20 December 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?

Written By news on Saturday, December 26, 2015 | 12/26/2015


'కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?'
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మహిళా సాధికారిత బూటకమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం, అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించడం మహిళా సాధికారితా అని ప్రశ్నించారు.

మహిళలకు ఇసుక్ రీచ్ లు అప్పగించే పేరుతో టీడీపీ నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులు ముమ్మాటికీ టీడీపీ నేతలేనని ఆరోపించారు.

కష్టమైనా, నష్టమైనా వెనుకడుగు వేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాను


బాబు పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది
♦ ఖమ్మం జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్
♦ వైఎస్సార్‌సీపీ మరింతగా బలం పుంజుకుంటోంది
♦ ఏపీ, తెలంగాణాల్లో మనమే జెండా ఎగరేస్తాం...

 సాక్షి, కడప:  ‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు.. ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.. చిన్నారుల నుండి పండుటాకుల వరకు ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. రోజు రోజుకూ చంద్రబాబుపై అసంతృప్తి పెరిగిపోయి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది’అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలోని అతిథి గృహం వద్ద తెలంగాణ  రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు వైఎస్ జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ వాళ్లంతా ఒకే తాటిపై నిలబడినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో ఇదే కసితో పని చేయాలని, పార్టీ తరఫున తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ ఇదివరకటి కంటే ఇపుడు మరింత బలంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ భవిష్యత్‌లో అడ్రస్ లేకుండా పోతుందని చెప్పారు.

టీఆర్‌ఎస్ కూడా ఖమ్మంలో బలంగా లేదని, కేవలం నాలుగు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే గెలుచుకుందన్నారు. కాకపోతే టీఆర్‌ఎస్ ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను కొనుక్కోవడమో.. తెచ్చుకోవడమో చేస్తోందని ఆయన విమర్శించారు. ఖమ్మంలో ఎంత మంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఎంపీటీసీ సభ్యుడు మొదలు.. ఎంపీ వరకు అందరూ నిజాయితీగా వ్యవహరించడం అభినందనీయం అన్నారు. ఖమ్మంలోనే కాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ  అంతటా పాగా వేస్తామని వైఎస్ జగన్ వివరించారు.

 మనం పుంజుకుంటున్నాం...
 ‘ఒక్కటైతే మీకు చెప్పాలి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది.. చంద్రబాబు పరిపాలనపై ప్రజలల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.. ఒక పక్క టీడీపీ బలహీనపడుతోంటే.. మరో పక్క ైవైఎస్సార్ కాంగ్రెస్ బలం పుంజు కుంటోంది.. రానున్న కాలంలో అధికారంలోకి వచ్చేది మన పార్టీనే.. ఏపీలో అధికారంలోకి వచ్చాక.. అదే గాలితో తెలంగాణాలో కూడా పుంజుకుంటాం.. రెండు రాష్ట్రాల్లో జెండా ఎగరేస్తాం.. కష్టమైనా, నష్టమైనా వెనుకడుగు వేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాను.

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి లింగాల కమల్‌రాజును గెలిపించుకునేందుకు అందరూ కృషి చేయాలి’ అని జగన్ పిలుపునిచ్చారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులను వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఖమ్మం జిల్లా పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాబుగారి దుబారా రూ. 600 కోట్లు


బాబుగారి దుబారా రూ. 600 కోట్లు
♦ ప్రత్యేక విమానాలు తప్ప మామూలు విమానమెక్కని సీఎం
♦ జిల్లాల్లో పర్యటనలకు ఆర్భాటపు ఏర్పాట్లు
♦ విజయవాడలో సమీక్షల కోసం అధికారులకు అదనపు ఖర్చులు
♦ కార్యాలయాల సోకులకు అదనంగా ఖర్చులు
♦ అవసరం లేకపోయినా కన్సల్టెంట్లకు వందల కోట్లు
♦ అమరావతి శంకుస్థాపన కోసం వృథా వ్యయం

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత మరో నాలుగు రోజుల్లో రెండో కొత్త సంవత్సరం వస్తోంది. గడచిన ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన వృథా ఖర్చులను గమనిస్తే దిమ్మతిరగడం ఖాయం.  ఒక పక్క నిధుల్లేవంటూ మరో పక్క ప్రత్యేక విమానాలకు, కార్యాలయాల సోకులకు, ప్రచార ఆర్భాటాలకు ముఖ్యమంత్రి  దాదాపు రూ.600 కోట్ల రూపాయలు వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణానికి విరాళాలు అడుగుతూ మరో పక్క వృథాగా నిధులను వ్యయం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చేసిన వృథా ఖర్చులను రేఖామాత్రంగా పరిశీలిద్దాం..

 ప్రత్యేక విమానంలోనే ప్రయాణం
 ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడంలో చంద్రబాబు రికార్డు సృష్టించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతి పర్యటనకు ప్రత్యేక విమానాల్లో తిరిగిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లాలన్నా..లేదా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రావాలన్నా..లేదా ఢిల్లీ వెళ్లాలన్నా, సింగపూర్ వెళ్లి రావాలన్నా ప్రత్యేక విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆయన 63 సార్లు ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. అందుకోసం ఫిబ్రవరి వరకు ఆర్థికశాఖ రూ. 15 కోట్లను చెల్లించింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ వ్యయం మరో రూ. 15 కోట్లు అవుతుందని అధికారులు లెక్క కట్టారు.  కృష్ణపట్నం పోర్టుకు చెందిన వారి ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ముఖ్యమంత్రి వెంటే ఉంటాయి.  ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన వ్యయం కూడా తడిసిమోపెడవుతోంది. జిల్లాల పర్యటన ఏర్పాట్ల కోసం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా రూ. 15 కోట్లను ఇటీవల విడుదల చేసింది.

 సమీక్షలు.. అధికారుల పర్యటనలు
 వృథా సమీక్షలు నిర్వహించడంలో కూడా ముఖ్యమంత్రి రికార్డు సృష్టించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం అయినా లేదా ఇతర అధికారులతో సమావేశమైనా ఉదయం 10 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతలపై రాత్రి ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్షలంటే అధికార యంత్రాంగం భయపడే పరిస్థితి నెలకొంది. చెప్పిందే చెబుతూ సమీక్షల మధ్య ఎలాంటి పురోగతీ లేకుండా సమావేశాల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారనే అభిప్రాయానికి అధికార యంత్రాంగం వచ్చేసింది. హైదరాబాద్‌లో కాదని ఈ ఏడాది మంత్రివర్గ సమావేశాలతో పాటు, ఇక అధికారిక సమీక్షలన్నీ విజయవాడలో నిర్వహిస్తుండటంతో అధికారుల ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్-విజయవాడలకు అధికారులంతా నిత్యం విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం టీఏ, డీఏలకు రూ.90 కోట్లను వ్యయం చేసింది.

 కార్యాలయాల సోకులకు రూ.103 కోట్లా..?
 హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ.45 కోట్లను వెచ్చించారు. ఇంకో పక్క విజయవాడలోని ఇరిగేషన్ అతిధి గృహంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ సోకులు, ఏర్పాట్ల కోసం ఏకంగా రూ.42 కోట్లను వెచ్చించారు. కొత్త భవనం నిర్మించినా ఇంత ఖర్చుకాదు. అదనపు సోకుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయడంపై ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం లేక్‌వ్యూ అతిధి గృహానికి రూ.10 కోట్లను వ్యయం చేశారు. మదీనగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్‌లోని అద్దె ఇళ్లకు ఏర్పాట్లు చేయడానికి రూ. 5.87 కోట్లను వ్యయం చేశారు.

 కన్సల్టెంట్లకు రూ. 200 కోట్లు...
 ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులను విదేశాలకు చెందిన కన్సల్టెంట్లకు అప్పగించి కోట్ల రూపాయలు చెల్లించడంపైన కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  నూతన రాజధాని ప్రాంతంలో అవసరమైన డాక్యుమెంట్ల రూపకల్పన కోసం విదేశీ కన్సల్టెంట్లకు ఏకంగా రూ.150 కోట్లు వ్యయం చేస్తున్నారు. వీరుగాక ఏడు మిషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు కన్సల్టెన్సీలకు చెల్లించేందుకు 2015-16 బడ్జెట్‌లో ఏకంగా రూ.50 కోట్లు కేటాయించింది. కన్సల్టెంట్లు స్వయంగా చేసేదేమీ ఉండదని, తాము ఇచ్చిన సమాచారం ఆధారంగా అందంగా నివేదికలు తయారు చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు.  విజన్ 2029 డాక్యుమెంట్ తయారీ బాధ్యతను మెసర్స్ ఎర్నెస్ట్ యంగ్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ రూ. 12.62 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు రూ. 1.12 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా చెల్లించారు.

 మచ్చగా మిగిలిన పుష్కర ప్రచారం
 గోదావరి పుష్కరాల పేరుతో రూ.1,500 కోట్లకు పైగా వ్యయం చేశారు. ఇందులో ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా నిధులను పనులు చేయకుండానే పచ్చ నేతలు కాజేశారన్న విమర్శలున్నాయి.  పుష్కరాల ప్రచారం కోసమే ఏకంగా రూ. 15.20 కోట్లను ఖర్చు చేశారు. పుష్కరాలలో ముఖ్యమంత్రి ప్రచార కండూతి కారణంగా తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందారు.

 అమరావతి శంకుస్థాపనకు  రూ. 100 కోట్లు
 నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటాలతో నిర్వహించడంతో తాత్కాలిక ఏర్పాట్లకు రూ.100 కోట్లకు పైగా వ్యయం చేశారు. ప్రముఖుల కోసం ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేకంగా హెలిపాడ్‌లు నిర్మించిన విషయం తెలిసిందే.  నీరు-చెట్టు ప్రచారం కోసం ఏకంగా రూ. 5 కోట్లు కేటాయించారు. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ గ్రామాల పేరుతో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం ప్రచారం కోసం జిల్లాకు రూ.కోటి  చొప్పున రూ.13 కోట్లను వ్యయం చేసింది. సీఎం జిల్లాల్లో అంతర్గత పర్యటనల కోసం ప్రత్యేకించి రూ.5.50 కోట్ల తో అత్యాధునిక సౌకర్యాలు గల ప్రత్యేక బస్సును కొనుగోలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఖరీదైన బస్సుల కోసం దుబారా ఖర్చుచేస్తారా అని దేవరపల్లికి చెందిన పొగాకు రైతు సుబ్బారావు తన సూసైడ్ నోట్‌లో సీఎంను ప్రశ్నించిన సంగతి తెల్సిందే.

బాబు మోసం.. మాస్టర్‌ప్లాన్‌తో బట్టబయలు

Written By news on Friday, December 25, 2015 | 12/25/2015


'బాబు మోసం.. మాస్టర్‌ప్లాన్‌తో బట్టబయలు'
మంగళగిరి(గుంటూరు జిల్లా): రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలకు పాల్పడుతున్నాడనేది  మాస్టర్ ప్లాన్ ద్వారా మరోసారి బట్టబయలైందని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకున్న రైతులకు ఎలాంటి అన్యాయం జరగనీయబోమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. రైతులను ఆయా గ్రామాల నుంచి ఖాళీ చేయించేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం చేపట్టింది రాజధాని కోసమో లేక ప్రజల కోసమో కాదని తన కుమారుడు, తన అనుచరుల అక్రమ సంపాదన కోసమేనని ఆరోపించారు.
 
భూ సమీకరణకు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి హామీలు ఇచ్చారని, సమీకరణ పూర్తయ్యాక మంత్రులు నారాయణ, పుల్లారావుల జాడే లేకుండా పోయిందన్నారు. మాస్టర్ ప్లాన్‌కు ముందే ప్రకటించాల్సిన గ్రామకంఠాలను ఇప్పటివరకు ప్రకటించకుండా రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ఆయా గ్రామాలను రైతులు ఖాళీ చేయకపోతే పోలీసుల చేత భయపెట్టి, హింసించి అవసరమైతే పొలాలను తగులబెట్టినట్లు, ఇళ్లను తగులపెట్టి లాక్కునేందుకు చంద్రబాబు దిగజారినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. సింగపూర్ సంస్థలకు తలొగ్గి రైతులకు స్థలాలే కేటాయించలేని ప్రభుత్వం రేపు అదే విదేశీ సంస్థలకు తలొగ్గి గ్రామాలను తరలించరని నమ్మకమేముందని ఆర్కే ప్రశ్నించారు. విదేశీ సంస్థలతో ఆయా గ్రామాల చుట్టూ బహుళ అంతస్తుల మేడలు నిర్మింపజేసి గ్రామాల్లో సామాన్యుడు నివసించేందుకు వీలు లేకుండా చేసి వారి చేతే గ్రామాలను ఖాళీ చేయించే దారుణానికి ఒడిగడతారన్నారు. అన్ని గ్రామాల రైతులకు వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించడంతోపాటు గ్రామకంఠాలను పూర్తిగా నిర్ధారించిన తర్వాతే మాస్టర్ ప్లాన్ ప్రకటించాలని ఆయన డిమాండ్‌చేశారు.
 
ఇప్పుడు ప్రకటించిన తొమ్మిది గ్రామాల రైతులతోపాటు ప్రతి గ్రామంలో భూములిచ్చిన పేద రైతులకు ఆయా గ్రామాల్లోనే వాణిజ్య, నివాస స్థలాలు కేటాయించాలని, లేదంటే వారితో కలిసి వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. తొలి నుంచి తమ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిలో సమీకరించిన భూములను జోన్లుగా విభజించి రైతులకే కేటాయిస్తే వారే వ్యాపారం నిర్వహించుకుని లాభాలు పొందుతారని చెప్పినా.. పట్టించుకోని ముఖ్యమంత్రి తన కొడుకు కోసం, అనుచరుల కోసమే అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు తేటతెల్లమైందన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా బలపడుతాం


'తెలంగాణ వ్యాప్తంగా బలపడుతాం'
పులివెందుల: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ ఖమ్మం జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సమావేశమయ్యారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేతలు వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.

ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ సీపీని నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్నారని వైఎస్ జగన్ పార్టీ నేతలతో అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ఖమ్మం జిల్లా నేతలను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార టీడీపీ సభ్యుల తీరు దారుణమని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను ఏకపక్షంగా విడుదల చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ఊదరగొట్టారని, ఇప్పుడు ఇంటికో ఉద్యోగం తీసేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో మాజీ సైనికుల కోసం డిఫెన్స్ క్యాంటీన్ ను మంజూరు చేసినట్టు చెప్పారు. శనివారం ఒంగోలులో నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా?


ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా?
సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సవాలు
సాక్షి, హైదరాబాద్: ‘‘సాక్షాత్తూ సీఎం చంద్రబాబు తన కనుసైగలతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత రాజశేఖరరెడ్డిపై సభ్యసమాజం తలదించుకునేలా బూతులు తిట్టించి.. ఆనందిస్తారు. ఓపిక నశించి మేమేదైనా అంటే.. వాటిని భూతద్దంలో చూపెడుతూ మాపై విషప్రచారం చేస్తారు.  ఎన్నాళ్లీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు.. చంద్రబాబూ.. నీకు దమ్ము , ధైర్యం ఉంటే..

నీది సుపరిపాలనని నమ్మకముంటే.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా? మధ్యంతర ఎన్నికలకు వెళదామా? ప్రజలు ఎవరిని ఛీకొడతారో తెలుస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సవాలు విసిరారు. గురువారమిక్కడ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

మాల వేసుకుని కాషాయ వస్త్రాలు ధరించి దీక్షలో ఉన్న తనను కసాయివాడిలా వ్యవహరించారంటూ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు విమర్శించడంపై ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘కసాయి అనేది వృత్తి. ఆ వృత్తివాళ్లను అగౌరవపరిచేలా మాట్లాడటం మంచిదికాదు.. తక్షణమే వాళ్లకు క్షమాపణ చెప్పు’’ అని శ్రీనివాసుల్ని ఆయన డిమాండ్ చేశారు.
 
స్పీకర్ తీరు అనుమానాస్పదం..
అసెంబ్లీలో స్పీకర్ కోడెల వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని చెవిరెడ్డి అన్నారు. కోడెలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడమేగాక.. చంద్రబాబులా కాకుండా సంప్రదాయాల ప్రకారం స్పీకర్ కుర్చీపై కూర్చోబెట్టడానికి విపక్ష నేత వైఎస్ జగన్ వెళ్లారని గుర్తుచేశారు. కానీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదన్నారు. ‘‘అసెంబ్లీ రికార్డుల్లో లేనిమాటలు సోషల్ మీడియాకు ఎలా వచ్చాయి? అదీ ఒకపార్టీకి చెందినవారివే అనధికారికంగా సోషల్ మీడియాకు ఇచ్చిందెవరు? బాధ్యులెవరో తేల్చాలి? అని డిమాండ్ చేశారు.
 
సభాసంఘానికి సిద్ధమా?
రోజమ్మపై ఏడాది సస్పెన్షన్ విధించడం వివాదాస్పదం కావడంతో.. దారిమళ్లించేందుకు అనితమ్మను సభలో ఏడిపించిన చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టాలన్నారు. ‘‘అసెంబ్లీలో అనధికారికంగా, అధికారికంగా జరిగిన ప్రతిచర్చనూ, ప్రతిమాటనూ, ప్రతి దూషణనూ ప్రజలకు తెలపాలన్న చిత్తశుద్ధి ఉంటే.. రెండు పార్టీల సభ్యులు సమానంగా ఉండేలా సభాసంఘాన్ని ఏర్పాటు చేసి.. మొత్తం అసెంబ్లీ సమావేశాల ఫుటేజీని పాత్రికేయుల సమక్షంలో చూపించగలరా?’’ అని సవాలు విసిరారు.

బొండా బూతులు తిట్టినా పట్టించుకోలేదు..

Written By news on Thursday, December 24, 2015 | 12/24/2015


బొండా బూతులు తిట్టినా పట్టించుకోలేదు..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన వాస్తవ ఫుటేజ్ ను బయటపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే టీడీపీ సభ్యులు...వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర సభలోనే వినడానికి వీల్లేని భాషలో తిట్ల పురాణం లంకించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.  

'చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు దారుణం. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు జుగుప్సాకరంగా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేల ఫుటేజ్ ను కూడా విడుదల చేస్తే ప్రజలు ఛీ కొడతారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలంటే...ముందు చంద్రబాబుపైనే పెట్టాలి. చంద్రబాబు పోటీ పెట్టి మరీ వారి సభ్యుల చేత మమ్మల్ని తిట్టిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ్య సమాజం తలదించుకునేలా సభలో వ్యవహరిస్తున్నారు. మా అధ్యక్షుడిని మా ఎదుటే దారుణంగా తిడుతున్నారు. దానికి చర్యలు ఏవి.
 
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ...పచ్చి బూతులు తిడుతూ నీచంగా మాట్లాడినా అతడిపై కనీస చర్యలు తీసుకోలేదు. మేము మైక్ అడిగితే స్పీకర్ ఇవ్వరు, కానీ టీడీపీ ఎమ్మెల్యేలు తిడుతుంటే మాత్రం మైక్ కట్ చేయడం లేదు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న నమ్మకంతోనే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. స్పీకర్ అలా వ్యవహరించడం లేదు కాబట్టే అవిశ్వాసం పెట్టాం. టీడీపీ సభ్యులు మాట్లాడిన ఫుటేజ్ ను కూడా వెంటనే విడుదల చేయాలి' అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.

విశాఖ నడిబొడ్డున టీడీపీ కబ్జాకాండ!


విశాఖ నడిబొడ్డున టీడీపీ కబ్జాకాండ!
విశాఖపట్నం: ఈ పక్కనున్న ఫొటోను చూశారా!.. విశాఖ నగరం నడిబొడ్డున అత్యంత విలువైన దసపల్లా హిల్స్ ప్రాంతమిది. ఇక్కడ ఎకరా రూ.25 కోట్లపై మాటే. అంత విలువైన ప్రాంతంలో ఉన్న ఓ కొండను తొలిచేస్తూ చదును చేసేస్తున్నారు చూశారా!.. ఇలా చేస్తున్నది వేరెవరో కాదు.. సాక్షాత్తు అధికార పార్టీవారే.  టీడీపీ జిల్లా కార్యాలయం విస్తరణ కోసమని ఈ కొండను దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించలేదు.. నిర్మాణ పనులకు జీవీఎంసీ అనుమతి అసలే తీసుకోలేదు. అధికార పార్టీ అన్న ధీమాతో ఇప్పటికే రూ.25 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేసి.. ఇంకా ఆక్రమణను కొనసాగిస్తున్నారు. 
 
టీడీపీ కార్యాలయ విస్తరణ కోసం..
నగరంలోని దసపల్లా హిల్స్‌లో జిల్లా టీడీపీ కార్యాలయం ఉంది. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో సర్వే నంబర్ 1197లో 2వేల గజాలను టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. అందులో కార్యాలయాన్ని నిర్మించి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దాని వెనుక భాగంలో 1196, 1197 సర్వే నెంబర్లలో 5.50 ఎకరాల వివాదాస్పద స్థలం ఉంది. ఆ భూమి మీద హక్కుల కోసం ప్రైవేటు వ్యక్తులు, రెవెన్యూ శాఖ మధ్య ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదం ఉంది. ఆ భూమి తమ ఆధీనంలోనే ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాస్తు దోష నివారణ కోసమని ఈశాన్య దిశగా ఉన్న కొండను చదును చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. 
 
దర్జాగా కబ్జా
టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ కొండపై పడ్డారు. కొన్ని రోజులుగా కొండను తొలిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఎకరా వరకు చదును చేసేశారు.  ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఆక్రమించేసిన ఎకరా స్థలం మార్కెట్ విలువ దాదాపు రూ.25 కోట్లవరకు ఉంటుంది. రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న ఆ కొండను చదును చేస్తున్న విషయం కనీసం ఆ శాఖ అధికారులకు కూడా చెప్పలేదు. 
 
లోకేష్ కనుసన్నల్లోనే....
ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల బాధ్యతలను నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంటే విశాఖ నగరంలో టీడీపీ కార్యాలయం కోసం కొండ కబ్జా కూడా లోకేష్‌కు తెలిసే.. ఆయన సమ్మతితోనే జరుగుతోందని సమాచారం. మరి చినబాబే స్వయంగా రంగంలోకి దిగితే కొండలు ఓ లెక్కా అన్నట్లుగా సాగుతోంది ఈ కబ్జా బాగోతం.
 
 మా అనుమతి తీసుకోలేదు
 దసపల్లా హిల్స్‌లోని కొండ రెవెన్యూ శాఖ ఆధీనంలోనే ఉంది. దాన్ని చదును చేసేందుకు ఎవరూ మా అనుమతి కోరలేదు.
 - కేవీఎస్ రవి, అర్బన్ ఎమ్మార్వో  
 
 జీవీఎంసీ అనుమతులు లేవు
దసపల్లా హిల్స్‌లో కొండను చదును చేసి నిర్మాణాలకు అనుమతుల కోసం ఎవ రూ దరఖాస్తు చేయలేదు. మా అధికారులను గురువారం అక్కడికి పంపించి తనిఖీ చేయిస్తాం. పనులు చేస్తున్నవారి వద్ద సరైన పత్రా లు ఉన్నాయో.. లేదో కూడా పరిశీలిస్తాం. 
 - వెంకటరత్నం, చీఫ్ సిటీ ప్లానర్, జీవీఎంసీ

దోపిడీకి అంతే లేదు


ఇసుక మాఫియాలో సీఎం తనయుడు
రోజుకు రూ. కోటి ఆర్జిస్తున్న తండ్రీ కొడుకులు: జగన్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు తనయుడి కనుసన్నల్లో ఇసుక మాఫియా పెట్రేగిపోతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ‘చంద్రబాబు అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో క్యూబిక్ మీటరు ఇసుక రూ.40కే దొరికేది. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.550 నుంచి రూ.700లు పలుకుతోంది. సగటున క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.600 పలుకుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 15 నెలల్లో రూ.810 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ.. గతంలో ఇసుక ధర క్యూబిక్ మీటరు రూ.40లు పలికినపుడే ప్రభుత్వానికి రూ.120 కోట్ల ఆదాయం లభించేది.

ఇసుక ధర 14 నుంచి 15 శాతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.1600 కోట్ల ఆదాయం లభించాలి. కానీ.. 15 నెలల్లో రూ.810 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇసుకను దారిమళ్లించి.. ఏడాదికి రూ.800 కోట్లకుపైగా ఇసుక మాఫియా ముసుగులో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దోచుకుంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేల నేతృత్వంలోని ఇసుక మాఫియా నుంచి ప్రతి రోజూ సీఎం తనయుడికి రూ.కోటి మేర ముడుపులు అందుతున్నాయి. అందుకే ఇసుక మాఫియాకు సీఎం చంద్రబాబునాయుడు అండదండగా నిలుస్తున్నారు.

 జెన్‌కోలో రూ.2,600 కోట్లు దోపిడీ
 రాష్ట్రంలో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం(వీటీపీఎస్) వద్ద 1600 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన రెండు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల టెండర్లలో కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా రూ.2,600 కోట్లను దోచిపెట్టి సీఎం చంద్రబాబునాయుడు కమీషన్లు దండుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను ప్రారంభించారు. ఈ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను మెగావాట్‌కు రూ.4.4 కోట్ల చొప్పున టెండర్ ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. గుజరాత్‌లో 800 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను మెగావాట్‌కు రూ.4.42 కోట్ల చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు.

కానీ.. సీఎం చంద్రబాబునాయుడు మాత్రం కృష్ణపట్నం వద్ద చేపట్టిన 800 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను మెగావాట్‌కు రూ.5.85 కోట్ల చొప్పున, వీటీపీఎస్ వద్ద 800 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను మెగావాట్ రూ.6.3 కోట్ల చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఎక్కడ రూ.4.4 కోట్లు.. ఎక్కడ రూ.5.85 కోట్లు.. రూ.6.3 కోట్లు. 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాల పనులను అధికధరలకు కట్టబెట్టి కాంట్రాక్టర్లతో కలిసి రూ.2,600 కోట్లను దోచుకున్నారు.

 దోపిడీకి అంతే లేదు
 సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో దోపిడీకి అంతే లేదు. పట్టిసీమ, జీవో 22, గాలేరు నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల పనుల్లో ప్రజాధనాన్ని లూఠీ చేశారు. 30 శాతం కమిషన్‌లు తీసుకుని పారిశ్రామిక రాయితీలు ఇచ్చేశారు. రాజధాని చుట్టూ చంద్రబాబు, బినామీలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. చంద్రబాబు బినామీల భూములు మాత్రం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రావు. సాధారణ రైతుల భూములు మాత్రం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి వస్తాయి. చంద్రబాబు బినామీలు ప్లాట్లు వేసి.. ఎకరానికి మూడు వేల గజాలను అమ్ముకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు మాత్రం 1200 గజాల భూమి మాత్రమే ఇస్తున్నారు. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, సెక్స్ రాకెట్.. రాష్ట్రంలో జరగనిదేమీలేదు.. దేశంలో అత్యంత దారుణమైన పాలన రాష్ట్రంలోనే సాగుతోంది.

మరింతమంది ఎమ్మెల్యేల్ని భయపెట్టేలా


ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినా ఏకపక్షమే
స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

 సాక్షి, హైదరాబాద్: శాసన సభాపతిగా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికవడానికి తమ పార్టీ, తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ సహకారం అందజేసినప్పటికీ ఆయన తొలి సమావేశం నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. ఆయన తీరు మారుతుందని ఆశించినప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదని, అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు వివరించింది.

వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జోత్యుల నెహ్రూ, ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, కలమట వెంకటరమణ, గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు, వరుపుల సుబ్బారావు, వంతుల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, డేవిడ్‌రాజు, కొరుముట్ల శ్రీనివాసులు, శివప్రసాద్‌రెడ్డి, విశే ్వశ్వరరెడ్డిలతో కూడిన బృందం బుధవారం ఇన్‌చార్జి శాసనసభా కార్యదర్శి సత్యనారాయణను కలసి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 179 క్లాజ్ సీ ప్రకారం రాష్ట్ర శాసనసభ స్పీకర్‌పై ఏపీ శాసనసభ ప్రొసీజర్ అండ్ కండక్టు ఆఫ్ బిజినెస్ రూల్ బుక్‌లో 71(1)ను అనుసరించి నోటీసును అందజేస్తున్నట్టు తెలిపారు. ‘శాసనసభ స్పీకర్‌పై మేం విశ్వాసం కోల్పోయాం’ అని అందులో పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలసి సుజయ్‌కృష్ణ రంగారావు విలేకరులతో మాట్లాడుతూ ఏఏ కారణాలవల్ల స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసివ్వాల్సి వచ్చిందో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటలలోనే...

 ఆది నుంచీ ఏకపక్షమే..: ఈరోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసివ్వడం జరిగింది. సభాపతి అంటే పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి అన్న మంచి ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి.. కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికవడానికి సంపూర్ణ సహకారమందించారు. అయితే కోడెల ఆ విషయాన్ని గుర్తుంచుకోకుండా.. తొలి సమావేశంనుంచీ ఏకపక్షంగా వ్యవహరించారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేత జగన్‌పై అనేక అవాస్తవాల్ని గంటల తరబడి మాట్లాడినప్పటికీ.. సభాపతిగా ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలగించడంగానీ, అలా మాట్లాడే సభ్యుల్ని, మంత్రుల్ని ఆపడంగానీ చేయని పరిస్థితి.

 వైఖరి మార్చుకుంటారనుకుంటే: గత సమావేశాల్లోనూ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో వైఎస్సార్‌సీపీ తరఫున నోటీసిచ్చాం.  సభాపతిపైన అవిశ్వాసం పెట్టడమన్నది తప్పనిసరి పరిస్థితుల్లోనే పెట్టాలి.. ఇప్పటికైనా ఆయన మనస్సు మార్చుకుని వ్యవహారశైలిని మార్చుకుని మిగిలిన నాలుగేళ్లు సక్రమంగా సభను నిర్వహిస్తారన్న ఆశతో ఆరోజు వెనక్కి తీసుకున్నాం. అయితే ఏమాత్రం మార్పురాకపోగా.. మరింత పక్షపాతం వహిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం తప్పనిసరై అవిశ్వాస తీర్మానం నోటీసివ్వడం జరిగింది.

 అన్యాయంగా సస్పెండ్ చేశారు: కాల్‌మనీ అంశంపై జరిగే చర్చలో పార్టీ తరఫున మొదటగా మాట్లాడడానికి రోజాను ఎంపిక చేసుకున్నాం. కానీ ఆమె మాట్లాడానికి అవకాశమివ్వకపోగా ఎదురుదాడి చేస్తూ.. ఏడాదిపాటు అన్యాయంగా సస్పెండ్ చేశారు. 340 సబ్‌రూల్ 2 ప్రకారం శాసనసభా వ్యవహారాలమంత్రి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్‌గారు కలగజేసుకుని ఆ రూల్ ప్రకారం ఏడాదిపాటు సస్పెన్షన్‌కు అవకాశం లేదని చెబుతారని ఆశించాం. కానీ స్పీకర్ డివిజన్‌కు ఓటింగ్‌పెట్టి ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. శాసనసభా వ్యవహారాలమంత్రి కోట్ చేసిన రూల్‌నే స్పీకర్ కోట్ చేశారు.

 మరింతమంది ఎమ్మెల్యేల్ని భయపెట్టేలా
 మా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిందిగాక ఇంకా కొందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని భయభ్రాంతుల్ని చేయాలన్న ఆలోచనతో అధికారపక్షం ప్రత్యక్ష ప్రసారంకాని కొన్ని వీడియోల్ని సోషల్ మీడియాకు లీకుచేసింది. రోజాను అప్రతిష్టపాలు చేయడానికి జరిగిన ప్రయత్నం సభాపతి వైఫల్యంగానే మాపార్టీ భావిస్తోంది. ఎందుకంటే సభావ్యవహారాల ప్రత్యక్షప్రసారాలన్నీ సభ ఆస్తి. అంటే సభాపతిగారి అనుమతి లేకుండా అవి బయటకెళ్లే అవకాశముండదు. అయినప్పటికీ కొన్ని వీడియోలు సోషల్‌మీడియాకు చేరాయి. కనీసం ఆరోజు సభలో జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్ సోషల్‌మీడియాకు చేరినా బాగుండు.

అలాగాక ఎడిట్ చేసి, మా సభ్యులు, సభ్యురాలికి సంబంధించినవే లీకయ్యాయి. సభలో మా ఎమ్మెల్యేలు నిరసన తెలిపేటప్పుడు వారిమాటలు రికార్డు చేయడానికి ప్రత్యేక మైకులు ఏర్పాటుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతకుముందెప్పుడూ ఈ సంప్రదాయం లేదు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా తీసుకోబోతోంది. వీడియోలు ఏవిధంగా లీక్ అయ్యాయో.. అసెంబ్లీ ఆస్తిగా ఉండాల్సినవి ఏవిధంగా సోషల్ మీడియాకు వచ్చాయో సమాధానం చెప్పాల్సిన అవసరముంది. సభ ఆస్తిని కాపాడలేని పరిస్థితులు సభాపతిగారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం.

వైఎస్సార్ జిల్లాలో నేటి నుంచి వైఎస్ జగన్ పర్యటన


వైఎస్సార్ జిల్లాలో నేటి నుంచి వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి నాలుగు రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నట్లు కడప ఎంపీ వై.ఎస్ అవినాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 7.30 గంటలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఓపెన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని అవినాష్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 25, 26, 27 తేదీల్లో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వివరించారు.

నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పొట్టకొట్టి


నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పొట్టకొట్టి
14 వేల మంది అంగన్‌వాడీల ఉద్యోగాలకు ముప్పు

♦ ‘చలో విజయవాడ’ ఆందోళనలో పాల్గొన్న వారి తొలగింపునకు ఉత్తర్వులు
♦ సీడీల ఆధారంగా గుర్తించాలని సీడీపీవోలకు ఆదేశాలు
♦ జాబితాలో వారి ఉద్యోగాలు తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు
♦ బాబు నియంతృత్వ పోకడపై రగులుతున్న అంగన్‌వాడీలు
♦ నేడు రాష్ట్రవ్యాప్తంగా మెమో కాపీల దహనం

 సాక్షి, హైదరాబాద్/ విజయవాడ: సీఎం చంద్రబాబు రాక్షస పాలనకు, దమనకాండకు ఇదో తార్కాణం! సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన అంగన్‌వాడీల గొంతు నొక్కే దుస్సాహసానికి సీఎం ఒడిగట్టారు. ఉద్యమించిన అంగన్‌వాడీలను గుర్తిం చి విధులనుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వేతనాలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల(జీవో)ను తక్షణమే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 18న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని అంగన్‌వాడీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లందరినీ చిత్రీకరించిన సీడీలు పంపుతున్నామనీ, జిల్లాల వారీగా వారిని గుర్తించి తక్షణమే తొలగించాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి ఈ నెల 21న రాష్ట్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్లు, సీడీపీవోలు, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు మెమో నంబర్ 5557/కె3/2015 జారీ చేశారు. సుమారు 14 వేల మందిని తొలగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు మండిపడుతున్నారు. చంద్రబాబు మోసపూరిత చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా మెమో కాపీల దహనం నిర్వహించాలని నిర్ణయించారు.

 ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ట
 ఉమ్మడి రాష్ట్రంలో కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు.. వేతనాలు పెంచాలంటూ అసెం బ్లీ ముట్టడికి తరలివచ్చిన అంగన్‌వాడీలపై బాబు పోలీసులను ఉసిగొల్పారు. ఇందిరాపార్క్ వద్ద గుర్రాలతో తొక్కించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఉద్యమించిన వారిపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించారు. బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి అనే ముగ్గురు అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో ప్రజా ఉద్యమాలను అణగదొక్కడానికి చంద్రబాబు పూనుకున్నారు. అంగన్‌వాడీలపై మరోసారి నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యం చేశారు. విజయవాడలో ఆందోళనకు దిగినవారిని ఇష్టమొచ్చినట్టు ఈడ్చి పారేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించినవారిని కొట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కనీసం స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వలేదు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగాలే పీకిపారేసేందుకు తెగబడ్డారు.

 ఎన్నికల  ముందు హామీ ఇచ్చి..
 రాష్ట్రంలో 20 వేల మందికిై పెగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఉన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు వేతనాలు పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అటకెక్కించారు. ఈ తీరును నిరసిస్తూ అంగన్‌వాడీలు ఉద్యమించడంతో వేతనాల పెంపునకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. అంగన్ వాడీ కార్యకర్తలకు రూ.7,100, అంగన్‌వాడీ సహాయకులకు రూ.4,600 చొప్పున వేతనాలు ఇవ్వాలని ఆగస్టు చివరి వారంలో మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది. ఆ మేరకు పెంచిన వేతనాలు సెప్టెంబరు 1 నుంచి అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నాలుగు నెలలు గడిచినా వేతనాలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో అంగన్‌వాడీలు మరోసారి సమరభేరి మోగించారు. ఈనెల 18న ‘చలో విజయవాడ’ చేపట్టారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ, వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. వేలాదిమంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం, బందరు రోడ్డు, మనోరమ సెంటర్ వద్ద బైఠాయించారు. తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన అంగన్‌వాడీలపై మగ పోలీసులు విరుచుకుపడ్డారు. చీరలు లాగి.. జుట్టుపట్టి.. ఈడ్చి పారేశారు.

పోలీసులు లాఠీలు ఝుళిపించి.. పిడిగుద్దులు కురిపించడంతో 60 మందికిపైగా మహిళలకు గాయాలయ్యాయి. కనీసం గాయపడ్డ అంగన్‌వాడీలను ప్రభుత్వం ఆసుపత్రిలో కూడా చేర్చలేదు. అంత దారుణంగా అంగన్‌వాడీలపై పోలీసులను ఉసిగొలిపి చావబాదించిన సీఎం.. సాయంత్రానికి అంగన్‌వాడీల వేతనాలను పెంచుతున్నట్లు శాసనసభలో ప్రకటించారు. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలను తుంగలో తొక్కి అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.7 వేలు, సహాయకులకు రూ.4,500 చొప్పున వేతనం ఇస్తామని చెప్పారు. అయితే ఆ ప్రతిపాదన చేసిన మూడో రోజే ఉద్యమంలో పాల్గొన్న అంగన్‌వాడీలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 చంద్రబాబు మోసం మరోసారి బయటపడింది
 చలో విజయవాడ ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగించాలని మెమో జారీ చేయడం ద్వారా చంద్రబాబు మోసం మరోసారి బయట పడింది. మెమోను రద్దుచేసి వేతనాల పెంపు జీఓ జారీ చేసేవరకు రాజీలేని పోరాటం చేస్తాం. గురువారం రాష్ట్రవ్యాప్తంగా మెమో కాపీలను దహనం చేసి  నిరసనను తెలియజేస్తాం.
 - కె.సుబ్బరావమ్మ,అంగన్‌వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అంగన్ వాడీల తొలగింపు అమానుషం

Written By news on Wednesday, December 23, 2015 | 12/23/2015


'అంగన్ వాడీల తొలగింపు అమానుషం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీల తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే ఆర్ కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ...  సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారనే అక్కసుతో ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. వీడియో సీడీలు, ఫొటోల ఆధారంగా ఉద్యోగులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించడం అత్యంత అమానుషమైన చర్య అని ఆమె అభివర్ణించారు. అంగన్ వాడీలపై ప్రతీకారం తీర్చుకోవడం బాధాకరమని.. అత్తెసరు జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న నిరుపేద అంగన్ వాడీలను ఉద్యోగుల నుంచి తొలగించడం దుర్మార్గమని రోజా చెప్పారు.

తహశీల్దార్ వనజాక్షి విషయంలో చంద్రబాబు కుటిలనీతిని ప్రదర్మించారని, రిషితేశ్వరి మరణానికి బాధ్యుడైన ప్రిన్సిపల్ ను చంద్రబాబు కాపాడరని రోజా ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాజాగా జీతాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించడంతో మహిళలంటే చంద్రబాబుకు ఎంత లోకువో  అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. ఉద్యోగాల తొలగింపు ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంగన్ వాడీల తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని రోజా హెచ్చరించారు.

చిలకలూరిపేట చేరుకున్న వైఎస్ జగన్


చిలకలూరిపేట చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వెళ్లారు. బుధవారం హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరిన వైఎస్ జగన్.. విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేటకు వెళ్లారు.

వైఎస్ జగన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. చిలకలూరిపేటలో జరిగిన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, హరికృష్ణ కలిశారు.

రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్నా...


రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్నా...
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు కేవలం 5 రోజుల పాటు జరిపి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మెహన్ రెడ్డి  విమర్శించారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు కనీసం 15 రోజులు సమావేశాలు జరపాలన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై ప్రధానంగా తాము పట్టుబట్టామని తెలిపారు. అన్యాయంగా తమ ఎమ్మెల్యే ఆర్ కే రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


'మేం ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం అసెంబ్లీలో జరిగిన తీరు, ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిన తర్వాత ప్రతిపక్షం సభలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఆ రెండురోజులు సభను ఎలా నడిపారన్నదాన్ని గమనిస్తే...ప్రధానంగా పట్టుబట్టింది కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశం. విజయవాడలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో సాక్షాత్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసులు భాగస్వామ్యులై వడ్డీలు కట్టకపోతే వ్యభిచారం చేయమని, గట్టిగా ఆడవాళ్ల, పేదవాళ్ల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడారు. దాదాపు వందల వీడియో టేపులు పట్టుబడ్డాయి.

అన్ని టీవీ చానల్స్, పేపర్లు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై రకరకల కథనాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ప్రారంభం కావడం కూడా ఎంత అన్యాయం అంటే... అక్కడ పార్లమెంట్ 30 రోజులు జరుపుతున్నారు. ఇక్కడ చూస్తే అసెంబ్లీ జరిపేది కేవలం అయిదే అయిదు రోజులు. అది కూడా ఉదయం 9 గంటలకు అట...మధ్యాహ్నం 2 గంటలకే ఆపేసేయాలట. చేతులు దులుపుకునేందుకు చూస్తుంటే ...అయిదు రోజులు జరపడం ఏంటని బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులు చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలుకు విలువ ఉందా అనిపిస్తోంది' వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
 
వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే....

* అసెంబ్లీలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై చర్చకు పట్టుబట్టాం
* ఏ ప్రజా సమస్య చర్చకు రాకుండా అసెంబ్లీ సాగింది
* కీచకుల సామ్రాజ్యంగా కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశం
* చంద్రబాబు ఆశీస్సులతో కాల్ మనీ ఆగడాలు
* ఈ కేసును సాదాసీదా చూపి, తీవ్రతను నీరుగార్చేందుకు కుట్ర

* అంబేడ్కర్ అంశం అజెండాలో లేదు
* అంబేడ్కర్ ను రాజకీయాల కోసం వాడుకున్నారు
* చంద్రబాబు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే రోజాను రూల్ 340 ప్రకారం సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ చెప్పారు
* కేవలం రోజాను మాత్రమే టార్గెట్ చేసి సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు వేశారు
* నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారు
* చర్చను దారి మళ్లించేందుకే రోజాపై సస్పెన్షన్
* ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదు

* ఆధారాలు లేవని చంద్రబాబు అన్నారు
* నిందితులతో ఉన్న ఫోటోలు ఆధారాలు కావా?
*  ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ సోదరుడికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు?
* చంద్రబాబు సభలో స్టేట్ మెంట్ ఇచ్చారు, చర్చిద్దామని మొత్తకున్నా మాది సభలో అరణ్య రోదనే
* కామ (కా అంటే కాల్, మ అంటే మనీ) సీఎం అని అందరూ అన్నారు. అయితే కేవలం రోజాను మాత్రమే సస్పెండ్ చేశారు

* ఇక చర్చ లేకుండానే సభలో బిల్లు పెట్టడం... ఆమోదించడం
* బిల్లులపై చర్చలు జరిగితే ప్రజా ఆమోదం తెలుస్తుంది
* ప్రతిపక్షం లేకుండానే 8 బిల్లులను ఆమోదించేశారు
* ప్రయివేట్ వర్సిటీల బిల్లును కూడా ఆమోదించారు
* ప్రయివేట్ వర్సిటీలు వస్తే ఫీజులు పెరుగుతాయి
* ఇష్టమొచ్చినట్లు బిల్లులు ఆమోదించారు

* రోజా సస్పెండ్ అయినా, వైఎస్ఆర్ సీపీ సభనుంచి బాయ్ కాట్ చేసినా, మా మీదే ఆరోపణలు
* సస్పెండ్ అయిన మూడో రోజుల తర్వాత కూడా రోజాపై విమర్శలు
* ప్రజలు సభను చూస్తున్నారనే ధ్యాస లేకుండా తిట్ల పురాణం
* టైమ్ పాస్ కోసం సభను నడిపారు
* చివరి రోజు రోజమ్మ ఎందుకు గుర్తొచ్చింది
* నిజంగా అసెంబ్లీ సమావేశాలు దారుణంగా జరిగాయి

* జీవో 97ను చంద్రబాబు ఎందుకు రద్దు చేయలేదు
* ఈ ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పగలరా?
* జీవో 97 ను రద్దు చేయకుండా బాక్సైట్ సరఫరా జీవోను రద్దు చేయడంలో ఆంతర్యం ఏమిటో?
*  2011లో గవర్నర్ కు ఇదే విషయంపై చంద్రబాబు లేఖ రాయలేదా?
* మరి ఇప్పుడు అదే జీవోను ఎందుకు రద్దు చేయడం లేదు
* గిరిజన చట్టాలను మార్చడానికి చంద్రబాబు ఏకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు

10.30కు శాసనసభ కార్యదర్శికి అవిశాస తీర్మానం


స్పీకర్ పై అవిశ్వాసం
స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానానికి విపక్ష వైఎస్సార్ సీపీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అధికారపక్షానికి పూర్తి అనుకూలంగా, పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేతకు కనీసం మైక్ కూడా ఇవ్వనందుకు నిరసనగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించాలని  వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ  నిర్ణయించింది. బుధవారం ఉదయం 10.30కు శాసనసభ కార్యదర్శికి అవిశాస తీర్మానం నోటీసును ఇవ్వనున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిపక్షనేత, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆపార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది.

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో ఏకగీవ్రంగా తీర్మానించారు. సమావేశం ముగిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహరిస్తున్న తీరు శోచనీయంగా ఉందని, ఆయనపై గతంలోనూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని గుర్తు చేశారు. వ్యవహారశైలి మార్చుకుంటారని భావించి.. కొందరు పెద్దల సూచనతో అప్పట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకున్నామని వివరించారు.

కానీ.. స్పీకర్ తీరులో ఏమాత్రం మార్పు కన్పించడం లేదన్నారు. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకుని, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా చేసి, వాటిని ప్రభుత్వం పరిష్కరించేలా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికారపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
 కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసును

పక్కదోవ పట్టించేందుకే...
వేలాది మంది మహిళల ధన, మాన, ప్రాణాలను హరిస్తూ కాల్‌మనీ-సెక్స్ రాకెట్ సాగిస్తోన్న అరాచకాలు.. అఘాయిత్యాలను సభదృష్టికి తీసుకురావడానికి విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తే.. స్పీకర్ అడుగడుగునా అడ్డుతగిలారన్నారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అరాచకాలకు బలైన మహిళల తరఫున ఎమ్మెల్యే రోజా మాట్లాతారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారన్నారు. రోజా వాగ్ధాటికి జడిసి, తమ బండారం బట్టబయలవుతుందని ఆందోళన చెంది పాలకపక్షం ఎలాంటి ఎత్తులు వేసిందో, విచక్షణ కోల్పోయి ఎలా వ్యవహరించిందో ప్రజలు చూశారన్నారు.

నిబంధనలు చదువుకోండి.. నేర్చుకోండి అని తరచూ చెప్పే శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్ 340(2)ను ఉటంకిస్తూ రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌కు ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించా రు. సెక్షన్ 340(2)ను కోట్ చేస్తూ రోజాపై స్పీకర్ ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారని, అయితే స్పీకర్ ఆ సెషన్ ముగిసే వరకూ మాత్రమే ఒక సభ్యుడిని సస్పెండ్ చేయవచ్చని సెక్షన్ 340(2) స్పష్టంగా చెబుతోందన్నారు.

కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసు చర్చకు రాకుండా పక్కదోవ పట్టించేందుకే నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్ రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. ఇదే సమావేశాల్లో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదిస్తే.. స్పీకర్ రెండు రోజులపాటు సస్పెండ్ చేయడంలో ఆంతర్యమేమిటని జ్యోతుల నిలదీశారు. సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసి మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకోవడానికే స్పీకర్ టీడీపీకీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

గత అసెంబ్లీ సమావేశాల్లోనూ విపక్ష నేత 40 నిముషాల ప్రసంగానికి స్పీకర్ 17 సార్లు అవాంతరాలు కల్పించారని గుర్తు చేశారు. అధికారపక్ష సభ్యులు కోర్టులో ఉన్న అంశాలను ఉటంకిస్తూ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నా స్పీకర్ కనీసం నివారించే యత్నం కూడా చేయలేదని ఆయన అన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తన రాజకీయజీవితంలో ఇలాంటి స్పీకర్‌ను ఎన్నడూ చూడ లేదన్నారు.

విధిలేకే అవిశ్వాసం నోటీసు
‘స్పీకర్ తీరు మార్చుకుంటారని గతంలో అవిశ్వాస తీర్మానం ఇచ్చి హెచ్చరిక చేశాం. కానీ.. స్పీకర్ శైలిలో ఏమాత్రం మార్పు కన్పించడం లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాభ్యుదయం కోసం విధిలేని పరిస్థితుల్లోనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయించాం. బుధవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ కార్యదర్శికి నోటీసు అందిస్తాం’ అని వివరించారు.

రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటుకు, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా.. అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజా సంక్షేమాన్ని కాలరాస్తున్న స్పీకర్ తీరును నిరసిస్తూనే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని స్పష్టీకరించారు. శాసనసభలో బలానికి.. అవిశ్వాస తీర్మానం నెగ్గడం, వీగిపోవడానికి సంబంధం లేదన్నారు. స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు తెలియజేయడానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలని కోరుకునే వారు.. ప్రజాభ్యుదయాన్ని కాంక్షించే వారు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు

There are no comments posted yet. Be the first one!

Post a new comment

Comments by
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

EPaper

Advertisement
Advertisement

Popular Posts

Topics :