11 September 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్‌సీపీలో పదవుల నియామకం

Written By news on Saturday, September 17, 2016 | 9/17/2016


వైఎస్సార్‌సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్‌ పదవితో పాటు ఐటీ విభాగంలో పలువురు నాయకులను నియమించింది. ఈ మేరకు శనివారం వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

లీగల్ సెల్ కన్వీనర్‌గా పాలెం రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. చాలా ఏళ్లుగా పాలెం రఘునాథ్ రెడ్డి దివంగత సీఎం వైఎస్‌ఆర్ కుటుంబీకులను విధేయుడిగా ఉంటూ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లి, పార్టీ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కటుకూరి సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా బాదం నరేష్ గుప్త, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పేరం నవీన్ కుమార్, మునగాల జగన్‌మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడుగా సి. హరికృష్ణారెడ్డిలను నియమిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు.

భూమనను ఇరికించేందుకు కుట్ర : అంబటి


భూమనను ఇరికించేందుకు కుట్ర : అంబటి
హైదరాబాద్: తుని ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... అరెస్టులు, బెదిరింపులతో కాపు ఉద్యమాన్ని ఆపలేరన్నారు.

కాపులను ఆరు నెలల్లో బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు రెండున్నర ఏళ్లు అయినా... కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. తుని ఘటనలో భూమనకు సంబంధమేమిటన్నారు. కాపునేత ముద్రగడ పద్మనాభంను భూమన కలిసి ఉద్యమానికి మద్దతు తెలిపినంత మాత్రాన కేసులు పెడతారా.. ? అని అంబటి ప్రశ్నించారు. ఈ కేసులో ఇరికించాలనే ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారన్నారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరని చెప్పారు. ముందుగా నేతలపై కేసులు పెడతారని...కేసులకు లొంగకపోతే చంద్రబాబు కాసులు ఇస్తారన్నారు. అందితే జట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం బాబు నైజమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘటనకు ప్రభుత్వ వైఫల్యామే ప్రధాన కారణమని అంబటి చెప్పారు
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. తుని ఘటనకు సంబంధించి ఆయనను ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. ఎల్లుండి గుంటూరు సీఐడీ  కార్యాలయానికి హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఈ నెల 6,7 తేదీల్లో భూమనను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు విచారణ పేరుతో ఆయనను రెండు రోజుల పాటు దాదాపు 16గంటలకు పైగా విచారణ జరిపారు. కాగా ఈ ఏడాది జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.

బీజేపీ, టీడీపీ కలిసి మోసం చేస్తున్నాయి


'బీజేపీ, టీడీపీ కలిసి మోసం చేస్తున్నాయి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు కలిసి మోసం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారధి ఆరోపించారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ...బీజేపీ, టీడీపీ నేతలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సన్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రానికి నిధులు కేటాయిస్తారని ఆశించామని...కానీ ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ప్రత్యేక హోదా చనిపోయిన అంశమని ప్రకటన చేసి...హోదాను చంపిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వెంకయ్యకు సన్మానం చేశారా.. ? అని పార్థసారధి ప్రశ్నించారు. జనాభా ప్రతిపాదికన రాష్ట్రాలకు ఎన్‌ఐటీ, ఐఐటీలు కేటాయిస్తారని...అంతే కానీ ఏపీకి ప్రత్యేకంగా కేటాయించింది ఏముందన్నారు. వెంకయ్య తానొక్కడే ఏపీకి ఏదో ఒరగబెడుతున్నట్లు కబుర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. హోదా విషయంలో ఏపీకి చేసిన మోసాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించారన్నారు.

కాంగ్రెస్ పార్టీని, విభజన చట్టంలోని హామీలను విమర్శంచడమే తప్పా...గడిచిన రెండున్నర ఏళ్లలో చట్టంలో మార్పులు ఎందుకు చేయలేదన్నారు. హోదా అంశంపై విజయవాడలో వెంకయ్యనాయుడు దారుణంగా మాట్లాడారన్నారు. తెలుగు తల్లి రెండు కళ్లలో వెంకయ్య, బాబు రెండు వేళ్లతో పొడుస్తున్నారన్నారు. ఐదు కోట్ల ప్రజలు హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. నాడు పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు..పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నిలదీసిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్లు కేటాయించాలన్న దానిపై కేంద్రమంత్రికే స్పష్టత లేకపోవడం బాధకరమని పార్థసారధి అన్నారు.

నయీమ్ ట్యాక్స్‌లా లోకేశ్ ట్యాక్స్


నయీమ్ ట్యాక్స్‌లా లోకేశ్ ట్యాక్స్
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపాటు
 
 సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ ట్యాక్స్ వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం లోకేశ్ ట్యాక్స్ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. లోకేశ్ అంటేనే అవినీతి అని మండిపడ్డారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయడమేనని, అయితే, అది నెరవేరదని స్పష్టం చేశారు. రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు దోపిడీలు, అక్రమాలకే తాము వ్యతిరేకం అని, వాటిని తాము బయటపెడుతుండడంతో ఆయన తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు.  చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేస్తే సహకరిస్తామని అన్నారు.   దేశంలో 954 బిలియన్ల పెట్టుబడులు వస్తే, అందులో ఏపీకి 15.6 శాతం పెట్టుబడులు వచ్చాయనడం అర్థరహితమన్నారు.

 కోర్టులపై ఉన్న నమ్మకాన్ని నీరుగార్చొద్దు
 ‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి, ఎన్నికలకు వెళ్తే వైఎస్సార్‌సీపీ కావాలా? టీడీపీ కావాలా? అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. వైఎస్సార్‌సీపీ ఉంటే టీడీపీకి పుట్టగతులు ఉండవన్న భయం చంద్రబాబుకు పట్టుకుంది. ఎన్నికలకు వెళ్లే ధైర్యం, చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉందా?  స్విస్ చాలెంజ్ విధానం లోపభూయిష్టంగా ఉందని సుదీర్ఘమైన విచారణ జరిగిన హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇస్తే, దానిపైనా బాబు రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదు. న్యాయస్థానాలపై వ్యాఖ్యలు చేసి, వాటిపై ఉన్న నమ్మకాన్ని నీరుగార్చొద్దు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.

ప్రత్యేక హోదా - జగన్ పోరాటం

Written By news on Friday, September 16, 2016 | 9/16/2016


22న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి


22న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో యువభేరి జరగనున్నట్లు కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం వెల్లడించారు. యువభేరి ఏర్పాట్లపై నియోజకవర్గాల కన్వీనర్లతో ఎమ‍్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, పార్టీ నేతలు ఆళ్ల నాని తదితరులు చర్చించారు. 
అనంతరం పిల్లి సుభాష్ చంద్రబాబు, ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ  ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు ...బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టారన్నారు. కేంద్ర సాయంతో సంతృప్తి చెంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.  ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ


మట్టికట్టతో కనికట్టుఓ ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్‌ డ్యామ్‌ నమూనా ఇది..
పోలవరం నిర్మాణంలో బాబుగారి కుట్రలెన్నో.. కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్:
 ‘‘కాఫర్ డ్యామ్ నిర్మించి పోలవరం కాలువలకు నీళ్లిచ్చేద్దాం.. ఇదే పోలవరం తొలిదశ.’’
 - మంగళవారంనాడు పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రకటన ఇది.

 
ఈ ప్రకటన చూడగానే ఇంజనీర్లకయితే మూర్ఛవచ్చినంత పనైంది. సాగునీటి శాఖ అధికారులూ సీఎం  ప్రకటన చూసి విస్తుపోయారు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటి?

జలాశయం నిర్మించడానికి ముందు ఇది ఎందుకు కడతారు? ప్రధాన డ్యామ్‌కు కాఫర్ డ్యామ్‌కు ఉన్న తేడా ఏమిటి? నిజంగా సీఎం చెబుతున్నట్లు కాఫర్ డ్యామ్ కట్టడం పూర్తయితే పోలవరం తొలిదశ పూర్తయినట్లేనా? అసలు ఈ కాఫర్ డ్యామ్ సీఎం చెబుతున్నట్లు 60 టీఎంసీల నీటి నిల్వకు పనికి వస్తుందా? ఇవన్నీ ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అసలు కేంద్రం నిర్మించాల్సిన జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టును మేమే నిర్మిస్తామంటూ చంద్రబాబు ఎందుకు ఆతృతపడుతున్నారు? కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు? అందులోని మర్మమేమిటి? వంటివి అర్ధం చేసుకోవాలంటే ఇది చదవండి.
 
పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. 2018 నాటికి డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇపుడు కాఫర్ డ్యామ్‌నే పోలవరం తొలిదశగా ప్రకటించేశారు. అంతేకాదు 60 టీఎంసీల నిల్వకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తొలిదశను పూర్తి చేశామని ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందడం, మరోపక్క తన అనుయాయుడైన సొంత పార్టీ కాంట్రాక్టరుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం, ఆ పైన కమీషన్లు కైంకర్యం చేయడం ప్రభుత్వ పెద్దల లక్ష్యాలుగా కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది.

కాఫర్‌డ్యామ్ తాత్కాలిక నిర్మాణం మాత్రమే
సాధారణంగా ఏదైనా ఆనకట్ట నిర్మించాలంటే తాత్కాలిక మట్టి అడ్డుకట్టతో నీటిని దారి మళ్లించడం తప్పనిసరి. దాన్నే కాఫర్ డ్యామ్ అంటారు. అంటే ప్రధాన డ్యామ్  నిర్మాణానికి ముందు మట్టితో నిర్మించే తాత్కాలిక డ్యామ్ అన్నమాట. జలాశయ నిర్మాణ పనులకు నీళ్లు అడ్డురాకుండా.. ప్రవాహాన్ని మళ్లించడానికి ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణమే కాఫర్ డ్యామ్. ఈ డ్యామ్ ఏ మాత్రం పటిష్ఠంగా ఉండదు. శాశ్వతంగా అసలు పనికి రాదు. కానీ పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నట్లు చంద్రబాబు గొప్పగా చెప్పడం పట్ల నీటిపారుదల రంగంపై అవగాహన ఉన్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

కాఫర్ డ్యామ్ ద్వారా 60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపిందని చంద్రబాబు కొత్త వాదన  తీసుకురావడం చూసి ఇంజనీరింగ్ అధికారులు నివ్వెరపోతున్నారు. గోదావరికి గరిష్టం గా 30 లక్షల క్యూ సెక్కులు వరద వస్తుంది. కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరదని కూడా తట్టుకుని నిలబడే సామర్థ్యం కాఫర్‌డ్యామ్‌కు ఉండదని జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇం జనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడానికే తప్ప నీరు నిల్వ చేయడానికి  కాఫర్ డ్యామ్ పనికిరాదని ఇంజనీర్లు చెబుతున్నారు. అలాంటి తాత్కాలిక నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం తొలి దశ పూర్తయిందని చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అధికార యంత్రాంగం అభిప్రాయపడుతోంది.

భారీ ఎత్తున వరద వస్తే తట్టుకునే శక్తి ఈ కాఫర్ డ్యామ్‌కు ఉండదని, దా నికి గండి పడితే దిగువ ప్రాంతంలో పెద్దఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. కాఫర్ డ్యామ్‌తో అంత నీటి నిల్వ సాధ్యమైతే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ వంటి వాటికి బదులు కాఫర్ డ్యామ్‌లే నిర్మించి.. ఎక్కువ నీటిని నిల్వ చేసి ఉండేవారు కదా అని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల భారం
పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే అయినా కేవలం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించిన కేంద్రం 2010-11 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించింది. 2010-11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010.45 కోట్లు. మార్చి 31, 2014 వరకూ రూ.5135.87 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.562.46 కోట్లను ఏఐబీపీ కింద కేంద్రం విడుదల చేసింది.

ఇప్పటివరకూ ఖర్చు చేసిన నిధులు పోను మిగతా సొమ్మును మాత్రమే కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించింది. అదీ ప్రాజెక్టు నిర్మాణం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు అయ్యే వ్యయం మాత్రమే. భూసేకరణ, నిర్వాసితుల పునరాసానికి అయ్యే వ్యయాన్ని ఇస్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. ఏప్రిల్ 1, 2014 నుంచి ప్రాజెక్టుకు చేసిన ఖర్చును మాత్రమే చెల్లించేందుకు అంగీకరించింది. తాజా ఎస్‌ఎస్‌ఆర్ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేల కోట్లకుపైగా పెరిగినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కనీసం రూ.20 వేల కోట్ల భారం పడనుంది.
 
కాంట్రాక్టరును కాపాడడం..
పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఒప్పందం చేసుకోవాలంటూ రెండేళ్ల క్రితమే ముసాయిదా(డ్రాఫ్ట్)ను పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. పీపీఏకి అప్పగిస్తే.. ప్రాజెక్టు నిధుల వ్యయంపై కేంద్రం పర్యవేక్షణ ఉంటుంది. నిధులు కొట్టేసేందుకు వీలుండదు. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు సక్రమంగా చేయడం లేదంటూ టీడీపీ ఎంపీ రాయపాటి కి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌పై అనేక సందర్భాల్లో పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈపీసీలో 60సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌పై వేటు వేసి.. సమర్థుడైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని సూచించింది. కానీ.. ఇవేవీ చంద్రబాబు పట్టించుకోలేదు.

రాయపాటిని రక్షించడం.. అంచనాలు పెంచేసి కమీషన్లు కొట్టేసేందుకు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ కేంద్రానికి విన్నవిస్తూ వచ్చారు. ఫలితంగా జూన్ 2, 2014 నుంచి ఇప్పటివరకూ 232 కోట్ల విలువైన పనులను మాత్రమే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. పీపీఏ సిఫారసు మేరకు కాంట్రాక్టర్‌పై వేటు వేసి మళ్లీ టెండర్లు పిలిచి ఉంటే సమర్థుడైన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే సౌలభ్యం ఉండేది. ఇనుము, డీజిల్, సిమెంటు వంటి ధరలు తగ్గిన నేపథ్యంలో పోలవరం అంచనా వ్యయమూ తగ్గి ఉండేది. ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గేది. ప్రాజెక్టు ఈ పాటికే ఓ కొలిక్కి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం చేతికి దక్కగానే పోలవరం హెడ్ వర్క్స్ పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేసి.. కమీషన్లు దండుకుంటున్నారు.

పోలవరం కాంట్రాక్టు కోసం.. ‘హోదా’ తాకట్టు
ప్రాజెక్టు అంచనాలు పెంచేసి కమీషన్లు దండుకోవడం కోసం ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రంతో రాయభేరాలు సాగించడానికి కాంట్రాక్టర్లయిన కేంద్ర మంత్రి సుజనా, ఎంపీ సీఎం రమేష్‌లను చంద్రబాబు పంపారు. రాష్ట్ర వినతి మేరకు ఆ ప్రాజెక్టును కేంద్రం రాష్ట్రానికే అప్పగించింది. దాంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రం చేతికి చిక్కిన 24 గంటల్లోనే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1,482 కోట్లు పెంచేశారు. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి కమీషన్లు కొట్టేశారు.
 
2018 నాటికి పోలవరం పూర్తయ్యేనా?
2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ీ చంద్రబాబు చెబుతుంటే.. ఆయన కేబినెట్‌లోని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి ఇటీవల శాసనమండలిలో మాట్లాడుతూ నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వీటిని బట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వెల్లడవుతోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషించినా.. పీపీఏ భేటీ  మినిట్స్‌ను పరిశీలించినా 2018 నాటికి పోలవరం పూర్తవడం అసాధ్యం. దీనికితోడు  పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా మే 13న భేటీలోనూ ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పడం గమనార్హం.  
 
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకే
కేంద్రమే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించిందని  చంద్రబాబునాయుడు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదు. ఈనెల 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకే పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు అప్పగిస్తున్నామని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈనెల 8న కేంద్ర ఆర్థిక శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్‌సైట్‌లో పెట్టిన ప్రకటనలోనూ ఇదే అంశాన్ని తేటతెల్లం చేశారు. చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని.. కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు పదే పదే చెబుతోండటం గమనార్హం.
 
విభజన చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదే
♦ ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.
♦ 90(2) ప్రకారం.. ప్రజాభ్యుదయం దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
♦ 90(3) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా సమ్మతించింది.
♦ 90(4) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే వ్యయం, భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీకి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. పర్యావరణ, అటవీ తదితర అనుమతులను కేంద్రం తీసుకొస్తుంది.
 
పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే నిర్మిస్తుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. పోలవరం ప్రాజెక్టుకుర్తిస్థాయి పునరావాస పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలను సాధ్యమైనంత త్వరగా చేపడతామని గౌరవసభ్యులకు హామీ ఇస్తున్నాను.
 - విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌

 
చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత
మూడున్నర దశాబ్దాలుగా మూలన పడిపోయిన పోలవరం ప్రాజెక్టును తామే దుమ్ము దులిపి చేపట్టామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. కానీ.. ఈ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘం, కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ తదితర అనుమతులన్నీ ఆయనే తెచ్చారు. పోలవరం కుడి కాలువను 145 కిమీల మేర తవ్వి.. పూర్తి స్థాయిలో లైనింగ్ పనులు పూర్తి చేయించారు.

ఎడమ కాలువ 134 కిమీల మేర లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులను శరవేగంగా పూర్తి చేసే దశలో ఆయన హఠన్మరణం చెందారు. వైఎస్ అకాల మరణం పోలవరానికి శాపంగా మారింది. మహానేత వైఎస్ పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టినప్పుడు అప్పటి విపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డ్యామ్ కట్టకుండా కాలువలు తవ్వడం ప్రపంచంలో వింతంటూ అపహాస్యం చేశారు. కానీ.. ఆ మహానేత తవ్విన పోలవరం కుడి కాలువ మీదుగానే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలిస్తూ.. అదీ తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటోండటం గమనార్హం.
 
కేంద్ర ప్రభుత్వం చేపడితే జరిగే మేళ్లివీ..
♦ పోలవరం జాతీయ ప్రాజెక్టు. తాజా ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.36 వేల కోట్లు.  కేంద్రం చేపడితే ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరిస్తుంది.
♦ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం పోలవరాన్ని వ్యతిరేకిస్తోంది. కేంద్రం చేపడితే  సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు సులభంగా నిర్వహించి.. వివాదం లేకుండా చూస్తుంది.
♦ గోదావరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పోలవరం డిజైన్లు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం తప్పనిసరి. కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించడం వల్ల సీడబ్ల్యూసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీని వల్ల ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
♦ సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌ఐ(నేషనల్ హైడ్రాలజీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), జీఎస్‌ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వంటి సంస్థల్లో పనిచేసే నిపుణుల పర్యవేక్షణ ఉండటం వల్ల ప్రాజెక్టు పనులు నాణ్యతతో చేస్తారు.
♦ కేంద్ర ప్రభ్వు బడ్జెట్ రూ.20 లక్షల కోట్లు. 2014లోనే కేంద్రానికి ప్రాజెక్టును అప్పగించి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. మార్చి, 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది.
 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం వల్ల జరిగే నష్టాలివీ..
♦ 2010-11 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం రూపొందించిన పోలవరం అంచనా వ్యయంలో కేవలం హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు(ఇరిగేషన్ కాంపొనెంట్)కు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుంది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు అవసరమైన నిధులతోపాటూ ప్రాజెక్టు నిర్మాణ పనుల పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
♦ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)లో కేసు వేసింది. దీని వల్లే ప్రాజెక్టు పనులపై కేంద్రం పర్యావరణ నిషేధం విధించి.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సడలిస్తూ వస్తోంది. ఒకవేళ కేంద్రమే ఈ ప్రాజెక్టును చేపట్టి ఉంటే.. ఈ వివాదం పరిష్కారమయ్యేది.
♦ పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌కు సంబంధించి వర్కింగ్ డిజైన్లు మినహా.. ఎలాంటి డిజైన్లను సీడబ్ల్యూసీకి పంపలేదు. ఇటీవల కేంద్ర బృందం ఇదే అంశాన్ని లేవనెత్తింది.
♦ భూకంప ప్రభావిత ప్రాంతం(సెస్మిక్ జోన్)లో నిర్మిస్తుండటం వల్ల నిపుణులు అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు అందుబాటులో లేరు. ఇటీవల జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కోసం నర్మద కార్పొరేషన్‌లో పనిచేసిన డీపీ భార్గవను కన్సల్టెంట్‌గా నియమించింది.
♦ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రస్తుతం జరుగుతున్న రీతిలోనే పనులు సాగితే 2018 నాటికి పూర్తవడం అసాధ్యం. ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం 20 నుంచి 30 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.

ఏపీని ఏం చేద్దామనుకుంటున్నావ్?

Written By news on Wednesday, September 14, 2016 | 9/14/2016


'ఏపీని ఏం చేద్దామనుకుంటున్నావ్?'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తన స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం పరిధిలో ఉన్న ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. టెండర్లు లేకుండా పోలవరం ప్రాజెక్టుకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, సీఎం స్థాయి వ్యక్తి సబ్ కాంట్రాక్టులు డిసైడ్ చేయడం దారుణం అన్నారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయం అని జోస్యం చెప్పారు. పోలవరం మెయిన్ ప్రాజెక్టును పక్కకు పెట్టి ఇప్పుడు కాపర్ డ్యాం నిర్మిస్తామంటున్నారని, అసలు మీ ఆలోచన ఏమిటని, రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.

మీ దోపిడీని అడ్డుకుంటే పోలవరానికి, రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం అడ్డుతగులుతుందని రాద్ధాంతం చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. తాబేదార్లకు, బూట్లు మోసేవారికి, సంచులు మోసేవారికోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కుంభంకోణం కేసులో దొంగలా దొరికిన చంద్రబాబు అందులో నుంచి బయటపడేందుకు హోదాను అమ్మేశాడని అన్నారు.

అమరావతి ఒక విస్పోటనమే..


 ‘సాక్షి’తో ఎన్‌ఏపీఎం జాతీయ సమన్వయకర్త బి.రామకృష్ణంరాజు
  •      రాజధాని నిర్మాణం పేరిట విధ్వంసం
  •      అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైతే తీవ్ర నష్టం
  •      ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి,
  •      ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతాయి
  •      వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి
  •      రాజధాని కంటే ముందు ప్రాథమిక
  •      రంగాలను అభివృద్ధి చేసుకోవాలి
  •      రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది
 గుంటూరు : ‘‘ప్రజా రాజధానిగా ప్రభుత్వం వల్లెవేస్తున్న రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విస్పోటనమే. రాజధాని పేరిట జరుగుతున్న వ్యవహారాలన్నీ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా, వ్యవసాయకంగా.. ఇలా అన్నివిధాలా దెబ్బతీయడానికే తప్ప ప్రగతికి, ప్రజాప్రయోజనాలకు ఏమాత్రం ఉద్దేశించినదిగా కనిపించడం లేదు. ఒక నాయకుడు తన ఇష్టాయిష్టాలకు అనుకూలంగా ప్రణాళికలు రచిస్తూ, వాటినే భూతద్దంలో గొప్పగా చిత్రీకరిస్తూ వ్యక్తిగత లబ్ధికి బాటలు వేసుకోవడం తప్ప మరొకటి కానే కాదు. వాస్తవ విశ్లేషణలు జరిగితే అమరావతి బూటకం బట్టబయలు అవుతుంది’’ అని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్- ఎన్‌ఏపీఎం) జాతీయ సమన్వయకర్త భూపతిరాజు రామకృష్ణమరాజు తెలిపారు.
విభిన్న ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వారందరినీ జాతీయ స్థాయిలో ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు మేధాపాట్కర్, సందీప్ పాండే, అరుణారాయ్, స్వామి అగ్నివేశ్, రాజేంద్రసింగ్, ఎంజీ దేవసహాయం తదితర నిపుణులతో కలిసి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న బి.ఆర్.కె.రాజు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. తన స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి పేరిట జరుగుతున్నది మహా విస్పోటనమని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ వివరాలు..

 సాక్షి: రాజధాని అమరావతి ఒక విస్ఫోటనమని ఎలా చెప్పగలరు?
 రాజు: అమరావతి ఒక విస్ఫోటనం అనడానికన్నా తక్కువ పదం మరొకటి కనిపించడం లేదు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతాయి. వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి. వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా స్పష్టంగా పేర్కొంది. రాజధాని నిర్మాణం పేరిట రైతు కుటుంబాలను అతలాకుతలం చేయడం, పర్యావరణ విధ్వంసం, నిర్మాణాల పేరిట అవినీతి, అక్రమాలకు గేట్లు బార్లా తెరవడం, ప్రభుత్వమే నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుండటం, విదేశీ కంపెనీల ముందు మోకరిల్లండం, స్వదేశీ నిపుణుల నైపుణ్యాన్ని కించపరచడం.. ఇవన్నీ విస్ఫోటనాలకు నిదర్శనాలే.
సాక్షి: ప్రపంచం మెచ్చే నగరాన్ని నిర్మిస్తామని  ప్రభుత్వం చెబుతోంది కదా!
రాజు: దానికన్నా ముందు ప్రపంచం మెచ్చేలా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటి ప్రాథమిక రంగాలను అభివృద్ధి చేసుకోవాలి. ప్రజల ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. వాటిని నెరవేర్చాలి. మెరుగైన రాజధాని నిర్మాణాన్ని ఎన్‌ఏపీఎం వ్యతిరేకించడం లేదు. అవసరాలకు అనుగుణంగా వెళ్లాలి తప్ప స్వప్రయోజనాల కోసం పాకులాడొద్దు. రాజధాని నిర్మాణానికి 3,000 ఎకరాలు చాలు. 50 వేల ఎకరాలకు పైగా సమీకరించడమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, అవినీతికి తప్ప మరొకటి కానేకాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చిత్తశుద్ధితో  వ్యవహరించకుండా కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. దీన్నే ప్రజలంతా ప్రశ్నించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిలదీయాలి.

 సాక్షి: రాష్ట్ర పరిపాలన తీరును ఎలా భావిస్తున్నారు?
 రాజు: నూతన రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారనే విశ్వాసంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన పరిపాలనపై దృష్టి పెట్టకుండా రాజధానే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, పుష్కరాలు, ఇసుక, రాజధాని నిర్మాణం, సదావర్తి సత్రం భూములు... ఇలా అన్నింటిలోనూ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఓటుకు కోట్లు కేసు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వంటి వ్యవహారాలు చంద్రబాబు తీరును బట్టబయలు చేశాయి. అవినీతి రహిత పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామి అయిన చంద్రబాబు అవినీతిని ఎలా సమర్థిస్తున్నారో అర్థం కావడం లేదు.  

 సాక్షి: ఎన్‌ఏపీఎం కార్యాచరణ ఏమిటి?
 రాజు: దేశంలో ప్రజా ఉద్యమాలను ఐక్య వేదికపైకి తీసుకొచ్చి ముందుకు నడిపించే బాధ్యతను ఎన్‌ఏపీఎం రెండు దశాబ్దాల క్రితమే స్వీకరించింది. దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తోంది. తాజాగా ‘మద్యం రహిత భారత్’పై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం.


http://www.sakshi.com/news/district/national-alliance-of-peoples-movements-co-ordinator-b-r-k-raju-interview-397031?pfrom=home-top-story

ఇది స్విస్ చాలెంజా.. సూట్‌కేస్ చాలెంజా?


సీబీఐ విచారణకు సిద్ధపడాలి
చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ డిమాండ్
-  ఇది స్విస్ చాలెంజా.. సూట్‌కేస్ చాలెంజా?
-  ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి ధ్వజం
 
 
 ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా లేదని జైట్లీ చేసిన ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు.. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని అంగీకరిస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. ప్రజాతీర్పు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు వేటిపైనా బాబుకు గౌరవం లేదన్నారు. స్విస్ చాలెంజ్‌పై తదుపరి ప్రక్రియను నిలిపేయాలని కోర్టు స్టే ఇచ్చినా.. మంత్రులు పుల్లారావు, నారాయణరావు అప్పీలుకు వెళ్లి దాన్ని కొనసాగిస్తామంటున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాల మీద, తాము వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

 నిబంధనల్లో మతలబులు..
 స్విస్ చాలెంజ్ విధానమే లోపభూయిష్టం కాగా.. అందులో పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కాకాని విమర్శించారు. ప్రభుత్వం 1690 ఎకరాల భూమి ఇవ్వడమే కాక రూ.12 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంటే... సింగపూర్ కంపెనీలు రూ.320 కోట్లు మాత్రమే పెడుతున్నాయని చెప్పారు. అయినా ప్రభుత్వానికి 42%, సింగపూర్ కంపెనీలకు 58% ఇస్తున్నారని తెలిపారు. వాళ్లు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు తిరిగి కట్టకపోయినా, 20 ఏళ్లలో ఎలాంటి సమస్య వచ్చినా భరించేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమని.. అందులో లబ్ధి పొందేది మాత్రం సింగపూర్ కంపెనీలని చెప్పారు. ఇది స్విస్ చాలెంజా.. చంద్రబాబు గారి సూట్‌కేస్ చాలెంజా? అని మండిపడ్డారు.

అక్రమాలకే మేం వ్యతిరేకం


చంద్రబాబు అక్రమాలకే మేం వ్యతిరేకం: అంబటి
కృష్ణా: రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలకు తాము వ్యతిరేకం ఏమాత్రం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు దోపిడీలు, అక్రమాలకే తాము వ్యతిరేకం అని వాటిని తాము ఎత్తి చూపిస్తున్నందునే ఆయన తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీల్లో వాటాలున్నందువల్లే రాజధానిని వాళ్లకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని అంబటి చెప్పారు

పారాలింపిక్స్‌ విజేతలకు వైఎస్ జగన్ కంగ్రాట్స్

Written By news on Tuesday, September 13, 2016 | 9/13/2016


పారాలింపిక్స్‌ విజేతలకు వైఎస్ జగన్ కంగ్రాట్స్
హైదరాబాద్: రియో పారాలింపిక్స్‌ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు ఆయన అభినందనలు చెప్పారు. తృటిలో కాంస్య పతకం కోల్పోయినప్పటికీ పవర్ లిఫ్టర్ ఫర్మాన్ భాషా మంచి ప్రయత్నం చేశాడని ప్రశంసించారు. ‘దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు అభినందనలు. ఫర్మాన్ మంచి ప్రయత్నం చేశాడు. పారాలింపిక్స్‌ లో మన అథ్లెట్లు చూపిన దృఢత్వం, అంకితభావం మనందరికీ గర్వకారణమ’ని వైఎస్ జగన్ మంగళవారం ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం నెగ్గారు. మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఫర్మాన్ నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయాడు.
Congrats DipaMalik,Thangavelu,Bhati. Good attempt Farman. Proud of the grit & determination shown by all our athletes

ఎమ్మెల్యే ఆర్ కే కి చంపుతామని బెదిరింపు లేఖ

Written By news on Monday, September 12, 2016 | 9/12/2016


మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపు లేఖ
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ‍్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సోమవారం ఆగంతకుల నుంచి  బెదిరింపు లేఖ వచ్చింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టుకు వెళితే చంపుతామని ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. మంగళగిరిలోనే ఆర్కేను చంపేస్తామని బెదిరింపులతో పాటు, అసభ్య పదజాలంతో ఆ లేఖలో హెచ్చరించారు.  తనకు వచ్చిన బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే ఆర్కే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరపాలని ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  అయితే తనపై కేసు కొట్టేయాలంటూ  ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, దానిపై న్యాయస్థానం స్టే ఇచ్చింది.

చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రపంచస్థాయి నగర నిర్మాణం కోసమే స్విస్ ఛాలెంజ్ పద్ధతి పాటిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కన్ స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్ వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లొసుగులున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం..
‘చాలెంజ్’.. ఇది దోపిడే
హైకోర్టు ఆగ్రహంతో... దిగొచ్చిన సర్కారు

Popular Posts

Topics :