6/30/2012
బాధితులను ఆదుకోవాలి: విజయమ్మ
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని నాగార్జున ఆగ్రోకెమ్ కార్మాగారంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీపీసీ బాధిత గ్రామాలను ఆమె సందర్శిస్తారు. విశాఖపట్నం జిల్లా తిక్కవానిపాలెంలో గురువారం పోలీసుల లాఠీఛార్జీలో గాయపడి చికిత్స పొందుతున్న మత్స్యకారులను విజయమ్మ పరామర్శించనున్నట్లు ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు.

జూలై 8న ఘనంగా వైఎస్ జయంతి
జూలై 8న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిర్ణయించింది. యువజన విభాగ రాష్ట్రస్థాయి సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై అక్రమ కేసులను నిరసిస్తూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ లీకులకు పాల్పడటాన్ని ఖండిస్తూ మరో తీర్మానం చేశారు. రానున్న 2 నెలల్లో యువత సమస్యలపై 'చలో హైదరాబాద్' కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్ రెడ్డి చెప్పారు.
6/30/2012
అధికార మదాంధత కాదా ఇది?!
|
6/30/2012
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర హైకోర్టు నూతన అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యరత్న శ్రీరామచంద్రరావు ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు వీరిద్దరి చేత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకినీ చంద్రఘోష్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన ప్రవీణ్‌కుమార్, రామచంద్రరావులను న్యాయమూర్తులు అభినందించారు. అనంతరం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక సీజేతో కలిసి పలు కేసులను విచారించగా... సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్యతో కలిసి రామచంద్రరావు కేసులను విచారించారు.
హైకోర్టు న్యాయమూర్తులుగా రామచంద్రరావు, ప్రవీణ్‌కుమార్

6/30/2012
జేడీ ఫోన్‌కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలి
సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరిన ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ
హైదరాబాద్, న్యూస్‌లైన్:
సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీ వి.దినేష్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కేకే మహేందర్‌రెడ్డి శుక్రవారం డీజీపీని కలిశారు. వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ జేడీ పలువురు మీడియా ప్రతినిధులతో అనేకమార్లు ఫోన్‌లో మాట్లాడటం, ఆయా మీడియాలలో ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పలు అసత్యమైన కథనాలను ప్రచురించడంపై విజయమ్మ డీజీపీకి ఈ నెల 26న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తమ కుటుంబాన్ని అంతమొందించేందుకు కూడా కుట్ర జరుగుతోందనిఆ ఫిర్యాదులో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసుశాఖ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డీజీపీకి తాజాగా విజ్ఞప్తి చేశారు.
ఫోన్ కాల్ వివరాలకు సంబంధించి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, వాసిరెడ్డి చంద్రబాల ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు హుటాహుటిన కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని, విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు జరపాలని ఈ సందర్భంగా కోరారు. చంద్రబాల, సీబీఐ జేడీ ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన కేసులను రాష్ట్ర నేర పరిశోధన విభాగాని(సీఐడీ)కి బదిలీ చేసినందున విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదు కేసును కూడా సీఐడీకే ఇవ్వాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్న మీడియా యాజమాన్యం, వ్యాపారపరంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారితో సీబీఐ జేడీ అనేకమార్లు ఫోన్‌లో మాట్లాడటం అనుమానాలను రేకెత్తిస్తున్నాయని ఎమ్మెల్యేలు అన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు తీరు సవ్యంగా సాగడంలేదనే అంశంపై విజయమ్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు, సీబీఐ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులకు, కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారని వివరించారు. తమ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మకు పంపానని వెల్లడించారని ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా కలిసి విజయమ్మ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరతామన్నారు.

కొన్ని సాగునీటి ప్రాజెక్టుల రద్దుకు యోచన
మధ్యంతర మదింపు పేరిట మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
వైఎస్ మరణానంతరం అనేక ప్రాజెక్టులను పక్కనబెట్టిన ప్రభుత్వం
తాజాగా జీవో నంబర్ 1ను అమలు చేసే యత్నం
రద్దు జాబితాలో దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి,
కంతనపల్లి ప్రాజెక్టులు!
హైదరాబాద్, న్యూస్‌లైన్: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో కొన్నింటిని రద్దు చేసే దిశలో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే నిర్మాణాలపై నిరాసక్త వైఖరిని అవలంబిస్తోన్న సర్కార్... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల మధ్యంతర మదింపు పేరిట మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేశ్‌లు సభ్యులుగా ఉన్నారు.
జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 86 ప్రాజెక్టులను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మొత్తం సుమారు 20 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించారు. వైఎస్ మరణానంతరం ప్రాజెక్టులను పట్టించుకునేవారే కరువయ్యారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాధాన్యత పేరిట ప్రాజెక్టులను విభజించారు. దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వంటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఆయా ప్రాజెక్టుల నిర్మాణ దశలపై మధ్యంతర నివేదికను అందించాలని ఆదేశించారు. అందులో భాగంగా గతంలో జీవో నంబర్-1 పేరిట ఉత్తర్వులను జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఇప్పటికీ నిర్మాణాలను మొదలు పెట్టని ప్రాజెక్టులను రద్దు చేయాల్సి ఉంటుంది. అలాగే మధ్యలోనే పనులు నిలిచిపోయిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలా ? లేక నిలుపుదల చేయాలా ? అనే విషయంపై అధికారులు స్పష్టమైన నివేదికలను అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైఖరి నేపథ్యంలో ప్రాజెక్టుల పనులను కొనసాగించడానికి కాంట్రాక్టర్లుకూడా వెనుకంజ వేస్తున్నారు.
ముఖ్యంగా ధరలు భారీగా పెరిగినందున పాత ధరలతో తాము పనులను చేయలేకపోతున్నామని చెప్తున్నారు. పెరిగిన ధరలను వర్తింపజేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు పనులను చేయబోమని కూడా స్పష్టం చేశారు. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ప్రాజెక్టుల నిర్మాణ దశలపై ఈ మంత్రుల కమిటీ మధ్యంతర మదింపు నివేదికను ఇవ్వనుంది. అలాగే జీవో నంబర్-1ను కూడా పరిగణనలోకి తీసుకుని తగు సూచనలను చేయనుంది. గతంలో అధికారుల నుంచి నివేదిక కోరిన ప్రభుత్వం.. తాజాగా దీనిపై కేబినెట్ కమిటీని వేయడం కొన్ని ప్రాజెక్టుల రద్దుకే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దు చేయబోయే ప్రాజెక్టుల్లో దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కంతనపల్లి వంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చివరిదశలో ఉన్న ప్రాజెక్టులపైనా చిన్నచూపు
ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాల కోసం సుమారు రూ.70 వేల కోట్లు వ్యయం చేశారు. చాలా ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి. మూడు నాలుగు వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తే...7 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 15 ప్రాజెక్టులను పాక్షికంగా వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుంది. ఇందులో నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, ఎల్లంపల్లి, దేవాదుల, మత్తడివాగు వంటి తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే...వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. కొద్ది మొత్తంలో ఖర్చు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయినా వాటి విషయంలోనూ ఎలాంటి చర్యల్నీ తీసుకోవడం లేదు. పైగా ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తత్కాల్ టికెట్ల జారీలో మార్పులు
అత్యధిక సంఖ్యలో ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు రైల్యే తత్కాల్ (అత్యవసర టికెట్ల) టికెట్ల జారీలో నిబంధనలను మార్పులు చేపట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. తత్కాల్ టికెట్ల అమ్మకాలు ఉదయం 8 గంటలకు కాకుండా 10 గంటలకు ప్రారంభించనున్నారు. భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ తోపాటు గుర్తింపు పొందిన ఏజెంట్లను 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే తత్కాల్ టికెట్లకు అనుమతించకూడదని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల అమ్మకాలలో చోటు చేసుకుంటున్న అవకతవకలను అడ్డుకోవడానికి రైల్వే శాఖ పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికి.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. తత్కాల్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన కొద్ది సేపటికే పూర్తవ్వడం రైల్వేశాఖను ఆలోచనల్లో పడేసింది.
6/30/2012
కంగు తినిపించిన ‘పెద్దాయన’ పాట!
మచిలీపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘పెద్దాయన’ పాట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కంగు తినిపించింది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రోశయ్యకు కాంగ్రెస్ కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేస్తుండగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ మోగడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ పాటను ఆయన రింగ్ టోన్‌గా పెట్టుకోవడంతో ఒక్కసారిగా ‘పెద్దాయన.. పెద్దాయన.. ఇది స్వార్థపు లోకం.. పెద్దాయనా’ అని పాట వినిపించింది. దీంతో అక్కడివారంతా విస్తుపోయారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గంభీరమైన వాతావరణం ఏర్పడింది. తామూ ఆ పాటను రింగ్‌టోన్‌గా పెట్టుకున్నామని, రింగయ్యింది తమ ఫోనేమో అనుకున్నామని మరికొంతమంది కార్యకర్తలు చెప్పుకోవడం కనిపించింది.
6/29/2012
True to their word, the YSRC which has assumed the role of the main opposition after the smashing victory in the by-elections, today began its task in the City in earnest by organising a dharna on the Kukatpally-Hitec City road to protest the protracted work of the railway over bridge that results in massive gridlocks on this arterial road.
YSRC protests on Hitec road
Written By news on Friday, June 29, 2012 | 6/29/2012

Scores of the YSRC workers and supporters joined the protest that blamed government apathy to a major mass issue. This railway over bridge planned in 2007 and pledged to be completed in nine months by the HMDA has already consumed three more years and the completion is still nowhere in sight, the YSRC leaders alleged.
“It’s a challenge to the people,” declared Rahul Reddy, a supporter of the YSRC who was lustily cheering the protesters. “Commuters to Hitec City from Kukatpally are facing serious traffic jams everyday,” he pointed out. The situation has become worse for commuters with the onset of monsoons. The traffic police are also closing the way completely when there is heavy rainfall forcing commuters to take the longer alternate routes through Hafeezpet.”
“I get late for work everyday. It takes almost 40 minutes to travel 2 km on my bike. Even with a light shower, there is water logging which results in chaotic traffic during rush hour. I do not know what the government has been doing for the last 10 days. They should at least take the necessary steps to get water logging sorted so that commuters will not face long traffic jams,” said Mohd Razdan, a techie who regularly commutes via this road.
The Lok Satta party, under whose constituency the area falls, had earlier blamed both the railway authorities and the HMDA officials for the mess. The party leader Jayaprakash Narayan regretted that despite revising the budget to build the bridge, the project was dragging along endlessly.
6/29/2012
డీజీపీని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
వైఎస్ఆర్ సీపీ నేతలు పలువురు ఈ సాయంత్రం డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారంలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫిర్యాదుపై త్వరగా విచారణ చేపట్టాలని వారు డిజిపిని కోరారు. జేడీ, వాసిరెడ్డి చంద్రబాల కాల్‌లిస్ట్ లీకేజీ కేసులను సిఐడికి అప్పగించారు. ఆ కేసులను పోలీసులు ఆగమేఘాల మీద విచారణ చేస్తున్నారని వారు డిజిపికి తెలిపారు.
అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస రెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంఎల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ విజయమ్మ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. విచారించాలని నగర కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.

జగన్ త్వరలోనే విడుదలవుతారు: వైవి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి త్వరలోనే విడుదలై ప్రజలను కలుస్తారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ విధానంపై జగన్‌దే తుది నిర్ణయం అన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన జగదీశ్వరీ హోటల్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు గట్టు రామచంద్ర రావు, జనక్ ప్రసాద్, రోజా, వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసి కొందరు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన నేతలు రవీంద్ర నాయక్, కె.కె.మహేందర్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, వెల్లాల రామ్మోహన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు ముందు, తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరును బాజిరెడ్డి ఎండగట్టారు. మే 27న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద 9 మంది పార్టీ కార్యకర్తలను అప్పటి ఏసీపీ రామచంద్రరావు అదుపులోకి తీసుకుని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు చేసిన అక్రమ అరెస్టు, వేధింపులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను అశ్రయిస్తామన్నారు.
కాంగ్రెస్ తొత్తులుగా పోలీసులు: బాజిరెడ్డి

6/29/2012
లగడపాటి.. ఘనాపాటి! ఐసీఐసీఐ బ్యాంకుకు కుచ్చుటోపీ!
ఆ బ్యాంకు నుంచి అక్రమంగా రూ.3000 కోట్లు తీసుకున్నారు
వైఎస్సార్‌సీపీ నాయకుడు గౌతమ్‌రెడ్డి ఆరోపణ
ఆయన ఆస్ట్రేలియా కంపెనినీ మోసం చేశారని ధ్వజం
మనీ లాండరింగ్‌పై ప్రధాని, లోక్‌సభ స్పీకర్, సీబీఐ, ఈడీకి ఫిర్యాదు
హైదరాబాద్, న్యూస్‌లైన్:
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్వదేశంలోని ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.3వేల కోట్ల మేర టోపీ పెట్టడమే కాక ఆస్ట్రేలియాలోని విదేశీ కంపెనీలను నట్టేట ముంచుతున్నారని, ఆయనపై తక్షణం విచారణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది పి.గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజగోపాల్ మనీ లాండరింగ్, ప్రజాధనం దుర్వినియోగం లాంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై తాను ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి, హోంమంత్రికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఆయన గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జాతీయ జెండా పట్టుకుని అందరికీ నీతులు బోధించే లగడపాటి చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు. ల్యాంకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థలోని షేర్ హోల్డర్లను కూడా మోసం చేసి రూ.440 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన పేర్కొన్నారు. ‘‘రాజగోపాల్ ల్యాంకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో 2006 సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.440 కోట్ల ప్రజాధనాన్ని సేకరించారు. దాంతో గత ఏడాది మే 4న ఆస్ట్రేలియాలోని గ్రిఫిన్ కోల్‌మైన్స్ అనే దివాళా తీసిన సంస్థను కొనుగోలు చేశారు. గ్రిఫిన్ సంస్థ దివాళా ప్రకటించడానికి ముందు పర్ధిమాన్ కంపెనీతో బొగ్గు సరఫరా ఒప్పందం చేసుకుంది.
బొగ్గును గ్యాస్‌గా మార్చి యూరియాను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతి పెద్ద కర్మాగారాన్ని నిర్మించే ప్రణాళికతో ఉన్న పర్ధిమాన్ ఫర్టిలైజర్స్ యజమాని వికాస్ రాంబాల్ అప్పటికే రెండు వందల మిలియన్ల డాలర్లను ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టారు కూడా. మిగిలిన మొత్తాన్ని ఆర్థిక సంస్థల ద్వారా సమీకరణకు రాంబాల్ ప్రయత్నిస్తూ ఉండగా ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ గ్రిఫిన్స్‌ను కొనుగోలు చేసింది. దాంతోపాటు అప్పటికే పర్ధిమాన్ సంస్థతో చేసుకున్న బొగ్గు సరఫరా ఒప్పందాన్ని గౌరవించడానికి అంగీకరించింది. కానీ గ్రిఫిన్స్‌ను కొనుగోలు చేశాక మాట మార్చి.. బొగ్గు సరఫరా చేసేది లేదని ల్యాంకో స్పష్టం చేసింది. దాంతో పర్ధిమాన్ సంస్థ సంక్షోభంలో పడింది’’ అని గౌతమ్ వివరించారు.
3.5 బిలియన్ డాలర్లు చెల్లించాలని పిటిషన్: ల్యాంకో సంస్థ అనైతిక, అక్రమ చర్యల కారణంగా తాము తీవ్రంగా నష్ట పోయామని, దానికి పరిహారంగా తమకు 3.5 బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని.. అంటే ల్యాంకో.. గ్రిఫిన్ సంస్థను కొనుగోలు చేసిన 750 మిలియన్ డాలర్ల కన్నా ఐదు రెట్లు ఎక్కువ చెల్లించాలని వెస్ట్రన్ ఆస్టేలియా కోర్టులో పర్ధిమాన్ సంస్థ దావా వేసిందని గౌతమ్‌రెడ్డి చెప్పారు. కేసు విచారణలో ఉన్నందున కోల్‌మైన్స్‌పై ఎలాంటి లావాదేవీలూ చేయరాదని కోర్టు ఆదేశించిన తరుణంలో ల్యాంకో సంస్థ మరో పెద్ద కుంభకోణానికి తెర లేపిందని ఆరోపించారు. కోర్టు వివాదాన్ని మరుగున పరచి గ్రిఫిన్ కోల్‌మైన్స్‌ను ఐసీఐసీఐ బ్యాంకుకు తనఖా పెట్టి 3 వేల కోట్ల రూపాయలు రుణంగా పొందిందని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పర్ధిమాన్ సంస్థ లబోదిబోమంటూ తాము నష్ట పరిహారం కోసం ప్రయత్నిస్తూ ఉండగా మరోవైపు వివాదంలో ఉన్న కోల్ మైన్స్‌ను ఐసీఐసీఐ బ్యాంకుకు తాకట్టు పెట్టిందని, ఒక వేళ తాము కేసులో గెలిస్తే తమకు ల్యాంకో ఎక్కడి నుంచి డబ్బు తెచ్చి పరిహారంగా ఇస్తుందని ప్రశ్నించిందని గౌతమ్‌రెడ్డి వివరించారు.
ఐసీఐసీఐ ఇరుక్కుపోయింది: పర్ధిమాన్ పిటిషన్‌పై వెస్ట్రన్ ఆస్ట్రేలియా న్యాయశాఖ అధికారులు స్పందించి కోల్‌మైన్స్‌ను ఐసీఐసీఐకి పెట్టిన తాకట్టు చెల్లదని పేర్కొనడంతో ఇపుడు ఆ బ్యాంకు ఉచ్చులో ఇరుక్కు పోయిందని గౌతమ్ తెలిపారు. ఈ తరుణంలోనే ల్యాంకో తమ సంస్థను కొనుగోలు చేసేటపుడు చేసుకున్న ఒప్పం దాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల అమ్మకపు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నామని గ్రిఫిన్ సంస్థ ప్రకటించిందని ఆయన వివరించారు. ఈ చర్యతో ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రుణానికి కూడా ముప్పు ఏర్పడిందని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు 63 రూపాయల విలువ ఉన్న షేర్ ధర ఇపుడు 13 రూపాయలకు పడిపోయి వాటాదారులు తీవ్రంగా నష్ట పోయారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని ఆయన వివరించారు. తన ఫిర్యాదుకుకు స్పందించక పోతే తాను హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తానని గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.

న్యాయమూర్తితో ఎందుకు మాట్లాడారు?
న్యాయమూర్తితో ఎందుకు మాట్లాడారు?
విలేకరులు, పత్రికాధిపతులతో ఎందుకు మాట్లాడారు?
ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలను ఖండించలేదెందుకు?
ప్రైవసీ మీకొక్కరికే ఉంటుందా? జగన్‌కు ఉండదా?
హైదరాబాద్, న్యూస్‌లైన్:
సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ.. సీబీఐ నియమావళికి విరుద్ధంగా మీడియాతోనూ, ప్రైవేటు వ్యక్తులతోనూ మాట్లాడిన ఫోన్ కాల్స్ గురించి సమాధానం చెప్పకుండా బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ కాల్స్ జాబితాను వెల్లడించడం ద్వారా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రను తాము బయటి ప్రపంచానికి చాటి చెబితే.. దానిపై జేడీ స్పందించకుండా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని విమర్శించారు.
‘‘కాల్స్ జాబితా వెల్లడించడం వల్ల తన ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) దెబ్బ తిన్నదని జేడీ ఫిర్యాదు చేశారు.. ఆయన ఒక్కరికే ఆ ప్రైవసీ ఉందా? జగన్‌మోహన్‌రెడ్డికి ప్రైవసీ లేదా? ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలకు ప్రైవసీ లేదా? 28 బృందాలను తీసుకెళ్లివారి బెడ్‌రూంలలో కూడా తనిఖీలు నిర్వహించారే, అపుడు జేడీకి ప్రైవసీ గురించి గుర్తుకు రాలేదా?’’ అని అంబటి ప్రశ్నించారు. ‘‘మీరొక దర్యాప్తు అధికారి, మీరు పెట్టే కేసులపై తీర్పునివ్వాల్సిన న్యాయమూర్తితో మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీడియాతోనూ, మీడియా యాజమాన్యాలతోనూ ఎందుకు మాట్లాడారు? ఇలా మాట్లాడ్డం సీబీఐ మాన్యువల్(నియమావళి)ను ఉల్లంఘిం చినట్లా? కాదా? సమాధానం చెప్పండి’’ అని నిలదీశారు.
నిజం కాకుంటే.. ఖండించరెందుకు?: తన కాల్స్ జాబితా ఎక్కడి నుంచి వచ్చిందని, అలా రావడం తప్పు అని అంటున్న లక్ష్మీనారాయణ తాను మాట్లాడిన కాల్స్ నిజం కాకపోతే.. వాటి ని ఎందుకు ఖండించడం లేదు? అని ప్రశ్నించారు.
న్యాయమూర్తితో సహా ఎంపిక చేసుకున్న కొందరు విలేకరులతో, వారి యాజమాన్యాలతో మాట్లాడింది నిజమో కాదో ఆయన ఎందు కు చెప్పడం లేదన్నారు. అసలు తాను అధికారిక ఫోన్ నుంచి వీరందరితో మాట్లాడ్డం చట్టబద్ధమే అయితే, మాన్యువల్‌కు అనుగుణంగా ఉంటే జేడీ ధైర్యంగా ఫలానా వారితో మాట్లాడాను అని చెప్పి ఉండే వారని అన్నారు. జగన్ వ్యతిరేక మీడియాతో మాట్లాడుతున్నారని తాము తొలి నుంచీ ఆక్షేపిస్తున్నామ ని, లీకుల పేరుతో లక్ష్మీనారాయణ వార్తలు రాసేలా సమాచారం ఇస్తున్నారని చెప్పారు.ఆయన సమాచారం మేరకే జగన్‌పై ‘ఈనాడు’, దాని తోక పత్రిక పుంఖానుపుంఖాలుగా వార్తలు రాశాయని చెప్పారు. జగన్‌పై దుష్ర్పచారం సాగిస్తూ వస్తున్న వార్తలను ఒక్క రోజూ విచారణాధికారిగా జేడీ ఖండించలేదని, ఎందుకంటే ఆ వార్తలు ఆయన అందించినవేనని రాంబాబు అన్నారు.
ఆ వార్తలను ఖండిస్తే తాను లీకులు ఇచ్చే మీడియా తిరిగి ప్రశ్నిస్తుందనే ఉద్దేశంతోనే జేడీ మిన్నకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అంబటి సీబీఐ దర్యాప్తు మొదలైనప్పటి నుంచీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వార్తలను ప్రదర్శించారు.
నన్ను అడిగినవే.. పత్రికల్లో: తాను సీబీఐ విచారణకు వెళ్లినపుడు అక్కడ తనను ఏమేమి అడిగారో అవన్నీ ఆ మరుసటి రోజు పత్రికల్లో వచ్చాయని అంబటి తెలిపారు. లక్ష్మీనారాయణ చేస్తున్న కుట్రను తాము బయట పెడుతూ ఉంటే.. ఆయనకు అండగా ఇపుడు ఓ వర్గం మీడియా సమీకృతమై తమపై దాడికి దిగుతోందని, దానికి కారణం ఆయన ఇచ్చే లీకులేనని రాం బాబు దుయ్యబట్టారు. ఒక మహిళను అడ్డం పెట్టుకుని రాజకీ యం చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా తమను ఉద్దేశించి ప్రచారం చేస్తోందని, వాస్తవానికి ఆ పని చేస్తున్నది జేడీయేనని అంబటి అన్నారు. జేడీని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.

లక్ష్మీనారాయణపై చర్య తీసుకోండి. హైకోర్టులో గుంటూరు వాసి పిల్ దాఖలు
మీడియాతో మాట్లాడలేదంటూ కోర్టును తప్పుదోవ పట్టించారు
ఈనాడు, ఆంధ్రజ్యోతి లబ్ధి పొందడానికి జేడీ సహకరించారు
మీడియాతో రహస్యంగా మాట్లాడడం మాన్యువల్‌కు విరుద్ధం
జేడీ కాల్ లిస్ట్‌ను సమర్పించేలా బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదేశించండి
పిల్.. సోమవారం విచారణకు వచ్చే అవకాశం
హైదరాబాద్, న్యూస్‌లైన్:
సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల వివరాలను సమర్పించేలా బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్‌ను ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. తను గానీ, తన సహచరులుగానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడలేదంటూ తప్పుడు ప్రకటన చేసి కోర్టును తప్పుదోవ పట్టించడమే కాకుండా, మోసం చేశారని, అందుకు లక్ష్మీనారాయణపై చర్య తీసుకోవాలని కోరుతూ గుంటూరు లోని పట్టాభిపురానికి చెందిన భూషణ్ బి.భవనం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ఈనాడు అధిపతి రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, బీఎస్‌ఎన్‌ఎల్ జీఎంలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అంతేకాక ఈ వ్యాజ్యం లో జేడీ లక్ష్మీనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. సోమవారం ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశాలు ఉన్నాయి.
దర్యాప్తు మొదలైన నాటి నుంచీ లీకులు..
జగన్ కంపెనీల్లో పెట్టుబడులు, ఇతర కేసుల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన నాటి నుంచి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులతో జేడీ లక్ష్మీనారాయణ ఫోన్‌లో మాట్లాడుతున్నారని, అయితే ఈ విషయాన్ని కోర్టుల్లో ఎప్పటికప్పుడు సీబీఐ న్యాయవాదులు ఖండిస్తూ వచ్చారని పిటిషనర్ తెలిపారు. మీడియాలో వచ్చే కథనాలకూ జేడీకీ ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు తెలిపారని వివరించారు. లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్లు ఆయన కాల్ లిస్టే స్పష్టంగా చెబుతోందని, ఇలా దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడటం సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధమని, ఇది అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని వివరించారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు, జేడీ లక్ష్మీనారాయణకు మధ్య అసాధారణ సంఖ్యలో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు నడిచాయని, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయని తెలిపారు. జేడీ కాల్‌లిస్ట్ ద్వారా చంద్రబాల అనే మహిళకు సైతం పెద్ద సంఖ్య లో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు కూడా తేలిందన్నారు. ఆమె కూడా లక్ష్మీనారాయణకు అదే స్థాయిలో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపారని వివరించారు. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు కూడా వచ్చాయని, ఆ మరుసటి రోజు చంద్రబాల ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు వచ్చి లక్ష్మీనారాయణకు, తనకు మధ్య జరిగిన సంభాషణలు పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, దానిని ప్రశ్నించేందుకు ఎవరికి అధికారం లేదని కూడా చెప్పారని పిటిషనర్ పేర్కొన్నారు.
జేడీ పనితీరుపై సందేహాలు
సీబీఐ మాన్యువల్ ప్రకారం మీడియాతో మాట్లాడే అధికారం జేడీ లక్ష్మీనారాయణకు లేదని, కేసు దర్యాప్తు గురించి ఉన్నతాధికారులతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడకూడదని పిటిషనర్ తెలిపారు. సీబీఐ మీడియాతో ఏం మాట్లాడాలన్నా అది ప్రెస్‌నోట్ ద్వారా బహిరంగంగానే మాట్లాడాల్సి ఉంటుందే తప్ప, ఫోన్‌లలో రహస్యంగా కాదని వివరించారు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులతో లక్ష్మీనారాయణ మాట్లాడిన కాల్స్‌ను బట్టి చూస్తే, ఆయన పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడినట్లు బహిర్గతమైనా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలు మీడియా ట్రయిల్ నిర్వహిస్తున్నాయని తెలిపారు.
చట్టానికి అతీతుడిగా భావిస్తున్నారు
లక్ష్మీనారాయణ చట్టానికి అతీతుడిగా భావిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం అందించి లబ్ధి పొందాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తున్నాయని, ఇందుకు లక్ష్మీనారాయణ సహకరిస్తున్నారన్నారు. దర్యాప్తునకు సంబంధించి లక్ష్మీనారాయణ చెప్పే వివరాలకు కల్పనలను జోడించి ఈనాడు, ఆంధ్రజ్యోతి దారుణ కథనాలను ప్రచురించాయని, ఇంకా ప్రచురిస్తున్నాయని పిటిషనర్ తెలిపారు. లక్ష్మీనారాయణను నియంత్రించకుంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని భూషణ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ వ్యాజ్యాన్ని భూషణ్ ఈ నెల 26న దాఖలు చేశారు. అయితే హైకోర్టు రిజిస్ట్రీ దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చివరకు గురువారం దానికి పిల్ నెంబర్ కేటాయించింది.

జగన్ స్వేచ్ఛను హరిస్తున్న సర్కారు: జెఠ్మలానీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ గురువారం చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. కేసు గురించి ఆయనతో సుమారు 15 నిమిషాల పాటు చర్చించినట్టు సమాచారం. అనంతరం జైలు బయట మీడియాతో జెఠ్మలానీ మాట్లాడారు. జగన్ తన క్లయింట్‌కావడంతో కేసు గురించి ఆయనతో చర్చించానన్నారు. ‘‘మీడియాకు ఒక విషయం స్పష్టం చేయాల్సి ఉంది. ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ స్వేచ్ఛను హరిస్తోంది. శిక్ష పడిన ఖైదీకి కూడా కొన్ని హక్కులుంటాయి. అలాంటిది.. ఒక పార్టీ అధ్యక్షుడైన జగన్‌కున్న రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మీడియా కూడా దీన్ని గమనించాలన్నారు.
6/29/2012
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ‘సాక్షి’ మీడియాపై నమోదు చేసిన కేసు దర్యాప్తును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు గురువారం ప్రారంభించారు. అందులో భాగంగా, దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం లక్ష్మీనారాయణ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోపక్క ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా కాల్ డీటైల్స్ బయటకు రావడం, ప్రచురణ కావడానికి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థతో పాటు ‘సాక్షి’ మీడియాకు కూడా సీసీఎస్ నోటీసులు జారీ చేసింది. ‘కాల్ డీటైల్స్ ఎవరిచ్చారు? ఎవరికిచ్చారు? వారి వివరాలేమిటి? పేర్లు, చిరునామాలు ఏమిటి?’ వంటి మొత్తం ఐదారు ప్రశ్నలను అధికారులు సంధించారు. వాటికి లిఖితపూర్వకంగా బదులివ్వాలని కోరారు. కాల్ వివరాలు తీసుకోవడం, ఇవ్వడంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ), టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మార్గదర్శకాలను కూడా సీసీఎస్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు.
సీబీఐ జేడీ వాంగ్మూలం నమోదు

6/29/2012
ఇదేం దర్యాప్తు.. ఇలాగేనా దర్యాప్తు సాగేది..?
విధి నిర్వహణలో సీబీఐ దారుణంగా విఫలమైంది
సీబీఐ పీపీలు నిజాలు దాచి కోర్టులను మోసగిస్తున్నారు
జగన్ అరెస్టును సీబీఐ ఏ విధంగానూ సమర్ధించుకోజాలదు
సొంతగా దర్యాప్తు చేయాలే తప్ప.. జగన్ చెప్పే దాన్నిబట్టి చేస్తారా?
బెయిలిస్తే జగన్ సాక్షులను బెదిరిస్తారు: సీబీఐ న్యాయవాది అశోక్‌భాన్
బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి జూలై 4న తీర్పు
నిజమే.. జగన్ వద్ద అధికారం లేదు
మీ చేతిలో ఉంది గనుకే సీబీఐని రిమోట్‌తో ఆడిస్తున్నారు
మీ నాటకాలను జనమంతా చూస్తున్నారు
భవిష్యత్తెలా ఉంటుందో చూడండి: జెఠ్మలానీ
‘‘నిజమే.. జగన్‌కు అసెంబ్లీలో ఉన్నది తక్కువ బలమే. ఆయన పార్టీ ఉప ఎన్నికల్లో 15 సీట్లు గెలిచింది. ఆయన వద్ద ఇప్పుడు అధికారం కూడా లేదు. మీ (కేంద్రం) వద్దే ఉంది. అందుకే సీబీఐని రిమోట్ కంట్రోల్‌తో ఆడించినట్టు ఆడిస్తున్నారు. మీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. జగన్ విషయంలో భవిష్యత్తెలా ఉంటుందో ఓసారి చూడండి. ప్రజలకన్నీ స్పష్టంగా తెలుసు’’ - హైకోర్టులో జెఠ్మలానీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ నిజాయతీగా వ్యవహరించడం లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని, సిగ్గుతో తలదించుకునేలా సాగుతోందని వివరించారు. దర్యాప్తు పేరుతో సీబీఐ చేస్తున్నదంతా తప్పని, అవసరం లేని అంశాలన్నింటిలో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. జగన్ పిటిషన్‌పై బుధవారం మొదలైన వాదనలు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ఎదుట గురువారం కూడా కొనసాగాయి. జగన్ తరఫున రాంజెఠ్మలానీ, సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ వాదించారు.
సీబీఐ తీర్పులిచ్చేస్తోంది..
దర్యాప్తు చేసి, తదుపరి ప్రక్రియను న్యాయస్థానాలకు వదిలిపెట్టాల్సిన సీబీఐ అధికారులు, అందుకు విరుద్ధంగా తామే తీర్పులిచ్చేస్తూ నిందితులను ముందుగానే శిక్షించేస్తున్నారని రాంజెఠ్మలానీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు పేరుతో వ్యక్తుల స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని తెలిపారు. ‘‘సీబీఐ దర్యాప్తు మొత్తం మోసం. అది తన విధి నిర్వహణలో దారుణంగా విఫలమైంది. ఇది నేను చెబుతున్నది కాదు. ఓ కేసులో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. సాక్షులను జగన్ బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అందుకే అరెస్టు చేస్తున్నామని సీబీఐ చెప్పింది. కానీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైన 2011 ఆగస్టు 17 నుంచి 2012 జగన్‌ను అరెస్టు చేసిన మే 27 దాకా సీబీఐకి ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? ఆ సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్ బయట ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాదు కాబట్టి ఢిల్లీ ఆదేశాల మేరకు సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది’’ అన్నారు. పైగా అరెస్ట్ సమయంలో జగన్ ఎంపీ హోదాను అధికారులు సాకుగా చూపారంటూ రాంజెఠ్మలానీ ఎద్దేవా చేశారు. సీబీఐ ఇచ్చిన అరెస్టు మెమో మొత్తం తప్పులతడకని, అందులోని విషయాలన్నీ అవాస్తవాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘వాస్తవాలు తెలుసుకునేందుకు విచారణకు పిలుస్తున్నామని జగన్‌కు చెప్పిన సీబీఐ అధికారులు, తరువాత అరెస్టు చేశారు. ఇది మోసగించడమే అవుతుంది. అరెస్టును జగన్ ముందే ఊహించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను ఫలానా అంశంపై విచారణకు పిలిపించామని అప్పుడు సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పలేదు. ఇది న్యాయస్థానాన్ని మోసం చేయడమే. సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాస్తవాలను దాచిపెడుతూ న్యాయస్థానాన్ని పదేపదే మోసం చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. సీబీఐ చర్యలు అమాయకులను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి’’ అని ఆయన కోర్టుకు నివేదించారు.
ఒక్క మంచి ప్రశ్నయినా అడిగారా?
విచారణకు జగన్ సహకరించలేదని, పొంతన లేని సమాధానాలు చెప్పారని అంటున్న సీబీఐ అధికారులు అసలు విచారణలో జగన్‌ను ఒక్క మంచి ప్రశ్నైనా అడిగారా అని రాంజెఠ్మలానీ ప్రశ్నించారు. జగన్ సరిగా సమాధానాలివ్వడం లేదని చెప్పేందుకు అసలు సీబీఐకున్న అర్హతేమిటంటూ నిలదీశారు. సీబీఐ సొంతగా దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకోవాలే తప్ప, జగన్ చెప్పేదాన్ని బట్టి దర్యాప్తు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ‘దర్యాప్తు అంటే ఇదేనా? దర్యాప్తు సాగే తీరు ఇదేనా?’ అని సీబీఐని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు సిగ్గుతో తలదించుకునేలా ఉందని పునరుద్ఘాటించారు. తాము చెప్పినట్టు విని, తమకు సహకరించిన వారిని సీబీఐ అధికారులు ఈ కేసులో సాక్షులుగా చూపుతున్నారని, అలా వినని వారిని మాత్రం దోషులుగా చూపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఒక్క సాక్ష్యమూ చూపలేదే?!
జగన్ సాక్షులను బెదిరించే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందంటున్న సీబీఐ అధికారులు, అందుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క సాక్ష్యాన్ని కూడా ఇప్పటిదాకా ఏ కోర్టు ముందూ ఉంచలేదని రాంజెఠ్మలానీ వివరించారు. ఈ విషయంలో సీబీఐ అధికారులు ప్రతిసారీ కోర్టు ముందు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని నివేదించారు. ‘‘సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలాలిచ్చేందుకు సాక్షులు ముందుకు రావడం లేదని సీబీఐ చెబుతోంది. కానీ నిజానికి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే 164 కింద వాంగ్మూలమిచ్చే విషయంలో సీబీఐ నోటీసులకు స్పందించలేదు. దాన్ని జగన్‌కు ముడిపెట్టడం ఎంత వరకు సమంజసం? దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా చెప్పుకునే సీబీఐ దర్యాప్తు తీరు ఎలా ఉందో ఓసారి చూడండి’’ అని ఈ సందర్భంగా న్యాయమూర్తిని జెఠ్మలానీ కోరారు. ‘సీబీఐలో మంచి అధికారులున్నారు. అదే సమయంలో చెడ్డవారూ ఉన్నారు. వారివల్లే మంచి అధికారులకు తగిన గుర్తింపు రాకుండా పోతోంది. జగన్ అరెస్టుకు సీబీఐ చెప్పిన కారణాలు స్పష్టంగా లేవు. వాటి ఆధారంగా జగన్ అరెస్టును సమర్థించుకోజాలదు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ పార్టీ అధ్యక్షుడిగా తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేయాలని ప్రచారం చేసుకునే హక్కు జగన్‌కుంది. రాజ్యాంగం ప్రసాదించిన ఆ హక్కును గౌరవిస్తూ ఆయనకు బెయిలివ్వాలి’’ అని కోర్టును కోరారు.
అసాధారణ పరిస్థితుల్లోనే బెయిల్ నిరాకరణ..
దర్యాప్తు జరుగుతోంది గనుక బెయిలివ్వరాదని సీబీఐ కోరడం సరికాదని రాంజెఠ్మలానీ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని పలు తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. ‘‘బెయిలిచ్చే విషయంలో చట్టం స్పష్టంగా ఉంది. నిందితులకు బెయిలివ్వడమనేది నిబంధన. దాని నిరాకరణ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చేసేది’’ అని అన్నారు. ‘‘దాదాపు 10 నెలలుగా దర్యాప్తు చేస్తున్నారు. మూడు చార్జిషీట్లు వేశారు. విదేశాలకు కూడా వెళ్లారు. లెటర్ ఆఫ్ రెగొటరీ ద్వారా విదేశాల నుంచి సమాచారమూ కోరారు. కానీ ఆ దేశాలు ఎప్పటికీ సమాధానమివ్వవు. దాన్ని అడ్డం పెట్టుకుని దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. నిందితులకు బెయిలివ్వొద్దని సీబీఐ వాదిస్తోంది. ఇదెంతమాత్రమూ సమంజసం కాదు’’ అని ఆయన వివరించారు.
జగన్ పలుకుబడి వల్లే సాక్షులు ముందుకు రావట్లేదు: సీబీఐ న్యాయవాది
అంతకుముందు సీబీఐ తరఫున అశోక్ భాన్ వాదనలు వినిపించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చగా అవి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఒకేసారి జరిగిందన్నారు. ఇదంతా క్విడ్ ప్రొ కోలో భాగమేనని ఆయన వివరించారు. ‘‘జగన్‌కున్న పలుకుబడి వల్ల సాక్ష్యమిచ్చేందుకు సాక్షులు ముందుకు రావడం లేదన్నారు. జగన్‌కు బెయిలిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలున్నాయి. దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ దశలో జగన్‌కు బెయిలివ్వరాదు’’ అని భాన్ కోర్టును కోరారు. ఈ సమయంలో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లేందుకు ఆయన పలుమార్లు ప్రయత్నించగా న్యాయమూర్తి అడ్డుకున్నారు. ‘పూర్వాపరాల్లోకి వెళ్లొద్దు. ఎందుకు బెయిల్ ఇవ్వరాదనే విషయానికి మాత్రమే వాదనలను పరిమితం చేయాలి’’ అని స్పష్టం చేశారు. జూలై 4న తీర్పు వెలువరిస్తానని ప్రకటించారు.
సీబీఐ తీరు సిగ్గుచేటు

నైతికంగా దెబ్బతీస్తున్నారన్న సీబీఐ జేడీ ఫిర్యాదుపై సర్వత్రా విస్మయం
ఓ వర్గం మీడియాకు కావాల్సిన లీకులివ్వటం నిజం కాదా?
వీలైనంత విషం కక్కేలా వాళ్లని ప్రోత్సహించటం అబద్ధమా?
ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది?
ఈ తీరు వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు బాధపడ్డాయో తెలుసా?
లిస్టెడ్ కంపెనీల ఇన్వెస్టర్లు కూడా దెబ్బతిన్నారని మీకు తెలియదా?
వాళ్లకు వ్యక్తిగత స్వేచ్ఛలు లేవా? వాళ్లవి ప్రైవేటు జీవితాలు కావా?
ఎమ్మార్ కేసులో అసలు కుట్రదారు బాబునెందుకు విచారించరు?
ఐఎంజీ దర్యాప్తునకు తగినంత సిబ్బంది లేరని చెప్పటం నిజమేగా!
వైఎస్ దుర్మరణం కేసు దర్యాప్తును మూడు నెలల్లోనే ముగించారేం?
ఎన్నికల ముందు జగన్ అరెస్టు.. ప్రచారాన్ని అడ్డుకోవటానికి కాదా?
అరెస్టు అధికార, విపక్షాలకు లబ్ధి చేకూర్చడానికే అన్నది నిజం కాదా?
ఇవి నైతికతకు సంబంధించిన ప్రశ్నలు కావా? ఎవరిది అనైతికత?
కాల్ డేటా వివరాలు లీకయ్యాయంటూ సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తనను నైతికంగా దెబ్బతీయటానికే ఇదంతా చేస్తున్నారని పేర్కొనటం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. రాజ్యాంగం తనకు కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దెబ్బ తీస్తున్నారని, కపటంతో దర్యాప్తును ప్రభావితం చేయటానికి కుట్ర చేస్తున్నారని ఆయన పేర్కొన్నట్టుగా గురువారం ‘ఈనాడు’ పత్రిక పతాక స్థాయి కథనాన్ని ప్రచురించింది. కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న తనను.. నైతికంగా దెబ్బ తీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా అందులో జేడీ పేర్కొన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తు తీరుతెన్నులపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం కావటం.. ఓ వర్గం మీడియా సాయంతో ైవె ఎస్సార్ కుటుంబాన్ని, అభిమానుల్ని, ‘సాక్షి’ని లక్ష్మీనారాయణ టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజా ఆరోపణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ఎవరిదండీ అనైతికం? జగన్‌ను దోషిగా నిరూపించాలని సీబీఐ ముందే నిర్ణయం తీసేసుకుని.. దాన్ని అమలు చేయటానికి నిబంధనల్ని గాలికొదిలేసి.. ఓ వర్గం మీడియాకు తాను చెప్పాలనుకున్నది చెబుతూ.. వీలైనంత విషం కక్కేలా వాళ్లని ప్రోత్సహిస్తూ దురుద్దేశపూరితంగా వార్తలు రాయించటం నిజం కాదా? ఇదంతా ఒక వ్యక్తిని అప్రతిష్టపాలు చేయటానికి పన్నిన లోతైన కుట్ర కాదా? విచారణలో భాగంగా ఒక గదిలో ఇద్దరు మాట్లాడిన అంశాలు కూడా బయటకు యథాతథంగా రాలేదా? జగన్‌ను, ఆయన కుటుంబీకుల్ని, బంధుమిత్రుల్ని, అభిమానుల్ని మానసికంగా దారుణంగా దెబ్బతీసేలా ఆ వర్గం మీడియాలో కథనాలు రాలేదా? సీబీఐ చెప్పిందంటూ వాళ్లు రాసిన కథనాల్ని లక్ష్మీనారాయణ సహా ఏ ఒక్క అధికారీ ఎందుకు ఖండించలేదు? ఏం! ఢిల్లీ పోలీసులు సైతం తమకు సంబంధించిన వార్తేదైనా వెలువడితే అది నిజమో కాదో వివరణ ఇస్తున్నారుగా! కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థకు ఆ మాత్రం బాధ్యత లేదా? పెపైచ్చు సదరు మీడియా ప్రతినిధులకు లక్ష్మీనారాయణ ఫోన్లు చేయటం నిజం కాదా? కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్నానంటున్న అధికారికి అంత సమయం ఎక్కడుంది? మీడియాకు తనంతట తాను అన్నేసిసార్లు ఫోన్లు చేసి మరీ విషయాల్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇలా చేయడం ద్వారా కొన్ని లక్షల మందిని మానసికంగా దెబ్బ తీయటం అబద్ధమా? ఈ అడ్డగోలు కథనాల వల్ల జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల తాలూకు లిస్టెడ్ కంపెనీలు కూడా తీవ్రంగా దెబ్బ తినలేదా? వాటిలో పెట్టుబడులు పెట్టిన చిన్న చిన్న ఇన్వెస్టర్ల మాటేమిటి? ఇవేవీ లక్ష్మీనారాయణకు క నిపించలేదా? ఏం! వారికి రాజ్యాంగం వర్తించదనుకుంటున్నారా? స్వేచ్ఛగా బతికే హక్కు వారికి మాత్రం లేదా? మీ దర్యాప్తు మీరు చేయకుండా మీడియానెందుకు ఆశ్రయిస్తున్నారు?’’ అని కేసు పూర్వాపరాలను తొలి నుంచీ గమనిస్తూ వస్తున్న పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
కేసేదైనా టార్గెట్ వైఎస్ కుటుంబమే!
నిజానికి నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తూ ఏ కేసునైనా ఒకేలా చూడాల్సిన సీబీఐ.. చంద్రబాబుకు మాత్రం ప్రాణ స్నేహితుడిలా ప్రవర్తిస్తోందని గతంలోనే విమర్శలొచ్చాయి. ఎందుకంటే జగన్ కేసుల్లో క్షణం కూడా వృథా కాకూడదన్నట్లుగా రెండు వారాల్లోనే కోర్టుకు నివేదిక ఇవ్వటం.. కోర్టు దర్యాప్తుకు ఆదేశించిన గంటల వ్యవధిలో మూకుమ్మడి దాడులతో ఇన్వెస్టర్లను, వైఎస్సార్ కుటుంబీకుల్ని భయభ్రాంతుల్ని చేయటం తెలిసిందే. ఆఖరికి ఎమ్మార్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తూ కూడా జగన్ సన్నిహితులనే టార్గెట్ చేశారు తప్ప.. నిబంధనల్ని గాలికొదిలేసి టెండర్ల దశ నుంచే కుట్రపూరితంగా వ్యవహరించిన చంద్రబాబును మాత్రం విచారించనేలేదు. చివరకు సింగిల్ టెండర్ మిగిలేలా చక్రం తిప్పి.. హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా రూ.4 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.28 లక్షల చొప్పున సీఎం హోదాలో బాబు విక్రయించేశారు. అది కూడా ఏ పరిశ్రమకో, వేల మందికి ఉపాధి కల్పించటానికో కాదు.. విల్లాలు కట్టుకొని అమ్ముకోవటానికి! అయినా సరే.. ఈ వ్యవహారంలో 2004 కన్నా ముందు ఏం జరిగిందనేది తమకు అనవసరమన్నట్టుగా సీబీఐ మొండిగా వ్యవహరించింది. చివరికి సుప్రీంకోర్టు చెప్పినా సరే, అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ బాగోతాన్ని ప్రస్తావిస్తున్న వర్గాలు.. మరి ఇదెంత వరకూ నైతికమని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. పెపైచ్చు బాబు హయాంలో జరిగిన వ్యవహారాల్ని తప్పుబడుతూ, వాటిపై విచారణ జరపాలంటూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినప్పుడు.. దానిపై మీనమేషాలు లెక్కిస్తూ మూడు వారాల దాకా సీబీఐ ముందుకు కదలకపోవడాన్ని, కనీసం అటువైపు దృష్టి కూడా సారించకపోవడాన్ని ఆ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
రూ.43 వేల కోట్లంటూ అడ్డగోలు ఆరోపణలు!
సీబీఐ బుధవారం చేసిన వాదననే ఓ తీర్పు మాదిరిగా గురువారం ‘ఈనాడు’ ప్రచురించింది. ‘43 వేల కోట్ల దోపిడీ’ అంటూ పెద్దగా హెడ్డింగు పెట్టేసింది. గురువారం జగన్‌ను కలిసిన న్యాయవాదులు ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావించగా, ‘‘పత్రిక నడపడం ఇప్పటికే కష్టంగా ఉంది. పోనీ 43 వేల కోట్లెందుకు... దాన్లో పావలా వంతు ఇచ్చినా మొత్తం ఆస్తుల్ని తీసుకోమని ఎవరికైనా బంపర్ ఆఫరివ్వండి’’ అని ఆయన నవ్వుతూ కొట్టిపారేయడం గమనార్హం. దర్యాప్తు మొదలై 10 నెలలు గడుస్తున్నా ఇంకా ఫిర్యాదులోని ఆరోపణల్నే ప్రస్తావిస్తూ నెట్టుకురావడం, ఏదీ తేలకపోయినా, ఏదో జరిగిపోతోందన్నట్టుగా మీడియాలో కథనాలకు ఆస్కారమిచ్చేలా వాదనలు చేయటం.. ఇవన్నీ సీబీఐ తీరుతెన్నుల్ని బహిరంగంగా బయటపెడుతున్నవే. వాటి లోగుట్టును కూడా చెప్పకనే చెబుతున్నవే!
లక్ష్మీనారాయణది పక్షపాతం కాదా?
చంద్రబాబు అధికారం నుంచి తప్పుకునే ముందు.. ఆఖరి క్షణాల్లో ‘ఐఎంజీ అకాడెమీస్ భారత’ అనే డమ్మీ కంపెనీని సృష్టించి.. ఫ్లోరిడాలో ఉన్న ఐఎంజీ సంస్థకు అది అనుబంధమంటూ బొంకారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఫ్లోరిడా సంస్థకు, దీనికి ఎలాంటి సంబంధమూ లేదని తెలిసి.. ఇది బాబు బినామీల ద్వారా సాగించిన మోసమని తెలిసి దానిపై సీబీఐ విచారణ కోరారు. అయినా దానిపై విచారణకు సీబీఐ ముందుకు రాలేదు. కారణమేంటని ఆరా తీస్తే.. తమవద్ద తగినంత మంది సిబ్బంది లేరని ఇదే లక్ష్మీనారాయణ నేతృత్వంలోని సీబీఐ కేంద్రానికి చెప్పినట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది.
‘‘మరి ఇది ఎంతవరకూ నైతికం? బాబుపై మీ ప్రేమకు ఇది కూడా ఒక నిదర్శనం కాదా? వైఎస్ మరణించిన ఘటనపై మీ నేతృత్వంలోనే విచారణ జరిగింది. తప్పేమీ జరగలేదని కేవలం మూడంటే మూడే నెలల్లో తేల్చేశారు. అసలు వైఎస్సార్ మరణించడానికి ఒక్క రోజు ముందు చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ, ‘ఎవరు ఫినిష్ అవుతారో చూద్దాం’ అంటూ వైఎస్‌కు నేరుగా సవాలు విసిరారు. దాన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో చాలా ప్రాధాన్యమిచ్చి మరీ ప్రచురించింది. ఇదే చంద్రబాబు మన రాష్ట్ర గ్యాస్ నిల్వలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు దక్కటానికి యథాశక్తి సహకరించి తరించారు. గుజరాత్ మాదిరిగా పోటీ పడటానికి ముందుకు రాలేదు కూడా. అందుకని వాళ్లు చంద్రబాబుకు రుణ పడి... ఆ తర్వాత రూ.1,800 కోట్ల సంచిత నష్టాల్లో ఉన్న ‘ఈనాడు’లో రూ.100 విలువైన షేరును ఒక్కోటీ ఏకంగా రూ.5,28,630 చొప్పున కొనుగోలు చేసి దాన్ని తీర్చుకున్నారు. మరోవంక వైఎస్సార్ మాత్రం గ్యాస్ రేట్లు తగ్గించాలని రిలయన్స్ సంస్థతో అలుపులేని పోరాటం చేశారు. అటువైపేమో అనిల్ అంబానీని చంపడం కోసం ఆయన హెలికాప్టర్ ఫ్యూయల్ ట్యాంక్‌లో రాళ్లు వేయటం.. తర్వాత దాన్ని కనుక్కున్న ఇంజినీర్ రైలు పట్టాలపై శవమై కన్పించడం వంటివెన్నో జరిగాయి. అసలు ఇలాంటివన్నీ విచారణలో భాగమేనని మీకెందుకు అనిపించలేదు? సమగ్రంగా శోధించి కదా తప్పు జరిగిందో లేదో తేల్చాల్సింది!! అలా చేయకపోవటం అనైతికమని మీకు అనిపించలేదా?’’ అని ఈ వ్యవహారాన్ని తప్పు పడుతున్న వర్గాలు గట్టిగా నిలదీస్తున్నాయి. పైగా చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐపీఎస్ మాజీ అధికారులతో లక్ష్మీనారాయణ ఇప్పటికీ చాలా సన్నిహితంగా ఉంటున్నారనే విమర్శలున్నాయని, ఇలా చేయటం ఎంతమాత్రం నైతికం కాదని వారంటున్నారు.
అరెస్టుపై సర్వత్రా విమర్శలే..
ఆగస్టులో దర్యాప్తు మొదలు కాగా అప్పటి నుంచి సీబీఐ ఏకంగా మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ ఏడాది మే 25 వరకూ ఈ కేసులో ఒక్కసారి కూడా జగన్‌ను విచారించలేదు కూడా. అలాంటిది.. కేవలం ఉప ఎన్నికలు ఇంకా 15 రోజుల్లో ఉన్నాయనగా ఆయన్ను విచారణ కోసమంటూ పిలవడం, కోర్టులో మర్నాడు హాజరవుతారనగా... అందుకు కేవలం కొన్ని గంటల ముందు అంటే మే 27న అరెస్టు చేయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘‘ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్‌కు బురద అంటించాలని, ఆయన్ను తిరగనీయకుండా చేసి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆయనపై చల్లే బురద మాత్రమే ప్రజలకు కన్పించేలా చేయాలని పన్నిన కుట్రే కాదా ఇది? అందులో భాగస్వామిగా మారడం ద్వారా అధికార, ప్రతిపక్ష పార్టీలకు మేలు చేయాలని మీరు భావించలేదా? జగన్ ఏం చెప్పినా అది వినిపించకుండా చేయాలనే ఆలోచన తప్ప ఇందులో వేరే కారణమేముంది? 10 నెలలుగా సాక్ష్యాల్ని తారుమారు చేయని వ్యక్తి ఉన్నట్టుండి అలా చేస్తారని మీకెందుకు అనిపించింది? ఎన్నికలు రాబట్టే కదా? జగన్ ఎంపీ కాబట్టి, ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఇలా చేస్తారనటం ఎలాంటి నైతికతకు నిదర్శనం? పైగా ఈ ఆరోపణలనే ఆధారంగా చూపుతూ అరెస్టు చేయటమే నీతి నియమాలకు ప్రతీకా?’’ అని వైఎస్‌ను అభిమానించే వారంతా ప్రశ్నిస్తున్నారు. సీబీఐ తన దర్యాప్తు తాను చేసుకుంటూ వెళ్తే.. బురదజల్లే కథనాలపై మీడియాను నియంత్రించి ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ ఉండేవి కావని వారంటున్నారు. ‘‘దర్యాప్తు ముసుగులో ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని మీరు బజారుకీడ్చారో, ఎందరు గౌరవనీయ వ్యక్తుల మనసుల్ని గాయపరిచారో, ఎన్ని కుటుంబాల్ని అప్రతిష్టపాలు చేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ లీకుల కథనాల్ని మరొక్కసారి తిరగేయండి. వారి బాధేమిటో అప్పుడైనా మీకు తెలుస్తుంది’’ అని హితవు పలికారు.
నీతి నియమాలంటే లీకులేనా?

6/28/2012
India today article on "Secret Friends in AP Politics"
Written By news on Thursday, June 28, 2012 | 6/28/2012
6/28/2012
30న వైఎస్సార్ సీపీ యువజన సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుల సమావేశం ఈ నెల(జూన్)30న పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని జిల్లాల యువజన అధ్యక్షులు పాల్గొనే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలతో పాటు రాష్ట్రంలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి ఉత్సవాలు తదితర అనేక అంశాలపై చర్చించి కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.
6/28/2012
వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎందుకున్నారంటూ బూతులు తిట్టడమే కాకుండా, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రై వర్ కేసునూ.....
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసి కొందరు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన నేతలు రవీంద్ర నాయక్, కె.కె.మహేందర్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, వెల్లాల రామ్మోహన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు ముందు, తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరును బాజిరెడ్డి గోవర్ధన్ ఎండగట్టారు.
‘‘రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది క్రియాశీల కార్యకర్తలను మే 27న అప్పటి ఏసీపీ రామచంద్రరావు 30 మంది పోలీసులతో దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నప్పటికీ వారు ప్రవర్తించిన తీరు చాలా అమానుషంగా ఉంది. ఏసీపీ 9 మంది కార్యకర్తల బట్టలూడదీసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎందుకున్నారంటూ బూతులు తిట్టడమే కాకుండా, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రై వర్ కేసునూ వారిపై మోపారు. కానీ బస్సు ప్రమాదానికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు సంబంధంలేదని ఐపీఎస్ అధికారి విజయ్‌రావు బహిర్గతం చేసినప్పటికీ ఏసీపీ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ నేతలను అకారణంగా రిమాండ్‌కు పంపించారు’’ అని దుయ్యబట్టారు.
ఏసీపీ రామచంద్రరావు లాంటి వ్యక్తుల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. అంతేకాదు ‘‘ఎక్కడో ఎల్బీనగర్‌లో బస్సులు దగ్ధం అయితే సనత్‌నగర్‌లో ఉండే సేవాదళం నగర కన్వీనర్ వెల్లాల రామ్మోహన్‌కు ముడిపెట్టారు. లీటర్ పెట్రోల్‌తో వంద బస్సుల దగ ్ధం అంటూ నమ్మశక్యంగా లేని విధంగా కట్టుకథ అల్లారు. స్వయంగా సైబరాబాద్ కమిషనర్ రంగంలోకి దిగి రామ్మోహన్‌ను చిత్రహింసలకు గురిచేసి పొంతన లేని విధంగా వాంగ్మూలం చెప్పించుకొని ‘యూట్యూబ్’లో పెట్టించారు. రామ్మోహన్‌ను మియాపూర్ వద్ద అరెస్టు చేశామని ప్రెస్‌మీట్‌లో చెప్పి, రిమాండ్ రిపోర్టులో మాత్రం ఇంట్లో అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఇలా పోలీసులు పొంతనలేని విధంగా ప్రవర్తిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారు’’ అని బాజిరెడ్డి ధ్వజమెత్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసులు చేసిన అక్రమ అరెస్టు, వేధింపులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను అశ్రయిస్తామన్నారు. నిబంధనలు తుంగలో తొక్కిన పోలీసులను కోర్టులకు ఈడుస్తామని గోవర్ధన్ చెప్పారు.

Subscribe to:
Posts (Atom)