29 November 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ఆర్ సీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య

Written By news on Saturday, December 5, 2015 | 12/05/2015


వైఎస్ఆర్ సీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య
హైదరాబాద్ : వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత దొమ్మాటి సాంబయ్య శనివారం తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ వైఎఎస్ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా దొమ్మాటి మాట్లాడుతూ... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అన్నారు. వైఎస్ జగన్, పొంగులేటి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఒకప్పుడు బడుగుల పార్టీ అయిన టీడీపీ ఇప్పుడు హైజాక్ అయిందని, ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని ఆ పార్టీ కోల్పోయిందని దొమ్మాటి సాంబయ్య వ్యాఖ్యానించారు.  బడుగు, బలహీన వర్గాలకు దళిత, గిరిజనులకు టీడీపీ దూరమైందన్నారు. తెలంగాణ టీడీపీలో కొంతమంది నాయకులు టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని దొమ్మాటి విమర్శించారు. టీఆర్ ఎస్ కు కోవర్టులుగా తెలంగాణ టీడీపీ నాయకులు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  టీడీపీ నేతలంతా ...ఆ పార్టీని కూకటి వేళ్లతో పెకలించే పనిలో ఉన్నారని అన్నారు. కాగా దొమ్మాటి సాంబయ్య ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

చైతన్యయాత్ర కాదు జిమ్మిక్కుల జాతర

Written By news on Friday, December 4, 2015 | 12/04/2015


'చైతన్యయాత్ర కాదు జిమ్మిక్కుల జాతర'

గుంటూరు: అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అనే పరిస్ధితులు రాష్ట్రంలో దాపురించాయని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యల పట్టించుకోకుండా తెలుగుదేశం నాయకులు చైతన్యయాత్రల పేరుతో జిమ్మిక్కు జాతరలకు శ్రీకారం చుట్టారని ఆయన ధ్వజమెత్తారు.

గుంటూరులో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లే నేడు వ్యవసాయం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ముందుచూపు లేకపోవటంతోనే అతివృష్టి, అనావృష్టిలను ఎదుర్కోలేకపోయామని.... కేవలం తెనాలి డివిజన్‌లోనే 4లక్షల 90వేల ఎకరాల ఆయుకట్టు ఉంటే దానిలో 80వేల ఎకరాల్లో అసలు నాట్లు పడలేదని మేరుగ తెలిపారు.

సాగైన 20వేల ఎకరాల్లోని పంట పూర్తిగా ఎండిపోయిందని, మిగిలిన పైరులో కొంత ధాన్యం రంగు మారి, మరికొంత నూకగా మారిడంతో పాటు దిగుబడి కూడా పూర్తిగా పడిపోయిందన్నారు. మూడు లక్షల 70వేల ఎకరాల్లో సగానికి సగం దిగుబడి కూడా రైతు చేతికి అందిన దాఖలాలు లేవని, ఇటువంటి పరిస్ధితుల్ల పాడైపోయిన ధాన్యం అంతటినీ ప్రభుత్వమే కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి రూ 20వేలు చొప్పున పరిహారం అందించాలని, రెండో పంటకు ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.మన జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు రైతు సమస్యల పట్ల ఏ మాత్రం చిత్తశుధ్ధి లేదని మేరుగ నాగార్జున విమర్శించారు. ప్రత్తిపాటి సవ్యంగా స్పందించని పక్షంలో రైతులతో కలిసి పోరుబాట చేపడతామని హెచ్చరించారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో వ్యవసాయం పండగలా జరిగిందన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు హాయంలో దండగలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించాల్సిన పాలకులే వారిని అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని అప్పిరెడ్డి  హెచ్చరించారు.

ఇసుకలో వెయ్యి కోట్ల దోపిడీ


ఇసుకలో వెయ్యి కోట్ల దోపిడీ
సాక్షి, హైదరాబాద్ : ఇసుక తవ్వకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి సుమారు రూ. 1,000 కోట్లు దోచుకున్నారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇసుక రాబడిపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా అభూతకల్పనలని విమర్శించారు. గత పాలన చివరి ఏడాదిలో ఇసుక ద్వారా రూ. 121 కోట్ల రాబడి వస్తే తన పాలనలో ఇప్పటి వరకూ రూ 850 కోట్లు ఆదాయం వచ్చినట్లు చంద్రబాబు గొప్పగా చెప్తున్నారన్నారు.

వాస్తవానికి 2009 ఆగస్టు 13న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఒక క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.40లు చెల్లించాలని పేర్కొందన్నారు. దీన్ని పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్థానికంగానే ఇసుక ధరను నిర్ణయించి డ్వాక్రా సంఘాల ద్వారా అమ్మకాలు చేయాలని ఆదేశించిందని గుర్తుచేశారు. అలా పలు జిల్లాల్లో ఆదాయం లెక్కిస్తే సుమారు రూ. 1,000 కోట్లు చంద్రబాబు, ఆయన వందిమాగధులు దోచుకుతిన్నారనేది స్పష్టం అవుతోందన్నారు.
 
ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించాలి
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళా అధికారిణి వనజాక్షిపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేను వెంటేసుకొని సీఎం చంద్రబాబు జనచైతన్యయాత్ర చేస్తున్నారని విమర్శించారు. సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసిన ఆ ఎమ్మెల్యేతో బహిరంగ క్షమాపణ చెప్పించాలని బొత్స డిమాండు చేశారు.
 
చెన్నై బాధితులను ఆదుకోవాలి
చెన్నై వరదలు, వర్షాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న తెలుగువారిని తక్షణం టీడీపీ ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర మంత్రి ఒకరి నేతృత్వంలో అక్కడికి ఒక ఉన్నతాధికారుల బృందాన్ని పంపి వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందని బొత్స తెలిపారు.తమిళనాడులోనూ, రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సంభవించిన వరదలపైనా తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలతో సమావేశమై చర్చించారని తెలిపారు. ఈ అంశాలను   బుధవారం తమ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారన్నారు.
 
ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా?
నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాలని చూస్తే వారిని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బొత్స తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా? ప్రజా సమస్యలపై గళం విప్పే స్వాతంత్య్రం కూడా లేదా? అని బొత్స ప్రశ్నించారు.

కుట్రలో భాగమే

Written By news on Thursday, December 3, 2015 | 12/03/2015


చంద్రబాబుది నియంత పాలన : ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి: భూముల సర్వేను లైసైన్స్‌డ్ సర్వేయర్లకు అప్పగిస్తే భూ వివాదాలు మరింత పెరగడంతో పాటు అవినీతి విచ్చలవిడిగా మారే అవకాశం ఉందని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని తన కార్యాలయంలో ఆర్కే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లైసైన్స్‌డ్ సర్యేయర్లకు సర్వే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు.
 
ముఖ్యంగా రాజధాని ప్రాంత పేదలకు చెందిన లంక అసైన్డ్‌భూములను కొట్టేసేందుకే ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలో భాగమే లెసైన్స్‌డ్ సర్యేయర్లను ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. అధికారపార్టీ నేతలు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు తెచ్చి ఇప్పటికే అక్రమాలు చేయిస్తూ రెవెన్యూ కార్యాలయాల్లో దళారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మాటవినని అధికారులను సైతం బదిలీ చేయిస్తామని, అవినీతి నిరోధక శాఖకు పట్టిస్తామంటూ బెదిరిస్తూ.. పనులు చేయించుకుంటూ అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఇక సర్వేలను తమ ఇష్టానుసారంగా నిర్వహించి భూములు కాజేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
 
కీలకమైన రెవెన్యూ శాఖలో నూతన రిక్రూట్‌మెంట్‌తో ఉద్యోగాలను భర్తీచేసి ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం.. ఇలా ప్రైవేటు వ్యక్తులకు సర్వే బాధ్యతలను అప్పగించి అవినీతిని ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన రెవెన్యూ మంత్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు రెవెన్యూశాఖలో నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రివర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అవేమీ పట్టించుకోని ముఖ్యమంత్రి నియంతపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలగానే లెసైన్స్ సర్వేయర్లతో అవినీతి పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నందున వెంటనే జీవోను ఉపసంహకరించుకోకపోతే కోర్టులో పిల్ వేస్తానని స్పష్టం చేశారు.

తన సామాజికవర్గానికి దోచిపెట్టేందుకే..
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుండగా, అది కాదని అధికార యంత్రాంగాన్ని హడావుడిగా తరలించాలని అనుకోవడం వెనుక చంద్రబాబు అద్దె నివాసాల పేరుతో తన అనుకూల సామాజిక వర్గానికి దోచిపెట్టేందుకేనని విమర్శించారు. అందులో భాగంగా తనకు అక్రమ కట్టడమైన అతిథి గృహాన్ని అద్దెకు ఇచ్చిన వారికి బహుమతిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు వున్న అపార్ట్‌మెంట్లు, విల్లాలకు భారీ అద్దెలు చెల్లించి దోచిపెడుతున్నారని ఆర్కే ఆరోపించారు. ఉద్యోగులను తరలించాలని విజయవాడ చుట్టుపక్కల అద్దెలకు తీసుకుంటున్న అపార్ట్‌మెంట్లు, అతిథి గృహాలు అన్ని తన బినామీలు, సామాజిక వర్గానికి చెందినవేనని, వాటికి అత్యధిక అద్దెలు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వానికి మేకపాటి వినతి


పెద్ద ఎత్తున సాయమందించాలి
♦ భారీవర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలి
♦ కేంద్రప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి వినతి

 సాక్షి, న్యూఢిల్లీ: భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రమే ముందుకొచ్చి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో భారీవర్షాలవల్ల వాటిల్లిన నష్టంపై లోక్‌సభలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘గడిచిన మూడేళ్లుగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు వచ్చినప్పుడు చెప్పుకోదగిన వర్షాలు పడలేదు. అంతేగాక తీవ్రమైన కరువు పరిస్థితుల్ని ఈ ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇటీవల వర్షాలు పడగానే తొలుత రైతులంతా సంతోషపడ్డారు.  దురదృష్టవశాత్తూ  కురిసిన భారీవర్షాలు తీవ్రనష్టాన్ని మిగిల్చిపోయాయి.  చెన్నై పొరుగునే ఉన్న నెల్లూరూ ఇదేరీతిలో నష్టాలు చవిచూసింది. పంటలన్నీ ధ్వంసమయ్యాయి.

ఒక్క నెల్లూరులోనే 25 వేల ఎకరాల్లో ఆక్వాకల్చర్ సాగవుతోంది. ఎకరాకు రూ.7 లక్షలవరకు రైతులు పెట్టుబడి పెట్టారు. అదంతా తుడిచిపెట్టుకుపోయింది. నష్టం రూ.1,500 కోట్లనుంచి రూ.1,700 కోట్లవరకు ఉంటుంది. అరటి, తమలపాకు తోటలు ధ్వంసమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 1.5 లక్షల ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రైతులు వేరుశనగ సాగు చేస్తే అదీ ధ్వంసమైంది. రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి.

రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. పౌల్ట్రీ కూడా నష్టపోయింది.ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నవిషయం కేంద్రానికి తెలుసు. అందువల్ల రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి. కేంద్రబృందాన్ని పంపి నష్టాన్ని అంచనా వేయించి భారీఎత్తున సాయం చేయాలి’’ అని మేకపాటి కోరారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ.. భారీవర్షాలవల్ల తిరుపతి నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారని వివరించారు.

చేనేత కార్మికులకు చంద్రబాబు మొండిచేయి


రుణమాఫీ కాదు.. చేతకాని మాఫీ
♦ చేనేత కార్మికులకు చంద్రబాబు మొండిచేయి
♦ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శ

 సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ విషయంలో మోసం చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు చేనేత కార్మికులకు కూడా ద్రోహం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు చేతిలో ద్రోహానికి గురవుతున్న వర్గాల జాబితాలో చేనేత కార్మికులు కూడా చేరుతున్నారని చెప్పారు. చేనేత రుణమాఫీని చేతగాని మాఫీగా మార్చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల రుణాలు రూ.365 కోట్ల మేర ఉన్నాయని అధికారులు నివేదిక సమర్పిస్తే ఇప్పుడు రూ.110 కోట్లు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. చెల్లించాల్సిన రుణాల్లో 60 శాతం కోత విధించడం ఏమిటని పార్థసారథి ప్రశ్నించారు. చేనేత కార్మికుల సంక్షేమం గురించి ఎన్నికల ముందు చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో చాలా గొప్పలు చెప్పారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక వారికి మొండిచేయి చూపారని దుయ్యబట్టారు.

 రుణ మాఫీ చేయకుండా విలాసాలా?
 వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని కొలుసు పార్థసారథి చెప్పారు. మరణించిన చేనేత కార్మికునికి రూ.1.5 లక్షల పరిహారం చెల్లించేలా జీఓ 119ను తెచ్చారని, వారు పింఛను పొందే వయోపరిమితిని 60  ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. రూ.312 కోట్ల రుణాలను కూడా మాఫీ చేస్తూ జీఓ జారీ చేశారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయకుండా ఆ డబ్బును విలాసాలకు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

 ఆనంకు నైతికత ఉందా? : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి నైతికత లేదంటూ టీడీపీలో చేరిన ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించడాన్ని పార్థసారథి తప్పు పట్టారు. అసలు తనకు నైతికత ఉందా? లేదా? అని తనను తాను ప్రశ్నించుకుంటే మంచిదన్నారు.

వరద బాధితులను ఆదుకోండి: జగన్


వరద బాధితులను ఆదుకోండి: జగన్
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. ఆయన బుధవారం ఆ జిల్లాల పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.  ఇబ్బందుల పడుతున్న వారి కోసం తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు

భారీ వర్షాలు, వరదలపై వైఎస్ జగన్ ఆరా

Written By news on Wednesday, December 2, 2015 | 12/02/2015


భారీ వర్షాలు, వరదలపై వైఎస్ జగన్ ఆరా
హైదరాబాద్ : చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. బుధవారం ఆయన... రెండు జిల్లాల పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ ఈ సందర్బంగా  వైఎస్ఆర్ సీపీ పార్టీ శేణ్రులను ఆదేశించారు.
 
కాగా నెల్లూరు జిల్లాలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పంటపొలాలు మళ్లీ నీటమునుగుతున్నాయి. ఊళ్లను నీళ్లు చుట్టుముడుతున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలోనూ మళ్లీ వానకష్టాలు మొదలయ్యాయి. పుత్తూరు మండలం శ్రీరంగంచెరువు, నగరి మండలం బీమానగర్ చెరువు మొరవలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు జలమయయ్యాయి.

గ్రేటర్ ఎన్నికలపై టీ. వైఎస్సార్ సీపీ సమీక్షలు

Written By news on Tuesday, December 1, 2015 | 12/01/2015


హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో సమీక్షల్లో రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు కె. శివకుమార్‌లు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 3వ తేదీ గురువారం కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి...శుక్రవారం కూకట్ పల్లి, మల్కాజ్ గిరి నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించనున్నారు.

ఆ తరువాత రెండు రోజులు పాటు ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ సమీక్షలు జరపనుంది. ఈ సమీక్షల్లో గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ అభ్యర్థి ఎంపికతో పాటు, స్థానికంగా పార్టీ బలోపేతానికి చర్చిస్తామని గ్రేటర్ నాయకులు తెలిపారు. ఈ సమావేశాల్లో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

ప్రజా బ్యాలెట్


చంద్రబాబు పాసా? ఫెయిలా?
*ప్రజా బ్యాలెట్

-ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పిందేమిటి...
-అధికారంలోకి వచ్చి 18 నెలలుగా చేసిందేమిటి?
-మీరే మార్కులేయండి.


ఎన్నికలకు ముందు వందలాది వాగ్దానాలు చేసిన టీడీపీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటైనా నెరవేర్చారా? బాబు వాగ్దానాల్లో మచ్చుకు 100 ఇక్కడ ఇచ్చాం. వంద మార్కులకు సీఎంకు ఎన్ని మార్కులు వేస్తారో మీరే  నిర్ణయించండంటూ ప్రశ్నావళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... సాక్షి దిన పత్రికలో 100 ప్రశ్నలు సంధించింది. జన చైతన్య యాత్రలంటూ వస్తున్న టీడీపీ నేతలను నిలదీయాలని వైఎస్ఆర్ సీపీ సూచించింది. బాబుకు మీరెన్ని మార్కులు వేస్తారో... ఇక్కడ క్లిక్ చేయండి. ప్రజా బ్యాలెట్
 

మిథున్ రెడ్డిపై కేసు వెనుక రాజకీయ కుట్ర


తిరుపతి: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. దురుద్దేశపూర్వకంగానే మిథున్ రెడ్డిపై కేసు పెట్టారని విమర్శించారు.

ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మిథున్ రెడ్డిపై పెట్టిన కేసు ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.

పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ దృష్టి


పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై వైఎస్సార్‌సీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలను బలోపేతం చేసి పార్టీ విస్తరణ కార్యక్రమాలను చేపట్టనుంది. ఇప్పటికీ తెలంగాణలో దివంగత నేత వైఎస్సార్‌ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలు, ప్రేమ ఉన్నాయని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశ ంతోనే వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిందన్నారు. వైఎస్సార్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు, జగన్‌పై అభిమానానికి ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేతకు ప్రజలు పలికిన నీరాజనాలే నిదర్శనమన్నారు.

గ్రామస్థాయిలో పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో వేయించగలిగేలా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందన్నారు. సోమవారమిక్కడ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటి అధ్యక్షతన సమావేశం జరిగింది. వరంగల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై ఇందులో చర్చించారు. రాష్ర్టంలో పార్టీని మరింత పటిష్టం చేసి, విస్తరించేందుకు వరంగల్ ఎన్నికల్లో పోటీచేశామన్నారు. గెలుపోటములు సహజమని ఆయా పరిణామాలతో కుంగిపోవాల్సిన అవసరం లేదని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

 క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు
 వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఉపేక్షించే ప్రసక్తి ఉండదని పొంగులేటి స్పష్టంచేశారు. పార్టీ నియమావళికి కట్టుబడి, అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. పార్టీపరంగా చేపట్టే ఏ కార్యక్రమం అయినా ఆషామాషీగా తీసుకోకుండా అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని పార్టీ నాయకులకు సూచించా రు. స్థానిక సంస్థల కోటాలో శాసన మండ లికి జరగనున్న ఎన్నికల్లో వైస్సార్‌సీపీ పోటీ, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. పార్టీ విధివిధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని నాయకులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించి పార్టీ అధినేత జగన్‌తో సుదీర్ఘంగా చర్చించానని, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుం దన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతమైతే ఏ ఎన్నికల్లోనైనా విజయం తథ్యమన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వాటిలో పాల్గొనాలని, పార్టీ ని మరింత బలోపేతం  చేసుకోవాలన్నారు.

 త్వరలో పార్టీలోకి దొమ్మాటి సాంబయ్య
 వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు దొమ్మాటి సాంబయ్య త్వరలోనే వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాష్, కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, సాయిచరణ్, మతీన్ ముజాహిద్, నిరంజన్‌రెడ్డి, ముజ్తాఫా, మట్టా దయానంద్, కొండారాఘవరెడ్డి, సురేష్‌రెడ్డి, రాజ్‌కుమార్‌గౌడ్, సింగిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి

పశ్చిమగోదావరి: టీడీపీ కార్యకర్తల దుర్మార్గాలకు అడ్డూ అదుపులేకుండాపోతోంది. వారివల్ల పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెర్త గ్రామంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆలపాటి నరేంద్ర ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లోని పర్నీచర్, ధ్వంసమైంది. ఇంట్లో పూలకుండీలన్ని పగులగొట్టారు. ఆలపాటి నరేంద్రకు తీవ్ర గాయాలవగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ఈ దాడిని పలువురు వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. కారుమురి నాగేశ్వరరావు దీనిపై స్పందిస్తూ టీడీపీ కార్యకర్తలు ఇంతటి దాష్టికానికి పాల్పడటం సరికాదని అన్నారు. దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ దాడి పాతకక్షలతోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. చెరువుల విషయంలో గతంలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా: పార్థసారధి

Written By news on Monday, November 30, 2015 | 11/30/2015


ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా: పార్థసారధి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం లో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. దోపిడీ దొంగలు సమావేశమైనట్లుగా కేబినెట్ భేటీ జరుగుతోందని ఆయన విమర్శించారు. దోచుకునేందుకే కేబినెట్ భేటీ అయిందని మండిపడ్డారు.  సోమవారం ఆయన లోటస్‌ పాండ్‌ లో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ  చంద్రబాబు వ్యవహార శైలి సంక్షేమ పథకాలకు కోతపెట్టే విధంగా ఉందన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పార్థసారధి పేర్కొన్నారు.


అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా అని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా అడిగారు. ఏపీలో ప్రజలంతా అశాంతితో కాలం నెట్టుకు వస్తున్నారని ఆయన అన్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా భర్తీ చేశారా అని పార్థసారధి అన్నారు. ఉద్యోగాలు రాక దాదాపు నాలుగువేల మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఎవరైనా చావండి మాకేంటి సంబంధం అన్న చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్థసారధి వ్యాఖ్యానించారు. దాదాపు 28 లక్షలమంది నిరుద్యోగులు .. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.

పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం


పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం : పొంగులేటి
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, అయితే వరంగల్ ఉప ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విఫలమయ్యామని తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం పొంగులేటి అధ్యక్షతన తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  సమావేశం లోటస్ పాండ్ లో జరిగింది.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నిక వైఫల్యాలకు కారణాలను విశ్లేషించామని, తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు, వచ్చే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఆ ఆరోపణలు అవాస్తవం


ఆ ఆరోపణలు అవాస్తవం: మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ : తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, రాజకీయ దురుద్దేశ్యంతో కూడినవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాఙకీయ ప్రత్యర్ధుల ప్రోద్భలంతో స్థానిక పోలీసులు తప్పడు కేసు పెట్టారని, సీసీటీవీ ఫుటేజీ వివరాలు వెల్లడి చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. విలేకరుల సమావేశం లో ఎంపీలు మేకపాటి రాఙమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బి. రేణుక, వరప్రసాద్ పాల్గొన్నారు.

ఆ రోజు జరిగిన సంఘటనను వివరిస్తూ, ‘నవంబర్ 26 వ తేదీన హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లో తిరుపతి విమాశ్రయంలో దిగాను. మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోమోహన్ రెడ్డి అదే విమానంలో హైద్రాబాద్ వెళుతున్నారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడి విమానాశ్రయం బయటకు వస్తున్నా... అదే సమయం లో మేనేజర్ రాఙశేఖర్ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విమానం ఎక్కనివ్వడం లేదని కొందరు తనకు ఫిర్యాదు చేసారు.  సంబంధిత వ్యక్తి కోసం తాను ఎదురు చూశాను. అతను వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆలస్యానికి కారణాలను ప్రశ్నించా. సరైన సమాధానం ఇవ్వడానికి బదులుగా నాతో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు బాధిత యాత్రికులతో పాటు పలువురు ప్రత్యక్ష సాక్ష్యులున్నారు. కొందరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసారు, అయితే కొద్దిసేపటి తర్వాత సంబంధిత అధికారి, తన సీనియర్ అధికారులు, స్థానిక పోలీసుల సమక్షంలొ క్షమాపణ చెప్పారు.’ అని మిథున్ రెడ్డి వివరించారు.

ఆ సమస్య అంతటితో ముగిసిందని ఆయన అన్నారు. అయితే తాను మేనేజర్ పై దాడి చేసానని రాత్రి సమయం లో ఫిర్యాదు చేసారని, అది వాస్తవం కాదని స్పష్టం చేసారు. సంఘటన ఙరిగిన సమయం నుంచి రాత్రి వరకూ ఏమి జరిగిందో తనకు తెలియదని మిథున్ రెడ్డి చెప్పారు.  తమ వాదనను రుజువు చేయడానికి సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని డిమాండ్ చేసానని, అయితే ఇంతవరకూ వాటిని విడుదల చేయకపోవడాన్ని బట్టి సంఘటన వివరాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్ధుల ప్రోద్భలమే అందుకు కారణమని  మిథున్ రెడ్డి చెప్పారు. ఈ విషయం పై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కు ఫిర్యాదు చేసానని, హైకోర్టును ఆశ్రయిస్తానని మిథున్ రెడ్డి తెలిపారు,

5 శాతం వృద్ధిరేటు మాటేమోగానీ.. బాబు, ఆయన కుమారుడి వృద్ధిరేటు ఎక్కడికో ...


చంద్రబాబువి పచ్చి అబద్ధాలు
15 శాతం వృద్ధిరేటు సాధిస్తామనడం కోతలే: ఎమ్మెల్యే రోజా ధ్వజం
దేశ వృద్ధిరేటే ఏడు శాతం.. ఏపీలో మాత్రం 15 శాతం ఎలా సాధ్యం?
15 శాతం వృద్ధిరేటు సాధించడం మాటేమోగానీ..
బాబు, ఆయన కుమారుడి వృద్ధిరేటు ఎక్కడికో వెళ్లిపోయింది

సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆయన మాటలు వింటూంటే ప్రజలు భయపడిపోతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు.

ఆమె ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వచ్చేఏడాది కల్లా రాష్ట్రంలో 15% వృద్ధిరేటు(జీడీపీ) సాధించాలని ఊహకందని మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ వృద్ధిరేటు ఉండే చైనాలోనే 7.40%, భారత్‌లో 7% ఉంటే ఏపీలో మాత్రం 15% లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పడంచూస్తే.. సీఎంగా మాట్లాడుతున్నారా? లేదా పోలిగాడి మాదిరి బొంకుతున్నారా? అనిపిస్తోందన్నారు.

‘బొంకరా...బొంకరా పోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయలంత..’ అన్నట్లుగా చంద్రబాబు మాటలున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కరువు, వరదలతో కుదేలైందని, విభజన తరువాత పరిశ్రమల్లో 70 %, ఐటీ రంగంలో 95% హైదరాబాద్‌లోనే ఉండిపోతే ఏపీలో వృద్ధిరేటు రెండింతలెలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. వాస్తవికం గా సాధించగలిగేవి, గతంలో ఎవరైనా సాధిం చినవే లక్ష్యాలుగా నిర్ణయించుకోవాలిగానీ ఇలాంటి అబద్ధాలు చెప్పరాదన్నారు.

ఆయన గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా చేసినపుడూ రెండంకెల వృద్ధిరేటు(డబుల్ డిజిట్) సాధిం చిన దాఖలాల్లేవని, అలాంటిది ఇపుడెలా సాధ్యమని రోజా ఆశ్చర్యం వెలిబుచ్చారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తాను నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఇలాగే అబద్ధాలు చెబుతూపోయారని, ఆయన మాటలు వింటున్న స్వీడన్ ఆర్థికమంత్రి జోక్యం చేసుకుని తమ దేశంలో రాజకీయవేత్తలు ఇలాంటి మాటలు మాట్లాడితే జైలుకు పంపుతాం.. లేదంటే పిచ్చాసుపత్రికి పంపుతామన్నారని ఆమె గుర్తుచేశారు. సాధ్యంగాని, అసంబద్ధమైన మాటలు చెబుతున్న చంద్రబాబును ఎక్కడికి పంపాలో ఆయనే నిర్ణయించుకోవాలని, ‘ఆప్షన్ ఏ జైలు.. ఆప్షన్ బి పిచ్చాసుపత్రి...’ అని రోజా ఎద్దేవా చేశారు.
 
టీడీపీ రికార్డులు చాలా ఉన్నాయి..
పద్దెనిమిది నెలల టీడీపీ పాలనలో సాధించిన రికార్డులు, అభివృద్ధి చాలానే ఉన్నాయని రోజా వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థుల ఆత్మహత్యల్లో అరుదైన రికార్డులు నెలకొల్పారన్నారు. మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు చేయడంలో దేశంలోనే నంబర్‌వన్‌గా టీడీపీ పాలనలో గణుతికెక్కారన్నారు. చింతమనేనిలాంటి ఎమ్మెల్యేలు మహిళలను దూషించడాన్ని బాబు వెనకేసుకొస్తున్నారని ఆమె తప్పుపట్టారు.

బాబుకు ఆడపిల్లల్లేరు కనుక వారి బాధలు తెలియవని, అందుకే తనచుట్టూ ఉన్న బొండా ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల లాంటివారు మహిళా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా ప్రోత్సహిస్తున్నారని రోజా విమర్శిం చారు. రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటు సాధించడం మాటేమోగానీ.. చంద్రబాబు, ఆయన కుమారుడి వృద్ధిరేటు ఎక్కడికో వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డంగా దోచేసుకుంటున్నారని, టీడీపీ వారి దోపిడీలో వృద్ధిరేటు 15 శాతం కాదు.. 150 శాతం ఉందనడంలో అతిశయోక్తి లేదన్నారు.
 
టీడీపీవాళ్లు సైకో సూదిగాళ్లు
టీడీపీలో ఉన్నవాళ్లంతా సైకో సూదిగాళ్లలా తయారయ్యారని, తమ న్యాయమైన కోర్కెల సాధనకు ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ మహిళలను సూదులతో గుచ్చడం, వారికి రక్తం వచ్చేలాగా కొట్టడం వంటివి చేయిస్తున్నారని రోజా విమర్శించారు. అంగన్‌వాడీ టీచర్లనుద్దేశించి చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. మహిళలనుద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడుతున్న టీడీపీ నేతల్ని వారి భార్యలు, కుమార్తెలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.

పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు

Written By news on Sunday, November 29, 2015 | 11/29/2015


పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విజయం సాధించిన తెలుగుతేజం పీవీ సింధును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఆదివారం జరిగిన మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-9, 21-23, 21-14 తేడాతో జపాన్ కు చెందిన క్రీడాకారిణి మినత్సు మితానిని ఓడించింది. మకావు ఓపెన్ లో సింధు విజేతగా నిలవడమిది వరుసగా మూడోసారి కావడం విశేషం.

కండిషనల్ బెయిల్‌పై చంద్రబాబు!


కండిషనల్ బెయిల్‌పై చంద్రబాబు!
♦ ధ్వజమెత్తిన అంబటి రాంబాబు
♦ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు
♦ వెంకయ్యనాయుడు మధ్యవర్తిత్వం... కేసీఆర్ షరతులు
♦ అందుకే మూడు నెలలుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టలేదు

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్ద కండిషనల్ బెయిల్ తీసుకుని 88 రోజుల తరువాత ఉమ్మడి రాజధానిలోని సచివాలయంలో అడుగుపెట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడి ్డని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం లో స్వర సహితంగా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ తరువాత హైదరాబాద్ వైపు చూడ్డం మానేశారన్నారు.

చంద్రబాబు సచివాలయంలోని తన చాంబర్‌కు రూ.25 కోట్లు, హెచ్ బ్లాక్‌కు రూ.10 కోట్లు, లేక్‌వ్యూ అతిథి గృహానికి (క్యాంపు కార్యాలయం) రూ. 10 కోట్లు... మొత్తం రూ. 45 కో ట్లు వ్యయం చేసి ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసుకుని 88 రోజుల పాటు ఇక్కడికి రాకుండా ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. విభజన బిల్లు ప్రకారం పదేళ్ల పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉన్నా ఇక్కడ ఉండరని ఏపీ ముఖ్యమంత్రి తరపున  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేసీఆర్ కు పూచీకత్తు ఇచ్చారని, ఆయన మధ్యవర్తిత్వంలోనే వీరిద్దరి మధ్య ఈ షరతు మేరకు అంగీకారం కుదిరిందని చెప్పారు. ఈరోజు చంద్రబాబు సచివాలయానికి వచ్చారంటే అది కేసీఆర్ అనుమతితోనే అని ఎద్దేవా చేశారు. ఈ విధంగా కేసీఆర్ వద్ద  కండిషనల్ బెయిల్ తీసుకుని పాలిస్తున్న చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే నైతిక హక్కుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అంగన్‌వాడీలపై అణచివేత పాశవికం
 చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 23 నుం చి జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీ టీచర్లు చేస్తున్న ఆందోళనను పాశవికంగా అణచివేయడం దారుణమని అంబటి విమర్శించారు. 

 చంద్రబాబుకు అంబటి సూటి ప్రశ్నలు
   రాజకీయనేతలు పత్రికలు, టీవీ చానెళ్లు పెట్టకూడదని ధర్మ పన్నాలు వల్లిస్తున్న చంద్రబాబూ... మీ పార్టీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీవీ చానెల్‌ను నడపడం లేదా?   మీ కుమారుడు లోకేశ్ బాబుతో ‘స్టూడియో-ఎన్’లో పెట్టుబడులు పెట్టించి నిర్వహణ చేయించింది తెలియదనుకుంటున్నారా?   లోకేశ్ నిర్దేశకత్వంలో ఆ చానెల్ చూసేవాడే దిక్కులేకపోతే ఆ యాజమాన్యం ఆయన్ను బయటకు పంపించిన విషయం తెలియదా?   సైకిల్‌పై తిరిగే ఒక వ్యక్తి పత్రికలో వేల కోట్లు బినామీగా పెట్టుబడులు పెట్టి నడిపించడం లేదా?
   మీకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు చదవొద్దని, చానెళ్లను చూడద్దని చెప్పడానికి మీకేం హక్కుంది?
   మీకు వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తున్నారని ఎన్టీవీ ప్రసారాలను 13 జిల్లాల్లో నిలిపివేయించింది వాస్తవం కాదా?

Popular Posts

Topics :