05 July 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్ సీపీలోకి పలువురు టీఆర్ఎస్ నేతల చేరిక

Written By news on Saturday, July 11, 2015 | 7/11/2015

నిజామాబాద్: తెలంగాణలో వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజాహిత ఆందోళనలకు ఆకర్షితులై ఎంతోమంది పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని వైఎస్సార్ సీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, యూత్ కాంగ్రెస్, నాయీ బ్రాహ్మణ సంఘాలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు.

చేరికల సందర్భంగా సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ ఆశయాల సాధనకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారన్నారు. వారి అడుగుజాడల్లో నడిచేందుకే పలువురు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా కమిటీలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఆ ఒప్పందాలను బయట పెట్టండి

హైదరాబాద్: విదేశీ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల గుట్టును బయట పెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటనలకు పారదర్శకత లేకుండా పోతోందన్నారు. జపాన్ ప్రధాని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే ఆ వెనుక ఉన్న ఒప్పందమేమిటో బహిర్గతం చేయాలన్నారు. విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు ఎంతో స్పష్టం చేయాలన్నారు.

చైనా, జపాన్, సింగపూర్‌లతో చేసుకున్న ఒప్పందాలనూ బహిర్గతం చేయాలన్నారు. విజయవాడ భవానీదీపాన్ని చైనాకు, అమరావతిని జపాన్‌కు, హీరో హోండా కంపెనీకి 600 ఎకరాలు కట్టబెట్టిన చంద్రబాబు ఆ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలతో పాటు గతంలో ఏ ప్రభుత్వం, ఏ కంపెనీకి ఇవ్వని విధంగా ఏషియన్ పెయింటింగ్స్‌కు కల్పించిన రాయితీల వెనకున్న నిగూఢత్వాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
 
సెటిల్‌మెంటు ఆపండి...: ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడి ఘటనలో సెటిల్‌మెంట్ జోలికి పోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో వనజాక్షిపై భౌతిక దాడులకు పాల్పడినా చంద్రబాబు నేతృత్వంలో రాజీ ప్రయత్నం చేస్తుండటం సిగ్గుచేటన్నారు.  ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా తహశీల్దార్ ఇంటికి ఇద్దరు మంత్రులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏం మాట్లాడారో స్పష్టం చేయాలన్నారు. సోమవారం చర్చలు జరుపుతామని మంత్రులు పేర్కొనడాన్ని ఆక్షేపించారు.

ఎస్పీ నంద్యాలకు వస్తే స్వాగతిస్తా..

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారని కర్నూలు జిల్లా  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. ఒకే చట్టాన్ని ఒకే రాష్ట్రంలో ఒక్కో తీరుగా అమలు చేయడం ఎంతరకూ సమంజసమని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అణగదొక్కడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారన్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారన్నారు. అదే తన విషయానికొచ్చే సరికి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎలా అరెస్టు చేయించారని అన్నారు. ఏసీబీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఏపీలో వైద్య చికిత్సలు చేయించుకోవడానికి అనుమతిచ్చిన చంద్రబాబు.. తనకు మాత్రం హైదరాబాద్‌లో చికిత్సలు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు.
 
ఎస్పీ నంద్యాలకు వస్తే స్వాగతిస్తా..
జిల్లా ఎస్పీ నంద్యాలకు అధికారిగా వచ్చి ప్రజలకు న్యాయం చేస్తానంటే స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాను గాని, తన అనుచరులు గానీ నంద్యాలలో ఎక్కడా అరాచకాలు, అన్యాయాలు చేయడం లేదని.. అందు వల్ల ఎలాంటి అధికారి వచ్చినా భయపడమన్నారు.ఎస్పీకి ప్రస్తుతం సీఎం నుంచి మంచి మార్కులు వచ్చి ఉండొచ్చని, అందువల్ల ఆయన జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినా స్వాగతిస్తానన్నారు.

ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు బేరం?

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/chandrababu-naidu-tapping-technology-bargain-purchase-1-2-482581.html
-వికీలీక్స్‌లో ఏపీ సర్కారు బాగోతం
-ఓర్టస్ కన్సల్టింగ్ కంపెనీతో ఏపీ ఇంటెలిజెన్స్ సంప్రదింపులు
-సింగపూర్ హ్యాకింగ్‌టీమ్‌కు బాధ్యతలు అప్పగించిన ఓర్టస్
-7.5 కోట్లకు ప్రాథమిక అంచనాలు పంపిన హ్యాకింగ్‌టీమ్
-ప్రభాకర్, మగ్లిట్టా మధ్య మెయిల్స్‌ను బయటపెట్టిన వికీలీక్స్
-మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-ట్యాపింగ్ తీవ్రమైన నేరమని కోడైకూసిన సీమాంధ్ర మీడియా
-వికీలీక్స్ సమాచారానికి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత
-బాబు వ్యవహారంపై భగ్గుమంటున్న తెలంగాణవాదులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాగోతం బయటపడింది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నదంటూ గగ్గోలు పెడుతూనే అదే సమయంలో సెల్‌ఫోన్లు, ఈ మెయిల్ సమాచారాన్ని దొంగచాటుగా ట్యాపింగ్ చేసే టెక్నాలజీని సమకూర్చుకునేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థద్వారా బేరసారాలు నడిపింది. సుమారు 7.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ టెక్నాలజీ కొనుగోలుకు సిద్ధమైంది. ఈ సంగతులు వికీలీక్స్ పరిశోధనలో బయటపడ్డాయి. 

babu


అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాఫ్ట్ట్‌వేర్‌ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఇందులో చంద్రబాబు సర్కారు బాగోతం వెలుగుచూసింది. సెల్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌ల మీద నిఘా పెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తెలంగాణ మీద ప్రయోగించేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుంది. సదరు టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థతో సంప్రదింపులు నడిపారు. 

వీరికోసం ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి ఇలాంటి టెక్నాలజీని విక్రయించే హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో బేరసారాలు జరిపారు. 25నుంచి 50 సెల్‌ఫోన్ల నంబర్లపై ట్యాపింగ్ జరిపేందుకు టెక్నాలజీ కావాలని హాకింగ్‌టీమ్‌కు ఆర్డర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఈ-మెయిళ్లు శుక్రవారం వెలుగు చూశాయి. ప్రాథమికంగా ఏడున్నర కోట్ల రూపాయలు చెల్లించి ఆ టెక్నాలజీని అమ్మేందుకు కన్సల్టెన్సీ జరిపిన సంప్రదింపుల కేబుళ్లను వికీలీక్స్ బయటపెట్టింది. బయటపడ్డ కేబుళ్లలోని సమాచారం ప్రకారం జూన్ 12న ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ సింగపూర్‌లోని హాకింగ్ టీమ్ సింగపూర్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ చీఫ్ డేనియల్ మగ్లిట్టాతో ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. 

line


ఏపీ పోలీసులకు అత్యవసరంగా సెల్యులార్ ఇంటర్‌సెప్షన్ హార్డ్‌వేర్ కావాలని ఆర్డర్ చేశారు. ఏ అవసరాలకోసం దాన్ని వినియోగించదలిచింది వివరాలను ఆయన ఈ మెయిల్‌కు జత చేశారు. టెక్నాలజీకి సంబంధించి అనేక సందేహాలతో కూడిన ప్రశ్నావళిని హాకింగ్ టీమ్‌కు పంపించారు. అంచనాగా ఒక ధర ఎంతో చెబితే తాను తన క్లయింట్ (ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్)కు చెప్పి ఆ మొత్తం సమకూర్చేందుకు యత్నిస్తానని ప్రభాకర్‌రెడ్డి ఆ మెయిల్‌లో స్పష్టం చేశారు. హాకింగ్ టీమ్‌కు సంబంధించిన ఇతర టెక్నాలజీ కొనుగోలుకు సైతం యత్నిస్తానని హామీ ఇచ్చారు. 

సుమారు 20నుంచి 50 మ్బైల్ లైసెన్స్‌లు అర్జంటుగా కావాలని అందులో కోరారు. దీనిపై స్పందించిన హాకింగ్‌టీమ్ ప్రతినిధి మగ్లిట్టా, ప్రభాకర్‌రెడ్డి పంపిన ప్రతిపాదనను పరిశీలించినట్టు ధృవీకరిస్తూ ఆయన కోరిన సాప్ట్‌వేర్ కావాలంటే ఉజ్జాయింపుగా సుమారు 7.5 కోట్ల రూపాయలు అవుతుందని, అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు. ఒకసారి క్లయింట్ (ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్)ను కలిస్తే ఇంకా ఇతర విషయాలు మాట్లాడవచ్చని ప్రతిపాదించారు. జూన్ 16, 17 తేదీల్లో కూడా స్కైప్‌లో ఇద్దరూ సంభాషించుకున్నారు. 

ఇదీ హాకింగ్‌టీమ్ కంపెనీ కథ..


ఇటలీలోని మిలాన్ కేంద్రంగా గిజ్మోడో హాకింగ్‌టీమ్ సంస్థ పనిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు, ఇంటెలిజన్స్ సంస్థలకు ఫోన్లను ట్యాప్ చేసే సాప్ట్‌వేర్‌ను చట్టబద్ధమైన పద్ధతుల్లో అమ్ముతున్నామని బాహాటంగా చెప్తున్నా ఈ సంస్థ బ్లాక్‌బెర్రీ, అ్రండాయిడ్, ఆపిల్ పోన్లలో నిఘాపెట్టే సాప్ట్‌వేర్‌ను లోడ్‌చేసే పరికరాలు అమ్ముతారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే రష్యా, సౌదీ అరేబియా తదితర దేశాలకు ఇలాంటి సాప్ట్‌వేర్ అమ్మింది. ఆసియాలో ఈ సంస్థకు సింగపూర్‌లో రిప్రజెంటేటివ్ కార్యాలయం ఉంది. దానికి చీఫ్‌గా మగ్లిట్టా పనిచేస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ ప్రతినిధులు పర్యటనలు కూడా జరిపారు. 

ఎక్కడిదీ ఓర్టస్..?


ఇది ఐటీ కన్సల్టెన్సీ సంస్థ. దీని రిజిస్టర్ ఆఫీస్ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 7 లోని బీ6 ఇంటినెంబర్‌తో ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయిన ఈ సంస్థ డైరెక్టర్లుగా కాసు ప్రభాకర్‌రెడ్డి, జోత్స్నరెడ్డి, కుంజిబెట్టు విష్ణుదాస్ ప్రభు ఉన్నారు. ఇటలీకి చెందిన ఒక సంస్థ ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ఈమెయిళ్లపై నిఘా పెట్టే సాప్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాప్ట్‌వేర్‌ను వివిధ ఏజెన్సీలకు అమ్మింది. ఆ సాప్ట్‌వేర్‌ను హాకింగ్‌టీమ్ అనే సంస్థ అమ్మకందారుగా సింగపూర్ నుంచి పనిచేస్తున్నది. ఓర్టస్ సంస్థ ఆ అమ్మకందారును ఏపీ పోలీసుల కోసం సంప్రదించింది. 

మొగున్ని కొట్టి...


ఓటుకు నోటు కేసు బయటపడగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ గగ్గోలు పెట్టారు. గల్లీనుంచి ఢిల్లీదాకా ఫిర్యాదులు చేశారు. ఏపీ మంత్రులు అదే తారకమంత్రమన్నట్టు నానా యాగీ చేశారు. చంద్రజ్యోతి వంటి పత్రికలు ట్యాపింగ్ ఎంత నేరమో ఎన్ని ప్రభుత్వాలు ఆ కారణంగా కూలిపోయాయో కథలు చెప్పాయి. ఇంతా చేసి ట్యాపింగ్ జరిగిందంటూ ధృవీకరించే ఏ చిన్న ఆధారమూ చూపలేక సెల్‌ఫోన్ ప్రొవైడర్లకు నోటీసులిచ్చి భయానక పరిస్థితిని సృష్టించారు. ఇంతాచేసి బాబు చేసిందేమిటి? సరిగ్గా తెలంగాణ మీద ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే ట్యాపింగ్ టెక్నాలజీ కోసం రూ.7.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డారు. 

ఈ విషయం వికీలీక్స్ బయటపెట్టడంతో తేలుకుట్టిన దొంగలా ఆయన పరిస్థితి మారిపోయింది. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు చంద్రబాబు యత్నించడం మీద తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. తెలంగాణ మీద ప్రయోగించేందుకే ఆయన సదరు టెక్నాలజీ కోసం వెంపర్లాడుతున్నారని వారు ఆరోపించారు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్టు తాను ఓ వైపు ట్యాపింగ్‌కోసం యత్నిస్తూ ఎదుటివారిమీద నిందలు వేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. 

ట్యాపింగ్ అనేది ఘోరమైన నేరమే అయితే చంద్రబాబుకు ఏ శిక్షపడుతుందో సీమాంధ్ర మీడియా ఇపుడు వివరించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసుతో పాటు ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలులో కూడా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వికీలీక్స్ సమాచారానికి తిరుగులేదని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఈ కొనుగోళ్ల బేరసారాల మీద విచారణ జరిపించాలని, సదరు టెక్నాలజీ ఏపీ ప్రభుత్వానికి చేరిందా అనే విషయం తేల్చాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.

బండారం బయటపెట్టిన వికీలీక్స్

హైదరాబాద్ : ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు వీకీలీక్స్ బయటపెట్టిందంటూ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్ కు చెందిన ఒక ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు వీకిలీక్స్ పేర్కొంది.,  ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్ లోని వార్టస్ అనే సంస్థతో ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

వార్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి...హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో జరిపిన మెయిల్స్ సంభాషణలను వికీలీక్స్ బయటపెట్టింది. సుమారు రూ.7.5 కోట్లు చెల్లించి ఈ పరికరాలను కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్....తన కథనంలో పేర్కొంది. ఓటుకు కోట్లు వ్యవహారం బయటపడిన తర్వాతే ఏపీ సర్కార్ ట్యాపింగ్ పరికరాల కోసం సంప్రదింపులు జరిపినట్లు, అత్యవసరంగా మొబైల్, మెయిల్స్ ట్రాక్ చేసే సదుపాయాలు కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది.

కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాప్ట్ వేర్ ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు పది లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఇందులో భాగంగానే చంద్రబాబు సర్కారు భాగోతం వెలుగు చూసింది.

పోలవరం పనుల్లో భారీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు


బాబుగారి భారీ స్కెచ్
- పోలవరం పనుల్లో భారీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు

సాక్షి, హైదరాబాద్:
 పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పక్కా ప్రణాళిక సిద్ధమైంది. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రూ.4,800 కోట్లు నొక్కేసేందుకు ప్రభుత్వ పెద్దలు పథకం వేశారు. పోలవరానికి జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయిస్తే కేంద్రం జోక్యం చేసుకుంటుందనే భయంతో టెండర్లు లేకుండానే పనులు పంచేసి భారీగా ముడుపులు దండుకోవడానికి వ్యూహం తయారైంది.

అందుకోసం అంచనా వ్యయాన్ని ఊహలకు అందనంతగా పెంచేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు ఇక సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించడం మాత్రమే మిగిలింది. రూ. నాలుగువేల కోట్ల విలువైన పోలవరం కాంట్రాక్టును రష్యా కంపెనీ ‘ట్రాన్స్‌ట్రాయ్’ భాగస్వామ్యంతో ఇప్పటి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దక్కించుకున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును నిర్మించే శక్తిసామర్థ్యాలు రాయపాటి కంపెనీకి లేవని, రష్యా కంపెనీ భాగస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితమని తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగినా... అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా కాంట్రాక్టును కట్టబెట్టింది.

ఆ కంపెనీ కాంట్రాక్టు పొంది రెండేళ్లు దాటినా ఇప్పటికీ నామమాత్రపు పనులకే పరిమితమైంది. ప్రభుత్వం నుంచి రూ.400 కోట్లకు పైబడి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ ఆ మేరకు పనులు చేయలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆప్తులైన కంపెనీలకు సబ్‌కాంట్రాక్టు కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. అందుకోసం మళ్లీ టెండర్లు పిలవకుండానే పనికానిచ్చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని సూచించాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి నీటిపారుదల శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందాయి.

రూ.4,800 కోట్లు బొక్కేసేదిలా...
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2011-12 ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ప్రకారం నిర్ణయించి రూ. నాలుగువేల కోట్ల విలువైన పనులను ‘ట్రాన్స్‌ట్రాయ్’కి అప్పగించారు. వివిధ రకాల మెటీరియల్స్, ఇంధనం, వాహనాలు, యంత్రాల ధరలు, కార్మికుల ఖర్చు.. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఏటా కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2015-16 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ఈ పని విలువను గణిస్తే 60-70 శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే అంచనా వ్యయాన్ని మరింత పెంచితే ఆ మేరకు ముడుపులు పెంచుకోవడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ట్రాన్స్‌ట్రాయ్‌కి అప్పగించిన పనుల అంచనా వ్యయాన్ని గరిష్టంగా రూ. 12 వేల కోట్లకు పెంచడానికి నీటిపారుదల శాఖలో కసరత్తు సాగుతోంది. ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య ఉన్న ఒప్పందంలోని 63వ నిబంధన ప్రకారం.. పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అవకాశం ఉంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని, ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చేసి పనుల విలువను భారీగా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే మొత్తం పనులను లాక్కుంటే తాను నష్టపోతానని, తన సంగతి కూడా చూడాలని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ అధినేత, టీడీపీ ఎంపీ రాయపాటి సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు సాగునీటి శాఖలో ప్రచారం జరుగుతోంది. ఈమేరకు రూ. 12 వేల కోట్ల కాంట్రాక్టులో ట్రాన్స్‌ట్రాయ్ రూ. 1000 నుంచి రూ. 1500 కోట్ల మట్టి పనులు విడిచిపెట్టి, మిగతా పనులను సీఎం సూచించే కంపెనీకి ఇవ్వడానికి రంగం సిద్ధమైందని సమాచారం. పని విలువ భారీగా పెంచుతున్న నేపథ్యంలో.. మొత్తం పని విలువలో 40 శాతం వరకు సర్కారు పెద్దలకు ముడుపుల రూపంలో వస్తుందని, అందుకు అనుగుణంగానే పావులు కదులుతున్నాయని అధికారులే చెబుతున్నారు.
 
కేంద్రం జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు
పోలవరానికి జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చూసుకుంటుందని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. అయితే నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేతుల్లోకి వెళితే తాము సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏడాది కాలంగా ఒక్క అంగుళం పని కూడా ముందుకు జరగనివ్వలేదని అన్ని వర్గాలు దుమ్మెత్తిపోసినా ప్రభుత్వంలో చలనం లేని విషయం తెలిసిందే. ఏడాది కాలంగా టీడీపీ ప్రభుత్వ తీరును చూసిన కేంద్రం ఇక లాభం లేదనే ఉద్దేశంతో పోలవరానికి నిధులు ఇవ్వడానికి సానుకూలంగా ఉందనే సమాచారం ఇటీవల వెలువడింది.

ఈ నేపథ్యంలో పోలవరంలో సొమ్ము పిండుకొనే మార్గాల మీద సర్కారు పెద్దలు దృష్టిపెట్టారు. ‘‘ప్రస్తుత కాంట్రాక్టర్‌కు పనిచేసే సత్తా లేదు. పనులు జరిగితే తప్ప నిధులు రావు. ఈ నేపథ్యంలో పనులు చేయగల కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం ద్వారా పురోగతి సాధించడం, ముడుపులు దండుకోవడం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడానికి వ్యూహం తయారు చేశారు. మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయిస్తే, కేంద్రం జోక్యం చేసుకొని పోలవరం పనులను నియంత్రణలోకి తీసుకుంటుందనే భయం ప్రభుత్వానికి ఉంది. అందుకే టెండర్లు లేకుండా పనికానివ్వడానికి, భారీగా ముడుపులు దండుకోవడానికి పక్కా ప్రణాళిక సిద్ధమైంది’’ అని పోలవరం వ్యవహారాలను సుదీర్ఘకాలంగా పర్యవేక్షిస్తున్న సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘సాక్షి’కి వివరించారు.
 
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababus-big-sketch-256188?pfrom=home-top-story

ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి

Written By news on Friday, July 10, 2015 | 7/10/2015


'ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే కర్నూలు జిల్లా ఎస్పీ..  వైఎస్ఆర్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్షలు పెంచుకునే బదులు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని భూమా వ్యాఖ్యానించారు.

ఎన్నికల సంఘం అనుమతి లేకుండా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించిందని, అలాంటపుడు ఈసీ అనుమతి లేకుండా తనను ఎలా అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని భూమా చెప్పారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో భూమాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.

దాడి చేసి రాజీ ప్రయత్నాలు చేస్తారా?

హైదరాబాద్: మహిళా తహశీల్దార్ వనజాక్షి పై దాడి చేసి మూడు రోజులు గడుస్తున్నా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తహశీల్దార్ కు ఫోన్ చేసి రాజీకి రావాలని బెదిరించడం సిగ్గుచేటని పద్మ విమర్శించారు. నిజాయతీగా పనిచేస్తున్న అధికారిణిపై దాడి చేసి రాజీ ప్రయత్నాలు చేస్తారా అని పద్మ నిలదీశారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వివరాలన్నింటినీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏయే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో వాటన్నింటినీ మీడియా ముందు ఉంచాలని అన్నారు. విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని భూములతో వ్యాపారం చేస్తూ విదేశాలకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని పద్మ మండిపడ్డారు.

వైఎస్సార్ స్మృతివనానికి గ్రహణం


వైఎస్సార్ స్మృతివనానికి గ్రహణం
ఆత్మకూరు రూరల్ (కర్నూలు జిల్లా): రాజకీయాలకు మానవీయ పరిమళాలు అద్దిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతటి మహనీయుడు పంచభూతాల్లో కలసిన ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ పరిసరాలు ఆయన అభిమానులకు స్మరణీయాలు. ఈ స్మరణ స్మృతి శాశ్వతంగా నిలిచేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నల్లకాల్వ గ్రామ శివార్లలో వైఎస్‌ఆర్ పేరిట స్మృతి వనం ఏర్పాటు చేసింది. 550 రకాల పుష్ప,ఫల వృక్షజాతుల సమీకరణతో స్మృతివనం జీవవైవిధ్యానికి మచ్చుతునకలా బాసిల్లుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరెక్కడా లేని అద్భుత సౌందర్య ఉద్యానవనం ఇది. ఈ స్మృతివనం ప్రతిష్ట మసకబారే పలు చర్యలు ఇటీవల చోటుచేసుకుంటుండడం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

ప్రధాన ద్వారం మూసివేత

వైఎస్‌ఆర్ స్మృతివనానికి ప్రధాన హంగు దాని సింహద్వారమే. ఈ ద్వారం వద్దకు రాగానే ఎదురుగా 30 అడుగుల మహానేత నిలువెత్తు విగ్రహం ఆశీర్వచనపు ఆహ్వానం పలుకుతుంటుంది. దీంతో సందర్శకులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇంతటి భావస్ఫోరక దృష్టితో ఏర్పాటు చేసిన సింహ ద్వారం 20 నెలలుగా మూతపడింది. అటవీశాఖ ఉద్యోగులు కేవలం సందర్శకులకు టిక్కెట్లు ఇవ్వడానికి వసతి లేదన్న విషయాన్ని సాకుగా చూపుతూ ఈ మార్గం మూసివేసి దొడ్డిదారిన సందర్శకులకు ప్రవేశం కల్పిస్తున్నారు. వైఎస్‌ఆర్ స్మృతివనం సందర్శన ఒక భావోద్వేగపు యాత్ర. అలాంటి సందర్శనను ఏ అనుభూతులు లేని నిస్సార యాత్రగా మార్చే కుట్రలో భాగంగా దొడ్డిదారి దర్శనాలు చేయిస్తున్నారు. అయితే దొడ్డిదారిలో వైఎస్‌ఆర్ పేరు కనిపించదు. ఇక్కడ ఉన్న ఫలహార శాల పేరే పెద్దగా కనిపించే బోర్డు ఉండడం మహానేత ప్రతిష్ట మసకబార్చడం కాక మరేమిటి?

ప్రచారం శూన్యం .. నిధులు మృగ్యం

26 ఎకరాల విశాల ప్రాంగణంలో సుమారు రూ.12 కోట్లతో నిర్మించిన వైఎస్‌ఆర్ స్మృతివనం పర్యవేక్షణకు ఒక్కటంటే ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం విదల్చకపోవడం చూస్తుంటే ఇది దురుద్దేశ చర్యగా కనిపిస్తోంది. అంతేకాకుండా వైఎస్‌ఆర్ అభిమానులు తప్ప, ఇతర రాష్ట్రాల వారిని గానీ రాజకీయేతర సాధారణ ప్రజలను గానీ ఈ స్మృతివనానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరం. సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో కూడా జాప్యం జరుగుతూనే ఉంది. అలాగే ఇంత పెద్ద ఉద్యానవనంలో అప్పటికప్పుడు అవసరమయ్యే పనులకోసం ఖర్చు పెట్టేందుకు కంటింజెన్సీ నిధులన్నవి లేకపోవడంతో పైపు పగిలినా, మోటారు కాలిపోయినా రోజుల తరబడి వేచి ఉండడమో లేక అక్కడ పని చేసే సిబ్బంది స్వయంగా తమ జేబులోంచి ఖర్చు చేయడమో చేయాలి తప్ప మరో మార్గం ఉండదు.

అభద్రతలో సిబ్బంది

స్మృతివనంలో వివిధరకాల పనుల్లో 30 మంది సిబ్బంది పనులు చేస్తుంటారు. వీరిలో స్వీపర్లు మొదలు తోటమాలులు, సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్ వంటి పలు విభాగాల్లో పనిచేసేవారున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినా, కొత్త నాయకులు తయారైనా.. మా మనుషులు వస్తారు, మీరు తప్పుకోండంటూ వీరిపై ఒత్తిళ్లు వస్తుంటాయి. వీరంతా ఆయా అధికార పీఠాలకు తామూ విధేయులమేనని నిరూపించుకునే వరకు ఈ ఒత్తిడి వారిపై కొనసాగుతూనే ఉంటుంది. దీంతో వీరు తమ ఉద్యోగ భధ్రతపై నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇది వారి పని విధానంపై తప్పక ప్రభావం చూపుతుంది.

Popular Posts

Topics :