24 March 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

106వ రోజు ముగిసిన షర్మిల పాదయాత్ర

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 106వ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ముగిసింది. కంకిపాడు, పొద్దుటూరు, దాములూరు, చలివేంద్రపాలెం, పెదఓగిరాల, ఆకునూరు, చినఓగిరాల, గండిగుంట మీదుగా పాదయాత్ర సాగింది. ఈరోజు షర్మిల15.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు ఆమె 1445.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.



దుర్భరమైన ప్రజల బతుకు: షర్మిల

రాష్ట్రంలో ప్రజల బతుకులు దుర్భరమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అప్పులతో రైతులు చాలా కష్టాలుపడుతున్నారు. ప్రతి పల్లెలో మహిళలు కన్నీరు పెడుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు. రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడంలేదు. పిల్లలకు ఫీజులు కూడా చెల్లించడం కూడా కష్టమవుతోందని వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. విద్యార్థులు చదువుకోవడానికి విద్యుత్ ఉండటం లేదు. పరిశ్రమలు మూతబడి కార్మికులు రోడ్డున పడ్డారని వివరించారు. విద్యుత్ గురించి అడిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిటికీలు, తలుపులు తెరిచి పడుకోమని చెబున్నారు. వైఎస్ బతికి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవికావు. అన్నివర్గాల వారి గురించి వైఎస్‌ఆర్ ఆలోచించారు. అందుకే అందరి గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. విద్యుత్, గ్యాస్, ఆర్టీసీ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా వైఎస్‌ఆర్ పెంచలేదు. ఒక్క పన్నుకూడా వేయకుండానే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు చంద్రబాబే కదా అటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యేల చేత దీక్షచేయించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకొచ్చింది? విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు పోరాటం చేయడం విడ్డూరం కాదా? 50 రూపాయలున్న హార్స్‌పవర్ 625 రూపాయలు చేసింది చంద్రబాబు కాదా? ప్రతిఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుతామని వరల్డ్‌ బ్యాంకుతో చంద్రబాబు ఒప్పందం చేసుకోలేదా? రైతులపై విద్యుత్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను చంద్రబాబు పెట్టలేదా? చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను పెంచితే వైఎస్ఆర్ 13 రోజులు ఆమరణ దీక్ష చేశారని షర్మిల గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించలేదు. ఇప్పుడు ఏముఖం పెట్టుకుని చంద్రబాబు పోరాటంచేస్తున్నారు? విద్యుత్ ఛార్జీలపైనా, ఉచిత విద్యుత్‌పైనా చంద్రబాబు వైఖరేంటి? అవసరమైనప్పుడల్లా ఛార్జీలు పెంచాలని చంద్రబాబు తన పుస్తకంలో రాయలేదా? ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోడానికే అని చంద్రబాబు అన్నారు. అప్పుడు అలా మాట్లాడి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న చంద్రబాబును ఏమనుకోవాలి? తనది రెండు నాల్కల ధోరణనని చంద్రబాబే నిరూపించుకుంటున్నారు. చంద్రబాబు ముందు ఊసరవెల్లి కూడా చిన్నబోతుంది. అవిశ్వాసంలో చంద్రబాబు కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. సర్కారు మోపిన 32 వేల కోట్ల రూపాయల భారానికి చంద్రబాబు ఆమోదం తెలపలేదా? ఈ భారం పాపం చంద్రబాబునాయుడుదే. చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలవల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

Sharmila's Padayatra in Penamaluru constituency

Special Edition 'Congress TDP laku buddi cheppandi'

జగన్మోహన రెడ్డిపై కావాలని దుష్ప్రచారం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. జగన్‌పై ఒక పత్రిక, ఒక చానెల్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయన్నారు. జగన్‌ను ఈడీ అరెస్టు చేస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 40, 50 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ ఎమ్మెల్యేలను ఆపుకోవడానికే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారన్నారు. ఆ పత్రిక కిరణ్ పత్రిక, కిరణ్ న్యూస్ అని పెట్టుకుంటే బాగుంటుందన్నారు. 

వైఎస్ఆర్ సిపి నేత సోమయాజులుపై సిబిఐ దర్యాప్తు చేయాలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఆ మాటలు వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. టీడీపీపై ఆయన సందించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సీబీఐ దర్యాప్తు చేయాలనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. టీడీపీకి దమ్ము, ధైర్యముంటే దర్యాప్తుకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు నచ్చిన ఆర్థికవేత్త రంగరాజన్‌తో దర్యాప్తు చేయించినా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతుల పట్ల చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు

 విప్ ధిక్కరించిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శాసనసభాపతి నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. సిఎల్ పి ఫిర్యాదు మేరకు శాసనసభాపతి ఈ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నానిలకు నోటీసులు పంపారు.

YSRCP leaders visits Ponnala's Constituency

Konathala Ramakrishna Press Meet 30th March 2013

ఏప్రిల్ 3 నుంచి వైఎస్ఆర్ సీపీ ధర్నాలు

విద్యుత్ సంక్షోభంపై ఏప్రిల్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన చేసింది. నల్గొండలో జరగనున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్లొంటారని తెలిపింది.


విద్యుత్ సమస్యలపై పోరాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ శనివారం విజయవాడలో అన్నారు. రిలయన్స్ సంస్థకు రాష్ట్ర గ్యాస్ నిక్షేపాలు చంద్రబాబు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. అందువల్లే ఈనాడు సంస్థ ప్రతిఫలం పొందిందని తెలిపారు. 

చంద్రబాబు తన హయాంలో రాష్ట్రంలో గ్యాస్ ఆథారిటి సంస్థ ఏర్పాటు చేసి ఉంటే కేజీ బేసి న్ లోని చమురు నిక్షేపాలు మనకు వచ్చి ఉండేవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్ర సమస్యలు ఉంటే మంత్రులు పనిలేక విదేశీ పర్యటనలు చేస్తున్నారని సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

గోసాల నుంచి షర్మిల పాదయాత్ర

మరో ప్రజాప్రస్ధానంలో భాగంగా షర్మిల శనివారంఉదయం కృష్ణా జిల్లా గోసాల నుంచి 106వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. కంకిపాడు మీదుగా ఆమె ప్రొద్దుటూరు, దాములూరు క్రాస్‌రోడ్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి చలివేంద్రపాలెం క్రాస్‌రోడ్‌ మీదుగా పెదఓగిరాల క్రాస్‌రోడ్‌కు పాదయాత్ర చేస్తారు. ఆకునూరు, చినఓగిరాల క్రాస్‌రోడ్‌, గండిగుంట, మీదుగా షర్మిల ఉయ్యూరు వెళ్తారు. ఉయ్యూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. షర్మిల నిన్నటికి 14వందల30కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.

షర్మిలను కలిసిన మంత్రి పార్థసారధి తండ్రి

మంత్రి పార్థసారధికి ఆయన తండ్రి కేపీ రెడ్డయ్య షాక్ ఇచ్చారు. కృష్ణాజిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను ఆయన శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా కేపీ రెడ్డయ్య షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపారు. కేపీ రెడ్డయ్య గతంలో మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు.

ప్రజలు బ్రహ్మరథం పట్టగానే...పాలకులకు ముచ్చెమటలు పట్టాయి!


రాజశేఖరరెడ్డిగారి పాలనాదక్షత గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఈ రాష్ట్రంలో తెలియనివారు లేరు. ఆయన ఈనాటికీ మన మధ్యన ఉండి ఉంటే ఆయన కోరుకున్న విధంగా, ప్రతి పౌరుడు ఆశించిన విధంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారి ఉండేది. కానీ మన దురదృష్టం. వైఎస్సార్ చేసిన మంచి పనులను చూసి, తనకు సహాయకుడిగా ఉంటే బాగుండునని దేవుడే అకస్మాత్తుగా ఇంతపని చేశాడనిపిస్తుంది!

వైఎస్సార్ చనిపోయి ఇన్నిరోజులైనా ఆయనను అభిమానించే, ఆరాధించే ప్రతి వ్యక్తి హృదయం నేటికీ ఆవేదన చెందుతూనే ఉంది. ఆ ఆవేదనను తీర్చేందుకు, ఓదార్చేందుకు ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ప్రతిప్రాంతమూ బ్రహ్మరథం పట్టింది. ఇప్పటివరకూ ఆ యువనాయకుడి పరిపాలన చూడకపోయినా, ఎందుకో అతడిపై ఒక దృఢనమ్మకం ప్రజల్లో ఏర్పడింది.

కచ్చితంగా అతడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడని, తండ్రిని మరిపించేలా జనాభ్యుదయం కోసం పాటుపడతాడని సంతోషపడ్డారు. అయితే కాంగ్రెస్‌పార్టీ జగన్‌ను జైల్లో వేయించి, బెయిల్ రాకుండా అవరోధాలు కల్పిస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మా నుంచి జగన్‌ని దూరం చేశామని ఈ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు క్షణికానందం పొందుతున్నారు తప్ప రాబోయే రోజుల్లో తమకు పట్టబోయే దుర్గతి గురించి ఆలోచించడం లేదు. ప్రజల అభిమానం, రాజశేఖర్‌రెడ్డి చల్లని దీవెనలు ఉన్నంతవరకు జగన్‌బాబు కాలి ధూళిని కూడా ఎవరూ తాకలేరనే వాస్తవం ఈ కుటిలనాయకులు గమనించాలి.

- ఎస్.పార్వతి, పార్వతీపురం, విజయనగరం

రైతులపై కక్షకట్టిన సర్కార్: ఇంద్రకరణ్‌రెడ్డి


 రాష్ర్టంలో రైతులపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కక్షకట్టిందని, వారి సంక్షేమాన్ని విస్మరించిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ, రైతులకు పంట నష్టపరి హారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్డీవో కార్యాల యం ఎదుట 48 గంటల దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన స్వగృహం నుంచి పట్టణంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు.

వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, దీక్ష ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ కరెంటు చార్జీలు పెంచి ప్రభుత్వం పేదల నడ్డి విరించిందని, విద్యుత్ కోతలతో రాష్ర్టంలో అంధకారం అలుముకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీక్షకు మద్దతు తెలిపిన కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, కోనేరు కోనప్ప తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు.

తమ్ముళ్లకు తండ్రీ కొడుకుల ఝలక్!


తెలుగుదేశం పార్టీలో ఇప్పు డు తండ్రీ కొడుకులు పార్టీ నాయకులకు ఝలక్ ఇస్తున్నారట. మీకోసం యాత్రలో చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా లోకేష్ చేస్తున్న ప్రకటనలు చూసి పార్టీ నేతలంతా ముక్కున వేలేసుకుంటున్నారట. టీడీపీలో నేతలుగా ఎదిగి.. ఇప్పుడు వీడిపోతున్న వారంతా ద్రోహులేనని లోకేష్ ఇటీవల ట్విట్టర్‌లో కామెంట్ చేసి పెద్దపెద్ద బాబులనే భుజాలు తడుముకునేలా చేశారు. సర్లే... ఏదో పిల్లవాడు.. తన తండ్రి కూడా మరో పార్టీ నుంచి వచ్చిన వారన్న విషయాన్ని మరచిపోయి అలా రాసి ఉంటారులే అని పార్టీ నేతలెవరూ దాన్ని పెద్దగా పట్టించుకోనట్టు నటించేశారట. ఏదో సర్దుకుపోతోందనుకుంటున్న వేళ.. పార్టీ అధ్యక్షుడు మరింత షాక్ ఇచ్చారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతున్నందువల్ల టీడీపీని వీడుతున్నట్టు ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పార్టీ నాయకుడొకరు ప్రకటన చేశారు. దాంతో చంద్రబాబు కోపం కట్టలు తెంచుకుంది. పార్టీలో పదవులు అనుభవించి, తర్వాత పార్టీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనుంచి ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా.. ఆ నాయకుడికి సంబంధించి అటు మూడు తరాలు, ఇటు మూడు తరాలు టీడీపీకి విశ్వాసపాత్రులుగా ఉన్నవారికే పదవిస్తానని ఆవేశంగా చెప్పేశారు. దీంతో పార్టీ నేతల మైండ్ బ్లాంకయ్యిందట! మూడు దశాబ్దాల కింద కాంగ్రెస్‌లో మంత్రి పదవి అనుభవిస్తూ.. టీడీపీని ఏర్పాటు చేసిన సొంత మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానని సవాలు చేసిన చంద్రబాబు... ఇప్పుడు అటు మూడు తరాలు, ఇటు మూడు తరాలు చూసి పదవిస్తానంటే.. మైండ్ బ్లాంక్‌కాక మరేమవుతుంది!

ఇది చంద్రబాబు పాలనే! బాబు హయాంలో తొమ్మిదేళ్లూ కరువే

మరో ప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
టీడీపీ పాలనలో లక్షలాది మంది వలసలు పోయారు
కన్నబిడ్డలు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లారు
ఇంటి దగ్గర ఉన్న వృద్ధులకు కనీసం పింఛన్లు కూడా ఇవ్వలేదు
అప్పులకు తాళలేక వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
రాష్ట్రంలో అవే పరిస్థితులు ఇప్పుడూ ఉన్నాయి..
ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చంద్రబాబు అండగా నిలిచారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 105, కిలోమీటర్లు: 1,430.5

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు నాయుడు హయాంలో వర్షాల్లేక.. పంటలు పండక తొమ్మిదేళ్ల కరువొచ్చింది. సాయం చేసే చేతులు లేక లక్షలాది మంది ఇళ్లను వదిలి పొట్టకూటి కోసం ఎక్కడెక్కడికో వలసలు పోయారు. కన్న బిడ్డలు ఉపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతే.. ఒంట్లో సత్తువ లేక నడిచే ఓపిక లేక ఎంతో మంది వృద్ధులు ఇంటి వద్దే ఉన్నారు. వాళ్లకు కనీసం వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదు. దేశం కాని దేశం పోయి ఎంతోకొంత సంపాదించి తమ ముసలి తల్లికి పంపిన సొమ్ము సకాలంలో అందక ఎంతోమంది వృద్ధులు ఆకలితో చనిపోయారు. అప్పుల బాధలు తట్టుకోలేక వేలాది మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంత భయంకరమైన రోజులవి. అదే పాడు పరిపాలన మళ్లీ వచ్చింది.. చంద్రబాబు పాలనకు కొనసాగింపుగా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగుతోంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో సాగింది. కానూరు గ్రామంలో కొందరు వలస కూలీలు షర్మిలకు ఎదురుపడ్డారు. ‘అమ్మా.. మేం కొందరం విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి, ఇంకొందరు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి వచ్చాం. ఊళ్లో పని దొరక్క రెండేళ్ల కిందట.. పిల్లలను ముసలోళ్ల దగ్గరే వదిలేసి విజయవాడకు వలస వచ్చాం. ఇక్కడ రోజుకు రూ.150 దాకా కూలీ పడుతుందమ్మా’ అని గాంధారి రామలీల, చంద్రగిరి భవాని అనే మహిళలు చెప్పగా.. షర్మిల పై విధంగా స్పందించారు. అనంతరం పెనమలూరులో మహిళలతో కలిసి రచ్చబండలో కొద్దిసేపు మాట్లాడారు. మాటల సారాంశం ఆమె మాటల్లోనే...

పల్లెలను బాబు పీల్చి పిప్పి చేశారు..

చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పురుగులను చూసినట్లు చూశారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పారు. రూ.వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పి చేసిన ఆయన.. ఇప్పుడు మళ్లీ ‘మీకోసం’ పాదయాత్ర అంటూ అవే పల్లెల వెంట తిరుగుతున్నారు. పాదయాత్ర చేస్తున్నాడు కదా.. ప్రజా సమస్యలు అర్థం చేసుకుని, రైతులకు, రైతు కూలీలకు అండగా నిలబడుతారు అనుకున్నాం. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కూలగొడతారు అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడుకు ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం. ఆయనకు కావాల్సింది రాజకీయాలు. ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. ఎంతటి నీచానికైనా దిగజారుతారు. రైతులు ఏమైపోయినా ఆయనకు పట్టదు. ఆరోజు అధికారం కోసం పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు తన అవినీతిపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే.. అవిశ్వాసానికి మద్దతిచ్చి ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగా నిలబడ్డారు. ఇది చంద్రబాబు నైజం. నమ్మక ద్రోహం, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ఆయన రక్తంలోనే ఉందని ఆయనకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్ గారే చెప్పారు.

శుక్రవారం 105వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమటి లంక నుంచి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్, కామయ్యతోపు మీదుగా పెనమలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. షర్మిల నడిచినంత దూరం రోడ్డుకు ఇరువైపులా జనం కిక్కిరిసిపోయారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి, షర్మిలతో కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. గోసాల గ్రామంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. శుక్రవారం 16.4 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,430.5 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, రత్న బోసు, జ్యేష్ట రమేష్, పార్టీ నాయకులు ఆర్కే, ఎంవీఎస్ నాగిరెడ్డి, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, తాడి శకుంతల, డాక్టర్ హరికృష్ణ స్థానిక నాయకులు పటమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి తదితరులున్నారు.

రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది

వైఎస్సార్ కంటే ముందు చాలా సీఎంలు రాష్ట్రాన్ని పాలించారు. ఆయన తర్వాత కూడా పాలించారు. కానీ ఒక్క వైఎస్సార్ సువర్ణ యుగం లో మాత్రమే రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది. ఆ పాలనలో పిలిస్తే వర్షాలు పడ్డాయి. వైఎస్ రైతుల పక్షపాతి. కన్నతండ్రి స్థానంలో ఉండి రైతు, మహిళ, విద్యార్థులు, మైనార్టీలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకున్నారు. ఇప్పటి పాలకులకు రైతు సమస్యలే పట్టవు. అమ్మా.. అయ్యా.. జగనన్న తరపున ఒక్క మాట చెప్తున్నా. ఓపిక పట్టండి.. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.
- షర్మిల

రూ.6,000 కోట్ల కరెంటు షాక్!

చార్జీల పెంపునకు నేడే సర్కారు పచ్చజెండా 
ఉదయం ఈఆర్‌సీకి అధికారికంగా ప్రభుత్వ లేఖ
సాయంత్రమే ఆదేశాలు జారీ చేయనున్న ఈఆర్‌సీ
ఏప్రిల్ 1 నుంచే కొత్త చార్జీల అమలు
ఆర్-ఎల్‌ఎన్‌జీకి తలూపేలా ఈఆర్‌సీపై సర్కారు ఒత్తిడి
దాంతో రూ.4,000 కోట్ల నుంచి 6,200 కోట్లకు చేరిన భారం
మే నుంచి రూ.1,058 కోట్ల మేరకు మళ్లీ సర్దుబాటు వడ్డన!

సాక్షి, హైదరాబాద్: రోజుకో రకం బాదుడుతో ఇప్పటికే హడలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్ గట్టిగా కొట్టనుంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్‌పై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి శనివారం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఫలితంగా జనంపై ఏకంగా రూ.6,000 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది. కొత్త కరెంటు చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మే నెల బిల్లు నుంచి వినియోగదారులపై ఆ ప్రభావం పడుతుందన్నమాట. నిజానికి 2013-14లో ఏకంగా 12,753 కోట్ల దాకా కరెంటు చార్జీల పెంపునకు ఈఆర్‌సీని డిస్కంలు అనుమతి కోరాయి. ఈ ప్రతిపాదనలపై ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయం సేకరించగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. 

పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించాలంటూ విచారణను కూడా జనం అడ్డుకున్నారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన ఈఆర్‌సీ భారాన్ని సుమారు రూ.4,000 కోట్లకు పరిమితం చేయాలని నిర్ణయించింది. యూనిట్‌కు ఏకంగా రూ.12 వెచ్చించి మరీ ఖరీదైన రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జీ)తో విద్యుదుత్పత్తి చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఈఆర్‌సీ నిర్ణయంపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం.. ఆర్-ఎల్‌ఎన్‌జీతో విద్యుత్ ఉత్పత్తిని అంగీకరించేలా దానిపై అనధికారికంగా ఒత్తిడి తెచ్చింది. దాంతో 2013 ఏప్రిల్, మే మాసాలతో పాటు 2014 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆర్-ఎల్‌ఎన్‌జీ ద్వారా విద్యుదుత్పత్తి చేసేందుకు ఈఆర్‌సీ అంగీకరించింది. ఫలితంగా ఆర్-ఎల్‌ఎన్‌జీతో కలుపుకుని జనం నెత్తిన మొత్తం చార్జీల భారం 5,800 కోట్ల నుంచి 6,200 కోట్ల మేరకు పడనుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇలా కరెంటు చార్జీలను ఈఆర్‌సీ ప్రతిపాదనల కంటే ఎక్కువగా పెంచుతున్న సర్కారు, మరోవైపు డిస్కంలకు సబ్సిడీని మాత్రం తగ్గించింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రూ.5,800 కోట్లు వస్తాయని డిస్కంలు అంచనా వేశాయి. ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో 5,700 కేటాయించింది. కానీ రూ.5,500 కోట్లు మాత్రమే ఇస్తామని తాజాగా ఈఆర్‌సీకి తేల్చి చెప్పింది. అలా రూ.300 కోట్లకు కోత పెట్టిందన్నమాట!

‘అధికారిక’ అస్పష్టత!

రోజుకో నిర్ణయంతో ఈఆర్‌సీతో ఆడుకుంటున్న ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా తన నిర్ణయం మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. డిస్కంల ప్రతిపాదనలపై కసరత్తు చేసిన ఈఆర్‌సీ, తుది నిర్ణయం తెలపాలని గత వారంలోనే ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు పంపింది. దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పైగా అనధికారికంగా రోజుకో నిర్ణయంతో ఈఆర్‌సీనే నియంత్రిస్తోంది. కొత్త టారిఫ్‌పై మార్చి 27 లేదా 28న ఆదేశాలు రావాల్సి ఉన్నా ఈ కారణంగానే వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం ఈఆర్‌సీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖ అందవచ్చని, అనంతరం చార్జీలపై ఈఆర్‌సీ అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మే నుంచి రూ.1,058 కోట్ల 
సర్దు‘పోటు’!

మరోవైపు 2012-13 మూడో త్రైమాసికం రూపంలో వచ్చే మే నెల నుంచి మరో సర్దుబాటు పోటు కూడా వినియోగదారుల నడ్డి విరవనుంది. ఈ ప్రతిపాదనలపై మార్చి 18న ఈఆర్‌సీ ఇప్పటికే బహిరంగ విచారణ నిర్వహించింది. వీటిపై ఏప్రిల్ మూడో వారంలో తుది ఆదేశాలు జారీచేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అంటే మే నుంచి మూడో త్రైమాసికపు సర్దుబాటు చార్జీల వడ్డన కూడా మొదలవనుందన్నమాట. యూనిట్‌కు 95 పైసల చొప్పున రూ.1,058 కోట్ల మేరకు సర్దుబాటు భారం ప్రజలపై పడనుంది. 2012-13 రెండో త్రైమాసికపు సర్దుబాటు చార్జీల వడ్డన మార్చి నుంచి మొదలవడం తెలిసిందే. యూనిట్‌కు 62 పైసల చొప్పున మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వినియోగదారుల నుంచి రూ.750 కోట్లకు పైగా వసూలు చేసుకోవాల్సిందిగా డిస్కంలను ఈఆర్‌సీ ఆదేశించింది.

రిజిస్ట్రేషన్ బాదుడుకు ఓకే

ప్రజలపై రూ. 2,400 కోట్ల అదనపు భారం.. 100 నుంచి ఏకంగా 300 శాతం దాకా పెంపు
సగటున 50% పెరుగుతున్న విలువలు.. రిజిస్ట్రేషన్ ఫీజు శాతం తగ్గింపు.. ఎంతో తేలేది నేడు


సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, నివసించే ఫ్లాటు... అన్నింటిపైనా రిజిస్ట్రేషన్ బాదుడు ఖాయమైంది. ముంగిట్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నందున రిజిస్ట్రేషన్ (మార్కెట్) విలువలను పెంచడానికి ప్రభుత్వం సాహసించకపోవచ్చన్న అంచనాలు పూర్తిగా తప్పాయి. భూములు, స్థలాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు ముఖ్యమంత్రి కిరణ్ పచ్చ జెండా ఊపారు. 

కొత్త (సవరించిన) రిజిస్ట్రేషన్ విలువల అమలు, దాంతోపాటే రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపునకు సంబంధించిన ఫైళ్లపై శుక్రవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు సంతకం చేశారు. దాంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలతో పాటు సవరించిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలు సగటున 50 శాతం పెరిగాయని అధికార వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. విలువల పెంపు వల్ల ప్రజలపై రూ.3,300 కోట్ల దాకా అదనపు భారం పడనుందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కాకపోతే ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తున్న రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే ప్రజలపై భారం రూ.2,400 కోట్లకు పరిమితం కావచ్చని అంచనా. రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కొంతయినా తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చార్జీలను ఎంత తగ్గిస్తున్నదీ అధికారులు చెప్పడం లేదు. దీనిపై శనివారం జీవో విడుదల కానుంది. ప్రస్తుతం మొత్తం రిజిస్ట్రేషన్ విలువపై నగరాల్లో 5 శాతం స్టాంపు డ్యూటీ, 2 శాతం ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, అర శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 7.5 శాతం వసూలు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్టాంపు డ్యూటీ 5 శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 3 శాతం, అరశాతం రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 8.5 శాతం వసూలు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రాంతాలకూ రిజిస్ట్రేషన్ ఫీజు శాతం సమానం కానుంది. అది 6, లేదా 5 శాతానికి తగ్గే అవకాశముంది.


బాదుడే బాదుడు...

రిజిస్ట్రేషన్ విలువల పెంపు రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. హైదరాబాద్‌లో 15 నుంచి 40 శాతం వరకు పెరగ్గా, కొన్ని జిల్లాల్లో మాత్రం ఇది ఏకంగా 300 శాతం వరకూ ఉంది! చాలా జిల్లాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విలువలను రెట్టింపు చేశారు. కొన్నిచోట్ల రెండు, మూడు రెట్లకు కూడా పెంచేశారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువను 300 శాతం పెంచారు. అంటే ఏప్రిల్ 1 తర్వాత ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసేవారు మూడు రెట్లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కష్టించి సంపాదించిన డబ్బుతో ఎకరా, రెండెకరాల వ్యవసాయ భూమి కొనాలని ఆశించే రైతులకు ఇది పెను భారమే. ఇక అపార్ట్‌మెంట్లకు సంబంధించి చాలాచోట్ల చదరపు అడుగుకు రిజిస్ట్రేషన్ విలువ 20 నుంచి 40 శాతం దాకా పెరిగింది. జీవితాంతం కష్టపడైనా సొంతిల్లు సమకూర్చుకుందామనే ఆశ పడే సగటు జీవులకు ఇది శరాఘాతమే! హైదరాబాద్‌లో స్థలాల విలువ కంటే అపార్ట్‌మెంటు విలువలు ఎక్కువగా పెంచారు. రాజధాని శివార్లలో విలువల పెంపు 50 శాతం దాకా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాలుగా ఎదుగుతున్న పట్టణాల సరిహద్దుల్లో మార్కెట్ విలువలు పలుచోట్ల 200 నుంచి 300 శాతం దాకా పెరిగాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.6,600 కోట్ల ఆదాయం వచ్చింది. తాజా పెంపుతో 2013-14లో అది రూ.9,900 కోట్లకు పెరుగుతుందని అంచనా.

ఇలా బాదేస్తున్నారు...

వరంగల్ జిల్లా హన్మకొండ మండలం గోపాలపురంలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ ప్రస్తుతం రూ.80 లక్షలుండగా రూ. 1.45 కోట్లకు పెంచారు. ఇదే మండలంలోని ఎనుమాముల గ్రామంలో ఎకరా వ్యవసాయ భూమి విలువను రూ.45 లక్షల నుంచి రూ. 88 లక్షలకు పెంచారు.

నల్లగొండ పట్టణంలోని అద్దంకి బైపాస్ రోడ్డులో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. నల్లగొండ పట్టణ సరిహద్దులో జాతీయ రహదారి వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఎకరా విలువను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.20 లక్షలకు పెంచారు. ఇదే ప్రాంతంలోని అనపర్తిలో ఎకరా విలువను రూ.10 లక్షల నుంచి రూ.24 లక్షలకు పెంచారు.

వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ద్వారకా నగర్‌లో గజం ఇంటి స్థలం విలువను రూ.5,000 నుంచి రూ.10,000 కు పెంచారు. జిల్లాలోని రాజంపేట మండలం మన్నూరులో ఎకరా వ్యవసాయ భూమి మార్కెట్ విలువను రూ.1.1 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఇదే ప్రాంతంలో హైవే పక్కనున్న వ్యవసాయ భూమి ఎకరా విలువను రూ.4.85 లక్షల నుంచి రూ.10 లక్షలకు సవరించారు!

హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడల్లో చదరపు గజం స్థలం రిజిస్ట్రేషన్ విలువ రూ.47,000 నుంచి ఏకంగా రూ.60,000కు పెరగనుంది! గ్రీన్‌ల్యాండ్స్‌లో రూ.33,000 నుంచి రూ.44,000కు పెరుగుతోంది.

తిరుపతి అర్బన్ ప్రాంతంలోని కొరమేరగుంట గ్రామంలో ఎకరా భూమి రిజిస్ట్రేషన్ విలువను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.40 లక్షలకు పెంచారు!

చిత్తూరులోని ప్రకాశం హైవేలో సెంటు (48.4 చదరపు గజాలు) విలువను రూ.15 వేల నుంచి రూ.26 వేలకు పెంచారు
వాల్మికిపురం మండలం గండబోయినపల్లిలో ఎకరా రూ.1.15 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు
తిరుపతి పరిసరాల్లో అపార్ట్‌మెంట్లకు సంబంధించి చదరపు అడుగు విలువను రూ.800 నుంచి రూ.1,200కు పెంచారు
విశాఖలోని మద్దిలపాలెంలో చదరపు గజం విలువ రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెరిగింది. జగదాంబ సెంటర్ ప్రాంతంలో రూ.30 వేల నుంచి రూ.40 వేలకు, సీతమ్మధారలో రూ.25 వేల నుంచి రూ.35 వేలకు పెరిగింది.

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలమరోప్రజాప్రస్థానం 106వ రోజు శనివారం గోసాల నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. కంకిపాడు, పొద్దుటూరు రోడ్డు, దాములూరు రోడ్డు, చలివేంద్రపాలెం రోడ్డు వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందన్నారు. అనంతరం పెదఓగిరాల రోడ్డు, ఆకునూరు, చినఓగిరాల రోడ్డు, గండిగుంట, ఉయ్యూరు వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. అక్కడే బహిరంగసభ నిర్వహించిన తరువాత సీబీఎం కాంపౌండు వద్ద రాత్రి బస చేస్తారని చెప్పారు.

పర్యటించే ప్రాంతాలు
కంకిపాడు, పొద్దుటూరు, దాములూరు, చలివేంద్రపాలెం, పెదఓగిరాల, ఆకునూరు, చినఓగిరాల, గండిగుంట, ఉయ్యూరు.

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు

Written By news on Friday, March 29, 2013 | 3/29/2013

త్వరలో రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన పోతుందని రైతులు, నేతన్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ భరోసా ఇచ్చారు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. మీకు అండాగా వైఎస్‌ఆర్ సీపీ ఉందని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలు ఎక్కడ ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ అక్కడే ఉంటుందని చెప్పారు. సమస్యలు లేవంటున్న పాలకులు నేత కార్మికుడు సత్తయ్య మృతికి బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.


kadapa: చుండ్రుపల్లిలో 1000 కుటుంబాలు వైఎస్‌ఆర్ సీపీలో చేరాయి. వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు, మాజీ మంత్రి వైఎస్‌, వివేకానందరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వైఎస్‌, అవినాష్‌రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మహానేత వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు వైఎస్ జగన్ కు మాత్రమే సాధ్యమేనన్నారు. 


వరంగల్: మంత్రి పొన్నాల నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ బృందానికి రైతులు తమ బాధను వినిపించారు. విద్యుత్ సమస్యలపై రైతులు ఆక్రందన వ్యక్తంచేశారు. మంత్రి పొన్నాల ఒక్కసారికూడా పట్టించుకోలేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రోజుకు నాలుగు గంటలకూడా కరెంటు ఇవ్వడంలేదంటున్న రైతులు వాపోయారు. 


జగనన్న ప్రభుత్వం వస్తే జనావాసాల్లోని బెల్టుషాపులను తొలగిస్తామని, మహిళా పోలీసులను నియమిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. బెల్టుషాపుల కారణంగా ఇబ్బందిపడుతున్నామంటూ పెనమలూరు రచ్చబండలో షర్మిలకు మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. రేషన్‌కార్డులు ఇవ్వడంలేదని, పెన్షన్లు మంజూరు చేయడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు రేషన్‌కార్డులు, వృద్ధులకు 700 రూపాయల, వికలాంగులకు 1000 రూపాయల పెన్షన్లు ఇస్తామని అన్నారు. 

ఇళ్లస్థలాలు ఇవ్వడంలేదని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మించుకున్నారని ఇళ్లు కూలగొడుతున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమవ్వడం షర్మిలను కదిలించింది. దాంతో బాధితులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని, స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని మహిళను షర్మిల ఊరడించారు. ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్‌ టీడీపీలకు బుద్దిచెప్పాలని షర్మిల పిలుపినిచ్చారు. 



వైఎస్ఆర్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వైఎస్ఆర్ సీపీ రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు కేవలం దివంగత నేత వైఎస్ఆర్‌ను విమర్శించడానికే జరిపారని ఆయన విమర్శించారు. జగన్‌పై ఉన్న ప్రజాభిమానం తట్టుకోలేకే కాంగ్రెస్‌- టీడీపీలు కుమ్మక్కై జైల్లో పెట్టించాయని ఆయన ఆరోపించారు.


రాజమండ్రి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొడ్డు భాస్కర రామారావు మండిపడ్డారు. తనపై సీబీఐ విచారణ జరిపిస్తారనే భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం ఉన్నందునే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని బొడ్డు భాస్కర రామారావు వ్యాఖ్యానించారు. బాబు పాదయాత్రతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని ఆయన పెదవి విరిచారు.






Special edition on 'Janam Chekkina Silapam YSR'

YSRCP Leader Indrakaran Reddy hunger strike against power crisis

YS Sharmila Padayatra In Krishna Dist

అక్రమంగా బెయిల్‌ను అడ్డుకుంటున్నారు


రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్‌ను ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ఆయన ఏ తప్పూ చేయలేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ప్రభుత్వంలో జరిగిన తప్పులకు జగన్‌ని ఎందుకు బాధ్యుడిని చేస్తారు? నిజంగా తప్పు జరిగి ఉంటే అప్పటి క్యాబినెట్ బాధ్యత వహించాలి కానీ, దానికి విరుద్ధంగా ఆనాడు ఏ పదవిలోనూ లేని, దేనితోనూ సంబంధం లేని వ్యక్తిని జైల్లో పెట్టడం న్యాయమేనా? పోనీ జగన్ చేసిన తప్పులైనా సీబీఐ ఎత్తి చూపించాలి కదా. ఇంతవరకు చూపించలేదు. జగన్ బయట ఉంటే, ఉప ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా రావని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కయ్యి చేసిన కుట్ర ఫలితమే జగన్ అరెస్ట్.

అయినా జగన్‌లోనే జనం, జనంలోనే జగన్ ఉన్నారన్న సంగతి ఎన్నికల ఫలితాలు వచ్చాక గానీ కాంగ్రెస్, టీడీపీలు గుర్తించలేకపోయాయి. జగన్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఏడాదిన్నర దాటినా సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపించలేదు. భారత రాజ్యాంగం ప్రకారం తొంభై రోజుల తర్వాత బెయిల్ పొందే అవకాశం ఉంది కానీ బెయిల్ రానివ్వకుండా చేసి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తోంది ఈ ప్రభుత్వం. ఏది ఏమైనా పేదల ఆపద్బాంధవుడు, ప్రజల పక్షపాతి జగన్ బయటికి వచ్చితీరుతారు. 2014లో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రతిపక్షానికి తగిన గుణపాఠం చెబుతారు.

- ఎం.డి.గౌస్, ఆత్మకూరు, మహబూబ్‌నగర్

సర్వే చరిత్ర ఏంటో తెలుసు: గోనె


 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై మాట్లాడుతున్న కేంద్ర సహాయమంత్రి సర్వే సత్యనారాయణ.. కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సంజయ్‌గాంధీలు ఏ విధంగా చనిపోయారో గుర్తు చేసుకోవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు సూచించారు. సర్వే మాదిరి తామూ మాట్లాడగలమని, కానీ సభ్యత, సంస్కారం కలిగిన వ్యక్తులుగా ఆ పని చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జనరల్ స్థానంలో ఎస్సీ అభ్యర్థి అయిన సర్వేకు టికెట్ ఇచ్చి గెలిపించిన మహానేత ైవైఎస్‌ను తూలనాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు మెంబర్‌గా కూడా గెలవని చరిత్ర ఉన్న సర్వే.. మహానేతపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదన్నారు.

1996లో పార్లమెంటు స్థానానికి లక్ష్మీపార్వతి నేతృత్వంలోని టీడీపీ తరఫున సర్వే పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. సర్వే అంతటి నీచ చరిత్ర, అవినీతిపరుడు మరొకరు ఉండరన్నారు. 2010 ఉపఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డిలో ‘కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ లీడర్లను చెప్పులతో కొట్టండి’ అని చెప్పిన సర్వే మాటకు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రానికి ప్రైవేట్ విమానంలో వచ్చారని, అది ఎవరు సమాకూర్చారో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. జాతీయరహదారులపై దాబాలకు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.కోట్ల లంచం పుచ్చుకున్నారని, వాటిని త్వరలో ఆధారాలతోసహా బయటపెడతానని చెప్పారు.

కోటిమందికి వైఎస్సార్ సీపీ సభ్యత్వం

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత బలోపేతానికి పటిష్టమైన కృషి జరుగుతోందని ఆ పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ కన్వీనర్ డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.గుంటూరు జిల్లా బాపట్లలోని తన నివాసంలో గురువారం ఆయనవిలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా కోటిమందికి సభ్యత్వం ఇవ్వాలని లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, ఇందులో 40 లక్షలమంది క్రియాశీలక సభ్యులు, 60 లక్షల మంది సాధారణ సభ్యులుగా ఉంచాలనేది నిర్ణయమన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఐదుగురి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది క్రియాశీలకసభ్యులకు ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వారికి వివిధరంగాలలో నిపుణులైన వారితో శిక్షణ ఇప్పించి, వారిద్వారా మిగిలిన సభ్యులకు జిల్లా, మండల, గ్రామ స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో రాజకీయ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

స్వలాభం కోసమే పాదయాత్ర


 ‘వస్తున్నా మీ కోసం’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర అతని స్వలాభం కోసమే తప్ప ప్రజల కోసం కాదని విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యులు సుజయ్‌కృష్ణరంగారావు విమర్శించారు. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో సర్కారుకు దన్నుగా నిలిచి పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గురువారం స్థానిక బాలాజీచెరువు సెంటర్ లో చేపట్టిన ఒకరోజు నిరసన దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తే ఇక ప్రజలకు ఎవరు అండగా ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో ప్రజలు కూడా ఇప్పుడు ఇదే విషయంపై ఆలోచనలో పడ్డారన్నారు. 

మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడు తూ విద్యుత్ చార్జీలపై ఆందోళన చేస్తే చంద్రబాబు తన హయాంలో కాల్పులు జరి పించారని, ప్రస్తుతం పెరిగిన విద్యుత్‌చార్జీలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదు ట ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌ను నిత్యం తూర్పారబడుతున్న చంద్రబాబు అవిశ్వాసంపై వెనుకడుగు వేయడంతోనే ఆయన బండారం బయటపడిందన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతిచోటా మొదటి సంతకం అంటూ ఉపన్యాసాలిస్తున్న బాబు తన మొదటి సంతకంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటం నుంచి తొలగించేస్తాడంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలతో సర్కారుపై అవిశ్వాసం పెడితే ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబుకు.. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆయన పర్యటన పూర్తి అయ్యాక చంద్రబాబు నడిచిన దారిని పసుపునీళ్లతో శుద్ధి చేస్తామని పేర్కొన్నారు. 

దీక్షకు అనూహ్య స్పందన: మరో ఒకటిరెండు రోజుల్లో చంద్రబాబు యాత్ర కాకినాడ రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చేపట్టిన నిరసన దీక్షకు అనూహ్య స్పందన లభించింది. దీక్ష సమాచారం తెలుసుకుని ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు స్వచ్ఛందంగా తరలిరాగా కాకినాడతోపాటు జిల్లా నలుమూలల నుంచి కూడా మండుటెండలను సైతం లెక్కచేయక నేతలు, కార్యకర్తలు భారీగా సంఖ్యలో వచ్చి నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఏజేసీ బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారితోపాటు జిల్లాలోని పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రెండు పార్టీల కుతంత్రానికి వ్యతిరేకంగా ఓటేశా


‘‘ఇటీవల జరిగిన అవిశ్వాస సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాడా, వ్యతిరేకంగా ఉంటాడా అన్న సందిగ్ధ సమయంలో నా ఆత్మ సాక్షిగా.. ప్రస్తు తం జరుగుతున్న కుటిలమైన రాజకీయానికి, ప్రభుత్వానికి, రెండు పార్టీల కుతంత్రానికి వ్యతిరేకంగా ఓటు వేశాను’’ అని కృష్ణా జిల్లా పెడన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. అవిశ్వాసంపై ఓటు వేయడానికి ముందే.. తాను వైఎస్ కుటుం బానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. జోగి రమేష్ చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే వీలులేదని పలుమార్లు ప్రజల సాక్షిగా చెప్పిన టీడీపీ నేత చంద్రబాబు.. ఆ పార్టీతో కుమ్మక్కు అయినందునే అవిశ్వాస సమయంలో అసెంబ్లీ సాక్షిగా పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. తనతోపాటు మరికొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచినందుకు గర్వపడుతున్నానని రమేష్ అన్నారు. ఇచ్చినమాట ప్రకారం ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో, విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి సైనికుడిలా పనిచేస్తానన్నారు. జగన్‌ను గురువారం కలిసిన వారిలో మచిలిపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత కూడా ఉన్నారు.

9న రాష్ట్ర బంద్ -వైఎస్సార్ సీపీ పిలుపు

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసన
3న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు
5 నుంచి 14 వరకు ప్రజా బ్యాలెట్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్ణయం
ఉద్యమాల్లో విజయమ్మ పాల్గొంటారని పార్టీ నేత కొణతాల వెల్లడి
బాబు పాలన నాటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే నెల 9వ తేదీన రాష్ట్ర బంద్ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రం అనేక సమస్యలతో అతలాకుతలమవుతున్న తరుణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టి వచ్చేనెల 9కి పదేళ్లు పూర్తవుతుందని, ఇప్పుడు రాష్ట్రంలో అవే పరిస్థితులు తిరిగి నెలకొన్నాయని, అందువల్ల అదే రోజున బంద్ చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వంపై నిరంతర పోరాటం సాగించాలని పార్టీ తీర్మానించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను సమావేశం ఖరారు చేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా బంద్‌కు పిలుపునిచ్చింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రజా పోరాటాన్ని ఉధృతంగా చేపట్టాలని కూడా నిర్ణయించింది.

సమావేశం వివరాలను కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. విద్యుత్ సమస్యపై వామపక్షాలు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ సంఘీభావం ప్రకటించిందని తెలిపారు. ‘‘పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో అతలాకుతలమయ్యారు. అనేక బాధలు పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చారిత్రాత్మకమైన రీతిలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. ఆ యాత్ర చేపట్టి వచ్చే నెల 9వ తేదీకి పదేళ్లు అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు మళ్లీ నెలకొన్నాయి.

అందుకే 9న బంద్ చేపట్టాలని నిర్ణయించాం. ఆనాటి వైఎస్ ప్రజాప్రస్థానం నుంచి ఈనాటి షర్మిల మరో ప్రజాప్రస్థానం వరకూ జరిగిన పరిణామాలను ప్రజలకు వివరిస్తాం. అదే రోజున పార్టీ శ్రేణులు వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించి ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవుతారు. అదే రోజున విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దానికి మేము మద్దతు ప్రకటించాం’’ అని చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరడంతోపాటు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 3వ తేదీన శాసన సభా నియోజకవర్గ కేంద్రాలన్నింటిలోనూ ధర్నాలు జరుగుతాయని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి రోజైన ఏప్రిల్ 5వ తేదీ నుంచి అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీ వరకు విద్యుత్ పరిస్థితిపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యుత్ చార్జీలు పెంచడం సరైనదేనా, కాదా?, కరెంటు సరఫరా బాగుందా, లేదా? అనే అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. మండల, మున్సిపాలిటీ, మేజర్ గ్రామపంచాయతీలతో సహా అన్ని చోట్లా బ్యాలెట్ నిర్వహిస్తామన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వీలునుబట్టి ఈ ఉద్యమాలన్నింటిలోనూ పాల్గొంటారని వెల్లడించారు.

బషీర్‌బాగ్ కాల్పులనూ బాబు బ్లాక్ పేపర్‌లో చేర్చాల్సింది: కొణతాల

విద్యుత్ సమస్యపై బ్లాక్ పేపర్ అంటూ టీడీపీ విడుదల చేసిన పత్రంలోని అంశాలపై కొణతాల తీవ్రంగా దుయ్యబట్టారు. తొమ్మిదేళ్ల పాలనలో దాదాపు ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన ఘనత చంద్రబాబుదని, అలాంటి వ్యక్తి వైఎస్‌పై నిందలేయడమేమిటని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ బషీర్‌బాగ్ వద్ద ఆందోళన చేస్తే మరో జలియన్‌వాలాబాగ్ తరహాలో ఉద్యమకారులను కాల్చి చంపిన విషయం బాబు మరిచారా అని ప్రశ్నించారు.

ఈ కాల్పుల ఘటనను కూడా బ్లాక్‌పేపర్‌లో పొందుపర్చాల్సిందని అన్నారు. ఆ ఉదంతాన్ని బాబు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. బాబు ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులతో చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రజలకు ఎలా అన్యాయం చేశారో ఆ పేపర్‌లో వివరించి ఉంటే బాగుండేదని అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం వల్ల బడ్జెట్‌పై భారం పడుతోందని చెప్పి ఒకేసారి రూ.3,500 కోట్ల మేరకు అన్ని రకాల పన్నులను చంద్రబాబు విధించారని, ఆ తరువాత ఆ రెండు పథకాలను ఎత్తివేశారని తెలిపారు. అప్పటి చంద్రబాబు పాలనకు, ఇప్పటి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనకు ఏమాత్రం తేడా లేదని అన్నారు. అప్పటి విధానాలే ఇప్పుడు పునరావృతమవుతున్నాయని చెప్పారు. రైతులు, సామాన్య ప్రజల కోసం వైఎస్ చేపట్టిన పథకాలన్నింటికీ ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు. అందుకే తమ పార్టీ ప్రభుత్వ విధానాలపై నిరంతర పోరాటం కొనసాగిస్తుందని కొణతాల తెలిపారు.

విజయమ్మతో వామపక్ష నేతల భేటీ

విద్యుత్ సమస్యపై ప్రభుత్వం మెడలు వంచేందుకు తాము చేపట్టిన ఉద్యమంలో కలిసి రావాలని వామపక్షాల నేతలు అజీజ్‌పాషా (సీపీఐ), వై వెంకటేశ్వరరావు (సీపీఎం), జానకి రాములు(ఆర్‌ఎస్పీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కోరారు. వచ్చే నెల 9న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. గురువారం వారు విజయమ్మను ఆమె నివాసంలో కలిసి ఈమేరకు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వామపక్షాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యపై విపక్షాలన్నీ కలిసి పోరాడాలని భావించి అన్ని పార్టీల మద్దతు కోరుతున్నామని చెప్పారు. తమ విన్నపంపై వైఎస్సార్ సీపీ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు.ఈ ఉద్యమంలో వైఎస్సార్ సీపీ చేరితే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవచ్చన్నారు.

ఆయన ఔరంగజేబు కంటే నీచుడు అని ఎన్టీఆర్ గారే చెప్పారు

* కిరణ్ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి.. మరో ప్రజాప్రస్థానంలో షర్మిల నిప్పులు
* వీళ్లు ప్రజలనుంచి వచ్చిన నాయకులు కాదు.. అందుకే ప్రజాసమస్యలు తెలియవు
* వైఎస్సార్ ఒక్కరే ప్రజల నాయకుడు.. ఐదేళ్లు కన్నతండ్రిలా పాలించారు
* చరిత్రకు వన్నె తెచ్చారు.. పేదల పెన్నిధిగా నిలిచారు
* చంద్రబాబు మోసాలకు, అబద్ధాలకు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్
* ఆయన ఔరంగజేబు కంటే నీచుడు అని ఎన్టీఆర్ గారే చెప్పారు
* ఇచ్చిన మాట కోసం జగనన్న.. ఈ మూడేళ్లలోనే జీవితానికి సరిపడా కష్టాలు పడ్డారు 
* కాబోయే ముఖ్యమంత్రిగా జగనన్న చరిత్ర సృష్టించబోతున్నారు

 ‘‘చంద్రబాబు నాయుడు వెన్నుపోట్ల నుంచి వచ్చిన నాయకుడు.. ఆయనకు ప్రజలంటే.. వాళ్ల సమస్యలంటే ఏమిటో తెలియదు. తెలిసిందల్లా ప్రజలను దోచుకోవడం.. దోచుకున్నది దాచుకోవడం.. అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారటం. అలాంటి మనిషి ఇప్పుడు ఆయన ఆవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడు. 

మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే.. ప్రజల పక్షాన నిలబడకుండా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కూలిపోకుండా నెత్తిన పెట్టుకొని కాపాడిన చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘ధనకాంక్షతో.. పదవీ వ్యామోహంతో తండ్రిని జైల్లో పెట్టి, అధికారం కోసం సోదరులను చంపిన ఔరంగజేబు కంటే నీచుడు చంద్రబాబు.

రంగులు మార్చడం, పదవీ కాంక్ష ఆయన రక్తంలోనే ఉంది’ అని ఆనాడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఎన్టీఆర్ అన్న మాటలను షర్మిల గుర్తు చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సాగింది. రాణిగారితోట సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
మామను వెన్నుపోటు పొడిచారు..: చంద్రబాబు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి, మంత్రి పదవి కూడా చేశారు. మంత్రి కదా.. మంచివాడు కాబోలు అని ఎన్టీఆర్ గారు తన కూతురునిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సొంతంగా పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఓడిపోయి ఎన్టీఆర్ పంచన చేరారు. నిజంగా ఆయనకు మామ మీద ప్రేమే ఉంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడే తెలుగుదేశంలోకి వచ్చి చేరేవారు. కానీ పదవి పోయాక.. మామగారి అధికారం కనబడుతుండటంతో అప్పుడు జంప్ అయ్యారు. ఎన్టీఆర్ గారు అల్లుడు కదా.. అని జాలిపడి పార్టీలోకి తీసుకొని ఒక పోస్టును, హోదాను ఇచ్చారు.

కానీ చంద్రబాబు కన్ను ఎన్టీఆర్ పోస్టు మీద పడింది. అంతే.. సొంత మామ అని కూడా ఆలోచించలేదు. హోదా ఇచ్చాడే.. పదవులు ఇచ్చాడే అని ఆలోచించ లేదు. పట్టపగలే కళ్లార్పకుండా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ గారి పార్టీని లాగేసుకున్నారు.. కుర్చీని లాగేసుకున్నారు.. ఆయన్ను అవమానించి మీద చెప్పులు వేయించారు.. ఆఖరుకు ఎన్టీఆర్ ఫోటో గోడ మీద పెట్టి దానికి పూలదండ వేసేందుకు కారకుడు అయ్యారు.

నాయకుడా.. ఖల్ నాయకా?: 
ఇంత చేసి సీఎం అయ్యాక చంద్రబాబు ప్రజల గురించి ఆలోచించారా అంటే అదీ లేదు. వెన్నుపోట్ల నుంచి పుట్టిన నాయకుడు కనుక ఆయన ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఈయన పుణ్యమా అని లక్షల మంది రైతులు వలస పోయారు. వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు గారు మోసానికి, అబద్ధాలకు, కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలబడ్డారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు లేరని స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. బాబు అంతటి ధనవంతుడైన రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే ఎవరూ లేరని తెహెల్కా చెప్పింది. ‘చంద్రబాబు జమానా-అవినీతి ఖజానా’ అని కమ్యూనిస్టులు ఒక పుస్తకమే రాశారు. ఆయనకు తెలిసిందల్లా ప్రజలనుంచి దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడమే. స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన ఆయన్ను నాయకుడు అంటారా? ఖల్ నాయక్ అంటారా?

చరిత్రకు వన్నె తెచ్చిన వైఎస్సార్..
ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ మనిషి వెళ్లిపోయినా చరిత్ర మాత్రం మిగిలిపోతుంది. 15 సంవత్సరాల్లో మన రాష్ట్రం ముగ్గురు ముఖ్యమంత్రులను చూసింది. చరిత్రకు వన్నె తెచ్చిన మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. నాన్న గారిని డాక్టర్‌గా చూడాలనీ, తాను కట్టించిన ఆసుపత్రిలోనే వైద్యం చేయాలని మా అబ్బగారు అంటే వైఎస్ రాజారెడ్డి గారు ఆశపడ్డారు. అనుకున్నట్టుగానే నాన్న ఎంబీబీఎస్ పూర్తి చేసి రాజారెడ్డిగారు కట్టించిన ఆసుపత్రిలోనే ఐదు సంవత్సరాలు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. రాజకీయాల ద్వారా అయితే ఎంతో మంది పేదలకు సేవ చేసే అవకాశం ఉంటుందని వైఎస్సార్ రాజకీయాల వైపు చూశారు.

30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 25 ఏళ్లు వారానికి 2 రోజులు కుటుంబంతో, 5 రోజులు ప్రజలతోనే గడిపారు. 2003లో పాదయాత్ర చేసి రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలనీ, భవిష్యత్తుపై భరోసా కల్పించాలని సంకల్పించారు. మండుటెండలను లెక్క చేయకుండా పాదయాత్రను యజ్ఞంలా చేశారు. ఆ తర్వాత సీఎం అయ్యారు. ఏళ్ల తరబడి నుంచి పేదలకు చేయాలనుకుంటున్న సేవలను ఐదేళ్లలోనే చేశారు. ప్రజలను కన్నతండ్రిలా పాలిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. పేదల పెన్నిధిగా నిలబడ్డారు. ప్రజల కోసమే పుట్టిన మనిషిగా ప్రజల కోసమే బతికారు. విలువలకు, విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 660 మంది ప్రాణాలు వదిలారంటే ఆయన ఎంత ప్రజల మనిషో అర్థం చేసుకోవచ్చు. ప్రజల కోసం బతికిన మనిషిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

కిరణ్ చరిత్రలో అసమర్థ సీఎంగా మిగిలిపోతారు..
ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకోలేదు. ఆయన కూడా అనుకోలేదు. అదృష్టంకొద్దీ ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్‌లో సీఎంగా వచ్చి పడ్డారు. వైఎస్సార్ ఈ కిరణ్‌కుమార్‌రెడ్డిని స్పీకర్‌గా చేయకపోతే సోనియాగాంధీ కంటికి ఆయన కనిపించే వారే కాదు. కానీ ఆ కృతజ్ఞత కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి లేదు. అకారణంగా వైఎస్సార్ మీద ద్వేషం పెంచుకున్నారు. వైఎస్సార్‌ను ప్రజల మనసు నుంచి తుడిచి వేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడిచారు.. మరికొన్ని పథకాలకు పాడె కట్టారు. 

ప్రజలు ఆయన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకే ఒక్కటి.. ఆ ఒక్కటి ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. వైఎస్సార్ తెచ్చిన పథకాలను సక్రమంగా అమలుచేస్తే చాలు అని ప్రజలు కోరుకుంటున్నారనే విషయం కిరణ్‌కు ఇప్పటికీ అర్థం కాలేదు. వైఎస్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ సీఎం వైఎస్సార్ మాటలను బేఖాతరు చేసి ఈ రోజు అన్ని చార్జీలను పెంచారు. వైఎస్సార్ మాటలను నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. వైఎస్ పథకాలను, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోవడమే వీళ్ల వినాశనానికి కారణం కానుందని, ఇదే తథ్యమని ఈరోజు ప్రజల సాక్షిగా చెప్తున్నాం. కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రలో అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోనున్నారని చెప్తున్నా..

ఆ మాట జగనన్న జీవితాన్నే మార్చేసింది: 
జగనన్న గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఓదార్పు యాత్ర చేస్తాను అని తాను ఇచ్చిన ఒక్క మాట ఆయన జీవితాన్నే మార్చేసింది. కాంగ్రెస్ మాట కాదంటే చాలా కష్టాల పాలు చేస్తారని మా మేలు కోరేవారు చాలామంది చెప్పారు. కానీ జగనన్న... ‘నాకు రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను రాజన్న బిడ్డను ఎలా అవుతా..’ అని అన్నారు. ఓదార్పు యాత్ర చేశారు.

కాంగ్రెస్ పెద్దలు కక్ష కట్టారు. సొంత చిన్నాన్న విరోధి కావడం మొదలుకొని దాడులనీ, కేసులనీ, కోర్టులనీ, జైళ్లనీ అన్నీ చూపించారు. 40 ఏళ్లకే జీవితానికి సరిపడా కష్టమంతా నాన్న పోయిన ఈ మూడేళ్ల కాలంలోనే అనుభవించారు. ఒక్కణ్ణి చేసి కుట్రలు పన్నారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు స్వార్థ రాజకీయాల కోసం ఒక అమాయకుడి జీవితాన్ని బలి చేయడానికి వెనుకాడలేదు. రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐ వెనుక దాక్కొని జగనన్న మీద దాడి చేస్తున్నారు. కానీ బోనులో ఉన్నా సింహం.. సింహమే. ఎన్ని కుట్రలు పన్నినా.. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా జగనన్న చరిత్ర సృష్టించబోతున్నారు.

గురువారం 104వ రోజు మరో ప్రజాప్రస్థానం కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని జింఖానా గ్రౌండ్ నుంచి ప్రారంభమైంది. అలంకార్ టాకీస్, అరండల్‌పేట, చిట్టుగుంట, విశాలాంధ్ర సెంటర్, బందర్ రోడ్డు మీదుగా రాణిగారి తోటకు షర్మిల చేరుకున్నారు. ఈ సెంటర్‌లో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పడమట లంకలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. 

గురువారం 10 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,414.1 కి.మీ. యాత్ర పూర్తయింది. 

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 105వ రోజు శుక్రవారం పటమటలంక నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తల శిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కామయ్యతోపు, తాడిగడప వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని తెలిపారు. అనంతరం పోరంకి, పెనమలూరు, గంగూరు జంక్షన్, ఈడుపుగల్లు రోడ్డు, గోసాల చేరిన తరువాత అక్కడే రాత్రి బస చేస్తారు.

పర్యటించే ప్రాంతాలు
పటమటలంక, ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్ గేటు, కామయ్యతోపు, తాడిగడప, పోరంకి, పెనమలూరు, గంగూరు, ఈడుపుగల్లు, గోసాల.

సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ నేతల పర్యటన

రైతులు, నేతన్నల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుంది. పార్టీ నేతలు శుక్రవారం సిరిసిల్ల, జనగాంలలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, కేకే మహేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు హైదరాబాద్ నుంచి పర్యటనకు వెళ్లనున్నారు.

Sharmila's speech at Rani gari thota, Vijayawada

Written By news on Thursday, March 28, 2013 | 3/28/2013

మోసానికి కేరాఫ్ చంద్రబాబు: షర్మిల

అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని షర్మిల విమర్శించారు. ప్రజల సమస్యల గురించి ఆయన ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. పాదయాత్రలో భాగంగా రాణిగారితోటలో జరిగిన బహిరంగసభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. మోసాలకు, అసత్యాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని అన్నారు. కిరణ్ సీల్డ్ కవర్ సీఎం అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆయన తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. 

ఓదార్పుయాత్ర చేస్తానని ఇచ్చిన ఒక్కమాట జగనన్న జీవితాన్నే మార్చేసిందన్నారు. ఓదార్పుయాత్ర చేస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజకీయంగా ఎదగనివ్వదని చెప్పినా జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని గుర్తు చేశారు. రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదు గానీ, మాట నిలబెట్టుకోకపోతే రాజన్న కొడుకును ఎలా అవుతానని జగనన్న అన్నారని షర్మిల చెప్పారు. అందుకే జగనన్నపై కాంగ్రెస్ కక్ష కట్టిందని అన్నారు. త్వరలో బయటకు వచ్చి రాజన్న రాజ్యం దిశగా జగనన్న నడిపిస్తాడని భరోసా ఇచ్చారు

9న బంద్ కు వైఎస్సార్ సీపీ పిలుపు

పెంచిన విద్యుత్ చార్జీలు, ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 3న ధర్నాలు నిర్వహించనున్నట్టు కొణతాల రామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్‌రాం జయంతి నుంచి ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరెంట్‌ చార్జీల పెంపుపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. 

ఏప్రిల్‌ 9న దివంగత నేత వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం ప్రారంభించి 10ఏళ్లు పూర్తైన సందర్బంగా ప్రజా ప్రస్థానానికి పునరంకితమవుతూ రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నాట్టు తెలిపారు. 9న వామపక్ష పార్టీల బంద్‌తో పాటు వైఎస్ఆర్ సీపీ కూడా బంద్‌ నిర్వహిస్తుందని కొణతాల చెప్పారు. ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలంతా కలిసిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా పాల్గొంటారని తెలిపారు.

Konathala Ramakrishna Press Meet 28th March 2013

Left leaders meets YS Vijayamma

Sharmila's gets blessings from Brahmin Pandits

Jogi Ramesh says Goodbye to Congress

వైఎస్ కుటుంబానికి అండగా ఉంటా.

తన రాజకీయ గురువు వైఎస్‌ఆర్‌ అని ఎమ్మెల్యే పెడన జోగి రమేష్ అన్నారు. అవిశ్వాసం సందర్భంగా తన ఆత్మసాక్షిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేశానని చెప్పారు. చంచల్ గూడ జైల్లో జగన్ ను ఆయన కలిశారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... కష్టాల్లో, బాధల్లో ఉన్న వైఎస్ కుటుంబానికి అండగా ఉంటానని రమేష్ చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇకపై వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పనిచేస్తానని అన్నారు

విజయమ్మను కలిసిన వామపక్ష నేతలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను గురువారం లోటస్ పాండ్లో వామపక్ష నేతలు కలిశారు. విద్యుత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తాము చేస్తున్న విద్యుత్‌ ఉద్యమానికి అండగా నిలవాలని అభ్యర్థించారు. సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకుడు అజీజ్‌పాషా, ఆర్ఎస్పీ నేత జానకిరాములు విజయమ్మతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. 

పెరిగిన విద్యుత్‌ కోతలు, సర్‌ఛార్జ్‌ భారం తగ్గించాలని ఏడు వామపక్ష పార్టీల నేతలు అయిదు రోజులపాటు ఇందిరాపార్క్‌లో ధర్నా చేసిన విషయం తెలిసిందే. పోలీసులు దీక్షను భగ్నం చేయడంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మతో సమావేశయ్యారు. కాగా విద్యుత్ కోతలు, సర్‌చార్జీల భారానికి నిరసనగా వచ్చే నెల 9వ తేదీన పది వామపక్ష పార్టీలు రాష్ట్రబంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిం

ఎంపీ టిక్కెట్ కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్న.....

కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ మరణంపై సర్వే సత్యనారాయణ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని గోనె గురువారమిక్కడ మండిపడ్డారు.

ఎంపీ టిక్కెట్ కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్న సందర్భాన్ని సర్వే గుర్తించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. హైవేల నిర్మాణ రూట్లను మారుస్తూ సర్వే అవినీతికి పాల్పడుతున్నారని గోనె ఆరోపించారు. దళిత కార్డును ఉపయోగించి అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారని, ఈ ప్రయత్నాలు సాగవని ఆయన హెచ్చరించారు - 

జగన్ ను కలవనున్న జోగి రమేష్

కృష్ణాజిల్లా పెడన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ములాఖత్ సమయంలో జగన్‌తో జోగి రమేష్ భేటీ కానున్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆయన ఓటు వేసిన విషయం తెలిసిందే.

జింఖానా గ్రౌండ్స్ నుంచి షర్మిల యాత్ర

 వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 104వ రోజుకు చేరింది. గురువారం ఉదయం ఆమె జింఖానా గ్రౌండ్స్‌ నుంచి యాత్రను ప్రారంభించారు. రమాటాకీస్‌, అలంకార్‌ టాకీస్‌, వినోదా టాకీస్‌, అరందాల్‌పేట, సీతారాంపురం మీదుగా షర్మిల చుట్టుగుంట చేరుకుంటారు. 

భోజన విరామం అనంతరం విశాలాంధ్ర సెంటర్‌, మెట్రోసెంటర్‌, శిఖామణిసెంటర్‌, బందర్‌రోడ్‌ మీదుగా రాణిగారి తోట చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం బాలాజీ నగర్‌, పూర్ణచంద్రనగర్‌ మీదుగా.. రామలింగేశ్వరనగర్‌ వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. పడమటలంక రోడ్‌లో రాత్రి బస చేస్తారు. ఇవాళ మొత్తం 10 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారు.

బ్లాక్ పేపర్‌లో చీకటి కోణాలేవీ!



తొమ్మిదేళ్ల పాటు సాగిన చం ద్రబాబు చీకటి పాలనలో కరెంటు చార్జీల పెంపు పేరిట ప్రజలు వరసగా నిలువుదోపి డీకి గురైన వైనం నుంచి దృష్టి మళ్లించడానికే టీడీపీ విద్యుత్ రంగంపై బ్లాక్ పేపర్ విడుదల చేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ పార్టీ ఇలా ఒక బ్లాక్ పేపర్‌ను అదీ విద్యుత్ రంగంపై విడుదల చేయడం విడ్డూరం. విద్యుత్ రంగానికి సంబంధించి తన హయాంలో అనుస రించిన,అవలంబించిన అపసవ్య అస్తవ్యస్త విధానాలను ప్రజలు మరిచిపోయారని చంద్రబాబునాయుడుగారు భ్రమపడుతున్నట్లుంది.

తన ప్రత్యక్ష మద్దతుతో మనుగడ సాగిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాకుండా దివంగత మహానేత డా. వైఎస్. రాజశేఖరరెడ్డిని టార్గెట్ చేయడానికే టీడీపీ ఈ బ్లాక్ పేపర్‌ను విడుదల చేసిందన్నది సుస్పష్టం. డా. వైఎస్ గారి హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల వ్యయాల పెంపునకు సం బంధించి అనిర్దిష్ట, అస్పష్ట ఆరోపణలు చేయడం కాకుం డా ఏయే ప్రాజెక్టుల వ్యయాలు పెరిగాయో బ్లాక్ పేపర్ విస్పష్టంగా ప్రకటించి ఉంటే బాగుండేది.

ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ముఖ్యకారణాల్లో ఒక టైన పదేళ్ల టీడీపీ పరిపాలనలోని విపరీతమైన అవినీతి, అసమర్థతల గురించి కూడా చర్చించి ఉంటే బ్లాక్ పేపర్‌కు కొంతైనా విశ్వసనీయత వచ్చి ఉండేది.

విద్యుత్ సంక్షోభానికి సంబంధించి రాష్ట్ర ప్రజల మన సుల్ని తొలుస్తున్న అంశాలు మూడు.
అ. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో విద్యుత్‌కు కొరత ఎందుకు ఏర్పడింది?
ఆ. మన రాష్ట్ర రాబడులు మునుపెన్నడూ లేనంతగా గత నాలుగేళ్లలో గణనీయంగా పెరిగినప్పటికీ భారీగా కరెంటు చార్జీలు ఎందుకు పెంచు తున్నట్లు?
ఇ. వైఎస్‌ఆర్ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో వ్యవ సాయానికి 7 గంటలపాటు ఉచిత విద్యుత్ అం దిస్తూ కూడా ఏ వర్గానికీ కరెంటు చార్జీలు పెం చకుండా ఎలా విద్యుత్తు రంగాన్ని నిర్వహించ గలిగింది?

బ్లాక్ పేపర్ భావిస్తున్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్న విద్యుత్ సంక్షోభానికి కారణం విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు లేకపోవడం కాదు. ఈ విషయం చంద్రబాబుకు ఇంకా అవగతమైనట్లు కనిపించడం లేదు. ఇవాళ మనకు విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యానికి కొరత లేదు. కానీ కావలసినంత బొగ్గు, గ్యాస్‌లేకపోవడమే అసలు సమస్య. మనకు మరో 5 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ దానికి కావలసిన ఇంధనం లేకపోతే ప్రయోజనం ఏమిటి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే నేటి విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణం.

గత నాలుగేళ్లుగా ఆదాయంలో కానీ అప్పుల్లో కానీ భారీ పెరుగుదలతో ఆర్థిక వనరులు అందుబాటులో ఉండగా ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తూ వరుసగా కరెంటు చార్జీలను పెంచడాన్ని చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ పేపర్‌లో ఎందుకు నిలదీయడంలేదు?

2008-09లో రూ.62,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 2011-12లో రూ.1.09 లక్షల కోట్లకు, 2013-14లో రూ.1.27 లక్షల కోట్లకు చేరుకున్న విష యం చంద్రబాబుగారికి తెలియదా?

కేవలం గత నాలుగేళ్లలో సుమారు రూ.50,000 కోట్ల మేర రాష్ట్ర వార్షికాదాయం పెరగ గా, తరచుగా కరెం టు చార్జీలను ఎందుకు పెంచుతున్నారని చంద్రబాబు నాయుడుగారు ప్రభుత్వాన్ని తాను బ్లాక్ పేపర్ అంటున్న దానిలో ఎందుకు నిలదీయలేదు?

2008-09లో రూ.93 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర రాష్ట్ర రుణాలు 2012-13 నాటికి రూ.1.55 లక్షల కోట్లకు చేరి కేవలం నాలుగేళ్లలోనే రూ.62,000 కోట్లకు పెరి గిన వాస్తవం చంద్రబాబుగారికి తెలియదా? 2013- 14లో రాష్ట్ర ప్రభుత్వం రూ.25,000 కోట్ల మేర అద నంగా అప్పులు తేవడం లేదా?

బడ్జెట్, బడ్జెటేతర మార్గాల ద్వారా సమకూరుతున్న డబ్బునంతా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లని చంద్ర బాబుగారు తన బ్లాక్ పేపర్‌లో ఎందుకు నిలదీ యలేదు?

ఇన్ని లక్షల కోట్లు అదనంగా ఆర్థిక వనరులు సమకూ ర్చుకున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దెబ్బ తీసింది. బీదల్లో వృద్ధులకు, వితంతువులకు, వికలాం గులకు ఇచ్చే ఫింఛన్‌లో ఒక్క రూపాయి కూడా పెం చలేదు. వచ్చిన డబ్బంతా మరి ఎక్కడ ఖర్చు పెట్టా రని చంద్రబాబునాయుడు గారు ఎందుకు ప్రశ్నిం చడం లేదు?

రాష్ట్ర వనరులు గణనీయంగా పెరిగినప్పటికీ తరచుగా ప్రభుత్వం భారీగా కరెంట్‌చార్జీలను ఎందుకు పెంచు తోందని చంద్రబాబుగారు బ్లాక్ పేపర్‌లో ఎందుకు ప్రశ్నించలేదు?

కాగ్, మీడియా, విపక్షం, కోర్టుల విమర్శలకు జడిసి కేంద్ర ప్రభుత్వం అన్ని కీలమైన అంశాలపై నిర్ణయం తీసుకోవడం మానేసింది. అటవీ అనుమతులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంవల్ల గత మూడే ళ్లుగా బొగ్గు ఉత ్పత్తి దాదాపు నిలిచిపోయింది. దీని వల్ల అనేక బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు సమస్యను ఎదు ర్కొంటున్నాయి.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ధర స్వదేశీ బొగ్గుతో పోల్చితే రెట్టింపు. 2012లో మన బొగ్గు దిగు మతులు 80 మిలియన్ టన్నులు. రాగల సంవత్స రాల్లో ఇది 185 మిలియన్ టన్నులకు చేరగలదని కేంద్ర ఆర్థికమంత్రి చెబుతున్నారు. ఒకవేళ అంత భారీగా బొగ్గును ఎక్కువ ఖరీదు పెట్టి దిగుమతి చేసు కుంటే విద్యుదుత్పత్తి వ్యయం ఎంతకు చేరుతుంది.?

నానాటికీ గ్యాస్ ఉత్పత్తి తగ్గుతూపోతున్నది. రిల యన్స్ ఇండస్ట్రీస్ మినహా 2002లో కేజీ బేసిన్ కాం ట్రాక్టులు పొందిన తక్కిన మూడు కంపెనీలు ఇంత వరకూ ఒక్క క్యూబిక్ మీటర్ గ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేయలేదు. అయినప్పటికీ వాటి మీద చర్యలు లేవు. తాజా గ్యాస్ బ్లాకుల అన్వేషణ కేటయింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివల్ల దేశం దేశీయ ఉత్ప త్తితో పోల్చితే మూడు రెట్లు అధిక వ్యయంతో కూడిన దిగుమతులపై ఆధారపడవలసివస్తోంది.

బొగ్గు, గ్యాస్ లేకపోతే దేశంలో విద్యుదుత్పత్తి మెరుగు పడేదెలా? విద్యుత్తు లేనిదే వృద్ధిని ఆశించగలమా? వృద్ధి లేకుండా సామాజిక న్యాయం ఎక్కడిది?

దివంగత మహానేత వైఎస్‌ఆర్ హయాంలోలాగా మన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యాస్ సరఫరా సాధించలేకపోతోంది?
1994-2004 మధ్య విద్యుత్ రంగంపై టీడీపీ ప్రభు త్వం పనితీరుకు సంబంధించిన అనేక వాస్తవాలను బ్లాక్ పేపర్ మరుగుపరిచింది. ఆ పదేళ్లకాలంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని భ్రష్టుపట్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఒకప్పుడు విద్యుత్తు బోర్డు పరిస్థితి ఎలా ఉంది? చం ద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఆ తర్వాత నేడు పరిస్థితి ఏమిటి? 1989 నుంచి 1994 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ఏపీఎస్‌ఈబీ నిర్వహణ లాభాలతో కొనసాగిన మాట వాస్తవం కాదా?

ఆ తర్వాత చంద్రబాబునాయుడు గారు ముఖ్యమం త్రిగా ఉన్న 1994 నుంచి 2004 వరకు అంటే టీడీపీ హయాంలో... ప్రతి ఏడాది ఏపీఎస్‌ఈబీ నష్టాలతో సతమతమై, అంతా కలిపి మొత్తం రూ.20 వేల కోట్ల మేర భారీనష్టాలు పేరుకుపోయినమాట నిజంకాదా?

టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు. దాని పర్యవసానం మొత్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 1994 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం రెవెన్యూ మిగులు కాస్తా చంద్రబాబునాయుడుగారు విద్యుత్ సంస్థతో ఆడిన చెలగాటం ఫలితంగా తలకిందులై ఏకంగా రూ.22 వేల కోట్లు లోటు పేరుకుపోయిన సంగతి వాస్తవం కాదా?

టీడీపీ నిర్వాకం కారణంగా 1994 మార్చి 31 నాటికి 101:100గా ఉండిన ఆస్తులు-అప్పుల నిష్పత్తి కాస్తా 1994-2004 మధ్యకాలంలో 45:100కు పడిపోవడం వాస్తవం కాదా?

2004-09 మధ్య కాలంలో అంటే మహానేత వైఎస్ హయాంలో 31-3-2009 నాటికి ఈ నిష్పత్తి 120:100కు పెరిగిన మాట నిజం కాదా?
లాభాల్లో ఉన్న సంస్థను ఏటా నష్టాలే మిగిలేలా ఊబి లోకి తోసేసి, ఆ సంస్థను సంస్కరించానని చెప్పుకుం టున్నారంటే, ఇదేనా చంద్రబాబుగారు ఎమ్మే ఎకనా మిక్స్ చదవడం ద్వారా నేర్చుకున్న చదువు అనే అను మానం కలుగుతోంది.

{పతి ఏడాదీ అన్ని వర్గాలకు సంబంధించిన వినియో గదారుల కరెంటు చార్జీలను ఠంఛనుగా పెంచుతా మని ప్రపంచబ్యాంకుతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నమాట వాస్తవం కాదా?

వైఎస్ పాలనలో 2003-04లో రూ.800 కోట్ల యూని ట్లుగా ఉన్న వ్యవసాయ విద్యుత్ వినియోగం, 2008- 09 నాటికి 1500 కోట్ల యూనిట్లకు చేరినప్పటికీ ఎన్నడూ ఏ వర్గానికీ కరెంటు చార్జీలు పెంచని మాట వాస్తవం కాదా?

2004తో పోల్చితే 2009లో పారిశ్రామిక విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు 75 పైసలు తక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా?

విద్యుత్ చార్జీలను మాత్రమే కాదు వ్యాట్ రేటు, ఆర్టీసీ చార్జీలు, నీటి బిళ్లులు, మునిసిపల్ టాక్సులు ఏవీ కూడా 2004-09 మధ్య కాలంలో ఒక్కసారి కూడా పెంచని మాట వాస్తవం కాదా?

టీడీపీ హయాంలో 5.7 శాతంగా ఉన్న రాష్ట్ర వార్షిక ఆర్థిక వృద్ధిరేటు... ఆ తరువాత వైఎస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, నాణ్యమైన కరెంటు సరఫరా చేయడం, రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ వంటి కారణాల వల్ల 2004-09 మధ్య కాలంలో 9.07 శాతానికి పెరిగిన మాట నిజం కాదా?

టీడీపీ హయాంలో కేవలం 8 శాతంగా ఉన్న వస్తూత్ప త్తిరంగం వార్షికవృద్ధి రేటు వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలవల్ల 2004-09 మధ్యకాలంలో 13 శాతంగా నమోదై రికారు వృద్ధి సాధించిన మాట వాస్త వం కాదా?

వ్యవసాయరంగం వార్షిక వృద్ధిరేటు చంద్రబాబు గారి హయాంలో కేవలం 3.25 శాతం కాగా ,వైఎస్ హయాంలో అది 6.87 శాతం కావడం నిజం కాదా?

టీడీపీ ఇచ్చిన బ్లాక్ పేపర్‌లో 2004 తరవాత ప్రైవేటు విద్యుదుత్పత్తిదారుల నుంచి ఎక్కువగా విద్యుత్ కొనుగోలు చేశారని తప్పుపట్టారు. ఎంత హాస్యా స్పదమైన ఆరోపణ? చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో ఆర్థిక సంస్కరణలకు తానే ఆదిపురుషు డినని, ప్రైవేటీకరణకు తానే రియల్
చాంపియన్‌నని చెప్పుకున్న మాట వాస్తవం కాదా?

1995 ఫిబ్రవరి 17-18 నాడు కనీసం ఆదాయం పన్ను చెల్లింపుదారులు కాకపోయినా, 10 వేల మెగా వాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్థ్యానికి సంబం ధించి వివిధ ప్రైవేటుసంస్థల వారితో హడావుడిగా అర్థరాత్రి 23 ఎంఓయూలు కుదుర్చుకున్నది ఎవరి ప్రభుత్వం? ఈ చీకటి ఒప్పందాలే రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్ చేయలేదా?

విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ ఈఏఎస్ శర్మ సలహాను ఖాతరు చేయకుండా అర్థరాత్రి సంతకాల వ్యవహారంతో యావద్దేశం నివ్వెరబోయిన మాట వాస్తవం కాదా? ఇలా అవమానించడంవల్ల డాక్టర్ శర్మ ఢిల్లీ సర్వీసులకు వెళ్లి కేంద్ర విద్యుత్‌శాఖ కార్య దర్శిగా నియమితులయ్యారు.

మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించిన ముద్దనూరు విస్తరణ ప్రాజెక్టును రద్దుచేసి, 23 అర్థరాత్రి ఎంఓయూలలో భాగంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించింది టీడీపీ కాదా?

టీడీపీ బ్లాక్ పేపర్ దీనిని ఎందుకు ప్రస్తావించలేదు?

31-3-1997 నాడు టీడీపీ ప్రభుత్వం 6 నాఫ్తా ఆధా రిత స్వల్పవ్యవధి పవర్ ప్రాజెక్టుల కోసం యూనిట్‌కు 97 పైసలు మొదలుకుని 135 పైసల వరకు ఫిక్స్‌డ్ పవర్ టారిఫ్‌లతో పీపీఏలు కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా?

నాడు ముద్దుకృష్ణమనాయుడుగారు, ఇతర పార్టీల వారితో కలిసి దీనిపై రాద్ధాంతం చేయలేదా?అది పెద్ద కుంభకోణం కాలేదా?

టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి యూనిట్‌కు 97 పైసల చొప్పున అన్ని ప్రాజెక్టులకు సమానంగా ఫిక్స్‌డ్ టారిఫ్‌ను అమలు చేసేలా ఒత్తిడి తెచ్చిన ఘనత వైస్‌ది కాదా?

గత పనితీరు, ఆర్థిక సామర్థ్యం, ఆనుభవం ఆధా రంగా ఐసీఐసీఐ షార్ట్ గెస్టేషన్ పవర్ ప్రాజెక్టుల బిడ్లను అంచనా కట్టగా దాని ఆధారంగా టీడీపీ ప్రభు త్వం కేబినెట్ ఆమోదంతో ప్రాజెక్టులను వారికి కట్టబెట్టింది.
కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం పూర్తిగావేరు. ప్రమోటర్లు మారిపోయారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రదే శాలు మారిపోయాయి. ఇదంతా కేబినెట్ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఆకస్మికంగా ఎక్కడి నుంచో ఊడిపడిన టీడీపీ సభ్యుడు ఎంవీవిఎస్ మూర్తి కి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఒక స్వల్పకాలిక విద్యుత్‌ప్రాజెక్టును కట్టబెట్టారు. 

సుమారు 200 మెగావాట్ల నాఫ్తా ఆధారిత పవర్ ప్రా జెక్టులను ఆమోదించడం ఆత్మహత్యాసదృశం కాదా?

విపక్షాలన్నీ ఒత్తిడి చేయగా టీడీపీ ప్రభుత్వం ఆ తరు వాత విద్యుత్ ప్రాజెక్టుల ఇంధనం వాడకంలో మార్పు చేసిన మాట వాస్తవం కాదా?

కేజీ బేసిన్‌లో గ్యాస్ అందుబాటులో లేనందున విద్యు త్ ప్రాజెక్టుల ఇంధనాన్ని నాఫ్తా నుంచి బొగ్గును మార్చాలని అప్పట్లో విపక్షాలు స్పష్టంగా చెప్పడం వాస్తవం కాదా?

విపక్షాలే కాకుండా గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు వద్దం టూ విద్యుత్ రంగ నిపుణులు కూడా నాడు టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్యాస్ సరఫరా చేయ లేని పక్షంలో ఎలాంటి పెనాల్టీ చెల్లించడానికి గెయిల్ ముందుకురాకపోయినప్పటికీ ఎందుకు టీడీపీ ప్రభు త్వం విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు గ్యాస్‌ను ఎంచు కున్నట్టు?

గ్యాస్ సరఫరా చేయకపోయినా ప్రభుత్వం పరిహారం కోరలేక నిస్పహాయంగా ఉండిపోవడానికి ఈ తప్పు డు నిర్ణయం కారణం కాదా? ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఇదే అతిపెద్ద ఏకైక కారణం కాదా?

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన ఎంవీవీఎస్ మూర్తికి బలిమెల హైడ్రోప్రాజెక్టును కట్టబెట్టడం వాస్తవం కాదా?

1997లో ఏపీజీపీసీఎల్ గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజె క్టును కేవలం మెగావాట్‌కు రూ.2.7 కోట్లకు అమలు చేస్తుండగా జీవీకే, స్పెక్ట్రమ్ వంటి ప్రైవేటు ప్రాజెక్టు లను మెగావాట్‌కు రూ.5 కోట్లకు అనుమతించింది చంద్రబాబాబు కాదా?

అప్పుడంతా ప్రైవేటీకరణతో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన టీడీపీ ఇప్పుడు ప్రైవేటీకరణ ప్రస్తావన తెచ్చి వైఎస్‌ను ఆడిపోసుకోవడం విడ్డూరంకాక మరేమిటి?

ఏ విధంగా చూసినా టీడీపీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ అర్ధసత్యాలతోనూ, అవాస్తవాలతోనూ కూడు కున్న నిష్ర్పయోజక పత్రం మాత్రమే.

Popular Posts

Topics :