుంచి జగన్ రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి చేరుకున్నారు.

నేడు రాజమండ్రికి వైఎస్ జగన్

నేడు జగన్ రాక
సాక్షి, రాజమండ్రి :సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములపై సమీక్షించడంతో పాటు నేతల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు వస్తున్నారు. రాజమండ్రిలో అయిదు జిల్లాలకు చెందిన పది పార్లమెంటు నియోజకవర్గాల్లో పరిస్థితిని ఆయన సమీక్షిస్తారు. పార్లమెంటు నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వహించి ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితిని జగన్ చర్చిస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బలమైన, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించే విధంగా, ప్రజల పక్షాన నిలిచి నిర్మాణాత్మకంగా వ్యవహరించే దిశగా క్యాడర్‌ను జగన్ ఉత్తేజపరచనున్నారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు వరుసగా ఈ సమీక్షలు కొనసాగనున్నాయి.

 జిల్లా సమీక్షలు పూర్తిచేసిన ప్రత్యేక బృందాలు
 ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ ప్రత్యేక బృందాలు పర్యటించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల పరిస్థితులపై బృందాలు అధినేతకు నివేదికలు సమర్పించాయి. వాటిని అధ్యయనం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి నేతలతో చర్చించి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పది పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలు ఈ సమీక్షలకు హాజరవుతున్నారు. వీరందరితో అధినేత పార్లమెంటు  నియోజకవర్గాల వారీగా విడివిడిగా సమావేశమై ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు అడిగి తెలుసుకుంటారు.

 పార్టీని గ్రామస్థాయిలో ప్రజల వద్దకు తీసుకు వెళ్లి పటిష్టపరచడంతో పాటు రానున్న రోజుల్లో వ్యవహరించే తీరుపై నేతలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో బుధవారం ఉదయం 10.00 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకుని నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభిస్తారు. తొలిరోజు ఉదయం 11.00  నుంచి కాకినాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో తన సమీక్షా కార్యక్రమాలు జగన్ ప్రారంభిస్తారు.

ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం

Written By news on Tuesday, June 3, 2014 | 6/03/2014

ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ప్రజాభిమానాన్ని చూరగొని జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ముండే అకాలమరణం పాలు కావడం మహారాష్ట్రకే కాక యావద్దేశానికి తీరని లోటని ఆయన అభివర్ణించారు. గోపీనాథ్ ముండే కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘వడ్డేపల్లి’ మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

‘వడ్డేపల్లి’ మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
కుటుంబీకులకు జగన్ పరామర్శ
 
హైదరాబాద్  కూకట్‌పల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దివంగత వడ్డేపల్లి నర్సింగరావు మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టమని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం వడ్డేపల్లి ద్వాదశ దినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్‌మోహన్‌రెడ్డి మనోధైర్యంతో ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడిన ఆయన.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతోనూ ముచ్చటించారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు వైఎస్ కొండారెడ్డి, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, మునిసిపల్ మాజీ చైర్మన్ హనుమంతరావు, లోకయ్యపటేల్, మాధవరం కాంతారావు, వైఎస్సార్ సీపీ నాయకుడు ముక్కా రూపానందరెడ్డి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు సురేష్‌రె డ్డి, ఎమ్‌ఎస్‌ఆర్, శివారెడ్డి, జార్జి, ప్రభారెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు వడ్డేపల్లి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

దేశం గర్వించేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదాం: జగన్

జాతీయ పార్టీగా వైఎస్సార్ సీపీ
దేశం గర్వించేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదాం: జగన్
 
వైసీపీ కార్యాలయంలో తెలంగాణ సంబురాలు
జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించిన జగన్
2నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులు
తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ ఉన్నారని వెల్లడి

 
 హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి జాతీయ పార్టీగా కొనసాగనుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణకు తొలిసీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. మంచి చేసే ప్రతి పనికి వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండా ను జగన్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రెండునిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఒకే భాష, ఒకే జాతిగా ఉన్న రెండు రాష్ట్రాల ప్రజలుగా ఒకరికొకరు సహకరించుకుంటూ దేశం గర్వపడేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పోయింది. తెలంగాణ రాకముందు అంతా కలిసి ఉండాలని.. తెలుగు వారిని చూసి దేశమంతా గర్వపడేలా ఉండాలని తాపత్రయపడ్డాం. కానీ విభజన జరిగిపోయింది.

అయినా రాష్ట్రాలను వేరు చేయగలిగారుగాని తెలుగు వారి మనసులను వేరు చేయలేరని మరోసారి ఉద్ఘాటిస్తున్నా. ఈ ప్రాంతం వారికి ఏ సమస్య వచ్చినా ఆ ప్రాంతం వారు తోడుగా ఉంటారు. ఆ ప్రాంతం వారికి ఏ సమస్య వచ్చినా ఈ ప్రాంతం వారు తోడుగా ఉంటారు..’’అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలోనూ ప్రతీ ఒక్కరి గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా తెలంగాణ ప్రజల కోసం వైఎస్ గడప, గడపను తట్టారని, తెలంగాణ అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా చేశారని ఆయన పేర్కొన్నారు. రైతులు 17 లక్షల పంపుసెట్ల ఆధారంగా వ్యవసాయం చేయగలుగుతున్నారంటే.. అది రాజశేఖరరెడ్డి ద్వారానే జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి వైఎస్ అండగా నిలబడ్డారు కాబట్టే, రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణలో కూడా గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని కచ్చితంగా తెలంగాణలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని జగన్ చెప్పారు.

తెలంగాణ నేతలతో సమావేశం

 తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణకు చెందిన నేతలతో జగన్ అరగంట పాటు ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచనలు జరిపారు. వైఎస్ కలలు కన్న సువర్ణయుగాన్ని తెలంగాణలో తెచ్చుకునేందుకు కచ్చితమైన ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అడహక్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, హెచ్.ఎ.రెహ్మాన్, బి.జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, విజయారెడ్డి, కె.శివకుమార్, టి.వెంకట్రావ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్  తదితరులు పాల్గొన్నారు.
 

జాతీయ పార్టీ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్

Written By news on Monday, June 2, 2014 | 6/02/2014

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ గా మారిందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జాతీయజెండాను, పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుడెల్లో వై.ఎస్. ఉన్నారని ఆయన చెప్పారు.తెలంగాణ అబివృద్దికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విశేష కృషి చేశారని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని విడదీసినా, తెలుగువారిని విడదీయలేరని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడునీడగా ఉంటుందన్నారు.కెసిఆర్ కు జగన్ అభినందనలు తెలియచేసి,మంచి పనులన్నిటికి మద్దతు ఇస్తామని చెప్పారు

తెలంగాణలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేయాలి'

'తెలంగాణలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేయాలి'
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలకు సూచించారు. వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ అడ్‌హక్‌ కమిటీతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ రెండు ప్రాంతాల ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో వైస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చేలా కృషిచేయాలని జగన్‌ పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండాతో పాటు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర

Written By news on Sunday, June 1, 2014 | 6/01/2014

'నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర'
హైదరాబాద్: నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో కూడా తాము ప్రజల పక్షానా పోరాడతామని తెలిపింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని తెలంగాణ అడ్ హక్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అడ్ హక్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు పాల్గొనాలని పొంగులేటి పిలుపునిచ్చారు.

Popular Posts

Topics :