23 August 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రేపు వైఎస్ఆర్ సీపీఎల్పీ సమావేశం

Written By news on Saturday, August 29, 2015 | 8/29/2015


రేపు వైఎస్ఆర్ సీపీఎల్పీ సమావేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఆ పార్టీనేతలు సమావేశం కానున్నారు.

చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు ఏకతాటి మీద నిలబడి  బంద్ చేస్తే.. చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మరీ బంద్ను విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం నాడు రాష్ట్ర బంద్ ముగిసిన అనంతరం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
  • సీఎం చంద్రబాబే ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని బంద్ను విఫలం చేసేందుకు విజయవాడకు వెళ్లి అక్కడే కేబినెట్ మీటింగ్ పెట్టి, జిల్లాల వారీగా మానిటర్ చేసి, రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్లుగా సెక్షన్ 144 అమలుచేశారు.
  • వేల సంఖ్యలో పోలీసులను మోహరించి, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. వేలసంఖ్యలో కార్యకర్తలనుఅరెస్టు చేశారు.
  • విద్యార్థులను కొట్టి, ఈడ్చుకుంటూ పోయారు. మహిళలని కూడా చూడకుండా వారిని సైతం వాళ్లను ఎత్తి వ్యాన్లలోకి విసిరేశారు.
  • ఈదృశ్యాలన్నీ టీవీలలో కనిపించాయి. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా అనిపిస్తోంది.
  • కనీసం కేబినెట్ సమావేశంలోనైనా ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రానికి తీర్మానం చేశారా అంటే, ఆ ప్రస్తావనే లేదు.
  • తన కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ రాస్తారేమోనని చూశాం. ఆ ప్రస్తావనే లేదు.
  • ఆయన తీరు చూస్తే అసలు తాను ప్రత్యేక హోదాకు వ్యతిరేకమని రాష్ట్ర ప్రజలంతా తెలుసుకునేలా చేశారు.
  • రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తుకోసం ఈ ప్రత్యేక హోదా కోసం బంద్కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
  • స్వచ్ఛందంగా సహకరించిన వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, పార్టీ కార్యకర్తలు అందరికీ, ముఖ్యంగా వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసేసినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
  • అసలు ప్రత్యేక హోదా అన్నది ఎందుకింత చర్చనీయాంశమైందో, దానివల్ల వచ్చే లాభాలేంటో ప్రతి సందర్భంలోనూ చెబుతూ వచ్చాం.
  • అది వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రత్యేక హోదా వస్తే ప్రధానంగా రెండు మంచిపనులు జరుగుతాయి.
  • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి గ్రాంటులు 90 శాతం, రుణాలు 10 శాతం అవుతాయి.
  • లేకపోతే గ్రాంటులు 30 శాతం కాగా, 70 శాతం రుణం అవుతుంది. అంటే.. కేంద్రం మనకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాల్సి వస్తుంది.
  • మరో మేలు ఏంటంటే.. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవాళ్లకు ఎక్సైజ్, సేల్స్, ఇన్ కం ట్యాక్స్ మినహాయింపులు వస్తాయి.
  • అవి వస్తేనే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. పరిశ్రమలు పెట్టే ప్రయత్నం చేస్తారు.
  • అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే.
  • ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది.
  • 972 కిలోమీటర్ల తీరప్రాంతం మనకుంది. ఎన్నెన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్నెన్ని ఉద్యోగాలు వస్తాయి..
  • ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు మాత్రం ఆశ్చర్యంగా దీనిగురించి పోరాటం చేయడంలో వెనకడుగు వేశారు. దీనికి కారణమేంటి?
  • ఒకసారి కేంద్రం ప్రత్యేక హోదా తీసేసిందంటారు, మరోసారి 14వ ఆర్థికసంఘం వద్దని చెప్పిందంటారు. ఎందుకిన్ని అబద్ధాలు?
  • మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా  గురించి ప్రశ్న అడిగారు.
  • దానికి లిఖితపూర్వంగా వాళ్లు సమాధానం ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోందని చెప్పారు. అంటే, కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వచ్చని అర్థం.
  • ఒకసారి మహారాష్ట్ర, ఒకసారి ఒడిషా, ఒకసారి తమిళనాడు వద్దంటున్నాయని చెబుతారు. కానీ ఈ రాష్ట్రాలన్నీ ఎన్నికలకు ముందు లేవా? అప్పుడు వాళ్లు వద్దంటున్న సంగతి తెలియదా?
  • అప్పుడు ఐదు కాదు, పదేళ్లు ఇస్తామని చెప్పారు. అది మోసం అని ఇప్పుడు అనిపించడం లేదా?
  • అసలు 14వ ఆర్థిక సంఘం ఏం చెబుతోంది, ఏం చెప్పదో మీకు తెలియదా? అయినా ఎందుకు మభ్య పెడుతున్నారు?
  • అసలు ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేదు. ఏ ఆర్థిక సంఘమైనా నాన్ ప్లాన్ గ్రాంటులు, కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచడం.. ఈ రెండు అంశాలనే పట్టించుకుంటుంది. ప్లాన్ గ్రాంటు, ప్లాన్ లోటు గురించి పట్టించుకోదు.
  • ప్రధాని చైర్మన్గా ఉన్న నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మాత్రమే ప్రత్యేక హోదాను నిర్ణయిస్తుంది.
  • ప్రత్యేక హోదా ఇవ్వాలని గత కేబినెట్లోనే తీర్మానం చేశారు. నిర్ణయం జరిగిపోయినప్పుడు దాన్ని ఆపడం ఎంతవరకు సమంజసమని అడిగితే సమాధానం చెప్పరు.
  • ఇప్పుడు కొత్తగా ప్రత్యేక హోదా కన్నా స్పెషల్ ప్యాకేజి ముద్దు అని చెబుతున్నారు.
  • రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పోలవరం ప్రాజెక్టు, ఇతర పనులు చేస్తామని హామీలు ఇచ్చారు. చట్టంలో కూడా పెట్టారు.
  • వాటికి ఎంత డబ్బు ఖర్చవుతుందో అందరికీ తెలుసు. ఆ డబ్బే ఇస్తామని చెబుతుంటే, దాన్ని ఏదో కొత్తగా ఇస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆ ప్యాకేజి డబ్బు మా హక్కు.
  • ప్రధాని పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు టీడీపీ, బీజేపీ అన్నీ పార్లమెంటులో ఉన్నాయి.
  • అలాంటి హామీనే తుంగలో తొక్కేశారు. పార్లమెంటుకు, పార్లమెంటులో ఇచ్చిన హామీకే క్రెడిబులిటీ లేకపోతే ఇక ఎవరివైపు చూడాలి? నిజంగా ఇది అన్యాయం కాదా?
  • ఈ ప్రశ్నలు వేస్తూ చంద్రబాబు తన కేంద్రమంత్రులను ఎందుకు ఉపసంహరించుకోలేదు?
  • చంద్రబాబు ప్రధానితోను, అరుణ్ జైట్లీతోను గంటన్నర సమావేశం అయ్యారు, కానీ అంత సేపట్లో ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు.
  • చంద్రబాబును గట్టిగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం.
  • ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వాళ్ల ఆకాంక్షలు ఏంటో చూశారు.
  • ఎంత తొక్కిపెట్టినా మీవల్ల కాదని చెప్పారు.
  • చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దు, జ్ఞానోదయం చేసుకోండి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మీ మంత్రులను ఉపసంహరించుకోండి.
  • ఈ పోరాటాన్ని ఇంతటితో ముగించేది లేదు. అసెంబ్లీలో కూడా దీనిపై చంద్రబాబును గట్టిగా నిలదీసేందుకు ప్రయత్నిస్తాం.

తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

తిరుపతి: తిరుపతి పట్టణంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలో పార్టీ నాయకులు బంద్ చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. షాపులు, వ్యాపార సంస్థలు స్వచ్ఛంధంగా మూతపడ్డాయి.
 

ఆరేళ్లయినా ప్రజలు మరవలేదు


ఆరేళ్లయినా వైఎస్‌ను ప్రజలు మరవలేదు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి
 
తొర్రూరు/పాలకుర్తి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరేళ్లుగాగా భౌతికంగా మనమధ్య లేకున్నా.. ప్రజలు ఆయన చేసిన సేవలు మరువ లేదని వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో వైఎస్సార్ అభిమానులు పొంగులేటితో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఘనస్వాగతం పలికారు. బోనాలు, బతుకమ్మలు డప్పు చప్పుళ్లతో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కాందాడి అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వారికి   ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పల్లెలో వైఎస్ హయాంలో ప్రతి ఇంటిలో లబ్ధి సొందిన వారు ఉన్నారని అన్నారు.

వైఎస్ ఆకస్మిక మరణం తరువాత అధికారంలో ఉన్న వారు ఆ పథకాలను అమలు చేయలేక పోయారని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ బలోపేతం కావడం ఖాయమన్నారు.కార్యక్రమంలో  వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి , జిల్లా నాయకులు విలియమ్స్, ఇర్మియా, ముగిగా కళ్యాణ్‌రాజ్, అప్పం కిశోర్, మహిపాల్ రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, నీలం లక్ష్మయ్య, బిజ్జాల అశోక్, కర్ర అశోక్ రెడ్డి, కృష్ణమూర్తి, మాడరాజు యాకయ్య, గుడ్ల వెంకన్న, లక్ష్మన్ పాల్గొన్నారు.

32 కుటుంబాలకు ఓదార్పు అడుగడుగునా నీరాజనం


మళ్లొస్తా..
ముగిసిన మొదటి విడత యాత్ర
 
చివరి రోజు నాలుగు కుటుంబాలకు పరామర్శ
ఐదు రోజులు.. 32 కుటుంబాలకు ఓదార్పు
అడుగడుగునా నీరాజనం
 

వరంగల్ : సంక్షేమ పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శ యాత్ర ముగిసింది. ఆగస్టు 24 నుంచి 28 వరకు సాగిన పరామర్శయాత్రలో భాగంగా షర్మిల జిల్లాలో 32 కుటుంబాలను ఓదార్చారు. ఐదో రోజు శుక్రవారం పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లోని నాలుగు కుటుంబాలను పరామర్శించారు. గీసుగొండ మండలం మరియపురం నుంచి తీగరాజుపల్లి, రామచంద్రాపురం, ఏనుగల్లు, సాయిరెడ్డిపల్లె, దౌలత్‌నగర్, పర్యతగిరి, కల్లెడ, అన్నారం మీదుగా సో మారంలో యాత్ర ముగిసింది. మృతుల కుటుంబ స భ్యులను కలుసుకొని పరామర్శించారు. వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. పరామర్శ యాత్ర సందర్భంగా జిల్లాలో షర్మిల పర్యటనకు మంచి స్పందన కనిపించింది. తొలి విడతలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో షర్మిల పరామర్శ యాత్ర సాగింది. గ్రేటర్ వరంగల్‌తోపాటు అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది.

 ఏడోరోజు యాత్ర సాగిందిలా..
 పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం గీసుగొండ మండలం మరియపురం నుంచి బయలుదేరారు. సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వర్షాలు సకాలంలో కురవక, పంటలు పండక జీవనం ఇబ్బందిగా మారిందని అక్కడి వారు షర్మిలకు చెప్పారు. మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని షర్మిల వారికి చెప్పారు. అనంతరం పర్వతగిరి మండలం ఏనుగల్లులోని పెడ్యాల చంద్రకళ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. తర్వాత పర్వతగిరిలోని పల్లూరి కొమురమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. చివరగా తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. చివరి రోజు సాగిన పరామర్శయాత్ర మార్గంలోని ప్రతి ఊరిలో, తండాల్లో ప్రజలు రహదారుల వెంట ఉండి ప్రజలు షర్మిలకు స్వాగతం తెలిపారు. ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. షర్మిల ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ‘నమస్తే అన్న.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లి.. నమస్తే పెద్దయ్య’ అంటూ ముందుకు సాగారు.

 షర్మిల వెంట..
 వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొం డా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్‌రెడ్డి, ఇతర జిల్లాల అధ్యక్షులు బి.అనిల్‌కుమా ర్, ఎస్.భాస్కర్‌రెడ్డి, జి.సురేష్‌రెడ్డి, ఎం. శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు  బి.రఘురాంరెడ్డి, కె.కుసుమకుమార్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, కె.వెంకట్‌రె డ్డి, విలియం మునిగాల, ఎం.శంకర్, షర్మిల సంపత్, టి.నాగరావు, సెగ్గం రాజేష్, నాడెం శాంతికుమార్, జా ర్జ్ హెర్బర్ట్, జి.శివ, ఎ.సంతోష్‌రెడ్డి, ఆకుల మూర్తి, వన జ, జి.సుమన్‌గౌడ్, జె.అమర్‌నాథ్‌రెడ్డి, సాదు రమేష్‌రె డ్డి, జిల్లా నాయకులు ఎం.కల్యాణ్‌రాజు, ఎ.మహిపాల్‌రె డ్డి, నెమలిపురి రఘు, అమరేందర్‌రెడ్డి, చరణ్, మాధవరెడ్డి, కాగిత రాజ్‌కుమార్ యాదవ్, సం గాల ఇర్మియా, పుజారి సాంబయ్య, అచ్చిరెడ్డి, ఎ.కిషన్, సుమిత్‌గుప్తా, ఇతర జిల్లాల నేతలు బి.సుధాకర్, టి. ఇన్నారెడ్డి, ఎం.నిరంజన్‌రెడ్డి, ఎన్.క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
 

హోదా లేని రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చిన దాఖలాలు లేవు


నితీశ్‌ను చూసైనా నేర్చుకోండి

 హైదరాబాద్: బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీవల్ల ఏమీ ప్రయోజనం లేదంటూ తమకు ప్రత్యేక హోదానే కావాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ డిమాండ్ చేస్తుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ ఇచ్చినా చాలంటూ ప్రాధేయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. నితీష్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని సూచించింది.

పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం సాధారణంగా రాష్ట్రాల్లో అమలు చేసే పథకాల ఖర్చు చేసే మొత్తాలు కాకుండా బీహార్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో అదనంగా చూపించింది కేవలం రూ.5000 కోట్లకు మించి లేదని గణాంకాలతో నితీష్‌కుమార్ వివరించారని గుర్తుచేశారు.

అయినా చంద్రబాబు మాత్రం విభజన తరువాత రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కాదని, కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టాలని చూస్తుంటే సరేనంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఏదో ఇస్తున్నట్టు, ఈయనేదో మోసుకొస్తున్నట్టు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్పటి ప్రధాని ఇచ్చిన హామీతో రాష్ట్రం రెండు ముక్కలయినా ఏపీకి హోదావల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం పెట్టుకున్న ప్రజలు గుండెలు ఇప్పుడు ఆగిపోతున్నాయన్నారు.
 
హోదా లేని రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చిన దాఖలాలు లేవు
ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాలకు తప్ప దేశంలో ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీల పేరుతో ప్యాకేజీ ఇచ్చిన దాఖలాలు లేవని పద్మ తెలిపారు. ఇప్పటివరకు హోదా దక్కిన 11 రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం రాయితీలు కల్పించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో శనివారం నిర్వహించిన తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. చంద్రబాబు తన వంతుగా బంద్‌ను విజయవంతం చేసి, ప్రజల ఆలోచనలను కేంద్రానికి వివరించడం ద్వారా మన రాష్ట్ర హక్కును సాధించాలని పద్మ సూచించారు.

వేకువజాము నుంచే ఎక్కడికక్కడ బంద్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం వేకువజామునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో... పార్టీ శ్రేణులు తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో బస్సులను అడ్డుకున్నారు. షాపులను బంద్ చేయించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 3.30 గంటల నుంచి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బస్టాండ్ నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఆర్టీసీ డిపో ముందు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైఠాయించి బంద్ నిర్వహించాయి.

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచే పట్టణ బంద్ జరిగింది. బస్సులు తిరగకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిలో పార్టీ సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషా పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే అనంపురం జిల్లా పుట్టపర్తి బస్ డిపో ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. చిత్తూరు జిల్లా పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్‌సీపీ బంద్ కారణంగా ఒడిశా, ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి. విశాఖ జిల్లా అరకులో స్వచ్చందంగా బంద్ కొనసాగుతోంది. వ్యాపారస్తులు తమకు తాముగా షాపులు తెరవకుండా బంద్ పాటిస్తున్నారు. పార్టీ శ్రేణులు రహదారిపై ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉదయం 4 గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అంజద్, మేయర్ సురేష్ తదితరులు బంద్‌ను పర్యవేక్షించారు. ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి. గుంటూరు, తిరుపతి ఆర్టీసీ బస్ డిపోల నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

నేతల అరెస్ట్
అనంతపురం పట్టణంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నవీ మహ్మద్, జయరాంనాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ కారణంగా వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చోడవరం, గోవాడ, అంబేరుపురం జంక్షన్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో బస్సులు, ఆటోలు, లారీలు నిలిచిపోయాయి. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్యుతాపురంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో ముందు బంద్ నిర్వహిస్తున్న 53వ వార్డు పార్టీ అధ్యక్షుడు చిక్కాల రమణ, 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

అద్దంకి(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా అద్దంకి బస్టాండ్ వద్ద బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అద్దంకి బస్టాండ్ వద్దకు తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు చేరుకొని బస్సులను అడ్డుకున్నారు.

అనంతరం బస్టాండ్ ఎదట బైఠాయించారు. కాగా,బస్టాండ్ వద్దకు చేరుకున్న పోలీసులు బైఠాయించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కందుకూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ బంద్‌లలో పాల్గొని బస్టాండ్ ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు.  

రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌తో శనివారం ఉదయం కడప-తిరుపతి జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రైల్వే కోడూరు మండలం కుప్పలదొడ్డి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి బంద్ నిర్వహించారు. తాటిమొద్దులు రోడ్డుపై వేసి నిప్పంటించారు. దీంతో ఇరువైపులా 12 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.



రాజమండ్రిలో కొనసాగుతున్న బంద్
రాజమండ్రి: రాజమండ్రి నగరంలో ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున 4గంటలకే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీరరాజులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని డిపోలో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మెయిన్‌రోడ్డులోని దుకాణాలు, బ్యాంకులు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌కు సహాకరించాయి.







నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. శనివారం తెల్లవారుజామున 4గంటలకే వైఎస్సార్ సీపీ జిల్లాలోని పలు డిపోలకు వద్దకు చేరుకొని బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా డిపోల ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.



పార్వతీపురం(విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేశారు. శనివారం పట్టణంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషను పురుష పోలీసులే బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్ ఎక్కించారు.

బంద్‌లో పాల్గొన్న పార్వతీపురం నియోజకవర్గ ఇంచార్జీ జమ్మాన ప్రసన్నకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. పోలీసులు వామపక్షాల నాయకుడు రెడ్డి శ్రీరామమూర్తితో పాటు ఆపార్టీలకు చెందిన పలువురు నాయకులను అరెస్ట్ చేసి లారీల్లో తరలించారు.






విజయవాడలో అరెస్టుల పర్వం


విజయవాడలో అరెస్టుల పర్వం
విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసంవైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన కృష్ణా జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. చాలాచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతుగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేశారు. పెట్రోలు బంక్‌లు, సినిమాహాళ్లు పనిచేయటం లేదు. విజయవాడలో ఉదయం 5 గంటలకే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, కొడాలి నాని, వంగవీటి రాధ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.

జగ్గయ్యపేట బస్‌డిపో ముందు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నాయి. అవనిగడ్డలో తెల్లవారు జాము 3.30 గంటల నుంచి బంద్ కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారావు నేతృత్వం వహించిన ఈ కార్యకమంలో 300 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




Popular Posts

Topics :