24 July 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబు నటిస్తున్నారు: ఎమ్మెల్యే రోజా

Written By news on Saturday, July 30, 2016 | 7/30/2016


చంద్రబాబు నటిస్తున్నారు: ఎమ్మెల్యే రోజా
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగించడం దుర్మార్గమని ఆమె శనివారమిక్కడ అన్నారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన ప్రజల హృదయాల్లో నుంచి వైఎస్ఆర్ ను తొలగించలేరని రోజా వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు నటిస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు చర్యల వల్లే ప్రత్యేక హోదాకు ముప్పు ఏర్పడిందన్నారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 40ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని రోజా హెచ్చరించారు.

పార్లమెంట్ లో హోదా అంశాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్


పార్లమెంట్ లో హోదా అంశాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆగస్ట్ 2వ తేదీన బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... బంద్ కు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా  ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారని వైఎస్ జగన్ మండిపడ్డారు.. బీజేపీ, చంద్రబాబు కలిసి ఐదుకోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. హోదా ఇవ్వకపోయినా ప్రభుత్వంలో కొనసాగుతామని చంద్రబాబు సంకేతాలిచ్చారన్నారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఏపీకి అయిదేళ్లు కాదు...పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల ముందు హోదాపై ప్రజలను మభ్యపెట్టారన్నారు. తిరుపతి ఎన్నికల సభ సాక్షిగా నరేంద్ర మోదీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో ఏం జరిగిందో చూశామని... రాజ్యసభలో శనివారం జరిగిన పరిణామాలు చూస్తే మరోసారి ఆ రోజులు గుర్తొచ్చాయన్నారు.

ఆ తర్వాతే చంద్రబాబు రాజీపడ్డారు..

ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. ఓటు కోసం కోట్లు ఇస్తూ...ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు పట్టుబడ్డారన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఎర చూపారన్నారు. సూట్ కేసులు ఇస్తూ నల్లధనంతో చంద్రబాబు దొరికిపోయారన్నారు. ఆ తర్వాతే చంద్రబాబు రాజీపడ్డారని వైఎస్ జగన్ అన్నారు. వారం రోజులకే చంద్రబాబు మాట మార్చారన్నారు. రాజధాని శంకుస్థాపన సభలో కూడా ప్రధానిని చంద్రబాబు హోదా విషయంపై అడగలేకపోయారన్నారు. ఆయన ఇప్పుడు ఏదీ అడగలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే  హోదా సంజీవిని కాదంటూ ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఆయన హోదా సంజీవని కాదన్న తర్వాతే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేమనే పరిస్థితిలోకి వెళ్లిపోయిందన్నారు.

గట్టి అల్టిమేటం ఇస్తారనుకున్న చంద్రబాబు ఏం చెప్పారో అంతా చూశామన్నారు. హోదా ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లు చంద్రబాబు మాట్లాడరన్నారు. చంద్రబాబు చాలా దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారని, నిలదీయలేని పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉందా? అనిపిస్తుందని వైఎస్ జగన్ అన్నారు. తన స్వప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని పణంగా పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. పథకం ప్రకారం చంద్రబాబు డ్రామాలాడి, ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. అందుకే మొహమాటం లేకుండా బీజేపీ హోదా సాధ్యం కాదని చెప్పిందన్నారు. బీజేపీ ఆ మాట అన్నాక కూడా చంద్రబాబు ఇంకా తాను కేంద్రంలో కొనసాగుతానని చెప్తున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.  అంతా అయిపోయాక ఇప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని  అన్నారు.

జైట్లీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాజ్యసభలో చెప్పిన వివరాలు తమకు ఆశ్చర్యాన్ని కలిగించాయని వైఎస్ జగన్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాలకు మధ్య తేడా చూపలేదన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖకు సమాధానం ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదా అంశానికి, ఆర్థిక సంఘానికి సంబంధం లేదని వైఎస్ జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలన్నదానిపైనే ఆర్థిక సంఘం దృష్టి పెడుతుందన్నారు. హోదా ఇవ్వాలా? వద్దా? అన్న విషయం ఆర్థిక సంఘం పరిధిలో ఉండదన్నారు. ప్రధాని నేతృత్వంలోని ఎన్డీసీ ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటుందని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
 హోదాపై ప్రధానిదే నిర్ణయం
ప్రత్యేక హోదా కేవలం ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే అని వైఎస్ జగన్ అన్నారు. అది లెజిస్లేటివ్ విషయం కానే కాదన్నారు. హోదా ఇవ్వాలా వద్దా అంశాన్ని ప్రధాని మాత్రమే నిర్ణయించగలరన్నారు. అప్పటి ప్రధాని వాజ్ పేయి ఒక్క సంతకంతో ఉత్తరాఖండ్ కు ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. హోదాపై మన్మోహన్ కేబినెట్ నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిందన్నారు. ప్లానింగ్ కమిషన్ కు కూడా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాలని ఆరోజు నిర్ణయం తీసుకుందని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ఏడాది పాటు 13వ ఆర్థిక సంఘమే ఉందని వైఎస్ జగన్ తెలిపారు. నీతి ఆయోగ్ కూడా 2014 డిసెంబర్ లో వచ్చిందని, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయకముందే ...ఆ ఫైల్ అక్కడే ఉందన్నారు. ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ...ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఒక పథకం ప్రకారం ఏపీని ఖూనీ చేశారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి 90 శాతం గ్రాంట్ల రూపంలో ఉంటాయని, హోదా లేని రాష్ట్రానికి 30 శాతం మాత్రమే గ్రాంట్ల రూపంలో ఉంటాయని వైఎస్ జగన్ అన్నారు. అలాగే హోదా ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు బాగా వస్తాయని, వంద శాతం ఎక్సైజ్, ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. ఇలాంటి రాయితీలు ఉన్నప్పుడే పెట్టుబడులు బాగా వస్తాయని, పెట్టుబడుల కోసం సింగపూర్, రష్యాలకు చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. లక్షల కోట్లు పెట్టుబడులే కాకుండా, లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి
బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ఊదరగొట్టారని, అయితే ఆయన అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని వైఎస్ జగన్ అన్నారు. అలాగే రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి తన అనుభవం చూపించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.  ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం, తర్వాత మోసం చేసే తీరు మారాలని వైఎస్ జగన్ అన్నారు.
రాజకీయ నాయకులు మాట మీద ఉండాలని, మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు నిలదీస్తారన్న భయం కూడా ఉండాలన్నారు.  మంగళవారం నిర్వహించే బంద్ కు అందరు సహకరించాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకే కుట్రలు


తిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రోడ్డు విస్తరణ పేరుతో విజయవాడలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ విజయవాడలో అన్ని అనుమతులతోనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ సీపీ పట్ల చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహాలు ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు.
వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకే చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

మ.12గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్


హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ జరగనుంది. కాగా  ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం రాజ్యసభలో సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైఎస్ జగన్ ఇవాళ మాట్లాడనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలు వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది.

హోదాపై బీజేపీ, టీడీపీల వైఖరికి నిరసనగా ఏపీ బంద్

Written By news on Friday, July 29, 2016 | 7/29/2016


- రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీల తీరు దుర్మార్గమన్న వైఎస్ జగన్
- నిరసనగా మంగళవారం (ఆగస్టు 2న) రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన ప్రతిపక్ష నేత

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ, టీడీపీలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించడం, అయినా సరే ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం.. కేంద్ర ప్రభుత్వంలో నిర్లజ్జగా కొనసాగుతుండటం దారుణమని ఆయన విమర్శించారు. ఈ దుర్మార్గ వైఖరికి నిరసనగా, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిరంతరం పోరాడుతున్న  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (ఆగస్ట్ 2న) రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ బంద్ లో పాల్గొనాల్సిందిగా, బంద్ కు అందరూ సహకరించాల్సిందిగా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక హోదా సంజీవని కాదని సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పేర్కొన్నందువల్లే బీజేపీ ఈ నిర్ణయానికి రాగలిగిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తుతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని, తన మీద కేసులు లేకుండా చేసుకునే క్రమంలో జనానికి ఎంత ఆన్యాయం జరిగినా ఆయన నోరు మెదపడంలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. రాజ్యసభలో జరిగిన చర్చ, ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు, నాయకులు చేసిన ప్రకటనలు, రెండేళ్లుగా వారు ఆడుతున్న డ్రామాలు.. బీజేపీ, టీడీపీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని, ఆ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ జగన్ ప్రకటనలో పేర్కొన్నారు.

1 నుంచి నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Thursday, July 28, 2016 | 7/28/2016


1 నుంచి నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన
1, 2 తేదీల్లో నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు.. 3న యువభేరి

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 1 నుంచి 3 వరకూ నెల్లూరులో పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్ యాదవ్‌తో కలసి బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1న, అలాగే 2వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నగరంలోని అనిల్ గార్డెన్స్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. 3వ తేదీన కస్తూరి దేవి గార్డెన్స్‌లో యువభేరి కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గాల సమీక్షకు పార్టీ ముఖ్య నేతలు మాత్రమే హాజరవుతారని, యువభేరికి విద్యార్థులు, ప్రజలు హాజరుకావాలని వారు కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ తొలినుంచీ పోరాటం చేస్తున్నార న్నారు. కాగా అనిల్ గార్డెన్స్‌లో ఏర్పాట్లను నేతలు పరిశీలించారు.

 అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిశీలకురాలిగా గిడ్డి ఈశ్వరి
 సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అరకు లోక్‌సభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

సీఎం మాట మార్చినా.. మా పోరాటం ఆగదు


సీఎం మాట మార్చినా.. మా పోరాటం ఆగదు
న్యూఢిల్లీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట మార్చారని.. అయినా హోదా కోసం తమ పోరాటం మాత్రం ఆగబోదని వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ సీపీ గత రెండేళ్లుగా హోదా కోసం పోరాడుతోందని, ఇప్పుడు కూడా హోదా ఇవ్వకపోతే ఎంతకాలమైనా పోరాటం చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే...

‘‘సమైక్యాంధ్రప్రదేశ్ ను విభజించింది ఎంత వాస్తవమో.. ఏపీకి అన్యాయం చేసిందన్నది కూడా అంతే నిజం. ఈ చర్చ సందర్భంగా కొన్ని ముఖ్యమైన న్యాయపరమైన విషయాలు లేవనెత్తి, వాటికి ఆర్థిక, న్యాయశాఖ మంత్రులు సమాధానంచెబుతారనుకున్నాను. కానీ వాళ్లు ఈ సభలో లేకపోవడం దురదృష్టకరం. ఈ సవరణ బిల్లు ఆర్థిక బిల్లు కాబట్టి రాజ్యసభలో పెట్టడం కుదరదని రెండురోజుల క్రితం ఆర్థికమంత్రి సభలో అన్నారు. నిజానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును 2014లో ఆమోదించినప్పుడు దానికి రాజ్యాంగ సవరణ అవసరం. కానీ అలా చేయలేదు. సభ్యులందరికీ ఆ విషయం

తెలుసు. అలాంటప్పుడు సవరణను ఆర్థిక బిల్లుగా ఎలా పరిగణిస్తారు? రాజకీయ, సాంకేతిక కారణాల వల్ల అధికారపక్షం దీన్ని ఆర్థికబిల్లుగా పరిగణించవచ్చు. కానీ న్యాయపరంగా చూస్తే మాత్రం ఇది ఆర్థికబిల్లు కాదు. ఒకవేళ దీనికి కొన్ని సవరణలు చేయాలన్నా.. అందుకు రాజ్యాంగంలోని నాలుగో అధికరణ ప్రకారం కొన్ని అవకాశాలున్నాయి. నిజానికి ప్రతి బిల్లులోనూ ఎంతోకొంత ఆర్థికాంశాలు ఉంటాయి. ఆ లెక్కన చూసుకుంటే 70-75 శాతం వరకు బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే. ఆ లెక్కన వాటిని రాజ్యసభలో ప్రవేశ పెట్టకూడదంటే ఉభయ సభల విధానమే ప్రమాదంలో పడుతుంది. అందువల్ల దీన్ని ఆర్థిక బిల్లుగా పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ సభలో ఓటింగుకు అనుమతించాలని అడుగుతున్నాను

రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20వ తేదీన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల‍్లుపై విస్తృతంగా చర్చ జరిగినప్పుడు ప్రధానమంత్రి స్వయంగా 6 హామీలు ఇచ్చారు. వాటిలో ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ప్రధాని స్వయంగా ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నప్పుడు వెంకయ్య నాయుడు ఐదేళ్లు సరిపోదని, పదేళ్లు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం నిరంతరం ఉంటుందని, పార్టీలు అధికారంలోకి రావచ్చు, పోవచ్చని ఆర్థికమంత్రి చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం నిరంతరం ఉంటే.. నాటి ప్రధాని ఇచ్చిన హామీని నేటి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే.. సభాహక్కుల ఉల్లంఘన అవుతుందా అనే అనుమానం కూడా నాకుంది.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయానికి వస్తే.. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు తమ మేనిఫెస్టోలలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి ర్యాలీలోను, విశాఖ సభలో కూడా స్వయంగా చెప్పారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం పూర్తిగా మాట మార్చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఆయన అంటున్నారు. కానీ వాస్తవానికి అది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంజీవనే అవుతుంది. అందువల్ల దాన్ని తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. నాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంది, అలాగే రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలి.’’

1,2,3 తేదీల్లో నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Wednesday, July 27, 2016 | 7/27/2016


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెలలో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 1,2,3 తేదీల్లో వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడించారు. ఒకటి, రెండు తేదీల్లో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలతో పాటు, 3న యువభేరీ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారని తెలిపారు.

పాల్మన్‌పేట బాధితులకు వైఎస్సార్‌సీపీ సాయం


పాల్మన్‌పేట బాధితులకు వైఎస్సార్‌సీపీ సాయం
పాయకరావుపేట : విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటలో ఇటీవల జరిగిన దాడుల్లో నష్టపోయిన బాధితులకు వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 109 మంది బాధితులకు రూ.7.75 లక్షల నగదు సాయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఇతర నేతలు అందజేశారు. ఇందులో 63మందికి రూ.5వేల చొప్పున, 46 మందికి రూ. పదివేలు చొప్పున అందజేశారు.

ఈ సందర్భంగా అమర్‌నాథ్  మాట్లాడుతూ బాధితులను ఆదుకునేందుకు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకొచ్చి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారని చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించినా.. ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆదుకోలేదన్నారు. గత నెలలో పాల్మన్‌పేటలో ఒక వర్గం వారిపై ప్రత్యర్థి టీడీపీకి చెందిన వందలాది మూకలు మూకుమ్మడిగా దాడి చేసి భౌతిక దాడులకు పాల్పడటం, ఆస్తుల విధ్వంసానికి తెగబడిన సంగతి తెలిసిందే.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీకే పట్టం


టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం
‘గిద్దలూరు’ వైఎస్సార్‌ సీపీకి కంచుకోట
ఎన్నికలు ఎప్పుడొచ్చినా  పార్టీకే పట్టం
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి
జగన్‌ సీఎం కావడమే లక్ష్యం : చేగిరెడ్డి లింగారెడ్డి
కంభం: 
గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సీఎల్‌ఆర్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో మంగళవారం పార్టీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన అశోక్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని సీఎం చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్టీ నేత చేగిరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు, సమన్వయకర్త ఐ.వి.రెడ్డికి పూర్తి మద్దతుగా నిలుస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమన్నారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రంగారెడ్డి, కంభం, బేస్తవారిపేట, కొమరోలు మండల కన్వీనర్లు గొంగటి చెన్నారెడ్డి, బాలిరెడ్డి, సార్వభౌమరావు, పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొండా తిరుపతిరెడ్డి, సెక్రటరీ ఖమర్, టీవీఎస్‌పీ శర్మ, మాజీ ఎంపీపీ వెంకటరాజు, కంభం ఎంపీటీసీ సభ్యుడు చిక్కుడు రోశయ్య, పట్టణ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.   

‘స్టాప్‌ ర్యాగింగ్‌’ పోస్టర్ల ఆవిష్కరణ

Written By news on Tuesday, July 26, 2016 | 7/26/2016


‘స్టాప్‌ ర్యాగింగ్‌’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్‌:
వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్టాప్‌ ర్యాగింగ్‌’ పోస్టర్లను రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి, మైదుకూరు, రాయచోటి, కమలాపురం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో  నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రిషితేశ్వరి లాగా ఏ విద్యార్థినిలు ర్యాగింగ్‌ భూతానికి బలికాకూడదన్నారు. ఆమె తల్లిదండ్రుల గర్భశోకం మరొకరికి కలగకూడదన్నారు.  జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరగం రెడ్డి తిరుపాల్‌రెడ్డి, గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్,  జెడ్పీటీసీలు సుదర్శన్‌రెడ్డి, సురేష్‌యాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు పి.
ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా పాల్గొన్నారు.

చంద్రబాబు ఇలా చేస్తుంటే కేంద్రం నిద్రపోతోందా

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాని కి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ సింగపూర్ తో ఒప్పందం చేసుకుంటున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత గౌతరం రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి సంబందించిన విషయంలో ఎపి ప్రభుత్వం ఇంత అవకతవకలు చేస్తుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కేంద్రం నిద్రపోతోందా అని ఆయన అన్నారు. చంద్రబాబు అడుగులకు కేంద్రం కూడా మడుగులు ఒత్తుతుందా అని ఆయన అన్నారు. స్విస్ చాలెంజ్ పద్దతి ప్రకారం ముందుగా పార్టీతో మాట్లాడరాదని, కాని చంద్రబాబు సింగపూర్ పలుమార్లు సందర్శించారని అన్నారు. సింగపూర్ లో చంద్రబాబు సంపాదించిన సొమ్మును అక్రమంగా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని గౌతం రెడ్డి ఆరోపించారు.పారదర్శకత లేకుండా ప్రజా దనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు.లోకేష్ కు ,మీకు ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి సింగపూర్ పేరుతో చంద్రబాబు రాజదానిలో స్విస్ చాలెంజ్ పద్దతి అంటున్నారని గౌతం రెడ్డి ఆరోపించారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20160726_9.php?p=1469508335397

బాధితులకు న్యాయం జరిగేలా రక్షణ శాఖపైనా ఒత్తిడి తీసుకువస్తాం


ఆ బాధ.. తెలుసు
ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన
 
- జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి
పార్లమెంటులో మా ఎంపీలు ఈ విషయంపై మాట్లాడుతున్నారు
బాధితులకు న్యాయం జరిగేలా రక్షణ శాఖపైనా ఒత్తిడి తీసుకువస్తాం
 
 సాక్షి, విశాఖపట్నం : ‘‘ఆరోజు సెప్టెంబర్ 2వ తేదీన నా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ అదృశ్యమైన రోజు నేను ఎంతటి నరకయాతన అనుభవించానో ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో గల్లంతైనవారి కుటుంబాలు అంతే వేదన అనుభవిస్తున్నాయి’’అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ నెల 22న చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరి అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంతోపాటు ఆచూకీ లేకుండాపోయిన ఎనిమిదిమంది విశాఖ ఎన్‌ఏడీఉద్యోగుల కుటుంబాలను వై.ఎస్.జగన్ సోమవారం కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో విమాన ప్రయాణాల భద్రతపై ప్రశ్నించాల్సి వస్తోందని, ఇప్పటికే మూడుసార్లు మరమ్మతులకు గురైన విమానాన్ని మనుషుల తరలింపునకు ఎలా వినియోగించారని ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గట్టిగా నిలదీస్తున్నారన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 ఆ రోజు నాన్న వస్తాడనుకున్నాం
 ‘‘భారతదేశం విమానాలను నడుపుతున్న తీరును ప్రశ్నించాల్సి వస్తోంది. ఈ కుటుంబాలు పడుతున్న బాధలు అందరికన్నా బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఆ రోజు కూడా నాన్న ప్రయాణించిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15, 20 నిమిషాలకే ఆచూకీ తెలియని పరిస్థితి. రెండు రోజుల పాటు నాన్న వస్తాడు, ఎక్కడో దిగే ఉంటాడు.. ఎక్కడో ఎవరికో కనిపించాడు..నడుస్తున్నాడు, వస్తున్నాడు అంటూ రకరకాల ఊహాగానాల మధ్య.. బతికున్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితుల్లో కాలం గడిపాం. ఈ కుటుంబాలు కూడా ఇంచుమించు అదే పరిస్థితుల్లో బతుకుతున్నాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం ఏమైంది,  ఎక్కడ ఉన్నారో తెలిసే పరిస్థితులు లేవు.

 విమానాలు నడుపుతున్న తీరు బాధాకరం
 విమానాలను నడుపుతున్న తీరు ఇంకా బాధాకరం. తాము పడుతున్న బాధను ఆ కుటుంబాలవారు చెబుతుంటే అర్ధమవుతోంది. ‘అన్నా దాదాపు ప్రతి సంవత్సం ఇదే జరుగుతోందన్నా.. మూడేళ్లు తప్ప ప్రతి సంవత్సరం ఓ విమానం కూలిపోతూనే ఉందన్నా, మనుషులు చనిపోతూనే ఉన్నారన్నా’ అని వారు చెబుతున్నారు. నిజంగా మానవ జీవితం వెలకట్టలేనిది. కానీ విమానం నడుపుతున్నప్పుడు విమానం బాగా పనిచేయలేదు, మూడుసార్లు ఆ విమానాన్ని రిపేరు చేశామని తెలిసినా అదే విమానాన్ని మనుషులను తిప్పడానికి ఉపయోగించడం చూస్తే ఇంకా బాధనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. జరిగిన ఈ ఘటనకు పూర్తి భాధ్యత తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చాలా చాలా గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు.

పార్లమెంటులోనిలదీస్తున్నాం                                                                                                                                                                                                                                                  పార్లమెంటులో ఇవాళ(సోమవారం) మా ఎంపీలందరూ కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఇక్కడికి వచ్చే ముందు ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల తో ఇదే విషయం మాట్లాడాను. పార్లమెంటులో గట్టిగా అడగండని, డిఫెన్స్ మినిస్టర్ వద్దకు వెళ్లమని చెప్పాను. ఆయనపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం గురించి వారికి గట్టిగా చెప్పాను. నిజంగా ఒత్తిడి తీసుకురావాలి. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే అప్పుటికప్పుడు పట్టించుకోవడం, ఆ తర్వాత మళ్లీ మర్చిపోవడం, మళ్లీ అవే సంఘటనలు పునరావృతం కావడం జరుగుతోంది. మన దేశంలో విమానాలైనా అంతే.. ట్రైన్‌లైనా అంతే.. అప్పటికప్పుడు రియాక్ట్ అవుతారు. తర్వాత కథ మామూలే. ఏటా జరుగుతూనే ఉంటున్నాయి.

ఈ వ్యవస్థను నిజంగా బాగుచేయాలంటే మనలో కూడా చైతన్యం రావాలి. మనం కూడా ప్రశ్నించడం మెదలుపెట్టాలి. మళ్లీ మళ్లీ గుర్తు చేసి అడుగుతుండాలి. దీనిలో మా వంతు పాత్ర ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఎంపీల ద్వారా ఏం చేయాలో అదంతా చేయిస్తాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో బాధనేది ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిని కాబట్టి.. దీనికి మీడియా సహాయం కూడా కావాలని కోరుతున్నాం. ఇలాంటివి మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే మీరంతా మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ తప్పులు సరిదిద్దితేనే వ్యవస్థ మారుతుంది.’’అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

 ప్రాణానికి విలువలేని పరిస్థితులున్నాయి
 ‘రక్షణ రంగంలోనే కాలం చెల్లిన విమానాలు కొని నడుపున్నారంటే, వాటిలోనే మనుషులను ఎక్కించుకుని తిప్పుతున్నారంటే మానవ జీవితాలకు విలువ లేదన్న పరిస్థితికి ఇది స్పష్టంగా అద్దం పడుతోంది.  ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థలు నడుస్తున్నాయంటే నిజంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది’అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ అన్నారు. విశాఖకు వచ్చిన సీఎం బాధితులందరి ఇళ్లకు వెళ్లకుండా ఇద్దరి, ఇళ్లకు వెళ్లి మరొకరిని ఎయిర్‌పోర్టుకు రప్పించుకుని పరామర్శించడాన్ని ఏ విధంగా తీసుకోవాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ ‘ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టులో పరామర్శించి వెళ్లిపోయారేంటని ఆయనను మీరే అడగండి. ఆయనకే తగలాలి. అప్పుడైనా ఆయనలో మార్పు వస్తుందని ఆశిద్దాం’ అని అన్నారు. భూపేంద్ర సింగ్ మినహా మిగతా ఏడుగురిలో ఎవరికీ విమానం ఎక్కే అర్హత లేకపోయినా తీసుకువెళ్లారని, ఎవరికీ ఇన్సూరెన్స్ కూడా లేదని, ఇలాంటి వాళ్లకి ఇన్సూరెన్స్ అర్హత వచ్చేలా ఏమైనా చేయిస్తారా అనే మరో ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ప్రతి ఏటా ఉద్యోగులు వెళుతున్నందున వాళ్ల భద్రత కోసం గట్టి చర్యలు తీసుకోవాలని తప్పకుండా ప్రభుత్వాన్ని కోరతామన్నారు.
 
 ధైర్యం కోల్పోవద్దు.. అండగా మేమున్నాం
 విమాన ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమాన ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలను  ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం విశాఖలో వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వారి కన్నీళ్లను తుడిచి ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మరింత గట్టిగా గాలించేలా కేంద్రం, రక్షణ శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నామని బాధితులకు భరోసా ఇచ్చారు.   అయితే ఇంత కష్టం వస్తే, అయిన వారు ఏమయ్యారోననే ఆందోళనలో మీరుంటే కనీసం సమాచారం కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అదృశ్యమైన వారంతా క్షేమంగా తిరిగిరావాలని దేవుడ్ని ప్రార్థ్ధిద్దామని, ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునేలా  ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని అన్నారు. ప్రమాదం జరిగింది సముద్రంలో గనుక విమానంలో లైఫ్‌గార్డ్స్ ఉంటాయి గనుక అందరూ క్షేమంగా ఉంటారని ఆ కుటుంబాలకు జగన్ ధైర్యం చెప్పారు.జగన్ వెంట పార్టీ ముఖ్యనేతలు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న జగన్ సాయంత్రం 7 గంటలకు పర్యటన ముగించుకుని తిరిగి విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

క్షేమంగా ఉంటారని ఆశిద్దాం: మేకపాటి


క్షేమంగా ఉంటారని ఆశిద్దాం: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : గత శుక్రవారం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు 29 మందితో వెళుతూ జాడ కానరాకుండా పోయిన వాయుసేన విమానం ఏఎన్-32 ఇంకా సురక్షితంగానే ఉంటుందని, అందులోని సిబ్బంది క్షేమంగానే ఉంటారని ఆకాంక్షిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. విమానం గల్లంతుపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పార్టీ ఎంపీల బృందం సోమవారం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌తో సమావేశమైంది. అనంతరం సమావేశ వివరాలను ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బుట్టారేణుక, వైఎస్ అవినాష్‌రెడ్డితో కలసి మేకపాటి మీడియాకు వెల్లడించారు.   

 వాయిదా తీర్మానానికి నోటీసులిచ్చాం:  వైవీ సుబ్బారెడ్డి
 విమానం గల్లంతుపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ తరఫున వాయిదా తీర్మానం ఇచ్చినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఇతర పార్టీలూ నోటీసులు ఇవ్వడంతో ఈ విషయమై మాట్లాడడానికి స్పీకర్ ఒక్కరికే అవకాశం కల్పించారని.. దీంతో కాంగ్రెస్ పక్షనేత ఖర్గే ప్రసంగించారని ఆయన వివరించారు. ఖర్గే మాట్లాడుతున్న సందర్భంలో తమ పార్టీ ఎంపీలు కూడా లేచి నిలబడి భాగస్వాములైనట్లు తెలిపారు.

మల్లన్నసాగర్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి


మల్లన్నసాగర్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  మల్లన్నసాగర్ ప్రాజెక్టు రీ డిజైన్‌పై సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్షంతో చర్చిం చకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రాత్రికిరాత్రి డిజైన్లు మార్చ డం, జీవోలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిం చారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీని, రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ సహా ఇతర పార్టీల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

లాఠీలు, తూటాలతో పొలాల్లోకి నీళ్లు రావన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు. రైతులు కోరుకున్న విధంగా భూసేకరణ చట్టం-2013 లేదా జీవో 123 ప్రకారం పరిహారమిస్తామన్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రాజెక్టులకు మా పార్టీ పూర్తి మద్దతునిస్తుంది. అయితే నిర్వాసితులకు అన్ని ప్రయోజనాలు చేకూర్చాలి. రైతుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చి, ఉపాధి కోల్పోయిన వారికి పనులు క ల్పించాలి. ఇళ్లు, ఆర్‌ఓఆర్ ప్యాకేజీని నిర్ణీత కాల వ్యవధితో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలా..?
 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పెట్టి రైతుల భూములను రిజిస్టర్ చేయించడాన్ని శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. రైతుకు జీవనాధారమైన పొలాన్ని లాక్కుంటూ పరిహారం అందించకపోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయన్నారు. నాడు వైఎస్ తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తున్నాయని గుర్తుచేశారు. రైతన్నల కడుపు కొట్టిన ప్రభుత్వాలు ఏవీ మనలేవని, వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు సర్కారు బషీర్‌బాగ్‌లో కాల్పులకు పాల్పడితే ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ఆరునెలల ఆలస్యంగా ప్రాజెక్టును ప్రారంభించినా ఏమీ కాదని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లోనే 600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడ్డారని, అయితే వారిలో కనీసం 60 మందికి కూడా పరిహారం అందించలేదన్నారు.

భూపేంద్రసింగ్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Monday, July 25, 2016 | 7/25/2016


విశాఖ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం భూపేంద్రసింగ్ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. విశాఖ మర్రిపాలెంలోని 104 ఏరియాలోని ఆయన నివాసానికి విచ్చేసిన వైఎస్ జగన్ ...ఘటనపై కుటుంబసభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూపేంద్రసింగ్ కుమారుడితో వైఎస్ జగన్ మాట్లాడి, ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అధైర్యపడవద్దని సూచించారు.
కాగా అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో భూపేంద్రసింగ్ ఎగ్జామినర్ కూడా ఉన్నారు. ఆయనకు భార్య సంగీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్. భూపేంద్ర సింగ్ ఆర్మీలో కూడా పనిచేశారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయినా తమవారి జాడ తెలీకపోవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు.

కాగా  ఎన్‌ఏడీ నుంచి ఈ నెల 20వ తేదీన ఎనిమిది మంది ఉద్యోగులు బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్‌ఎస్) బట్టిమాల్వ్‌లో సీఆర్‌ఎన్-91 అనే ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్‌కు ఐఏఎఫ్ విమానం ఏఎన్ 32 ఈ నెల 22వ తేదీ ఉదయం 8.30కి బయలుదేరింది. 8.46 గంట లకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
అనంతరం విమానం అదృశ్యమైనట్లు వైమానిక దళ అధికారులు ప్రకటించారు. విమానంలో 29 మంది ఉండగా వారిలో విశాఖపట్నంలోని నేవల్ ఆర్మమెంట్ డిపో (ఎన్‌ఏడీ)కి చెందిన ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

రేపు విశాఖ పర్యటనకు వైఎస్ జగన్

Written By news on Sunday, July 24, 2016 | 7/24/2016


విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు. అదృశ్యమైన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.

ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్‌ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్ మన్ ఉన్నారు

15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి


ఎఫ్‌ఆర్‌బీఎంను 5 శాతానికి నిర్ధారించాలి
ఐదేళ్లు దాటినా రెవెన్యూ లోటే ఉంటుంది
ప్రైవేటు బిల్లులో ప్రతిపాదించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను 15 ఏళ్ల పాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదించారు. శుక్రవారం నాటి లోక్ సభ ప్రైవేటు మెంబరు బిజినెస్ ఎజెండాలో ఈ బిల్లుకు చోటు దక్కింది. వచ్చే శుక్రవారం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పదో భాగానికి అదనంగా పది-ఏ భాగంలో ఈ అంశాన్ని చేర్చాలని ప్రైవేటు బిల్లులో ప్రతిపాదించారు. ఈ భాగం కింద సెక్షన్ 94ఏ, 94 బీ, 94 సీ సెక్షన్లను అదనంగా చేర్చాలని కోరారు. ప్రైవేటు బిల్లు లక్ష్యాలు, కారణాలు అన్న శీర్షికతో బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నారన్న అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై చర్చ జరిగిన సందర్భంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో పలు హామీలు ఇచ్చారు.

ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రస్తుత మంత్రి వెంకయ్యనాయుడు ఆనాడు బిల్లు వచ్చిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నారు.  హోదాను ఐదేళ్లపాటు వర్తింపజేయాలని కోరారు.  అధికారంలోకి వచ్చిన తరువాత 10 ఏళ్లపాటు వర్తింపజేస్తామని చెప్పారు. రెండేళ్లు గడిచినా ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ఇప్పటికే పలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను అమలుచేస్తోంది.ఆ రాష్ట్రాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే వచ్చే ఐదేళ్ల తరువాత కూడా రెవెన్యూ లోటును ఎదుర్కొంటుందని 14వ ఆర్థిక సంఘం తెలిపింది. అందువల్ల ఇతర రాష్ట్రాలతో సమాన బలం చేకూరాలంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయడం తప్పనిసరి..’ అని వైవీ సుబ్బారెడ్డి బిల్లులో పేర్కొన్నారు.
 
 ఏ సెక్షన్ కింద ఏం కోరారంటే...
 సెక్షన్-94 ఏ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు మార్చి 2, 2014 నుంచి 15 ఏళ్ల పాటు ప్రత్యేక కేటగిరీ హోదా వర్తిస్తుంది. ఒకవేళ అవసరమైన పక్షంలో 15 ఏళ్ల తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించేందుకు తగిన ఉత్తర్వుల ద్వారా చర్యలు తీసుకుంటుంది. సెక్షన్-94 బీ: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కింద సాధారణ కేంద్ర సాయం, అదనపు కేంద్ర సాయం, ప్రత్యేక కేంద్ర సాయం అందించాలి. గాడ్జిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఈ సాయం ఉండాలి. స్పెషల్ స్టేటస్ ద్వారా పన్ను ఆదాయం, ఇతర నిధుల పంపిణీ ఇలా ఉండాలి. 1) మార్చి 2, 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే పరిశ్రమలకు ఆర్థిక శాఖ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలో రాయితీ ఇవ్వాలి. 2) ఇన్‌కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ రేట్లలో రాయితీలు ఇవ్వా లి. 3) మార్చి 2, 2014 తరువాత పరిశ్రమలు తమ కార్యకలాపాలను, యూనిట్లను విస్తరించాలనుకుంటే వర్కింగ్ కేపిటల్‌లో 40 శాతం సబ్సిడీ ఇవ్వాలి..’ అని పొందుపరిచారు.  సెక్షన్-94 సీ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని జీడీపీలో ఐదు శాతానికి నిర్ధారించాలి.

Popular Posts

Topics :