16 August 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

Written By news on Thursday, August 20, 2015 | 8/20/2015


షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
షర్మిల యాత్రను విజయవంతం చేయాలి
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నేతలు
కొండా రాఘవరెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి
 

కాజీపేట రూరల్ : హన్మకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పరమార్శ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పర్యటించే షర్మిల పరమార్శ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తట్టుకోలేక 650 మంది మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి వైస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నల్ల కాల్వ వద్ద మాట ఇచ్చారని తెలిపారు. మాట తప్పని.. మడమ తిప్పని కుటుంబంలోని షర్మిల పరమార్శ యాత్రతో వారిని ఓదార్చనున్నట్లు తెలిపారు. షర్మిల ఈ నెల 24 నుంచి 28వ  తేదీ వరకు జిల్లాలో పరమార్శ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. షర్మిలకు జిల్లావాసులు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ పాలనలో రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో వెలుగులు నింపాయని.. అలాంటి మహానేతను వారి కుటుంబంను ప్రజలు ఎప్పటికి గుండెల్లో పెట్టుకుంటారన్నారు.

ఈనెల 24న ప్రారంభం
జిల్లాలో షర్మిల పరమార్శయాత్ర 24న ప్రారంభమై 28 వరకు సాగుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి అ న్నారు. జిల్లాలో 32 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముని గాల విలియం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికం టి శివ, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, జిల్లా అధికార ప్రతినిధులు అప్పం కిషన్, చల్లా అమరేందర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు దోపతి సుదర్శన్‌రెడ్డి, జిల్లా నాయకులు సంగాల ఈర్మియ, ముజఫరుద్దీన్ ఖాన్, శంకరాచారి, బద్రుద్దీన్ ఖాన్, మాదాడి చరణ్‌రెడ్డి, భీంరెడ్డి రవితేజరెడ్డి, అచ్చిరెడ్డి, తౌట్‌రెడ్డి మాధవరెడ్డి, నోముల జయపాల్‌రెడ్డి, పులుగాల గాంధీ, బొడ్డు శ్రావణ్, పిడిశెట్టి సంపత్, నిమ్మరబోయిన రమేష్, గౌరబోయిన సమ్మయ్య, ఆరేపెల్లి రాజు, రామేశ్వర చారి, లోకు రమేష్, యాకూబ్‌లు పాల్గొన్నారు.
 
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
 హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ైవె ఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో 30 మంది చేరారు. పార్టీలో చేరిన ప్రతిక్, గౌతం, ప్రమోద్, మనోహర్, సాయికృష్ణ, సాయిరాం, అనిల్, వంశీ, హరీష్, పవన్‌కల్యాన్, ఫయిముద్దీన్ తదితరులను రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. వైఎస్సార్ సీపీలో కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.
 

మూడు రోజుల పర్యటన విజయవంతం


పలకరింపులు..పరామర్శలు
♦ బిజీబిజీగా వైఎస్ జగన్ 
♦ మూడు రోజుల పర్యటన విజయవంతం

 సాక్షి, కడప : అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. కరచాలనం చేయాలని ఎగబడుతున్న వారికి చేయి అందిస్తూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ.. అధైర్య పడే  వారికి నేనున్నానంటూ ధైర్యం చెబుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తూ.. మృతుల కుటుంబ సభ్యులను ఓదారుస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం బిజీబిజీగా గడిపారు. పులివెందుల నుంచి ఉదయమే బయలుదేరిన వైఎస్ జగన్‌కు వీరపునాయునిపల్లె మండల సరిహద్దులో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.

అనంతరం వైఎస్ జగన్‌తోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు యు.రాజుపాలెం చేరుకొని మాజీ సర్పంచ్ పి.పెద్దచెన్నారెడ్డి (ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు) కుమారులు రామచంద్రారెడ్డి, రామసుందర్‌రెడ్డిలను పరామర్శించారు. కొత్తూరులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు అమరనాథరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఇటీవల రాలేకపోయిన జగన్.. బుధవారం ఆయన ఇంటికి వెళ్లి కాసేపు గడిపారు. సమీపంలో ఉన్న వెంకట్రామిరెడ్డి ఇం టికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తర్వాత పెండ్లిమర్రి మండలం గొందిపల్లెకు వెళ్లిన జగన్‌కు ఘన స్వాగ తం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న మార్కెట్ యార్డు మాజీ చెర్మైన్ చంద్రహాసరెడ్డి తండ్రి రామచెన్నారెడ్డిని పరామర్శించారు.

అనంతరం పులివెందులలోనిఇస్లాంపురంలో తండ్రి మృతి చెంది బాధలో ఉన్న మైనార్టీ నాయకుడు సాదక్‌వల్లిని పరామర్శిం చారు. రెండు నెలల క్రితం జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లి ఖలీల్ అనే వ్యక్తి అక్క డ మృతి చెందాడు. పులివెందులలో నివాసముంటున్న ఖలీల్ భార్య ఆరిఫున్నీషాను వైఎస్ జగన్ పరామర్శించారు. పులివెందుల మండలం రాయలాపురంకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత విజయభాస్కర్‌రెడ్డి(బాబు), లక్ష్మిదేవిల కుమార్తె నందిని, సందీప్‌ల నిశ్చితార్థం స్థానిక వీజే కళ్యాణ మండపంలో బుధవారం జరిగింది. మధ్యాహ్నం ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా వ ర్ధిల్లాలని ఆకాంక్షించారు.

  అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడుతూ..
   వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి బయలుదేరగానే దారి మధ్యలో క్వానాయ్‌ని మహిళలు ఆపుతూ ఆయనతో కరచాలనం చేశారు. ప్రతిచోట వైఎస్ జగన్ వాహనం దిగి వారికి అభివాదం చేస్తూ.. ఆత్మీయంగా పలకరించారు. తంగేడుపల్లె, యు.రాజుపాలెం, కొత్తూరు, బాలయ్యగారిపల్లె, శాంతిపురం, గొందిపల్లె తదితర గ్రామాల వద్ద వృద్ధులు, మహిళలు, యువకులతో వైఎస్ జగన్ కరచాలనం చేశారు. బాలయ్యగారిపల్లె, శాంతిపురం వద్ద ఉపాధి కూలీలతో మాట్లాడారు. కూలి గిట్టుబాటు, పని దినాల గురించి అడిగి తెలుసుకున్నారు.

   పర్యటన విజయవంతం
 వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు ప్రజలతో మమేకమయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీకి చెందిన పలువురు నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. మధ్యాహ్నం తర్వాత జగన్ మూడు రోజుల పర్యటన ముగించుకుని బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనతో ఆ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది.

ప్రత్యేక హోదా సాధనకు సమష్టి పోరు


ప్రత్యేక హోదా సాధనకు సమష్టి పోరు
కర్నూలు(ఓల్డ్‌సిటీ) : సమష్టి పోరాటంతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిద్దామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు పునర్విభజన ప్రయోజనాలన్నీ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రస్తుతం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ఆ హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు.. హోదా రాకపోతే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలకు అర్థమైతే.. ఉద్యమాలను వారే నిర్వహిస్తారన్నారు. వారికి వైఎస్‌ఆర్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు. ప్యాకేజీ పేరిట కేంద్రం.. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని.. ప్యాకేజీతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి.. నందికొట్కూరు, డోన్, ఆలూరు ఎమ్మెల్యేలు ఐజయ్య, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో మునికోటి ప్రాణ త్యాగం చేశారని, హోదా సాధించే వరకు ప్రజలు పోరాటం సాగించాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు హఫీజ్‌ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, న్యాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.రాకేశ్‌రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.అబ్దుల్హ్మ్రాన్, జాయింట్ సెక్రటరీ బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులు పర్ల శ్రీధర్‌రెడ్డి, పి.తిరుమలేశ్వరరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎ.నారాయణమ్మ, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎం.ఎ.హమీద్ పాల్గొన్నారు.

 బంద్‌కు ప్రజలు సహకరించాలి -  బుడ్డా రాజశేఖరరెడ్డి
  ప్రత్యేక హోదా సాధించుకోవడం రాష్ట్ర ప్రజల హక్కు అని బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఈనెల 10న తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిచ్చారన్నారు. అదేవిధంగా ఈనెల 29న తమ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని.. ప్రజలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, అభిమానులు సహకరించాలని కోరారు.

బాబు పాలనలో అభివృద్ధి శూన్యం


బాబు పాలనలో అభివృద్ధి శూన్యం
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

 కోటపాడు ( శిరివెళ్ల ) : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. బుధవారం మండలంలోని కోటపాడులో రూ. 12 లక్షల పంచాయతీ నిధులతో వేసిన సీసీ రోడ్లు, రూ. 9 లక్షలతో నిర్మించిన సబ్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాబు పాలనలో ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. ఎమ్మెల్యే నిధులు లేక నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు.  పంచాయతీ నిధులతో మాత్రమే పనులు జరుగుతున్నాయన్నారు. వర్షాలు లేక కరువుతో ప్రజలు అల్లాడుతుంటే .. మరో వైపు సీఎం విదేశీ పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక యువత నిరాశ చెందుతున్నారని, ఇంటికొక ఉద్యోగం హామీ ఏమైంది బాబూ అంటూ ప్రశ్నించారు. అనంతరం ఎస్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఆలయాలను పరిశీలించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ నాయకులు జి. పరమేశ్వరరెడ్డి, తిరుపాలరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీరెడ్డి, సర్పంచులు శకుంతలమ్మ, రత్నమ్మ, రామభూపాల్‌రెడ్డి, రామనాగిరెడ్డి, ఉప సర్పంచులు లీలావతి, అజీజ్, వైఎస్సార్సిపీ మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ. రఫీ పాల్గొన్నారు.

పోలీస్ వాహనంతో తొక్కించారు


నగరిలో బాబూగిరీ!బుధవారం తమిళనాడులోని పళ్లిపట్టులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల వాహనాలను అడ్డుకుంటున్న ఏపీ పోలీసులు
ఎమ్మెల్యేలను వెంటాడి.. వేటాడిన పోలీసులు
⇒ తమిళనాడులోనూ చిత్తూరు ఖాకీల దౌర్జన్యకాండ
⇒  శాంతియుత ర్యాలీని చెదరగొట్టేందుకు 144 సెక్షన్..
⇒  ముందుగానే అనుమతి తీసుకున్నా అడుగడుగునా ఆటంకాలు
⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసు వాహనంతో తొక్కించిన వైనం..
⇒ జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల అరెస్టు
సాక్షి ప్రతినిధి, తిరుపతి:  చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ముందస్తు అనుమతితో ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ చేసేందుకు బయలుదేరిన ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా అడ్డం కులు సృష్టించింది.

పచ్చనేతల కనుసన్నల్లో ఎమర్జెన్సీని తలపించేలా పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. బుధవారం నగరిలో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలపై దురుసుగా ప్రవర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినా వదిలిపెట్టకుండా వెంటాడారు. వైఎస్సార్‌సీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీస్ వాహనంతో తొక్కించారు.  
 
వేధింపులకు నిరసనగా..: నగరి ఎమ్మెల్యే రోజాతోపాటు, మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతకుమారిలపై పోలీసుల వేధింపులకు నిరసనగా బుధవారం నగరిలో ర్యాలీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు అనుమతి తీసుకున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి 144 సెక్షన్ విధించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల కన్వీనర్లు పార్టీ అనుబంధ సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.

నగరికి వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు మోహరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని బుధవారం గృహ నిర్బంధంలో ఉంచారు. తిరుపతికి వస్తున్న పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని చిత్తూరు సమీపంలో అరెస్ట్ చేశారు. నగరి, పుత్తూరుల్లో ముఖ్యనేతలను అరెస్ట్ చేసి ఉదయాన్నే జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. నగరి పట్టణాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ఎవరినీ పట్టణంలోకి ప్రవేశించకుండా చక్రబంధం చేశారు.
 
పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి..
వైఎస్సార్‌సీపీ నగరిలో ర్యాలీ చేయకుండా టీడీపీ నేతలు పోలీసులను ఉసిగొల్పడాన్ని పసిగట్టిన ఎమ్మెల్యేలు అత్యవసరంగా తిరుపతిలో సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పీఎల్‌ఆర్ గ్రాండ్ హోటల్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న నేతలు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, గిడ్డి ఈశ్వరి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్ కుమార్, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బి.మధుసూదన్‌రెడ్డిలతోపాటు ముఖ్యనేతలు హాజరై కార్యాచరణ రూపొందించారు.

టీడీపీ నేతలు, పోలీసుల దాడులను తీవ్రంగా ఖండించారు. ఎలాగైనా నగరికి చేరుకుని కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలనే కృతనిశ్చయంతో బయలుదేరారు. పోలీసులు వెంటాడాన్ని గమనించిన ఎమ్మెల్యేలు, నేతలు ప్రధాన రహదారిపై వెళ్లకుండా అప్పలాయిగుంట, రామచంద్రాపురం, పచ్చికాపలం, తమిళనాడులోని పళ్లిపట్టు మీదుగా నగరి చేరుకునే యత్నం చేశారు. రాష్ట్ర సరిహద్దు దాటి పళ్లిపట్టుకు వెళ్లినా వెంటాడం మానలేదు. నేతల వాహనాలకు పోలీస్ వాహనాన్ని అడ్డంగా పెట్టి నానా హంగామా చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతలపై దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.పోలీసులను అడ్డుకోబోయిన చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీస్ వాహనంతో తొక్కించారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. నేతలు వెంటనే చెవిరెడ్డిని పళ్లిపట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స చేయించారు. అనంతరం ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి చెవిరెడ్డి బి5 పళ్లిపట్టు పోలీస్ స్టేషన్‌లో ఏపీ పోలీసులపై ఫిర్యాదు చేశారు.
 
పుత్తూరులో అరెస్ట్: పళ్లిపట్టు నుంచి నగిరికి చేరుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేల బృందాన్ని మధ్యాహ్నం నగరి సమీపంలోనే అడ్డుకుని అరెస్టు చేసి పుత్తూరు స్టేషన్‌కు తరలించారు. అనంతరం  సొంతపూచీకత్తుపై వదిలేశారు.

25న బందరులో వైఎస్ జగన్ ధర్నా

Written By news on Wednesday, August 19, 2015 | 8/19/2015


25న బందరులో వైఎస్ జగన్ ధర్నా
మచిలీపట్నం : వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 25వ తేదీన మచిలీపట్నంలో ధర్నా నిర్వహించనున్నారు. ఆ  విషయాన్ని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా జరుగుతుందని ఆయన తెలిపారు. కొత్తమాజేరులో విషజ్వరాల బారినపడి మృతి చెందిన కుటుంబాలకు ఎలాంటి సాయం అందించకపోవటంతో బాధితుల తరఫున ఒత్తిడి తెచ్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఈ ధర్నా తలపెట్టారని వివరించారు.

 చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి 18 మంది మృతి చెందారని... మృతుల కుటుంబాలను ఈ నెల నాలుగో తేదీన కొత్తమాజేరులో పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. లేకుంటే మృతుల కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారని తెలిపారు. కొత్త మాజేరు మృతుల కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. 

కడప మేయర్ గృహ నిర్బంధం

కడప బంద్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్ లతో పాటు గృహ నిర్బంధం కొనసాగుతోంది.  నారాయణ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యల నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ బుధవారం కడప నగరం  బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు, అంజద్ బాషాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే పలువురు పార్టీ నాయకులను అరెస్ట్ చేసి, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

మరోవైపు కడప వాసులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చిన బంద్ కు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. కాగా బంద్ ను విఫలం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

బాబును ఏ వన్‌గా చేర్చాల్సిందే


బాబును ఏ వన్‌గా చేర్చాల్సిందే
వైఎస్సార్‌సీపీ నేత  బొత్స సత్యనారాయణ డిమాండ్
 
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు చార్జిషీట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించిన తెలంగాణ ఏసీబీ అధికారులు ఆయనను ఏ వన్(ప్రథమ ముద్దాయి)గా చేర్చకపోవడం వెనుక ఆంతర్యమేంటని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు కొలు సు పార్థసారథి, మేరుగ నాగార్జునతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే వ్యూహరచన చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆంగ్ల, తెలుగు దినపత్రికలన్నీ ప్రచురించాయి.

ఈ మొత్తం వ్యవహారానికి వ్యూహరచన చేసింది చంద్రబాబే అని చార్జిషీట్‌లో పేర్కొన్నప్పుడు ఆయనను ఏ వన్‌గా చేర్చకపోవడం వెనుక మర్మం ఏమిటి?  ఇదే ఒక సామాన్యుడు చేసి ఉంటే ఇలాగే వ్యవహరిస్తారా? చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నప్పుడు బాబు విషయంలో ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ఏ వన్‌గా చేర్చాల్సిందే’’ అని బొత్స డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయటపడటానికే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని, ప్రత్యేక హోదా సాధన కోసం కాదన్నారు. బిహార్‌కు కేంద్రం రూ.1.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, ఎన్డీయే మిత్రపక్షంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఎందుకు అడగడం లేదని నిలదీశారు. 

విద్యార్థినుల మృతిపై అభాండాలా?


నారాయణ విద్యా సంస్థల్లో మరణ మృదంగం
⇒ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు
⇒  చంద్రబాబు 15 నెలల పాలనలో 11 మంది విద్యార్థులు మృతి
⇒ ఆ విద్యాసంస్థల అకృత్యాలను ఎందుకు నియంత్రించరని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
⇒  నారాయణ’లో బాబు భాగస్వామి కాబట్టే చర్యలు లేవు
⇒ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న
⇒ మంత్రి నారాయణను అరెస్టు చేయండి
⇒  ఇంటర్‌లో చేరిన మూడు నెలలకే తనువు చాలించిన అభం శుభం ఎరుగని ఇద్దరు విద్యార్థినులు
⇒  మృతదేహాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ అధినేత
⇒ మనీషా, నందినీల మృతిపై సిట్టింగ్ జడ్జితో  జ్యుడీషియల్ విచారణ  జరిపించాలని డిమాండ్
⇒నేడు కడప నగరంలో బంద్‌కు పిలుపు
 సాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణ విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు... నిర్దాక్షిణ్యంగా విద్యార్థుల ఊపిరి తీస్తున్నారు.. 15 నెలల చంద్రబాబు పాలనలో 11 మంది విద్యార్థులు ఆ సంస్థల్లో అర్ధంతరంగా చనిపోయినా ఎలాంటి చర్యల్లేవు.. దీనికి కారణం నారాయణ విద్యా సంస్థల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భాగస్వామ్యం ఉండడమేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని కాలేజీలకు, యూనివర్సిటీలకు విద్యార్థినులను పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడేలా చేస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కడప నగర శివారులోని నారాయణ జూనియర్ బాలికల కళాశాల హాస్టల్‌లో సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న నందిని(16), మనీషా(16) అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినుల మృతదేహాలను మంగళవారం ఆయన రిమ్స్ మార్చురీలో పరిశీలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల యాజమాన్యం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మృతుల బంధువులతో కలిసి మార్చురీ వద్ద బైఠాయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
 చంద్రబాబు కన్నెత్తి చూడనేలేదు...
 ‘సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. 6.30 గంటల వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోనే ఉన్నారు. సమీక్ష సమావేశాలు పెట్టారు. అయినా, ఈ విషయం ఆయనకు తెలియదంటే నమ్మాలా..’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. సీఎం విద్యార్థినుల మృతదేహాలను సందర్శించలేదు, తల్లిదండ్రులను పరామర్శించలేదు, ఇటువైపు కన్నెత్తి చూడనేలేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా నారాయణ విద్యా సంస్థల్లో అనంతపురంలో ఒకరు, తిరుపతిలో ఇద్దరు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ఒకరు, కడపలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు.. మొత్తం 11 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. ‘వారిలో తొమ్మిది మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలున్నారు. ఇంత మంది చనిపోతున్నా ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు.. వేరే కళాశాలల్లో చనిపోతే సీఎం ఇలానే గమ్మున ఉంటారా? చంద్రబాబు.. నారాయణ కళాశాలల్లో భాగస్వామి కావడంతోనే చూసీ చూడనట్లు ఉన్నారని ఆయన ఆరోపించారు.

 నారాయణ స్కూళ్లను విస్తరించాలనే..
 ‘అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం, ఇవ్వలేకపోతే రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా’ అని ఎన్నికల్లో చెప్పారు. ఇంటికో ఉద్యోగం లేదు.. నిరుద్యోగభృతీ లేదు. కానీ, కళాశాలల్లో విద్యార్థుల్ని చంపేసే పరిస్థితి. చంపేసే వారికే మద్దతు ఇస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి మృతి చెందింది. ఆమె మృతికి కారకులైన అసలు దోషులను ఇంతవరకూ అరెస్టు చేయనేలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘గ్రామాల్లో మూడు కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాల ఉంటే ఎనిమిది కిలోమీటర్లకు కుదిస్తూ మిగతావి మూసేస్తున్నారు. నగరాలు, జిల్లా కేంద్రాల నుంచి గ్రామాలకు నారాయణ పాఠశాలలు విస్తరించాలనే గ్రామీణ పాఠశాలలను మూసి వేస్తున్నారని ఆరోపించారు. నారాయణ కళాశాలల్లో ఎలాంటి అఘాయిత్యాలు చోటుచేసుకున్నా.. ఎంత మంది చనిపోయినా మంత్రి కాబట్టి సీఎం భాగస్వామి కాబట్టి మూత పడవని పేర్కొన్నారు.

 విద్యార్థినుల మృతిపై అభాండాలా?
  ‘అభం శుభం తెలియని ఇద్దరు విద్యార్ణినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజాయితీగా వారి మృతికి కారణాలు వెలికి తీయకుండా లవ్ లెటర్‌ను కొత్తగా పుట్టించారు.. బుద్ది ఉండి మాట్లాడుతున్నారా..’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవే ఆరోపణలతో ఓ మీడియాలో వార్తలు వస్తాయి. తల్లిదండ్రులకు లెటర్ చూపెట్టరు. నారాయణ కాలేజీని కాపాడలనే దృక్పథం మినహా మరొకటి కాదని పేర్కొన్నారు. 10వతరగతి పాస్ అయి మూడు నెలల క్రితం ఇంటర్‌లో చేరిన విద్యార్థినులపై అభాండాలు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలా అభాండాలు వేయడం ఎంతవరకూ ధర్మమని ధ్వజమెత్తారు. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా.. ఇంత దారుణమైన పరిస్థితులు, రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా.. దారుణమైన చంద్రబాబులాంటి రాజకీయ నాయకుడు ఎవరూ ఉండరని వైఎస్ జగన్ విమర్శించారు. విద్యార్థులను కాలేజీ, యూనివర్సిటీలకు పంపాలంటేనే తల్లిదండ్రులు బయపడేలా చేస్తున్నారని ఆయన వాపోయారు.

ఇద్దరూ మెరిట్ స్టూడెంట్లే..

(నందిని.. ఫైల్)       (మనీషా..ఫైల్)

  ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినులు చదువుల ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయారని మరో కారణం చెబుతున్నారని, వాస్తవానికి వారిద్దరూ మెరిట్ విద్యార్థినులని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మాలేపాటి నందిని 10వ తరగతిలో గ్రేడ్ పాయింట్ ఆవరేజి (జీపీఏ) 8 నమోదు చేసిందన్నారు. మనీషా 8.5 జీపీఏ దక్కించుకుందన్నారు. ఇద్దరూ 80 శాతం మార్కులు పొందిన విద్యార్థులని తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన మూడు నెలలకే చదువుల ఒత్తిడి కారణంగా చనిపోయారన్నది నమ్మశక్యంగా లేదన్నారు.
 హైదరాబాద్‌లో రీ పోస్టుమార్టమ్ నిర్వహించాలి..
 విద్యార్థుల మృతిపై వాస్తవాలు వెలుగు చూసేందుకు జ్యుడీషియల్ ఎంక్వెయిరీ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో, అవసరమైతే ఇంకా సీబీఐతో ఎంక్వెయిరీ చేయించాలన్నారు. విద్యార్థినుల మృతదేహాలకు రీ పోస్టుమార్టమ్ నిర్వహించాలని, అదీ కూడా హైదరాబాద్‌లో చేయాలని డిమాండ్ చేశారు. వారు ఉరి వేసుకోకమునుపే చనిపోయారా? ఉరి వేసుకున్నాక చనిపోయారా? అని మీడియా ముందే డాక్టర్‌ను అడిగితే సమాధానం లేదని తెలిపారు. తాను వస్తున్నానని తెలుసుకుని.. హడావుడిగా ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకెళ్లాలంటూ వారి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. పిల్లలపై అభాండాలు వేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా నారాయణ సంస్థల యజమాని నారాయణ మంత్రిగా కొనసాగుతూనే ఉంటారు. నారాయణ సంస్థల్ని వెంటనే మూసివేయించి, సంస్థల అధినేత నారాయణను అరెస్టు చేసి వెంటనే జైళ్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 నేడు కడప నగరంలో బంద్...
 నారాయణ కళాశాల యాజమాన్యం తీరుకు నిరసనగా బుధవారం కడప నగరంలో స్వచ్ఛందంగా బంద్ పాటించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి వైఎస్సార్‌సీసీ బంద్ పాటించాలన్నారు. మనీషా, నందిని మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు నగర ప్రజలు ఒత్తిడి తేవాలన్నారు. బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎస్‌బీ అంజాద్‌బాషా, కె శ్రీనివాసులు, పి.రవీంద్రనాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి ఉన్నారు.
 త్రిసభ్య కమిటీ బూటకం...
 విద్యార్థుల మృతిపై త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం ఓ బూటకమని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యానిపుణులు పేర్కొన్నారు. మంత్రి గంటా కుమారుడికి మంత్రి నారాయణ కుమార్తెతో వివాహం త్వరలో జరగనుందని, ఈ నేపథ్యంలో వియ్యంకుడి సంస్థల్లో జరిగిన ఘటనపై కమిటీ వేయడం హాస్యాస్పదమని ఆరోపించారు. ఆ కమిటీపై విశ్వసనీయత ఎంత ఉంటుందో ఇట్టే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

లండన్ లో వైఎస్సార్ అన్నదాన కార్యక్రమం

Written By news on Tuesday, August 18, 2015 | 8/18/2015


లండన్ లో వైఎస్సార్ అన్నదాన కార్యక్రమం
లండన్: ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి ఆధ్వర్యంలో క్రీడా  సాంస్కృతిక కార్యక్రమం లో దివంగత నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 300 మందికి రుచికరమైన భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన మంచి పనులు, వారి గొప్ప నాయకత్వాన్ని స్మరించుకోవటం విశేషం.

వైఎస్సార్ సీపీ యుకే & యురోప్ వింగ్ కార్యకర్తలు సందీప్ రెడ్డి వంగల, శివ కుమార్ రెడ్డి చింతం, డా. ప్రదీప్ కుమార్ రెడ్డి చింతా, అబ్బయ చౌదరి కొఠారి,  సతీష్ వనహారం, వాసుదేవ రెడ్డి మేరెడ్డి, భగవాన్ రెడ్డి , కోటి రెడ్డి కల్లం, పిసి రావు, సురేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి పాతపాటి, ప్రదీప్ కుమార్ రెడ్డి కత్తి, రవి మోచెర్ల, భాస్కర్ రెడ్డి మాలపాటి, సునీల్ రెడ్డి చవ్వా తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల సైనికుల్లా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు లండన్ లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేస్తున్న మంచి కార్యక్రమాలను కొనియాడారు.

వైఎస్ఆర్ సీపీ ఆఫీసులో జిల్లా పరిశీలకుల మీటింగ్

హైదరాబాద్ : నగరంలోని లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జిల్లా పరిశీలకుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఈ 29న రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ సీపీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు చర్చ జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం పార్టీ చేపట్టనున్న బంద్ కు నేతలు, కార్యకర్తలు మద్ధతుగా నిలవాలని పిలుపునిచ్చారు. 

శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ జగన్ సంతాపం

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభ్రా ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించారు.

కాగా గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న శుభ్రా ముఖర్జీ వారం రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి

కడప: నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో బుధవారం కడప నగరం బంద్ కు పిలుపునిచ్చారు. విద్యార్థినుల మృతదేహాలకు హైదరాబాద్ లో రీపోస్టుమార్టం నిర్వహించాలని, మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులను మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు.

వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే....
* రాష్ట్రవ్యాప్తంగా 15 నెలల్లో నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థులు మృతి చెందారు
వీరిలో 9 మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు
ఇంతమంది చనిపోతావుంటే సీఎం చంద్రబాబు ఎందుకు గమ్మునున్నారు
నారాయణ కాలేజీల్లో చంద్రబాబుకు భాగం ఉంది కాబట్టి చూసిచూడనట్టు ఉంటున్నారు
మరో విద్యాసంస్థలో ఇలా జరిగితే ముఖ్యమంత్రి అనే వ్యక్తి గమ్మునుంటాడా?
సాయంత్రం 4.30కు ఘటన జరిగితే 6.30 వరకు జిల్లాలోనే ఉన్నా చంద్రబాబుకు తెలియలేదా?
విద్యార్థుల తల్లిదండ్రులను కనీసం పరామర్శించలేదు, ఇటువైపు కన్నెత్తి చూడలేదు
చనిపోయిన పిల్లలు టెన్త్ పాసయి 3 నెలలు కూడా కాలేదు
కాలేజీకి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా కొత్తగా లవ్ లెటర్ సృష్టించారు
వాళ్లు రాయని లెటర్లు చూపిస్తున్నారు
అభంశుభం తెలియని పిల్లలపై అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసం?
పోస్టుమార్టం కూడా అన్యాయంగా చేస్తున్నారు
ఉరి వేసుకోకముందే చనిపోయారా, ఉరి వేసుకున్నాక చనిపోయారా అని అడిగితే డాక్టర్ సమాధానం చెప్పలేకపోయారు
నారాయణ కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
పిల్లలను కాలేజీలకు పంపించాలంటే భయపడేలా విద్యా రంగాన్ని చంద్రబాబు దిగజార్చారు
నాగార్జున వర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన దోషులను ఇంతకువరకు అరెస్ట్ చేయలేదు
ఇద్దరు విద్యార్ధినుల ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణ జరగాలి
రీ పోస్టుమార్టం హైదరాబాద్ లో జరిపించాలి
మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి
విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో రేపు కడప నగరం బంద్ కు పిలుపునిస్తున్నాం
కడప నగర వాసులు బంద్ కు సహకరించాలి

వరంగల్‌లో షర్మిల పరామర్శ యాత్ర


వరంగల్‌లో షర్మిల పరామర్శ యాత్ర
24 నుంచి ఐదు రోజుల పర్యటన

32 కుటుంబాలకు పరామర్శ
పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వెల్లడి
 

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తట్టుకోలేక వరంగల్ జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 24 నుంచి పరామర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. యాత్ర మొదటి విడతలో భాగంగా ఐదురోజుల పాటు పర్యటించి 32 కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘24న ఉదయం 9 గంటలకు షర్మిల లోటస్‌పాండ్ నుంచి బయల్దేరుతారు. శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా ఉదయం 11 గంటలకు చేర్యాల చేరుకొని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేరోజు మరో ఆరు కుటుంబాలను పరామర్శిస్తారు.

మొదటి రోజు 154 కి.మీ. ప్రయాణం చేస్తారు. 25న రెండోరోజు 78 కి.మీ. ప్రయాణించి ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. 26న ఏడు, 27న ఏడు కుటుంబాలను కలుస్తారు. చివరి రోజైన 28న నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. మొత్తం 619 కి.మీ. మేర ప్రయాణించి ఐదు నియోజకవ ర్గాల్లో పూర్తిగా, రెండు నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటిస్తారు’’ అని ఆయన చెప్పారు. పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ మరణం తట్టుకొలేక అత్యధికంగా వరంగల్ జిల్లాలోనే చనిపోయారన్నారు. షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజ్‌తబ అహ్మద్ మాట్లాడుతూ.. మైనార్టీ సోదరులందరూ పరామర్శ యాత్రలో పాల్గొని విజయవంతం
 చేయాలని కోరారు.

అసెంబ్లీలో టీచర్స్ సమస్యలపై చర్చిస్తాం: వైఎస్ జగన్

పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాగా ఓబులపతితో పాటు వైఎస్ జగన్ ను కలిసినవారిలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఉన్నారు.
జీవో 53 ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సక్సెస్ స్కూళ్లను ఎత్తివేసేలా ప్రభుత్వం కుట్ర జరుగుతోందని టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు.  అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చిస్తామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

బాలయ్య పీఏ అవినీతి.. కరపత్రాలు విడుదల

Written By news on Monday, August 17, 2015 | 8/17/2015

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ.. కరపత్రాల పంపిణీ జరిగింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో.. ఈ వార్త ధావనంలా పాకింది. కరపత్రంలో తెలిపిన వివరాల ప్రకారం ‘‘ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఎందరో మహానుభావులు విజయం సాధించారు.

అయితే వారు చేయని పనిని ఘన కీర్తి సాధించిన ప్రస్తుతం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసి చూపిస్తున్నాడని తెలిపారు. ఎన్టీఆర్‌పై మమకారంతో ఓట్లు వేసి గెలిపించిన హిందూపురం ప్రజలైతే ఇక్కడ ప్రజల అభిమానాన్ని నోట్ల రూపంలో అతని ఇన్‌చార్జ్ శేఖర్ ప్రజల నుంచి వసూలు చేస్తాన్నాడని’’ అందులో పేర్కొన్నారు.

ఓటుకు కోట్లు కేసు: చార్జిషీటులో చంద్రబాబు పేరు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కుల్లోపడ్డారు. ఏసీబీ మొదటి చార్జిషీటులో చంద్రబాబు పేరును చేర్చారు. చార్జిషీటులో పలుమార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించినట్టు సమాచారం.  ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు ఏసీబీ అధికారులు  చార్జీషీటులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముడుపులిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్.. స్టీఫెన్ సన్ తో మాట్లాడిన సంభాషణలు బహిర్గతమయ్యాయి. అంతేగాక ఆడియో రికార్డులు కూడా వెల్లడయ్యాయి. రేవంత్ పలుమార్లు 'బాస్' అని సంబోధించారు. ఈ బాస్ ఎవరన్నదానిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు ఉదయ సింహా, సెబాస్టియన్ తదితరులను నిందితులుగా చేర్చారు. కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు పలువురు టీడీపీ నేతలను, వారి వద్ద పనిచేసేవారిని విచారించారు.

స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు బహిర్గతమైన విషయం విదితమే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు చంద్రబాబు.. స్టీఫెన్ తో మాట్లాడారు. ఆ తర్వాత రేవంత్.. స్టీఫెన్ కు ముడుపులిస్తూ దొరికిపోయారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్ స్టీఫెన్ ను ప్రలోభపెట్టారు. కాగా స్టీఫెన్ తో మాట్లాడిన విషయంపై చంద్రబాబు పెదవి విప్పలేదు. జాతీయ మీడియా ప్రతినిధులు ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.

24 నుంచి వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర


24 నుంచి వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 24 నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శయాత్ర చేపట్టనున్నారు. మొదటి విడత యాత్రలో భాగంగా 32 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని వైఎస్సార్ సీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, అహ్మద్ తెలిపారు.

మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 72 మంది అశువులు బాశారని చెప్పారు. షర్మిల పరామర్శయాత్రకు తెలంగాణ వైఎస్సార్ సీపీ నేతలందరూ హాజరై విజయవంతం చేస్తారన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలోని 4 జిల్లాల్లో పరామర్శయాత్ర పూర్తైందని తెలిపారు.

చుట్టం చూపుగా వస్తున్న ‘నారాయణ ’


చుట్టం చూపుగా వస్తున్న ‘నారాయణ ’
జిల్లా నుంచి మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం
నారాయణపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే అనిల్

 నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జిల్లాకు చుట్టం చూపుగా వస్తున్నారే కానీ ఏనాడూ ప్రజా సమస్యలు పరిష్కరించిన దాఖలాల్లేవని మంత్రి నారాయణపై సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మంత్రి ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదన్నారు. జిల్లాకు వచ్చే కేంద్ర మంత్రులకు స్వాగతాలు పలకడానికే ఆయన ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన వ్యక్తి మున్సిపల్ మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఒక్క పైసా కూడా నిధులు తీసుకురాక పోవడం దారుణమన్నారు. ఆయన మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు.

 మోసపూరిత మాటలు మానుకోవాలి..
 ప్రత్యేక హోదాపై ప్రజలను మోసం చేసే మాటలను తెలుగుదేశం నాయకులు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సమావేశంలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, దేవరకొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం


తుపాకులున్నాయిగా.. ఒకేసారి కాల్చేయండి
పెదారికట్లకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదని..అది కొనకనమిట్ల ఎస్సై చేసిన హత్య అని..ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాకులున్నాయిగా..వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఒకేసారి కాల్చేయండి అంటూ పోలీసులనుద్దేశించి ఘాటుగా స్పందించారు. నిమ్మారెడ్డి మృతదేహానికి ఆదివారం ఎంపీ నివాళులర్పించారు.

- పోలీసులనుద్దేశించి ఘాటుగా స్పందించిన ఒంగోలు ఎంపీ వైవీ
- వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డి మృతదేహానికి నివాళి
- నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదు.. అది ఎస్సై చేసిన హత్య
- కొనకనమిట్ల ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలన్న ఎంపీ
పొదిలి :
 ‘పెదారికట్లకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదు. అది కొనకనమిట్ల ఎస్సై చేసిన హత్య. ఈ విషయమై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. అసలు ఇవన్నీ ఎందుకు మీ చేతుల్లో తుపాకులున్నాయిగా.. మా కార్యకర్తలను ఒకేసారి కాల్చేయండి’ అంటూ పోలీసులను ఉద్దేశించి ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. కొనకనమిట్ల ఎస్సై మస్తాన్ షరీఫ్ వేధింపులకు తాళలేక పెదారికట్లకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిమ్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే.

ఈ మేరకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న నిమ్మారెడ్డి మృతదేహానికి ఎంపీ వైవీ ఆదివారం నివాళులర్పించారు. మృతుని తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చారు. సంఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చచొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నిమ్మారెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలని కూడా చూడకుండా నిమ్మారెడ్డి బంధువులను పోలీసుస్టేషన్‌లో మూడు రోజులు ఎలా నిర్బంధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు 24 గంటల్లో న్యాయం జరగాలని, లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆరు నెలల పసికందు తల్లిని కూడా కేసులో ఇరికించి రిమాండ్‌కు పంపించారంటే ఎస్సై ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో అర్థమవుతోందన్నారు.

ఎస్సైపై చర్యలు తీసుకోవాలని సీఐ రవిచంద్రను కోరారు. కొడుకును పొగొట్టుకున్న తల్లిదండ్రులను ఎంపీ ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆరు నెలల బిడ్డతో రిమాండ్‌లో ఉన్న తల్లికి న్యాయం జరిగేలా చూడాలని ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డికి ఎంపీ వైవీ సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డి, పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, కె.నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు మెట్టు వెంకటరెడ్డి, సాయిరాజేశ్వరరావు, జవ్వాజి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పార్టీ స్థానిక నాయకులు గొలమారి చెన్నారెడ్డి, ఆవుల చంద్రశేఖరరెడ్డి, రాచమల్లు వెంకటరామిరెడ్డి, కామసాని శేషిరెడ్డి, డి.శ్రీనివాసరెడ్డి, జి.ఓబులరెడ్డి, వీవీ రమణారెడ్డితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పులివెందులకు నేడు వైఎస్ జగన్


నేడు వైఎస్ జగన్ రాక
పులివెందుల :  వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం వైఎస్ జగన్ బెంగళూరులో బయలుదేరి మధ్యాహ్నానికి పులివెందులకు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలనుంచి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. 18న మంగళవారం ఉదయం 9 గంటలకు సింహాద్రిపురం మండలం బలపనూరుకు చేరుకొని ఇటీవల అనారోగ్యంతో మరణించిన బలపనూరు సర్పంచ్ సరస్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు.

అనంతరం సింహాద్రిపురం మండలంలో ఎండిన వేరుసెనగ, పత్తి పంటలను అధికారులతో కలిసి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30గంటలకు పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో పీబీసీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతోపాటు మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో పీబీసీకి నీటి కేటాయింపులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 19న ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.  12.30 గంటలకు పులివెందులలోని వీజే ఫంక్షన్ హాలులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రాయలాపురం భాస్కర్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు హాజరవుతారు. రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.

జీవితాంతం జగన్ వెంటే..


జీవితాంతం జగన్ వెంటే..
ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది నా కోరిక
నెల్లూరు: జీవితాంతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తానని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తన కోరికని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోటకు వచ్చిన ఆయన కుటుంబసభ్యులతో కలసి కోటమ్మ దేవాలయంలో పూజలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన చివరిశ్వాస వరకూ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా పనిచేస్తానన్నారు. కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుల నియామకం

Written By news on Sunday, August 16, 2015 | 8/16/2015

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి జిల్లా పరిశీలకులను నియమించారు. సంస్థాగతంగా తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి కొద్ది రోజులుగా పార్టీ సీనియర్ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించిన తర్వాత వీరి నియామకాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 29వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించ తలబెట్టిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జిల్లా పరిశీలకుల తొలి సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగుతుందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో తెలిపారు.

ఆ రోజు ఉదయం 11 గంటలకు జరిగే పరిశీలకుల సమావేశంలో బంద్ ఏర్పాట్లు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. జిల్లాల వారీగా కొత్తగా నియమితులైన పరిశీలకుల వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
కర్నూలు - అనంత వెంకటరామిరెడ్డి
చిత్తూరు - పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కడప - వైఎస్ అవినాష్‌రెడ్డి, మేరుగ నాగార్జున, సురేష్‌బాబు
నెల్లూరు - వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం - డీసీ గోవిందరెడ్డి
గుంటూరు - బొత్స సత్యనారాయణ
కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పశ్చిమగోదావరి - పిల్లి సుభాష్‌చంద్ర బోస్
తూర్పుగోదావరి - ధర్మాన ప్రసాదరావు
విశాఖపట్టణం - వి.విజయసాయిరెడ్డి
విజయనగరం - ధర్మాన కృష్ణదాసు
శ్రీకాకుళం - ఆర్వీఎస్‌ఎస్‌కె రంగారావు(బేబి నాయన).

రోజా అనుచరులను పోలీసులు వేధిస్తున్నారు

తిరుపతి:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పోలీసుల ఆకృత్యాలు శృతిమించుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నగరిలో పథకం ప్రకారం ఎమ్మెల్యే రోజాను తుదిముట్టించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా, ఆమె అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులు వేధిస్తున్నారని భూమన చెప్పారు.

టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఒత్తిడి వల్లే వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని భూమన ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు, టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొంటామని భూమన చెప్పారు.

షర్మిల పరామర్శయాత్ర కోసం రూట్ సర్వే


మాట నిలబెట్టుకునే వంశం వైఎస్‌ఆర్‌దే..
షర్మిల పరామర్శయాత్ర కోసం రూట్ సర్వే చేసిన నేతలు
జనగామ:
 రాష్ట్రంలో మాట నిలబెట్టుకునే వంశం ఒక్క వైఎస్‌ఆర్‌దేనని... ఆ ఘనత ఆ కుటుంబానికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, భీష్వ రవీందర్ అన్నారు. మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు రానున్న వైఎస్ జగన్ సోదరి షర్మిల యాత్రకోసం శనివారం వీరు రూట్ సర్వే చేశారు.

జిల్లాలోని చేర్యాల, మద్దూరు మండలం భైరాన్‌పల్లి, బచ్చన్నపేట మండలం కట్కూరు, బండనాగారం, కేశిరెడ్డిపల్లి, ఆలీంపూర్, బచ్చన్నపేట, పోచన్నపేటలోని మూడు గ్రామాల్లోని 9 కుటుంబాలతో పాటు అలువాల యాదగిరి కుటుంబం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను నేరుగా కలుసుకుని పరామర్శించేందుకు షర్మిల ఈ నెల చివరి వారంలో పర్యటించనున్నారని వివరించారు. లక్షలాది మంది పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క వైఎస్‌కే దక్కుతుందని కొనియాడారు.

చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి సూటిప్రశ్న

హోదా కోసం పోరాడతారా.. లేదా?
హోదా కోసం పోరాడతారా.. లేదా?
♦ చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి సూటిప్రశ్న
♦ అయినా మభ్యపెడతారెందుకు?  కేంద్రంతో పోరాటానికి టీడీపీ సిద్ధమా?
♦ 29న చేపట్టనున్న బంద్‌ను జయప్రదం చేయండి

 సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వస్తాయని చెబుతున్న చంద్రబాబు ఎప్పటిలోగా వాటిని సాధించగలరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శనివారంనాడిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా అసలు చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటడానికి బాబు సిద్ధంగా ఉం టారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ టీడీపీ ఎంపీల సమక్షంలోనే తేల్చిచెప్పినా వారంతా మిన్నకుండిపోయారని తప్పుబట్టారు. ఇటీవలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ వాయిదా తీర్మానం రూపంలోనో, ప్లకార్డులతో నిత్యం ఆందోళన చేపట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచామని చెబుతూ టీడీపీ నేతలు ఏమాత్రం స్పందించకపోవడం విడ్డూరమన్నారు.

రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు రావడం మంచిదేననీ, ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీని ఒకే గాటన కట్టొద్దని మిధున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా రావడం వల్ల సామాన్య ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఆరేళ్లు కావసున్నా చంద్రబాబు ఇప్పుడు ఆయనపై విమర్శలు చేస్తున్నారని నిప్పులుచెరిగారు.స్వాతంత్ర దినోత్సవం రోజున అవినీతికి వ్యతిరేకంగా ప్రమాణం చేయించిన బాబు ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డికి అంత డబ్బెవరి ద్వారా వెళ్లాయో కూడా స్పష్టం చేయాలని  మిధున్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 బంద్‌కు ప్రజలందరూ మద్దతు పలకాలి
 ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 29వ తేదీన జరపతలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ప్రజలందరూ విజయవంతం చేయాలని మిధున్‌రెడ్డి కోరారు.హోదాతోపాటు విభజన హామీల అమలుకు జగన్‌మోహన్‌రెడ్డి మొదట నుంచీ ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు ఢిల్లీలో ధర్నా చేపట్టారని గుర్తు చేశారు. ఈ పోరాటానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం ఇంటిముందు ధర్నా చేస్తా: రోజా


సీఎం ఇంటిముందు ధర్నా చేస్తా: రోజా
హైదరాబాద్: తన అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహిళల సమస్యలపై పోరాటం చేస్తున్నందునే తనపై, అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. నగరి మున్సిపల్ చైర్మన్ శాంతకుమారి కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్న నేపథ్యంలో రోజా స్పందించారు.

సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పోలీసులు తీరు దారుణంగా ఉందన్నారు. తనపై, అనుచరులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మహిళల సమస్యపై సీఎం ఇంటిముందు ధర్నా చేస్తానని రోజా హెచ్చరించారు.

మమ్మల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు'

నగరి: ప్రతిసారి వైఎస్సార్ సీపీ శ్రేణులను, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు బనాయించడాన్నినగరి మున్సిపాలిటీ చైర్ పర్సన్, ఆ పార్టీ మహిళా నాయకురాలు శాంతా కుమారి తీవ్రంగా తప్పుబట్టారు. తన కుటుంబ సభ్యులుపైనే కాకుండా,  స్థానికంగా ఉన్న తమ బంధువులపై కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తమపై నాన్ బెయిల్ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం రాజకీయ కుట్ర కాదా?అని ఆమె ప్రశ్నించారు.  టీడీపీ సీనియర్ నాయకుడు ముద్దు కృష్ణమనాయుడు ఒత్తిడితో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ తమను వేధింపులు గురి చేస్తున్నారన్నారు.

శనివారం అర్ధారాత్రి శాంతాకుమారి ఇంటి గేటుకు వేసి ఉన్న తాళలను పగలగొట్టిమరీ లోనికి ప్రవేశించిన పోలీసుల తీరుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురైన  వైఎస్సార్ సీపీ కార్యకర్తలు..  శాంతాకుమారి నివాసం వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించేప్రయత్నం చేశారు.


*ప్రతిసారి మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు.
*అక్రమంగా నాన్ బెయిల్ కేసులు నమోదు చేస్తున్నారు.
*నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో నా ఇంటికి వచ్చి గేటు  పగులగొట్టారు
*దుర్బషలాడారు, బూతులు మాట్లాడారు
*మమ్మల్మి అరెస్ట్ చేస్తే  కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంటానని నా పెద్ద కోడలు  హెచ్చరించింది
*పనిచేయని శాడిస్ట్ కమిషనర్ ను పెట్టి ముద్దు కృష్ణమనాయుడు వేధిస్తున్నాడు
'రాజకీయ కుట్రతో మాపై కేసులు పెట్టారు
'మేమైనా టెర్రలిస్టులమా?

బాబు జమానా.. అక్రమాల ఖజానా


'బాబు జమానా.. అక్రమాల ఖజానా'
 రైతుల భూములతో రాజకీయ వ్యాపారం
 రాజధాని ప్రాంతంలో స్వాతంత్య్ర హరణం
 ఎన్టీఆర్ పార్టీలో ‘నారాయణ’ మంత్రం
 దుర్భిక్షం ముంగిట్లో మరోసారి రాష్ట్రం


మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి నియోజకవర్గం) ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రం తిరిగి కరువు కోరల్లో చిక్కుకుందని,  సాగునీరు లేక, రైతులు వలస బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి జిల్లాలోనే దుర్భిక్ష పరిస్థితులున్నా పట్టించుకునే నాథుడడే కరువయ్యాడని విమర్శించారు. నీరు- చెట్టు పేరుతో ప్రకృతి వనరులను యధేచ్చగా దోచుకుంటున్నారని, పట్టిసీమతో ఆగస్టు15 నాటికి రాయలసీమకు నీరు పారుతుందని చెప్పినా... అవినీతి మాత్రం ఏరులై పారిందని ఆరోపించారు.
రాజధాని పేరుతో ఐదేళ్ళపాటు హైడ్రామాను రక్తి కట్టించాలని చూస్తున్నారని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం దూరం పెట్టి ‘నారాయణ’ మంత్రం జపిస్తున్నారన్నారు. తన అడ్డగోలు దోపిడీకి అండగా నిలిచే అధికారులను అందలం ఎక్కిస్తున్నారని దుయ్యబట్టారు. ‘రాజధాని ప్రాంత ప్రజలు, రైతుల స్వాతంత్య్రాన్ని హరించి భూసేకరణ పేరుతో బె దిరింపులకు దిగుతున్నారు...అసలు రాజధాని నిర్మాణానికి రెండు వేల ఎకరాలు సరిపోతుంది కదా.. 33 వేల ఎకరాలు ఎందుకంటే సమాధానం చెప్పరు. జపాన్, సింగపూర్‌లకు వేల ఎకరాలు ధారాదత్తం చేసి వందల కోట్లు కొల్లగొట్టే వ్యూహం బహిర్గతమైనా నిస్సిగ్గుగా పన్నాగాలు పన్నుతున్నారు.

 పేద ప్రజలు, రైతులను దోచుకునే వారితో పాటు దోపిడీకి సహకరిస్తున్న ప్రతిఒక్కరిని కోర్టు మెట్లెక్కించి తీరతాన’ని ఆర్కే హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో రైతుకూలీలు, కౌలు రైతులు, అసైన్డ్ భూముల రైతుల గోడు పట్టించుకొనేవారే లేరని, భూములిచ్చిన రైతులను  తన్ని తరిమేసి ఉద్యోగులకు ఇళ్ళు కట్టిస్తామనడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించా రు. కోట్ల విలువ చేసే భూములు త్యాగం చేసిన రైతు కుటుం బాలకు మీ హైటెక్ రాజధానిలో నివసించే అర్హత లేదా అని ఎమ్మెల్యే నిలదీశారు. మంత్రులు స్టార్‌హోటళ్ళలో బస చేయొ ద్దని హుకుం జారీ చేసిన ముఖ్యమంత్రి తాను మాత్రం ప్రత్యే క విమానాల్లో తిరుగుతూ, వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని తన విలాసవంతమైన భవనాలకు ఖర్చు చేయవచ్చా అని ఆర్కే ప్రశ్నించారు. ఉండవల్లి కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఆక్రమించుకుని తన గెస్ట్‌హౌస్‌లుగా వాడుకొనేందుకు సక్రమ నిర్మాణాలుగా మార్చిన ఘనత బాబుకే ద క్కిందన్నారు. దేవాదాయశాఖ భూములను కైంకర్యం చేసి దేవుడికే శఠగోపం పెడుతున్నారని, ధర్మప్రచారానికి ఉద్దేశించి న ఆస్తులను వ్యాపారులకు కట్టబెట్టే కుట్రపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆర్కే స్పష్టం చేశారు.

 ఓటుకు నోటు కేసులో నిందితుడిగా నిర్ధారణ అయినా తెలంగాణ ప్రభుత్వం చర్యల కు వెనుకాడుతుందంటే చంద్రబాబు ఏ చీకటి ఒప్పందం చే సుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఒక ప్రకటన చేస్తే పక్కనే వున్న చంద్రబాబు మరొక ప్రకటన చేస్తూ రాష్ట్రప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫోటో సైతం చంద్రబాబు అక్రమాలను ప్రశ్నిస్తోందని, అందుకే అసెంబ్లీలో ఆయన ఫొటోను తొలగించి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పుష్కరాల పేరుతో కోట్లు దండుకున్న చంద్రబాబు, నారాయణ ప్రచారార్భాటం తో ముప్ఫై మంది ప్రాణాలు బలిగొన్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలన ఇలాగే సాగితే ప్రజలకు కడుపు మండి ప్రత్యక్ష పోరాటాలకు దిగటం ఖాయమని స్పష్టం చేశారు.

Popular Posts

Topics :