17 August 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఇప్పటి హత్యలకు అప్పటినుంచే నాంది

Written By news on Saturday, August 23, 2014 | 8/23/2014


ఇప్పటి హత్యలకు అప్పటినుంచే నాంది
హైదరాబాద్ : వరుస ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారిందని, ఇప్పుడు జరుగుతున్న హత్యలకు అక్కడే నాంది పలికిందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సభ నుంచి వాకౌట్ చేసి, బయట గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో చర్చకోసం పట్టుబడుతున్న సందర్భంలోనే గుంటూరుజిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఇద్దరిని చంపేశారని, అనంతపురం జిల్లా శింగనమలలో మరొకరిని హత్యచేశారని చెప్పారు. మొత్తం 3 నెలల కాలంలో 14 హత్యలు జరిగాయన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

''వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు, ఘర్షణలు ఉండొచ్చు. అవి సమసిపోయేలా పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పైనుంచి అధికార పార్టీ వారు ప్రోత్సహిస్తున్నారు. జరిగిన ఘటనలు హత్యకాదంటారా? 100 రోజుల్లో జరిగినవి హత్యలు కాదా? అసెంబ్లీ చర్చలో అ 14 కుటుంబాలకు ఏం భరోసా ఇస్తారన్నదానిపై మాట్లాడటం లేదు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యహరించేలా ఎందుకు చేయడంలేదు? మేం దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెడితే.. దాన్ని హాస్యాస్పదం చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఈ ఘటనలగురించి కాకుండా పాత అంశాలను తీసుకొస్తున్నారు. గతంలోకి పోవద్దని, అలా పోతే అవాస్తవాలు, ఆరోపణలు తప్ప చర్చ ముందుకెళ్లదని చెప్పాం. ముందుగా ఈ ఘటనలపై దృష్టిపెట్టాలని మొత్తుకున్నా ఫలితం లేకపోయింది.

పథకం ప్రకారం మా గొంతులు వినబడనీయకుండా వారి గొంతులు మాత్రమే వినపడేలా సభ జరుగుతోంది. బాబు ప్రమాణస్వీకారం చేయడానికి ముందు హత్యలు జరిగితే విచారణ చేయరా? 19సార్లు అధికార పార్టీ సభ్యులు అప్రజాస్వామిక భాషను ఉపయోగిస్తే సభాపతి అడ్డుకోరు. మేం ఒకే ఒక్కసారి మాట్లాడితే.. దాని గురించి మాట్లాడతారు. మేం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నామని స్పీకర్ అంటారు. ఆ మాటను ఆయన అనడం కూడా అప్రజాస్వామికమే.

వాస్తవానికి ఇవాళ బడ్జెట్‌పై మాట్లాడాల్సి ఉంది... అదికాకుండా శాంతిభద్రతల అంశాన్ని ముందుపెట్టారు. పోనీ చర్చ పెట్టారు అంటే, మాకు మైకు ఇవ్వరంట.
చనిపోయిన కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిందిపోయి.. వారిపై నిందలు మోపారు.
పదేళ్ల కిందట కథలకు పోతున్నారు. పరిటాల రవిహత్యకేసులో దర్యాప్తు జరిగింది, కోర్టుల్లో విచారణకూడా ముగిసింది. ఈకేసులో దోషులకు శిక్షకూడా పడింది. అయినా అవే ఆరోపణలను పదేపదే చేస్తున్నారు.

ఒకవేళ మాకు మైకు ఇచ్చిఉంటే, మాకూ సభను పక్కదోవ పట్టించే ఆలోచన మాక్కూడా ఉంటే మేంకూడా అడిగేవాళ్లం. వంగవీటి మోహన రంగాని దగ్గరుండి చంపించింది చంద్రబాబే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబునుకూడా గట్టిగా నిలదీయాలంటే వంగవీటి మోహనరంగా కేసులో 11వ ముద్దాయి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ఇదే అసెంబ్లీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈకేసులో ముద్దాయి. ఆయన చంద్రబాబు పక్కన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే చంద్రబాబును మేం ప్రశ్నించాలనుకుంటే వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్ ఆరోజు హోంమంత్రిగా లేరా? అవాళ ఆయన బాధ్యుడు కాదా? బాధ్యత తీసుకోరా? రాజీ నామా చేయాల్సిన పరిస్థితుల్లో పదవి వదులుకున్నారు.

సభను పక్కదోవ పట్టించడానికి మేంకూడా ఇవన్నీ ప్రస్తావించి ఉండొచ్చు. విషయం పక్కదోవ పట్టకూడదని గట్టిగా మేం చర్చకోసం పట్టుబట్టాం. కానీ అధికారపక్షం వాళ్లు తెలిసీ, తెలియని విషయాలతో అవాస్తవాలు చెబుతున్నారు. సభా సమయాన్ని పూర్తిగా వృథా చేశారు. ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యే లేదా ప్రతిపక్షనేత వాకౌట్ చేస్తున్నప్పుడు మైకు ఇస్తారు. కానీ దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా మైకు ఇవ్వకుండా స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ఆయన తెలుగుదేశం కార్యకర్తా? మంత్రా? టీడీపీ ఎమ్మెల్యేనా? స్పీకరే నిర్ణయించుకోవాలి. మా గొంతు నొక్కుతున్నప్పుడు నిరసన తెలపడం మినహా మాకు మరో మార్గంలేదు.

పోలీసులతో రాయించిన ఎఫ్‌ఐఆర్‌లు కాకుండా మరణించిన వారి కుటుంబాల మాటలు వినాలి. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. హత్యకు గురైన కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. చిన్నచిన్నగొడవలు హత్యలవరకూ వెళ్తున్నాయంటే రాజకీయ వ్యవస్థ చెడిపోతున్నట్టే. అధికారంలో ఎవ్వరున్నా.. హత్యలను ప్రోత్సహించకూడదు. మైకులు ఇవ్వకపోవడం వల్లే మేం వాకౌట్ చేశాం. మా గొంతులు వినే అవకాశం లేదుకాబట్టి వాకౌట్ చేశాం. శాంతిభద్రతలపై చర్చ ముగిశాక బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటాం. అక్కడ రుణమాఫీ అంశంపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తాం. రైతులకు, డ్వాక్రా మహిళలకు తోడుగా ఉంటాం. ఈ సందర్భంగా జరిగే చర్చను రాష్ట్రం మొత్తం చూడాలి. దీన్నికూడా ఆపడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను దేశంమొత్తంచూడాలి

ఇంటింటికీ రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. దీనిపైకూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీ జరుగుతున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి. రాజకీయ లబ్ధి కోసమే అధికారపక్ష సభ్యులు తీర్పువచ్చిన కేసులను కూడా ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఇలాగే వ్యవహరిస్తే... వ్యవస్థ కుప్పకూలిపోతుంది'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

వాళ్లు19సార్లు అమర్యాదగా మాట్లాడారు


వాళ్లు19సార్లు అమర్యాదగా మాట్లాడారు
హైదరాబాద్ : అసెంబ్లీలో తమకు మాట్లాడే స్వేచ్ఛ లేనందునే సభ నుంచి వాకౌట్ చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలంతా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహార శైలిపై చూస్తుంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేనా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభాపతా అనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు.

అసెంబ్లీలో శుక్రవారం అధికారపక్షం నేతలు 19సార్లు అన్ పార్లమెంటరీ భాష ఉపయోగిస్తే ఏమీ అనని స్పీకర్, తాము ఒక్కసారి 'బఫూన్' అనే పదం ఉపయోగిస్తే దానికి అభ్యంతరం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. సభలో తమ గొంతు వినిపించే అవకాశం లేనందునే బయటకు వచ్చి తమ తెలుపుతున్నామన్నారు.
గత మూడు నెలల్లో వైఎస్ఆర్ సీపీకి చెందిన 14మంది చనిపోయారని, వాటిపై విచారణ చేపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో చర్చ జరుపుతున్నారన్నారు. అవి తప్పుడు ఆరోపణలు అని చంద్రబాబుకు తెలుసు కాబట్టే ....జేసీ బ్రదర్స్ కు టికెట్లు ఇచ్చారన్నారు. 14 మంది రాజకీయ హత్యలకు గురైతే కనీసం వాళ్ల గురించి ఒక్క మాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన చెప్పారు.

వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేల ఆందోళన


వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేల ఆందోళన
హైదరాబాద్ : సభలో విపక్ష నేతలను మాట్లాడనీవ్వటం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో టీడీపీ వైఖరని నిరసిస్తూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు నోటికి నల్ల రిబ్బను కట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రతిపక్షం నోటిని నొక్కేస్తున్నారంటూ అంతకు ముందు వైఎస్ఆర్ సీపీ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షానికి స్పీకర్ వంత పాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. దీనిపై నిరసన తెలుపుతూ నేటి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

అంతకు ముందు సభలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా రాష్ట్ర అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక శాసన సభ్యుడు తన ఇష్టంవచ్చినట్లు అబద్ధాలు చెబుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
 

అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ

అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ
హైదరాబాద్ : పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా రాష్ట్ర అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక శాసన సభ్యుడు తన ఇష్టంవచ్చినట్లు అబద్ధాలు చెబుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 'ఇదేంటి అధ్యక్షా.. ఆయన నోటికొచ్చినట్లు తప్పులు మాట్లాడుతుంటే, మీరు అనుమతిస్తూనే ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి నేను సూటిగా అడుగుతున్నాను' అని చెప్పారు.

మా గొంతు నొక్కేసి వాళ్లతో మాట్లాడిస్తారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనలు అసెంబ్లీ చరిత్రలోనే సిగ్గుచేటుగా ఉన్నాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి ప్రతిపక్షం వాకౌట్ చేసిన తర్వాత ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''అసెంబ్లీలో జరిగిన సంఘటన అసెంబ్లీ చరిత్రలోనే సిగ్గుచేటు. ఒక శాసనసభ్యుడికి మైకిచ్చి, చర్చ మొదలుపెట్టమంటే.. హత్యలు, ఊచకోతలపైన మాట్లాడమంటే దాని మీద వివరించాల్సిన మా గొంతు నొక్కేసి బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. ఆయనేమో అసలు విషయం వదిలేసి ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీం, విదేశాలు అంటున్నాడు. మతి భ్రమించి మాట్లాడుతున్నాడు.

ఆయన అలాంటి అసత్య ఆరోపణలు చేస్తుంటే స్పీకర్ గారికి చెవికి ఇంపుగా ఉన్నాయా, జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే ఆనందంగా ఉందా? అలాంటి సందర్భంలోనే స్పీకర్ గారిని ప్రతిపక్ష నాయకుడు అడిగారు. అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని అంటుంటే.. పది సెకన్లు కూడా మాట్లాడనివ్వకుండా మైకు కట్ చేసి మళ్లీ బుచ్చయ్య చౌదరికే అవకాశం ఇచ్చారు.

ప్రతిపక్ష నాయకుడు వాకౌట్ చేస్తానన్నప్పుడు కనీసం మైకు ఇచ్చి ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. వీటిని అధికార పార్టీ, స్పీకర్ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మీరే నిబంధనలు పట్టించుకోకుండా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అసలు స్పీకర్ ఎందుకు ఉన్నారని అడుగుతున్నా. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారా.. ప్రజల తరఫున మాట్లాడటానికి, ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షంగా మేముంటే, మా గొంతు నొక్కేస్తారా, ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నా. నిండు సభలో ప్రతిపక్ష నాయకుడి మీద నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేస్తుంటే పట్టించుకోకపోవడం నిజంగా బ్లాక్ డే. అడిగినా మైకు ఇవ్వకుండా వ్యవహరించడం సరికాదు.

మంత్రులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకు పుచ్చలపల్లి సుందరయ్య పేరు ఎత్తే అర్హత లేదు. వాళ్లే బతికుంటే మీ తీరు చూసి కన్నీళ్లు పెట్టుకునేవారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంలా మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇది దుర్మార్గం, అమానుషం. ప్రజలను, ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేయడం. యనమల రామకృష్ణుడు పెద్ద నీతిమంతుడు అయినట్లు హితోపదేశం చేస్తున్నారు. అదేదో వాళ్ల పార్టీ శాసనసభ్యులకు చెప్పాలి. కవి చౌడప్ప వారసుల్లా మాట్లాడుతున్నారు'' అని ఆయన అన్నారు.

‘బాబు’ రాగానే జాబు పోయింది

ఒంగోలు అర్బన్ : జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేశారని, కానీ, బాబు రాగానే జాబు పోయిందని గృహ నిర్మాణ సంస్థ (హౌసింగ్) ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా పదో రోజైన శుక్రవారం ఉద్యోగులంతా నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 స్థానిక కలెక్టరేట్ నుంచి సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగింది. అనంతరం నిర్వహించిన ధర్నాలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి.మస్తాన్‌రావుమాట్లాడుతూ హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు గృహాలు నిర్మించడంలో హౌసింగ్ శాఖలోని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు.

వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అడకా స్వాములు, జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్, నగర ప్రెసిడెంట్ తాడి శ్రీనివాసులు, యునెటైడ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఏవీబీ బ్రహ్మచారి, కార్యదర్శి జీవీ రాగయ్య, యూనియన్ జిల్లా కోశాధికారి ఆర్.ఉదయ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ మురళీమోహన్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

హత్యారాజకీయాలపై చర్చను పక్కదోవ పట్టిస్తూ టీడీపీ ఎదురుదాడి

నోటికొచ్చినంత..
 హత్యారాజకీయాలపై చర్చను పక్కదోవ పట్టిస్తూ టీడీపీ ఎదురుదాడి
 పరుష పదజాలంతో జగన్‌పై విమర్శలు..
 దీటుగా తిప్పికొట్టిన వైసీపీ

 
 సాక్షి, హైదరాబాద్: హత్యా రాజకీయాలపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ అట్టుడికింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హత్యలపై శాసన సభలో చర్చ జరగాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఈ చర్చ జరగనీయకుండా పక్కదారి పట్టించడానికి అధికార తెలుగుదేశం పార్టీ తొలి నుంచీ ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగుతోంది. చర్చ కోరిన ప్రతిసారీ పరిటాల రవి అంశాన్ని ప్రస్తావిస్తూ అధికార పార్టీ అడ్డగోలు ఆరోపణలతో అడ్డుతగులుతోంది. పరిటాల రవి హత్యను ప్రస్తావించిన దరిమిలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వంగవీటి రంగా హత్యను ప్రస్తావనకు తేవడంతో పరస్పర వాగ్వాదానికి దారి తీస్తోంది. చివరకు శుక్రవారం అధికారపక్షం దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పైన, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపైన ఏకంగా వ్యక్తిగత దూషణలకే దిగింది.

వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచిపోషించారని, రాక్షస పాలన సాగించారని తెలుగుదేశం పార్టీ సభ్యులు దూషించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక ఉన్మాది అని, నరరూప రాక్షసుడని, హంతకుడంటూ  అడ్డగోలు దూషణలకు దిగారు. దీనికి జగన్ స్పందిస్తూ చేయని తప్పుకు బఫూన్లతో ఇలా అనిపించుకోవాలా అని అన్నారు. వెంటనే అధికారపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. దీంతో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలపై వైఎస్సార్ సీపీ ఇచ్చిన నోటీసుపై శుక్రవారం లఘు చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా మరోసారి వంగవీటి రంగా, పరిటాల రవి హత్యల ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని తాము లేవనెత్తిన అసలు సమస్యకే చర్చను పరిమితం చేద్దామని హితవు పలికారు. అధికార, ప్రతిపక్షాలు రెండు వైపుల నుంచి పాత విషయాలను పక్కనపెట్టి ఈ మూడు నెలల కాలంలో జరిగిన 14 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తల హత్యలపై చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయ హత్యలకు గురైన వారి కుటుంబాలకు న్యాయం చేయడం అందరి కర్తవ్యమని, ఎప్పుడో జరిగిన హత్యల గురించి విపక్షం ప్రస్తావించదని, అలాగే అధికార పక్షం కూడా ప్రస్తావించకుండా గత మూడు నెలల్లో జరిగిన హత్యలకే చర్చను పరిమితం చేద్దామని సూచించారు. తన పార్టీ ఎమ్మెల్యేలకూ సూచిస్తానని, అధికారపక్షం కూడా దీనికి కట్టుబడి ఉండాలని కోరారు. అయినప్పటికీ అధికారపక్షం మాత్రం చర్చకన్నా పదేపదే పరిటాల రవి అంశాన్ని ప్రస్తావిస్తూ అమర్యాదపూర్వకమైన మాటలతో అడ్డగోలు వాదనలకు దిగింది. దాంతో ఒక దశలో పరస్పరం ఆవేశకావేశాలు ప్రదర్శించారు. ప్రతిపక్ష నేత ఆర్థిక ఉన్మాది అని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు దొంగలు, స్మగ్లర్లు అంటూ అధికార తెలుగుదేశం పక్షం నేతలు దూషణలకు దిగారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపైన కూడా దూషణలను దిగారు. ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించారని, రాక్షస పాలన సాగించారంటూ దూషించారు. జగన్ నరరూప రాక్షసుడని, హంతకుడని, అవినీతి పరుడంటూ తీవ్రస్థాయిలో ఒకరితర్వాత ఒకరన్నట్టు దూషించడం మొదలుపెట్టారు. ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో లేని, ఇక రాలేని, సమాధానం చెప్పుకోలేని వ్యక్తులపై (వైఎస్‌పై) అడ్డగోలుగా మాట్లాడకుండా కట్టడి చేస్తూ రూలింగ్ ఇవ్వాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష సభ్యుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయినప్పటికీ దూషణల పర్వం కొనసాగిస్తుండటంపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. చేయని తప్పుకు బఫూన్లతో ఇలా అనిపించుకోవాలా? అని ఆవేదనతో ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు.
 
 శాంతిభద్రతల సమస్యపై సభలో చర్చ సాగిన తీరిదీ..
 
 కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ): తొలి బడ్జెట్ సమావేశాల్లో శాంతిభద్రతల సమస్యపై చర్చించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. టీడీపీ అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా ఎన్నికల హామీల అమల్లో అడుగు మందుకు పడలేదు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, వారి ఆస్తుల విధ్వంసం విషయంలో ప్రభుత్వం జెట్ వేగంతో ముందుకెళుతోంది. విపక్ష పార్టీ కార్యకర్తలను రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా చూడటం దుర్మార్గం. ప్రజల గొంతుకకు ప్రతి పక్షం తోడు కాకుండా ఉండటానికే అధికారపక్షం దాడులకు తెగబడుతోంది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, దాడులుగానే చూడాలి. నాకు గన్‌మెన్ అక్కర్లేదని సరండెర్ చేశాను. కానీ ఇప్పుడు భయమేస్తోంది. వంగవీటి రంగా, ఎన్‌కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరామ్, మల్లెల బాబ్జీ, ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు హత్యలు గుర్తుకొస్తున్నాయి. ఎన్టీఆర్ మరణం గుర్తుకొస్తోంది.

 తెలుగుదేశం పార్టీ సభ్యులు: ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం పట్ల అభ్యంతరం

 వైఎస్ జగన్: గత మూడు నెలల్లో జరిగిన 14 హత్యల మీదే చర్చను పరిమితం చేద్దాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందో చెప్పాలి. ప్రభుత్వం ఏం చెబుతుందో అని ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.

 ధూళిపాళ్ల నరేంద్ర (టీడీపీ): లేని సమస్యను తీసుకొచ్చి అధికార పార్టీ మీద బురద చల్లడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. మేం ఎవరినీ శత్రువులుగా చూడటంలేదు. వంగవీటి రంగా, ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన మత ఘర్షణలకు కారణం ఎవరు?

 బోండా ఉమామహేశ్వరరావు (టీడీపీ): వైఎస్ రాజశేఖరరెడ్డి నరమేధాన్ని సృష్టించారు. రాక్షస పాలన సాగించారు. వైఎస్ ప్రభుత్వం 120 మందిని హత్య చేసింది. నరరూప రాక్షసుడు. ప్రాణభయం ఉందంటూ పరిటాల రవి నిండు సభలో చెప్పారు.
 కాకాని గోవర్ధన్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ): (పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ) సభలో లేని వ్యక్తులు, ఇక్కడకు వచ్చి సమాధానం చెప్పుకోలేని వారి మీద నిందారోపణలు చేయడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై స్పష్టమైన రూలింగ్ ఇవ్వాలి.

 డిప్యూటీ స్పీకర్: దీనిపై స్పీకర్ రూలింగ్ ఇస్తారు.

 ధూళిపాళ్ల నరేంద్ర (టీడీపీ): వారు వంగవీటి రంగా, ఎన్టీఆర్ గురించి మట్లాడారు. మమ్మల్ని మాట్లాడొద్దంటే ఎలా?

 వైఎస్ జగన్: సభను రాష్ట్రం మొత్తం చూస్తోంది. ఇక్కడ ప్రవర్తించే తీరును ప్రజలు గమనిస్తున్నారు. శాంతిభద్రతల మీద చర్చ కోసం పట్టుబడినప్పటికీ 11 హత్యలు జరిగాయి. చర్చ మొదలుపెట్టేసరికి హత్యల సంఖ్య 14కు చేరింది. హత్యా రాజకీయాలపై ప్రభుత్వ తీరులో మార్పు వచ్చే దిశగా చర్చ జరగాలి. చర్చను తప్పుదోవ పట్టించడానికి పరిటాల రవి కేసును తీసుకొస్తున్నారు. ఆ కేసు విచారణ ఎప్పుడో ముగిసింది. నా మీద చేస్తున్న ఆరోపణలన్నీ సత్యదూరమని చంద్రబాబుకూ తెలుసు. నాతోపాటు అనంతపురానికి చెందిన జేసీ సోదరులకు రవి హత్యతో సంబంధం లేదని కోర్టు చెప్పింది. అందుకే జేసీ సోదరులను చంద్రబాబు పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. వంగవీటి రంగా పేరును మా ఎమ్మెల్యేలు ప్రస్తావించరు. పరిటాల రవి పేరును మీరూ (అధికారపక్షం) తేవద్దు. 14 బాధిత కుటుంబాలకు మంచి చేయాలంటే చర్చ బాగా సాగాలి. ఆ కేసుల దర్యాప్తు, విచారణ సక్రమంగా జరిపి, న్యాయం చేసే విధంగా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రాజకీయ హత్యలకు గురైన కుటుంబాలకు రూ. 20 లక్షల సాయం ప్రకటించాలి.

 బోండా ఉమామహేశ్వరరావు (టీడీపీ): పరిటాల రవి హత్యలో పాత్రధారి, సూత్రధారి జగన్. వైఎస్సార్ సీపీ వల్లే శాంతిభద్రతల సమస్య. హత్యలు చేయించి బతికిన ఘనత జగన్‌దే.

 కొడాలి నాని (వైఎస్సార్ సీపీ): శాంతిభద్రతల మీద చర్చ అడిగినప్పటికి 11 హత్యలు జరిగాయి. ఈ రెండు మూడు రోజుల్లో మరో 3 హత్యలు జరిగాయి. అంతకుముందు ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యల గురించి చర్చ కోరలేదు. గతంలో హత్యలు జరిగినప్పుడు వైఎస్సార్ సీపీ అధికారంలో లేదు. మా పార్టీ పెట్టి 3 సంవత్సరాలే అయింది. అప్పుడు జగన్ సీఎం కాదు. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చి నిలబెట్టింది టీడీపీనే. నేను వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటువేసి ఒక సంవత్సరం ఇంటి వద్ద కూర్చోబెట్టారు. మంత్రి ఉమామహేశ్వరరావు ప్రోద్బలంతోనే కృష్ణా జిల్లా గొట్టుముక్కల గ్రామంలో హత్య జరిగిందని మేం బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు స్థానికులు చెప్పారు. పరిటాల హత్య కేసులో జగన్, జేసీ సోదరుల ప్రమేయం లేదని కోర్టు చెప్పింది. అందుకే జేసీ సోదరులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. రాజకీయంగా వాడుకోవడానికే జగన్ పేరును పదేపదే టీడీపీ ప్రస్తావిస్తోంది. మేం కూడా వారి పార్టీలో చేరితే రవి కేసుతో సంబంధం లేదని చెబుతారేమో! వైఎస్‌ఆర్ అంటే డాక్టర్ వైఎస్‌ఆర్. డాక్టర్‌గా పదిమందికి ప్రాణాలు పోయడం తప్ప తీయడం తెలియని నాయకుడు. ఆరోగ్యశ్రీ పెట్టి వేలాది మంది ప్రాణాలు కాపాడిన మహానుభావుడు. మనిషి రూపంలో ఉన్న దేవుడు. అలాంటి వ్యక్తిని నరరూప రాక్షసుడని నిందించడం న్యాయమా? జగన్ రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లకే 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు ఆశీర్వదించారు. 30 ఏళ్ల టీడీపీకి 1.35 కోట్ల ఓట్లు వస్తే, మాకు 1.30 కోట్ల ఓట్లు వచ్చాయి. 14 హత్యల మీద న్యాయవిచారణ జరిపించాలి. హత్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

 మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు: గొట్టుముక్కలలో జరిగినది సాధారణ హత్యే. రాజకీయ హత్య కాదు. పరిటాల రవిని హత్య చేయించలేదని జగన్ చెప్పగలరా?

 వైఎస్ జగన్: బురద జల్లడం తప్ప, జరిగినదానికి బాధ్యత తీసుకోవాలనే స్పృహ లేదు. బాధితులను ఆదుకుంటామని ఒక్క మంత్రి కూడా చెప్పకపోవడం దురదృష్టకరం. ఇంకా రెచ్చగొట్టి రాజకీయ హత్యలు కొనసాగిస్తే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కళ్లు తెరవండి. హత్యా రాజకీయాలు చేయొద్దు. 14 హత్యలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి. నిష్పాక్షింగా వ్యవ హరించాలని పోలీసులకు ఆదేశాలివ్వండి.

 మంత్రి బొజ్జల: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. మీరు (వైఎస్సార్ సీపీ సభ్యులు) నాయకుడిని మార్చుకోండి. బాగుపడతారు. చంద్రబాబుకే బాంబు పెట్టి పేల్చారు.

 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ): టీడీపీ అధికారంలోకి రాకముందు జరిగిన హత్యలకు, ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రాణభయం ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రాణభయం బయటవారి నుంచి కాదు. స్వపక్షం నుంచే. విజయవాడ మీద కర్రపెత్తనం కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటంలో వంగవీటి రంగా హత్య జరిగింది. పరిటాల హత్య రాజకీయ హత్య. అనంతపురం జిల్లాలో గనుల దోపిడీకి ఎదురులేకుండా చేయడానికి రవిని హత్య చేయించారు. మంగలి కృష్ణ ఎవరో జగన్‌కు తెలియదా? విచారణలో ఎవరి పేరు చెప్పారో అందరికీ తెలుసు.

 జగన్ : మీరు ప్రస్తావిస్తున్న కేసుల్లో విచారణలు జరిగాయి. చేయని తప్పునకు బఫూన్లతో ఇలా అనిపించుకోవాలా?

 టీడీపీ సభ్యులు: జగన్ వ్యాఖ్యలకు నిరసనగా అధికార సభ్యులంతా స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. జగన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ కల్పించుకొని ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు. సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 1.45 గంటలకు సభ సమావేశమైంది

 గోరంట్ల (టీడీపీ): అనుభవ రాహిత్యం, అహంకారం, శాడిజం వల్ల కావచ్చు.. మమ్మల్సి బఫూన్లు అన్నారు. మమ్మల్ని అనడం అంటే మమ్మల్ని ఎన్నుకున్న కోట్లాది మంది ప్రజలను అన్నట్లే. క్షమాపణ చెప్పాలి.

 పి. శ్రీనివాసులురెడ్డి (టీడీపీ): బఫూన్లంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి. జగన్‌ను సస్పెండ్ చేయాలి.

 ధూళిపాళ్ల నరేంద్ర (టీడీపీ): ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యానించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.

 శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ): రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్లి మొరపెట్టుకున్నా స్పందించడంలేదు. సభలో లేని వ్యక్తిని, ఫ్యాక్షన్‌ను రూపుమాపిన వ్యక్తిని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిని ఎన్నెన్నో మాటలన్నారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయాలు కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చిన జగన్ మీద అసూయతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.

 స్పీకర్: సభా నాయకుడి తర్వాత ప్రతిపక్ష నేతకే ప్రాధాన్యత. మీరు వాడిన మాట నేను గతంలో ఎప్పుడూ సభలో వినలేదు.  హుందాగా ఉపసంహరించుకోండి.
 జగన్: ఇదే సభలో నన్ను హంతకుడన్నారు. నరరూప రాక్షసుడన్నారు. మా ఎమ్మెల్యేలను స్మగ్లర్లు అన్నారు. ఎంతవరకు న్యాయం?

 టీడీపీ సభ్యులు: (జగన్ మాట్లాడుతున్నప్పుడు..) స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు.  వారిని దీటుగా ఎదుర్కొంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభను స్పీకర్ శనివారానికి వాయిదా వేశారు.
 

వాళ్లను బఫూన్లు అంటే తప్పయిందా!

మమ్మల్ని నానా మాటలంటే ఒప్పా ?: వైఎస్ జగన్‌
* నేను వాళ్లను బఫూన్లు అంటే తప్పయిందా!
టీడీపీ నేతలు వారి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నేనూ అందుకు సిద్ధమే
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ
పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారినే పార్టీలో చేర్చుకున్నారు
వాస్తవాలు బయటపడతాయనే హత్యలపై విచారణకు ఒప్పుకోవ డం లేదు

 
సాక్షి, హైదరాబాద్: ‘నన్ను హంతకుడని, నా తండ్రిని నరరూప రాక్షసుడని, మా ఎమ్మెల్యేలను స్మగ్లర్లని అంటే ఒప్పయిందా? నన్ను నానా మాటలన్న వారిని ఉద్దేశించి బఫూన్లని నేనన్న ఒక్క మాట తప్పయిందా? వాళ్లు (టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు) మమ్మల్ని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేనూ అందుకు సిద్ధమే’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ వాయి దాపడిన తరువాత జగన్ తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. తాను అందరు ఎమ్మెల్యేలను బఫూన్‌లని అనలేదని, మమ్మల్ని ఇష్టమొచ్చినట్లు నిందించిన వారిని మాత్రమే అన్నానని చెప్పారు. ‘అసలు బఫూన్ అంటే అర్థం ఏమిటి? సర్కస్‌లో జోకర్ అని. అదికూడా సభలో అందరినీ ఉద్దేశించి నేను అనలేదు, ఎవరైతే నానా మాటలూ అన్నారో వాళ్లనే అన్నాను’ అని స్పష్టం చేశారు.
 
  ‘టీడీపీ వాళ్లు మమ్మల్ని పదే పదే నానా మాటలంటే అది ఆమోదయోగ్యమేనా? మమ్మల్ని ఏటీఎం దొంగలు, స్మగ్లర్లు, దొంగలని అనొచ్చు, అది మీకు న్యాయంగానే అనిపిస్తుంది. కానీ నేనన్న ఒకే ఒక్కమాట మాత్రం అన్యాయంగా అనిపిస్తోంది’ అని జగన్ స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. ‘మమ్మల్ని అన్న అవే మాటలను మా ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంటే చూస్తూ ఊరుకునేవారా?’ అని ప్రశ్నించారు. ‘పదే పదే పరిటాల రవి హత్యను నాకు ఆపాదిస్తున్నారు. రవి హత్య జరిగి పదేళ్లయింది. న్యాయస్థానాల్లో విచారణ జరిగింది, దోషులను నిర్ధారించారు, వారికి శిక్ష కూడా పడింది. అయినా నాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు ఇది అబద్ధమని. రవి హత్య కేసులో ఆరోపణలెదుర్కొన్న జె.సి.దివాకర్‌రెడ్డి, జె.సి.ప్రభాకర్‌రెడ్డిలను టీడీపీలో చేర్చుకుని టికెట్లు కూడా ఇచ్చారు కదా. ఇంకా మాట్లాడ్డం ఏమిటి!’ అని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
 ఆ దమ్మూ, ధైర్యం ప్రభుత్వానికి లేవు
 ‘గత మూడు నెలలుగా జరుగుతున్న హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కానీ వారికి ఆ దమ్మూ ధైర్యం లేవు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. హత్యకు గురైన వారందరూ వైఎస్సార్‌సీపీ వారే. హత్య చేసిన వారూ, చేయించిన వారందరూ టీడీపీ వారే. విచారణలో ఈ వాస్తవాలు బయటపడతాయనే వారీ పనికి పూనుకోరు..’ అని జగన్ తెలిపారు. హత్యకు గురైనవారి కుటుంబాలకు ఏమైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతున్నట్లు తెలి పారు. గత మూడు నెలలుగా జరిగిన హత్యలపై సభలో చర్చ జరిగి వారి కుటుంబాలకు ఏదైనా మేలు జరుగుతుందని మేం ఆశిస్తుంటే, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేం దుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించా రు. ‘శాసనసభలో శాంతిభద్రతలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చను కనుక టీవీల్లో హత్యకు గురైనవారి కుటుంబాలు చూస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటారు.
 
 గతం తవ్వితే మేం వంగవీటి రంగా అంటాం, మీరు పరిటాల రవి అంటారని పలుసార్లు అధికార పక్షానికి మనవి చేశాం. అరుునా వినలేదు’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు సంయమనం కోల్పోయి తమను బఫూన్లు అన్నారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన దృష్టికి తేగా.. ‘వాళ్లు మమ్మల్ని హంతకులని, దొంగలనీ పూర్తి సంయమనంతోనే అన్నారంటనా’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు మిమ్మ ల్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలకు మీరు ట్రాప్‌లో పడినట్టుగా భావించాలా? అని ప్రశ్నించగా.. ‘వాళ్లే మా ట్రాప్‌లో పడ్డారని అనుకోవచ్చు కదా..’ అని జవాబిచ్చారు.
 
 హత్యలపై కచ్చితమైన సమాచారాన్ని సభ ముందుంచాం
 హత్యలకు సంబంధించిన సంఖ్యను పలుమార్లు మారుస్తున్నారనే విమర్శలకు సమాధానం ఇస్తూ.. తమకు తొలుత వచ్చిన సమాచారం ప్రకారం ఒక సంఖ్యను చెప్పామని, కానీ అసెంబ్లీ ముందుకు వచ్చేటప్పుడు సమగ్రమైన, కచ్చితమైన సమాచారంతో ముందుకు వచ్చామని, ఇందులో తప్పేమీ లేదని జగన్ తెలిపారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని చెప్పారు. వాస్తవంగా ఎన్ని హత్యలు జరిగాయో సాక్షి దినపత్రికలో స్పష్టంగా వచ్చాయని అన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా ఆదేశాలిప్పించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదని, గ్రామాల్లో జరిగే చిన్న ఘర్షణలను హత్యలు జరిగేదాకా ప్రోత్సహించడం సరికాదని జగన్ అభిప్రాయపడ్డారు.

మా పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టవచ్చా?

Written By news on Friday, August 22, 2014 | 8/22/2014

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు తనను హంతకుడు, నరరూప రాక్షసుడు, ఉన్మాది అనవచ్చా?అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను స్మగర్లుగా పేర్కొంటూ.. పదే పదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా తాను సంయమనం పాటించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తేనే, తన వ్యాఖ్యలు కూడా తొలగించాలన్నారు. ఈ మూడు నెలల్లో జరిగిన హత్యలకే పరిమితం అవుదామని తాను భావిస్తే.. వారేమో అసలు విషయాన్ని ప్రక్కకు పెట్టారని మండిపడ్డారు. ఇప్పటివరకూ జరిగిన హత్యలపై బాధిత కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయని విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదన్నారు.
 
'పరిటాల హత్య కేసులో విచారణ జరిగింది. దోషులకు శిక్ష పడింది. ఇప్పటికే సంఘటన జరిగి పదేళ్లు అయింది. ఈ అంశానికి, నాకు సంబంధం లేదని చంద్రబాబుకూ తెలుసు.ఈ సంఘటనతో జేసీ సోదరులకు సంబంధం లేదనే వారికి టిడిపి టికెట్లు ఇచ్చారు'అని జగన్ స్పష్టం చేశారు. తనను ఉద్దేశించి టీడీపీ వాళ్లు మాట్లాడినట్లుగా మా పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబును మాట్లాడితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకునే వారేనా? అని నిలదీశారు. 'టీడిపి ఎమ్మెల్యేలు ఏది మాట్లాడినా ఫర్వాలేదా?, మమ్మల్ని విమర్శించిన వాళ్లనే అన్నాను తప్పా సభలో ఉన్న అందరిని కాదని జగన్ ఈ సందర్భంగా తెలిపారు.
 
'మా నాన్నను ఉద్దేశించి అంత దారుణంగా మాట్లాడారు. నేను ప్రతిపక్ష నాయకుడినన్న సంగతి వాళ్లకు తెలియదా?, వాళ్ల మాటలు రికార్డుల నుంచి తొలగిస్తేనే  నా మాటలు కూడా తొలగించాలని' జగన్ డిమాండ్ చేశారు. 'మృతుల కుటుంబీకుల స్థానంలో కూర్చుని మీరు ఆలోచించండి.అసెంబ్లీలో జరుగుతున్నది తప్పా? ఒప్పా?, న్యాయం ఎవరి వైపో మీడియా వారి వైపే ఉంటుంది. యాజమాన్య ఉద్దేశాలు పక్కనబెట్టి మీ మనస్పాక్షిగా రిపోర్ట్‌ చేయండి' అని మీడియా ప్రతినిధులకు జగన్ తెలిపారు.  పదకొండు హత్యలు ఏమైనా చిన్న సంఖ్యా?..ఇప్పటికై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

వాళ్లను ఒక్క మాట కూడా అనరేం?


హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. న్యాయమూర్తిలా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి తొత్తులా, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను, విపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి అధికారపక్ష ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికి వచ్చినట్లల్లా మాట్లాడుతున్నా వారిని ఒక్క మాట కూడా అనని స్పీకర్.. విపక్ష నేత విషయానికి వచ్చేసరికి మాత్రం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ తీర్పులు ఇస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చెవిరెడ్డి ఏమన్నారంటే..

''ప్రతిపక్ష నాయకుడిని నరహంతకుడు అంటే స్పీకర్ గారికి వినపడదు, పట్టించుకోరు. స్మగ్లర్లు, దొంగలు అన్నారు.. గోపాలకృష్ణారెడ్డి బరితెగించి 'చిప్పకూడు తిన్నారు' అన్నారు.. అసెంబ్లీ చరిత్రలో ఇంత అసభ్యమైన పదజాలం వాడిన అధికార పార్టీ ఏదీ లేదు. అయినా స్పీకర్ ఏ మాత్రం పట్టించుకోరు, కనీస స్పందన కూడా ఉండదు. జగన్ మోహన్ రెడ్డి మాత్రం తనను అసభ్యంగా మాట్లాడినవాళ్లను ఉద్దేశించే వ్యాఖ్యానించారు. ఆయన అన్న పదానికి విదూషకుడు, జోకులు వేసేవాళ్లని అర్థం. అందులో అసభ్యత ఏముంది? నరహంతకులు, ఉగ్రవాదులు, చిప్పకూడు అంటున్నారు.. అంత దుర్మార్గంగా అంటున్నా స్పీకర్ ఒక్కమాట కూడా అనరు. అదే జగన్ మోహన్ రెడ్డిని మాత్రం పదాన్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అంటారు. జడ్జిగా ఉండాల్సిన స్పీకర్ వాళ్లను మాత్రం అస్సలు పట్టించుకోరేం? ఎందుకు వాళ్లను ఏమీ అనట్లేదు?

స్పీకర్ కు నిజాయితీ ఉంటే.. వాళ్ల మాటలను కూడా తప్పని భావిస్తే వాళ్లను అసెంబ్లీ నుంచి తన్ని తరిమేయాలి. ప్రజల పక్షాన ప్రశ్నించే బాధ్యతను ప్రతిపక్షానికి ఇచ్చారు. అలా ప్రశ్నిస్తామంటే మా గొంతు కట్టేసి, మా మాట ప్రజలకు వినిపించకుండా ఎందుకు చేస్తున్నారు? మేం ప్రారంభించిన కొన్ని సెకన్లలోనే మైకులు కట్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పడానికి లేచి 20, 30 సెకన్లు కూడా కాకముందే మైకు కట్ చేశారు. ఒక్క యనమల రామకృష్ణుడు తప్ప ఇంతవరకు ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం కూడా లేకుండా మైకులు కట్ చేసిన వాళ్లు ఎవరూ లేరు. అయ్యదేవర కాళేశ్వరరావు నుంచి ఇప్పటివరకు ఇంకెవరూ ఇలా చేయలేదు. స్పీకర్ నిష్పక్షపాతంగా ఉంటారని భావించి గౌరవిస్తే.. ఆయన టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. ఇలా మాట్లాడటం సరికాదు. ఈ జడ్జిమెంటు ఇస్తున్నప్పుడు వాళ్లు మాట్లాడిన భాష మీద ఎందుకు జడ్జిమెంటు ఇవ్వట్లేదు? అధికార పక్షానికి సభ్యత, మాట్లాడే భాష నేర్పించండి. మేం కూడా వినడానికి, సంప్రదాయాలు పాటించడానికి సిద్ధంగానే ఉన్నాం. స్పీకర్ ఆలోచనలు, వ్యవహారశైలి మారాలి. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించడం సరికాదు.

కాన్వాయ్‌ లేకుండానే వెళ్లిపోయిన జగన్


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. విపక్ష నాయకుడికి కల్పించిన భద్రత విషయంలో టీడీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్‌ పార్కింగ్‌కు స్థలం కేటాయించకుండా ఆయనను ఇబ్బంది పెడుతోంది. దీనికి నిరసనగా వైఎస్ జగన్ కాన్వాయ్‌ లేకుండానే అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

విపక్ష నేతకు ఇవ్వాల్సిన కాన్వాయ్ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించారు. పైలట్, ఎస్కార్ట్ కోసం పాత వాహనాలకు కేటాయించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకుడి భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష ధోరణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. వైఎస్ జగన్ భద్రతపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హంతకులు, స్మగ్లర్లు అంటారా?

హంతకులు, స్మగ్లర్లు అంటారా?
హైదరాబాద్ : శాంతిభద్రతలపై జరిగిన చర్చ అసెంబ్లీలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసింది. అధికారపక్షం సభ్యులు సంయమనం కోల్పోయి వ్యవహరించి.. నోటికి వచ్చినట్లల్లా వ్యాఖ్యానించారు. దాంతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనను నరరూప రాక్షసుడని అన్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను స్మగ్లర్లుగా అభివర్ణించారని, ఇదే నిండు సభలో తనను హంతకుడని కూడా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. తనను, తన పార్టీ వాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వాళ్లు ఉపసంహరించుకుంటే.. తాను కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని చెప్పారు.

టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు చేసిన వ్యాఖ్యలమీద వైఎస్ఆర్ సీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోడియంలోకి రావడంతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ చర్చ జరిగింది. సభలో లేని దివంగత నేతలను కించపరిచేలా అధికారపక్షం వ్యాఖ్యలు చేస్తోందని, వైఎస్ఆర్, వైఎస్ జగన్ లక్ష్యంగా అధికారపక్షం వ్యాఖ్యలు చేస్తోందని విపక్ష సభ్యులు మండిపడ్డారు. మరోవైపు అధికార పక్షం కూడా వెల్ లోకి దూసుకొచ్చి పోటాపోటీగా నినాదాలు చేయడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను శనివారానికి వాయిదా వేశారు.

బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం

రాజకీయ హత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికింది. హత్యారాజకీయాలపై చర్చ వాడివేడిగా జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సభలో చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో స్పీకర్ అంగీకరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి.

పలువురు నేరస్థులతో వైఎస్ జగన్ కు సంబంధాలున్నాయని బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. దీనిపై వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. బుచ్చయ్య చౌదరి అడ్డుతగలడంతో.. చెప్పేది వినలేని మీరు- చేయని తప్పులకు ఆరోపణలు చేస్తే ఎలా ఊరుకుంటానంటూ సమాధానమిచ్చారు. తనపై బురద చల్లడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు టీడీపీ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం రేగింది. దీంతో సభను కోడెల శివప్రసాదరావు పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత గందరగోళం కొనసాగింది

డాక్టర్ వైఎస్ కు ప్రాణాలు పోయడమే తెలుసు

'డాక్టర్ వైఎస్ కు ప్రాణాలు పోయడమే తెలుసు'
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ అని.. ఆయనకు ప్రాణాలు పోయడమే తెలుసు గానీ, ప్రాణాలు తీయడం తెలియదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికార పార్టీ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై పదే పదే ఆరోపణలు చేయడంతో ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు రెండు రాష్ట్రాల్లోను ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను కాపాడాయని, ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.

గొట్టిముక్కల గ్రామం జాతీయరహదారికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, అక్కడ తమ పార్టీ తరఫున చురుగ్గా వ్యవహరిస్తున్న డిప్యూటీ సర్పంచిని తెలుగుదేశం పార్టీకి చెందినవారు దారుణంగా హతమార్చినట్లు అక్కడివారు చెబుతున్నారన్నారు. అక్కడకు తాము వెళ్లినప్పటికి కూడా ఇంకా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని, అందుకు కారణం మంత్రి ఒత్తిడేనని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారని కొడాలి నాని అన్నారు. ఇలా అధికార పార్టీ ప్రోద్బలంతోనే అరాచకాలన్నీ జరుగుతున్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.

మృతుల కుటుంబాలను ఆదుకుందాం: వైఎస్ జగన్

శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాట్లాడేందుకు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ''శాంతిభద్రతలపై చర్చను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పరిటాల రవీంద్ర హత్య కేసు విషయంలో విచారణలు జరిగాయి. అందులో తాను చేసినవి సత్యదూరమైన ఆరోపణలని చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే ఆయన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు టికెట్లు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. పరిటాల రవీంద్ర హత్య విషయంలో వచ్చిన ఆరోపణలు నిజమే అయితే ఆయనలా చేస్తారా?

కేవలం చర్చను తప్పుదోవ పట్టించడానికే లేనిపోని అభాండాలు వేస్తున్నారు. వాళ్లు పరిటాల రవి అంటే, మావాళ్లు వంగవీటి మోహనరంగా అంటారు. ఇలా అంటుంటే ఇంకా ఎంత దూరమైనా వెళ్తుంది. వాళ్లను ఆ ప్రస్తావన మానమనండి, మావాళ్లు ఈ ప్రస్తావన మానేస్తారు. చనిపోయిన 14 మంది కుటుంబాలకు ఏదైనా మేలు చేయడానికి ప్రయత్నిద్దాం. మనకు ఎవరైనా తెలియనివాళ్లయినా సరే.. మనుషులు చనిపోతే కొంతమందికి ఐదు లక్షలు, మరికొందరికి ఇంకా ఎక్కువగా ఎక్స్ గ్రేషియాలు ఇస్తున్నాం. ఇక్కడ మాత్రం ఓ పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులను వరుసపెట్టి హతమారుస్తున్నారు. ఇక్కడ వ్యవస్థలో మార్పు రావాలి. రేపు అధికారంలోకి మేమొస్తాం. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ హత్యారాజకీయాలను మానుకోవాలని అందరికీ సలహా ఇస్తున్నా'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

చర్చ జరుగుతుండగానే దాడులా?

చర్చ జరుగుతుండగానే దాడులా?
హైదరాబాద్: హత్యారాజకీయాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని పదేపదే కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒకవైపు సభలో చర్చ జరుగుతుండగానే ఎక్కడికక్కడ రాజకీయ హత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కూడా తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు.

మనుషుల ప్రాణాల కంటే విలువైంది ఏమైనా ఉందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. శాంతిభద్రతలపై కచ్చితంగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ బడ్జెట్‌పై రేపు చర్చిద్దామని, ఇవాళే హత్యారాజకీయాలపై చర్చకు అనుమతివ్వాలని స్పీకర్ ను జగన్ కోరారు. ముందుగా బడ్జెట్ చర్చ ప్రారంభించాలని జగన్ కు స్పీకర్ కోడెల విజ్ఞప్తి చేశారు. అయితే బడ్జెట్ పై చర్చ ప్రారంభినట్టుగా భావించాలని జగన్ సమాధానమిచ్చారు. దీంతో హత్యారాజకీయాలపై చర్చకు స్పీకర్ అనుమతిచ్చారు.

ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కోటంరెడ్డి

ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కోటంరెడ్డి
హైదరాబాద్ : రాజకీయ హత్యలపై శుక్రవారం అసెంబ్లీలో వాడీ వేడీగా చర్చ జరిగింది. వ్యవసాయ బడ్జెట్ అనంతరం శాంతి భద్రతలపై చర్చకు స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమతి ఇచ్చారు. రాజకీయ హత్యలపై నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు.

పక్కా వ్యూహం ప్రకారం దాడులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ హత్యలు జరుగుతూనే ఉన్నాయని.... రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెడుతున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు.పోలీస్ స్టేషన్లలోనే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని కోటంరెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. బాధితుల వివరాలతో సహా ఆయన ప్రస్తావించారు.
కలెక్టర్ పై దాడి చేసినా తూతూమంత్రంగా కేసులు పెట్టారని కోటంరెడ్డి తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫాకి దిగారని, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై దాడికి పాల్పడ్డారని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి కూడా ముప్పు ఉందని, చెవిరెడ్డికి  ఏం జరిగినా అందుకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ చర్చపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు. అధికార పక్షంపై కావాలనే బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు.

వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఇనపరాడ్లతో దాడి

 టీడీపీ  ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేస్తున్న దాడులు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లోని ప్రజాశక్తినగర్ లో శుక్రవారం వైఎస్ఆర్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని గురజాల ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

అంగన్ వాడీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తల జీతాలు రూ.10వేలు చేయాలని వైఎస్ఆర్ సీప ఈరోజు ఉదయం సభలో డిమాండ్ చేసింది. దీనిపై మంత్రి సుజాత స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ సమస్యలపై సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడుగా మాట్లాడటం సరికాదన్నారు.

దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలి: వైఎస్ జగన్

Written By news on Thursday, August 21, 2014 | 8/21/2014

'దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టేల్‌పాండ్ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని లేఖలో  ప్రధాని మోడీని వైఎస్ జగన్ కోరారు. ఖమ్మం, వరంగల్ , పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్ట్‌తో సాగులోకి వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు

తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని ఆయన గురువారమిక్కడ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి చంద్రబాబే కారణమని చెవిరెడ్డి విమర్శించారు. ఫ్యాక్షనిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్లకు  టికెట్లు ఇచ్చింది ఆయననేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులు అయిన పోతుల సురేష్, చమన్, కందికుంట ప్రసాద్ లకు పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారని చెవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రెడ్డి నారాయణ, మహేష్ నాయుడు ఎర్ర చందనం స్మగర్లు అని, స్మగ్లర్లకు, ఫ్యాక్షనిస్టులకు టికెట్లు ఇచ్చిన బాబు ఇప్పుడు నీతులు చెప్పటం సిగ్గుచేటు అని ఆయన ఎద్దేవా చేశారు.

వైఎస్ జగన్ తన బాధ్యత నేరవేర్చారు

హైదరాబాద్: ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షమే ప్రశ్నిస్తుందని చెప్పారు. వైఎస్ జగన్ తన బాధ్యతను నెరవేర్చారని అన్నారు. బడ్జెట్‌లో ఉన్న తప్పులు, లోపాలను ఎత్తిచూపడాన్ని మీరు అంగీకరించలేరా అని సూటిగా ప్రశ్నించారు.

వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు బడ్జెట్‌పై స్పష్టత ఇవ్వాలి కాని ఇలా మాట్లాడకూడదని సూచించారు. ప్రతిపక్షనేతను అవమానించడం చంద్రబాబుకు తగదని హితవు చెప్పారు. మీ తప్పులను ప్రశ్నించడానికి మాకు అనుభవం కావాలా అని నిలదీశారు. చంద్రబాబు తన పద్దతులు, వైఖరి మార్చుకోవాలని ధర్మాన ప్రసాదరావు సలహాయిచ్చారు.

78 జీవోను రద్దు చేయాలి

78 జీవోను రద్దు చేయాలి
  • - అసెంబ్లీలో రోజా డిమాండ్
తిరుపతి : తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగించడాన్ని నగరి శాసనసభ్యురాలు ఆర్‌కే.రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందుకు సంబంధించిన జీవో 78ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోజా మెటర్నిటీ ఆస్పత్రి అంశాన్ని లేవనెత్తారు. రాయలసీమకు తలమానికంగా ఉన్న తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి పేద మహిళలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు.

ఆస్పత్రికి కాన్పుల కోసం వచ్చే గర్భిణీలు, గైనిక్ సంబంధ జబ్బులతో వచ్చే మహిళారోగుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గతంలో జీవోనెంబర్ 87 ద్వారా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నిధులతో 300 పడకల ఆస్పత్రి మంజూరైందన్నారు. అయితే ఆ ఆస్పత్రిని జీవో 78 ద్వారా కార్పొరేట్ సేవలకు ప్రతీకగా ఉన్న స్విమ్స్‌కు అప్పగించడం అనుచితమైన చర్యగా రోజా పేర్కొన్నారు.

జీవో 78ని రద్దు చేసి 300 పడకల భవనాన్ని మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగానే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. జీవో 78 కి వ్యతిరేకంగా మూడు వారాలుగా జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనను ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు.
 

ఫలానా చోట రాజధానికి వ్యతిరేకమని. నేనెప్పుడైనా అన్నానా?

ఫలానా చోట రాజధానికి  వ్యతిరేకమని. నేనెప్పుడైనా అన్నానా?
ఈ బ డ్జెట్‌లో ఏపీ కొత్త రాజధాని ఎక్కడ పెడతారు, దానికోసం ఎంత కేటారుుస్తారో చెప్పనేలేదు. అసలా ప్రస్తావనే లేదు’’ అని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రాజధాని ఎక్కడుండాలనుకుంటున్నారు అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఈ విషయంలో తొలి నుంచీ నేను చెబుతున్నది ఒక్కటే. ఎక్కడ 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటుందో అక్కడ నిర్మించాలని చెబుతున్నాను. రాజధాని నగరం అంటే నడిబొడ్డు నుంచి ఎటు చూసినా 6 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉండాలి. కనీసం 144 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండాలని చెబుతున్నాను’’ అని చెప్పారు.

విజయవాడలో రాజధాని నిర్మాణానికి మీరు వ్యతిరేకమా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘నేనెప్పుడైనా ఆ మాట అన్నానా? ఫలానా చోట రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అని చెప్పానా?’’ అని అన్నారు. ‘‘ఒక సామాన్యుడు లేదా ఒక ఉద్యోగి రాజధాని నగరంలో నివాసానికి ఇల్లు కొనుక్కోవాలంటే సాధ్యమవుతుందా? ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండే చోట రాజధాని
నిర్మించాలని అంటున్నాను. - వైఎస్ జగన్
 

వైఎస్సార్‌సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు

వైఎస్సార్‌సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు
 జిల్లాలకు కొత్త అధ్యక్షులు.. నియామకాలు చేసిన జగన్

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగానికి 8 మంది ప్రధాన కార్యదర్శులతోపాటుగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులుగా సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎంవీ మైసూరారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ నియమితులయ్యారు.

జిల్లా అధ్యక్షులుగా రెడ్డి శాంతి (శ్రీకాకుళం), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), గుడివాడ అమర్‌నాథ్ (విశాఖపట్టణం), జ్యోతుల నెహ్రూ (తూర్పు గోదావరి), ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి), కె.పార్థసారథి (కృష్ణా -దక్షిణం), కొడాలి నాని (కృష్ణా-ఉత్తరం), మర్రి రాజశేఖర్ (గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి (ప్రకాశం), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (నెల్లూరు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి (వైఎస్సార్), శంకరనారాయణ (అనంతపురం), కె.నారాయణస్వామిలను (చిత్తూరు) నియమించారు.
 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల,కార్యదర్శుల నియామకం

Written By news on Wednesday, August 20, 2014 | 8/20/2014

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల నియామకం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు నియామకం చేపట్టారు. ప్రధాన కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యాలయం బుధవారం రాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పదవుల నియామకంలో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారికి, గెలిచినవారికి పదవులు వరించాయి. జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులగా నియమితులైన వారి వివరాలిలా ఉన్నాయి.

జిల్లా అధ్యక్షులు

శ్రీకాకుళం- రెడ్డి శాంతి
విజయనగరం-వీరభద్రస్వామి
విశాఖపట్నం-అమర్నాథ్
తూర్పుగోదావరి-జ్యోతుల నెహ్రూ
పశ్చిమగోదావరి-ఆళ్ల నాని
కృష్ణా (సౌత్)-పార్థసారథి
కృష్ణా (నార్త్)-కొడాలి నాని
గుంటూరు-మర్రి రాజశేఖర్
ప్రకాశం-బాలినేని శ్రీనివాసరెడ్డి
నెల్లూరు-ప్రసన్న కుమార్ రెడ్డి
కర్నూలు-బుడ్డా రాజశేఖర్ రెడ్డి
అనంతపురం-శంకర్ నారాయణ
వైఎస్ఆర్ కడప-ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
చిత్తూరు-నారాయణ స్వామి

ప్రధాన కార్యదర్శులు

మైసూరా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, సుజయ్ కృష్ణా రంగారావు, జంగా కృష్ణమూర్తి, విజయసాయి రెడ్డి, పీఎన్ వీ ప్రసాద్


YSR Congress Party District Presidents

1 Srikakulam - Reddi Shanthi
2 Vizianagaram - Kolagatla Veerabhadra Swamy

3 Visakhapatnam-Gudiwada Amarnath

4 East Godavari - Jyothula Nehru
5 West Godavari - Alla Nani
6 Krishna South - K. Partha Sarathi
7 Krishna North - Kodali Nani
8 Guntur - Marri  Rajasekhar
9 Prakasam - Balineni Srinivasa Reddy
10 Nellore - Prasanna Kumar Reddy
11 Kurnool - Budda Raja Sekhar Reddy
12 YSR - Akepati Amarnath Reddy
13 Ananthapuram - Shankar Narayana
14 Chittoor - Narayana Swamy


YSR CP General Secretary's

1 Sujay Krishna Ranga Rao

2 Dharmana Prasad Rao

3 Mopidevi Venkata Ramana

4 Janga Krishna Murthy

5 M.V. Mysoora Reddy

6 Bhumana Karunakar Reddy

7 Vijay Sai Reddy

8 PNV Prasad

బడ్జెట్ తో కోట్లాది మందికి నిరాశ

బడ్జెట్ తో కోట్లాది మందికి నిరాశ: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్ట మొదటి బడ్జెట్ తో కోట్లాది మంది ప్రజల ఆశలు అడియాసలయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ తమతో పాటు అన్ని వర్గాలను తీవ్రంగా నిరుత్సాహపరించిందని ఆయన చెప్పారు. రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని వైఎస్ జగన్ అన్నారు.

వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత రెండు మేనిఫెస్టోలలోను రైతు రుణమాఫీ అంశాన్ని చంద్రబాబు ప్రముఖంగా ప్రస్తావించారని, దానిపై హామీ ఇచ్చినా బడ్జెట్ లో ఏమాత్రం కేటాయింపులు చేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. లక్షా 2 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానన్నచంద్రబాబు ఆ విషయంలో చేసింది శూన్యమన్నారు. బడ్జెట్ గురించి ఆశగా ఎదురుచూస్తున్న కోట్లాదిమంది రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారన్నారు. గృహ నిర్మాణ రంగానికి ఈ బడ్జెట్ లో కేటాయింపులు దారుణమని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రతి యేటా 7, 8 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ. 800 కోట్లు కేటాయించారన్నారు.

సాధారణంగా ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉంటే రాష్ట్ర పురోగతి బాగుంటుందని, కానీ ఇక్కడ మాత్రం ప్రణాళికేతర వ్యయాన్ని దాదాపు మూడురెట్లు ఎక్కువగా చూపించారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ కూడా పడిపోయందని, ఈ రెండు జీడీపీపై ప్రభావం చూపుతాయని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణం ఎక్కడో, దానికి కేటాయింపులు ఎంత చేశారో అసలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Popular Posts

Topics :