27 January 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

'మరో 20 మంది ఎమ్మెల్యేలు రెడీ'

Written By news on Saturday, February 2, 2013 | 2/02/2013

 రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. వారంతా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గతంలో పలుమార్లు లోపాయకారీ ఒప్పందాలు చేసుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సహకార ఎన్నికల్లో కూడా పరస్పరం సహాయం చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి అర్ధమైందన్నారు

టీడీపీ అవిశ్వాసం పెట్టాలి: మైసూరారెడ్డి

మైనార్టీలో పడిన రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ వెంటనే అవిశ్వాసం పెట్టాలని వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. అవిశ్వాసం పెట్టకుంటే కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకున్నామని బహిరంగంగా చెప్పాలన్నారు. అవిశ్వాసం పెట్టడం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యతని, ఈ విషయాన్ని గవర్నర్‌పైకి నెట్టాలనుకోవడం తప్పించుకోవడమేనని అన్నారు. 

ప్రజల తరఫున పోరాడుదలచుకుంటే టీడీపీ వెంటనే అవిశ్వాసం పెట్టాలన్నారు. కాంగ్రెస్‌ పాలన బాగుందని టీడీపీ అంటే అవిశ్వాసం గురించి తాము మాట్లాడబోమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలని, లేకపోతే కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నట్టేనని మైసూరారెడ్డి అన్నా

అవిశ్వాసమంటే బాబుకు భయం

 పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలు నిజమైతే రాష్ట్రప్రభుత్వం మైనార్టీలో పడినట్లేనని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరించామని చెబుతున్న 9మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పే స్థితిలో బొత్స లేరని అన్నారు. బల నిరూపణ చేసుకోమని ప్రభుత్వాన్ని ప్రతిపక్షనేత అడగాలన్నారు. విపక్ష నేతగా చంద్రబాబుపై ఆ బాధ్యత ఉందన్నారు. అవిశ్వాసం పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందని బాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

MLA Jogi Ramesh fire on Botsa statement

జగన్ విషయం లో జోక్యం చేసుకోవాలి:అంతర్జాతీయ హై కమీషనర్ కు మానవ హక్కుల పరిశీలకుల వినతి.

సస్పెన్షన్ సంతోషం: ద్వారంపూడి

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మరికొద్ది రోజుల్లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సన్నిహిత ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారని ద్వారంపూడి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో?

* ప్రభుత్వానికి తగిన బలం లేదు!
* పరోక్షంగా తేల్చేసిన పీసీసీ చీఫ్
* సాంకేతికంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 155 
* 9 మంది ఎమ్మెల్యేలను బహిష్కరించామన్న బొత్స
* 146కు తగ్గిన కాంగ్రెస్ బలం.. మెజారిటీకి 2 తక్కువ
* అయినా నోరు మెదపని టీడీపీ, విపక్ష నేత చంద్రబాబు
* మరోసారి రుజువవుతున్న ‘కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు’
* అవిశ్వాసానికి టీడీపీని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ
* సర్కారుకు మద్దతు ఉపసంహరించిన మజ్లిస్.. వ్యతిరేక ఓటుకు సిద్ధం 
* అవిశ్వాసానికి సహకరిస్తామన్న సీపీఎం నేత రాఘవులు
* ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలోనే ఓటేసిన టీఆర్‌ఎస్ 

 ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందా? అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? తమ ప్రభుత్వం ఎవరి దయాదాక్షిణ్యాల మీదా ఆధారపడలేదని, తగిన మెజారిటీ ఉందని ఇటీవల కిరణ్ చేసిన వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనా? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం స్వయంగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇది నిజమే అనిపించక మానదు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన 9 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఎప్పుడో బహిష్కరించామని గాంధీభవన్ వేదికగా బొత్స చేసిన తాజా వ్యాఖ్యలతో ప్రభుత్వ మెజారిటీపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం 295 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీకి 155 మంది ఎమ్మెల్యేలున్నారు.మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ బలం (కనీసం 148) ఉంటేనే ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నట్టు. అప్పుడే అది మనగలుగుతుంది కూడా. ఆ లెక్కన 155 మంది ఎమ్మెల్యేలున్న కిరణ్ సర్కారు మనుగడకు ఢోకా ఏమీ లేదన్నది బయటకు కనిపించే విషయం. కానీ వారిలో 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి బహిష్కరించినట్టు పీసీసీ అధ్యక్షుడే ప్రకటించడంతో తాజాగా అసెంబ్లీలో పార్టీ బలం 146కు పడిపోయినట్టే. అంటే సాధారణ మెజారిటీ కంటే ఇది రెండు స్థానాలు తక్కువ! ఈ లెక్కన కిరణ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని పీసీసీ చీఫ్ తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో బల నిరూపణ చేసుకోవాల్సిన నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం దీనిపై నోరైనా మెదపకపోవడం విచిత్రంగా ఉంది!

ఎన్ని పార్టీలు చెప్పినా...
ముస్లిం మైనారిటీల విషయంలో కిరణ్ వైఖరికి నిరసనగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ఏడుగురు ఎమ్మెల్యేలున్న మజ్లిస్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. అంతేగాక అవిశ్వాస తీర్మానం ఎప్పుడు సభ ముందుకు వచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేస్తామని ఆ పార్టీ బహిరంగంగా ప్రకటించింది. ఇక.. అన్ని రంగాల్లో విఫలమైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. 

ఇక, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎవరు ప్రయత్నించినా తమ వంతు సహకారం అందిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కూడా నాలుగు రోజుల క్రితమే స్పష్టమైన ప్రకటన చేశారు. అవిశ్వాస తీర్మానంపై గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను తమ పార్టీ నుంచి బహిష్కరించామని స్వయంగా పీసీసీ అధ్యక్షుడే ప్రకటించినా.. టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటం పట్ల పార్టీల్లోనే గాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా విస్మయం వ్యక్తమవుతోంది.

బాబు తీరుపై టీడీపీలోనూ అసంతృప్తే
ప్రజా సమస్యలను పాలకులు గాలికొదిలేశారని, అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని ‘మీకోసం’ పాదయాత్రలో హామీలు గుప్పిస్తున్న బాబు.. అవిశ్వాస తీర్మానంపై మాత్రం నోరు మెదపకపోవడంపై టీడీపీ నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘బొటాబొటి సంఖ్యా బలంతో ప్రభుత్వాలు కొనసాగే రాష్ట్రాల్లో అవకాశం చిక్కుతూనే వాటిని కూల్చేయడానికి ప్రధాన ప్రతిపక్షాలు కాచుకుని కూర్చుంటాయి. 

కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రభుత్వాన్ని కాపాడేలా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వ్యవహరిస్తోందని ఆ పార్టీకి చెందిన కోస్తాంధ్ర ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. ‘అసలు బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంతకాలం కాంగ్రెస్ నుంచి ఎందరు ఎమ్మెల్యేలు బయటకు పోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లే’దని రాయలసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు ఇటీవల సీఎల్పీ ఆవరణలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఉటంకిస్తున్నారు. అది నిజమేనని ప్రస్తుత పరిస్థితులు మరోసారి రుజువు చేస్తున్నాయని వారంటున్నారు.

అందుకే ఆ ధీమా...
ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే అవకాశాల్లేవు. కానీ కీలకమైన టీడీపీయే అవిశ్వాసానికి సిద్ధంగా లేనప్పుడు ఇలాంటి అంశాలను చర్చకు పెట్టడమే తప్పని తెలంగాణకాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు చెప్పిన, లేక అసంతృప్తి ప్రకటించిన, లేదా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా ఇచ్చిన వారిని దృష్టిలో ఉంచుకొని బొత్స అలా మాట్లాడి ఉంటారని కాంగ్రెస్‌కే చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరన్నారు. ‘కానీ బొత్స వ్యాఖ్యల నేపథ్యంలో ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వం మైనారిటీలో పడ్డట్టే భావించాల్సి వస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 

‘అయినా కూడా ప్రభుత్వ మనుగడకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఇటు సీఎం, అటు మంత్రులు అంత ధీమాగా ఉన్నారంటే అందుకు కారణమేమిటో అందరికీ తెలిసిందే’ అని టీడీపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి ఢోకా లేదని, చేతనైతే అవిశ్వాసం పెట్టుకోవచ్చని కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటీవల మీడియా సమావేశంలో కిరణ్ సవాలు చేయడాన్ని మరో పీసీసీ ముఖ్య నేత ఒకరు ప్రస్తావించారు. బాబు మద్దతుందన్న గట్టి నమ్మకమే కిరణ్‌తో అలా మాట్లాడించిందంటూ ఆయన విశ్లేషించారు.

ప్రభుత్వం మైనారిటీలో పడిందని స్వయానా పీసీసీ అధ్యక్షుడే పరోక్షంగా అంగీకరించినా, పరిస్థితిని గమనించి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం.. ఆ ఊసే ఎత్తకపోగా లోపాయకారీ ఒప్పందాలతో సర్కారును కాపాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, ఈ విషయంలో తాము అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు బాబు భరోసా ఇచ్చారంటూ అప్పట్లో జోరుగా వార్తలు రావడం తెలిసిందే. 

‘బాబు నన్ను కలిశారు’ అని కేంద్ర మంత్రి చిదంబరం స్వయంగా లోక్‌సభలోనే చెప్పారు! నిజానికి మూడేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ పరస్పరం కుమ్మక్కై ముందుకు సాగుతున్నాయని పలు రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో విమర్శిస్తూనే వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) కాంగ్రెస్‌లో విలీనం కాకముందు కూడా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కాగా, అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంతగా డిమాండ్ చేసినా టీడీపీ అధినేత అందుకు ముందుకు రాకపోవడం, కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ మనుగడకు ఢోకా లేదని నిర్ధారించుకున్నాక మాత్రమే అందుకు సిద్ధపడటం తెలిసిందే. 

అది పూర్తిగా వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని పెట్టిన అవిశ్వాస తీర్మానమేనని కాంగ్రెస్ నేతలే అప్పట్లో వ్యాఖ్యానించారు కూడా. ‘‘అవిశ్వాసంపై చర్చలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సింది పోయి, కేవలం వైఎస్సార్‌సీపీపై విమర్శలకే అసెంబ్లీ వేదికను టీడీపీ వాడుకున్న వైనాన్ని రాష్ట్రమంతా చూసింది. కానీ, అనర్హత వేటు పడుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు’’ అని కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు గుర్తు చేశారు!

తొమ్మిదేళ్లు సాగిన ‘మాయల ఫకీరు’ పరిపాలనలో అగ్రవర్ణ పేదలను ఎవరైనా గుర్తించారా?

జగన్ ఆస్తులకేసులో న్యాయస్థానాల తీర్పు ఎలా ఉన్నా, ప్రజాకోర్టులో జగన్ నిర్దోషని, నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడే ఏకైక ప్రజానాయకుడు ఈ సమకాలీన రాజకీయాల్లో జగన్ ఒక్కడేననీ గత ఉపఎన్నికల్లో మూడు ప్రాంతాల ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. జగన్ జనంలో ఉన్నా, జైల్లో ఉన్నా ప్రజాదరణ, అభిమానం పెరుగుతాయే గాని తరగవని చెప్పటానికి నిదర్శనం ఆయన పార్టీలోకి గోదావరి వరదలా పెరుగుతున్న వలసలే. ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు, వయోభేదాలు లేకుండా రాజకీయాల్లో తలపండిన కురువృద్ధులు సైతం నిస్వార్థంగా వైఎస్సార్‌సీపీలో చేరటం చూస్తుంటే... జగన్ ఒక వ్యక్తి మాత్రమే కాదు గొప్పశక్తి అని అర్థమౌతోంది.

ఒకటి మాత్రం వాస్తవం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలందరూ వైఎస్సార్‌సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి, యువనేత జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని, మళ్లీ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగాన్ని పునరావృతం చేసుకుంటారు. అందులో సందేహం లేదు. 

- శీలం నర్సిరెడ్డి, హైదరాబాద్

‘పెద్దాయన’కు ప్రతిరూపం జగన్‌బాబు

మనలో మనుధర్మం ఎందరికి తెలుసు? ప్రపంచానికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఒకదేశాన్ని బలిచ్చి అయినా ప్రపంచాన్ని కాపాడుకోవాలి అన్నాడు మనువు. అదే ఒక దేశాన్ని కాపాడుకోవటానికి ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కోసం తన ఆర్థిక, సామాజిక స్థాయిని కాపాడుకోవటానికి కుటుంబంలోని ఒక వ్యక్తిని కోల్పోయినా తప్పు లేదన్నదే మనుధర్మం. దానికి ఉదాహరణగా పాండవులు విడిది చేసిన ఏకచక్రపురంలోని ప్రతి కుటుంబం నుండి ప్రతిరోజు ఒక మనిషిని బకాసురునికి ఆహారంగా పంపడాన్ని చెప్పుకోవచ్చు. ఆ ‘మను ధర్మాన్నే’ తిరగరాశాడు మన పెద్దాయన. ఏ కుటుంబం కూడా తన స్థాయిని కోల్పోనవసరం లేదన్నాడు. దురదృష్టం వెంటాడి ఆ కుటుంబంలోని ఏ వ్యక్తికైనా ప్రాణాంతక వ్యాధి వస్తే, ఆ కుటుంబం తన పూర్తి ఆర్థిక స్థాయిని ఫణంగా పెట్టి వైద్యం చేయించుకోనవసరం లేదు, ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనన్నాడు ఆయన. ఆ కుటుంబంలోని పిల్లలను ఆస్తులు కుదవపెట్టి, ఉన్న కొద్దిపాటి పొలాలు అమ్మేసి చదివించాల్సిన పని లేదన్నాడాయన. ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నాడు. 

2004కి ముందు తొమ్మిదేళ్లు సాగిన ‘మాయల ఫకీరు’ పరిపాలనలో అగ్రవర్ణ పేదలను ఎవరైనా గుర్తించారా? ఒక్క ‘పెద్దాయన’కే ఆ బాధితులు కనబడ్డారు. కాలం కలిసి రాక నిరుపేదలైన ఈ అగ్రవర్ణ పేదల ఇంట ‘పెద్దాయన’ దయతో ప్రయోజకులైన నేటి యువతకు ఎవరేమిటో, ఎవరేమి చేశారో పూర్తిగా తెలుసు. ప్రస్తుత అధికార, ప్రధాన ప్రతిపక్షాల ‘కృతఘ్నత’ గురించి, ప్రేమించడం మాత్రమే తెలిసిన ‘పెద్దాయన’ గురించి ఈ పసివాళ్లు తమ తరువాతి పది తరాలకు కథలు కథలుగా చేరవేస్తారు. ఇప్పటికే వీరంతా ‘జగన్‌బాబు’లో తమ ‘పెద్దాయన’ను చూసుకుంటున్నారు. 

నిశ్శబ్దకెరటం ‘ఢీ’కొట్టబోయే సమయం దగ్గరలోనే ఉంది. ఒడ్డున ఉన్న పీత బొక్కల్లోకి ఎన్నెన్ని పెద్ద తలలు, తలదాచుకోవడానికి పోబోతున్నాయో మనమందరం త్వరలో చూడబోతున్నాం.

- ఎ.వి.మహేంద్ర ప్రసాద్, సికింద్రాబాద్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

చంద్రబాబు అక్రమాలు, అధికార దుర్వినియోగంపై.........

 లోకాయుక్తకు తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం ఫిర్యాదు
 పిటిషన్ విచారణార్హతపై విచారణ ఏప్రిల్ 26కు వాయిదా

 రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నారా చంద్రబాబునాయుడు పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టారని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు సంఘం గౌరవ అధ్యక్షుడు సుంకరి జనార్దన్‌గౌడ్ శుక్రవారం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన కేటాయింపులు, సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వివరాలను పిటిషన్‌తో పాటు జతచేశారు. అడ్డగోలుగా భూకేటాయింపులు, తన అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బినామీల పేర్లతో కూడబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు అక్రమాలు, అధికార దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, సెబీలను ఆదేశించాలని అభ్యర్థించారు. 

ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చంద్రబాబునాయుడుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు సంస్థల అధినేత సీహెచ్ రామోజీరావు, మాగంటి రాజబాబు అలియాస్ మురళీమోహన్, అహోబలరావు, వి. నాగార్జున నాయుడు, కర్ణాటి వెంకటేశ్వరరావు, యలమంచలి సత్యనారాయణ చౌదరిలను పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు హయాంలో భారీగా లబ్ధి పొందిన మధుకాన్ సుగర్స్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి... పిటిషన్ విచారణార్హతపై వాదనలు వినిపించాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు.

ఆ పార్టీనే ప్రజలు బహిష్కరించారు


కాంగ్రెస్ మునిగిపోయే నావ
‘‘నేను ఏడాదిన్నర క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. పేదల కోసం అహర్నిశలూ శ్రమించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జననేత జగన్‌మోహన్‌రెడ్డిల కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా. త్వరలోనే పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వైఎస్సార్ సీపీలో చేరతారు. ఈ ప్రభుత్వం మనుగడ కొద్దిరోజులు మాత్రమే. కాంగ్రెస్ మునిగిపోయే నావ. ఈసారి బడ్జెట్ ఆమోదం పొందే పరిస్థితి కూడా ఉండదు. ప్రభుత్వ విప్ నాని కూడా ఆ పార్టీని విడిచిపెట్టారం టే పాలకులు సిగ్గుపడాల్సిన విషయం. ప్రస్తుతం ఉన్నవారు కూడా అధికారం చూసి మాత్రమే. సహకార ఎన్నికల్లో కాం గ్రెస్, టీడీపీలు చీకటి రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’.
- బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే 

ఆ పార్టీనే ప్రజలు బహిష్కరించారు
‘‘కాంగ్రెస్ పార్టీ నన్ను బహిష్కరించడమేమిటి? నేనెప్పుడో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు కొత్తగా బాధపడేదేమీ లేదు. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిని. సహకార ఎన్నికల్లో టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్‌ను ప్రజలు ఎప్పుడో బహిష్కరించారు. సహకార ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలిచే చోట్ల స్టేలు తేవడం ఎవరికి తెలియని విషయం. కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. ముందు ఆ పార్టీలోని వారి భవితవ్యం చూసుకోవాలి’’.
- గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యే 


ఎనిమిది నెలల కిందటే రాజీనామా చేశా
‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చడంతోపాటూ ప్రజాభిమానం ఉన్న నాయకుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డిని వేధింపులకు గురిచేయడాన్ని తట్టుకోలేక ఎనిమిది నెలల కిందటే రాజీనామా సమర్పించా. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తే తీరిగ్గా ఇప్పుడు బహిష్కరించామనడం హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ కుటుంబంపై కక్ష సాధింపుతోపాటు ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నా. సహకార ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఏం చేయాలో పాలుపోక ఈ అంశాన్ని ఇప్పుడు 
తెర మీదకు తెచ్చారు.
- సుజయ్‌కృష్ణ రంగారావు, బొబ్బిలి ఎమ్మెల్యే 

వారిది మానసిక ఆనందం
‘‘కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో రాజీనామా చేశా. ఇప్పుడు వారు నన్ను పార్టీ నుంచి బహిష్కరించిమానసిక ఆనందం పొందుతున్నారు. జనాభీష్టానికి అనుగుణంగా వైఎస్ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్‌కు, విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గత నెల 24నే ప్రకటించా. ఇప్పుడు తీరుబడిగా నన్ను బహిష్కరిస్తున్నట్టు చెప్పటం కాంగ్రెస్ నేతలు మానసిక ఆనందానికే తప్ప మరొకటి కాదు. నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసమే ధైర్యంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. వైఎస్ ఆశయసాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉంటా’’.
- పేర్ని నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే

ఎన్ని వేషాలు వేసినా బాబును ప్రజలు నమ్మరు


 టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే ఆరు నెలల్లో రాష్ట్రాన్ని తగలబెడతారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు, తన మచ్చలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలకు పూటకో అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. బాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా, మరెన్ని మోసపూరిత ప్రకటనలు చేసినా నమ్మే పరిస్థితి లేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రెండెకరాల పొలంతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు ప్రస్తుతం దేశ విదేశాల్లో రూ.లక్ష కోట్లకు పైబడి ఆస్తులున్నాయని ఆరోపించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగినన్ని కుంభకోణాలు రాష్ట్ర చరిత్రలో జరగలేదని వివరించారు. ‘‘అర్బన్ బ్యాంకుల మూసివేత, నకిలీ స్టాంపుల కుంభకోణం, నీరు-మీరు పథకం, పనికి ఆహార పథకం, మద్యం కుంభకోణం, రహేజా భూములు, కాందిశీకుల భూములు... ఇలా చెప్పుకుంటూ పోతే బాబు అవినీతికి అంతే ఉండదు’’ అని పేర్కొన్నారు. ఇన్ని మచ్చలు పెట్టుకున్న చంద్రబాబు మహానేత రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

సర్కారు మైనార్టీలో పడింది.. అవిశ్వాసానికి బాబు సిద్ధమా?

- వైఎస్సార్ సీపీ నేత అంబటి ప్రశ్న
- 9 మందిని బహిష్కరించినట్లయితే సర్కారు సంఖ్యా బలం తగ్గి మైనార్టీలో పడినట్లే
- చంద్రబాబు అవిశ్వాసం పెడతారా లేక
- చీకటి ఒప్పందాలకే కట్టుబడి ఉన్నారా? 

సాక్షి, హైదరాబాద్: తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌నుంచి బహిష్కరించడంతో మైనారిటీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? లేక చీకట్లో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉన్నారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాబు నిజంగా ప్రతిపక్ష నేతగా వ్యవహరించగలిగితే ఈ ప్రజాకంటక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాపక్షంగా వైఎస్సార్‌సీపీ అవిశ్వాసం పెడితే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా టీడీపీ మద్దతిస్తుందా? అని నిలదీశారు. 

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన తొమ్మిది మంది పార్టీ ఎమ్మెల్యేలను బహిష్కరించామని చెప్తున్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ‘‘జగన్‌ను జైల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు కలిశారు. అందులో ఐదుగురు కాంగ్రెస్, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. బొత్స లెక్కల బట్టి చూస్తే టీడీపీ వారిని కూడా బహిష్కరించారా..?’’ అని ఎద్దేవా చేశారు. బహిష్కరించిన వారి పేర్లను ధైర్యంగా చెప్పలేని దుస్థితిలో పీసీసీ చీఫ్ ఉన్నారని విమర్శించారు. తొమ్మిది మందిని బహిష్కరించినట్లయితే ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే కనుక బేషరతుగా బల నిరూపణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు.

మధ్యంతర ఎన్నికలకు దమ్ముందా?:

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందని చెప్పుకుంటున్నవారికి వైఎస్ఆర్ సీపీ సవాల్‌ విసిరింది. కాంగ్రెస్‌ పార్టీకి దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు రావాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. మధ్యంతర ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుస్తామని అంబటి వ్యాఖ్యానించారు. 

తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు బొత్స చెప్తున్నారని.. ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే అసెంబ్లీలో మీకు మెజార్టీ ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఇంతకంటే మంచి సమయం మళ్లీ దొరకదు అని అంబటి రాంబాబు అన్నారు

'చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించండి'

 చంద్రబాబు ఆక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని లోకాయుక్తలో తెలంగాణ జూనియర్‌ న్యాయవాదుల సంఘం ఫిర్యాదు చేసింది. తెలంగాణ జూనియర్ న్యాయవాదులు సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ ను లోకాయుక్త స్వీకరించింది. ఈ పిటిషన్ పై విచారణను లోకాయుక్త ఏప్రిల్‌ 26కు వాయిదా వేసింది.

'అధికార దుర్వినియోగంతో గెలుపు'

 సహకార ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడి విజయం సాధించిందని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు బరిలోకి దిగకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకే రైతుల బలం ఉందని చెప్పుకునేందుకే ఈ ఎన్నికలు నిర్వహించారని అన్నారు. షర్మిల పాదయాత్రను హృదయపూర్వకంగా స్వాగతించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని మేకపాటి అన్నారు.

we will support TRS: TDP

 సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని టి-టిడిపి ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నందుకే సహకార ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్‌ఎస్ అభ్యర్థులకు టిడిపి బేషరుతుగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ మొదట్నించి మోసం చేసిందని, విద్యార్థుల చావుకు వారే కారణమని ఎర్రబెల్లి విమర్శించారు.

నువ్వొక నిటారు నాయకుడివి

వేనవేల చేతులు
నీ నోరు తీపి చేయాలనుకున్న
నీ పుట్టినరోజును
‘లక్ష్యదీక్ష’గా మార్చిన
నీ త్యాగ నిరతిని
జాతి మరువదు!

సోనియానే ‘డోంట్ కేర్’ అన్న
నీ సాహసానికి జాతి యావత్తూ
జేజేలు పలుకుతోంది!
ఓదార్పుయాత్రలో 
పెరుగన్నం తినిపించి
అమృతంలా మజ్జిగ తాపించి
తోటలోని బత్తాయిలు కోసిచ్చి
నీకు పచ్చబొట్టు పెట్టిన
ప్రజల ప్రజా ప్రతిస్పందనలు...
వద్దని సున్నితంగా వారించినా
కన్ను దెబ్బతినేంతగా నీమీద
అభిమాన పూలవర్షం కురిపించి -
నాన్నిచ్చిన వృద్ధాప్యపు పింఛనులోంచి
ఇరవై రూపాయలిచ్చిన
బామ్మ దీవెనలు...
అన్నీ నీకు ముక్కోటి దేవతల శుభాకాంక్షలు!
ఊరు పేరు నిలబెట్టినవాడివి!
నాన్న ప్రతిష్టను జెండాగా ఎగరేసినవాడివి!
నిలువు గీతల చొక్కాలంటే నీకెంత ఇష్టమో...
నువ్వంటే మాకంత ప్రియం!
రాజకీయాల్లో నువ్వో నిటారు నాయకుడివి!
నీ తిరుగుబాటు బావుటా కచ్చితంగా
తెలుగువాడి ఆత్మగౌరవ జెండా!
మేమంతా నీ జెండా కర్రలం!
నీ చేతిలోని ఉద్యమ సంకేత కాగడాలం!

- షేక్ అక్బర్ బాషా, విజయవాడ

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు!

మహానేత వైఎస్సార్ రెక్కల కష్టంతో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన మరణానంతరం ఆయనకు వ్యతిరేకులైన వృద్ధనాయకుల మాటలు విని, రాజనీతి లేని సలహాదారులను నమ్మి, రాష్ట్రంలో తన గోతిని తనే తవ్వుకుంది. అంతేకాదు, వైఎస్సార్ ప్రతిష్టను దెబ్బ తీయటానికి అన్ని సంక్షేమ పథకాలూ తమవేనంటూ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. జగన్‌ను అధికారంలోకి రాకుండా నివారించటానికి కాంగ్రెస్‌వాళ్లు చేయని ప్రయత్నం లేదు. పెట్టని ఇబ్బందులు లేవు. వైఎస్సార్ తెచ్చిన రాజకీయాధికారాన్ని అనుభవిస్తూ ఆయనపైనే నిందలు మోపటం, ఆయన ఎవరినైతే నమ్మారో వారే ఆయనకు అండగా నిలబడలేకపోవటం చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతోంది. 

జగన్‌ను ఎదుర్కోటానికి కాంగ్రెస్ తన శత్రువైన తెలుగుదేశంతో చేతులు కలిపింది. చిరంజీవిని కూడా అక్కున చేర్చుకుంది. వై.ఎస్.ఆర్. కుటుంబంపై ఎన్నో అభాండాలు వేసింది. మరెన్నో అవినీతి ఆరోపణలు చేసింది. ఆఖరికి ఒక పార్టీకి అధినేత, పార్లమెంట్ సభ్యుడైన జగన్‌ను విచారణ పేరుతో నెలల తరబడి జైల్లో ఉంచడానికి కూడా వెనకాడలేదు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది? జగన్‌కు బెయిల్ రాకుండా మూడునెలలకొక చార్జిషీట్ వేస్తున్న సీబీఐని ఏమనాలి? జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆగమేఘాల మీద వందలమంది సిబ్బందితో ఆయన ఇళ్లు, ఆఫీసులు, బంధువుల నివాసాలపై ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ... అలాంటి కేసులోనే కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుపై విచారణ మొదలుపెట్టాల్సి ఉండగా, ఆ పని చేయకుండా చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకునేదాకా ఆగడాన్ని ప్రజలు ఎలా మరిపోతారు? 

నిందితుల్లో కొందరిని అరెస్టు చేసి, మరికొందరిని వదిలివేయటం సీబీఐ ద్వంద్వ నీతి కాదా? దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పెద్దలు జగన్‌పై రాజకీయ కక్ష సాధిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయినా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే ప్రజానాయకుణ్ని ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు. వారు అన్ని విషయాలనూ గమనిస్తున్నారు. తగిన సమయంలో, తగిన విధంగా అరాచక శక్తులకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 

- రాయప్ప తలమాల, విజయవాడ

అధికారం అండతో తొలి అంకం పూర్తి

అధికారం అండతో తొలి అంకం పూర్తి
సహకార ఎన్నికల్లో అన్ని రకాల అడ్డదారులు తొక్కిన కాంగ్రెస్
సొసైటీలను హస్తగతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న ఎన్నికల తీరుకు నిరసనగా ఎన్నికల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్.. 
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పలు చోట్ల స్వచ్ఛందంగా పోటీలో నిలుచుని గెలిచిన పార్టీ అభిమాన రైతులు
పార్టీ పరంగా కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు బరిలోకి..

సాక్షి, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడత సహకార ఎన్నికల ప్రహసనం చెదురుమదురు సంఘటనల మధ్య గురువారం సాయంత్రం ముగిసింది. అధికార కాంగ్రెస్ అన్నిరకాల అడ్డదారులూ తొక్కి సొసైటీలను హస్తగతం చేసుకొనే ప్రయత్నాలు కొనసాగించింది. తమ వర్గీయులకు సభ్యత్వాలు ఇప్పించుకోవటం, ఇతర పార్టీల వారికి సభ్యత్వాలు దక్కకుండా ఇబ్బంది పెట్టటం, కొన్నిచోట్ల దౌర్జన్యంగా సభ్యత్వ పుస్తకాలు ఎత్తుకెళ్లటం వంటి సకల అక్రమాలకూ తెరతీశారు. విజయావకాశాలు లేని సొసైటీలను వాయిదా వేయించారు.

డీసీసీబీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉన్న నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న పీఏసీఎస్‌లను లక్ష్యంగా చేసుకుని వాయిదా తంత్రం రచించారు. తొలి దశలో 80 పీఏసీఎస్‌ల ఎన్నికలు వాయిదా వేయటం ద్వారా ఆయా సంఘాల ప్రతినిధులకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశమే లేకుండా చేయగలిగారు. మొత్తంమీద 1,439 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా అందులో 80 సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయగా 397 సంఘాలు ఏక గ్రీవమయ్యాయి. మరో మూడు సంఘాల ఎన్నికలపై కోర్టు స్టే ఇచ్చింది. మిగిలిన 959 సంఘాల్లో దాదాపు 12 వేల డెరైక్టర్ స్థానాలకు 32,794 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. గురువారం సాయంత్రానికి పోలింగ్ ముగియగా వెనువెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా అధికార పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేక పోయినట్లు వెల్లడైన ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. 

పాలక కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పార్టీపరంగానే అభ్యర్ధులను బరిలోకి నిలిపాయి. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికల తీరుకు నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు తిరస్కరించింది. అయితే, పలుచోట్ల పార్టీ అభిమానులైన రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీలో నిలుచున్నారు. కాగా, మొదటి విడత ఎన్నికలు ముగిసి గురువారం రాత్రి లెక్కింపు పూర్తయ్యే సరికి చాలా సొసైటీల్లో బలాబలాలు వెల్లడయ్యాయి. అయితే, ప్రాదేశిక సభ్యుల ఎన్నిక పార్టీ రహితంగా జరిగినందున సభ్యులు ఎవరికైనా మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సొసైటీలు ఏ పార్టీకి దక్కుతున్నాయో స్పష్టంగా చెప్పడం కష్టం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు... వివిధ జిల్లాల్లో సొసైటీలను దక్కించుకున్న పార్టీల మద్దతుదారుల వివరాలు ఇలా ఉన్నాయి. 

వైఎస్‌ఆర్ జిల్లాలోని 18 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా 8 సొసైటీలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. 6 సొసైటీలను కాంగ్రెస్ మద్దతుదారులు, మూడు సొసైటీల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు.

అనంతపురం జిల్లాలో 47 సొసైటీలకు ఎన్నికలు జరగ్గా 27 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుదారులు 11,టీడీపీ మద్దతుదారులు 8 దక్కించుకున్నారు. 

చిత్తూరు జిల్లాలో 19 సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ మద్దతుదారుడు ఒకటి, టీడీపీ మద్దతుదారులు 6, వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులు 11 సొసైటీలను సాధించుకున్నారు. 

కర్నూలు జిల్లాలో 59 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా 29 సొసైటీలు కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కాయి. 15 సొసైటీలు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు, ఒకటి టీడీపీ మద్దతుదారుకు, అయిదు ఇండిపెండెంట్లకు దక్కాయి.

నెల్లూరు జిల్లాలో మొత్తం 31 సొసైటీల పరిధిలో 266 ప్రాదేశిక సభ్యత్వాలకు ఎన్నిక నిర్వహించగా 22 సొసైటీల పరిధిలో ఫలితాలు వె ల్లడయ్యాయి. వాటిలో 19 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, రెండు స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ఒక స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 

వరంగల్ జిల్లాలో 49 సొసైటీల పరిధిలో 637 ప్రాదేశిక సభ్యత్వాలకు ఎన్నిక నిర్విహ ంచగా 43 సొసైటీలకు ఫలితాలు వెల్లడయ్యాయి. వాటిలో కాంగ్రెస్ మద్దతుదారులు 30 సొసైటీలు, టీడీపీ మద్దతుదారులు ఏడు, టీఆర్‌ఎస్ మద్దతుదారులు నాలుగు, వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుడు ఒకటి, ఇండిపెండెంటు ఒక సొసైటీని దక్కించుకున్నారు. 

ఖమ్మం జిల్లాలో 55 సహకార సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల కాగా ఎన్నికలకు ముందే ఏడు సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 48 సంఘాలకు ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవంతో కలిపి 23 సంఘాల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఏడు సంఘాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, మరో మూడింటిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. మిగిలిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

కరీంనగర్ జిల్లాలో తొలివిడత 72 సహకార సంఘాల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ మద్దతుదారులు 40, టీఆర్‌ఎస్ మద్దతుదారులు 15, టీడీపీ మద్దతుదారులు 4, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు 5, బీజేపీ మద్దతుదారులు ఇద్దరు, సీపీఐ మద్దతుదారుడు ఒకరు, ఇండిపెండెంట్లు నలుగురు గెలుపొందే అవకాశముంది. 
నిజామాబాద్ జిల్లాలో 61 సంఘాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌కు 33, టీఆర్‌ఎస్‌కు 16,టీడీపీ 10, వైఎస్‌ఆర్‌సీపీ 1, బీజేపీ 1 దక్కించుకున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో 28 సొసైటీలకు ఎన్నిక జరగ్గా 15 సొసైటీలు కాంగ్రెస్, తొమ్మిది వైఎస్‌ఆర్ కాంగ్రెస్, నాలుగు టీడీపీ మద్దతుదారులకు దక్కాయి. 

ప్రకాశం జిల్లాలో 73 సొసైటీలకు గాను 22 ఏకగ్రీవమయ్యాయి. 51 సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. ఫలి తాలు వెల్లడి కావాల్సి ఉంది. 

కృష్ణా జిల్లాలో 89 సహకార సంఘాలకు జరిగాయి. ఇందులో 28 సంఘాలు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు, 27 కాంగ్రెస్, 25 టీడీపీ మద్దతుదారులకు దక్కాయి. 

విశాఖపట్నం జిల్లాలో 29 సహకార సంఘాలకు 10 సంఘాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు, తొమ్మిది సంఘాల్లో కాంగ్రెస్, ఒక సంఘంలో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు.
రంగారెడ్డి జిల్లాలో 37 సొసైటీల్లో ఎన్నికలు జరిగాయి. 15 సంఘాల్లో టీడీపీ మద్దతుదారులు, 16 సంఘాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు.

అధికారం...అరాచకం

సహకార ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డిపై కేసు నమోదు చేయించడమే ఇందుకు ఉదాహరణ అని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అంటున్నారు. సహకార ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలుపు సునాయాసమని నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్..టీడీపీతో జట్టుకట్టింది. ఆ రెండు పార్టీల నేతలు కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులే లక్ష్యంగా పావులు కదుపుతూ వచ్చారు. రవీంద్రనాథ్‌రెడ్డి అందుబాటులో ఉంటే వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం అసాధ్యమని ఆయన్ను ఎన్నికలకు దూరంగా ఉంచాలనే నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి, సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయించారని చెబుతున్నారు. పెద్దచెప్పలి సహకార సంఘంలో బోగస్ ఓట్లు ఉన్నాయని మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన యంత్రాంగం అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గింది. మాజీ మేయర్ ఫిర్యాదు ప్రతి బదులు ఆ స్థానంలో మరో ఫోర్జరీ పత్రాన్ని ఉంచి అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి చేసినట్లు చెబుతున్న సంతకాన్ని పరిశీలిస్తే అధికార కుట్ర బట్టబయలవుతుందని వారు తేల్చిచెబుతున్నారు. రవీంద్రనాథ్‌రెడ్డి అందుబాటులో లేకుండా చేసే ఎత్తుగడలో భాగంగానే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. అయితే సహకార ఎన్నికల నేపథ్యంలో మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు బుధవారం వైఎస్సార్ జిల్లా పోలీసులను ఆదేశించిన విషయం విదితమే. 

కుమ్మక్కులో కొత్త పుంతలు

మూడేళ్లుగా రెండు పార్టీలూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి
ఇప్పుడవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి
వైఎస్సార్ సీపీ జెండాలతో బైక్‌పై మంత్రి తిరగడం కుట్రలో భాగమే
సహకార ఎన్నికల్లో తెలుగుదేశానికి మేలు చేకూర్చేందుకే ఇదంతా..
చంద్రబాబూ.. మీరు కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాకపోతే.. 
అవిశ్వాసం పెట్టండి.. అప్పుడు ఎవరేంటో తేలిపోతుంది

సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు మూడేళ్లుగా కొనసాగిస్తున్న కుమ్మక్కు కుట్రలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉప నేత మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రి ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఉన్న బైక్ మీద కూర్చొని సహకార సంఘాల ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారంటూ వస్తున్న కథనాలు అందులో భాగమేనని తెలిపారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా మారిన తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారపక్షం కుయుక్తులు పన్నుతోందని, ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండి స్తున్నామని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే, ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాకపోతే.. ప్రజాకంఠక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఎవరేంటో తేలిపోతుం దని సుచరిత అన్నారు. మూడేళ్లుగా కాంగ్రెస్‌తో కొనసాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పూటకొక అబద్ధం చెప్తూ ప్రజలను మోసగిస్తున్నారని ఆమె గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.

గ్రామాల్లో పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి

రాష్ట్రంలో ప్రజలు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నా.. చంద్రబాబుకు అవేవీ పట్టకపోగా కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలను తు.చ. తప్పకుండా ఆయన పాటిస్తున్నారని సుచరిత దుయ్యబట్టారు. గ్రామాల్లో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సామాన్యుడికి బతకలేని పరిస్థితి కాంగ్రెస్ పాలకులు కల్పిస్తున్నారు. ఎడాపెడా కరెంటు కోతలతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కరెంటు బిల్లులు చూస్తే షాక్‌కు గురిచేస్తున్నాయి. మరోపక్క 104 వాహనం కనిపించడంలేదు. ఆరోగ్యశ్రీ పడకేసింది. 108 గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పేదవారికి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. వృద్ధాప్య పెన్షన్‌లు ఒక్కటీ మంజూరు కాకపోగా ఉన్నవాటిని తొలగిస్తున్నారు. ఒక కొత్త ఇల్లు కూడా కట్టించలేదీ ప్రభుత్వం’ అని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం రెండు నెలల్లో ముగుస్తున్నా... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,900 కోట్ల మేర చెల్లించకుండా ప్రభుత్వం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. మహానేత రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. అయితే ప్రజలను ఇంతగా హింసిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదని సుచరిత ప్రశ్నించారు.

మాటకు కట్టుబడిన జగన్...: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను చంద్రబాబుకు సుచరిత గుర్తుచేశారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉండి ఉంటే కేంద్ర మంత్రిని చేసేవారమని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవారమని ఆజాద్ చెప్పారు. కానీ మా నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వల్లే కదా అక్రమ కేసులతో 8 నెలలుగా నిర్బంధించినప్పటికీ చెక్కు చెదరని ధైర్యంతో ఉన్నారు. మా నాయకుడిని చూసి మేం గర్విస్తున్నాం’ అని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో తనపై విచారణ జరగకుండా చూసుకునేందుకు.. వ్యక్తిత్వాన్ని అమ్ముకొని చీకట్లో చిదంబరాన్ని కలుస్తూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి వ్యవహారాలు చూస్తుంటే అసహ్యం కలుగుతోందని, వీళ్లు మనుషులేనా అనే భావం కలుగుతోందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఒక పథకం ప్రకారం మాల, మాదిగలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఎస్సీల మధ్య చిచ్చుపెట్టేందుకు రెండు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా వారు అవేవీ పట్టించుకోకుండా జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచారన్నారు. 

సమస్యలు సృష్టించేది కాంగ్రెస్సే..: ‘‘రాష్ట్రంలో సమస్యలను కాంగ్రెస్ వారే సృష్టిస్తారు. ఆ తర్వాత సమస్యలపై నిరసనలకు వారే నాయకత్వం వహించేటట్టుగా కుట్రలు, కుయుక్తులు పన్నుతారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ‘డిసెంబర్ 9 ప్రకటన’తో కాంగ్రెస్ నాయకత్వం అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఒక తండ్రిలా ఆలోచన చేసి ఎవరికీ అన్యాయం జరగకుండా సమస్యకు పరిష్కారం చూపాల్సిందిపోయి, ఓట్ల కోసం రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి సంబంధం లేని ఖమ్మం జిల్లా మంత్రి చేత కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ జెండాలు ఉన్న బైక్ ఎక్కించడం, ఆయన కావాలనే ఆ బైకు మీద తిరగటం.. అంతా రెండు పార్టీల కుట్రలో భాగమే. టీడీపీకి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఏమనాలో అర్థం కావడంలేదు’ అని సుచరిత దుయ్యబట్టారు.

జగన్‌ను కలిసిన అనకాపల్లి ఎంపీ


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం సబ్బం హరి విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌ను జైల్లోనే ఉంచేందుకు ప్రభుత్వం, సీబీఐ కలిసి నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు తలోమాట మాట్లాడుతున్నాయని విమర్శించారు. అసలు ఆ మూడు పార్టీలు అయోమయంలో ఉన్నాయా లేక ప్రజలను అయోమయ స్థితిలో పడేయటానికి అలా వ్యవహరిస్తున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీయే స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు ఆజాద్, వయలార్ రవి, పీసీ చాకో, సుశీల్‌కుమార్ షిండేలు భిన్నమైన ప్రకటనలు చేయటాన్ని బట్టి చూస్తే తెలంగాణపై వారు కూడా అయోమయంగా మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకోవాలన్నారు. అశేష ప్రజాదరణ ఉన్న జగన్‌ను ఒక ప్రాంతానికే పరిమితం చేసేందుకు విభజనపై కాంగ్రెస్ తీవ్రంగా దృష్టి సారించిందంటూ వస్తున్న వార్తలను ప్రస్తావించగా.. కేవలం పార్లమెంటు సీట్ల కోసం రాష్ట్రాన్ని విడదీస్తారంటే అంతకంటే అరిష్టం లేదన్నారు.

గల్ఫ్ బాధితులకు చేయూత ,తిరిగి రావడానికి వైఎస్సార్సీపీ ఏర్పాట్లు

వంద మందికి టికెట్ల అందజేత 
దుబాయ్‌లో పర్యటించిన ప్రతినిధి బృందం

సాక్షి, హైదరాబాద్: అనధికారికంగా పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దుబాయ్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ పట్టుబడిన వారిని, ఎలాంటి కేసులు లేకపోయినా అధీకృత పత్రాలు లేని కారణంగా జైల్లో ఉంచిన వారిని కూడా సొంత రాష్ట్రానికి పంపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు దాతల సాయంతో ఏర్పాట్లు చేశారు. దుబాయ్ ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి ప్రకటించే ‘అమ్నెస్టీ’ కింద విడుదల చేసిన వారిలో తొలివిడతగా 30 మందిని ఈనెల 29న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు పంపారు. మలి విడతగా మరో 20 మంది ఈ నెల నాలుగోతేదీన ఇక్కడకు రావడానికి ఏర్పాట్లు చేశారు. త్వరలో మరో యాభై మంది వరకూ వచ్చే అవకాశం ఉందని గురువారం రాత్రి దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ ‘సాక్షి’కి తెలిపారు. వీరందరికీ విమాన టికెట్లకు అయిన ఖర్చులను వైఎస్సార్ కాంగ్రెస్ సమకూర్చింది. అలాగే కలాని ఎం.లాల్ సైతం పలువురికి విమానటికెట్ల ఖర్చును భరిం చారు. ఎన్నారై విభాగం విజ్ఞప్తి మేరకు అమెరికాలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు దారులు 20 మందికి విమాన టికెట్ల ఖర్చును భరించడానికి సిద్ధమయ్యారు. దుబాయ్‌లో ఉన్న పార్టీ శ్రేయోభిలాషులు పృథ్వీరాజ్ 12 మందికి, ప్రసాద్ (గల్ఫ్ జ్యోతి) ఐదుగురికి, అజయ్ కందిమళ్ల మరో ఐదుగురికి, వాసవీగ్రూప్ వారు ఇద్దరికి టికెట్లను ఏర్పాటు చేశారు. అక్కడినుంచి ప్రవాసులందరినీ రాష్ట్రానికి పంపే కార్యక్రమాన్ని పార్టీ శ్రేయోభిలాషులు ప్రసాద్ కుక్కునూరు, రమేష్‌రెడ్డి, స్వామి, సోమిరెడ్డి, బ్రహ్మానంద్, శామ్యూల్, సత్యం పర్యవేక్షించారు. ఇలా తిరిగివస్తున్న వారిలో కరీంనగర్, నల్లగొండ, ఉభయగోదావరి జిల్లాల వాసులు ఎక్కువగా ఉన్నారని వెంకట్ వివరించారు.

విముక్తికి కృషి: దుబాయ్‌లో ఒక హత్య కేసులో ఇరుక్కుని ఆరేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వాసులు ఆరుగురిని విడిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషిని ప్రారంభించింది. పొట్ట కూటి కోసం వెళ్లి జైలుపాలైన ఈ ఖైదీల కుటుంబీకులు గతనెల 22న వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలసి తమ వారిని విడిపించాలని మొరపెట్టుకోగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయం విదితమే. పార్టీ సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్‌లతో కూడిన ప్రతినిధిబృందం దుబాయ్‌కు వెళ్లి అక్క డి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపింది. ఖైదీలు విడుదల కావాలంటే షరియత్ ప్రకారం హత్యకు గురైన నేపాలీ రక్తసంబంధీకులకు రూ.15లక్షలు చెల్లించాల్సి ఉంది.

ఈ మొత్తాన్ని తాను చెల్లిస్తానని అక్కడి ప్రవాస భారతీయుడు కలాని ఎం.లాల్ ముందుకు వచ్చారు. లాల్‌కు మిత్రుడైన ఆర్.జె.రావు ఈప్రతిపాదనను పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డికి చెప్పడంతో ఆయన వెంటనే సమ్మతించి ప్రతినిధి బృందాన్ని దుబాయ్‌కు పంపారు. సుమారు ఎనిమిదేళ్ల కిందట శిక్ష పడిన కేసు కనుక ఖైదీల విడుదలకు న్యాయపరమైన తంతు పూర్తయ్యేటప్పటికి కనీసం 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని అక్కడి న్యాయవాదులు పార్టీ నేతలకు వివరించారు. ఈ విషయంలో దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు సహకరించారు. ఈ సందర్భంగా కె.కె.మహేందర్‌రెడ్డి జైల్లో ఉన్న ఖైదీలతో కూడా మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. జైల్లో మగ్గుతున్న వారి కుటుంబీకులు సీఎం, ప్రధాని కార్యాలయాలను ఎన్నిసార్లు సంప్రదించినా ఈ విషయంలో ప్రయోజనం లేక పోయింది. సంక్షేమనిధి నుంచి వీరికి సాయం అందించాల్సిందిగా న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. నిరాశలో ఉన్న కుటుంబాల్లో ఈ ప్రయత్నాలు ఆశలను రేకెత్తించాయి.

పైసాకే పడిపోయిన సర్కారు !

- ఒకే ఒక్క పైసా తగ్గించినా.. అధికార పార్టీ ఎంపీ విద్యుత్ కంపెనీతో ఒప్పందం 

- కేస్-1 బిడ్డింగ్‌లో భాగంగా 500 మెగావాట్ల విద్యుత్ 25 ఏళ్లపాటు కొనుగోలుకు ఓకే
- ఎల్-1 ధర యూనిట్‌కు రూ.3.466 చొప్పున ఇవ్వాలన్న ట్రాన్స్‌కో
- కుదరదన్న ఎల్-5 థర్మల్ పవర్‌టెక్.. ఎల్-1 ధరకిస్తేనే కొనాలని విద్యుత్ సంస్థ నిర్ణయం
-చక్రం తిప్పిన సీఎంఓ!.. ఒక్కపైసా తగ్గింపుతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి
రూ.350 కోట్ల నష్టం 

సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డికి చెందిన థర్మల్ పవర్‌టెక్ కంపెనీపై ప్రభుత్వం తన అభిమానాన్ని చాటుకుంది. కేవలం ఒక్క పైసానే తగ్గించినప్పటికీ 25 ఏళ్ల పాటు విద్యుత్‌ను (500 మెగావాట్లు) కొనుగోలు చేసేందుకు గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. 2016 ఫిబ్రవరి 1 నుంచి 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. 

అయితే బిడ్డింగ్‌లో ఎల్-1 పేర్కొన్న ధరకు సరఫరా చేస్తేనే ఒప్పందం కుదుర్చుకోవాలని, భారీ ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్న ట్రాన్స్‌కో సూచనలను సర్కారు బేఖాతరు చేసింది. బిడ్డింగ్‌లో ఎల్-5గా నిలిచిన ఈ కంపెనీ పేర్కొన్న ధరకు ఒక్కపైసా తగ్గింపుతోనే ఒప్పందం కుదుర్చుకోవడానికి.. సీఎం కార్యాలయం నేరుగా రంగంలోకి దిగడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా ఆ కంపెనీకి రూ.350 కోట్ల మేర లాభం చేకూర్చిందనే అనుమానాలు వ్యక్తమవుతుండగా...ఈ మేరకు ప్రజలపైనే భారం పడనుంది.

ఇదీ కేస్-1 బిడ్డింగ్ కథ: వచ్చే 25 ఏళ్లకుగానూ 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు 2011లో ప్రభుత్వం బిడ్డింగ్(కేస్-1)ను పిలిచింది. హిందుజాను బిడ్డింగ్‌కు అనుమతించడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మొత్తం మీద యూనిట్ రూ.3.466 చొప్పున సరఫరా చేస్తామన్న ఈస్ట్‌కోస్ట్ కంపెనీ ఎల్-1గా నిలిచింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హిందుజా ఎల్-2గా(రూ.3.480) నిలిచింది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 100 శాతం విద్యుత్‌ను రాష్ట్రానికే ఇవ్వాల్సిన హిందుజాను బిడ్డింగ్‌కు అనుమతించడం వివాదాస్పదం అయిన నేపథ్యంలో హిందుజా తప్పుకుంది. బిడ్డింగ్ ఆలస్యం కావడంతో ఎల్-3, 4గా వచ్చిన అథెనా, నెల్‌క్యాస్ట్ సంస్థలు కూడా తప్పుకున్నాయి. దీంతో ఎల్-5గా (రూ.3.685) వచ్చిన థర్మల్ పవర్‌టెక్ తెరపైకి వచ్చింది. 

ట్రాన్స్‌కో అభ్యంతరాలు బేఖాతరు!: థర్మల్ పవర్‌టెక్ ఎల్-1 ధరకు సరఫరా చేస్తేనే విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. ఇందుకు సదరు కంపెనీ ససేమిరా అంది. దాంతో ఒకదశలో విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా ట్రాన్స్‌కో అభిప్రాయపడింది. ఈ సమయంలో రంగంలోకి దిగిన సీఎంఓ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో సంబంధం లేకుండా.. కేవలం ఒక్కపైసా మాత్రమే తగ్గించేందుకు కంపెనీ ముందుకు వచ్చినప్పటికీ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే యూనిట్ విద్యుత్‌ను ఏకంగా రూ.3.685 చెల్లించి కొనుగోలు చేయడం సరికాదని.. క్రమేణా పెరిగే ధర 25 ఏళ్ల సమయంలో భారీగా పెరిగి భారమవుతుందని ట్రాన్స్‌కో తెలిపింది. ఈ నేపథ్యంలోనే మొదటి 250 మెగావాట్లు ఎల్-1 ధరకు (యూనిట్‌కు రూ.3.466) సరఫరా చేయాలని, మిగిలిన 250 మెగావాట్లు కోట్ చేసిన ధరకు (రూ.3.685) సరఫరా చేయాలని కోరింది.

ఇందుకు థర్మల్ పవర్‌టెక్ అంగీకరించ లేదు. ఎల్-1 ధరకు ఇస్తేనే విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. కానీ సీఎం కార్యాలయం రంగంలోకి దిగడంతో సీను మారిపోయింది. సదరు కంపెనీతో నేరుగా సీఎంవోనే చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ మధ్యేమార్గంగా కేవలం ఒక్కపైసా తగ్గింపుతో అంటే యూనిట్‌కు రూ. 3.675 చెల్లించి 500 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇంధనశాఖ ఉన్నతాధికారులపై సీఎంవో ఒత్తిళ్లు తెచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తాజా ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రూ. 350 కోట్ల భారం: 25 ఏళ్లకు సంబంధించిన ఈ విద్యుత్ కొనుగోలులో ఒక్క పైసా విలువెంతో తెలుసా? వెయ్యి మెగావాట్లకు ఒక్కపైసా అదనంగా చెల్లిస్తే 25 ఏళ్లకు రూ.35 కోట్ల అదనపు వ్యయమవుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఈ లెక్కన ఎల్-1తో పోలిస్తే థర్మల్ పవర్‌టెక్ నుంచి యూనిట్‌కు అదనంగా సుమారు 20 పైసల మొత్తాన్ని(రూ.3.675-రూ.3.466) ప్రభుత్వం అదనంగా చెల్లించనుంది. 

1,000 మెగావాట్లకు 20 పైసలు అదనంగా చెల్లిస్తే 25 ఏళ్లలో రూ.700 కోట్లు అదనపు వ్యయమవుతుంది. థర్మల్ పవర్‌టెక్ నుంచి 500 మెగావాట్లు కొంటున్న నేపథ్యంలో రూ.350 కోట్ల వ్యయం కానుంది. ఈ వ్యయాన్ని ప్రభుత్వం విద్యుత్ చార్జీల రూపేణా ప్రజల నుంచే వసూలు చేస్తుంది.

21న ఎమ్మెల్సీ ఎన్నికలు..14 జిల్లాల్లో సెలవు

మూడు పట్టభద్ర స్థానాలకు, మూడు ఉపాధ్యాయ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 21వతేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో స్థానికంగా సెలవు రోజుగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ తేదీ ముందు రోజున(ఫిబ్రవరి 20వ తేదీ) ఎన్నికలు నిర్వహించే కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలున్న కార్యాలయాలకు కూడా సెలవు వర్తిస్తుంది. 

కౌన్సిల్ ఎన్నికల విధుల్లో పోలీసులు: ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 21వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖలో డీజీపీ నుంచి సంబంధిత పోలీస్‌స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్ల వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలను కలిసి, వారిలో ధైర్యం నింపాలని...

Written By news on Thursday, January 31, 2013 | 1/31/2013

కాలికి గాయంతో డిసెంబర్ 14న తుర్కయాంజాల్ వద్ద నిలిపివేత
అక్కడి నుంచే యాత్ర తిరిగి మొదలవుతుంది: వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ

సాక్షి, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఫిబ్రవరి 6వ తేదీన పునఃప్రారంభమవుతోంది. గత ఏడాది అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర షర్మిల కాలికి గాయం కారణంగా డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వద్ద నిలిచిపోయింది. అనంతరం షర్మిల కాలికి శస్త్ర చికిత్స జరిగింది. గాయం నుంచి షర్మిల కోలుకుంటుండటంతో యాత్రను కొనసాగించనున్నారు. ఇంతకు ముందు యాత్ర నిలిచిపోయిన తుర్కయాంజాల్ నుంచే ‘మరో ప్రజాప్రస్థానం’ తిరిగి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు.

బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేసిన నేపథ్యంలో ప్రజాపక్షంగా వైఎస్సార్‌సీపీ తరపున షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. షర్మిల ఇప్పటిదాకా 58 రోజుల్లో 828.1 కిలోమీటర్లు నడిచినట్లు తెలి పారు. అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలను కలిసి, వారిలో ధైర్యం నింపాలని షర్మిల చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పారు. కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకునేం దుకు షర్మిల ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకోవడంతో పాటు వైద్యుల సూచనలన్నింటినీ పాటించారని తెలిపారు.

కాంగ్రెస్‌పక్ష నేత చంద్రబాబే


అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడని పద్మ అన్నారు. ‘‘అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను సర్వనాశనం చేసింది. ప్రజలపై కక్షగట్టినట్లు విపరీతమైన పన్నుల భారం మోపుతోంది. ప్రజల పాలిట శాపంగా మారింది. అయినా ఈ ప్రభుత్వం గురించి ప్రతిపక్షనేత చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. ఆయన బాధ్యతను విస్మరించి అధికార పక్షానికి రక్షణ కల్పిస్తున్నారు. పైగా ప్రజలను మోసగించేందుకు యాత్రల పేరుతో పూటకొక అబద్ధం చెబుతున్నారు. ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. పలువురు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఈ ప్రభుత్వానికి సంఖ్యా బలం లేదు. మైనారిటీలో ఉంది. పాలించే అర్హతలేని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని బాబు చెప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగడానికి చంద్రబాబు తీవ్రంగా తాపత్రయపడుతున్నట్లు ఆయన వ్యవహార శైలిని చూస్తే అర్థమవుతుంది. ఆయనే కాంగ్రెస్ పక్ష నేత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ప్రజల మధ్య ఉన్న జగన్‌ను అక్రమంగా బంధించారు. 8 నెలలు గడచినాజగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐని అడ్డంపెట్టుకొని డ్రామాలాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలను చూసి ప్రజలు నిరాశకు గురయ్యారని, అందుకే వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు జగన్ వదిలిన బాణంగా షర్మిల పాదయాత్ర చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న రాజన్న సువర్ణయుగం త్వరలోనే వస్తుందని పాదయాత్ర ద్వారా షర్మిల భరోసా ఇచ్చారన్నారు.

పాదయాత్రను అడ్డుకొనే పరిస్థితి తలెత్తదు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా మాట తప్పలేదని, ఇడుపులపాయ ప్లీనరీలో చెప్పిన విషయానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని పద్మ తెలిపారు. ఇతర పార్టీల మాదిరిగా రెండు కళ్ల సిద్ధాంతమంటూనో, పూటకొక నిర్ణయం మార్చడమో చేయడంలేదన్నారు. షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోరని విలేకరుల ప్రశ్నకు బదులుగా చెప్పారు. అవి ఊహలేనని, అర్థంలేని ప్రశ్నలని కొట్టిపారేశారు. కేంద్ర హోం మంత్రి షిండే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తమ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా దోషిగా నిలబడింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రకటించాలని తాము మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆ పార్టీ తప్పించుకు తిరుగుతోందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక, కాంగ్రెస్ తన దుష్ట ఆలోచనలతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు మంచి ఆలోచనలతో దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలని సూచించా

Popular Posts

Topics :