10 May 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పింఛన్ల కోసం తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ

Written By news on Saturday, May 16, 2015 | 5/16/2015


చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారు: వైఎస్ జగన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆరో రోజు శనివారం వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఉజ్జహల్ లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. గ్రామాల్లో పేదలు పింఛన్ల కోసం తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్జహల్ సభలో వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు వాగ్దానాలను నమ్మి తాము మోసపోయామని డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్ తో మొరపెట్టుకున్నారు.

'రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు


అనంతపురం:రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో శనివారం ఆరో రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కనేకల్ లో ధాన్యాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు.  ఈ సందర్భంగా వరిపంట సాగు చేసే రైతుల  సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులు జగన్ కు విన్నవించారు.

ధాన్యానికి ప్రభుత్వం రూ. 1360 మద్దతు ధర ప్రకటించినా.. కనేకల్ లో మాత్రం రూ. 1300 లోపే ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని జగన్ తప్పుబట్టారు. ఎరువుల ధరలు అమాంత పెరిగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం పెట్టుబడులు సైతం గిట్టుబాటు కావకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే పింఛన్ ఆపుతారా?


ఉసురు ఖాయం
► ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే పింఛన్ ఆపుతారా?
► ముసలోళ్ల ఉసురు తగలక తప్పదు
► వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు పోతయ్...
► త్వరలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
► భరోసా యాత్రలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్
► ఉరవకొండ నియోజకవర్గంలో కొనసాగిన ఐదో రోజు యాత్ర
► సీఎంపై చేనేత కార్మికుల శాపనార్థాలు


 (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఫ్యాన్‌కు ఓటేసినానని నా పింఛను నిలిపేసిరి. మేం ముగ్గురం అన్నదమ్ములం. ముగ్గురమూ ముసలోళ్లమే. మూడు నెలలుగా అందరికీ పింఛన్ ఆపేశారు. ఇదేమన్నా నాయంగా ఉందాని అడిగితే కసురుకుంటున్నారు బాబూ’ అంటూ కాళ్లు తడబడుతుంటే,  గద్గత స్వరంతో  పెద్దాయన చెప్పిన మాటలు విన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఏం బాధ పడకు తాతా.. న్యాయం, ధర్మం వదిలేసి నిస్సిగ్గుగా అరాచకాలు చేస్తోన్న టీడీపీ నేతలపై గట్టిగా పోరాడదాం.

అన్ని నియోజకవర్గాల్లో పింఛను రాని వృద్ధులను వెంటబెట్టుకుని కలెక్టరేట్‌ను ముట్టడిద్దాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మేమన్నా పాకిస్తాన్‌లో ఉన్నామా అంటూ కడిగేద్దాం’ అని ధైర్యం చెప్పారు. రైతుభరోసా యాత్రలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఉరవకొండలో స్థానిక శాసనసభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన చేనేత కార్మికుల ముఖాముఖి నిర్వహించారు. ఎర్రగొండ గ్రామానికి చెందిన వృద్ధుడు వన్నూరప్ప వేదిక పెకైక్కి మైకందుకుని తన గోడు వెళ్లబోసుకున్నాడు.

పోయిన ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసినామని టీడీపీ నాయకులు గ్రామంలో మొత్తం 47 మందికి పింఛన్లను ఆపేశారని ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్ తనయుడు శివ వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాబుకు ముసలోళ్ల ఉసురు తగులుతుందిలే. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు పోతయ్.నువ్వేం బెంగపడక’ంటూ జగన్ నచ్చజెప్పారు. ఈ సందర్భంగా పలువురు డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, రైతులు సీఎం పీఠం ఎక్కాక చంద్రబాబు విస్మరించిన ఎన్నికల హామీలను లేవనెత్తుతూ ఆయనకు శాపనార్థాలు పెట్టారు. లక్ష్మీదేవమ్మ అనే మహిళ డ్వాక్రా రుణాలు కట్టే ప్రసక్తిలేదనీ, మోసం చేసిన బాబు వాటిని మాఫీ చేయాలని డిమాండు చేశారు.

 భగభగ మండే ఎండలోనే....
 శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ భానుడు ప్రతాపాన్ని చూపాడు. అయినా వెనుకంజ వేయకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉరవకొండ, పందికుంట, వెంకటంపల్లి గ్రామాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ఉరవకొండలోని రైతు అందెల వన్నయ్య ఇంటికెళ్లి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా చేనేత కార్మికుల కాలనీకి చేరుకున్నారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావదానంగా విన్నారు.

ఈ సందర్భంగా చేనేత సంఘం నేతలు చెంగల మహేశ్, చందా వెంకటస్వామి, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ చేనేతలు పడుతున్న ఇక్కట్లు, ప్రభుత్వం అవలంబిస్తోన్న నిర్లక్ష్య వైఖరిని వివరించారు. చేనేత కార్మికులకు మూడు నెలలుగా నిలిపేసిన రూ.600 సబ్సిడీని పునరుద్ధరించాలని కోరారు. పట్టు, జరీ, నూలు వంటి ముడి సరుకు ధరలు తగ్గేలా చూడాలన్నారు. ముక్కుపుడక కూడా కుదవ పెట్టి అప్పులు తీర్చామని, బాబు మాటలు నమ్మి మోసపోయామని వరలక్ష్మి అనే మహిళ వాపోయింది. చంద్రబాబుకు ఈ మధ్యనే మతిమరుపు వ్యాధి వచ్చిందనీ, ఆ దేవుడు కరుణిస్తేగానీ అది నయం కాదని చమత్కరించిన జగన్.. చేనేత కార్మికుల్లో భరోసా నింపారు.

 అన్నా...నీకు రుణపడి ఉంటాం..
 ఉరవకొండ నుంచి పందికుంట బయలుదేరిన వైఎస్ జగన్‌ను ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నేతలు ఆదినారాయణరెడ్డి, మీసాల రంగన్నతో పాటు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ డి. శ్రీనివాసరెడ్డి, కొండయ్య, వెంకటేశ్వర్లు, సర్వానాయక్‌లు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ‘అన్నా.. నీకు రుణపడి ఉంటాం.మీరు మద్దతు తెలిపి ప్రకటన చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించింద’ని అన్నారు. అనంతరం వైఎస్ జగన్ తట్రకల్లు మీదుగా పందికుంట చేరుకున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఓబులేసు కుటుంబాన్ని పరామర్శించారు.

అక్కడి నుంచి వెంకటంపల్లి పెద్దతండా చేరుకుని గోవిందనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత వెంకటంపల్లిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జోరున కురిసే వర్షంలోనూ వెంకటంపల్లి, జయరాంపురం గ్రామస్తులు వైఎస్ జగన్ కోసం ఎదురు చూశారు. ఉరవకొండ నుంచి వెంకటంపల్లి వరకూ అభిమానులు ఎండావానలను లెక్క చేయకుండా వెన్నంటే ఉండటం గమనార్హం. జయరాంపురం, షేక్షానుపల్లి గ్రామాల్లోనూ అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి.. స్వాగతం పలికారు. జగన్ వెంట మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఉన్నారు.

 నేటి జగన్ రైతు భరోసాయాత్ర సాగేదిలా..
 అనంతపురం ఎడ్యుకేషన్  : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత రైతుభరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంటుంది. ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం.. ఉరవకొండ పట్టణం నుంచి బయలుదేరి వివిధ గ్రామాల మీదుగా కణేకల్లుకు చేరుకుంటారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు గంగవరం శర్మాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ,  ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

నేటి జగన్ రైతు భరోసాయాత్ర సాగేదిలా..

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత రైతుభరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంటుంది. ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం.. ఉరవకొండ పట్టణం నుంచి బయలుదేరి వివిధ గ్రామాల మీదుగా కణేకల్లుకు చేరుకుంటారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు గంగవరం శర్మాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ,  ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

ధైర్యంగా ఉండండి


ధైర్యంగా ఉండండి
వన్నప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

 ఉరవకొండ : ‘కష్టాలున్నాయని అధైర్యపడొద్దు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. పిల్లలను బాగా చదివించాల’ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాతపేటకు చెందిన రైతు అందెల వన్నప్ప భార్య సుశీలమ్మకు సూచించారు. రెండోవిడత రైతుభరోసా యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, వన్నప్ప భార్య సుశీలమ్మ మధ్య సంభాషణ ఇలా సాగింది.

 వైఎస్ జగన్ :  ఏం తల్లీ బాగున్నారా?
 సుశీలమ్మ:  వూకు దిక్కు లేకుండా పోరుుంది సార్.
 జగన్ :  పిల్లలు ఎంతమంది తల్లీ?
 సుశీలమ్మ: ఒక కొడుకు, ఇద్దరు ఆడ పిల్లలు.
 జగన్ : ఎన్నెకరాల పొలముంది?
 సుశీలమ్మ : రెండెకరాల సొంత పొలముంది. కౌకుంట్లలో పదెకరాలు గుత్తకు తీసుకున్నాం.
 జగన్ : పిల్లలు స్కూల్‌కు వెళుతున్నారా?
 సుశీలమ్మ : వెళ్తున్నార్ సార్. కొడుకు 6వ క్లాసు, పాప 3వ క్లాసు.
 జగన్: అప్పెంత ఉందమ్మా?
 సుశీలమ్మ : బయుట రూ.3లక్షల వరకు ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్‌లో నా బంగారు చైను పెట్టి రూ.50 వేలు తీసుకొచ్చాం.
 జగన్ : ధైర్యంగా ఉండండి. పిల్లలను బాగా చదివించమ్మా..
 సుశీలమ్మ: అలాగే సార్.

 కూలికెళితే గానీ పూట గడవదయ్యా..
 వజ్రకరూరు : ‘కూలికెళితే గానీ పూట గడవడం లేదు. చాలా కష్టాల్లో ఉన్నాం సార్’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన రైతు ఓబుళేసు భార్య ఓబుళమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. రైతు భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం వైఎస్ జగన్ ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఓబుళేసు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్, ఓబుళమ్మ మధ్య సంభాషణ ఇలా సాగింది.

 జగన్ :  నీ భర్త ఎలా చనిపోయాడమ్మా ?
 ఓబుళమ్మ : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సార్.
 జగన్: ఎంత భూమి ఉంది తల్లీ?
 ఓబుళమ్మ: రెండు ఎకరాల 40 సెంట్లు ఉంది సార్. దీంతో పాటు 5 ఎకరాల వరకు కౌలుకు సాగు చేశాం.
 జగన్ : డాక్రా రుణం తీసుకున్నారా?
 ఓబుళమ్మ : లేదన్నా...
 జగన్: బంగారు రుణాలు ఏమైనా తీసుకున్నారా తల్లీ?
 ఓబుళమ్మ : తినడానికే తిండి లేదు సార్. స్టోరు బియ్యమే దిక్కు. బంగారు ఎలా తెచ్చుకుంటాం సార్?!
 జగన్ : ప్రభుత్వ సాయం అందిందా.. ఎవరైనా పరామర్శించారా తల్లీ?
 ఓబుళమ్మ: ఎవ్వరూ పట్టించుకోలేదు సార్. ప్రభుత్వసాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాం.
 జగన్ : పిల్లలు ఏం చదువుతున్నారమ్మా?
 ఓబుళమ్మ : ఒకబ్బాయి 5వ తరగతి, ఇంకో అబ్బాయి 8వ తరగతి చదువుతున్నారు సార్.

ముమ్మాటికీ రాజకీయ హత్యే

శ్రీశైలం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆసాది వసంతరావు(55) హత్యతో శ్రీశైలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరైన ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాపు కాచి గొడ్డళ్లు, గడ్డపారలతో పొడిచి చంపడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలివి.. వసంతరావు శుక్రవారం ఉదయం సున్నిపెంట నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ కారు(ఏపీ28 సీఎల్ 2830)లో బయలుదేరారు. 5.30 గంటల ప్రాంతంలో రెండో పవర్‌హౌస్ దాటి రెండు మలుపులు తిరగ్గానే ఎదురుగా వచ్చిన వాహనం వేగంగా ఢీకొంది.

ఆ తర్వాత దుండగులు ఒక్కసారిగా వాహనాన్ని చుట్టుముట్టి వసంతరావును బయటకు లాగి గడ్డపార, గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారని కారు డ్రైవర్ శివ తెలిపారు. నిమిషాల వ్యవధిలో పరారైన దండగులు తమ వాహనాన్ని వజ్రాలగుట్ట సమీపంలో వదిలివెళ్లారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని శ్రీశైలం సీఐ వెంకటచక్రవర్తి, ఈగలపెంట ఎస్‌ఐ శ్రీనివాస్, ఆమ్రాబాద్ ఎస్‌ఐ ఆదిరెడ్డి పరిశీలించారు.

 కార్డు డ్రైవర్ ప్రమేయంపై పోలీసుల అనుమానం
 ఒక్కసారిగా చుట్టుముట్టిన దుండగులు కారు డ్రైవర్‌ను వదిలిపెట్టడం అనుమానాల కు తావిస్తోంది. ఆ దిశగా పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 10 మంది వ్యక్తులు ముఖానికి కర్చీప్‌లు, టవళ్లు కట్టుకున్నారని.. కత్తులు, కొడవళ్లు, తుపాకులతో వచ్చిన వీరు వసంతరావు పక్కనే ఉన్న బ్రీఫ్‌కేస్‌లోని రూ.50వేలు తమకిచ్చి పారిపోవాలని చెప్పారని డ్రైవర్ శివ పోలీసులకు వివరించాడు. ఘటనకు ముందు లింగాలగట్టు ప్రాంతంలో ఓ దుకాణం వద్ద 15 నిమిషాలు కారు ఆపి సిగరెట్లు తీసుకున్నట్లు కూడా చెబుతున్నాడు.

ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వసంతరావు రాకపోకలు డ్రైవర్‌తో పాటు ఆయన సన్నిహిత అనుచరుడు చెన్నయ్యకు మాత్రమే తెలుస్తుంది. ముందు రోజు రాత్రి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు వసంతరావు చెప్పారని చెబుతున్న శివ.. ఈ విషయం చెన్నయ్యకు కూడా తెలియదంటున్నాడు. అలాంటప్పుడు సమాచారం ప్రత్యర్థులకు ఎలా పొక్కిందనే ప్రశ్న తలెత్తుతోంది.
 
 గన్ లెసైన్స్ కోసం దరఖాస్తు?
  ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని గతంలో అప్పటి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి దృష్టికి వసంతరావు తీసుకెళ్లగా.. ఆ మేరకు ఎస్పీకి అందజేసిన దరఖాస్తుపై ఆయన సిఫారసు కూడా చేసినట్లు తెలుస్తోంది. గన్‌మెన్లు కూడా కావాలని కోరగా.. భారం అధికమవుతుందని ఏరాసు సూచించడంతో లెసైన్స్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఏరాసు పాణ్యం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం.. వసంతరావు వైఎస్‌ఆర్‌సీపీలో చేరి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వెంట నడవటం జరిగింది. సున్నిపెంటతో పాటు శ్రీశైలంలోని ఎస్సీ వర్గీయులను ఏకతాటిపై నడిపించడంలో వసంతరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి నేత మరణంతో శ్రీశైలం మూగబోయింది.
 
 ముమ్మాటికీ రాజకీయ హత్యే - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
 వసంతరావు హత్య రాజకీయంతో ముడిపడి ఉందని శ్రీశైలం నియోజకవర్గ ఎంఎల్‌ఏ, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శ్రీశైలం మండల పరిధిలో హత్య జరిగితే ఆ నింద టీడీపీపైనే పడుతుందనే భావనతోనే ప్రత్యర్థులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దును ఎంచుకున్నారన్నారు. హత్య వెనుక ఎవరున్నారో స్థానికులందరికీ తెలుసని, తెలంగాణ పోలీసులు కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలన్నారు.

ఇటీవల వెన్నెముకకు ఆపరేషన్  చేయించుకున్న వసంతరావును అమానుషంగా దాడి చేసి హత్య చేయడం బాధాకరమన్నారు. హత్యా రాజకీయాలతో ఎదగాలనుకోవడం నీచమైన చర్యగా అభివర్ణించారు. కొన్ని నెలల క్రితమే సున్నిపెంటలో భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు వసంతరావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని.. ఇది జీర్ణించుకోలేకనే హత్యకు పాల్పడ్డారన్నారు.

 హత్యా రాజకీయాలు సిగ్గుచేటు: ఎమ్మెల్యే ఐజయ్య
 మిడుతూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా హత్యలు అధికమయ్యాయని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని 49 బన్నూరులో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంతరావును అధికార పార్టీ వర్గీయులే హత్య చేయించారన్నారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలతో సాంధిచేదేమీ ఉండదన్నారు.

రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Friday, May 15, 2015 | 5/15/2015


రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. వజ్రకరూరు మండలం పందికుంట ఓబులేసు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.

ఉరవకొండ మండలం వెంకటపల్లి పెదతండాలో ఆత్మహత్య చేసుకున్న గోవింద్ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. యువకులు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడుతున్నారు.

రైతుల నడ్డి విరవడానికే 166 జీవో


రైతుల నడ్డి విరవడానికే 166 జీవో..
హైదరాబాద్ : భూ సేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 166 జీవోను తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వరూప్ తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయని ఆర్డినెన్స్ ను రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.  రైతుల నడ్డి విరవడానికే ప్రభుత్వం 166 జీవో చేసిందని, ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? అని ప్రశ్నించారు.

రైతులే స్వచ్ఛందంగా భూములిస్తున్నారన్న మంత్రులు ఇప్పడెందుకు భూ సేకరణకు సిద్ధం అయ్యారని విశ్వరూప్ ప్రశ్నించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ జీవోను అడ్డు పెట్టుకుని ఏపీలో లక్షలాది ఎకరాల భూ సేకరణకు సిద్ధమైందన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూను ఇప్పటి కూడా ఏపీ ప్రభుత్వం బయటపెట్టడం లేదని విశ్వరూప్  విమర్శించారు.

కాగా  యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013ను సవరిస్తూ గత నెల 3న కేంద్రం జారీ చేసిన అర్డినెన్స్‌లోని సెక్షన్ 10 (ఎ) (1) ప్రకారం.. ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో 'రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు'ను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా రాజధానిలో భూ సేకరణకు.. 'భూసేకరణ చట్టం-2013'లోని రెండు, మూడు చాప్టర్లలో పేర్కొన్న సామాజిక ప్రభావం అంచనా, ఆహార భద్రతకు సంబంధిత అంశాల నుంచి మినహాయింపు లభించింది.

డ్వాక్రా వ్యవస్థను నాశనం చేశారు

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
నాలుగోరోజు రైతు భరోసా
యాత్రలో రెండు రైతు కుటుంబాలకు పరామర్శ

 
అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతుల వ్యవసాయ రుణాలతోపాటు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారు. తానలా అనలేదనీ, కేవలం రూ.10 వేలే ఇస్తానని చెప్పానని బుకాయిస్తున్నారు. గోబెల్స్ తరహాలో అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పదివేలు కూడా ముష్టి వేసినట్టు ఏడాదికి రూ.3 వేలచొప్పున మూడు విడతలుగా ఇస్తారంట.
 
అది వడ్డీకి కూడా సరిపోదు. వడ్డీలేని రుణాలు పొందే డ్వాక్రా మహిళలు చంద్రబాబు పుణ్యమా అని ఇప్పుడు రూపాయిన్నర, రెండు రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తోంది. డ్వాక్రా సంఘాల వ్యవస్థను బాబు నాశనం చేశారు’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర నాలుగోరోజైన గురువారం గుంతకల్లు నియోజకవర్గంలో సాగింది. నియోజకవర్గంలోని నల్లదాసరపల్లి, తిమ్మారంలో ఆత్మహత్య చేసుకున్న ఉసేనప్ప, పుల్లయ్య కుటుంబాలకు ఆయున భరోసానిచ్చారు. అక్కడి నుంచి వజ్రకరూరు మీదుగా ఉరవకొండకు చేరుకున్నారు.
 
 ఒక్క హామీ నెరవేర్చలేదు...
 డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పావలావడ్డీకే రుణాలు ఇచ్చి లక్షాధికారులుగా చేయాలని దివంగత నేత వైఎస్‌ఆర్ ఆశిస్తే... ఇప్పుడు చంద్రబాబు రుణవూఫీ చేయకపోవడంవల్ల ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిమ్మాపురం గ్రామంలో మహిళలతో ఏర్పాటు చేసిన మాటామంతీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాము తెచ్చుకున్న డ్వాక్రా రుణా ల్లో బాబు ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని మహిళలు మండిపడ్డారు. ఈ వుహిళల ఆవేదన వినైనా చంద్రబాబుకు ఎన్నికల మందు ఇచ్చిన హామీలు గుర్తుకు రావాలని జగన్ చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే విధంగా ఆందోళనలు చేపడదామని పిలుపునిచ్చారు. ఎన్నికల వుుందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి నిజాయితీగా బతకాలని హితవు పలికారు. లేదంటే అమలుచేయలేని హామీలు ఇచ్చి మోసం చేశానని అంగీకరించాలని జగన్ డిమాండ్ చేశారు.  
 
చంద్రబాబుపై మండిపడ్డ డ్వాక్రా మహిళలు
షలీంబాను: మాది గుంతకల్లు. 5వ వార్డులో ఉంటాను. 5 లక్షల రుణం తీసుకున్నాను. ఇంకా 2.5 లక్షల రుణం ఉంది. తప్పుడు మాటల వల్ల మేం ఆరు నెలలు రుణం కట్టలే. ఇప్పుడు దీనికి వడ్డీ 85 వేలు అయింది. నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు క్షమాపణ చెప్పాలే. ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోవాలె.  
 
జగన్: చంద్రబాబు ఇప్పుడు రూ.10 వేలు  ఇస్తానంటున్నాడుగా?
షలీంబాను: మాకు ఏడాదికి 3 వేలు ఇచ్చేది ఏంది? మేమే కావాలంటే రూ.10 వేలు ఇస్తాము. సరైన సీఎం అయితే మా ముందుకు వచ్చి మాట్లాడాలె.
లక్ష్మీనారాయణమ్మ: మాకు 2 ఎకరాల పొలం ఉంది. దీని కింద రూ.14 వేల రుణం తీసుకున్నాం. ఈ రుణం మాఫీకాలే. డ్వాక్రా రుణం రూ. 5 లక్షలు తీసుకున్నాం. రుణమాఫీ అవుతుందని రుణాలు కట్టలేదు. 3 నెలలు కట్టలేదు. దీనికి రూ.45 వేలు వడ్డీ అయింది.
 
జగన్: రూ.  5లక్షలకు మూడు నెలలు కట్టకపోతే రూ.45 వేల వడ్డీ అయిందా?
లక్ష్మీనారాయణమ్మ: అవును సార్. గ్రూపులో కొద్దివుంది ఈ వడ్డీలు కట్టలేం. యూడి నుంచి తెచ్చి కట్టాలా అని వెళ్లిపోయినారు.

జగన్: గ్రూపు నుంచే వెళ్లిపోయారా?
లక్ష్మీనారాయణమ్మ: అవును  సార్. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పావలావడ్డీ వస్తుండే. అందుకే ఆయన ఫోటో పెట్టుకుని దేవునిలాగా పూజిస్తాం సార్.   
 
జగన్: నీపేరు ఏంటమ్మా? మీది ఏ గ్రూపు, ఎంత రుణం తీసుకున్నావు?
లక్ష్మి: నా పేరు లక్ష్మి. మాది గుంతకల్లు. శ్రీలక్ష్మీ గ్రూపు ద్వారా రూ.3 లక్షలరుణం తీసుకున్నాం. చంద్రబాబు మాటలు నమ్మి కట్టలేదు. తర్వాత లోనుకోసం బ్యాంకుకుపోతే పాసుబుక్కులు పక్కకు పెడుతున్నారు. అందుకే నగ, నట్ర తాకట్టు పెట్టి రుణాలు కట్టాం. అయినా ఇప్పుడు కొత్త లోన్లు ఇవ్వమంటున్నారు. చంద్రబాబు విదేశాల మీద మోజుతో ఇక్కడి ప్రజలను మర్చిపోతున్నారు. అటువంటి ఆయన మనకు అవసరమా?  
 
జగన్: ఏమ్మా నీ పేరు ఏంటి?
లీలావతి: నా పేరు లీలావతి అన్నా. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు అబద్దాలు చెప్పినాడు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పినాడు. ఎవరికైనా ఒక్క రూపాయైనా మాఫీ చేసినాడా? గొలుసులు కుదవ బెట్టుకుని నల్లదారాలు వేసుకుని ఉంటున్నాము. మేము ఏం తిని బతకాలి? ఉద్యోగం రాలేదని నా కొడుకు ఇంటిమొకం రాకుండా ఉన్నాడు.
 
జగన్: ఎంత లోను తీసుకున్నావమ్మా?
లీలావతి: లక్షరూపాయలు తీసుకున్నాను. రూ.30 వేలు కట్టినాము. ఇంకా బంగారం లోను రూ. 70 వేలు ఉంది. మాఫీకాలేదు.
 
జగన్: డ్వాక్రా సంఘంలో ఏమైనా లోను తీసుకున్నావా తల్లీ?
లీలావతి: 3 లక్షలు తీసుకునింటిమి. చంద్రబాబు బాధ తాళలేక కట్టేసినాం.
 
రూపాయి కూడా మాఫీ కాలేదు..!
రెండో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం గుంతకల్లు మండలంలోని నల్లదాసరిపల్లిలో కురుబ మశేనప్ప, ఎన్.తిమ్మాపురంలో కసాపురం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. 3.67 ఎకరాల భూమిలో బోర్లకు, వ్యవసాయానికి రూ.4 లక్షలు అప్పుచేశామని, రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. అప్పుల బాధ భరించలేకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని, ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు. ఇద్దరికీ చెరో రూ.50వేలు సాయం అందించారు.

Popular Posts

Topics :