02 October 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

బాబులిద్దరూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు

Written By news on Saturday, October 8, 2016 | 10/08/2016


బాబులిద్దరూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు
అవినీతి పరమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్:రాష్ట్రాన్ని దోచుకోవడమే పరమధ్యేయంగా చినబాబు,పెదబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇంకా ఎంతమంది రైతులు నష్టపోతే సీఎం చంద్రబాబు ధనదాహం తీరుతుందోనన్నారు. అవినీతే పరమధ్యేయంగా కార్యక్రమాలు చేసుకుంటూపోతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశీ కంపెనీలకోసం రాష్ట్రప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం సరికాదన్నారు. అధికారముందని ఇష్టానుసారంగా చట్టాలు చేస్తే చాలదని, రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నది మరచిపోరాదన్నారు. చట్టాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు వద్దన్నా వినకుండా స్విస్‌చాలెంజ్‌పై గుడ్డిగా ముందుకెళ్లడం రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదన్నారు.

 అవినీతి రాజ్యమేలుతోంది..
 టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఒక్క సంక్షేమ పథకమూ అమలు కావట్లేదని బొత్స విమర్శించారు. ఎక్కడచూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. నీతిమంతుడ్ని, అనుభవజ్ఞుడ్ని, అభివృద్ధి అంటే చంద్రబాబు అని సొంతడబ్బా కొట్టుకునే చంద్రబాబు.. చేతల్లో మాత్రం స్వార్థం, అవినీతి, ఆశ్రీతపక్షపాతమని దుయ్యబట్టారు. సాక్షాత్తూ ప్రభుత్వవిప్ ఇసుక దందాకు పాల్పడుతుంటే.. ఆటకాయించిన అధికారుల్ని చంద్రబాబు తప్పుపట్టారన్నారు. రుణమాఫీ చేయకుండా ప్రచారం చేసుకుంటున్న సీఎంను చంద్రబాబునే చూస్తున్నానన్నారు. నాన్న అడుగుజాడల్లో నడుస్తా.. ఆయనకు తలవంపులు తేను అంటే.. నీ తండ్రి ఏమన్నా స్వాతంత్యం తెచ్చిన వ్యక్తా? లేక ఇచ్చినమాట నిలబెట్టుకున్న వ్యక్తా? అని లోకేశ్‌ని బొత్స ప్రశ్నించారు. నీ తండ్రే అవినీతి.. కోర్టులో స్టేలు తెచ్చుకుంటున్న మహాపురుషుడని ఎద్దేవాచేశారు.

 పోలవరాన్ని ఏం చేయబోతున్నారు?
 కాంట్రాక్టులకోసం కక్కుర్తిపడి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని తెచ్చుకున్న సీఎం ఇప్పుడా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు ఏం సమాధానం చెబుతారో చూడాలని బొత్స అన్నారు. కేంద్రం పరిధిలో ఉండుంటే కేంద్రమే అన్నీతానై చూసుకునేదన్నారు. పర్యావరణ అనుమతులు, పునరావాసం, భూసేకరణ, రైతులకు నష్టపరిహారం తదితర అంశాలపై సుప్రీంకోర్టు నుంచి అందిన నోటీసులకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు.
 
 పాపం.. చినరాజప్ప..
 టీడీపీ శిక్షణ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పపట్ల లోకేశ్ వ్యవహరించిన తీరును బొత్స ఆక్షేపించారు. పదవికి కాకున్నా వయసుకైనా గౌరవమివ్వకుండా లోకేశ్ మాట్లాడిన తీరును తప్పుపట్టారు. సోషల్‌మీడియాలో ప్రచారమవుతున్న ఫొటోను చూస్తుంటేనే ఆయనెంతగా వణికిపోతున్నారో కనిపిస్తోందన్నారు. చినరాజప్పను ప్రశ్నించడానికి లోకేశ్ ఏమైనా పార్టీ అధ్యక్షుడా? అని ప్రశ్నించారు. వయస్సులో పెద్దవాడైన ఉపముఖ్యమంత్రినే గౌరవించే సంప్రదాయంలేని పార్టీ తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుతుందన్నారు.

సీపీఐ ప్రజాబ్యాలెట్ లో పాల్గొన్న వైఎస్ జగన్

Written By news on Thursday, October 6, 2016 | 10/06/2016

 ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక  హోదా ఇవ్వాల్సిందేనని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కడప చెన్నూరు బస్టాండ్ లో గురువారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్ లో ఆయన పాల్గొన్నారు. బ్యాలెట్ లో ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ స్పష్టీకరించారు.

నింపిన బ్యాలెట్ పత్రాన్ని బ్యాలెట్ బాక్సులో వేశారు. ప్రత్యేక హోదాతో పాటు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అమరావతిని ఫ్రీ జోన్ గా చేయాలన్న సీపీఐ డిమాండ్ లను కూడా ఆయన పరిశీలించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఆందోళనలు చేసినా తన మద్దతు ఉంటుందని సీపీఐ నేతలకు ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న వైఎస్ జగన్ ఈ ఉదయం పులివెందుల అమ్మవారిశాలకు చేరుకుని దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పెండ్లిమర్రిలో వేరుశనగ రైతులతో ఆయన మాట్లాడారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.


జగన్‌కు జమ్మలమడుగులో బ్రహ్మరథం


జగన్‌కు జమ్మలమడుగులో బ్రహ్మరథం
కడప గడపలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరులో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలుసుకొని జనం దారి పొడవునా ఎదురేగి స్వాగతం పలికారు. నాలుగురోడ్ల కూడలి చేరుకోగానే ఓపెన్‌ టాప్‌ వాహనంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డిలతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు  వైఎస్‌ జగన్‌ ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిశాలకు సమీపంలోనే ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు.

తరలివచ్చిన జమ్మలమడుగు నేతలు..
వైఎస్‌ కుటుంబానికి ద్రోహం తలపెట్టి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అండగా తామున్నామంటూ నియోజకవర్గవ్యాప్తంగా నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా వైఎస్సార్‌సీపీ అభిమానులు , నాయకులు వచ్చారు. మీకు అండగా మేమున్నామంటూనే, వైఎస్సార్‌ మా గుండెల్లో ఉన్నారు, అవకాశవాదులకు బుద్ధి చెబుతామంటూ పలువురు నినాదాలు చేశారు.

ఏసీసీ బాధితులకు భరోసా..
ఏసీసీ బాధిత రైతుల న్యాయమైన కోర్కెలను సాధించుకోవడానికి వైఎస్సార్‌సీపీ ముందువరుసలో నిలిచి పోరాటం చేస్తుందని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మైలవరం మండలం వద్దిరాల, గొల్లపల్లె, ఉప్పలపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు రామాంజనేయులుయాదవ్‌ నేతృత్వంలో ముద్దనూరు వద్ద కలిశారు. 1996లో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ఏసీసీ యాజమాన్యం తమ ప్రాంతంలో 2700 ఎకరాల పంటపొలాలను కొనుగోలు చేసిందని వివరించారు. ఇప్పటివరకూ కనీసం పునాదిరాయి కూడా వేయలేదని వారు చెప్పారు.

అప్పట్లో తక్కువ ధరకు భూములు కోల్పోయిన రైతులకు అదనపు పరిహారం చెల్లించాలని తాము డిమాండ్‌ చేస్తుంటే అధికారులు తమపై  కేసులు పెట్టి గొంతునొక్కుతున్నారని వారు వాపోయారు. రైతుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పాలకుల బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదన్నారు. అప్పట్లో భారతి సిమెంటు ఎకరాకు రూ.2లక్షలు అదనపు పరిహారం చెల్లించిందని, ఇప్పటి ధరల ప్రకారం ఏసీసీ యాజమాన్యం ఎకరాకు రూ.4లక్షలు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ఈనెల 20వ తేదీన గొల్లపల్లె వద్ద రైతులు చేపట్టనున్న ధర్నాకు వైఎస్సార్‌సీపీ తరుపున కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఇన్‌ఛార్జి సుధీర్‌రెడ్డిలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు ఉత్సవాలకు హాజరు
 మైసూరు తర్వాత ఆ స్థాయిలో దసరా ఉత్సవాలు నిర్వహించే ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి, సమీపంలో ఉన్న చెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు  వైఎస్‌ జగన్‌ హాజరవుతున్న విషయం తెలుసుకొని పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  ఈ సందర్భంగా విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిలను ఉత్సవ కమిటీ సన్మానించింది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం పులివెందుల మండలం వెంకటాపురంలో ఇటీవల వృతి చెందిన తిమ్మనాయుడు కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. అలాగే వేముల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సత్యప్రభావతమ్మ కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లి ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

అనంతలో నేడు వైఎస్ జగన్ మహాధర్నా

Written By news on Tuesday, October 4, 2016 | 10/04/2016


అనంతలో నేడు వైఎస్ జగన్ మహాధర్నా
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.

ధర్నాకోసం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అనంత వెంకట్రామిరెడ్డి, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వర్షాభావంతో ‘అనంత’తో పాటు రాయలసీమలో వేరుశనగ పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ‘అనంత’ కేంద్రంగా మహాధర్నా చేపట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకత్వం నిర్ణయించింది.

కేసు నుంచి రక్షించినందుకే సన్మానాలు

Written By news on Sunday, October 2, 2016 | 10/02/2016

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుళ్లిద్దరూ తోడు దొంగలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాబు పాలనతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటుకు కోట్లు కేసు నుంచి చంద్రబాబును రక్షించినందుకే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు రాష్ట్రంలో సన్మానాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, వెంకయ్యలిద్దరూ గోబెల్స్ ను మించిన ఘనులని ఆయన ఎద్దేవా చేశారు. అర్థరాత్రి సమయంలో లెఫ్ట్, ప్రజాసంఘాల నేతలను అరెస్ట్ చేయడం దారుణమని భూమన చెప్పారు. 

Popular Posts

Topics :