09 October 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మెగా ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Saturday, October 15, 2016 | 10/15/2016


మెగా ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన
పశ్చిమగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని శనివారం తెలిపారు. భీమవరం మండలంలోని తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువుల్లో పర్యటించి మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు బాధితులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాల్లో మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

పలుమార్లు ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో గత నెల రోజులుగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. కాగా, బాధిత గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఇప్పటికే పర్యటించింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన బృందం అక్కడి పరిస్ధితులను అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వివరించింది.

రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్

Written By news on Friday, October 14, 2016 | 10/14/2016


రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్
నెల్లూరు: ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. బారాషహీద్‌ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో రోట్టెలు పట్టారు.

ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకుని రోడ్డు మార్గంలో నెల్లూరు వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ జగన్ కు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.  రొట్టెల పండుగలో పాల్గొన్న తర్వాత తిరుపతికి వైఎస్ జగన్ పయనమయ్యారు.

ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ

Written By news on Thursday, October 13, 2016 | 10/13/2016


ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ
► ఆదాయ వెల్లడి పథకంలో పేర్లను బయటపెట్టండి
► చంద్రబాబుకు ఆ వివరాలు ఎలా తెలిశాయి
► కచ్చితంగా లెక్క చెబుతున్నారంటే ఆ వ్యక్తి ఆయన బినామీ అయి ఉండాలి
► వివరాలు బయటకు చెప్పబోమని సీబీడీటీ స్పష్టం చేసింది
► ఆ తర్వాత కూడా చంద్రబాబు మాత్రం వివరాలు చెబుతున్నారు
► ఆదాయన్ని ప్రకటించినవారి పేర్లు బయటపెట్టండి
► లేఖలో ప్రధానమంత్రిని కోరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

హైదరాబాద్

ఆదాయ వెల్లడి పథకం -2016పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధానికి జగన్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి....

''ఏపీలో ఐడీఎస్-2016పై జరిగిన పరిణామాలను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ అంశంపై తలొకరు తలోరకంగా మాట్లాడుతున్నారు. ఆదాయాన్ని వెల్లడిస్తే వారి వివరాలు వెల్లడించబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెబుతోంది. ప్రాంతాలవారీగా గానీ, మరే రూపంలో గానీ వారి పేర్లను బయట పెట్టబోమని స్పష్టం చేస్తోంది. మరోవైపు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఆ వివరాలు బయటకు చెబుతున్నారు. సీబీడీటీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయన రెండు సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి 10 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెల్లడించారని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుకు ఈ సమాచారం ఎలా లభ్యమైంది? ఒకవేళ అది వాస్తవం అయితే.. ఆయన చంద్రబాబు బినామీ అయి ఉండాలి. ఎందుకంటే, చంద్రబాబు అంత కచ్చితంగా ఆ మొత్తం ఎంతో చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేం కూడా దీని గురించి తెలుసుకుంటున్నాం.

ఎన్‌సీఏఈఆర్ సర్వేలో చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతిపరమైన రాష్ట్రంగా మొదటి ర్యాంకు సాధించింది. రెండున్నరేళ్ల కాలంలో రూ. లక్షన్నర కోట్ల కుంభకోణానికి ఎలా పాల్పడ్డారో ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి, దాన్ని కూడా మీకు ఇచ్చాం. విచారణ చేయడానికి తగినంత సమాచారం ఆ పుస్తకంలో ఉంది. మేం ఇచ్చిన విజ్ఞాపనపై ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు. దేశంలో ఏ ఒక్కరూ కూడా తనపై విచారణ జరిపించలేరని చంద్రబాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. నల్లధనంతో ఎమ్మెల్యేలను కొన్నా.. ఓటు కోసం కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయినా.. వేల కోట్లు పోగేసినా నిరభ్యంతరంగా పదవిలో కొనసాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. దయచేసి ఐడీఎస్‌లో ఆదాయాన్ని ప్రకటించిన వారి పేర్లు వెల్లడించాలని కోరుతున్నాం. అలాగే చంద్రబాబు అవినీతిపై విచారణ చేయించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం''

చంద్రబాబుకు ఎందుకింత వైరాగ్యం?


చంద్రబాబుకు ఎందుకింత వైరాగ్యం?
హైదరాబాద్ :
చంద్రబాబు పరిపాలనను పక్కన పెట్టి దోమలపై దండయాత్రలు, ఈగలపై యుద్ధాలు చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికే చంద్రబాబు చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య ఆయన మాటల్లో వైరాగ్యం కూడా కనిపిస్తోందని.. ఓటుకు కోట్ల కేసులో రేవంత్ రెడ్డి వాడినవన్నీ 500 నోట్లే కావడం వల్లే ఇంత వైరాగ్యం వచ్చిందా అని అడిగారు. 500, 1000 నోట్ల రద్దు విషయం సరేగానీ లంచగొండితనం, అవినీతి గురించి కూడా మాట్లాడాలన్నారు. ఇక నల్లధనం అంశంపై ఆయన ప్రధానికి ఉత్తరం రాయాలనుకుంటున్నారు గానీ.. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే లేఖ రాసేశారని చెప్పారు.

నల్లధనం వెల్లడి పథకం గురించిన వివరాలను బయటకు వెల్లడించబోమని సీబీడీటీ స్పష్టంగా చెప్పిందని.. కానీ చంద్రబాబు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 13వేల కోట్లు బయటపడ్డాయని, అందులో ఒక వ్యక్తే 10 వేల కోట్లు బయటపెట్టినట్లు చెప్పారన్నారు. ఒకవైపు సీబీడీటీ మాత్రం ఆ పేర్లు గానీ, ప్రాంతాలు గానీ, రాష్ట్రాలు గానీ బయటపెట్టబోమని చెబుతుంటే మరోవైపు చంద్రబాబుకు ఆ వివరాలు ఎలా తెలిశాయని బుగ్గన ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా ఏవైనా పేర్లు బయటకు చెబితే వాటిని నమ్మొద్దని.. అవి మోసపూరితమని సీబీడీటీ చెప్పిందని, కేంద్రం ఇంత కచ్చితంగా చెబుతుంటే చంద్రబాబు అంత స్పష్టంగా ఎలా చెబుతున్నారో చెప్పాలని కోరారు. డిక్లేర్ చేసినవారికి తప్ప మరెవ్వరికీ ఆ వివరాలు తెలిసే అవకాశం లేదని కేంద్రం చెబుతోందని, ముఖ్యమంత్రికి ఆ వివరాలు ఎలా తెలిశాయని అడిగారు.

దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని ఎన్‌సీఎఈఇర్ సర్వేలో తేలిన విషయం గుర్తుందా లేదా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే ఏపీలో 1.50 లక్షల కోట్ల అవినీతికి సంబంధించిన ఒక పుస్తకం కూడా వచ్చిందని.. ఇసుక నుంచి పట్టిసీమ, రాజధాని, భూముల సేకరణ వరకు అన్ని అంశాలూ ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పిన పదివేల కోట్లు వెల్లడించిన వ్యక్తి ఎవరో బయటపెట్టాలని ప్రధానమంత్రిని కోరుతున్నామన్నారు. ఈయన చెప్పే విషయాలు చూస్తే.. భాస్కరాచార్యులు వచ్చి సున్నాకు విలువ లేదని, శుశ్రుతుడు వైద్యానికి విలువ లేదని చెప్పినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

అమరావతి శంకుస్థాపనకు వందల కోట్లు ఖర్చుపెట్టారని, పట్టిసీమ అని పంపులు బిగించి.. దానికి 1600 కోట్లు అన్నారని, గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో 3000 కోట్లు ఖర్చుపెట్టామంటున్నారని, పారిశ్రామిక సబ్సిడీలకు 2200 కోట్లు ఇచ్చామంటున్నారని.. ఆ డబ్బంతా ఏమైందని బుగ్గన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తానే హైదరాబాద్ కట్టానంటున్నారు.. అలాగైతే 400 ఏళ్ల క్రితం కట్టిన కులీ కుతుబ్ షా ఏమైపోవాలని అడిగారు. ఐటీని తీసుకొచ్చింది తానేనంటారని.. కానీ ఈయనకు ఐటీ అంటే ఏంటో తెలిసేసరికే విదేశాల్లో అది ఎప్పుడో ఉందని గుర్తుచేశారు. సత్య నాదెళ్లకు, పీవీ సింధుకు తానే స్ఫూర్తి అంటారని, ప్రజలు ఇదంతా చూస్తుంటే చివరకు ఆయన క్రెడిబులిటీ దెబ్బతినడంతో పాటు శాశ్వత నష్టం జరుగుతుందని తెలిపారు.

అలాగే ఈమధ్య మరోసారి మాట్లాడుతూ.. ఎక్కడ పుట్టాలో ఎంపిక చేసుకోలేరు గానీ, ఒకవేళ అవకాశం అంటూ ఉంటే తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుట్టాలనుకునేవారం అని అన్నారని గుర్తుచేశారు. ఏదేశమేగినా.. అన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఎక్కడకు వెళ్లినా తెలుగు గడ్డమీదే పుట్టాలని అంతా కోరుకుంటారని, మన తల్లి కడుపునే జన్మజన్మలకు పుట్టాలని అంతా కోరుకుంటారని, ఈయన మాత్రం ఇలా అంటున్నారని, చివరకు పుట్టుకను కూడా అవమానిస్తున్నారని.. ఇది దేనికి దారితీస్తుందో గమనించుకోవాలని చెప్పారు. ఆయన మాట్లాడే మాటల్లో ఒకదానికి, మరోదానికి పొంతన ఉండటంలేదన్నారు. జీడీపీ, జీఎస్‌డీపీ, ఎఫ్‌ఆర్‌బీఎం లాంటి పదాలతో సామాన్యులకు అర్థం కాకుండా మాట్లాడతారని విమర్శించారు. వాటి గురించి మాట్లాడుతూ మధ్యలో పుష్కరాల గురించి చెబుతారని, ప్రతిరోజూ తానే అక్కడ ఇన్‌స్పెక్షన్ చేశానంటారని అన్నారు. మామూలుగా అయితే అది ఒక ఏఈ లేదా డీఈ చేయాల్సిన పని అని, దానికి తాను వెళ్లానని చెబుతూ గొప్పలు చెప్పుకొంటారని విమర్శించారు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి 7.5 శాతం పెరిగితే, రాష్ట్రంలో జీఎస్‌డీపీ 10.99 శాతం పెరిగిందని ఈయన అంటున్నారని, కానీ  అదే కాలానికి కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రాబడి 30 శాతం పెరిగితే మనకు మాత్రం కేవలం 13 శాతమే పెరిగిందని.. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అలాగే తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో 2016-17 సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 12.26 శాతం పెరుగుతోందని, జాతీయంగా మాత్రం 7.31 మాత్రమే పెరుగుతోందని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ వివరాలన్నింటినీ తాము ముఖ్యమంత్రి కోర్ డాష్‌బోర్డు నుంచే తీసుకున్నామన్నారు. ఈయన లెక్కలు చూస్తే రాష్ట్రం ముందుకు పోతోందని అంతా అనుకుంటారని.. కానీ వాస్తవంలో మాత్రం అలా జరగడం లేదని వివరించారు. ముఖ్యమంత్రి ఈమధ్య ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసినట్లు తరచు చెబుతున్నారని.. అది ఎప్పుడొచ్చిందో తమకు అనుమానంగానే ఉందని అన్నారు. ఆయనకు అమెరికాలోని ఒక యూనివర్సిటీ గౌరవ పీహెచ్‌డీ ఇస్తామంది గానీ, అది కూడా మూతపడిపోయిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో పరిపాలన మొత్తం స్తంభించిందని, రైతు గానీ, సామాన్య మానవుడు గానీ, రైతులు గానీ, ఉద్యోగులు గానీ ఎవరైనా సంతోషంగా ఉన్నారా అని బుగ్గన ప్రశ్నించారు. కేవలం మీరు, మీకు సంబంధించిన చుట్టుపక్కల వాళ్లు తప్ప ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దని ముఖ్యమంత్రిని కోరారు.

గ్రావెల్‌ అక్రమార్కులు టీడీపీ నేతలే


గ్రావెల్‌ అక్రమార్కులు టీడీపీ నేతలే
అక్రమ మైనింగ్‌ పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి 
అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్న మైనింగ్‌ ఏడీ 
బహిరంగ విచారణకు రావాలని టీడీపీ నేతలకు కాకాణి సవాల్‌   
 
నెల్లూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్‌ తరలింపులో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని, దొంగే దొంగ..దొంగ అని అరుస్తున్న చందంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ గ్రావెల్‌ తరలింపులో తమ నాయకుల భాగస్వామ్యం ఉందని పత్రికల్లో వచ్చిన కథనాల్లో నిజం లేదని ఆయన ఖండించారు.
 
అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను అనేక మార్లు తాను కోరినట్లు గుర్తు చేశారు. జెడ్పీ సమావేశంలో, శాసనసభ సమావేశాల్లో మాట్లాడినట్లు తెలిపారు. వెంకటాచలం మండలం కనుపూరులో అక్రమంగా గ్రావెల్‌ తరలింపులో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడికి భాగస్వామ్యం ఉందని పత్రికల్లో కథనంలో వాస్తవం లేదన్నారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మైనింగ్‌ ఏడీ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. గ్రావెల్‌ తరలిస్తున్న టిప్పర్లు పట్టుకున్న పోలీసులు క్రిమినల్‌ పెడుతూ, భారీగా జరిమానా విధించడం దారుణమన్నారు. అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తున్న యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టిన యంత్రాలు సీజ్‌ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 
 
ఖనిజ సంపదను కొల్లగొట్టే వారిపై వారిపై చర్యలు తీసుకుని యంత్రాలను సీజ్‌ చేయాలన్నారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు మీడియా సాక్షిగా బహిరంగ విచారణకు రావాలని సవాలు విసిరారు. ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారో ప్రజలే వాస్తవాలు తెలియజేస్తారని చెప్పారు. పత్రికలు, మీడియా వాస్తవాలను వెల్లడించాలని హితవు పలికారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి మైనింగ్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వెంకటాచలం జెట్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, ముత్తుకూరు మండలం వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు

వైఎస్సార్‌ సీపీలోకి మాజీ కార్పొరేటర్లు


వైఎస్సార్‌ సీపీలోకి మాజీ కార్పొరేటర్లు
గుంటూరు : అధర్మమే పాలనగా సాగుతున్న టీడీపీ పునాదులు పెకళించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాయంలో మంగళవారం మాజీ కార్పొరేటర్‌లు తుమ్మేటి శారదా శ్రీనివాస్, ఉడతా కృష్ణ, బత్తుల దేవానంద్‌లు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారితోపాటుగా 33, 38, 43 డివిజన్‌లకు చెందిన మద్దతుదార్లు పార్టీలోకి వచ్చారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ  పీడీ యాక్టులు పెట్టడం సిగ్గు చేటన్నారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.  వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శులు, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), లక్కాకుల థామస్‌నాయుడు మాట్లాడుతూ ప్రభు త్వ విధానాలను కార్పొరేషన్‌ ఎన్నికల్లో  ఓటు అనే ఆయుధంతో నోరు మూయించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 

పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్లు మాట్లాడుతూ కార్పొరేషన్‌ ఎన్నికల్లో  పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ సంయుక్త కార్యదర్శి షేక్‌ గులాంరసూల్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూనె ఉమామహేశ్వరరెడ్డి, పలు విభాగాల నేతలు మద్దుల రాజాయాదవ్, మార్కెట్‌బాబు, అగ్గిపెట్టెల రాజు, నూనె పవన్‌తేజ, షఫీ, ఎన్‌ రామారావు, రమేష్, రెడ్డి కోటేశ్వరరావు, నరాలశెట్టి అర్జున్, పఠాన్‌ఖాన్, మోహన్‌రావు, పెద్దబ్బాయి, రవి పాల్గొన్నారు.

Popular Posts

Topics :