20 May 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పనిమంతుడు పందిరివేస్తే పిచ్చుకలు వచ్చి కూలదోశాయట(andhrabhoomi article)

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012

పనిమంతుడు పందిరివేస్తే పిచ్చుకలు వచ్చి కూలదోశాయట. జగన్ అనే నరాధముడిని రాజకీయంగా వధించటానికి తెలుగుదేశం కౌటిల్యుల లోపాయకారీ సాయంతో కాంగ్రెస్ పెద్ద దిక్కులు వేసిన సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ జయప్రదంగా అడ్డం తిరిగింది. తెలివిమీరిన సర్కారువారు వై.ఎస్.జూనియర్‌ని కేసుల ఉచ్చులో ఇరికించబోయి తామే ఇరుక్కున్నారు. తాము తీసిన గోతిలో తామే పడ్డారు.
చెరుూ్య మనదే, కత్తీ మనదే కాబట్టి పీక కోసుకున్నా ఏమీ కాదని పాలక మారాజులకు మా చెడ్డ నమ్మకం. కేసులు పెట్టించిందీ మనమే, వాటి దుంపతెంచేదీ మన పెంపుడు సిబిఐయే కాబట్టి మనం ఎలా ఆడినా చెల్లుతుందని ప్రభువులు మహాధీమాగా ఉన్నారు. వారి అతి విశ్వాసమే ఇప్పుడు కొందరు మంత్రులకూ మొత్తంగా కాంగ్రెసు సర్కారుకూ కొంప ముంచుతోంది.
తెలంగాణ ఉప ఎన్నికల పరాభవం నుంచి తేరుకోకుండానే పులిమీద పుట్రలా సీమాంధ్ర ఉప ఎన్నికలొచ్చాయి. వాటిలో పరువు దక్కితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. విచిత్ర విన్యాసాలు ఎన్ని చేసినా కాంగ్రెసుకూ, కొన్ని విషయాల్లో దాని వ్యూహాత్మక రహస్య భాగస్వామి తెలుగుదేశానికీ కనీసం డిపాజిట్లు దక్కే గ్యారంటీ లేదని ‘దేశం’ మార్గదర్శులు, కాంగ్రెసు కుశాగ్రబుద్ధులు చేయించిన రహస్య సర్వేల్లో తేలిందట. ఎక్కడచూసినా జగన్ గాలే వీస్తూండటంతో, ఆ గాలిని బంధించి, ఎలాగైనా అతగాడిని ఉప ఎన్నికల రంగం నుంచి తప్పిస్తే తప్ప లాభం లేదని ఏలినవారికి అమోఘమైన ఐడియా వచ్చింది.
ఆ ముచ్చట తీరాలంటే సిబిఐ ఆల్సేషియన్లని ఉసికొలిపి శత్రువును ‘లోపల’ వేయించటమే వాటమైన ఉపాయం. ‘పైవాళ్ల’ కనుసన్నల్లో దర్యాప్తు తతంగం 9 నెలలుగా జరుగుతున్నా... అసలు కథానాయకుల జోలికి పోనివారు... నెంబర్‌వన్ నిందితుడిని ఒక్కసారైనా పిలవనంపకుండానే ఒకే కేసులో ఇప్పటికి మూడు చార్జిషీట్లు వేసేసిన వారు... వాటిపై సమన్లు అందుకుని రేపో మాపో కోర్టులో హాజరుకానున్న తరుణంలో - ఆదరాబాదరా అతడిని అరెస్టు చేస్తే గవర్నమెంటు ఇరుకునపడవచ్చు. ఒక్కడిమీద కక్ష కట్టారన్న చెడ్డపేరు రావచ్చు.
మరి ఏమి చేయాలి? అతడికంటే ముందు తమలో నుంచి ఒకరిద్దరు మంత్రులను అరెస్టు చేయించాలి. చూశారా, అంతటి వారినే వదల లేదు. కాబట్టి మాకు పక్షపాతం, కక్షపాతం ఏమీ లేదు అని వెర్రిజనాన్ని నమ్మించి, ఆ తరవాత అసలు విరోధిని జైల్లో వెయ్యాలి. చదరంగం ఆటలో రాజును కట్టెయ్యటానికి ఒక పావును బలి ఇస్తారే... అలాగన్నమాట!
ఆలోచన ఏడ్చినట్టే ఉంది. తొలి బలికి ఎంచుకున్నది ఒక బి.సి. మంత్రిని! దాంతో బి.సి. వర్గాలు భగ్గుమన్నాయి. మంత్రి నియోజకవర్గంలోని అభిమానులైతే చెలరేగి బస్సులు, ఆస్తులు తగలబెట్టేశారు. బి.సి. మంత్రిని వేసేసినందుకు బి.సి.లు గోల పెట్టారు కనుక, వారి ఓట్లు చాలా అవసరం కనుక, వారిని సముదాయించటానికి సెకండ్ రౌండులో ఒక రెడ్డి మంత్రిని జైలుకు పంపాలని - అనుకుంటున్నారట. దానిమీద ఆ కులపోళ్లు మండిపడితే ముచ్చటగా మూడోకులం మంత్రిని బలిపీఠం ఎక్కిస్తారేమో!!
పావు శతాబ్దం కింద జగమొండి ఎన్టీ రామారావు తన కేబినెట్ మంత్రిమీదే ఎ.సి.బి. చేత వలపన్నించి, అవినీతి కేసులో అరెస్టు చేయిస్తే లోకమంతా ఓహో అంది. ఇప్పుడు మహానాయకుడు కి.కు.రెడ్డి తన కేబినెట్ మంత్రికి మొండి చెయ్యి చూపి, ఇంకో రకం అవినీతి కేసులో అరెస్టు కానిస్తే అదే లోకం దుమ్మెత్తిపోస్తున్నది. దానికి లోకుల్ని నిందించి ప్రయోజనం లేదు.
కేబినెట్ మంత్రిని సిబిఐ అరెస్టు చేసింది ఎవరిదగ్గరో లంచం పట్టి అడ్డమైన మేలేదో చేసినందుకు కాదు. కేబినెటు ఆమోదించిన విధానం మేరకు ఎవరికో ఏదో ఉపకారం చేసే జీవోలకు ముఖ్యమంత్రి ఆదేశిస్తే మమ అన్నందుకు! కేబినెట్ నిర్ణయాలను అమలుచేసిన నేరానికి మంత్రులను బలి ఇస్తూపోతే మంత్రివర్గ సమష్టి బాధ్యత సూత్రం ఏ గంగలో కలిసినట్టు? అధికారపక్షం అధినాయకత్వానికి గిట్టని ఒక్క తిరుగుబాటుదారును తిప్పలు పెట్టటంకోసం, అతడిని, అతడి తండ్రిని నేరస్థులుగా చిత్రించటం కోసం... పూర్వమున్నదీ తమ పార్టీ ప్రభుత్వమేనని మరచి, దానిలో భాగస్వాములైన ప్రస్తుత మంత్రులను జైలుకు పంపితే పోయేది పాలకపక్షం పరువేకదా? ఎవరికో అనుచిత లబ్ధి చేకూర్చిన నిర్ణయాలకు బాధ్యుడైన ముఖ్యమంత్రి మరణించి ఉండవచ్చు. కాని ఆయన పనుపున అన్ని వ్యవహారాలూ చక్కబెట్టిన ‘‘ఆత్మ’’ ఇప్పటికీ మన మధ్యనే ఉన్నది కదా? మంత్రుల మీదా, ఐఎఎస్ అధికారుల మీదా ప్రతాపం చూపి అరెస్టులు చేయించే సర్కారు... వారి నెత్తిన కూచుని, మెడలు వంచి జీవోలు జారీ చేయించుకున్న అసలు సూత్రధారి ఊసే ఎత్తదేమి? పైవారి అండ ఆత్మగారికి ఉన్నందు వల్లేనా? ఇలా మనిషినిబట్టి వైఖరి మారుస్తూ పోవటంవల్లే కదా సిబిఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’గా పేరొచ్చింది?
పోనీ ఇంతగా విధంచెడ్డా జగన్ అనే వాడి నోరు నొక్కేసిన ఫలం దక్కిందా? ఆ కుర్రవాడిని తన మానాన తాను ప్రచారం చేసుకోనిచ్చి ఉంటే ఆ ప్రభావమేదో ఆయా నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యేది. మిగతా దేశం అతడి మాటల మీద పెద్దగా దృష్టి పెట్టేదికాదు. ఎక్కడో ఒక జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఒకే మూస ప్రచారం చేసుకుంటున్న వాడిని తీరి కూర్చుని హైదరాబాదుకు పిలిపించి, అతడేదో అమెరికా ప్రెసిడెంటు అయిన లెవెల్లో భారీ బందోబస్తులు చేసి, రాష్టమ్రంతటా రెడ్ అలర్ట్ ప్రకటించి, సిబిఐ అడ్డాలో అతడి ప్రశ్నోత్తరాల కార్యక్రమం అతి ప్రధాన జాతీయ సమస్య అయిన రీతిలో నానా హంగామా చేయడంవల్ల ఏమైంది? జగన్ అంటే గిట్టని చానల్సు, జాతీయ మీడియా కూడా పొద్దస్తమానం అతడి ముఖానే్న చూపిస్తూ, అతడి గురించే మాట్లాడుతూ, అతడి మాటలే వినిపించటంతో కాణీ ఖర్చు లేకుండా రాష్టమ్రంతటా, దేశమంతటా విస్తృత ప్రచారం రాబట్టే సువర్ణావకాశం అతడికి దక్కింది. మండే ఎండలో తిరిగి ప్రచారం చేయాల్సిన బాధ తప్పించి హాయిగా ఎ.సి. రూములో కూచోబెట్టి సిబిఐ విచారణ పేరిట వందలకోట్ల రూపాయల విలువైన పబ్లిసిటీని తనకు సమకూర్చిపెట్టిన ఢిల్లీ పెద్దలకు, సిబిఐ మార్గదర్శులకు జగన్ ఆజన్మాంతం రుణపడి ఉండాలి. నిండా మూడేళ్ల రాజకీయ అనుభవం లేని ఒక వివాదాస్పద వ్యక్తిని జాతీయస్థాయిలో హీరోను చేసిన కాంగ్రెస్ పెద్దల తెలివికి జోహార్లు!

ఇద్దరు జగన్ అభిమానుల మృతి

ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అరెస్ట్ పై కొన్ని పత్రికలలో వచ్చిన తప్పుడు కథనాలతో కలత చెంది పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు అభిమానులు మృతి చెందారు. గుడిపాడు గ్రామంలో గరికముక్కల రంగారావు, అప్పనవీడులో పరిమి ఏసోబు మృతి చెందారు. మృతుల కుటుంబాలను కొయ్యె మోషెన్ రాజు, ఊదరగొండి చంద్రమౌళి పరామర్శించారు.

False Cases on YSRCP Cader

We Approach HRC: Bajireddy Govardhan

Too more MP's to Support YS Jagan: Sabbam Hari

Bobbili MLA Ranga Rao met YS Jagan

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: జూపూడి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంబంధించి జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విజ్ఞప్తి చేశారు. ఈ సాయంత్రం సిబిఐ కార్యాలయం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. బయట అనుకునేటంతటి భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఏమీలేదని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో విచారణ కొనసాగుతోందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. జగన్ పేరుతో అల్లర్లు చేస్తే పార్టీకి, జగన్ కు సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. 

ఈ నెల 28వ తేదీ సోమవారం జగన్మోహన రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరవుతారని చెప్పారు. అందువల్ల కోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, దానిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు

జగన్ కి సంఘీభావం తెలిపేందుకు బొబ్బిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలవడానికి బొబ్బిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు రాత్రి 7 గంటల ప్రాంతంలో లోటస్ పాండ్ కు వచ్చారు. ఆయన వెంట సోదరుడు , కొంతమంది జడ్ పిటిసిలు, ఎంపిటిసిలు కూడా ఉన్నారు. రంగారావు ఈ ఉదయమే ఇక్కడకు వచ్చారు. అయితే అప్పటికే జగన్ సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. దాంతో ఆయన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి వెళ్లారు. జగన్ పై కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ చేస్తున్న కుట్రను చూసి ఆవేదనతో వైఎస్ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

లోపలికి వెళుతున్న రంగారావుని విలేకరులు ప్రశ్నించగా, బయటకు వచ్చిన తరువాత అన్ని విషయాలు చెబుతానన్నారు.

కార్యకర్తలను బెదిరించి, వారిచేత తప్పుడు రిపోర్టులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోకపోతే మానవహక్కుల సంఘం(హెచ్ ఆర్ సి)ని ఆశ్రయిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ పోలీసులను హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధేయ పద్దతిలో తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. కిరోసిన్ బాటిల్ తీసుకువెళుతుంటే పెట్రోల్ అని కేసు పెట్టారన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పోలీసులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి ఇంట్లో వారిని బెదిరిస్తున్నారన్నారు. రామ్మోహన్ ని ఇంట్లో నుంచి పోలీసులు పట్టుకువెళ్లారని చెప్పారు. కార్యకర్తలను బెదిరించి, వారిచేత తప్పుడు రిపోర్టులు రాయిస్తున్నారని ఆరోపించారు.

2రోజుల్లో జగన్ కు ముగ్గురు ఎంపిల సంఘీభావం

రెండు మూడు రోజుల్లో మరో ముగ్గురు కాంగ్రెస్ ఎంపిలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంఘీభావం తెలుపుతారని కాంగ్రెస్ ఎంపి సబ్బం హరి చెప్పారు. లోటస్ పాండ్ వద్ద ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ పరిస్థితులలో జగన్ కు సంఘీభావం తెలపడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జగన్ అభిమానులను ఆందోళనకు గురిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అది మంచి పద్దతి కాదని ఆయన చెప్పారు. రేపు కూడా జగన్ సిబిఐ విచారణకు హాజరవుతారన్నారు. సోమవారం వరకు సిబిఐ ఎటువంటి నిర్ణయం తీసుకోదని ఆయన
చెప్పారు. జగన్ కు సంబంధించి ఊహాజనిత వార్తలు ప్రచారం చేసింది గాక, ఆ ప్రచారం ప్రకారం అరెస్ట్ చేయలేదేంటి అని ప్రశ్నిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.

Rajanna Rajyam Ravali 25th May 2012

బాబు చేతిలోనే రాం ‘కీ’ఫార్మా సిటీ కేటాయించి 2,143 ఎకరాలు కట్టబెట్టిన బాబు
2000 నుంచి విశాఖలో ఫార్మా సిటీకి ప్రయత్నాలు
పరవాడ ప్రాంతం వద్దన్నా అభ్యంతరాలు బేఖాతరు
టెండర్ల ప్రాసెసింగ్‌ను ఎల్ అండ్ టీకి అప్పగించిన ప్రభుత్వం
13 సంస్థలొచ్చినా అన్నిటికీ వంకలు పెట్టి వెనక్కి పంపేసిన తీరు
ఆ తరవాత తాను జోక్యం చేసుకుని బీఓటీ పద్ధతిని మార్చిన బాబు
2003లో తాము చేపడతానని స్వయంగా ప్రతిపాదించిన రాంకీ
హడావుడిగా అప్పగించిన బాబు; 2004 ఏప్రిల్ 11న భాగస్వామ్య సంస్థ ఏర్పాటు
రాంకీ వాటా 89 శాతం; ఏపీఐఐసీకి 11 శాతమే
24 గంటలు తిరక్కుండానే 12న కన్సెషన్ ఒప్పందంపై బాబు సంతకాలు.. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూనే ఓకే; గ్రీన్‌బెల్ట్‌కు 58 ఎకరాలు చాలని అనుమతి
చార్జిషీట్లో వీటిని అరకొరగా చెప్పిన సీబీఐ; బాబుపై లేని ఫోకస్
తరవాత వైఎస్ వచ్చి గ్రీన్‌బెల్ట్ పెంచాలని ప్రతిపాదించారట
కుదరకపోవటంతో చివరికి బాబు నాటి ఒప్పందానికే సై అన్నారట
అలా అనటమే ఆయన రాంకీకి చేసిన మేలు... అందుకే వారు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు
ఇదీ సీబీఐ వింత వాదన; నాటి కన్సెషన్ ఒప్పందంలో వాన్‌పిక్ మాదిరే రాయితీలు
ఎమ్మార్ దర్యాప్తు మాదిరిగా 2005కు ముందు ఏం జరిగిందో అనవసరమంటున్న దర్యాప్తు సంస్థ

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ఏ విషయమైనా సరే! ఏ వ్యవహారమైనా సరే!! రామోజీరావు పిచ్చి కథనాలతో రెచ్చిపోయారంటే దాన్లో ముందుకు కనిపించే కారణంతో పాటు... దానివెనక కనిపించని కారణమూ ఉంటుంది. సీబీఐ ఇటీవల వేసిన మూడవ చార్జిషీటుపై రెండ్రోజులుగా ‘ఈనాడు’ చెలరేగిపోతోంది. ఇందులో తనకు అనుకూలంగా ఉన్న అంశాల్ని మాత్రమే ప్రస్తావిస్తూ కథనాలు వండి వార్చేస్తోంది. దీన్లో కనిపిస్తున్నది ఒక్కటే. ‘సాక్షి’పై మరింత విషం కక్కటం. జగన్‌మోహన్‌రెడ్డిని మరింత టార్గెట్ చేస్తూ... సీబీఐ అడ్డగోలు దర్యాప్తునకు వత్తాసు పలకటం. మరి కనిపించని కారణమేంటో తెలుసా..? తన సియామీ కవల లాంటి చంద్రబాబు నాయుడిని కాపాడటం. ఫార్మా సిటీని ఆయన ఎంత ఆగమేఘాలపై కేటాయించారో, ఎంత హడావుడిగా ఒప్పందం చేసుకున్నారో, పర్యావరణంపై వచ్చిన అభ్యంతరాల్ని ఎంత కిరాతకంగా పక్కనపడేశారో... అవన్నీ బయటపడకుండా సమాధి చేసెయ్యటం. అసలు రాంకీ సంస్థకు ఫార్మాసిటీని కట్టబెట్టిందెవరు? 2,143 ఎకరాల్ని దానికి అప్పగించిందెవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ... ఎన్నికలకు రెండునెలలు కూడా లేకున్నా భాగస్వామ్య సంస్థను రిజిస్ట్రేషన్ చేయించిందెవరు? అది జరిగి 24 గంటలు కూడా గడవకముందే దాంతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నదెవరు? ఆ కన్సెషన్ ఒప్పందం ప్రకారం గ్రీన్‌బెల్ట్ ఉండాల్సిందెంత? ఇప్పుడున్నదెంత? మధ్యలో వైఎస్సార్ ప్రభుత్వం చేసిందేంటి? ఇదికదా ఛార్జిషీట్లో ఉండాల్సింది. ఒకవేళ లేకుంటే దీన్నికదా మీడియా బయటపెట్టాల్సింది!! కావాలంటే మీరే చూడండి...


ఫార్మా సంస్థల్ని హైదరాబాద్ నుంచి తరలించేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని 1999లోనే చంద్రబాబునాయుడి ప్రభుత్వం భావించింది. అందుకని ఐదుగురు సభ్యులతో ఒక బృందాన్ని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలకు పంపించింది. చివరికి విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ 2000వ సంవత్సరం జూలై 18న చంద్రబాబు నాయుడు జీవో ఎంఎస్ నంబరు 381ని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం ఒక ఫార్మా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటయింది. దానికి చంద్రబాబే ఛైర్మన్ కూడా.
అభ్యంతరాలు బేఖాతరు... 
ఈ టాస్క్‌ఫోర్స్ బృందం విశాఖలో పలు ప్రాంతాల్ని సందర్శించిన మీదట... చివరికి పరవాడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకుంది. అయితే పరవాడ ఐడీఏను 1997లో పారిశ్రామిక వాడగా ప్రకటించినా... ఆ తరవాత జరిపిన సర్వేల్లో అది పారిశ్రామిక వాడకు తగిన ప్రాంతం కాదని బయటపడింది. దీంతో ఈ ప్రాంతాన్ని తక్కువ జల, వాయు కాలుష్యాలు వెదజల్లే కలాపాలకే పరిమితం చేశారు. వీటన్నిటినీ టాస్క్‌ఫోర్స్ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం వీటిని బేఖాతరు చేస్తూ... ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యంలో ఫార్మా లేదా కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నెంబరు 501ని విడుదల చేసింది.


ఎల్ అండ్ టీకే టెండర్ల ప్రక్రియ: బాబు హయాంలో ఏం చేసినా ఎల్ అండ్ టీ మాత్రమే చేయాలనేది తప్పనిసరిగా పాటించే నిబంధన. ఇదే కోవలో ఫార్మా పార్కుకు టెండర్ల ప్రక్రియను నడిపించే బాధ్యతను ఎల్ అండ్ టీ రాంబోల్ కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌కు అప్పగించారు. దీంతో టెండర్లు ఆహ్వానిస్తూ 2002 అక్టోబర్ 31న, డిసెంబర్ 17న ప్రకటనలొచ్చాయి. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో 11 ఇతర సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ప్రతిపాదనల్ని పంపే దశలో రాంకీతో పాటు ఏడుగురు బిడ్డర్లే ఆర్‌ఎఫ్‌పీ పత్రాల్ని ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశారు. కానీ చిత్రంగా మూడు కంపెనీలు మాత్రమే... అంటే జూమ్ డెవలపర్స్, మరిది, వర్ట్సిలా సంస్థలు మాత్రమే సవివర ప్రతిపాదనల్ని సమర్పించాయి. వీటిలో మారిషస్‌కు చెందిన క్రిస్సన్ సంస్థతో కలిసి జూమ్ డెవలపర్స్ వేసిన ప్రతిపాదన మాత్రమే అర్హత పొందింది. అయితే ఏపీఐఐసీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదనే కారణంతో జూమ్ ప్రతిపాదనను కూడా రద్దు చేశారు.

నిబంధనలు మార్చిన బాబు: టెండర్ల ప్రక్రియ రద్దయిపోవటంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. 2003 జూన్ 28న సమావేశమై... బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ బదులు బిల్డ్ ఆపరేట్ ఓన్ ప్రాతిపదికన దీన్ని చేపట్టాలని నిర్ణయించింది. అంటే నిర్మించి, నిర్వహించి ప్రభుత్వానికి అప్పగించే బదులు... ఇక సదరు ప్రయివేటు సంస్థ యాజమాన్యంలోనే ఇది కొనసాగుతుందన్న మాట. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న నెలరోజులకే అంటే... 2003 జూలై 31న రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఏపీఐఐసీకి ప్రతిపాదన సమర్పించింది. ఆ ప్రతిపాదనపై నేరుగా ముఖ్యమంత్రితో... ఇన్‌ఫ్రా సబ్‌కమిటీ చర్చించింది. చివరికి 2003 నవంబర్ 14న రాంకీతో చర్చలు జరిపే అధికారాన్ని నేరుగా ఏపీఐఐసీకే అప్పగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక నోట్‌ను ఆమోదించారు.

రెండు మూడు నెలల్లో మొత్తం సిద్ధమైపోయింది. ప్రాజెక్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం... ఎంఓయూ కుదర్చుకోవటం... అన్నీ జరిగిపోయాయి. అప్పటికే బాబు ప్రభుత్వం ఆపద్ధర్మంలో పడింది. కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన ఎంఓయూ కుదుర్చుకున్నారు. చివరికి ‘రాంకీ ఫార్మా సిటీ’ సంస్థను 2004 మార్చి 11న... అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు రిజిస్టరు చేశారు. 24 గంటలు కూడా తిరక్క ముందే... 2003 మార్చి 12న రాంకీతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిప్రకారం ఈ సంస్థలో రాంకీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉంటాయి. ఏపీఐఐసీ తన వాటా మేరకు భూమిని సమకూరుస్తుంది.

ఇదీ... ప్రధాన ఆరోపణ 
మూడవ చార్జిషీట్లో సీబీఐ ప్రధాన ఆరోపణమేమిటంటే... విశాఖపట్నంలో రాంకీ సంస్థ ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ గ్రీన్‌బెల్ట్‌కు సంబంధించి నిబంధనల్ని ప్రభుత్వం సవరించిందని! అందుకే ఆ సంస్థ టీడబ్ల్యూసీ ఇన్‌ఫ్రా, ఎరెస్ ప్రాజెక్ట్స్ అనే సంస్థల ద్వారా జగన్‌మోహన్ రెడ్డి కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని!.

గ్రీన్ బెల్ట్‌పై వైఎస్ సమావేశాలు...
సీబీఐ చార్జిషీట్లో ఏమని పేర్కొందంటే... ‘‘2004 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్... ప్రాజెక్టుల్ని సమీక్షించే క్రమంలో ఫార్మాసిటీపైనా సమీక్షించారు. ఈ ఫార్మా సిటీలో నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా... బౌండరీ చుట్టూ ఒక కిలోమీటర్ ఉంటే బాగుంటుందని, అది గోడకు అవతల 500 మీటర్లు, ఇవతల 500 మీటర్లు ఉన్నా సరిపోతుందని, అక్కడ ఉడాయే నేరుగా వాణిజ్య ప్రాతిపదికన మొక్కలు పెంచాలని సూచించారు. అయితే బయటి వారి నుంచి భూముల్ని కొనకుండా కిలోమీటర్ మేర గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయటం సాధ్యం కాదని తరువాతి సమావేశంలో ‘ఉడా’ చెప్పటంతో... దాన్ని 250 మీటర్లకు తగ్గిస్తే సరిపోతుందని చెప్పారు. కానీ ఆ తరవాత జరిగిన సమావేశంలో గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల మాత్రం 50 మీటర్లు ఉంటే సరిపోయేట్టుగా నిబంధనలు సవరించాలని ‘ఉడా’కు చెప్పారు. ఇది ఖచ్చితంగా ఫార్మా సిటీ యాజమాన్యానికి అయాచిత లబ్ధి చేకూర్చటమే. అందుకు ప్రతిగానే రాంకీ సంస్థ పరోక్షంగా రూ.10 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టింది’’ అని వివరించింది.

ఇక్కడ మౌలికమైన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
{పస్తుతం గోడకు లోపల గ్రీన్‌బెల్ట్ 50 మీటర్లుగా ఉండటం వల్ల రాంకీ సంస్థ వదిలిపెట్టాల్సిన స్థలం 58.95 ఎకరాలు. మరి ఇది చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదించినదే కదా? దాన్నేమైనా వైఎస్ మార్చారా?
వైఎస్ 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ఉండాలని ప్రతిపాదించినపుడు... తాము చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందం ప్రకారం 50 మీటర్లే గ్రీన్‌బెల్ట్‌కు అంగీకరించామని, దానికే పరిమితం కావాలని ముఖ్యమంత్రిని రాంకీ సంస్థ కోరే అవకాశం లేదా? అలా కోరినపుడు మునుపటి ఒప్పందమే కనక ఆమోదించవచ్చని సీఎం వైఎస్ భావించే అవకాశం లేదా? అలాంటి సహేతుకమైన కారణాలన్నిటినీ వదిలేసి... సాక్షిలో పెట్టుబడి పెట్టారు కనకే ఈ మేలు చేశారనటం సమంజసమా?
ఏం! జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపార దక్షతపై నమ్మకం ఉండో, మున్ముందు ఇన్వెస్ట్‌మెంట్లు లాభిస్తాయనో, రాష్ట్రంలో బొమ్మనేకాదు... బొరుసును కూడా చూపించే పత్రిక వస్తోంది కాబట్టి దానికి మద్దతివ్వాల్సిన అవసరముందని భావించో ‘రాంకీ’ సంస్థ పెట్టుబడి పెట్టే అవకాశం లేదా? ఇదెక్కడి అడ్డగోలు తీరు?
{Xన్‌బెల్ట్‌పై నిజానికి రాంకీకి వైఎస్ ప్రభుత్వం చేసిన మేలేమీ లేదు. మునుపటి ఒప్పందాన్నే పాటించింది. మరి ఈ పాటిదానికే ‘సాక్షి’లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న సీబీఐ వాదన నిజమైతే... 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరు ప్రాతిపదికగా కట్టబెట్టేసిన చంద్రబాబుకి రాంకీ ఎంత ముడుపులిచ్చి ఉండాలి? అంత హడావుడిగా ఎన్నికల ముందు ఒప్పందం కుదుర్చుకున్నారెందుకు?
ఇక్కడా ఎమ్మార్ లాంటి తేదీలే...
ఎమ్మార్ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 2005 కన్నా ముందు ఏం జరిగిందనేది తాను దర్యాప్తు చేయబోనని భీష్మించుకున్న సీబీఐ... రాంకీ వ్యవహారంలోనూ అదే చేసింది. ఎంతసేపూ ఈ ఛార్జిషీట్లో 2005 నుంచి 2009 మధ్య జరిగిన లావాదేవీల ప్రకారం... అంటోందే తప్ప అసలు రాంకీకి ఇచ్చిందెవరు? 2004 ఏప్రిల్లో ఆ సంస్థ ఏర్పాటయిన 24 గంటల్లో కన్షెషన్ ఒప్పందం ఎలా కుదిరింది? అంతకు ముందే భూములు ఎలా అలాట్ చేశారు? అనేవి దర్యాప్తు చేయటమే లేదు. ఎందుకని? అసలు 2004 కన్నా ముందటి వ్యవహారాల్ని విచారించొద్దని సీబీఐకి చెప్పిందెవరు? రామోజీనా? చంద్రబాబా? లేక సీబీఐని నడిపిస్తున్న సూపర్ బాసా?

వాన్‌పిక్ మాదిరే రాయితీలు...
ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసినపుడు సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో చిత్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థకు స్టాంపు, రిజిస్ట్రేషన్ల చార్జీల్ని మినహాయించారని, ఇతరత్రా మినహాయింపులు చాలా ఇచ్చారని, అందుకే వాన్‌పిక్ ‘సాక్షి’లో పెట్టుబ డులు పెట్టినట్లుగా పేర్కొంది. ‘కన్సెషన్’ ఒప్పం దాన్ని పెద్ద భూతంలా చూపించింది. మరి ఫార్మాసిటీతో చంద్రబాబు హడావుడిగా కుదుర్చుకున్న ఈ కన్సెషన్ అగ్రిమెంట్‌లో ఏముందో తెలుసా?
*అమ్మకం పన్ను పూర్తిగా మినహాయిస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా పూర్తిగా మినహాయించారు.
*{పభుత్వానికి, ఉడాకు చెల్లించాల్సిన చార్జీలేమైనా ఉంటే వాటిని తగ్గించటానికైనా, పూర్తిగా రద్దు చేయటానికైనా అవసరాన్ని బట్టి ఏపీఐఐసీ రికమెండ్ చేస్తుంది.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అవకాశాలున్న అన్ని రాయితీలూ వచ్చేలా ఏపీఐఐసీ సహకరిస్తుంది.
*అయితే 2000 మార్చిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న విధంగా గ్రీన్ బెల్డ్ ఉండేలా డెవలపర్ చూసుకోవాలి. (దీని ప్రకారం చంద్రబాబు గ్రీన్‌బెల్ట్‌కు నిర్దేశించిన మొత్తం భూమి 352 ఎకరాలు)
*మొత్తం భూమిని రాంకీ పేరిటే కేటాయిస్తారు. దాన్ని అది ప్లాట్లుగా చేసి, తనే ధర నిర్ణయించి విక్రయిస్తుంది. దీన్లో గ్రీన్‌బెల్ట్ జోన్ ఉంటుంది.
*ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం 2005 ఫిబ్రవరి 28న వుడాకు ‘రాంకీ’ లే ఔట్ ప్లాన్‌ను అందజేసింది. ఈ లే ఔట్ ప్లాన్ ప్రకారం గ్రీన్‌జోన్ మొత్తం 352 ఎకరాలుంటుంది. దీన్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు, ఓపెన్‌స్పేస్‌లో గ్రీన్ బఫర్ 221.21 ఎకరాలు, హెచ్‌టీ కారిడార్‌లో గ్రీన్ బఫర్ 72 ఎకరాలు ఉంటుంది. ఈ మేరకు ఉడాకు లేఔట్ సమర్పించిన రాంకీ... ఆమోదం కూడా పొందింది.

మీడియాపైనా సీబీఐ విశ్లేషణ...
ఈ ఛార్జిషీట్లో తన వాదన కరెక్టని చెప్పటానికి రాష్ట్ర మీడియా రంగంపైనా సీబీఐ విశ్లేషణ చేసింది. ‘‘సాక్షి ప్రమోటర్లు పెట్టుబడుల్ని ఆకర్షించటానికి రాష్ట్రంలో ఇప్పటిదాకా బలంగా ఉన్న మీడియా కన్నా ఎక్కువ లాభాలొస్తాయని ఆశించారు. లాభాల మార్జిన్లు కూడా ఇప్పటిదాకా వస్తున్న వాటికన్నా ఎక్కువ అంచనా వేశారు’’ అని పేర్కొన్నారు. వీళ్ల దృష్టిలో రాష్ట్రంలో ఉన్న మీడియా అంటే... ‘ఈనాడు’ తప్ప మరోటి కాదు. అసలు ‘ఈనాడు’ తన ఆదాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైనా చూపించిం దా? ఆదాయపు పన్ను ఎగ్గొట్టడానికి అడ్డగోలు స్టేట్‌మెంట్లు తయారు చేసిన వ్యవహారాన్ని అప్పట్లోనే ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టలేదా?


‘సాక్షి’ తొలి రెండేళ్లలోనే తాను ఆశించిన సర్క్యులేషన్‌ను సాధించిందని, కానీ ఆశించిన లాభాల్ని సాధించలేదని సీబీఐ పేర్కొంది. మరి సర్క్యులేషన్‌ను సాధించటమంటే పెట్టుబడిదారులకు అబద్ధాలు చెప్పినట్టా? అమ్మకాలు ఆశించినంతగా ఉన్నపుడు లాభాలు ఒకటిరెండేళ్లలో ఆశించినట్టు రావా? ఇదెక్కడి వింత వాదన? పెపైచ్చు తొలి ఏడాది భారీ నష్టాలొచ్చినా రెండో ఏడాది అవి గణనీయంగా తగ్గాయని కూడా సీబీఐనే పేర్కొంది. మరి మూడో ఏడాది లాభాల బాటలోకి వచ్చే అవకాశం లేదా?

పోలీస్ ఓవరాక్షన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి నగర పోలీసులు ఓవరాక్షన్ చేశారు. నగర జీవికి నరకయాతన చూపారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆటంకాలు కల్పించి నగరాన్ని అష్టదిగ్బంధం చేశారు. ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. ఇదే సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుల్ని, కార్యకర్తలను వేధింపులకు గురిచేశారు. ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడ్డారు.

సిటీబ్యూరో, న్యూస్‌లైన్: రాజ్‌భవన్ సమీపంలో ఉన్న దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సీబీఐ విచారణకు జగన్ హాజరవుతున్న నేపథ్యంలో మోనప్ప ఐలాండ్ నుంచి వీవీ స్టాట్యూ మధ్య శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పరిమిత ట్రాఫిక్‌కు అనుమతిస్తామంటూ గురువారం రాత్రి పోలీసులు ప్రకటించారు. అయితే తెల్లారేసరికి ఖైరతాబాద్ చౌరస్తా, నెక్లెస్‌రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద బారికేడ్లు, మధ్యలో బార్డ్బ్‌వైర్ ఏర్పాటు చేసి ఆ మార్గాలను పూర్తిగా మూసేశారు. దీంతో ఆ రూట్‌లో ప్రయాణించాల్సిన వాహనాలు ఇతర రోడ్లలోకి మళ్లడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. విశాలమైన ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో వాహనచోదకులు నరకం చవిచూశారు. పాదచారులను సైతం అనుమతించకపోవడంతో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగారు. చివరకు ఆస్పత్రులకు వెళ్తున్న వాహనాలను సైతం అడ్డుకోవడంతో రోగులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది.

క్యాడర్‌కు బెదిరింపులు..
పోలీసులు సృష్టించిన ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో నగరంలో కొన్ని అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు బస్సుల దహనాలకు పాల్పడిన నేపథ్యంలో... ఈ ఘటనలకు కారకుల్ని గుర్తించే నెపంతో పోలీసులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్నే టార్గెట్‌గా చేసుకున్నారు. స్థానికంగా ఉన్నవారికి, సంబంధీకులకు ఫోన్లు చేస్తూ, ఇళ్లకు వెళ్తూ పోలీసుస్టేషన్‌కు రావాల్సిందిగా వేధిస్తున్నారు. రాజ్‌భవన్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులు కొందర్ని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం కార్యకర్తలతోపాటు జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందినీ పోలీసులు విడిచిపెట్టకుండా తమ ప్రతాపం చూపారు. శనివారం సైతం జగన్ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు వస్తుండటంతో పోలీసులు అత్యుత్సాహంపై నగరవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

గోల్కొండ ఠాణాకు వైఎస్సార్ సీపీ నాయకులు
గోల్కొండ, న్యూస్‌లైన్: శుక్రవారం సాయంత్రం గోల్కొండ పోలీస్‌స్టేషన్ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తెచ్చారు. విద్యార్థులైన తమను ఉగ్రవాదుల్లా చిత్రీకరించి విచక్షణా రహితంగా కొట్టడం, బూతులు తిట్టడం అమానుషమని అసలు తమను అరెస్ట్ చేయడమే అక్రమమని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ నేమూరి నవీన్‌గౌడ్ అన్నారు. ఓ ప్రమాదంలో గాయపడి తన తొడలో రాడ్డు ఉన్న తనను పంజగుట్ట ఏసీపీ తన తొడపై బూటుకాలుతో తన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎటువంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టకపోయినా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు ఠాకూర్ అమిత్‌సింగ్, నగర స్టీరింగ్ కమిటీ సభ్యుడు తైక్వాండో రమేశ్‌లతోపాటు మరో 28 మంది ఉన్నారు.

ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు!

జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై దర్యాప్తు పూర్తి చేయకుండానే దాఖలు చేసిన చార్జిషీట్‌ను
సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడాన్ని సవాల్ చేసిన విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ 


వాదనలు వినిపించిన పద్మనాభరెడ్డి, సుశీల్‌కుమార్ 
సీబీఐ తీరు నిబంధనలకు విరుద్ధం
హైకోర్టు నిర్దేశించినట్టు కాకుండా తనకిష్టమొచ్చినట్టు చేస్తోంది 
రోజుకో చార్జిషీటు దాఖలు 
ఇలా చేయడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు 
కోర్టు విచారణకు స్వీకరించడం కూడా చెల్లదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం లో సీబీఐ ఇష్టారాజ్యంగా దర్యాప్తు సాగిస్తోందని సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి కోర్టుకు నివేదించారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా కాక, తనకు కావాల్సిన విధంగా దర్యాప్తు చేస్తోందని ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు, చార్జిషీట్ దాఖలు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు.

ఈ కేసులో దర్యాప్తు పూర్తి కాకుండానే గత మార్చి 31న సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించడాన్ని సవాలు చేస్తూ ఆడిటర్ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర ప్రసాదరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి బెజ్జారం చంద్రకుమార్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.పద్మనాభరెడ్డి, సుశీల్‌కుమార్ తమ తమ వాదనలను వినిపించారు. 

మొదట పద్మనాభరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో సీబీఐ రోజుకో చార్జిషీట్ దాఖలు చేస్తోందని తెలిపారు. చట్ట ప్రకారం దర్యాప్తు పూర్తయిన తరువాత దాఖలు చేసే తుది నివేదికే చార్జిషీట్ అవుతుందని, అయితే సీబీఐ అధికారులు దర్యాప్తు పూర్తి చేయకుండా చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారని వివరించారు. ఇలా అసంపూర్తి దర్యాప్తుతో దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించిందని, ఇలా చేయడం చట్ట విరుద్ధమని ఆయన కోర్టుకు నివేదించారు. 

వేర్వేరుగా దాఖలు చేసే చార్జిషీట్లను ఏమనాలి?
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పలువురు వ్యక్తులను, కంపెనీలను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, అటు తరువాత ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణల, వ్యక్తుల ప్రస్తావన లేకుండా ఈ ఏడాది మార్చి 31న సీబీఐ చార్జిషీట్‌ను దాఖలు చేసిందని వివరించారు. ఈ కేసులో ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్ రాకూడదనే ఏకైక లక్ష్యంతో.. సీబీఐ అధికారులు ఆ చార్జిషీట్‌ను హడావుడిగా దాఖలు చేశారని తెలిపారు. 

ఒకసారి చార్జిషీట్ దాఖలు చేశారంటే చట్ట ప్రకారం దర్యాప్తు పూర్తయినట్లు లెక్కని, అయితే సీబీఐ అధికారులు మాత్రం ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు దాఖలు చేస్తూ.. ప్రతిసారీ ఇంకా దర్యాప్తును కొనసాగిస్తున్నామని కోర్టుకు చెబుతున్నారని వివరించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు సైతం ఇలా దాఖలు చేస్తున్న చార్జిషీట్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, వాటిని విచారణకు స్వీకరిస్తోందని తెలిపారు. మొదటి చార్జిషీట్‌ను ఒరిజినల్ అని చెప్పిన సీబీఐ, తరువాత దాఖలు చేసే చార్జిషీట్లను కూడా ఒరిజినల్ అని చెబుతోందని, ఒక కేసులో మొదట దాఖలు చేసే చార్జిషీట్ మాత్రమే ఒరిజినల్ అవుతుందని, మిగిలినవన్నీ అనుబంధ చార్జీషీట్లు అవుతాయని, అయితే సీబీఐ మాత్రం ప్రతి చార్జిషీట్‌ను స్వతంత్ర చార్జిషీట్‌గా పరిగణిస్తూ, ప్రతి దానికి సీసీ నంబర్ కేటాయించాలని కోరుతోందని పద్మనాభరెడ్డి తెలిపారు. 

ఇలా దాఖలు చేస్తున్న చార్జిషీట్లు చట్ట ప్రకారం చెల్లుబాటు కావని, వాటిని విచారణకు స్వీకరించడం కూడా చెల్లదని ఆయన తెలిపారు. కొత్త విషయాలు, వాస్తవాలను వెలుగు చూస్తేనే, సెక్షన్ 173 (8) కింద తదుపరి దర్యాప్తు కొనసాగించవచ్చునని, అయితే సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేయకుండానే తొలి చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. దర్యాప్తు పూర్తి కాకుండానే దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించడం, తదనుగుణంగా సమన్లు జారీ చేయడం ద్వారా సీబీఐ కోర్టు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయిందని వివరించారు. చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ, తదనుగుణంగా సమన్లు జారీ చేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. 

దర్యాప్తు పూర్తికాకుండానే చార్జిషీట్లు: తరువాత సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. ఈ మొత్తం కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పనివారిని సీబీఐ అధికారులు నిందితులుగా చేర్చారని వివరించారు. ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు దాఖలు చేయడానికి వీల్లేదని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించిందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో లేని అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు, సీబీఐ దర్యాప్తును కొనసాగింవచ్చునని, అయితే సీబీఐ అధికారులు అసలు ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలకు సంబంధించే దర్యాప్తును పూర్తి చేయలేదని, అలాంటప్పుడు చార్జిషీట్లు ఎలా దాఖలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తి.. సీబీఐ వాదనల నిమిత్తం విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

నాతో సహా నాటి మంత్రులందరినీ విచారించాలిరామచంద్రపురం (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలకు అప్పటి మంత్రిమండలి మొత్తం బాధ్యత వహించాలని మాజీ మంత్రి, రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటే ముందుగా.. వైఎస్ మంత్రివర్గంలో ఉండి నిర్ణయాలు తీసుకున్న తనతో సహా అప్పటి మంత్రులందరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారమిక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తరువాత తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుతంత్రంలో ఇదొక భాగమని ఆరోపించారు. బలహీన వర్గానికి చెందిన మంత్రిని బలి చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ ఒత్తిడి మేరకు సంతకం చేశానని చెబుతున్న మోపిదేవి.. ఆ విషయాన్ని అరెస్టుకు ముందు చెప్పి ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉండేదన్నారు. అరెస్టయిన తరువాత ఈ మాట అనడం చూస్తుంటే .. దీని వెనుక కిరణ్ సర్కారు పెద్దల హస్తం ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు.

‘రైతు సమస్యలను ప్రాధాన్యతాంశంగా తీసుకుని అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాం. సర్కారుకు వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలందరికీ పదవి పోతుందని ఆనాడే తెలుసు. అయితే, రైతుల కోసం పదవిని వదులుకోవటం వల్లే ఈనాడు వారికి ప్రజల్లో మరింత ఆదరణ లభిస్తోంది’ అని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల్లో అన్ని చోట్లా తమ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు.

ఓ మీడియా దుష్ర్పచారంతో నలుగురు హఠాన్మరణం


ఓ మీడియా దుష్ర్పచారంతో నలుగురు హఠాన్మరణం
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: సీబీఐ విచారణ పేరుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే వదంతులు, ఓ మీడియాలో దుష్ర్పచారం నాలుగు నిండు ప్రాణాల ను బలిగొన్నాయి. వైఎస్ జగన్‌పై ప్రభుత్వం వేధిం పులకు గురిచేస్తోందని కలత చెందిన జగన్ అభిమానులు నలుగురు గుండెపోటుతో మృతిచెందారు. కర్నూలు, ఖమ్మం, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ వైఎస్‌ఆర్‌సీపీ నేత రాజగోపాల్‌రెడ్డి(48) శుక్రవారం జగన్ సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్న దృశ్యాలను వీక్షిస్తూ ఉద్వేగానికి లోనై కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యు లు చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.జగన్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందంటూ గురువారం రాత్రి టీవీల్లో వచ్చిన వార్తను చూసిన ఖమ్మం జిల్లా పాల్వంచలోని నెహ్రూనగర్‌కు చెందిన కాల్వ లక్ష్మయ్య (65) అదే విషయాన్ని భార్యాబిడ్డలతో చర్చిస్తూ కుప్పకూలిపోయాడు. దీంతో వారు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం గుడిపాడుకు చెందిన గరికిముక్కు రంగారావు (39) కూడా టీవీలో వార్తలు చూసి తీవ్ర మనోవ్యధకు గురయ్యూడు. దీంతో గురువారం రాత్రి గుండెపోటుకు గురయ్యూడని అతని తమ్ముడు రవి తెలిపాడు. బాధితుడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మరో ఘటనలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సిద్దారెడ్డిపాళెం గ్రామానికి చెందిన సిగినం చినసుబ్బయ్య(42) కూడా జగన్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందన్న కథనాలకు కలతచెంది టీవీ చూ స్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు.

దిల్‌కుశ, లోటస్‌పాండ్‌కు వెళ్లే రహదారులన్నీ మూసివేత


ఇక్కట్ల పాలైన సామాన్య ప్రజానీకం
మక్తాలో అప్రకటిత కర్ఫ్యూ
ట్రాఫిక్‌ మళ్లించడంతో పిల్లలతోసహా మండుటెండలో ప్రజల అవస్థలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలీసుశాఖ అత్యుత్సాహంతో రాష్ట్ర రాజధాని ప్రజలు శుక్రవారం మండుటెండలో నానా అవస్థలు పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరైన నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రోడ్డులో ఉన్న దిల్‌కుశ అతిథిగృహానికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. ఖైరతాబాద్ జంక్షన్, సోమాజిగూడ నుంచి రాజభవన్‌రోడ్డుకు వెళ్లే మార్గాలను శుక్రవారం ఉదయం నుంచే పూర్తిగా మూసివేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. ఉదయం ఎనిమిది గంటలకే మొత్తం రోడ్లన్నీ దిగ్బంధనం చేయడంతో ఆఫీసులకు వెళ్లేవారు ఆందోళనకు గురయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి నివాసమైన లోటస్‌పాండ్‌కు వెళ్లే దారులనూ తెల్లవారు జామునుంచే పూర్తిగా మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండేవారిని సైతం వెళ్లనీయకుండా చెక్‌పోస్టులు పెట్టారు. గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఆ ప్రాంతంలో నివాసముండేవారు పోలీసులతో పలుచోట్ల వాగ్వివాదానికి దిగారు. దిల్‌కుశ, లోటస్‌పాండ్ ప్రాంతాల్లో భారీస్థాయిలో బారికేడ్లు ఏర్పాటుచేయడమేగాక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్), సాయుధ పారా మిలటరీ బలగాలను మోహరించారు. అంతేగాక ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించడంతో చంటి పిల్లలతోసహా మండుటెండలో కాలినడకన కిలోమీటర్ల వరకు సామాన్యులు కొందరు నడిచి వెళ్లాల్సి వచ్చింది. విధి నిర్వహణకోసం దిల్‌కుశ అతిథిగృహం వద్దకు వెళ్లే మీడియా ప్రతినిధులకూ ఇబ్బందులు తప్పలేదు. మీడియాకు సంబంధించిన గుర్తింపు కార్డులను చూపినప్పటికీ కొందరు ప్రతినిధులను పోలీసులు ఆ రోడ్డులోకి అనుమతించలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్లే సమయంలో పోలీసులు మరింత హడావుడి సృష్టించారు.


మక్తాలో అప్రకటిత కర్ఫ్యూ!: దిల్‌కుశ అతిథి గృహానికి ఎదురుగా రైల్వే ట్రాక్‌కు అవతలవైపున ఉన్న మక్తా ప్రాంతంలో పోలీసులు అప్రకటిత కర్ఫ్యూ విధించారు. దుకాణాలన్నింటినీ బలవంతంగా మూసివేయించారు. కనీసం టీ హోటళ్లను కూడా తెరవనీయలేదు. నిరంతరం పోలీసు వాహనాలు, సాయుధ పోలీసులతో ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ఆ ప్రాంతానికి చెందిన సాధారణ ప్రజలు తమ రోజువారీ పనుల నిమిత్తం వెళ్లేందుకు కూడా రోడ్డు మీదకు పోలీసులు రానివ్వలేదు. దీంతో ఆ ప్రాంతంలో నివసించేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దిల్‌కుశ అతిథి గృహం వద్ద మీడియా ప్రతినిధులు మంచినీళ్లకోసం మక్తా ప్రాంతానికి వెళితే... వారు తిరిగి రోడ్డుమీదకు రాకుండా అడ్డుకున్నారు. పలువురు మీడియా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మతో మాట్లాడిన తరువాత మాత్రమే దిల్‌కుశ వద్దకు వచ్చేందుకు అనుమతించారు.

విచారణ ప్రశాంతంగా జరిగింది..సీబీఐ అడిగిన వాటికి వివరణ ఇచ్చానేడు కూడా సీబీఐ ఆఫీసుకు వస్తానని వెల్లడి
తల్లి విజయమ్మ ఆశీస్సులతో దిల్‌కుశకు జగన్‌మోహన్‌రెడ్డి
ఆయన వెంట వెళ్లిన ఆళ్ల నాని, సబ్బం హరి, భూమా నాగిరెడ్డి
లోటస్‌పాండ్, దిల్‌కుశ వద్ద ఆద్యంతం పోలీసుల వీరంగం
రోడ్లన్నింటినీ అష్టదిగ్బంధం చేసి ఉదయం నుంచే ఓవరాక్షన్
భారీగా ట్రాఫిక్‌జామ్, మండుటెండలో జనం విలవిల
వైఎస్సార్‌సీపీ నేతలనూ అనుమతించని పోలీసులు
ఖైరతాబాద్ వద్దే జగన్ కాన్వాయ్ నిలిపివేత
లేక్‌వ్యూ వరకు వెళ్తామన్నా అనుమతి నిరాకరణ
జగన్ అభిమానులను అదుపులోకి తీసుకున్న వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘సీబీఐ అధికారులు వివరణ అడిగారు. వారడిగిన వాటికి పూర్తిగా వివరణ ఇచ్చాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ క్యాంపు కార్యాలయమైన దిల్‌కుశ అతిథి గృహంలో ఆయన శుక్రవారం విచారణకు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్తూ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఇంకా మరికొన్ని అంశాలకు వివరణ ఇవ్వాల్సి ఉందని, అందుకోసం శనివారం కూడా వస్తానని వెల్లడించారు. విచారణ ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. విచారణ నిమిత్తం దిల్‌కుశ అతిథి గృహంలోకి వెళ్లేప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, బయటికి వచ్చేప్పుడు కూడా జగన్ అంతే ఉత్సాహంగా కనిపించారు. దిల్‌కుశ ప్రధాన ద్వారం వద్దకు రాగానే, మాట్లాడాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరడంతో వాహనం ఆపాలని డ్రైవర్‌ను ఆదేశించారు. అందరికీ కనిపించేలా కారు డోర్ దగ్గర నుంచుని వారి ప్రశ్నలకు సమాధాన మిచ్చారు. అనంతరం బై.. బై... అంటూ తనదైన శైలిలో చేయి ఊపుతూ వెళ్లిపోయారు.

సుదీర్ఘంగా విచారణ: విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10.30కు జగన్ దిల్‌కుశ అతిథి గృహానికి వచ్చారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఏలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి ఆయన వెంటవచ్చారు. తరవాత కొద్దిసేపటికి సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ జగన్‌ను విచారించారు. ఆ సందర్భంగా హరి, భూమా, నాని వేరొక గదిలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు హరి వెళ్లిపోయారు. వాన్‌పిక్ ఉదంతంలో అరెస్టయిన మంత్రి మోపిదేవి వెంకటరమణ, మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌టీఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిలను కూడా సీబీఐ అధికారులు విచారించారు. సాయంత్రం 4.30కు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సాయంత్రం 6.30 గంటలకు విచారణ ముగిశాక భూమా, నానిలతో కలిసి ఒకే వాహనంలో జగన్ తిరిగి వెళ్లిపోయారు. జగన్‌తో పాటు ఆయన వెంట వచ్చిన వారికి జగన్ నివాసం నుంచి భోజనం వచ్చింది. మధ్యాహ్నం 1.30 సమయంలో వారికి భోజనం తీసుకుని వస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని కిలోమీటర్ దూరంలోనే నిలిపేయడంతో అందులోని వారు కాలినడకన వచ్చి భోజనం అందించారు. భోజన విరామం మినహా విచారణ సుదీర్ఘంగా కొనసాగింది.

ఈ సమయంలో విచారణ కుట్రే: సబ్బం
ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జగన్‌ను విచారణకు పిలవడం కచ్చితంగా కుట్రేనని సబ్బం స్పష్టం చేశారు. దిల్‌కుశ నుంచి తిరిగి వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని జగన్ కూడా చెప్పారు. తనూ అలాగే భావిస్తున్నాను. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం మేరకు 26 జీవోలిచ్చారు. జగన్ నిందితుడిగా నిర్ధారణ కావాలంటే ఆ జీవోలు రైటో, రాంగో ముందుగా తేలాల్సి ఉంది. ఆ జీవోలపై నిర్ధారణ రానంత వరకూ జగన్‌పై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే’’ అని ఆయన అన్నారు. జగన్ అరెస్టు వార్తలపై స్పందించాలని కోరగా, అది సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను అడగాలని సబ్బం సూచిం చారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి, జగన్‌మోహన్‌రెడ్డికి తాను అభిమానినని ఒక ప్రశ్నకు సమాధానంగా పునరుద్ఘాటించారు.

పోలీసుల వీరంగం: శుక్రవారం సీబీఐ విచారణ సందర్భంగా జగన్ నివాసం లోటస్‌పాండ్‌తో పాటు దిల్‌కుశ అతిథి గృహం సమీపంలో పోలీసులు వీరంగం చేశారు. జగన్ నివాసానికి వెళ్లే దారిలో బారికేడ్లు పెట్టి, ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. జగన్‌ను కలిసేందుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా నిలిపేయడంతో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. పార్టీ కార్యకర్తలను, జగన్ అభిమానులను దరిదాపుల్లోకి రాకుండా చేశారు. జగన్ దిల్‌కుశకు వస్తున్న సమయంలోనూ ఖైరతాబాద్ వద్ద పోలీసులు వీరంగం సృష్టించారు. ఆయన్ను వెన్నంటి వస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలను ఖైరతాబాద్ వద్ద నిలిపేశారు. లేక్‌వ్యూ వరకు వెళ్తామన్నా అంగీకరించలేదు. ఇక దిల్‌కుశకు దారి తీసే మార్గాలన్నింటినీ ఉదయం నుంచే దిగ్బంధించారు. బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు. అయినప్పటికీ పలువురు జగన్ అభిమానులు దిల్‌కుశ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. ఉదయం 11.30 సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేత వెల్లాల రామ్మోహన్ దిల్‌కుశ వద్దకు చేరుకుని ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. దాంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటల లోపు జగన్ అభిమానులు పలుమార్లు దిల్‌కుశకు చేరుకుని నినాదాలు చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తల్లి ఆశీస్సులతో దిల్‌కుశకు జగన్


మైసూరా, సబ్బం, పార్టీ నేతలతో భేటీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో.. తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్న అనంతరం సీబీఐ ముందు విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు. అంతకుముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న జగన్ శుక్రవారం ఉదయం పలువురు పార్టీ నేతలను కలుసుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డితో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆ తరువాత అనకాపల్లి ఎంపీ సబ్బంహరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, భూమా నాగిరెడ్డి, ఎస్.వి.మోహన్‌రెడ్డి, ఎమ్మిగనూరు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, జ్యోతుల నెహ్రూతో పాటుగా పలువురు నాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. కాగా ఏలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) కూడా జగన్‌ను కలుసుకున్నారు. 

ఉదయం సరిగ్గా 10.10 గంటలకు ఇంటినుంచి బయటకు వచ్చి అక్కడ వేచి చూస్తున్నవారందరికీ అభివాదం చేశారు. జగన్‌ను తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబసభ్యులు బయటకు వచ్చి వీడ్కోలు పలుకగా, అప్పటికే భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ‘జై జగన్...!’ అంటూ నినాదాలు చేస్తుండగా దిల్‌కుశ అతిథి గృహానికి వెళ్లారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జగన్ కాన్వాయ్ వెంట ఉన్నారు. ఇదిలావుండగా జగన్ నివాసానికి సమీప ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించారు. 

సుమారు అర కిలోమీటరు పరిధిలో అన్ని రహదారుల్లోనూ పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎంత కట్టుదిట్టం చేసినా పార్టీ కార్యకర్తలు, అభిమానులు జగన్ నివాసం వద్దకు చేరుకోకుండా నిరోధిం చడం మాత్రం వారివల్ల కాలేదు. ఉదయం 8 గంటల నుంచే ఆయన ఇంటి ముందు వందల సంఖ్యలో అభిమానులు గుమికూడారు. జగన్ వాహనం బయటకు రాగానే పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ వీడ్కోలు పలికారు.

అడుగడుగునా నిర్బంధం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టులు, గృహనిర్బంధం
హైదరాబాద్‌కు రానివ్వకుండా పోలీసుల అడ్డంకులు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్‌కు సంఘీభావంగా జిల్లాల నుంచి హైదరాబాద్ బయలుదేరిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అడుగడుగునా అడ్డంకులు సృ ష్టించి వారిని అరెస్టు చేశారు. చెక్‌పోస్టుల్లో వాహనాలు తనిఖీ చేసి ఆ పార్టీకి చెందిన వారు లేరని ధ్రువీకరించుకున్నాకే వదులుతున్నారు. పలువురిని గృహనిర్బంధం చేశారు. కార్యకర్తలకు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నాయకుల ఇళ్ల వద్ద గస్తీ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్ వద్దకు జగన్‌ను కలిసేందుకు పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌గౌడ్, సిటీ అధ్యక్షుడు ఠాకూర్ అమీత్‌సింగ్, రాష్ట్ర యువజన నాయకుడు బి.శ్రీకాంత్, రమేష్‌యాదవ్ ఆధ్వర్యంలో వస్తున్న 27 మందిని సోమాజిగూడలో పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటనర్సయ్య వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చితకబాదారు. అలాగే వైఎస్‌ఆర్ సీపీ సేవాదళం సిటీ కన్వీనర్ వెల్లెల రాంమోహన్, ఐటీ విభాగం స్టేట్ బాడీ మెంబర్ దేవేందర్‌రెడ్డిలను కూడా పంజగుట్ట పోలీసులు గోల్కొండ స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ నాయకులు మహ్మద్‌ఖాజా, గులాంసాజీద్‌లను గురువారం అర్ధరాత్రే అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ చౌరస్తాలో నిలబడి ఉన్న వైఎస్‌ఆర్ జిల్లావాసి రాహుల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 

జగన్ ప్రైవేటు భద్రత సిబ్బందీ అరెస్టు 
జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. సీబీఐ విచారణ కోసం గురువారం రాత్రి మాచర్ల నుంచి జగన్ వెంట 34 మంది సెక్యూరిటీ గార్డులు నగరానికి వచ్చారు. వారంతా పంజగుట్టలోని విష్ణుప్రియ లాడ్జిలో బస చేసేందుకు వెళ్లారు. కాగా పోలీసులు అత్యుత్సాహంతో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆ లాడ్జిపై దాడి చేశా రు. తామంతా వైఎస్ జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిమని వారు చెప్పినా వినకుండా బ్యాగ్‌లు తనిఖీలు చేసి, వారందరినీ అరెస్ట్ చేసి గోషామహాల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. సాయంత్రం 6.30 గంటల వరకు వారిని విడిచిపెట్టలేదు.


జిల్లాల్లోనూ అదే తంతు 
వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎమ్మెల్సీ కొండా మురళిని జనగామ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం విడిచిపెట్టారు. కరీంనగర్ జిల్లాలో ముందు జాగ్రత్త పేరుతో 113 మందిని అరెస్ట్ చేసి సాయంత్రం వరకు స్టేషన్లలో నిర్బంధించారు. వేములవాడలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఆది శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. కరీంనగర్‌లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు అదుపులో తీసుకొని సాయంత్రం వదిలిపెట్టారు. విజయవాడలో పార్టీ నాయకులకు షాడో పార్టీలను ఏర్పాటు చేశారు. నాయకుల ఇళ్ల వద్ద గట్టి నిఘా పెట్టారు. మెదక్ జిల్లాలో మండలాల వారీగా తమ జాబితాలో ఉన్న నేతలను స్టేషన్‌కు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. పెద్దశంకరంపేట, బుధేరాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి, సాయంత్రానికి వదిలేశారు.

నెల్లూరులో ఎక్కడ చూసినా పోలీసులు గుంపులు గుంపులుగా కనిపించారు. లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆలంపూర్, షాద్‌నగర్ చెక్‌పోస్టుల వద్ద హైదరాబాద్ వైపు వెళుతున్న ప్రైవేటు వాహనాలను ఆపి తనిఖీలు చేసిన పోలీసులు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు లేరని రూఢీ చేసుకున్న తరువాతే పంపుతున్నారు. ఇదే పరిస్థితి శ్రీశైలం హైవేపై కూడా కొనసాగింది. నల్లగొండ జిల్లాలో పోలీసు అధికారులు పార్టీ నాయకులకు ఫోన్లు చేసి, తమకు తెలియకుండా ఎటూ వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. రెండు వాహనాల్లో కోదాడ నుంచి హైదరాబాద్ బయలు దేరిన పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎర్నేని బాబు, కెఎల్‌ఎన్‌ప్రసాద్, మరో ఇరవై మంది కార్యకర్తలను సూర్యాపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ-గుంటూరు జిల్లాల సరిహద్దుల్లోని వాడపల్లి బ్రిడ్జి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆందోళనలు
సీబీఐ విచారణ పేరుతో ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధింపులకు గురిచేస్తోందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జగన్‌పై కాంగ్రెస్, సీబీఐ చేస్తున్న కుట్రలు ఆపాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ సీపీకి చెందిన నలుగురు మహిళా నాయకురాళ్లు హైదరాబాద్‌లో ఓ కాంప్లెక్స్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కి రోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటామని హెచ్చరించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి కిందకి దించారు. నల్లగొండ జిల్లా కోదాడలో సైతం కార్యకర్తలు ఓ బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కారు. నేరేడుచర్లలో మరో నలుగురు యువకులు సెల్‌టవర్ ఎక్కారు. కడపలో కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన చేయగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మౌన ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. విజయవాడలో పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద పార్టీ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల నిరసన ప్రదర్శన చేశారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ వినాయక్‌నగర్‌కు చెందిన వరలక్ష్మీ, వాజ్‌పేయినగర్‌కు చెందిన శారద నేరేడ్‌మెట్ చౌరస్తాలోని మార్షల్ హోటల్‌పై ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. రంగారెడ్డిజిల్లా పార్టీ కన్వీనర్ బి.జనార్ధన్‌రెడ్డి ఫోన్ చేసి జగన్‌కు మంచి జరగాలంటే ఆత్మహత్యలు మానుకోవాలని సూచించడంతో వారు కిందికి దిగివచ్చారు.

జగన్ సహకరించలేదా? సీబీఐని చెప్పమనండి


సీబీఐ అనుమానాలన్నీ జగన్ నివృత్తి చేశారని వెల్లడి
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ అధికారులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకరించలేదని కొన్ని వ్యతిరేక చానళ్లలో వచ్చిన వార్తా కథనాలు పూర్తి అవాస్తవమని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. జగన్ సహకరించలేదని సీబీఐని నోట్ పంపమనండి అని హరి ఆ చానళ్లను సూటిగా అడిగారు. సీబీఐ లేవనెత్తిన అనుమానాలన్నింటికీజగన్ సమాధానమిచ్చారని చెప్పారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ.. మనసులో ఏదో పెట్టుకొని ఒక వర్గం మీడియా గందరగోళం సృష్టించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్‌కు సర్వ అధికారాలున్నాయని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. వారు ఎలాంటి చర్య తీసుకున్నా ఫర్వాలేదన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని హరి పేర్కొన్నారు.

చంద్రబాబు స్క్రిప్టును అమలు చేస్తున్న కాంగ్రెస్: జూపూడి

జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రూపొందించిన మోసపూరిత స్క్రిప్టును కాంగ్రెస్ హైకమాండ్ సీబీఐ ద్వారా అమలు చేస్తోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న నీచరాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. ఆ రెండు పార్టీలకు 18 చోట్లా డిపాజిట్లు దక్కవని మండిపడ్డారు. జగన్‌పై సీబీఐ వ్యవహరిస్తున్న తీరు చూసి అయ్యో పాపమంటూ కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలోచన చేస్తున్నారని, వారు తగిన బుద్ధిచెబుతారని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్సే: రోజా
మహానేత వైఎస్‌ను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రోజా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హైకమాండ్, చంద్రబాబుల ఆలోచన మేరకే సీబీఐ జగన్‌ను వేధిస్తోందన్నారు. సీబీఐ 9 నెలలుగా దర్యాప్తు చేస్తూ.. మూడు చార్జిషీట్‌లు వేసిన తర్వాత ఉప ఎన్నికల నేపథ్యంలో అర్ధరాత్రి సమన్లు జారీ చేయడాన్ని ఏ విధంగా భావించాలని ప్రశ్నించారు. 26 జీవోలు అక్రమమని చెబుతున్న సీబీఐ ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయడంలేదన్నారు. జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లైతే ఐటీ రిటర్న్ ఎలా చేయగలుగుతారని నిలదీశారు. చదువుకోసం హోటళ్లలో పనిచేసిన సోనియా గాంధీకి ఈ రోజు లక్షలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. రెండెకరాల పొలం ఆసామిగా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు వేలకోట్ల ఆస్తులు, విదేశాల్లో హోటళ్లు ఎలా వచ్చాయని నిలదీశారు.

చెప్పినట్లు చేస్తే ‘బయటపడేస్తామ’ని మోపిదేవిపై పెద్దల ఒత్తిళ్లు

* చెప్పినట్లు చేస్తే ‘బయటపడేస్తామ’ని మోపిదేవిపై పెద్దల ఒత్తిళ్లు
*నిన్నమొన్నటి వరకు వాన్‌పిక్ భూ కేటాయింపుల్లో తప్పులు జరగలేదని ఉద్ఘాటించిన మోపిదేవి
*అరెస్టు నేపథ్యంలో వైఎస్ వల్లే సంతకాలు చేసినట్లు చెప్పాలంటూ మోపిదేవిపై కాంగ్రెస్ పెద్దల ఒత్తిళ్లు
* అలాగైతేనే బయటపడేస్తామని హామీ
*ఆ మేరకే రాజీనామా లేఖపై సంతకం చేశారంటున్న సన్నిహితులు
* సీఎంపై కత్తులు నూరిన పీసీసీ నేతే మంత్రాంగం నడిపిన వైనం
* తప్పు చేసినా నిర్దోషిగా బయటపడతారంటూ ఆనక ప్రకటనలు
* తొలుత విచారణ కోసమే అరెస్టు అని భావించిన మోపిదేవి
* కేసులో దోషిగా చేర్చినట్లు తెలుసుకుని హతాశుడైన వైనం
*తమను బలిచేస్తున్నారని ఇతర మంత్రుల్లోనూ తీవ్ర ఆందోళన
* సీఎం తమను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం
* మంత్రులందరికీ చుట్టుకోక తప్పదంటున్న న్యాయ నిపుణులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాన్‌పిక్ భూముల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిన్నమొన్నటి వరకు చాలా గట్టిగా చెప్పిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ.. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత మాట మార్చి.. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒత్తిడి మేరకు ఫైళ్ల మీద సంతకాలు చేశానని తన రాజీనామా లేఖలో పేర్కొనటం వెనుక పెద్దల ఒత్తిళ్లు, భారీ వ్యూహం ఉన్నట్లు తెలిసింది. వాన్‌పిక్ భూముల కేటాయింపు విషయంలో మోపిదేవిని సీబీఐ ఇదివరకే రెండుసార్లు విచారించింది.

ఆ విచారణ సందర్భంగా కూడా మంత్రిమండలి నిర్ణయం మేరకు ఆ భూముల కేటాయింపు జరిగిందని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో గుంటూరు పర్యటన సందర్భంగా కూడా భూ కేటాయింపుల్లో ఎలాంటి తప్పులూ జరగలేదని పునరుద్ఘాటించారు. ఇంత గట్టిగా చెప్పిన మోపిదేవిని సీబీఐ అరెస్టు చేయటం, ఆ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో.. అంతకు ముందు చెప్పిన దానికి విరుద్ధంగా.. వైఎస్ ఒత్తిడి మేరకు ఫైళ్లపై సంతకాలు చేశానని పేర్కొనటం మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం విస్మయానికి గురిచేసింది.

తెర వెనుక ఏదో జరిగి బలమైన కారణం లేకపోతే మోపిదేవి ఆ రకమైన రాజీనామా లేఖపై సంతకం చేసే వారే కాదని వారు అంటున్నారు. ఈ కేసులో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆయన కుటుంబాన్ని, ఆయన సన్నిహితులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇంత కాలం సాగిన సీబీఐ విచారణ కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని.. పైగా జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయాలన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో.. ఆ అపవాదు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటపడాలంటే సొంత పార్టీ నేతలను కొందరిని బలిచేయకతప్పదన్న ఆలోచన మేరకే మోపిదేవి అరెస్టు జరిగిందని మంత్రుల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ అరెస్టు వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మరో సీనియర్ మంత్రి పకడ్బందీ వ్యూహరచనతో ముందుకు నడిపించారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మోపిదేవి బలహీనవర్గాల నుంచి ఎదిగిన నాయకుడు. ఢిల్లీ స్థాయిలో ఆయన కు ఎలాంటి లాబీయింగ్ లేదు. రాష్ట్రస్థాయిలోనూ బలమైన వర్గం కానీ గ్రూపు కానీ లేదు. ఈ పరిస్థితులను అవకాశంగా చేసుకుని.. మోపిదేవిని నిస్సహాయ స్థితి లోకి నెట్టివేసిన కాంగ్రెస్ పెద్దలు తాము అనుకున్నట్లు కథను నడిపిస్తున్నట్లు పార్టీ వర్గాలే వివరిస్తున్నాయి. బలీహ నవర్గాలకు చెందిన తనను బలిపశువును చేస్తున్నారని, ఇది అన్యాయమని మోపిదేవి వెంకటరమణ ఎంతగా ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ.. ఆయనపై పలురకాల ఒత్తిళ్లు తెచ్చి, మాయమాటలు ప్రయోగించారని తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అరెస్టు తరువాత మోపిదేవి కాంగ్రెస్ పార్టీ పైనా, కేంద్ర నాయకత్వం పైనా, సీబీఐ తీరు పైనా తమ పైనా విమర్శలు, ఆరోపణలు గుప్పించకుండా ఆయనను మభ్యపెట్టారు.

‘‘ఈ కేసులో జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయాలని నిర్ణయించాం. దానికి ముందుగా మీ అరెస్టు తప్పదు. మేం చెప్పినట్లు నడచుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూస్తాం’’ అని ఆయనను నమ్మించారు. అరెస్టు ఎలాగూ తప్పదని, సీబీఐ మిమ్మల్ని అరెస్టు చేయాలని నిర్ణయించినందున తాము చెప్పినట్లు నడవకుంటే కేసు నుంచి బయట పడే పరిస్థితీ ఉండదని భయపెట్టారు. ‘‘అసలు తప్పుచేయనప్పుడు ఎందుకు రాజీ నామా చేయాలి? రాజీనామా చేస్తే తప్పు చేసినట్టు అంగీకరించినట్టు అవుతుం ది? రాజీనామా చేసే ప్రసక్తే లేదు...’’ అని అప్పటివరకూ మోపిదేవి చాలా గట్టిగా చెప్తూ వచ్చారు.

అరెస్టుకు ముందు రోజు సీబీఐ విచారణ తర్వాత కూడా ఆయన మీడియాతో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చానళ్లు కూడా మోపిదేవి చెప్పిన విషయాలను ప్రసారం చేశాయి. ఇంత జరిగినా అరెస్టయిన తర్వాత అం దుకు విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు తెచ్చిన రాజీనామా లేఖపై సంతకం చేయటం మంత్రులు చాలా మందికి అంతుబట్టటం లేదని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

నన్నెందుకు బలిచేస్తున్నారు?
తొలి రోజు విచారణ సందర్భంలోనే సీబీఐ తీరును పసిగట్టిన మోపిదేవి తనను అరెస్టు చేస్తారన్న అభిప్రాయానికి వచ్చి ఆ వెంటనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. అంతకుముందే సీబీఐకి వత్తాసుగా ఉన్న కొన్ని పత్రికల్లో మోపిదేవి అరెస్టుపై వార్తలు కూడా వెలువడ్డాయి. సీఎంను కలిసిన సందర్భంలోనే మోపిదేవిపై తీవ్ర ఒత్తిళ్లు వ చ్చాయి. అక్కడి నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణను కలసిన సమయంలోనూ ఇదే రకమైన వాతావరణం కనిపించటంతో మోపిదేవి తీవ్ర నిరాశా నిస్పృహలకు గురయ్యారు.

ఈ కేసులో జగన్ వ్యవహారం పైనే కాంగ్రెస్ ఉనికి ఆధారపడి ఉందని, ఆయన్ను నిలువరించాలంటే ఇంతకు మించిన మార్గం లేదని, మీకేమీ భయం అక్కర్లేదని, తాము చూసుకుంటామని ఆ నేతలు చెప్పటంతో మోపిదేవి నమ్మారని తెలుస్తోంది. తెర వెనుక జరిగిన ఈ తతంగాన్ని ఒక నాయకుడు ముందుగానే ఒక చానల్‌కు చేరవేశాడు. దాంతో.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకే తాను సంతకాలు చేశానని, జగన్ ధనదాహానికి తాను బలిపశువునయ్యానని మోపిదేవి సీబీఐ ముందు చెప్పారంటూ ఆయన అరెస్టును చూపటానికి ముందే ఆ చానల్ కథనం ప్రసారం చేసింది.

అంతకుముందు ఉదయమే తిరిగి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన నేతలు అందుకు అనుగుణంగా రాజీనామా లేఖ తయారీ తదితర వ్యవహారాలపై దృష్టిసారించారు. మధ్యాహ్నానికి ఆ లేఖపై మోపిదేవి చేత సంతకం చేయించి సాయంత్రం మీడియాకు విడుదల చేశారు. అయితే తన అరెస్టు వ్యవహారం కేవలం విచారణ వరకే పరిమితమవుతుందని మోపిదేవి భావించారు. అయితే అందుకు భిన్నంగా కేసులో తననో నిందితుడిగా చేసి అరెస్టు చేయటంతో ఆయన ఒక్కసారిగా హతాశుడయ్యారని సన్నిహితులు చెప్పారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సాయంత్రం మంత్రులతో భేటీలో కేవలం విచారణ కోసమే అరెస్టు జరిగిందని, మోపిదేవి త్వరలోనే బయటకు వచ్చేస్తారని చెప్పారు. అయితే ఆయన్ను నిందితుడిగా చూపి సీబీఐ అరెస్టు చేసిన విషయం ఆ తరువాత తెలుసుకున్న మంత్రులు సీఎం తమనూ మభ్యపెడుతున్నారని, రేపు తమ గతీ ఇదేనేమోనని ఆవేదనకు గురయ్యారు.

మిగతా మంత్రుల్లో భయం భయం...
ముఖ్యంగా 26 జీవోల విషయంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు ఈ పరిణామాలపై తీవ్ర గందరగోళంలో పడ్డారు. మరోపక్క మోపిదేవిని అరెస్టు చేస్తారని అనుకోలేదని, ముందుగా తనకెలాంటి సమాచారమూ లేదని సీఎం మంత్రులతో పేర్కొనటం కూడా సందేహాలకు తావిస్తోంది. తమకింద పనిచేసే అధికారిని అరెస్టు చేస్తేనే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇవ్వకుండా జరగదని.. అలాంటిది కేబినెట్ మంత్రి అరెస్టు విషయం తనకు తెలియదని సీఎం చెప్తుండటం చూస్తుంటే ఆయన తమను ఎంతగా తప్పుదోవ పట్టిస్తున్నారో తెలుస్తోందని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు తమకూ అదే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు.

ఆ పరిస్థితి వస్తే మేమేం చేయాలి?
మోపిదేవికి వచ్చిన పరిస్థితే వస్తే ఏం చేయాలని ఒక మంత్రి తన సన్నిహితుడైన సీనియర్ న్యాయవాదితో చర్చించారు. ముఖ్యమంత్రి ఒత్తిడి చేస్తేనే ఫైలుపై సంతకం చేశానని చెప్పినంత మాత్రాన కేసు నుంచి బయట పడలేరని, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారని, ఏదైనా ఫైలుపై పూర్తి సమాచారం లేకపోయినా, లేదా ఇష్టం లేకపోయినా మంత్రి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చని, అంతే తప్ప ఇతరత్రా కారణాలు చెప్పినంత మాత్రాన కేసు నుంచి బయటపడలేరని, కేసు నుంచి బయటపడేస్తానని ఎవరైనా అన్నా అది వట్టి మాటేనని, కేసు నుంచి తప్పించుకోలేరని ఆ సీనియర్ న్యాయవాది చట్టాలను విడమరిచి చెప్పినట్లు సదరు మంత్రి సన్నిహితుడు ఒకరు తెలిపారు.

మౌనంగా ఉన్నందువల్లే ఇంతదాకా వచ్చింది...
ఈ వ్యవహారంపై తాము మౌనంగా ఉండటం వల్లనే ఇంతవరకు వచ్చిందని, ఇలాగే ఉంటే ప్రమాదం ముంచుకు వస్తుందన్న అభిప్రాయానికి ఆయా మంత్రులు వస్తున్నారు. అందుకే ఈ విషయంలో మరింతగా కూరుకోకముందే మేలుకుని సీఎంను, పార్టీ అధిష్టానాన్ని నిలదీయాలనీ వారు ఆలోచనలు సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం సీఎం నిర్వహించిన సమావేశంలో సీబీఐ నోటీసులు అందుకున్న ముగ్గురు మంత్రులు తమ పరిస్థితి ఏమిటని సీఎంను ప్రశ్నించారు. సీఎం దాదాపు మౌనంగానే ఉన్నా మంత్రులనుంచి పదేపదే ప్రశ్నలు రావటంతో తన చేతుల్లో ఏమీ లేదని తేల్చేశారు.

కనీసం ప్రభుత్వం తరఫున జీఓలపై ఇంప్లీడ్ అయ్యే అంశం పైనా సీఎం భరోసా ఇవ్వలేకపోవడం, ఎవరి వ్యక్తిగతంగా వారే ఈ నోటీసులకు సమాధానం ఇచ్చుకోవాలని సీఎం పేర్కొనడం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. శుక్రవారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలతో మరోసారి భేటీ అయ్యారు. అలాగే మంత్రి సబితారెడ్డి, గీతారెడ్డిలూ వీరిద్దరితో మాట్లాడారు. మరోవైపు.. సీఎం, పీసీసీ చీఫ్ కలిసే ఈ వ్యవహారాన్నంతా నడిపిస్తున్నారన్న అనుమానాలూ వారిలో ఏర్పడ్డాయి. కిరణ్‌కు బద్ధవ్యతిరేకిగా ఇప్పటివరకు తమ ద్వారా అసమ్మతి కార్యకలాపాలను నడిపించిన బొత్స కూడా ఇందులో భాగస్వామి కావటం మంత్రుల అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

మోపిదేవి అరెస్టును సీబీఐ అధికారికంగా ప్రకటించిన వెంటనే బొత్స హుటాహుటిన రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలిశారు. అయితే ఆ సందర్భంగా మోపిదేవి రాజీనామా లేఖ ఏదీ తాను గవర్నర్‌ను కలిసినప్పుడు ఇవ్వలేదని ఆ తర్వాత గాంధీభవన్‌లో చెప్పారు. ఆయన గవర్నర్‌ను కలిసిన సమయంలోనే కొత్తగా ఏసీబీ డీజీగా నియమితులైన ప్రసాదరావు అక్కడే ఉండటం గమనార్హం.

సీఎంపై మోపిదేవి కుటుంబ సభ్యుల ప్రశ్నల పరంపర
మోపిదేవిని బలిపెట్టిన పెద్దలే ఆయన కుటుంబాన్ని ఊరడించే మాటలు చెప్పి మరింతగా మభ్యపెడుతున్నారని మోపిదేవికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు, ఆయన స్నేహితులు మండిపడుతున్నారు. మోపిదేవి అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమను నట్టేట్లో ముంచేశారని విలపిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణను గురువారం సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం పరామర్శించారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్-12 లోని మంత్రుల క్వార్టర్లలో ఉంటున్న మోపిదేవి కుటుంబ సభ్యులతో సీఎం పది నిమిషాల పాటు మాట్లాడారు. పక్క క్వార్టర్‌లోనే ఉంటున్న మంత్రి శ్రీధర్‌బాబు కూడా అక్కడికి వచ్చారు. సీఎంను చూడగానే మోపిదేవి సతీమణి బోరున విలపించారు. ‘ఇంత అన్యాయం చేస్తారా?’ అంటూ నిలదీశారు. సీఎంతో ఆమె పలు నిష్టూరాలు మోపారు. మోపిదేవి పిల్లలు సీఎం వచ్చినా దగ్గరకు వెళ్లకుండా దూరంగానే ఉండిపోయారు. సీఎంకు అక్కడి వాతావరణం ఇబ్బందికరంగా మారటంతో కేవలం పది నిమిషాల్లోనే వెనుదిరిగారు. మోపిదేవి సతీమణి రోదిస్తూ అడిగిన ప్రశ్నలకు సీఎంతో సహా ఎవరూ నోరు తెరవలేదని సమాచారం.

సీఎంతో ఉండవల్లి భేటీ...
గురువారం మోపిదేవిని సీబీఐ కార్యాయం వద్ద కలిసి మంతనాలు సాగించిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ శుక్రవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మోపిదేవి అంశంతో పాటు సీబీఐ విచారణలో తదుపరి మంత్రుల వ్యవహారమూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ప్రత్యేక ంగా భేటీ అయ్యారు. మోపిదేవి అరెస్టు నేపథ్యంలో ఆయన బొత్స ఎదుట తీవ్ర ఆందోళన వ్యక్తపరిచినట్లు సమాచారం. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చుకోవటంతో పాటు సీబీఐ విచారణ, అరెస్టుల వ్యవహారాలపై మంతనాలు సాగించారు. ఈ వ్యవహారంలో తమను ఆదుకోవాలని ఆయన బొత్సను వేడుకున్నట్లు తెలుస్తోంది.

మోపిదేవిని కలిసిన వట్టి: వాన్‌పిక్ కేసులో అరె స్టయి సీబీఐ కస్టడీలో ఉన్న మోపిదేవి వెంకటరమణతో శుక్రవారం రాత్రి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ భేటీ అయ్యారు. విచారణ సందర్భంగా సీబీఐ తాత్కాలిక కార్యాలయం దిల్‌కుశ అతిథి గృహంలో ఉన్న మోపిదేవితో ఆయన అరగంటపాటు మంతనాలు జరిపారు. రాత్రి 7.30 గంటల సమయంలో దిల్‌కుశ అతిథి గృహానికి వచ్చిన ఆయన ఎనిమిది గంటల వరకు లోపలే ఉన్నారు. ఆ సమయంలో సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కూడా దిల్‌కుశలోనే ఉండటం గమనార్హం. వట్టి వసంతకుమార్‌తోపాటు ఒక న్యాయవాదిని కూడా దిల్‌కుశ లోపలికి తీసుకుని వెళ్లినట్లు సమాచారం.

ఏదైనా కేసు విచారణలో భాగంగా సీబీఐ కస్టడీలో ఉన్న నిందితులను వేరే వ్యక్తులు కలిసేందుకు అనుమతి ఇవ్వడం అసాధారణం. విచారణకు సంబంధించి నిందితునిపై వారేమైనా ప్రభావం చూపిస్తారా? అనే అనుమానంతో కుటుంబ సభ్యులను సైతం కలిసేందుకు అనుమతి ఇవ్వరు. కానీ, సీబీఐ కస్టడీలో ఉన్న మోపిదేవిని గురువారం ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు కలుసుకోగా, శుక్రవారం మంత్రి వంసతకుమార్ ఏకంగా అరగంటపాటు భేటీ అవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోపిదేవితో భేటీ అనంతరం వట్టి మీడియాతో మాట్లాడుతూ మిత్రుడైనందునే పరామర్శించానని చెప్పారు.
అరెస్టుకు ముందు... అరెస్టు తర్వాత...
సీబీఐ అరెస్టు చేయటానికి ముందు వాన్‌పిక్ భూ కేటాయింపుల నిర్ణయాన్ని మోపిదేవి వెంకటరమణ గట్టిగా సమర్థిం చారు. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత సంతకం చేసిన రాజీనామా లేఖలో.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశాలతోనే సంతకం చేసినట్లు పేర్కొన్నారు. ఆయన రాజీనామా లేఖ ముందస్తుగా తయారు చేసిందని స్వయంగా మంత్రులే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఈ నెల 20న రేపల్లెలో మోపిదేవి విలేకరులతో మాట్లాడుతూ...
‘‘ఒక జీవో విడుదల చేసే సమయంలో ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. అయితే ఆ జీవోల వల్ల ఏమైనా నష్టాలు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. తీరప్రాంత ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాన్‌పిక్ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ సరైనదే. సీబీఐ విచారణలో నా నిజాయతీ నిరూపించుకుంటా.’’

ఈ నెల 24 న సీబీఐ అరెస్టు చేసిన తర్వాత సీఎంకు సంతకం చేసి పంపిన రాజీనామా లేఖలో...
‘‘... నేను ఎప్పుడూ నాయకుడిని మరియు పార్టీని నమ్ముతూ మరియు ఆదేశాలు పాటించే క్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్ నా కార్యాలయానికి రాకున్ననూ, వారి కార్యాలయానికి పిలిపించి వారి కార్యదర్శి సమక్షంలో సంతకాలు పెట్టటం జరిగింది.’’

ఇది రాక్షస రాజకీయ క్రీడ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలిసి రాక్షస రాజకీయ క్రీడను సాగిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహ క మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిని చూసి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో హృదయమున్న నాయకులూ, ఆలోచన గల వారూ ఎవరూ మిగలబోరని జోస్యం చెప్పారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌పై జరుగుతున్న అణచివేత చర్యలను చూసి సహించలేకే టీడీపీ నుంచి మైసూరారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల నాని సంఘీభావం ప్రకటించారని స్పష్టం చేశారు. పులివెందులలో వైఎస్ విజయమ్మపై పోటీ చేసిన జగన్ పిన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఆయనకు అండగా ఉండటానికి వచ్చారని అంబటి గుర్తు చేశారు. జగన్‌కు ఏదైనా జరిగితే ప్రజలు తిరగబడి ఓట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారని అంబటి హెచ్చరించారు.

ఆది నుంచీ వివక్షాపూరితమే: సీబీఐ విచారణ పూర్తిగా వివక్షాపూరితంగా సాగుతోందని అంబటి అన్నారు. 26 జీవోలు జారీ చేసిన మంత్రులపై సుప్రీంకోర్టు నోటీసులిచ్చాకే విచారణ సాగుతోందని గుర్తు చేశారు. సీబీఐ విచారణ క్రమాన్ని తొలి నుంచీ తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ‘‘జగన్ కేసుల్లో అత్యుత్సాహంతో ఆయన ఇంటి బాత్రూములను కూడా సోదా చేసిన సీబీఐ, మంత్రులపై ముందే ఎందుకు విచారణ జరపలేదు? సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది సుప్రీంకోర్టుకు వెళ్లి, కోర్టు నోటీసులిచ్చాకే సీబీఐ హడావుడిగా రంగంలోకి దిగింది. బీసీ మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణారావును బలిగొంది. వాన్‌పిక్ జీవోల జారీకి సంబంధించి సీబీఐ ముందు నోరు విప్పలేదని చెప్పిన మోపిదేవితో, ‘వైఎస్ రాజశేఖరరెడ్డి చెబితేనే చేశా’నని అరెస్టు తరవాత ఆయన సమర్పించిన సుదీర్ఘ రాజీనామా లేఖలో చెప్పించడం వెనక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల కుట్ర దాగుంది.

సీబీఐ అడిగితే చెప్పని మోపిదేవి, తన రాజీనామా లేఖలో మాత్రం అలా ఎలా రాస్తారు? దీని వెనుక ఎవరి హస్తముంది? జగన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకే అలా రాయడం నిజం కాదా? ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆ 26 జీవోలు అక్రమమో, సక్రమమో తెలియజేస్తూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు? ఆ జీవోలన్నీ సరైనవేనంటూ అఫిడవిట్ సమర్పిస్తే అసలు జగన్‌పై కేసే ఉండదని భావించే ఆ పని చేయలేదు. దాని ఫలితంగానే అది ప్పుడు మంత్రులకు చుట్టుకుంది. జగన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తే, భయపడుతున్నారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. మా నాయకునికి ఎలాంటి భయాందోళనలూ లేవు. న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకునే ఉద్దేశంతోనే కోర్టు తలుపు తడుతున్నారు’’ అని అంబటి వివరించారు.

కుట్రలను ఎదుర్కొందాం: హైదరాబాద్‌లో సైనిక పాలనను తలపించేలా అడుగడుగునా పోలీసులు మోహరించి పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను అరెస్టు చేస్తే తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతామే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు పని చెప్పేలా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. ‘‘పార్టీ కార్యకర్తలెవరూ భయపడాల్సిందేమీ లేదు. జగన్‌కు వ్యతిరేకంగా జరిగే కుట్రలను ఎదుర్కొందాం. సంయమనం పాటిద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు.

ఆ పత్రికలకు వార్తలుండవు గనకే: జగన్ ఆరెస్టు విషయంలో తమకు అనుమానాలున్నాయని అంబటి అన్నారు. వెంటనే అరెస్టు చేస్తే జగన్ చెప్పిందే నిజమవుతుంది గనుక అలా చేయక పోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘ఒకవేళ జగన్‌ను వెంటనే అరెస్టు చేస్తే ఆయనకు వ్యతిరేకంగా రాసుకోవడానికి ఎల్లో మీడియా పత్రికలకు వార్తలేమీ ఉండవు. విచారణ పేరుతో ఆయనను ఇంకా కొద్ది రోజుల పాటు పిలిస్తే, ‘సీబీఐ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన జగన్’, ‘తెల్లబోయిన జగన్’ వంటి శీర్షికలతో ఎల్లో పత్రికల్లో వార్తలు ప్రచురించుకోవచ్చు. ఆ తరవాతే అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్‌ను అరెస్టు చేయాలనే కుట్ర ఇప్పటికే జరిగిందన్నారు. జగన్‌కు వెన్నెముక లేదన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా స్పందించారు. జగన్ వెన్నెముక లేని నాయకుడైతే, బొత్స సీసాల కొద్దీ మద్యం ఎందుకు పోసుకుంటున్నారని వ్యంగంగా వ్యాఖ్యానించారు.

భూమా నాగిరెడ్డికి గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించాలని హైకోర్టు

మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ కన్వీనర్ భూమా నాగిరెడ్డికి గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత ఉపసంహరణపై పోలీసులకు నోటీసులు జారీ చేశారు. తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ భూమా నాగిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ చంద్రకుమార్ విచారించారు. భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారని, ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పిటిషనర్ కదకలికను నియంత్రించాలనే ఉద్దేశంతో పోలీసులు భద్రతను ఉపసంహరించారని ఆయన తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ కోర్టుకు నివేదించారు.

పోలీసులు ఇటీవల భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేశారని, తరువాత భద్రత సమీక్షా కమిటీ (ఎస్‌ఆర్‌సీ) ఆయనకున్న భద్రతను ఉపసంహరించాలని సిఫారసు చేసిందని, ఆయనకున్న ఐదుగురు భద్రతా సిబ్బందిని ఉపసంహరించారని వివరించారు. భద్రతను ఉపసంహరించే ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. హైకోర్టు ఆదేశాలతో భద్రతను ఇచ్చినప్పుడు, ఉపసంహరించే ముందు కోర్టు అనుమతి తీసుకుని ఉండాల్సిందని స్పష్టం చేశారు. తక్షణమే భూమా నాగిరెడ్డికి ఐదుగురు భద్రతా సిబ్బం దిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ఐజీ, కర్నూలు ఎస్‌పీలకు నోటీసులు జారీ చేశారు. విచారణను జూన్ 18కి వాయిదా వేశారు.

పోటాకే భయపడలేదు: కొండా మురళీ


జనగామ : ‘టీడీపీ హయాంలో నాపై ‘పోటా’ కేసు పెట్టినప్పుడే భయపడలేదు.. ఆరు నెలల్లో కూలిపోయే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేస్తే బెదిరిపోతామా...’ అని ఎమ్మెల్సీ కొండా మురళీదర్‌రావు అన్నారు. హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయనను జనగామ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడంపై కొండా నిప్పులు చెరిగారు. సాయంత్రం విడుదలైన తర్వాత మురళి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవి అనర్హత విషయంలో శాసనమండలి చైర్మన్‌ను కలవడానికి వెళ్తున్నట్లు చెప్పినా, వినకుండా తనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే కక్షతో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

Ambati Rambabu Press Meet 25th May 2012

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012

YS Jagan Cooperated for CBI Enquiry: Sabbam Hari

Balineni Srinivasa Reddy Namination

సిబిఐకి సహకరించిన జగన్: సబ్బం హరి

సిబిఐకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పూర్తిగా సహకరించారని కాంగ్రెస్ ఎంపి సబ్బం హరి తెలిపారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ఉపఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయన్నారు. జగన్ తో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని చెప్పారు. తనపై చర్యలకు సంబంధించి పిసిసి నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. సమాచారం అందిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు.

Shobha Nagi Reddy comments

Police Over action on YS Jagan Private Security

ఇక జగన్ వెంటే: మైసూరారెడ్డి


ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తా
సీబీఐ విచారణ అంతా రాజకీయం
రాజకీయాలు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలి

హైదరాబాద్:టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఉదయం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో కలిసి మైసూరా అల్పాహార విందు చేశారు. ఈ సంఘటనతో తత్తరపాటుకు లోనైన టీడీపీ నాయకత్వం హడావుడిగా మైసూరాను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు జగన్ వెళ్లేటప్పటి వరకూ మైసూరారెడ్డి అక్కడే ఉండి ఆయనను సాగనంపారు. ఆ తరువాత మైసూరా బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను ఇకపై జగన్ వెంటే ఉంటానని ప్రకటించారు. జగన్ తనను మర్యాద పూర్వకంగా అల్పాహార విందుకు ఆహ్వానిస్తే వచ్చాననీ తన సహాయ సహకారాలు కావాలని కోరారనీ అందుకు తాను అంగీకరించి తన శాయశక్తులా శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పాననీ వెల్లడించారు. జగన్ రాజకీయంగా ఎదుగుతున్న నాయకుడనీ ఆయన ఎదుగుదలకు తమ లాంటి పెద్దవాళ్లు ఆశీస్సులు అందించాల్సిన అవసరం ఉందని భావించాననీ మైసూరా వివరించారు.

రాష్ట్రంలో జగన్ కేసులపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన సంస్థ ఒత్తిడులకు లొంగి పక్షపాతంతో విచారణ జరుపడం అనేది చాలా తప్పుడు విధానం అని మైసూరా అన్నారు. సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని దేశమంతా కోడై కూస్తోందనీ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే దానిని వినియోగిస్తున్నాయనేది వెల్లడవుతోందనీ ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ కేసులో ఈ విమర్శలు పూర్తిగా నిజం అవుతున్నాయని మైసూరా అన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చే సింది జగన్‌ను అరెస్టు చేయడానికేనని ఆయన అన్నారు. మోపిదేవిని అరెస్టు చేసింది తాము నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని చెప్పడానికేనని ఆయనను అనవసరంగా బలిపశువును చేశారని మైసూరా అన్నారు. రాజకీయ పార్టీలు కుమ్మక్కు అయి కక్ష సాధిస్తున్నాయనే విషయం స్పష్టంగా తెలిసి పోతోందని ఆయన అన్నారు. జగన్ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో సీబీఐని అడ్డం పెట్టుకుని ఆయన్ను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఈ విచారణ నిస్పక్షపాతంగా కనపడటంలేదన్నారు. జగన్‌పై సీబీఐ విచారణ వేసేందుకు దారితీసిన పరిస్థితులన్నీ తనకు తెలుసన్నారు. ఈ కేసులో ఫలానా వ్యక్తి పేరు చెప్పండని సాక్షులను బెదిరించటం, వేధించటం వంటివి జరుగుతున్నాయన్నారు. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని సీబీఐ విచారణ చేస్తోందన్నారు.ఆ సంస్థ చట్టపరంగా విచారిస్తే ఇబ్బంది లేదని, అయితే అది కొందరి ఒత్తిడికి లొంగి పనిచేస్తోందన్నారు.

జగన్ పట్ల ప్రజల్లో అభిమానం ఉందని, ఆయన అధికారంలోకి వస్తే తమకు మేలు చేస్తారని పేదలు, రైతులు ఆశతో ఉన్నారని వెల్లడించారు. వెఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అన్ని వర్గాల మద్ధతు ఉందన్నారు. రాజకీయాల్లో ఏదైనా ఉంటే ప్రజ ల్లోకి వెళ్లి తేల్చుకోవాలే తప్ప పక్షపాతంతో కూడుకున్న విచారణలతో కాదని ఆయన అన్నారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలను నిర్వహించ బోతున్నారని ప్రశ్నించగా జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని చేస్తానని అన్నారు. జగన్‌కు ప్రజాదరణ పెరుగుతోందనీ ఉప ఎన్నికల్లో 18 స్థానాలూ వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని వచ్చిన వార్తలను ప్రస్తావించగా అది అర్థం లేనిదని, రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత చంద్రబాబును కలిసి ఏదైనా పని ఉంటే పిలవండి వచ్చి చేసి పెడతానని చెప్పానన్నారు. రెండోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనందుకే టీడీపీని వీడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించగా అది నిజం కాదని అన్నారు. తాను మళ్లీ రాజ్యసభ కావాలని బాబును అడుగలేదన్నారు. తానూ, బాబు ఇంకా బతికే ఉన్నారు కనుక ఇది నిజమో కాదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

వై.ఎస్‌తో విభేదించి బయటకు వచ్చానని ఎపుడూ చెప్పలేదు
మైసూరా తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ వై.ఎస్. రాజశేఖరరెడ్డితో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బైటకు వచ్చానని ఎపుడూ చెప్పలేదని వై.ఎస్ మరణించినపుడు కూడా తాను ఆయనకు మంచి నివాళి అర్పించానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. మీకు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి సహాకారం అందించాల్సిందిగా జగన్ కోరారని, అందుకు అంగీకరించానని చెప్పారు.

పార్టీ కార్యాలయంలో...
మైసూరా మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో తొలిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి వచ్చి కొద్ది సేపు ఉన్నారు. ఆయనను పార్టీ ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, పి.ఎన్.వి.ప్రసాద్, కొణతాల రామకృష్ణ, వాసిరెడ్డి పద్మ, జ్యోతుల నెహ్రూతో సహా పలువురు సాదరంగా ఆహ్వానించి అందరినీ పరిచయం చేశారు. వై.వి.సుబ్బారెడ్డి ఆయనకు పార్టీ కండువాను వేశారు. 

Popular Posts

Topics :