03 August 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన బాబుకు తెలియదా?

Written By news on Saturday, August 9, 2014 | 8/09/2014

ఏలూరు : రుణమాఫీపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని, ఆయన రోజుకో మాట మాట్లాడటం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాకపోయినా, అప్పుడే అంతా మాఫీ అయిపోయినట్లు అభూత కల్పనలు స్పష్టిస్తూ పండగ చేసుకుంటున్నారని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రం విడిపోతే లోటు బడ్జెట్ ఉంటుందని ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తనకే తెలిసిందని, అలాంటిది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఆ విషయం తెలియదా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. అన్నీ తెలిసి రుణమాఫీని మేనిఫెస్టోలో చేర్చింది మీరు కాదా అని ఆయన నిలదీశారు.

నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్


నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్
నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నెల్లూరు వెళ్లారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోదరుడు భద్రారెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్‌ నెల్లూరు చేరుకున్నారు.

నెల్లూరులో వైఎస్ జగన్ ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పినాకిని అతిథి గృహం వద్ద జగన్ ను చూసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. పోలీసులు అడ్డుకోవడంతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. స్థానిక నేతలు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.

బాబూ నీ సంతకానికి విలువేదీ?

  •      రుణాలు ఎక్కడ మాఫీ చేశారు ?
  •      టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే రోజా ప్రశ్న
విజయపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకానికి విలువ లేకపోయిందని,  దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో చేసిన సంతకానికి తిరుగులేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు.

శుక్రవారం ప్రజాబాట కార్యక్రమంలో ఆమె మండలంలోని నార్పరాజుకండ్రి గ, బొగ్గలవారికండ్రిగ, మల్లారెడ్డికండ్రిగ, శ్రీహరిపురం, మహరాజపురం గ్రామాల్లో పర్యటించారు. శ్రీహరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతు, డ్వాక్రా, చేనేత కార్మికులను రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు సీఎం పీఠం దక్కించుకున్నారని, అయితే నమ్మి ఓటు వేసిన రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శిం చారు.

రైతులకు రూ.1.5లక్షలు, డ్వాక్రా గ్రూపునకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని సంతకం చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి రుణమాఫీ జరగలేదంటే ఆయన సంతకానికి విలువలేకుండా పోయినట్టేనని ఎద్దేవా చేశారు. రుణాలు వెంటనే కట్టాలని, తాకట్టు పెట్టిన బంగారును వెంటనే విడిపించుకోవాలని బ్యాంకర్లు రైతులకు ఓ వైపు నోటీసులు పంపుతుంటే... రుణమాఫీ చేసిన చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని మరో వైపు టీడీపీ నాయకులు ఫెక్లీబోర్డులు ఏర్పటు చేయడం హాస్యాస్పదం గా ఉందన్నారు.

రుణాలు ఎక్కడ మాఫీ చేశారని ఆమె టీడీపీ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో మాత్రం వెంటనే రుణమాఫీ చేయాలని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇక్కడ మాత్రం ఇంకా సమయం ఉందని చెబుతున్నారు. ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకాలని ఆమె విమర్శించారు.

రుణాలు కాదు.. వర్షాలు మాఫీ అయ్యాయి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రుణాలు కాదు.. వర్షాలు మాఫీ అయ్యాయి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్/విజయవాడ: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు ప్రజలందరి ముందు ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబునాయుడు అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తయినా వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిం చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులెవరికీ రుణాలు మాఫీ కాలేదు కానీ రాష్ట్రంలో వర్షాలు మాత్రం పూర్తిగా మాఫీ అయ్యాయని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వస్తే కరువేననే నానుడి రాష్ట్రంలో  ఉందని.. ఇప్పుడదే నిజమైందని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పారు.
 
 దేశంలో అన్ని రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కూడా లేకుండా పోయిందన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రెండు నెలల పాలన తీరును ఆయన దుయ్యబట్టారు. బాబు వస్తే ఉద్యోగం వస్తుందని ప్రచారం చేసిన ఆ పార్టీ కార్యకర్తలు కూడా ప్రస్తుతం.. ‘బాబు వచ్చాడు ఉద్యోగం పోయింది’, ‘బాబు వచ్చాడు వర్షాలు పడడం లేదు’ అని అనుకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు.

జిల్లాల కలెక్టర్లను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ముక్కుసూటిగా పనిచేయొద్దు, తమ పార్టీ కార్యకర్తలకు సహకరించమంటూ కోరిన ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు ఒక్కరేనని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సును ప్రస్తావిస్తూ.. ప్రపంచ చరిత్రలో ఏ పాలనాధిపతి అధికార యంత్రాంగానికి ఇలాంటి ఆదేశాలిచ్చి ఉండరని ఆయన అన్నారు. అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉన్న వారికీ పచ్చచొక్కాలు తొడగాలని బాబు ప్రయత్నం చేస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు నెల్లూరుకు వైఎస్ జగన్

నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నెల్లూరుకు రానున్నట్లు పార్టీ  జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి కడప నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు చేరుకుంటారని పేర్కొన్నారు. ఇక్కడ పినాకిని అతిథి గృహంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో సమావేశమవుతారని తెలిపారు.

అనంతరం కనుపర్తిపాడుకు సమీపంలోని వీపీఆర్ కన్వెన్షన్‌లో జరిగే ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోదరుడు భద్రారెడ్డి కుమార్తె తన్మయి, చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడు అభినయ్‌ల వివాహ వేడుకకు హాజరవుతారని పేర్కొన్నారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం రాత్రి హైదరాబాద్ వెళుతారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు.

పులివెందుల నుంచే నెల్లూరుకు జగన్

పులివెందుల నుంచే నెల్లూరుకు జగన్
తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పులివెందుల నుంచే నేరుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వెళతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కే నారాయణస్వామి తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయూనికి చేరుకుని అక్కడి నుంచి నెల్లూరు వెళతారని తొలుత సమాచారం వచ్చిందని, అరుుతే జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంటకు రావడంలేదని నారాయణస్వామి చెప్పారు.

నేనున్నా.. మీకేం కాదు

నేనున్నా.. మీకేం కాదు
సాక్షి, కడప : తన రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలతో పాటు ప్రజలలో భరోసా నింపారు.  పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, జయరాములు, జెడ్పీ చైర్మన్ రవి, వైఎస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ తిరుపేల రెడ్డి, మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి, మాసీమ బాబుతో పాటు  నాయకులు, కార్యకర్తలు  వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు.

డిపాజిటర్లకు అన్యాయం చేసిన అక్షయ గోల్డ్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానన్నారు. జర్నలిస్ట్‌లకు హెల్త్ కార్డులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో కూడా మాట్లాడతామన్నారు. కడప, పులివెందులకు చెందిన ముస్లింలు ఈ సందర్భంగా జగన్‌తో ప్రత్యేకంగా భేఠీ అయ్యారు. వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు.

ఏపీలో 120 మండలాల్లోనే రీ షెడ్యూల్

ఏపీలో 120 మండలాల్లోనే రీ షెడ్యూల్
* ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ లేఖ
 
సాక్షి, హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) పరిమితంగానే అనుమతి ఇచ్చింది. 4 జిల్లాల పరిధిలోని 120 మండలాల రుణాల రీ షెడ్యూల్‌కే అంగీకరించింది. ఇందుకు సైతం కొన్ని పరిమితులు విధించింది. ఏపీలో రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తున్నట్టు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపాలీ పంత్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు.

రాష్ట్రంలో 653 మండలాలు ఉండగా కరువు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 575 మండలాల్లో రుణాలను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐని కోరిన విషయం తెలిసిందే. దాంతో గత ఖరీఫ్‌లో ఆహార ఉత్పత్తుల వివరాలను అందించాలని ఆర్‌బీఐ రాష్ట్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అర్థగణాంక విభాగం విడుదల చేసిన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ వాటిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబిచ్చింది.

ఆహార ఉత్పత్తులు 50 శాతంకన్నా తక్కువగా వచ్చిన పక్షంలోనే వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్‌బీఐ నిబంధనలు అనుమతిస్తాయంటూ, ఆ వివరాలతో కూడిన సమాచారాన్ని కూడా రాష్ట్రానికి పంపింది. తాజాగా రాష్ట్రంలో ఎక్కడైతే ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయో.. ఆ ప్రాంతాల్లోని వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తూ లేఖ రాసింది.
 
 పరిమిత రీ షెడ్యూల్‌పై ఆర్‌బీఐ ఏమన్నదంటే...
* బంగారంపై తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు.
పంటలను కుదవ పెట్టి తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు.
* చెరకు, పొగాకు తదితర వాణిజ్య పంటల రుణాలకు, మూసేసిన పంట రుణాల ఖాతాలకు రీ షెడ్యూల్ వర్తించదు.
* ప్రామాణిక ప్రాతిపదిక మేరకు రీ షెడ్యూల్‌ను 4 జిల్లాలకు మాత్రమే పరిమితం.
 
* శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది.
 
* కేవలం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తింపు.
 
* రీ షెడ్యూల్ మూడేళ్లకే పరిమితం. తొలి ఏడాది మారిటోరియం ప్రకటనకు, తర్వాత రెండేళ్లలో రీ షెడ్యూల్‌కు అనుమతి.
 
మూడేళ్లలో రైతులు రుణాలు చెల్లించకపోతే బ్యాంకులు ఆ బకాయి మొత్తాలను వడ్డీతో సహా రైతుల నుంచి వసూలు చేస్తాయి.
* గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న పంట రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు వడ్డీతో కలిపి ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు మాత్రమే పంట రుణం రీ షెడ్యూల్ వర్తిస్తుంది. వడ్డీతో కలిపి రుణం లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం నగదు రూపంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలి.
 
* ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనుల విషయంలో రైతులు ఇక్కట్లకు గురికాకూడదని, రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలనే సానుభూతితో రుణాల రీషెడ్యూల్‌కు నిర్ణయం తీసుకున్నాం.

http://www.sakshi.com/news/andhra-pradesh/crop-loan-reschedue-in-120-mandals-in-andhra-pradesh-rbi-letter-156208?pfrom=home-top-story

కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్‌

కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, కడప : జిల్లా రైతులు ప్రతిసారి కరువు కొరల్లో చిక్కుకుపోతున్నారు.. మిగతా జిల్లాలకు ఎప్పుడో కరువు వస్తే.. ఇక్కడ మాత్రం పిలవని పేరంటంలా వచ్చి ఇబ్బంది పెడుతోంది. తుంగభద్ర నుంచి సాగునీరు సక్రమంగా రాక పులివెందుల, జమ్మలమడుగు రైతులు అల్లాడుతున్నారు... కృష్ణా జలాలైనా సంపూర్ణంగా వస్తే తప్ప.. కేసీ కాలువతోపాటు ఇతర ప్రాంతాల రైతులకు పంటలు పండించుకునే అవకాశం ఉండదని వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, గండికోట, జీఎన్‌ఎస్‌ఎస్ అధికారులతో వైఎస్ జగన్ శుక్రవారం విడివిడిగా సమీక్షించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డితో కలిసి వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలను గండికోటకు ఈసారైనా  తీసుకురావాలని.. ఇంతలోపే ముంపు గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సిన పరిహారం మొత్తాన్ని ఇవ్వాలన్నారు. కృష్ణా జలాలు గండికోటకు వస్తే అక్కడ నుంచి పైడిపాలెంకు తీసుకరావచ్చని.. అలాగే సీబీఆర్‌కు కూడా పంపింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. పైడిపాలెం, సీబీఆర్, పీబీసీ, బైపాస్ కాలువలకు  సంబంధించిన పనులు  ఇంకా పెండింగ్‌లో ఎందుకున్నాయని ఆయన ప్రశ్నించారు.

దివంగత సీఎం వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే 80శాతం పైగా పనులు పూర్తయితే.. ఇప్పటివరకు ఇంకా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. తుంగభద్ర నుంచి ఈసారైనా పులివెందులకు పూర్తి కోటా నీరు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని.. ఐఏబీ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ మేరకు  డిమాండు చేస్తారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పీబీసీకి 4.4 టీఎంసీతోపాటు, మైలవరానికి 1.300టీఎంసీల పూర్తికోటా నీటిని అందించాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు.

రేషన్ డీలర్లను  ఇబ్బంది పెట్టొదు
రేషన్ డీలర్లకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు మెరుగ్గా నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని.. అలా కాకుండా కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేయడం తగదని వైఎస్ జగన్ సూచించారు. నిజంగానే డీలర్ అన్యాయంగా సొమ్ము చేసుకుంటుంటే చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ.. అనవసరంగా ఎలాగోలాగా ఇబ్బందులు పెట్టి తొలగించాలని చూడటం మంచి పద్దతి కాదన్నారు.

గ్రామాభివృద్ధికి సహకరించండి :
పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉన్న గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. గ్రామాల్లో సమస్యలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

సమావేశాలలో మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో రఘునాథరెడ్డి, పీబీసీ, పైడిపాలెం ప్రాజెక్టుల ఈఈలు రాజశేఖర్, చెంగయ్యకుమార్‌లతోపాటు పలువురు డీఈలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ రఘురామయ్య, ఏడు మండలాల తహశీల్దార్లు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, శివరామయ్య, శ్రీనివాసులు, ఎల్.వి.ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవోలు మురళీమోహన్‌మూర్తి, సమత, జ్ఞానేంద్రరెడ్డి, మైథిలీ, బాలమునెయ్య, వెంకటేష్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయండి
నెలకొకమారు వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న రూ. 200  పింఛన్‌ను అధికారులు సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.  ఏ సమయానికి ఎక్కడ పింఛన్ ఇస్తున్నారో.. ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా తెలపకపోవడంతో లబ్ధిదారుల పింఛనంతా ఆటో ఛార్జీలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల పేరుతో ఇబ్బందులు సృష్టించడం తగదని.. మాన్యువల్ పద్దతిలోనే లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్ అందేదన్నారు. 

'యూజ్ లెస్ ఫెలో' అంటూ రైతుపై చంద్రబాబు ఆగ్రహం!

Written By news on Friday, August 8, 2014 | 8/08/2014

'యూజ్ లెస్ ఫెలో' అంటూ రైతుపై చంద్రబాబు ఆగ్రహం!వీడియోకి క్లిక్ చేయండి
రుణమాఫీ గురించి నిలదీసిన రైతుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ ఎప్పుడంటూ ఓ రైతు ప్రశ్నించడంతో సహనం కోల్పోయిన చంద్రబాబు 'ఏయ్ యూజ్ లెస్ ఫెలో..ముందు విను అంటూ కసురుకున్నారు. ముందు విను. ఒక్కరు అరిస్తే సమస్య పరిష్కారం కాదు. పదిమంది మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది అంటూ హెచ్చరించే ధోరణిలో చంద్రబాబు స్పందించడంతో రైతులు అవాక్కయ్యారు. 
 
చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే.. ఆయన కుమారుడు లోకేశ్ బాబు వ్యవహారం మరోలా ఉంది. రైతు రుణమాఫీ గురించి అడిగిన ప్రశ్నకు మీడియాపై రుసరుసలాడారు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన వ్యవహారం.. రైతు రుణమాఫీ గురించి తనకు సంబంధం లేదని లోకేశ్ తప్పించుకోవడానికి చూశారు. రుణమాఫీ ఎప్పడవుతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్న రైతులకు చంద్రబాబు తాజా హెచ్చరికలు అయోమయానికి గురిచేస్తున్నాయి

ఇంత చేతగాని సర్కారు ఎక్కడా చూడలేదు

విజయవాడ : అసలు ఇంత చేతకాని ఆంధ్రప్రదేశ్ సర్కారును ఎక్కడా చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి అన్నారు. బాబు ఈజ్ బ్యాక్ అంటే ఆయన 9 ఏళ్ల పాలనాకాలంలో వచ్చిన కరువు మళ్లీ మొదలైందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో నినాదాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు మాత్రం బాబు వచ్చాడని తెలిసి రుతుపవనాలు పారిపోతున్నాయని ఆయన అన్నారు.

కార్యకర్తలు ఏం చేసినా చూసీచూడనట్లు ఉండాలని కలెక్టర్లకు చెప్పడానికే చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసినట్టున్నారని పార్థసారథి విమర్శించారు. ఈ రెండు నెలల్లో టీడీపీ నేతల దుబారా ఖర్చుకు కొంత జోడిస్తే  క్యాంప్ కార్యాలయం, మంత్రుల ఆఫీసులు ఏర్పాటు చేయొచ్చని ఆయన అన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ చేతగానితనం వల్లే కృష్ణా డెల్టా రైతులకు కష్టాలు వచ్చాయని పార్థసారధి మండిపడ్డారు. ఇక తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు ఏపీ సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంటుపై భరోసా ఇవ్వాలని పార్థసారధి డిమాండ్ చేశారు.

రుణమాఫీ బదులు వర్షాలు మాఫీ

రుణమాఫీ బదులు వర్షాలు మాఫీవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దాలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ తో చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని విషయం రుజువైందని వ్యాఖ్యానించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసే ధైర్యం చంద్రబాబుకుందా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు అధికారం చేపట్టి ఈ రోజుకు రెండు నెలలు పూర్తయిందని, ఇంత పనికిమాలిన సీఎంను ఎప్పుడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఐదు సంతకాలు పెట్టి ఒక్కటి కూడా అమలు చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వమిదని మండిపడ్డారు. రైతుల రుణాలు మాఫీ చేయకుండా వర్షాలు మాఫీ చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ముక్కుసూటిగా పనిచేయొద్దని చంద్రబాబు చెప్పడం దారుణమని విమర్శించారు. ఇవే వ్యాఖ్యలు వేరే దేశాల్లో మాట్లాడి ఉంటే కచ్చితంగా జైల్లో పెట్టేవారని అన్నారు. చంద్రబాబు మీరు ఏపీకి ముఖ్యమంత్రా లేక టీడీపీకి ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన పద్దతులు మార్చుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తీరు మార్చుకోండి
  • ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
  •  టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గితే..
  •  మూల్యం చెల్లించుకోవాల్సిందే
  •  వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతా
  •  మెప్పు పొందడం కోసంపయత్నించి బలిపశువులు కావొద్దు
  •  పోలీసులకు హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గో.. మెప్పు పొందడం కోసమో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి బలిపశువులు కావొద్దని పోలీసు అధికారులకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టీకరించారు.

రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేతలు సుబ్రమణ్యం, ఎ.మధు, సిద్ధయ్య, శ్రీనివాసులుపై టీడీపీ నేత పద్మనాభనాయుడు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినందుకు నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ రామచంద్రాపురం పోలీసుస్టేషన్‌లో బైఠాయించారు.

పద్మనాభనాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయకుండా వైఎస్సార్‌సీపీ నేతలపై ఎలా కేసు నమోదు చేస్తారని సీఐ సాయినాథ్‌ను, పోలీసులను ప్రశ్నించారు. ఇందుకు సీఐ స్పందిస్తూ.. పద్మనాభనాయుడుపై రక్తపు గాయాలు ఉండడం వల్ల కేసు నమోదు చేశానని బదులిచ్చారు. దాంతో అక్కడి నుంచే రుయా ఆస్పత్రి  సూపరింటెండెంట్ వీరాస్వామికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేఖను తన మనుషుల ద్వారా పంపారు. ‘పద్మనాభనాయుడు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారా.. ఆయన శరీరంపై ఏమైనా గాయాలు ఉన్నాయా? ఆయనకు ఎలాంటి చికిత్స చేశారు?’ వంటి వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో చెవిరెడ్డి కోరారు.

ఇందుకు రుయా సూపరింటెండెట్ వీరాస్వామి స్పందిస్తూ.. ‘పద్మనాభనాయుడు అవుట్ పేషంట్‌గా ఆస్పత్రికి వచ్చారు. ఆయన శరీరంపై ఎలాంటి రక్తపు గాయాలు లేవు.. సాధారణ చికిత్స చేసి పంపాం’ అని రాతపూర్వకంగా బదులు ఇచ్చారు. దానిని చూపుతూ వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసు బనాయించిన మాట వాస్తవం కాదా అని సీఐ సాయినాథ్‌ను చెవిరెడ్డి ప్రశ్నిం చారు. తప్పుడు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని కోరారు. టీడీపీ నేతలపై సీఐ సాయినాథ్ కేసు నమోదు చేశారు.

అనంతరం చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను భయోత్పాతానికి గురిచేయడం కోసం టీడీపీ నేతలు పోలీసులను ప్రయోగిస్తున్నారన్నారు. ఇందుకు నెత్తకుప్పం వైఎస్సార్‌సీపీ నేతలపై బనాయించిన కేసే నిదర్శనమన్నారు. తప్పుడు కేసు బనాయించిన పోలీసు అధికారులపై న్యాయస్థానంలో ప్రైవేటు కేసు ఫైల్ చేస్తానన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు కేసు బనాయించిన ఏ ఒక్క అధికారిని వదిలి పెట్టే ప్రశ్నే లేదని.. న్యాయస్థానం ఎదుట నిలబెడతామని హెచ్చరించారు.

అధికారపార్టీ నేతల మెప్పుకోసం తప్పుడు కేసులు పెట్టి బలిపశువులు కావద్ద ని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు బనాయిస్తోన్న అక్ర మ కేసులు.. చేస్తోన్న దాడులపై అసెంబ్లీలో పోరాటం చేస్తానన్నారు. పోలీసు అధికారులు చట్టప్రకారం నడుచుకుంటే శాంతిభద్రతలు పరిఢవిల్లుతాయని.. లేదంటే శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని.. అందుకు చంద్రగిరి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే ఉదాహరణ అని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల కోసం ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టీకరించారు.

కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం.. కావాలని కేసుల్లో ఇరికించడం చేస్తే చూస్తూ ఊరుకోం

వేధిస్తే.. ఊరుకోంపులివెందులలో కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్
సాక్షి, కడప: అధికారం ఉంది కదా అని.. కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం.. కావాలని కేసుల్లో ఇరికించడం లాంటి చర్యలకు ఉపక్రమిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని.. ప్రతిపక్షంలో ఉన్నా పోరాటాలు చేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని బాకరాపురంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో గురువారం ఆయన మమేకమయ్యారు. పులివెందుల మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఉదయమే వైఎస్ జగన్ ను  కలిశారు.
 
పోలీసులతోపాటు ప్రత్యర్థులు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఎవరూ ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని.. ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ తరపున తాను అండగా ఉంటానని.. కార్యకర్తలకు కష్టం వచ్చిన సందర్భంలో అవసరమైతే తాను కూడా వచ్చి ఆందోళనలో పాల్గొంటానని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. కొన్ని కష్టాలైతే ఉంటాయని.. అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామన్నారు. కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామన్నారు.
 
మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించండి..
చక్రాయపేట మండలంలోని కాలేటివాగు డ్యాంకు సంబంధించి ముంపునకు గురయ్యే భూములకు న్యాయమైన పరిహారం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.  చక్రాయపేట మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డితోపాటు మరికొంతమంది రైతులు పులివెందులలో వైఎస్ జగన్‌ను కలిశారు.
 
వరి, వేరుసెనగ, పొద్దుతిరుగుడుతోపాటు ఇతర ఎలాంటి పంటలు వేసినా మంచి దిగుబడి వచ్చే భూములు అని.. అధికారులు ఏ మాత్రం పరిశీలన చేయకుండానే బీడు భూములు అని  చెబుతూ తక్కువ పరిహారం ఇచ్చేలా చేస్తున్నారని వారు జగన్ దృష్టికి తెచ్చారు. అక్కడ ఎకరా రూ. 8లక్షల నుంచి రూ. 10లక్షలు మార్కెట్‌విలువ ఉంటే.. కేవలం లక్ష నుంచి రూ. 1.50లక్షలు ఇవ్వాలని చూడటం ఎంతవరకు న్యాయమన్నారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించడంతోపాటు లేఖ రాయాలని సిబ్బందిని వైఎస్ జగన్ ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెంటనే  కాన్వొకేషన్ సర్టిఫికెట్లు అందించాలని  వైఎస్ జగన్‌రెడ్డి ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ కృష్ణారెడ్డిని ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో పలువురు విద్యార్థులు వైఎస్ జగన్‌ను కలిసిన నేపథ్యంలో వెంటనే డెరైక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
 
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, నేతలు
పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కలిసి చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పులి సునీల్‌కుమార్, రిమ్స్ సురేష్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి  తదితరులు కలిసి చర్చించారు. జిల్లా రాజకీయాలతోపాటు అనేక విషయాలకు సంబంధించి వారు చర్చించారు.
 
మున్సిపల్ కౌన్సిలర్లతో చర్చించిన వైఎస్ జగన్
పులివెందుల  మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మలతోపాటు 23మంది వార్డు కౌన్సిలర్లతో వైఎస్ జగన్ చర్చించారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ పులివెందులగా మార్చేందుకు ప్రతి వీధిలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించాలని వారికి సూచించారు.
 
ప్రజలతో మమేకం.. 
హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారు జామున ముద్దనూరులో దిగిన వైఎస్ జగన్ నేరుగా పులివెందులకు చేరుకుని  ఉదయం నుంచే ప్రజలతో మమేకమయ్యారు. ఇంట్లో ఉన్న వైఎస్ జగన్‌ను పలువురు నేతలు, కార్యకర్తలు కలిశారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి  వినతులు స్వీకరించారు.
 
వికలాంగులు, వృద్ధులు, ఉద్యోగం కోసం నిరుద్యోగులు, గ్రామాల్లో సమస్యల పరిష్కారం నిమిత్తం నాయకులు, ఇలా వచ్చిన ప్రతి ఒక్కరితోనూ వైఎస్ జగన్ మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యలో భోజన విరామం మినహా కార్యాలయంలోనే ఉండి ప్రతి ఒక్కరి సమస్య వినడం.. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపారు.

తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి, వేముల పరిశీలకుడు వేల్పుల రాము, పులివెందుల, వేంపల్లె మండలాల కన్వీనర్లు శివప్రసాద్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎం.రాజారెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్.జనార్థన్‌రెడ్డి, సింహాద్రిపురం నాయకులు కొమ్మా పరమేశ్వరరెడ్డి, లింగాల, తొండూరు, చక్రాయపేట, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వచ్చి జగన్‌ను కలుసుకున్నారు. అనంతరం పారిశ్రామిక వేత్త ప్రకాష్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులతో గడిపారు.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ నేతల దాడి

రాప్తాడు : తమ ఇంటి ముందుకు మురుగు నీరు రానివ్వకుండా చూడాలని చెప్పినందుకు ‘ఈ ప్రభుత్వం మాది.. మాకే అడ్డు చెపుతారా.. మురుగు నీళ్లు వదిలేదే.. మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి’ అంటూ గురువారం సాయంత్రం బోగినేపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోగినేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త తలారి వెంకటరాముడు ఇల్లు దిగువ ప్రాంతంలో ఉంది.
 
  ఎగువ ప్రాంతంలో టీడీపీ నాయకుడు, మండల మాజీ కన్వీనర్ ఖాశీంనాయుడు ఇల్లు ఉంది. ఖాశీంనాయుడు నెల రోజులుగా మురుగునీరు రొడ్డు పైకి వదులు తుండటంతో ఆ నీరు తలారి వెంకటరాముడు ఇంటి ముందుకు వచ్చి నిలిచిపోతోంది. దీంతో అక్కడ అపరిశుభ్రత నెలకొంటోంది. ఐదు రోజుల క్రితం మండల స్థాయి అధికారులు కూడా గ్రామంలోకి వెళ్లి మురుగు నీరు అలా వదల కూడదని ఖాశీంనాయుడుకు హితవు పలికారు. అయినా మార్పు కనిపించలేదు.
 
  ఇలా అయితే తమకు రోగాలు వస్తాయని భావించిన తలారి వెంకటరాముడు భార్య బోయ రాజమ్మ తక్షణమే మురుగునీరు రాకుండా చూడాలని ఖాళీం నాయుడు ఇంటి దగ్గరకు వెళ్లి చెప్పింది. దీంతో ఆయన ‘ప్రస్తుతం ఉన్నది మా ప్రభుత్వం, మేము చెప్పిన విధంగానే మీరు నడుచుకోవాలి, నీళ్లు అలాగే వస్తుంటాయి. ఉంటే ఉండండి లేకుంటే గ్రామం వదిలిపెట్టి వెళ్లండి. లేకుంటే గ్రామ బహిష్కరణ చేస్తాం’ అంటూ బెదిరించారు. మీరు ఇలాగే చేస్తే మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అనడంతో ఖాశీంనాయుడు, ఆయన భార్య సంజమ్మ, కూతురు రాధిక ఆగ్రహోదగ్రులై రాజమ్మపై దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజమ్మ కూతురు బోయ సుజాత(18)పైనా బండరాతితో తలపై బాదారు. స్పృహ తప్పి కిందపడిపోయినా వదలకుండా కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడంతో సుజాత కోమాలోకి వెళ్లింది. సుజాత మేనమామ మాదన్న కలగజేసుకుని ఆడపిల్లను ఇంత అన్యాయంగా కొడతారా అంటూ ఖాశీంనాయుడిపై చేయిచేసుకుని పక్కకు నెట్టేశారు. స్థానికులు 108 ద్వారా ఆమెను అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. సుజాత పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. తీవ్రంగా గాయపరిచిన వారు కూడా ఐదుగురు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై కౌంటర్ ఫిర్యాదు చేశారు.
 
 మాదన్నను చంపుతాం!
 ఖాశీం నాయుడిపై చేయి చేసుకున్న మాదన్నను చంపి తీరుతాం అంటూ గ్రామంలో టీడీపీ వర్గీయులు బెదిరించినట్లు సమాచారం. నా మేనకోడలును నా కళ్లముందే రక్తం కారేటట్లు కొడుతుంటే తట్టుకోలేక ఖాశీం నాయుడిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందే కాని తనకు వేరే ఉద్దేశం లేదని మాదన్న వాపోయాడు.
 
 అధికారం ఉందని విర్రవీగుతున్నారు
 అధికారంలోకి వచ్చాం కదా అని టీడీపీ నాయకులు విర్రవీగుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రాణాలు అడ్డుపెట్టి తమ కార్యకర్తలను కాపాడుకుంటామని ఆ పార్టీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజమ్మ, సుజాతలను ఆయన పరామర్శించారు.
 
 ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బోగినేపల్లి టీడీపీ నాయకులు పక్కా ప్రణాళికతోనే తమ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత ఇలాంటి దాడులను ప్రోత్సహించే బదులు గ్రామాల్లో మురుగు నీటి కాల్వల ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని హితవు పరికారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

పులివెందులలో కౌన్సిలర్లతో వైఎస్ జగన్ భేటీ

Written By news on Thursday, August 7, 2014 | 8/07/2014

పులివెందులలో కౌన్సిలర్లతో వైఎస్ జగన్ భేటీ
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పులివెందుల మున్సిపాలిటీలో కౌన్సిలర్లతో సమావేశం అయ్యారు. తాగునీరు, ఇతర సమస్యలను కౌన్సిలర్లు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, ఇతర అధికారులతో సాగు, తాగునీటితోపాటు పలు అభివృద్ది కార్యక్రమాలపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం పులివెందుల కార్యాలయంలోనే ప్రజలతో మమేకం కానున్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు,  ప్రజాప్రతినిధులు  వైఎస్ జగన్‌ను కలవనున్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడండి

ప్రభుత్వ పాఠశాలలను కాపాడండి
జగన్‌కు బాలల హక్కుల ప్రజాధ్వని వినతి
 
 హైదరాబాద్: మూసివేతకు గురవుతున్న ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల ప్రజాధ్వని అధ్యక్షురాలు జె. లలితమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆమె బుధవారం ఈ మేరకు ఆయనకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. అందరికీ నాణ్యమైన విద్య అంది స్తామని, విద్యా ప్రమాణాలు మెరుగు పరుస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు  హామీ ఇచ్చారని, కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్‌ను కలసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు మూసివేయకుండా కృషి చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. జగన్‌ను కలసినవారిలో శేషగిరిరావు, కేవీ రమణారావు, లక్ష్మణరావు, కె. సుభాష్ తదితరులున్నారు.    

నేడు పులివెందులకు వైఎస్ జగన్

నేడు పులివెందులకు వైఎస్ జగన్
రెండు రోజులపాటు ప్రజలతో మమేకం
 8న ఉదయం సాగు,తాగునీటిపై సమీక్ష
 
 సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం పులివెందులకు రానున్నారు. ఇందుకు సంబంధించి పర్యటన వివరాలను బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలియజేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  హైదరాబాదులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం రాత్రి బయలుదేరి గురువారం తెల్లవారుజామున ముద్దనూరులో దిగుతారని ఆయన వెల్లడించారు.
అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుని గురువారమంతా క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకుంటారన్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు,  ప్రజాప్రతినిధులు వచ్చి వైఎస్ జగన్‌ను కలుసుకుంటారని వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పులివెందుల నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, ఇతర అధికారులతో సాగు, తాగునీటితోపాటు పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. సమీక్ష అనంతరం పులివెందుల కార్యాలయంలోనే ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర  కార్యక్రమాలకు వైఎస్ జగన్ వెళ్లాల్సి వస్తే పర్యటనలో స్వల్ప మార్పులు ఉండవచ్చన్నారు.
 

2011 లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల పునర్విభజన!

పునర్విభజన షురూ!
* 2011 లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల పునర్విభజన
* పార్లమెంటు స్థానాలు యథాతథం
* ఎస్టీ లోక్‌సభ స్థానం ఒకటి పెరిగే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తవ్వాల్సి ఉండటంతో ఈ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో ఉన్న ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపైనా దృష్టి సారించినట్టు తెలిసింది. ఇందుకోసం త్వరలోనే ఒక కమిషన్‌ను నియమించనుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలను 225కు పెంచాల్సి ఉంది. పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాల స్వరూప, స్వభావాలు మారతాయి. నియోజకవర్గాల్లో ఇప్పుడున్న మండలాలు కొన్ని ఇతర నియోజకవర్గాల్లో చేరతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టాల్సి ఉంది. ఈ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో  4,93,78,776 జనాభా ఉంది.

పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పెరగనున్న నియోజకవర్గాల సంఖ్యతో  మొత్తం రాష్ట్ర  జనాభా సంఖ్యను విభజిస్తే ఒక్కో నియోజకవ ర్గానికి 2,19,461 సగటు జనాభా ఉండే అవకాశాలున్నాయి. ఈ లెక్కన శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరంలో 2, విశాఖపట్నంలో 5, తూర్పు గోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 3, కృష్ణాలో 3, గుంటూరులో 5, ప్రకాశంలో 3, నెల్లూరులో 4, చిత్తూరులో 5, వైఎస్సార్‌లో 3, అనంతపురంలో 5, కర్నూలులో 5 చొప్పున నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది.

ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు
తాజా జనగణన ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినందున, ఆ వర్గాలకు రిజర్వు అయ్యే నియోజకవర్గాలు కూడా పెరగనున్నాయి. ఈ రిజర్వ్‌డ్ స్థానాలు కూడా మారనున్నాయి. ఈ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 84,45,398గా ఉంది. ఆ వర్గానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 29 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈసారి 38కి చేరుకొనే అవకాశం ఉంది. ఎస్సీ స్థానాలను జిల్లా యూనిట్‌గా కేటాయిస్తారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎస్సీ స్థానాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేశారు.

రాష్ట్రంలో ఎస్టీల జనాభా 26,31,145గా ఉంది. వారికి ప్రస్తుతం అసెంబ్లీలో ఏడు సీట్లుండగా అది 12కు చేరుకునే అవకాశముంది. ఎస్టీలకు రాష్ట్రం యూనిట్‌గా నియోజక వర్గాలను నిర్ణయిస్తారు. నియోజకవర్గాల విభజన తరువాత ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న మొదటి 12 స్థానాలు ఏయే జిల్లాల్లో ఉంటే వాటిని ఎస్టీలకు కేటాయిస్తారు. పునర్విభజనలో భౌగోళిక మార్పులతో కొత్త నియోజకవర్గాలు రిజర్వు అయ్యే
 అవకాశముంది.

లోక్‌సభ స్థానాల సంఖ్య యథాతథం
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. అయితే జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్యను అనుసరించి లోక్‌సభ స్థానాల్లో అక్కడ పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. ప్రస్తుతం ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, పునర్విభజన తర్వాత వీటి సంఖ్య తొమ్మిదికి పెరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్లు పెరుగుతున్నందున ఒక్కొక్క లోక్‌సభ స్థానం పరిధి రెండు మూడు జిల్లాలకు విస్తరించే అవకాశముంది. దీనివల్ల ఎంపీలకు పరిపాలనపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు.

సాధ్యమైనంతమేరకు ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒకటి లేదా రెండు జిల్లాలకు మించి లేకుండా చూడాలని భావిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం అమలాపురం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజనతో ఇప్పుడున్న నియోజకవర్గాల స్వరూపంలో మార్పు వస్తే కనుక వీటికి బదులు వేరే నియోజకవర్గాలు రిజర్వు అయ్యే అవకాశముంటుందే తప్ప సంఖ్య మాత్రం నాలుగుగానే ఉండనుంది.

ఎస్టీలకు ప్రస్తుతం అరకు లోక్‌సభ స్థానం మాత్రమే రిజర్వు అయి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఎస్టీల లోక్‌సభ స్థానం మరొకటి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మండలాల్లోని జనాభాలో అత్యధికం ఎస్టీలే ఉన్నారు. ఆ లెక్కన రాష్ర్ట్రంలో వారి జనాభా పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను ఆనుకొని ఉన్నవే కనుక అక్కడి  అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్ని ఎస్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.


రుణమాఫీకి బాబు ఆస్తులు తనఖా పెడితే చాలు

Written By news on Wednesday, August 6, 2014 | 8/06/2014

'రుణమాఫీకి బాబు ఆస్తులు తనఖా పెడితే చాలు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రుణమాఫీపై చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. బాబు తన ఆస్తులు తనఖా పెడితే రుణాలన్నింటినీ తీర్చొచ్చని, అందరికీ పింఛన్లు ఇవ్వచ్చని ఆయన అన్నారు. బాబు హయాంలో ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయని, ప్రైవేట్ సంస్థలు మాత్రమే బాగుపడ్డాయని చెప్పారు.

చిత్తూరు డెయిరీని మూతపడేలా చేసిన చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీని మాత్రం లాభాల్లో నడుపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాలు మార్చుకుని, రైతులకు మేలుచేయడానికి ప్రయత్నించాలని చెవిరెడ్డి తెలిపారు.

మధిర ఎంపిపి స్థానం వైఎస్ఆర్

ఖమ్మం : మధిర మండల ప్రజాపరిషత్(ఎంపిపి) అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ సిపి   అభ్యర్థి వేమిరెడ్డి వెంకట్రావమ్మ గెలుపొందారు. ఉపాధ్యక్షురాలుగా సీపీఎం అభ్యర్థి రావూరి శివనాగకుమారి విజయం సాధించారు.

ఖమ్మం  జిల్లాలోని  39 మండలాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  కొన్ని మండలాలలో ఉత్కంఠ నెలకొంది.

రుణమాఫీపై శ్వేతపత్రం ఇవ్వండి

రుణమాఫీపై శ్వేతపత్రం ఇవ్వండివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రుణాల రీ షెడ్యూల్ సాధ్యంకాదని రిజర్వు బ్యాంకు గవర్నర్ తేల్చిచెప్పారని, ఈ నేపథ్యంలో రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రస్తుతం రైతులంతా తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారని తెలిపారు.

మరోవైపు.. లెవీపై కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతు లోకానికి గొడ్డలిపెట్టులా ఉంటుందన్నారు. ఈ నిర్ణయంతో రైతుల భవిష్యత్తును మిల్లర్లు, వ్యాపారస్తుల చేతిలోకి నెట్టేశారని ఆయన తెలిపారు. లెవీని 75 నుంచి 25 శాతానికి కుదించడం అత్యంత దారుణమని ఉమ్మారెడ్డి అభివర్ణించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇరు ప్రభుత్వాలు వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు

వైఎస్సార్‌సీపీ నేతకు బెదిరింపు కాల్స్

Written By news on Tuesday, August 5, 2014 | 8/05/2014

ప్రాణ హాని ఉందని ఎస్పీ, డీజీపీ, హోంమంత్రికి రమేష్‌రెడ్డి ఫిర్యాదు

తాడిపత్రి : వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు, తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ రమేష్‌రెడ్డికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఆయన పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. గత సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన చురుకుగా పాల్గొన్నారు.
 
ఇటీవల పార్టీలో క్రియశీలకంగా పని చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతల దృష్టి రమేష్‌రెడ్డిపై పడ్డంతో ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత 20 రోజుల క్రితం కూడా ఆయన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాక్కోని ఉండటాన్ని గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు వచ్చే లోపే దుండగులు పారిపోయారని స్థానికులు పోలీసులకు తెలిపారు. అత్యంత సమస్యాత్మక మైన తాడిపత్రి ప్రాంతంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం పరిపాటిగా మారింది.
 
ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రమేష్‌రెడ్డికి చెందిన కళాశాల, ఆస్తుల విషయంలో అధికార పార్టీ నేతలు స్వయంగా కరపత్రాలను పంచి దుష్ర్పచారం చేశారు. అలాగే వారం క్రితం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, దీంతో తనకు ప్రాణహాని ఉందని రమేష్‌రెడ్డి జిల్లా ఎస్పీ, డీజీపీ, హోంశాఖ మంత్రిని కలిసి వివరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ లిస్టు ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం

Popular Posts

Topics :