16 July 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే

Written By news on Friday, July 21, 2017 | 7/21/2017


హైదరాబాద్‌ : ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఇంఛార్జ్‌ శిల్పా మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సంజీవరెడ్డి  సంజీవరెడ్డి, ఆయన తనయుడు వెంకట్‌ రెడ్డి, నంద్యాలలో మంచి పేరున్న న్యాయవాది శివశంకర్‌ రెడ్డి పార్టీలో చేరారు.
సంజీవరెడ్డికి కండువా కప్పి వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు చుట్టు అవినీతిపరులు చేరారని, ఉప ఎన్నిక కోసం ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు వైఖరి నచ్చకే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారన్నారు. నంద్యాలలో వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపు ఖాయమని సంజీవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

లీకేజీ వెనుక పెద్ద ప్యాకేజీ ఉంది: ఆళ్ల

Written By news on Tuesday, July 18, 2017 | 7/18/2017


లీకేజీ వెనుక పెద్ద ప్యాకేజీ ఉంది: ఆళ్ల
హైదరాబాద్‌ : ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం నిర్వాకాన్ని అందరూ చూస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కొద్దిపాటి వర్షానికే ఏపీ సచివాలయం ఛాంబర్లు వర్షపు నీటితో లీక్‌ అయిన వ్యవహారంతో ఆంధ్ర రాష్ట్ర పరువును దిగజార్చుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సచివాలయంలో లీకేజీలు చాలా చిన్న విషయం అని, భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మంత్రి నారాయణ అంటున్నారు. ఏపీ సచివాలయం ఛాంబర్ల లీకేజీ వెనక చాలా పెద్ద ప్యాకేజీ ఉంది. మీకు, ప్రభుత్వానికి, చంద్రబాబుకు వచ్చిన ప్యాకేజీ మాత్రం భారీ ఎత్తున ఉండి ఉంటుంది. లీకేజీ వెనుక అసలు విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. అందుకే చదరపు అడుగుకు పదివేల రూపాయిలకు కాంట్రాక్ట్‌ కట్టబెట్టారు.

దీని వెనుక పెద్ద ఎత్తున ప్యాకేజీ కుదిరింది. గతంలోనూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌ కూడా వర్షంనీరు చేరింది. దానిపై సీఐడీ ఎంక్వైరీ వేశారు. నెలరోజుల గడుస్తున్నా దానిపై కదలిక లేదు. ఇప్పుడు మంత్రుల ఛాంబర్లు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షం, మరోవైపు అధికారులు పని చేసుకోవాలి. దీంతో వాళ్లు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. చిన్న వర్షానికే ఇలా ఉంటే తుపాను వస్తే పరిస్థితి ఏంటి?. హుద్‌హుద్‌ తుఫాను సమయంలో కేవలం విశాఖలో రెవెన్యూ శాఖలో రికార్డులు మాయం అయ్యాయి. ఇప్పుడు కూడా సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఏ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చారో వాళ్లకు సంబంధించిన పైళ్లు మాయం అయ్యే అవకాశం ఉంది. దీనిపై సీఐడీ కాదు సీబీఐ విచారణ జరిపించాలి.’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన వైఎస్ జగన్

Written By news on Monday, July 17, 2017 | 7/17/2017


రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన వైఎస్ జగన్
విజయవాడ: రాజధాని అమరావతిలో తొలిసారి జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్ ఓటింగ్ ప్రారంభమైన కొంత సమయానికి అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్‌లో ఓటేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత వైఎస్ జగన్ అక్కడే తన చాంబర్‌లో కొద్దిసేపు ఉండి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతకుముందు నేటి ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ సందర్భంగా.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులకు ఆయన వివరించారు. భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి వెళ్లారు.
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్, మిథున్ రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఎంపీ మేకపాటి నివాసంలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ అంశంపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం పార్లమెంట్‌కు వెళ్లిన నేతలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలతో వైఎస్‌ జగన్‌ భేటీ


ఎమ్మెల్యేలతో వైఎస్‌ జగన్‌ భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులకు వివరించారు.

తర్వాత వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వెలగపూడిలోని అసెంబ్లీకి వెళతారు. శాసనసభ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైఎస్సార్‌ సీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్నారు.  

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎంపీ

Written By news on Sunday, July 16, 2017 | 7/16/2017


పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎంపీ
హొళగుంద/ఆలూరు రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. శనివారం కర్నూలు జిల్లా హొళగుందలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారని.. అలాంటి పార్టీని వదిలి టీడీపీలో చేరే ప్రసక్తే లేదని ఆమె మరోసారి తేల్చి చెప్పారు. ఎల్లో మీడియా అసత్య ప్రసారాలు చేస్తోందని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :