20 January 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ జగన్మోహన రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి భయపడే...

Written By news on Saturday, January 26, 2013 | 1/26/2013

 తెలుగు ప్రజలతో కాంగ్రెస్ ఆటలాడుకుంటోందని అందుకు ఆ పార్టీ మూల్యం చెల్లించుకోకతప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలని అధిష్టానం రెచ్చగొడుతోందన్నారు. ఉద్యమం చల్లారుతుందనుకున్నప్పుడల్లా ఓట్ల కోసం రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి లబ్దిపొందాలనుకోవడం తప్పు అన్నారు. తెలంగాణ అంశం విషయంలో కాంగ్రెస్ గందరగోళమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. 

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి భయపడే ఈ విధంగా చేస్తోందన్నారు. ఎన్నికుట్రలు చేసినా 2014లో జగన్ను సీఎం కాకుండా అడ్డుకోలేరన్నారు.

త్వరలో షర్మిల పాదయాత్ర

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఆరోగ్యం మెరుగుపడిందని ఆమె త్వరలో పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఆమె పాదయాత్రపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. రెండు రోజుల్లో నిర్ణయం 
తీసుకుంటామన్నారు.

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డిసెంబర్ 18న ఆమె మోకాలికి శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా కోసం ఆమె ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.




వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగీత వెంకటరెడ్డి

మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, మైసూరారెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు నియోజకవర్గానికి చెందిన వెంకటరెడ్డి నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు.

ఇప్పుడు ఎన్నికలొస్తే రాష్ట్ర కాంగ్రెస్‌కు ఓటమే!


http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013%2Fjan%2F26%2Fmain%2F26main18&more=2013%2Fjan%2F26%2Fmain%2Fmain&date=1%2F26%2F2013


ఇప్పుడు ఎన్నికలొస్తే రాష్ట్ర కాంగ్రెస్‌కు ఓటమే!
వైసీపీ, టీఆర్ఎస్‌లకు అధిక స్థానాలు
ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌దే హవా
ప్రధానిగా మోడీకే ఎక్కువ మంది ఓటు
ఇండియా టుడే నీల్సన్ సర్వేలో వెల్లడి

 ఉన్నఫళంగా రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే...! కాంగ్రెస్ ఓటమి పాలవడం ఖాయం. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలో మరికొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారి పోతోందని ఇండియాటుడే-నీల్సన్ 'దేశ ప్రజల మనోగతం' సర్వేలో వెల్లడైంది.

ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుందని స్పష్టమైంది. అంతేకాదు, వైసీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి 50 శాతానికి పైగా సీట్లు సంపాదించి అధికారాన్ని సొంతం చేసుకుంటాయని వెల్లడైంది. 2009లో కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో అధిక భాగం ఇప్పుడు ఈ రెండు పార్టీలకు మళ్లే అవకాశం కూడా ఉందని సర్వే పేర్కొంది. వైసీపీ రాష్ట్రం నుంచి లోక్‌సభలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది.



కాంగ్రెస్ పరిస్థితి దారుణమే..
2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 33 లోక్‌సభ స్థానాలు గెలుచుకోగా.. వచ్చే ఎన్నికల్లో ఎనిమిదికి మించి సీట్లు చేజిక్కించుకునే అవకాశం లేదని సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 52.5 శాతం ఓట్లు రాగా.. వచ్చే ఎన్నికల్లో 18 శాతం కంటే తక్కువకు పడిపోయే సూచనలున్నాయని వెల్లడించింది. ఈ ఓట్లలో ఎక్కువ భాగం వైసీపీ, టీఆర్ఎస్‌కు వెళ్లవచ్చని పేర్కొంది. రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో వైసీపీకి, తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా సర్వేలో తేలింది.

ఇక, 'ఉత్తమ ముఖ్యమంత్రి' విషయంలో 18 రాష్ట్రాల సీఎంల మధ్య సర్వే జరగగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎనిమిదవ స్థానంలో నిలిచారు. కిరణ్ నాయకత్వం లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే సూచనలే లేవని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా, సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది జగన్‌పై కేసులను వేధింపు చర ్యలుగానే పరిగణించారు.

ఎన్డీఏకి కొద్దిగా మొగ్గు!
ఇండియా టుడే-నీల్సన్ తాజా వార్షిక సర్వే ప్రకారం, దేశ ప్రజల్లో అధిక శాతం మందికి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ పట్ల విముఖత పెరిగిపోతోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పరిస్థితి మాత్రం యూపీఏ కంటే కొద్దిగా మెరుగ్గా ఉంది. 2009లో 259 స్థానాలు సంపాదించుకున్న యూపీఏ.. 2014 ఎన్నికల్లో 152 నుంచి 162 స్థానాల దగ్గరే ఆగిపోవచ్చని సర్వే పేర్కొంది. ఇక, 2009 ఎన్నికల్లో 159 స్థానాలు చేజిక్కించుకున్న ఎన్డీఏ ఈసారి 198 నుంచి 208 స్థానాల వరకూ గెలుచుకునే సూచనలున్నాయి. ఇతర పార్టీలకు 178 నుంచి 188 స్థానాలు లభించవచ్చని సర్వేలో వెల్లడైంది.

రాహుల్‌కు ఎదురు గాలి
ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే గుజరాత్ సీఎం మోడీకే ఆదరణ ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. దేశ ప్రధానిగా మోడీ సమర్థుడైన నాయకుడని అత్యధిక సంఖ్యాకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీని 41 శాతం మంది ప్రధానిగా కోరుకుంటే.. నరేంద్ర మోడీ ప్రధాని కావాలని 57 శాతం మంది కోరుకుంటున్నారు. ముస్లింల విషయానికొస్తే.. ప్రధాని అభ్యర్థిగా 21 శాతం మంది మోడీకి, 77 శాతం మంది రాహుల్‌కు ఓటేశారు.

ఇక, ప్రధాని మన్మోహన్‌సింగ్ పాలన పట్ల అధిక శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా వ్యవహరించలేకపోయారని 27 శాతం అభిప్రాయపడ్డారు. అయితే, 26 శాతం మంది మాత్రం మన్మోహన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు ఓ మోస్తరుగా ఉందని 42 శాతం మంది, అధ్వానంగా ఉందని 27 శాతం మంది అభిప్రాయ పడ్డారు.

కుట్రల నడుమ ఒక యోధుడి ఒంటరి పోరాటం!

కాంగ్రెస్‌పార్టీ వేయిపడగల విషనాగు. పాము తన పిల్లలను తానే ఆరగించినట్టు కాంగ్రెస్‌పార్టీ వైఎస్సార్‌ని కబళించాలని చూసింది. ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడనే భయంతో 2009లో ఎన్నికల ముందు ఢిల్లీలో పథక రచన జరిగినట్లు అప్పట్లోనే పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన రాజశేఖరరెడ్డికి కేంద్రం సహాయనిరాకరణ చేసింది! 

అందుకే జాతీయ నాయకులెవరూ ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి రాలేదు. అయినప్పటికీ వైఎస్సార్ ఒక్కరే యుద్ధం చేసి విజయం సాధించారు. ఆయన మరణానంతరం, తండ్రి కీర్తిని కాపాడుకోవటం కోసం తనయుడు జగన్ వైఎస్సార్ పార్టీని ప్రారంభించటంతో ఢిల్లీ పెద్దలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వైఎస్సార్‌ను, జగన్‌ను ఒకేసారి దెబ్బకొట్టాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ తన శత్రువైన టీడీపీతో చేయి కలిపింది. ఉమ్మడి శత్రువైన జగన్‌ను నిలువరించాలంటే కాంగ్రెస్‌పార్టీలో అటువంటి సమర్థులు లేరు కాబట్టి చంద్రబాబుతో రహస్య ఎజెండా కుదుర్చుకుంది.

అక్కడ నుండి జగన్‌ను కట్టడి చేయటానికి వ్యూహరచన చేసింది. తన చేతులకు మట్టి అంటకుండా ఒక అమాయకపు దళితుడిని జగన్‌పై కేసులు వేయడానికి వాడుకుంది. ఇంతచేసినా సీబీఐ ఒక్క సాక్ష్యం కూడా సేకరించలేకపోయింది. ఒక్కరు కూడా జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు. వైఎస్సార్ మిత్రులు కూడా అధికారం కాపాడుకోవడం కోసం నమ్మకద్రోహులుగా మారి, జగన్ అణచివేసే ఈ కుట్రలో పావులుగా ఉపయోగపడ్డారు. ఇలా ఇంతమంది మధ్య, ఇన్ని కుట్రల నడుమ ఒంటరి పోరాటం చేస్తున్నారు జగన్. 

కొలిమిలో కాలి సమ్మెట దెబ్బలు పడితేనే ఇనుము ఆయుధంగా మారుతుంది. అలాగే జగన్ కూడా. జగన్ అనే శక్తిని ఎదుర్కోవటానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఇంకా ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి చంద్రబాబు పాదయాత్రలు చేస్తుండగా, నూటపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌పార్టీ చేష్టలుడిగి చూస్తోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు. జగన్‌ని అక్కున చేర్చుకుంటారు. ఆరోజుకోసం మేము ఎదురు చూస్తుంటాం. 

- శశికుమార్ చందోలు, గుంటూరు


పోరుబాటలో నీ వెంట నడుస్తాం

నీ కోసం... 
ఎన్నో కళ్లు కాయలు కాస్తూ చూస్తున్నాయి.
నీ చిరునవ్వుల జల్లులలో తడవాలని...
నీ ఓదార్పులో సేద తీరాలని
నీ పోరుబాటలో నడవాలని ఆశిస్తున్నాయి.
సాహసంతో సాగి, సహనంతో ఆగి
ఆత్మవిశ్వాసంతో కదిలి
ఆప్యాయతతో మెదిలి
కుట్ర కుతంత్రాలను ఛేదించుకుంటూ
జైలు నుండి విడుదలై
రాబోయే ఎన్నికల రణరంగంలో
రాజన్న దీవెనతో ప్రజాబలంతో
విజయం సాధిస్తావని ఆకాంక్షిస్తున్నాయి.

- బత్తుల నరసింహం, జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

‘సహకారం’ అపహాస్యం

కొన్నిచోట్ల ఎన్నికల నిలిపివేత సిగ్గుమాలిన చర్య... మరికొన్ని చోట్ల ఎన్నికల రద్దుకూ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

 రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతుల కోసం నిర్వహించే సహకార ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇప్పటి దాకా రిగ్గింగ్‌కు పాల్పడిన అధికారపక్షం ఇప్పుడు కొన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ జీవోలివ్వడం సిగ్గుమాలిన చర్య అని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు డీఏ సోమయాజులు దుయ్యబట్టారు. చట్టాలను దుర్వినియోగం చేస్తున్న కిర ణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమయాజులు మాట్లాడారు. రైతుల కోసం మహత్మా గాంధీ చేసిన ఆలోచనలు, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రతిపాదనలను కాంగ్రెస్ పాలకులు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. 

సహకార ఎన్నికల్లో రైతులు కాని వారిని ఓటర్లుగా చేరుస్తున్నారని తెలిపారు. ఒకే రోజు 11 లక్షల మంది ఓటర్లను కొత్తగా చేర్చారంటే అక్రమాలు ఏవిధంగా జరిగాయో అర్థమవుతుందని అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిపారు. వీటిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్ని అక్రమాలకు పాల్పడి కూడా అధికారం చేతిలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చివరి అస్త్రంగా ఎన్నికలను వాయిదా వేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికే 45 సహకార సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపేసిన ప్రభుత్వం మరో 100 సంస్థల ఎన్నికలను రద్దుచేసే ఆలోచనలో ఉందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రతలకు ఆటంకం కలిగినప్పుడు, ఓటర్లు వారి హక్కును వినియోగించుకోలేని పరిస్థితుల్లో మాత్రమే సెక్షన్ 22-సి ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిలిపేయాల్సి ఉందని, అయితే కిరణ్ ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

రాజకీయాలను దిగజారుస్తున్న చంద్రబాబు

30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు.. గోబెల్స్ ప్రచారంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రాజకీయాలను దిగజారుస్తున్నారని సోమయాజులు దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎంతగా దిగజారిపోయారనేది అర్థమవుతుందని చెప్పారు. ‘‘విచారణ పూర్తయ్యేవరకూ బెయిల్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు చెప్పిందన్న కారణంతో హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 

జగన్ బెయిల్‌పై హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా సీబీఐ సరికొత్త అంశాన్ని ప్రస్తావించింది. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని సీబీఐ అంటోంది. ప్రభుత్వం సహకరించకపోతే విచారణ మరింత జాప్యం జరిగి జగన్‌కే కదా నష్టం జరిగేది? దీన్ని వదిలేసి చంద్రబాబు మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ కలిసిపోయాయని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో జగన్ కలిస్తే జైల్లో ఉండాల్సిన ఖర్మ ఎందుకుంటుంది? మీ మాది రిగా చీకట్లో చిదంబరంను కలిసి మేనే జ్ చేసుకునే అలవాటు మాకు లేదు’’ అని మండిపడ్డారు. 26 జీవోలకు సంబంధించిన కేసులో 70 శాతం దర్యాప్తు పూర్తి చేసిన సీబీఐ ఇప్పటిదాకా రూ.900 కోట్లు నష్టం అంచనా వేస్తే చంద్రబాబు పదే పదే లక్ష కోట్లు అనడాన్నిబట్టి చూస్తే ఆయన పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. ఎమ్మార్ కేసులో కూడా చంద్రబాబు పది వేల కోట్లని దుష్ర్పచారం చేస్తే సీబీఐ విచారణలో తేలింది రూ.43 కోట్లన్న విషయాన్ని గుర్తుచేశారు. వరుసగా వెలువడుతున్న సర్వేలను చూసి చంద్రబాబుకు నిద్రపట్టక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం తప్ప రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ కచ్చితంగా గెలవగలదని గుండెపై చెయ్యివేసుకొని చెప్పగలరా అని సోమయాజులు ప్రశ్నించారు.

ధర్మకాటాలో తేలిపోతున్న హక్కులు

‘‘జైలు గేట్ల దగ్గరకు చేరగానే ఖైదీకీ, అతని ప్రాథమిక హక్కులకూ ఉన్న సంబంధం తెగిపోదుసుమా’’!
- జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్

ఆరోపించడానికి ఏమీ దొరకని వాడొకడు ఎదుటి వాడిని ‘మీ తాత బతికున్న రోజుల్లో పొగచుట్టలు తాగేవాడట’ అని కడుపుబ్బరం తీర్చుకుని పోయాడట! ఈ దేశంలో కొన్ని కేసులు అలా నడుస్తున్నాయి! గురువారం (24.1.2013) వైఎస్సార్ పార్టీ వ్యవస్థా పకుడు, పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ మరొకసారి పాత వాదనల ఆధారంగానే అడ్డుకోవ టంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే జగన్ కేసులో ఆ ముందురోజు (23.1.2013) హైకోర్టులో ఓ సరికొత్త పరిణామం జరిగింది. జగన్ ‘అక్రమ ఆస్తుల కేసు’లో ‘రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ’ మూలంగా విచారణను త్వరగా ముగించలేకపోతున్నామని సీబీఐ సరికొత్త ‘బాణం’ వదిలింది. ఈ వార్త అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే, వాయిదాల పద్ధతిలో ‘చిల్లర దుకాణం’లాగా సీబీఐ లాంటి విచారణ సంస్థ అభియోగపత్రాలు (చార్జిషీట్లు) ఇవ్వడమూ, కేసు ఒక ముగింపునకు రాకుండా చేయడమూ కేవలం సీనియర్ న్యాయవాదులకే కాదు, న్యాయవ్యవస్థ పట్ల గౌరవాభిమానాలున్న వారందరికీ రోజులు గడిచిన కొలదీ మరింత విస్మయపరుస్తోంది. 

జగన్‌పై మోపిన కేసులు ‘వయా’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మంత్రి మండలి అమలులోకి వచ్చిన 26 జీవోల మీదుగా, పరోక్షంగా జగన్‌కూ అతని కంపెనీలకూ, ఆ జీవోల నుంచి లబ్ధి పొందగోరిన ఇతర కంపెనీల అధినేతలు జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు దించారన్న సాగలాగుడు విద్యపై ఆధారపడి సీబీఐ మోపినవే. ఎంతకూ ఈ కేసులు ఒక కొలిక్కి రాకపోవడానికీ, జీవోలకూ జగన్ ఆస్తులకూ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నిరూపించడంలో సీబీఐ విఫలమవుతూనే ఉండటానికీ, జగన్‌కు బెయిల్ రాక పోవడానికీ కారణం రాజకీయం తప్ప మరొకటి కాదు! రోజులు గడుస్తున్న కొద్దీ ఈ నమ్మకం ప్రజల మనస్సుల్లో బలపడుతున్నది. 

ఎందుకంటే జగన్ కేసు ఇంతకుముందు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు కూడా గౌరవ న్యాయస్థానం సీబీఐని త్వరగా విచారణను పూర్తి చేయమని చెప్పడమేగాక (2013 మార్చికన్నా గడువు మించడానికి వీల్లేదని రికార్డు మీద పెట్టకపోయినా మాట మాత్రంగా చెప్పిన ప్పటికీ), కింది కోర్టు విచారణ సందర్భంగానే బెయిల్ పిటిషన్‌ను కూడా ప్రతిపాదించుకునే అవకాశం జగన్‌కూ కల్పించింది. అయినా, మాసాల తరబడి కేసులను ఒక కొలిక్కి తీసుకురాకుండా జాప్యం చేస్తున్న సీబీఐ ఒక్కో న్యాయ స్థానం ముందు ఒక్కోలాగా ఆయనకు బెయిల్ రాకుండా నిరోధించే ‘టెక్నిక్’కు అలవాటుపడింది. అక్కడికీ సీబీఐ ప్రత్యేక కోర్టు గౌరవ న్యాయమూర్తులు (జస్టిస్ భాను, జస్టిస్ నాగమారుతి శర్మ) ప్రాథమిక అభియోగపత్రంలో పేర్కొన్న ఒకరిద్దరిని తప్ప మిగతా నిందితుల్ని (70 మందిని) ఎందుకు అరెస్టు చేయలేదు? అసలు మీ పద్ధతులేమిటి? అని పదే పదే ప్రశ్నించాల్సివచ్చిందని మరవరాదు! 

అంతేగాదు, చివరికి ఈనెల 23న జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో కూడా గౌరవ న్యాయమూర్తి శేషశయనారెడ్డి ‘‘దర్యాప్తుకు ఒక నిర్దిష్టమైన గడువంటూ ఉండాలి, కాని అలాంటిదేమీ లేకుండా మీరు ఇలా సాగదీస్తారా’’అని సీబీఐని నిలదీయాల్సివచ్చిందంటే - సీబీఐ సాగదీత వెనక కాంగ్రెస్ అధిష్టాన స్వార్థ రాజకీయ హస్తం ఉందన్న సందేశం ప్రజాబాహుళ్యానికి అందించినట్టయింది! ‘ఏడు అంశాల’పైన దర్యాప్తును మే నెలలోగా పూర్తి చేసి తీరాలని సుప్రీంకోర్టు ఏనాడో ఆదేశించినా, మూడింటిలో మాత్రమే దర్యాప్తు పూర్తి చేశామని చెప్పడం, దర్యాప్తు పూర్తికాలేదన్న సాకుపైన న్యాయస్థానాల్లో ఇంకా రుజువు కావలసి ఉన్నప్పటికీ బెయిల్ నిరాకరించడం న్యాయశాస్త్ర విరుద్ధమేగాక, నేర శిక్షాస్మృతి నిబంధనలను కోర్టు తీర్పులను కూడా సీబీఐ బాహాటంగా ఉల్లంఘించడమే అవుతుంది. పైగా, బెయిల్ ఇస్తే ‘సాక్షుల’’ను బెదిరిస్తారని, ప్రభావితం చేస్తారన్న ఒక ‘ఊహ’ను తడికెగా అడ్డంపెట్టుకుని ఇన్నాళ్లూ సీబీఐ జగన్‌కు బెయిల్ నిరాకరించడం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రాలకే విరుద్ధం. పేరు మోసిన నేరగాళ్లకు, గుప్తధనం లావాదేవీలు నడిపిన (మనీ-లాండరింగ్) వారికి సైతం బెయిళ్లు మంజూరైన వాస్తవాన్ని ఎవరూ కాదనజాలరు. 

జగన్ శాసనసభ ఆవరణలోకి వెళ్లి ఉప ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగించినప్పుడు గానీ, జైల్లో తనను చూడవచ్చిన విభిన్న రాజకీయ పక్షాల వారిని కలుసుకున్నప్పుడు గానీ ఎవరినీ ప్రభావితం చేసినట్లు, పారిపోవడానికి ప్రయత్నించిన సన్నివేశాలు గానీ ఏవీలేవని లోకానికీ తెలుసు. సీబీఐకీ తెలుసు! క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 437 కింద కేసులో ఉండి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులకు లేదా కిరాయి హంతకులకు డబ్బిచ్చి హత్యలు చేయించారన్న ఆరోపణలున్న వ్యక్తులకు మాత్రమే బెయిల్ నిరాకరించే హక్కును న్యాయస్థానాలకు చట్టం కల్పిస్తోంది (1987 సుప్రీంకోర్టు షాజాద్ హసన్ ఖాన్ కేసు; 1998 సుప్రీంకోర్టు రమేష్ తౌరానీ కేసు తీర్పులు). వ్యక్తి స్వేచ్ఛ హక్కు పవిత్రతకూ, సమాజ ప్రయోజనాల రక్షణకూ మధ్య సమతూకాన్ని పాటించే విధంగా న్యాయసూత్రాలు ఉండాలని న్యాయశాస్త్రం చెబుతోంది.

అంతేకాదు, రాజ్యాంగం గ్యారంటీ చేస్తున్న ‘జీవించే హక్కు’ గురించి సుప్రీం గౌరవ మాజీ న్యాయమూర్తి చిన్నపరెడ్డి ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టు ఎలాంటి ప్రభుత్వ ప్రలోభాలకు లేదా ఒత్తిళ్లకూ లొంగని ఒకానొక దశలో జస్టిస్ ఫీల్డ్ ‘జీవితం’ గురించి ఇచ్చిన నిర్వచనాన్ని ఉదహరించారు. జస్టిస్ ఫీల్డ్ దృష్టిలో ‘జీవితం అన్న పదానికి విలువైన అర్థం ఉంది. జీవితం అంటే పశువులా జీవించడం కాదు’ అంతేగాదు, ‘ఒక మనిషి, అతను సామాన్యుడు గానీ, అసామాన్యుడు గానీ, జీవించాల్సిన జీవితాన్ని అనుభవించ నివ్వకుండా చేయడమంటే, ఏ జీవితాన్ని అనుభవించడానికి మనిషి సర్వాంగాలూ తోడు నీడలవుతాయో వాటన్నింటనీ మనిషి కోల్పోవటమనే అర్థం’ అని ఫీల్డ్ అన్నాడు!

చేతనా న్యాయశాస్త్రానికి నేటి దాకా నిగ్గుతేలిన ప్రతినిధిగా నిలిచిన జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఈ నిర్వచనం నుంచే ఉత్తేజితుడై ‘చెరసాలల ధర్మశాస్త్రా’నికి (ప్రిజన్ జూరిస్ ప్రూడెన్స్) ఒక కేసులో సరికొత్త భాష్యం చెప్పారు. ‘రాజ్యాం గంలోని జీవించే హక్కును పౌరునికి గ్యారంటీ చేసిన 21వ అధికరణకు నిష్పా క్షికమైన, న్యాయబద్ధమైన అనుసరణ అనేది ఆత్మ. కాగా 19(5) అధికరణ పిండితార్థం - విధించే అదుపాజ్ఞలు హేతుబద్ధంగా ఉండాలని శాసిస్తోంది. కాని ఈ అధికరణను అమలుజరిపే పద్ధతి వివక్షదశకు దిగజారిపోయింది. ఈ దిగజా రుడుతనం రాజ్యాంగంలోని 14వ అధికరణకే పరమ శాపంగా తయార యింద’న్నారు జస్టిస్ కృష్ణయ్యర్!

ఇంతకూ మన రాజ్యాంగం, అమెరికన్ రాజ్యాంగంలోని మంచి లక్షణాలకు కూడా దూరంగా ఉంది. విచారణ లేదా దర్యాప్తులూ క్రమపద్ధతిలో జరగాలన్న నిబంధన (డ్యూ ప్రోసెస్ క్లాజు) గానీ, అమెరికా రాజ్యాంగంలోని 8వ సవరణా నుభవం గానీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో (నేర న్యాయ విచారణ వ్యవస్థలో) కొరవడ్డాయని న్యాయశాస్త్ర కోవిదుల అభిప్రాయం. అందుకే కొన్ని సందర్భాల్లో కొందరు గౌరవ న్యాయమూర్తుల నుంచి ‘నిరంకుశోపాఖ్యానాలు’ వింటూం టాం! బహుశా అందుకనే జస్టిస్ కృష్ణయ్యర్ కేవలం అధికారం చెలాయించే ధోరణిలో వ్యవహరించే న్యాయమూర్తుల్ని ‘ప్రజాస్వామ్యానికి మోయరాని బరువు’ (లయబిల్టీ టు డెమోక్రసీ) అని ఉంటాడు!

ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు సీబీఐ జగన్‌పైన కేసుల దర్యాప్తును ‘‘త్వరగా తెమల్చడా’’నికి అడ్డంకి కిరణ్‌కుమార్ ప్రభుత్వమేనని ఆరోపిస్తోందంటే - కేబినెట్ మంత్రులుగా ఉంటూ వచ్చిన ధర్మాన ప్రసాద రావును, మోపిదేవిని ఆ 26 జీవోలను సమర్థించడం వల్లనూ, ఆ జీవోలు సక్రమంగానే ఉన్నాయని కిరణ్‌కుమార్ ప్రభుత్వం నిర్ధారించడం వల్లనూ తమ చేతులాడటం లేదని సీబీఐ భావిస్తున్నట్టుంది! చేతులాడకపోవడమే కాదు, ఈ లెక్కన మొత్తం కేసుల రుజువర్తనకే ఎసరువచ్చి, సీబీఐ పరువు ప్రతిష్టలకే (అవి మిగిలి ఉంటే) మచ్చ వచ్చే పరిస్థితులు ముంచుకొస్తున్నందున సీబీఐ కిరణ్ ప్రభుత్వాన్ని అలా ఆడిపోసుకోవడంలో తప్పులేదు! అన్నట్టు మరవరాని మరి కొన్ని విషయాలు - జగన్‌పై కక్షసాధింపు కాంగ్రెస్ చరిత్రలో ఓ పెద్ద రాజకీయ ప్రక్రియ అనడానికి బెదిరింపుల పర్వం కాంగ్రెస్ అధిష్టానం తలపెట్టిన ‘ద్రావిడ ప్రాణాయామ’ యజ్ఞంలో ఒక భాగం. 

ముక్కు ఏదంటే నె రుగా చూపకుండా, వేలును తలచుట్టూ తిప్పి చూపించినట్టుగానే యూపీలో మాయావతిని, ములా యంసింగ్‌ను తమ అవసరానికి తగ్గట్టు లొంగదీసుకోవడానికి కాంగ్రెస్ అధి ష్టానం విచారణ సంస్థలను ఎలా బెదిరింపులతో వినియోగిస్తూ వచ్చిందో, ఎలా ‘లాభలబ్ధి’ (క్విడ్ ప్రోకో)కి ఏతామెత్తిందో వారిపై నడిపిన కేసులు, వాటి ఉపసంహరణ తంతే నిరూపించింది. కాని జగన్ విషయంలో అలాంటి ‘మంత్రం’ తంత్రం ఏదీ పారినట్టు కనిపించదు! అందుకే కేసులు సాగుతూ, కొనసాగుతూ ఉంటాయి. 

ఎమర్జెన్సీ కాలంలో పౌరుల ప్రాథమికహక్కుల అధ్యాయాన్ని ఇందిరాగాంధీ చాపచుట్టివేసినప్పుడు అంతటి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు లోని మెజారిటీ న్యాయమూర్తులలో కొందరు భయభ్రాంతులకు లోనై ఆ హక్కులకు తిరిగి ఊపిరి పోసే సాహసం చేయలేని దుర్ముహూర్తంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు ప్రాణప్రదమైన హెబియస్ కార్పస్ పిటిషన్లను ధైర్యసాహసాలతో పునరుద్ధరించి, వందలాది మంది డిటెన్యూల విడుదలను సుగమం చేసిన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా!

అదెప్పుడు సాధ్యమ వుతుంది? నిర్భయంతో ముందడుగు వేయగలిగినప్పుడు! అందుకే ఖన్నా అంటాడు: ‘నిజం చెప్పడానికి భయపడితే అది మానవ వ్యక్తిత్వాన్ని మసక బారుస్తుంది, హీరోలను మట్టిముద్దలను చేసి ‘జీరో’లుగా మారుస్తుంది. జీవితపు ఉన్నత విలువల్ని కాంతిహీనం చేస్తుంది. భయమున్న చోట న్యాయం తలెత్తుకో లేదు. భయ వాతావరణానికి బందీలయినందుననే మహా వ్యక్తులయిన జోన్ ఆఫ్ ఆర్కి, గెలీలియో, డ్రీఫస్‌లు దెబ్బతిన్నారు. అందుకే మహాతాత్వికులంతా భయం నుంచి స్వేచ్ఛ పొందడానికే మొదటి తాంబూలమిచ్చారు!’ఆ సాహసం జాతీయ స్వాతంత్య్ర సమరం నాటి బార్ సుసంప్రదాయం. స్వాతంత్య్ర సమరం నాటి బార్ సుసంప్రదాయం ఆ సాహసమే.


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=56555&Categoryid=1&subcatid=18 

చంద్రబాబుకు మతిభ్రమించింది

Written By news on Friday, January 25, 2013 | 1/25/2013

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు సోమయాజులు తెలిపారు. బాబుకు మతిభ్రమించిందనే అలా మాట్లాడుతున్నారు అనే అనుమానం కలుగుతుందన్నారు. హైదరాబాద్‌లోనివైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయనవిలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు కుప్పం నుంచి తప్ప రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన ఎద్దేవా చేశారు. సహకార ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందన్నారు. అధికార పార్టీ ఓటమి భయంతో చట్టాన్ని అపహాస్యం చేస్తొందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. నిజమైన రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సోమయాజులు ఈ సందర్బంగా ఆరోపించారు. 

డోర్నకల్లో వైఎస్‌ఆర్ సీపీ నాయకుల ధర్నా

తెలుగుదేశం పార్టీకి డోర్నకల కోపరేటివ్ ఎన్నికల అధికారి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శుక్రవారం ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు నామినేషన్లు తిరస్కరించారని వారు పేర్కొన్నారు. దీంతో కోపరేటివ్ కార్యాలయం ఏదుట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. 

YSRCP Leader Somayajulu press meet in YSRCP Office

తాగునీటి పైప్‌లైన్ ప్రారంభించిన విజయమ్మ

 పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా లింగాలలో రూ. 4లక్షలతో నిర్మించిన తాగునీటి పైప్‌లైన్‌తోపాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులను విజయమ్మ ప్రారంభించారు

వైఎస్ఆర్ సీపీ నేత నామినేషన్ తిరస్కరణ

సహకార ఎన్నికల నామినేషన్ల విషయంలో అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాశారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఛైర్మన్ నల్లపాటి చంద్రశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ గోపిరెడ్డి మధ్య వివాదం నెలకొంది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వైఎస్ జయమ్మకు కుటుంబసభ్యుల నివాళి

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ జయమ్మ 7వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద నివాళులర్పించారు. జయమ్మ పార్కులోని ఆమె విగ్రహానికి పూలమాలు వేశారు. విజయమ్మతో పాటు వైఎస్‌ కుటుంబసభ్యులు వైఎస్‌ భారతి జార్జిరెడ్డి, వైఎస్‌ పురుషోత్తమ్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, డాక్టర్‌ ఈసీ సుగుణమ్మలు జయమ్మకు నివాళులర్పించారు.

పులివెందులు చేరుకున్న విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం పులివెందుల చేరుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ ఏడో వర్థంతి సందర్భంగా విజయమ్మ నివాళులు అర్పించనున్నారు. రెండు రోజుల పాటు విజయమ్మ నియోజకవర్గంలో పర్యటిస్తారు.

మేం నమ్ముతున్నాం.

మేం నమ్ముతున్నాం.
సమస్యల అంధకారంలో ఉన్న ఈ రాష్ట్రానికి జగన్ తప్ప మరో కరదీపం లేదని మేం నమ్ముతున్నాం.

టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై, పన్నుతున్న కుట్రలు, వ్యూహాలకు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. కానీ ఈ రాష్ట్రం అనే నావను ఎన్ని తుపాను గాలులు వచ్చినా ‘నావికుడై’ నడుపుతాడు జనగన్న అని మేం నమ్ముతున్నాం.

రెండు పార్టీల నాయకులు, ఢిల్లీ పెద్దలు... మీడియాలను అడ్డం పెట్టుకుని, వైఎస్సార్ పార్టీ నాయకుడిని జైల్లో ఖైదీగా పెట్టారు. కాని వారు పెట్టింది మా మనస్సుల్లో అని వారికి తెలియదు. తెలివితేటలు, సమర్థత ఉన్న ప్రతివాడూ తన ఆస్తిని మూడింతలు, పదింతలు చేసుకోగలడు. అలాగే జగన్ నీతి మార్గంలో తన ఆస్తి రెట్టింపు చేసుకున్నాడని మేం నమ్ముతున్నాం.

రాజశేఖరరెడ్డిగారి బిడ్డగా, కాబోయే ముఖ్యమంత్రిగా జగన్ ఈ రాష్ట్రాన్ని యేలుతారని మేం నమ్ముతున్నాం. పులిబిడ్డ బయట ఉన్నా బోనులో ఉన్నా ఒకటేనని మేం నమ్ముతున్నాం.

జైల్లో ఉన్న జగనే మాకు నాయకుడిగా రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారని మేం నమ్ముతున్నాం.

మరొక్కమాట: మబ్బులోని వాన చినుకు ఎప్పుడు, ఎలా భూమ్మీద పడుతుందో తెలియనట్లే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు గద్దె దిగుతుందో తెలీని పరిస్థితిలో ఉంది. పార్టీలన్నిటికీ జగనంటే భయం. ప్రతి పేదవాడికీ జగన్ అంటే ప్రేమ. మరి కాంగ్రెస్‌ని, ప్రతిపక్షాన్ని ప్రజలు అంతలా కోరుకుంటున్నారా? జగన్ లాంటి స్థానం వారికి లభిస్తుందా? వైఎస్సార్‌గారి ప్రభుత్వంలో సీబీఐని ఎందుకు రంగంలోకి దించలేదు? ఎన్నికల ముందే సీబీఐ ఎందుకు దించారు? ఇలా లక్షల ప్రశ్నలు ప్రజల మనస్సుల్లో ఉన్నాయి. వీటిల్లో దేనికైనా వారి దగ్గర సమాధానముందా?

- వై.పరిమళ, కడప

దేవుడా! ఏమి లోకమిది?!

చూడరా... చూడరా...
ఈ లోకం తీరు చూడరా.
కోటి మనస్సుల ఇలవేల్పునే
కటకటాలకే పంపిన వింతనే చూడరా

అన్యాయం ఒకవైపు, న్యాయం మరోవైపు
తీర్పు ఏమిటో వేచి చూడరా!
అవినీతి తమవైపు, జగన్ ఏమో మనవైపు
గెలిచేది ఎవరో ఆశగా చూడరా!

మానవత్వమే తన మతముగా
పరిపాలనే దైవకార్యంగా
చేసిన నాయకుడినే నిందితుడిగా
నిలిపిన వింతనే చూడరా!

గాంధీనే తిరిగొస్తే, గాడ్సే అని
జైల్లోకి నెట్టేను ఈ ప్రభుత్వమురా!
బైబిల్ పట్టిన ఏసయ్యయినా
బాణం వేసేను అయ్యో రివ్వున!

- మన్నవ అంజనీ వీరేంద్ర, చింతపల్లిపాడు, గుంటూరు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

బలమున్న చోట దౌర్జన్యం.. లేనిచోట వాయిదా తంత్రం

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ ఇష్టారాజ్యం
ఆది నుంచీ అధికార దుర్వినియోగం
సభ్యత్వ నమోదు నుంచే అక్రమాలు 
సీఎం, సహకార మంత్రి సొంత జిల్లాల్లో మెజారిటీ సంఘాలకు ఎన్నికలు బంద్!
గెలవలేని చోట ఎన్నికలు వాయిదా వేయాలంటూ అధికారులకు ఆదేశాలిస్తున్న మంత్రులు
నామినేషన్ల సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత
సీఎం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
గుంటూరులో బట్టబయలైన కాంగ్రెస్, టీడీపీ ఫిక్సింగ్
అన్యాయాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు

హైదరాబాద్, సాక్షి నెట్‌వర్క్: సహకార ఎన్నికల్లో గెలుపు ముద్ర వేయించుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ దండోపాయాన్ని ప్రయోగిస్తోంది. సభ్యత్వ నమోదు నుంచి పోలింగ్ దాకా అంతా తన కనుసన్నల్లోనే నడిపించేందుకు ఎత్తులు వేస్తోంది. ఓడిపోతామని అనుమానం ఉన్నచోట ‘వాయిదా’ మంత్రం జపిస్తూ.. బలమున్న చోట ఇతర పార్టీలను అడ్డుకుంటూ దౌర్జన్యకాండకు దిగుతోంది. మరికొన్ని చోట్ల కుమ్మక్కు రాజకీయాలతో ప్రజా బలమున్న పార్టీని అడ్డుకుంటోంది. ఒక్కచోట కాదు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి! సీఎం సొంత జిల్లా చిత్తూరు, సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి జిల్లా గుంటూరులో అయితే అక్రమాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం పీలేరులో గురువారం నామినేషన్లు వేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

గుంటూరు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ ఫిక్సింగ్ మరోసారి బహిరంగంగా వెల్లడైంది. గురువారం వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు సొసైటీకి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు నామినేషన్ వేయడానికి వెళ్తుండగా.. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఒక్కటై అడ్డుకున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్)లకు ఎన్నికలు జరపకుండా ఇప్పటికే వాయిదా వేసేశారు. అనేక జిల్లాల్లో కూడా ఇలాగే వందలాది సొసైటీల ఎన్నికలను వాయిదా వేసేందుకు అధికారిక ఉత్తర్వులిచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

ఆది నుంచి అదే తీరు..

సహకార ఎన్నికల్లో ఆది నుంచి అధికార పార్టీ వ్యవహారం అభ్యంతరకరంగానే ఉంది. తొలుత ప్రతిపక్ష పార్టీలకు చెందిన రైతులకు ప్రాథమిక పరపతి సంఘాల్లో సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకుంది. అధికారులను తన కనుసన్నల్లో ఉంచుకొని.. తాము సూచించిన వారికే సభ్యత్వాలు ఇప్పించుకొంది. మిగతా వారికి సభ్యత్వాలు దక్కకుండా అనేక అడ్డంకులు సృష్టించింది. పారదర్శకంగా జరగాల్సిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇష్టారీతిగా సాగించింది. కొన్నిచోట్ల అయితే సభ్యత్వ పుస్తకాలను పరపతి సంఘాల కార్యాలయాల్లో ఉంచకుండా అధికారులు తమ ఇళ్లలో ఉంచుకొని, అధికార పార్టీకి చెందిన రైతులకే సభ్యత్వం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు కుల ధ్రువీకరణ పత్రాలు కూడా సకాలంలో అందకుండా ‘మీసేవ’లో జాప్యం చేయించారు. ఫలితంగా వేలాది మంది ఎస్సీ, ఎస్టీలకు సభ్యత్వం దక్కకుండా పోయింది. మరికొన్ని చోట్ల విపక్ష పార్టీ రైతుల మీద దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. అన్ని రకాలుగా ప్రయత్నించిన తర్వాత కూడా.. గెలుపు దక్కే అవకాశం లేని చోట ఎన్నికలు వాయిదా వేయించేందుకు ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తోంది.

మంత్రి అనుమతి లేకుండానే జీవోలు..

సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో మంత్రుల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలానా సంఘంలో పరిస్థితి బాగోలేదని, కాంగ్రెస్ ఓడిపోతుందనే సమాచారం రాగానే మంత్రులు తమ ఫోన్లకు పని చెపుతున్నారు. సహకార శాఖ ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఆ సొసైటీ ఎన్నికలు నిలిపివేసేలా ఉత్తర్వులివ్వాలని ఆదేశిస్తున్నారు. మంత్రులతో పాటు అన్ని స్థాయిల్లోనూ అధికార పార్టీ నేతలు సహకార ఎన్నికలలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వారి సూచనలను సహకార శాఖ ఉన్నతాధికారులు సైతం తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. వాస్తవానికి జీవో జారీ చేయాలంటే సంబంధిత శాఖ మంత్రి అనుమతి అవసరం. అయితే సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి అందుబాటులో లేకపోయినా.. బుధ, గురువారాల్లోనే పెద్ద ఎత్తున జీవోలు వెలువడ్డాయి. ఎన్నికలు వాయిదా వేసే అధికారం.. సహకార చట్టంలోని నిబంధన 22(సి) ప్రకారం ప్రభుత్వానికి ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేకపోతేనే వాయిదా వేయాలని చట్టంలో స్పష్టంగా ఉంది. అధికార పార్టీకి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ‘ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవు. ఎన్నికలు నిర్వహిస్తే శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.’ అంటూ జీవోల్లో పేర్కొనడం గమనార్హం. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో సగానికిపైగా పీఏసీఎస్‌ల ఎన్నికలు వాయిదా వేయడానికి రంగం సిద్ధమైందని సమాచారం. సహకార శాఖ మంత్రి సొంత జిల్లా గుంటూరులోనూ పలు సంఘాలకు ఎన్నికలు వాయిదా వేశారు.

చిత్తూరులో అన్నీ సమస్యాత్మకమేనట: రాష్ట్రంలో 2,949 సహకార సంఘాలకుగాను 2,931 సంఘాలకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో 819 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా, 390 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. చిత్తూరు జిల్లాలో 77 సంఘాలకుగాను 72 సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే అందులో ఈ జిల్లాలో 29 సమస్యాత్మక, 43 అత్యంత సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించడం గమనార్హం.

ఎన్నికలు నిష్పాక్షికంగా జరపండి: సీఎస్

సహకార ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుతం గా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించేందుకు వీడియో కెమెరాలు కావాలని గుంటూరు, కడప కలెక్టర్లు సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆమె పరిశీలిస్తానని హామీనిచ్చారు.

పీలేరులో దౌర్జన్యకాండ..

సీఎం నియోజకవర్గ కేంద్రమైన పీలేరులో నామినేషన్ల సందర్భంగా అధికార కాంగ్రెస్ నేతలు దౌర్జన్యకాండకు దిగారు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సహకార ఎన్నికల నామినేషన్లు వేయనీయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నేతృత్వంలో నామినేషన్లు వేసేందుకు 13 మంది నాయకులు సింగిల్ విండో కార్యాలయం వద్దకు చేరుకోగా కాంగ్రెస్ వాళ్లు మూకుమ్మడిగా దాడి చేశారు. మైనార్టీ నాయకుడు జిలానీ సాహెబ్‌పై చేయిచేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన ఇద్దరు మహిళా అభ్యర్థులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు సైతం అధికార పార్టీకే వత్తాసు పలికారు. జాండ్ల, రేగళ్లుకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత వారిని తమ వెంట తీసుకుని వెళతామన్న వైఎస్సార్‌సీపీ నాయకుల అభ్యర్థనకు నో చెప్పారు. అనంతరం అక్కడికి చంద్రగిరి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేరుకోగా ఆయన్నూ వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేకలు వేస్తూ ముందుకు రావడంతో పోలీసులు కార్యాలయ గేట్లు మూసేసి తాళం వేశారు. సాయంత్రం 4 గంటల వరకు సింగిల్‌విండో కార్యాలయ గేట్లు తెరవలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆ పార్టీ నేత చింతల రామచంద్రారెడ్డి తదితరులు కార్యాలయం వద్దే పీలేరు-తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తరువాత క్రాస్‌రోడ్డు వరకు ప్రదర్శనగా వెళ్లి ఆందోళన నిర్వహించారు.

కృష్ణాలో 11 సొసైటీ ఎన్నికలపై స్టే!

కృష్ణా జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉన్న 11 సొసైటీల ఎన్నికలను ప్రభుత్వం గురువారం నిలిపేసింది. వైఎస్సార్‌సీపీ తరపున కేడీసీసీ చైర్మన్ పదవి కోసం పోటీపడుతున్న ఆప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరరావు ఎప్పుడూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఐతవరం సొసైటీతోపాటు మరో పదింటి ఎన్నికలను వాయిదా వేసింది. మరికొన్నింటిని వాయిదా వేసేందుకు రంగం సిద్ధం చేసింది. కేడీసీసీ బ్యాంకును కైవసం చేసుకుంటామనే భయంతోనే ప్రభుత్వం ఈ సొసైటీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని వసంత నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికలు నిలుపుదల చేసిన 11 సహకార సంఘాల్లో 10 సంఘాలను గెల్చుకునే సత్తా తమ పార్టీకి ఉందని, దీన్ని అడ్డుకునేందుకే ప్రభుత్వం వాయిదా వేసిందని మండిపడ్డారు. స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఐతవరం, అల్లూరు సొసైటీ కార్యాలయాల ఎదుట ధర్నాలు, జాతీయ రహదారిపై రాస్తారోకో జరిగాయి. రెండో దశలో ఎన్నికలు జరిగే సొసైటీల్లో కూడా కీలకమైన సంఘాల ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

విశాఖలో ఎన్నికల వాయిదా యత్నాలు: విశాఖ జిల్లాలో అత్యధిక సహకార సంఘాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు కుట్రలకు తెరతీస్తున్నారు. కీలకమైన నేతలు పోటీ చేసే సంఘాలు, పేరెన్నికగన్న సంఘాలపై కన్నేశారు. ముఖ్యంగా నక్కపల్లి, కోటఉరట్ల, మునగపాక, పెందుర్తి తదితర సహకార సంఘాల ఎన్నికలు నిలిపివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది.


గుంటూరులో ఫిక్సింగ్

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడు సొసైటీకి నామినేషన్‌ల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు వ్యవహారం బయటపడింది. వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా కాంగ్రెస్ నాయకుడు, జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ కుర్రి పున్నారెడ్డి, టీడీపీ నేత కళ్లం రామాంజనేయరెడ్డిలు బహిరంగంగా వారి అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు సబ్బసాని కోటిరెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై అటకాయించారు. 

కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి టీడీపీ నాయకుడు కళ్లం రామాంజనేయరెడ్డి ఇంట్లో నిర్బంధించారు. వెల్దుర్తి ఎస్సై ఆయనను గృహనిర్బంధం నుంచి విడిపించారు. వైఎస్సార్‌సీపీ డెరైక్టర్లుగా నామినేషన్ దాఖలు చేయకుండా అభ్యర్థుల నుంచి కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పత్రాలు లాక్కొని చించేశారు. తర్వాత పోలీసుల రక్షణలో వైఎస్సార్‌సీపీ నేత నామినేషన్ వేశారు. వైఎస్సార్‌సీపీ వెల్దుర్తి మండల నాయకుడు జూలకంటి వీరారెడ్డి శిరిగిరిపాడుకు రాగా ఆయనపైనా కాంగ్రెస్, టీడీపీ నాయకులు దాడిచేసి గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు శిరిగిరిపాడు గ్రామానికి చేరుకున్నారు. ఆయన్ను సైతం శాంతి భద్రతల పేరుతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి, తర్వాత విడిచిపెట్టారు. మరోవైపు విజయావకాశాలు లేవన్న కారణంతో రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం సొసైటీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది.

నెల్లూరు జిల్లాలో కర్రలు, రాళ్లతో దాడి..

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సిద్ధవరంలో గురువారం సొసైటీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, అనుచరులపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. దాడిలో శ్యాంప్రసాద్ రెడ్డి అనుచరులకు గాయాలయ్యాయి. బుజ్జమ్మ అనే మహిళ తలకు బలమైన గాయమైంది. 

చిత్తూరులో 11 సంఘాల ఎన్నికలు నిలిపివేత

సీఎం కిరణ్ సొంత జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అనుమానంగా కనిపించడంతో ప్రభుత్వం 11 సహకార సంఘాల ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజ యం సాధించగలరనే అంచనాతో.. ఈ సొసైటీల్లో ఓట ర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల నిర్వహణ నిలిపివేసింది. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా సహకార శాఖాధికారికి ఉత్తర్వులు అం దాయి. ఓటర్ల జాబితా తయారు చేయలేదంటూ ఇప్పటికే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఒక సొసై టీ ఎన్నికను నిలిపేశారు. జిల్లాలో 73 సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ జారీ కాగా.. 61 సింగిల్ విండోలకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వం సహకరించకపోతే ఆ ఆధారాలు మీరు సృష్టించారా?

సర్కారు సహకరించకపోతే 26 జీవోలు అక్రమమని ఎలా నిర్ధారించారు?
ఏ ఆధారాలున్నాయని జగన్‌ను అరెస్టు చేశారు? అవి ఎక్కడినుంచి వచ్చాయి?
ప్రభుత్వం సహకరించకపోతే ఆ ఆధారాలు మీరు సృష్టించారా?
ఆధారాలు ఎలాగూ లేవు కనుక ఆధారాలు సృష్టించేవరకు జగన్‌ను జైల్లోనే ఉంచదలుచుకున్నారా?
ఆయన్ను వీలైనన్ని ఎక్కువరోజులు జైల్లో పెట్టేందుకే కోర్టు ముందు కొత్త వాదన
ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టులో ఎందుకు చెప్పలేదు?
ప్రభుత్వం సహకరించకపోతే.. సీఎంను, సీఎస్‌ను అరెస్టు చేస్తారా?
సీబీఐ, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర ప్రజలకు అర్థమవుతోందన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం దర్యాప్తుకు సహకరించకపోతే 26 జీవోలు అక్రమమని ఎలా నిర్ధారించారు? ఏ ఆధారాలతో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సీబీఐని ప్రశ్నించారు. జగన్‌ను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే దురుద్దేశంతోనే సీబీఐ ప్రభుత్వం సహకరించడం లేదనే కొత్తవాదనను కోర్టు ముందుకు తెచ్చిందని ఆమె చెప్పారు. ‘ఇది అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసు...ఈ కేసుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటే సీబీఐ తీసుకోవాల్సిన తదుపరి చర్యలేమిటి? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేస్తుందా? ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తుందా?’ అని ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుకే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటే.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఎందుకున్నట్లు? అని నిలదీశారు. హైకోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడారు. 18 నెలలుగా దర్యాప్తు పేరుతో రకరకాల విన్యాసాలు చేస్తున్న సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఏ కోర్టులోనూ.. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించడం లేదనే విషయం ఎందుకు చెప్పలేదని ఆమె అడిగారు. హైకోర్టు ముందు సీబీఐ చేసిన వాదనలు చూస్తే.. ‘దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము..’ అన్నట్టుగా ఉందని అన్నారు. 

గత ఏడాది అక్టోబర్ ఐదో తేదీకి ముందు సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ చెప్పిందని, ఆ గడువు ఈ ఏడాది జనవరి 5వ తేదీతో ముగిసిందని.. ఇలాంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పడమేమిటని పద్మ ప్రశ్నించారు. ఇదే విషయం సుప్రీం విచారణ సందర్భంగా సీబీఐ ఎందుకు చెప్పలేదన్నారు. ‘18 నెలల క్రితం శంకర్రావు 26 జీవోలపై పిటిషన్ వేసినప్పుడు అడ్వొకేట్ జనరల్ హాజరై వాదించాలి. కానీ ఆయన కౌంటర్ దాఖలు చేయలేదు సరికదా.. ఆ ఛాయలకు కూడా రాలేదు. ఆరోజు సీబీఐ ఎందుకు ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పలేదు? కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పలేదు?’ అని నిలదీశారు. సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది ఈ వ్యవహారంలో మంత్రులు, ఐఏఎస్‌ల పాత్ర ఏమిటని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. నెల రోజుల్లోపు ఈ జీవోలపై కౌంటర్ వేయాలని నోటీసులు జారీ చేసిందని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం నెల రోజులే గడువు ఇచ్చినా మంత్రులు తొమ్మిది నెలల తరువాత నోటీసులకు సమాధానం చెప్పారని ఆమె విమర్శించారు. దీనిని బట్టి కోర్టులంటే ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు.

మంత్రులు జవాబిచ్చేందుకు తొమ్మిది నెలల జాప్యం చేసినప్పుడు కూడా.. ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించడం లేదని సీబీఐ చెప్పకపోవడంలోని అంతర్యం ఏమిటని పద్మ ప్రశ్నించారు. ‘అసలు జగన్‌ను ఏ ప్రాథమిక ఆధారాలున్నాయని అరెస్టు చేశామని సీబీఐ చెప్పిందో అవి ఎక్కడినుంచి వచ్చాయి? ప్రభుత్వం సహకరించకుంటే సీబీఐ ఆ ఆధారాలను సృష్టించిందా? జగన్‌కు శిక్ష పడదగ్గ ఆధారాలు ఎలాగూ సీబీఐ వద్ద లేవు కనుక అలాంటి ఆధారాలను సృష్టించే వరకూ ఆయనను జైల్లోనే ఉంచేందుకు కొత్త ప్రణాళికను రచిస్తోందా?’ అని నిలదీశారు. అసలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారందరూ ద్రోహులే అన్న విధంగా సీబీఐ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను జైల్లో పెట్టి ఎనిమిది నెలలైనా, ఇంతవరకు దర్యాప్తులో ఒక్క ఆధారం ఉన్నట్టుగా కూడా తేల్చలేకపోయిందని, దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కూడా చెప్పలేని పరస్థితుల్లో ఉందని తెలిపారు. ‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయం, చట్టాలను విశ్వసించే దేశం మనది. అలాంటి చోట సీబీఐ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి ఎంత కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయో.. సామాన్య ప్రజలకు కూడా అర్థం అవుతోందని ఆమె పేర్కొన్నారు. శంకర్రావుకు కేసు ఎలా వేయాలో చెప్పిందీ, తమ కార్యాలయం నుంచి ఫ్యాక్స్‌లు పంపిందీ టీడీపీయేనని తెలిపారు. 

జగన్ జైలు నుంచి బయటకు వస్తే తమ పార్టీ ఉనికి ఉండదనే భయంతో.. ఆయనను శాశ్వతంగా జైల్లో ఉంచాలనే కుట్రకు టీడీపీ పాల్పడుతోందని పద్మ చెప్పారు. ఇవే కేసులకు సంబంధించి ఇతర నిందితులు బెయిల్ పిటిషన్లు వేసుకుంటే సీబీఐ కనీసం వ్యతిరేకించలేదన్నారు. ‘గత ఎమర్జెన్సీ రోజుల్లో మధు దండావతే, జయప్రకాష్ నారాయణ్, జార్జి ఫెర్నాండెజ్, కుల్దీప్ నయ్యర్ వంటి వారందరినీ జైల్లో పెట్టారు. కనీసం మీకు బెయిల్ అడగడానికి కూడా అర్హత లేదని ఆనాడు సుప్రీంకోర్టు జడ్జిలు తీర్పునిచ్చారు. ఆ జడ్జిలే కొందరు పదవి నుంచి దిగి పోయాక తాము చేసింది తప్పని అంగీకరించారు. ఇక్కడా అలాంటి పరిస్థితే వస్తుంది. ఇంత అన్యాయంగా అక్రమంగా కుమ్మక్కు రాజకీయాలతో 18 నెలలుగా ఇష్టానుసారం దర్యాప్తు జరుపుతున్నారంటే ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?’ అని పద్మ ప్రశ్నించారు. దేశ ప్రజలు ఆనాడు ఎమర్జెన్సీ అనంతరం ఎలాంటి తీర్పునైతే ఇచ్చారో తెలుగు ప్రజలు కూడా రాష్ట్రంలో కచ్చితంగా అలాంటి తీర్పే ఇస్తారని ఆమె చెప్పారు.

ఏడు అంశాల్లో జగన్‌ను సీబీఐ కావాలనే రిమాండ్ కోరలేదని...

జస్టిస్ శేషశయనారెడ్డి తీర్పు
సీబీఐ కావాలనే జగన్ రిమాండ్ కోరలేదనే విషయం తెలుసునని వ్యాఖ్య

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏడు అంశాల్లో సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసిన తరువాతనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని, ఆ మేరకు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. ఏడు అంశాల్లో దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా సీబీఐ ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయలేదని, అందువల్ల బెయిల్ మంజూరు చేయలేమని పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ను గతంలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

దీన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై వాదనలు విని రెండ్రోజుల క్రితం తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి... గురువారం ఉదయం 10.25 గంటలకు తీర్పు వెలువరించారు. ఆ సమయంలో కోర్టుహాలు న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. 
‘సుప్రీంకోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌పై జారీ చేసిన ఉత్తర్వుల్లో మూడు అంశాల గురించి స్పష్టంగా పేర్కొంది. అందులో మొదటిది, సీబీఐ చెప్పిన ఏడు అంశాల్లో దర్యాప్తు పూర్తి చేసి సమగ్రంగా తుది చార్జిషీట్ దాఖలు చేయాలి. రెండోది, సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసిన తరువాతనే జగన్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించొచ్చు. మూడోది, జగన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తామిచ్చిన ఉత్తర్వుల ప్రభావానికి లోనుకాకుండా, జగన్ దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్‌ను దిగువ కోర్టు విచారించాలి. 

ఈ నేపథ్యంలో ఏడు అంశాలకు సంబంధించి సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేయకుండానే జగన్ దాఖలు చేసిన ఈ బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం న్యాయపరంగా సముచితం కాదు. కాబట్టి సీఆర్‌పీసీ సెక్షన్లు 436, 439 కింద జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆమేరకు కొట్టివేస్తున్నా...’ అని జస్టిస్ శేషశయనారెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు వెలువరించిన తరువాత జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ... సీబీఐ దర్యాప్తునకు కాలవ్యవధి నిర్ణయించాలని, ఆ మేర ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. దీనికి జస్టిస్ శేషశయనారెడ్డి స్పందిస్తూ, జగన్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఇరుపక్షాల న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఉన్నారని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టునే అడిగి ఉండాల్సిందని అన్నారు. ఏడు అంశాల్లో జగన్‌ను సీబీఐ కావాలనే రిమాండ్ కోరలేదని, ఈ విషయం తనకు స్పష్టంగా తెలుసునని, అయినప్పటికీ ఇప్పుడు తాను చేయగలిగింది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజల ఆకాంక్షల మేరకే వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి..


ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా
జగన్‌పై కేంద్రం, చంద్రబాబు కుట్రలను దగ్గర నుంచి చూశా
ఆయనకు మద్దతుగా నిలబడటానికి ఇదే సరైన సమయమని భావించా
జైల్లో జగ న్‌తో నాని ములాఖత్

సాక్షి, హైదరాబాద్: మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రకటించారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానిగా.. ఆయన కుటుంబంపై జరుగుతున్న వేధింపులకు కలత చెందానని చెప్పారు. ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గురువారమిక్కడ ఆయన చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని, పార్టీలో చేరడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. జగన్‌తో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జగన్‌ను నెలల తరబడి జైల్లో పెట్టడం బాధాకరం. తమపై జరుగుతున్న వేధింపులను వివరించడానికి ఏనాడూ బయటకు రాని వైఎస్ సతీమణి, ఆయన కుమార్తె ఎండనక.. వాననక.. జనంలో తిరగాల్సి రావడం నాకు ఆవేదన కలిగించింది.

ఆ కుటుంబం కష్టాల్లో ఉన్న తరుణంలో ఇంకా జగన్ వైపు నిలబడకపోవడం ఏ మాత్రం ధర్మం కాదని నియోజకవర్గ ప్రజలు నాతో చెప్పారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా’ అని వివరించారు. వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిసి చేసిన కుట్రలను చాలా దగ్గరగా.. ప్రత్యక్షంగా.. మౌనంగా వీక్షించానని చెప్పారు. అసెంబ్లీలో కూడా వారి కుమ్మక్కును చూశానన్నారు. ‘కేంద్రం, చంద్రబాబు కలిసి కుమ్మక్కై ఎనిమిది నెలలుగా జగన్‌ను జైల్లో ఉంచడం చూసి.. ఆయనకు మద్దతుగా నిలబడటానికి ఇదే సరైన సమయంగా నేను భావించాను. నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు 2014 వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుదామనుకున్నా. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మహానేత తనయుడైన జగన్‌కు అండగా ఉండి పనిచేసేందుకే నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నారు. త్వరలో తేదీ నిర్ణయించుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతానని తెలిపారు. పేర్ని నాని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004, 2009లో వరుసగా గెలుపొందారు. ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి గతంలో బందర్ మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, గుర్నాథరెడ్డిలు కూడా జగన్‌ను ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు.

బాబు అధికారంలో ఉన్నంత కాలం అవినీతే

 రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడా టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అంత జిత్తులమారి నక్క, నయవంచకుడు మరొకరు ఉండరని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని జిత్తులమారి కొంగ అని బాబు విమర్శించడాన్ని నల్లపరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాదయాత్రలో చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడుతుండటాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని, అసలు అవినీతికి అడ్రసే చంద్రబాబు అనే విషయం ఎవరినడిగినా చెబుతారని ప్రసన్న విమర్శించారు. బాబు అధికారంలో ఉన్నంత కాలం అవినీతే రాజ్యమేలిందని, పదవి నుంచి దిగిపోగానే అవినీతి అని ఆయన గగ్గోలు పెడుతుంటే ప్రజలకు నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదని ప్రసన్న ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని బాబుకు సూచించారు. వై.ఎస్ గురించి మాట్లాడే నైతిక అర్హత బాబుకు లేదని ఆయన విమర్శించారు. వై.ఎస్ తన పాలనలో అన్ని వర్గాల వారికీ న్యాయం చేశారు, అందుకే ఆయన కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. వై.ఎస్‌ను విమర్శిస్తున్న చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దించారన్నారు. ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసిన బాబు...నయవంచకుడు, నరరూప రాక్షసుడు అని ప్రసన్న విమర్శించారు. వై.ఎస్ పేదల గుండెల్లో గూడు కట్టుకున్న దైవమని ఆయన పేర్కొన్నారు. 

రాహుల్ మెప్పుకోసమే చంద్రబాబు పాట్లు

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మెప్పు కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పడరాని పాట్లు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్ ప్రసాద్ దుయ్యబట్టారు. ఐఎంజీ భూముల అక్రమాల బాగోతం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్‌న ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు. ఇందులో భాగంగానే రాహుల్‌ను ప్రధాని చేసేందుకు తాము మద్దతిస్తామని జాతీయ దినపత్రికల్లో బాబు కథనాలు రాయించుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జనక్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కును కూలంకషంగా వివరించారు. 

‘ది హిందూ’, వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక కథనాలు రాసే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికల్లో కాంగ్రెస్-టీడీపీ మైత్రిపై వస్తున్న వార్తా కథనాలపై చంద్రబాబుగానీ, ఆయన భజనపరులుగానీ ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అదే పత్రికలు వైఎస్సార్ కాంగ్రెస్‌పై చిన్న కథనం రాస్తే అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా ఎగిరిపడే టీడీపీ నేతలు... ఇప్పుడు మౌనం దాల్చడం వెనకున్న మతలబు ఏమిటన్నారు. జగన్‌పై అక్రమ కేసులను బనాయించడం కోసం కాంగ్రెస్ నేత శంకర్రావుతో కలసి పనిచేయడం మొదలుకొని.. చీకట్లో చిదంబరాన్ని కలవడం, ప్రధాని మన్మోహన్‌తో రహస్యంగా భేటీ, ఇటీవల ఎఫ్‌డీఐ బిల్లు విషయంలో యూపీఏను గట్టెక్కించడం వరకూ చంద్రబాబు కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ కనుసన్నల్లోనే చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. 2జీ స్పెక్ట్రం స్కామ్‌లో చిదంబరం, బొగ్గు కుంభకోణంలో ప్రధాని మన్మోహన్‌పైనా, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపైనా వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడటం లేదని గుర్తు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మంత్రి పదవులు పొందినట్లు చంద్రబాబు కూడా టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేసుకుంటే ఆయనకు గౌరవముంటుందని జనక్ ప్రసాద్ హితవు పలికారు. జగన్ ఆస్తులపై నోరు పారేసుకుంటున్న చంద్రబాబు.. తన బినామీలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, రామోజీరావు ఆస్తులపై దర్యాప్తు కోరాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

Congress MLA Nani joins in YSRCP

తాజా సర్వేలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి!

Written By news on Thursday, January 24, 2013 | 1/24/2013

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ కూటమికి ఇబ్బందులు తప్పవని ఇండియా టుడే-నీల్సన్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే తేల్చింది. యూపీఏ కూటమికి వ్యతిరేక పవనాలు తప్పవని ఈ సర్వే పేర్కొంది. ప్రస్తుతం యూపీఏ మెజారిటీ సీట్లు గెలుచుకోవటం కష్టమని అభిప్రాయపడింది. తాజా ఇండియన్ టుడే-నీల్సన్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ కూటమి 152 నుంచి 162 సీట్లలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ సర్వేలో ఎన్డీఏ కూటమి సుమారు 198 నుంచి 208 సీట్లు గెలుచుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఇతర పార్టీలు 178 నుంచి 182 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొంది. ప్రధాని అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ కంటే మోడీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని సర్వే తెలిపింది.

26 జీవోలు అక్రమమని ఎలా నిర్థారించారు?

సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కాలం సహకరించక పోతే 26 జీవోలు అక్రమమని ఎలా నిర్థారించారు, ఏ ఆధారాలతో తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. జగన్ బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన దరిమిలా ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీబీఐ వైఖరిపై మండిపడ్డారు. జగన్‌ను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే దురుద్దేశ్యంతోనే సీబీఐ ప్రభుత్వం సహకరించలేదనే కొత్తవాదనను కోర్టు ముందుకు తెచ్చిందని ఆమె విమర్శించారు. ‘ఇది అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసు...ఈ కేసుకున రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదంటే సీబీఐ తీసుకోవాల్సిన తదుపరి చర్యలేమిటి? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేస్తారా? ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా?’ అని ఆమె ఆగ్రహంగా ప్రశ్నించారు. హైకోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. పద్దెనిమిది నెలలుగా దర్యాప్తు పేరుతో రక రకాల విన్యాసాలు చేస్తున్న సీబీఐ గతంలో జగన్ బెయిల్ పిటిషన్ వేసుకున్న ఏ కోర్టుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించలేదన్న విషయం ఎందుకు చెప్పలేదని ఆమె అన్నారు. ప్రభుత్వం సహకరించకుండానే 26 జీవోల్లో అక్రమాలు జరిగాయని మీరెలా నిర్థారించారు, లబ్ది పొందారని జగన్‌ను ఎలా అరెస్టు చేస్తారని ఆమె అన్నారు. హైకోర్టు ముందు చేసిన వాదనలు చూస్తే దర్యాప్తు ఎపుడు పూర్తవుతుందో చెప్పలేని వాతావరణాన్ని సీబీఐ కల్పిస్తోందని ఆమె దుయ్యబట్టారు. గత ఏడాది అక్టోబర్ ఐదో తేదీకి ముందు సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడు మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ చెప్పిందని ఆ గడువు ఈ ఏడాది జనవరి 5వ తేదీతో ముగుస్తుందని ఇలాంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పడమేమిటి అని అన్నారు. అదే విషయంలో సుప్రీం విచారణ సందర్భంగా ఎందుకు సీబీఐ చెప్పలేదన్నారు. 

పద్దెనిమిది నెలల క్రితం శంకర్‌రావు 26 జీవోలపై పిటిషన్ వేసినపుడు అడ్వకేట్ జనరల్ హాజరై వాదించాలి. కానీ ఆయన కౌంటర్ దాఖలు చేయలేదు సరికదా, ఆ ఛాయలకు కూడా రాలేదు. ఆరోజు సీబీఐ ఎందుకు ప్రభుత్వం సహకరించలేదని చెప్పలేదు, కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పలేదు అని పద్మ ధ్వజమెత్తారు. సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది ఈ వ్యవహారంలో మంత్రులు, ఐఏఎస్‌ల పాత్ర ఏమిటని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాతనే నెల రోజుల్లోపు ఈ జీవోలపై కౌంటర్ వేయాలని నోటీసులు జారీ చేసిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఒక నెల రోజులే గడువు ఇచ్చినా మంత్రులు తొమ్మిది నెలల తరువాత నోటీసులకు సమాధానం చెప్పారని ఆమె విమర్శించారు. దీనిని బట్టి కోర్టులంటే ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు. మంత్రులు సమాధానం చెప్పడంలో తొమ్మిది నెలల జాప్యం చేసినపుడు కూడా ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించలేదని సీబీఐ కోర్టుల్లో చెప్పక పోవడంలో అంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ‘అసలు జగన్‌ను ఏ ప్రాథమిక ఆధారాలున్నాయని అరెస్టు చేశామని సీబీఐ చెప్పిందో అవి ఎక్కడి నుంచి వచ్చాయి. 

ప్రభుత్వం సహకరించకుంటే మీరు ఆ ఆధారాలను సృష్టించారా? జగన్‌కు శిక్ష పడదగ్గ ఆధారాలు ఎలాగూ సీబీఐ వద్ద లేవు కనుక అలాంటి ఆధారాలను సృష్టించే వరకూ ఆయనను జైల్లో పెట్టాలని కొత్త ప్రణాళికను రచిస్తోందా?’ అని పద్మ ప్రశ్నించారు. సీబీఐ వ్యవహార శైలిపై తొలి నుంచీ తామేమి చెబుతున్నామో అది నిజమని ఈ రోజు తేలుతోందన్నారు. అసలు దేశ చరిత్రలోనే ఇంతటి అధ్వాన్నమైన దర్యాప్తు మరొకటి ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. శంకర్‌రావు పిటిషన్ వేసింది 26 జీవోల్లో అక్రమాలు జరిగాయని, ఆ దిశగా దర్యాప్తు జరుపకుండా జగన్ గారు లబ్ది పొందారనే కోణంలో దర్యాప్తును సాగదీస్తున్నారని ఆమె అన్నారు. అసలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారందరూ ద్రోహులే అన్న విధంగా సీబీఐ వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. జగన్‌ను జైల్లో పెట్టి ఎనిమిది నెలలైనా ఒక్క ఆధారాన్ని ఇంత వరకు దర్యాప్తులో తేల్చలేక పోయారు, దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో కూడా చెప్పలేని పరస్థితుల్లో ఉన్నారని ఆమె అన్నారు.‘63 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయం, చట్టం వాటిని విశ్వసించే దేశం మనది. అలాంటి చోట సీబీఐ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి ఎంత కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందో సామాన్య జనానికి కూడా అర్థం అవుతోందని ఆమె అన్నారు. ఇవాళ టీడీపీ కూడా నీతిమాలిన విధానంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. 

శంకర్‌రావుకు ఎలా కేసు వేయాలో చెప్పిందీ, తమ కార్యాలయం నుంచి ఫ్యాక్స్‌లు పంపిందీ టీడీపీయేనని ఆమె అన్నారు. జగన్ జైలు నుంచి బయటకు వస్తే తమ పార్టీ ఉనికి ఉండదనే భయంతో ఆయనను శాశ్వతంగా జైల్లో ఉంచాలనే కుట్రకు టీడీపీ పాల్పడుతోందని ఆమె దుయ్యబట్టారు. ఇదే కేసులకు సంబంధించి ఇతర నిందితులు బెయిల్ పిటిషన్లు వేసుకుంటే సీబీఐ కనీసం వ్యతిరేకించనైనా లేదు, కానీ ఐదున్నర లక్షల మెజారిటీతో గెలిచిన ఒక ప్రజా నాయకుడిని, ఓ పార్టీ అధ్యక్షుడిని అన్యాయంగా జైల్లో నిర్భందించారని ఆమె అన్నారు. ఒక విధానం గానీ, పద్ధతి గానీ లేకుండా సీబీఐ వ్యవహరిస్తోందని తమకు నిబంధనలు లేవన్నట్లుగా ఉందని అన్నారు. ఇదంతా చూస్తూంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నట్లుగా ఉందని పదే పదే రుజువు అవుతోందని ఆమె అన్నారు. హైకోర్టులో జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడానికి కారణమైన సీబీఐ వైఖరి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని అన్నారు. 

‘గత ఎమర్జెన్సీ రోజుల్లో మధు దండావతే, జయప్రకాష్ నారాయణ్, జార్జి ఫెర్నాండెజ్, కుల్దీప్ నయ్యర్ వంటి వారందరినీ జైల్లో పెట్టారు. కనీసం మీకు బెయిల్ అడగడానికి కూడా అర్హత లేదని ఆ నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు తీర్పు నిచ్చారు. అదే న్యాయమూర్తుల్లో కొందరు పదవి నుంచి దిగి పోయాక తాము చేసింది తప్పని అంగీకరించారు. ఇక్కడా అలాంటి పరిస్థితే వస్తుంది. ఇంత అన్యాయంగా అక్రమంగా కుమ్మక్కు రాజకీయాలతో పద్దెనిమిది నెలలుగా ఇష్టానుసారం దర్యాప్తు జరుపుతున్నారంటే ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?’ అని ఆమె ప్రశ్నించారు. దేశ ప్రజలు ఆనాడు ఎమర్జెన్సీ అనంతరం ఎలాంటి తీర్పునైతే ఇచ్చారో తెలుగు ప్రజలు కూడా రాష్ట్రంలో కచ్చితంగా అలాంటి తీర్పే ఇస్తారని ఆమె అన్నారు. సీబీఐ ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక పద్ధతి లేకుండా దర్యాప్తు చేయడం గర్హనీయం అని ఆమె అన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుకే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఎందుకున్నట్లు? అని ఆమె అన్నారు. 

Popular Posts

Topics :