10 November 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జగన్ ను కట్టడి చేసేందుకే అరెస్టు చేశారు

Written By news on Saturday, November 16, 2013 | 11/16/2013

రేపల్లె: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని కట్టడి చేసేందుకు ఆయన్ను అరెస్టు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత మోపీదేవి వెంకటరమణ వ్యాఖ్యనించారు. దీనికోసం మంత్రులంతా నీచ రాజకీయాలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలోని రేపల్లె బహిరంగ సభలో ప్రసంగించిన మోపీదేవి తనపట్ల ప్రభుత్వం ప్రదర్శించిన వైఖరిపై మండిపడ్డారు.జగన్ ను ఎదుర్కొలేక అరెస్టు డ్రామా నడిపారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీని కోసం తనను ఎరగ వేసి ఓ పావులా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
'నన్ను అరెస్టు చేసిన అనంతరం సీఎంతో సహా మంత్రులంగా అండగా ఉంటామన్నారు. మా ఇంటికి వచ్చి కుటుంబానికి భరోసా ఇచ్చారు. జైలు నుంచి తీసుకొస్తామన్నారు. తీరా చూస్తే మా మనిషి కాదంటూ నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని 'మోపీదేవి తెలిపారు. తనకు అనారోగ్యం చేస్తే కనీసం పట్టించు కోలేదన్నారు. తాను ఏనాడు ఏ తప్పూ చేయలేదని తెలిపారు. మిగతా మంత్రులను రక్షించి తనను బలిపశువును చేశారన్నారు. ఆ మంత్రులు చేసిన ఒప్పేంటి? తాను చేసిన తప్పేంటో చెప్పాలని కిరణ్ సర్కారును ప్రశ్నించారు. రాష్ట్రంలోని రాజకీయాలు దిగజారి పోయాయని ఆయన తెలిపారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/kiran-kumar-reddy-sarkar-conspiracy-on-me-says-mopidevi-venkataramana-81203

సచిన్, ప్రొ.సీఎన్ ఆర్ రావులకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్


న్యూఢిల్లీ: : దేశ అత్యున్నత పురస్కారమైన 'భారత రత్న'ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ , ప్రముఖ శాస్త్రవేత్త ప్రొ.సీఎన్ ఆర్ రావుకు కేంద్రం ప్రకటించడం పట్ల  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హార్షం వ్యక్తం చేశారు. సచిన్ , రావులకు ఈ సందర్భంగా జగన్ అభినందనలు తెలిపారు. సచిన్ అసమాన ప్రతిభకు భారతరత్న పురస్కారం ప్రకటించడం ముదావహం అని ఆయన పేర్కొన్నారు.
 
సచిన్ అంకితభావం యువతకు స్పూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. అలాగే సైన్స్ రంగంలో ప్రొ.రా వు చేసిన సేవలను జగన్ ఈ సందర్బంగా కొనియాడారు. ప్రొ.రావు ప్రస్తుతం ప్రధానమంత్రి శస్త్ర సాంకేతిక సలహదారునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రొ. రావు పద్మ అవార్డులను కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

Suravaram lauds Jagan efforts to keep State united

సీఎం పదవికి కిరణ్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు?

సీఎం పదవికి కిరణ్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు?
హైదరాబాద్: : సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి శనివారం నిప్పులు చెరిగారు. జులై 30న తెలంగాణ ప్రకటన వెలువడింది... సమైక్యవాదిని అని చెప్పుకుంటున్న ఆయన తన పదవికి ఎందుకు  రాజీనామా చేయలేదని సీఎం కిరణ్ ను శ్రీకాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్టాడుతూ...  విభజన బిల్లు రాష్ట్రపతికి పంపకముందే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని తాము ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని, అయితే ఆ విషయంలో సీఎం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు.
 
మీ కింద పని చేస్తున్న వ్యవస్థలే విభజనకు సహకరిస్తున్నాయన్నది వాస్తవం కాదని సీఎంను విలేకర్ల సమావేశంలో బహిరంగంగా అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత  కేంద్రం విభజన నిర్ణయాన్ని కొంత కాలం వాయిదా వేయాలని సూచించిందని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అ విషయం వాస్తవమా కాదా అని సీఎం కిరణ్ ను మరోసారి ప్రశ్నించారు.  

ఢిల్లీలో జాతీయ పార్లీ నేతలతో వైఎస్ జగన్ భేటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం న్యూఢిల్లీలో  సీపీఎం అగ్రనాయకుడు సీతారాం ఏచూరి,  సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలతోనూ వైఎస్ జగన్ చర్చలు జరిపారు.

విభజన తీరు సరైన సంప్రదాయం కాదు

విభజన తీరు సరైన సంప్రదాయం కాదు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనేది అతి పెద్ద అంశమని, విభజన విషయంలో ఇప్పుడు జరుగుతున్నది సరైన సంప్రదాయం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇదే జరిగితే కేంద్రంలో అధికారంలోఉన్న ఏ పార్టీ అయినా ఎన్నికల్లో లబ్ధికోసం ఏ రాష్ట్రాన్నయినా విభజించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని, రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరని చెప్పారు. ఆర్టికల్‌ -3ని సవరించేలా పోరాడుతామని, భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్తామని తెలిపారు.

భాషాప్రయుక్త ప్రాతిపదిక మీద ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్‌, ఆంధ్ర అసెంబ్లీలు రెండింట మూడొంతుల మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాయని, నాడు తెలంగాణ బిడ్డ, హైదరాబాద్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. తెలుగు ప్రజలు కలిసి ఉండాలని, విశాలాంధ్ర ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ దేశంలో మూడోదని, దేశంలోనే తెలుగు రెండో అతిపెద్ద భాష అయినా.. మమ్మల్ని విడగొట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది రేపు బీహార్‌లో జరగొచ్చు, తమిళనాడులో జరగొచ్చు, లేదా బెంగాల్‌లో జరగొచ్చని, రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటులో 272 సీట్లున్న ఏ ప్రభుత్వమైనా ఒక్క గీత గీసి రాష్ట్రాన్నివిభజించామని చెబుతాయని అన్నారు. ఏపీ విభజనతో కొత్త సంప్రదాయం ఒకటి మొదలవుతోందని, దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

సురవరాన్ని కలిసిన వైఎస్ జగన్ గ్యాలరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం న్యూఢిల్లీలో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలతోనూ వైఎస్ జగన్ చర్చలు జరిపారు.

జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా: సురవరం

జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా: సురవరంవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభినందించారు. రాజ్యాంగంలోని మూడో అధికరణం దుర్వినియోగం కాకుండా చూడాలని జగన్ తమను కోరినట్లు ఆయన తెలిపారు. జగన్ తో పాటు పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా భేటీ అయిన అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన అంశాలివీ...

''జగన్, ఇతర నేతలు అన్ని జాతీయ పార్టీలను కలుసుకునే సందర్భంగా మమ్మల్నీ కలిశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నేను కలిసి వాళ్లతో చర్చించాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయొద్దని, సీపీఐ వైఖరిని పునరాలోచించాలని వారు మమ్మల్ని కోరారు. మూడో అధికరణాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, దానిపై మేం ప్రత్యేకంగా చర్చించాలని కోరారు. రాష్ట్రాలను విభజించే అధికారాన్ని ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చింది. తెలంగాణకు సంబంధించి మా వైఖరిలో పునరాలోచన లేదు. విభజన జరిగి తీరాల్సిందేనని పునరుద్ఘాటించాం. భవిష్యత్తులో పార్లమెంటులో మెజారిటీ ఉండి ఇష్టం వచ్చినట్లు విభజన జరిగే అవకాశం ఉందని, దేశం ముక్కలవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకీ 272 సీట్లు రావు. ఫ్రంటులు ఏర్పడతాయి. అలా ఏర్పడ్డ ఫ్రంటులలో ఏకాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలు విడిపోతామంటే వారిని బలవంతంగా ఆపలేమని, అయితే ఆర్టికల్ 3 దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు న్యాయం చేయడానికి మా పార్టీ నిలుస్తుంది. తెలంగాణ ఏర్పడినంత మాత్రాన ఇతర ప్రాంతాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఉద్యమిస్తాం. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు న్యాయం జరిగిన తర్వాతే విభజన ప్రక్రియ ముందుకు సాగాలి'' అని సురవరం చెప్పారు.

విభజన విషయంలో రాష్ట్రంలోని వివిధ స్టేక్ హోల్డర్లను సప్రందించకుండా ముందుకువెళ్లడం తగదని గతంలోనే ప్రధానమంత్రికి లేఖ రాశామని, కోస్తాంధ్ర సమస్యల పరిష్కారం, విభజన రెండూ జరగాలని ఆయన తెలిపారు. దేశం ముక్కలు కావడం తమకూ ఇష్టం లేదని, అయితే అదే సమయంలో తెలంగాణ ప్రాంత వాసులకు ఇన్నాళ్లుగా జరిగిన అన్యాయాన్ని మాత్రం విభజన ద్వారానే సరిచేయాలని చెప్పారు. పొత్తుల విషయంలో మాత్రం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, లౌకిక వాదంతో ఉండాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అభినందించామని చెప్పారు.

ఢిల్లీలో నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన

ఢిల్లీలో నేడు వైఎస్‌ జగన్‌ పర్యటనవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఏకైక ఉద్దేశంతో ఆయన ఢిల్లీలో పలు జాతీయ పార్టీల నేతలను కలిసి వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే రాష్ట్ర సమైక్యత కోసం వివిధ జాతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు వారితో చర్చలు జరపనున్నారు.  ముందుగా శనివారం నాడు వామపక్షాల నాయకులను కలవనున్న జగన్.. ఆదివారం బీజేపీ, ఇతర పార్టీల నాయకులను కూడా కలుస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వారికి వివరిస్తారు. జగన్ తో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నాయకులు కొణతాల రామకృష్ణ, వల్లభనేని బాలశౌరి, గట్టు రామచంద్రరావు, మైసూరారెడ్డి తదితరులు కూడా ఢిల్లీలో పలువురు నేతలను  కలుస్తారు.

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్

Written By news on Friday, November 15, 2013 | 11/15/2013

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన దేశ రాజధానిలో గళం వినిపించనున్నారు. ఇందులో భాగంగా పలు రాజకీయ పార్టీ నాయకులను ఆయన కలుస్తారు. విభజన వల్ల తలెత్తె విపరిణామాలను వివరిస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరనున్నారు.

సమైక్యమే తమ ఎజెండా అని వైఎస్ జగన్ తెలిపారు. రేపు (శనివారం) కమ్యూనిస్టు పార్టీ నాయకులను కలవనున్నట్టు ఆయన వెల్లడించారు. ఎల్లుండి బీజేపీ అగ్ర నాయకత్వంతో సమావేశమవుతానని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరతానని తెలిపారు. కాగా, కోర్టు అనుమతి వచ్చాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను జగన్ కలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి వెల్లడించారు.

సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు

ఆత్మకూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శుక్రవారం నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు, ముఖ్యనేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి పరిచయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 18న సుప్రీంకోర్టులో విభజనపై వాదన ఉందన్నారు. బీజేపీ కూడా విభజనను అడ్డుకునే అవకాశం ఉందని చెప్పారు. సమైక్యరాష్ట్రంలో ఎన్నికలు జరిగి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. దక్షిణ తెలంగాణలో కూడా 30 అసెంబ్లీ స్థానాలు వస్తాయని భావిస్తున్నామన్నారు. సీమాంధ్రలో 150 అసెంబ్లీ స్థానాలను తమ పార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి ఆఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ హడావుడి చూస్తే రాష్ట్రం విడిపోతుందనే అనుమానం కలుగుతోందన్నారు. తెలంగాణలో కూడా నాలుగైదు పార్లమెంటు స్థానాలను తమ పార్టీ గెల్చుకుంటుందన్నారు. నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని విజయబావుటా ఎగురవేస్తామని చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు జగన్ ఫోబియా పట్టుకుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ కలవరింతలేనని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు, తెలుగుదేశానికి 20 స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సామాన్యుడిని చేరదీశారని గుర్తు చేశారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ గొప్ప మానవతావాది అని చెప్పారు. సీమాంధ్రలో ప్రతి సీటు విలువైనదేనని, చిన్నచిన్న పొరపొచ్చాలను పక్కన పెట్టి పార్టీ శ్రేణులన్నీ ఐకమత్యంగా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రేపు(శనివారం) ఉదయం జగన్‌ సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశo

విభజనకు ఆంధ్రప్రదేశ్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
హైదరాబాద్: వైఎస్‌ జగన్‌ రేపు(శనివారం) ఉదయం సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశమవుతారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు నేత మైసూరా రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సీపీఎం కార్యదర్శి కారత్‌తో జగన్‌ భేటీ అవుతారని వెల్లడించారు. ఎల్లుండి సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ను జగన్ కలుస్తారని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీల నేతలనూ కలుస్తామన్నారు.

కోర్టు అనుమతి వచ్చాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను జగన్ కలుస్తారని అన్నారు. ఎవరు ఏంచెప్పినా కేంద్రం పెడచెవిన పెడుతోందని విమర్శించారు. విభజన విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని ఆరోపించారు. విభజన కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఎంపిక చేసుకుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం అధికార దుర్వినియోగమే పాల్పడుతోందని దుయ్యబట్టారు.

"చరిత్రకే ఒక్కడు" పుస్తక ముఖ చిత్ర ఆవిష్కరణ

"చరిత్రకే ఒక్కడు" పుస్తక ముఖ చిత్రాన్ని, అట్లాంటా మహానగరంలో, ప్రవాసాంధ్ర పాత్రికేయుడు వేణుగోపాల ఉడుముల ఆధ్వర్యములో, ప్రముఖ తెలుగు సామాజిక నాయకులు డాక్టర్ ప్రేమ రెడ్డి , డాక్టర్ మల్లా రెడ్డి, డాక్టర్ సంజీవ రెడ్డి, డాక్టర్  హరనాథ్ పొలిచర్ల ఆవిష్కరించారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి  జీవిత చరిత్ర  "చరిత్రకే ఒక్కడు" ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనే పట్టుదలతో, రచయత చెరుకు కరణ్ రెడ్డి మరియు  ప్రవాసాంధ్ర  పాత్రికేయుడు, వేణుగోపాల ఉడుముల సహకారముతో, డిసెంబర్ 30వ తేది, ఈ అద్బుతమైన పుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా,  హైదరాబాద్ లో మరియు తెలుగు వాళ్ళున్న దేశాల్లో విడుదల చేస్తున్నారు.

Popular Posts

Topics :