04 December 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మీ త్యాగాలు మర్చిపోం: వైఎస్‌ జగన్‌

Written By news on Wednesday, December 7, 2016 | 12/07/2016


మీ త్యాగాలు మర్చిపోం: వైఎస్‌ జగన్‌
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసాయిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో బుధవారం పోలవరం నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. పోలవరం కోసం భూములు ఇచ్చిన రైతులు, గిరిజనులకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి తీసుకున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్యాకేజీ ఇచ్చి స్థానికుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రతి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే కనీసం రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


8 లక్షల ఎకరాలపై గిరిజనులకు మహానేత వైఎస్సార్‌ హక్కులు కల్పిస్తే, చంద్రబాబు ఒక్క ఎకరా ఇవ్వకపోగా భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ‘పోలవరం కావాలి, నిర్వాసితులకు న్యాయం’ జరగాలని నినదించారు. నిర్వాసితులు త్యాగాలు మర్చిపోమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు 19 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీయిచ్చారు. ఈ  సందర్భంగా పలువురు నిర్వాసితులను జగన్‌ మాట్లాడించారు.



కిశోర్‌ సత్యనారాయణ
పోలవరం కారణంగా సర్వస్వం కోల్పోతున్నాం
సరైన జవాబుదారితనం లేకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
మాకు అన్నివిధాలా నష్టం చేశారు



చల్లన్న దొర(గిరిజనుడు)
మాకు 15 ఎకరాల పొలం ఉంది
ఒక్కొక్కరికి ఒక్కో మాదిరిగా ధరలు ఇచ్చి మా మధ్య గొడవలు పెడుతున్నారు
గతంలో తక్కువ ధరలు ఇచ్చారు, ఇప్పుడు ఎక్కువ ధరకు భూములు తీసుకుంటున్నారు
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మాకు పరిహారం ఇవ్వాలి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రేటు, తూర్పుగోదావరి జిల్లాలో మరో రేటుకు భూములు తీసుకుంటున్నారు
అందరికీ ఒకేవిధంగా న్యాయం చేయాలి

ఆరండల్‌ పేట వాసి
అందరి ఆమోదంతో పోలవరం కట్టండి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం
20 ఏళ్ల పాటు మా జీవనోపాధికి ప్రభుత్వం హామీయివ్వాలి
నిర్వాసితుల కుటుంబంలో చదువుకున్న వారికి పర్మినెంట్‌ ఉద్యోగం కల్పించాలి
పట్టిసీమ నిర్వాసితులకు ఇచ్చినట్టుగా పరిహారం కల్పించాలి
6 పంచాయతీలు ముంపు ఎదుర్కొంటున్నాయి
మిగిలిన 8 పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు

గొప్పలకు పోకండి, వసతులు కల్పించండి


‘గొప్పలకు పోకండి, వసతులు కల్పించండి’
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడేందుకు వచ్చిన వైఎస్సార్‌ సీసీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంపచోడవరంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌ హయాంలో పెంచిన మెస్‌ చార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని  జగన్‌ కు విద్యార్థులు తెలిపారు. పిల్లలకు కనీస సౌకర్యాలు లేకపోవడంపై జననేత అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్వచ్ఛ భారత్‌, బహిరంగ మల విసర్జన లేని వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు, వసతులు కల్పించాలని మండిపడ్డారు. 750 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు సిబ్బందే ఉన్నారని, ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు పెరగలేదని తెలుసుకుని ఆవేదన చెందారు. తమ ప్రభుత్వం వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీయిచ్చారు. ట్రైబల్‌ అడ్వైజరీ కమిటీ వేయకుండా రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కును సీఎం చంద్రబాబు హరిస్తున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి  ట్రైబల్‌ అడ్వైజరీ కమిటీ వేయడం లేదని జగన్‌ ఆరోపించారు.

కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడంతో శిశు మరణాలు సంభవించడం వల్ల వై యస్ జగన్ ఆందోళన


బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ
రంపచోడవరం: కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం శిశు మరణాలు సంభవించడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో వైఎస్‌ జగన్‌ బుధవారం నుంచి రెండురోజుల పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.

సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, పౌష్టికాహారం అందకపోవడం వల్ల ఒక్క రాజవొమ్మంగిలోనే వారం నుంచి రెండు నెలల వయస్సులోపు 15 మంది చిన్నారులు చనిపోయారని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజవొమ్మంగి మండలంలోపరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఇక్కడ నిరుపేదలు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1300 కోట్లు అవసరమైతే రూ. 780 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నదని తప్పుబట్టారు. తాను ఇటీవల సీఎం చంద్రబాబుకు లేఖ రాశాక ఆరోగ్యశ్రీకి రూ. 262 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు.

మూడు నెలల్లోనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తాం


మూడు నెలల్లోనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తాం
బూరుగుపూడి :
తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్దామని, ఒక్క రెండేళ్లు ఓపిక పట్టాలని వారికి తెలిపారు. 
 
ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయడం లేదంటూ కాంట్రాక్టు లెక్చరర్లు వైఎస్ జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయనను వాళ్లు బూరుగుపూడి గ్రామం వద్ద కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషిచేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ జగన్ వారికి హామీ ఇచ్చారు.
 
ఆ తర్వాత గుమ్మలూరు గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 

చంద్రబాబు దుబాయ్‌ టూర్‌ ఎందుకెళ్లారు?


‘చంద్రబాబు దుబాయ్‌ టూర్‌ ఎందుకెళ్లారు?’
హైదరాబాద్‌: ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు స్థాయి దిగజారి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడీఎస్‌ పథకం కింద రూ.10వేల కోట్లను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారని నాడు చంద్రబాబు, టీడీపీ నేతలు అన్నారని, ఇప్పుడేం జవాబు చెబుతారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఎదుటివారిపై బురదజల్లే కార్యక్రమాలు మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన ఐడీఎస్‌(స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం) అపహాస్యం అయిందని బొత్స అన్నారు.

మోసం, అబద్ధాలు, దగా చంద్రబాబు చేసే నిత్యకృత్యాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుకు ముందే ఫ్యూచర్‌ గ్రూప్‌ తో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలు అతి త్వరలోనే బయటకు వస్తాయని బొత్స చెప్పారు. చంద్రబాబు దుబాయ్‌ పర్యటన వెనుక రహస్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబాయ్‌ కు చెందిన బీఆర్‌ షెట్టి గ్రూపునకు అమరావతిలో భూకేటాయింపులు జరిగాయని బొత్స చెప్పారు. ఈ సెటిల్‌ మెంట్‌ చేసుకునేందుకే చంద్రబాబు దుబాయ్‌ వెళ్లాడని అన్నారు. ఆ రహస్యాలు కూడా త్వరలోనే బయటపెడతామని చెప్పారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
 

ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది


'ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది'
ప్రకాశం: మహోన్నత లక్ష్యం, మానవత దృక్పథంతో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1300 కోట్లు అవసరమైతే.. ప్రభుత్వం కేవలం రూ. 200 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటోందని ఆయన విమర్శించారు.

ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9న వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద చేపడుతున్న భారీ ధర్నాకు అభిమానులు, కార్యకర్తలతో పాటు ఆరోగ్యశ్రీ పథకం అందని బాధితులు హాజరుకావాలని బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

వైఎస్ జగన్ దృష్టికి దళితులపై దాడి ఘటన


వైఎస్ జగన్ దృష్టికి దళితులపై దాడి ఘటన
పోలీసు హింసపై విచారణకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం

 సాక్షి, హైదరాబాద్/తెనాలి:
గుంటూరు జిల్లా చుండూరు మండలం అంబేడ్కర్ నగరంలో పోలీసులు బెల్టులతో ఇష్టా రాజ్యంగా కొట్టిన ఘటనను బాధిత దళితులు మంగళవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది సోమవారం డిశ్చార్జి అరుున మేడికొండు రవి, కర్రి ప్రేమ్‌చంద్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ని కలసి పోలీసుల దాడితో అరుున గాయాలను  చూపించారు. తమకు నిలువ నీడ లేకుండా చేసేలా భయబ్రాంతుల్ని చేస్తున్నారని వాపోయారు.

ఈ దాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్.. దాడి దుర్మార్గమని అన్నారు. దీనిపై ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్లలో కేసు వేయాలని పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జునను ఆదేశించారు. అనంతరం బాధితులు నాగార్జున వెంట ఎస్సీ కమిషన్, మానవహక్కుల సంఘ కార్యాలయాలకు వెళ్లి, తమకు జరిగిన అన్యాయంపై విచారించి న్యాయం చేయాలని కోరుతూ అర్జీలిచ్చారు. గత నెల 30వ తేదీ నుంచి జరిగిన సంఘటనల వివరాలను నాగార్జున కమిషనుకు వివరించారు. దీనిపై స్పందించిన కమిషన్ గుంటూరు జిల్లా కలెక్టరు, ఎస్పీకి వెంటనే సమాచారం పంపుతూ ఆ కాపీని బాధితులకు అందజేసింది. బాధితుల ఆరోపణలపై విచారణ చేసి వెంటనే నివేదిక పంపాలని రూరల్ ఎస్పీ నారాయణ్‌నాయక్‌కు లేఖ పంపింది.

డెల్టా గుండెల్లో గునపం!

Written By news on Monday, December 5, 2016 | 12/05/2016


డెల్టా గుండెల్లో గునపం!
70వేల గ్యాస్ బావులు తవ్వేందుకు కార్పొరేట్ సంస్థల పథకం
 
- ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో కేజీ బేసిన్‌లో గ్యాస్, చమురు వెలికితీత
పశ్చిమగోదావరి, కృష్ణాలో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం    ఏడు లక్షల ఎకరాలు సాగుకు దూరం
ఇంకా లక్షలాది ఎకరాలపై తీవ్ర ప్రభావం    వాయు, జల, భూకాలుష్యం తీవ్రమయ్యే ప్రమాదం
జనజీవనంపై విషమ ప్రభావం అంటున్న పరిశోధనలు    అమెరికా, పలు దేశాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం
ఇక్కడ అదే ముద్దంటోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు    ప్రాజెక్టు చేపట్టే గ్రామాలకు కనీస సమాచారం లేదు
భీమవరంలో రేపు ప్రజాభిప్రాయ సేకరణ
 
 (ఆలమూరు రామ్‌గోపాల్‌రెడ్డి)
 దేశానికి ధాన్యాగారంగా భాసిల్లుతోన్న గోదావరి, కృష్ణా డెల్టాల్లో వరి సాగు కనుమరుగు కానుందా..? నలుగురికి అన్నం పెట్టిన రైతన్న ఇక ఉపాధి వెతుక్కుంటూ వలసపోవాల్సిన దుస్థితి దాపురించనున్నదా? అన్నపూర్ణగా విరాజిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం ప్రజలు అలమటించాల్సిన పరిస్థితులు పొంచి ఉన్నాయా..? పచ్చని పైర్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కనిపించే డెల్టాలు ఇక జన జీవనానికి పనికి రాకుండా పోతాయా..? అనే ప్రశ్నలకు అవుననే అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. గ్యాస్, చమురు ఉత్పత్తిలో కార్పొరేట్ సంస్థలకు సహజవనరులను దోచిపెడుతోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరో అడుగు ముందుకేసి సాంప్రదాయేతర ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ పద్ధతిలో షేల్ గ్యాస్, చమురును వెలికితీయడానికి ఆమోదముద్ర వేశాయి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ(ఆరుుల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్)ని ముందుపెట్టి పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి మండలం కాళ్ల, భీమవరం మండలం వీరవాసరం, కృష్ణా జిల్లాలో మండవల్లిలో తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాళ్ల, వీరవాసరం, మండవల్లి ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. ప్రాజెక్టు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చట్టాలు చెబుతున్నా ఆ గ్రామాలను వదిలేసి భీమవరంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు. మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా 17 బావుల ద్వారా హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌కి ఓఎన్‌జీసీ తెరతీసింది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి డెల్టాల్లో 70 వేల బావులను తవ్వి ద్వారా గ్యాస్, చమురు ఉత్పత్తి చేయడానికి కేంద్రం టెండర్లు పిలవనుంది. భూమిని, నీటిని అధికంగా వినియోగించుకునే ఈ విధానం వల్ల ఎన్నో ఉపద్రవాలు పొంచి ఉన్నారుు.  అనేక దేశాలు ఈ విధానానికి గుడ్‌బై చెప్పాయి.

 ఎక్కడా వద్దన్నది ఇక్కడ ముద్దు..
 హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో తవ్వకాల వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఈ విధానంపై అనేక దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఫ్రాన్‌‌స, బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే ఆ విధానాన్ని నిషేధించారు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం అంశాన్ని ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ఇరు పక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌ను నిషేధించారు. కానీ.. మన దేశంలో మాత్రం ఆ విధానాన్ని అమలుచేయడానికి శ్రీకారం చుట్టడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఎన్నో ఉపద్రవాలు.. భయానక వాస్తవాలు..
 హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
► ఒక్కో బావికి కనీసం పది ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ లెక్కన. 70 వేల బావులకు ఏడు లక్షల ఎకరాల భూమి అవసరం అవుతుంది. బావులకు సమాంతరంగా భూగర్భంలో సొరంగాలు తవ్వడం వల్ల లక్షలాది ఎకరాల భూమిపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల పచ్చని పంట పొలాలు మాయం కావడం ఖాయం. దేశానికి అన్నపూర్ణగా భాసిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం అలమటించాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌తోభూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కో బావికి సగటున ఆరు కోట్ల లీటర్ల నీళ్లు అవసరం అవుతారుు. 70 వేల బావులకు అవసరమైన నీటిని   పరిగణనలోకి తీసుకుంటే.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భం ఒట్టిపోవడం ఖాయం.
► అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ), నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అంచనాల ప్రకారం గ్యాస్, చమురు ఉత్పత్తి సమయంలో మిథేన్ లీకవుతూనే ఉంటుంది. సెకనుకు 0.6 గ్రాముల కార్బన్ లీకవుతుంది. దీని భూతాపాన్ని తీవ్రం చేస్తుంది. ఇది పంటల దిగుబడిని 80 శాతం మేర తగ్గించి వేస్తుంది.
► భూగర్భంలో అత్యధిక పీడనంతో అవశేష శిలలను ఛిద్రం చేయడం, భూగర్భ జలాలను లాగేయడం వల్ల భూకంపాలు వస్తాయని ఈపీఏ తేల్చింది. అమెరికాలోని టెక్సాస్‌లో రిక్టర్ స్కేలుపై 5.1, ఓక్లహోమాలో 3.0 తీవ్రత కలిగిన భూకంపాలు నమోదయ్యారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల అమెరికాలో 2013లో 109, 2014లో 585, 2015లో 907, 2016లో 611(అక్టోబరు వరకూ) భూకంపాలు నమోదవడం గమనార్హం.
► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురును వెలికితీయడం వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూకాలుష్యం పెరిగిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన అణుధార్మిక లక్షణాలున్న రాడాన్ వాయువు వెలువడుతుంది. గర్భస్థ శిశువులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతారుు.
► అమెరికాలో 2012లో బంబెర్గర్, ఆస్వాల్డ్‌లు నిర్వహించిన పరిశోధనల్లో ఒళ్లుగగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన బావులకు కిలోమీటరు వ్యాసార్థంలో ఆవులు, దూడలు మరణించినట్లు తేలింది. గర్భస్రావాలు అధికమైనట్లు వెల్లడైంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగినట్లు తేలింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిర్వహించిన రక్తపరీక్షల్లో అత్యంత ప్రమాదకరమైన ఆర్శనిక్, బెంజీన్ అవశేషం ఫినాల్‌లో ఉన్నట్లు వెల్లడైంది. ఇది జనజీవనాన్ని ఛిద్రం చేసింది. అమెరికాలో  ఉద్యమాలు రావడంతో టెక్సాస్, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని నిషేధించారు.

 కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే..
 కేజీ బేసిన్‌లో ఇప్పటికే డీ-6 గ్యాస్ క్షేత్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్న రిలయన్‌‌స సంస్థ అక్రమంగా గ్యాస్‌ను తరలించి రూ.12,136 కోట్ల మేర కొల్లగొట్టినట్లు జస్టిస్ ఏపీ షా కమిషన్ తేల్చింది. ఆ మేరకు రిలయన్‌‌స నుంచి ఆ నిధులను వసూలు చేయాలని షా కమిషన్ చేసిన సూచనను కేంద్రం బుట్టదాఖలు చేసింది. అమెరికాలో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురు ఉత్పత్తిలో ప్రధాన వాటా రిలయన్‌‌సదే. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం విధించడం.. రానున్న రోజుల్లో పూర్తి స్థారుులో నిషేధం విధించనున్న నేపథ్యంలో రిలయన్‌‌సకు భారీ దెబ్బ తగలనుంది. దాన్ని పూడ్చుకునేందుకే కేజీ బేసిన్‌పై కన్నేసిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

 ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ..?
 ప్రాజెక్టులు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాలని భూసేకరణ చట్టం-2013 స్పష్టీకరిస్తోంది. ఎన్జీటీ తీర్పులు ఇదే అంశాన్ని తేల్చిచెబుతున్నారుు. కానీ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను బుట్టదాఖలు చేస్తున్నారుు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల, వీరవాసరం, కృష్ణా జిల్లా మండవల్లిల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై మంగళవారం భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నియంత్రణ మండలి ఓ ప్రకటన జారీ చేసింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి.. దీనిపై అభిప్రాయ సేకరణ చేయాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తోండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 ప్రజల జీవితాలతో చెలగాటమా?
 హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో గ్యాస్, చము రు తవ్వకాలు జరపడమంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడటమే. దేశానికి అన్నం పెడుతోన్న కృష్ణా, గోదావరి డెల్టాలు నాశనమౌతారుు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భజలాలను తోడేస్తే సముద్రం నుంచి ఉప్పునీళ్లు ఎగదన్నడం ఖాయం. ప్రపంచంలో జర్మనీ, స్కాట్లాండ్, రుమేనియా, బల్గేరియా, ఫ్రాన్‌‌స వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని నిషేధించారు.
     - కలపాల బాబూరావు, పర్యావరణవేత్త

 విధ్వంసం చేయడం అభివృద్ధా?
 జన జీవనాన్ని విధ్వంసం చేయడం అభివృద్ధా?  మానవ జీవనాన్ని ప్రశ్నార్థకం చేసే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అవసరమా? కార్పొరేట్ శక్తులకు సహజ వనరులను దోచిపెట్టేందుకే ఈ విధానం అమలుకు పూనుకోవడం అన్యాయం.
 - రామకృష్ణంరాజు, కో-ఆర్డినేటర్, నేషనల్ అలయన్సఆఫ్‌పీపుల్స్ మూవ్‌మెంట్స్(ఎన్‌ఏపీఎం)
 
 కేజీ బేసిన్‌లో భారీ గ్యాస్, చమురు నిల్వలు..
 భారతదేశంలో పశ్చిమ, తూర్పు, అండమాన్ సముద్ర తీరాల్లో కలిపి 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నట్లు ఓఎన్‌జీసీ గుర్తించింది. దేశంలో గ్యాస్‌హెడ్రేట్ సామర్థ్యాలను అన్వేషించటానికి, ప్రయోగాత్మకంగా ఉత్పత్తి పరీక్షల కోసం 2014లో అమెరికాకు చెందిన యూఎన్‌జీఎస్, జపాన్‌కు చెందిన జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఓఎన్‌జీసీ, యూఎన్‌జీఎస్, జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో గోదావరి-కృష్ణా బేసిన్‌లో 982, డీ-3, డీ-6, డీ-9 బ్లాకుల్లో 4320 చదరపు మైళ్ల విస్తీర్ణంలో అత్యంత సాంద్రత గల ఇసుక రిజర్వాయర్లలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్, ఆరుుల్ నిక్షిప్తమైనట్లు తేలింది. దీని విలువ రూ.33 లక్షల కోట్లుగా ఓఎన్‌జీసీ అంచనా వేసింది.
 
 హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటే..
 భూ ఉపరితలానికి సుమారు నాలుగు వేల మీటర్ల లోతులో కఠినమైన అవశేష శిలావరణం కింద ఏర్పడిన ఇసుక రిజర్వాయర్లలో షేల్, గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఉండే గ్యాస్, చమురును బోరు బావులు తవ్వడం వంటి సాంప్రదాయ పద్ధతుల్లో వెలికితీయడం సాధ్యం కాదు.. ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ విధానంలో ఏం చేస్తారంటే.. కఠినమైన అవశేష శిలలు ఉండే వరకూ అంటే కనీసం నాలుగు వేల మీటర్ల లోతుకు భారీ బోరు బావి తవ్వుతారు. అవశేష శిల పొరకు సమాంతరంగా సొరంగం తవ్వుతారు. ఆ సొరంగంలో రంధ్రాలున్న గొట్టాలను అమర్చుతారు. ఈ గొట్టాల ద్వారా నీళ్లు, ఇసుక, 700 రకాల రసాయనాల మిశ్రమాన్ని 550 అట్మాస్పియర్లకుపైగా పీడనంతో పంపి.. అవశేష శిల పొరను ధ్వంసం చేస్తారు. తద్వారా శిల పొరల్లో ఏర్పడే చీలికల నుంచి గ్యాస్, చమురును వెలికితీస్తారు.

ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగి వచ్చిన సర్కార్


ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగి వచ్చిన సర్కార్
 ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అదనంగా రూ.262.35 కోట్లు విడుదల
 
 సాక్షి, అమరావతి/భీమవరం టౌన్:
 పేదలకు అండగా ఉన్న ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చొద్దంటూ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖ, ధర్నా చేస్తామంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు అదనంగా రూ.262.35 కోట్లు విడుదల చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదివారం ఉత్తర్వులిచ్చారు. జగన్ లేఖ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సెలవు రోజైనా బడ్జెట్ కేటారుుంపులకు అదనంగా రూ.262.35 కోట్లు కేటారుుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధుల వ్యయానికి త్రైమాసిక, ట్రెజరీ ఆంక్షలను మినహారుుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేనాటికి ఆరోగ్యశ్రీ బకారుులు రూ.395.69 కోట్లు. ఈ ఏడాది అవసరం రూ. 910.77 కోట్లు. అంటే మొత్తం రూ. 1306.46 కోట్లు. కానీ ఈ ఏడాది కేటారుుంచింది రూ.568.23 కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ. 738.23 కోట్లు ఆరోగ్యశ్రీ బకారుులకు అవసరం కాగా ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం హడావిడిగా రూ. 262.35 కోట్లు కేటారుుంచింది. అంటే ఇంకా రూ. 475.88 కోట్లు అవసరమన్నమాట.

వాటికి కూడా లెక్కలు చూపించాలనడం హాస్యాస్పదం

Written By news on Sunday, December 4, 2016 | 12/04/2016


బంగారంపై ఆంక్షలు అమానుషం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 
 
మాచర్ల : లక్షలాది మంది బాధతో పెడుతున్న కన్నీటి ప్రవాహంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుపోవడం ఖాయమని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు.  ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.  పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బంగారంపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమానుషమని తెలిపారు.  ఇప్పటికే నోట్ల రద్దు విషయంలో పేద, మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడ్డారన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు బ్యాంక్‌ల వద్ద క్యూలో నిలబడలేక ఇబ్బందులు పడుతుంటే టీడీపీ నాయకులు అంతా మంచి జరుగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

కష్ట పడి సంపాదించుకుని దాచుకున్న డబ్బులతో మహిళలు బంగారం కొనుక్కుంటే వాటికి కూడా లెక్కలు చూపించాలని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బడా బాబులను పట్టించుకోకుండా వారందరూ ముందుగానే సర్దుకునే విధంగా వ్యవహరించిన ప్రభుత్వం సామాన్య మహిళలు, పేదలను కన్నీరు పెట్టించే విధంగా వ్యవహరించడం హేయమని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి వారికి వైఎస్సార్‌ సీపీ అండగా నిలబడి వారి తరపున పోరాటం చేస్తామన్నారు.

7, 8 తేదీల్లో మన్యంలో జగన్ పర్యటన


7, 8 తేదీల్లో మన్యంలో జగన్ పర్యటన
- రాజానగరంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
- అనంతరం మన్యంలో బాధితులకు బాసట


 సాక్షి ప్రతినిధి, కాకినాడ:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శనివారం విలేకరులకు తెలిపారు. 7న హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని రాజానగరం నియోజకవర్గంలో దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం రంపచోడవరం వెళ్లి అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై బాధితులతో మాట్లాడతారని చెప్పారు.

ఆ రోజు రాత్రి మారేడుమిల్లిలో బసచేసి ఎనిమిదో తేదీ ఉదయం చింతూరు మీదుగా రేఖవానిపాలెం వెళ్లి అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. వారితో మాట్లాడాక జగన్ కాళ్లవాపు వ్యాధితో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను కలసి ఓదారుస్తారని కన్నబాబు చెప్పారు.

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరనున్న కాసు మహేశ్‌ రెడ్డి


వైఎస్‌ఆర్‌ సీపీలో చేరనున్న కాసు మహేశ్‌ రెడ్డి
హైదరాబాద్‌: గుంటూరు జిల్లాకు చెందిన యువ నాయకుడు కాసు మహేశ్‌ రెడ్డి త్వరలో వైఎస్ఆర్‌ సీపీలో చేరనున్నారు. వైఎస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం లోటస్‌ పాండ్‌ లో కాసు మహేశ్‌ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు.. వైఎస్‌ జగన్‌ ను కలిసి చర్చించారు. పార్టీలో చేరబోతున్నట్టు ఈ సందర్భంగా కాసు మహేశ్‌ రెడ్డి ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు అయిన మహేశ్‌ రెడ్డి ఈ నెల 16న గుంటూరు జిల్లా నరసారావుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు వైఎస్‌ జగన్‌ ను ఆహ్వానించి ఆయన సమక్షంలో పార్టీలో చేరుతారు. ఆయన చేరిక వల్ల గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్‌ సీపీ మరింత బలపడుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

Popular Posts

Topics :