12 July 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

తమిళనాడులో వైఎస్సార్ విగ్రహావిష్కరణలు

Written By news on Saturday, July 18, 2015 | 7/18/2015

హైదరాబాద్ : తమిళనాడులోని తిరువల్లూరు, కృష్ణగిరి జిల్లాలతో పాటు రాజధాని చెన్నై నగరంలో పలుచోట్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణలు చేపడుతున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయా ప్రాంతాల్లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
 
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అభిమానించే వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని.. ఆ పెద్దాయన్ని స్మరించుకుంటూ పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారనితెలిపారు. తమిళనాడులో తెలుగు వారు బాష పరంగా, ఇతరేతరా ఎదుర్కొంటున్న పలు సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరినట్టు కేతిరెడ్డి చెప్పారు.

21 నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర


21 నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో విడత రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. జులై 21 నుంచి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆయన రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతపురంలో ఆయన రెండు విడతల్లో రైతు కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే.

ఎంపీలతో భేటీకానున్న వైఎస్ జగన్

Written By news on Friday, July 17, 2015 | 7/17/2015


ఎంపీలతో భేటీకానున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ ఎంపీలతో చర్చించనున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు కోట్లు కేసు పార్లమెంట్లో చర్చకు రానుంది.

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ పర్వదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి ప్రతీకని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐకమత్యంతో మసలడం, క్రమశిక్షణ కలిగి ఉండటం, పేదలకు తోడ్పడటమే రంజాన్ పండగ సందేశమని వైఎస్ జగన్ తెలిపారు.

అన్నివిధాలా ఆదుకుంటాం: పొంగులేటి


అన్నివిధాలా ఆదుకుంటాం: పొంగులేటిగురువారం అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషనుపరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
హైదరాబాద్: అవేర్‌గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నదని ఆమెకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉండి చేయూత నంది స్తుందన్నారు.

గతంలో ఆమె గర్ల్స్ స్టేట్ హోంలో ఆశ్రయం పొందిందని అక్కడ కూడా సరైన వసతులు లేవన్న సంగతి బాధితురాలి ఆవేదన ఆధారంగా తనకు తెలిసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా  స్పం దించి తగిన వసతులు కల్పించాలని కోరా రు.  ప్రత్యూషకు ఉచిత వైద్య సేవలందిం చిన ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అండగా నిలబడిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, బాలల హక్కు ల సంఘం అధ్యక్షురాలు అనూరాధలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

కార్మికులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ


కార్మికులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి
 
తిరుపతి మంగళం: రాష్ట్రంలో ఏ కార్మికుడి కష్టమొచ్చినా మీ వెంట మేమున్నామంటూ.. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. అపరి ష్కృత సమస్యల పరిష్కారానికి తిరుపతి కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు చే స్తున్న సమ్మెలో భాగంగా గురువారం వా రు నిర్వహించిన రాస్తారోకోకు వైఎ స్సార్ సీపీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు రేయిం బవళ్లు విధుల్లో నిమగ్నమై ఉంటారన్నారు. వారు లేకుంటే నగరం ఎలా కంపు కొడుతుందో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూస్తున్నారన్నారు.

హంగు, ఆర్భాటాల కోసం వందలాది కోట్ల రూపాయిలు వృథాగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు కార్మికులకు పనికి తగ్గ వేతనం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రెండు రోజుల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులు, ఉద్యోగు లు, కార్మికులు, సామాన్య ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసే ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు తుల సేంద్ర, రామచంద్ర, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు మమత, దొడ్డారెడ్డి సిద్ధారె డ్డి, ఎస్‌కే బాబు, ఆదం రాధాకృష్ణారెడ్డి, సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ, కేతం జయచంద్రారెడ్డి, టీ రాజేంద్ర, ఎంవీ ఎస్. మణి, అమరనాథరెడ్డి, ముద్ర నారాయణ, చిన్నముని, హనుమంత్‌నాయక్, కో టూరు ఆంజనేయులు, నల్లాని బాబు, అమోస్‌బాబు, బొమ్మగుంట రవి, నాగిరెడ్డి, మాధవనాయుడు, తాల్లూరు ప్రసాద్, పుణీత, శ్యామల, సాయికుమారి, ప్రమీల  పాల్గొన్నారు.

జులై 18న అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలుజులై 18న అట్లాంటాలో వైఎస్సార్ 66వ జయంతోత్సవాలు
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంత్యుత్సవాలు శనివారం అమెరికాలోని అట్లాంటా నగరంలో జరగనున్నాయి. ఇందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న వైఎస్ అభిమానులు హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళుతున్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజన్న దొర, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నేతలు అంబటి రాంబాబు, చలమలశెట్టి సునీల్, గుడివాడ అమర్‌నాథ్, భూమన కరుణాకరరెడ్డి ఈ వేడుకలకు హాజరుకానున్నారు.

బోయపాటి డైరెక్షన్ లో చంద్రబాబు యాక్షన్.


బోయపాటి డైరెక్షన్ లో చంద్రబాబు యాక్షన్..
పుష్కరాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని సీఎం నిర్ణయం
సాక్షి, రాజమండ్రి/ హైదరాబాద్: గోదావరి పుష్కరాలను మహా కుంభమేళాకు దీటుగా నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పుష్కరస్నానాల ప్రారంభం, సీఎం కుటుంబసభ్యుల పుణ్యస్నానాలు, లక్షలాది భక్తుల హాజరు, ఘాట్‌లలో హడావుడి... అన్నీ కలిపి ఒక డాక్యుమెంటరీ తీసి, విదేశీ ప్రతినిధులను చూపి అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని భావించారు.

ఈ మేరకు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ సలహాదారును రంగంలోకి దింపారు. డాక్యుమెంటరీ నిర్మాణం కోసం ఆయన కొన్ని జాతీయ ఛానళ్లను సంప్రదించారు. చివరకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్న నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌తో (ఎన్‌జీసీ) ఒప్పందం కుదుర్చుకోవడం, డాక్యుమెంటరీ రూపకల్పన, ప్రసారం, వసతి తదితర సౌకర్యాల కోసం దాదాపు రూ.ఏడు కోట్ల కేటాయింపు అత్యంత రహస్యంగా జరిగిపోయాయి. ఆయా చానల్స్ ప్రతినిధులు పుష్కరాల ప్రారంభానికి దాదాపు రెండు రోజుల ముందే రాజమండ్రికి చేరుకున్నారు.

వీరికి ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసిన ప్రభుత్వ సలహాదారు రాచమర్యాదలు చేయడం మొదలుపెట్టారు. తాము చిత్రీకరించాల్సిన అంశాలు, వాటిని చిత్రీకరించే ప్రదేశాలు నిర్ణయించుకునేందుకు ఆ మీడియా ప్రతినిధులు అన్ని పుష్కరఘాట్లను సందర్శించారు. లైటింగ్ సహా ఇతర అంశాల్లో వారే కొన్ని మార్పుచేర్పులు సూచించారని తెలిసింది. మరోవైపు చంద్రబాబు ఆస్థాన సినీరంగ ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు.

ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ సినీ ప్రముఖుడి ఆధ్వర్యంలో వారంతా పలుమార్లు రాజమండ్రికి వచ్చి పుష్కర ఘాట్లను పరిశీలించారు. వారు సూచించిన మేరకే గోదావరి హారతి కార్యక్రమంతోపాటు లేజర్ షోలు, ఇతర ఆర్భాటాలను చంద్రబాబు ఏర్పాటు చే యించారు. వీటి చిత్రీకరణ బాధ్యతను ప్ర ముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారు. డాక్యుమెంటరీ ముహూర్తపు షాట్‌గా పుష్కరాల ముందు రోజైన సోమవా రం రాత్రి పుష్కర ఘాట్‌లో సీఎం నిర్వహిం చిన గోదావరి నిత్యహారతిని వాడుకున్నారు. ఆ షాట్ అంతా బోయపాటి డెరైక్షన్‌లో తీశారు.
 
‘స్పెషల్ ఎఫెక్ట్’ కోసం ఘాట్ మార్పు...
రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా వీఐపీలు, వీవీఐపీలు స్నానం చేయడానికి ప్రభుత్వం సరస్వతి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఘాట్‌ను ఏర్పాటు చేసింది. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతోసహా మంగళవారం ఉదయం ఆ ఘాట్‌లోనే పుష్కరాలను ప్రారంభించాల్సి ఉంది. దీనికోసం భద్రతాధికారులు సోమవారం రాత్రి అడ్వాన్డ్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) పేరుతో భద్రతను పర్యవేక్షించే రిహార్సల్స్ సైతం నిర్వహించారు.

అయితే మంగళవారం తెల్లవారుజామున ఏఎస్‌ఎల్ పూర్తయిన తరవాత క్షేత్రస్థాయి సిబ్బందికి సీఎం పుష్కరాలను ‘పుష్కర’ ఘాట్‌లో ప్రారంభించనున్నారంటూ సమాచారం వచ్చింది. సీఎం స్థాయి వ్యక్తి పుష్కరాలను ప్రారంభిస్తున్న ఘట్టాన్ని తాము డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తామని, దీనికోసం చుట్టూ భారీ జనం ఉంటే ఎఫెక్ట్ బావుంటుందని సినీ, టీవీ చానల్ ప్రతినిధులు చెప్పడంవల్లనే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం కోసం లక్షలాది భక్తులను ఎక్కువసేపు ఆపడం సమంజసం కాదంటూ క్షేత్రస్థాయి సిబ్బంది హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం ఉండదని భావించిన ఉన్నతాధికారులు ఆయన చెప్పినట్లే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఘాట్‌కు చేరుకోవడానికి కొన్ని గంటలముందు మరోసారి పుష్కర ఘాట్‌ను పరిశీలించిన ఆ మీడియా ప్రతినిధులు ఇతర ఘాట్లలో ఉన్న వారినికూడా ఇక్కడకు మళ్ళిస్తే షాట్స్ ఇంకా బాగా వస్తాయని సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిసింది.

దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు భక్తుల్ని పుష్కరఘాట్‌కు మళ్లించారు. బయట భక్తులు పోటెత్తుతున్న క్రమంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తెలిసినా స్వయంగా ముఖ్యమంత్రే లోపల ఉండటంతో పోలీసులు అనివార్యంగా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కుటుంబం పుణ్యస్నానం, పితృదేవతలకు పిండప్రదాన క్రతువులు, వాటి చిత్రీకరణ కోసం సుమారు రెండున్నర గంటలపాటు భక్తులను గేటు బయటే నిలిపివేశారు. చివరకు గేట్లు తెరిచినప్పుడు తొక్కిసలాట జరిగి అందులో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

సీఎం వ్యక్తిగత ప్రచారం కోసం చేపట్టిన డాక్యుమెంటరీ చిత్రీకరణ ఇంతమంది ప్రాణాలను బలిగొనడానికి కారణమైందన్న చర్చ మం త్రుల మధ్యే నడుస్తోంది. మరోవైపు ఘాట్ బయట, లోపల జనసమూహం ఎక్కువ సమ యం ఉండిపోవడంవల్లనే ఈ దుర్ఘటన జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొనడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

పుష్కర ఘాట్‌కు వెళ్లి తప్పు చేసింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని లోకం అంతా కూడై కూస్తున్నా అధికారులపై వేటు వేసేందుకు రం గం సిద్ధం చేయడంపట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. పుష్కరాలు పూర్తి కాగానే జిల్లా కలెక్టర్‌పైన బదిలీ వేటు వేయనున్నట్లు తెలిసింది. అలాగే జిల్లా ఎస్పీపైన బదిలీ వేటా లేదా సస్పెండ్ చేయడమా అనే అంశంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు.
 
ఘాట్ల పర్యటనలు వద్దు బాబోయ్...
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన బుధవారం నుంచి సీఎం చంద్రబాబు సహా ఇతర మంత్రులు, ప్రముఖులు వరుసపెట్టి ఘాట్లను సందర్శించడం, భక్తులతో మాట్లాడటం మొదలెట్టారు. ఇది తమకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందని క్షేత్రస్థాయిలో ఉండే పోలీసు సిబ్బంది, అధికారులు వాపోతున్నారు. మొదటి రోజు జరిగిన ఘటనతో నిద్రాహారాలుమాని విధులు నిర్వర్తిస్తున్న తమకు ఇలా ఘాట్లకు వస్తున్న వీఐపీలకు బందోబస్తు, భద్రత కల్పించడం మరో ఇబ్బందిగా మారిందని స్పష్టం చేస్తున్నారు.

ఏ ప్రముఖుడినైనా భక్తులు అడ్డగించడం, తమ సమస్యలపై ప్రశ్నించడం తదితరాలు జరిగితే పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలను ఆస్కారం లేకుండా ఉండాలంటే ఆయా ప్రముఖులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు ఇతర కంట్రోల్‌రూమ్స్‌లో ఉండి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని, సమయానుకూలంగా అక్కడినుంచే తమకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలోనూ ఉన్నతాధికారులు సీఎం సహా ప్రముఖులకే వంతపాడుతున్నారని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు.

http://www.sakshi.com/news/home-latest-news/babu-devotion-to-international-direction-257933?pfrom=home-top-story

గోదావరి పుష్కరాలు: నేడు-నాడు

Written By news on Thursday, July 16, 2015 | 7/16/2015


గోదావరి పుష్కరాలు: నేడు-నాడు
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, మహానేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి గత పుష్కర జ్ఞాపకాలు మరోసారి జ్ఞప్తికి వస్తున్నాయి. 2003వ సంవత్సరంలో వచ్చిన గోదావరి పుష్కరాల్లో వైఎస్సార్ గోష్పాద క్షేత్రంలోని వీఐపీ ఘాట్ లో పుష్కర  స్నానం ఆచరించారు. ఆ సమయంలో వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షగా నేతగా ఉన్నారు.


నేటి పుష్కరాల్లో కూడా వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించారు. నేడు వైఎస్ జగన్ కూడా ప్రతిపక్ష నేత హోదాలోనే ఉన్నారు. తొలుత సంప్రదాయ పద్ధతిలో పంచె, ధోవతి ధరించి కాలినడకన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఘాట్ (వీఐపీ ఘాట్)కు వెళ్లారు. గోదావరి మాతకు సంకల్ప పూజ నిర్వహించి, నదీ స్నానమాచరించారు. ఆ తరువాత తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత, నాయనమ్మలు రాజారెడ్డి, జయమ్మలకు, తాత, అమ్మమ్మలకు, ఇతర దివంగతులకు శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత జ్ఞాపకాలు అభిమానులకు గుర్తుకొచ్చాయి.

ఆరోపణలకు కలెక్టర్ నివేదిక మద్దతు

పుష్కరాలలో తొక్కిసలాట ఘటనకు ఎవరు బాద్యత తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా ఉంది. తాజాగా జిల్లా కలెక్టర్ అరుణకుమార్ ప్రభుత్వానికి పంపిన నివేదిక సంచలనంగా ఉంది. ఆయన స్పష్టంగా పుష్కర ఘాట్ లో స్నానాలు చేయడం, ఎనిమిదిన్నర గంటలవరకు విఐపిలు అంతా అక్కడే ఉండడం, రెండు గంటలకు పైగా జనాన్ని రేవులోకి అనుమతించకపోవడంవల్లనే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వానికి పంపిన ప్రాధమిక నివేదికలో తెలపడం విశేషం.ప్రతిపక్షాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘాట్ లో స్నానానికి వెళ్లి రెండు గంటలకు పైగా ఉండడం వల్లనే జరగిందన్న ఆరోపణలకు కలెక్టర్ నివేదిక మద్దతు ఇచ్చది గా ఉంది. ఈ నివేదిక కాపీలు కూడా లీక్ అవడం విశేషం. జిల్లాలో కలెక్టర్,ఎస్.పిలకు పడడం లేదని, వారి మద్య సమన్వయం లేదని కొన్ని పత్రికలలో కధనాలు రాగా, దీనికి ప్రతిగానా అన్నట్లుగా కలెక్టర్ ఏకంగా విఐపిల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న సంకేతం ఇచ్చేలా నివేదికను ప్రభుత్వానికే పంపడం విశేషం . ఈ కేసులో రాజకీయ నాయకులు అదికారులపై నెపం నెట్టడానికి ప్రయత్నిస్తుంటే, అదికారులు రాజకీయ వ్యవస్థపైనే నివేదిక పంపడం సంచలనంగా ఉంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20150716_17.php

తప్పించుకునేందుకే న్యాయవిచారణ


* పుష్కర మరణాలకు ఏపీ ముఖ్యమంత్రే కారణం
* కానీ చివరకు వేరే అధికారులను సస్పెండ్ చేస్తారు
* ఇదే తప్పు వేరేవా
రు చేసుంటే జైలుకు పంపేవారు కాదా?
* చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* కొవ్వూరులో సంప్రదాయబద్ధంగా పుష్కరస్నానం
* దివంగత వైఎస్సార్, రాజారెడ్డిలతోపాటు పుష్కర మృతులకు కూడా పిండప్రదానం
* రాజమండ్రి అయ్యప్ప ఆలయంలో పూజలు

 (పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి)

సాక్షి, కొవ్వూరు/ రాజమండ్రి: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది అమాయక భక్తులు చనిపోవడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయవిచారణ పేరుతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యతనుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం నీతిమాలిన చర్యని మండిపడ్డారు. న్యాయవిచారణ నెపంతో వేరే అధికారులను బాధ్యులను చేసి సస్పెండ్ చేస్తారని చెప్పారు.

 జగన్ మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాజమండ్రిలో జరిగిన విషాద ఘటన మళ్లీ మరెక్కడా జరగకూడదన్నారు. దీనిపై తానొక్కడినే మాట్లాడితే చాలదనీ, మీడియా కూడా స్పందించాలని కోరారు. తప్పుచేసిన వారిని నిలదీయాలని సూచించారు. ‘‘ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజమండ్రిలో జరిగిన పుష్కర మరణాలకు చంద్రబాబు నాయుడే కారణం. సామాన్య భక్తులకు, ఇతరులకు అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబే వీఐపీ ఘాట్‌లు ఏర్పాటు చేయించారు.  కానీ అదే చంద్రబాబు నాయుడు వీఐపీ ఘాట్‌లో కాకుండా లక్షలమంది ప్రజలున్న ఘాట్‌కు వెళ్లి రెండున్నర గంటలపాటు స్నానం, పూజలు ఆచరించారు.

పుష్కరాలకు వచ్చిన సామాన్యులను తన పబ్లిసిటీ కోసం తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఆదేశాలతోనే అధికారులు ఒక్కసారిగా గేట్లు తీశారు. దీంతో గంటలపాటు నిరీక్షించిన ప్రజలు ఒక్కసారిగా లక్షల సంఖ్యలో రావడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటలో మృత్యువాత పడ్డారు. 27మంది మరణానికి కారణమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంవల్లే అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన స్థానంలో వేరే వారుంటే ఇదే చంద్రబాబు నాయుడు వారిని జైలుకు పంపించే వారు కాదా?’’ అని జగన్ ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు తనని తాను రక్షించుకోవడానికి సీఎం న్యాయవిచారణకు ఆదేశించారని ఆక్షేపించారు. చివరకు ఎవరో అధికారులను సస్పెండ్ చేస్తారని ఆయన చెప్పారు. జగన్ పర్యటనలో పార్టీ శాసన సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, సమన్వయకర్తలు తానేటి వనిత (కొవ్వూరు), ఘంటా మురళీరామకృష్ణ (చింతలపూడి), తలారి వెంకట్రావు (గోపాలపురం), రాజీవ్‌కృష్ణ (నిడదవోలు), కారుమూరి నాగేశ్వరరావు (దెందులూరు) తదితరులు పాల్గొన్నారు.
 
 పుష్కరస్నానం.. అయ్యప్ప ఆలయంలో పూజలు
 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి నుంచి రోడ్డుమార్గాన బుధవారం ఉదయం 9.45 గంటలకు కొవ్వూరు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ నివాసంలో కొద్దిసేపు ఉండి, సంప్రదాయ పద్ధతిలో పంచె, ధోవతి ధరించి కాలినడకన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఘాట్ (వీఐపీ ఘాట్)కు వెళ్లారు. గోదావరి మాతకు సంకల్ప పూజ నిర్వహించి, నదీ స్నానమాచరించారు. ఆ తరువాత తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత, నాయనమ్మలు రాజారెడ్డి, జయమ్మలకు, తాత, అమ్మమ్మలకు, ఇతర దివంగతులకు శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రాజమండ్రి పుష్కరఘాట్ దుర్ఘటనలో మృతిచెందిన వారికీ పిండ ప్రదానం చేశారు.
 
 ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా ఘాట్‌లోని మెట్లపై ఒక పక్కగా కూర్చుని మండుతున్న ఎండలోనే గంటసేపు ఈ కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం దశదానాలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనంతో క్రతువు ముగించారు. ఆ తర్వాత అక్కడినుంచి బయలుదేరి కొవ్వూరులో పశ్చిమగోదావరి జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన భారీ అన్నప్రసాద శిబిరాన్ని సందర్శించారు. తాను లోనికి వస్తే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని నిర్వాహకులను బయటే అభినందించారు. అక్కడినుంచి రాజమండ్రికి చేరుకున్న జగన్ సరస్వతీ (వీఐపీ) ఘాట్ పక్కనే ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రానికి (అయ్యప్పస్వామి ఆలయం) చేరుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయం లోపలకి తీసుకెళ్లారు. జగన్ అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. అనంతరం నేరుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు.

Popular Posts

Topics :