01 September 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఉదయించే సూర్యుణ్ని ఆపలేరు: షర్మిల

Written By news on Saturday, September 7, 2013 | 9/07/2013

ఉదయించే సూర్యుణ్ని ఆపలేరు: షర్మిల
బద్వేల్ : ఉదయించే సూర్యుణ్ని ఎవ్వరూ ఆపలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయలేకనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డిని కుట్రచేసి జైల్లో పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ లో శనివారం సాయంత్రం జరిగిన సమైక్య శంఖారావం సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే... వైఎస్ రాజశేఖరరెడ్డి 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని.. పేదల కోసం దేశమంతా 41 లక్షల పక్కాఇళ్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి 45 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారని చెప్పారు. పేద ప్రజల మీద, అక్క చెల్లెళ్ల మీద భారం పడుతుందనే ఉద్దేశంతో ఏనాడూ ఏ ఒక్క ఛార్జీ పెంచలేదని విమర్శించారు.

ఇక రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని షర్మిల తీవ్రంగా దుయ్యబట్టారు. ''గతంలో మద్రాసును తీసేసుకున్నారు.. ఇప్పుడు సీమాంధ్రకు హైదరాబాద్‌ను దూరం చేసేస్తారట. కాంగ్రెస్ ఉద్దేశం సీమాంధ్రను వల్లకాడు చేయాలనేనా? ఇంత జరుగుతున్నా చంద్రబాబులో చలనం లేనే లేదు. కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. చేసిందంతా చంద్రబాబు చేసి ఇప్పుడు వైఎస్‌ఆర్‌పై నెపం నెడుతున్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా ఒకేసారి రాజీనామా చేశారు. వాళ్లతోనే మిగతా పార్టీల వాళ్లు కూడా రాజీనామా చేసుంటే విభజన ప్రక్రియ ఆగిపోయేది'' అని షర్మిల అన్నారు.

చంద్రబాబు కాంగ్రెస్‌తో నిస్సిగ్గుగా కలిసిపోయి ఎప్‌డీఐ ఓటింగ్ సమయంలో తమ ఎంపీలను గైర్హాజపరిచి కోట్లాది రైతులను, చిన్నవర్తకులకు వెన్నుపోటు పొడిచారని, ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే... ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక్క ఈగ కూడా వాలడానికి వీల్లేదని సిగ్గులేకుండా విప్‌ జారీ చేసి మరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడి కోట్లాది ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఒకప్పుడు సొంతమామకు వెన్నుపోటు పొడిచి, తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు తెలుగు గడ్డకు, పుట్టిన గడ్డకు, తెలుగు తల్లికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈ వెన్నుపోటు చంద్రబాబుకు అసలు ఆత్మ ఉందంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.

Smt. YS Vijayamma's letter to Union Home Minister Shinde

https://www.facebook.com/photo.php?fbid=606788102693823&set=pb.309587409080562.-2207520000.1378564058.&type=3&theater



Smt. YS Vijayamma's letter to Union Home Minister Shinde



కేంద్ర హోంమంత్రికి విజయమ్మ రాసిన లేఖ పూర్తి పాఠం ... 

‘గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే గారికి,
మేం పదే పదే ఆందోళనలు వ్యక్తంచేసినప్పటికీ.. రాష్ట్రంలో 60 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గత 38 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేబినె‌ట్ నో‌ట్ రూపకల్పనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మేం మీడియా ద్వారా తెలుసుకున్నామని మీకు తెలియజేయటానికి విచారిస్తున్నాం.‌ ఇది మౌలిక న్యాయసూత్రాలను విస్మరించటమే అవుతుంది. రాష్ట్ర విభజనకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ, ఎంఐఎం, ‌సిపిఐ(ఎం)లు వ్యతిరేకమన్న వాస్తవాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే అవుతుంది.

ఈ అన్యాయాన్ని ఆపాలని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని మేం పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కేవలం ఓట్లు, సీట్ల కోసం మాత్రమే ఈ అన్యాయం చేయటానికి కేంద్రం ముందుకు వెళ్లటం దురదృష్టకరం.‌

కనీసం ఇప్పటికైనా.. మా రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ అన్యాయాన్ని ఆపివేయాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీగా మేం గతంలోనే చెప్పినట్లు ఈ విభజన చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’

కృతజ్ఞతలతో
వై.ఎస్.విజయమ్మ




13,14 తేదీల్లో తూ.గో జిల్లాలో షర్మిల బస్సు యాత్ర

రాజ‌మండ్రి: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఈ నెల 13న ఉదయం 10 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతం నుండి తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్రవేశించనున్నట్టు ఆ జిల్లా క‌న్వీన‌ర్ చిట్టెబ్బాయి పేర్కొన్నారు. బ‌స్సు యాత్రలో భాగంగా ఉదయం 10.30 గంటలకు రావులపాలెంలోనూ,  సాయంత్రం 4 గంటలకు అమలాపురంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.

14వ తేదీన ఉదయం 10 గంటలకు కాకినాడ మెయిన్ రోడ్డు వద్ద సమైక్యాంధ్ర ధర్నాలో షర్మిల పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తుని నుండి విశాఖ జిల్లాలోకి ష‌ర్మిల బస్సుయాత్ర ప్రవేశించనునున్నట్టు క‌న్వీన‌ర్ చిట్టెబ్బాయి పేర్కొన్నారు.

Sureedu sureedu terachatu.......song

Sharmila's speech in Mydukur

Vijayamma asks Shinde to keep AP united

Sharmila's speech in Proddatur

'విలువతో పోరాడే దమ్ము,ధైర్యంలేని కాంగ్రెస్,టిడిపి

మైదుకూరు: విలువలతో పోరాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఈ రోజు ఆమె ఇక్కడకు వచ్చారు. ఆ రెండు పార్టీలు  కుట్రలు, కుతంత్రాలతో జగనన్నను జైలులో పెట్టించారన్నారు. జగనన్న జైలులో ఉన్నా పులేన్నారు.

వెన్నుపోటుదారు చంద్రబాబును తరిమి..తరిమి కొట్టాలని షర్మిల  పిలుపు ఇచ్చారు.  తన కొడుకు కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు తొక్కిపెట్టారని విమర్శించారు.  హైదరాబాద్ తన వల్లే అభివృద్ధి చెందినట్లు గొప్పలు  చెబుతున్న చంద్రబాబు హైదరాబాద్ కు ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టు ఉన్న విలువైన భూములను తన వారికి అమ్ముకున్నారన్నారు.  చార్మినార్‌ను మీరే కట్టారా అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు.  హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.  ఇప్పటికైనా తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి న్యాయం చేసే సత్తా మీకు లేదు..ఇక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి అని అన్నారు. న్యాయం 

విభజన నిర్ణయాన్ని ఉపసంహరించండి: విజయమ్మ లేఖ

విభజన నిర్ణయాన్ని ఉపసంహరించండి: విజయమ్మ లేఖ
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోందని.. ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ మొదటి నుంచీ చెప్తున్నట్లుగా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజయమ్మ శుక్రవారం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు లేఖ రాశారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజన అన్యాయానికి వ్యతిరేకంగా గత 38 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయంటూ తీవ్ర ఆందోళన, విచారం వ్యక్తం చేశారు. ఇది మౌలిక న్యాయసూత్రాలకు విరుద్ధమని, వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎంలు విభజనకు పూర్తిగా వ్యతిరేకమన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించటమేనని తప్పుపట్టారు. ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని ఆపివేయాలని, విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రికి విజయమ్మ రాసిన లేఖ పూర్తి పాఠం... 
 
 ‘‘గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే గారికి, 
 మేం పదే పదే ఆందోళనలు వ్యక్తంచేసినప్పటికీ.. రాష్ట్రంలో 60 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గత 38 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ రూపకల్పనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మేం మీడియా ద్వారా తెలుసుకున్నామని మీకు తెలియజేయటానికి విచారిస్తున్నాం. 
 
 ఇది మౌలిక న్యాయసూత్రాలను విస్మరించటమే అవుతుంది. రాష్ట్ర విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సీపీఐ(ఎం)లు వ్యతిరేకమన్న వాస్తవాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే అవుతుంది. ఈ అన్యాయాన్ని ఆపాలని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని మేం పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కేవలం ఓట్లు, సీట్ల కోసం మాత్రమే ఈ అన్యాయం చేయటానికి కేంద్రం ముందుకు వెళ్లటం దురదృష్టకరం. 
 
 కనీసం ఇప్పటికైనా.. మా రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ అన్యాయాన్ని ఆపివేయాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం. వైఎస్సార్‌సీపీగా మేం గతంలోనే చెప్పినట్లు ఈ విభజన చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ’’
 కృతజ్ఞతలతో 
 వై.ఎస్.విజయమ్మ

కేంద్ర హోం మంత్రి షిండేకు వైఎస్ విజయమ్మ లేఖ!

Written By news on Friday, September 6, 2013 | 9/06/2013

కేంద్ర హోం మంత్రి షిండేకు వైఎస్ విజయమ్మ లేఖ!
హైదరాబాద్:
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ విజయమ్మ లేఖలో డిమాండ్ చేశారు. 
 
ఎంఐఎం, సీపీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని లేఖలో వెల్లడించారు. పార్టీల, ప్రజల ఇష్టాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని లేఖలో వెల్లడించారు. రాష్టర్ విభజనకు కేంద్ర ప్రభుత్వం నోట్ ను సిద్ధం చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయని లేఖలో తెలిపారు. 
 
ఓట్లు, సీట్ల ప్రతిపాదికన రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలో 60 శాతం మంది విభజనకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని లేఖలో పేర్కోన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధారంగా కేంద్రం విభజనకు ముందుకెళ్తోందని, ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి అంటూ లేఖలో విజయమ్మ సూచించారు. 

బోనులో ఉన్నా సింహం సింహమే

బోనులో ఉన్నా సింహం సింహమే
బోనులా ఉన్నా సింహం సింహమేనని, జగనన్నను కూడా ఎవరూ ఆపలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. త్వరలోనే గజనన్న వచ్చి అందరికీ సాంత్వన పలుకుతారని ఆమె తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి అశేష సంఖ్యలో హాజరైన జనసందోహం నడుమ ఆమె ఆవేశంగా ప్రసంగించారు. ఎన్నో పథకాలను వైఎస్ అద్భుతంగా అమలుచేసి చూపించారని, ఇంటింటికీ తలుపు తట్టి సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అందించారని చెప్పారు. ప్రజల మీద ఏ పన్నూ వేయకుండా అభివృద్ధి పథకాలను అమలు చేసిన ఘనత రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. అన్మదమ్ముల మధ్య కాంగ్రెస్ విభజన చిచ్చుపెట్టిందని,  విభజనతో సీమాంధ్ర ప్రాంతం మొత్తం ఎడారి అవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేశారని, అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతినిధులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, ఈయన పదే పదే ఢిల్లీ వెళ్లి రావడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది కూడా ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ఆయనకు తెలుస్తూనే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రాన్ని చీల్చిందని.. అలాంటి ఈ ముఖ్యమంత్రి పనికొచ్చేవాడో, పనికిరానివాడో ప్రజలే తేల్చాలని అన్నారు. హైదరాబాద్ నిర్మాణానికి 60 ఏళ్లు పట్టినప్పుడు పదేళ్లలోనే సీమాంధ్రకు రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర అంటూ ఆమె చేసిన నినాదాలతో వేలాది మంది గొంతు కలిపారు. ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఓ తండ్రిలా ఆలోచన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే కోరినా.. ఇది ప్రజాస్వామ్య దేశమని కూడా చూడకుండా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని షర్మిల మండిపడ్డారు. న్యాయం చేయగల సత్తా లేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.

జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకు కూర్చోదని, జగనన్న నాయకత్వంలో ముందు నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. నిర్బంధంలో ఉండి కూడా ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని, జనంలో ఉన్నా.. జైల్లో ఉన్నా జననేతేనని జగనన్న నిరూపించుకున్నారన్నారు. బయట ఉన్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు దొంగలు, ద్రోహులని వాళ్లు కూడా నిరూపించుకున్నారన్నారు.

మంగళగిరిలో చంద్రబాబుకు సమైక్య సెగ

మంగళగిరిలో చంద్రబాబుకు సమైక్య సెగ
మంగళగిరి : గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంగళగిరిలో సమైక్యసెగ తగిలిగింది. చంద్రబాబు సభలో సమైక్యాంధ్ర ప్లకార్డులతో విద్యార్థులు నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులను బలవంతంగా నెట్టివేశారు.

ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అడుగడుగునా సమైక్య సెగ తగులుతోంది. అంతకుముందు క్రోసూరులోనూ చంద్రబాబుకు సమైక్య ఉద్యమ వేడి తాకింది. ఆయనను అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. సమైక్యవాద ప్లకార్డ్స్‌తో నిరసన తెలిపారు.

రెడ్డిగూడెంలో ప్రసంగిస్తున్న సమయంలోనూ కొందరు యువకులు ముందుకు దూసుకువచ్చి సమైక్యవాదానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. బాబు వ్యక్తిగత సిబ్బంది, రక్షణ వలయాన్ని దాటుకుంటూ బస్ వద్దకు చేరుకుని... సమైక్యవాదం వర్ధిల్లాలి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపివేసి సత్తెనపల్లికి వెళ్లిపోయారు.

చంద్రబాబు వేర్పాటువాది: జోగి రమేష్

చంద్రబాబు వేర్పాటువాది: జోగి రమేష్
కృష్ణా: తెలంగాణ లేఖ ఇచ్చిన రోజే తెలుగుజాతి మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
జోగి రమేష్ విమర్శించారు. లక్షల కోట్ల ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబే స్వయంగా తన బండారంను బయటపెట్టుకున్నారని అన్నారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ, ఆత్మగౌరవమంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ముమ్మాటికి సమైక్యవాదే, చంద్రబాబే వేర్పాటువాది అని జోగి రమేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి టీడీపీనే కారణమని జోగి రమేష్ అంతకుముందు విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి  నేతలు చీడపురుగులని ఆయన మండిపడ్డారు. రాజీనామాలు చేశామంటున్న కాంగ్రెస్ నేతలు అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని డిమాండ్ చేశారు.

Both development and welfare put on back burner after YSR death,

Jupudi condemns attack on Seemandhra lawyers by T lawyers

సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణం: భూమన

సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణం: భూమన
తిరుపతి/విశాఖపట్టణం : హైదరాబాద్‌లో సీమాంధ్ర లాయర్లపై దాడి దారుణమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ లాయర్లు అప్రజాస్వామికంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యమాలు జరిగినప్పుడు సీమాంధ్ర లాయర్లు ఎలాంటి దాడులు చేయలేదని గుర్తు చేశారు. హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర లాయర్లపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అన్నారు. ఇలాంటి చర్యలతో సమైక్య ఉద్యమం మరింత బలపడుతుందని చెప్పారు.

హైకోర్టులో సీమాంధ్ర లాయర్లపై తెలంగాణ న్యాయవాదుల దాడిని విశాఖపట్టణం బార్‌ అసోసియేషన్ ఖండించింది. దాడికి నిరసనగా జిల్లాకోర్టు దగ్గర న్యాయవాదుల రాస్తారోకో నిర్వహించారు. మానవహారం చేపట్టారు. తమ ప్రాంత న్యాయవాదులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లాయర్లపైనే దాడి చేస్తే మిగతావారి పరిస్థితేంటి?

లాయర్లపైనే దాడి చేస్తే మిగతావారి పరిస్థితేంటి?
హైదరాబాద్ : హైకోర్టులో సీమాంధ్ర లాయర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ అన్నారు. లాయర్లపైనే దాడి చేస్తే మిగిలినవారి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. హైకోర్టులో న్యాయవాదులపై దాడి ప్రజాస్వామ్య విలువలు దిగజార్చేలా ఉందని అన్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా పరిగణించాలన్నారు. పరిస్థితిని అదుపుచేయలేకుంటే ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పోలీసు కమిషనర్ కలిసిన పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా అని అడిగారు. శాంతి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని జూపూడి విమర్శించారు. హైకోర్టులో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో సంబంధం ఉంటే జగన్ జైల్లో ఎందుకు ఉంటారు?

చంద్రబాబుకు మతి భ్రమించింది: అంబటి రాంబాబు
ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు
 అవిశ్వాసం సమయంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది మీరు కాదా బాబూ?
ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో సంబంధం ఉంటే జగన్ జైల్లో ఎందుకు ఉంటారు?
మతి భ్రమించి మాట్లాడుతున్న బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
సమైక్యాన్ని కోరుతున్నది వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే
ఏకపక్ష విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీలే
విభజనపై చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి.. ఆయనతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులకు రాజీనామా చేయాలి

 
 సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుజాతి ఆత్మగౌరవం’ పేరిట సీమాంధ్రలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలో లేక విభజించాలనే దానికి స్పష్టంగా వైఖరి చెప్పకుండా... మతి భ్రమించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే మంచిదని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత ఏకపక్ష విభజనకు అనుకూలంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీలు వ్యవహరించాయి. కానీ ఏకపక్ష విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాణిని వినిపిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే’ అని అంబటి పేర్కొన్నారు.
 
  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా... ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఏ ఒక్కరికీ అర్థంకావడంలేదన్నారు. ‘చంద్రబాబూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. విభజించాలంటూ కేంద్రానికి మీరిచ్చిన లేఖను వెంటనే ఉపసంహరించుకోండి. మీరు, మీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి’ అని హితవు పలికారు. చంద్రబాబు చేస్తున్న యాత్రకు జనం రాకపోవడంతో.. వారికి అనుకూలంగా ఉండే కొన్ని చానెళ్లు ఆ దృశ్యాలను చూపించేందుకు చాలా ఇబ్బంది పడిపోతున్నాయన్నారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని బాబు కూడా తన యాత్రను ముఖ్య పట్టణాల ద్వారా వెళ్లకుండా సందులు, గొందుల్లో తిరుగుతున్నారని ఎద్దేశా చేశారు. విభజన లేఖను వెనక్కు తీసుకునే దాకా సీమాంధ్ర ప్రజల ఆదరణ బాబుకు దక్కదని అంబటి స్పష్టం చేశారు.
 
 ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది చంద్రబాబే..
 తెలుగువారి ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని ప్రజలు నమ్ముతున్నట్లు అంబటి పేర్కొన్నారు. ‘ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రాన్ని విభజించాలంటూ ప్రణబ్ కమిటీకి 2008లో లేఖ ఇచ్చారు. అంతేకాదు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదనడమే కాక, రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గతేడాది రాష్ట్రాన్ని విభజించాలంటూ ప్రధానికి లేఖలు రాసి, షిండేకు లేఖలు అందజేశారు’ అని వివరించారు. ఇంత చేసిన చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర చేస్తున్నానంటే సీమాంధ్ర ప్రజలు విశ్వసించేదెలా? అని ప్రశ్నించారు.
 
 హైదరాబాద్ సీమాంధ్రుల హక్కు అని ఎక్కడైనా చెబుతున్నారా?
 హైదరాబాద్ నగరాన్ని మొత్తం తానే నిర్మించానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గేయడం లేదా అని అంబటి ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌కు బాబు ఒరగబెట్టింది ఏంటి? అసెంబ్లీ నిర్మించారా, చార్మినార్ కట్టించారా, మక్కామసీద్, బిర్లాటెంపుల్, ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే వీటిలో ఏ ఒక్కటైనా నిర్మించారా’ అని అడిగారు. హైదరాబాద్ మొత్తాన్ని సింగపూర్‌లా మార్చానని చెబుతున్న బాబు ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇంతగా గింజుకుంటున్న చంద్రబాబు రాష్ట్రం మొత్తం సమైక్యంగా ఉంచాలని, హైదరాబాద్‌పై సీమాంధ్రులకు కూడా హక్కు ఉందని ఏ ఒక్క చోటైనా చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ‘పాడిందే పాటరా పాచిపళ్ల దాసరి’ అన్నట్లు మహానేత వైఎస్ కుటుంబంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
 
 ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని అంబటి మండిపడ్డారు. అలాంటి పార్టీతో కుమ్మక్కు అయితే జగన్ జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అవిశ్వాసం సందర్భంగా విప్ జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినది మీరు కాదా? అని చంద్రబాబును అడిగారు. నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను మోసే కార్యక్రమం మీరు తీసుకొని ఇతరులను నిందించడమేమిటన్నారు. అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టినట్లయితే ఇప్పుడు రాష్ట్ర విభజన పరిస్థితి వచ్చుండేదే కాదు కదా? అని ప్రశ్నించారు. ‘అనునిత్యం సమయం, సందర్భం లేకుండా 24 గంటలు జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
 
 ఈ రోజు జగన్ జైలుకు ఎందుకు వెళ్లారో, ఎవరిని ఎదిరించినందుకు ఇలా జరుగుతున్నదో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. మరి ఆయన సుపుత్రుడు లోకేష్‌బాబు సంగతేంటి? ఆయన కొడుకు గురించి మాట్లాడాల్సి వస్తే పుంఖానుపుంఖాలుగా చెప్పాల్సి వస్తుంది’ అని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు సొల్లు కబుర్లు కట్టిపెట్టి రాష్ట్ర విభజనపై తన విధానమేంటో స్పష్టం చేయాలని అంబటి డిమాండ్ చేశారు. ఈనెల 7న హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభకు వైఎస్సార్‌సీపీని ఆహ్వానించకపోవడానికి గల కారణాలేంటని మీడియా ప్రశ్నించగా... ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేం చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఏపీఎన్జీవోలు ఎందుకు ఆహ్వానించడం లేదో వారినే అడగాలి’ అని ఆయన అన్నారు.

వైఎస్సార్ సీపీ నేత ఆర్కే బహిరంగ లేఖ

ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారే ప్రజానాయకులవుతారు. ఈ విషయాన్ని విస్మరించి.. తెలుగు ప్రజల్ని వంచించి.. సోనియా విశ్వాసం, దిగ్విజయ్ సింగ్, చిదంబరం ప్రాపకం పొందడం కోసం చంద్రబాబు పాకులాడడం తగదని వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. జిల్లాలో బస్సుయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్కే గురువారం ఓ బహిరంగలేఖ రాశారు. 
 
 తనకు అధికారం ఇస్తే ఏడాదిలోపు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పదే పదే వేడుకుంటున్న చంద్రబాబుకు 2004, 2009లో రెండు దఫాలు ప్రజలు తిరస్కరించినా వారి మనోభావాలు పట్టించుకోకుండా ఆత్మవంచన యాత్ర చేయడం ఇంకా ఎందుకోసమని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానం సుస్పష్టమని, టీడీపీ విధానమేంటో చంద్రబాబు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆర్కే బహిరంగ లేఖలోని ప్రశ్నలివే...
 
 = బాబు గారూ... 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని పోటీ చేసి టీడీపీ తెలంగాణకు అనుకూలమని మీరు ప్రకటించిన విషయం వాస్తవమా? అవాస్తమా?
 
 = తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా 2008లో బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు ప్రణబ్‌ముఖర్జీకి  లేఖ ఇచ్చి ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రం విభజిస్తే సీమాంధ్ర పరిస్థితి ఏంటి? అన్న విషయంపై ఒక్క ముక్కయినా రాశారా? 
 
 = విభజన ప్రకటన వెలువడిన తర్వాత నీటి సమస్య, హైదరాబాద్ మహానగరం అంశాలపై పరిష్కారం కోసం ప్రశ్నించకుండా సీమాంధ్రుల మనోభావాల్ని రూ.4-5 లక్షల కోట్లకు తాకట్టు పెట్టే విధంగా ప్యాకేజీ అడిగిన విషయం మరిచి తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర అంటూ తెలుగుజాతి ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారా? లేదా?
 
 = రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న మీ వద్దకు ఏపీఎన్జీవోలు వచ్చి బ్లాంక్ చెక్‌లా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోమని ప్రాధేయపడినా వారి పట్ల మీరు వ్యవహరించి తీరు.. వారితో ఏం మాట్లాడారో.. మీకు గుర్తుందా?
 
 = విభజన ప్రకటనపై కాంగ్రెస్ ఎక్కడ వెనక్కు వెళుతుందోనని గతంలో రెండు కళ్ల సిద్ధాంతం అన్నట్లు ఇప్పుడు రెండు కాళ్ల సిద్ధాంతం కోసం మీరు యాత్ర చేయడం లేదని మనస్సాక్షితో చెప్పగలరా?
 
 = విభజన జరిగితే మీరు ప్రాతినిధ్యం వహించే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పు నీరు తప్ప మంచినీరు దొరకదనే విషయం మీకు తెలియదా? ఈ విషయాన్ని మీ యాత్రలో ధైర్యంగా చెప్పగలరా? 
 
 = రాష్ట్ర విభజనపై ప్రకటన చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ఆగదని చెబుతున్న దిగ్విజయ్‌సింగ్.. మీకు మంచి స్నేహితుడనే విషయం ఆయన స్వయంగా మీడియాలో అంగీకరించారు. ఈ విషయంపై బహిరంగంగా బస్సు యాత్రలో మీరు ప్రకటన చేయగలరా?
 
 = మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేయకుండా రాజకీయ వ్యాఖ్యలతో, ఆరోపణలతో కూడిన లేఖలను రాజీనామా చేశారా? లేదా? 
 
  ఈప్రశ్నలపై ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని మీరు యాత్ర సాగించాలని, ముఖ్యంగా చంద్రబాబు ఫ్రస్టేషన్ నుంచి బయటపడాలని ఆర్కే తన లేఖ ద్వారా సూచించారు. 

ఒకే మాట... ఒకే వైఖరి!

ఒకే మాట... ఒకే వైఖరి!
 సందర్భం: ‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరిగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించమని కోరుతున్నాం’ అని 28 డిసెంబర్ 2012న కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు ఇచ్చిన లేఖలో స్పష్టంగా చెప్పాం.
మా పార్టీ ఎక్కడా విధానాన్ని మార్చుకోలేదు. వెనక్కి పోలేదు... యూ టర్న్ తీసుకోలేదు. అన్ని ప్రాంతాలు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ చేసింది.
 
 గడిచిన నాలుగేళ్లుగా ఈ రాష్ట్రం దిక్కూ మొక్కూ లేని అనాధగా మిగిలింది. ఎప్పుడు ఏం జరు గుతుందో అంతుబట్టని పరిస్థితి. రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఢిల్లీకి చెక్కర్లుకొట్టే నాయకులు... అం తా అనిశ్చితి. జనం గోడు పట్టిం చుకోకుండా నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అండతో సర్కారును నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి. అన్ని లెక్కలూ వేసుకుని కాంగ్రెస్ ఉన్నట్టుండి ఒక్కసారిగా విభజన అంశం తెర మీదకు తెచ్చింది. ఆగమేఘాలపై యూపీఏ సమావేశం, అటు తర్వాత సీడబ్ల్యూసీ తీర్మానం పూర్తిచేసి రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించింది. ఇన్నాళ్లనుంచి తెలంగాణపై సమావేశాలు జరుగుతున్నా ఎక్కడా తన వైఖరేమిటో, దానికి ప్రాతిపదికేమిటో చెప్పని కాంగ్రెస్ ఉన్నట్టుండి నిర్ణయం వెల్లడించడంతో కోస్తా, రాయలసీమ ప్రజల్లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దాంతో ఆ నిందను ఇతర పార్టీలపై వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
 
 మీరు ఒప్పుకోబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా తెలంగాణకు అనుకూలమంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఇరు ప్రాంతాల్లోనూ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం కావడం... ఎన్నికల్లో ప్రయోజనం ఆశించి తీసుకున్న నిర్ణయం తిరగబెట్టడంతో ఏంచేయాలో తోచక... రాజకీయంగా ఆ రెండు పార్టీలు కొత్త నాటకానికి తెరతీశాయి. ఇక ప్రజలకు దగ్గరకాలేమని, వారు తమను విశ్వసించరని తెలుసుకుని ఆ రెండు పార్టీలు తెరవెనుక కుట్రలు మొదలుపెట్టాయి. తీసుకున్న నిర్ణయంపై వక్రభాష్యం చెప్పడం ప్రారంభిం చాయి. తెలంగాణ ఏర్పాటు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల అని, వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూలంగా లేఖ ఇచ్చిందనీ...అది యూ టర్న్ తీసుకుందని...  విషప్ర చారానికి దిగాయి. మేం చెప్పని విషయాన్ని చెప్పినట్టు దుష్ర్పచారం చేస్తున్నాయి. వైఎస్‌పైనా... మా పార్టీపైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. నిజానికి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీల మాదిరి కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఆది నుంచి ఒకే మాట చెబుతోంది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి సమైక్య శంఖారావం వరకు ఒక మాటపై నిలబడింది.
 
 ప్లీనరీలో మేం చెప్పిందేమిటి...?
 వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత జూలై 8 న ఇడుపు లపాయలో జరిగిన తొలి ప్లీనరీ ప్రజాప్రస్థానం ముగిం పులో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లా డుతూ, తెలంగాణ అంశంపై పార్టీ వైఖరేంటో విడమ రిచారు. ‘‘సున్నితమైన అంశం మీద.. ఒక అభిప్రా యమంటూ చెప్పాలి కాబట్టి చాలా ఆలోచనలు చేశాం. ఇవాళ ఇటువంటి జటిలమైన సమస్యకు అభిప్రాయం చెప్పాల్సివస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మేం తెలం గాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని నేను చెబు తున్నా. అయితే ఇవాళ తెలంగాణ ఇచ్చే శక్తి మాకు లేదు. తెలంగాణను ఆపే శక్తి కూడా మాకు లేదు. ఈ రాష్ట్రం అత లాకుతలామవుతుందన్నా, ఇన్ని వందల మంది చని పోయినా, ఆస్తులు నష్టమయ్యాయన్నా దీనికి కారణం.. కేంద్ర ప్రభుత్వమే. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకా రం రాష్ట్రాలను విభజించాలన్నా, కలిపి ఉంచాలన్న పూర్తి హక్కులు కేంద్రానికే ఉన్నాయని తెలిసినప్పటికీ కేంద్రం మనతో చెలగాటమాడుతోంది.
 
 కనీసం ఇప్పటికైనా మన జీవితాలతో చెలగాటమాడడం మానేసి మన మధ్య వైష మ్యాలు పెంచకుండా అందరి మనోభావాలు పరిగణ నలోకి తీసుకుంటూ, ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా వెంటనే ఒక మంచి నిర్ణయం, ఒక మంచి మార్గం చెప్పవలసిన బాధ్యత పూర్తిగా ఈ కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే ఉందని చెబుతున్నా. ఒక పంచా యతీలో కేంద్ర ప్రభుత్వం పెద్దమనిషిగా కూర్చుని ఉంది. ఆ పంచాయతీ చేసేటప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ పంచాయతీ పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది’’. ఇదే ప్లీనరీ తీర్మానం కూడా. అంటే దీనర్థం తెలంగాణకు అంగీ కరిస్తున్నట్టా? సమస్యకు విభజనే పరిష్కారమా? ఇప్పుడు అడ్డగోలుగా చేసిన నిర్ణయం అందరి ప్రయోజనాలు పరిరక్షిస్తున్నాయా? ఇది అందరి మనోభావాలు పరిగ ణలోకి తీసుకున్నాక చేసిన నిర్ణయమా?
 
 షిండేకిచ్చిన లేఖలో ఏముంది?
 28 డిసెంబర్ 2012 న కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమా వేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టంగా లేఖ రూపంలో తెలియజేసింది. ఆ లేఖలో ఏముందంటే... ‘‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అలాగే అన్ని ప్రాంతాల వారు సుఖ సంతోషాలతో తమ జీవనవిధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ - భారత రాజ్యాంగంలో అనేక అధికరణ లను పొందుపరిచారు. అధికరణలను అమలుపరిచే అధి కారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు.
 
 అందులో భాగం గానే ఆర్టికల్ 3 ను రాజ్యాంగంలో పొందుపరిచి, రాష్ట్రా లను విభజించాలన్నా లేదా కలిపి ఉంచాలన్నా ఆ అధికా రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కేంద్రానికే సర్వాధికారాన్ని ఇచ్చారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకుండా, ఎన్ని పార్టీలు ఏమి చెప్పినా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికే మీ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అయినా రాష్ట్రంలో ఒక పార్టీగా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యతను గుర్తించి మా వైఖరిని ఇలా తెలియజేస్తున్నాం.’’
 
 ‘‘ఇంతకుముందు 2011 జూలై 8, 9 తేదీల్లో మేము మా పార్టీ మొదటి ప్లీనరీలో చెప్పినట్టుగా- తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగ ణలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరి తగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమో దయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరు తు న్నాం.’’ ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ లేఖలను ఇంగ్లీషులో రూపొందించగా, ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఎలాంటి గందరగోళం లేకుండా తెలు గులో అందజేసింది.
 
 ఇంత స్పష్టంగా వైఖరి విడమరిచిన తర్వాత కూడా ఈ లేఖలో తెలంగాణ ఏర్పాటు కోసం అం గీకరించామన్న దానికి లేశమాత్రమైనా ఆస్కారముందా? విభజనే పరిష్కారమని మేమెక్కడైనా చెప్పామా? మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏంటి? కీలకమైన అంశంపై నిర్ణయం తీసుకునేప్పుడు దానికి ప్రాతిపదిక, ప్రతి పాదనలు, అన్ని పక్షాలతో చర్చలు అవసరం లేదా? అం దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయాలని అన్న మా పార్టీ వైఖరికి, తెలంగాణకు సానుకూలం అని లేఖ ఇచ్చిన టీడీపీ వైఖరికి మధ్య ఉన్న తేడా ఎందుకు కని పించడంలేదు? ఏ సమస్య ఉత్పన్నమైనా... ఒక ప్రాం త ప్రజల ఆకాంక్షను గుర్తించడం ప్రజాస్వామ్యంలో పార్టీల కనీస ధర్మం. సమస్య ఉత్పన్నమైనప్పుడు ఒక ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం సమ్మతం కాదు.
 
 ఆనాడు వైఎస్ ఏమన్నారు...
 2009 ఫిబ్రవరి 11 ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి రాష్ట్ర శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏకాభిప్రాయానికి యత్నించినా సాధ్యంకాలేదు. మరికొన్ని పార్టీలు మద్దతివ్వడానికి నిరాకరించాయి. అప్పటి నుంచి ఈ సమస్యనెలా పరిష్కరించాలనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈలోగా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తమ భద్రతకు ఇబ్బంది కలుగుతుందని ముస్లిం మైనారిటీలు చెప్పారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించాలి.
 
  గత 30. 40, 50, 60 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉన్నందునే ఇక్కడ స్థిరపడ్డామని కోస్తా, రాయలసీమ ప్రజలు అంటున్నారు. రాష్ట్రానికి రాజధాని అయినందునే హైదరాబాద్ వచ్చా మని అంటున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరిం చాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు, మూడు, నాలుగు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. సీమ, ఉత్తరాంధ్ర, కోస్తా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని అంటు న్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ఏర్పా టుకు తీసుకోవలసిన చర్యలను సూచించడానికి అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ నివేదిక సమ ర్పిం చాక... దాని ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది.’’ అని స్పష్టంగా చెప్పారు.
 
 ఏది వైఎస్ కల...?
 ఈ ప్రకటన చేసిన తర్వాత రోశయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోను కూడా జారీ చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు జరగడం, వైఎస్ నేతృ త్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం, కొద్ది రోజులకే వైఎస్ మృతిచెందడం తెలిసిన పరిణామాలే. తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకునే ముందు దానితో సంబంధం ఉన్నవారు లేవనెత్తిన అభ్యంతరాలు, వారి ఆందోళనలను పరిష్కరించాల్సి ఉందని వైఎస్ తన ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ... తెలంగాణ ఏర్పాటు రాజశేఖరరెడ్డి ‘కల’ అని ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి దిగ్విజయ్‌సింగ్ ఎలా చెబుతారు? ఈ ప్రాంతం, ఆ ప్రాంతమని తేడా లేకుండా రాష్ట్రాన్ని మొత్తంగా  సస్యశ్యా మలం చేయాలన్నదే వైఎస్ స్వప్నం.
 
 అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే ఆయన కల. అందుకే ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులు, రెండు రూపా యలకే కిలో బియ్యం, అర్హులైన అందరికీ సంతృ ప్తస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీకే రుణాలు, సంతృప్తస్థాయిలో వృద్ధాప్య పెన్షన్లు... ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ అనేక వినూత్న సంక్షేమ పథకాలు చేపడితే... ఉన్నంత కాలం కొనియాడి ఆయన మరణించగానే మాట మార్చిందెవరు? అబ్బ బ్బే... అవన్నీ కాంగ్రెస్ పథకాలే అని, అధిష్టానం ఆమో దంతోనే చేపట్టారని రకరకాల మాటలు చెప్పారు.  పథ కాలైతే మీవి, తెలంగాణ అయితే వైఎస్ కలా? తెలంగాణ అంశంపై వైఎస్ ఆనాడు నిండు శాసనసభలో ప్రకటన చేయడం అబద్ధమా? రోశయ్య నేతృత్వంలో కమిటీ వేయడం అవాస్తవమా?  వైఎస్ మరణం తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటవడం, ఆయనను మద్దాయిగా చూపిం చడం ఎవరికి తెలియనిది? ఆఖరికి ఎఫ్‌ఐఆర్‌లో సైతం ప్రభుత్వాలు ఆయన పేరు నమోదుచేయించాయి. ఆయన వల్ల లాభం కలుగుతుందంటే ఒకలా, లేదనుకుంటే మరో లా మాట్లాడినంత మాత్రాన చరిత్ర చెరిగిపోతుందా?
 
 వైఎస్సార్‌సీపీ అభ్యంతరం...
 జూలై 12 న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిని కూడా పిలిచారు. ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్వి జయ్‌సింగ్ మాట్లాడుతూ, చర్చలు, సంప్రదింపులు ముగి శాయనీ ఇక నిర్ణయమే తరువాయి అని ప్రకటించారు. దాంతో కీలకమైన, సున్నితమైన అంశంపై కాంగ్రెస్ చేస్తు న్న డ్రామా, గందరగోళం, ఏకపక్ష వైఖరిని తప్పుబడుతూ జూలై 17న (అంటే సీడబ్ల్యూసీ సమావేశానికి పక్షం రోజుల ముందే) వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు కేంద్ర హోంశాఖ మంత్రికి ఒక లేఖరాశారు. అందులో విభజన అంశం, డిసెంబర్ 28న జరిగిన అఖిలపక్ష సమావేశ వివరాలను గుర్తుచేశారు. ఆ లేఖలో... ‘‘విభజన అంశంపై ప్రభుత్వం ముందుగా తన వైఖరిని స్పష్టం చేయాలి. అలా ప్రకటించిన వైఖరిపై అన్ని భాగస్వామ్య పార్టీలను ఆహ్వా నించి చర్చలు జరపాలి. విభజన అంశంపై చర్చలు సంప్ర దింపులు అయిపోయాయని దిగ్విజయ్ చెప్పడంలో అర్థం లేదు. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమని భావిస్తే అన్ని ప్రాంతాలవారికి ఆమోద యోగ్యమైన పరిష్కారాలను చూపాలి. అలాంటివేమీ చేయకుండానే ఏకపక్షంగా నిర్ణ యం జరిగిపోయిందని ఎలా ప్రకటిస్తారు? అది న్యాయస మ్మతం కాదు. విభజన అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పారదర్శకంగా వ్యవహరించాలి. ముందు కేం ద్రం తన వైఖరేమిటో ప్రకటించాలి. ఆ తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయాలి. అప్పు డు అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసు కోవాలి.’’ అని కోరారు.
 
 మా ఎమ్మెల్యేల రాజీనామాలు
 రాష్ట్రాన్ని విభజించాలని జూలై 30 న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం తీర్మానించింది. అంతకుముందు 12 వ తేదీన జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం నుంచి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హడావిడి చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వేస్తున్న అడుగులను గమనించి, ఏకపక్ష నిర్ణయం తీసుకోబోతోందని ఆ పార్టీ నేతల చేష్టలను గ్రహించిన తర్వాత కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ మా పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు జూలై 25న స్పీకర్ ఫార్మేట్‌లో తమ పదవులకు రాజీనామాలు చేశారు.
 
 అటుతర్వాత ఆ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ‘‘తానే పార్టీ, తానే ప్రభుత్వమన్న విధంగా వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రజల భవిష్యత్తును కాంగ్రెస్ తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తోంది. ఓట్లు, సీట్లు లెక్కలేస్తూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ బేరసారాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో మొదట కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించాలి. ఆ తర్వాత కేంద్రం అందరికీ అమోదయోగ్యమైన రీతిలో, ఏ ఒక్కరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా ఒక ప్రతిపాదనను అందరి ముందుంచాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు’’ అని హెచ్చరించిన విషయాన్ని గమనించాలి. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందే కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రాజనామాలు సమర్పించడం... తెలంగాణకు అనుకూలమవుతుందా? విభజన చేయమని చంద్రబాబు లాగా బ్లాంక్ చెక్‌పై సంతకం పెట్టినట్టవుతుందా?
 
 ఐదు పార్టీలదే ఏకాభిప్రాయమా?
 సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన తర్వాత సీమాంధ్ర ప్రజల ఆవే దనను, ఆక్రందనను, వారికి జరగబోయే అన్యాయాలను వివరిస్తూ మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆగస్టు 27న ప్రధాని మన్మోహన్ సింగ్‌గారికి లేఖ రాశారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయం జరగనప్పుడు రాష్ట్రా న్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏకపక్ష నిరంకుశ వైఖరికి నిరసన విజయమ్మ నిరవధిక నిరాహారదీక్ష చేయగా, పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి జైలులోనే దీక్ష చేపట్టారన్న విషయాన్ని కూడా ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ఇక్కడి పార్టీల మధ్య దాదాపుగా వంద శాతం ఏకాభిప్రాయం వచ్చిందని కాంగ్రెస్ చెప్పడం తప్పుదారి పట్టించడమే అవుతుంద న్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకున్నది టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీలు మాత్రమే. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎంలు అంగీకారం తెలి యజేయలేదని విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్న విషయం గమనించాలి.  
 
 
 ఎవరిది వక్రభాష్యం?
 మా పార్టీ ఎక్కడా విధానాన్ని మార్చుకోలేదు. వెనక్కిపో లేదు... యూ టర్న్ తీసుకోలేదు. అన్ని ప్రాంతాలు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమో దయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ చేసింది. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం జరగాలంటే ఎం చేయాలి? అందరి మనో భావాలు పరి గణలోకి తీసుకుంటూ, ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఒక మంచి నిర్ణయం, ఒక మంచి మార్గం చెప్ప వలసిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని చెప్పిన విష యంలో ఎక్కడైనా... ఏకపక్షంగా రాష్ట్రాన్ని రెండు ముక్క లు చేయాలనిగానీ, నిరంకుశ వైఖరితో నిర్ణయం తీసుకో మనిగానీ... కనబడుతోందా? అలాంటప్పుడు కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్నది తప్పుడు ప్రచారం కాదా? విభ జన నిర్ణయాన్ని తీసుకున్నాక దాన్ని దిగ్విజయ్‌సింగ్ మీడియా సమావేశంలో ప్రకటించి ఆ వెంటనే ఇది వైఎస్ కల అని చెప్పడమంటే... ఒక కుట్రపూరిత ప్రకటనకాక మరేమవుతుంది? వైఎస్ మరణించిన  నాలుగేళ్ల తర్వాత ఈ మాట ఎలా చెప్పగలరు.
 
 ఆయన ఎక్కడైనా ఆ మాట అన్నారా? దిగ్విజయ్ చెప్పిన తొమ్మిది రోజుల తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పదో రోజున బాబు అవే మాటలు మాట్లాడారు. ప్రజల అభిమానం కూడగట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ బలమైనశక్తిగా ఎదిగిన పరిస్థితిని చూసి ఓర్వలేక, కాంగ్రెస్, టీడీపీలు తమ రాజకీయ మను గడ ప్రశ్నార్థకంగా మారడంతో అడ్డగోలు ప్రచారాన్ని మొదలు పెట్టాయని అందరికీ అర్థమవుతోంది. వైఎస్ ఉన్నప్పుడు 2001లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ, విదర్భ ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని రెండో ఎస్సార్సీ వేయాలని తీర్మానం చేసింది. అదే విషయాన్ని వైఎస్ అనేకసార్లు ప్రస్తావించారు. ఒక అంశంపై సమగ్రంగా మాట్లాడినప్పుడు, ఒక పార్టీ తన వైఖరిని ప్రకటించినప్పుడు తమకు అనుకూలమైన  వాటినే ప్రస్తావించి నిందలు మోపడం ఏం నీతి?
 
 తెలంగాణపై టీడీపీ తీర్మానం
 2008 అక్టోబర్ 8న  జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. అందు లో ఏముందంటే... ‘‘రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిరంతరం నిశితంగా సమీక్షించే టీడీపీ తెలంగాణ ప్రజల మనోభావాలను గమనించి మొదటి నుంచి గౌర విస్తూనే ఉంది. ప్రజల మనోభావం బలపడటాన్ని గుర్తిం చి రెండు సంవత్సరాల క్రితమే తెలంగాణ అంశంపై సరైన సమ యంలో సరైన నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ప్రక టించింది. అనంతరం సూత్రప్రాయంగా తెలంగాణకు వ్యతిరేకం కాదని కూడా  ప్రకటించింది. ఈ అంశంపై విసృ్తతంగా చర్చజరగాలని కూడా నిర్ణయించింది. అయితే ఇది సున్నితమైన అంశం కనుక అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను అధ్యయనం చేసే ఉద్ధేశంతో పార్టీ సీనియర్ నాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఐదు నెలలుగా విసృ్తతస్థాయిలో అభి ప్రాయ సేకరణ జరిపి ప్రజాభిప్రాయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నదని పొలిట్‌బ్యూరోకి తెలి యచేసింది. కోర్ కమిటీ తెలియ చేసిన అభిప్రాయంపై కూలంకషంగా చర్చించిన టీడీపీ పొలిట్ బ్యూరో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించింది.’’
 
 టీడీపీ ఏం చెప్పింది?
 బాబు పాదయాత్రలో భాగంగా 2012 డిసెంబర్ 27న కరీంనగర్ జిల్లా పొల్కపల్లి గ్రామంలో బసచేశారు. సుశీల్‌కుమార్ షిండే అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖ రిని తెలియజేయడానికి అక్కడే పొలిట్ బ్యూరో సమా వేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే తెలంగాణకు అనుకూలంగా గతంలో చేసిన తీర్మానాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. అదే విషయాన్ని పొందు పరుస్తూ షిండేకు లేఖ రాశారు. ఆ లేఖలో ‘‘... ఈ నేపధ్యంలో మీ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే, మా పార్టీ తన అభిప్రా యాన్ని 18-10-2008న అప్పటి విదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖ ద్వారా తెలియచేసింది. ఆ లేఖను మేం ఉపసంహరించుకోలేదు. మరోవైపు మాజీ హోం మంత్రి పి. చిదంబరం లోక్‌సభలో 2013 మే 5 న కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని ప్రకటించారు. ఇప్ప టికీ కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించలేదు. అనిశ్చితిని తొల గించేందుకు ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవా ల్సిం దిగా కేంద్రాన్ని మాపార్టీ కోరుతోంది.’’ ఇలా చెప్పడమం టే తెలంగాణకు అనుకూలమని స్పష్టంచేయడం కాదా?
 
 ఎవరిది యూ టర్న్?
 ఇరు ప్రాంతాలకు న్యాయం పాటించాలని, అలా చేయలే నప్పుడు... రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని స్పష్టమైన వైఖరిని చెబితే...  మా పార్టీ యూ టర్న్ తీసుకున్నట్టు కొం దరు ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం చేయమన్నాం. సీమాంధ్ర ప్రజల్లో వెల్లువెత్తిన ఉద్యమం చూసైనా అందరికీ ఆమో దయోగ్యమైన నిర్ణయం తీసుకోలేదన్న విషయం కాం గ్రెస్‌కు అర్ధంకాదా?  తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి కూడా ఇప్పుడు తగుదునమ్మా... అంటూ బాబు ఆత్మగౌరవ యాత్ర చేయడాన్ని ఎలా చూడాలి?
 
ఇంత జరి గాక కాంగ్రెస్ ఆంటోనీ కమిటీ వేయడమేంటి? విభజన అంశం కాంగ్రెస్ సొంత వ్యవహారంగా చూస్తుందన్న విష యం  తెలియడం లేదా?  ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమ వుతున్న తరుణంలో వారిని పక్కదారి పట్టించడా నికి వేసిన కమిటీ కాక మరేమనాలి? తెలంగాణ నిర్ణయం తీసుకున్నదే అధికార కాంగ్రెస్ అయినప్పుడు... అదీ అయిదు (కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ) పార్టీల ఆమోదంతో నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై ఆ పార్టీలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, ఆ పార్టీ యూ టర్న్ తీసుకున్నదనీ, సమైక్యాంధ్ర కోసం తీర్మానం చేయాలని... ఇలా రకరకాలుగా మాట్లాడటంలో ఆంతర్యమేంటి?  వైఎస్సార్ కాంగ్రెస్ తన వైఖరిని అనేక సందర్భాల్లో విడమరిచి స్పష్టంగా తెలియజేసింది. అయినా ఈ పార్టీలు అర్ధంకానట్టు నటిస్తున్నాయి. తమ గేమ్‌ప్లాన్ కొనసాగిస్తున్నాయి.
 - పిల్లి సుభాష్ చంద్రబోస్
 మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ
 కేంద్రపాలక మండలి సభ్యులు   

8న నెల్లూరు జిల్లాలో షర్మిల బస్సుయాత్ర

సమైక్యాంధ్రకు మద్దతుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన 'సమైక్య శంఖారావం'బస్సుయాత్ర షెడ్యూల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం  ఇక్కడ విడుదల చేసింది.  ఈ నెల 8వ తేదీన సమైక్య శంఖారావం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది.  ఆ రోజు ఉదయం 10.00 గంటలకు ఆత్మకూరు, సాయంత్రం 4.00 గంటలకు కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనున్నారు. 
 
అలాగే షర్మిల బస్సుయాత్ర 10వ తేదీ ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తుంది.ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కనిగిరి, సాయంత్రం 4.00 గంటలకు మార్కాపురం బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.అనంతరం 11వ తేదీన గుంటూరు జిల్లాలో ప్రవేశించి ఉదయం 10.00 గంటలకు వినుకొండ, సాయంత్రం 3.00 గంటలకు రేపల్లేలో జరిగే సభలో ఆమె మాట్లాడతారు.
 
అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ మరునాడు అంటే 12వ తేదీన ఉదయం 10.30 గంటలకు కైకలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.అనంతరం షర్మిల చేపట్టిన సమైక్య శంకారావం బస్సుయాత్ర పశ్చిమగోదావరిలో ప్రవేశిస్తుంది.ఆ రోజు సాయంత్రం 4.00 గంటలకు ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడనున్నారు.  

Sharmila's speech in Dhone

Written By news on Thursday, September 5, 2013 | 9/05/2013

ఇటలీతో లింకు మీదా? మాదా? బాబూ!

డోన్ (కర్నూలు జిల్లా),


http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmila-slams-chandrababu-congress-in-done-public-meeting.html

 5 సెప్టెంబర్ 2013: రాహుల్‌ను ప్రధానిని చేసుకోవాలనే స్వార్ధంతోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల విమర్శించారు. కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం చేయడానికి పూనుకుందని విమర్శించారు. ఇటలీకి ఇడుపులపాయకు లింకు ఉందని నిన్న చంద్రబాబు చేసిన ఆరోపణలపై శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. సోనియాతో లింకు పెట్టుకున్నది మీరా? మేమా? అన్నది ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. కాంగ్రెస్‌కు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు లింకే ఉంటే 15 నెలలుగా జగనన్న జైలులో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ హయాంలో కళకళలాడిన మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు సర్వనాశనం చేసిందని ఆమె విమర్శించారు. వైయస్ఆర్ పెట్టిన పథకాలన్నింటినీ తుంగలో తొక్కుతోందని దుయ్యబట్టారు. శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర గురువారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా డోన్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా డోన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

రాజశేఖరరెడ్డిగారు ఒక్క రూపాయి కూడా ధరలు‌ గాని, చార్జీలు గాని పెంచకుండానే అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలనూ విజయవంతంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అన్నింటి ధరలూ, చార్జీలూ విపరీతంగా పెరిగాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించిందని, సంక్షేమానికి పాడె కట్టిందని విమర్శించారు. ఈ పాలనలో రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు అన్ని వర్గాల వారూ అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేయడంతో లక్షలాది మంది పేద విద్యార్థులు చదువులను మధ్యలోనే మానేసేలా చేసిన పాపం కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని ఆరోపించారు. అన్ని ధరలూ పెంచేసి సామాన్యులు కొనలేక చతికిల పడుతుంటే చూసి నవ్వుకుంటోంది ఈ కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు.

ఇంతవరకూ చేసిన పాపాలు సరిపోలేదని మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు గొడ్డలితో నరికినట్టు అడ్డంగా రెండు ముక్కలుగా నరుకుతోందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి కాంగ్రెస్‌ పార్టీ చలి కాచుకుంటోందని నిప్పులు చెరిగారు. తెలుగువారి ఓట్లు దండుకుని వారికే వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. తెలుగువారి భిక్షతో రాష్ట్రంలో, కేంద్రంలో గద్దెనెక్కి వారికే దగా చేయాలని చూస్తోందన్నారు.

మహారాష్ట్ర అవసరాలు తీరితో తప్ప గోదావరి నీటిని, ఆల్మట్టి, నారాయణపూర్‌ నిండితే గాని కృష్ణా నీటిని కర్నాటక కిందికి వదలని పరిస్థితిని ఇప్పుటికే మనం చూస్తున్నాం అని శ్రీమతి షర్మిల అన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే కృష్ణా నీటికి అడ్డుకుంటే సీమాంధ్ర మహా ఎడారిగా మారిపోదా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినా మధ్యలో మరో రాష్ట్ర వచ్చి గోదావరి నీటిని కిందికి రానివ్వకుంటే ఆ ప్రాజెక్టును ఏ నీటితో నింపుతుందని కేంద్రాన్ని ఆమె నిలదీశారు. గతంలో మద్రాసును లాగేసుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి వెళ్ళిపొమ్మంటున్నారని దుయ్యబట్టారు. అరవై ఏళ్ళపాటు కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భాగం లేదంటున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి లేదా? అన్నారు. కేవలం పదేళ్ళలో కొత్త రాజధానిని కట్టుకుని వెళ్ళిపొమ్మనడంలో న్యాయం ఎక్కడ ఉందన్నారు. పదేళ్ళలో హైదరాబాద్‌ లాంటి రాజధానిని కట్టుకోవడం ఎలా సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో సగభాగం వచ్చే హైదరాబాద్‌ లేక పోతే సీమాంధ్రలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి? ఉద్యోగుల జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలని నిలదీశారు.

ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిలో ఏమాత్రం చలనం లేదని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఈ విభజనకు కారణమే చంద్రబాబుగారు అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టమని బ్లాంక్‌ చెక్కు లాంటి లేఖను చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చేశారు. ఆయన లేఖ వల్లే రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సాహసించిందన్నారు. రాష్ట్రం విభజన పాపంలో కాంగ్రెస్‌కు ఎంత భాగం ఉందో టిడిపికి అంతే ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, సీమాంధ్రకు కట్టుబడి ఉండాలని శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా విభజనను వ్యతిరేకిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎంల దారిలోకి చంద్రబాబు కూడా రావాలని అన్నారు. చంద్రబాబు, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Smt. Sharmila public meeting speach in Done in Kurnul Dist.పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసిన చంద్రబాబు ఇప్పుడు బస్సు యాత్రకు ఏ విధంగా వస్తున్నారని ప్రశ్నించారు. ఆత్మ గౌరవ యాత్ర పేరు పెట్టుకుని వస్తున్న చంద్రబాబుకు అసలు ఆత్మ అంటూ ఉందా? అని నిలదీశారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీని లాగేసుకున్న చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకే కూడా వెన్నుపోటు పొడిచారు. నిజం చెప్పిన రోజునే చంద్రబాబు తల వేయి ముక్కలైపోతుందన్న మునీశ్వరుడి శాపం వల్ల ఎప్పుడూ అబద్ధాలే చెబుతారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య లింకే ఉంటే జగనన్న ఈ పాటికి ఏ ముఖ్యమంత్రో, కేంద్ర మంత్రో అయి ఉండేవారని శ్రీమతి షర్మిల అన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యింది వైయస్ఆర్‌ కాంగ్రెస్సో లేక టిడిపినో ప్రజలకు బాగా తెలుసన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో నిస్సిగ్గుగా లింకు పెట్టుకున్నది చంద్రబాబు అని అనేకసార్లు స్పష్టంగా వెల్లడైందన్నారు. చీకట్లో చిదంబరంతో కలిసి తన మీద ఉన్న ఐఎంజి సహా అనేక కేసులపై విచారణ జరగకుండా మేనేజ్‌ చేసుకున్నది చంద్రబాబే అన్నారు. కోట్ల మంది ప్రజలు సీమాంధ్ర ఉద్యమంలో రోడ్ల మీదకు వచ్చి ఉద్యమం చేస్తుంటే.. కోట్ల మందికి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తున్నా చంద్రబాబు నోరు మూసుకుని కూర్చున్నారని విమర్శించారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా నరికేస్తున్నామంటూ కేంద్రం సంకేతాలిచ్చిన మరుక్షణం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఒక్కుమ్మడిగా రాజీనామాలు చేసిన వైనాన్ని గుర్తు చేశారు. న్యాయం చేసే సత్తా కాంగ్రెస్‌కు లేనప్పుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్మూ ధైర్యం ఈ కాంగ్రెస్, టిడిపిలకు లేవన్నారు. అందుకే అబద్ధపు కేసులు పెట్టి, ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై జగనన్నను జైలులో పెట్టించాయన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులకు వెన్నుదన్నుగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర సాధించే వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందన్నారు.

వైయస్ఆర్‌ విగ్రహాల జోలికి వస్తే సహించం

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాల జోలికి వస్తే సహించబోమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు. ఆ మహానేత అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రుణ మాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్సుమెంట్‌లలో సుమారు 70 శాతం తెలంగాణ వారికే లబ్ధి చేకూరిన విషయాన్ని మర్చిపోయి హరీష్‌రావు ఇచ్చిన పిలుపుతో‌ దాదాపు 8 వైయస్ఆర్ విగ్రహాలను కూల్చివేశారని తెలిపారు. కొన్నిచోట్ల అయితే ఆ విగ్రహాలను రంపంతో కోసిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసిన మహానేత విగ్రహాలను ఇంత దారుణంగా, అన్యాయంగా ధ్వంసం చేయడం తగదని బాజిరెడ్డి ఖండించారు. తెలంగాణలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల మీద కూడా భౌతిక దాడులు చేయమని టిఆర్ఎస్‌ నాయకులు తమ శ్రేణులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు గట్టు రామచంద్రరావు, బి. జనక్‌ప్రసాద్, శివకుమార్‌, నల్లా సూర్యప్రకాశ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

చదువుకున్నవాడు, ఉద్యమంలో నడిచినవాడు హరీష్‌రావు మహానేత వైయస్ఆర్‌ బ్రతికి ఉన్ననాడు ఆయన ఆశీస్సులతో తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ఇప్పుడిలా దాడులకు పురికొల్పడమేమిటని బాజిరెడ్డి ప్రశ్నించారు. ప్రాణం లేని విగ్రహాలను ధ్వంసం చేసి పొందే రాక్షసానందం ఏమిటని హరీష్‌రావును ఆయన ప్రశ్నించారు. వైయస్‌ విగ్రహాల జోలికి వెళితే తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని బాజిరెడ్డి హెచ్చరించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఎంతగానో అభివృ‌ద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ వాదంతో పుట్టిన పార్టీ అని, మిగతా పార్టీలు ఏవీ కూడా అలా ఏర్పడలేదన్న విషయాన్ని ఈ సంద‌ర్భంగా బాజిరెడ్డి గుర్తుచేశారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రానికి సమన్వాయం చేయలేదు కాబట్టి సమైక్యంగా ఉంచాలని మాత్రమే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కోరిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కోల్పోతుందన్న టిఆర్ఎస్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.‌

ఈ సందర్భంగా టిఆర్ఎస్ వైఖరిపై‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో బలం ఉందో లేదో టిఆర్ఎస్ నేతలు నిర్ణయించనక్కర్లేదన్నారు.‌ కేవలం తెలంగాణలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ హవాను తగ్గించాలనే ‌దురుద్దేశంతోనే టిఆర్ఎస్‌ నాయకులు విమర్శలకు దిగుతున్నారన్నారు. టిఆర్ఎస్ ‌నాయకుడు హరీష్‌రావు విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్రలో సమైక్య ఉద్యమం చేస్తుందని, ఒక ఓటు వేస్తే రెండు రాష్ట్రాలు ఇస్తామని చెప్పి బిజెపి రెండు ప్రాంతాల్లో ఉంటుంది కాని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఏమి తప్పు చేసిందని తెలంగాణలో ఉండవద్దంటున్నారని బాజిరెడ్డి నిలదీశారు. వైయస్ఆర్‌ ఆశయాల మేరకు, ఆయన సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న కృతనిశ్చయంతోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైందని బాజిరెడ్డి గుర్తుచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ కాదని, అయినప్పటికీ తెలంగాణ ప్రాంత సెంటిమెంటును గౌరవిస్తామని చెప్పిందని ఆయన వివరించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారు మళ్ళీ ఎన్నికల్లో నిలబడితే వారి మీద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పోటీ కూడా పెట్టని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పార్టీ మీద దుమ్మెత్తి పోయాల్సిన అవసరం ఏముందని బాజిరెడ్డి ప్రశ్నించారు.

http://www.ysrcongress.com/news/news_updates/ysrcp-never-said-to-anty-to-telangana.html

కాంగ్రెస్‌తో వైఎస్‌ఆర్‌సీపీ కుమ్మక్కు అయివుంటే వైఎస్‌ జగన్ జైల్లో ఉండేవారా?

కర్నూలు: జగనన్న జైలులో ఉన్నా, జనంలో ఉన్నా ఎప్పటికీ జన నేతే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఆమె కర్నూలు చేరుకున్నారు.  ఇక్కడ జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి  భారీ సంఖ్యలో హజరైన జన సమూహం నుంచి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింకుందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇడుపులపాయకు, ఇటలీకి లింకుందని కూడా ఆయన అన్నారు.  కాంగ్రెస్‌తో వైఎస్‌ఆర్‌సీపీ కుమ్మక్కు అయివుంటే వైఎస్‌ జగన్ జైల్లో  ఉండేవారా? అని షర్మిల ప్రశ్నించారు. నిజానికి కాంగ్రెస్ తో కుమ్మక్కయింది టిడిపి అని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో  చంద్రబాబు కుమ్మక్కు కాకుంటే ఈ మైనార్టీ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుతారు? అని అడిగారు. వజ్రం లాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేయాలని చూస్తుందటే అది చంద్రబాబు లేఖతోనే అన్నారు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్వించారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారన్నారు.

సమైక్య శంఖారావం సభకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం అంతా జైజగన్, సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయింది.

Popular Posts

Topics :