
అంతకుముందు పాలకొల్లులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్‌కి అండగా ఉండటానికి వేలాది మంది తరలిరావడం కనిపించింది. వైఎస్ జగన్ పయనించే ప్రతిదారి జన గోదావరి అయింది. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కర్ని వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. కష్టాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చిన రాజన్న బిడ్డను ఆశీర్వదించి వెళ్లారు. తల్లులు తమ బిడ్డలను తీసుకొచ్చి జగన్ చేతిలో పెట్టి ఆశీర్వదించమని అడగటం కనిపించింది. వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో పశ్చిమ గోదావరి జిల్లా మారుమోగుతుంది.
ప్రజాసేవ చేయడానికే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని స్వాతంత్ర్య సమరయోధుడు సత్యనారాయణ బాబు చెప్పారు. వైఎస్ జగన్‌కు కోట్ల మంది ఆశీర్వాదం ఉందన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చే శక్తి జగన్‌కే ఉందన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన వృద్దులు.