10 June 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన వైఎస్ఆర్ సిపి నేతలు

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద బస్ ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనక్ ప్రసాద్, నిర్మలా కుమారి, రెహ్మాన్ లు అక్కడకు వెళ్లారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహించి రవాణా మంత్రి బొత్స రాజీ నామా చేయాలని వారు డిమాండ్ చేశారు. డబ్బులకు కక్కుర్తి పడి ప్రైవేట్ ట్రావెల్స్ కు బొత్స పర్మిట్లు ఇస్తున్నారని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు

Magazine Story "Chetta Palukulu"

YS Vijayamma Consoles Vizag Steel Plant Victims

Mysura Reddy Condolence to Shirdi Bus Victims

YSRCP Plays major role AP Politics: Asaduddin Owaisi

YS Vijayamma Consoles Vizag Steel Plant Victims

దేశంలో కీలక నేతగా జగన్: ఎంపీ మేకపాటి

యువనేత వైఎస్ జగన్ ను కాంగ్రెస్ చేజేతులారా దూరం చేసుకుందని నెల్లూరు ఎంపీగా ఎన్నికయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ తన శక్తి ఎంటో రుజువు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడారు. జగన్ సత్తా ఉన్న నాయకుడని, ఆయనను దూరం చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి చెప్పానని వెల్లడించారు. రాబోయే రోజుల్లో జగన్ దేశంలో కీలక నేతగా ఎదుగుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఉప ఎన్నికల్లో ప్రజా మద్దతుతో గెలిచామని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడడం వల్లే నర్సాపురం, రామచంద్రాపురంలో తమ పార్టీ ఓడిపోయిందన్నారు. పరకాలలో కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ కారణంగానే కొండా సురేఖ స్వల్ప మెజారిటీలో ఓడిపోయిందని చెప్పారు.

జగన్ పులిలా బయటకు వస్తారు: నల్లపురెడ్డి

త్వరలోనే తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యాలయాలు మూతపడటం ఖాయమని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగన్ పులిలా తిరిగి బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఆయన విలేకరులత మాట్లాడుతూ జగన్‌ను అరెస్ట్ చేయడమే కొంపముంచిందన్న వయలార్ రవి, ఆజాద్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్ కుట్రకు అద్దంపడుతున్నాయని అన్నారు.

సీఎం రాజీనామా చేయాలి: మోహన్‌రెడ్డి

ఉప ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రితో పాటు ప్రచారంలో పాల్గొన్న మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకులు ప్రచారం చేసినా జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించలేకపోయారని అన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు విజయమ్మ పరామర్శ

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ విశాఖలోని స్టీల్‌ ప్లాంట్‌ బాధితులను పరామర్శించారు. బాధితుల కన్నీళ్లు తుడిచారు. ప్రమాదంలో మృతి చెందినవారికి నివాళ్లు అర్పించారు. విజయమ్మ వెంట తనయ షర్మిల, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొణతాల రామకృష్ణ, గొల్లబాబు రావు ఉన్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: మైసూరా

షోలాపూర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మైసూరా రెడ్డి డిమాండ్‌ చేశారు. చనిపోయిన టీసీఎస్‌ ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి వద్ద బాధితుల కుటుంబాలను మైసూరా పరామర్శించారు.

YS Vijayamma Condolence to Lakshmipeta Victims

YS Vijayamma Speech In Lakshmi Peta Victims

YSRCP MP Mekapati Rajamohan Reddy Speaks To Media

YSRCP By Poll Victory celebrations in Ireland

వైఎస్ఆర్ సీపీకి సంగ్మా అభినందనలు

ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ఎన్సీపీ సీనియర్‌ నేత పీ.ఏ సంగ్మా అభినందనలు తెలిపారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డికి ఆయన ఫోన్‌ చేసి అభినందించారు. అయిదు రోజుల క్రితం సంగ్మా కుమారుడు మేఘాలయ ఎమ్మెల్యే జేమ్స్‌ సంగ్మా హైదరాబాద్‌ వచ్చి వైఎస్‌ఆర్‌ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

జగన్‌కు అధికారం అప్పగించడం ఖాయం: గోనె

సానుభూతి వల్లే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనడం సరికాదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. జగనే తమ నాయకుడని ఉపఎన్నికల ద్వారా ఓటర్లు నిరూపించారని అన్నారు. టీఆర్‌ఎస్ లక్ష్యం ఓట్లు, సీట్లేనని ఉపఎన్నికల ద్వారా నిరూపితమైందని అన్నారు. తెలంగాణలోనూ వైఎస్‌ఆర్ సీపీ బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ బంగారుపళ్లెంలో అధికారాన్ని జగన్‌కు అప్పగించడం ఖాయమని గోనె ప్రకాశరావు ధీమాగా చెప్పారు. 



బాధితులకు అండగా ఉంటాం: విజయమ్మ

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో ముంపు మినహా మిగులు భూముల వివాదంపై ఈనెల 12న జరిగిన కోట్లాటలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఘటనకు దారి తీసిన వివరాలను బాధితులను అడిగి ఆమె తెలుసుకున్నారు. అన్నివిధాలా అండగా ఉంటామనికి వారికి భరోసా ఇచ్చారు. 

విజయమ్మ వెంట ఆమె కుమార్తె షర్మిల, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. లక్ష్మీపేట ఘటనలో నలుగురు దళితులు మృతిచెందగా, 31 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

వైఎస్ఆర్ కి మేకపాటి ఘనంగా నివాళులు


ఇడుపులపాయ : ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్‌ గెలుపును ఆపలేకపోయారని నెల్లూరు నుంచి భారీ మెజార్టీతో లోక్‌సభకు ఎన్నికైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం ఇడుపులపాయ వెళ్లి మహానేత వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ ఇక కాంగ్రెస్‌ టీడీపీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు మొదలవుతాయని అన్నారు.

వాన్ పిక్ ఏరియాలో జగన్ పార్టీకే పట్టం

వాన్ పిక్ ప్రాజెక్టుకు భూములు సేకరించిన ఒంగోలు నియోజకవర్గ ప్రాంతంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి బారీ ఆదిక్యత రావడం విశేషంగా కనిపిస్తుంది. వాన్ పిక్ ప్రాజెక్టుకోసం భూములు సేకరించడంలో రైతులకు అన్యాయం జరిగిందని,తక్కువ పరిహారం ఇచ్చారని ఇలా రకరకాల ఆరోపణలను ఒకపక్కన సిబిఐ మరో పక్క కాంగ్రెస్ , టిడిపిలు గుప్పించాయి. ఒక ప్రముఖ పత్రిక అయితే రైతుల అభిప్రాయాలు అంటూ రోజూ వాన్ పిక్ వ్యతిరేక ప్రచారం చేపట్టింది. మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ ఏరు వాక పేరుతో వాన్ పిక్ భూములలో దున్నుతున్నట్లు డ్రామా కూడా నడిపారు. చివరికి పోలింగ్ జరుగుతున్న రోజున కూడా హడావుడిగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి వాన్ పిక్ పై సమీక్ష జరిపినట్లు, దానిని రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారంలో పెట్టారు. ఇంత చేసినా ప్రజలు మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం విశేషం. ఒంగోలు నియోజకవర్గంలో ఇరవైఏడువేలకు పైగా ఆధిక్యతతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఏదో ఒకటి చెప్పి ప్రజలను తమవైపు తిప్పుకోవాలనుకునే క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలను కూడా రాజకీయ పార్టీలు పణంగా పెడుతున్నాయి. సిబిఐ అయితే రాజకీయ బాస్ ల ఒత్తిడికి లొంగి జగన్ ఆస్తుల కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త, వాన్ పిక్ లో భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేసింది.ఇంత చేసినా చివరికి అక్కడ జనం వీరందరికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం విశేషం.


source: kommineni

జగన్‌కు హ్యాట్సాఫ్ - ఎంపీ మాగుంట

= ఓటమిని అంగీకరిస్తున్నాం
= మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేసినా గెలవలేకపోయాం
= {పజల తీర్పు బాధ కలిగించినా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా
=విలేకరుల సమావేశంలో ఎంపీ మాగుంట 

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒక పక్క జైల్లో ఉండి బాధపడుతూ, తల్లిని, చెల్లిని ప్రచారానికి పంపి పార్టీ విజయానికి కృషి చేయడంలో జగన్ విధానాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అభినందించక తప్పదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రజా తీర్పుతో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు సానుభూతికి విజయం చేకూర్చారన్నారు. ఎన్నికలకు ముందు జగన్ అరెస్టు కూడా పార్టీ ఫలితాలపై ప్రభావం చూపిందని చెప్పారు. ఒకపక్క మంత్రులు, మరోపక్క ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా పనిచేసినా పార్టీ విజయం సాధించకపోవడం నిరాశ కలిగించిందన్నారు.

ఓటమితో ఎటువంటి సంబంధం లేకుండా భవిష్యత్‌లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే కార్యకర్తలు కూడా తమ సమస్యలపై ఎల్లప్పుడూ తనను సంప్రదించవచ్చన్నారు. పార్టీ ఓటమి పాలైన కూడా తమ కుటుంబం తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం ఉండదని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా సేవకు అంకితమైన తమ కుటుంబానికి ప్రజలు ఇటువంటి తీర్పు ఇవ్వడం కొంత బాధ కలిగించిందన్నారు. మేము చేసిన తప్పు ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం మేరకే పార్వతమ్మను ఒంగోల్లో పోటీ చేయించామన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలిపారు.

ప్రజా జీవితంలో ఎదురులేని బాలినేని

 నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకునికి ఎదురులేదని స్పష్టమైంది. వలస నాయకులను ప్రజలు విశ్వసించరని రుజవైంది. ఢిల్లీ నాయకులు వచ్చి జనం లేని రోడ్‌షోలు చేసినా, ముఖ్యమంత్రి రెండుసార్లు పర్యటించినా, చిరంజీవితో చేతులూపించినా, చంద్రబాబు రెండు సార్లు వచ్చి రెండు ఏళ్లు చూపించినా అవన్నీ బాలినేని చరిష్మా ముందు దిగదుడుపేనని తేటతెల్లమైంది. పోటిచేసిన ప్రతిసారీ భారీ మెజార్టీతో గెలుస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించగల రాజకీయ ఉద్దండుడు వాసు.

విద్యార్థి దశనుంచే రాజకీయ రంగప్రవేశం చేసిన బాలినేని.. సమకాలిన రాజకీయ నాయకునిగా.. రాజకీయ చతుర త.. చాణిక్యం ప్రదర్శించగల సమర్థుడుగా గుర్తింపు పొందారు. యువజన కాంగ్రెస్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బాలినేని శ్రీనివాసరెడ్డి 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావుపై పోటిచేసి 6222 ఓట్ల మెజార్టీ సాధించారు. అక్కడి నుంచి ఆయనకు నియోజకవర్గంలో ఎదురు లేదు. 2004లో టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావుపై 24,171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తదనంతరం 2009 ముక్కోణపు పోటీలో 22,986 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆయన మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రకు జిల్లాలో మద్దతుగా నిలిచి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారు. 

ఈనెల 12న జరిగిన ఒంగోలు ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగి అత్యధికంగా 27,476 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ప్రత్యర్థులకు సవాల్ విసిరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రచారంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై బాలినేనిపై అసత్య ప్రచారం చేశాయి. వాన్‌పిక్ వ్యవహారంలో ఆయన ప్రజలకు మేలు చేస్తే దాన్ని మరోలా చిత్రీకరించాయి. ఏకంగా అధికార పార్టీ మంత్రి వాన్‌పిక్ భూముల్లో దుక్కిదున్ని రాజకీయ విత్తనాలు నాటాలని చూసినా ప్రజలు అవేవీ విశ్వసించలేదు.

ఎన్నికల ప్రారంభం నుంచే బాలినేని వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. వార్డుల వారీగా ఇన్‌చార్‌‌జ లను నియమించి వారి పర్యవేక్షణలో స్థానిక నాయకులు కార్యక్రమాలు చేసే విధంగా పథక రచన చేశారు. అధికార కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించి వార్డుల వారీగా డబ్బులు వెదజల్లినా ప్రజలు మాత్రం మంచి మనిషికే పట్టం కట్టారు. బాలినేని నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా ఎలా గెలుస్తున్నారని విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నవ్వుతూ మాట్లాడటం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం.. పేద, ధనిక భేదం లేకుండా అందరూ తనతో నేరుగా మాట్లాడే విధంగా అవకాశం కల్పించడం ఆయన విజయ రహస్యమని ఇతర పార్టీల నాయకులే పేర్కొంటున్నారు. ఆ మంచి తనమే బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రజా జీవితంలో ఎదురులేని నేతగా నిలిపింది.

ఫ్యాన్‌ గాలి తుఫానైంది. కోస్తాలో కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి కాగా, తెదేపా గల్లంతైంది (andhraprabha)

ఫ్యాన్‌ గాలి తుఫానైంది. కోస్తాలో కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి కాగా, తెదేపా గల్లంతైంది. తుఫాను ప్రళయగాలి తెలంగాణనూ తాకింది. పరకాలలో తెరాస 'కొండా'ను ఢీకొట్టి ప్రమాదానికి గురైనా, బతికి బయటపడింది. 'సింహపురి సింహం' టీఎస్సార్‌ కూడా 'మేక'పాటి ధాటికి తట్టుకోలేక చిత్తగించడం విశేషం. జగన్‌ అరెస్ట్‌, విజయమ్మ కన్నీళ్లు తమ కొంప ముంచాయని కాంగ్రెస్‌ వాపోయింది. జగన్‌తో కుమ్మక్కై అరెస్ట్‌ పర్వం సృష్టించడం వల్లే జనం అవినీతిని పట్టించుకోలేదని తెదేపా ఘొల్లుమంది. అయినా 10 స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం పెద్ద ఊరటే. ఫలితాల నేపథ్యంలో ముంచుకొస్తున్న జగన్‌డం నుంచి ఎలా తప్పించుకోవాలా అని తెదేపా, కాంగ్రెస్‌లు మల్లగుల్లాలు పడుతున్నాయి. 


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి:అంతా ఊహించినట్లుగానే ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 15, కాంగ్రెస్‌ రెండు, తెరాస ఒక శాసనసభ స్ధానాల్లో విజయం సాధించాయి. నెల్లూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి 2.91 లక్షల అత్యధిక అధిక్యతతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి ఘన విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఒక్క స్ధానాన్ని కూడా దక్కంచుకోలేక పోయింది. ఉప ఎన్నికలు జరిగిన స్ధానాలు తమవి కానప్పటికీ గట్టి పోటీనిచ్చి అత్యధిక స్ధానాల్లో రెండవ స్ధానంలో నిలబడగలిగామనే సంతృప్తిని వ్యక్తం చేసింది. పరకాల నియోజక వర్గంలో తెరాస వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధుల మధ్య చివరి వరకు హోరా హోరీగా సాగిన పోరులో తెరాస అభ్యర్ధి ఎం. భిక్షపతి 1562 ఓట్ల అత్యల్ప ఆధిక్యతతో గెలుపొందారు. రామచంద్రాపురం, నర్సాపురం స్ధానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకొని ఊపిరి పీల్చుకుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి నియోజక వర్గం ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులను ఒడ్డించినప్పటికీ 17,975 ఓట్ల ఆధిక్యతతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 13 కేంద్రాల్లో గట్టి పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్‌ నిర్వహించారు. తొలి రౌండ్‌ నుండే రాజంపేట, రాయదుర్గం, ప్రత్తిపాడు, అనంతపురం అర్బన్‌, పాయకరావుపేట, ఎమ్మిగనూరు, మాచర్ల, పోలవరం, రాయచోటి, ఆళ్లగడ్డ శాసనసభ నియోజక వర్గాలు, 


నెల్లూరు పార్లమెంటు నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యతను కనబరుస్తూ విజయం దిశగా దూసుకుపోయింది. కాంగ్రెస్‌, తెదేపా, వైఎస్‌ఆర్‌సిపి, భాజపా, తెరాస, సిపిఎం, లోక్‌సత్తాతో పాటుగా పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మధ్యనే ప్రధానంగా పోటీ ఏర్పడింది. తెలంగాణలోని పరకాల నియోజక వర్గంలో మాత్రం వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి కొండా సురేఖ తెరాస అభ్యర్ధి భిక్షపతిని ఢీ కొనవలసి వచ్చింది. చివరి వరకు హోరా హోరీగా పోరాడినప్పటీకీ విజయం తెరాసనే వరించింది. పార్టీ పెట్టిన 15 మాసాల వ్యవధిలోనే మూడవ సారి జరిగిన ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్ధానాలను కైవసం చేసుకొని సంబరాలు జరుపుకుంటోంది. విజయమ్మ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిపితే అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బలం 17కు చేరిందనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో ఆ పార్టీ బలం రెండుకు చేరింది. ఉప ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ప్రకటించారు. రామచంద్రాపురం నియోజక వర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి తోటా త్రిమూర్తులు తన సమీప వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పైన 11,919 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నర్సాపురం నియోజక వర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధి కొత్తపల్లి సుబ్బరాయుడు తన సమీప ప్రత్యర్ధి ఎం. ప్రసాదరాజు ( తెదేపా) పైన 4,464 ఆధిక్యతతో విజయం సాధించారు. పరకాల నియోజక వర్గం నుండి తెరాస అభ్యర్ధి ఎం. భిక్షపతి తన సమీప ప్రత్యర్ధి కొండా సురేఖ పైన ( వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) 1562 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నెల్లూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి మేకపాటి రాజమోహరన్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్ధి టి. సుబ్బరామిరెడ్డిపైన 2,91,745 లక్షల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. నర్సన్నపేటలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి ధర్మాన కృష్ణదాస్‌ 7312 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. పాయకరావు పేటలో జి.బాబురావు (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) 14,362 ఓట్ల ఆధిక్యతను సాధించి సమీప తెదేపా అభ్యర్ధి చెంగల వెంకట్రావుపై విజయం సాధించారు.

తదేపాకు తలసాని షాక్‌!కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీ నుండి కూడా భారీ ఎత్తున వలసలు!

రాష్ట్రంలో ఉపఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా రావడంతో వివిధ పార్టీల నుండి ఆ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు భారీ స్థాయిలో ఉండడం ఏదో ఒకనాటికి ఆ గూటికి చేరడం ఖాయమనే వాదనలు ఉండగా, తెలుగుదేశం పార్టీ నుండి కూడా భారీ ఎత్తున వలసలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే కొద్దికాలంగా తెలుగుదేశం నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ త్వరలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్‌తో ఆయన ఎప్పటినుండో సంబంధాలు నెరపుతున్నట్లు సమాచారం. జగన్‌ అవినీతిపై ఎంత మొత్తుకున్నా ప్రజలు దాన్ని పట్టించుకోలేదని ఆయన చేసిన వ్యాఖ్యల్లో బలమైన ఆధారాలున్నాయి. తలసాని ఈసారి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి వైకాపా నుంచి పోటీచేస్తారనే ప్రచారం సాగుతోంది.


 కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వర్గపోరు మరోసారి బయటపడింది. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో లింగాపూర్‌ యూత్‌ అసోసియేషన్‌తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఒకవైపు వైఎస్‌ జగన్‌, విజయమ్మల నిలువెత్తు ఫోటోలను ముద్రించగా, అదే ఫ్లెక్సీపై మరోవైపు నాని ఫోటోను ముద్రించారు. దీంతో ఆయన తన నిర్ణయాన్ని పరోక్షంగా వెల్లడించినట్లయింది. ఒకటిరెండు రోజుల్లో చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను కలిసి పార్టీలో చేరిక విషయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న, కృష్ణా జిల్లాకే చెందిన సీనియర్‌ నాయకుడు వర్ల రామయ్య కూడా దేవినేని ఉమా మహేశ్వరరావుపై అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. తన పార్టీలోనే తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నందిగామ నియోజకవర్గం నుండి తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానేమోనన్న భయంతో ఇప్పటికే దేవినేని ఉమ తన సోదరుడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పంపారని, తన అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నిస్తారని, ఒకవేళ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే తనను ఓడించేందుకు కృషి చేస్తాడంటూ ఆయన ధ్వజమెత్తారు. గతంలోనే విజయవాడ అర్బన్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభనేని వంశీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని బహిరంగంగా కలిసి ఆలింగనం చేసుకోవడంపై దుమారం చెలరేగింది. ఆగ్రహానికి గురైన చంద్రబాబు ఆయనకు షోకాజ్‌ నోటీసులను జారీ చేయించారు. దీంతో వంశీ సమాధానం ఇవ్వడంతో ఆ గొడవ సద్దుమణిగింది. అయితే జూనియర్‌ ఎన్‌టిఆర్‌తో సత్సంబంధాలు ఉండి ఆయన వర్గంగానే కొనసాగుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, దివంగత వంగవీటి రంగ తనయుడు రాధాకృష్ణతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారిద్దరినీ జగన్‌ వద్దకు రప్పించేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిద్దరూ తెదేపాను వీడడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కూడా తెలుగుదేశం పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయన వైఎస్సార్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలపై దృష్టి సారించారు.

 సీమాంధ్రలో పలువురు తెలుగుదేశం నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏదిఏమైనా ఉప ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జోరును పెంచేలా కనిపిస్తున్నాయి.

source:  andhraprabha news 

YSRCP MLAs speech

YS Jagan Thanks to ALL

శ్రీకాకుళం చేరుకున్న విజయమ్మ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. రణస్థలం వద్ద ఆమెకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఉపఎన్నికల విజయోత్సవంలో ఉన్న కార్యకర్తలు పెద్దఎత్తున అన్ని గ్రామాల్లోనూ రోడ్లపైకి వచ్చి విజయమ్మను ఆహ్వానించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులు జై జగన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రణస్థలం నుంచి ఆమె చిలకపాలెం మీదుగా రాజాం వెళ్లి లక్ష్మీపేట చేరుకోనున్నారు. లక్ష్మీపేట ఘటనలో మృతిచెందిన నలుగురు కుటుంబాలను విజయమ్మ పరామర్శిస్తారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

మృతుల కుటుంబాలకు విజయమ్మ సంతాపం

మహారాష్ట్ర సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పర్యటనలో ఉన్న ఆమె ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు విజయమ్మ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు శనివారం విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. లక్ష్మీపేట, స్టీల్ ప్లాంట్ బాధితుల్ని ఆమె నేడు పరామర్శించనున్నారు. విజయమ్మ వెంట మాజీ మంత్రి కొణతాల, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉన్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులు, జగన్‌ అభిమానులతో విమానాశ్రయంలో సందడి నెలకొంది.

'ప్రజలంతా రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు'


తమ గెలుపును జగన్‌కు అంకితం చేస్తున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు విజేతలు హైదరాబాద్ వచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిసి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యాలయ ఆవరణలోని దివంగత మహానేత వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలంతా రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆ కల సాకారం చేయడమే తమ లక్ష్యమన్నారు.



తిరుపతి : ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపించాయన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించే అర్హత కోల్పోయిందని, సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే ప్రజలు కసితీరా కాంగ్రెస్ ను ఓడించారన్నారు. బాబు మోసపూరిత మాటలను ప్రజలు నమ్మలేదని అందుకే టిడిపి అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారని భూమన విమర్శించారు.

Tdp,Congress future?

vijayamma reached vizag

High Court notice to CBI,CVC

పార్టీ కార్యాలయానికి నూతన ఎమ్మెల్యేలు

ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15మంది ఎమ్మెల్యేలు శనివారం ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరంతా మరికొద్దిసేపట్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలవనున్నారు.

విశాఖ చేరుకున్న వైఎస్ విజయమ్మ

 వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేడు శ్రీకాకుళం, విశాఖపట్నంలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం ఆమె హైదరాబాద్‌ నుంచి నేరుగా విశాఖ చేరుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దారుణకాండలో మరణించిన వారి కుటుంబాలను విజయమ్మ పరామర్శిస్తారు. అనంతరం విశాఖ విశాఖ చేరుకుంటారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఆమె పరామర్శించనున్నారు.

ఇది ప్రజల విజయం

జగన్‌ను కలిసిన తర్వాత విజయమ్మ, షర్మిల వ్యాఖ్య
రాజన్న రాజ్యం రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు
జగన్‌ను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికీ 
ఈ విజయం చెందుతుంది: వైఎస్ విజయమ్మ
జగన్ దోషి అంటూ విమర్శిస్తున్న అందరికీ ప్రజలు ఓట్ల ద్వారా సమాధానమిచ్చారు... మా పట్ల ఆదరణ చూపించిన 
ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటాం
జగన్‌ను కలిసిన తర్వాత చంచల్‌గూడ జైలు వద్ద విజయమ్మ, షర్మిల
కాంగ్రెస్, టీడీపీ కలిసి ప్రలోభాలు పెట్టాయి.. ఓటు వేస్తే రూ.3,000, వేయకుంటే రూ.2,000 ఇచ్చాయి
ఎన్నికల్లో ఏకమై జగన్ ఒక్కడినే టార్గెట్ చేశాయి.. అసెంబ్లీలో పటిష్టమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం
ఈ ఎన్నికలు రెఫరెండమే.. 2014లో ఇంతకంటే భారీ విజయం ఖాయం: షర్మిల
పిల్లి సుభాష్‌చంద్రబోస్, సురేఖ, ప్రసాదరాజు ఓడిపోవడంపట్ల జగనన్న బాధను వ్యక్తం చేశారు
జగన్ త్వరలోనే బయటకు వస్తారు.. ఓదార్పును కొనసాగిస్తారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ప్రజల విజయమని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం కావాలని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో.., జగనన్న నాయకత్వాన్ని ఎంత బలంగా విశ్వసిస్తున్నారో ఈ ఫలితాలు నిరూపించాయని అన్నారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వారిద్దరూ చంచల్‌గూడ జైలుకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం జైలు వద్ద, ఆతర్వాత ఇంటి వద్ద విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇది దేవుడిచ్చిన విజయం. ప్రజలు మెచ్చిన విజయం. జగన్‌బాబుకు దేవుడిచ్చిన బహుమానం’’ అని విజయమ్మ వ్యాఖ్యానించారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఆయన సంక్షేమ పథకాలను ప్రజలు మరచిపోలేదని, పదిలంగా గుండెల్లో దాచుకున్నారని ఈ ఫలితాలు నిరూపించాయి. 

జగన్‌ను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి ఈ విజయం చెందుతుంది. జగన్ దోషి అంటూ విమర్శిస్తున్న అందరికీ ప్రజలు ఓట్ల ద్వారా సమాధానమిచ్చారు. ప్రజల కోసం జగన్ చేసిన పోరాటం, దీక్షలను ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఎన్నికల్లో అండగా నిలిచారు. ప్రజలు మాకు న్యాయం చేశారు. జగన్‌బాబును నిర్దోషిగా ప్రజాకోర్టులో తీర్పునిచ్చారు. మా పట్ల ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని చెప్పారు. ‘‘ప్రజా కోర్టుకు వెళ్లి నేను ఏదైతే న్యాయం కోసం అడిగానో ప్రజలు ఆ న్యాయం ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. జగన్‌బాబుపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఈ విషయాలను నేను ప్రజా కోర్టులో చెప్పాను. దానికి ప్రజలు న్యాయమైన తీర్పునిచ్చారు. వైఎస్‌ఆర్ మాదిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల ఆకాంక్షలను, ఆశలను నెరవేరుస్తుందని ఈ ఎన్నికల్లో ప్రజలు చెప్పారు. వైఎస్‌ఆర్ గారి సువర్ణయుగం జగన్ బాబు నేతృత్వంలోనే సాధ్యమని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా చెప్పారు’’ అని విజయమ్మ తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ను, టీడీపీని ప్రజలు నమ్మడంలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. ‘‘అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలే నైతిక హక్కును కోల్పోయింది. ఎందుకంటే.. ఆరోజు వైఎస్ రాజశేఖరరెడ్డిగారిని చూసే ప్రజలు ఓట్లు వేశారు. మళ్లీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విశ్వసనీయతతో ఓట్లేశారు. 

మా కుటుంబం 40 ఏళ్లుగా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం బతుకుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు 35 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నారు. జగన్‌బాబు కూడా రెండున్నరేళ్లుగా ప్రజల మధ్యన ఉండి కష్ట పడుతున్నారు. ఆయన ప్రజలపట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఆమోదించారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. జగన్ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారు. టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై రకరకాల ప్రలోభాలు పెట్టాయి. ఓటు వేస్తే 3,000 రూపాయలు, వేయకుంటే 2,000 రూపాయలు ఇచ్చారు. రామచంద్రపురం, నరసాపురంలో టీడీపీకి 5 వేలు, ఆరు వేల ఓట్లు కూడా రాలేదు. ఈ రెండు పార్టీలూ ఏకమై జగన్ ఒక్కడినే టార్గెట్ చేసి ఎన్నికలు నడిపించాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా చూశారు’’ అని అన్నారు. ‘‘నేను ఈరోజు జగన్‌బాబును కలిసినప్పుడు ఆయన నాకొక మాట చెప్పారు. మనకు ఓట్లు వేసిన ప్రతి అవ్వా తాతకు, ప్రతి అక్కా చె ల్లెలుకు, ప్రతి అన్నా తమ్ముడికి, ప్రజలందరకీ కృతజ్ఞతలు తెలపమని చెప్పారు. ఆయన తరపున నేను వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. రైతులపక్షంగా, పేదలపక్షంగా నిలబడి పదవులు పోగొట్టుకుని ప్రజల ముందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను’’ అని అన్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షం దాని బాధ్యతలు నిర్వహించలేకపోతోందని అన్నారు. ఇకపై అన్ని ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుండి గట్టిగా పోరాడుతుందని తెలిపారు. అసెంబ్లీలో తమ పార్టీ పటిష్టమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, వై.వి.సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. విజయమ్మకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

జగనన్న సీఎం అవుతారు: షర్మిల

‘‘ఇది ప్రజల తీర్పు. దేవుడి తీర్పు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయం. జగనన్న సీఎం అవుతారని ఫలితాలు రుజువు చేశాయి’’ అని షర్మిల చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలు రెఫరెండమేనని, 2014 ఎన్నికల్లో ఇంతకంటే భారీ విజయం ఖాయమని తెలిపారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై, అధికార బలంతో పోలీసులను వాడుకొని, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినా వారికి ఫలితం దక్కలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడాన్ని ప్రజలు అంగీకరించలేదు. జగన్ నిర్దోషి అన్ని ప్రజలు నమ్మారు. రెండు సంవత్సరాలుగా జగనన్న ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసు. అందుకే జగనన్నకు విజయం అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పమని జగనన్న చెప్పారు. ప్రతి అవ్వ, తాత, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు.. అందరికీ జగనన్న కృతజ్ఞతలు తెలిపారు. మా పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరూ మాకు ముఖ్యమే. పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, ప్రసాదరాజు ఓడిపోవడంపట్ల జగనన్న బాధను వ్యక్తం చేశారు’’ అని షర్మిల చెప్పారు. సానుభూతితోనే గెలిచారని, జగన్ తల్లి, చెల్లి కన్నీళ్లు కార్చడంవల్లే ప్రజలు ఓట్లేశారంటూ కొందరు చేస్తున్న వాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘ఓట్లు రాలేదని ఇప్పుడు ఏడ్వటంకంటే.. అప్పుడే కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా కన్నీళ్లు కార్చాల్సింది. ఎవరు వద్దన్నారు’’ అంటూ షర్మిల ఘాటైన సమాధానమిచ్చారు. జగన్ త్వరలోనే బయటకు వస్తారని, ఓదార్పును కొనసాగిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు.

ప్రజాగ్రహానికి నిదర్శనం

సమర్థ, సంక్షేమ పాలన అందించే సత్తా జగన్‌కు ఉందని జనం విశ్వసించారు
ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడంలో ప్రభుత్వం విఫలమైంది.. ప్రజల హక్కుల పరిరక్షణ బాధ్యతను ప్రతిపక్షం విస్మరించింది
జగన్ బయటకు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు ఆపలేవు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల ఫలితాలు కేవలం సానుభూతి పవనాల ఫలితమే కాదని.., మహానేత రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యల ఫలితంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి చెప్పారు. సమర్థ, సుస్థిర, సంక్షేమ పాలన అందించే సత్తా జగన్‌కు ఉందని ప్రజలు విశ్వసించారని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శుక్రవారం పలు జాతీయ ఛానళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. ఆ ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పిన ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
గత ఏడాది కడప ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించినప్పుడు.. వైఎస్ సొంత ప్రాంతం కాబట్టే విజయం సాధ్యమైందని కాంగ్రెస్, టీడీపీలు వ్యాఖ్యానించాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అవే ఫలితాలు పునరావృతమయ్యాయి.
జగన్ గత రెండున్నరేళ్లుగా ప్రజల్లోనే ఉన్నారు. కుటుంబంతో గడిపిన సమయంకంటే.. ప్రజల్లో ఉన్నదే ఎక్కువ. ప్రజలు ఆయన్ని కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడలేదు. వారి అన్నగా, తమ్ముడిగా, మనవడిగా... సొంత కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు. వారి సొంత మనిషికి అండగా నిలిచారు.
ఫలితాలు వచ్చిన తర్వాత జైల్లో జగన్‌ను కలిశాం. ఆయన చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. ఫలితాలపట్ల సంతోషం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఎమ్మెల్యే పదవులను వదులుకున్న సుభాష్‌చంద్రబోస్, కొండా సురేఖ, ప్రసాదరాజు ఓడిపోవడంపట్ల బాధపడ్డారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువైపు ఉండాలనే విషయాన్ని పార్టీ నాయకులు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ప్రతి కుటుంబానికి 30 కిలోల బియ్యం, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న హామీలు. వైఎస్ మరణం తర్వాత ఆ హామీలను కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేసింది. అప్పటికే అమల్లో ఉన్న పలు సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసింది. సర్కారు అసమర్థత వల్ల ధనికుల నుంచి పేదల వరకు.., పట్టణవాసుల నుంచి గ్రామీణుల వరకు... అందరూ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సర్కారు మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యతను ప్రతిపక్షం విస్మరించింది. ప్రజల పక్షాన నిలిచింది వైఎస్సార్‌సీపీ మాత్రమే. అందుకే వైఎస్సార్ సీపీని ప్రజలు విశ్వసించారు. ధాన్యానికి మద్దతు ధర కోసం మొదలు పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జగన్ ఒక్కరే పోరాటం చేశారు. అందుకే ప్రజలు జగన్ పక్షాన నిలిచారు.

జగన్ అరెస్టుకు ముందే భారీ విజయాన్ని ఊహించాం. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించడంపట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. జగన్ దోషి కాదని ప్రజలు తీర్పు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలకు సమాధానమిచ్చారు. దేశంలో ఏ రాజకీయ నేత ఇంటి మీదా సీబీఐ దాడులు జరగలేదు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షసాధింపే. చంద్రబాబు అక్రమాస్తుల మీద అన్ని ఆధారాలతో విజయమ్మగారు కోర్టుకు వెళితే.. సీబీఐ విచారణ జరగలేదు. ఒక ఎమ్మెల్యే లేఖ రాయడం, జగన్ మీద సీబీఐ విచారణ జరగడం.. రాజకీయ వేధింపుల్లో భాగమే.

ఈ ఫలితాలే పునరావృతమైతే 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 200కు పైగా స్థానాలు రావడం ఖాయం.
జగన్ బయటకు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు ఆపలేవు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా.., దేశవ్యాప్తంగా పర్యటించడం ఖాయం. జగన్ వచ్చేవరకు పార్టీకి విజయమ్మ నాయకత్వం వహిస్తారు.
నేను రాజకీయ నేతను కాదు. జగన్ భార్యగానే నా పాత్ర ఉంటుంది.

మాచర్ల.. 15,479,కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

రెండో స్థానంలో టీడీపీ 
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 15,479 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఎన్నికల్లో రామకృష్ణారెడ్డికి 79,751 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ళ మధు 64,272 ఓట్లు దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డి కేవలం 19,065 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు. మాచర్ల నియోజకవర్గం ఆవిర్భావం అనంతరం మొదటిసారిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోయింది. 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ బొత్స సత్యనారాయణతో సహా పలువురు మంత్రులు, ఎంపీలు విస్తృతంగా ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. తొలి రౌండ్‌లోనే 1,398 ఓట్లతో మొదలైన మెజార్టీ ప్రస్థానం తుదికంటా కొనసాగింది. 9వ రౌండ్‌లో టీడీపీ 282 ఓట్లు, 11వ రౌండ్‌లో ఒక్క ఓటు, 16వ రౌండ్‌లో 162 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవానే కొనసాగింది. 

ఈ విజయం జగన్‌కు అంకితం: పీఆర్కే

నా విజయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కే అంకితం ఇస్తున్నా. కాంగ్రెస్, టీడీపీ లు తమ పార్టీపై ఎంత బురదజల్లినా, దిగజారి నీచ ఆరోపణలు చేసినా ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు. 

ఒంగోలు.. 27,403, కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగోసారి ఒంగోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌పై 27,403 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. కాగా జిల్లా కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ డిపాజిట్ కోల్పోయారు. 

శుక్రవా రం కౌంటింగ్ సందర్భంగా తొలి రౌండ్‌లో టీడీపీకి 366 ఓట్ల మెజారిటీ రావడం ఉత్కంఠ రేకెత్తించింది. ఆ పార్టీకి రెండో రౌండ్ నుంచి 1,189 ఓట్ల మెజారిటీ లభిం చిం ది. ఇక అక్కడ్నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌కాంగ్రెస్ మెజారిటీ పెరుగుతూనే ఉంది. చివరకు 27 వేలకు పైగా వచ్చిన భారీ మెజారిటీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కనువిప్పు కావాలి: బాలినేని

‘‘నా గెలుపు కాంగ్రెస్, టీడీపీలకు కనువిప్పు కావాలి. వైఎస్సార్ కుటుంబాన్ని వేధిస్తున్న కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం’’

రాజంపేట..38,219



రాజంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అమర్‌నాథరెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థి మేడా మల్లిఖార్జునరెడ్డిపై 38,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1,46,615 ఓట్లు పోలవగా.. అమర్‌నాథరెడ్డికి 76,951 ఓట్లు లభించాయి. మల్లిఖార్జునరెడ్డికి 38,732 ఓట్లు దక్కాయి. తెలుగుదేశం అభ్యర్థి పసుపులేటి బ్రహ్మయ్య 21,417 ఓట్లు సాధించినా డిపాజిట్ గల్లంతైంది. ఇక్కడ ఐదో రౌండులో మాత్రమే మల్లిఖార్జునరెడ్డికి 45 ఓట్లు స్వల్ప ఆధిక్యత లభించింది. అలాగే పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌కు 44, ఒకటి మాత్రమే వైఎస్‌ఆర్ సీపీకి లభించాయి. ఆ రెండు మినహా అన్ని రౌండ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హవా కనిపించింది.

కక్ష సాధింపును గమనించారు: ఆకేపాటి

‘‘నా గెలుపు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తున్నా. అధికార పార్టీ ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభ పెట్టినా వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకునే విధంగా ఓటర్లు నాకు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు’’

రికార్డు తిరగరాసిన మేకపాటి

రికార్డు తిరగరాసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి
కాంగ్రెస్ కోట్లు వెదజల్లినా.. తగ్గని ఫ్యాన్ హవా
కౌంటింగ్ మధ్యలోనే వెనుదిరిగిన టీఎస్సార్.. టీడీపీకి డిపాజిట్ గల్లంతు
మంత్రులు ఆనం, మహీధర్ రెడ్డి నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ

నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డిపై 2,91,745 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ధరావతు కోల్పోయారు. తాజా విజయంతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఎప్పుడూ రానంత మెజారిటీని ఆయన సాధించారు. 1980లో ఇందిరాగాంధీ ప్రభంజనంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) తరపున పోటీ చేసిన దొడ్ల కామాక్షయ్యకు 2,27,291 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పటివరకు అది రికార్డుగా ఉంది. ఇప్పుడు మేకపాటి ఆ రికార్డును తిరగరాశారు. రాజమోహన్‌రెడ్డి మొత్తం ఓట్లలో 54.59% రాబట్టుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి ఉదయం 9 గంటలకు వచ్చిన టి.సుబ్బరామిరెడ్డి మొదటి మూడు రౌండ్ల ఫలితాలు వెలువడిన వెంటనే తిరుగుముఖం పట్టారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఫలితాలపై ప్రశ్నించగా మాట్లాడ్డానికి నిరాకరించారు. కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్‌దే హవా

నెల్లూరు లోక్‌సభ పరిధిలో రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ హవా కొనసాగింది. కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తమ ప్రతిష్టను నిలుపుకునేందుకు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, మహీధర్‌రెడ్డి సర్వశక్తులూ ఒడ్డారు. భారీ ఎత్తున డబ్బు, నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆనం సొంత నియోజకవర్గం ఆత్మకూరులో 33 వేల పైచిలుకు ఓట్ల్ల మెజారిటీ వచ్చింది. అలాగే మున్సిపల్ మంత్రి సొంత నియోజకవర్గం కందుకూరులో 29 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. మహీధర రెడ్డి స్వగ్రామం మాచవరంలో వెయ్యి ఓట్లకుపైగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ రావడం చర్చనీయాంశమైంది.

కోవూరులో పెరిగిన మెజారిటీ

కోవూరు శాసనసభస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అత్యధికంగా 51,468 ఓట్ల ఆధిక్యం లభించింది. కోవూరు ఉప ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఇది రెట్టింపు. దీన్నిబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ బలం పెరిగినట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డి స్వగ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉండడం గమనార్హం. కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయంతో ప్రారంభమైన హవా ఈ ఉప ఎన్నికల్లోనూ కొనసాగింది.

ప్రజలు గొప్పతీర్పు ఇచ్చారు: మేకపాటి

రాజశేఖరరెడ్డిపై అభిమానం, జగన్‌మోహన్ రెడ్డిపైన విశ్వాసంతో ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని, ఈ తీర్పు ఆ పార్టీ నేతలకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి మమతా బెనర్జీ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఫోన్‌లో సంప్రదించారన్నారు.

పాయకరావుపేట..14,362 టీడీపీ కోట బద్దలు

మూడో స్థానంలో కాంగ్రెస్ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు తన సమీప టీడీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 14,362 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమన మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు జరిగిన మొత్తం 17 రౌండ్లలో 13 రౌండ్లు వైఎస్సార్ కాంగ్రె స్ ఆధిక్యత కొనసాగింది. 1983 నుంచి వరుసగా ఆరు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బాబూరావు గెలిచారు. నాడు కూడా తెలుగుదేశం అభ్యర్థి చెంగల వెంకట్రావుపైనే గెలుపొందడం మరో విశేషం. అయితే నాటి మెజారిటీ కంటే నేటి మెజారిటీ భారీ స్థాయిలో ఉండడంతో.. టీడీపీ కంచుకోట పూర్తిగా బద్దలైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ ఎన్నికకు ప్రభుత్వోద్యోగుల నుంచి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా రాకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

లెక్కల్లోకి ఎక్కని ఓట్లు

శుక్రవారం లెక్కింపు సందర్భంగా ఒక ఈవీఎం సీల్ లేకుండా ఖాళీగా దర్శనమిచ్చింది. ఆరా తీయగా పోలింగ్ రోజున ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో 190వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఒక ఈవీఎం మరమ్మతులకు గురవడంతో కొత్త ఈవీఎంను పెట్టారు. కానీ పోలింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్‌రూమ్‌కు పొరపాటున పనిచేయని ఈవీఎంను అప్పగించారు. దీంతో సీల్ ఉన్న ఈవీఎంను పక్కనబెట్టి సీల్‌లేని ఖాళీ ఈవీఎంను కౌంటింగ్‌లో వుంచడం వల్ల ఇదంతా జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు. బరిలో ఉన్న అభ్యర్థుల నుంచి అభ్యంతరం లేకపోతే ఈ ఓట్లను పరిగణనలోకి తీసుకోనవసరం లేదని ఈసీ నుంచి సమాచారం అందడంతో ఆ మేరకు అధికారులు దాన్ని అలాగే ఉంచేశారు. దీంతో 597 ఓట్లు ఎవరి ఖాతాలో చేరకుండా పోయాయి. కాగా సంబంధిత ప్రిసైడింగ్ అధికారిపై ఈసీ చర్యకు ఆదేశించింది.

ప్రజలకు అంకితం: బాబూరావు


తన గెలుపు దివంగత వైఎస్సార్‌కు, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులకు అంకితమని గొల్ల బాబూరావు అన్నారు. పేట ప్రజలు చూపిన అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ధర్మానికి అధర్మానికి, విశ్వాసానికి వంచనకు మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు విశ్వాసానికి, ధర్మానికి మద్దతు ప్రకటించారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడిన పాలక ప్రతిపక్షాలకు కనువిప్పు కావాలన్నారు. ప్రజలు తమ తీర్పు ద్వారా జగన్ నిర్దోషి అని చాటి చెప్పారన్నారు. ఈ ఫలితాలు ద్వారా ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. విజయమ్మ, షర్మిల ప్రచారం తన

ఉదయగిరి.. 30,598



వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 30,555 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉదయగిరి అసెంబ్లీ స్థానం ఆవి ర్భావం నుంచి ఇప్పటివరకూ ఎవ్వరికి రాని మెజారిటీ ఈయనకు లభించింది. ఇప్పటి వరకు ఉదయగిరి నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా చంద్రశేఖర్‌రెడ్డి రికార్డు సృష్టించారు.

ఇక వలసలే: చంద్రశేఖర్‌రెడ్డి

‘‘కాంగ్రెస్, టీడీపీలపై అటు ప్రజల్లో, ఇటు కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లింది. అందుకే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇక ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు వలసలబాట పట్టనున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లలో ఒక్క కార్యకర్త కూడా మిగిలే అవకాశం లేదు.

ప్రత్తిపాడు..16,781,కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

రెండోస్థానంలో టీడీపీ 
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత.. సమీప టీడీపీ అభ్యర్థిపై 16,781 మెజార్టీతో విజయదుందుభి మోగించారు. నియోజకవర్గ ఆవిర్భానంతరం నమోదైన రికార్డు మెజార్టీ ఇది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కందుకూరి వీరయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్‌బాబు పోటీ చేశారు. సుచరిత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలుకొని చివరి రౌండ్ వరకు అత్యధిక రౌండ్‌లలో ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు. 

ఏడో రౌండ్‌లో తెలుగుదేశం పార్టీ 98 ఓట్లు, ఎనిమిదో రౌండ్‌లో 1,020 ఓట్ల ఆధిక్యతను మాత్రం కనబరిచింది. జిల్లాలో మొట్టమొదటిసారిగా అధికార పార్టీ డిపాజిట్ పూర్తిస్థాయిలో గల్లంతయిం ది. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు సహా అనేక మంది ప్రముఖులు వచ్చి ప్రచారం చేసినా సుధాకర్‌బాబును గట్టెక్కించలేకపోయారు. ప్రతిపక్ష టీడీపీతో మ్యాచ్‌ఫిక్సింగ్ కూడా పనిచేయలేదు.

ప్రజాకోర్టులో జగన్ నిర్దోషి: సుచరిత

ప్రజాకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని ఉపఎన్నికల ఫలితాల ద్వారా తేటతెల్లమైందని మేకతోటి సుచరిత పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని నిలుపుకొనేలా జగనన్న నేతృత్వంలో పనిచేస్తానన్నారు. 

3 నెలల్లో తెలంగాణ తేవాలి

= లేనిపక్షంలో బిక్షపతితో రాజీనామా చేయించాలి
= టీఆర్‌ఎస్‌కు కొండా సురేఖ డిమాండ్

పరకాల(వరంగల్), న్యూస్‌లైన్: పరకాలలో టీఆర్‌ఎస్ గెలిస్తే మూడునెలల్లో తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెప్పినట్లుగా ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో.. పరకాలలో గెలి చిన మొలుగూరి బిక్షపతి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ అన్నారు. ఆమె శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ... ‘‘టీఆర్‌ఎస్ వాళ్లు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులను పల్లెల్లోకి తీసుకొచ్చి ప్రచారం చేయించారు. ఇక విద్యార్థి, జేఏసీల పేరుతో బస్సుయాత్రలు, రెచ్చగొట్టే ఫొటోలు, వాల్‌పోస్టర్లతో మాపై దుష్ర్పచారం సాగించారు. అయినప్పటికీ.. ఈ తీర్పుతో నైతికంగా మేమే గెలిచాం’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ క్రాస్‌ఓటింగ్ వల్ల చివరి నిమిషంలో ఓటమి పాలయ్యామని ఆమె చెప్పా రు. అయినా ప్రజలు తమను ఆదరించినందుకు గర్వపడుతున్నామన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు తననే గెలిపిస్తారనే నమ్మకముందన్నారు.

‘చిరు’ లాభమూ లేదు.. అంతా నష్టమే!

పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ బలమే తగ్గిపోయింది
2009 ఎన్నికల ఫలితాలతో పోల్చితే కాంగ్రెస్‌కుఇప్పుడొచ్చినవి సగం ఓట్లే!
18 స్థానాల్లో కాంగ్రెస్, పీఆర్పీల ఓట్లకు 10.12 లక్షల గండి
తేలిపోయిన చిరంజీవి బలం.. 
విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం శూన్యం
చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతిలోనూ బోర్లాపడ్డ కాంగ్రెస్

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఎటువంటి ప్రయోజనం కలగకపోగా, పెద్ద నష్టమే జరిగిందని ఈ ఉప ఎన్నికల్లో తేలిపోయింది. కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని చిరంజీవి సినీ గ్లామర్‌తో గట్టెక్కించుకోవాలన్న ఢిల్లీ పెద్దల ఆశలు అడియాశలయ్యాయి. చిరంజీవి సత్తా ఏమిటో ఈ ఎన్నికలు తేల్చేశాయి. 

చిరంజీవిని అందలమెక్కించి రాజ్యసభకు పంపినా, కించిత్తు ఉపయోగం లేకపోయింది. పైగా, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తిరుపతి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ బోర్లాపడింది. 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, పీఆర్పీ విడివిడిగా పోటీ చేసి గెలుచుకున్న స్థానాల్లోనే ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగాయి. ఇటీవల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. అంటే.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ బలానికి పీఆర్పీ బలమూ తోడవ్వాలి. కానీ, ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే చాలా తక్కువ వచ్చాయి. పైగా, ఈ రెండు పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకులో 63 శాతం మేరకు పెద్ద గండే పడింది.

ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్, పీఆర్పీలకు చెందిన చిన్నాచితకా నేతలందరూ ఈ ఉప ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశారు. అయినప్పటికీ, అధికారంలో ఉండీ రెండు పార్టీల బలంతో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచిన ఆరు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. మిగిలిన చోట్ల కూడా 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, పీఆర్పీ రెండింటికీ వచ్చిన ఓట్లకంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల సంఖ్య అతి తక్కువ. రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉండే మూడు ప్రధాన సామాజికవర్గాల ఓటర్లు ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలోనూ విలీనం ప్రభావం నామమాత్రంగా కూడా కనపడలేదు. 2009 ఎన్నికల్లో ప్రత్తిపాడులో కాంగ్రెస్‌కు 66,324 ఓట్లు, పీఆర్పీకి 33,889 ఓట్లు వచ్చాయి. 

అంటే.. అక్కడ రెండు పార్టీల బలం 1,00,213 ఓట్లు. కానీ, ఈ ఉప ఎన్నికల్లో పీఆర్పీ ఓట్లతో కలిపి కాంగ్రెస్‌కు వచ్చినవి 15,908 మాత్రమే. ఇదే సమయంలో.. గతంలో కాంగ్రెస్, పీఆర్పీల నుంచి గెలిచి, ఆ తరువాత బయటకు వచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాత్రం ఓట్లు గణనీయంగా పెరిగాయి. ఒకటెండ్రు మినహా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గతంలో కాంగ్రెస్ లేదా పీఆర్పీ అభ్యర్థులుగా వారు తెచ్చుకున్న ఓట్లకన్నా 20 వేలకంటే ఎక్కువ తెచ్చుకోగలిగారు. గతంలో చిరంజీవి 15 వేల మెజార్టీతో గెలిచిన తిరుపతిలో ఇప్పుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరుణాకర్‌రెడ్డి 17 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున రామచంద్రపురం నుంచి పోటీ చేసి, ఇప్పుడు అదే స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈసారి 9 వేలకుపైగా ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగారు.

2009 ఎన్నికల్లో ఈ 18 స్థానాల్లో కాంగ్రెస్‌కు మొత్తం 10,74,870 ఓట్లు రాగా.. పీఆర్పీకి వచ్చినవి 5,38,042 ఓట్లు. ఈ స్థానాల్లో రెండు పార్టీల బలం 16,12,912 ఓట్లు. కానీ, ఈ రెండు పార్టీలు కలిసిపోయినా, ఈసారి వాటికి వచ్చిన ఓట్లు 6,00,441 మాత్రమే. అంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, పీఆర్పీలకు వచ్చిన ఓట్ల మొత్తంతో పోలిస్తే ఇప్పుడు 10,12,471 ఓట్లు తగ్గాయి. ఆ రెండు పార్టీల ఓట్లలో దాదాపు 63 శాతం ఓట్లకు ఈసారి గండిపడింది. 2009లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 55.8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. కాంగ్రెస్ ఓట్లలోనే దాదాపు 42 శాతం గండి పడింది. ఇదే సమయంలో రెండు పార్టీల నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన వారికి మొత్తంగా 12,87,986 ఓట్లు రావడం గమనార్హం.

ఆళ్లగడ్డ.. 36,795,టీడీపీ డిపాజిట్ గల్లంతు

టీడీపీ డిపాజిట్ గల్లంతు

ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ ఫ్యాన్ హవా కొనసాగింది. ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శోభా నాగిరెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్‌రెడ్డిపై 36,795 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డికి 20,374 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2,009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన శోభా నాగిరెడ్డికి 61,555 ఓట్లు రాగా.. ఈ ఉప ఎన్నికల్లో 88,697 ఓట్లు సాధించడం విశేషం. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీ అభ్యర్థులతో పాటు మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగారు.

ఇది ప్రజా విజయం..: శోభా నాగిరెడ్డి

ఈ గెలుపు ప్రజా విజయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాలు తమ సొంత పార్టీలా భావించాయి. అందుకే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలు పంచినా ప్రజాబలం ముందు అవేమీ పనిచేయవని రుజువైంది. పాలక, ప్రతిపక్షాలు ఏకమై జగన్‌పై చేసిన అసత్య ఆరోపణలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం నైతిక భాధ్యత వహించి ఎన్నికలకు రావాలి.

ఆ రెండు పార్టీల ఉమ్మడి ఓట్లకన్నా..వైఎస్సార్ కాంగ్రెస్‌కు 1.59 లక్షల ఓట్లు ఎక్కువ

నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక ప్రజాదరణతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులకు కలిపి వచ్చిన ఓట్లకన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 1.59 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 8,44,131 ఓట్లు రాగా.. టీడీపీకి 8,20,256 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు కలిపి మొత్తం 16,64,387 ఓట్లు రాగా.. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే 18,23,422 ఓట్లు వచ్చాయి. 

కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేసినా కొన్ని చోట్ల అంతర్గతంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా.. ఆ రెండు పార్టీలనూ ఉమ్మడిగా కలిపి చూసినా కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రజాదరణ పొందటం విశేషం. అలాగే.. నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 48.88 శాతం ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 22.63 శాతం ఓట్లు రాగా టీడీపీకి 21.99 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీలకు కలిపి వచ్చిన ఓట్లు శాతం 44.62 గా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతంలో సగం కూడా సాధించలేని స్థితికి దిగజారినట్లు ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఇటు కాంగ్రెస్, అటు టీడీపీలకు చెందిన ఓటు బ్యాంకును వైఎస్సార్ కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 

చేతిలో సైకిల్

రామచంద్రపురం, నరసాపురం ఫలితాలే నిదర్శనం
టీడీపీకి డిపాజిట్లు గల్లంతు, ఆ మేరకు కాంగ్రెస్‌కు ఓట్లు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ బంధం ఈ ఉప ఎన్నికల్లో మరింతగా చిక్కబడింది! ఎంతగా అంటే.. కాంగ్రెస్ కోసం టీడీపీ తమ డిపాజిట్లను కూడా త్యాగం చేసేంతగా! ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తన ఓట్లను వీలైనంతగా కాంగ్రెస్ పార్టీకి వేయించడం ద్వారా ఆ పార్టీని గెలిపించేందుకు యథాశక్తి పాటుపడింది. ఈ వైనానికి రామచంద్రపురం, నరసాపురం నియోజకవర్గాల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రెండు చోట్లా టీడీపీ డిపాజిట్‌ను కోల్పోగా, ఆ పార్టీ నుంచి బదిలీ అయిన ఓట్ల సాయంతో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టెక్కారు. 

రామచంద్రపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వచ్చిన ఓట్ల కంటే ఈసారి దాదాపు తొమ్మిది వేల ఓట్లు ఎక్కువగా సాధించుకున్నారు. అయినా కేవలం కాంగ్రెస్, టీడీపీ పకడ్బందీ మ్యాచ్‌ఫిక్సింగ్ కారణంగా ఆయన ఓటమి పాలయ్యారు. బోస్‌కు 2009లో 56,589 ఓట్లు రాగా ఈసారి 65,373కి పెరిగాయి. కానీ టీడీపీకి 2009లో 23,252 ఓట్లు రాగా, ప్రస్తుతం కేవలం 6,256 ఓట్లతో డిపాజిట్ కూడా కోల్పోయింది! టీడీపీకి తగ్గిన ఈ ఓట్లు ఈసారి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ కారణంగానే కాంగ్రెస్ 11,919 మెజార్టీతో గెలిచింది. అలాగే నరసాపురంలో కూడా టీడీపీ తన ఓట్లను భారీగా కాంగ్రెస్‌కు వేయించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకున్నట్టు స్పష్టమవుతోంది. సుదీర్ఘ కాలంపాటు టీడీపీలో ముఖ్య నేతగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి, ఆ పార్టీ తరఫున నరసాపురంలో పోటీ చేశారు. ఆయనతో పాటే స్థానిక టీడీపీ నేతలు, శ్రేణులు కూడా పీఆర్పీలోకి మారారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఎన్నికల్లో అక్కడ టీడీపీ 10,841 ఓట్లు సాధించింది. అలాంటిది, ఈ మూడేళ్లలో స్థానిక నాయకత్వాన్ని, క్యాడర్‌ను పటిష్టపరుచుకుని కాస్తోకూస్తో మెరుగైన ప్రదర్శన కనబరచాల్సింది పోయి.. తాజా ఉప ఎన్నికలో టీడీపీ కేవలం 8,813 ఓట్లకే పరిమితమైంది. అది పథకం ప్రకారం తన ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి బదలాయించిందని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఫలితంగా నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాదరాజు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

వారిద్దరూ టీడీపీ పాతకాపులే: రామచంద్రాపురం, నరసాపురం కాంగ్రెస్ అభ్యర్థులు తోట త్రిమూర్తులు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఇద్దరూ టీడీపీ మాజీ నేతలే. ఆ కారణంగానే ఇరు పార్టీల పెద్దల మ్యాచ్‌ఫిక్సింగ్‌కు స్థానిక టీడీపీ కార్యకర్తల స్థాయి నుంచీ కూడా మంచి సహకారం లభించిందని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. నిజానికి రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. కాబట్టి మామూలుగానైతే ఆ సామాజిక వర్గ ఓట్లలో చీలిక ఉండాలి. కానీ అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థులకు 2009లో కంటే ఈసారి ఓట్లు గణనీయంగా తగ్గి, అదే మోతాదులో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి గంపగుత్తగా పడ్డట్టు ఓటింగ్ సరళి స్పష్టం చేస్తోంది.

Popular Posts

Topics :