19 October 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారు

Written By news on Saturday, October 25, 2014 | 10/25/2014

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి ప్రజలు మోసపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. విజయవాడలో శనివారం వైఎస్ఆర్ సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

పార్థసారథి మాట్లాడుతూ.. రుణ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ప్రజలను వంచించారని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ చేసిన మోసాన్ని బట్టబయలు చేసేందుకు వచ్చే నెల 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపడుతామని చెప్పారు. రేషన్ కార్డులు, పెన్షన్లలో కోత, రుణమాఫీ వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలను ప్రజల ఎదుటే ఎండగడతామని పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కమిటీలు, అనుబంధ సంఘాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని పార్థసారథి కోరారు.

రాజకీయ లబ్ధికోసమే వాళ్ల ప్రయత్నాలు

రాజకీయ లబ్ధికోసమే వాళ్ల ప్రయత్నాలువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలపై తాము చర్చించామని, ముఖ్యమంత్రిని.. గవర్నర్ ను కలిసి అన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని ఆయన అన్నారు.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ లబ్ధికోసమే ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు పడుతున్న కష్టాలు, వారి బాధలను పట్టించుకోవడం లేదని పొంగులేటి విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ మాత్రం ప్రజల పక్షాన ముందుండి పోరాడుతుందని ఆయన చెప్పారు. వచ్చేనెల 9వ తేదీన రంగారెడ్డి, 13న మహబూబ్ నగర్, 17న నల్లగొండలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతలు జనకప్రసాద్, కిష్టారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడి లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు.

నేడు వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం


నేడు వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం
Vijayawada: వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం శనివారం నగరంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి తెలిపారు. హోటల్ ఐలాపురంలో జరిగే ఈ సమావేశానికి త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు హాజరవుతారని వివరించారు. జిల్లాలోని తమ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, 16 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన నిర్మాణాత్మక కార్యక్రమాలు, పార్టీపరమైన ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.  

నేడు వైఎస్సార్‌సీపీ సమావేశం


నేడు వైఎస్సార్‌సీపీ సమావేశం
హైదరాబాద్ :  వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ తెలంగాణ నాయకుల సమావేశం జరగనుంది. వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్ష తన జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీల కన్వీనర్లు, 8 మంది ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొననున్నారు. ఈ నెల 16-20 తేదీల మధ్య జిల్లాల వారీగా నిర్వహించిన పార్టీ సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాలు, చర్చకు వచ్చిన అంశాలను సమీక్షించనున్నారు. 

బాబువి మాయ మాటలు


బాబువి మాయ మాటలు
 విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయ మాటలతో ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ తీరు ను నిరసిస్తూ.. ఈ నెల 5వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్న ట్టు తెలిపారు. శుక్రవారం కోలగట్ల నివాసంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు పీరుబండి జైహింద్‌కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చే రారు. ఆయనతో పాటు గంట్యాడ మండ లం రామవరం, మురపాక, సిరిపురం, కరకవలస గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాలు కూడా పార్టీలో చేరా యి. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడు తూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు నిర్వహిస్తున్నా.. పార్టీని పటిష్ట పరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యకర్తలను ప్రోత్సహించే విధం గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జైహింద్‌కుమార్ తన మాటకు గౌరవించి పార్టీలో చేరడం ద్వారా తనలో ఆత్మస్థైర్యం పుంజుకుందన్నారు.

 చంద్రబాబు మాయ మాటలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారన్నారు. టీడీపీ మాటలు నమ్మి రైతులు   రుణాలు తీర్చుకోలేక, ప్రభుత్వం తీర్చక పంట భీమాను కోల్పోయిన పరిస్థితి వచ్చిందన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ మాయమాటలతో కాలం వెల్లదీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ధాటికి జిల్లా ప్రజలు ఆర్థికం గా,మానసికంగా కుదేలైతే తక్షణ సాయం అందించడంలోనీచరాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పంటను సా  గు చేస్తున్న కౌలురైతులకు కాకుండా య జమానుల పేరిట నష్ట పరిహారం రాయ డం ఎంతవరకు సమంజమని ప్రశ్నించా రు. రుణమాఫీ, తుపాను బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలన్న డిమాండ్‌తో వచ్చేనెల 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తీరు ను ఎండగట్టాలని సూచించారు.

 పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమ త్స సాంబశివారజు మాట్లాడుతూ జైహిం ద్‌కుమార్ పార్టీలో చేరడం  శుభపరిణామమన్నారు. నిస్వార్థంగా పని చేసే స్వభావం కల  జైహింద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముంద డుగు వేయాలన్నారు. జైహింద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎ స్సార్ సీపీలో చేరిన తాను అందరితో కలి సికట్టుగా పని చేస్తానన్నారు.   ఈ కార్యక్రమంలో నెలిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఎస్. కోట నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నా యుడుబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఆదాడ మోహనరావు,  కెవి.సూర్యనారాయణరాజు,అంబళ్ల శ్రీరాములనాయుడు, చనుమళ్ల వెంకటరమణ, కాళ్ల గౌరీశంకర్, గొర్లె వెంకటరమణ, వర్రి నర్సింహమూర్తి, మామిడి అప్పల నాయుడు, ఎస్‌ఎం సన్యాసినాయుడు, ఎస్‌వీవీ రాజేష్, ఆశపు వేణు, శ్రీను, బంగారునాయుడు, పాల్గొన్నారు.
 

ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ

Written By news on Friday, October 24, 2014 | 10/24/2014


ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
హైదరాబాద్ :
శ్రీశైలం నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారని ఆయన తెలిపారు. రాయలసీమ తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో ఉందని, కనీసం తాగునీరు కూడా దొరకడం లేదని లేఖలో చెప్పారన్నారు.

చంద్రబాబుకు సొంత ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్, ప్రచార స్టంట్ తప్ప ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం పట్టడంలేదని, ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు కూడా బాధాకరంగా ఉందని వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వెంటనే ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని ఆ లేఖలో కోరారన్నారు. రాయలసీమ గొంతుకోయొద్దని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆళ్లగడ్డ ఎన్నిక ఏకగ్రీవం: ఆర్వో ప్రకటన


ఆళ్లగడ్డ ఎన్నిక ఏకగ్రీవం: ఆర్వో ప్రకటన
ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ ఎన్నిక లాంఛనప్రాయమైంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 17న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ నామినేషన్ దాఖలు చేశారు.  ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి.

రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు


రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు
తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజంపేట వైఎస్ ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ చేస్తామంటూ చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. రుణాలు మాఫీ కాకపోవటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది రైతులు డీఫాల్టర్స్ అయ్యారని ఆయన అన్నారు.

డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని, ఎన్నికల సమయంలో అన్ని రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పారని మిథున్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని అన్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రైతులు తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధం అవుతున్నారని మిథన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 5వ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ఆయన తెలిపారు.

వాకతిప్ప బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం


వాకతిప్ప బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకోనుంది. మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున సాయం చేయనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం  బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాలు అందేవిధంగా ఒత్తిడి తెస్తామని వైఎస్ జగన్ చెప్పారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శించారు.

జిల్లాలవారీగా వైఎస్ఆర్ సీపీ సమీక్షలు

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన బృందం జిల్లాల్లో పర్యటించనుంది.  పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి  ప్రసాదరాజు, విజయ సాయిరెడ్డిలతో వైఎస్ఆర్ సీపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 25న కృష్ణా, 26న గుంటూరు, 27న ప్రకాశం, 28న నెల్లూరు, 29న తిరుపతి, 30 వైఎస్ఆర్ జిల్లా, 31న అనంతపురం, నవంబర్ 1వ తేదీన కర్నూలు జిల్లాల్లో ఈ కమిటీ పర్యటించనుంది.

నవంబర్ 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలతో చర్చిస్తామని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి తెలిపారు. రుణమాఫీ, పెన్షన్లు, ప్రభుత్వ హామీలపై జిల్లా నేతలతో సమీక్షించనున్నట్లు చెప్పారు. మరోవైపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ధర్మాన ప్రసాదరావు, పార్ధసారధి, జ్యోతుల నెహ్రు పర్యటిస్తారని ఉమ్మారెడ్డి వెల్లడించారు.

ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం


ఆళ్లగడ్డ : అనుకున్నట్లుగానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ ఎన్నిక లాంఛనప్రాయమైంది. దీనిపై ఎన్నికల అధికారులు మరికొద్ది సేపట్లో అఖిల ప్రియ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. దాంతో  ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సాంకేతిక కారణాలతో ఉప ఎన్నికకు ఆలస్యంగా పచ్చజెండా ఊపింది. దీంతో ఈనెల 17న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ నామినేషన్ దాఖలు చేశారు.  నేటితో నామినేషన్ల గడువు ముగియటంతో బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

చంద్రబాబుది మొదటి నుంచి హత్యా రాజకీయమే


'చంద్రబాబుది మొదటి నుంచి హత్యా రాజకీయమే'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హత్యారాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలో భూమన మాట్లాడుతూ...  చంద్రబాబు ఓ పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులపై దాడులు, హత్యలు చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుది మొదటి నుంచి హత్య రాజకీయమేనని గుర్తు చేశారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో 400 మంది హత్యకు గురయ్యారని... కానీ ఒక్క ఎఫ్ ఐఆర్ కూడా నమోదు కాలేదని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన నిందితులకు సాక్షాత్తూ టీడీపీ కార్యాలయంలో వసతి కల్పించిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హత్యరాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. తమ పార్టీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తామంతా అండగా నిలుస్తామని భూమన కరుణాకర్ రెడ్డి  వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

దౌర్జన్యాలు ఆపండి

Written By news on Thursday, October 23, 2014 | 10/23/2014

దౌర్జన్యాలు ఆపండి
అనంతపురం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని దాడులు చేస్తారా.. దళితులని కూడా చూడకుండా దౌర్జన్యాలు చేస్తారా.. ఇక మీ దౌర్జన్యాలు ఆపండి.. లేదంటే తగిన గుణపాఠం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో ఈ నెల 18వ తేదీ దళితులపై జరిగిన దాడి విషయంపై గురువారం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు నాగార్జున, జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర నారాయణ, పార్టీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎగ్గుల శ్రీనివాసులు క లిశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

అనంతరం వారు మీడియాతో మట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులైన దళితులపై విచక్షణా రహితంగా దాడులకు దిగుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్‌ను తరిమికొడతామని చెప్పిన ముఖ్యమంత్రి దానిని మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మహిళలు వణికిపోతూ.. తమకు రక్షణ లేదంటూ.. బోరున విలపిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదురించడానికి దళితులకు అండగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్నారు. దాడిలో గాయపడిన దళిత కుటుంబాలకు నష్ట పరిహారం వచ్చే విధంగా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు.  
 
ఇది జేసీ బ్రదర్స్ పనే....

వీరాపురంలో జరిగిన ఘటనపై జేసి బ్రదర్స్ హస్తం ఉందని జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న వందలాది మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా దాడులు ఆపకపోతే తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు.
 
న్యాయం చేస్తాం : ఎస్పీ

వీరాపురంలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, వారికి పూర్తి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా రాజశేఖర్‌బాబు హామీ ఇచ్చారు. సంఘటన అనంతరం ఆ గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నేతలు దిలీప్‌రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం నేత బండి పరుశురాం, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పెన్నోబులేసు, పురుషోత్తమ్ ఉన్నారు.

వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు

Written By news on Wednesday, October 22, 2014 | 10/22/2014


తెలుగువారికి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

దీపావళి పండగ కోసం చేసే ఖర్చులో కొంత భాగం హుదూద్ తుపాన్ బాధితులకు అందించాలని జగన్ కోరారు.  తుపాన్ తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రకు సాయం చేయాలని వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రచారం ఆధారంగా బాబు పరిహారం!:వైఎస్ జగన్


కాకినాడ: ప్రచారం ఆధారంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం ప్రకటిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామాన్ని ఈరోజు ఆయన సందర్శించారు.  బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడినవారిని ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాధితులకు  పరిహారం చంద్రబాబు సరైన రీతిలో ప్రకటించడంలేదని అన్నారు. ప్రచారం ఎక్కువగా జరుగుతుందని అనుకుంటే అక్కడ  5 లక్షల రూపాయలు ప్రకటిస్తారని చెప్పారు. తక్కువ ప్రచారం ఉన్నచోట లక్ష లేక రెండు లక్షల రూపాయలే  ప్రకటిస్తారని అన్నారు.  ఈ గ్రామంలో పేలుడు ఘటనలో చనిపోయినవారందరూ కూలీలేనని చెప్పారు. పరిహారం అందరికీ సమానంగా ఉండాలని జగన్ డిమాండ్ చేశారు.
**

వాకతిప్ప పేలుడు బాధితులకు నేడు జగన్ పరామర్శ


వాకతిప్ప పేలుడు బాధితులకు నేడు జగన్ పరామర్శ
  కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాకతిప్ప విస్ఫోట బాధితులను పరామర్శించనున్నారు. గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర లోని తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పేలుడు దుర్ఘటనను తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. ముందు అనుకున్న దాని ప్రకారం ఆయన మరో రెండురోజులు శ్రీకాకుళం జిల్లాలోని తుపాను బాధిత గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే పేలుడు బాధితులను సత్వరం ఊరడించాలన్న సంకల్పంతో మంగళవారం రాత్రే శ్రీకాకుళం నుంచి నేరుగా కాకినాడ చేరుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంట బస చేశారు. పలువురు పార్టీ నేతలు ఆయనను కలుసుకుని పేలుడు వివరాలను తెలిపారు.
 

ప్రజలను మోసం చేయాలనే తప్ప..

Written By news on Tuesday, October 21, 2014 | 10/21/2014

'నారా'సురుడా లేక నరకా సురుడా: అంబటి
గుంటూరు: ప్రజలను మోసం చేయాలనే తప్ప.. సేవ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రైతు సాధికారిక సంస్థకు కేటాయించిన 5 వేల కోట్లు ఏమూలకు సరిపోతాయని అంబటి ప్రశ్నించారు. 
 
87 వేల కోట్ల అప్పులుంటే అందులో నాలుగో వంతు వడ్డీ కూడా కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు అసమర్ధ పాలన కారణంగా రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోయారని, స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేస్తూ డ్వాక్రా రుణాల మాఫీని కూడా చేయడం లేదని అంబటి ఆరోపించారు. 
 
నారావారు నారాసురుడా లేక నరకా సురుడా అని అని ఎద్దేవా చేశారు. కడుపు మండిన రైతులు, స్త్రీశక్తిని ఎదుర్కొక తప్పదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతున్నాయని అంబటి మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని స్థలాలు ఆక్రమించుకుంటుంటే, ఎమ్మెల్యే బొడ్డేడ ప్రసాద్ నకిలీ వ్యక్తులతో ఇంటర్ పరీక్షలు రాయిస్తున్న అంశాలను అంబటి మీడియాకు వివరించారు. టీడీపీ పాలనను, ప్రజా ప్రతినిధుల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు. 

సాయం అందేవిధంగా ప్రభుత్వంపై వత్తిడి


చలించిపోయిన వైఎస్ జగన్ఓ వృద్ధురాలి కష్టాలు వింటూ చలించిపోయిన వైఎస్ జగన్
హుదూద్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బాధితుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో  8 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని మారుమూల గ్రామాలలోకి కూడా వెళ్లి  ప్రజలు పడుతున్న బాధలను ఆయన దగ్గరగా చూస్తున్నారు. భారీగా నష్టపోయిన మత్స్యకారులను, పేదలను, వృద్ధులను అందరినీ పరామర్శిస్తున్నారు. దెబ్బతిన్న పడవలను, వలలను చూశారు. నీట మునిగిన పొలాలను చూశారు. కూలిపోయిన ఇళ్లను చూశారు. తుపాను వల్ల సర్వం కోల్పోయి ప్రభుత్వ సహాయం అందక బాధితులు పడుతున్న కష్టాలను చూసి జగన్ చలించిపోయారు. అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  సాయం అందేవిధంగా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని వారికి భరోసా ఇచ్చారు.

 ఫైబర్‌ బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు 2 లక్షల 50వేల రూపాయలు, వలలు కోల్పోయిన వారికి 50వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. కొబ్బరితోటలు కోల్పోయిన వారికి చెట్టుకు 5 వేలు పరిహారం డిమాండ్‌ చేశారు. జీడిమామిడి తోటలకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని  కోరారు.  కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.   దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి బాధితుని ఇంటికి తక్షణ సాయంగా 5 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని  కోరారు.

తుపాను బాధితులకు  25 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.  నిర్వాసితులకు అందించే సాయం ఇదేనా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  తుపాను వల్ల నష్టపోయిన రైతులు,  మత్స్యకారులకు వచ్చే నెల 5వ తేదీలోగా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులు,  డ్వాక్రా మహిళలు  ఈ ముట్టడిలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన


వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్  రెడ్డి ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని సందర్శించారు. ఆయన  ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఉత్తరాంధ్ర తుపాను బాధిత ప్రాంతాల్లో 8 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  సోమవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని బాధితులను ఆయన పరామర్శించారు.
**

తుపాను నష్టం లెక్కలు అస్తవ్యస్తం: వైఎస్ జగన్


తుపాను నష్టం లెక్కలు అస్తవ్యస్తం: వైఎస్ జగన్
శ్రీకాకుళం :
తుపాను నష్టం లెక్కలు సరిగా వేయలేదని బాధితులు చెబుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన శ్రీకాకుళం జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. అసలు తమకు తుపాను సాయం అందలేదని బాధితులు చెబుతున్నారని, ప్రభుత్వ ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం చివరకు బియ్యం కూడా సరిగా పంపిణీ చేయలేదని మండిపడ్డారు.

రుణాలు మాఫీ చేస్తారన్న ఆశతో రైతులెవరూ రుణాలు కట్టలేదని, తీరా ఇప్పుడు మాత్రం రుణాలు మాఫీ కాక, అటు పంటబీమా కూడా దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, కరెంటు లేకపోవడంతో తాగునీటి పథకాలు పనిచేయడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పారని, వాస్తవానికి లక్ష కోట్ల వరకు అప్పులు మాఫీ చేయాల్సి ఉంటే ఇప్పుడు కేవలం 5వేల కోట్లే ఇస్తామంటున్నారని ఆయన విమర్శించారు. కేవలం రుణాల వడ్డీల కోసమే ఏడాదికి 14 వేల కోట్లు అవసరం అవుతుందని ఆయన గుర్తు చేశారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించి 18 మంది మరణించిన సంఘటన పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన బుధవారం వాకతిప్ప వెళ్లనున్నారు.

నేటి పర్యటన వివరాలు


నేటి పర్యటన వివరాలు
  శ్రీకాకుళం: జిల్లాలో తుపాను బాధిత ప్రాంతాల్లో జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పర్యటించి, బాధితులను పరామర్శిస్తారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ప్రోగ్రామ్స్) తలశిల రఘురాం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం పర్యటన బాగా ఆలస్యంగా కావడంతో సోమవారం రాత్రి పొద్దుపోయాక శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటిస్తారు.

 పర్యటన షెడ్యూల్:
 ఉదయం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి జగన్ బయలుదేరి అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకుంటారు.
 అక్కడి నుంచి పెద్దగ ణగళ్లవానిపేట చేరుకొని తుపాను బాధితులను పరామర్శిస్తారు.
 తరువాత శ్రీకాకుళం పట్టణంలోని కృష్ణాపార్కు వద్దనున్న తురాయిచెట్టు వీధిలోని వరదముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు.
 మధ్యాహ్నం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అల్లినగరం జంక్షన్, బుడగట్లపాలెంతో పాటు, రణస్థలం మండలంలోని జీరుపాలెం, కోటపాలెం, పాతర్లపల్లి ప్రాంతాల్లోని తుపాను బాధితులను పరామర్శిస్తారు. అనంతరం జాతీయ రహదారి సమీపంలోని కోష్ట చేరుకుంటారు. అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరుతారని పార్టీ నాయకులు తెలిపారు.

వాకతిప్ప పేలుడు సంఘటనపై జగన్ దిగ్భ్రాంతి


వాకతిప్ప పేలుడు సంఘటనపై జగన్ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందిన సంఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు.  

న్యాయంకోసం పోరాటం


న్యాయంకోసం పోరాటం
రుణాల మాఫీ, పింఛన్ల సక్రమ పంపిణీ, తుపాను బాధితులను ఆదుకోవాలి 5న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు: జగన్
 
పదవి కోసం మాయమాటలు చెప్పి జనాన్ని గాలికొదిలేశారు
చంద్రబాబు పుణ్యమా అని రైతులు  పంట బీమా కోల్పోయారు
ఇప్పుడు తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులు రుణాలెలా తీరుస్తారు?
తూర్పుగోదావరి, ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటికి నష్టం జరిగింది
పుట్టు పడవలకు కూడా పరిహారం చెల్లించాలి
తుపాను బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటన


‘‘అవిచేస్తాం, ఇవిచేస్తాం అని ఎన్నికల ప్పుడు హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఐదేళ్ళవరకు మీతో పనిలేదు కదా అని గాలికొదిలేసిన వాళ్ళను నిలదీద్దాం. ఏదో ముష్టి వేసినట్లు పరిహారం ఇస్తామంటే ఊరుకోం. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్ల కోసం, రైతు రుణమాఫీ కోసం, హుదుద్ తుఫానులో తీవ్రంగా నష్టపోయిన మీ అందరికీ తక్షణ సహాయం, పునరావాసంకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీస్‌లను నవంబర్ 5న ముట్టడిద్దాం. భారీ ధర్నా చేద్దాం’’అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో తుపానుబాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వై.ఎస్.జగన్ ఏడో రోజు సోమవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని బాధితులను పరామర్శించారు. ఉదయం 9.30 గంటలకు విజయనగరం నుంచి నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం దిబ్బలపాలెం, పూసపాటిరేగ మండలం  తిప్పలవలస గ్రామాల్లో పర్యటనకు  బయలుదేరిన జగన్‌మోహనరెడ్డికి నాతవలస జంక్షన్ మీదుగా అమటాం రావివలస, దల్లిపేట, దిబ్బలపాలెం, తురిట్లిపాలెం, చేపకంచేరు, రెడ్డికంచేరు, తోటపల్లి ఎస్సీ కాలనీ, ముక్కాం, నడిపల్లి, కొప్పెర్ల, తిప్పలవలసలో పర్యటించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం, చీపురుపల్లి, సుభద్రాపురం జంక్షన్ మీదుగా  శ్రీకాకుళం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా దిబ్బలపాలెంలో  ప్రసంగిస్తూ వై.ఎస్. జగన్ ఇలా మాట్లాడారు...

► దారిపొడవునా చాలా చోట్ల ఆగుతూ వచ్చాను. విరిగిన చెట్లు, కూలిన ఇళ్లు కనపడుతున్నాయి. ప్రభుత్వాధికారులు ఎవరైనా వచ్చా రా..? ఏమైనా సాయం చేశారా..? నష్టపోయిన వాటి వివరాలు నమోదు చేసుకున్నారా..? అని నన్ను కలసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలను, సోదరుడ్ని, తాతను, అవ్వను అడిగా. ఒక్క గవర్నమెంట్ అధికారి మా వద్దకు రాలేదని చెప్పారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని... ఒక్క దమ్మిడీ అయినా సాయం చేశారా? ఎన్ని చెట్లు, ఎన్ని ఇళ్లు కూలిపోయాయని రాసుకున్నారా? (అందరూ లేదని చెప్పారు).
► ప్రతి నెలా కిలో రూపాయి బియ్యం 20 కేజీ లు తీసుకుంటాం. చంద్రబాబు ఈ నెల తుఫాను బాధితులకు ఉచితంగా 25 కిలోల బియ్యం ఇస్తాడంట. ఆ 25 కేజీలైనా మీ అందరికీ అందుతున్నాయా అని అడుగుతున్నాను. (అందడంలేదని జనం అన్నారు). వాళ్లకు నచ్చినట్లు ఇష్టారాజ్యం గా ఇస్తున్నారు.ముష్టి వేసినట్లు 25కేజీల బియ్యం ఇస్తున్నారు. గుండెలమీద చెయ్యివేసుకుని మేం ఇంతచేశాం అని చెప్పుకోలేని పరిస్థితి.

► చెరకు రైతుల దగ్గరకు వెళ్లినప్పుడు అడిగా క్రాప్ ఇన్యూరెన్స్ ఉందా అని. ‘చంద్రబాబు రుణాలు కట్టొద్దన్నాడు, మేం కట్టలేదు. రుణాలు కట్టని కారణంగా క్రా్‌ప్‌ఇన్యూరెన్స్ లేద’ని వాళ్లు చెబుతున్నారు. బాబు పుణ్యమా అని రైతులకు రుణమాఫీ లేదు, రీషెడ్యూల్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. బ్యాంకుల్లో పంట రుణాలపై 14 శాతం వడ్డీ వేస్తున్నారు, కొత్త రుణాలు ఇవ్వటంలేదు. దీనితో రైతులు వడ్డీ వ్యాపారుల  నుండి రూ.2, రూ.3ల వడ్డీకి రుణాలు తెచ్చి పంటలు వేసుకున్నారు. తుఫానుతో ఆ పంటలు నష్టపోయారు.  ప్రభుత్వానికి ఇవేమీ పట్టడంలేదు.

 తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర మూడు జిల్లా ల్లో తుఫానువల్ల ప్రతి ఇంటికి నష్టం జరిగిం ది.తక్షణ సహాయం కింద రూ.5వేలు ఇవ్వాలి. అప్పుడైనా ప్రజలు కనీసం బట్టలు కొనుక్కుం టారు. ఆ డబ్బులతో కూరగాయలు తెచ్చుకుం టారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు ఇవ్వడంతోపాటు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో  కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.  ప్రతి కొబ్బరి చెట్టుకి కనీసం రూ.5వేలు, జీడి చెట్లకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలి. మత్స్యకారుల ఫైబర్ బోట్లకు రూ.2.5లక్షలు, వలలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి. సోనా బోట్లకు రూ.25 లక్షలు ఇచ్చి మత్స్యకారులను ఆదుకోవాలి. పుట్టు పడవలకు కూడా పరిహారం ఇవ్వాలి. ధర్నాలో ఇక్కడి డిమాండ్లను చేరుద్దాం.
 
మీకు ఇస్తున్నది రూ. 50 సాయమే
 
భోగాపురం: తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ చేస్తున్న పర్యటన ఆరోరోజు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం తీర ప్రాంత గ్రామంలో తుపాను కారణంగా దెబ్బతిన్న కుట్టు పడవలను, ఫైబర్ బోట్లను పరిశీలిస్తూ మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు దానయ్యతో ఆయన సంభాషణ ఇలా సాగింది.

జగన్: ఏమయ్యా..! తుపాను ధాటికి సముద్రం ఒడ్డున్న నివసిస్తున్న మీ ప్రాంతీయులు తీవ్రంగా నష్టపోయారు కదా... ప్రభుత్వం ఏం సాయం చేసింది?

దానయ్య: బాబూ .. తుపాను దెబ్బకు మా ఊరంతా వణికిపోయింది. ఊరిలోకి సముద్రం నీరు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి 50 కిలోల బియ్యం మినహా ఏమీ అందలేదు. అదీ కూడా 300 కార్డుదారులకు ఇవ్వలేదు.
 
జగన్: ప్రభుత్వం 50 కిలోల బియ్యం ఇస్తుందని చెప్పుకుంటోంది వాటి ఖరీదు రూ.50 లే. రేషన్ ద్వారా కిలో ఒక్కంటికి రూ.1 చొప్పున అందించే బియ్యాన్ని ఈనెల ఉచితంగా ఇస్తుంది. అంటే మీకిచ్చేది రూ.50 సాయమే. సరే ఎన్ని బోట్లు పాడైపోయాయి..?
 
దానయ్య: 15 కుట్టు (చెక్కతో చేసిన) పడవులు పూర్తిగా పాడయ్యాయి. ఫైబర్ బోట్లు 36 ఉంటే అందులో ఆరు పూర్తిగా పోనాయి.

జగన్
: నష్టం అంచనాలు వేశారా..?

దానయ్య: నష్ట పరిహారం కోసం మేమెంతో ఆశగా ఎదురుచూస్తుంటే సర్వే అధికారులు వచ్చి వారికి నచ్చినోళ్లకే రాసుకువెళ్తున్నారు. కుట్టు పడవ తయారు చేయాలంటే రూ 30. వేలు ఖర్చువుతుంది. దానిలో వేటకు వెళ్లేందుకు ఐదు రకాల వలలు వినియోగించాలంటే రూ. 40 వేల వరకు ఉంటుంది. అవన్నీ పాడైపోయాయి. ఇందులో రాజకీయం చేస్తున్నారన్నా.. ఫైబర్ బోట్లు తయారు చేయాలంటే రూ 3. 50 లక్షల వరకు ఖర్చువుతుంది. పది రోజులు సాయం అందలేదు.

జగన్: ఊరిలో మొత్తం ఎన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి..? అధికారులు నమోదు చేశారా..?
 
చినరాములు: పది రోజులు క్రితం వచ్చిన భారీ ఈదురుగాలులు, వర్షం,  ఇళ్లలోకి వచ్చిన సముద్రపు నీరుతో 450 పూరిళ్లు పూర్తి పాడైపోయాయి. కొన్ని మేడ ఇళ్లు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి.  కొన్నింటినే రాశారు.
 
జగన్: మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. చేయగలిగింది చేద్దాం. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం.

వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకే కార్యకర్తలపై దాడులు

Written By news on Monday, October 20, 2014 | 10/20/2014

అనంతపురం: టీడీపీ నేతలు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్ వివేకానంద రెడ్డి,  భూమన కరుణాకర్ రెడ్డిలు ఆరోపించారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు రక్తంతో తడిశాయని అన్నారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి,  ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల ప్రోద్భలంతోనే తాడిపత్రిలో దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేతలు చెప్పారు. టీడీపీ నేతలు వీరాపురం దళితులపై దాడి చేయడం అమానుషమని అన్నారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జేసీ సోదరులు ప్రతిగ్రామంలో చిచ్చుపెడుతున్నారని వైఎస్ వివేకానంద రెడ్డి,  భూమన కరుణాకర్ రెడ్డిలు విమర్శించారు.

నవంబర్ 5న నిరసన ప్రదర్శనలు:వైఎస్ జగన్ పిలుపు

నవంబర్ 5న నిరసన ప్రదర్శనలు:వైఎస్ జగన్ పిలుపు
విజయనగరం: ప్రభుత్వం చేసే మోసాలకు, వంచనకు నిరసన తెలుపుతూ నవంబరు 5న అన్ని మండల కార్యాలయాల వద్ద ప్రదర్శనలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళలు ముందుకు వచ్చి నిరసనలు తెలపాలన్నారు.

రైతుల రుణాలు మాఫీ చేయలేదు, రీషెడ్యూల్ కూడా చేయలేదన్నారు.  క్రాప్ ఇన్యూరెన్స్ కూడా లేదని చెప్పారు. రైతులు తీసుకున్న రుణాలపై 14 శాతం వడ్డీ పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితులలో రైతులు రుణాలు ఎలా చెల్లిస్తారని జగన్ ప్రశ్నించారు.

తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణాసంచా గోడౌన్ లో జరిగిన పేలుడు దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

 తిప్పవలసలో బాధితులకు పరామర్శ
పూసపాటిరేగ మండలం తిప్పవలసలో తుపాను బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. మత్య్సకారులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.

తుపాను బాధితులకు కేంద్ర సాయం కోరాం:సుబ్బారెడ్డి


తుపాను బాధితులకు కేంద్ర సాయం కోరాం:సుబ్బారెడ్డి
ఢిల్లీ:తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్ర సాయాన్ని కోరినట్లు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాను బాధితులకు కేంద్ర సాయాన్ని కోరినట్లు తెలిపారు. పెను తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
 
ప్రకాశం జిల్లాలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కోరినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరుపున జైట్లీ ఆరోగ్యపరిస్థితిని సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు.

విజయనగరంలో వైఎస్ జగన్ పర్యటన

హదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం భోగాపురం మండలం ఏ రావివలస నుంచి తన పర్యటనను ప్రారంభించారు.
 
తుఫాను బాధితులు, రైతులను పరామర్శించిన ఆయన అనంతరం  దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్ పూసపాటిరేగ మండలంలోని కోనాడ, తిప్పలవలసలో పర్యటించి మత్స్యకారులు, రూతులను ఓదార్చి వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు.

రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలా?


రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలా?
బాబు ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: అనేక రకాల ఆంక్షలతో ఇప్పటికే రైతు రుణమాఫీ, ఫించను పథకాల్లో భారీగా కోతలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అదే తీరున విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె. పార్థసారథి ఆదివారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిబంధన లు చూస్తే రాష్ట్ర విద్యార్ధులకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. స్థానికతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  
 
బాబుదంతా.. ప్రచార ఆర్భాటమే
హుదూద్ తుపాను తరువాత ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే.. చంద్రబాబు మాత్రం పూర్తి ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని పార్థసారథి ఆరోపించారు. తమ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత పార్టీ నేతలందరం చర్చించుకొని తుపాను సాయంపై ప్రధానిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా త్వరలో తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు.

కష్టాలు వినేందుకు...


కష్టాలు వినేందుకు...
శ్రీకాకుళం అర్బన్:హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు, వారి కష్టాలు తెలుసుకుని ప్రభుత్వం నుంచి సాయం అందేలా పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో సోమవారం నుంచి పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారమే జిల్లాకు వస్తారని నాయకులు భావించారు. అయితే, విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో బాధితులను పరామర్శించడంలో ఆలస్యం జరిగింది.

 జిల్లాలోని నాగావళి, వంశధార నదుల వరదలతో నాశనమైన పంట పొలాలను పరిశీలిస్తారు. బాధిత రైతులను ఓదార్చుతారని ఆమె తెలిపారు. పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్‌తో పాటు జిల్లాలోని పది నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, రాష్ట్ర నాయకులు ఆదివారం సమావేశమై జగన్ పర్యటనపై చర్చించారు. పర్యటన వివరాలను వెల్లడించారు.

 పర్యటన వివరాలివి...
 పర్యటన వివరాలివి...
  సోమవారం మధ్యాహ్నం  నాలుగు గంటలకు విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.
  ఐదు గంటలకు లావేరు మండలం సుభధ్రాపురం జంక్షన్ చేరుకుంటారు.
  ఆరు గంటలకు శ్రీకాకుళం పట్టణానికి చేరుకొని నాగావళి వరద ముంపునకు గురైన పట్టణంలోని తురాయిచెట్టువీధికి చేరుకుంటారు. అక్కడి బాధితులను పరామర్శిస్తారు.
  సోమవారం రాత్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు.
  మంగళవారం ఉదయం 8 గంటలకు అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుంటారు.
  అక్కడి నుంచి తొమ్మిది గంటలకు శ్రీకాకుళం మండలంలోని పెదగణగళ్లవానిపేట చేరుకొని బాధితులను పరామర్శిస్తారు.

  మధ్యాహ్నం రెండు గంటలకు ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో కింతలి, కనిమెట్ట, సింగూరు కూడలి, బొడ్డేపల్లి, మొదలవలస, బెలమాం, తాడివలస, లచ్చయ్యపేట, రామరాయపురం, వాసుదేవపట్నం వయా సంతకవిటి మండలంలోని  సిరిపురం గ్రామాల్లో పర్యటించి అక్కడి బాధితులను పరామర్శిస్తారు.
  అక్కడి నుంచి శ్రీకాకుళం చేరుకొని మంగళవారం రాత్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
  బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం మండలం ఒప్పంగి గ్రామం వెళ్లి బాధితులను పరామర్శిస్తారు.

  అక్కడి నుంచి 10 గంటలకు గార మండలం తూలుగు జంక్షన్‌కు చేరుకుని బాధితులను పరామర్శిస్తారు.
  ఒంటి గంటకు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని జీరుపాలెం, వెంకటాపురం, బుడగట్లపాలెం గ్రామాల్లో పర్యటించి తుపాను బాధితులను పరామర్శించనున్నారు.
  అనంతరం మూడు గంటలకు విశాఖపట్నం బయలుదేరుతారు.

ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలి: వైఎస్ జగన్

Written By news on Sunday, October 19, 2014 | 10/19/2014


విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శిస్తున్నారు. విజయనగరం జిల్లా కోరుకోండలో దెబ్బతిన్ని మామాడి, టేకు, చెరుకు పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరిగినా ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్ జగన్ విమర్శించారు.

ఈ నెల పేదలకు ఉచితంగా ఇస్తామన్న బియ్యాన్ని ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు ప్రతి కుటుంబానికి తక్షణం 5 వేల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం, పూర్తిగా ధ్వంసమైన వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు రీ షెడ్యూల్ కూడా చేయలేదని, దీంతో పంటలు కోల్పోయిన రైతులకు బీమా వచ్చే అవకాశం లేదని జగన్ ఆరోపించారు.

నేడు, రేపు జగన్ పర్యటన


నేడు, రేపు జిల్లాలో జగన్ పర్యటన
 విజయనగరం: జిల్లాలో హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  రెండు రోజులు పర్యటించనున్నారు. తీవ్రంగా నష్టం వాటిల్లిన పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో  పర్యటించి బాధితుల్ని పరామర్శిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 12, ఒంటి గంట మధ్య జిల్లాకు రానున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి   శనివారం రాత్రి వెల్లడించారు.

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టూర్ షెడ్యూల్...
 తొలుత విజయనగరం మండలం కోరుకొండలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి గంట్యాడ మండలం పెదవేమలి, సిరిపురం మీదుగా బోనంగి చేరుకుంటారు. అక్కడ అరటి, వరి రైతుల నష్టాలను తెలుసుకుంటారు. రాత్రి విజయనగరంలో బస చేస్తారు. సోమవారం ఉదయం భోగాపురం మండలం దిబ్బలపాలెంలో పర్యటించి,  అక్కడి కొబ్బరి రైతులను పరామర్శించాక పూసపాటిరేగ మండలం తిప్పలవలస వెళతారు. అక్కడ మత్స్యకారులను పరామర్శించాక పూసపాటిరేగ చేరుకుంటారు. అనంతరం చీపురుపల్లి మండలంలో పర్యటిస్తారు.   

చక్కెర కర్మాగారాల ప్రైవేటీకరణకు కుట్ర


చక్కెర కర్మాగారాల ప్రైవేటీకరణకు కుట్ర
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది తమవారికి కట్టబెట్టే కుట్రలు చేస్తోంది  ధ్వజమెత్తిన వైఎస్ జగన్
 
విశాఖపట్నం: సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేసి తమవారికి కట్టబెట్టాలని కుట్రలు పన్నుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చక్కెర రైతుల తరఫున పోరాడతామని, ఫ్యాక్టరీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. హుదూద్ తుపాను బాధిత విశాఖపట్నం జిల్లాలో ఐదో రోజు పర్యటనలో భాగంగా జగన్ శనివారం అనకాపల్లి, చోడవరంలతోపాటు విశాఖ ఏజెన్సీలోని పాడేరు, హుకుంపేట, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తమ వద్దకు వచ్చిన జగన్‌ను చూసి చెరకు రైతులు, గిరిజనులు ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని వాపోయారు. తమకు సాయం చేయాలని, తమ కోసం పోరాడాలని కోరారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో బయలుదేరిన ఆయన అనకాపల్లిలోని ఆవఖం డం వద్ద ఆగి వరద ముంపులో మునిగిన చెరకు తోటలను పరిశీలించారు. కూలిన గుడిసెలను చూశారు. అక్కడినుంచి అనకాపల్లిలోని చవితి నివీధి, విజయరామరాజుపేట జంక్షన్, తుమ్మపాల, వెంకుపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కూలిన ఇళ్లు, గుడిసెలను పరిశీలించారు. చెరకు రైతులు, మహిళలతో మాట్లాడారు. ఏజెన్సీలోని పాడేరులోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మోదుపల్లిలో తుపానుకు దెబ్బతిన్న కాఫీ తోటలను పరిశీలించారు. యరడపల్లిలో బురదలో నడుస్తూ కూలిన ఇళ్లను పరిశీలించారు. గిరిజనులతో మాట్లాడారు.

అరకులోయ రూరల్ మండలంలో కొండచరియ విరిగిపడి దుర్మరణం పాలైన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరకులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి వరకు అలుపు లేకుండా ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా తమ్ముపాల, మోదుపల్లి వద్ద ఆయన చెరకు, కాఫీ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నారంటే....

 సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది. అనకాపల్లి షుగర్స్ రైతులకు రూ.6కోట్లు ఇవ్వాల్సి ఉండగా... కేవలం రూ.2కోట్లే ఇచ్చింది. మిగిలిన రూ.4కోట్లు ఇవ్వకపోగా... ఫ్యాక్టరీ రూ.23కోట్లు నష్టాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. ఆ సాకుతో ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్నది ప్రభుత్వ దురుద్దేశం. గతంలో కూడా ఇలాగే సహకారరంగంలోని సుగర్ ఫ్యాక్టరీలను తమవారికి తక్కువ ధరకు కట్టబెట్టేశారు. ఈసారి అదే చేద్దామనుకుంటున్నారు.

► రైతులతో ప్రభుత్వం చెలగాటమాడాలని చూస్తోంది. సర్కారు ఆటలు సాగనివ్వం. సుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం. చెరకు రైతులకు హెక్టారుకు రూ.10వేలు పరిహారం ఇస్తామమని ప్రభుత్వం చెబుతోంది. అది ఏమూలకు సరిపోతుంది? ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలి. కొబ్బరి చెట్టుకు రూ.5వేలు ఇవ్వాలి.

 కాఫీ రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి. కాఫీ తోటల్లో కూలిపోయిన సిల్వర్‌వోక్ చెట్లు మరో 15ఏళ్లకుగానీ పెరగవు.  ఆ చెట్ల నీడలోనే కాఫీ తోటలు పెరుగుతాయి. అవి లేకపోతే కాఫీ తోటలు పెరగవని ప్రభుత్వానికి తెలీదా? ప్రభుత్వం హెక్టారుకు రూ.15వేలు ఇస్తామని చెబుతోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. గిరిజనులు ఏజెన్సీలో తప్ప బయటకు వెళ్లలేరు. వారికి మరో బతుకుదెరువు లేదు. కాబట్టి నష్టపోయిన కాఫీ తోటలకు హెక్టారుకు రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించాలి.
 
అందరికీ భరోసానిస్తూ...

విశాఖపట్నంలో శనివారం ఉదయం మొదలైన జగన్ ఐదోరోజు పర్యటన అర్ధరాత్రి వరకూ సాగింది. తుపానువల్ల తమకు కలిగిన నష్టాన్ని రైతులు, గిరిజనులు ఆయనకు చెప్పుకున్నారు. అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసానిస్తూ జగన్ ముందుకు సాగారు. జగన్ పర్యటన లో ముఖ్యాంశాలు ఇలా...

 గత  పైలీన్ తుపానుతో మొత్తం పంట పోయింది. కానీ పరిహారం ఇవ్వలేదు. ఈసారైనా పంట చేతికొస్తుందనుకుంటే మళ్లా తుపాను ముంచెత్తింది. ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. మా గతేం కాను. దిక్కుతోచడం లేదని కర్రిరాము, పిల్లా కొండయ్య, అప్పలనాయుడులు జగన్‌తో చెప్పుకుని వాపోయారు.

 గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తుమ్మపాల ఫ్యాక్టరీని అమ్మేద్దామనుకున్నారు. అప్పట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు సీఎం ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తారనిపిస్తోంది. ఫ్యాక్టరీ మూసేశారు. ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. చెరకు క్రషింగ్ డబ్బులు ఇవ్వడం లేదు.రైతులం రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాను వచ్చినప్పుడు  భారీ వర్షాలకు ఏలేరు, పులికాల్వ పొంగడంతో 3,500 ఎకరాల్లో చెరకు పంట మునిగిపోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని జగన్ దృష్టికి తీసుకువచ్చారు.

Popular Posts

Topics :