15 May 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

గంగమ్మా.. జగనన్నకు మరింత శక్తినివ్వు

Written By news on Friday, May 20, 2016 | 5/20/2016


గంగమ్మా.. జగనన్నకు మరింత శక్తినివ్వు
తాతయ్యగుంట గంగ మ్మకు భూమన ప్రత్యేక పూజలు
 
తిరుపతి (మంగళం): ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నే త వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి మరిం త శక్తిని ప్రసాదించు గంగమ్మ తల్లి అంటూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వేడుకున్నా రు. గురువారం తాతయ్యగుంట గం గమ్మను ఆయన దర్శించుకుని, ప్రత్యే క పూజలు చేయించారు. ఆలయ చైర్మన్ సుబ్రమణ్యం ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి అయితే ఆంధ్ర రాష్ట్రానికి చుక్క నీళ్లు రావని జగనన్న మూడు రోజులు జలదీక్ష చేశారన్నారు.


దీనికి లక్షలాది మంది రైతులు, ప్రజలు మద్దతు తెలపడం సంతోషిం చదగ్గ విషయమన్నారు. ఆంధ్రాకు అన్యాయం జరుగుతుందని తెలిసినా సీఎం చంద్రబాబు నోరుమెదపడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆయనకు సొంతలాభాలే  ముఖ్యమని విమర్శించారు. ప్రత్యేక హోదాపైకేంద్రాన్ని ఎదురించే ధైర్యం లేక  చేతగాని సీఎంగా నిలుస్తున్నారని విమర్శించారు.

కాపు భవనాలకు బాబు పేరా!


కాపు భవనాలకు బాబు పేరా!
♦ మండిపడిన వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు
♦ సావిత్రి, సీకే నాయుడులాంటి కాపు ప్రముఖుల పేర్లెందుకు పెట్టరు?
♦ కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ వారిని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాపుల కోసం నిర్మించే భవనాలకు ‘చంద్రన్న కాపు భవనాలు’ అని పేరు పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల్లో జాతీయ స్థాయిలోనే పహిల్వాన్‌గా ఖ్యాతి గడించిన కోడి రామ్మూర్తినాయుడు, జాతీయోద్యమంలో పోరాడిన కన్నెగంటి హనుమంతు,ఎన్టీఆర్ కన్నా గొప్ప నటుడైన ఎస్వీ రంగారావు, భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సీకే నాయుడు, మహానటి సావిత్రి వంటి ఎందరెందరో ప్రముఖులుంటే వారి పేర్లను కాదని కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టుకోవడం ఏమిటని ధ్వజమెత్తారు.
ఈ భవనాలను చంద్రబాబు నారావారిపల్లిలోని తన ఆస్తిలో నుంచి తీసి కట్టించడం లేదని ప్రభుత్వ సొమ్ముతో కాపుల సంక్షేమం కోసం నిర్మిస్తున్న ఈ భవనాలకు ఆయన పేరు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం జారీ చేసి జీవో నెంబరు 16లో ఈ భవనాలతో పాటుగా అనేక పథకాలను చంద్రన్న పేరుతో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
 కాపులపై చిత్తశుద్ధి లేదు
కాపులకు రిజర్వేషన్లు ఇస్తాననీ హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారని అంబటి విమర్శించారు.  కాపుల సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ జలదీక్షపై భూమా నాగిరెడ్డి చేసిన విమర్శలను ప్రస్తావించగా... ఆయనకు సిగ్గుంటే ముందు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి  మాట్లాడాలన్నారు.

తెలుగువారి భావోద్వేగాలకు అద్దంపట్టిన జలదీక్ష


 వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ

అమృతలూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడ్రోజులుగా కర్నూలులో చేపట్టిన ‘జలదీక్ష’ తెలుగు ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నిలిచిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున చెప్పారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రను ఎడారిగా మార్చేలా ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరోధించడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఓటుకు నోటు వ్యవహారం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో కేసీఆర్‌కు బానిసగా మారి తెలుగు వారి పరువు తీశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రత్యేక హోదాపై నిలదీయలేక కేంద్రం వద్ద సాగిలపడి రాష్ట్రానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ రాష్ట్రాలో ప్రాజెక్టులు కడితే, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని, భావితరాల ప్రజల కోసం జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్ష చేపట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం భారతదేశంలో 27 దీక్షలు చేపట్టిన ఘనత తమ నాయకుడుకే దక్కుతుందని మేరుగ తె లిపారు.

కేసీఆర్ , మోదీలను అడిగే ధైర్యంలేదు

Written By news on Wednesday, May 18, 2016 | 5/18/2016


కేసీఆర్ , మోదీలను అడిగే ధైర్యంలేదు
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగే ధైర్యం, దమ్ము ఏపీ సీఎం చంద్రబాబుకు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తారని భావించామని, ఆయనకు ఆ ధైర్యం కూడా లేదని అన్నారు. కేసీఆర్ ను అడిగితే ఓటుకు నోట్లు కేసు బయటకు తీసి, జైల్లో పెడతారని చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు. అక్రమ ప్రాజెక్టుల గురించి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రత్యేక హోదా గురించి మోదీతో గట్టిగా మాట్లాడితే.. 24 నెలల్లో చేసిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తారని చంద్రబాబుకు భయమని వైఎస్ జగన్ ఆరోపించారు. కృష్ణా, గోదావరిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ, ఏపీకి అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు నోరెత్తకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ కర్నూలులో మూడురోజులుగా చేసిన జలదీక్ష బుధవారం ముగిసింది. పార్టీ నేతలు, రైతులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు.

జలదీక్ష శిబిరం వద్దకు తరలివచ్చిన వేలాదిమంది ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. మనకు రావాల్సిన నీళ్ల కోసం మనమందరం కలసి కట్టుగా పోరాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి కలసి కట్టుగా పోరాడాలని, ఇందుకు మీ అందరి దీవెనలు కావాలని కోరారు. ఇంకా నెల, రెండు నెలలు చూసి ఎలాంటి మార్పు రాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈసారి గోదావరి నీళ్ల కోసం పోరాటం చేస్తామని, పోలవరం వేదికగా మరో దీక్ష చేపడుతామని చెప్పారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..

 
  • ఎండలు తీవ్రంగా ఉన్నా, మండుతున్న ఎండలను ఖాతరు చేయకుండా, ముఖంలో చిరునవ్వు చూపిస్తూ ఇంతటి ఆత్మీయతను, ప్రేమానురాగాలు చూపిస్తున్న ఇక్కడున్న ప్రతి అక్కచెల్లెమ్మలకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, అవ్వతాతలకు, ఇక్కడికి వచ్చిన వారికే గాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేతులెత్తి, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
  • మూడురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నాం. మన బాధలు, గోడు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన గోడు విని వారిలో మార్పు వస్తుందేమోని పోరాడుతున్నాం
  • అన్యాయం జరుగుతోంది కాబట్టి ఇవాళ మనమందరం ఇక్కడికి వచ్చి గళం విప్పుతున్నాం
  • కేసీఆర్ ను ఒక్క మాట అడుగుతున్నా. మొన్నటి వరకు మనం కలసి ఉన్నాం, తెలుగే మాట్లాడుతున్నాం, ఒకే రాష్ట్రంగా ఉన్నాం. ఆ రోజు మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మనమందరం కలసి పోరాడిన విషయం గుర్తురాలేదా?
  • కేసీఆర్ గారూ మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఇవాళ మీరు కూడా పై రాష్ట్రాల మాదిరే చేస్తున్నారు.
  • మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రాజెక్టులు నిండితే గానీ కిందకు నీళ్లు రాని పరిస్థితి. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ఎక్కడకక్కడ ప్రాజెక్టులు కడుతుంటే కింద ఉండే రైతులకు నీళ్లు ఎలా వస్తాయి?
  • కేసీఆర్ గారూ మా రాష్ట్రం తెలంగాణపైన ఉండి మేం నీళ్లు ఆపుంటే మీకు నచ్చేదా?
  • ఇవాళ కావాల్సింది అందరూ కలసికట్టుగా ఉండటం. మనంమనం తన్నుకుని గొడవలు పడటం కాదు
  • వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, అన్యాయం జరగకుండా చూడాలి
  • పైరాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక పాలకులు కూడా ఆలోచించాలి
  • పైన వర్షాలు పడినప్పుడు మా నీళ్లు మేమే తీసుకుంటామంటే కిందివారి పరిస్థితి ఏమిటో ఆలోచించాలి
  • మహారాష్ట్ర, కర్ణాటక నీళ్లు కిందకు ఇవ్వకుంటే తెలంగాణ పరిస్థితి ఏంటి?
  • ప్రతి వర్షం చుక్కలో దామాషా పద్ధతి ప్రకారం ఎవరివాటా ఎంత అని లెక్కలు కట్టి, ఎవరి వాటా నీళ్లు  వాళ్లు వాడుకుని మిగిలిన నీళ్లను కిందకు వదలాలి
  • కృష్ణా నది మహబూబ్ నగర్ జిల్లాను దాటుకుని కర్నూలు జిల్లాకు రావాలి
  • మహబూబ్ నగర్ జిల్లాలో 800 అడుగుల ఎత్తున రోజుకు 30 వేల క్యూసెక్కుల నీళ్లను తోడుకుంటే కిందకు నీళ్లు ఎలా వస్తాయి?
  • గోదావరి నీళ్లు కిందకు రాకుండా తెలంగాణలో ఎడాపెడా ప్రాజెక్టులు కడుతున్నారు
  • కేసీఆర్ గారూ అధికారం చేతిలో ఉందని పేదవాళ్లమైన మాపై ప్రతాపం చూపడం భావ్యమేనా?
  • ఈ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా అని అడుగుతున్నా?
  • శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రాకుంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగడానికి నీళ్లు కూడా ఉండవు
  • గోదావరిలో రోజుకు 70 వేల క్యూసెక్కులు నీరు వాడుకుంటే కింద ఉన్న ఆయకట్టు పరిస్థతి ఏంటి?  
  • ఈ అన్యాయంపై చంద్రబాబు పోరాడుతాడని అనుకుంటే ఆయన నోట ఏ మాటా రాదు. ఎటువంటి పోరాటం చేయడం లేదు
  • కేసీఆర్ ను గట్టిగా అడిగితే ఓటుకు నోటు కేసు బయటకు తీసి, జైల్లో పెట్టిస్తాడని చంద్రబాబుకు భయం
  • పోనీ ఢిల్లీ వారినైనా, ప్రధాని మోదీనైనా అడుగుతారా అంటే అదీలేదు
  • మోదీకి అల్టిమేటమ్ ఇచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు
  • ఎందుకంటే చంద్రబాబు 24 నెలల్లో చేసిన అవినీతిపై సీబీఐ విచారణ వేయిస్తారని భయం
  • చంద్రబాబుకు కేసీఆర్ ను అడిగే ధైర్యం లేదు, మోదీని అడిగే ధైర్యం లేదు
  • అడిగే ధైర్యం లేనపుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లావని చంద్రబాబును అడుగుతున్నా
  • మోదీతో సమావేశమయ్యాక ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం అని ఆయనే అంటారు
  • కేసీఆర్ అడ్డుగోలుగా కడుతున్న ప్రాజెక్టులపై మోదీకి ఫిర్యాదు చేస్తారని ఆశించాం
  • తీరా చూస్తే ఫిర్యాదు కథ దేవుడెరుగు.. తెలంగాణ ప్రాజెక్టులపై ఓ విలేకరి చంద్రబాబును అడిగితే.. అన్ని అనుమతులు తీసుకుని కట్టాలి, కేంద్రం పరిష్కరించాలి అని అన్నారు
  • ఇవన్నీ మాకు తెలీవా అని చంద్రబాబును అడుగుతున్నా
  • వాళ్లు ప్రాజెక్టులు కడుతుంటే నువ్వేమి చేస్తున్నావని అడుగుతున్నా
  • ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటు
  • చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక అడ్డుగోలుగా ప్రాజెక్టులు కట్టినా ఏమీ చేయలేకపోయాడు
  • ఇవాళ తెలంగాణ అదే పనిచేస్తుంటే చంద్రబాబు నోరుమెదపడం లేదు
  • తాగడానికి నీళ్లు దొరకవని ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నారు
  • మనకు జరుగుతున్న అన్యాయంపై మనమందరం కలసి కట్టుగా పోరాడాలి
  • వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి కలసి కట్టుగా పోరాడాలి. ఇందుకు మీ అందరి దీవెనలు కావాలి
  • ఇంకా నెల, రెండు నెలలు చూసి ఎలాంటి మార్పు రాకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాం
  • ఈసారి గోదావరి నీళ్ల కోసం పోరాటం చేస్తాం, పోలవరం వేదికగా మరో దీక్ష చేపడుతాం
  • ఎండను లెక్కచేయకుండా ఇంతటి ఆప్యాయతను చూపిన అందరికీ చేతులు జోడించి, శిరస్సు వహించి నమస్కరిస్తున్నా

మీ పార్టీలో మాడాలున్నారని ఒప్పుకోండి


మీ పార్టీలో మాడాలున్నారని ఒప్పుకోండి..
కర్నూలు :
''మీ పార్టీలో ఆడా మగా కాని మాడాలున్నారని ఒప్పుకొంటే.. మీ పార్టీని కూడా జగనే నడిపిస్తారు.. అంతే తప్ప సంతలో పశువులను కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనడం సరికాదు'' అని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్ష మూడోరోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బతికున్న వ్యక్తి పేర్లను పథకాలకు పెట్టుకుంటున్న దౌర్భాగ్యం ఇక్కడ తప్ప ఎక్కడా చూడలేదని చెవిరెడ్డి అన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న మజ్జిగ.. ఇలా అన్నింటికీ ఆయన పేర్లే పెట్టుకుంటున్నారని, ఇక శిలావిగ్రహాలు పెట్టుకోవడం ఒక్కటే మిగిలిందని విమర్శించారు. ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో కూడా జనం ఆయనను నమ్మడం లేదని.. జగన్ నాయకత్వాన్నే నమ్మారని, అందుకే తనను అక్కడి ఎమ్మెల్యేగా ఎన్నుకొన్నారని చెవిరెడ్డి చెప్పారు.

చంద్రబాబు ప్రతి ఒక్కరినీ మోసం చేస్తూనే ఉన్నారని, తొలుత పిల్లనిచ్చిన మామను, తర్వాత సొంత తమ్ముడిని, ఆపై తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును, 2009 ఎన్నికల్లో వాడుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను అందరినీ మోసం చేశారని గుర్తు చేశారు. ఇలా అందరూ చంద్రబాబు చేతిలో మోసపోతే మీరెందుకు అక్కడికి పోతున్నారని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. తాత్కాలికంగా వాళ్లిచ్చిన డబ్బులు ఎంతకాలం ఉంటాయని అడిగారు. టీడీపీలోకి వెళ్లిన ఒక ఎమ్మెల్యే తనకు ఫోన్ చేశారని, ఆయన చెప్పిన మాటలను ప్రస్తావించారు. ''జగనన్నతో ఒక మాట చెప్పు, నేను పార్టీలో చేరినప్పుడు నా చుట్టూ నాయకులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు అంతా ఉండి చాలా గౌరవించారు. కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది. నాలుగు ఫైళ్లు పట్టుకుని కలెక్టర్ దగ్గరకు వెళ్తే మంత్రులతో చెప్పిస్తే పనిచేస్తా అన్నారు. మంత్రుల వద్దకు వెళ్తే నువ్వు చంద్రబాబు కొనుక్కున్న మనిషివి, ఆయన దగ్గరకే వెళ్లమన్నారు. ఆయన దగ్గరకు వెళ్తే కలెక్టర్ వద్దకు వెళ్లు, చెబుతా అన్నారు. ఇలా నా పని వాళ్ల చుట్టూ వీళ్ల చుట్టూ తిరగడమే అవుతోంది. వాళ్లిచ్చిన డబ్బు మళ్లీ తిరిగి వాళ్లకే ఇచ్చేస్తా.. మళ్లీ పార్టీలోకి వస్తా'' అన్నారని, అయితే.. అలా వెళ్లినవారిని తిరిగి తీసుకోవడం భావ్యం కాదని వైఎస్ జగన్ అన్నారని భాస్కర్ రెడ్డి తెలిపారు.

ఒకప్పుడు రాత్రి పూట తాగే వ్యక్తి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేయడంతో పగలు, రాత్రి అంతా తాగుతూనే ఉన్నారని, రాజ కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి ఇటీవల వైజాగ్ విమానాశ్రయంలో కనిపించారని, ఆయన ముందుకు, వెనక్కి వెళ్లలేక మిన్నకున్నారని అన్నారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి వెళ్లిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉందని, వాళ్లకు జ్ఞానోదయం అయినా భవిష్యత్తు మాత్రం లేదని అన్నారు. జాతరలో బలిచ్చే దున్నపోతు పరిస్థితి శుక్రవారం నుంచి సోమవారం వరకు బ్రహ్మాండంగా ఉంటుందని, దానికి దండలు వేసి, పూజలు చేస్తారని.. కానీ మంగళవారం ఒకే వేటుకు గంగానమ్మ వద్ద నరికేస్తారని చెవిరెడ్డి అన్నారు. అలా మొదట వీళ్లను బాగా మేపి, ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ప్రజల పక్షానే ఉంటానంటూ జగన్ నడుస్తున్నారని, ఇది మనమంతా కళ్లతో చూస్తున్నామని అన్నారు.

70 ఏళ్లు వస్తున్నా బాబుకు సిగ్గు లేదు: కొడాలి నాని

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 70 ఏళ్ల వయస్సు వస్తున్నా సిగ్గు, శరం లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన కర్నూలు జలదీక్షలో ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దమ్ము, ధైర్యముంటే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటిముందు ధర్నా చేయడానికి ముందుకు రావాలని, తాము కూడా వస్తామని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ జలదీక్ష ఎందుకు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రులకు మాత్రం తెలియడంలేదని ఎద్దేవా చేశారు. రోజుకు తెలంగాణ ప్రభుత్వం 20 - 30 వేల క్యూసెక్కుల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా కళ్లుండి చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోదీని ధైర్యంగా అడగలేక గాలి తిరుగుళ్లు తిరుగుతూ.. మోదీ దగ్గర చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నారని మండిపడ్డారు.

 తెలంగాణ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం వైఎస్ జగన్ పోరాట యోధుడిలా దీక్ష చేస్తున్నారని కితాబిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా అభివృద్ధి పేరుతో టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితేనే వాళ్ల నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. అలా అయితే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా అని కొడాలి నాని అన్నారు. దమ్ముంటే సోనియాగాంధీని వైఎస్ జగన్ ఎదిరించి పోరాడినట్లు, చంద్రబాబు మోదీని ఎదిరించి పోరాడాలని సూచించారు.

చంద్రబాబు వారం రోజుల విదేశీ యాత్రల పేరుతో పనామా పేపర్ల అంశాన్ని సెటిల్ చేసుకున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే ఆయన బినామీ ప్రసాద్ పేరు పనామా పేపర్లలో ఉందని నాని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా వచ్చిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు. కృష్ణా జిల్లాలో కాలువల నిర్మాణం కోసం వైఎస్ ఆర్ ఎంతో కృషి చేశారని.. టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుపడే ప్రయత్నం చేసినా ఆయన దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.

గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం తానే చేసినట్లు చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని అన్నారు. ప్రకాశం, పులిచింతల, నాగార్జున సాగర్ లకు నీరు ఎలా అందిస్తారో అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ దీక్షను మంత్రులు విమర్శలు చేయడంపై నాని తీవ్రంగా తప్పుపట్టారు. డ్రామా దీక్షలంటే చంద్రబాబు హాయాంలో 70  మంది ఎమ్మెల్యేలతో కర్ణాటక ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడ నుంచి ముంబాయి వెళ్లి తిరిగిరావడమని ఎద్దేవా చేశారు. బాబు మనిషిగా పుడితే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కొడాలి నాని సవాల్ విసిరారు.

మూడో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరాహార దీక్ష


మూడో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరాహార దీక్ష
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందన వస్తోంది. కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఏపీకి జరుగుతున్న జల అన్యాయాన్ని తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ చేస్తున్న నిరాహారదీక్షకు రెండో రోజు జిల్లాల నుంచి జనం పోటెత్తారు. కర్నూ లు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, జనం భారీగా తరలివచ్చి ప్రియతమ నేత వైఎస్ జగన్ కు మద్ధతు తెలిపారు.


తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ సాగిస్తున్న నిరాహారదీక్షకు వెల్లువలా మద్దతు లభిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల దీక్షలు, ధర్నాలతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మండలకేంద్రాలు దద్దరిల్లాయి. అనేక మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలకు మద్దతు పలకడం విశేషం. ఉదయం ఎనిమిది గంటల నుంచే వైఎస్ జగన్ దీక్షా వేదిక వద్ద తన కోసం వచ్చిన జనాన్ని కలుసుకుంటున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయకుండా దూర ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చి దీక్ష వద్ద కూర్చుని మద్ధతుగా నిలుస్తున్నారు. మంగళవారం పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తరలివచ్చి వైఎస్ జగన్ చేస్తున్న జలదీక్షకు మద్దతు ప్రకటించారు.

వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి


హరీశ్ రాజీనామా చేయాలి
♦ మంత్రిగా ఉండి బెదిరింపులా..: వైఎస్సార్‌సీపీ
♦ ఏపీ ప్రయోజనాల కోసం జగన్ దీక్ష చేస్తున్నారు
♦ వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి
♦ అంతేగానీ దబాయింపులకు దిగడమేమిటని ప్రశ్న
♦ వైఎస్సార్‌సీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన
♦ నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు, నీటి వినియోగంపై తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... మానుకోట చేస్తా అంటూ హరీశ్‌రావు బెదిరింపులకు దిగడమేమిటని నిలదీసింది. మంత్రి హోదాలో ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా హెచ్చరికలు చేస్తున్న హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, గత రెండేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం ఎంత బడ్జెట్ విడుదల చేశాయో ప్రకటించాలన్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యాలయంపై దాడిని, హైదరాబాద్‌లో పలు చోట్ల వైఎస్సార్‌సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాచరికం అనుకుంటున్నారా?: నల్లా
‘సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ కొనసాగుతున్నదని అనుకుంటున్నారా? తామేమైనా అభినవ నిజాం నవాబు అనుకుంటున్నారా..’  అని నల్లా సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయిన హరీశ్‌రావు రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి మానుకోట పునరావృతమవుతుందంటూ హెచ్చరికలు చేయడం... రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు జగన్ దీక్ష చేస్తుంటే.. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమేమిటని నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి, జెండా గద్దెల కూల్చివేతను ఖండించారు.
వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి: రాఘవరెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో వైఎస్ ప్రారంభించిన 36 ప్రాజెక్టుల్లో ఆరు పూర్తికాగా, 9 నిర్మాణదశలో ఉన్నాయని.. 21 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు రూ.10వేల కోట్లు కేటాయిస్తే వాటన్నింటినీ పూర్తి చేసి ఏకంగా 49 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వొచ్చన్నారు. కానీ అవి పూర్తయితే వైఎస్‌కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే పక్కన పెట్టారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని జగన్ దీక్ష చేస్తున్నారని...
ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా మానుకోట పునరావృతం అవుతుందంటూ హరీశ్ హెచ్చరికలు చేయడం సరికాదని పేర్కొన్నారు. వీలైతే జగన్ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని.. అలాగాకుండా ఏవేవో మాట్లాడడం సమంజసం కాదన్నారు. పచ్చకామెర్ల రోగులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లుగా టీఆర్‌ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని రాఘవరెడ్డి విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు దిగిపోయి, డబ్బు వెదజల్లి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. సోమవారం జేఏసీ పేరిట కొందరు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే.. తాము ముందుండి అఖిలపక్షంతో కలసి ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు.

వైఎస్ జగన్ జలదీక్షకు పోటెత్తిన జనం

Written By news on Tuesday, May 17, 2016 | 5/17/2016


వైఎస్ జగన్ జలదీక్షకు పోటెత్తిన జనం
కర్నూలు: కృష్ణా జలాల నీటి మళ్లింపు, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు జనంపోటెత్తారు. వైఎస్ జగన్ చేస్తున్న నిరాహారదీక్ష మంగళవారం రెండోరోజుకు చేరుకుంది. కర్నూలులోని నంద్యాల రోడ్డులో కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఉన్న దీక్షావేదిక వద్దకు వేలాదిమంది ప్రజలు తరలిస్తూ వైఎస్ జగన్ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నారు. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అన్ని వర్గాల వారు సంఘీభావం తెలియజేస్తున్నారు. వైఎస్ జగన్ తో ఫొటోలు దిగి, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు. సోమవారం నుంచి వైఎస్ జగన్ మూడురోజుల పాటు నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

 వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు దీక్ష వేదిక వద్ద వైఎస్ జగన్ ను పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వేదికపై పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని, ఏపీ ప్రభుత్వం చేతగానితనాన్ని దుయ్యబట్టారు.

కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులన్నీ పూర్తయితే కింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోకి చుక్కనీరు కూడా రాదని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు తాగడానికి కూడా నీళ్లు దొరకవని చెప్పారు. చంద్రబాబు రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి రావాల్సిన నీటి వాటా కోసం అందరూ కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.  వైఎస్ జగన్ చేస్తున్న జలదీక్షకు ప్రతిఒక్కరూ సంఘీభావం తెలపాలని కోరారు.


Popular Posts

Topics :