08 April 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఉప ఎన్నికల నియోజకవర్గాలకు నిధుల వరద

Written By news on Saturday, April 14, 2012 | 4/14/2012

హైదరాబాద్: త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చింది. తలచిందే తడవుగా ఈ నియోజకవర్గాలకు భారీగా నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు రోజు అని కూడా చూడకుండా 6 నియోజకవర్గాలకుసీఎం ఫండ్ నుంచిఏకంగా రూ. 30 కోట్లు విడుదలచేసింది. ఒంగోలుకు రూ. 6 కోట్లు, రాయదుర్గంకు రూ. 6 కోట్లు పరకాలకు రూ. 5 కోట్లు, రాయచోటికి రూ. 4.44 కోట్లు, నర్సాపురానికి రూ. 4.20 కోట్ల నిధులు కేటాయించింది.

Congress party cheap politics in Ongole

నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటాం: సాయిరెడ్డి


హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం అత్యంత పారదర్శకమని, ఈ వ్యవహారంపై నమోదు చేసిన కేసులో తామంతా నిర్ధోషులుగా బయటకు వస్తామనే ధృడసంకల్పం ఉందని ఆడిటర్ వేణుంబాకం విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో 103 రోజుల జైలు జీవితం తర్వాత సాయిరెడ్డి విడుదలయ్యారు. శనివారం ఆయన నివాసం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై తనకు

విశ్వాసం ఉందని, తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటామని తెలిపారు. జైలు జీవితం బయట అనుకున్నంత సంతోషకరంగా ఉండదని, జెలు జీవితం చాలా కష్టంగా, దుర్భరంగా ఉంటుందని, జైలుకు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. బెయిల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

10 రోజుల్లో ఉప ఎన్నికల షెడ్యూల్: ఇసి బ్రహ్మ

న్యూఢిల్లీ: దేశంలో ఖాళీగా ఉన్న అన్ని పార్లమెంట్, శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ చెప్పారు. పది రోజులలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మన రాష్ట్రంలోని 18 స్థానాలకు కూడా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

Face to face with Vijay Sai Reddy - NTv

Vijay Sai Reddy met YS Jagan

YS Jagan pays tribute to Ambedkar

జగన్ తో సమావేశమైన విజయ సాయిరెడ్డి

హైదరాబాద్ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి శనివారం లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన నిన్న బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జైలు జీవితము కష్టమేనని అన్నారు. బెయిల్ ఇచ్చినందకు ఆయన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.

సీబీఐ తన బాధ్యత తాను నెరవేరుస్తుందని అన్నారు. జైలు అధికారులు తనను విడుదల చేసినప్పుడు నిబంధనలు అతిక్రమించలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. సమయం మించిన తర్వాత తనను విడుదల చేశారనటం అవాస్తవమన్నారు.

శ్రీనివాసులు, అమరనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిల పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం

 వైఎస్సార్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అమరనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలకు గన్‌మెన్లను సమకూర్చాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. భద్రతా సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పోలీసుశాఖ తమ గన్‌మెన్లను తొలగించిందని ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు హైకోర్టుకు నివేదించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని కోర్టుకు తెలిపారు. తాము మళ్లీ జనంలోకి వెళ్లి ప్రజాతీర్పును కోరాల్సిన పరిస్థితుల్లో గన్‌మెన్లను ఉపసంహరించడం వల్ల స్వేచ్ఛగా తిరగలేమని, ఇది తమ హక్కులను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వారికి గన్‌మెన్లను పునరుద్ధరించాలని ఆదేశించారు. అయితే గన్‌మెన్ల ఖర్చును మాత్రం మాజీ ఎమ్మెల్యేలే భరించాలని, వారి భద్రతకు ఎలాంటి ముప్పులేదని భావించేంతవరకు గన్‌మెన్లను ఉపసంహరించవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బాబుకు భజన చేస్తున్న కిరణ్


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రజా సమస్యలు గాలికొదిలేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు భజన చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. బాబు హయాంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని అవకతవకలు బయటకు రాకుండా సీఎం అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో చేసుకున్న ఒప్పందం మూలంగానే మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. కుట్ర, కుమ్మక్కు రాజకీయాల కోసం ప్రజలు ఏమైనా ఫర్వాలేదన్నట్లుగా సీఎం కిరణ్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘చంద్రబాబు హయాం 1997లో విద్యుత్ కొనుగోలు విషయంలో స్పెక్ట్రం పవర్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పదం వల్ల ట్రాన్స్‌కో దాదాపు రూ.300 కోట్లు నష్టపోయింది. నిర్మాణం విషయంలో మూలధనం ఎక్కువ చేసి చూపినందువల్ల చంద్రబాబుకు, టీడీపీ నేతలకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రమోటర్ల మధ్య వచ్చిన భేదాభిప్రాయంవల్ల ఈ అవకతవకలు బయటకొచ్చాయి. 

దీనికి సంబంధించి ఒక ప్రమోటర్ ఆధారాలతో సహా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీసీఐడీ విచారణకు ఇవ్వాల్సిందిగా ట్రాన్స్‌కోకు ఆదేశించారు. బాబు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అనేక లొసుగులున్నాయని, ట్రాన్స్‌కో అనేక ఆధారాలు సమర్పించింది. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడుతున్న కేసు పురోగతి సాధించకుండా సీఎం కిరణ్ మోకాలడ్డటం సిగ్గుచేటు’’ అని దుయ్యబట్టారు. ‘‘విద్యుత్ చార్జీల పెంపును సమర్థించుకుంటూ... ట్రాన్స్‌కో తీవ్ర సంక్షోభంలో ఉందంటూ సీఎం ఉపన్యాసాలిస్తున్నారు. చంద్రబాబు కారణంగా ట్రాన్స్‌కో ప్రతి నెల అదనంగా రూ. 2 కోట్లు చెల్లిస్తున్నా పట్టించుకోరు. ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే ఆలోచన చేయకుండా... కేసును మూసేయాలని సీబీసీఐడీ సంస్థను ఆదేశించడం సిగ్గుమాలిన చర్య. ఇదంతా కాంగ్రెస్-టీడీపీల కుమ్మక్కుకు నిదర్శనం కాదా?’’ అని ఆమె నిలదీశారు. ఒకరి తప్పుల్ని ఒకరు కప్పిపుచ్చుకుంటూ చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు కలిసి ఆడుతున్న నాటకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తుందని, అదే విధంగా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తుందని పద్మ తెలిపారు.

సీబీఐ తీరు, సాయిరెడ్డి అరెస్టుపై న్యాయనిపుణుల విశ్లేషణ

అరెస్ట్ చేయటానికి ముందే రోజుల తరబడి విచారించిన సీబీఐ 
విచారణకు అన్ని విధాలా సాయిరెడ్డి సహకరించినా అరెస్ట్ 
3 నెలల్లో చార్జిషీట్ దాఖలు చేసినా.. ఆధారాల కంటే ఆరోపణలే ఎక్కువ 
టీడీపీ ఆరోపణలు, శంకర్రావు లేఖల్లో రాసిందే చార్జిషీట్‌లో పేర్కొన్న వైనం 
రూ. 16 కోట్ల లబ్ధికి ప్రతిఫలంగా రూ. 30 కోట్లు పెట్టుబడి పెట్టారంటూ వితండ వాదన 
ఎనిమిది నెలల పాటు దర్యాప్తు చేసినా... ఇంకా ఉందంటూ కప్పదాట్లు 
సీబీఐ తీరుపై ప్రత్యేక కోర్టు అసహనం.. దర్యాప్తుపై ప్రశ్నల వర్షం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు సీబీఐ ఎనిమిది నెలల కిందటే విచారణ ప్రారంభించినా ఇంకా సాగదీయటం వెనుక రాజకీయ కక్షసాధింపు కనిపిస్తోందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దానిలో భాగంగానే అరెస్ట్ చేసి మూడు నెలలు దాటిపోయినా ఆడిటర్ విజయసాయిరెడ్డిని మరింత కాలం జైలులో ఉంచేందుకు కావాలనే కాలయాపన చేస్తోందని వారు అంటున్నారు. సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి తన తీర్పులోనూ ఈ అంశాలనే ప్రస్తావించటం గమనార్హం. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు లింకు పెట్టేందుకు సీబీఐ చేయని ప్రయత్నం లేదు. పెట్టుబడిదారులు మొదలు, ఆయా కంపెనీల అధికారులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలకు దిగింది. పెట్టుబడులకు సంబంధించి జగతి పబ్లికేషన్స్‌తో పాటు, ఆయా కంపెనీలు పూర్తి సమాచారం అందించాయి. జగతి పెట్టుబడులు పూర్తి పారదర్శకమని, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి వారికి వివరించారు. 

కేసులో దర్యాప్తు ప్రారంభించిన తరువాత సీబీఐ అధికారులు సాయిరెడ్డిని 300 గంటల పాటు విచారించారు. విచారణకు ఆయన పూర్తి స్థాయిలో సహకరించినా కానీ అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తరువాత కూడా ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. తీరా మూడు నెలల గడువు పూర్తయ్యేలోగా చార్జిషీట్ దాఖలు చేసినా అది అసంపూర్తిగానే ఉంది. దర్యాప్తు పూర్తి కాలేదని చెప్పటానికే సీబీఐ ఈ నాటకమాడుతోందని న్యాయనిపుణులే వ్యాఖ్యానిస్తున్నారు. ‘దేశ ద్రోహానికి సంబంధించినదో లేదా తీవ్రవాద కార్యకలాపాల్లో అయితే దొరికిన ఆధారాలను బట్టి చార్జిషీట్‌లు దాఖలు చేస్తారు. కానీ, ఈ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ కక్ష సాధింపు ధోరణికి అద్దం పడుతోంది’ అని సీనియర్ న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. అరబిందో, హెటిరో కంపెనీలు జగతి పబ్లికేషన్స్‌లో రూ. 30 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఈ రెండు అంతర్జాతీయ ఫార్మసీ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 16 కోట్ల మేర రాయితీ ఇచ్చిందన్నది సీబీఐ, తెలుగుదేశం పార్టీల ఆరోపణ. దీనినే కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు తాను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎనిమిది నెలల అనంతరం కూడా సీబీఐ ఈ ఆరోపణలనే చార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఆధారాలు లేకుండానే ఆరోపణలతో సరిపుచ్చింది. అంతటితో ఆగకుండా తదుపరి దర్యాప్తుకు అనుమతించాలంటూ ఆ వెంటనే కోర్టులో మెమో దాఖలు చేసింది. సాయిరెడ్డిని అరెస్టు చేసిన తరువాత మూడు నెలలు, అంతకు ముందు ఐదు నెలల నుంచి సీబీఐ విచారణ సాగిస్తూ వచ్చింది. ఈ విచారణ తంతును చివరకు సీబీఐ కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పెట్టుబడుల వివరాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందా అని సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తు తీరుపై న్యాయమూర్తి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు తీరుపై ఆయన సీబీఐకి ప్రశ్నలు సంధించారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సీబీఐ వైపు నుంచి సరైన సమాధానం రాలేదు.

సీబీఐకి న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలు ఇవీ...

వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా భూకేటాయింపులు, ఇతర ప్రయోజనాలు కల్పించిందని ఆరోపిస్తున్నారు... వీటికి సంబంధించిన అన్ని జీవోలు అందుబాటులో ఉన్నాయి. లబ్ధిపొందిన కంపెనీలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వివరాలు తెలుసుకదా. అలాంటప్పుడు సీబీఐ ఇంకా దర్యాప్తులో తేల్చేది ఏముంటుంది? వైఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటున్నారు ? కుట్ర ఒక్కటే అయినప్పుడు వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉందా? 

జగన్‌ను ఎన్ని చార్జిషీట్లలో నిందితునిగా చేరుస్తారు? ఇంకా ఎన్ని చార్జిషీట్లు పెడతారు? 12 లేదా 13 దాఖలు చేస్తారా? 4 లేదా 5 దాఖలు చేస్తారా? ఒకే నేరానికి ఎన్ని శిక్షలు ఉంటాయి? వేర్వేరుగా కుట్ర జరిగిందని చెప్తూ అనేక చార్జిషీట్లు దాఖలు చేయటానికి చట్టం అనుమతిస్తుందా? 

ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నప్పుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మొదటి నిందితునిగా పెడుతూ చార్జిషీట్ ఎందుకు దాఖలు చేశారు? విచారణ పూర్తయిందని ఒకవైపు చెప్తూ మరోవైపు ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు? జీవోలు, పెట్టుబడిదారుల వివరాలు పూర్తిగా అందుబాటులో ఉన్నప్పుడు ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఉందా? ఈ కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుంది? నిర్ణీత గడువు చెప్పగలరా? 

సాయిరెడ్డి విడుదలను 16 వరకు ఆపాలని కోరిన సీబీఐ.. తిరస్కరించిన సీబీఐ ప్రత్యేక కోర్టుషరతులతో కూడిన బెయిల్ మంజూరు.. విడుదల
బెయిల్‌ను అడ్డుకునేందుకే సీబీఐ చార్జిషీట్: కోర్టు వ్యాఖ్య
74 మంది నిందితుల్లో 13 మంది పైనే చార్జిషీట్ వేశారు
13 మందిలో ఒక్కరినే జైలులో పెట్టాల్సిన అవసరమేముంది?
అరెస్టు చేసి 90 రోజులు పూర్తయింది కాబట్టి బెయిల్‌కు అర్హుడే
ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి
సాయిరెడ్డి విడుదలను 16 వరకు ఆపాలని కోరిన సీబీఐ..
తిరస్కరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో రెండో నిందితునిగా ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ను అడ్డుకునేందుకే 74 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో కేవలం 13 మందిపై మాత్రమే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సీబీఐ ఇటీవల కోర్టుకు సమర్పించిన మొదటి చార్జిషీట్‌లో 13 మందిని నిందితులుగా పేర్కొన్నా అందులో విజయసాయిరెడ్డి ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని, ఆయన్ను అరెస్టు చేసి ఇప్పటికే 90 రోజులు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ పొందేందుకు అర్హుడని న్యాయమూర్తి తన తీర్పులో అభిప్రాయపడ్డారు. సాయిరెడ్డిని విడిచిపెడితే దర్యాప్తును అడ్డుకుంటారన్న సీబీఐ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ కేసులో సాయిరెడ్డి రెండో నిందితుడు మాత్రమేనని, ఇందులో ఇతర నిందితులను సీబీఐ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.

ఈ కేసులో ఇతర నిందితులు కూడా బలవంతులేనని, వారు దర్యాప్తును అడ్డుకోలేనప్పుడు సాయిరెడ్డి మాత్రమే అడ్డుకుంటారన్న వాదన సరైంది కాదని స్పష్టంచేశారు. దర్యాప్తులో జాప్యం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సాయిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి నాగమారుతి శర్మ తన తీర్పులో స్పష్టం చేశారు. రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించటంతో పాటు పాస్‌పోర్టు అప్పగించి బెయిల్ పొందాలని షరతు విధించారు. అలాగే అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సీబీఐ దర్యాప్తుకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సాయిరెడ్డిని ఆదేశించారు. పూచీకత్తు బాండ్లతోపాటు పాస్‌పోర్టును సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి వెంటనే కోర్టుకు సమర్పించారు. దీంతో సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే.. బెయిల్ మంజూరు చేయటాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని.. కాబట్టి సోమవారం (16వ తేదీ) వరకూ సాయిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయకుండా ఆపాలని సీబీఐ మెమో దాఖలు చేసింది. దీనిని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. కోర్టు సిబ్బంది బెయిల్ ఆర్డర్ కాపీలను రాత్రి 7 గంటలకు చంచల్‌గూడ జైలు అధికారులకు అందచేశారు. దీంతో.. జనవరి 2వ తేదీ నుంచి జైలులో విచారణ ఖైదీగా వున్న విజయసాయిరెడ్డి శుక్రవారం రాత్రి 7.45 గంటలకు విడుదలయ్యారు. మీడియా ప్రతినిధులు ఆయనను మాట్లాడించాలని ప్రయత్నించినప్పటికీ అప్పటికే జైలు ప్రధాన ద్వారం ముందు ఆగిన వాహనంలో సాయిరెడ్డి న్యాయవాదులతో కలిసి వెళ్ళిపోయారు.

సాక్ష్యాలు లేకున్నా అరెస్టు చేశారు: సుశీల్‌కుమార్ వాదన

అంతకుముందు విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ సందర్భంగా.. ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. 2007 తర్వాత జగన్ కంపెనీలతో సాయిరెడ్డికి సంబంధమే లేదని, పెట్టుబడుల వ్యవహారాల్లో ఆయన పాత్ర లేదని కోర్టుకు తెలిపారు. జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో సాయిరెడ్డి పాత్రకు సంబంధించి సీబీఐ ఎటువంటి సాక్ష్యాలను సేకరించిందో తమకు తెలియదని, కీలక సాక్ష్యాలు ఉన్నాయని మాత్రమే ప్రతి సందర్భంలో సీబీఐ వాదిస్తోందని చెప్పారు. విచారణ పేరుతో ఎంత కాలం ఆయన్ను జైల్లో పెడతారని, దర్యాప్తు పూర్తి కావటానికి రెండేళ్లు పడితే అంత కాలం ఆయన్ను జైల్లో ఉంచాల్సిందేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఆరుగురు మంత్రులు, 14 మంది ఐఏఎస్ అధికారులకు పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నా.. ఈ కేసును ఏడు నెలలుగా విచారిస్తున్న సీబీఐ సాయిరెడ్డిని మినహా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. ‘‘సాయిరెడ్డి తమ నుంచి బలవంతంగా డబ్బు తీసుకున్నారని ఎవరైనా సీబీఐకి ఫిర్యాదు చేశారా? కంపెనీల నుంచి వచ్చిన డబ్బును జగన్ కంపెనీల్లో పెట్టించారని మాత్రమే సాయిరెడ్డిపై సీబీఐ ఆరోపించింది.

కుట్రతో సంబంధమేలేని సాయిరెడ్డి ఎంత కాలం జైల్లో ఉండాలి? అవసరం లేకపోయినా ఆయన్ను జైల్లో ఉంచి ఆయన హక్కులను హరిస్తున్నారు. సాయిరెడ్డిని అరెస్టు చేసి ఇప్పటికి 100 రోజులు పూర్తయ్యింది. ఎంత కాలం ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను సీబీఐ హరిస్తుంది? జగన్ కంపెనీల్లోకి రూ. 1,246 కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయని పేర్కొన్న సీబీఐ.. చార్జిషీట్‌లో కేవలం రూ. 19 కోట్లకు సంబంధించి మాత్రమే ప్రస్తావించింది. రూ. 1,246 కోట్లకు సంబంధించిన దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయటానికి సీబీఐకి ఏళ్ల సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. దర్యాప్తులో కొత్త విషయాలు, కొత్త వ్యక్తులకు సంబంధించిన పాత్ర ఉన్నప్పుడే దర్యాప్తు కొనసాగించేందుకు కోర్టు అనుమతించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. దురుద్దేశపూరితంగా సీబీఐ అసంపూర్తి ఛార్జిషీట్ దాఖలు చేసిందని వాదనలు వినిపించారు. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తూ సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.

జగన్ పర్యటనలో మార్పు

హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్పంగా మార్పులు జరిగాయి. జగన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. ఈ నెల 14 నుంచి చేపట్టాల్సిన పర్యటన 15వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, బెయిల్‌పై విడుదలైన ఆడిటర్ విజయసాయిరెడ్డిని శనివారం జగన్‌మోహన్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కలవనున్నారు.

వైఎస్‌ ఫోటోతో పరకాలలో గెలుస్తా: కొండా సురేఖ

Written By news on Friday, April 13, 2012 | 4/13/2012

వరంగల్‌: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోతోనే ఉపఎన్నికలకు వెళ్లడమే కాకుండా గెలిచి చూపిస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. నమ్మిన నాయకుడు వైఎస్‌ కోసం మంత్రి పదవి నుంచి తప్పుకున్నానని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆమె తెలిపారు. సీఎంగా ఎవరుంటే పొన్నాల వారి కాళ్లు పట్టుకుంటారని, అలాంటి పొన్నాలకు తమ గురించి మాట్లాడే నైతికత లేదని సురేఖ మండిపడ్డారు. దళితుల భూములను పొన్నాల బకాసురునిలా తిన్నారని ఆమె అరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం తమ మీద కక్ష సాధిస్తోందని, అందులో భాగంగానే గన్‌మెన్లను తొలగించిందని సురేఖ మీడియాతో అన్నారు. పరకాల ప్రజలే తమని కాపాడుకుంటారని అన్నారు.

వైఎస్‌ఆర్‌ సీపీదే విజయం: జూపూడి

కృష్ణా: ముదినేపల్లి మండలం కొత్తపల్లిలో వైఎస్‌, అంబేద్కర్‌ విగ్రహాలను వైఎస్‌ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దూలం నాగేశ్వరరావు, అబ్రహం లింకన్లు పాల్గొన్నారు. మహానేత వైఎస్‌పై కాంగ్రెస్ దళిత నేతల వ్యాఖ్యలు కృతజ్ఞతారాహిత్యమని ఆయన అన్నారు. ఆనాడు పదవులు అనుభవించి నేడు దివంగత నేతపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. వైఎస్‌పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే దళిత ద్రోహులుగా మిగులుతారని ఆయన తెలిపారు. త్వరలో జరుగునున్న ఉపఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీదే విజయమని జూపూడి ప్రభాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

దళితుడైన తనను మంత్రి పదవి నుంచి తొలగించింది ఈ ప్రభుత్వమే

అమలాపురం: సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలపై మాజీ మంత్రి శంకర్రావు మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ని దళిత వ్యతిరేకి అంటే పార్టీకి దళితులందరూ దూరమౌతారని ఆయన అభిప్రాయపడ్డారు. దళితుడైన తనను మంత్రి పదవి నుంచి తొలగించింది ఈ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. సీఎం, బొత్స తీరు వల్ల విద్యావంతులు, మేథావులు, దళితులు, మైనార్టీలు పార్టీకి దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్న సీఎం, బొత్స నైతిక బాధ్యత వహిస్తూ పదవుల నుంచి తప్పుకోవాలని అమలాపురంలో మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్‌ చేశారు.

YSR Congress Leader Vasi Reddy Padma Talking To Media

బెయిల్‌పై విజయసాయిరెడ్డి విడుదల

ఆడిటర్ విజయసాయిరెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి సాయంత్రం ఏడున్నర గంటల తర్వాత విడుదలయ్యారు. జనవరి 2 తేది నుంచి విజయసాయిరెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. రిలీజ్ ఆర్డర్‌ను నాంపల్లి కోర్టు విజయసాయిరెడ్డి తరపు న్యాయవాదికి అందచేశారు. దాంతో ఆయనను చంచల్‌గూడ జైలునుంచి విడుదల చేశారు. ఆడిటర్ విజయసాయిరెడ్డికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. జనవరి రెండో తేదిన విజయసాయిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. 25 వేల ఇద్దరి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ.. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే షరతును కోర్టు విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.Vijaya Sai Reddy granted bail


Vijaya Sai Reddy


Vijaya SaiReddy, arrested in Jagan’s case, has been granted bail by Nampally CBI court on Friday. He spent 100 days in Chanchalguda jail.
Sai Reddy was granted conditional bail by the court. He was asked to surrenderhis passport and provide two sureties of Rs 25,000 each.
ఆడిటర్ విజయసాయిరెడ్డికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. జనవరి రెండో తేదిన విజయసాయిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. 25 వేల రెండు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ.. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే షరతును కోర్టు విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

BAIL sanctioned to VIJAYASAI REDDY

Today nampally highcourt  sanctioned bail to vijayasai reddy

కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరు: బాలినేని

ఒంగోలులో మంత్రులు, ఎంపీలు తిష్టవేసి. కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మరని బాలినేని తెలిపారు. హైదరాబాద్‌లో కూర్చోని మహానేత వైఎస్‌ఆర్‌ను తిడుతున్నారని, జనం దగ్గరికి వెళ్లినపుడు వైఎస్‌ఆర్ తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Discussion on YSR Congress party launches Android mobile application

గన్‌మెన్ల సౌకర్యం కల్పించండి: హైకోర్టు

తాజా మాజీ ఎమ్మెల్యేల గన్‌మెన్ల ఉపసంహరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తాజా మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్ల రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.

గన్‌మెన్లను తొలగించిన వ్యవహారంపై తాజా మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, అమరనాథ్‌రెడ్డిలు కోర్టును ఆశ్రయించారు. తాజా ఎమ్మెల్యేల ఫిర్యాదును పరిశీలించిన అనంతరం.. గన్‌మెన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Planning to Close Arogyasri

Janam Kosam Jagan


Jagan takes on Chandrababu with a mobile app


Jaganmohan Reddy
To stay in tune with Gen Next, the year-old YSR Congress Party is making all information about its activities, such as photographs and videos, accessible on a mobile phone.
The party hopes the move will help it score brownie points over the usually tech-savvy TDP chief N. Chandrababu Naidu and boost its image in the run up to the by-elections to the Lok Sahba and 18 legislative assembly constituencies, expected to be held most probably by July.
"This application will help us reach the growing number of mobile users across Andhra Pradesh, especially youth, students and smart phone users, so as to let them know the latest about the party. It will also reach NRIs from Andhra Pradesh who are eager to know about the YSRCP," said party chief Y.S. Jaganmohan Reddy when he launched the application for Android platform enabled phones at the party office in Hyderabad on Thursday.
The application can be downloaded from http://play.google.com or www.ysrcongress.mobi using any Android enabled smart phone. This is perhaps the first instance in Indian politics that a party has an official mobile application launched to reach out to its supporters.
The party's Information Technology wing member, Suresh Bomma, who is also CEO of Indsys Systems, has designed and developed this free application. His company is working on developing apps for other platforms such as iPhone, Windows, Symbian and Blackberry soon.

మొబైల్‌లో వైఎస్సార్ సీపీ సమాచారంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్‌లో తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన ‘ఆండ్రాయిడ్ అప్లికేషన్’ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన నివాసంలో ప్రారంభించారు. ‘ఇండిస్ సిస్టమ్స్’ సంస్థ సీఈఓ బొమ్మా సురేష్‌రెడ్డి రూపొందించిన ఈ అప్లికేషన్స్ వల్ల పార్టీ కార్య
క్రమాలు, ఫొటోలు, వీడియోలు మొబైల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. మొబైల్‌లో జీపీఆర్‌ఎస్, త్రీజీ సౌకర్యం ఉంటే ఇవి అందుబాటులోకి వస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వినియోగదారులు వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట ఉన్న ఈ అప్లికేషన్‌ను ఠీఠీఠీ.ఞ్చడ.జౌౌజ్ఛ.ఛిౌఝ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. భారతదేశంలోనే మొదటిసారిగా ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు మున్ముందు మరిన్ని ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా జగన్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి పి.ఆర్.కిరణ్‌కుమార్ రెడ్డి, పార్టీ ఐటీ విభాగ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, హర్షవర్ధన్, బొమ్మా శేఖర్‌రెడ్డి, మౌనితారెడ్డి పాల్గొన్నారు.

జగన్ ఉప ఎన్నికల ప్రచారంలో మార్పులు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్పంగా మార్పులు జరిగాయి. ముందు అనుకున్న విధంగా ఈ నెల 13 నుంచి కాకుండా 14 నుంచి ఆయన మలి విడత ప్రచారం మొదలు పెడతారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అదనంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జగన్ మూడు రోజులపాటు పర్యటిస్తారు. తాజా షెడ్యూలు ప్రకారం.. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నర్సన్నపేట(శ్రీకాకుళం), 17,18 తేదీల్లో పాయకరావుపేట(విశాఖపట్టణం), 19 నుంచి 22 వరకు పోలవరం, 23, 24 తేదీల్లో నర్సాపురం(పశ్చిమగోదావరి), 25, 26, 27 తేదీల్లో తిరుపతి(చిత్తూరు)లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారు.ఆరోగ్యశ్రీపై మరో దొంగదెబ్బ!

*ఆసుపత్రి అభివృద్ధి నిధుల వినియోగంపై ఆంక్షలు
* ఇక పైసా ఖర్చు చేయాలన్నా పడిగాపులు కాయాల్సిందే
* కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమ్మడి ఖాతాలు ప్రారంభించాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆరోగ్యశ్రీపై సర్కారు మరో దొంగదెబ్బ వేసింది. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానాల్లో ఏమాత్రం వసతులు కల్పించకుండానే ఆరోగ్యశ్రీ నుంచి 133 జబ్బులను సర్కారీ ఆసుపత్రులకు మళ్లించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆసుపత్రి అభివృద్ధి నిధులపై కన్నేసింది. ఇకపై ఆస్పత్రి అభివృద్ధి సొసైటీలకు వచ్చే నిధులను కలెక్టర్ల పరిధిలోనే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లూ ఆయా ఆస్పత్రి పరిధిలోనే ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ కన్వీనర్, సూపరింటెం డెంట్ తదితరుల సభ్యుల ఆమోదంతో స్థానికంగా ఆరోగ్యశ్రీ నిధుల వినియోగం జరిగేది. 

సొసైటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నా నిధుల వినియోగానికి సంబంధించి కలెక్టర్ అనుమతులు ఉండేవి కావు. ఇప్పుడు కలెక్టర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమ్మడి ఖాతా (జాయింట్ అకౌంట్)ను ప్రారంభించి తప్పనిసరిగా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు చెందిన చీఫ్ మెడికల్ ఆడిటర్ ఆదేశాలు వెలువరించారు. దీంతో ఆరోగ్యశ్రీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు స్తంభించనున్నాయి. ఉదాహరణకు ప్రొద్దుటూరు ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగితే అందుకు సంబంధించిన నిధుల ఖర్చుకు కడప వెళ్లి కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 బోధనాసుపత్రులు, 4 రిమ్స్‌లు, 17 జిల్లా ఆస్పత్రులు, 58 ఏరియా ఆస్పత్రులకు సంబంధించిన సూపరింటెండెంట్‌లు ఇకపై కలెక్టర్ల చుట్టూ తిరిగితే తప్ప నిధులు మంజూరు కావు. 

మరోవైపు కలెక్టర్ల వద్దకు సూపరింటెండెంట్‌లు వెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చులపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కలెక్టర్లతో జాయింట్ అకౌంట్ అనేది ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడమేనని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 31 ఏరియా ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఎక్స్‌రే యూనిట్లు లేవు, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్‌లు పనిచేయడం లేదు, 14 జిల్లా ఆస్పత్రుల్లో ల్యాప్రొస్కొపిక్ పరికరాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులపై కూడా రెవెన్యూ శాఖకు లింకు పెడుతూ ఆదేశాలివ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ దయతో ఎదిగి.. ఆయన్నే విమర్శిస్తారా?


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల ప్రయోజనాలు, పదవులు పొందినవారు.. ఆయన మోచేతి కింద నీళ్లు తాగినవారే మహానేతను విమర్శించడం సిగ్గుచేటు అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు దుయ్యబట్టారు. వైఎస్ ప్రాపకంతో పైకి వచ్చి ఆయనపైనే విమర్శలు చేసేవారిని తెలుగు ప్రజలు, వైఎస్సార్ అభిమానులూ చెప్పులతో తరిమికొడతారని హెచ్చరించారు. 

రాంబాబు గురువారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ను కాంగ్రెస్ నేతలు విమర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రంలో ఈనెల 15 నుంచి ప్రజాపథం ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే పర్యటనలకు వెళ్లిన మంత్రులకు తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. గంటా శ్రీనివాసరావును అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజలు తరిమి తిట్ల పురాణాన్ని లంఘించుకున్నారు. మరోచోట టి.జి.వెంకటేష్‌కు తీవ్ర నిరసన వ్యక్తమైంది. పొన్నాల లక్ష్మయ్యపై చెప్పులతో దాడి చేసినంత పనైంది. ప్రజాపథంలో ప్రజలు మంత్రులను ఎలా తరమబోతున్నారో అనడానికి ఇదొక శాంపిల్(నమూనా) మాత్రమే. మంత్రులు కూడా పరుగు పందానికి సిద్ధంగా ఉండాలి’ అని ఎద్దేవా చేశారు. 

వైఎస్ మరణించాక ఆయన్ను దూషిస్తే ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి మరణించాక అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎందుకిలా తయారయ్యాయో మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ‘వైఎస్‌ను విమర్శించాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ను విమర్శించబోనని చెప్పారు. టీడీపీ నాయకుడు పాలకొండ్రాయుడు తమ అధినేత చంద్రబాబు సమక్షంలోనే వైఎస్‌ను విమర్శించబోనని తేల్చి చెప్పారు. వైఎస్‌తో కలిసి తాను ఎన్నోసార్లు భోజనం చేశానని, కొంత కాలం పాటు సన్నిహితంగా మెలిగానని, అందుకే తాను అలా చేయనని ఆయన ప్రకటించారు. ఎపుడో సన్నిహితంగా మెలిగినందుకు, ఆయనతో కలిసి భోజనం చేసినందుకే విమర్శించబోనని పాలకొండ్రాయుడు చెప్పారంటే.. మరి వైఎస్ ప్రాపకంతో పైకి వచ్చినవారు విమర్శలకు దిగుతూ ఉంటే ఏం చెప్పాలి’ అని అంబటి దుయ్యబట్టారు.

బాబువే శవరాజకీయాలు 

జగన్ శవరాజకీయాలు చేశారని, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టించారనీ చంద్రబాబు చేసిన ఆరోపణలపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ‘అసలు శవాలతో రాజకీయం చేసింది చంద్రబాబే. ఎన్టీఆర్‌ను శవంగా మార్చి ఆ శవంపై కాలు పెట్టి అధికారంలోకి వచ్చిన బాబు.. ఈ రోజు చెబుతున్న మాటలు చూసి పరిశీలకులకూ, రాజకీయ విశ్లేషకులకూ నవ్వాలో, ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది’ అని వ్యాఖ్యానించారు. కలిసి భోజనం చేసినందుకే వైఎస్‌ను విమర్శించబోనని టీడీపీ నాయకుడు చెప్పినపుడు.. అదే వైఎస్ దగ్గర పాకెట్‌మనీ(రోజువారీ ఖర్చులు) తీసుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు మరణించిన వైఎస్‌పై విమర్శలు చేయడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. 

పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి

మలి విడత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు
ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేరుస్తూ నిర్ణయం

న్యూఢిల్లీ: ఇకపై మతాలకు అతీతంగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు సామాజిక సమస్యల నుంచి తప్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, సిక్కుల వివాహాలకు ప్రత్యేక చట్టానికి ఆమోదం తెలిపింది. జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం-1969కి సవరణ కింద ప్రతిపాదించిన బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్, దీనిని ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. మతాల వారీగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రస్తుత విధానం కొనసాగుతుందని, అయితే, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు కోరుకున్నట్లయితే, వారికి మతాతీతంగా సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుందని న్యాయశాఖ అధికారులు తెలిపారు. దేశంలోని అన్ని మతాల వారికీ వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టు 2006 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన దరిమిలా, కేంద్రం ఈ బిల్లును ముందుకు తెచ్చింది.

స్వావలంబన్ పథకానికి మరో రూ.2,065 కోట్లు

అసంఘటిత రంగంలోని 70 లక్షల కార్మికులకు లబ్ధి కలిగించేలా, ‘స్వావలంబన్’ పింఛను పథకానికి అదనంగా మరో రూ.2,065 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పింఛను పథకం కింద 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాలలో నమోదు చేసుకున్న కార్మికులకు రానున్న ఐదేళ్ల వరకు, అంటే 2016-17 వరకు పింఛన్లు చెల్లించేందుకు అదనంగా ఈ నిధులు కేటాయించినట్లు మంత్రి సిబల్ చెప్పారు. ఈ పథకం నుంచి వైదొలగేందుకు వర్తించే నిబంధనల్లో కూడా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన వారు లేదా కనీసం ఇరవయ్యేళ్లు పథకంలో కొనసాగిన వారు దీని నుంచి వైదొలగే అవకాశం ఉంది. మారిన నిబంధనల ప్రకారం 50 ఏళ్లు నిండిన వారు లేదా ఇరవయ్యేళ్లు పథకంలో కొనసాగిన వారు, ఏ తేదీ చివరిదైతే ఆనాటికి ఈ పథకం నుంచి వైదొలగవచ్చు. 

లోక్‌పాల్ సవరణలకు ఆమోదం...: లోక్‌సభలో ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లుకు చుక్కెదురైన సంగతి తెలిసిందే. కాగా, లోక్‌సభలో బిల్లును ఆమోదించినప్పుడు ప్రభుత్వం పలు సవరణలకు అంగీకరించింది. ప్రధానిపై విచారణ జరపాలంటే లోక్‌పాల్ సంపూర్ణ ధర్మాసనంలోని మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదం ఉండాలనేది ఇందులో ఒకటి. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రధానిపై విచారణ జరిపేందుకు లోక్‌పాల్ సంపూర్ణ ధర్మాసనంలో నాలుగింట మూడొంతుల మెజారిటీ ఆమోదం ఉండాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 

లోక్‌పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే, దీనికి సమ్మతి తెలిపిన రాష్ట్రాల్లో కూడా ఇది అమలులోకి వస్తుందనే సవరణకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. సాయుధ దళాల సిబ్బందిని లోక్‌పాల్ పరిధికి వెలుపల ఉంచడంతో పాటు, మాజీ ఎంపీలకు విచారణ నుంచి మినహాయించే కాలాన్ని ఐదేళ్ల నుంచి ఏడేళ్లకు పొడిగిస్తూ లోక్‌సభలో అంగీకరించిన సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సవరణలతో కూడిన ఈ బిల్లును మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉండగా, ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలని కేబినెట్ నిర్ణయించింది. కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపురలకు చెందిన కొన్ని కులాలను ఈ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి సిబల్ చెప్పారు.

పర్యావరణంపై...: పర్యావరణ మార్పులపై యునెటైడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) సచివాలయానికి పంపాల్సిన రెండవ నివేదికను కేబినెట్ ఆమోదించింది. యూఎన్‌ఎఫ్‌సీసీసీ కింద భారత్ చేపడుతున్న చర్యలపై పదేళ్లకు ఒకసారి వెల్లడించాల్సి ఉన్నందున, ఇందుకోసం రూపొందించిన 300 పేజీల నివేదికను కేబినెట్ ఆమోదించింది. 

చంద్రబాబుతో కిరణ్ సర్కారు కుమ్మక్కుకు మరో రుజువు* చంద్రబాబుతో కిరణ్ సర్కారు కుమ్మక్కుకు మరో రుజువు
* బాబు హయాంలో జరిగిన రూ. 300 కోట్ల కుంభకోణం కేసు మూసివేతకు సీఐడీ నిర్ణయం
* కాంగ్రెస్ సర్కారులోని ‘ముఖ్యుల’ ఒత్తిడే కారణం
* కాకినాడ వద్ద ‘స్పెక్ట్రమ్’ గ్యాస్ విద్యుత్ ప్లాంటు నిర్మాణం
* 1997లో విద్యుత్ కొనుగోలుకు బాబు ఒప్పందం
* నాటి టీడీపీ సర్కారుకు భారీ ముడుపుల ఆరోపణలు
* ప్రాజెక్టు వ్యయం రూ. 100 కోట్లు పెంచి చూపిన వైనం
* ఫలితంగా ట్రాన్స్‌కోపై భారీగా స్థిర చార్జీల భారం
* నాటి నుంచి నెలకు అదనంగా రూ. 2 కోట్ల చొప్పున ఇప్పటికే రూ. 300 కోట్లు ‘స్పెక్ట్రమ్’కు సమర్పణ
* అక్రమాలపై సంస్థ ప్రమోటర్ల నుంచే ఆరోపణల వెల్లువ
* 2004లో సీఐడీ విచారణకు నాటి సీఎం వైఎస్ ఆదేశం
* బ్రిటిష్ కంపెనీ నుంచి రూ. 67 కోట్ల ముడుపులు స్వీకరించినట్లు ఈడీకి నాటి ‘స్పెక్ట్రమ్’ ఎండీ వెల్లడి
* రూ. 26 కోట్ల కాంట్రాక్టులు బోగస్‌గా నిర్ధారించిన ఐటీ
* ట్రాన్స్‌కో ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీసీఐడీ
* ఈడీ, ఐటీ తదితర శాఖల నుంచి ఆధారాలూ సమర్పణ
* నాటి ‘స్పెక్ట్రమ్’ మేనేజింగ్ డెరైక్టర్, కుమారుడు అరెస్ట్
* ఎనిమిదేళ్ల తర్వాత కేసు మూసివేతకు సీఐడీ నిర్ణయం
* బలమైన ఆధారాలున్నా.. లేవంటూ లేఖ

కె.శ్రీకాంత్‌రావు:
అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య మరో కుమ్మక్కు వ్యవహారమిది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన ఓ విద్యుత్ ప్రాజెక్టు కుంభకోణం కేసును.. కాంగ్రెస్ ప్రభుత్వ ‘ముఖ్యుడు’ ఒత్తిడి తెచ్చి మూసివేసేయించేందుకు రంగం సిద్ధం చేసిన వైనమిది. తద్వారా చంద్రబాబు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అక్రమాలకు ముసుగువేయటంతో పాటు.. సదరు విద్యుత్ సంస్థను, దాని యాజమాన్యాన్ని గట్టెక్కించేందుకు సర్కారు ప్రముఖులు తహతహలాడుతున్నారు. స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ (ఎస్‌పీజీఎల్) విద్యుత్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 100 కోట్ల మేర పెంచి చూపించి.. స్థిర చార్జీల రూపంలో ఇప్పటికే రూ. 300 కోట్ల వరకూ దండుకున్నదన్నది కేసు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన సూచనల మేరకు ఈ కుంభకోణంపై ట్రాన్స్‌కో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదయింది.

ఈ ప్రాజెక్టు విషయంలో తాము పాల్పడిన అక్రమాలకు సంబంధించి స్పెక్ట్రమ్ నాటి మేనేజింగ్ డెరైక్టర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఎదుట స్వయంగా అంగీకరించిన వాంగ్మూల పత్రాలనూ, ఆదాయపన్ను శాఖ గుర్తించిన అవకతవకల తాలూకు నివేదికనూ, అకౌంట్లలో అవకతవకలను నిర్ధారిస్తూ బిల్‌మోర్ చార్డర్ట్ అకౌంటెంట్ ఇచ్చిన నివేదికనూ, షేర్ల తారుమారు విషయమై కంపెనీ అక్రమాలను నిర్ధారిస్తూ తీర్పుచెప్పిన హైదరాబాద్ రెండో అదనపు చీఫ్ జడ్జి కోర్టు ఆదేశాలను కూడా ట్రాన్స్‌కో సీఐడీకి అందజేసింది. సీఐడీ దర్యాప్తులో కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా లభించాయి. నిందితులను అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసును మూసివేయటానికి రంగం సిద్ధం చేసింది.

మొన్నటి వరకు సీఐడీలో పని చేసిన ఓ ఉన్నతాధికారి ఈ కేసును మూసివేసేందుకు ససేమిరా అనటంతో.. ఆయనను ఏకంగా అక్కడి నుంచి బదిలీ కూడా చేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తాజాగా సీఐడీ అధికారులు.. ‘స్పెక్ట్రమ్’ కుంభకోణానికి ఆధారాలు లేవని, కేసును మూసివేయాలని నిర్ణయించుకున్నామని ఫిర్యాదుదారైన ట్రాన్స్‌కోకు మూడు రోజుల కిందట లేఖ ద్వారా తెలియజేసింది. సీఐడీ అధికారులు పంపించిన లేఖపై ఆంధ్రప్రదేశ్ పవర్ కో ఆర్డినేషన్ సమావేశంలో చర్చించిన తరువాత ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా స్పందించాలన్న విషయం ట్రాన్స్‌కో నిర్ణయించే అవకాశం ఉంది.

విద్యుత్ కొనుగోళ్లకు బాబు ఒప్పందం...
స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ (ఎస్‌పీజీఎల్) కాకినాడ వద్ద 208 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నిర్మించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1997 జనవరి 23న ఆ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో నిర్మించిన బ్రిటన్‌కు చెందిన రోల్స్‌రాయిస్ సంస్థ నుంచి ప్రమోటర్లయిన ‘స్పెక్ట్రమ్’ యజమానులే ముడుపులు పుచ్చుకుని.. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టచెప్పిన విషయంపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. దానికి ప్రతిఫలంగా ఈ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 18 సంవత్సరాలపాటు విద్యుత్ కొనుగోలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అంతేకాకుండా.. ఈ సంస్థకు ప్రాజెక్టు వాస్తవ వ్యయం కంటే ఎక్కువ మొత్తాన్ని స్థిర (ఫిక్స్‌డ్) చార్జీల రూపంలో చెల్లించి ట్రాన్స్‌కో విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. 1998 నుంచి 2009 మార్చి వరకూ ఈ విధంగా స్థిర చార్జీల రూపంలో ట్రాన్స్‌కో రూ. 273 కోట్ల మేర స్పెక్ట్రమ్‌కు అదనంగా అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. చంద్రబాబు చేసుకున్న నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో మార్పు చేసే అవకాశం లేకపోవటంతో ఇప్పటికీ అధిక స్థిర చార్జీలు చెల్లిస్తూ వస్తున్నారు. అది ఇప్పటికి రూ. 300 కోట్లు దాటిపోయింది. ఒప్పందం పూర్తయ్యే నాటికి అదనపు చెల్లింపులు దాదాపు రూ. 350 కోట్లు దాటుతుంది.

కుంభకోణం జరిగిందిలా...
ట్రాన్స్‌కో నుంచి స్థిర చార్జీలు ఎక్కువగా దండుకునే లక్ష్యంతో.. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం కంటే దాదాపు రూ. 97 కోట్లు అధికంగా చూపించింది. మొత్తం రూ. 748 కోట్లతో నిర్మాణం చేపట్టినట్లు లెక్కలు చూపింది. స్పెక్ట్రమ్ సంస్థ.. ఈ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం, అమలు, నిర్వహణ బాధ్యతలను బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ అనే సంస్థకు అప్పగించింది. అందుకు ఆ సంస్థ నుంచి ‘ఏజెన్సీ కమిషన్’ పేరుతో రూ. 67 కోట్లు ముడుపులు పుచ్చుకున్నట్లు ‘స్పెక్ట్రమ్’ నాటి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.కిషన్‌రావు స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ విచారణలో అంగీకరించారు. ఆ ముడుపులు తీసుకోవటం కోసమే తొవాండా సర్వీసెస్ లిమిటెడ్ అనే బోగస్ కంపెనీని సృష్టించినట్లు కూడా తన వాంగ్మూలంలో ఒప్పుకున్నారు.

అలాగే.. ప్రాజెక్టు నిర్మాణ పనులను (తన కుటుంబ సభ్యులకే) సివిల్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు నకిలీ పద్దులు సృష్టించారు. కనీసం టెలిఫోన్ కనెక్షన్ కూడా లేని బ్లూస్టార్ కన్‌స్ట్రక్షన్స్ అనే బోగస్ కంపెనీకి రూ. 29 కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపారని ఆదాయపన్ను శాఖ గుర్తించింది. రోల్స్‌రాయిస్ నుంచి తీసుకున్న రూ. 67 కోట్ల ముడుపులను, దానితో పాటు రూ. 29 కోట్ల విలువ చేసే బోగస్ కాంట్రాక్టులను కూడా ప్రాజెక్టు వ్యయంలో కలపటం వల్ల.. దానిని వాస్తవ వ్యయం కన్నా దాదాపు రూ. 97 కోట్లు ఎక్కువగా చూపారని ట్రాన్స్‌కో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.

ఇలా ప్రాజెక్టు వ్యయం పెంచి చూపటం ద్వారా.. చంద్రబాబు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం స్పెక్ట్రమ్ సంస్థకు చెల్లించాల్సిన స్థిర చార్జీలు భారీగా పెరిగాయని పేర్కొంది. (ప్రాజెక్టు పెట్టుబడి మూలధన వ్యయం మొత్తాన్ని వడ్డీతోపాటు, పన్నులు, లాభం తదితరాలను స్థిర చార్జీల కింద సదరు కంపెనీకి ట్రాన్స్‌కో ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. దీనిని స్థిర చార్జీలు అంటారు.) విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం ‘స్పెక్ట్రమ్’ స్థిర చార్జీల రూపంలో ప్రతి నెలా దాదాపు రూ. 14.50 కోట్లు వసూలు చేస్తోందని.. అంటే వాస్తవ వ్యయంపై స్థిర చార్జీల కన్నా ప్రతి నెలా రూ. 2 కోట్లు అదనంగా ఆ సంస్థ పొందుతోందని.. ఆ మేరకు తాము నష్టపోతున్నామని ట్రాన్స్‌కో వివరించింది.

ప్రమోటర్ల గొడవతో బయటపడ్డ అక్రమాలు...
ఈ ప్రాజెక్టు నిర్మాణం, సంస్థలోని ప్రమోటర్ల మధ్య కలహాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆద్యంతం వివాదాస్పదమే. ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణ వ్యయం పెంపు తదితర అంశాలపై ప్రమోటర్లలో ఒకరైన ఎ.వి.మోహనరావు, మరికొందరు పలు కోర్టుల్లో కేసులు వేశారు. స్పెక్ట్రమ్ ప్రాజెక్టు అక్రమాలమయమని, వ్యయం భారీగా పెంచి చూపారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంటూ అప్పట్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే.. అప్పటి ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఎస్.సంపత్.. ప్రాజెక్టు వ్యయం పెంచి చూపించారనటం అవాస్తవమంటూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయటంతో ఈ పిల్‌ను 2002లో హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ప్రమోటర్లలో ఒకరైన ఎ.వి.మోహన్‌రావు.. మూలధన వ్యయాన్ని పెంచి చూపించిన విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. దీంతో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సర్కారు.. మోహనరావు ఫిర్యాదుల కాపీలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లకు అందించటంతో పాటు సీబీసీఐడీ వద్ద ప్రత్యేకంగా కేసు నమోదు చేయాలని ట్రాన్స్‌కోకు నిర్దేశించింది. ఈడీ విచారణలో.. రోల్స్‌రాయిస్ కంపెనీ నుంచి రూ. 67 కోట్లు ముడుపులు స్వీకరించినట్లు కిషన్‌రావు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో వివిధ శాఖల నుంచి మరిన్ని సాక్ష్యాలను సేకరించింది.

అవకతవలపై విచారణకు వైఎస్ సర్కారు నిర్దేశం...
చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో పోరాడిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. 2004లో అధికారంలోకి వచ్చిన మరుసటి నెలలోనే స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ అవకతవకలపై సీబీసీఐడీ విచారణకు అనుమతి ఇచ్చారు. దీంతో.. ఎ.వి.మోహనరావు చేసిన ఆరోపణల పత్రాలు, అందుకు సంబంధించి ఈడీ, ఐటీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తదితర విభాగాల నుంచి సేకరించిన పూర్తి ఆధారాలతో ట్రాన్స్‌కో అదే ఏడాది జూన్ ఎనిమిదో తేదీన సీబీసీఐడీకి ఫిర్యాదు చేసింది. ట్రాన్స్‌కో ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు క్రైమ్ నంబర్ 21/2004తో భారత శిక్షాస్మృతి లోని 403, 405, 408, 409, 468, 471, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్పెక్ట్రమ్ సంస్థ ప్రాజెక్టు మూలధన పెట్టుబడి పెంచి చూపించిన వైనంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తర్వాత స్పెక్ట్రమ్ కార్యాలయంలోనూ, ఆ సంస్థ ఎండీగా ఉన్న కిషన్‌రావు ఇంట్లోనూ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించటమేకాక.. కిషన్‌రావును, ఆయన కుమారుడు రఘువీర్‌ను అరెస్టు చేశారు కూడా. అనంతరం వారు బెయిల్‌పై విడుదల కాగా.. కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

‘స్పెక్ట్రమ్’ అవకతవకలపై ట్రాన్స్‌కో ఫిర్యాదులోని ముఖ్యాంశాలు...
* రోల్స్‌రాయిస్ నుంచి ముడుపుల కోసం తొవాండ సర్వీసెస్ లిమిటెడ్ అనే బోగస్ కంపెనీ సృష్టి.
* ఉద్దేశపూర్వకంగా బూటకపు రికార్డులు రూపొందించటం.
* సివిల్ పనుల కోసం బ్లూస్టార్ కనస్ట్రక్షన్స్ అనే బోగస్ కంపెనీ ఏర్పాటు.
* షేర్ హోల్డర్ల జాబితానూ ఇష్టానుసారం మార్చేయటం.
* దురుద్దేశపూర్వకంగా మూలధన వ్యయాన్ని పెంచి చూపటం.
* తద్వారా అధిక మొత్తంలో స్థిర చార్జీలు పొందాలన్న దురుద్దేశం.
* ఫలితంగా ట్రాన్స్‌కో ప్రతి నెలా రూ. 2 కోట్లు అదనంగా చెల్లిస్తూ నష్టపోతోంది.
* ఆ మొత్తం ఇప్పటివరకూ రూ. 300 కోట్లు దాటిపోయింది.


షేర్ల అక్రమాలను నిగ్గుతేల్చిన కోర్టు
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్పీలు
స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీలో షేర్ల అక్రమాలపై అదే సంస్థకు చెందిన షేర్ హోల్డర్లు వేసిన కేసులో.. అక్రమాలు జరిగినట్లు కోర్టు నిర్ధారించింది. స్పెక్ట్రమ్‌కు చెందిన నిధులను దాని మేనేజింగ్ డెరైక్టర్ ఎం.కిషన్‌రావు తనకు చెందిన ఇతర బోగస్ కంపెనీల్లోకి మళ్లించి.. ఆ నిధులనే తిరిగి స్పెక్ట్రమ్‌లో పెట్టుబడిగా పెట్టి తన కుటుంబ సభ్యుల పేరిట 4 కోట్ల షేర్లు కొన్నట్లు తేలింది. దీంతో ఆ షేర్ల కొనుగోళ్లను రద్దు చేయాలని అప్పట్లో సిటీ సివిల్ కోర్టులోని రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై కిషన్‌రావు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ పెండింగ్‌లో ఉంది.

2009లోనే విద్యుత్ ప్లాంటు స్వాధీనానికి వైఎస్ సూచనలు...
స్పెక్ట్రమ్‌కు స్థిర చార్జీల రూపంలో అధికంగా చెల్లించిన రూ.273 కోట్లను వసూలు చేసే విషయాన్ని పరిశీలించాలని 2009 మార్చిలో నాటి ముఖ్యమంత్రి రాజశే ఖరరెడ్డి అధికారులకు సూచించారు. ఆ సంస్థతో చంద్రబాబు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం కాలపరిమితి ముగిసే సమయానికి.. ‘స్పెక్ట్రమ్’ స్థిర చార్జీల రూపంలో అదనంగా రూ. 350 కోట్ల వరకూ లబ్ధిపొందుతుంది. ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయకపోతే.. కొనుగోలు ఒప్పందం 2016లో ముగిసిన తరువాత.. మూలధన వ్యయం కావాలని పెంచి చూపటం ద్వారా వసూలు చేసుకున్న అధిక మొత్తానికి నష్టపరిహారంగా సదరు విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జెన్‌కోకు అప్పగించాలని వైఎస్ అప్పట్లో సూచించారని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొన్నాయి.

అయితే.. ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణలో కిషన్‌రావు వాంగ్మూలం, ఆదాయపన్ను శాఖ నివేదిక తదితర ఆధారాలు ఉన్నప్పటికీ.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కేసు మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు సీఐడీ లేఖ రాయటం పట్ల ట్రాన్స్‌కో సహా వివిధ వర్గాల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం.. అధికార -ప్రతిపక్ష పార్టీల మధ్య కుమ్మక్కు వ్యవహారమేనన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: భన్వర్‌లాల్

రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని ఆయన చెప్పారు. భన్వర్‌లాల్ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రక్రియను పదిహేను రోజుల్లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. 

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని, ఈ విషయంలో జిల్లాలోని వివిధ రాజకీయపార్టీల నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రక్రియలో అధికారులకు సహకరించాలని రాజకీయ నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

వై‘ఎస్’ అన్నా ‘నో’ అన్నా ఓటమే!

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వాణ్ణి పరమ దుర్మార్గునిగా భావిస్తారు జనం . వైఎస్ విషయంలో నేడు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది ఇదే. 2004లోనూ, 2009 లోనూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గద్దె మీద కూర్చోపెట్టిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. తన చరిత్రాత్మక పాదయాత్రతో 2004లోనూ, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో 2009లోనూ వైఎస్ కాంగ్రెస్‌ను విజయపథాన నడిపించాడు. వైఎస్ రెక్కల కష్టంతోనే పదేళ్లు కాంగ్రెస్ అవిచ్ఛిన్నంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం చెలాయించింది. 

ఇద్దరు ముగ్గురు తప్ప రాష్ట్ర మంత్రులం దరూ వైఎస్ మంత్రివర్గంలోని వారే. జగన్‌ను ఎదుర్కోవా లంటే వైఎస్‌ను టార్గెట్ చేసి దూషించాలట! దీని మీద తర్జన భర్జనలు? జిల్లాలో దమ్మిడీకి చెల్లని వారు కూడా వైఎస్‌ను విమర్శించేవారే! వీహెచ్ లాంటి వృత్తి వ్యతి రేకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. పోనీ వైఎస్ మరణా నంతరం వైఎస్ పట్ల మర్యాదగా నడుచుకున్నారా? వైఎస్ వ్యతిరేక ప్రచారానికి పచ్చజెండా ఊపింది సోనియా కాదా! సోనియాకు తెలియకుండా డాక్టర్ శంకర్రావు వైఎస్ మీద హైకోర్టులో పిల్ వేశాడా? ఆమెకు తెలియకుండానే సీబీఐ విచారణ జరుగుతుందా? వైఎస్ మరణవార్త విని ప్రాణాలు వదిలారంటే అదంతా అవాస్తవం అన్నారు. వీహెచ్ మాటే వేదవాక్కన్నారు. తర్వాత ఏఐసీసీ విచా రించగా అవి నిజమే అన్నారు. 

బాధితులకు ఆర్థిక సహా యం చేస్తామన్నారు. ఏళ్లు గడుస్తున్నా వారిని ఓదార్చింది లేదు. ఇదంతా సోనియా నిర్వాకం! ఆమె రాజకీయ పరపతి ఆవిరైపోయిందని యూపీ, పంజాబ్ ఎన్నికలు తిరుగులేని విధంగా నిరూపించాయి. ఆమె ఇందిరాగాంధీ కోడలైతే కావచ్చు గానీ, ఆమె భావాలకు వారసురాలు మాత్రం కాదు. 2014లో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులను గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేయాలని వైఎస్ కలలుగన్నాడు. అది నిష్కల్మ షమైన ఆలోచన. కానీ, కృతఘ్నతకు కొత్త నిర్వచనం సోనియా చెప్పారు. 

ఆమెది చారిత్రక కృతఘ్నత. ఈ ద్రోహాన్ని సహించలేక కాంగ్రెస్‌లో తిరుగుబాటు చెలరేగు తోంది. కొంత మంది మంత్రులే దీనిని వ్యతిరేకించారు. మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను గానీ వైఎస్‌ను దూషించలేనన్నారు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్‌నే విమర్శిస్తాను గానీ వైఎస్‌ను కాదని వైఎస్ తమ్ముడు వివేకానందరెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల వైఎస్ పాలనను మరో మారు మెచ్చుకున్నారు. నిన్నటిదాకా వైఎస్ మహానేత అన్నవారు ఈ రోజు అవినీతిపరుడయ్యాడని అంటే జనం ఉమ్మేస్తారు. అలా అయితే వైఎస్ పేరుతో స్మృతివనాలు, స్తూపాలెందుకు? పోస్టల్ స్టాంపులెందుకు? ఆయన పేరుతో వైఎస్‌ఆర్ జిల్లా ఎందుకు? ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న సామెత వీరికి చక్కగా వర్తిస్తుంది. వీరికి ఓట్లు కాదు వచ్చేది చేతికి చిప్ప!

తప్పని నిర్ణయం
సాగదీసి, సాగదీసి విధిలేక స్పీకర్ ఆ 17 మంది శాసన సభ్యుల రాజీనామాలను ఆమోదించక తప్పలేదు. రాజీ నామా చేసే హక్కు రాజ్యాంగ బద్ధమైనప్పుడు, వాటిని ఆమోదించే బాధ్యత స్పీకర్‌కు లేకపోవడం ఎంత విడ్డూ రం? ఆమోదించిన పిదప ఆ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫై చేయడానికి ఎంత ఆలస్యం! పాలక పక్షం చేతిలో రాజ్యాంగం ఒక చిత్తుకాగితంగా మారిపోవడం లజ్జాకర మైన పరిణామం. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే హక్కు ఈ స్థానాల నుంచి కొత్తగా ఎన్నికయ్యే వారికి ఉండాలన్న సుసంప్రదాయాన్ని గౌరవించాలని ఎన్నికల కమిషన్ చెం దుతున్న ఆవేదన నెరవేరకూడదన్నది పాలకపక్షం దుర్బు ద్ధిగా కనపడింది. ఇటువంటి గూడుపుఠానీలో కాంగ్రెస్ పెద్దలు ఆరితేరిన వారని లోకానికి తెలిసిందే. ఏమైనా పాలకపక్షం కనుసన్నలలో మెలగకుండా, స్వతంత్రంగా ఆలోచించి రాష్ట్రపతి ఎన్నికలలోగానే ఈ 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరపబోతున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించడం శుభపరిణామం. అందుకు ఆయనను అభినందించక తప్పదు, ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉం దని చాటి చెప్పినందుకు.

ఎన్నికల కమిషన్ నిస్సహాయత...
ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నా, ఎన్నికల అవినీతిని అరికట్టడంలో అది తన నిస్సహాయతను అంగీకరించక తప్పలేదు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పాలకపక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ, రిగ్గింగ్ వీరు ల పన్నాగాలను అరికట్టడంలో ఎన్నికల యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందింది. కోవూరు ఉప ఎన్నికలో ఎన్నికల కమిషన్ తన పరిధికి లోబడి చేయగలిగింది చేసినప్పటికీ డబ్బు, సారా పంప కాన్ని అరికట్టలేకపోవడాన్ని అంగీకరించింది. అభ్యర్థులు బినామీ పద్ధతిలో ఈ ప్రక్రియను సాగించినందువల్ల అరికట్టలేకపోయామని కమిషన్ బాహాటంగానే అంగీకరించింది.

శాసనసభకైతే రూ.16 లక్షలు, పార్లమెంటుకైతే రూ.40 లక్షలకు మించి అభ్యర్థి ఖర్చుచేస్తే ఆ ఎన్నిక చెల్లనే రదని నిబంధన ఉన్నప్పటికీ ఆ పరిమితికి మించి పదిరెట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఎన్నికల ఖర్చు చూపించే రిటర్న్స్ బోగస్ అని తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ గుడ్లప్పగించి చూడటంతప్ప చేసేది ఏమీలేదు. అవినీతిని గురించి గొంతు చించుకునే చంద్రబాబు నాయుడు కోవూరులో తమ అభ్యర్థి రూ.16 లక్షల పరిమితికి లోబడి ఖర్చు చేశాడని గుండెమీద చేయివేసుకుని చెప్పగలడా? ప్రధాన పార్టీలన్నీ ఈ సమస్య మీద దొంగకు తేలుకుట్టినట్లు నోరు విప్పడం లేదు. జీవితవ్యయ పరిమాణం ఇబ్బడిముబ్బ డిగా పెరిగినట్లుగానే ప్రజాస్వామ్యం కూడా సామాన్యు నికి అందని సరుకుగా తయారైంది.

సిగ్గుచేటైన ‘ఆపరేషన్ థర్టీ డేస్’
18 నియోజకవర్గాల్లోనూ, నెల్లూరు పార్లమెంటరీ నియో జకవర్గంలోనూ నోటిఫికేషన్ వెలువడక ముందే కోట్ల కొద్దీ ప్రభుత్వ ధనాన్ని కుమ్మరించి కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభపెట్టడానికి ముఖ్యమంత్రి, బొత్స కలిసి రూపొం దించిన పథకానికి ‘ఆపరేషన్ థర్టీ డేస్’ అన్న ముచ్చటైన పేరుపెట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక విముఖత ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రోత్స హిస్తున్న విధానం ఇది. నోటిఫికేషన్ అన్నది సాంకేతిక పరమైన హద్దుగా చెప్పారు గానీ, ఆ స్థానాల్లో ఎన్నికలు ఖాయమైనప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి విచ్చ లవిడిగా ఓటర్లను ప్రలోభపెట్టే ఈ పథక రచన ఎలా చట్ట సమ్మతమవుతుంది? ఈ పథకాన్ని సుప్రీంకోర్టుకెళ్లి సవా ల్ చేస్తే అధికార పక్షం దుర్నీతి ప్రపంచానికి తెలిసి పోతుంది.

ఇది విశ్వాస పరీక్షే!
కాంగ్రెస్ అంతర్గతంగానూ, బయట తీవ్రమైన సంక్షో భాన్ని ఎదుర్కొంటోంది. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయంటే ప్రజలు నమ్మలేదు. చెవులు మెలివేసి కూర్చోపెట్టారు. కడప, పులివెందుల, కోవూ రులో అది నిరూపితమైంది. కాంగ్రెస్, చంద్రబాబు బల మైన అభ్యర్థులను నిలబెట్టి కోట్లు ఖర్చు పెట్టారు. 2014 కీలకమైంది కాబట్టి, తమ పార్టీ వారి స్థైర్యం నిలబెట్టడాని కైనా సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతమైనా చూపించుకో వాలి. 

ఈ 18 ఉప ఎన్నికలు మినీ జనరల్ ఎన్నికలతో సమానం. కాంగ్రెస్ టోకుగా ఓడిపోతే, ఓట్ల శాతం అధ్వా నంగా ఉంటే మధ్యంతర ఎన్నికలను తప్పించుకోలేదు. అందువల్లనే వారు శతవిధాలా కొన్ని సీట్లయినా సంపా దించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తెలివిపరులు. అది కాంగ్రెస్ వారి డబ్బు కాదు, అది ప్రజల డబ్బు, జరిగిన ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు. ఓటుకు 5 వందల నుంచి 2 వేల రూపాయల దాకా ఇచ్చారు. అయినా ఓటమి తప్పలేదు. కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను నమ్ముకోవటం లేదు. వారు సీబీఐని నమ్ముకుంటున్నారు. 

జగన్‌ను జైల్లో పెట్టించి తాను సీఎం కావాలని చంద్రబాబు కలలు కంటు న్నాడు. అయితే సామాన్య ప్రజలు జగన్‌ను సీఎంగా చూడాలని, మళ్లీ వైఎస్ పాలన రావాలని కోరుకుంటు న్నారు కాబట్టే జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఎనిమిది మాసాలైనా సీబీఐ జగన్ మీద నేరారోపణ నిరూ పించలేకపోయింది. వైఎస్ భూములను కేటాయింపు చేసింది కేబినెట్ ఆమోదంతోనే. నిబంధనలు పాటించే చేశాడు. నిబంధనలు ఉల్లంఘించకుండా చేసిన కేటాయిం పులు చట్టసమ్మతమే. జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు కూడా చట్టసమ్మతమే అయినప్పుడు అందులో తప్పే మిటి? కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో సీబీఐ వ్యవహరి స్తున్నా, న్యాయస్థానాలున్నాయి గదా! అన్నిటికంటే పెద్ద న్యాయస్థానం ప్రజాన్యాయస్థానమే. రానున్న ఉప ఎన్ని కల్లో ప్రజలిచ్చే రాజకీయ తీర్పు ఢిల్లీ పెద్దలకు, రాష్ట్ర నేత లకు దిమ్మ తిరిగేదిగా ఉంటుంది. కాంగ్రెస్, టీడీపీల ఆరా టమంతా గౌరవమైన ఓటమి కోసమే. ఘోరమైన ఓటమి నుంచి బయటపడటానికే! 

‘ఆరోగ్యశ్రీ’పై అన్నీ అబద్ధాలే!

-గుండం రామచంద్రారెడ్డి
‘సాక్షి’ ప్రతినిధి

ఆ రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే మందులు ల భించేవి. సమయానికి వైద్యులు ఉండేవారు. వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా జరిగేవి. అంటువ్యాధులు ప్రబలకుండా సకాలంలో అన్ని ఏర్పాట్లు జరిగేవి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాలేని పల్లెటూరి పేద రోగుల కోసం 104 వాహనాలలో వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులివ్వడమే కాకుండా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. మారుమూల గ్రామీణ ప్రాం తాలు, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఏదైనా ఆపద సంభవిస్తే కుయ్‌కుయ్‌మని 108 పరిగెట్టుకుంటూ వచ్చేది. క్షణాల్లో ఆస్పత్రికెళితే ప్రాణం పోకుండా వైద్యసేవలు అం దేవి. తెలుగువారి సంజీవనిగా చెప్పుకునే ఆరోగ్యశ్రీ పేదవారికి భరోసానిచ్చింది. పెద్ద జబ్బు వస్తే చావుకు దగ్గర కావడమే తప్ప మరో మార్గం లేని, డబ్బు ఖర్చు చెయ్యలేని ఎంతోమంది పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించి ఇంటికి క్షేమంగా పంపించిన పథకం అది. మహానేత వైఎస్ పేదసాదల ఆరోగ్యం పట్ల చూపిన శ్రద్ధాసక్తుల ఫలితం ఇది. 1995 నుంచి 2003 వరకూ మం దులు సరిగా అందక, వైద్యులు లేక విలవిలలాడిన పేద రోగులకు ఊరట లభించిన మంచి కాలం అది.

గ్రామీణ రోగులకు భరోసా

గ్రామీణ రోగులకు జబ్బు వస్తే మొదటగా గుర్తుకొచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. వాటి బాగోగులపై వైఎస్ చూపిన మక్కువ అంతా ఇంతా కాదు. సర్కారు ఆస్పత్రులకు కేటాయించే మందుల బడ్జెట్‌లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు దక్కాల్సిన 40 శాతం ఎప్పుడూ తగ్గకుండా చూశారు. అవసరాన్ని బట్టి అదనంగా కూడా ఇచ్చారు. వివిధ డిస్పెన్సరీలు, సివిల్ డిస్పెన్సరీలు, సబ్‌సెంటర్లను ఉన్నతీకరించి 200 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలుగా మార్చా రు. సిబ్బంది లేకపోతే రోగులకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన వైఎస్ 2006లో జీవో నం.138ని జారీ చేసి 3,500 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 1,081 మంది డాక్టర్లు, 1,200 మంది పారామెడికల్ సిబ్బంది, 1,220 మంది నర్సులు ఉన్నారు. అప్పట్లో ఈ నియామకాలు జరిగాయి కాబట్టే ఇప్పటికీ అక్కడ డాక్టర్ల సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఎంబీబీఎస్ పూర్తయిన అభ్యర్థులు గ్రామీణ సర్వీసుల్లో తప్పనిసరిగా పనిచేయాలని ఆదేశాలివ్వడంతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మరింత బలపడ్డాయి. అంతేకాదు 2 వేల మంది కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను నియమించి మారుమూల పల్లెల్లోనూ సేవలందేలా చూశారు. గ్రామీణ స్థాయిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రాణాంతక జబ్బులున్న వారిని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేర్చి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. 1,629 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 12,200 ఉప కేంద్రాలు, 200 సీహెచ్‌సీల్లో ఎప్పుడూ మందుల కొరత తలెత్తకుండా చూశారు.

మారుమూలకూ మందుల బండి!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటూ, ఆయా కేంద్రాలకు రాలేని పేద రోగుల కోసం 104 పథకాన్ని వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టారు. కాల్‌సెంటర్ ద్వారా ఉచిత వైద్య సలహాలు అందించడం, ఎఫ్‌డీహెచ్‌ఎస్ (ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసెస్) ద్వారా పల్లెవాసులకు మందులివ్వడం దీని ముఖ్యోద్దేశం. సుమారు 26 వేల గ్రామాల ప్రజలకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా మధుమేహం, క్షయ, రక్తపోటు, మూర్ఛ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, జ్వరాలు, విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు తదితర సాధారణ జబ్బులకూ 104 వాహనాల్లో వెళ్లి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. దీని కోసం 475 వాహనాలు అప్పట్లో కొనుగోలు చేసి ఒక్కో వాహనంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు వెళ్లి, మందులివ్వడంతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. దీనికోసం ఏటా రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించారు. రోజూ కనీసం 900 గ్రామాల్లో మందులు క్రమంతప్పకుండా అందేవి. వైద్య సిబ్బంది నెలకు 475 వాహనాల్లో 25,200 గ్రామాలకు వెళ్లి సేవలందించేవారు. ఒక్కో గ్రామంలో 60 నుంచి 70 మందికి మందులు ఇవ్వడంతోపాటు ఇతర వైద్య సేవలూ అందేవి. అంటే ఏటా 2 కోట్ల మంది పేద, గ్రామీణ రోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, స్కూలు పిల్లలు, వృద్ధులు ఉచితంగా మందులు లభిస్తుండటంతో రోగమొచ్చినా నొప్పొచ్చినా నిర్భయంగా ఉండేవారు.

దేశంలోనే ‘108’ రోల్‌మోడల్

పేద, ధనిక తారతమ్యం లేకుండా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానంటూ కుయ్‌కుయ్‌మని ముం దుకు వచ్చి కాపాడే 108 అంబులెన్సుల పథకం దేశానికే రోల్‌మోడల్ అయింది. 108 వాహనం రోగిని అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తీసుకెళ్లేవి. ఎక్కడ ప్రమాదం జరిగినా 25 నిమిషాల్లోనే ఘటనా స్థలికి వాహనం చేరుకోవడం, క్షణాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లడం నిత్యకృత్యంగా ఉండేది. 150 వాహనాలతో మొదలైన ‘108’ పథకం 2009 నాటికి 802 వాహనాలకు చేరుకుంది. ప్రతిరోజూ 6 వేల ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ వస్తే కనీసం 4 వేల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడేవి. కనీసం నెలకు లక్ష మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడేవి. గర్భిణులను కూడా 108 వాహనాలే ప్రసవానికి ఆస్పత్రులకు తీసుకెళ్లడం వలన, సకాలంలో సేవలు అంది తల్లీబిడ్డలు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరేవారు. 2007లో ప్రారంభమైన ఈ పథకం ప్రాథమిక దశలో అంబులెన్సులు తక్కువగా ఉండటంతో సేవల్లో నెమ్మదిగా ఉన్నా, 2008 నుంచి లక్షలాది మందిని ప్రమాదం నుంచి బయటపడేసింది. 2009లో 2.81 లక్షల మంది గర్భిణి స్త్రీలను అవి ఆసుపత్రులకు చేర్చాయి. ఈ పథకానికి 2008 నుంచి ఏటా రూ.100 కోట్లు తక్కువ కాకుండా బడ్జెట్ కేటాయించారు. ఈ పథకం సాధించిన ఫలితాలు చూసిన సుమారు 13 రాష్ట్ర ప్రభుత్వాలు 108 పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నాయి. 

పేదవాడి సంజీవని ‘ఆరోగ్యశ్రీ’

పేదవాడికి ఇది సంజీవనే. దేశంలో ఎవరికీ, ఏ ముఖ్యమంత్రికీ రాని ఆలోచన వైఎస్‌కి వచ్చింది. అంతే... అది అమలయ్యే వరకూ తిరిగి చూడలేదు. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబమూ పెద్దపెద్ద జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందే వసతి కల్పించేందుకు పూనుకున్నారు. 
తొలుత 350 జబ్బులకు మాత్రమే వైద్యమందించిన ‘ఆరోగ్యశ్రీ’ క్రమంగా 938 జబ్బులకు వైద్యం అందించే స్థాయికి చేరింది. దశలవారీగా రాష్ట్రమంతా విస్తరించింది. ఈ పథకం కింద పేద రోగులకు రోజుకు సుమారు రూ.3 కోట్ల మేర ఖర్చు చేశారు. ఇప్పటి వరకూ సుమారు 12 లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. దీనివల్ల చిరకాలంగా జబ్బుపడి ‘రోగ నిలయాలు’గా మారిన ప్రభుత్వాసుపత్రుల ‘ఆరోగ్యం’ బాగుపడింది. ప్రభుత్వాసుపత్రుల్లో శస్త్రచికిత్సలు జరిగినా ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చేవి. ఇప్పటి వరకూ అలా ఆస్పత్రి అభివృద్ధి నిధుల కింద సుమారు రూ.90 కోట్లపైనే ఆదాయం వచ్చింది. పథకం నిర్వహణకు ఏటా రూ.925 కోట్లు ఖర్చు చేశారు. ఏ కార్పొరేట్ ఆస్పత్రికెళ్లినా ఒక్క పైసా లేకుండా వైద్యమందించే ఈ పథకం ద్వారా ఎంతోమంది గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి బయటపడ్డారు.

తీరు మారింది... శోకం మిగిలింది!

వైఎస్ మరణానంతరం సర్కారు తీరు మారింది. పేద రోగులకు శోకమే మిగిలింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మందు బిళ్లలు లేవు. 600 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. 2 వేల మంది ఏఎన్‌ఎంలకు జీతాలు రాకపోయినా స్పందించరు. ఇక 104 పథకం ఆరు నెల లుగా మూతపడింది. ఉద్యోగులు జీతాలు పెంచాలని, భద్రత కల్పించాలని సమ్మెచేస్తే పట్టించుకోలేదు. నెలనెలా పల్లెలకొచ్చే ఉచిత మందులకోసం పేదరోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడటం మినహా ఏమీ చేయలేని స్థితి. బడ్జెట్ కూడా రూ.80 కోట్ల నుంచి రూ.40 కోట్లకు కుదించారు. ఇక 108 వాహనంలో వేగం తగ్గింది. ఎమర్జ్జెన్సీ కాల్స్ అటెండ్ చేసే సమయం 25 నిమిషాల నుంచి 40 నిమిషాలకు పెరిగింది. 200 వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. ఏటా రూ.100 కోట్లు ఉన్న బడ్జెట్ పెంచాల్సింది పోయి రూ.80 కోట్లకు తగ్గించారు. నెలన్నర సమ్మె జరిగితే పట్టించుకోలేదు. 

ఆరోగ్యశ్రీ పరిస్థితీ అంతే. 133 జబ్బులను ప్రైవేటు ఆస్పత్రుల పరిధి నుంచి తీసేసి ప్రభుత్వాసుపత్రులకు పరిమితం చేశారు. వసతులు, యంత్ర పరికరాలు మెరుగుపరచకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో రోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. బోధనాస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో మందుల్లేక రోగులు అల్లాడుతున్నా సర్కారు పట్టించుకునే స్థితిలో లేదు. ఏతావాతా తేలేదేమంటే ‘ఆరోగ్యశ్రీ’ మూలంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురికాలేదు. గుర య్యాయనే ప్రచారంలో కించిత్తయినా వాస్తవం లేదు. అం తేకాదు, ఆరోగ్యశ్రీ వలన అవి లబ్ధి పొందాయి. జవాబు దారీతనం సమకూరి వాటి పని తీరు మెరుగైంది. అందుకే ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో కొనసా గించాల్సిన అవసరం ఉంది. 

Popular Posts

Topics :