23 March 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో

Written By news on Saturday, March 29, 2014 | 3/29/2014

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్ సిపి మ్యానిఫెస్టోవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్‌: రెండు  ప్రాంతాల ప్రజల అభీష్టాన్ని ప్రతిబింభించే విధంగా వైఎస్ఆర్ సిపి మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టోను రూపొందింస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే  తమ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు.

 ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తున్నట్లు మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు కూడా అయిన గట్టు తెలిపారు. తమ మ్యానిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఉంటాయని చెప్పారు.

జట్టు కట్టిన పార్టీల పుట్టి ముంచే ఘనుడు

బాబు... భస్మాసురం
*  జట్టు కట్టిన పార్టీల పుట్టి ముంచే ఘనుడు
*  2004లో బీజేపీకి మర్చిపోలేని భంగపాటు
*  కేంద్రంలో అధికారమే కోల్పోయిన కమలనాథులు
*  2009లో టీఆర్‌ఎస్, వామపక్షాలకూ అదే అనుభవం
*  టీడీపీతో ‘మహా కూటమి’ కట్టి మట్టికరిచిన వైనం
*  ఇప్పుడు మళ్లీ మిత్రుల ‘వేట’లో టీడీపీ అధ్యక్షుడు

 
సీహెచ్ శ్రీనివాసరావు, హైదరాబాద్: వన్ ప్లస్ వన్ టూ వంటి సాధారణ లెక్కలు రాజకీయాల్లో పని చేయవు. కొన్ని సందర్భాల్లో రెండు కంటే ఎక్కువ కావచ్చు, మరికొన్నిసార్లు సున్నాగానూ మారొచ్చు. గత రెండు సాధారణ ఎన్నికల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలబొప్పి కట్టించిన కూటమి ప్రయో గమే ఇందుకు మంచి ఉదాహరణ. 2004లో బీజేపీతో అంటకాగినా, 2009లో టీఆర్‌ఎస్, వామపక్షాలను కౌగిలించుకుని ‘మహా కూటమి’ అన్నా ప్రజలు మాత్రం బాబును నిర్ద్వంద్వంగా తిరస్కరించడం తెలిసిందే. 2004-09 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా విఫలమై అపకీర్తిని మూటగట్టుకున్న టీడీపీ, ఆయన హఠాన్మ రణం అనంతరం గత నాలుగున్నరేళ్లుగానైతే ఏకంగా అధికార పార్టీతోనే అంటకాగుతూ ‘కొత్త చరిత్ర’ సృష్టించింది.
 
 ఈ ట్రాక్ రికార్డు దృష్ట్యా ఈసారి ‘మహా మహా కూటమి’ కట్టినా కష్టమేనంటూ టీడీపీ నేతలం తా ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. అయినా సరే, చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేరు. ప్రజల్లో గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన తర్వాత పొత్తులు పెట్టుకున్నా, ఆల్ ఫ్రీ హామీలు గుప్పించినా లాభముండదన్న వాస్తవాన్ని పక్కన పెట్టారు. ఈసారి కూడా బీజేపీ, లోక్‌సత్తాలతో పాటు జన సేన... ఇలా అదీ ఇదీ అని లేకుండా ఏ పార్టీ దొరికితే ఆ పార్టీతో పొత్తుల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు! కానీ 2009 నాటి టీఆర్‌ఎస్, వామపక్షాల చేదు అనుభవం నేపథ్యంలో బాబు ధృతరాష్ట్ర కౌగిలి బారిన పడేందుకు బీజేపీ సహా ఏ పార్టీలూ ఇష్టపడటం లేదు.
 
వాత పెట్టుకోబోయి బొక్క బోర్లా
 వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఎదిరించడం తన ఒక్కడి వల్ల కాదని అర్థమైన చంద్రబాబు, 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహా కూటమికి తెర తీశారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనీ, జయప్రకాశ్ నారాయణ లోక్‌సత్తా పార్టీనీ కూటమిలోకి లాగేందుకు శాయ శక్తులా ప్రయత్నించారు. అంతటితో ఆగలేదు. ఊరూవాడా హోరెత్తించిన నగదు బదిలీ మొదలుకుని కలర్ టీవీలు, ఉచిత బియ్యం, వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య... ఇలా కనీసం 40 దాకా ఉచిత హామీలిచ్చారు. చిరంజీవికి మద్దతుగా అనుచర సినీ గణం ప్రచారం చేయడంతో బాబు కూడా నందమూరి వంశాన్ని బరిలో దించారు.
 బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో ముమ్మరంగా ప్రచారం చేయించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయించి మరీ తనదైన శైలిలో ‘ఎగ్జిట్ పోల్’ నిర్వహించారు బాబు. మహాకూటమికి 179 అసెంబ్లీ, 30 లోక్‌సభ స్థానాలు ఖాయువుంటూ ఆ వుుసుగులో తెగ ప్రచారం చేయించారు. కాంగ్రెస్‌కు 57 అసెంబ్లీ, 9 లోక్‌సభ సీట్లొస్తే కష్టవున్నారు. ఇలా ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్ర ప్రజలు వైఎస్ సంక్షేమ పాలనకే పట్టం కట్టారు. మహా కూటమిని మూకుమ్మడిగా తిరస్కరించారు. ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్‌కు అసెంబ్లీకి పోలైన ఓట్లలో 36.55 శాతం వస్తే, టీడీపీ నేతృత్వంలోని మహా కూటమికి 34.76 శాతమే వచ్చాయి. టీడీపీకి ఓటు బ్యాంకుకు 10 శాతం దాకా గండిపడింది. లోక్‌సభకు పోలైన ఓట్లలోనైతే కాంగ్రెస్‌కు 39 శాతం వస్తే టీడీపీకి కేవలం 24.93 శాతం దక్కాయి. ఆ పార్టీ చరిత్రలో ఇదే అత్యల్పం.
 
ధృతరాష్ట్ర కౌగిలి
 బాబుతో పొత్తు మొదటికే మోసమని మహా కూటమి ప్రయోగంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలకూ తెలిసొచ్చింది. 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ కేవలం పదింటినే గెల్చుకుంది. 14 సీట్లలో పోటీచేసిన సీపీఐకి 4, 18 స్థానాల్లో బరిలో దిగిన సీపీఎంకైతే కేవలం ఒకే ఒక్క సీటు దక్కాయి.కేవలం బాబు మోసపూరిత వైఖరి వల్లే తీవ్రంగా నష్టపోయామంటూ టీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే ధ్వజమెత్తారు. బాబు మాత్రం ఆ పార్టీల పుట్టి ముంచిందే, వాటి కారణంగానే, ముఖ్యంగా టీఆర్‌ఎస్ వల్లే ఓడామంటూ టీడీపీ నేతలతో విమర్శలు చేయించారు. వాస్తవానికి టీడీపీ 91 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోగలిగిందంటే అది టీఆర్‌ఎస్, వామపక్షాల పుణ్యమే. కేవలం వాటి ఓట్లు కలిసొచ్చినందువల్లే తెలంగాణలో 22, సీమాంధ్రలో 8 స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి.
 
 లేదంటే దానికి కనీసం వురో 30 అసెంబ్లీ సీట్లు తగ్గేవి. ఆ లెక్కన వుహా కూటమితో లాభపడింది టీడీపీ అయితే, నిండా మునిగింది. టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ! పైగా పొత్తు ఒప్పందాలన్నింటినీ టీడీపీ తుంగలో తొక్కింది. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన 45 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో పలు చోట్ల బీ ఫారాలిచ్చి మరీ అధికారికంగా అభ్యర్థులను పోటీకి దింపింది. టీఆర్‌ఎస్, వామపక్షాలు 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మెరుగైన ఫలితాలు సాధించాయి! సీపీఐ 12 స్థానాల్లో పోటీ చేస్తే ఆరింటిలో, సీపీఎం 14 స్థానాలకు గాను 9 చోట్ల, టీఆర్‌ఎస్ 54 స్థానాలకు గాను 26 చోట్ల గెలిచాయి. ఆ ఫలితాలను చూసే బాబు 2009లో ఆ మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని బొక్క బోర్లా పడ్డారు.
 
 ఛీ అన్న బీజేపీ కోసం తహతహ
 ఈ ఎన్నికల్లో కూడా ఎలాగైనా కూటమి కట్టేందుకు బాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే, తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అసాధ్యమని ఆందోళన చెందుతున్నారు. లోక్‌సత్తాతో పాటు సినీనటుడు పవన్‌కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీని కూడా కలుపుకుంటానంటున్నారు! 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బీజేపీతో పొత్తే కారణమని బాబు నిందించడం, మరెప్పుడూ ఆ పార్టీతో కలవబోమని ప్రకటించడం తెలిసిందే. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి వీస్తోందన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీతో మరోసారి జత కట్టేందుకు తహతహలాడుతున్నారు.
 
 అందుకు ఆ పార్టీని ఎలాగైనా ఒప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కోటరీ నేతలతో రాయబారాలు నడుపుతున్నారు. గతానుభవాల దృష్ట్యా టీడీపీతో పొత్తు వద్దే వద్దని బీజేపీ రాష్ట్ర శాఖ కుండబద్దలు కొడుతున్నా, ఢిల్లీ స్థాయిలో కమలనాథులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని చెబుతున్నారు. పైగా సొంత పార్టీ నేతలపైనే పూర్తిగా నమ్మకం పెట్టుకోలేక నలిగిపోతున్న బాబు, ఎందుకైనా మంచిదని కాంగ్రెస్‌ను వీడుతున్న వారితో టీడీపీని నింపేశారు. ఇది టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. పైగా వచ్చిన వారందరికీ టికెట్లు ఖాయమంటూ బాబు భరోసా ఇస్తుండటంతో తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నామినేషన్ల నాటికి అది మరింతగా రాజుకుని భగ్గమనే వాతావరణం టీడీపీలో చాలా స్థానాల్లో కన్పిస్తోంది.

వైఎస్సార్‌సీపీలోకి చేరికల వెల్లువ

అల్లూరు, న్యూస్‌లైన్ : మండలంలోని నార్తుమోపూరుకు చెందిన టీడీపీ సీని యర్ నేతలు పిడూరు పరమేశ్వరరెడ్డి, నూకలపాటి శివకుమార్‌రెడ్డి శుక్రవారం కావలి నియోజకవర్గ సమన్వయకర్త రా మిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో 100 మంది అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
త్వరలో జ రుగబోయే సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా, ప్రజ లకు సుభిక్షమైన పాలనను అందించాలంటే రాష్ట్రానికి యువకుడైన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మీదున్న నమ్మకంతో నే తనతో పాటు తన అనుచర వర్గమం తా వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు.

గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీలో తా ను సర్పంచ్ అభ్యర్థిని గెలిపించడంలో  కీలకపాత్ర పోషించామన్నారు. ప్రస్తు తం వైఎస్సార్‌సీపీలో ఉన్న అందరిని క లుపుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థు ల విజయానికి కృషి చేస్తామన్నారు. పా ర్టీ సీనియర్ నాయకుడు మేడా అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భవననిర్మాణానికి పునాదులు ఎంతగట్టిగా ఉంటాయో పార్టీ నిలబడాలంటే కార్యకర్తలు అంతగట్టిగా ఉండాలన్నారు. పరమేశ్వరరెడ్డి పార్టీలో చేరడం ఎంతో సంతోషమన్నారు.
అందరూ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.  మండల కన్వీనర్ దండా  కృష్ణారెడ్డి, యువజన విభాగ కన్వీనర్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, పార్టీనాయకులు బాలకృష్ణంరాజు, అక్కల రాఘవరెడ్డి, కేతిరెడ్డి కృష్ణారెడ్డి, ఊటు అశోక్‌రెడ్డి, కేతిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.


 కావలి: బోగోలు మండలం అనంతరాజువారింకండ్రిగకు చెందిన కొందరు టీ డీపీ నేతలు శుక్రవారం వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రా మిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. స్థానిక పుల్లారెడ్డినగర్ లో ఉన్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం లో వారికి పార్టీ కండువా వేసి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో బాలకృష్ణ, హరి, వెంకటేశ్వర్లు, సురేష్, సురేంద్ర, శ్రీనాథ్, ప్రసా ద్, సిద్దయ్య, సుదర్శన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు రమణయ్యనాయుడు, కిషోర్‌బాబు, శ్రీను ఉన్నారు

బొమ్మనహాళ్, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. దర్గాహొన్నూరులో టీడీపీ, కాంగ్రెస్ నుంచి దాదాపు 400 మంది శుక్రవారం వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్.వన్నప్ప, రమేష్‌ల అధ్వర్యంలో పూజారి చిన్నవన్నూరప్ప, శీనప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.ఎల్లప్ప, చిన్నసిద్దప్ప, జలేంద్ర, ముత్యాలప్ప, పెద్దవన్నూరప్ప, రోగన్న, పాల్తూరు తిప్పేస్వామి, నాగరాజు, జి.వన్నూరప్ప, వన్నూరుస్వామి, వారి అనుచరులు పార్టీలో చేరారు.

వీరికి మాజీ ఎమ్మెల్సీ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాటిల్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కణేకల్లు, బొమ్మనహాళ్ మాజీ ఎమ్పీపీలు రాజగోపాల్‌రెడ్డి, లాలుసాబ్, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు ప్రవీణ్‌కుమార్, హొన్నూరు రామక్రిష్ణ, నాగభూషణ, వన్నూరుస్వామి, సింగానహళ్ళి దేవణ్ణ, అంజినేయ, రామాంజినేయులు, తిప్పేస్వామి, కరెణ్ణ, ఉద్దేహాళ్ ఈశ్వర్‌రెడ్డి, శ్రీధరగట్ట చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేదరమెట్ల, న్యూస్‌లైన్: వైఎస్  జగన్‌మోహనరెడ్డితోనే రాజన్న కోరుకున్న స్వర్ణయుగం వస్తుందని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని బొడ్డువానిపాలెంలో గతంలో పీఆర్‌పీ, టీడీపీల్లో ఉన్న 600 మందిని శుక్రవారం పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి  ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ  అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేయాలన్నారు.  టీడీపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని, రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. ముందుగా బొడ్డువానిపాలెంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి కార్యకర్తలు, అభిమానులు బైకులపై ర్యాలీగా అద్దంకి రోడ్డులోని సీతారామస్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
పార్టీలో చేరిన వారిలో తిరుమల శెట్టి నాగేశ్వరరావు, చింతం అంజయ్య, నేరెళ్ల వెంకటేశ్వర్లు, నేరెళ్ల జానకీరామయ్య, ధర్మవరపు దుర్గారావు, పీ హనుమంతరావు, మందలపు అంకారావు, నేరెళ్ల సుబ్బయ్య, పెద్దిరెడ్డి శివారెడ్డి, అన్నెం అంజిరెడ్డి, ఎం హనుమారెడ్డిల ఆధ్వర్యంలో 600 మంది కార్యకర్తలు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు
 
. కార్యక్రమంలో మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, ఎస్సీ సెల్ నాయకులు రంపతోటి సాంబయ్య, ముత్తవరపు రమణయ్య, అన్నెం అంజిరెడ్డి, కోట శ్రీనివాసరావు, శానం చిన్న వెంకటేశ్వర్లు, జంపు ఆదిశేషు, ఈవూరి సోమారెడ్డి, ఆరుమళ్ల సామియేలు, రామిరెడ్డి అంజయ్య, మేకల అంజిరెడ్డి, రామిరెడ్డి వెంకటస్వామి, యర్రబాలెం సుధాకర్, సాదినేని శ్రీనివాసరావు, జ్యోతి రమేష్, స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.

అగళి,న్యూస్‌లైన్: జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలోకి కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలు ప్రారంభం కావడంతో కోడిపల్లి పంచాయతీ గ్రామాల్లో కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితి ఏర్పడింది. ముక్కడంపల్లి, దాసేగౌడనపల్లి, జంగమరపల్లి, పూలపల్లి తదితర గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు సగం మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు.  పూలపల్లిలో మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ దేవరాజు, కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్, స్టీరింగ్‌కమిటీ సభ్యులు హనుమంతరాయప్ప, ఎస్సీసెల్ దేవన్న, మాజీ సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరినవారిని  బీసీసెల్ లింగరాజు, దేవరాజు, బసవేగౌడ్, గోవిందప్ప, సదాశివ, శ్రీనివాస్ పార్టీ కండువాలతో ఆహ్వానించారు.   ముక్కడంపల్లి రామచంద్రప్ప, నాగభూషణ, గుండేగౌడ్, జంగమరపల్లి శివన్న, నాగరాజు, దొడ్డరంగప్ప, సిద్దరాజు, కోడిపల్లి రాఘవేంద్ర, దాసేగౌడనపల్లి గోవిందప్ప, రామిరెడ్డి, లోకేష్, నరసింహమూర్తి, కావాలప్ప వారి అనుచురులు మొత్తం 300 కుటుంబాలదాకా వైఎస్సార్‌సీపీలో చేరారు. నాయకులు   నాగప్ప, మంజు, సతీష్, చంద్రప్ప, తిప్పేష్, సిద్దారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గండికోట వైఎస్ చలువే

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గండికోట ప్రాజెక్టు పూర్తయిందని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు  వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  శుక్రవారం పాతబస్టాండ్‌లో నిర్వహించిన సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడారు.  ఎన్టీఆర్ హయాంలో గండికోటకు శంకుస్థాపన జరిగిందన్నారు. తొమ్మిదేళ్లపాటు పాలన చేసిన చంద్రబాబు గండికోటను ఏనాడూ  పట్టించుకోలేదన్నారు.
 
వైఎస్ హయాంలోనే గండికోట నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. కరవు జిల్లాలో ఉద్యోగావకాశాలను కల్పించాలని 2007లో బ్రహ్మణి ఫ్యాక్టరీకి వైఎస్ శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్ అకాలమృతితో బ్రహ్మణి ఆగిపోయిందని, దీని గురించి పట్టించుకునే నాధుడే లేడన్నారు. వైఎస్ ఆశయాలను జగన్‌బాబు  కొనసాగిస్తారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే  నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇళ్లు, పెన్షన్లు అందిస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు.

వైఎస్సార్ హయాంలో గుంటూరు పట్టణాల్లో జరిగిన అభివృద్ధి

గుంటూరు: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో  పట్టణాల్లోని మురికివాడలకు కోట్ల రూపాయలు వెచ్చించారు. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. కొన్ని మున్సిపాలిటీలకు నూతన భవనాలు, పట్టణాల్లో సిమెంట్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లను కోట్ల నిధులతో నిర్మించి పట్టణాలకు కొత్త కాంతులు తెచ్చిపెట్టారు.
 
 అంతేకాక అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకం ద్వారా మురుగునీరు రోడ్లపై కనిపించకుండా మున్సిపాలిటీలను క్లీన్ అండ్ గ్రీన్‌గా చేసిన ఘనత ఆయనకే దక్కింది.అయితే ఆయన మరణంతో పట్టణాభివృద్ధి నిలిచిపోయింది. ఇప్పటి వరకు పట్టణ ప్రజల బాధలు పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడని, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెబుతామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదీ వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి...
మంగళగిరిలో రూ. 60 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.వైఎస్ మరణంతో ఇవన్నీ ఆగిపోయాయి.  తొలి విడతలో 504 మంది నిరుపేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చారు.
 
నూతనంగా ఏర్పడిన తాడేపల్లి పట్టణాన్ని కూడా మున్సిపాలిటీగా మార్చేందుకు వైఎస్సార్ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ. 40 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఆయన మరణంతో అది కాస్తా నిలిచిపోయింది.

పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు గోవిందాపురం వద్ద రూ. 36 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు.
 
బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి మాచర్ల పట్టణానికి మంచినీటినందించే పథకానికి రూ.16 కోట్లతో  అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే వైఎస్ అకాల మరణంతో ఆ పథకాన్ని పట్టించుకున్న దిక్కే లేకుండా పోయింది. వైఎస్సార్ నగరబాట కార్యక్రమంలో మాచర్ల పట్టణానికి వచ్చి అడగకుండానే సిమెంట్‌రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశారు.
 
సత్తెనపల్లిలో రూ. 14.5 కోట్ల వ్యయంతో 120 ఎకరాలను కొనుగోలు చేసి మంచినీటి చెరువు తవ్వించారు. రూ. 20 కోట్ల నిధులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఓవర్‌ెహ డ్ ట్యాంకులు పూర్తి చేశారు. 60 కి.మీ మేర పైప్‌లైన్ నిర్మాణం చేశారు. మురికివాడల అభివృద్ధి కోసం రూ. 15.38 కోట్లు అందించారు.
 
చిలకలూరిపేటలో మురికివాడల అభివృద్ధి కోసం రూ. 16.74 కోట్లు మంజూరు చేశారు. నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు, రూ. 8 కోట్లతో 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
 
నరసరావుపేటలో రూ.44 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పథకానికి శంకుస్థాపన చేశారు. రూ. 22 కోట్లతో చిలకలూరిపేట రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, రాజీవ్ గృహకల్ప వంటి కార్యక్రమాలు చేపట్టారు.
 
బాపట్లలో రూ.49 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకాన్ని ప్రవేశపెట్టారు. రూ. 2 కోట్ల వ్యయంతో గృహ సముదాయాలు నిర్మించారు.
 
తెనాలిలో రూ. 100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి 2009లో శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణంతో ఆ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది.
 
మహానేత వైఎస్సార్ వినుకొండ పట్టణాన్ని 2005లో మున్సిపాలిటీగా మార్చి రూ. 30 కోట్లతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేశారు. రూ. 15 కోట్లతో మంచినీటి పథకాన్ని నిర్మించారు.
 
రేపల్లెలో రూ.13 కోట్ల వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణం చేశారు. వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీచేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేశారు.
 
పొన్నూరు మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి  కోటి రూపాయలు మంజూరు చేశారు. మరో కోటితో హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు.

నాడు తిట్లు.. నేడు పొగడ్తలు

నాడు తిట్లు.. నేడు పొగడ్తలు
మాచర్లటౌన్, న్యూస్‌లైన్: నాడు కాంగ్రెస్ నాయకులను విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు వారినే తన పార్టీలో చేర్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి సీమాంధ్ర రాజధానికి ప్యాకేజీ అడిగిన చంద్రబాబు నిత్యం కాంగ్రెస్ నాయకులను విమర్శించారన్నారు.
 
శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులం దరిని చంద్రబాబు దుమ్మెత్తి పోశారని, నేడు వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ టీడీపీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతమవు తుందని చెప్పుకుంటున్నారన్నారు. బాబు రాజకీయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోరాటం చేసిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు.
 
అంతేకాక సీమాంధ్రను  అభివృద్ధి చేయగలిగిన శక్తిమంత నేత జగన్ అని అన్నారు.  వైఎస్సార్ ప్రవేశ పెట్టిన  పథకాలను అమలు చేయడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు జగన్ అన్నారు.అందుకే ఆయనపై విశ్వాసంతో అన్ని ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలువబోతున్నారన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. విలేకరుల సమా వేశంలో మార్కెట్‌యార్డు మాజీ  చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఒంటరిగా జగన్‌ను ఎదుర్కోలేకే: జూపూడి

తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ ఇతర పార్టీలతో పొత్తులకు సిద్ధమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్కడిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకే మోడీ, పవన్‌కల్యాణ్, కాంగ్రెస్, కిరణ్‌కుమార్‌రెడ్డి, జయప్రకాష్ నారాయణ్, సీపీఐలతో పొత్తులకోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. జూపూడి శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబుకు ఒక్కడిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఉందా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాలకపక్షం విఫలమైనప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాల్సిన టీడీపీ.. నిన్నటిదాకా పాలకపక్షాన్ని భుజాలపై మోసిందని దుయ్యబట్టారు. మళ్లీ ఎన్నికలోచ్చేసరికి ఒక్కడుగా పోటీ చేయలేక పవన్, మోడీ, జేపీ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాళ్లందరితో పొత్తు కట్టినా ప్రజలు మాత్రం జగన్ పక్షానే ఉండాలని నిర్ణయం తీసేసుకున్నారని జూపూడి  పేర్కొన్నారు.

ఈ ఎన్నికలు జరుగుతున్నది వీటి మధ్యే.

కుతంత్రమా.. విశ్వసనీయతా?: వైఎస్ జగన్

ఈ ఎన్నికలు జరుగుతున్నది వీటి మధ్యే..: వైఎస్ జగన్ విజయనగరం, న్యూస్‌లైన్: ‘‘రాష్ట్రంలో తొమ్మిదేళ్ల చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుతూ అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. రాష్ట్ర ప్రజలకు ఓ సువర్ణయుగాన్ని అందించారు. దేశానికే ఆదర్శనీయంగా నిలిచారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పారు. ఇచ్చిన మాట తప్పకుండా పాలించి విశ్వసనీయతకు అర్థం చెప్పారు. ఆ దివంగత రాజశేఖరరెడ్డి నాకు వారసత్వంగా ఇచ్చింది ఏదైనా ఉందీ అంటే అది విశ్వసనీయతే అని చెబుతున్నా. ఈ విశ్వసనీయత అన్న పదానికి అర్థం చంద్రబాబుకు ఈ జన్మకు తెలియనే తెలియదు. ఏ గడ్డి కరిచైనా మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అందుకే నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను పట్టపగలే మోసం చేయాలని చూస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 45 రోజుల్లోపే వస్తున్న ఎన్నికల్లో ఓవైపు నిజాయితీ, విశ్వసనీయత ఉంటే... మరోవైపు అధర్మం, కుళ్లు, కుతంత్రాలు ఉండి పోటీపడు తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బేబీనాయనను, నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థిగా పెనుమత్స సురేశ్‌బాబును ప్రకటించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

 అందుకే బాబు అలా హామీలిస్తున్నారు..
 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలు. ఆ తర్వాత ఆయన పార్టీ ఉంటుందో లేదో చెప్పలేం. అందుకే ఇప్పుడు ఏదో విధంగా అధికారంలోకి రావాలని ఆయన నోటికొచ్చినట్టు హామీలిస్తున్నారు. చంద్రబాబు మాదిరి నాకు అబద్ధాలాడడం చేతకాదు. చంద్రబాబు మాదిరి నేను దొంగ హామీలు ఇవ్వలేను. ఆయన మాదిరి విశ్వసనీయతకు పాతరేయడం నాకు చేతకాదు. ఎందుకంటే చంద్రబాబు కంటే నేను పాతికేళ్లు చిన్నవాణ్ణి, నేను ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిని. పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పదవి లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ప్రజలకు వెన్నుపోటు పొడవరని గ్యారంటీ లేదు. తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనీ నిలబెట్టుకోని చంద్రబాబు.. ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయడానికి ఆల్ ఫ్రీ అంటూ హామీలిస్తున్నారు. అధికారంలోక రావడమే ధ్యేయంగా కళ్లార్పకండా అబద్ధాలు ఆడుతున్నారు.

ఇదే చంద్రబాబు మొన్నటికి మొన్న రైతులకు రుణాలు మాఫీ చేస్తానని డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానని హామీలు ఇచ్చేశారు. చాలా మంది నా దగ్గరకువచ్చి చంద్రబాబులాగా మీరూ రైతుల రుణాలు మాఫీ చేస్తానని, హామీ ఇవ్వాలని అడిగారు. రోజంతా బడ్జెట్‌పై అధ్యయనం చేశాను. రాష్ర్టంలో రైతు రుణాలు రూ. లక్షా 27వేల కోట్లున్నాయి. అలాగే డ్వాక్రా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలున్నాయి. మన రాష్ర్ట బడ్జెట్ చూస్తే రూ. లక్షా 25 వేల కోట్లయితే చంద్రబాబేమో రూ.లక్షా 47 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటూ ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారు. అంతేకాదు,  మళ్లీ ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని కొత్త హామీ ఇస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లున్నాయో చంద్రబాబుకు తెలుసా? ఈ రాష్ర్టంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉన్నాయి.. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బాబు ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారు.

 ఐదు సంతకాలు.. మూడు పనులు..
 ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో రాజకీయం, పాలన రెండూ భ్రష్టుపట్టిపోయాయి. అలాంటి ఈ వ్యవస్థలో మళ్లీ నేను మార్పు తెస్తా. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపై ప్రజల తలరాతలు మార్చేసేలా ఐదు సంతకాలు చేస్తా. వీటితో పాటు మరో మూడు ముఖ్యమైన పనులు చేస్తా. మొదటి  సంతకం ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకంపై చేస్తా. అవ్వా తాతల పింఛన్  రూ.700కు పెంచుతూ రెండో సంతకం, రైతన్నల కోసం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం, ప్రతి గ్రామంలోనూ ఒక ఆఫీస్ తెరిచి.. ఆరోగ్య శ్రీ, పింఛను, రేషన్ ఇలా ఏ కార్డు కావాలన్నా అక్కడే ఇచ్చేలా ఐదో సంతకం చేస్తాను.

 వీటితోపాటు ఏటా 10 లక్షల ఇళ్లచొప్పున 2019 నాటికి రాష్ట్రంలో 50 లక్షల ఇళ్లు కట్టించడాన్ని ఆరో పనిగా చేస్తా. ఏడో పనిగా.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకుని వస్తా. ఎనిమిదో పని అక్కా చెల్లెమ్మల కోసమే చేస్తా. గ్రామాల్లో బెల్టుషాపులనేవే లేకుండా చేస్తా.. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన 10 మంది మహిళలను ఆడపోలీసులుగా చేసి వారితోనే బెల్టు తీయిస్తా. నియోజకవర్గానికి ఒకే ఒక్క మద్యం దుకాణం ఉండేలా చేస్తా. మన తలరాతలు మార్చనున్న ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులందరికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నా.’’

 40 డిగ్రీల ఎండనూ లెక్క చేయకుండా..
 ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయనగరంలో ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సాయంత్రం 4.30 గంటల వరకు సాగిన రోడ్ షోకు హోరెత్తిన జన సందోహంలో జైజగన్ నినాదాలు ప్రతిధ్వనించాయి. శుక్రవారం సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా కూడా లెక్క చేయకుండా జగన్ జనంతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకుని సమస్యలపై స్పందించారు. మరో రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని, ఇక సమస్యలుండవని భరోసా ఇచ్చారు.

 ఎండను లెక్క చేయకుండా జగన్‌ను చూసేందుకు తరలివచ్చిన జనం ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వీధి వీధిలోనూ జనం ముఖ్యంగా మహిళలు ఆయనకు మంగళ హారతులు పట్టారు. నెల్లిమర్లలో రామతీర్థం కూడలి, మెయిద కూడలిలలో జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం జరిగిన నెల్లిమర్ల బహిరంగ సభకు జనం పోటెత్తడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కాగా, జగన్ వెంట పర్యటనలో పార్టీ  జిల్లా అధ్యక్షుడు పి.సాంబశివరాజు, నేతలు రఘుబాబు, శ్రీరాములు నాయుడు, సీహెచ్. వెంకటరమణ తదితరులున్నారు.

 వైఎస్సార్ సీపీలోకి పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి
 నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్:  విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. నెల్లిమర్లలోని మొయిద జంక్షన్ వద్ద శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు పార్వతీపురం ఏఎంసీ చైర్మన్ భీమవరపు కృష్ణమూర్తి, సీడీసీ చైర్మన్ నడిమింటి రామకృష్ణ, డీసీసీబీ డెరైక్టర్ బొంగు చిట్టిరాజు, పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీ సీ సభ్యులు పార్టీలో చేరారు.

బాబు.. చేతనైతే జగన్ ను నేరుగా ఎదుర్కో

Written By news on Friday, March 28, 2014 | 3/28/2014

'బాబు.. చేతనైతే జగన్ ను నేరుగా ఎదుర్కో'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కొన్ని రాజకీయ పార్టీలు కొంత మంది వ్యక్తులతో కలిసి కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇలాగే కుట్రలు చేశారని, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు దిష్టిబొమ్మలా తయారయ్యారని, చేతనైతే జగన్ ను నేరుగా ఎదుర్కోవాలని జూపూడి సవాల్ విసిరారు. కౌరవుల్లా కట్టకట్టుకుని వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు. సీమాంధ్రలో 143 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ శుక్రవారం సమావేశమైందని, త్వరలోనే మరో సారి సమావేశమై మేనిఫెస్టోను ప్రకటిస్తామని జూపూడి ప్రభాకరరావు చెప్పారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

'రాష్ట్రాన్ని శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చారు'
కడప: ప్రొద్దుటూరు తాగునీటి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ జాప్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం అయితే ప్రొద్దుటూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని ఆమె హామీయిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రోడ్ షోలో విజయమ్మ ప్రసంగించారు.

పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి వైఎస్ఆర్ ఎంతో ఆరాట పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చారా, రుణమాఫీ చేశారా, ప్రాజెక్ట్‌లు కట్టారా అని విజయమ్మ ప్రశ్నించారు. చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23,500 ఉద్యోగాలు తొలగించారని వెల్లడించారు. 7 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని దుయ్యబట్టారు.

గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ తో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రాన్ని విభజన జరిగేది కాదన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమన్నారు. వైఎస్ జగన్ ప్రాబల్యం తగ్గించేందుకే విభజన చేశారన్నారు. విభజన ఎలా చేయాలో కిరణ్‌ రోడ్డు మ్యాప్ ఇచ్చారని ఆరోపించారు. ఉద్యోగుల సమ్మెను కిరణ్ నీరుగార్చారని వైఎస్ విజయమ్మ అన్నారు.

వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా...వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: తమ పార్టీ మేనిఫెస్టోను అతిత్వరలో విడుదల చేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టోగా ఉంటుందని వెల్లడించారు. మేనిఫెస్టోపై పార్టీ సీనియర్ నేతల కసరత్తు పూర్తవుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో ఉంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని ఎవరూ నమ్మడం లేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు బాబు చేస్తున్న హడావిడి చూస్తుంటే జాలేస్తుందన్నారు. కాంగ్రెస్ లీడర్లకు పునరావాస కేంద్రంగా టీడీపీ మారిందన్నారు.

విజయనగరంలో నేటి నుంచి జనభేరి

నేటి నుంచి వైఎస్‌ఆర్ జనభేరి
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: పురపోరును పురస్కరించుకుని ‘వైఎస్‌ఆర్ జనభేరి’ మోగిస్తున్న ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి.

తొలిరోజు విజయనగరంలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం  నెల్లిమర్లలోని మొయిద జంక్షన్‌లో  సాయంత్రం 5 గం టలకు  జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, టూర్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు.  
 
ఉదయం 10 గంటలకు పట్టణంలోని బాలాజీనగర్‌లోని పార్టీ సమన్వయకర్త అవనాపు విజయ్ స్వగృహం నుంచి  పర్యటన ప్రారంభమవుతుందని తెలిపారు. వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీనేతలు విజ్ఞప్తిచేశారు. అంతకుముందు జగన్ పర్యటనపై పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స, జిల్లా కో ఆర్డినేటర్ చేకూరి కిరణ్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు పక్కి దివాకర్,  సమన్వయకర్తలు అవనాపు విజయ్, గురాన అయ్యలు  చర్చించారు.
 
రోడ్ షో వివరాలు
ఉదయం 10 గంటలకు  బాలాజీనగర్‌లో రోడ్ షో ప్రారంభమవుతుంది. మయూరి జంక్షన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి,   ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్,  అంబేద్కర్ కాలనీ, యస్‌బీటీ మార్కెట్,  ఎన్‌సీఎస్ రోడ్డు,  ఎంఆర్‌ఓ కార్యాలయం రోడ్డు,  బొడ్డువారి జంక్షన్,  శాంతినగర్, బీసెంట్ స్కూల్ రోడ్డు మీదుగా నాగవంశపు వీధి, హుకుంపేట, కొత్తపేట జంక్షన్ మీదుగా నెల్లిమ ర్ల వెళ్తారు. సాయంత్రం మొయిద జంక్షన్‌లో జరిగే బహిరంగ సభలో  నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.అనంతరం మొయిదలో జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు స్వగృహంలో రాత్రి బస చేస్తారు.
 
రెండో రోజు పర్యటన వివరాలు
శనివారం ఉదయం మొయిదలో రోడ్ షో ప్రారంభమవుతుంది. గుర్ల, గరివిడి మండలా ల మీదుగా చీపురుపల్లి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు చీపురుపల్లిలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.

మీప్రేమకు, ఆప్యాయతకు కృతజ్ఞతలు

దుష్ట సంహారంమైదుకూరులో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
 సాక్షి ప్రతినిధి, కడప: వచ్చే ఎన్నికల్లో దుష్టసంహారం చేయాలని వైఎస్ విజయమ్మ కోరారు. వైఎస్ ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు.. మరెందరికో ఆర్థికంగా చేయూతనందించారు., వారంతా అండగా లేరు.. మాకు తోడూ నీడ గా మీరున్నారు.. మీప్రేమకు, ఆప్యాయతకు కృతజ్ఞతలు. మీరిచ్చిన స్ఫూర్తితోనే ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి నిలిచాం.. 30 ఏళ్లుగా రాజశేఖరరెడ్డిని  భుజాలకెత్తుకొని మోశారు.. ఆదే ఆదరణ, ఆప్యాయతలు మాపై చూపుతున్నారు... మీరుణం తీర్చుకోలేనిదన్నారు.. ఎన్నికల ప్రచారం జనభేరిలో భాగంగా రెండవ రోజు కడప కార్పొరేషన్, మైదుకూరు, బద్వేలు, సిద్దవటంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ నుంచి తాము బయటికి వచ్చాక జరిగిన  అనేక ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చారన్నారు. కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో జగన్‌బాబును గెలిపించారన్నారు.
 

ఈ విషయంలో దేశచరిత్రలోనే జగన్ మూడో స్థానంలో నిలిచారన్నారు. దీనికి  మీ ఆప్యాయతలే కారణమన్నారు. వైఎస్‌లాగే తమను కూడా మీ కడుపులో దాచుకున్నారని, మీ రుణం మరువలేనిదని విజయమ్మ పేర్కొన్నారు.మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  కాంగ్రెస్,  తెలుగుదేశం పార్టీల కుయుక్తులకు చరమగీతం పాడాలన్నారు.  వైఎస్సార్‌జిల్లాలో  మీ ప్రేమ, ఆప్యాయతల కారణంగా వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందని, ఈ ఎన్నికల్లో మరోమారు  ఆదరించాలని కోరారు.

 విజయమ్మ జనభేరి సక్సెస్
 కడప కార్పొరేషన్, మైదుకూరు, బద్వేలు మున్సిపాలిటీలలో గురువారం వైఎస్ విజయమ్మ నిర్వహించిన జనభేరి కార్యక్రమం సక్సెస్ అయింది. దివంగత నేత సతీమణి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని వస్తుందని తెలుసుకున్న ప్రజానీకం రోడ్లపై నిరీక్షించారు. మండుటెండలో సూర్యుడు చిన్నబుచ్చుకునేలా కడప పురవీధుల్లో భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు. బిల్డప్ నుంచి కృష్ణాసర్కిల్ వరకు పెద్దాయన సతీమణి కోసం బారులు తీరారు. ఓపికగా గంటల తరబడి నిరీక్షించారు.

 విజయమ్మ  అనర్గళంగా  ప్రసంగం చేయడం చేసి ప్రజానీకం ఆశ్చర్యానికి లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను వివరిస్తున్న ఒక దశలో  ‘తల్లీ మీరు ఎండలో తిరగొద్దు. మీ కుటుంబానికి తోడునీడగా మేం ఉన్నాం.. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటాం’ అని కృష్ణాసర్కిల్‌లో  ఉబికివస్తున్న దుఃఖంతో కొందరు విజయమ్మకు వివరించారు.  విజయమ్మ రాకతో  మైదుకూరు నాలుగురోడ్ల కూడలి జనసంద్రంగా మారింది.  మూడు గంటలపాటు నిరీక్షించి మైదుకూరు ప్రజలు విజయమ్మను చూడగానే ఒక్కమారుగా జయజయధ్వానాలు పలుకుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బద్వేలు నాలుగు రోడ్ల కూడలిలో రాత్రి అయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆమె కోసం వేచి చూశారు.

భారీగా మహిళలు కూడా తరలివచ్చి  వేచి ఉండటం విశేషం.  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన పథకాలు, చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక పాలన, రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన అనంతరం కొనసాగిన కాంగ్రెస్ పాలనపై సవివరంగా విజయమ్మ ప్రసంగం చేయడం  ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతున్న సేపు హర్షం వ్యక్తం చేస్తూ ఈలలు, కేకలు వేశారు. పర్యటనలో  కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, జిలా కన్వీనర్, మేయర్ అభ్యర్థి కె.సురేష్‌బాబు, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు అభ్యర్థులు వరుసగా పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బీ అంజాద్‌బాష, ఎస్ రఘురామిరెడ్డి, టీ జయరాములు, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

అంతా మేలే జరిగింది..

ముసల్మాన్ కా జాన్ వైఎస్సార్
వైఎస్ ముఖ్యమంత్రిగా నాలుగు శాతం రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేయ డంతోనే గుర్తింపు దక్కింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వేషను అమలు చేయ డంలో వైఎస్ విజయం సాధించారు. ఈ రిజర్వేషన్లతోనే మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతవిద్యను చదువుకునే వీలు కలిగింది. జిల్లాలో పలువురికి వైద్యవిద్యనభ్యసించే సువర్ణ అవకాశం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా తమ చదువును నిరాటంకంగా కొనసాగించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు సముచిత స్థానం దక్కింది.
 
2007లో అమలు చేసిన రిజర్వేషన్లతో జిల్లాలో 25వేల మంది విద్యార్థులకు అన్ని విధాలా లబ్ధి చేకూరింది. ముస్లింలు ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలని ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం అమలు చేశారు. పేద ముస్లింలకు హజ్ యాత్ర ప్రభుత్వ రాయితీతో కల్పించారు. మైనార్టీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి షాదీఖానాల నిర్మాణం, పేద ముస్లిం బాలికలకు సామూహిక వివాహాలు చేశారు.
 
 ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, పింఛన్లు ద్వారా వేలాది మంది ముస్లింలకు లబ్ధి చేకూరింది.  వైఎస్ హయాం సువర్ణయుగమని. ‘హర్ గరిబ్ ముసల్మాన్ కే దిల్ మే డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిజీ  కే లియే జగా హే.. హర్ వక్త్ దువేమే భి వైఎస్‌ఆర్‌కో యాద్ రఖ్‌తేహే..’ అంటూ నిత్యం ప్రతి ముస్లిం కుటుంబం గుర్తు చేసుకుంటున్న సువర్ణయుగం అది.
 
 అంతా మేలే జరిగింది..
వైస్ రాజశేఖర్‌రెడ్డి మహానుభావుడు. ఆయన పాలనలో ముస్లిం మైనార్టీలకు అంతా మేలే జరిగింది. మా పిల్లలకు రిజర్వేషన్‌తో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. ఆరోగ్యశ్రీతో మరో జన్మనిచ్చారు. రుణాలు మాఫీ చేశారు. మైనార్టీ సంక్షేమం కోసం నిత్యం కృషి చేశారు.

గుండెకు రంధ్రం పడింది..

నాకు గుండెకు రంధ్ర పడింది. రాజశేఖర్‌రెడ్డి పుణ్యవూ అని ఆరోగ్యశ్రీ ద్వారా విజయువాడ కేర్ హాస్పటల్‌లో రూపారుు ఖర్చు లేకుండా చికిత్స చేరుుంచుకున్నాను. నాకు ప్రాణమించిన రాజన్న తనయుుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట నా ప్రాణం ఉన్నంత కాలం నడుస్తాను.
 
 వైఎస్సార్ మా కుటుంబానికి దేవుడు..
 వైఎస్సార్ మా కుటుంబానికి దేవుడులాంటి వారు. జాకీర్‌హుస్సేన్ నగర్‌లో ఇప్పటికీ అద్దె నివాసంలో ఉండే నాకు 2013లో గుండె సరిగా లేదని డాక్టర్లు చెప్పారు. బైపాస్ సర్జరీ చేస్తే తప్ప బతకనన్నారు. పెద్ద ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. మహానేత డాక్టర్ వైస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నా పాలిట సంజీవని అయింది.  గత ఏడాది నవంబర్‌లో ప్రైవే టు ఆస్పత్రిలో నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆపరేషన్ చేయటంతో పాటుగా, సంవత్సరం పాటు మందులను ఉచితంగా ఇస్తున్నారు. నేను బతికి ఉన్నంత కాలం వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం.

వైసీపీ మహిళా విభాగం కమిటీ సభ్యులు

 వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మెరుగుమల శ్రీదేవి(విశాఖ దక్షిణ), కాకి నిర్మల(గాజువాక), ఎర్రంరెడ్డి ఇందిరారెడ్డి(రంగారెడ్డి), ఇందిరారెడ్డి(కరీంనగర్), డి.సుశీల(హైదరాబాద్), ఉప్పులేటి అనిత(విజయవాడ సిటీ)ను రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించినట్లు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పైలా జానకి, కరీంనగర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా కె.సంధ్యారాణిని నియమించినట్టు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయప్రస్థానం

అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ ప్ర స్థానం స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసిన నా ప్రజల్లో గుండెల్లో నుంచి వైఎస్సార్ ముద్రను చెరపలేరన్నారు. గురువారం నాయుడుపేటలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ మాట్లాడుతూ పలు సర్వేల్లో వైఎస్సార్‌సీపీ 135-145 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడైందన్నారు. టీడీపీకి 35- 40 స్థానాలు దక్కుతాయని సర్వేల్లో తే లిందన్నారు.  కొంతమంది కాంగ్రెస్ నా యకులు టీడీపీ పంచన చేరుతుండటం తో చంద్రబాబు ఆనందపడుతున్నారని, అయితే ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదన్నారు.

  25 ఎంపీ స్థానాల్లో 22 వైఎస్సార్ సీపీకి దక్కే అవకాశం ఉందని పలు సర్వేలు తేల్చి చెప్పాయన్నారు. రాబోయే రోజు ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా పెద్ద భాగస్వామ్య పార్టీ కాబోతుందన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధికి బాటలు వేసేం దుకు కృషి చేస్తున్న జగన్‌బాబును ఆదరించి స్థానిక, మున్సిపల్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్చాలని కోరారు.  ఎంపీ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, తిరుపతి పార్లమెం టు నియోజకవర్గ సమన్వయకర్త వరప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, నాయకు లు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యులు ఓడూరు గిరిధర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పేరం మధునాయుడు, 786 సేవా సంఘ చైర్మన్ షేక్ రఫీ, కట్టా వెంకటరమణారెడ్డి ఉన్నారు.  

 మేకపాటి ప్రచార ర్యాలీకి అపూర్వ స్పందన
 నాయుడుపేటలో మేకపాటి ప్రచార ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది. ముందుగా మేకపాటి పాతబస్టాండ్ వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా వ్యాపారులు, గృహణిలను ఆప్యాయంగా పలకరిస్తూ ముం దుకు సాగారు.  టీడీపీకి చెందిన స్థానిక ఫ్రెండ్స్ హోమ్ నీడ్స్ అధినేత చంద్రశేఖర్, స్థానిక నాయకులు కిలివేటి సంజీవయ్య, షేక్ రఫీ ఆధ్వర్యంలో మేకపాటి సమక్షంలో పార్టీలో చేరారు. జామియా మసీదు కూడలి వద్ద మసీదు ముతవళ్లీతో పాటు పలువురు మతపెద్దలను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు  దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ పూలవర్షం కురిపిస్తూ మేకపాటికి ఘనస్వాగతం పలికారు.

చేసి చూపిస్తా

చేసి చూపిస్తా
ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తా  
విశాఖ జిల్లా తగరపువలస సభలో వైఎస్ జగన్ హామీ
 
 విభజన వల్ల ఇప్పటికే నీళ్లకు కష్టం అనుకుంటే హైదరాబాద్‌ను కూడా మన నుంచి తీసేసుకున్నారు. నేను అధికారంలోకి వచ్చాక పదేళ్లలో సింగపూర్ లాంటి నగరాన్ని సీమాంధ్రలో నిర్మిస్తా. అంతేకాదు.. చదువుకున్న ప్రతి పిల్లాడికి ఓ ధీమా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబులా నేను సాధ్యంకాని హామీలు ఇవ్వను. మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అబద్ధాలు చెప్పను. గత నాలుగున్నరేళ్లుగా నన్ను చూశారు. ఎండనక, వాననక కష్టపడ్డ నన్ను చూశారు. మీ కష్టాలు చూసిన వాడిగా చెబుతున్నా.. ప్రతి పేద పిల్లాడికి నేను భరోసా ఇస్తున్నా. మీకు కష్టాలు లేకుండా చేస్తాను. ఏదేదో చెప్పి ఏదేదో మాట్లాడడం కాదు. చేసి చూపిస్తా. అందుకు మీ అందరి దీవెనలు కావాలి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి.    - వైఎస్ జగన్
 
 సాక్షి, తగరపువలస: ‘‘నాయకుడనేవాడు ప్రజలకు దశ, దిశ చూపించాలి. దురదృష్టవశాత్తూ అది జరగడంలేదు. కానీ నేనొచ్చి ఈ వ్యవస్థలో మార్పు తెస్తా. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపై ప్రజల తలరాతలు, రాష్ట్ర చరిత్రను మార్చివేసే ఐదు సంతకాలు చేస్తా. వీటితోపాటు మరో మాట కూడ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికీ ఇల్లు లేదనే బెంగ లేకుండా చేస్తా.
 
 దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే, దివంగత నేత రాజశేఖరరెడ్డి అదే ఐదేళ్లలో ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఇవాళ వైఎస్ చనిపోయాక అస్తవ్యస్త పరిపాలన నడుస్తోంది. పేదలు ఇళ్లు అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను చెబుతున్నా. ఇళ్లులేని ప్రతివారికీ హామీ ఇచ్చి చెబుతున్నా. 2019 నాటికి రాష్ట్రంలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తా. ఆ తర్వాత గ్రామాల్లోకి వెళ్లి ఇళ్లు లేని వాళ్లు చేతులెత్తండి అని అడిగితే ఒక్కరు కూడా చేతులెత్తని స్థాయిలో పాలన చేస్తా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్‌మోహన్‌రెడ్డి.. గురువారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపువలసలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అబద్ధాల కోరు చంద్రబాబు దొంగహామీలిచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారిని జైల్లో పెట్టాలని అన్నారు. సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 అలాంటి వ్యక్తినే ఎన్నుకోండి..
 
 ‘‘ఇవాళ మరో 40 రోజుల్లో రాష్ట్రమంతటా వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజల తల రాతలు మార్చబోయే ఈ ఎన్నికల్లో మనమందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి అని ఆలోచించాలి. ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి అని ప్రశ్నించుకోవాలి.
 
 ఏ వ్యక్తి ప్రజల గుండె చప్పుడు వింటారో, ఏ వ్యక్తి అయితే ప్రజల మనసు ఎరుగుతారో, ఏ వ్యక్తి చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో ఉండడానికి ఆరాటపడతారో అటువంటి నాయకుడిని సీఎంగా ఎంచుకోవాలి. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేయబోయే ఐదు సంతకాల్లో.. మొదటిది అక్కాచెల్లెళ ్ల కోసం చేస్తా. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో ఒక్కో పిల్లాడికి నెలకు రూ.500 చొప్పున, ఇద్దరైతే రూ.1,000 చొప్పున వేస్తాం. రెండో సంతకం అవ్వా, తాతల పింఛన్‌ను రూ.200 నుంచి రూ.700కు పెంచడానికి పెడతా. మూడో సంతకం రైతన్నలకు గిట్టుబాటు ధర అందించేందుకు రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడానికి పెడతా. నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసం పెడతా. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తా. 24 గంటల్లో కోరుకున్న కార్డును అదే గ్రామం, అదే వార్డులోనే అందించేందుకు ఐదో సంతకం పెడతా. గ్రామాల్లో బెల్ట్‌షాపులను రద్దుచేసి నియోజకవర్గానికి ఒకే మద్యం దుకాణం ఉండేలా చేస్తా. అక్కడ కూడా మద్యం ముట్టుకుంటే ధర షాక్ కొట్టేలా చేస్తా.
 
 చంద్రబాబును జైల్లో పెట్టాలి..
 
 ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాను అధికారంలో ఉండగా ప్రజలను నిలువునా వంచించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను గాలికొదిలేశారు. ఇప్పుడు ఏదోలా అధికారంలోకి రావడానికి తోచిన హామీలన్నీ ఇచ్చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తా అంటున్నారు. నేనొక్కటే అడుగుతున్నా. ఇప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్న మీరు మరి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. అందుకే నోటికి వచ్చిన హామీలన్నీ గుప్పిస్తున్నారు. ఆల్‌ఫ్రీ అంటున్నారు. ప్రజలను మోసం చేయడానికి ఇటువంటి దొంగ హామీలిచ్చే చంద్రబాబును జైల్లో పెట్టాలి. కోట్లమంది ప్రజల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఒకే ఒక్కరికి వస్తుంది. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని వైఎస్ దేశానికి చూపించారు. నేను బాబులా ప్రజలకు సాధ్యం కాని హామీలివ్వను. చేసింది చెబుతా. చెప్పిందే చేస్తా.’’
 
 తరలివచ్చిన అభిమాన జనసందోహం
 విశాఖ జిల్లాలో మూడోరోజు సాగిన జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో జనాభిమానం పొంగి పొర్లింది. గురువారం ఉదయం పాయకరావుపేట నుంచి ప్రారంభమైన రోడ్ షోకు అడుగడుగునా జనం హోరెత్తారు. తగరపువలసలో సభకు జనం భారీగా హాజరవడంతో పక్కనే ఉన్న జాతీయ రహదారి సైతం కిక్కిరిసింది. ఒంగోలు టీడీపీకి చెందిన ఆర్‌కే టౌన్‌షిప్ అధినేత ఎం.కొండయ్య, కాంగ్రెస్ పార్టీ భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, పీసీసీ మాజీ సంయుక్త కార్యదర్శి వారణాసి దినేశ్‌రాజు గురువారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
 

ఫలితాలు.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే

ఫలితాలు.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో నిర్వహించేందుకు సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుమతి ఇచ్చింది. అయితే వీటి ఫలితాలను మాత్రం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరవాతే వెల్లడించాలని ఆదేశించింది. జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం గురువారం ఉదయం ఈ కేసును విచారించింది. ఈ ఎన్నికలను ఏప్రిల్ 6, 8 తేదీల్లో నిర్వహించడానికి అనుమతివ్వాలంటూ కోర్టును ఎన్నికల సంఘం కోరడం తెలిసిందే. అరుుతే 8న శ్రీరామనవమి కావటంతో మర్నాడు నిర్వహించేందుకు వీలవుతుందా? అని న్యాయమూర్తులు బుధవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. గురువారం కేసు తిరిగి విచారణకు రాగా.. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, ఫలితాలు 13న విడుదల చేస్తామని ఎన్నికల సంఘంవిన్నవించింది.
 
జస్టిస్ గోపాలగౌడ స్పందిస్తూ ‘ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేదా?’ అని ప్రశ్నించారు. జస్టిస్ జ్ఞానసుధామిశ్రా జోక్యం చేసుకుని ‘ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు ఎప్పుడు?’ అని ప్రశ్నించారు. ఏప్రిల్ 30, మే 7వ తేదీల్లో ఉన్నాయని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మనోజ్ సక్సేనా చెప్పారు. స్థానిక ఎన్నికల జాప్యంపై సుప్రీంకోర్టులో కేసు వేసిన పిటిషనర్ ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఈ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయంటూ పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి విన్నవించడాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు... ‘స్థానిక ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున మే 7నసార్వత్రిక ఎన్నికలు ముగిశాకే ఈ ఫలితాలు ప్రకటించాలి. అలాగే ఎన్నికల సంఘం తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ చేసిన ప్రతిపాదన మేరకు ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు..’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా సాధారణ ఎన్నికల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే.. అవి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అవి తమకు ఇబ్బందికరంగా మారవచ్చని భయుపడిన పలు పార్టీలు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.  
 
 
 ఎప్పుడు ఎక్కడ నిర్వహించేదీ నేడు వెల్లడి: సుప్రీం తీర్పు నేపథ్యంలో జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను తయారు చేసింది. జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ఆధారంగా ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఒక జిల్లాలో నాలుగు డివిజన్లుంటే.. రెండు డివిజన్లకు 6న, మరో రెండు డివిజన్లకు 11న ఎన్నికలు నిర్వహిస్తారు. మూడు డివిజన్లుంటే.. 2 డివిజన్లకు ఒకరోజు, ఒక డివి జన్‌కు రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వర్గాలు తెలియజేశాయి. ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేదీ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఎన్నికల ఫలితాలను మే 9-15 తేదీల మధ్యలో ప్రకటించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఫలితాలు ఆలస్యం కానున్న నేపథ్యంలో మండల, జెడ్పీ చైర్‌పర్సన్‌ల ఎన్నిక షెడ్యూల్ కూడా మారనుంది.

బాబు+రామోజీ= 1000 అబద్ధాలు


బాబు+రామోజీ= 1000 అబద్ధాలు
 *    ఎన్నికలు వచ్చినప్పుడల్లా రామోజీకి టీడీపీ పూనకం
 *    బాబును గద్దెనెక్కించడమే ఏకైక లక్ష్యంగా రాతలు
 *    ‘ఈనాడు’ నైజానికి అద్దం పట్టిన 2004, 2009 ఎన్నికలు
 *    గెలుపు టీడీపీదేనంటూ గుడ్డి రాతలు.. వైఎస్‌పై విషం
 *    ప్రజాభిప్రాయూన్నీ తానే నిర్దేశించాలనే నియుంత నైజం
 *    ఎన్నికల వేళ మరోసారి పదునెక్కుతున్న ‘పచ్చ’ రాతలు
 
ఎలక్షన్ సెల్: పున్నమికి, అమావాస్యకు కొందరికి పిచ్చి ప్రకోపిస్తుంటుంది. ఎన్నికల వేళ ‘ఈనాడు’ రామోజీరావు కూడా రాత్రింబవళ్లూ అచ్చంగా అటువంటి మానసిక స్థితిలోనే మునిగి తేలుతుంటారు. ఎక్కడ లేని ఉన్మాదమూ ఆయనను ఆపాదమస్తకం ఆవహిస్తుంటుంది. ప్రచార వేడితో పాటే అది కాస్తా పెరిగి పరాకాష్టకు చేరుతుంది. ఇక పోలింగ్ తేదీకల్లా రాజగురువు ముసుగు కొద్ది కొద్దిగా తొలగిపోయి, ఆయన లోపలి బాబు అన్ని ముసు గులూ తొలగించుకుని రెండు వేళ్ల చిహ్నం చూపుతూ బయటికొచ్చేస్తాడు. తన తాబే దారు బాబుకు అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా తన పత్రికకు పూర్తిగా పసుపు రంగు పులిమి ప్రజల మీదికి వదులుతుంటారు రామోజీ. పతాక శీర్షిక నుంచి మొదలు పెట్టి ప్రతి పేజీలోనూ టీడీపీని, చంద్రబాబును ఆకాశానికెత్తడం, ఇతరులను వీలైనంతగా అణగదొక్కడమే ‘ఈనాడు’కు సింగిల్ పాయింట్ అజెండాగా మారిపోతుంది.
 
 వైఎస్‌పై, ఆయన వారసునిపై పేజీల నిండా విషం కక్కుతూ రామోజీ విషపుత్రిక పేట్రేగిపోతుంది. నగరానికి దూరంగా కట్టుకున్న కోటలో జనానికి సుదూరంగా బతుకుతూ కూడా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తానే నిర్దేశించాలన్న రామోజీ తాపత్రయం దాని రాతల్లో అడుగడుగునా ప్రతి ఫలిస్తుంటుంది. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలు ఈ ధోరణికి తిరుగులేని సాక్షిగా నిలిచాయి. ఆ రెండు దఫాలూ ప్రజలు టీడీపీకి కర్రుగాల్చి వాత పెట్టినా, తద్వారా రామోజీ రోత రాతలనూ నిర్ద్వంద్వంగా తిరస్కరిం చినా ‘ఈనాడు’ తీరు ఏ మాత్రమూ మారలేదు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో మరోసారి ‘పచ్చ’ రాతలకు పదును పెడుతోంది. తన టీడీపీ పక్షపాతాన్ని పేజీ పేజీలోనూ నిస్సిగ్గుగా ప్రదర్శించుకుంటోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అక్షరాలా విషం చిమ్ముతూ పాత తరహా కుహకానికి మరోసారి సరికొత్తగా తెర తీస్తోంది. కుక్క తోక ఎప్పుడూ వంకరేనని ఇంకోసారి రుజువు చేస్తోంది...
 
 2004లో నిస్సిగ్గుగా ‘చంద్రహాసం’
 2004 ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతటా కాంగ్రెస్ హవా కొట్టొచ్చినట్టు కన్పించింది. వైఎస్ సారథ్యంలో ఘన విజయం ఖాయమని సర్వేలు, ఎన్డీటీవీ వంటి జాతీయ మీడియా సంస్థలు ముక్త కంఠంతో చెప్పాయి. అయినా సరే... జనం నాడిని ఇట్టే పట్టేస్తానని గొప్పలు చెప్పుకునే రామోజీకి మాత్రం అవేవీ ‘కన్పించలేదు’. బాబు తొమ్మిదేళ్ల పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్న వైనం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నా ‘ఈనాడు’ మాత్రం కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి కూడా సిగ్గు పడేలా ప్రవర్తించింది. బాబుకే మళ్లీ అధికారమంటూ ఉన్మాదంతో ఊగిపోయింది. ఊరూపేరూ లేని తాబేదారు సంస్థలతో సర్వేలు చేయించి, వాటి ఫలితాలను సరిగ్గా తొలి, మలి దశ పోలింగ్ వేళల్లో పతాక కథనాలుగా వండి వార్చింది. ‘బాబుకే మళ్లీ అధికారం’ అంటూ తొలి దశకు ముందు, ‘తెలుగుదేశానికే మళ్లీ పగ్గాలు’ అంటూ మలి దశ సందర్భంగా ఊదరగొట్టింది. ‘ఇంకేముంది... టీడీపీయే దుమ్ము రేపనుంది’ అంటూ పేట్రేగిపోయింది.
 
 వీటన్నింటినీ మించి... కౌంటింగ్ కూడా జరగకముందే, టీడీపీ గెలిచేసిందంటూ ముందస్తుగానే ఏకంగా ప్రత్యేక సంచికను ముద్రించిందంటే అప్పట్లో రామోజీ పైత్యం ఎంతగా ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘చంద్రహాసం’ పేరుతో ఎనిమిది పేజీల ప్రత్యేక అనుబంధాన్నే సిద్ధం చేసి పెట్టుకుంది ‘ఈనాడు’. నిజానికి రాష్ట్రమంతటా హస్తం హవా వీస్తోందని, తానెంతగా తిమ్మిని బమ్మి చేయజూసినా చంద్రబాబు గెలుపు ముఖం చూసే సమస్యే లేదని రామోజీకి బాగా తెలుసు. ఆ ఫలితాలు వెల్లడైన రోజు ఎటూ అవకాశముండదు గనుక ముందుగానే ‘డమ్మీ’ పేజీలు వేసుకుని మిథ్యానందం పొందారు రాజగురువు! తీరా వైఎస్ మ్యాజిక్ ముందు బాబు బోల్తా పడి, టీడీపీ మట్టికరవడంతో ‘చంద్రహాసం’ చెత్తనంతా వుూటకట్టి దాచేసి, చేసి తేలు కుట్టిన దొంగలా గప్‌చుప్ అయిపోయారు.
2004 ఎన్నికల సందర్భంగా సర్వేల సాకుతో ‘ఈనాడు’ వేసిన ‘పచ్చ’ వేషాలకు ఈ క్లిప్పింగులు వురో నిదర్శనం. ఊరూ పేరూ లేని సర్వేలను ఉటంకిస్తూ, ‘బాబుకే వుళ్లీ అధికారం’, ‘తెలుగుదేశానికే వుళ్లీ పగ్గాలు’, ‘తదుపరి వుుఖ్యవుంత్రిగా చంద్రబాబే ఉండాలని ఏకంగా 62 శాతం వుంది భావిస్తున్నారు’ అంటూ గాలి పోగేసి తృప్తి పడింది ‘ఈనాడు’.

 2009లో ‘మహా’ పైత్యం

 ఇక 2009 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ‘ఈనాడు’ రాసిన రాతలు, వేసిన వేషాలు, చేసిన విష ప్రచారాలను చూస్తే అంత గొప్ప గోబెల్స్ కూడా గింగిరాలు తిరగాల్సిందే. సంక్షేమానికి చిరునామాలా సాగిన వైఎస్ ఐదేళ్ల పాలనను చూసి ఎన్నికలకు ఎంతో ముందుగానే జావగారిపోయిన టీడీపీని రామోజీ నెత్తికెత్తుకున్న తీరు ఎంత చెప్పినా తరిగేది కాదు. ‘పాంచజన్యం’ పేరుతో ఏకంగా రోజుకు ఎనిమిది పేజీల చొప్పున నెలన్నరకు పైగా వైఎస్‌పై అక్షరాలా విషం చిమ్మింది ‘ఈనాడు’. ఒకే ఒక్కడిలా నిలిచిన ఆయనను ఒంటరిగా ఎదుర్కోలేక టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలతో కలిసి టీడీపీ ఏర్పాటు చేసిన మహా కూటమి మహాద్భుతమే చేయబోతోందంటూ మిడిమిడి రాతలు రాసింది. నిజానికి నిత్య కుమ్ములాటలతో, రోజుకో రకం రగడతో అప్పట్లో ఆ కలహాల కూటమి ప్రజలకు నిత్యం వినోదం పంచిన తీరు అందరి మనసుల్లోనూ ఇంకా తాజాగానే ఉంది. అసలు ఆ పార్టీల సారథులు కేసీఆర్, బీవీ రాఘవులు, కె.నారాయణలతో సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికే బాబుకు తల ప్రాణం తోకకు వచ్చింది.
 
  పెపైచ్చు టీఆర్‌ఎస్‌కు కేటాయించిన పలు స్థానాల్లో టీడీపీ నేతలకు బీ ఫారాలిచ్చి మరీ బాబు బరిలో దింపారు. దాంతో రెండు పార్టీల నేతలూ నిత్యం నోటికొచ్చినట్టల్లా తిట్టిపోసుకుంటూనే గడిపారు. అయినా సరే, ‘ఈనాడు’ కంటికి వూత్రం అదంతా ‘ఎలాంటి పొరపొచ్చాలు, వివాదాలు లేని మైత్రి’గానే కన్పించింది. ఆ మాయా కూటమి బ్రహ్మాండం బద్దలు కొట్టబోతోందంటూ రెచ్చిపోయింది. తొలి విడత పోలింగ్‌కు ముందు ‘మహా స్వీప్’ అంటూ పతాక కథనాన్ని వండి వార్చింది. తొలి విడత పోలింగ్ జరిగిన మర్నాడేమో ‘మహా తడాఖా’ అంటూ జోస్యుని అవతారమెత్తింది. తెలంగాణ, ఉత్తరాంధ్రల్లో జరిగిన ఆ పోలింగ్‌లో ప్రజలంతా మహా కూటమికే గుండుగుత్తగా గుద్దేశారంటూ కౌంటింగ్ వగైరాలతో పని లేకుండానే తానే ప్రజా తీర్పును ప్రకటించేసింది! పైగా... తొలి విడత దెబ్బకు, మరో వారం తర్వాత జరగాల్సిన మలి విడతలోనూ కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేనంటూ తన దింపుడుకల్లం ఆశలనే విశ్లేషణలుగా అచ్చొత్తి తృప్తి పడింది. తీరా ఫలితాలొచ్చాక చూస్తే షరామామూలుగా టీడీపీ బొక్క బోర్లా పడింది. తాను మునగడమే గాక తనతో జట్టు కట్టిన పాపానికి టీఆర్‌ఎస్‌నూ, లెఫ్ట్ పార్టీలనూ ముంచేసింది. రాష్ట్ర ప్రజలు వైఎస్‌కే మరోసారి పట్టం కట్టారు. తద్వారా రామోజీకి పలుగు రాళ్లతో నలుగు పెట్టారు.
 
 అచ్చొత్తిన అసత్యాలు
 2004 మేలో, అప్పటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక వుుందే ‘చంద్రహాసం’ పేరుతో ‘ఈనాడు’ ప్రచురించిన పత్రిక ఇది. టీడీపీ గెలిచేసిందంటూ ‘కథనాలు’, విశ్లేషణలతో ఏకంగా 8 పేజీలను పక్కాగా వండి వార్చేశారు! వైఎస్ వెల్లువతో టీడీపీ కొట్టుకుపోవడంతో ‘చంద్రహాసం’ వెలుగు చూడలేదు. దాని ప్రతిని 2009 ఏప్రిల్ 21న మీడియూ వుుందు బయుట పెడుతున్న అప్పటి ఆర్థిక వుంత్రి కె.రోశయ్యును కింది క్లిప్పింగ్‌లో చూడవచ్చు.
 
 2009లో ఇలా..
 వైఎస్ లెక్క తప్పుతోందంటూ 2009 ఎన్నికల వేళ పోలింగ్‌కు వుుందు ‘ఈనాడు’ వండిన వంటకమిది. తెలంగాణలో వుహా కూటమి, కోస్తాలో ప్రజారాజ్యం పార్టీ వైఎస్‌ను దెబ్బ తీయునున్నాయుని, రాయులసీవులోనే ఆయునకు ఎదురుగాలి వీస్తోందని రాసుకుని తృప్తి పడింది!
 
2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్, వావుపక్షాల కలరుుకతో పుట్టిన వుహా కూటమి భారీ విజయుం సాధించడం ఖాయువుంటూ ‘వుహా స్వీప్’ శీర్షికన తొలి విడతకు వుుందు ‘ఈనాడు’ వండిన కథనం, కూటమి దున్నేసిందంటూ పోలింగ్ వుర్నాడు ‘వుహా తడాఖా’ శీర్షికన అది చెప్పిన చిలక జోస్యం తాలూకు క్లిప్పింగులివి.

బాబు డైరీ: ఆసరా అంతంతే..

బాబు డైరీ: ఆసరా అంతంతే..
ఇదీ తేడా!
*  మైనార్టీలకు కేవలం రూ.32కోట్ల బడ్జెట్ కేటాయించారు.
*  మైనార్టీ విద్యార్థులు ఇంటర్ విద్యను పూర్తి చేసిన అనంతరం పై చదువుల కోసం రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణాలు అందించేవారు.
*  దుకాన్-మకాన్ స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, ఇళ్ల నిర్మాణానికి 3 శాతం వడ్డీతో రుణాల పంపిణీ
*     వితంతువులు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు  3 శాతం వడ్డీతో రూ.పది వేల రుణాలు.
*     రోష్నీ పథకం ద్వారా వృత్తి పనివారికి 20 శాతం సబ్సీడీతో బ్యాంకు రుణాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ
*     మైనార్టీ పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థికసాయం
 
 కిరణ్ హయాం
*     మైనార్టీల కోసం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచారు.
*     మైనార్టీల బడ్జెట్‌ను రూ.1027 కోట్లకు పెంచారే కానీ  2014 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ  40 శాతం కూడా ఖర్చు చేయలేదు.
*     ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం గత ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ ఇవ్వలేదు.
*     మాస్ మ్యారేజెస్ పథకాన్ని నీరుగార్చారు. సబ్సిడీ రుణాలదీ ఇదే స్థితి.

 వైఎస్ హయాం

 *    బడ్జెట్ రూ. 350 కోట్ల వరకు పెంపుదల
 *    పేద ముస్లింలకు రుణ మాఫీ
 *    అర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రూ.30 వేల చొప్పున సబ్సిడీ రుణాలు
 *    డోమువా పథకం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో నివసించే పేద ముస్లిం మహిళలకు సబ్సిడీ రుణాలు
 *    నేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్ పథకం ద్వారా ముస్లిం పిల్లలకు విద్యా రుణాలు
*    స్కాలర్‌షిప్ పథకం ద్వారా ప్రతి ఏటా 3 లక్షల మంది ముస్లిం పిల్లలు విద్యావంతులవుతున్నారు.
*    ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి 4 శాతం  రిజర్వేషన్ల కల్పన. దీనివల్ల లక్షల మంది విద్య, ఉపాధి రంగాల్లో  రాణిస్తున్నారు.  వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎదిగాయి.
 *    ముస్లిం పేద అమ్మాయిల కోసం మాస్ మ్యారేజెస్ (సామూహిక వివాహాల) పథకాన్ని ప్రవేశ పెట్టారు.
 *    కుటుంబ వార్షికాదాయం రూ. 80 వేల కంటే తక్కువగా ఉన్నవారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.30 వేల నుంచి రూ.లక్ష  వరకు సబ్సిడీ రుణాల పంపిణీ
*    దీపం పథకం ద్వారా ముస్లిం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
 *    రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు కోసం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా ప్రత్యేక నిధుల కేటాయింపు.
*    మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఓపెన్ స్కూల్స్ ఏర్పాటు.
*   మదర్సాల్లో చదివే విద్యార్థుల కోసం కంప్యూటర్ల ఏర్పాటు
*   యువతకు ఐటీ,వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాల కల్పన.
 
నాకు పునర్జన్మ లభించింది
 ఐస్‌ఫ్రూట్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అనుకోకుండా 2010 సంవత్సరంలో గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గుండె శస్త్ర చికిత్స చేయాల్సిందేనని డాక్టర్‌లు చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన నా దగ్గర డబ్బులేని దుస్థితి. అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉండడంతో వెంటనే మలక్‌పేట్ యశోదా ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేశారు. నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆస్పత్రిలో ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇంటికి వచ్చేందుకు బస్సు చార్జీలు సైతం ఇచ్చారు. మళ్లీ ఏడాది కాలం పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు..వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారానే నాకు పునర్జన్మ లభించింది..
 - మహమ్మద్ ఫజలుద్దీన్, జిరాయత్‌నగర్,
 ఆర్మూర్ మండలం,నిజామాబాద్ జిల్లా

Popular Posts

Topics :