26 June 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సాంకేతిక కారణాలు సాకు చూపడం సరికాదు: బుగ్గన

Written By news on Saturday, July 2, 2016 | 7/02/2016


సాంకేతిక కారణాలు సాకు చూపడం సరికాదు: బుగ్గన
హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన పిటిషన్ ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించటం సరికాదని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ పిటిషనర్ తో సంబంధం లేకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ గుర్తుతో గెలిచిన వాళ్లు వేరే పార్టీలోకి  ఏవిధంగా వెళ్లిపోయారో ఆధారాలు సమర్పించినా, సాంకేతిక కారణాలు సాకుగా చూపడం సరికాదన్నారు.  పిటిషన్ తీవ్రతను స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదని బుగ్గన వ్యాఖ్యానించారు. పిటిషన్ పై నెలలు తరబడి కాలయాపన చేశారని అన్నారు. స్పీకర్ దగ్గర ఇంకా కొన్ని పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యేల అనర్హత కేసులను గతంలో సుప్రీంకోర్టు విచారణ జరిపిందని, హొలో హొలో కేసు, బాలచందర్ జార్క్, మహాచంద్ర ప్రసాద్ కేసుల్లో నాడు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్పీకర్ కు పాక్షిక న్యాయాధికారాలు మాత్రమే ఉంటాయని, ఆ కేసుల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం తెలిపిందన్నారు. (పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కి ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.)
ఆ పిటిషన్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందనే భయపడే ఏవో కారణలు చెబుతూ హడావిడిగా స్పీకర్ ఇవాళ పిటిషన్ తిరస్కరించారన్నారు. ఫార్మాట్ తప్పుగా ఉంటే నిర్ణయంపై ఇన్నిరోజుల జాప్యం దేనికని ఆయన సూటిగా ప్రశ్నించారు. స్పీకర్ ఏదైతే ఫార్మాట్ కావాలంటున్నారో అది కూడా సమర్పిస్తామని బుగ్గన తెలిపారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ  వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన పిటిషన్లను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించిన విషయం తెలిసిందే.

రాజారెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులు


నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బల రాజారెడ్డి (55) భౌతికకాయానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సన్నిహితుడు రాజారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ శనివారం సూళ్లురుపేటకు వెళ్లారు. రాజారెడ్డి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు రాజారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడుగా ఉన్న దబ్బల రాజారెడ్డి (55) శుక్రవారం అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
 

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?


ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
 ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. అది సరైంది కాదని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి హితవు పలికారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైద్యం కోసం పేదలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న వైఎస్సార్ 2007లో మూడు జిల్లాల్లో ఆరోగ్యశ్రీని ప్రారంభించి తొమ్మిది నెలలు తిరగక ముందే మిగతా 20 జిల్లాలకు వర్తింపజేశారన్నారు. 500 రోగాలను అందులో చేర్చడంతో పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందారన్నారు.

వైఎస్సార్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చే శారన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీని మూసివేయడానికి కంక ణం కట్టుకున్నట్లు కన్పిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 450 కోట్లు బకాయి చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. తక్షణమే బకాయిలు చెల్లించి... ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ముఖ్యమంత్రులు స్పందించాలి...
హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలని, తమకు న్యాయం కావాలని తెలంగాణ న్యాయాధికారులు చేస్తున్న డిమాండ్ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇద్దరు సీఎంలు, గవర్నర్, చీఫ్ జస్టిస్ కూర్చొని తక్షణమే చట్టపరంగా దీనికి పరిష్కార మార్గం వెతకాలన్నారు.

వైఎస్సార్‌సీపీ తెలంగాణలో పలు నియామకాలు


వైఎస్సార్‌సీపీ తెలంగాణలో పలు నియామకాలు
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీకి సంబంధించి వివిధ అనుబంధ విభాగాల్లో పలువురిని నియమించారు. రాష్ట్రపార్టీ కార్యదర్శిగా కోడి మల్లయ్య యాదవ్ (హుజుర్‌నగర్), రాష్ర్ట కార్యవర్గసభ్యులుగా కర్ల సుందరబాబు (నల్లగొండ), లింగం సత్యనారాయణరెడ్డి (మేళ్లచెర్వు) నియమితుల య్యారు. రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా కస్తాల ముత్తయ్య (హుజుర్‌నగర్),  రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా రహీమ్ షరీఫ్ (నారాయణపురం), బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కర్నె వెంకటేశ్వర్లు (హుజుర్‌నగర్), రాష్ట్ర యూత్ కార్యదర్శిగా మంద వెంకటేశ్వర్లు (హుజుర్‌నగర్)లను నియమించారు.

నల్లగొండ జిల్లా పార్టీ అధికార ప్రతి నిధిగా సుతారి శ్రీను (హుజుర్‌నగర్), ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బాలెంల మధు (మోత్కురు), మైనారిటీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎండీ ఫయాజ్ (నల్లగొండ), బీసీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ముషం రామానుజం (నకిరేకల్) నియమితులయ్యారు.
 
రాష్ర్ట మహిళా కమిటీలో నియామకాలు..: రాష్ర్టపార్టీ మహిళా కమిటీలో పలు నియామకాలు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా జూలి బెన్నాల (శేరిలింగంపల్లి), క్రిస్టోలైట్ (అంబర్‌పేట), గాదె రమారెడ్డి (ఎల్‌బీనగర్), ఎం.పుష్పలత (చేవెళ్ల), వనజ (కూకట్‌పల్లి), మేరి (జూబ్లీహిల్స్), యర్రంరెడ్డి ఇందిరారెడ్డి (శేరిలింగంపల్లి), కార్యదర్శులుగా సూర్యకుమారి (ఎల్‌బీనగర్), జ్యోతి రెడ్డి (జూబ్లీహిల్స్), నేహా (మహేశ్వరం), అల్ఫరాన్‌సమ్మ (ఇబ్రహీంపట్నం), విష్ణుప్రియ (శేరిలింగంపల్లి), బొక్కనపల్లి రాజమ్మ (కరీంనగర్), సంయుక్త కార్యదర్శులుగా రాగ సంధ్య(కూకట్‌పల్లి), పద్మ (జూబ్లీహిల్స్), లక్ష్మీదేవి (మహేశ్వరం), గడ్డం జలజ (కరీంనగర్), వి.రాణిరెడ్డి (రంగారెడ్డి)లను నియమించారు.

ఇదిలా ఉండగా మహిళా కమిటీలో భాగంగా జీహెచ్‌ఎంసీ అధ్యక్షురాలిగా శ్యామల, నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా విజయలక్ష్మి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలిగా ఇందిర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కుముద్దీని నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీలో ఆయా విభాగాల్లోని పలు పోస్టుల్లో నియమించినట్లు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలి పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

కూల్చివేతల వెనుక కుట్ర


  • వ్యాపార కేంద్రంగా నదీతీరం!  
  • రివర్‌ఫ్రంట్ కోసం విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసే యోచన
  • నేతల వ్యూహంతోనే ఆలయాల ధ్వంసం !  
  • పుష్కరాలను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా తొలగింపు

విజయవాడ : విజయవాడ నగరంలో ఆలయాల అడ్డగోలు కూల్చివేత వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు తెలుస్తోంది. విదేశీ కంపెనీలకు నదీతీర ప్రాంతాన్ని ధారాదత్తం చేసి వ్యాపార కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. విలాసవంతమైన రివర్ ఫ్రంట్‌గా ఈ ప్రాంతాన్ని మార్చాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. నిత్యం వందలాదిమంది భక్తులు దర్శించుకునే ఆలయాలను రివర్‌ఫ్రంట్ కోసం కూల్చివేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని భావించిన నాయకులు ముందస్తు వ్యూహంగా పుష్కరాల కోసం అభివృద్ధి పేరుతో తొలగించే కార్యక్రమం చేపట్టారని ప్రచారం జరుగుతోంది.

సీఎం ఇంటి వైపు సాధ్యంకాక
వాస్తవంగా కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన గుంటూరు జిల్లా వైపు నదీతీరం అద్భుతంగా ఉంటుంది. అక్కడి ఆక్రమణలన్నింటినీ తొలగించి చక్కటి రివర్‌ఫ్రంట్‌గా మార్చుతామని గతంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అదే ప్రదేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని ఏర్పరుచుకోవటం, అక్కడి తీరప్రాంతమంతా బడాబాబుల గుప్పెట్లో ఉండటంతో ప్రస్తుతం అటువైపు రివర్ ఫ్రంట్ ఆలోచనకు స్వస్తి పలికినట్లు సమాచారం. తాజాగా ప్రకాశం బ్యారేజీ దిగువన రివర్‌ఫ్రంట్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిసింది.

బ్యారేజీ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వద్ద రైల్వే బ్రిడ్జి వరకు సుమారు 800 మీటర్లు ఉంటుందని, 35 నుంచి 40 అడుగుల వెడల్పు స్థలం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానదిలో ఏడాదంతా నీరు ఉండేందుకు ఒక చెక్‌డ్యామ్‌ను నిర్మించి, అందులో సుమారు ఆరేడు అడుగుల నీరు సంవత్సరమంతా ఉండే విధంగా మార్చితే అక్కడ రివర్ ఫ్రంట్, నదిలో బోటింగ్ ఏర్పాటుకు అనేక విదేశీ సంస్థలు ముందుకు వస్తాయని నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది.  అందులో భాగంగానే పుష్కరాలను అడ్డుపెట్టుకుని సాయిబాబా గుడి,  శనైశ్చర ఆలయం, భూగర్భ వినాయకుడు తదితర దేవాలయాల ధ్వంసానికి సిద్ధమయ్యారు.

అవినీతి కంపు కొడుతున్న ఆంధ్రప్రదేశ్


అవినీతి కంపు కొడుతున్న ఆంధ్రప్రదేశ్
ఏపీని కాపాడేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి

 సాక్షి,హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి మయం చేశారని, ఆయన చేసే ప్రతి పనిలోనూ అవినీతి కంపు కొడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారథి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని, పట్టిసీమ, రేషన్ మొదలు నీరు చెట్టు, ఆఖరికి వడదెబ్బతో పడిపోయే వాళ్లకు సహాయం చేసే దాంట్లో కూడా టీడీపీ అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా అవినీతి లేకుండా జరగడం లేదన్నారు.

చంద్రబాబు 2019 నాటికి ఏపీని దేశంలోనే నంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా చేయాలని కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు స్విస్ చాలెంజ్ పేరుతో దోపిడీకి తెర తీశారని మండిపడ్డారు. నిజాయితీగా రాజధాని నిర్మిస్తున్నామని భావిస్తే.. నిజంగా ధైర్యం ఉంటే రెండేళ్ల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సీబీఐ ఎంక్వైరీ జరిగితే దాన్ని ఎదుర్కోలేక స్టే తెచ్చుకున్న ఘనుడు బాబు అని దుయ్యబట్టారు.

 ఎదుర్కొనే దమ్ము లేక అపనిందలు : ప్రతిపక్ష నేత వైయస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేక.. ఆయనపై అపనిందలు వేసి రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారని చంద్రబాబుపై పార్ధసారధి నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

కువైట్‌లో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు

Written By news on Friday, July 1, 2016 | 7/01/2016


కువైట్ : భారత దేశం మతసామరస్యానికి ప్రతీక అని వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి అన్నారు. శుక్రవారం కువైట్‌లోని మాలియా ప్రాంతంలో ఉన్న ఆంధ్రా మ్యాక్స్ హోటల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకు ప్రత్యేకత ఉందన్నారు. భారత దేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయని, భారతీయులంతా ఒక్కటేనని చాటి చెప్పేందుకు ఇఫ్తార్ విందు ఒక మంచి అవకాశమన్నారు.

రంజాన్ మాసం శుభప్రదమైనదని ఉపవాసం ద్వారా పేదవారి ఆకలి తెలుస్తుందని, తద్వారా వారి ఆకలి తీర్చేందుకు సహాయం చేయాలనే అవకాశం భావన  కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కమిటీ కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, రెహమాన్ ఖాన్, నాయని మహేష్‌రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి. రెహమాన్ ఖాన్, సభ్యులు సయీద్ నజర్, గఫార్, మన్నూరు చంద్రశేఖర్‌రెడ్డి, రమణ యాదవ్, సురేష్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నాగిరెడ్డి చంద్ర పాల్గొన్నారు. 

మీకు ముందుంది ముసళ్ల పండుగ

Written By news on Thursday, June 30, 2016 | 6/30/2016


'మీకు ముందుంది ముసళ్ల పండుగ'
హైదరాబాద్: ఈడీ ఆస్తుల అటాచ్ ను సాకుగా తీసుకొని టీడీపీ దుష్ఫ్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. ఈడీ న్యాయ నిర్ధారణ సంస్థ మాత్రమేనని, పోలీసులాంటి వ్యవస్థే అని చెప్పారు. విచారణ ఇంకా జరుగుతుందని, తుది తీర్పు రావాల్సి ఉందని, ఆస్తులు అటాచ్ చేసినంత మాత్రానా స్వాధీనం చేసుకున్నట్లు కాదని ఆమె అన్నారు. వైఎస్ఆర్ ఉన్నన్ని రోజులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యాపార వేత్త అని గుర్తు చేశారు.

వైఎస్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ చేసిన ఓదార్పు యాత్రతో అసాధారణ ప్రజాభిమానం సంపాధించారని, దాంతో కాంగ్రెస్, టీడీపీలు భయపడి ఆయన ఆస్తులపై తప్పుడు విచారణ పిటిషన్ లు వేశారని అన్నారు. నిజనిజాలు త్వరలోనే తెలుస్తాయని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తిరిగి ఆస్తులు వస్తాయని, ఎప్పటికైనా న్యాయానిదే విజయం అని ఆమె అన్నారు. టీడీపీ నాయకులకు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. ఈడీ అటాచ్ సాకుగా టీడీపీ చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని, దుష్ప్రచారాలు ఆపేయాలని, తుది తీర్పు వచ్చాక మాట్లాడాలని అన్నారు.

ఎంతసేపు వైఎస్ జగన్ ను ప్రజల నుంచి దూరం చేసేందుకే కుట్రలు చేస్తున్నారని, వైఎస్ఆర్ సీపీ మూతపడిపోతుందని కలలు కంటున్నారని, అది ఎప్పటికీ జరగదని చెప్పారు. విచారణ పూర్తి కాకుండానే అటాచ్ అంటే ఒక భూతంగా చూపిస్తున్నారని, నోటుకు ఓట్ల కేసులో దొరికిపోయిన ఎవరికి తెలియదని అనుకుంటున్నారని అన్నారు. ఛార్జిషీట్లలో ఉన్న ఐఏఎస్ లు నిబంధనల మేరకే వ్యవహరించినట్లు ప్రభుత్వాలే కోర్టుల్లో చెప్తున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు అవినీతిపై తాము పుస్తకాన్ని ముద్రించామని, ఆయన నిజాయితీ పరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. చంద్రబాబు శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని అన్నారు.

కోటీశ్వరుల రాజధానిగా అమరావతి


కోటీశ్వరుల రాజధానిగా అమరావతి
 కోటీశ్వరుల రాజధాని వద్దు
 వైఎస్సార్‌సీపీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం


హైదరాబాద్: రాష్ట్రానికి రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిగా ఉండాలి గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కోటీశ్వరుల రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తీరు చూస్తుంటే అమరావతిలో నిర్మించేది మన రాష్ట రాజధానా? లేక సింగపూర్ రాజధానా? అనే అనుమానం కలుగుతోందన్నారు. కోటీశ్వరుల కోసమే రాజధాని అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేతిలో అధికారం ఉంది కదా అని తాము ఏం చెబితే అదే శాసనం, ఏది చేస్తే అదే విధానం అన్నట్లుగా టీడీపీ వ్యవహరించడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. మన దేశాన్ని 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటిష్ వాళ్లు కూడా ఇలాంటి నిబంధనలు పెట్టి ఉండరని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించి ఉండరని ఆయన పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ సంస్థలు కోరుకున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించిందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను మోసగించి భారీగా దోపిడీ చేసుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. రెండేళ్లుగా నిద్ర నటించిన చంద్రబాబు ఇప్పుడు హడావుడిగా రాజధాని, సచివాలయాన్ని తరలించుకుపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తాత్కాలిక సచివాలయంలో ఒక్క గది కూడా సిద్ధం కాకుండానే అక్కడికి వెళ్లి హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రాజధానిలో సింగపూర్‌కు భూములు కట్టబెట్టడాన్ని తాము ప్రతిపక్షం కనుక వ్యతిరేకించడం లేదని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యతిరేకించామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

సింగపూర్‌పై ఎందుకంత ప్రేమ?
కొన్నేళ్లుగా చంద్రబాబు మనిషిగా ఇక్కడున్నాడు తప్పితే ఆయన మనసంతా సింగపూర్‌లోనే ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి సింగపూర్‌పై ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదన్నారు. భారతదేశంలో బ్రహ్మాండమైన ఇంజినీర్లు, ప్రపంచం గర్వించదగ్గ నిపుణులు ఉండగా, వారిని కాదని రాజధానిని విదేశీ సంస్థల చేతుల్లో పెట్టడం ఏమిటని నిలదీశారు. విశాఖపట్టణంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినపుడు రూ 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారని, అలాగే వివిధ దేశాలు తిరిగినపుడు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారని ఒప్పందాలు కుదుర్చుకున్న వన్నీ వచ్చాయా ? అని ఆయన ప్రశ్నించారు.

శ్రీసిటీలో చంద్రబాబు ప్రారంభించిన పరిశ్రమలన్నీ గత ప్రభుత్వాలు ప్రారంభించినవేనని, నేమ్‌ప్లేట్లు మార్చి కార్యక్రమాలు చేశారని ఆయన అన్నారు. చైనా పర్యటనలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించడానికి అంగీకరించినట్లుగా చెబుతున్న సంస్థ ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థ అని ఆయన అన్నారు. భద్రతా సమితిలో భారత్‌కు సభ్యత్వం రాకుండా గట్టిగా అడ్డుకుంటున్న చైనాపై ఏ నమ్మకంతో ఒప్పందాలు చేసుకుంటారని కూడా ఆయన ప్రశ్నించారు.

వారి విద్యార్హతల వివరాలెందుకివ్వలేదు?


వారి విద్యార్హతల వివరాలెందుకివ్వలేదు?
రాష్ట్ర శాసనసభ పీఐఓకు సమాచార హక్కు కమిషనర్ నోటీసు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి తదితరుల విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తూ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ అసెంబ్లీ పీఐఓ(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)కు నోటీసులు జారీచేశారు. జూలై 13న తన  ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు తెలిపారు.

సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం తాను.. అసెంబ్లీలోని ఈ ఉన్నతాధికారులు టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వివరాలతోపాటు న్యాయశాస్త్ర పట్టాను వీరు ఎప్పుడు, ఎక్కడినుంచి పొందారనే సమాచారాన్ని ఇవ్వాలని 2015 నవంబర్ 10న సంబంధిత అధికారులను కోరానని తెలిపారు. మళ్లీ 2016 ఫిబ్రవరిలోనూ ఇదే సమాచారం కావాలని కోరానన్నారు. తాను అడిగినవి రహస్య పత్రాలేమీ కావని, అన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లేన న్నారు. చట్టప్రకారం నెలరోజుల్లో ఇవ్వాల్సిన ఈ సమాచారాన్ని ఏడెనిమిది నెలలైనా ఇవ్వకపోయేటప్పటికి సమాచార హక్కుకమిషనర్‌ను ఆశ్రయించడంతో ఈ విషయమై ఏపీ శాసనసభ పీఐఓకు నోటీసులు జారీ చేశారని ఆర్కే తెలిపారు.

బాబు గుళ్లనూ వదలడం లేదు


బాబు గుళ్లనూ వదలడం లేదు
- వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి
విచక్షణారహితంగా గుడులు, మసీదుల్ని కూల్చేస్తున్నారు

 సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నిర్మిస్తున్న రాష్ట్ర రాజధానిలో దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలతోపాటుగా దేవుళ్లకూ స్థానం లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాజధాని ప్రాంతంలో విచక్షణారహితంగా టీడీపీ ప్రభుత్వం దేవాలయాల్ని, మసీదుల్ని కూల్చివేస్తోందని మండిపడ్డారు.  గుళ్లనూ చంద్రబాబు వదలడం లేదని, దేవుడంటే ఆయనకు భయం లేదని విమర్శించారు. దేవాలయాలేగాక మసీదులనూ విచక్షణారహితంగా పడగొడుతున్నారన్నారు.

ఇప్పటికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో 25 నుంచి 30 వరకు దేవాలయాల్ని, కొన్ని మసీదుల్ని పడగొట్టారన్నారు. స్థానిక ప్రజలు వ్యతిరేకించినా, బంద్ పాటించినా, కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా లెక్క చేయకుండా దేవాలయాలు, మసీదుల్ని కూల్చేసుకుంటూ పోవడాన్ని తమపార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విజయవాడలో సీతమ్మ పాదాలు, శనేశ్వరాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, సాయిమందిరం వంటివాటన్నింటితోపాటు రామవరప్పాడు మసీదును పడగొట్టడం దారుణమన్నారు. ఆ ప్రాంతంలోఉన్న ముస్లింలను రాత్రిపూట అరెస్టు చేసి మరీ కూల్చివేశారన్నారు.గోశాలకు చెందిన శ్రీకృష్ణ దేవాలయాన్ని కూల్చివేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

 కేంద్రం.. మతసంస్థలు స్పందించాలి
 దేవాలయాల్ని, మసీదుల్ని పడగొట్టడాన్ని కేంద్రం జోక్యం చేసుకుని ఆపాలని పార్థసారథి కోరారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీవారు దేవాలయాల కూల్చివేతపైన వెంటనే స్పందించాలన్నారు. మసీదుల కూల్చివేతపైన ముస్లిం మైనారిటీ సంస్థలు, క్రిస్టియన్ మైనారిటీ పెద్దలు స్పందించాలని కోరారు. అభివృద్ధి వద్దని తామనట్లేదని, అయితే అదేసమయంలో మతభావాల్ని గౌరవించాలని ఆయన అన్నారు.

వైఎస్సార్ సీపీలోనూతనోత్సాహం


వైఎస్సార్ సీపీలోనూతనోత్సాహం
♦ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాలినేనికి బాధ్యతలు
♦ నేడు ఒంగోలుకు రాక.. నగరంలో పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ
♦ ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం క్రియాశీలక రాజకీయాలకు బాలినేని కొంత దూరంగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధికార పార్టీలో చేరిన నేపథ్యంలో బాలినేని వైఎస్సార్ సీసీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు భుజానికెత్తుకొని పార్టీని ముందుకు నడిపేందుకు సిద్ధమయ్యూరు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆపార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు.
బాలినేనికి జిల్లావ్యాప్తంగా విస్తృత పరిచయాలు, పార్టీ కేడర్‌తో సత్సంబంధాలున్నాయి. మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించి, క్రియాశీలకంగా పని చేస్తే కేడర్ మరింత ఉత్సాహంగా పని చేసి, పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బాలినేని తొలిసారి గురువారం ఒంగోలుకు రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్ననికి నెల్లూరు ప్రధాన రహదారిలోని వల్లూరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా రామ్‌నగర్, చర్చిసెంటర్, ట్రంకురోడ్డు, కర్నూలు రోడ్డు, ఫై ్లఓవర్ బ్రిడ్జి, మంగమూరు రోడ్డు మీదుగా జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.

ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్


ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్:వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మతీన్ మజాద్దాది నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కి పార్టీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బుధవారం రాత్రి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని మతీన్ నివాసంలో ఇఫ్తార్ సందర్భంగా ఉపవాస దీక్ష ముగించిన మతీన్‌కు జగన్ ఖర్జూరం తినిపించారు. మతీన్ కూడా గౌరవ సూచకంగా జగన్‌కు ఖర్జూరం తినిపించి, ముస్లిం సంప్రదాయ టోపీని, శాలువను అందజేశారు.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, పార్టీ ఏపీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు , కొండా రాఘవరెడ్డి, శివకుమార్, జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, ఇంకా మతీన్ సోదరుడు ముబీన్, మాజీ ఎంపీ బాలశౌరి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

కోడెలపై తక్షణమే అనర్హత వేటు వేయాలి: అంబటి

Written By news on Tuesday, June 28, 2016 | 6/28/2016


కోడెలపై తక్షణమే అనర్హత వేటు వేయాలి: అంబటి
-రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని తానే నేరం ఒప్పుకున్నారు
-ఎన్నికల నియమావళి ప్రకారం రూ.28 లక్షలే ఖర్చు చేయాలి
-డబ్బు వెదజల్లడం వల్లనే 924 ఓట్లతో గెలిచారని భావిస్తున్నాం
-కోడెలను తక్షణమే ఎమ్మెల్యే పదవినుంచి తొలగించండి
-ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన అంబటి రాంబాబు
-అడ్డదారిలో గెలిచిన వ్యక్తి స్పీకర్ పదవికీ అనర్హుడే...రోజా
-బ్రీఫ్‌డ్‌మీ వాయిస్ నాది కాదని ఇప్పటికీ బాబు ఖండించలేదు...వాసిరెడ్డి పద్మ


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్‌ను కోరారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే రోజా, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీలతో కలిసి సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. ప్రస్తుత ఏపీ స్పీకర్‌గా ఉన్న కోడెల శివపస్రాదరావు తాను ఎన్నికల్లో రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, అందుకే ఆయనపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
ఈమేరకు వినతి పత్రంతో పాటు కోడెల శివప్రసాదరావు మాట్లాడిన టేపులను సీడీల రూపంలో భన్వర్‌లాల్‌కు అందజేశారు. అనంతరం సచివాలయంలో మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో తనపై 924 ఓట్లతో కోడెల శివప్రసాదరావు గెలుపొందారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రూ.11.5 కోట్లు ఖర్చు చేసినందునే ఆయన 924 ఓట్లతో గెలుపొందినట్టు భావిస్తున్నానని అన్నారు. ఒక ఎమ్మెల్యే ఎన్నికల నిబంధనల మేరకు రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని, కానీ కోడెల శివప్రసాదరావు ఇందుకు భిన్నంగా 40 రెట్లు అధికంగా ఖర్చు చేశారన్నారు. రూ.11.5 కోట్లు ఖర్చుచేసినట్టు తానే స్వయంగా ఒప్పుకున్నందున ఇంతకంటే ఆధారాలు అవసరం లేదని చెప్పారు.
నేను మర్డర్ చేశాను బాబూ అన్నట్టు నేను రూ.11.5 కోట్లు ఖర్చుచేశానని నేరం అంగీకరించారని చెబుతూంటే ఆయనపై చర్యలు తీసుకోకపోవడం సమంజసం కాదన్నారు. ఆయన రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేసి ఉంటే ఇన్ని ఓట్లు వచ్చేవి కావని అంబటి అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు కదా, మరి వారిపై స్పీకర్ చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించగా... ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే కోర్టులు చర్యలు తీసుకునే అవకాశం లేదన్న ఒకే ఒక్క లొసుగుతో స్పీకర్ ఈ దారుణానికి పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని చెప్పిన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారని తాము అనుకోవడం లేదన్నారు. స్పీకర్ కోడెల ఫ్యాక్షన్ లీడర్ అని గ్రహించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను స్పీకర్‌గా నియమించారనేది అర్థమవుతోందన్నారు. ధనం విచ్చలవిడిగా వెదజల్లి కోడెల గెలిచారని, ఈ గెలుపు గెలుపే కాదన్నారు. స్పీకర్‌పై ఎన్నికల కమిషనే చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని, కోర్టులకు వెళ్లే అవసరం ఉండదని భావిస్తున్నామని అన్నారు.
స్పీకర్ పోస్టుకు అనర్హులు
ఎందరో మహామహులు కూర్చున్న స్పీకర్ స్థానంలో అడ్డదారిలో గెలిచి ఆ సీటులోకి వచ్చిన కోడెల శివప్రసాదరావు అనర్హుడని ఆయన్ను తక్షణమే స్పీకర్ పదవినుంచి, ఎమ్మెల్యే పదవినుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఓటుకు నోటుతో ఎమ్మెల్యేలను కొంటారు, ఈయనేమో ప్రజలను కొన్నట్టు చెబుతున్నారు...ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గు చేటైన విషయమని అన్నారు. అసెంబ్లీలో నియమాలు, నిబంధనలు అంటూ చెప్పే స్పీకర్‌కు ఇలా కోట్లు వెదజల్లి శాసనసభకు వచ్చారని, ఆయనకు నీతులు మాట్లాడే నైతిక అర్హత ఏ మాత్రం లేదని అన్నారు.
నేరుగా తానే తప్పును ఒప్పుకున్న స్పీకర్‌పై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని రోజా అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా సంతలో పశువుల్లాగా కొంటున్నా, వారిపై చర్యలు తీసుకునే ధైర్యం స్పీకర్‌కు లేదన్నారు. ఇప్పటికే పాలనా వ్యవస్థ, పోలీసుల వ్యవస్థ బ్రష్టు పట్టిపోయాయని, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే శాసన వ్యవస్థ కూడా బ్రష్టు పట్టే అవకాశం ఉందని అన్నారు.
బ్రీఫ్‌డ్ మీ వాయిస్ నాది కాదు అని అనలేదు
ఓటుకు కోట్లు వ్యవహారంలో బ్రీఫ్‌డ్ మీ అన్న వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పటికీ అవి తన వ్యాఖ్యలు కాదని ఖండించడం లేదని, అయినా దానినుంచి ఆయన తప్పించుకునేందుకు అడ్డదార్లు తొక్కారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఇప్పుడు స్పీకర్ కూడా రూ.11.5కోట్లు ఖర్చు చేశానని నేరం అంగీకరించారని, ఎన్నికల అఫిడవిట్‌లో ఇచ్చింది తప్పని నిరూపించారని, ఈయన కూడా తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇలా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లు ఏం చేసినా చెల్లుబాటవుతుందని, ఎలాగైనా తప్పించుకోవచ్చునని అనుకుంటే రాజ్యాంగంలో నిబంధనలకు విలువలేదని, ప్రజాస్వామ్యంలో పూర్తిగా తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు.

రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డి ప్రమాణం

న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాజసభ్య చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా సభ్యునిగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇటీవల రాజసభ్యకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వి విజయసాయిరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఎన్నికైన విషయం విదితమే. 

Popular Posts

Topics :